09 July 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పాదయాత్రతో మీ చెంతకే వస్తున్నా: వైఎస్‌ జగన్‌

Written By news on Sunday, July 9, 2017 | 7/09/2017


పాదయాత్రతో మీ చెంతకే వస్తున్నా: వైఎస్‌ జగన్‌
గుంటూరు: చంద్రబాబు దగాకోరు ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి త్వరలో పాదయాత్ర చేస్తానని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ ప్లీనరీ వేదికగా ప్రకటించారు. అక్టోబర్‌ 27 నుంచి ఆరు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని వెల్లడించారు.
వైఎస్‌ జగన్‌ పాదయాత్ర గురించి ఇంకా ఏం చెప్పారంటే.. 'ప్రతి ఊరుకి పోండి.. ప్రతి గ్రామానికి వెళ్లండి.. త్వరలోనే అన్న వస్తున్నాడని చెప్పండి. అందరికీ భరోసా ఇస్తూ నేను కూడా వస్తా.. అక్టోబర్‌ 27 నుంచి దాదాపు ఆరు నెలల పాటు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా. ప్రతి జిల్లాకు, ప్రతి ప్రాంతానికి వస్తా.. మీతోనే ఉంటూ పాదయాత్ర చేస్తా. ఇడుపులపాయ నుంచి తిరుమలకు వెళ్తా.. కాలి నడకన కొండెక్కి తిరుమలేశుడిని దర్శించుకుంటా. అక్కడి నుంచి ఇచ్ఛాపురం దాకా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా. ఊరు వాడా అందరికీ చెప్పండి. అన్న వస్తున్నాడు. మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. వైఎస్‌ మాదిరిగానే అధికారం తెచ్చుకుంటాం. ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. మీ అందరి ఆశీస్సులు కావాలి. నష్టపోయాం అని తెలుసు. కేసులు పెడుతున్నారని తెలుసు. మంచి కాలం వస్తుంది. ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడతా. మీ అందరి ఆశీస్తులు కోరుతున్నా.'

ప్రశాంత్‌ కిషోర్‌ ను పరిచయం చేసిన వైఎస్‌ జగన్‌


 
గుంటూరు : ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ సందర్భంగా ఆయనను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ  ఏర్పాటులో కీలకపాత్ర వహించిన ప్రశాంత్‌ కిషోర్‌ను పరిచయం చేస్తూ రానున్న ఎన్నికల నేపథ్యంలో  పార్టీ కోసం ప్రశాంత్‌ కిషోర్‌  సహకారం అందించనున్నారని  తెలిపారు. అందరం కలిసికట్టుగా పార్టీ విజయం కోసం.... శ్రమిద్దామని పిలుపునిచ్చారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీని ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టడంలో ప్రశాంత్‌ కిషోర్‌ క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. అలాగే బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ సీఎం గద్దెనెక్కడానికి, పంజాబ్‌లో విజయం సాధించి కెప్టెన్‌ అమరీంద్ర సింగ్‌ ముఖ్యమంత్రి కావడానికి కూడా ప్రశాంత్‌ కిషోర్‌ కృషి ఉందన్నారు. అయితే ఒక్క ఉత్తరప్రదేశ్‌ లో మాత్రం ఎన్నికల ఫలితాలు అటూ ఇటూగా అయ్యాయని, అయితే అందుకు కారణాలు కూడా అందరికీ తెలుసునని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో ఉంటారని ఆయన తెలిపారు.

వైఎస్‌ఆర్‌ సీపీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ ఏకగ్రీవ ఎన్నిక


గుంటూరు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తరపున 20 సెట్ల నామినేషన్లు వచ్చాయని వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీలో రిటర్నింగ్ అధికారి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన వైఎస్‌ జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. విల్లంబులు, శంఖం బహుకరించారు. తర్వాత ప్లీనరీలో ముగింపు ప్రసంగం చేశారు. ఏకగ్రీవం‍గా తనను ఎన్నుకున్నందుకు, తమ కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నందుకు జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు నడిచిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.

నాయకుడంటే ప్రజల గుండె చప్పుడు: వైఎస్‌ విజయమ్మ


గుంటూరు : నాయకుడు అనేవాడు ప్రజల మనసులు చదవాలని, వారి గుండె చప్పుడులో ఉండాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి లేని లోటు తమ కుటుంబంతో పాటు, ప్రజల్లోనూ నెలకొందన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలకు వైఎస్‌ విజయమ్మ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. 
తన బిడ్డ వైఎస్ జగన్‌కు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, టీడీపీలు కలిసి తన బిడ్డపై అక్రమ కేసులు బనాయించి  జైలు పాలు చేశాయని ఆరోపించారు. అసెంబ్లీలో వైఎస్ జగన్‌ పట్ల అధికార పక్షం తీరును చూసి ఎన్నోసార్లు బాధపడ్డానని చెప్పారు. వైఎస్‌ఆర్‌  కష్టార్జితంతో  వచ్చిన  ప్రభుత్వం కూలిపోకూడదనే 150 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా కూడా రోశయ్య ప్రభుత్వం నిలిచేలా అనాడు  వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.

వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ..‘ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్‌ఆర్‌ మంచివారు.. వైఎస్‌ జగన్‌ మంచి వారు. కానీ వైఎస్‌ఆర్‌ మరణంతో పరిణామాలు మారిపోయాయి.  సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు మీతో పంచుకుంటున్నా. ఇచ్చిన మాట కోసం జగన్‌ యాత్ర చేస్తానంటే కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరించలేదు. టీడీపీ కాంగ్రెస్‌ కలిసి అబద్ధపు కేసులు పెట్టారు.
కేసుల విచారణ అంటూ తీసుకెళ్లి 16 నెలలు జైలులో పెట్టారు నా బిడ్డను. తొలి ప్లీనరీలో మీకు చెప్పాను  నా బిడ్డను మీకు అప్పగిస్తున్నానని. ఈరోజు కూడా ప్రభుత్వం ఏ సమస్యను పట్టించుకోకపోయినా అసెంబ్లీలో, బయటా కూడా వైఎస్‌ జగన్‌ మీ అందరి కోసం పోరాడుతున్నారు. తండ్రిని, తనని తిడుతున్నా పట్టించుకోకుండా సమస్యలపై పోరాడుతున్నారు. ఒక్కోసారి నా బిడ్డ ఎందుకు ఇలా రాజకీయాల్లోకి వచ్చాడా అని బాధ వచ్చినా  ప్రజలు గుర్తుకొచ్చి మీకు అండగా ఉండాలని దుఖాన్ని దిగమింగుకున్నాను.

ఇప్పుడున్న ప్రభుత్వం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తుంది. ఏ పనీ చేయడం లేదు. ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. నాయకుడనేవాడు ప్రజల గుండె చప్పుడు వినాలి. అప్పుడే ఆ నాయకుడు ప్రజల హృదయాల్లో ఉంటాడు. వైఎస్‌ఆర్‌ అధికారంలోకి వచ్చినప్పుడు సంక్షేమాన్ని నెత్తికెత్తుకొని అభివద్ధి బాట పట్టించారు. ఉచిత విద్యుత్‌ అమలు చేశారు. కరెంటు బకాయిలు మాఫీ చేశారు. రైతులను పేదలను అమితంగా ప్రేమించారు. వారికి ఆదాయం పెరగాలని ఆవాసం, ఆరోగ్యం, ఆహారం, పిల్లలకు చదువు ఇవ్వాలని, సబ్సీడీ, బీమా, కేంద్రం నుంచి రుణమాఫీ, విత్తన ధరల అందుబాటులో, గిట్టు బాటు ధరలు, పావలా వడ్డీ తీసుకొచ్చారు.
ఆ పథకాల అమలు చూసి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌.. కూడా ఆశ్చర్యపోయారు. మరి ఇప్పటి ప్రభుత్వం ఏ చేస్తోంది. రైతులకు, డ్వాక్రా మహిళలకు ఏం చేస్తోంది. 108ను తీసేశారు. అప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌ వస్తే ఇప్పుడు ఎప్పుడొస్తుందో తెలియదు. నాడు పిల్లలు ఏం చదవాలనుకున్నా ప్రభుత్వం ఓ భరోసా ఇచ్చింది ఇప్పుడు పరిస్థితి దారుణం. మైనార్టీలకు నాలుగుశాతం రిజర్వేషన్‌, అభయ హస్తం, ఏమైంది. 86  ప్రాజెక్టులు ఏమయ్యాయి.
వైఎస్‌ఆర్‌ 25లక్షల ఎకరాలకు పైగా సాగునీరు ఇచ్చారు. హంద్రీనీవా చూస్తే గాలినగేరు చూసినా, దేవాదుల, కల్వకుర్తి భీమా ప్రాజెక్టులన్నీ కూడా ఆయన వల్లే పూర్తయ్యయాయి. పోలవరం కాలువలు చూస్తే ఆయన గుర్తొస్తారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఏం చేశాయి. రిలయన్స్‌ వాళ్లు మన రాష్ట్రం నుంచి గ్యాస్‌ తీసుకెళితే మాకు ఇవ్వకుండా ఎలా తీసుకెళతారని ప్రశ్నించిన వ్యక్తి రాజశేఖర్‌ రెడ్డి. చంద్రబాబు ప్రైవేట్‌ వ్యక్తులకు పవర్‌ ప్రాజెక్టులు ఇచ్చారు. విజయవాడ, రాయలసీమ, కొత్తగూడెం, జెన్‌ కో ఇలా ఎన్నో థర్మల్‌ ప్రాజెక్టులతో కరెంట్‌ ఇచ్చారు. మేనిఫెస్టోలో లేనివి చేశారు. మానవతావాది రాజశేఖర్‌ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమైనా ఏం చేస్తున్నాయి.
సర్వత్రా సంక్షేమ పథకాలు వైఎస్‌వి ఉన్నాయి. చంద్రబాబు ఇప్పుడు ఏం చేశారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన ప్రజల గుండెల్లో చోటు సంపాదించలేరు. మీరంతా ప్రజల్లోకి వెళ్లాలి. రాజశేఖర్‌రెడ్డి పథకాలు తీసుకెళ్లాలి. పార్టీకోసం అంతా కష్టపడండి. వైఎస్‌ జగన్‌ను గెలిపించాలి. పార్టీ ఏ ఒక్కరని జగన్‌ బాబు పోగొట్టుకోరు. మాట ఇస్తే తప్పుకునే కుటుంబం కాదు. రాబోయే యుద్ధం కోసం ఇప్పుడే ఎన్నికలు వచ్చినట్లు భావించి ప్రతి ఒక్కరు పనిచేసి రాజన్న స్వర్ణయుగం తీసుకు రావాలి’ అని పిలుపునిచ్చారు.

Popular Posts

Topics :