12 May 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

భయపడుతున్న కాంగ్రెస్: బొబ్బిలి ఎమ్మెల్యే

Written By news on Saturday, May 18, 2013 | 5/18/2013

రాజీనామా చేసిన 15 స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ భయపడుతోందని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థలతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు ఓటమి తప్పదన్నారు. ఎస్‌.కోటలో పదివేల మంది కార్యకర్తలతో వైఎస్‌ఆర్ సీపీ సమావేశం నిర్వహించారు. అనకాపల్లి ఎంపీ సబ్బంహరి, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెన్మత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు తదితర నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు వైఎస్‌ఆర్ సీపీలో చేరారు.

వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం సభ్యుడిగా మణికంఠ

వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యునిగా ప్రకాశం జిల్లాకు చెందిన మణికంఠ రెడ్డిని నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మణికంఠను నియమిస్తున్నట్లు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Sharmila visits Dwaraka Tirumala

YSRCP leader mahender reddy speaks to media

వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న షర్మిల

ద్వారకా తిరుమల : రెండో తిరుపతిగా ప్రసిద్ధి గాంచి ద్వారకా తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని వైఎస్ షర్మిల శనివారం దర్శించుకున్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె ఈరోజు యాత్రను ద్వారకా తిరుమల నుంచే ప్రారంభించనున్నారు. ఆమె చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 152వ రోజుకి చేరింది. గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర సాగుతుంది. రాళ్లకుంట, అయ్యవరం, కొత్తగూడెం మీదుగా 12.2 కిలో మీటర్లు షర్మిల నడుస్తారు. కొత్త గూడెంలో రాత్రికి ఆమె బస చేస్తారు.

అడుగుజారిన టీడీపీ!కాంగ్రెస్‌కు ఇక పరాభవపర్వమే!

రాష్ట్రం మార్పు కోరుతోంది. అందుకు అనుగుణంగానే ఏ నోట విన్నా జగన్ మాటే వినపడుతున్నది. సోనియా కక్ష సాధింపు మీద అంతిమతీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కోర్టు ఆదేశం ప్రకారమే సీబీఐ జగన్‌పై చార్జిషీటు వేస్తోంది గానీ, దానితో కాంగ్రెస్‌కు సంబంధం లేదనే నంగనాచి మాటలను ప్రజలు నమ్మడం లేదు. కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యే వాడని గులాంనబీ ఆజాద్ చెప్పలేదా! కాంగ్రెస్‌లో ఉంటే నిర్దోషి, లేకుంటే దోషి అవుతాడా! రూల్ ఆఫ్ లా అంటే ఇదేనా! 

కేంద్రంలోని తాజా పరిణా మాలు ఆ పార్టీ సమీప భవిష్య త్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు అక్షింతలతో కర్ణా టక విజయం మరుగున పడి పోయింది. స్కాములలో ముని గితేలుతున్న కేంద్ర సర్కారును తాజాగా కేంద్ర మంత్రుల వ్యవహారం నిలువునా ముంచివేసింది. తన పరువును కాపాడుకోవడానికి బన్సల్, అశ్వనీ కుమార్‌ల చేత రాజీ నామా ఇప్పించకతప్పలేదు.

సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన తరువాత కూడా మన్మోహన్‌సింగ్ పదవిలో కొనసాగడం కాంగ్రెస్ దుస్థితికి అద్దం పడుతున్నది. ప్రజల మన్ననలు పొందిన నిజాయి తీగల సమర్థులు కాంగ్రెస్‌లో కరువయ్యారు. తన కుమా రుడు రాహుల్ కోసం ప్రణబ్ ముఖర్జీని సోనియా రాష్ర్ట పతిభవన్‌కు సాగనంపింది. అయితే రాహుల్ చేతులు కాల్చుకోవడానికి సిద్ధంగా లేడు. ఇందిరా గాంధీ అనంత రం దేశానికి దశ, దిశ ఇవ్వగల ధైర్యం గల నాయకుడేడీ?

ఇటీవల సీబీఐ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. అది కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మెలిగే సంస్థ అని అతి సామా న్యునికి కూడా అర్థమైపోయింది. దేశం కోడై కూస్తున్నా సోనియాలో చలనం లేదు. వైఎస్ జగన్‌పై కక్షసాధింపు నకు సాధనంగా సోనియా సీబీఐని ఉపయోగిస్తోందని బడి పిల్లవానికీ, మూలనున్న ముసలమ్మకూ అర్థమై పోయింది. అయినా సోనియా వైఖరిలో మార్పురాలేదు. రాజకీయ ప్రత్యర్థులను బ్లాక్‌మెయిల్ చేసి తన మద్దతు దార్లుగా మార్చుకోవడానికి కేంద్ర సంస్థలను సోనియా ఉపయోగిస్తున్నదని మొన్న ములాయంసింగ్ అంటే, నేడు మమత కూడా అదే మాట అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వ పంజరంలోని చిలుకగా సీబీఐ మారి పోయిందని సుప్రీంకోర్టు చురకలు అంటిస్తే ప్రస్తుత సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అది అక్షరాలా నిజం అన్నారు. సీబీఐ ని స్వతంత్రంగా వ్యవహరించగల సంస్థగా తీర్చిదిద్దడానికి చట్టం తయారు చేయమని అటార్నీ జనరల్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. సోనియా, మన్మోహన్‌సింగ్‌లకు ఇంత కంటే అభిశంసన కావాలా? దీని తర్వాత కూడా వారు పదవుల్లో కొనసాగడం ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్న నాయ కత్వ దారిద్య్రాన్ని సూచిస్తోంది. పాలకపక్షీయులైనా, ప్రతిపక్షీయులైనా చట్టం ఒక్కటే అనే రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాన్ని సోనియా బుట్టదాఖలా చేసింది. భజనపరు లను చేరదీసి వారికి ఉన్నత పదవులు కట్టబట్టే కళలో ఆమె రాటు దేలారు.

