03 May 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పట్టిసీమ అంశం మీద బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్ధమా

Written By news on Saturday, May 9, 2015 | 5/09/2015


చంద్రబాబు  అక్రమ సంతానం పట్టిసీమ
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్

పాతగుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెదడుకు పుట్టిన అక్రమ బిడ్డే పట్టిసీమ ప్రాజెక్టు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు కమీషన్ తీసుకోవడానికే పట్టిసీమ జపం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు గతంలో 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉండగా 10 టీఎంసీల ప్రాజెక్టు ఒక్కటి కూడా కట్టింది లేదన్నారు.

పట్టిసీమ ఆలోచన చంద్రబాబుకు 2014 ఎన్నికల సమయంలో కూడా రాలేదన్నారు.  పట్టిసీమ కడితే రాయలసీమకు నీళ్లు వస్తాయని, 1000 టీఎంసీల నీరు తరలించవచ్చని, 2 కోట్ల ఎకరాలకు నీరు అందించవచ్చని, కృష్ణా డెల్టాకు గోదావరి నీరు అందుతుందంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రాజశేఖర్ మండిపడ్డారు.

చంద్రబాబునాయుడు అబద్ధాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  పట్టిసీమ అంశం మీద బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్ధమా అంటూ రాజశేఖర్ సవాలు విసిరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిబాబా, జిల్లా అధికార ప్రతినిధి శిఖా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

ఏడాదిలో పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారు? ఏ పని చే శారు?


బాబు మాటలన్నీ ముడుపులకోసమే
- వైఎస్సార్‌సీపీ నేతలు పార్థసారథి, కొత్తపల్లి ధ్వజం

హైదరాబాద్: 
రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చడానికీ, తన అవినీతి అంశాలను మరుగుపరచడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడులు శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ సీఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సీఎం తాజాగా ఐదేళ్లలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తీసుకొస్తానని ప్రకటనలు చేశారని, అదెలా సాధ్యమని పార్థసారథి ప్రశ్నించారు.  ఇప్పటివరకు ప్రాజెక్టుల ద్వారా సాగులోకి తెచ్చిన 69 లక్షల ఎకరాలేనన్నారు.  వీటిలో 20-25 లక్షల ఎకరాలు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాగులోకి తెచ్చినవేనని తెలిపారు.  ఇప్పుడు ఐదేళ్లలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తెస్తాననడం ప్రజలను మభ్యపెట్టడానికి కాక మరేంటని ఆయన దుయ్యబట్టారు.

చెరువు మట్టిని అమ్ముకుంటున్నారు..
చెరువుల్లో పూడిక తీసిన మట్టిని టీడీపీ నేతలు, కార్యకర్తలు రియల్‌ఎస్టేట్, ఇతర వ్యాపార అవసరాలకు అమ్ముకోవడం కోసమే నీరు-చెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని పార్థసారథి విమర్శించారు. పోలవరం, పట్టిసీమ, గోదావరి జలాలపై బహిరంగ చర్చకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని ఆయన సవాలు విసిరారు.

ఏడాదిలో పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారు? ఏ పని చే శారు?
ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అవకాశాలు పెరగాలంటే ఒక్క పోలవరం ప్రాజెక్టుతోనే సాధ్యమని కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఏడాదికాలంలో చంద్రబాబు ఎంత ఖర్చుపెట్టారు? కొత్తగా ఎంత పని పూర్తిచేశారో శ్వేతపత్రం ద్వారా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు.

లాఠీచార్జిని ఖండిస్తున్నాం: అంబటి

Written By news on Friday, May 8, 2015 | 5/08/2015


లాఠీచార్జిని ఖండిస్తున్నాం: అంబటి
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ కార్మికులపై లాఠీచార్జి చేయడాన్ని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఖండించారు. న్యాయబద్దమైన హక్కుల కోసం పోరాడితే లాఠీచార్జి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్తూరులో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.

రైతు వ్యతిరేక విధానాల వల్లే..


రైతు వ్యతిరేక విధానాల వల్లే..
సీఎం సభలో రైతు
ఆత్మహత్యాయత్నంపై
వైఎస్సార్‌సీపీ నేత అంబటి విమర్శ

హైదరాబాద్: సాక్షాత్తు సీఎం చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలోనే రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు అనుసరించిన విధానాలే ఇందుకు కారణమని ఆరోపించింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో రాము అనే రైతు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేస్తే.. ముఖ్యమంత్రి ‘అక్కడేమీ లేదు.. కూర్చొండి’ అంటూ సభికులకు సూచించడం శోచనీయమని రాంబాబు అన్నారు.  తన వెంట ఉండే అంబులెన్స్ ద్వారానైనా వైద్య సదుపాయం కల్పించలేదని దుయ్యబట్టారు.  రైతు ఆత్మహత్యాయత్నంపై చంద్రబాబు, టీడీపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.


రాజకీయం చేస్తే విమర్శిస్తాం..
ఖాకీ దుస్తుల ముసుగులో రాజకీయం చేసే వారిని, చంద్రబాబుకు ఊడిగం చేసే పోలీసు అధికారులను ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ విమర్శిస్తూనే ఉంటుందని అంబటి చెప్పారు. డీజీపీనుద్దేశించి తమ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం నేతలు మోతాదు మించి మాట్లాడారన్నారు. పోలీసు వ్యవస్థను జగన్ ఎక్కడా కించపరచడంగానీ, విశ్వాసం సన్నగిలేలా మాట్లాడటంగానీ చేయలేదన్నారు.

11 నుంచి వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటన

Written By news on Thursday, May 7, 2015 | 5/07/2015


11 నుంచి వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటనవైఎస్ జగన్ మోహన్ రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 11 నుంచి అనంతపురం జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం చెప్పారు. గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల మీదగా రైతు భరోసా యాత్ర చేస్తారన్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని తెలిపారు.

ఇటీవల దారుణ హత్యలకు గురైన పార్టీ నేతలు ప్రసాద్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారని రఘురాం చెప్పారు.

లోకేష్ తో పాటు ఇద్దరు అదికారులు

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ అమెరికా పర్యటన వివాదాస్పదంగా మారుతోంది. పెట్టుబడులకోసం అమెరికాలో పర్యటిస్తున్నానని లోకేష్ ప్రకటించగా, ఆయనకు తోడుగా మరో ఇద్దరు అదికారులను విడి,విడిగా అమెరికాకు ప్రభుత్వ ఖర్చుతో పంపడం పై విమర్శలు వస్తున్నాయి. దీనిని ఎవరికి తెలియకుండా ఉంచాలని ప్రయత్నించారని , అయినా ఆ విషయాలు బయటపడిపోయాయని కధనాలు వస్తున్నాయి.లోకేష్ కు అత్యంత సన్నిహిత మిత్రుడు అభీష్టతో పాటు,ఒక అదికారి కార్తికేయ మిశ్రలను అమెరికా పంపించారు.వారిద్దరూ సొంత ఖర్చులపై వెళితే పర్వాలేదు.కాని ప్రభుత్వం జి.ఓలు ఇచ్చి మరీ పంపించడం వివాదంగా మారింది.అభీష్ట కోసం (జీవో 1326), కార్తికేయ మిశ్రా కోసం మరో జీవో (నంబర్ 1336) జారీ చేశారు. ఇద్దరూ 3 వ తేదీ నుంచి 12 వరకు అమెరికాలో పర్యటిస్తారని, ఇద్దరికీ అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని జీవోలలో తెలిపారు. వారు ముగ్గురూ అమెరికా కలిసే తిరుగుతున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో వారు ముగ్గురూ కలిసి దిగిన ఫోటోలు మీడియా దృష్టిలో పడ్డాయి.అవి ప్రచారంలోకి వచ్చాయి.

http://kommineni.info/articles/dailyarticles/content_20150507_5.php?p=1430970228611

గ్రామాల్లో తిరిగే దమ్ముందా?

సీఎం చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సూటిప్రశ్న
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అబద్ధాలు చెబుతున్న మీకు గ్రావూల్లో తిరిగే ధైర్యం ఉందా?’-అని సీఎం చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బాబు అబద్ధాల పాలనకు రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెబుదావుని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండలో కాంగ్రెస్ పార్టీ మాజీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి వైఎస్సార్ సీపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ‘రైతులు, డ్వాక్రా అక్కచెల్లెవ్ముల రుణాలను వూఫీ చేయకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు దేవుడు మొట్టికాయలు వేస్తాడు’ అని ఆయన అన్నారు.   
 
వడ్డీ కూడా మాఫీ చేయలేదే..!
ఎన్నికల ముందు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు.. రుణాలు కాదు కదా.. కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని వుండిపడ్డారు. ‘రూ.87 వేల కోట్లున్న వ్యవసాయ రుణాలు.. వడ్డీలు పెరిగి రూ.లక్ష కోట్లకు చేరింది చంద్రబాబు చలవవల్ల కాదా?’ అని నిలదీశారు. ‘రైతన్నలారా.. మీ రుణాలు మాఫీ అయ్యాయా?’ అని సభలో ఉన్న రైతులను జగన్ ప్రశ్నించారు. ఇందుకు రైతులు ‘లేదు.. లేదు’ అని బిగ్గరగా సమాధానమిచ్చారు. తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలన్నా.. జాబు కావాలన్నా బాబు రావాలని ఏ టీవీ ఆన్ చేసినా ప్రకటన వచ్చేదని జగన్ గుర్తుచేశారు. అయితే, చంద్రబాబు అధికారంలోకైతే వచ్చాడు కానీ.. తాకట్టులోని బంగారం మాత్రం ఇంటికి రాలేదన్నారు.

