23 June 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Sharmila's Speech in Chodavaram, Visakha district

Written By news on Saturday, June 29, 2013 | 6/29/2013
కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని షర్మిల అన్నారు. కిరణ్ హయాంలో అన్ని ధరలు పెరిగిపోయాయని అన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఈ సాయంత్రం జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. ధరల పోటుతో కుదేలయిన సామాన్యుడిపై కాంగ్రెస్ సర్కారు తాజాగా 'పెట్రో'బాంబు వేసిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుతో నిత్యావసర ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

కిరణ్ పాలనలో ప్రతి రైతు అప్పులపాలయ్యారని అన్నారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా అధికార పక్షంలో ఏమాత్రం చలనం లేదన్నారు. ఈ నాలుగేళ్లలో వ్యవసాయ వ్యయం భారీగా పెరిగినా మద్దతు ధరలు పెరగాల్సినంతగా పెరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే పగ లేక చిన్నచూపా అని ప్రశ్నించారు. వైఎస్సార్ బతికుంటే వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవారని చెప్పారు. కిరణ్ ప్రభుత్వం కనీసం 3 గంటలు కూడా ఉచిత్ ఇవ్వడం లేదని ఆరోపించారు. కరెంట్ కోతలతో 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు పట్టించుకోనివారిని పాలకులు అనలా, రాక్షసులు అనలా అని ప్రశ్నించారు.

ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈగ కూడా వాలనీయకుండా కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. స్వప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారో అదే పార్టీతో ఆయన కుమ్మక్కయ్యారని అన్నారు. కాంగ్రెస్ తో జగన్ కుమ్మక్కయారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. జగన్ కుమ్మక్కయివుంటే ఈ రోజు జైల్లో ఉండేవారా అని షర్మిల ప్రశ్నించారు. 

సీబీఐని అడ్డం పెట్టుకుని జగనన్నను జైలుపాల్జేశారని అన్నారు. జగనన్నఏ తప్పు చేయలేదని, అందుకే ధైర్యంగా ఉన్నారని అన్నారు. జగనన్నను ఆపడం చంద్రబాబు, కాంగ్రెస్ వల్ల కాదన్నారు. రాజన్న రాజ్యాన్ని జగనన్న తప్పకుండా స్థాపిస్తాడని అప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలపర్చాలని కోరారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా గుణపాఠం చెప్పాలన్నారు.

Belief in public service says YS Vijayamma

YS Vijayamma console to jawan Yadaiah family

YSRCP Doctors Wing Press Meet 29th June 2013

పాలమూరు జిల్లాలో నేడు విజయమ్మ పర్యటన

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కల్వకుర్తి మండలం కొట్ర సమీపంలో జరగనున్న జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి విజయమ్మ ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.

అలాగే ఆమనగల్లు మండలంలోని కడ్తాల్ లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాళ్ల గణేష్ కుటుంబాన్ని విజయమ్మ పరామర్శించనున్నారు. ఆనంతరం ఆమనగల్లులో మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ ఆ తర్వాత వెల్దండ మండలంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డితో పాటు ముఖ్య నేతలు కేకే మహేందరరెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి, కొండా సురేఖ, రెహ్మాన్, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, గట్టు రామచందర్‌రావు, రవీంద్రనాయక్ తదితర రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు.

వారంతా కళ్లకు గంతలు కట్టుకున్నారా?

జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ అంటోంది. ‘‘ప్రభావితం చేస్తారని ఎందుకనుకోవాలి?’’ అని సీబీఐ వారిని కోర్టు ఎందుకు ప్రశ్నించదన్నది నా ఆవేదన. ‘సీబీఐ అరెస్టు చేస్తుందేమో, ముందస్తు బెయిల్ ఇవ్వండి’ అని జగన్ తరఫు న్యాయవాది అడిగినప్పుడు - ‘‘అరెస్టు చేస్తారని ఎందుకనుకోవాలి’’ అని ఆనాడు కోర్టు వ్యాఖ్యానించలేదా? మరి అదే ‘లా’జిక్ ఇప్పుడు ఏమయింది? ఇలా ప్రశ్నించడం కూడా మన న్యాయవ్యవస్థను ధిక్కరించడమేమో నాకు తెలీదు. కానీ కళ్లెదుటి అన్యాయానికి నా మనసు కలతచెందుతోంది.


ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మనిషిని ఎంతో సునాయాసంగా నెలల తరబడి జైల్లో నిర్బంధించడం చూస్తుంటే ఈ పరిస్థితిని ఏ విధంగా వర్ణించాలో కూడా అర్థం కాని అయోమయం దాపురించింది. ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రే. ఓ విధంగా చూస్తే ఇది రాజకీయ హత్యాయత్నం కాదుకదా అనే అనుమానం రాక మానదు. ప్రత్యేకించి ఓ వ్యక్తిని టార్గెట్ చేసి నడిపించే రాజకీయాన్ని ఇంతకన్నా ఏమంటారు మరి! ఓవ్యక్తిని దోషిగా నిర్థారణ అయితే తదనుగుణంగా శిక్షించడంలో తప్పులేదు. చట్టం తన పని చేసుకుంటూ పోతే ఎవరూ ఆక్షేపించరు. కానీ నిందారోపణలు మాత్రమే ఎదుర్కొంటూ, ఆ ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలను చూపించే స్థితిలో లేనప్పుడు ఆ వ్యక్తిని ఒట్టి పుణ్యానికి నిర్బంధించడం ఎంతవరకు సబబో సుప్రీంకోర్టు పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జగన్ కేసులో నిజంగా న్యాయపరంగా నడుస్తున్నట్లు ఎవరి అంతరాత్మకైనా అనిపిస్తోందా అని నేను ప్రశ్నిస్తున్నాను. అరెస్టు తర్వాత ఛార్జ్‌షీట్ వేయడానికి ఎంతకాలం కావాలనే ప్రాథమిక సూత్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా జనాదరణ కలిగిన ఓ నేతని జైలు జీవితానికి పరిమితం చేయడం నిజంగా ప్రజాస్వామ్యం కిందకే వస్తుందా అనే సందేహం పామరులను సైతం అలోచింపజేస్తోంది. దేశంలో ఎన్నో కేసులను సీబీఐ పరిశోధించింది. కానీ ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చార్జిషీట్‌లు దాఖలు చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. ఆర్థిక నేరాల ఆరోపణలు దేశానికి కొత్తేమీ కాదు. ఈ విధమైన ఆరోపణల్ని ఇందిరాగాంధీ కుటుంబం కూడా ఎదుర్కొంది. ఇప్పుడు జగన్ కేసులో అనుసరించిన విధానాలనే సీబీఐ ఆనాడూ పాటించిందా అని ఓసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకు సీబీఐని కాంగ్రెస్ ఓ అస్త్రంగా వాడుకుంటోంది.

ఎటువంటి పదవులు లేని వ్యక్తి తన వ్యాపారం తను చేసుకుంటూ అభివృద్ధి చెందితే అది ఏ విధంగా తప్పవుతుంది? మోసం జరిగిందని అంటున్నారు. మోసపోయిన వారు ముందుకు రావాలి కదా! ఇన్నేళ్లయినా, ఒక్కరు కూడా ముందుకు రాకపోయినా బలవంతంగా సీబీఐ వారు స్టేట్‌మెంట్‌లు రాయించుకోవడం చూస్తుంటే మనం ఏ యుగంలో ఉన్నామో అర్థమవుతోంది. రాజకీయంగా ఎవరైనా ప్రజాదరణ పొందితే జైలు జీవితం గడపాల్సిందేనన్న సంప్రదాయాన్ని సోనియా తీసుకొస్తున్నట్టు ఉన్నారు. అయినా జగన్ చేసిన తప్పేమిటి? కాంగ్రెస్ అధినేత్రి సోనియా మాట వినకపోవడమే కదా? అదే నేరమా? జగన్ ఒక్కరే నేరం చేస్తుంటే అందరూ కళ్లప్పగించి చూస్తుండిపోయారా!

రాత్రికి రాత్రే బలవంతగా అందర్నీ బెదిరించి ఆయన ఫైళ్లు లాక్కెళ్లిపోయారా? లేక వారంతా కళ్లకు గంతలు కట్టుకున్నారా? అలా చేస్తే ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడు ప్రశ్నించే ధైర్యం, శక్తి వారికి లేవా? ఈ రకంగా చేస్తూ ఎవర్ని ఎవరు మోసం చేస్తున్నారు.? ఎందుకు చేస్తున్నారు? ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కోర్టుల నుంచి ఎంతకూ రాని (తాము ఆశించిన) తీర్పును తామివ్వడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.

- కొండా రాజేశ్వరరావు, విజయవాడ

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com

రాజ్యాంగ హక్కులు అపహాస్యం

- వైఎస్ జగన్‌ది కచ్చితంగా అక్రమ నిర్బంధమే
- ‘చైతన్యపథం’లో మార్కాపురం వాసులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆధారాలు లేకుండా కేవలం అభియోగాలతోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏడాదిపైగా నిర్బంధంలో ఉంచడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని మార్కాపురం ప్రజలు ధ్వజమెత్తారు. కేవలం అభియోగాలపైనే ఇంతకాలం అక్రమంగా రిమాండ్‌లో ఉంచుతారా? నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసేంత దుస్సాహసానికి సీబీఐ ఎందుకు తెగించింది? నాలుగు నెలల తరువాత మళ్లీ గడువు కోరుతామని సీబీఐ న్యాయవాది అశోక్‌భాన్ ఏమాత్రం జంకులేకుండా ఎలా ప్రకటిస్తారు? రాజ్యాంగ నియమావళి ప్రకారం కాకుండా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే సీబీఐ ఇంతగా దిగజారి వ్యవహరిస్తోంది... అని పట్టణ ప్రముఖులు విమర్శించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ‘సాక్షి చైతన్యపథం’ సదస్సును శుక్రవారం నిర్వహించారు. 

నాగరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పట్టణవాసులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కఫార్డు స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కె.ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రితో పాటు బొగ్గు కుంభకోణంలో పాత్ర ఉన్న సోనియా గాంధీ కుటుంబ సభ్యులను కాపాడేందుకే సీబీఐ ఆ కేసును నీరుగారుస్తోందని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి కేసులో మాత్రం విచారణను పూర్తి చేయడం మీద దృష్టిపెట్టకుండా ఆయన్ని ఎంతకాలం రిమాండ్‌లో ఉంచుదామా అనే సీబీఐ యత్నిస్తోందని విమర్శించారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి.ఎల్.ప్రసాద్‌యాదవ్, న్యాయవాది జి.గాంధీరెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ కుట్రను అమలు చేసే ఏజెన్సీగా సీబీఐ రూపాంతరం చెందిందని విమర్శించారు. 

టీడీపీకి అనుకూలంగా ఉన్న పత్రికల్లో పెట్టుబడులను ప్రశ్నించని కాంగ్రెస్ ప్రభుత్వం, సీబీఐ... సాక్షి పెట్టుబడులపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని నీటి సంఘం అధ్యక్షుడు వెలుగొండారెడ్డి విమర్శించారు.

హాస్టళ్లలో మౌలిక వసతుల లేమిపై చలించిన షర్మిల

విశాఖ జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్రలో రావికమతం బీసీ బాలికల హాస్టల్ పరిశీలన 
- హాస్టల్‌ని చూసి కంట నీరు పెట్టిన స్థానిక మహిళ
- తమ గుడిసెలోనే పిల్లలను ఇంకా మంచిగా సాకుతామని వెల్లడి
- బాలికలకు ఈ ప్రభుత్వం కనీస వసతులు కల్పించలేదా? అంటూ షర్మిల ఆగ్రహం 
- విద్యార్థినులకు అండగా ఉంటామని, చక్కగా చదువుకోవాలని సూచన
- జగనన్న సీఎం అయితే అన్ని సమస్యలు పరిష్కరిస్తారని హామీ

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి : ‘పుడితే ఆడపిల్లగానే పుట్టాలి.. అదీ ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టాలి’. ఇదీ ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నినాదం. ‘బంగారు తల్లి’ పథకంతో ఆడపిల్లల భవిష్యత్తు అంతా బంగారుమయమేనని ఆయనే స్వయంగా ప్రకటించినప్పుడు, చిట్టి తల్లుల భవిష్యత్తు బంగారంలా ఉండాలి. పేదింట్లో పుట్టినా, పెద్ద చదువులు చదువుకోగల సౌకర్యాలు ఉండాలి. తొలిసారి తల్లి ఒడిని విడిచి బడిలో అడుగుపెట్టినప్పుడు స్కూళ్లు, హాస్టళ్లు వారిని ఆకర్షించేలా వసతులు ఉండాలి. వారికి భద్రత కల్పించగలగాలి. కానీ రాష్ట్రంలో బాలికల హాస్టళ్లు ఎంత భయంకరంగా ఉన్నాయో, అందులో వారి జీవనం ఎంత దుర్భరంగా ఉందో విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలోని ఓ హాస్టల్‌ను చూస్తే తేటతెల్లమైంది.

విశాఖ జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ హాస్టల్లో విద్యార్థినుల అవస్థలు చూసి చలించిపోయారు. ‘‘హాస్టళ్లలో పరిస్థితి ఇంత దుర్భరమా? ఈ ప్రభుత్వం బాలలకు కనీస వసతులు కూడా కల్పించలేదా? పేదరికంలో పుట్టినందుకు ప్రభుత్వం శిక్షలు వేస్తున్నట్లుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు అండగా ఉంటామని, చక్కగా చదువుకోవాలని చెప్పారు. జగనన్న సీఎం అయితే అన్ని సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో సాగింది. రావికమతం మండల కేంద్రం గుండా వెళ్తున్న షర్మిల అక్కడే కనిపించిన బీసీ బాలికల సంక్షేమ వసతి గృహంలోకి వె ళ్లారు. అక్కడి వసతులను పరిశీలించి, విద్యార్థినులతో మాట్లాడారు. 60 మంది ఆడపిల్లలకు నాలుగే పడక గదులు ఉన్నాయి. రెండు స్నానాల గదులు, రెండే మరుగుదొడ్లు ఉన్నాయి. వాటికీ నీటి సరఫరా లేదు. 

మూడేళ్ల కిందట బోర్ మోటార్ పాడయితే ఇంతవరకు మరమ్మతులు చేయించలేదు. స్నానాల గదులు సరిపోక బాలికలు చాటుగా ఒక వరండా సందులో మోకాళ్లు మొఖానికి తగిలేట్లు ముడుచుకొని స్నానాలు చేయాల్సిన దుస్థితి. కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఆత్మాభిమానం చంపుకోవాల్సిన పరిస్థితి. హాస్టల్లో విద్యార్థినుల అవస్థలు చూసి షర్మిల చలించిపోయారు. హాస్టళ్లలో వసతులు ఇంత అధ్వానంగా ఉన్నాయా అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. షర్మిలతో పాటు హాస్టల్‌లోకి వచ్చిన దాంబూడి లక్ష్మి అనే స్థానిక మహిళ ఈ హాస్టల్‌ని చూసి ఆవేదన చెందింది.

‘‘మా కడుపు మాడ్చుకోనైనా మా పిల్లలకు ఇంతకంటే మంచిగా పెట్టుకుంటాం. గుడిసెలోనైనా పిల్లలను బాగానే సాకుతాం. పిల్లలు చదువుకుంటారని హాస్టల్‌కు పంపితే ఇంత ఘోరంగా పెంచుతారా’’ అంటూ కన్నీరు పెట్టింది. ఆమె ఆవేదన, ఇక్కడి వసతులు చూసి షర్మిల చలించిపోయారు. ‘‘చాలా కష్టంగా ఉంది. కనీసం తాగటానికి నీళ్లు లేవు. స్నానానికి నీళ్లు లేవు. స్నానాల గ దులు మరీ దరిద్రంగా ఉన్నాయి. మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను అర్థం చేసుకోగలనమ్మా. సంక్షేమ హాస్టళ్లు చీకటి గదుల మాదిరిగా ఉన్నాయి. బాలికలకు ఈ ప్రభుత్వం కనీస వసతులు కల్పించలేదా? పేదరికంలో పుట్టినందుకు ప్రభుత్వం పిల్లలకు బాల్యంలోనే శిక్షలు వేస్తున్నట్లు అనిపిస్తోంది. 

బాలికలు కనీసం స్నానాలు చేసేందుకూ వసతి కల్పించలేని పరిస్థితిలో ఇవాళ మన పాలకులున్నారు. వీళ్లంతా ఎదిగే పిల్లలు. ప్రతి బిడ్డకూ పౌష్టికాహారం అందించడం పాలకుల కనీస బాధ్యత. కానీ, లక్షలాది బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల కోసం నిధులివ్వడానికి ప్రభుత్వానికి మనసు రావడంలేదు. కనీసం మరుగు దొడ్ల నిర్వహణకూ మూడేళ్లుగా నిధులివ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతోంది. సంక్షేమ హాస్టళ్లలో అపరిశుభ్రత రాజ్యమేలి విద్యార్థులు రోగాల పాలవుతున్నారు. వైఎస్సార్ అధికారంలో ఉండగా హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రెండుసార్లు పెంచారు.

ఒకసారి 25 శాతం, మరోసారి 45 శాతం పెంచారు. వైఎస్ ఉంటే మరోసారి మెస్ చార్జీలు పెరిగేవని కుల సంఘాల నేతలంటున్నారు’’ అని అన్నారు. ‘‘అమ్మా.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీరు చదువులు ఆపొద్దు. కష్టపడి చదువుకోవాలి. జగనన్న సీఎం అయితే మన సమస్యలు తీరిపోతాయి. మీకు ఇబ్బందులు లేకుండా చూస్తారు. బాగా చదువుకోండి తల్లీ’’ అని విద్యార్థినులకు సూచించారు. విద్యార్థినులు కాలకృత్యాలకు హాస్టల్ ప్రాంగణం దాటి బయటికి పోకుండా వసతులు మెరుగుపరచాలని, ముందుగా నీటి సౌకర్యం కల్పించాలని వైఎస్సార్‌సీపీ నేత పీవీఎస్‌ఎన్ రాజుకు షర్మిల సూచించారు.

మండుటెండనూ లెక్కచేయకుండా... 
శుక్రవారం 193వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం టి.అజ్జాపురం నుంచి సంగవరం వరకు సాగింది. చోడవరం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సూర్యుడు భగ్గుమన్నాడు. 39 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అయినా షర్మిల యాత్ర ఆగలేదు. ఉదయం నుంచే ఓ వైపు ఎండ... మరోవైపు ఉక్కపోతతో సతమతమవుతున్నా, షర్మిలను చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. నెత్తిన ఎండ మాడుతున్నా రోడ్డు మీద నిల్చొని రాజన్న బిడ్డ కోసం వేచిచూశారు.

టి.అజ్జాపురంలో పాదయాత్ర ప్రారంభించిన షర్మిల మేడివాడ, గర్నికం, రావికమతం, కోమళ్లపూడి, పొట్టిదొరపాలెంల మీదుగా సంగవరం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మొత్తం 16.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,564.9 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. షర్మిల వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, ముదునూరి ప్రసాదరాజు, జ్యోతుల నెహ్రూ, చోడవరం సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు, వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు పెట్ల ఉమాశంకర్ గణేష్, కిడారి సర్వేశ్వర్‌రావు, బొడ్డేటి ప్రసాద్, కోల గురువులు, తిప్పల నాగిరెడ్డి, కోరాడ రాజబాబు, స్థానిక నాయకులు కొణతాల లక్ష్మీనారాయణ, కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు న్నారు.