మూలాల్లోకి పోయే సాహసం ఏదీ?
దొరికిన వాడు దొంగ, దొరకని వాడు దొర అన్న పద్ధతిలో పాలన నడుస్తోంది. బన్సల్, అశ్వినీ కుమార్‌లను పదవుల నుంచి తొలగిస్తే అవినీతి అంతమైనట్లా? వేళ్లూనికుని విస్తరించిన అవినీతి పైపూతలతో అంతమవుతుందా? గత మూడు, నాలుగు దశాబ్దాలుగా రాజకీయ అవినీతి తామర తంపరగా విస్తరించింది. స్వాతంత్య్ర సమరయోధులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన రోజులు ఏ నాడో గతిం చాయి. సంపద కేంద్రీకరణ, ఆర్థిక వ్యత్యాసాలు పెరగరా దని రాజ్యాంగంలో రాసుకున్న ఆదేశిక సూత్రాలు గాలిలో కలిసిపోయాయి. నెల్లూరు పార్లమెంటు ఉప ఎన్నికల్లో జగన్ పార్టీని ఓడించడానికి ఓటర్లకు వేలకు వేలు పంచి పెట్టగల కోటీశ్వరుడు టి. సుబ్బరామిరెడ్డిని రంగంలోకి దింపి డబ్బు రాజకీయంలో దిట్ట అని సోనియా నిరూపిం చుకున్నారు. అయితే నెల్లూరు ప్రజలు ధనశక్తి కంటే ప్రజాశక్తి మిన్న అని నిరూపించారు. 

విధానాల మార్పు ద్వారా కాంగ్రెస్‌కు కొత్త ఊపిరులు పోయడానికి బదులు, ఎత్తుగడల్లో మార్పుల ద్వారా ఆమె అధికారం నిలబెట్టుకో వడానికి దివారాత్రాలు పథకరచన చేస్తున్నారు. ఆమె పెత్తందారీ విధానానికి తలవంచని జగన్‌ను సీబీఐ ద్వారా ఎలా ముప్పుతిప్పలు పెడుతున్నదో అందరికీ తెలిసిందే. దేశంలో ఎవరికీ రానంత మెజారిటీ జగన్‌కు ఇచ్చి సోని యా మీద ప్రజలు కసితీర్చుకున్నా కనుచూపు మేరలో ఆమెలో మార్పు వచ్చే సూచన కానరావడం లేదు. ప్రజలే అంతిమ నిర్ణేతలనే నగ్నసత్యాన్ని సోనియా విస్మరించింది.

కర్ణాటక విజయం ఎవరిది?
బీజేపీ మీద కర్ణాటక ప్రజలు సాధించిన విజయం అది. గత్యంతరం లేకనే కాంగ్రెస్‌ను గెలిపించారు. ప్రత్యామ్నా యం ఉన్న నియోజకవర్గాల్లో జేడీఎస్‌ను గెలిపించారు. ఫలితంగా జేడీఎస్ బలం 28 నుండి 40కి పెరిగింది. బీజేపీ ముఠాకక్షలు, అస్థిర రాజకీయాలతో కర్ణాటక ప్రజలు విసు గెత్తారు. కర్ణాటక జనతాపార్టీ బీజేపీ ఓట్లను చీల్చినం దువల్ల సుమారు 23 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. కాం గ్రెస్ ఘనకార్యాలను చూసి ప్రజలు వారిని గెలిపించలేదు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో భారీ నష్టం తప్పదు. వరుస కుంభకోణాలతో విసుగెత్తిన ప్రజలు తిరిగి కాంగ్రెస్‌ను గద్దెనెక్కిస్తారని అనుకోవడం పచ్చి భ్రమ మాత్రమే. దాని తొమ్మిదేళ్ల నిర్వాకం చూసిన ఏ పార్టీ కూడా దానితో జత కట్టడానికి సిద్ధంగా లేదు. పెద్ద రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తమిళనాడు, యూపీ, బీహార్‌లలో కాంగ్రెస్‌కు గండిపడకతప్పదు. కాంగ్రెసేతర లౌకికశక్తుల కూటమి బలమైన ప్రత్యామ్నాయంగా ఆవి ర్భవించే సూచన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

సీఎం పిల్లిమొగ్గలు!
వైఎస్ తన లోకోత్తరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. వైఎస్ మరణంతో 650 మంది వైఎస్ అభిమానులు ప్రాణాలు విడవడం ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా జరి గిందా! ఈ ముద్రను చెరిపివేయడానికి అహోరాత్రాలు కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త కొత్త పథకాలతో తలబద్దలు చేసు కుంటున్నాడు. అయితే వైఎస్ పథకాల ముందు అవి పిల్లి మొగ్గలే. వైఎస్ రెక్కల కష్టంతో పదవుల్లో కులుకుతున్న వారికి మరిచిపోలేని వాత పెట్టడానికి ప్రజలు కాచుకొని ఉన్నారు. విద్యుత్ సంక్షోభం ప్రజలకు నరకాన్ని చూపి స్తోంది. కిలో రూపాయి పథకం ద్వారా 21 రూపాయల లబ్ది చేకూర్చి వైఎస్ 30 కేజీల పథకంలోని పది కేజీలను మార్కెట్లలో కొనమని చెప్పి 300 రూపాయల బరువును పేదల మీద వేశాడు. ప్రజా ద్రోహులను వెనుక బెంచీల్లో కూర్చోబెట్టే రోజు కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు.

అడుగుజారిన టీడీపీ!
2009 తర్వాత జరిగిన అన్ని ఉపఎన్నికల్లో టీడీపీ చిత్తయి పోయింది. గణనీయ సంఖ్యలో డిపాజిట్లు కూడా గల్లంత య్యాయి. చంద్రబాబు కౌటిల్యం అర్థమై మైసూరారెడ్డి వైఎస్సార్ సీపీలో చేరి, లక్ష కోట్ల అపవాదులోని బండా రాన్ని బయటపెడితే బాబు గొంతు పెగలలేదు. ఆత్మ గౌరవాన్ని చంపుకోలేక టీడీపీకి గుడ్‌బై చెప్పిన దాడి వీర భద్రరావు బాబు కుమ్మక్కు రాజకీయాన్ని అసహ్యించు కుంటూ వాస్తవాలను బయటపెట్టాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చంద్రబాబు దోబూచులాటను ఛీత్కరించు కుంటూ టీడీపీకి షాక్ ఇచ్చాడు. ‘వెన్నుపోటు రాజా’ను గురించి షర్మిల పరిహసిస్తూ పాదయాత్రలో మాట్లాడటం చంద్రబాబుకు నిష్కృతి లేదని స్పష్టం చేస్తున్నది.