బాబు వచ్చాక ఉన్న జాబు కాస్తా ఊడిపోయిందని ధ్వజమెత్తారు. ‘ఏ సీఎంపైనైనా ప్రజా వ్యతిరేకత వచ్చేందుకు రెండు, వుూడేళ్ల సమయుం పడుతుంది. అరుుతే, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ర్టంలో ఏడాది తిరగకవుుందే ‘మా కొద్దు బాబోయ్ ఈ బాబు పాలన’ అని ప్రజలు మండిపడుతున్నారు.’ అని జగన్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతామని.. అందరూ కలసి పోరాడదావుని పిలుపునిచ్చారు.
 
ఆ కుయ్.. కుయ్ లేవీ?!
విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన సభలో ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యుత్నించిన విషయూన్ని జగన్ ప్రస్తావించారు. అరుుతే, చంద్రబాబు వూత్రం ‘అది(రైతు ఆత్మహత్య యత్నం) పట్టించుకోకండి.. అందరూ ఇటే(తనవైపే) చూడండి’ అని అన్నారని విమర్శించారు. 108కి ఫోన్ చేస్తే కుయ్.. కుయ్ వుంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ రాలేదన్నారు. చివరకు ఆ రైతును ఆటోలో ఆస్పత్రికి తీసుకుపోవాల్సి వచ్చిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ పత్తికొండ నియోజకవర్గం బాధ్యతలను చెరుకులపాడు నారాయణరెడ్డి నిర్వర్తిస్తారన్నారు.
 
 100 మార్కులు సాధిస్తాం : భూమా
ప్రస్తుతం 11స్థానాల్లో ఉన్నా, రాబోయే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలనూ కైవసం చేసుకుని నూటికి నూరు వూర్కులు సాధిస్తావుని పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఉద్ఘాటించారు.  రాబోయే రోజుల్లో పార్టీకి వుంచి భవిష్యత్తు ఉందని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఫ్లోరైడ్ బారిన పడిన పత్తికొండ నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించిన ఘనత దివంగత వైఎస్‌దేనని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.
 
అందుకే పార్టీలో చేరా: నారాయణరెడ్డి
పత్తికొండ అభివృద్ధికి అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు వీలుంటుందనే వైఎస్సార్ సీపీలో చేరినట్టు చెరుకులపాడు నారాయణరెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నందునే తనపై తప్పుడు కేసులు మోపుతున్నారన్నారు.  సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, మణిగాంధీ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఐజయ్య, వూజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాష్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, పార్టీ నేతలు పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి, సీఈసీ సభ్యులు హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు.
 
మీకు చేతకాకపోతే మేమే నీళ్లిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, కర్నూలు: ‘శ్రమదానంతో నిర్మించిన వెంకటాపురం చెరువు కింద 15 గ్రామాలకు సాగునీరందే అవకాశాలున్నాయి. అలాంటి చెరువు నేడు బీటలువారింది. సమీపంలోనే హంద్రీనీవా కాలువ ఉన్నా.. చెరువుకు నీళ్లివ్వాలనే యోచన సీఎంకిగానీ, మంత్రులకుగానీ రావడం లేదు. వచ్చేది మన ప్రభుత్వం.. హంద్రీ కాలువ నుంచి నేను చెరువుకు నీళ్తు తీసుకోస్తాను.’-అని జగన్ అన్నారు.

కర్నూలు పర్యటనలో భాగంగా బుధవారం డోన్‌కు చేరుకున్న ఆయన తొలుత గాజులదిన్నె తాగునీటి పథకం పంప్‌హౌస్‌ను పరిశీలించి, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘దివంగత సీఎం వైఎస్ డోన్ మీదుగా పాదయాత్ర చేపట్టినప్పుడు.. నీటికోసం డోన్ ప్రజల ఇబ్బందులు చూశారు. బిందెడు నీళ్లను రూ.2కు కొనుగోలు చేస్తున్న దుస్థితి చూసి చలించిపోయారు. అధికారంలోకి రాగానే సుమారు 62 కిలోమీటర్ల దూరంలోని గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపుల ద్వారా ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చేందుకు రూ.53 కోట్లు ఖర్చు చేశారు. అంతకుముందు అధికారంలో ఉన్న సీఎంలు ఎవరికీ ఈ ఆలోచన రాలేదు.’ అని జగన్ ధ్వజమెత్తారు.
 
విపక్ష నేతకు ఎస్కార్ట్ కరువు
విపక్ష నేత, కేబినెట్ హోదా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి.. కర్నూలు పర్యటనకు వస్తున్నా రని తెలిసికూడా.. పోలీసులు కనీస భద్రతను కల్పించలేదు. ఆయన వెంట రక్షణగా ఉండాల్సిన ఎస్కార్ట్ గానీ, రోప్‌పార్టీగానీ కనిపించలేదు. కర్నూలు చేరుకున్న జగన్‌కి నగర శివార్లవరకే పోలీసులు ఎస్కార్ట్‌గా వచ్చి వెనుదిరిగారు. జగన్ ప్యాపిలి, కలుచట్ల, శభాష్‌పురం, రాంపల్లి క్రాస్, ఎద్దులదొడ్డి మీదుగా పత్తికొండ మార్గంలో ప్రమాదకర కొండల మధ్య ప్రయాణించినా బందోబస్తు కల్పించలేదు.

అభిమాన తరంగం


అభిమాన తరంగం
► వైఎస్ జగన్ పర్యటన విజయవంతం
► డోన్, పత్తికొండలోభారీగా తరలివచ్చిన జనం
► పర్యటనలో దారి పొడవునా పోటెత్తిన అభిమానం
► కిక్కిరిసిన పత్తికొండ బహిరంగ సభ


సాక్షి ప్రతినిధి, కర్నూలు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాలో చేపట్టిన పర్యటన విజయవంతమైంది. డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. ఊరూరా ప్రజలు ఆత్మీయతానురాగాలు పంచగా.. అభిమానులు పెద్ద ఎత్తున నీరాజనం పలికారు. ఉదయుం 12 గంటలకు మొదలైన పర్యటన రాత్రి 10 గంటల వరకు సాగింది.

హైదరాబాద్ నుంచి నేరుగా కర్నూలుకు చేరుకున్న జగన్.. అక్కడ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు వుద్దతు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయుమైన సవుస్యల సాధనకు కృషి చేస్తావున్నారు. అనంతరం అక్కడి నుంచి డోన్‌కు బయులుదేరారు. టోల్‌గేటు వద్ద కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి డోన్ వుునిసిపాలిటీలోని ప్రజలకు తాగునీరు అందించేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన గాజులదిన్నె మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించారు.

ఇక్కడకు తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయున మాట్లాడారు. డోన్‌లోని 50వేల వుంది ప్రజల కష్టాలను తెలుసుకుని రూ.52 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయూన్ని గుర్తుచేశారు. అదేవిధంగా బ్రిటీష్  కాలంలో నిర్మించిన వెంకటాపురం చెరువుకు హంద్రీ నీవా నుంచి నీరు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తావుని ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే.. అధికారంలోకి వచ్చిన వెంటనే నీరు అందిస్తావుని జగన్ హామీ ఇచ్చారు.

అనంతరం వెంకటాపురం చెరువును పరిశీలించి డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పార్టీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి సాయుంత్రం నాలుగున్నరకు బయులుదేరగా పత్తికొండకు చేరుకునే సరికి రాత్రి ఏడున్నర గంటలు దాటింది. పత్తికొండ బహిరంగ సభ రాత్రి 9 గంటలకు వుుగించుకున్న తర్వాత... ప్యాపిలికి చేరుకున్నారు. కొద్దిరోజుల క్రితం రోడ్డుప్రవూదంలో వురణించిన పార్టీ ఎంపీటీసీ బోరెడ్డి శ్రీలత కుటుంబాన్ని రాత్రి 10 గంటల ప్రాంతంలో పరావుర్శించి హైదరాబాద్‌కు వెళ్లారు.

డిప్యూటీ సీఎం ఇలాకాలా హవా!
 డిప్యూటీ సీఎం కేఈ కృష్ణవుూర్తి ఇలాకా పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తన సత్తా చాటింది. పత్తికొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ వూజీ నేత చెరుకులపాడు నారాణరెడ్డి పార్టీలో చేరిన అనంతరం నిర్వహించిన మొదటి బహిరంగ సభ కావడంతో నలువుూలల నుంచి ప్రజలు తరలివచ్చి తవు అభిమానాన్ని చాటుకున్నారు. రోవైపు జిల్లాలో ఆన పర్యటన ఆసాంతం ప్రజలు భారీగా తరలివచ్చి త ద్దతు ప్రకటించారు.

డోన్ పట్టణానికి తాగునీటి కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని జగన్ స్పష్టం చేయగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. డోన్ నియోజకవర్గంలోని 15 గ్రావూలకు నీరందించే వెంకటాపురం చెరువుకు.. హంద్రీనీవా నుంచి నీరు తరలించేందుకు ఒత్తిడి తెస్తావుని జగన్ ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే నీరు అందిస్తావుని హామీ ఇచ్చారు.