తిరుపతిలో వైస్ఆర్ సీపీ నిరసన దీక్షలు

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండు రోజుల క్రితం చేపట్టిన మహాధర్నా కొనసాగుతోంది. వైఎస్ఆర్ సీపీ నేతలు ఈరోజు ఉదయం నుంచి రెండు రోజుల పాటు నిరవధిక దీక్షలకు పూనుకున్నారు.

తిరుపతి ఆర్టీసి బస్టాండ్ సమీపంలో గాంధీ విగ్రహం ఎదుట తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో వందలాది మంది నిరవధిక దీక్షలో పాల్గొన్నారు. తిరుపతిలో మద్యం షాపులకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమానికి మహిళలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తూ నిరసన దీక్షలకు హాజరయ్యారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 194వ రోజు సాగే వివరాలను పాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గొల్ల బాబూరావు శుక్రవారం ప్రకటించారు. షర్మిల శనివారం చోడవరం నియోజకవర్గంలోని బంగారుమెట్టలో పాదయాత్ర మొదలు పెడతారు. వడ్డాది మీదుగాసాగి విజయరామరాజుపేట సమీపంలో లంచ్ చేస్తారు. లక్ష్మీపురం మీదుగా చోడవరం చేరుకుంటారు. చోడవరం జంక్షన్‌లో బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. 

పర్యటించే ప్రాంతాలు
బంగారుమెట్ట, వడ్డాది, విజయరామరాజుపేట, లక్ష్మీపురం, చోడవరం

కార్యకర్తలు నేతలుగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలు

Written By news on Friday, June 28, 2013 | 6/28/2013

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలలో డబ్బు, మద్యం, పోలీసులతో ఇబ్బందిపెట్టే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లోని కేఎల్‌ఆర్ గార్డెన్‌లో జరుగుతున్న పార్టీ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె ముఖ్య ఆతిథిగా ప్రసంగిస్తున్నారు. ముందుగా ఉత్తరాఖండ్‌ మృతులకు నివాళులర్పిచారు. జగన్‌పై కేసు రాజకీయ ప్రేరేపితమన్నారు. రెండేళ్లు పూర్తయినా జగన్‌ కేసు ఎందుకు పూర్తి చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. 

ఎప్పుడు ఏ ఎన్నికలకైనా పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఐక్యమత్యంతో ప్రజల్లోకి వెల్దామన్నారు. ప్రత్యర్థులకు సత్తా చూపాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణపై సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని చెప్పారు. పల్లెలు చీకట్లో మగ్గిపోతున్నాయని, కరెంట్ బిల్లుల మోతతో పంచాయతీలు చతికిల పడ్డాయని తెలిపారు. పరిశ్రమలు పవర్‌హాలీడే ప్రకటిస్తున్నాయి, వేలాది ప్రరిశ్రమలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై తప్ప మంచినీరు, సాగునీరుపై ధ్యాసలేదని విమర్శించారు. మహిళలపై అత్యాచారాల్లో రాష్ట్రం నెంబర్ 1 స్థానానికి ఎగబాకిందన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ ప్రభుత్వం పేర్లు మార్చి కొత్తపథకాలు పెడుతుందని చెప్పారు. చంద్రబాబు మద్దతుతోనే రాష్ట్ర కాంగ్రెస్ పాలన సాగిస్తోందన్నారు.ఆయన డైరెక్షన్‌ లోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. అధికార ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రాబోయే ఎన్నికలను చులకనగా తీసుకోవద్దన్నారు. ప్రతి పంచాయతీపై పార్టీ జెండా ఎగురవేయాలని చెప్పారు. అతివిశ్వాసం వద్దు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజాసమస్యలకు స్పందించాలని కూడా చెప్పారు. అప్పుడే ఎన్నికల్లో గెలుపు సాధ్యం అన్నారు. ఈ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కరువయిందని చెప్పారు. వైఎస్ఆర్ తెలంగాణ వాదాన్ని గౌరవించారని చెప్పారు. వైఎస్‌ఆర్ ఉంటే ప్రాణహిత చేవెళ్ల పూర్తయ్యేదన్నారు. 

కార్యకర్తలు నేతలుగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజలలో పార్టీకి మంచి బలం ఉందన్నారు. జగన్ బాబును చూసి ఓటు వేయమని ఓటర్లను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయం కోసం కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. కార్యకర్తలకు పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని తెలిపారు. సహాయసహకారాలు అందిస్తుందని చెప్పారు. దివంగత మహానేత వైఎస్ కార్యకర్తలను ఎలా చూసుకున్నరో మీ అందరికి తెలుసన్నారు. ఎన్నికలలో బిసిలకు న్యాయం చేయడానికి ఏ పార్టీ కూడా ముందుకురాలేదని చెప్పారు. సకాలంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామాలలో ఈరోజు అన్నీ సమస్యలే ఉన్నాయని తెలిపారు. ఆ నాడు వైఎస్ స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించారని చెప్పారు.

విజయమ్మ వస్తున్నారని తెలిసి అభిమానులు, కార్యకర్తలు ఘట్‌కేసర్‌ కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=626961&Categoryid=14&subcatid=0#sthash.AhksHcRl.dpuf

దొంగ పార్టీలకు బుద్ధి చెప్పండి

కొత్తకోట (విశాఖ జిల్లా), 27 జూన్‌ 2013: దొంగ టిడిపి, దొంగ కాంగ్రెస్‌ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలకూ ప్రజలంతా బుద్ధి చెప్పిన రోజున, జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం వస్తుందని శ్రీమతి షర్మిల అన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా టిడిపి, కాంగ్రెస్‌లకు గుణపాఠం చెప్పి, జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తిచేశారు. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తకోటలో గురువారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

'కొత్తకోట గ్రామ ప్రజలకు, తన సభకు చేరవచ్చిన ప్రతి ఒక్కరికీ మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది' అంటూ శ్రీమతి షర్మిల కొత్తకోట సభలో ప్రసంగం ప్రారంభించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలూ మన రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందో మనందరికీ తెలుసు అన్నారు. రైతుకు ప్రతి విషయంలోనూ రాజశేఖరరెడ్డి అండగా నిలబడ్డారన్నారు. వ్యవసాయానికి నీళ్ళిచ్చారు.. ఉచితంగా ఏడు గంటల విద్యుత్‌ ఇచ్చారన్నారు. మద్దతు ధర, అవసరమైనప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ,  పంటలు పోయినప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చారన్నారు. ప్రతి ఎకరాకూ సాగునీళ్ళివ్వడానికి ఎన్నో ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. వ్యవసాయాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. విశాఖ జిల్లాలోని సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతంలోని ఎన్నో లక్షల ఎకరాలకు నీళ్ళివ్వాలనుకున్నారని చెప్పారు. ఆయన అకాల మరణంతో ఈ ప్రాజెక్టు పనులు కూడా అటకెక్కాయని ఆమె విచారం వ్యక్తంచేశారు.

వైయస్‌ కన్నా ముందు సిఎంగా ఉన్న చంద్రబాబు మహిళలు, రైతులకు రూపాయి వడ్డీకి రుణాలిచ్చేవారని, మహానేత ముఖ్యమంత్రి అయిన తరువాత పావలా వడ్డీకే రుణాలు అందజేశారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ముందెన్నడూ బ్యాంకు ముఖం కూడా చూసి ఎరుగని మహిళలు పావలా వడ్డీ రుణాలు తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించారని చెప్పారు.

పేదరికం అనే ఊబి నుంచి బయటపడాలంటే ప్రతి కుటుంబమూ ఉన్నత విద్య చదవడం ఒక్కటే మార్గమని రాజశేఖరరెడ్డి భావించారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలోనూ పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేసే బిడ్డలు ఉండాలని ఫీజు రీయింబర్సుమెంటు పథకం తెచ్చారని చెప్పారు. ఆ పథకం వల్ల లక్షలాది మంది ఉన్నత విద్యను ఉచితంగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. పేదలకు కూడా కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించేందుకు ఆరోగ్యశ్రీ తీసుకువచ్చారు. లక్షల విలువైన వైద్య సేవలను మన రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుపేదలు కూడా ఉచితంగా పొందారన్నారు. ఆపదలో ఉన్న వారు ఫోన్‌ చేసిన 20 నిమిషాలకే వచ్చి వాలిపోయే 108 వాహనాలను వైయస్‌ఆర్ ప్రవేశపెట్టారన్నారు.‌ 104, అభయ హస్తం, ఉపాధి హామీ లాంటి పథకాలను ఆయన అద్భుతంగా అమలుచేసి చూపించారన్నారు. చంద్రబాబు హయాంలో 16 లక్షల పింఛన్లు ఇస్తే.. వైయస్ 71‌ లక్షల మందికి ఇచ్చిన పెద్ద మనసున్న మనిషి వైయస్‌ అన్నారు.

ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూడా రాజశేఖరరెడ్డి ఒక్క రూపాయి కూడా చార్జీలు, ధరలు పెంచాలనుకోలేదు, పెంచలేదని శ్రీమతి షర్మిల అన్నారు. రాజశేఖరరెడ్డి ఒక్క రూపాయి కరెంటు చార్జీ పెంచారని ప్రతిపక్షాలు కూడా చెప్పే సాహసం చేయలేదన్నారు. గ్యాస్‌, విత్తనాలు, ఎరువుల ధరలు పెంచలేదన్నారు. ఆర్టీసీ చార్జీలు, మున్సిపల్‌ పన్నులు పెరగలేదని గుర్తుచేశారు. ఏ చార్జీలూ పెంచకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని శ్రీమతి షర్మిల అభివర్ణించారు.