ఏ నోట విన్నా జగన్ మాటే!
రాష్ట్రం మార్పు కోరుతోంది. అందుకు అనుగుణంగానే ఏ నోట విన్నా జగన్ మాటే వినపడుతున్నది. సోనియా కక్ష సాధింపు మీద అంతిమ తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కోర్టు ఆదేశం ప్రకారమే సీబీఐ జగన్‌పై చార్జిషీటు వేస్తోంది గానీ, దానితో కాంగ్రెస్‌కు సంబంధం లేదనే నంగనాచి మాటలను ప్రజలు నమ్మడం లేదు. కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యే వాడని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ చెప్ప లేదా! కాంగ్రెస్‌లో ఉంటే నిర్దోషి, లేకుంటే దోషి అవు తాడా! రూల్ ఆఫ్ లా అంటే ఇదేనా!

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రదా తలు ప్రజలే గానీ, సోనియా కాదు! సోనియాకు దిమ్మ తిరిగే తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు. అది ఎప్పు డెప్పు డా అని వారు ఎదురు చూస్తున్నారు.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62507&Categoryid=1&subcatid=18

జగనన్న కోసం... ఎదురుచూపులు

అయ్యా చంద్రబాబునాయుడుగారూ... ‘వస్తున్నా మీకోసం’ అంటూ మీరు పాదయాత్ర చేశారు. అందుకు ధన్యవాదాలు. అయితే మీరు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేశారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు ఏమీ చేయలేని నిస్సహాయుడిగా మిగిలిపోయారు. నీతి, నిజాయితీ గల వ్యక్తినని మీ గురించి మీరు చెప్పుకుంటున్నారు. ఆ మాటను సీబీఐ చెప్తే ఇంకా బాగుండేది కదా... మీ మీద వచ్చిన ఆరోపణలకు సమాధానంగా ఉండేది. ఏ అవినీతికీ మీరు పాల్పడనప్పుడు కాంగ్రెస్‌తో చేయికలిపి, సీబీఐ దర్యాప్తునుంచి ఎందుకు తప్పించుకున్నారు? మొన్నటి యాత్రలో కూడా మీరు ఎన్నో డాంబికాలు పలికారు. ‘నాకు మరొక్కసారి అవకాశమివ్వండి’ అన్నారు. 

ఎందుకివ్వాలి? సంక్షేమ పథకాలన్నింటినీ మరుగున పరచడానికా? మీరు సీఎంగా ఉన్నప్పుడు పేదవారి దగ్గర గవర్నమెంట్ ఆసుపత్రిలో యూజర్ ఫీజు రూ.10 వసూలు చేయాలి అనే ఐడియా వచ్చింది మీకే కదా! ఉచిత కరెంటు ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నది మీరు కాదా? నిరుద్యోగ సమస్యను సృష్టించింది మీరే కదా? ఎందుకయ్యా ఇప్పుడీ కొంగ జపాలు. చుక్కాని లేని నావలా పడి ఉన్న కాంగ్రెస్‌ను వైఎస్సార్ తన భుజస్కంధాలపై వేసుకుని జవజీవాలు నింపి, ముందుకు నడిపారు. 

అలాంటి మహానేత తనయుడిని దూరం చేసుకుని, అది చాలదన్నట్లు జగనన్నపై నిందారోపణలు చేసి, కాంగ్రెస్‌వాళ్లు తప్పుచేశారు. కాంగ్రెస్, మీరు ఒక్కటై, జగనన్నను జైల్లో బంధించి, బెయిల్ రాకుండా చేస్తున్నారు. ఇందుకు త్వరలోనే మీరు ప్రతిఫలం అనుభవిస్తారు. మీరు, మీకు వంత పాడుతున్న ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతారు. అలాంటి సునామీని సృష్టించేందుకు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగనన్న రాక కోసం నిత్యం ఎదురు చూస్తున్నారు.

- పి.బాపూజీరావు, తేలప్రోలు, కృష్టా


జగన్‌కు సాటి రాగలవారెవరు?

దివంగత వైఎస్సార్‌ని, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ బురద జల్లితే, పాలకుల మెప్పు పొంది... రాబోయే ఎన్నికల్లో ఆయా పార్టీ టికెట్లు పొందవచ్చని పాలక, ప్రతిపక్ష నేతల ఆశ. అయితే ఈ విధంగా వైఎస్సార్‌ని విమర్శించే వాళ్లందరూ రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు.

ఒక మనిషి... ఎదుటి మనిషిని విమర్శించాలి అంటే అందుకు సాటి రాగల వారు ఉండాలి. అందుకే మన పెద్దలు ‘సమాన వియ్యం - సమాన కయ్యమ’ని అన్నారు. జగనన్నకు సాటి ఎవరు? చంద్రబాబునాయుడు కాదు కదా, రూలింగ్ పార్టీలో ఏ ఒక్కరూ సాటిరారు. అందుకే ఇరుపార్టీలు ఆయన్ని మరికొంతకాలం జైల్లో ఉంచటానికే చూస్తున్నాయి. అయితే వాళ్ల ఆటలు ఇక ఎంతోకాలం సాగవు. జగన్ కడిగిన ముత్యంలా త్వరలో బయటికొచ్చి, దివంగత వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చి, బడుగు బలహీన వర్గాల యువ నాయకుడిగా కొనసాగుతాడు. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే సమయం కనుచూపుమేరలోనే ఉన్నదని నా ప్రగాఢ విశ్వాసం. ఆయన జైల్లో ఉండి కూడా ప్రజలను, నాయకులను ఆకర్షించడానికి ముఖ్య కారణం అతనిలోని మొండిధైర్యం, ప్రజల గురించి అతని ఆలోచనావిధానమేనని ప్రస్ఫుటం అవుతోంది. ఈ తరం నాయకుల్లో ఇలాంటి తెగువ ఒక్క జగన్‌లోనే కనిపిస్తోంది. జగన్‌కి సాటి ఎవరూ లేరని, రారని ఇంకొక మారు నేను ఘంటాపథంగా చెప్పగలను. త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు ఎండగట్టి, జగనన్నకు పట్టం గట్టడం ఖాయం.