దారి పొడవునా నీరాజనాలు...!

 డోన్ నుంచి బయులుదేరిన జగన్‌కు పత్తికొండ వరకూ గ్రావుగ్రావూన ప్రజలు నీరాజనాలు పలికారు. సాయుంత్రం నాలుగున్నర గంటలకు డోన్ నుంచి బయులుదేరితే.. పత్తికొండకు చేరుకునే సరికి రాత్రి ఏడున్నర గంటలరుుంది. మార్గమధ్యంలో కలచట్ల, రావులింగాయుపల్లె క్రాస్, శేభాష్‌పురం, ఎద్దులదొడ్డి గ్రావూల ప్రజలు తరలివచ్చారు. ఈ గ్రావూల్లో గుంపుగుంపులుగా ఉన్న ప్రజలను పలుకరిస్తూ ఆయున పర్యటన సాగించారు.

11 వుంది సభ్యుల వుద్దతు ఉంటుంది
 పార్టీలో చేరిన చెరుకులపాడు నారాయుణ రెడ్డికి పార్టీకి చెందిన ఎంపీతో పాటు 11 వుంది ఎమ్మెల్యేల వుద్దతు ఉంటుందని నేతలు ప్రకటించారు. అధికార పార్టీ ఎంత బెదిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 14 సీట్లకు 14 గెలుస్తావుని ధీవూ వ్యక్తం చేశారు. తాను వైఎస్సార్‌సీపీలోకి చేరడంతో అధికార పార్టీ అక్రవు కేసులను బనారుుస్తోందని చెరుకులపాడు నారాయుణ రెడ్డి వివుర్శించారు. వెంకటప్పనాయుుడు, సోవుప్ప హత్య కేసులతో తనకు ప్రత్యక్షంగా, పరోక్షంగానూ సంబంధం లేదన్నారు. ఈ విషయుంపై ప్రవూణం చేయుడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పత్తికొండలో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు కనీసం కోటి రూపాయలు పెట్టి రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు.

కార్యక్రవుంలో ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్యేలు భూవూ నాగిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎస్‌వీ మోహన్ రెడ్డి, గౌరుచరిత, సారుుప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, వుణిగాంధీ, గువ్మునూరు జయురాం, ఐజయ్యు, వూజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాష్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి జగన్మోహన్ రెడ్డి, సీఈసీ సభ్యులు హఫీజ్ ఖాన్, ధర్మవరం సుబ్బారెడ్డి, శ్రీరావుులు, వుురళీధర్ రెడ్డి, తుగ్గలి ప్రహ్లాద్ రెడ్డి, శ్రీరంగడు, ఎర్రగుడి రావుచంద్రారెడ్డి, రవిరెడ్డి, బొవ్మున రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దీనికేంచెబుతారు!


డీఐజీ సారూ..దీనికేంచెబుతారు!
అనంతపురం: రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌సీపీ నాయకుడు శివప్రసాద్‌రెడ్డి హత్య అనంతరం తన అనుచరులు ప్రభుత్వ ఆస్తులపై ధ్వంసం చేస్తుంటే వారిని అడ్డుకోనందునే అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిని అరెస్ట్ చేశామని డీఐజీ బాలకృష్ణ నిన్న విలేకరుల సమావేశంలో తెలపడం వాస్తవ విరుద్ధంగా ఉంది. సంఘటన జరిగిన రోజు ఆందోళనకారులు తహశీల్దార్ కార్యాలయం, కార్యాలయ ఆవరణలోని ద్విచక్రవాహనాలపై దాడులు చేస్తుంటే స్వయంగా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అడ్డుకున్నట్లు అప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. గురునాథరెడ్డి ఆందోళనకారులను అడ్డుకుంటూ పక్కకు తోస్తున్నట్లు ఈ వీడియో ఫుటేజీలో కనిపిస్తున్నాయి.

పోలీసులు మాత్రం ఆయన తన అనుచరులను అడ్డుకోనందునే కేసులు నమోదు చేశామని చెబుతున్నారు. పైగా తాము వీడియో రికార్డులు పరిశీలించామని అందులో గురునాథరెడ్డి, దాడి జరుగుతుంటే చూస్తూ నిలబడినట్లు స్పష్టంగా గుర్తించామని చెబుతున్నారు. మరి ఈ ఫుటేజీలకు పోలీసుల నుంచి ఏం సమాధానం వస్తుందో మరి. రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి కూడా ప్రసాద్‌రెడ్డి మృతదేహాన్ని చూసిన అనంతరం రోడ్డు పక్కన చెట్టుకింద కూర్చున్నారని, అయినా ఆయనపైనా అక్రమంగా కేసు బనాయించారని ఆరోపిస్తున్నారు. మంత్రి సునీత సూచనల మేరకు ఈ కేసుల నమోదు చేశారనేది స్పష్టమవుతోందని పార్టీ శ్రేణులంటున్నాయి. ఈ అక్రమ అరెస్టులపై డీజీపీ, ఐజీ, ఎస్పీకి నోటీసులు జారీ చేసి విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణరెడ్డి మానవ హక్కుల కమిషన్‌కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేశారు.

ప్యాపిలిలో శ్రీలత కుటుంబానికి పరామర్శ


ప్యాపిలిలో శ్రీలత కుటుంబానికి పరామర్శ
ప్యాపిలి : ప్యాపిలి-1 ఎంపీటీసీ సభ్యురాలు బోరెడ్డి శ్రీలత కుటుంబాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం రాత్రి పరామర్శించారు. పత్తికొండ బహిరంగ సభ ముగించుకుని నేరుగా ఆయన బోరెడ్డి శ్రీలత ఇంటికి చేరుకున్నారు. ఫిబ్రవరి నెల 19వ తేదీన వెల్దుర్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బోరెడ్డి శ్రీలత మృతి చెందిన విషయం విదితమే. దీంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ముందుగా ఆయన బోరెడ్డి శ్రీలత చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

అనంతరం శ్రీలత భర్త గోపీనాథ్‌రెడ్డి, మామ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, అత్త పద్మావతి తదితరులను పరామర్శించారు. వారిని ఓదార్చిన జగన్ శ్రీలత కుమార్తెను దగ్గరికి తీసుకున్నారు. చిన్నారిని ఉన్నతంగా చదివించుకోవాలని సూచించారు. ఆయన వెంట డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, డోన్ నాయకులు ధర్మారం సుబ్బారెడ్డి,  డోన్, ప్యాపిలి జెడ్పీటీసీలు శ్రీరాములు, దిలీప్ చక్రవర్తి, సర్పంచ్ గౌసియాబేగం, ఎమ్మెల్యే పీఏ అంకిరెడ్డి, స్థానిక నాయకులు బోరా మల్లికార్జునరెడ్డి, బోరెడ్డి రఘునాథ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, షాషా,  క్రిష్ణారెడ్డి,  మెట్టు వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, రాజా నారాయణమూర్తి, వి.శ్రీనివాసరెడ్డి, పర్వతం శ్రీనివాసరెడ్డి, తొప్పెల రమణ, బషీర్, ఎస్కే వలి, ఇమాముద్దీన్, సర్కార్ బాసా, సీబిల్లి రంగన్న, దాదు తదితరులు  ఉన్నారు.

 తరలి వచ్చిన జనసందోహం
 ప్యాపిలి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. బుధవారం డోన్ పర్యటన ముగించుకుని పత్తికొండకు వెళ్తున్న జననేతకు దారి పొడవునా ప్రజలు నీరాజనం పలికారు. ఏనుగుమర్రి గ్రామంలో ప్రజలు రోడ్డుపైకి చేరుకుని ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. వారి ఆసక్తిని గమనించిన వైఎస్ జగన్ ఓపికతో వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం ప్యాపిలి సమీపంలో కలచట్ల బ్రిడ్జి వద్ద కూడా జనం వైఎస్ జగన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. కలచట్ల, ఎస్ రంగాపురం గ్రామాల్లో జనానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివాదం చేస్తూ పత్తికొండకు వెళ్లారు.

కిక్కిరిసిన జనం
 ప్యాపిలి : బోరెడ్డి శ్రీలత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు రాత్రి బోరెడ్డి శ్రీరామిరెడ్డి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ సామాజిక సేవలు హార్షనియం.