కానీ ఆ కాలం చెల్లిపోయిందని, ఇప్పుడున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని, కిరణ్‌రెడ్డి పాలనలో రైతులంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. కిరణ్‌ పాలనలో రైతులకు భరోసా లేదని, వ్యవసాయానికి నీళ్ళు లేవని, ఏడు గంటల ఉచిత విద్యుత్‌, మద్దతు ధర లేదని విచారం వ్యక్తంచేశారు. రైతులను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి బతకడం కష్టంగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. కరెంటు బిల్లులు చూస్తే షాక్‌ కొడుతున్నాయన్నారు. ఎరువుల ధరలు పెరిగిపోయాయని విచారం వ్యక్తంచేశారు.

కిరణ్‌ ప్రభుత్వం అంటే రైతులు, మహిళలు, విద్యార్థులకు భరోసా లేదు. కేవలం చంద్రబాబుకు మాత్రమే భరోసా ఉందని ఎద్దేవా చేశారు. అందుకే అవిశ్వాస తీర్మానం సమయంలో టిడిపి సభ్యులకు విప్‌ జారీ చేసి మరీ ఈ ప్రజా కంటక ప్రభుత్వాన్ని రక్షించారని దుయ్యబట్టారు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే.. తన బాధ్యతను నిర్వర్తించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వానికే రక్షణ కవచంలా నిలబడ్డారని నిప్పులు చెరిగారు. అది ఇంకా అదికారంలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడే అన్నారు. ఈ ప్రభుత్వం పడిపోకుండా చంద్రబాబు కాపాడినందువల్లే ఇప్పుడు మనందరి మీద వేలాది కోట్ల రూపాయల భారాన్ని కిరణ్‌  ప్రభుత్వం వేసిందన్నారు.

రైతులు, పేదలను చంద్రబాబు పురుగుల్లా చూశారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. వ్యవసాయం దండగ అన్నారని, ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చూపించారని శ్రీమతి షర్మిల విమర్శించారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదన్నారని, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇవ్వకపోగా లాఠీలతో కొట్టించారని గుర్తుచేశారు. గ్యాస్‌ ధరను పెంచేశారన్నారు. రూ.50 ఉన్న విద్యుత్‌ హార్సుపవర్‌ ధరను రూ. 625 చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరి నడ్డీ ఆయన విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇంతగా హింసించిన చంద్రబాబు మళ్ళీ తనకు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్నే కాదు దేశాన్నే గాడిలో పెడతానని చెబుతూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పేనుకు పెత్తనం ఇస్తే.. అంతా గొరిగేసిందన్న సామెత చంద్రబాబుకు సరిపోతుందన్నారు. ఆయనకు అధికారం ఇస్తే ఇక మన రాష్ట్రం పరిస్థితి అధోగతే అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కై, జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టి, సిబిఐని ఉసిగొల్పి జైలులో పెట్టించారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. దేవుడు మంచివాళ్ళ పక్షాన నిలబడతాడని జగనన్నను త్వరలోనే బయటికి తీసుకువస్తాడని శ్రీమతి షర్మిల ఆశాభావం వ్యక్తంచేశారు. జైలులో ఉన్నా జగనన్న ధైర్యంగా ఉన్నారు. బోనులో ఉన్నా సింహం సింహమే. జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం వచ్చాక రాజశేఖరరెడ్డి కన్న ప్రతి కలనూ నెరవేరుస్తారని చెప్పారు. జగనన్న సిఎం అయ్యాక రైతులు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారన్నారు. ఇద్దరు పిల్లలను చదివించేందుకు నెల నెలా తల్లి ఖాతాలో డబ్బులు జమచేస్తారన్నారు. ప్రతి తల్లీ తమ బిడ్డలను తామే చదివించుకుంటున్నామని గర్వంగా చెప్పుకుంటారన్నారు. ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు ఉండాలన్న రాజన్న ఆశయాన్ని జగనన్న పూర్తిచేస్తారని హామీ ఇచ్చారు. పంటలకు రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారన్నారు.

అనంతరం ఇదే వేదిక మీద పలువురు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారందరికీ శ్రీమతి షర్మిల పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

http://www.ysrcongress.com/news/top_stories/smt-sharmilas-public-meeting-in-kothakota-in-vizag-dt.html

జవాన్ కుటుంబానికి వైఎస్ఆర్ సిపి ఆర్థికసాయం

పూతలపట్టు: ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీరజవాన్ వినాయకం కుటుంబాన్ని వైఎస్ఆర్ సీపీ నేత మిథున్ రెడ్డి పరామర్శించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిన్నబండపల్లె గ్రామానికి చెందిన వినాయకం హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కృష్ణ, రాణెమ్మ దంపతులకు వినాయకం ఏకైక కుమారుడు. తండ్రి కూలీనాలీ చేసి అతడిని డిగ్రీ వరకు చదివించాడు. వినాయకం 2009లో ఎన్‌డీఆర్ఎఫ్‌లో జవానుగా చేరాడు. ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి సహాయపడేవాడు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చేశాడు. ఈ మధ్యనే వినాయకానికి కూడా అతడి తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగి, ప్రాణాలు కోల్పోయాడు. 

పల్లెలు చీకట్లో మగ్గిపోతున్నాయి: విజయమ్మ

ఘట్ కేసర్: ఐక్యమత్యంతో ప్రజల్లోకి వెళ్దాం, ప్రత్యర్థులకు సత్తా చూపాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికల వచ్చినా పార్టీ సిద్ధంగా ఉంది అని విజయమ్మ అన్నారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు అని విజయమ్మ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది ఆమె హెచ్చరించారు. రాబోయే ఏ ఎన్నికలనైనా ఆషామాషీగా తీసుకోవద్దు అని విజయమ్మ హెచ్చరించారు.

పల్లెలు చీకట్లో మగ్గిపోతున్నాయని, ప్రజాసమస్యలపై స్పందించాలని, అప్పుడే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందన్నారు. ప్రతి పంచాయతీపై పార్టీ జెండా ఎగురవేయాలని, ఈ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కరువయిందని, పరిశ్రమలు పవర్‌హాలీడే ప్రకటిస్తున్నాయని, వేలాది పరిశ్రమలు మూతపడ్డాయని, దాంతో లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని విజయమ్మ తెలిపారు.

ఈ సర్కారుకి మద్యంపై తప్ప సాగు, తాగునీటిపై ధ్యాస లేదు అని, మహిళలపై అత్యాచారాల్లో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లు పూర్తయినా జగన్‌ కేసు ఎందుకు పూర్తి చేయడం లేదు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తున్నాయని విజయమ్మ మండిపడ్డారు. వైఎస్ విజయమ్మ అధ్యక్షతన జరిగిన రంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఉత్తరాఖండ్‌ మృతులకు పార్టీ నేతలు నివాళి అర్పించారు.

రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయింది: నాగిరెడ్డి

ధాన్యం మద్దతు ధర కేవలం 60 రూపాయలు పెంచడం దారుణం అని వైఎస్‌ఆర్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్‌ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతుల ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర పెంపు లేదు నాగిరెడ్డి ఆరోపించారు. రైతాంగం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది అని ఆయన అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయన్నారు. ముడిచమురు ధరల పెంపు ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని.. వెంటనే ముడి చమురు ధరలు తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. శాస్త్రీయ విధానంతో మద్దతు ధరలు ప్రకటించాలని వైఎస్‌ఆర్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్‌ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. - 

YSR Congress plenary from July 8

YS Sharmila Visits Pedder Reservoir at Visakha

YS Sharmila face to face with Hostel Students

Visakha Teeramlo 28th june 2013

రేపు కల్వకుర్తిలో వైఎస్ ఆర్ సీపీ ప్రాంతీయ సదస్సు

కల్వకుర్తిలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ సదస్సును నిర్వహించనుంది. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆ సదస్సులో పాల్గొనున్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలపై కార్యకర్తలకు ఆమె ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఆమన్ గల్ లో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ విజయమ్మ ఆవిష్కరించనున్నారు.

నేడు జెనీవా సదస్సుకు జూపూడి


సాక్షి, హైదరాబాద్: ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న గ్లోబల్ హోప్ నెట్‌వర్క్ ఇంటర్ నేషనల్ వార్షిక సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావుకు ఆహ్వానం అందింది. జెనీవాలో ఈ నెల 29 నుంచి వారం రోజులు జరగనున్న ఈ సమావేశాల్లో ‘సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇన్ ఖెయాటిక్ టైమ్స్-గ్లోబల్ చాలెంజెస్ అండ్ లోకల్ సొల్యూషన్స్’ అనే అంశంపై జూపూడి ప్రసంగించనున్నారు. ఆయన శుక్రవారం జెనీవాకు బయల్దేరతారు. 65 దేశాల ప్రతినిధులు పాల్గొనబోయే ఈ సదస్సుకు వరుసగా రెండో సంవత్సరం కూడా జూపూడికి ఆహ్వానం అందడం గమనార్హం. గత ఏడాది ‘సంఘర్షణతోనే నాయకత్వ సృష్టి’ అనే అంశంపై జెనీవాలో జూపూడి ప్రసంగించారు.