ఎన్టీయార్‌ను టీడీపీ నుండి బహిష్కరించాక, ఆయన లక్ష్మీపార్వతితో రాష్ట్రంలో పర్యటించారు. లక్ష్మీపార్వతి ప్రస్తుతం వైఎస్సార్ పార్టీలో ఉన్నారు. కాబట్టి చంద్రబాబుకి కాని, ఎన్టీయార్ పుత్రరత్నాలకి కాని ఆయన ఫొటోపై ఎటువంటి హక్కు లేదు. దివంగత మహానేతలైన ఎన్టీయార్, వైఎస్సార్ అందరివారు. వీళ్లపై ఒక జాతి, మతం, కులం ప్రభావం ఉండదు. వారిపై కుటుంబాలకూ ఎటువంటి హక్కులు ఉండవు. ఇద్దరిలోనూ సారూప్యాలు ఉన్నాయి. ఒకరు తెలుగుజాతి గౌరవం గూర్చి పాటుపడితే, ఇంకొకరు బడుగు బలహీన పేదసాదల గురించి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కి ఆదర్శమూర్తులుగా కొనియాడబడుతున్నారు. 

దివంగత వైఎస్సార్‌ని, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ బురద జల్లితే, పాలకుల మెప్పు పొంది... రాబోయే ఎన్నికల్లో ఆయా పార్టీ టికెట్లు పొందవచ్చని పాలక, ప్రతిపక్ష నేతల ఆశ. అయితే ఈ విధంగా వైఎస్సార్‌ని విమర్శించే వాళ్లందరూ రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు. ప్రజలు అటువంటి నాయకులను ఒక కంట కనిపెడుతూ, 2014 ఎన్నికల్లో ఓడించటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరేమన్నా యువనాయకుడైన జగన్‌కు సాటి ఎవరూ రారు. ఇటువంటి నాయకుడు దేశానికి, ప్రజలకు ఎంతైనా అవసరం. ఆంధ్ర ప్రజానీకం యావత్తూ ‘యువకెరటం - జగన్’ కోసం నిరీక్షిస్తోంది. 

- బి.కైలాసరావు పట్నాయిక్, పూణె, మహారాష్ట్ర

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com

ఢిల్లీ ‘బాబు’ ల స్పాట్ ఫిక్సింగ్ !

* కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగుల్లో మరో ఘట్టం...
* ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాతే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించాలంటూ బాబు హడావుడి
* సంక్షేమ వైఫల్యం, విద్యుత్ చార్జీల పెంపు
* నుంచి జనం దృష్టి మళ్లించటమే లక్ష్యం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలులో వైఫల్యానికి తోడు.. అడ్డగోలుగా పెంచిన కరెంటు చార్జీలతో.. అధికార కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఆ పార్టీకి, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని గ్రహించి చాలా మంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ స్థాయిలోనే టీడీపీ కూడా తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మరోవైపు.. వచ్చే నవంబర్, డిసెంబర్‌లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ రెండూ గల్లంతయ్యే ప్రమాదముంది.

ఈ ప్రమాదాన్ని అధిగమించటానికి.. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు - టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ‘స్పాట్ ఫిక్సింగ్’ చేసుకున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త డ్రామాకు తెరతీశారు. ఏడాదిన్నర కాలంగా లేనిది ఒక్కసారిగా తన దృష్టిని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై కేంద్రీకరించారు. అదికూడా చంద్రబాబు కొద్ది రోజుల కిందట రెండు పర్యాయాలు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాతే ఆయనకు ‘జ్ఞానోదయం’ అయినట్లు హడావుడి మొదలుపెట్టారు.

సీబీఐ తప్పుపట్టిన 26 జీవోలకు సంబంధించి 2012 మార్చిలో సుప్రీంకోర్టు రాష్ట్ర మంత్రులకు నోటీసులు జారీచేసినప్పటి నుంచి ఆ మంత్రులపై ఏదో రకమైన చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ విషయాన్ని గతంలో ఎప్పుడూ పట్టించుకోని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు ఒక్కసారిగా ఆ మంత్రులను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ హడావుడి మొదలుపెట్టారు. నాలుగు రోజుల కిందట గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.

ఈ విషయంలో త్వరలోనే రాష్ట్రపతిని కూడా కలుస్తామని, పోరాటాలు చేస్తామని గర్జించారు. మంత్రుల విషయంలో చంద్రబాబు అకస్మాత్తుగా హడావుడి చేయటం సొంత పార్టీ నేతలను సైతం విస్మయపరుస్తోంది. చంద్రబాబు చేస్తున్న తాజా హడావుడి వెనుక ‘ఢిల్లీ పెద్దల’ ఆదేశాలున్నాయని సర్వత్రా వినిపిస్తోంది. చంద్రబాబు ఈ నెల 7, 8 తేదీల్లో ఢిల్లీ వెళ్లొచ్చారు. ఆ తర్వాత 10 వ తేదీన మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఆయన ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాతే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13వ తేదీన రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

బాబు హడావుడి వెనుక కాంగ్రెస్ వ్యూహం... : 
అంతకుముందు వరకు ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు ఒక్కసారిగా ఈ డిమాండ్ తేవటంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ఉందని తెలుస్తోంది. వచ్చే నవంబర్, డిసెంబర్ నెలల్లో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితులు కనబడుతుండటంతో కాంగ్రెస్ పెద్దలు చంద్రబాబుతో కలిసి కొత్త ఎత్తుగడను అమలుచేస్తున్నారు. ‘‘వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన రాష్ట్రం. అక్కడి పరిస్థితులపై అధిష్టానం దృష్టి సారించినప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా తీవ్రస్థాయిలో ఉందన్న విషయం స్పష్టమైంది.

ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల్లో సానుకూలత సాధించలేకపోవటంతో పాటు విపరీతంగా పెంచిన కరెంట్ చార్జీల భారం వల్ల పూర్తి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అడ్డగోలుగా పెంచిన చార్జీలతో కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. వాటిని ఎలా అధిగమించాలన్న అంశంపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది...’’ అని ఏఐసీసీ నాయకుడొకరు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించటానికి కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కలిసికట్టుగా కొత్త వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. గత మూడేళ్లుగా కాంగ్రెస్‌కు అన్ని విషయాల్లోనూ సహకారం అందిస్తున్న చంద్రబాబు ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల వ్యవహారం తెరపైకి తెచ్చినట్లు చెప్తున్నారు.