Written By news on Wednesday, May 6, 2015 | 5/06/2015


 
కువైట్: జన నేత  వై.యస్. జగన్  పిలుపు మేరకు కువైట్ జాయింట్ కో ఆర్డినేటర్ యం. బాలిరెడ్డి గారి సలహాలతో యం.వి. నరసా రెడ్డి గారి ఆధ్వర్యములో సభ్యులు గోవింద్ నాగరాజు, నాయని మహేష్, పి.రేహామాన్ ఖాన్, యం. చంద్రశేఖర్ రెడ్డి, ఆకుల ప్రభాకర్, తెట్టు రఫీ, సి. చంద్రశేఖర్ రెడ్డి, కె. సురేంద్ర రెడ్డి, రమణ యాదవ్, నాగిరెడ్డి చంద్ర. మర్రి కళ్యాణ్, పి. సురేష్ బాబు, దుగ్గి గంగాధర్, యం. సుబ్బారెడ్డి, సజ్జద్, గారి సహాయ సహకారాలతో నేపాల్ భూకంప భాదితుల సహాయార్ధం బట్టలు, పాల డబ్బాలు, దుప్పట్లు, మినీ లారి లో మొదటి విడతగా నేపాల్ అంబసి సూచించిన నేపాల్ స్వచ్చంద సంస్ధ సభ్యులకు ఇవ్వడం జరిగిందని కువైట్ కో అర్డినేటర్ ఇలియాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ సందర్భముగా యం. బాలిరెడ్డి గారు నరసారెడ్డి, కమిటి సభ్యులను అభినందిస్తూ భారత దేశంలో పకృతి వైపరీత్యాల ద్వారా జరిగే భూకంప భాదితులకు, తుఫాన్ భాదితులకు మంచి మనసుతో ఆదుకోవడం కువైట్ కమిటి సభ్యుల మంచితనానికి నిదర్శనమన్నారు. మన దేశమే కాక మిత్ర దేశమైన నేపాల్ లో భూకంప భాదితులను ఆదుకోవాలని అలోచించి మొదటి విడతగా బట్టలు, పాల డబ్బాలు, దుప్పట్లు భారి ఎత్తున సేకరించి భాదితులకు అందేలా చేయడం నిజంగా అభినందనీయమని ఇందుకు సహాకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో కడప శీను, పాటూరు వాసు, బి. శివారెడ్డి, డి. గోపాల్ రెడ్డి, షేక్ నాసర్, యు. శివాకుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రాజు, కె. రవి రెడ్డి, సూరి రెడ్డి,నేపాల్ స్వచ్చంద సంస్ధ సభ్యులు పాల్గోన్నారు.

పురుగుల మందు తాగిన రైతును తరలించడానికి 108కి ఫోన్ చేస్తే...


చంద్రబాబుకు మొట్టికాయ ఖాయం: వైఎస్ జగన్
పత్తికొండ: ఏ సీఎం కైనా ప్రజావ్యతిరేకత రావడానికి రెండుమూడేళ్లు పడుతుందని, ఏడాది తిరక్కముందే ఈ సీఎం మాకొద్దు బాబోయ్ అంటున్నారని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జనం అదే  మాట అంటున్నారని చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండలో బుధవారం రాత్రి జరిగిన సభలో జగన్ ప్రసంగించారు.

చంద్రబాబు సభలో ఈరోజు ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడని, దాని గురించి పట్టించుకోవద్దని... అందరూ తనవంకే చూడాలని సీఎం అన్నారని తెలిపారు. పురుగుల మందు తాగిన రైతును తరలించడానికి 108కి ఫోన్ చేస్తే రాలేదని, చివరకు ఆటోలో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రుణాలు మాఫీ చేసేశానని  సిగ్గులేకుండా చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. రుణమాఫీ కాదు కదా వడ్డీలు కూడా మాఫీ చేయలేదన్నారు. బాబు అధికారంలోకి రాగానే ఉన్న జాబులు పోతున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాగానే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా ప్రజలు గట్టి మొట్టికాయ వేస్తారని హెచ్చరించారు. చంద్రబాబు సర్కారును బంగాళాఖాతంలో కలిపే రోజు ఎంతో దూరంలో లేదని వైఎస్ జగన్ అన్నారు.

ఏం చేశారని నవనిర్మాణ దీక్ష?


ఏం చేశారని నవనిర్మాణ దీక్ష?
చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ ధ్వజం

 హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఏడాదిలో ఏం సాధించారని నవనిర్మాణ దీక్ష చేపడతారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ 11 నెలల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. విభజనకు లేఖలిచ్చిన వ్యక్తి విధ్వంసం పునాదులపై నవనిర్మాణం చేస్తారా? అని ప్రశ్నించారు. రైతు రుణ మాఫీ విషయంలో నిలువునా మోసం చేశారని, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయమంటూ కుచ్చు టోపీ పెట్టారని, నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఏమీ చేయకుండానే అన్నీ చేసేశామని చెప్పి మీడియా ప్రచారంతో కాలం గడిపారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రావడానికి తానే కారణమని ఆ ప్రాంతంలో ఘనంగా చెప్పుకున్న చంద్రబాబు విభజన హామీల్లో ఒక్కటైనా ఈ ఏడాది కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోగలిగారా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చే సేసినట్లుగా పత్రికలకు లీకులు ఇచ్చి వార్తలు రాయించుకున్నారని...  అసలు ఎంతమేరకు, ఎప్పటివరకు రుణాలు మాఫీ చేస్తారనే విషయమే ఎక్కడా అధికారికంగా చెప్పలేకపోయారని తూర్పారబట్టారు. దివంగత వైఎస్  హయాంలో పావలా వడ్డీకే రుణాలు పొందిన మహిళలు చంద్రబాబు మాటలు విని మోసపోయి, ఇపుడు రుణాలు లేనిస్థితిలో ఉండి పోయారన్నారు.

మస్తాన్‌బాబుకు గ్యాలంటరీ అవార్డు ఇవ్వాలి


మస్తాన్‌బాబుకు గ్యాలంటరీ అవార్డు ఇవ్వాలి
లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ మేకపాటి

న్యూఢిల్లీ: ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్వతారోహణలో పేరు గడించిన మస్తాన్‌బాబుకు జాతీయ అవార్డు ప్రకటించాలి. తగిన గ్యాలంటరీ అవార్డుతో సత్కరించాలి. ఈ సూచనతో ఈ సభ ఏకీభవిస్తుందని ఆశిస్తున్నా’ అని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. అలాగే గిన్నిస్ రికార్డులు సాధించిన ఆయనను ఏప్రభుత్వమూ గుర్తించలేదన్నారు.

మస్తాన్  భౌతికకాయాన్ని స్వస్థలానికి చేర్చినందుకు కృతజ్ఞతలనీ, అయితే ఆయన కుటుంబ సభ్యులకు పక్కా ఇల్లు లేదనీ వారికి ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు. ఇందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ సానుకూలత వ్యక్తం చేశారు. కాగా, మేకపాటి మరికొందరు ఎంపీలు పోలీస్‌స్టేషన్‌లో మౌలిక వసతులపై అడిగిన ప్రశ్నకు త్వరలో ఎంపీఎఫ్ కింద నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరాతీభాయ్ చౌదరి తెలిపారు.
 

నేడు కర్నూలుకు వైఎస్ జగన్


నేడు కర్నూలుకు  వైఎస్ జగన్
కర్నూలు(ఓల్డ్‌సిటీ) : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 6న మధ్యాహ్నం 12 గంటలకు డోన్‌కు చేరుకుని కృష్ణగిరి సమీపంలోని గాజులదిన్నె వాటర్ ప్రాజెక్ట్ పంప్‌హౌస్‌ను పరిశీలిస్తారన్నారు. 1998వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డోన్ మీదుగా పాదయాత్ర చేపట్టారని.. ఆ సందర్భంగా ఫ్లోరైడ్ నీటితో ఎదుర్కొంటున్న అవస్థలను డోన్ ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారన్నారు.

ఆ తర్వాత 2009లో గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి 0.06 టీఎంసీల నీటిని డోన్‌కు తరలించి ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు వైఎస్ సంకల్పించారన్నారు. అందులో భాగంగా సుమారు రూ.52 కోట్లు మంజూరు చేసి ప్రజారోగ్య శాఖ ద్వారా పనులు ప్రారంభింపజేశారన్నారు. పథకం పూర్తయినందున బుధవారం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టును పరిశీలించనున్నట్లు చెప్పారు. అక్కడే ప్రజలతో ముఖాముఖి ఉంటుందన్నారు.

ఆ తర్వాత వెంకటాపురం చెరువును సందర్శిస్తారు. ఒకటి నుంచి రెండు గంటల వరకు భోజన విరామం.. అనంతరం గత ఫిబ్రవరి 19న వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్యాపిలి ఎంపీటీసీ సభ్యురాలు బోరెడ్డి శ్రీలత ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారన్నారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ నేత చేరుకులపాడు లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పత్తికొండలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు.

బరాక్‌తో ‘బడాయి’ ఫొటో


బరాక్‌తో ‘బడాయి’ ఫొటోవీడియోకి క్లిక్ చేయండి
అమెరికా అధ్యక్షునితో లోకేష్ ఫొటోకు రూ.కోటి
పార్టీకి నిధుల సేకరణకోసం పోర్ట్‌ల్యాండ్‌లో ఒబామా కార్యక్రమం
10 వేల అమెరికా డాలర్లు చెల్లిస్తే ఫొటో దిగే అవకాశం
ఆ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని అమెరికా టూర్ ఖరారు
ఇద్దరు ప్రభుత్వ అధికారులు కూడా వెళ్లేందుకు జీవో జారీ

 
 హైదరాబాద్: పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికాకు లోకేష్... అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అవకాశం... ఇలాంటి వార్తలు నిన్నో మొన్నో చదివినట్లుందా? ప్రచార సాధనాలను మేనేజ్ చేయడంలో మాస్టర్ బ్లాస్టర్ నారా చంద్రబాబు నాయుడు, తన కుమారుడిని ప్రమోట్ చేసుకునేందుకు ఈసారి ఏకంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా పేరునే ఉపయోగించుకునేందుకు రంగం సిద్ధం చేశారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలను పురస్కరించుకుని డెమాక్రటిక్ పార్టీ ఇప్పుడు ఆ దేశంలో ఫండ్ రెయిజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ పార్టీకి చెందిన డెమాక్రటిక్ నేషనల్ కమిటీ (డీఎన్‌సీ) ఈ నెల 7 వ తేదీన పోర్ట్‌ల్యాండ్‌లోని సెంటినల్ హోటల్‌లో 2016 వైట్‌హౌస్ విక్టరీ ఫండ్ పేరుతో నిధుల సమీకరణ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా ఐదు వేల అమెరికన్ డాలర్లు చెల్లిస్తే ఒబామాతో ఫోటో దిగడానికి అనుమతిస్తారు. ఓ 10 వేల డాలర్లు చెల్లిస్తే ఫోటోతోపాటు ఆయనతో కరచాలనం చేసి ఓ రెండు నిమిషాల పాటు పరిచయం చేసుకోవచ్చు. అమెరికాలో నిధుల సమీకరణ కోసం ఇదో మామూలు ప్రక్రియ. సరిగ్గా ఆ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను రంగంలోకి దింపారు.