నిజాలు దాచి.. వైఎస్‌పై శివాలు

 పది రోజుల్లో పారిశ్రామిక సిటీ కోసమూ దాంతోనే ఎంఓయూ
- 1997లో పోర్టు కోసం కన్సెషన్ ఒప్పందంపై సంతకాలు
- 2002 వరకూ రూ. 800 పెట్టుబడితో నెట్టుకొచ్చిన నాట్కో
- ఫార్మా కంపెనీగా ఇన్‌ఫ్రా రంగంలో దాని అనుభవం శూన్యమే 
- 2004లో బాబు పదిరోజుల్లో దిగిపోతారనగా రూ. కోటి పెట్టుబడి
- 2005లో నవయుగ సంస్థ చేరాకే పనులకు ఊపు; రెండేళ్లలో పోర్టు పూర్తి
- ఆ నమ్మకంతోనే 2008లో పారిశ్రామిక సిటీకి ఓకే చెప్పిన వైఎస్
- అంతవరకే సీఎం బాధ్యత... తరువాత ప్రక్రియ వివిధ విభాగాలది
- 2009 సెప్టెంబర్‌లో వైఎస్ మరణించాక భూముల రిజిస్ట్రేషన్ మొదలు
- మూడు విడతలుగా 2010 సెప్టెంబర్ నాటికి 4,737 ఎకరాల అప్పగింత
- అవన్నీ విడిచిపెట్టి వైఎస్ టార్గెట్‌గా ‘ఈనాడు’ మతిలేని రాతలు
- ఏ కథనంలోనూ బాబు పాత్రను వీసమెత్తయినా ప్రస్తావించని తీరు
- ఎవరి హయాంలో భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయో నోరెత్తని ‘రామోజీ మార్కు’ కథనం

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : వాస్తవాల్ని మరుగునపరిచి అబద్ధాన్ని పదేపదే చెబితే అది నిజమై కూర్చుంటుందన్నది చంద్రబాబు పాలసీ. ఆయన అవిభక్త కవలలాంటి రామోజీరావుదీ అదే విధానం. అందుకే ఆయన విషపుత్రిక ‘ఈనాడు’కు నిజాలక్కర్లేదు. వైఎస్ ఉంటే చాలు. తప్పు జరిగినా జరగకపోయినా... ఆ తప్పు చేసినది ఎవరైనా దానికి సంబంధం లేదు. వైఎస్ కుటుంబంపై విషం కక్కే అవకాశం ఉందా... లేదా! అదొక్కటే దానికి కావాల్సింది. తాజాగా ‘కృష్ణపట్నం’ పేర పేజీలకొద్దీ కక్కుతున్న కాలకూట విషం కూడా ఆ పాలసీ పుట్టలోని పాముదే. 

కృష్ణపట్నంలో పోర్టు నిర్మాణం కోసం 1996లో ఒప్పందం కుదుర్చుకున్నది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఇందుకోసం నాట్కో అధిపతి నన్నపనేని చౌదరితో 1997 జనవరి 4న కన్సెషన్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. నిజానికి అప్పటికి దీనికి పోర్టులు కాదు కదా... కనీసం ఒక భవనం కట్టిన అనుభవం కూడా లేదు. రూ. 35 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీకి ఏకంగా పోర్టునే కట్టబెట్టేశారు చంద్రబాబు. చిత్రమేమిటంటే ఈ కంపెనీ దీనిలో కేవలం రూ. 800 పెట్టుబడి (పెయిడప్ క్యాపిటల్) పెట్టి ఊరుకుంది. 1999లో ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను సమర్పించింది. ప్రభుత్వం ఓకే చేసేసింది. కానీ 2002 వరకూ ఈ రూ. 800 పెట్టుబడితోనే లాక్కొచ్చింది నాట్కో. 2002లో మరో రూ. 5 లక్షలు మాత్రం పెట్టుబడి (పెయిడప్ క్యాపిటల్) పెట్టింది. ఇక 2004లో చంద్రబాబు ప్రభుత్వం మరో 10 రోజుల్లో దిగిపోతుందనగా... ఏప్రిల్ 29న మరో రూ. 1.6 కోట్లు పెట్టింది. అదీ సంగతి. 2005లో దానికి భాగస్వామిగా నవయుగ సంస్థ రావటంతో మరో రూ. 20 కోట్లు పెట్టుబడి పెట్టడం... పనులు ఊపందుకోవటం... రెండేళ్లలోనే పోర్టు నిర్మాణం పూర్తికావటం జరిగాయి. 

పోర్టు పూర్తయ్యాకే పారిశ్రామిక సిటీ: ఇదీ కథ. చంద్రబాబు ఎలాంటి కంపెనీతో ఒప్పందం చేసుకున్నారో, ఏ పెట్టుబడీ లేకున్నా భూములెలా అప్పగించారో, కన్సెషన్ ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారో ‘ఈనాడు’కు అవసరం లేదు. ఎందుకంటే అది బాబు కనక. ఇదే చంద్రబాబు పోర్టు ఆధారిత పారిశ్రామిక సిటీ కోసం కూడా 1996లోనే... అదే నాట్కోతో ఒక ఒప్పందం చేసుకున్నారు. 

దాని ప్రకారం ఆ సంస్థ ఆరు నెలల్లోగా పారిశ్రామిక సిటీ కోసం ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తయారు చెయ్యాలి. కానీ ఒప్పందం కుదుర్చుకున్న పోర్టునే ఆరేళ్ల పాటు అటకెక్కించిన నాట్కో ఈ పారిశ్రామిక సిటీ దిశగా ఏమీ చెయ్యలేదు. 2004లో చంద్రబాబు దిగిపోయే ముందు... తమకు భూములిచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. అంతలోనే ప్రభుత్వం మారిపోయింది. 2007లో పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయటంతో... 2008లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణపట్నం సంస్థ పారిశ్రామిక నగరానికి సంబంధించి నివేదికను రూపొందించి చూపించింది. ఆ సమావేశంలో కలెక్టరు, సంబంధిత అధికారులు ఉన్నారన్నది మినిట్స్‌ను చూస్తే అర్థంకాక మానదు. 

సామర్థ్యం ఉంది కనక సరేనన్నారు: చంద్రబాబులా వైఎస్సార్ ఏ అనుభవమూ లేని చోటామోటా కంపెనీకి ఓకే చెప్పలేదు. అప్పటికే పోర్టు పూర్తి చేయటం... ప్రాజెక్టు నివేదిక సంతృప్తికరంగా ఉండటంతో రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పారిశ్రామిక సిటీకి సరేనన్నారు. ఆ తరువాత సెజ్ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి రావటం... అక్కడి నుంచి కేంద్రానికి వెళ్లటం అన్నీ జరిగాయి. ఈ సెజ్‌కు కేంద్రం పూర్తిస్థాయి అనుమతినిచ్చింది కూడా వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించాకే. అది కూడా 2010లో. ఏ కంపెనీకైనా భూములిచ్చేది ఏపీఐఐసీనే. అది ఎలాంటి జీవోలూ ఇవ్వదు. అలాట్‌మెంట్ లెటర్లు మాత్రమే ఇస్తుంది.

ఇక ఏపీఐఐసీ చేతికి ఆ భూముల్ని స్థానిక రెవెన్యూ యం త్రాంగం ఇస్తుంది తప్ప ముఖ్యమంత్రి కాదు. ప్రాజెక్టును ఓకే చేయటమే ముఖ్యమంత్రి బాధ్యత. తదనుగుణంగా ఎంఓయూ చేసుకోవాలన్నా... ఒకవేళ చాలా సందర్భాల్లో ఎంఓయూ అవసరం లేదు కనక భూము ల్ని జీవోల ఆధారంగా స్వాధీనం చేసుకోవాలన్నా... అదంతా దిగువస్థాయి యంత్రాంగమే చేస్తుంది... చేయాలి కూడా. అది సీఎం బాధ్యత కాదు. ఇక్కడా అ దే జరిగింది. ప్రాజెక్టు నివేదిక ప్రజెంటేషన్ చూశాక... అప్పటికే ఆ సంస్థ పోర్టును పూర్తిచేసింది కనక... రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సీఎం సరేనన్నారు. ఇంతలోనే 2009 సెప్టెంబర్ 2న ఆయన మరణించారు. 

వైఎస్ మరణించాకే భూముల అప్పగింత: వైఎస్సార్ కుటుంబంపై రామోజీ పగ ఏ స్థాయిదంటే... నిజానిజాలతో పనిలేదు. ఆధారాలు అసలే వద్దు. వైఎస్ ఏం చేసినా తప్పే. చేయకున్నా తప్పే. ఎందుకంటే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారిలో అరబిందో, హెటెరో, రాంకీ, వాన్‌పిక్ వంటి సంస్థలు ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు చేపట్టాయి. వాటికి సంబంధించి వైఎస్సార్ హయాంలో జరిగిన ప్రతి కేటాయింపునకూ అవసరమైన ఎంఓయూలు, జీవోలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా వాళ్లు ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టారు కనక అదంతా ‘క్విడ్ ప్రోకో’ అని తాను రాసి... తన పార్టీ చేత పిటిషన్ వేయించి... వైఎస్సార్ కుటుంబమే లక్ష్యంగా చెలరేగుతున్నారు రామోజీ. 

కృష్ణపట్నం విషయానికొచ్చేసరికి వైఎస్ ఇవ్వని భూములకు జీవో లేదని, ఎంఓయూ లేదని నానాయాగీ చేస్తున్నారు. దీన్నేమనుకోవాలి? ఇక్కడ రామోజీ కడుపుమంట స్పష్టంగా కనిపించటం లేదా? ఎందుకంటే వైఎస్సార్ హయాంలో ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పటం మాత్రమే జరిగింది. ఆ తరువాత 2009 సెప్టెంబర్ 28న... 2010 సెప్టెంబర్ 15న విడతలుగా కృష్ణపట్నం సంస్థకు ఏపీఐఐసీ భూముల విక్రయ అగ్రిమెంట్ కుదుర్చుకుని రిజిస్టర్ చేసింది. అంటే మొత్తం 4,737 ఎకరాలనూ వైఎస్సార్ మరణించాకే రిజిస్టరు చేసింది. ఒకవేళ వైఎస్సార్ ఓకే చేశారు తప్ప దానికి సంబంధించిన ప్రాసెస్ జరగలేదని, పూర్తి కాలేదని భావిస్తే వైఎస్ తరవాత వచ్చిన ముఖ్యమంత్రయినా ఆ భూముల్ని రిజిస్టర్ చేయటం నిలిపేయొచ్చు. ఏపీఐఐసీ కూడా అగ్రిమెంట్ కుదుర్చుకోకుండా ఉండి ఉండొచ్చు. 