ఏడాదిన్నరగా ఆ మంత్రుల ఊసే ఎత్తని బాబు
ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించాలని ఏడాదిన్నర కాలంగా చంద్రబాబు ఏనాడూ గవర్నర్‌ను కలవలేదు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ అంతకన్నా కోరలేదు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా శాసనసభకే హాజరు కాని చంద్రబాబు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించాలన్న డిమాండ్‌పై పోరాటం చేస్తామని కనీసం తన పార్టీ ఎమ్మెల్యేల ద్వారానైనా చెప్పించలేదు. చంద్రబాబు ఇటీవల తన ఢిల్లీ పర్యటన అనంతరమే ఉన్నపళంగా ఆ మంత్రుల విషయంలో గట్టిగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ సర్కారుపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టీడీపీ మద్దతిచ్చి ఉంటే ప్రభుత్వం పడిపోయేది. కాంగ్రెస్ సర్కారు మైనారిటీలో పడిన విషయం ఆ రోజు స్పష్టమైంది కూడా. తటస్థంగా ఉండటం ద్వారా ప్రభుత్వం పడిపోకుండా చంద్రబాబు కాపాడారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలపై అడ్డగోలుగా కరెంట్ చార్జీల భారం మోపారు. దాదాపు 32 వేల కోట్ల రూపాయల మేరకు వివిధ రకాలుగా భారం వేసి సామాన్యుడి నడ్డివిరిచారు. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అటకెక్కించారు. దాంతో కాంగ్రెస్‌పై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అందుకు భిన్నంగా కాంగ్రెస్‌కు అండగా ‘స్పాట్ ఫిక్సింగ్’ చేసుకోవటంతో ఆ పార్టీ పట్ల కూడా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఉభయ ప్రయోజన వ్యూహం... : 
మరోవైపు.. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని గ్రహించి చాలా మంది నాయకులు టీడీపీని వీడి వెళ్లిపోతున్నారు. పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ స్థాయిలోనే టీడీపీ కూడా తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నందునే ప్రజల దృష్టిని మళ్లించటానికి ఉమ్మడిగా కొత్త ప్రచారం తెరమీదకు తెచ్చారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించాలని చంద్రబాబు ప్రతినిత్యం అదే డిమాండ్‌పై హడావిడి చేయడం, దానిపై కాంగ్రెస్ అధిష్టానం సైతం ఏదో కసరత్తు సాగిస్తున్న సంకేతాలివ్వటం.. తద్వారా ప్రజల దృష్టిని మళ్లించొచ్చన్న రాజకీయ ‘దురా’లోచనతో ఉభయ ప్రయోజన ప్రణాళిక రచించినట్టు బలంగా వినిపిస్తోంది.

ఢిల్లీలో కాంగ్రెస్ నేతతో బాబు భేటీ!
పార్లమెంటులో ఎన్‌టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం పేరుతో ఢిల్లీ వెళ్లిన సందర్భంగా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానవర్గానికి చెందిన ఒక కీలక నేతతో చర్చలు జరిపారని టీడీపీలోనే వినిపించింది. అది జరిగిన రెండు మూడు రోజులకే ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల వ్యవహారంపై పార్టీ నేతలతో సమాలోచనలు జరిపి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్న అంశాన్ని తలకెత్తుకోవటం యాధృచ్చికంగా జరిగింది కాదని ఆ పార్టీ నేతలు కూడా అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో అల్లాడుతున్నా.. వారి సమస్యలపై ఏనాడూ గవర్నర్‌ను కానీ రాష్ట్రపతిని కానీ కలిసి వివరించని చంద్రబాబు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల అంశంలో మాత్రమే అదీ ఏడాదిన్నర కాలం తర్వాత అకస్మాత్తుగా ఆందోళనలు చేస్తామని పదేపదే వల్లించటం గమనార్హం.

చదివించే బాధ్యత జగనన్నదే

* ఆరు నెలలో.. ఏడాదో.. ఓపిక పట్టండి
* ‘అమ్మ ఒడి’ పథకంతో మీ పిల్లలను చదివించే బాధ్యత జగన్ తీసుకుంటారు
* టెన్త్ వరకు ఒక్కో విద్యార్థికీ నెలకు రూ. 500 చొప్పున తల్లి ఖాతాలో వేస్తారు
* ఇంటర్ అయితే రూ. 700, డిగ్రీ అయితే రూ. 1000 ఇస్తారు

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అమ్మా ఒక్క ఆరు నెలలో.. ఏడాదో ఓపిక పట్టండి. మీ పిల్లలను చదివించే బాధ్యత జగనన్న తీసుకుంటారు. ‘అమ్మ ఒడి’ పథకంతో ఆదుకుంటారు. అప్పుడు మీ పిల్లలు పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేస్తారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. ప్రజలకు ధైర్యం చెప్పారు. ‘‘అమ్మా... నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి ఏడు పాసయ్యాడు. చిన్నబ్బాయి ఆరు వరకు సదివాడు. ఇల్లు గడిచే దారిలేక ఇద్దరినీ బడి మాన్పించి నాతోపాటే పనికి తీసుకొని పోతున్నానండీ.. పిల్లలను సదివించాలని ఉన్నా వీలుపడడంలేదండీ’’ అని పశ్చిమగోదావరి జిల్లా కొత్త వెంకటాపురం గ్రామానికి చెందిన నాగ సుందరీదేవి.. షర్మిల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు.

ఆమె ఆవేదన వింటూ ముందుకు సాగిన షర్మిల గోపాలపురం నియోజకవర్గంలోని ఈస్ట్ యడవల్లి గ్రామంలో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో సాగింది. ఈస్ట్ యడవల్లి గ్రామంలో షర్మిల ప్రజలను ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

‘‘జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత.. పిల్లలను చదివించేలా అక్క చెల్లెళ్లను ప్రోత్సహించేందుకు ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెడతారు. ఆ పథకం కింద.. బడికి వెళ్లే చిన్నారికి నెలకు రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరేసి పిల్లల వరకు అమ్మ ఖాతాలోనే డబ్బు వేస్తారు. అంటే ఒక్కో చిన్నారికీ ఏడాదికి రూ. 6,000 చొప్పున అమ్మ అకౌంట్లో పడుతుంది. ఇంటర్ అయితే చిన్నారికి నెలకు రూ. 700 చొప్పున, డిగ్రీ అయితే రూ. 1,000 చొప్పున నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఆపై చదువులు చదివే వారికి వైఎస్సార్ అమలు చేసి చూపించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఉండనే ఉంది.