లోకేష్‌ను ప్రమోట్ చేసే వ్యూహం

అమెరికా అధ్యక్షుడితో ఫోటో దిగే అవకాశాన్ని వినియోగించుకుని, ఆ ఫోటో ఆధారంగా లోకేష్‌ను ప్రమోట్ చేసే ప్రచారానికి చంద్రబాబు పథకం రచించారు. అందుకోసం పక్షం రోజుల కిందటే అమెరికాలోని తన సన్నిహితుల ద్వారా ఏర్పాట్లు పూర్తి చేయించారు. ఆ తర్వాత రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అమెరికా అధ్యక్షుడితో లోకేష్ భేటీ అవుతున్నారంటూ తన అనుకూల పత్రికలద్వారా హడావుడి చేశారు. ఈ నెల 3 నుంచి 12 వ తేదీ వరకు లోకేష్ అమెరికా పర్యటనకే ఏర్పాట్లు చేయించారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రి ఓఎస్‌డీ సీతేపల్లి అభీష్ట, పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రాలు వెళ్లేందుకు అనుమతినిస్తూ జీవో-1326 జారీ చేసేశారు. వీరు సరిగ్గా ఏడో తేదీన పోర్ట్‌ల్యాండ్ నగరానికి చేరుకునేలా కార్యక్రమం ఖరారు చేశారు. లోకేష్ తన షెడ్యూలులో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ప్రత్యేక విమానంలో ఆరోజు ఉదయానికి పోర్ట్‌ల్యాండ్ చేరుకుంటారు.

ఫండ్ రెయిజింగ్ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరిని ఉద్దేశించి సాయంత్రం ఐదు గంటలకు ఒబామా ప్రసంగిస్తారు. అంతకన్నా ముందు నిర్ణీత రేటు పెట్టి టికెట్టు కొనుగోలు చేసినవారు ఒక్కొక్కరితో ఒబామా ఫొటోలు దిగే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే చాలామంది టిక్కెట్లు కొన్నందువల్ల లోకేష్ వంతు ఎప్పుడొస్తుందో తెలీదు. అందుకే ఆరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లోకేష్ సమయాన్ని ఖాళీగా పెట్టుకున్నట్లు సమాచారం. ఒబామాతో ఫొటో దిగేందుకు ఏ టైమ్ ఖరారైనా వెళ్లడానికి వీలుగానే ఈ ఏర్పాటు చేసుకున్నట్లు అమెరికాలోని టీడీపీ వర్గాలు చెప్పాయి. మరోవైపు లోకేష్‌తోపాటు అధికారికంగా వెళ్లిన సీఎం ఓఎస్డీ అభీష్ట, పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రాలకు కూడా ఒబామాతో కలవడానికి టికెట్లు కొనుగోలు చేసినట్టు తెలిసింది. వీరితోపాటు లోకేష్ స్నేహితుడు రాజేష్ అన్న వ్యక్తికి కూడా ఉన్నట్టు సమాచారం. వీరు ఒక్కొక్కరు 10 వేల అమెరికన్ డాలర్లు (రూ.6.10 లక్షలు) పెట్టి టికెట్ కొనుగోలు చేశారు. దీనికి తోడు వీరు ఉండడానికి ప్రత్యేకంగా హోటల్‌లో బస, ప్రత్యేక చార్టర్డ్ విమానం వెరసి కోటి రూపాయలకు పైగా ఖర్చవుతున్నట్టు అంచనా వేశారు. అధికారులిద్దరికీ ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలిచ్చి మరీ పంపిన కారణంగా వారి టికెట్లకయ్యే ఖర్చుతోపాటు ఇతర ఖర్చులన్నీ ఖజానాపై భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

అనుకూల మీడియా అడ్డగోలు ప్రచారం...

నిర్ణీత ఫీజు చెల్లించి ఎవరైనా సరే ఒబామాతో కలిసి ఫొటో తీయించుకునే ఓ సంప్రదాయ కార్యక్రమం ఇది. కానీ దీనికి టీడీపీ అనుకూల మీడియా ఓ మహత్తర కార్యక్రమంలా ప్రచారం మొదలుపెట్టింది. పెట్టుబడులను సమీకరించేందుకే లోకేష్‌బాబు అమెరికాలో పర్యటిస్తున్నారనీ, ఇందులో భాగంగా ఒబామాను కూడా కలవబోతున్నారనీ ఒక పత్రిక ఇప్పటికే కథనాలు రాసేసింది. సోషల్ మీడియాలో ఈ ఒబామా కార్యక్రమం గుట్టురట్టు కాకుండా ఉన్నట్లయితే... ఒబామాతో లోకేష్ ఫొటో దిగిన అనంతరం టీడీపీ అనుకూల మీడియా ఆ ఫొటోకు విశేష ప్రాచుర్యం కల్పించి ఉండేదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఒబామాతో లోకేష్ ఏకాంత భేటీ విజయవంతంగా ముగిసిందనీ, కొత్త రాజధాని నిర్మాణం పనుల గురించి అమెరికా అధ్యక్షుడు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని కూడా 8వ తేదీన తెలుగు మీడియాలో వచ్చి ఉండేదనీ ప్రచారం జరుగుతోంది. తాను చంద్రబాబును ఆదర్శంగా తీసుకునే రాజకీయాల్లో ప్రవేశించానని ఒబామా అన్నట్లు కూడా వార్తలు వస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కూడా సోషల్ మీడియా ఘోషిస్తోంది.

‘నిద్ర’మాని నిధులివ్వండి

బెళుగుప్ప : రాష్ట్రంలోని  నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రపోతే అవి పూర్తి కావాని, నిధులు కేటాయిస్తేనే సాధ్యమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలో మంగళవారం  లక్ష సంతకాల కార్యక్రమం ఏర్పాటు   చేశారు.  ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సీపీ వీరన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హంద్రీ నీవా మొదటిదశ ఆయకట్టుకు ఎగనామం పెట్టి చిత్తూరు, కుప్పంకు నీటిని తరలించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.

సంక్రాంతి సంబరాలకు రూ.150 కోట్లు, హెలికాప్టర్ ఖర్చు, విజయవాడ, హైదరాబాద్‌లలో కేబినేట్ ఖర్చులకు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు తప్ప రాయలసీమ కరువు రైతులకు సాగునీటికి నిధులు వెచ్చించి నీటిని అందించలేక పోతున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి  హంద్రీ నీవాకు రూ. 5800 కోట్లు ఖర్చు చేసి జీడిపల్లి వరకు కృష్ణా జలాలు తీసువచ్చే విధంగా కృషిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌కు అయినా  మొదటిదశకు  సాగునీరు అందించాలన్నారు.

నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీరు,  బెళుగుప్ప మండల పరిధిలో మాత్రమే జీడిపల్లి రిజర్వాయర్ కింద 26,500 ఎకరాల  ఆయకట్టుకు నీటిని ఇవ్వాలని ఉద్యమించాలని, దీనిపై లక్ష సంతకాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ హంద్రీ నీవా కింద భూములకు  ఒక తడి ఇస్తే బంగారు పంటలు పండుతాయన్నారు.

మొదటి దశ ఆయకట్టుకు  ప్రస్తుత ఖరీఫ్‌లో నీటిని అందించాలని, లేకపోతే    కాలువలు పగుల గొట్టి నీటిని తీసుకుపోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా రైతులు సమైక్యంగా పోరాడాలన్నారు.   వైఎస్సార్‌సీపీ  రాష్ట్ర బీసీ సెల్ ప్రదాన కార్యదర్శి దుద్దేకుంట రామాంజనేయులు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.

 బెళుగుప్ప సింగిల్‌విండో అధ్యక్షుడు శివలింగప్ప, బెళుగుప్ప సర్పంచ్ రామేశ్వరరెడ్డి, కాలువపల్లి ఎంపీటీసీ వెంకటేశులు,  పార్టీ  మండల ఉపాధ్యక్షుడు అశోక్, శీన, నాయకులు రాజన్న, తిప్పేస్వామి నాయక్, హర్షకుమార్‌రెడ్డి, బాస్కర్‌రెడ్డి, చౌదరి, తిమ్మరాజు  తదితరులు పాల్గొన్నారు.