ఆ భూముల్ని అప్పగించటం కూడా నిలిపేసి ఉండొచ్చు. ఇవేవీ చేయకుండా వైఎస్సార్ మరణానంతరం 4,737 ఎకరాలనూ రిజిస్టర్ చేశారు. అలా చేసిన ఏపీఐఐసీ గానీ, వైఎస్సార్ తరువాతి ముఖ్యమంత్రి గానీ రామోజీకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్లెవరూ ఆయన టార్గెట్ కాదు కనక. సత్తా లేని నాట్కో చౌదరికి భారీ పోర్టు, 10 రోజులు తిరక్కుండానే పారిశ్రామిక సిటీ ఇచ్చేసిన చంద్రబాబు కూడా రామోజీ దృష్టిలో మహానుభావుడే. ఆయన కూడా రాష్ట్రాభివృద్ధి కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారట!! ఎందుకంటే అప్పట్లో ‘ఈనాడు’లో వచ్చిన కథనాలే దీనికి సాక్షి. వాళ్లందరినీ వదిలి... వైఎస్‌కే మొత్తం అంటగడుతూ శివాలెత్తటం ఏ మార్కు జర్నలిజం? ఇవేం విలువలు రామోజీ? ఏం! బాబు పాత్రను బయటపెడితే మీ సొమ్మేం పోతుంది?

ఈ తిండి తిని మా పిల్లలు పెద్దోళ్ల పిల్లలతో పోటీపడి చదవగలరా?

- నాసిరకం సరుకులను చూపిస్తూ, ఎలా తినేదంటూ ఆవేదన
- ‘రూ.185కు 9 సరుకుల’పై విమర్శల వెల్లువ 
- ఉద్వేగానికి లోనైన షర్మిల.. సర్కారు తీరుపై మండిపాటు 
- వాటిని కిరణ్ తిని చూస్తే తెలుస్తుందంటూ ధ్వజం
- ఎన్నికల పథకాలతో మోసపుచ్చుతారా అంటూ నిలదీత

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘రూ.185కే తొమ్మిది సరుకులు’ అంటూ పంచ రంగుల కరపత్రాలతో ఊదరగొట్టి పేదలను ఊహా లోకంలో తిప్పిన ‘అమ్మహస్తం’ పథకం అసలు రంగు బయట పడింది. సర్కారు ఇచ్చిన సంచిలో పుచ్చు పట్టిన సరుకులే తప్ప తినటానికి పనికొచ్చేవి లేనేలేవని జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ సరుకులు వద్దంటే రేషన్ కార్డు ఇచ్చి వెళ్లండని అధికారులు బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మేం పేదోళ్లమే. కూటికి లేనోళ్లమే. అంతమాత్రాన మాతో మట్టి తినిపిస్తారా అమ్మా?’ అని కృష్ణాపురం గ్రామానికి చెందిన ఉత్తరాల నూకరత్నం అన్న మాటలకు, ‘ఈ సరుకులతో వండి పెడితే పిల్లలు బతుకుతారా? ఈ తిండి తిని మా పిల్లలు పెద్దోళ్ల పిల్లలతో పోటీపడి చ దవగలరా అక్కా?’ అని భోగాపురం గ్రామంలో శారద అన్న మాటలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. నూకరత్నంను దగ్గర తీసుకొని ఓదార్చారు. ‘అమ్మ హస్తం కింద రూ.185కే 9 సరుకులంటూ రంగులు పూసిన సంచిని పేపర్లలో, టీవీల్లో చూపిస్తే కడుపు నిండా తినొచ్చని సంబరం పడ్డాం. కానీ మూట విప్పి చూస్తే దాని రంగు బయట పడింది. 

మీరు కూడా చూడండమ్మా’ అంటూ స్వామి మహిళా గ్రూపు సభ్యులు రవణమ్మ, లక్ష్మి కారాన్ని తీసి నీళ్లలో కలిపితే తెల్లగా నీళ్లపై తేలింది. పసుపు తీసి నీళ్లలో పోస్తే మునిగిపోయింది. చింతపండు మీద లేత గులాబీ రంగులో బియ్యపు పురుగు వంటి పురుగులు పాకుతూ కన్పించాయి. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పలు గ్రామాల్లో గురువారం ఇదే పరిస్థితి ఆవిష్కృతమైంది. ప్రజలంతా అమ్మహస్తం పథకం కింద తమకు ప్రభుత్వం ఇస్తున్న 9 సరుకుల లోగుట్టును చూపించారు. మిరప కాడలను మరపట్టి, దానికి రంగులేసి ప్యాక్ చేసి కారం పొడి అంటూ ఇస్తున్నారు. ఇలాంటి కారంలో కార్సినోజనిక్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయని, దాన్ని తింటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువని వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఎన్నోసార్లు హెచ్చరించారు. ఇలాంటి కారాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. అలాంటి కారాన్ని ఇప్పుడు అమ్మహస్తం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పంపిణీ చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇక పసుపులో పిండి కలిపారు. అది ఏం పిండో కూడా గుర్తు పట్టడానికి కష్టంగా ఉంది. ఇక చింతపండైతే ఏళ్ల తరబడి నిల్వ ఉండి, పడేయటానికి సిద్ధంగా ఉన్న బాపతుది! దాన్నే చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారు. విప్పి చూస్తే అన్నీ పురుగులే! దాన్ని నీళ్లలో కలిపి పిసికితే పులుసు కంటే పురుగుల కషాయమే వస్తోందనవచ్చు. అమ్మహస్తం పథకం డొల్లతనాన్ని ఇలా ప్రత్యక్షంగా చూసిన షర్మిల, ప్రభుత్వ వైఫల్యంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలతో పాటు, కొత్తకోట సభలో మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ఇవి ఎన్నికల పథకాలు..
‘‘అమ్మా! ఇవి ప్రజల సంక్షేమం కోసం పెట్టిన పథకాలు కానే కావు. ఎన్నికలు వస్తున్న వేళ పెట్టిన ఎన్నికల పథకాలు. పథకాలు ప్రజలకు అందకపోయినా పర్లేదు గానీ ప్రచారానికి పనికొస్తే చాలనుకుంటున్నారు. అందుకే ఇమేజ్‌ను పెంచుకోవడానికి చేస్తున్న ఈ ప్రచారానికి ఏకంగా రూ.100 కోట్ల ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారు. రేషన్ దుకాణం ద్వారా ఇప్పటిదాకా ఇస్తున్న సరుకులకు కత్తెర వేసి, అమ్మహస్తం అంటూ ఒక పొట్లంలో కొన్ని సరుకులు వేసి, దాని మీద సీఎం తన బొమ్మ వేసుకుని, ‘మీకు నేను రూ.100 మిగిలిస్తున్నాను’ అంటున్నారు. ఆయన ఇస్తున్న ఈ సంచిలో ఎన్ని సరుకులు పనికొస్తున్నాయో వాటిని కిరణ్‌కుమార్‌రెడ్డి గారు వండుకుని తింటే తెలుస్తుంది.

కావాల్సింది చిత్తశుద్ధి
పెట్టిన పథకాలు అమలు కావాలంటే చిత్తశుద్ధి ఉండాలి. ప్రజల మీద వీసమంతైనా ప్రేమ ఉండాలి. పేదల మీద గుప్పెడంతైనా కనికరం ఉండాలి. పథకాలు అమలు చేసేవారిలో నిజాయితీ ఉండాలి. అప్పుడే అవి కోట్ల మంది ప్రజలకు అందుతాయి. వైఎస్సార్ తన పథకాలను అలా అమలు చేసి చూపించారు కాబట్టే ఆయన వంటి నాయకుడే తమకు మళ్లీ కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికలు మరో ఏడాది ఉన్నాయనగా కిరణ్ ఇలా కొత్త పథకాలను, కొత్త పేర్లను పెట్టి ప్రచారం చేసుకుంటే అవి ఎన్నికల పథకాలవుతాయే తప్ప సంక్షేమ పథకాలనిపించుకోవు. పాదయాత్రలో నేను గమనించింది ఒక్కటే. కిరణ్‌కుమార్‌రెడ్డి గారు కొత్త పథకాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. కేవలం వైఎస్సార్ పెట్టిన పథకాలను అమలు చేస్తే చాలని ప్రజలు కోరుకుంటున్నారు.

దొంగ టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓట్లతో బుద్ధి చెప్పండి
కొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. తరవాత మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఓటు ఆయుధంతో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను మీరు గెలిపించిన రోజున జగన్‌మోహన్‌రెడ్డి గారిని మీరు ఆశీర్వదించినట్టు అయితుంది. మీరు వేసే ప్రతి ఓటూ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని మీరు నమ్ముతున్నట్టు అవుతుంది’’

16.1 కిలోమీటర్ల నడక..
షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం 192వ రోజు విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గం చెట్టుపల్లి నుంచి ప్రారంభమైంది. వెలంకాయపాలెం, రోలుగుంట, భోగాపురం మీదుగా షర్మిల కొత్తకోటకు చేరుకున్నారు. అక్కడ భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడ్నుంచి దొండపూడి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30కు చేరుకున్నారు. గురువారం షర్మిల మొత్తం 16.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటిదాకా 2,548.4 కి.మీ. పాదయాత్ర పూర్తయింది. 

మధ్యాహ్నం వేళ బస కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ షర్మిలను కలిశారు. నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర్‌గణేశ్, బలిరెడ్డి సత్యారావు, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, కుంబం రవిబాబు, చెంగల వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు కిడారి సర్వేశ్వర్‌రావు, వనజంగి కాంతమ్మ, బొడ్డేటి ప్రసాద్, కోల గురువులు, బూడి ముత్యాల నాయుడు, పాడేరు సత్యవాణి, జీవీ రవి రాజు, స్థానిక నాయకులు దాడి రత్నాకర్, కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.