చార్జీలు పెంచని సీఎం వైఎస్
ఏ రాజకీయ పార్టీ అవునన్నా కాదన్నా.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రతి పల్లె, ప్రతి రైతు బాగుపడింది నిజం. వైఎస్ రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చారు.. నీళ్లిచ్చారు.. అవసరమైనప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు.. ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చారు. రైతుల రుణాల మీద వడ్డీ ఒక సారి, కోట్ల రూపాయల రుణాలను మరోసారి మాఫీ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, అభయహస్తం ప్రవేశపెట్టడంతోపాటు పేదలకు పక్కా ఇళ్లు, వృద్ధాప్య పింఛను.. ఇలాంటి ఎన్నో పథకాలు వైఎస్సార్ అద్భుతంగా అమలు చేసి చూపించారు. ఇన్ని పథకాలు చేసి వైఎస్సార్ ఏ రోజూ ఒక్క రూపాయి చార్జీ పెంచలేదు.

రూపాయి పెంచినా ఆ భారం పేదల మీద పడుతుందని, తన అక్క చెల్లెళ్ల మీద పడుతుందని ఆలోచన చేశారు. కేంద్రం గ్యాస్ మీద రూ.50 పెంచితే ఆ భారం తన అక్కచెల్లెళ్ల మీద పడకూడదని చెప్పి.. వైఎస్సార్ ఆ భారం తన ప్రభుత్వం మీదనే వేసుకున్నారు. వైఎస్సార్ అధికారంలోకి వచ్చేనాటికి రూ.305 ఉన్న గ్యాస్ ధరను ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయేంత వరకు రూ.1 కూడా పెంచలేదు. ఇప్పుడున్న పాలకులు ఈ ధరను రూ.420 చేశారు. అదీ సబ్సిడీ ఉంటే, సబ్సిడీ లేకుంటే రూ.1,000 చేసేశారు.

చంద్రబాబు.. ఖల్‌నాయక్
ప్రజలను ఆదుకోవడంలో ఈ కాంగ్రెస్ సర్కారు ఇంత ఘోరంగా విఫలమయినా.. చంద్రబాబు నాయుడు మాత్రం ఆ సర్కారుకే అండగా నిలబడుతున్నారు. ప్రతి పక్ష నాయకుడిగా ఉండి ప్రజల పక్షాన నిలబడకుండా, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి అండగా నిలబడి అది కూలిపోకుండా కాపాడుతున్నారు అంటే ఈయన్ను ఖల్‌నాయక్ అనక మరేమంటారు. సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు మీరు బుద్ధి చెప్పి.. జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం వస్తుంది. ఆ రోజు రైతన్న మళ్లీ తలెత్తుకొని తిరుగుతాడు. రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు అందుతాయి.’’

12.2 కిలోమీటర్ల మేర యాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ 151వ రోజు శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని రావికంపాడు గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కొత్త వెంకటాపురం, పాత వెంకటాపురం, ఈస్ట్ యడవల్లి, దొరసానిపాడు గ్రామాల మీదుగా షర్మిల నడిచారు. ద్వారకా తిరుమల శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.40 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం ఆమె మొత్తం 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,013.9 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది.

పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేశ్, తానేటి వనిత, ఎమ్మెల్సీలు మేకాశేషుబాబు, బొడ్డు భాస్కర రామారావు, మాజీ ఎమ్మెల్యే కేవీ కృష్ణబాబు, మొవ్వ ఆనంద శ్రీనివాసు, బొడ్డు వెంకట రమణ చౌదరి, స్థానిక నాయకులు టి. వెంకట్రావు, రాజీవ్ కృష్ణ, డి. సువర్ణ రాజు, జి.ఉమా బాల తదితరులు ఉన్నారు.

80 శాతం పంచాయతీలు మనమే గెలవాలి

* 80 శాతం పంచాయతీలు మనమే గెలవాలి
* వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులకు విజయమ్మ పిలుపు
* సాధారణ ఎన్నికలకూ సర్వసన్నద్ధంగా ఉండాలి
* జగన్‌కు వ్యతిరేకంగా సాగుతున్న కుట్రలను ప్రజలకు వివరించాలి
* జగన్ అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ 27, 28 తేదీల్లో నిరసనలు
* పార్టీ విసృ్తత సమావేశంలో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: త్వరలో జరుగుతాయని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా ఏమిటో చాటాలని, 80 శాతం పంచాయతీలను గెలుపొందాలన్నది లక్ష్యంగా పెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నవంబర్ లేదా డిసెంబర్‌లో అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలతో పాటే సాధారణ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కోవడానికి కూడా శ్రేణులు కింది స్థాయి నుంచి సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు. పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ఉంటే ఏ ఎన్నికలనైనా ఎదుర్కోవడం కష్టం కాదని, అయితే నేతలు మితిమీరిన విశ్వాసం ప్రదర్శించొద్దని ఆమె సూచించారు. శుక్రవారం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశానికి విజయమ్మ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇదే విషయం తనకు చెప్పారని తెలిపారు. ఎన్నికల్లో గ్రూపులను సృష్టించి దెబ్బ తీయాలని అధికారపక్షం కుట్ర పన్నుతోందని, అందుకు తావివ్వకుండా ఇప్పటినుంచే మంచి అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించాలని నేతలకు సూచించారు. రిజర్వేషన్లపై కోర్టు తీర్పును అడ్డంపెట్టుకుని రెండేళ్లుగా స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై సీబీఐతో కలిసి జగన్‌పై కొనసాగిస్తున్న కుట్రలను ప్రజలకు తెలియజెప్పాలని విజయమ్మ కోరారు. కోర్టుల్లో వివిధ స్థాయిల్లో సీబీఐ చేస్తున్న విచిత్ర వాదనలను ప్రజలకు వివరించి చెప్పాలని ఆమె సూచించారు.