బీఈడీలకు ఎస్ జీటీ అవకాశం కల్పించండి: వైఎస్ జగన్

Written By news on Tuesday, May 5, 2015 | 5/05/2015


బీఈడీలకు  ఎస్ జీటీ అవకాశం కల్పించండి: వైఎస్ జగన్వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
హైదరాబాద్: బీఈడీ అభ్యర్థులకు డీఎస్సీలో ఎస్ జీటీ పోస్టులకు అర్హత కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడలకు లేఖ రాశారు. ఏపీలో బీఈడీ అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నారని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ సంఖ్యలో ఉన్నాయని వివరించారు. అందువల్ల బీఈడీ అభ్యర్థులకు ఎస్ జీటీ పోస్టుల్లో అర్హత కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు.

ఎన్ సీటీఈ వారికి ఈ అవకాశం లేకుండా చేసిందన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ కు ఈ వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీలో దాదాపు రెండు లక్షల మంది బీఈడీ అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు. వారి ఆశలమేరకు ఎన్ సీటీఈ నిబంధనలను సవరించి ఈ వెసులుబాటు కల్పించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.

ఒబామాకు ఎన్నారైల లేఖ

అట్లాంటా : భారతదేశం నుంచి వస్తున్న నారా లోకేశ్ కు అపాయింట్ మెంట్ ఇవ్వొద్దంటూ అమెరికాలోని ఎన్నారైలు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు బహిరంగ లేఖలు రాస్తున్నారు. అమెరికాలో ఉన్న కొంతమంది వద్ద డబ్బు సేకరించి, ఆ మొత్తాన్ని డెమొక్రాటిక్ పార్టీకి విరాళం రూపంలో ఇవ్వడానికి వస్తున్నట్లుగా వచ్చేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని.. ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని బహిరంగ లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి కొడుకుగా తప్ప లోకేశ్ కు వేరే ఏ అర్హతా లేదని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అక్కడ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను అత్యంత క్రూరంగా నిర్మూలిస్తున్నారని, ఇందుకోసం పోలీసు యంత్రాంగాన్ని కూడా వాడుకుంటున్నారని లేఖలో ఆరోపించారు.

ఇక పార్టీ కార్యకర్తల నిధికి చీఫ్ కోఆర్డినేటర్ పదవిలో ఉంటూ.. ప్రపంచవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల నుంచి భారీమొత్తంలో డబ్బు సేకరించారని అట్లాంటాకు చెందిన గురవారెడ్డి అనే ఎన్నారై తెలిపారు. ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో 10 వేల డాలర్లు ఇచ్చి అమెరికా అధ్యక్షుడితో షేక్ హ్యాండ్ కొనేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని, మళ్లీ స్వదేశానికి వెళ్లాక ఒబామాయే స్వయంగా తనను ఆహ్వానించినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తారని కూడా ఆయనా లేఖలో హెచ్చరించారు. అందువల్ల అసలు లోకేశ్ ను కలిసే ఆలోచనే పెట్టుకోవద్దని సూచించారు.

వైఎస్సార్ సీపీ పోరుబాట

- ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కదంతొక్కిన నాయకులు, కార్యకర్తలు
- మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు..ర్యాలీలు
- రెవెన్యూ అధికారులకు వినతిపత్రాల అందజేత
- టీడీపీ మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చాలి, రుణ మాఫీ చేయాలని డిమాండ్
గుంటూరు సిటీ : 
 ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విల్లు సంధించింది. పరిష్కారమే లక్ష్యంగా పోరుబాట పట్టింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నేతృత్వంలో సోమవారం జిల్లాలోని పలు మండల కార్యాలయాల ఎదుట ఆందోళనకు శ్రీకారం చుట్టింది.

ప్రజల గోడు పట్టని పక్షంలో పతనం తప్పదని తెలుగుదేశం ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు చేసింది. ఒకే సమయంలో ఇటు కరువు, అటు అకాల వర్షాలు దాడి చేస్తున్న చిత్రమైన పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. అకాల వర్షాలతో జిల్లా రైతాంగం భారీగా నష్టపోగా, కరువుతో కూలీలు వలస బాట పట్టిన వాతావరణం సర్వత్రా కనిపిస్తోంది. సాగునీటి మాట దేవుడెరుగు ప్రస్తుతం తాగునీరు కూడా దక్కని దుస్థితి జిల్లా అంతటా తాండవిస్తోంది. ప్రభుత్వ పట్టనితనం, అధికారుల అలసత్వం వెరసి జిల్లా ప్రజల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ దృష్టి సారించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో రెండ్రోజుల ఆందోళనకు తెర తీసింది. మొదటి రోజులో భాగంగా పలు మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించింది.

మేడికొండూరు, ఫిరంగిపురం, బాపట్ల టౌన్, రూరల్, మంగళగిరి టౌన్, రూరల్,  క్రోసూరు, వేమూరు, చుండూరు, అమృతలూరు, తెనాలి టౌన్, రూరల్, కొల్లిపర, నర్సరావుపేట టౌన్, రూరల్, రొంపిచర్ల, చిలకలూరిపేట టౌన్, రూరల్, గురజాల, మాచవరం, నకరికల్లు, ముప్పాళ్ల తదితర మండలాల్లో సోమవారం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీలు చేపట్టి రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. నీటి ఎద్దడి నివారించాలనీ, వలసలు నిరోధించాలనీ, కరువు, అకాల వర్షాల ధాటికి దెబ్బతిన్న రైతాంగానికి తక్షణం నష్టపరిహారం అందించాలనీ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలనీ, రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలనీ, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ను పగలే అందించాలనీ డిమాండ్ చేశారు.

అనంతను ఆప్ఘనిస్తాన్‌గా మారుస్తున్న బాబు

అనంతపురం: మలేషియా, సింగపూర్, జపాన్ మాదిరిగా ఏపీని తీర్చిదిద్దుతామని ప్రకటనలు గుప్పిస్తున్న సీఎం చంద్రబాబు.. అనంతపురంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఆ జిల్లాను మరో ఆప్ఘనిస్తాన్‌గా మారుస్తున్నారని వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు.

వైఎస్సార్  సీపీ నాయకుడు భూమిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి హత్య, ఆపార్టీ మాజీ ఎమ్మెల్యే బి.గుర్నాథ్‌రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డిల అక్రమ అరెస్టులకు నిరసనగా సోమవారం అనంతపురం బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు.

అసలు ఎర్రచందనం దొంగలు టీడీపీ నేతలే

Written By news on Monday, May 4, 2015 | 5/04/2015


చిత్తూరు:ఎర్రచందనం స్మగ్లర్లతో వైఎస్సార్ సీపీ నేతలకు సంబంధాలున్నట్లు ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండించింది. వైఎస్సార్ సీపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక పచ్చ పత్రికలు, టీడీపీ నేతలు లేని పోని ఆరోపణలకు తెరలేపుతున్నారని వైఎస్సార్ సీపీ పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి,  దేశాయి తిప్పారెడ్డిలు విమర్శించారు. ఎర్రచందనంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపించడం తగదని వారు సూచించారు.
 
అవరసరమైతే స్మగ్లర్లు ఎవరు అనే దానిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అసలు ఎర్రచంద్రనం దొంగలు టీడీపీ నేతలేనని రామచంద్రారెడ్డి, తిప్పారెడ్డిలు తీవ్రంగా మండిపడ్డారు.

డీజీపీతో కలిసి చంద్రబాబు హత్యలు చేయిస్తున్నారు


డీజీపీతో కలిసి చంద్రబాబు హత్యలు చేయిస్తున్నారు
హైదరాబాద్ : రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో కలిసి గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నేతలపై జరుగుతున్న దాడులపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ నేతలపై జరుగుతున్న దాడులు, హత్యలపై సీబీఐతో విచారణ చేయించాలని గవర్నర్ ను కోరినట్లు చెప్పారు.  సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...డీజీపీతో కలిసి వైఎస్ఆర్ సీపీ నేతలను హత్యలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 29న భూమిరెడ్డి శివప్రసాదరెడ్డిని దారుణంగా హతమార్చారని, ఎమ్మార్వో కార్యాలయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ అధికారుల ప్రమేయంతో హత్య జరిగిందని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వం, అధికారులతో కలిసి వ్యక్తలను ఏరివేసే అరాచకాన్ని ఆపాలని గవర్నర్ కు వివరించినట్లు చెప్పారు.  గత నెల మార్చి 31న జిల్లాలో సింగిల్ విండో అధికారి విజయ్ భాస్కర్ రెడ్డిని కూడా కిరాతకంగా హత్య చేశారన్నారు. అనంతపురం జిల్లాలో ఇప్పటివరకూ హత్యలు జరిగాయని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గవర్నర్ తో సమావేశమైన వైఎస్ జగన్

 వైఎస్సార్ సీపీ నేతలపై వరుసగా జరుగుతున్నదాడుల ఘటనలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేసింది.  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం గవర్నర్ తో  సమావేశం అయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్సార్ సీపీ నేతలపై జరుగుతున్న దాడులను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.
 
గత కొన్ని రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి దారుణ హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై సమీక్ష నిర్వహించాలని గవర్నర్ కు వైఎస్సార్ సీపీ విన్నవించింది.

తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ పదిలం


తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ పదిలం
వైఎస్ విగ్రహావిష్కరణ సభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
మద్దిపాడు: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉన్నారని వైఎస్సార్ సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలే ఆయన కీర్తిని చిరస్థాయిగా నిలిపాయన్నారు. మండలంలోని తెల్లబాడు  ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని  ఆదివారం రాత్రి ఎంపీ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వైవీ మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, రోగుల కోసం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖరరెడ్డి ఒక్కరే అన్నారు.

ఆయన మరణించి ఐదేళ్లు దాటినా ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారంటే ఆయన అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ ప్రతి పేదవాని సంక్షేమం చూడటమే కారణమన్నారు.  ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం రాకుంటే నిరుద్యోగ భృతి కల్పిస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని మోసగించాడని..ఇలా ప్రతి విషయంలో అబద్ధాలాడిన వ్యక్తి ప్రజలకు ఏంచేశాడని ప్రశ్నించారు. త్వరలో యువకులకు ఉద్యోగాలపై ఒక ఉద్యమం చేస్తామని ఆయన అన్నారు. తండ్రిబాటలో మాటతప్పని జగన్‌ను ముఖ్యమంత్రిగా చూసే సమయం అతిదగ్గరలో ఉందని అన్నారు.  

జిల్లాలో వైఎస్సార్  4 సాగునీటి పథకాలను చేపట్టి 3 పథకాలను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తిచేసి ప్రారంభించారన్నారు. కాగా ప్రస్తుత ప్రభుత్వం రూ.60 కోట్లు కావలసిన ప్రాజక్టుకు రూ.6 కోట్లు కేటాయించటం చూస్తే రైతులపట్ల వీరికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో 600 అడుగులు బోరు వేస్తేకానీ నీరు అందుబాటులోకి రాదని, గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాంతంలో 30 అడుగులకే నీరు పడుతుందంటే అంతా వైఎస్సార్ పుణ్యమే అన్నారు. తాము పశ్చిమ ప్రాంతంలో పడుతున్న బాధలను చూడలేకే రూ.3300 కోట్ల పైచిలుకు వ్యయం చేసి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్సార్ కృషి చేశారని అన్నారు.

ప్రస్తుతం  చంద్రబాబు కేవలం ఆ ప్రాజెక్టుకు రూ.150 కోట్ల నిధులు కేటాయించారని అవి సిబ్బంది జీతభత్యాలకే సరిపోవన్నారు. సభకు అధ్యక్షత వహించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ తాను వైఎస్సార్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండటం పూర్వజన్మ సుకృతమన్నారు. తెల్లబాడు ఎస్సీ కాలనీ ప్రజలు చందాలు వేసుకుని వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నాగార్జున మాట్లాడుతూ వైఎస్సార్  ప్రతి క్షణంప్రజల కోసం, దళితుల కోసం ఆలోచించారని అన్నారు. చంద్రబాబు దళితులకు ఉపయోగించాల్సిన రూ.5 వేల కోట్లు ఎటుపంపించాడో సమాధానం చెప్పాలని అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదవాని గుండెల్లో వైఎస్సార్ కొలువై ఉన్నారన్నారు.

పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి భరత్ మాట్లాడుతూ కేవలం అధికారం కోసం తపించిన చంద్రబాబు బూటకపు మాటలు ప్రజలు నమ్మి మోసపోయారని మరోసారి ఆ తప్పు చేయరని అన్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎటువంటి వ్యక్తో అందరికీ తెలుసునని అన్నారు. కార్యక్రమంలో బూచేపల్లి వెంకాయమ్మ, ఎంపీపీ నారావిజయలక్ష్మి, ఎంపీటీసీ ఉన్నం ప్రశీద, జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, చుండూరి రవి, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యానికి పాతరేశారు


ఇది టీడీపీ గెలుపుకాదు..  వైఎస్సార్‌సీపీ ఓటమి కాదు
ప్రజాస్వామ్యానికి పాతరేశారు
కోట్లు పోసి పదవిని కొనుక్కొన్నారు...
వీరేం సేవ చేస్తారు
ఈ ఎన్నిక చెల్లదు..
ఎప్పటికైనా డీసీసీబీ మాదే
డీసీసీబీ ఎన్నికపై వైఎస్సార్‌సీపీ నేతల వ్యాఖ్యలు


కడప కార్పొరేషన్ : జిల్లా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు(డీసీసీబీ)ని టీడీపీ కైవసం చేసుకోవడం ఆ పార్టీకి గెలుపుకాదని, వైఎస్సార్‌సీపీకి ఓటమి కాదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ ంలో ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాభిమానంతో డీసీసీబీని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోగా, టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించి దాన్ని లాక్కుందన్నారు.

డెరైక్టర్లందరికీ డబ్బులు ఎరగా వేసి, లొంగని వారిని ఎర్రచందనం కేసుల్లో ఇరికిస్తామని భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. అనేక ఆరోపణలు చేసి ఇద్దరు డెరైక్టర్లకు ఓటు హక్కు లేకుండా చేశారన్నారు. పుల్లయ్య అనే డెరైక్టర్ రెండు సంఘాలకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని, తమ ఎంపీ, ఎమ్మెల్యేలు రాతమూలకంగా ఫిర్యాదు చేసినా అధికారులు కనీసం విచారణ చేసిన పాపాన పోలేదన్నారు.

శ్రీమన్నారాయణ అనే వ్యక్తి కో ఆప్షన్ పదవికి నామినేషన్ దాఖలు చేస్తే అది చెల్లదని ప్రక్కనబెట్టారన్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరించి డీసీసీబీ ఎన్నిక నిర్వహించారన్నారు. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తున్నందున ఈ  ఎన్నిక  చెల్లదని తె లిపారు. భవిష్యత్తులో తామే డీసీసీబీని కైవసం చేసుకొంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

జిల్లాలో అప్రజాస్వామ్యం రాజ్యమేలుతోంది
  జిల్లాలో అప్రజాస్వామ్యం రాజ్యమేలుతోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే  రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నిక ద్వారా టీడీపీ అప్రతిష్ట మూటగట్టుకోక తప్పదన్నారు. 21 మంది డీసీసీబీ డెరైక్టర్లలో టీడీపీకి చెందిన వారు ఆరుమంది, వైఎస్సార్‌సీపీకి 15 మంది డెరైక్టర్లు ఉన్నారన్నారు. సహకార వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకొని, అధికారాన్ని, డబ్బును ఆశచూపి తమ డెరైక్టర్లను వారివైపు లాక్కున్నారని ధ్వజమెత్తారు. కోట్లు పోసి డీసీసీబీ పదవిని కొనుక్కొన్నవారు ప్రజలకు, రైతులకు మేలు చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఈ సమావేశంలో కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు జి. రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఎస్. ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎనిమిది మంది డెరైక్టర్లకు ధన్యవాదాలు- ఎంపీ
 అధికారం, డబ్బు ఆశచూపినా, అక్రమ కేసులు పెడతామని బెదిరించినా చెక్కు చెదరని విశ్వాసంతో పార్టీ వెంట ఉన్న 8 మంది డెరైక్టర్లకు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వారి విశ్వాసాన్ని, నిబద్ధతను పార్టీ గుర్తుంచుకొంటుందని చెప్పారు.

హత్యకేసు పక్కనపెట్టి.. అనంతర పరిణామాలపై దృష్టి


ప్రతిపక్షమే టార్గెట్ఆదివారం హైదరాబాద్ లో వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని అరెస్టు చేసి తరలిస్తున్న దృశ్యం
హత్యకేసు పక్కనపెట్టి.. అనంతర పరిణామాలపై దృష్టి
 కార్యాచరణ మొత్తం మంత్రి పరిటాల సునీత కనుసన్నల్లోనే..
 వైఎస్సార్‌సీపీ నేతలు గుర్నాథరెడ్డి, చందు విషయంలో ఇష్టారాజ్యం
 నోటీసు ఇచ్చే అవకాశమున్నా పట్టించుకోకుండా అరెస్టులు
 సీఆర్పీసీ నిబంధనల్ని పట్టించుకోని ‘అనంత’ పోలీసులు
 
 సాక్షి, హైదరాబాద్, అనంతపురం: రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జరిగిన వైఎస్సార్ సీపీ నాయకుడు భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీని వెనుక ప్రముఖుల ప్రమేయంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని పట్టించుకోని పోలీసులు హత్యానంతరం చోటు చేసుకున్న విధ్వంసం కేసుకు కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా హడావుడిగా అరెస్టులు చేపడుతున్నారు.
 
 అంశం ఏదైనా ప్రభుత్వానికి మాత్రం టార్గెట్ ప్రతిపక్షమే. శివప్రసాదరెడ్డి హత్యానంతరం చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన కేసులోనూ పోలీసుల ద్వారా ఇదే విధానాన్ని అవలంభిస్తోంది. అనంతపురం పోలీసులు ఆగమేఘాల మీద ఆదివారం హైదరాబాద్‌కు వచ్చి వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేత  తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి అలియాస్ తోపుదుర్తి చందును అనంతపురంలో అరెస్టు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 41 సవరణని సైతం పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. ఇదంతా మంత్రి పరిటాల సునీత కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. శివప్రసాదరెడ్డి హత్య కేసు దర్యాప్తులో చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని ప్రటించుకుంటున్న అధికారులు వైఎస్సార్ సీపీ నేతల విషయానికి వచ్చేసరికి వారినే టార్గెట్‌గా చేసుకుంటూ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఇష్టారాజ్యంగా పని చేస్తున్నారు. ఈ కోణంలో ఇప్పటికే 30 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని అరెస్టు చేసిన విషయం విదితమే.