పంచాయతీ నగారా! జూలై 3న ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్

- మూడో వారంలో ఎన్నికలు.. 25 నాటికి ప్రక్రియ పూర్తి
- నేడు పోలీసు, ఆర్థిక, పంచాయతీశాఖ అధికారులతో ఈసీ భేటీ
- శనివారం రాజకీయ పార్టీలతో సమావేశం
- రిజర్వేషన్ల నోటిఫికేషన్లు నేడు ప్రభుత్వానికి...
- రేపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పణ

పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. జూలై 2 లేదా 3వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. జూలై మూడో వారంలో పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్కో దఫా ఎన్నికలకు మూడు రోజుల వ్యవధి ఉంటుంది. జూలై 25వ తేదీ నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేసినట్టు తెలిసింది. రిజర్వేషన్ల నోటిఫికేషన్ ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందలేదు. అయినా ఎన్నికల నిర్వహణకు శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులతో, శనివారం పార్టీలతో సమావేశం కావాలని నిర్ణయించింది. 

ఎన్నికల బందోబస్తుకు సంబంధించి పోలీసులతో, ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించేలా సహకరించడంతో పాటు అభ్యర్థుల డిపాజిట్ మొత్తం, ఎన్నికల వ్యయ పరిమితి పెంపు వంటి ప్రతిపాదనలను పార్టీలతో చర్చించనుంది. డిపాజిట్, ఎన్నికల వ్యయ పరిమితి పెంపు ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. జిల్లాల్లో ఏ గ్రామ పంచాయతీని ఏ కేటగిరీకి రిజర్వ్ చేశారన్న వివరాలతో కూడిన నోటిఫికేషన్లు అన్ని జిల్లాల నుంచి పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఇంకా చేరలేదు. దాంతో ఆ నోటిఫికేషన్లను గురువారం వారు ప్రభుత్వానికి అందించలేకపోయారు. ఈ రిజర్వేషన్ నోటిఫికేషన్లను శుక్రవారం ప్రభుత్వానికి అందిస్తే, అది వాటిని పరిశీలించి ఎన్నికల సంఘానికి సమర్పిస్తుంది. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల నోటిఫికేషన్ అందగానే ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్‌ను సంఘం ప్రకటించనుంది. జూలై రెండున మంగళవారం కావడంతో మూడో తేదీన షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది.

తర్వాత మూడు రోజుల్లోగా ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను రెవెన్యూ డివిజన్లవారీగా మొత్తం మూడు దశల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం ఇదివరకే నిర్ణయించడం తెలిసిందే. అందుకు సంబంధించి జిల్లాల అధికారులకు ఇదివరకే ఆదేశాలిచ్చింది. ఎన్నికల నిర్వహణకు జిల్లాల అధికారుల సంసిద్ధతను జూన్ 24వ తేదీన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడి యో రికార్డింగ్‌తో పాటు మొబైల్ పోలీసింగ్, స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటుపై నివేదికలు ఇవ్వాలని ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి కోరారు.

ఇవేం రిజర్వేషన్లు: బీసీ సంఘాలు
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారుపై బీసీ సంఘాలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వాటిని జిల్లా యూనిట్‌గా ఖరారు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా కొన్ని జిల్లాల్లో 13 శాతం, కొన్ని జిల్లాల్లో 18 నుంచి 26 శాతం స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించారని ఆరు బీసీ సంఘాలు మండిపడ్డాయి. పంచాయతీరాజ్ శాఖ అధికారులకు లెక్కలు రావా అని ప్రశ్నించాయి. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, రిజర్వేషన్ల ఖరారులో బీసీలకు జరిగిన అన్యాయాన్ని డిమాండ్ చేశాయి. లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించాయి. బీసీ రిజర్వేషన్లలో తీవ్ర గందరగోళం సృష్టించారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర బీసీ ప్రజా సమితి అధ్యక్షుడు గుజ్జ కృష్ణ, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేశ్, రాష్ట్ర బీసీ ఫ్రంట్ అధ్యక్షుడు జి. మల్లేశ్‌యాదవ్, రాష్ట్ర బీసీ సమాఖ్య అధ్యక్షుడు దుర్గా గౌడ్ ఆరోపించారు. 

రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించాల్సిన రొటేషన్ పద్ధతిని బీసీ, జనరల్, మహిళా కేటగిరీల్లో పాటించలేదని వారు విమర్శించారు. నిబంధనల ప్రకారం కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్లు స్థానికంగా రిజర్వేషన్లు ఖరారు చేశారని ఆరోపించారు. ‘‘జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లు అమలు చేస్తే ప్రతి జిల్లాలో బీసీలకు 34 శాతం సీట్లు రావాలి. అందుకు విరుద్ధంగా జిల్లాల్లోని మొత్తం జనాభాలో బీసీల శాతాన్ని తీసుకుని, దాన్ని రాష్ట్ర జనాభా, రిజర్వేషన్ల శాతంతో భాగించి రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇది చట్టవిరుద్ధం. గుంటూరు జిల్లాలోని 1,008 పంచాయతీల్లో 34 శాతం లెక్కన బీసీలకు కనీసం 342 స్థానాలు రావాలి. కానీ 201 మాత్రమే కేటాయించారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. రొటేషన్ పద్ధతి ప్రకారం గతంలో రిజర్వ్ అయిన స్థానం మళ్లీ ఆ వర్గానికే రిజర్వ్ కావడానికి వీల్లేకపోయినా పలు జిల్లాల్లో ఆ వర్గాలకే మళ్లీ రిజర్వ్ చేశారని విమర్శించారు.

రాజన్న కుటుంబానికి చక్కటి బహుమానాన్ని...


నిజాన్ని తేల్చాల్సిన దర్యాప్తు సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకుని, న్యాయస్థానాలను తప్పుదారి పట్టించి వై.ఎస్.జగన్‌ని విజయవంతంగా జైలుకు పంపేశారు. పచ్చపాలకుల, పచ్చపత్రికల పైశాచికత్వాన్ని తన గుండె ధైర్యంతో ఒంటరిగా ఎదుర్కొని రెండుసార్లు రాజ్యాధికారాన్ని సాధించిన రాజన్న కుటుంబానికి చక్కటి బహుమానాన్ని నల్లారివారి నల్ల నాయకత్వంలో ఇచ్చుకున్నారు. కర్నూలు ఓదార్పులో జగన్ ‘‘వీళ్లు నా కాళ్లు విరగ్గొట్టొచ్చు లేదా నా వెన్నెముక విరగ్గొట్టొచ్చు.

వీళ్లు ఏమి చేసినా నేను కెరటంలా ఎగిరిపడతాను’’ అని చెప్పారు. ఎప్పుడూ మాట మీద నిలబడే రాజన్న, ఒకసారి ‘ప్రతిరంగంలో మనకు రిటైర్మెంట్ ఉండాలి, అలాగే రాజకీయాల్లో కూడా ఉండాలి. నేను కచ్చితంగా అరవై సంవత్సరాలకు రిటైర్ అవుతాను’ అని చెప్పారు. కాకపోతే ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాలు చాలా మిగిలిపోవడం వల్ల, మరీ ముఖ్యంగా ఆయన అనుకున్న జలయజ్ఞం ప్రాజెక్టులు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం వల్ల మరికొంతకాలం రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. కాని మాట తప్పని రాజన్నకి ఆ మచ్చ ఉండకూడదని దేవుడికి అనిపించిందేమో!

‘రాజన్నా! నువ్వు మాట తప్పొద్దు. నీకన్నా నీ కుమారుణ్ని గొప్ప నాయకుడిగా తయారుచేసే బాధ్యత నాది’ అని చెప్పి తీసుకెళ్లిపోయాడనిపిస్తుంది. అందుకే ఇంతమంది రాజకీయ నాయకులు, వాళ్ల అనుబంధ మీడియా సంస్థలు ఇలా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తుంది. వీళ్లు ఎంత దారుణంగా ప్రవర్తిస్తే, జగన్ అంతగా రాటుదేలి గొప్పనాయకుడిగా తయారవుతాడు. అంతవరకు రాజన్నని ప్రేమించే ప్రతి గుండె ఓర్పుతో, సహనంతో ఉండాలి. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించే అవకాశం వచ్చిన ప్రతిసారీ గుణపాఠం చెప్పాలి.

- శ్రీకాంతరెడ్డి జంబుల, సంగలపల్లి, వైఎస్సార్ కడప జిల్లా

చట్టం కొందరికే చుట్టమా?

- జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో పెట్టడం అన్యాయం, అక్రమం
- సాక్షి చైతన్యపథంలో కర్నూలు మేధావుల ధ్వజం

కర్నూలు, న్యూస్‌లైన్: ‘బొగ్గుస్కాంలో ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఫైలు కదిలింది. అలాంటప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను ఎందుకు నిందితుడిగా చేర్చలేదు. ప్రజాప్రతినిధిగా లేని, సచివాలయానికి కూడా రాని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు బాధ్యుడిని చేస్తూ నిందితుడిగా ఎలా చేర్చారు. ప్రధానికో న్యాయం.. జగన్‌మోహన్‌రెడ్డికి ఒక న్యాయమా..’ అంటూ మేధావులు ప్రశ్నించారు. జిల్లా కేంద్రం కర్నూలు శివారులోని మెగాసిరి ఫంక్షన్ హాలులో స్వప్న వ్యాఖ్యాతగా సాక్షి చైతన్య పథం నిర్వహించారు. న్యాయవాది ఎస్.మనోహర్ మాట్లాడుతూ చట్టాలను రాజకీయాలు నడిపిస్తుండటం వల్లే జగన్‌మోహన్‌రెడ్డి ఏడాదిగా జైలులో ఉండాల్సి వచ్చిందన్నారు. 

చట్టం అందరికీ సమానంగా లేదని, ఒక్కొక్కరి పట్ల ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యాశాఖ రిటైర్డ్ జేడీ డాక్టర్ ఎన్.గంగయ్య మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి కేసు విషయంలో మీడియా తనకు బాగా సహకరించిందని లక్ష్మీనారాయణ చెప్పడాన్ని బట్టి జరిగిన కుతంత్రాలను అర్థం చేసుకోవచ్చన్నారు. మైనార్టీ సంక్షేమ సంఘం నేత రోషన్ అలీ మాట్లాడుతూ ప్రజలు, మేధావులు ఇకనైనా నిశ్చబ్దాన్ని ఛేదించుకుని బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సైకాలజిస్టు ధరణి అజేయచంద్ర మాట్లాడుతూ వ్యాపారాలను, పెట్టుబడులను ముడుపులుగా చిత్రీకరిస్తే ఎలాగన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు టి.శేషఫణి మాట్లాడుతూ చట్టం పాలకులకు చుట్టంగా మారడం వల్లే జగన్‌మోహన్‌రెడ్డి జైలులో ఉన్నారని పేర్కొన్నారు. 

వైఎస్ రాజశేఖరరెడ్డి తాత వల్లే మాటలొచ్చాయి
నా పేరు సాయికుమార్. మాది కర్నూలు. నేను పుట్టుకతోనే మూగచెవుడు. నాకు మాటలు తెప్పించాలని నాన్న స్వామిచంద్రుడు డాక్టర్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. అప్పట్లో నాకు ఆరేళ్లు దాటిపోయాయి. ఆరోగ్యశ్రీ పథకం కూడా వర్తించదని చెప్పారు. చివరకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వద్దకు నాన్న వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. నాలాంటి వాళ్ల ఆక్రందనలు విన్న వైఎస్ రాజశేఖరరెడ్డి తాతయ్య 2009 జనవరి 28వ తేదీన 12 ఏళ్ల వరకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేయవచ్చంటూ జీవో జారీచేశారు.

దీంతో నేను అదే ఏడాది ఫిబ్రవరిలో ఆపరేషన్ చేయించుకున్నా. వైఎస్సార్ తాతయ్య దయవల్ల నేను ఇప్పుడు బాగా మాట్లాడుతున్నా, వింటున్నా. పదో తరగతి చదువుతున్నా. అయితే ఇప్పుడు రెండేళ్లలోపు వయస్సు వారికే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తారంట. నాలాగా ఇంకా ఎంతో మంది ఈ ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ అంకుల్ జైలు నుంచి బయటకు వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది. 
- సాయికుమార్, పదో తరగతి విద్యార్థి

టి.అజ్జాపురం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయత్ర శుక్రవారం విశాఖపట్నం జిల్లాలోని టి.అజ్జాపురం నుంచి ప్రారంభమైంది. మేదివాడ, గర్నికం,రావికమతం, పొట్టిదొరపాలెం, కోమళ్లపూడి, సింగవరం మీదగా షర్మిల పాదయాత్ర సాగుతొంది. 

వరద బాధితులకు వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ

Written By news on Thursday, June 27, 2013 | 6/27/2013

రుషికేష్‌: హిమాలయన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తరాఖండ్ వరద బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైసూరారెడ్డి, గొల్లబాబురావు పరామర్శించారు. రుషికేష్‌లోని ఆంధ్ర ఆశ్రమానికి చేరుకుని అక్కడున్న వారికి ధైర్యం చెప్పారు. బాధితులు పడుతున్న అవస్థలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే వారం రోజులుగా ఉత్తరాఖండ్‌లో వైఎస్ఆర్‌సీపీ వైద్య విభాగం సేవలు అందిస్తోంది. 'సహాయ కార్యక్రమాలకు అడ్డుపడుతున్న బాబు'


బద్రినాథ్‌లో 350 మందికిపైగా తెలుగు వారున్నట్టు గుర్తించామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే 3 రోజుల్లో వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువస్తామని చెప్పారు. బాధితులకు వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని పంపామని వెల్లడించారు. డెహ్రాడూన్‌లో చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వం విమానాన్ని ఏర్పాటు చేస్తే దానిలో ఎక్కొద్దని బాధితులను రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు చంద్రబాబు అడ్డు పడుతున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. 


వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమాశానికి విజయమ్మ!

రంగారెడ్డి జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ శుక్రవారం పాల్గొననున్నారు. జిల్లాలోని ఘట్ కేసర్ లోని కేఎల్ఆర్ గార్డెన్స్ లో ఉదయం11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సమావేశం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనార్ధన్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డిలు తెలిపారు. రేపటి సమావేశానికి ఏర్పాట్లను పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి పరిశీలిస్తున్నారు.

షర్మిల పాదయాత్రతో బలపడిన వైయస్‌ఆర్‌సిపి

మరో ప్రజాప్రస్థానం 27-06-2013
మరో ప్రజాప్రస్థానం పేరిట శ్రీమతి షర్మిల చే‌స్తున్న పాదయాత్ర ప్రభావం ప్రజల్లో చాలా స్పష్టంగా, తీవ్రంగా ఉన్నదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ ‌పార్టీ ‌రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా చెట్టుపల్లిలో ఆయన గురువారంనాడు శ్రీమతి షర్మిల 192వ రోజు పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శ్రీమతి షర్మిలతో పాటు ఆయన కొద్ది దూరం పాదయాత్రలో పాల్గొన్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర కారణంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతాలకు అతీతంగా అన్ని చోట్లా మరింతగా బలపడిందని ధీమాగా చెప్పారు. తెలంగాణలో కూడా తమ పార్టీ రోజురోజుకూ మరింతగా బలోపేతం అవుతున్నదని కొణతాల తెలిపారు. మహానేత వైయస్‌ఆర్‌ పట్ల తెలంగాణ ప్రజల్లో ఎనలేని అభిమానం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన, పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నదని కొణతాల చెప్పారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులలో ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ, చక్కని దిశానిర్ధేశం చేస్తున్నారన్నారు. ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు సేవ చేయడం మరచి కాంగ్రెస్‌, టిడిపి ఎంపిలు ఘర్షణ పడటం సిగ్గుచేటు అని కొణతాల రామకృష్ణ విచారం వ్యక్తంచేశారు.

కాగా.. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 192వ రోజు గురువారం ఉదయం విశాఖజిల్లా చెట్టుపల్లి నుంచి ప్రారంభించారు. ఈ రోజు పాదయాత్రలో వేలాది మంది వైయస్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులు ఆమెతో కలిసి ఉత్సాహంగా అడుగులు వేశారు. అక్కడి నుంచి శ్రీమతి షర్మిల వెలంకాయపాలెం, రోలుగుంట, భోగాపురం, కొత్తకొట, దొండపూడి గ్రామాల మీదుగా పాదయాత్ర చేస్తారు. శ్రీమతి షర్మిల 191వ రోజు బుధవారం పాదయాత్ర షెడ్యూలు ముగిసే సమయానికి రాష్ట్రంలో మొత్తం 2532.3 కిలోమీటర్లు నడిచారు.

http://www.ysrcongress.com/news/news_updates/ysrcp-strengthening-day-by-day-konatala-ramakrishna.html

YS Vijayamma speech in Bonakal Road at Khammam District

YS Sharmila Speech in Kothakota, Visakha dist

YSRCP leaders Meets Dehradun Collector

వైఎస్సార్ సీపీలో చేరిన కంచెట్టి గంగాధర్


సాక్షి, హైదరాబాద్: ఆర్మూర్ మున్సిపాలిటీ తాజా మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, మాజీ కౌన్సిలర్లు పూల నర్సయ్య, పాన్ శ్రీనివాస్ బుధవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. వీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్ నుంచి నల్లగొండ జిల్లా పర్యట నకు బయలుదేరడానికి ముందు వీరంతా విజయమ్మను కలుసుకుని తమ అభీష్టా న్ని వ్యక్తం చేయడంతో.. ఆమె వారికి కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

తెలుగువారి పరువు తీశారు


డెహ్రాడూన్‌లో కాంగ్రెస్, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగి దేశం దృష్టిలో తెలుగువారి పరువు తీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు విషాద సమయాల్లోనూ రాజకీయం చేస్తారనేది బుధవారం నాటి సంఘటన రుజువు చేసింది. ఉత్తరాఖండ్‌లో తీవ్ర వరదలు సంభవించి తెలుగు ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు హాయిగా అమెరికాలో గడిపిన చంద్రబాబు ఇపుడు తగుదునమ్మా అని వచ్చి ప్రచారంకోసం ఇలాంటి పనులను ప్రోత్సహిస్తున్నారు.

రాజకీయాలకు అతీతంగా కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాల్సిన సమయంలో మా విమానం ఎక్కండి అంటే మా విమానం ఎక్కాలి అంటూ టీడీపీ, కాంగ్రెస్ నేతలు సిగపట్లకు దిగడం ఏమిటీ? ఉత్తరాఖండ్‌లో తెలుగు ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం కిరణ్ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. పదవి కాపాడుకోవడానికి ఢిల్లీకి వెళ్లారుగానీ, అక్కడినుంచి బాధితులను ఆదుకునేందుకు ఉత్తరాఖండ్‌కు మాత్రం వెళ్లలేకపోయారు. ఒకవైపు వరదల్లో జనం కొట్టుకుపోతే సీఎం మాత్రం మద్యం అమ్మకాలు పెంచుకుని ఖజానా నింపుకోవడంపై ఆలోచిస్తూ కూర్చున్నారు. బాధ్యత గల సీఎం, బాధ్యతగల ప్రతిపక్ష నేత ఇద్దరూ ప్రజలను విస్మరించడం ఘోరం.
- భూమా శోభా నాగిరెడ్డి (వైఎస్సార్ సీపీ)

Popular Posts

Topics :