 నిబంధనలకు తిలోదకాలిచ్చి:  పోలీసులు కేసుల నమోదు నుంచి అరెస్టుల వరకు ప్రతి అంశాన్నీ పోలీసు మాన్యువల్‌తో పాటు సీఆర్పీసీ నిర్దేశించిన ప్రకారం చేపట్టాలి. నిందితుల అరెస్టుకు సంబంధించి సీఆర్పీసీ సెక్షన్ 41కు జరిగిన కీలక సవరణ 2010, నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకా రం ఏడేళ్లు, అంతకంటే తక్కువ శిక్షపడే నేరాలకు సంబంధించి నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు తప్పనిసరి కాదు.
 
  శివప్రసాదరెడ్డి హత్యానంతరం రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి స్థానిక పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును (ఎఫ్‌ఐఆర్ నెం.57/2015) ఐపీసీలోని సెక్షన్లు 143, 427, 435, 436, 353, రెడ్ విత్ 149, ప్రజా ఆస్తుల భద్రత చట్టంలోని సెక్షన్లు 3, 4, క్రిమినల్ లా ఎమెండ్‌మెంట్ యాక్ట్‌లోని సెక్షన్ 7 (1) కింద నమోదు చేశారు. వీటిలో 435, 436 మినహా మరే ఇతర సెక్షన్ కిందా ఏడేళ్ల శిక్ష పడే అవకాశం లేదు. తహసీల్దార్ కార్యాలయంపై జరిగిన దాడిలో ప్రత్యక్షంగా పాల్గొనని గుర్నాథ్‌రెడ్డి, చందులకు కేవలం అక్రమంగా గుమిగూడటం (సెక్షన్ 143) మినహా మరే ఇతర సెక్షన్లు వర్తించవు. దీని ప్రకారం వీరికి తొలుత నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది.
 
 వీటికి స్పందించనప్పుడో, సదరు నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడని బలమైన ఆధారాలు ఉన్నప్పుడో, నేరానికి కొనసాగిస్తాడనే నిర్దిష్ట ఆరోపణలున్నపుడు మాత్రమే అరెస్టుకు అవకాశం ఉంది. ప్రజా జీవితంలో ఉండి, అరెస్టు సమయానికి హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉన్న గుర్నాథరెడ్డి, అనంతపురంలో అందుబాటులోనే ఉంటున్న చందు విషయంలో ఇవి ఏవీ వర్తించవని అధికారులకూ తెలిసిందే. అయినప్పటికీ ఈ విషయాలను పట్టించుకోని అనంతపురం పోలీసులు మంత్రి పరిటాల సునీత ఒత్తిడి మేరకే పని చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. విధ్వంసాలకు ప్రత్యక్షసాక్షులు కావడమే నేరమైతే ఆ సమయంలో ఎస్పీ రాజశేఖర్‌బాబు, డీఎస్పీలు మల్లికార్జున వర్మ, విజయ్‌కుమార్‌తో పాటు వందలాది పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్రలో ఉన్నారు.
 
 ఫ్యాక్షన్ రంగు పులిమేందుకు..
 
 రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం చోటు చేసుకున్న శివప్రసాదరెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ హత్య వెనుక స్థానిక మంత్రితో పాటు ఆమె కుమారుడు, పోలీసుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లవెత్తాయి. ఘటనకు ముందు, తదనంతరం జరిగిన పరిణామాలూ వీటికే బలాన్నిస్తున్నాయి. ఈ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం 14 మందిని నిందితులుగా చేర్చారు.
 
 సూత్రధారిగా ఆరోపిస్తూ తోట శ్రీనివాసులుతో పాటు సహా మరో ముగ్గురిని గురువారం అరెస్టు ప్రకటించారు. వీరిని రాప్తాడు ఎస్సై ఘటన జరిగిన వెంటనే పట్టుకున్నారని సాక్షాత్తు ఎస్పీనే ప్రకటించి చట్ట ప్రకారం 24 గంటల్లోనే అరెస్టు ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి సంచలనాత్మక కేసుల్లో నిందితులు ఘటనాస్థలిలోనే దొరికినా పోలీసులు వెంటనే అరెస్టు ప్రకటించరు. ‘సాంకేతిక కారణాల’ నేపథ్యం లో కనీసం 48 గంటల పాటు వివిధ కోణాల్లో విచారించిన తరవాతే తదుపరి చర్యలు తీసుకుంటారు. శివప్రసాదరెడ్డి హత్య విషయంలో దీనికి భిన్నంగా వ్యవహరించిన అనంతపురం పోలీసులు తక్షణం అరెస్టు ప్రకటించడంతో పాటు కుట్రతో కూడిన ఈ నేరానికి 2003 నాటి ‘ట్రిపుల్ మర్డర్‌కు ప్రతీకారం’ అంటూ ఫ్యాక్షన్ రంగు పులిమారు.
 
ఈ కేసుకు సంబంధించిన పరారీలో ఉన్న నిందితుల్ని పట్టుకోవడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకుండా ‘టార్గెట్ ప్రతిపక్షం’ ఆపరేషన్ ప్రారంభించారు.
 
 హోం మంత్రితో భేటీ తర్వాత మారిన సీన్
 
 ప్రసాదరెడ్డి హత్యలో మంత్రి పరిటాల సునీత పాత్ర కూడా ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు మొదట్నుంచి ఆరోపిస్తున్నారు. హత్యకు బాధ్యుల్ని చేస్తూ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌లను వీఆర్‌కు పంపుతూ డీఐజీ బాలకృష్ణ  శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విష యం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణిం చిన మంత్రి పరిటాల సునీత హోం మం త్రి నిమ్మకాయల చినరాజప్పతో శని వారం భేటీ అయ్యారు. ప్రసాదరెడ్డి హత్య, పోలీసులను వీఆర్‌కు పంపడం, వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టుపై భేటీలో చర్చించి, హోంమంత్రి ద్వారా పోలీసులపై సునీత ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో సునీత, హోంమంత్రితో భేటీ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయి ‘అనంత’ పోలీసుల్లో వేగం పుంజుకుంది. సంచలనం సృష్టించిన హత్య కేసును పక్కన పెట్టి మరీ ఆగమేఘాల మీద విధ్వంసం కేసుకు ప్రాధాన్యం ఇస్తూ అరెస్టు చేస్తున్నారని తెలుస్తోంది.

మమ్మల్ని టార్గెట్ చేయడానికే.. సునీతకు మంత్రి పదవి ఇచ్చారు

Written By news on Sunday, May 3, 2015 | 5/03/2015


అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేయడానికే పరిటాల సునీతకు మంత్రి పదవి ఇచ్చారని ఆ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ కీలక నేతలను హతమారుస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.

రాప్తాడు మండల తహశీల్దార్ కార్యాలయంలో ఇటీవల వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన అల్లర్లకు బాధ్యులను చేస్తూ వైఎస్ఆర్ సీపీ నేతలు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వైఎస్ఆర్ సీపీని ఎదుర్కోలేకే భౌతిక దాడులు


'వైఎస్ఆర్ సీపీని ఎదుర్కోలేకే భౌతిక దాడులు'
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను అరెస్ట్  చేయడాన్ని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఖండించారు. హత్యకు గురైన రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద రెడ్డి విచారణను పక్కనబెట్టి, పోలీసులు వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా పోలీసులు వ్యవహరించడం బాధాకరమని అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సీపీని రాజకీయంగా ఎదుర్కోలేకే టీడీపీ నేతలు భౌతిక దాడులకు దిగుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ దౌర్జన్యాలకు నిరసనగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అనంత వెంకట్రామి రెడ్డి చెప్పారు.

అరెస్టులకు నిరసనగా.. రేపు అనంతపురం బంద్


అరెస్టులకు నిరసనగా.. రేపు అనంతపురం బంద్
అనంతపురం: వైఎస్ ఆర్ సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిల అరెస్ట్ లకు నిరసనగా సోమవారం అనంతపురం జిల్లా బంద్ కు వైఎస్ ఆర్ సీపీ పిలుపునిచ్చింది. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బి. ప్రసాదరెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే.  వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యతో అనంతపురంలో చేలరేగిన అల్లర్లకు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలు కారణమంటూ వారిద్దరిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. దాంతో అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అనంతపురం ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

అయితే వైఎస్ ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్య అనంతరం జరిగిన ఆందోళనలకు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఆ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణలు తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. ప్రసాద్ రెడ్డి హత్యను చేధించాల్సిన పోలీసులు వైఎస్ ఆర్ సీపీ కార్యకర్తల అరెస్ట్ అమానుషమని చెప్పారు. టీడీపీ నేతలకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వారు దుయ్యబట్టారు. ప్రసాద్ రెడ్డి హత్య జరిగిన ఘటనా స్థలానికి వారు రావడమే తప్పయితే ఎస్పీ రావడం సమంజసమా? అంటూ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి,  శంకర్ నారాయణలు సూటిగా ప్రశ్నించారు.

Popular Posts

Topics :