ప్రదర్శనలు, దీక్షలకు నిర్ణయం
జగన్‌ను సీబీఐ అక్రమంగా నిర్బంధించి ఈ నెల 27వ తేదీతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ విసృ్తత సమావేశం నిర్ణయించింది. సమావేశం వివరాలను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్.. సీజీసీ సభ్యులు ఆది శ్రీనివాస్, ఎం.మారెప్పతో కలిసి విలేకరులకు తెలియజేశారు. జగన్ నిర్బంధానికి నిరసనగా 27వ తేదీ సాయంత్రం ప్రతి జిల్లా కేంద్రంలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 28వ తేదీన జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. జగన్‌పై పెట్టిన అక్రమ కేసులు, రాజకీయ కక్ష సాధింపులు, సీబీఐ విచారణ తీరును ఈ సందర్భంగా పార్టీ నేతలు ఎండగడతారని తెలిపారు.

ఇలావుండగా పార్టీని పటిష్టం చేసే క్రమంలో రాష్ట్రంలోని ఓటర్లలో 20 శాతం మందిని సభ్యులుగా నమోదు చేయాలని సమావేశం నిర్ణయించిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇద్దరేసి చొప్పున క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేసి వారికి శిక్షణ నివ్వబోతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలోనూ ఒక సుశిక్షితుడైన పార్టీ కార్యకర్త ఉంటారన్నారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సందర్భంగా పార్టీ అభిమానులను, మద్దతుదారులను ఓటర్లుగా చేర్పించాలని, అలాగే పార్టీ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా అప్రమత్తంగా ఉండాలని తీర్మానించినట్లు తెలిపారు. గతంలో అనంతపురం ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల వర్గాల వారి ఓట్లు భారీ సంఖ్యలో అక్రమంగా తొలగింపునకు గురైన ఉదంతాన్ని బాజిరెడ్డి ఉదహరించారు.

పార్టీపై చానెళ్ల విష ప్రచారం
కొన్ని టీవీ చానె ళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నాయని బాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశా రు. చంద్రబాబు పాదయాత్రలో కార్చిన మొసలి కన్నీరును ఈ చానెళ్లు గొప్పగా చూపిస్తున్నాయని, అయితే టీడీపీని వదిలిపెట్టి ఎంతమంది నేతలు బయటకు వెళుతున్నదీ చూపించవని, అసలు ఆ ప్రస్తావనే తీసుకురావని ఆయన విమర్శించారు. అదే తమ పార్టీలో ఏమీ లేకపోయినా అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరైనా అనారోగ్యంతో ఏదైనా సమావేశానికి రాక పోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ నిర్వహించే అన్ని సమావేశాలకూ ఆ పార్టీల నాయకులంతా హాజరవుతున్నారా? అని ప్రశ్నిం చారు.

తమ పార్టీలో కూడా అత్యవసర పనులున్న నేతలు కొన్ని సందర్భాల్లో సమావేశాలకు, కార్యక్రమాలకు రారని, దాన్ని కొండంతలుగా చేసి ప్రచారం చేయడం తగదని ఆయన అన్నారు. వ్యక్తిగత పనుల వల్ల తాను సమావేశానికి రాలేకపోతున్నట్టుగా కొణతాల రామకృష్ణ.. విజయమ్మకు ఫోన్ చేసి చెప్పారని బాజిరెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. షర్మిల పాదయాత్ర 2,000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆమెను అభినందిస్తూ సమావేశం ఓ తీర్మానం చేసిందన్నారు. తెలంగాణలో విజయమ్మ బస్సు యాత్ర లేదా ఓదార్పు యాత్ర.. ఏదో ఒకటి చేయాలనే సూచనలు వచ్చాయని, త్వరలో ఆ విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విస్తృత సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లు, లోక్‌సభా నియోజకవర్గాల పరిశీలకులు, వివిధ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

షర్మిల పాదయాత్రకు కువైట్ వాసుల సంఘీభావం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకున్న సందర్భంగా కువైట్‌లోని పార్టీ అభిమానులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కువైట్‌లోని హవల్లీ ప్రాంతం వద్దకు వారు శుక్రవారం పెద్ద సంఖ్యలో చేరుకొని హర్షం వ్యక్తం చేశారు. మండుటెండలో కూడా షర్మిల తన పాదయాత్ర కొనసాగిస్తూ... రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటడం ద్వారా ప్రపంచ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనలేకనే కాంగ్రెస్, టీడీపీలు కలిసి సీబీఐని అడ్డుపెట్టుకొని బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పి.రెహమాన్, పి.వాసుదేవరెడ్డి, గోవింద్ నాగరాజు, షేక్ ఇనాయత్, జీఎం బాబు రాయుడు, సత్తార్‌ఖాన్, రమణయాదవ్‌లతో పాటు పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 152వ రోజు శనివారం 12.2 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని ద్వారకాతిరుమల నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి కొత్తగూడెం చేరుతుందని పేర్కొన్నారు. 

పర్యటించే ప్రాంతాలు : ద్వారకాతిరుమల, రాళ్లకుంట, అయ్యవరం, కొత్తగూడెం

వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన టిడిపి నేత

Written By news on Friday, May 17, 2013 | 5/17/2013

 లోటస్‌పాండ్‌లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన టిడిపి నేత గేదెల రామారావు ఆ పార్టీలో చేరారు. ఆయన శ్రీకాకుళం రూరల్ మాజీ మండలాధ్యక్షుడు. రామారావుతోపాటు ఆయన తనయుడు పురుషోత్తం కూడా వైఎస్ఆర్ సిపిలో చేరారు.


చంద్రబాబు ఇచ్చిన లేఖలో స్పష్టత లేదు: ఎర్రబెల్లి

 తెలంగాణ కోసం చంద్రబాబు ఇచ్చిన లేఖలో స్పష్టతలేదు అని ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని అప్పుడే చెప్పానని ఎర్రబెల్లి అన్నారు. ఈ వ్యవహారంలో తాను అలిగితే నన్ను బుజ్జగించింది కడియం శ్రీహరేనని అన్నారు. కడియంను టార్గెట్ చేసే ప్రయత్నంలో ఎర్రబెల్లి గుట్టువిప్పినట్టు తెలుస్తోంది. 

ప్రధాని మన్మోహన్‌కు వైఎస్ విజయమ్మ లేఖ!

 సౌదీ అరేబియా అమలుపరచనున్న కొత్త కార్మిక చట్టంపై ప్రధాని మన్మోహన్‌ సింగ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే 12లక్షల మంది భారతీయులు ఇబ్బంది పడతారని లేఖలో విజయమ్మ తెలిపారు. లక్ష మంది తెలుగువారు రోడ్డునపడతారని.. ఈ విషయంపై సౌదీ అరేబియా ప్రభుత్వంతో చర్చించాలని ప్రధానికి విజయమ్మ సూచించారు. 

భారతీయులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని మన్మోహన్ కు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. చట్టం అమలు చేసేముందు భారతీయులకు మరింత గడువు ఇచ్చేలా చూడాలని లేఖలో తెలిపారు. సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు.

YSRCP Leader Bajireddy Govardhan speaks to media

అన్ని కులాలకు ప్రాధాన్యత : విజయమ్మ

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే గ్రామస్థాయి నాయకత్వం బలంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. లోటస్ పాండ్ లో జరిగిన పార్టీ విసృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామస్థాయిలో మంచి నాయకులను ఎంపిక చేసుకోవాలని జగన్ చెప్పినట్లు ఆమె తెలిపారు. ప్రజల్లో పార్టీకి ఉన్న బలాన్ని చీల్చాలని కొందరు చూస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు.ఈ ఎన్నికల కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రజా సమస్యలపై మనం సైనికుల్లా పనిచేయాలని చెప్పారు. ప్రజలకు పార్టీ నాయకులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. స్థానిక ఎన్నికల్లో అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇద్దామని చెప్పారు. ఒక్క రోజు కూడా వృథా కాకుండా నాయకులు ప్రజల్లోనే ఉండాలన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికలలో అందరినీ కలుపుకొని ఐక్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. గ్రామాలలో మంచి నాయకులను ఎన్నుకోవాలన్నారు. పార్టీ తరపున మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని నేతలకు సూచన చేశారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేస్తూ, అందరిని కలుపుకుకోవాలని చెప్పారు. సభ్యత్వ నమోదుకు ప్రజలలోకి వెళ్లవలసిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వం మైనార్టీలో ఉందని, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సహకారంతో నడుస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి అండతో కిరణ్ ప్రభుత్వం ఎటువంటి భయంలేకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతోందని చెప్పారు. వైఎస్ఆర్ సిపి ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండు కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. ఎన్నికలలో కూడా కలిసి నడుస్తున్నాయన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించవలసిన వ్వ్యూహంపై జరిగిన ఈ సమావేశానికి దాదాపు 150 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు

సిబిఐ తీరు ఇలా ఉంటుందన్నమాట!

రైల్వేశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బన్సల్ కు వ్యతిరేకంగా ఆధారాలు లేవని సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా వ్యాఖ్యానించిన తీరు వివాదాస్పదంగానే ఉంది.సిబిఐలో అత్యున్నత పదవిలో ఉన్న ఈయన బొగ్గు కుంభకోణంలో తయారుచేసిన నివేదికను న్యాయశాఖ మంత్రి చూసి మార్పులు చేశారని చెప్పి సంచలనం సృష్టించారు. తాజాగా కేసు దర్యాప్తులో ఉండగానే బన్సల్ కు సర్టిఫికెట్ ఇచ్చేశారు.దీనిని ఆయా విపక్షాలు తప్పుపడుతున్నాయి. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు.రంజిత్ సిన్హా ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఈ ప్రకటన చేసినట్లు ఉందని ఆయన అన్నారు.కేసును నీరుకార్చే విదంగా సిన్హా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు.సిబిఐ తీరు ఇలా ఉంటుందన్నమాట.

http://kommineni.info/articles/dailyarticles/content_20130517_15.php

ఎబ్రోన్‌ చర్చి ట్రస్ట్‌తో వైఎస్ఆర్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు

ఎబ్రోన్‌ చర్చి ట్రస్ట్‌తో వైఎస్ఆర్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఎబ్రోన్‌ ట్రస్టీలు పీటర్‌, జాన్‌ సుబ్బారెడ్డి, సామ్‌సన్‌ స్పష్టం చేశారు. వారు శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కావాలనే కొంతమంది ఎబ్రోన్‌ చర్చిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

2004 మార్చి 23న ఎబ్రోన్‌ సొసైటీ రద్దు చేయబడిందని, మరుసటి రోజు 24న ఎబ్రోన్‌ ట్రస్ట్‌ ఏర్పాటు అయినట్లు వారు తెలిపారు. 25వ తేదీన సొసైటీ ఆస్తులన్నీ ట్రస్టుకు బదిలీ చేశారని, ఈ ఆస్తుల బదిలీని హైకోర్టు కూడా ఆమోదం తెలిపిందని పీటర్‌, జాన్‌ సుబ్బారెడ్డి, సామ్‌సన్‌ వెల్లడించారు.

YS Vijayamma speech in YSRCP meeting

అందరితో కలిసి ఐక్యంగా పనిచేయాలి: విజయమ్మ

స్థానిక సంస్థల ఎన్నికలలో అందరినీ కలుపుకొని ఐక్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిలుపు ఇచ్చారు. లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించవలసిన వ్వ్యూహాలపై చర్చించారు. దాదాపు 150 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో విజయమ్మ మాట్లాడుతూ గ్రామాలలో మంచి నాయకులను ఎన్నుకోవాలన్నారు. పార్టీ తరపున మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని నేతలకు సూచన చేశారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేస్తూ, అందరిని కలుపుకుకోవాలని చెప్పారు. సభ్యత్వ నమోదుకు ప్రజలలోకి వెళ్లవలసిన అవసరం ఉందన్నారు. 

ప్రభుత్వం మైనార్టీలో ఉందని, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సహకారంతో నడుస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి అండతో కిరణ్ ప్రభుత్వం ఎటువంటి భయంలేకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతోందని చెప్పారు. వైఎస్ఆర్ సిపి ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండు కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. ఎన్నికలలో కూడా కలిసి నడుస్తున్నాయన్నారు.

రాష్ట్ర ప్రజలంతా...జగనన్నకు అండగా ఉన్నారు

నాకు పాలిటిక్స్ గురించి పెద్దగా ఏమీ తెలియదు. అలాంటిది వైఎస్సార్ సీఎం అయ్యాక, ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలని చూశాక ప్రజానాయకుడంటే ఇలా ఉండాలి అనుకున్నాను. ప్రతి నాయకుడూ ఆయనలాగే ఉంటే రాజకీయాలపై ప్రజలకు ఉండే ఉదాసీనభావం తొలగిపోతుంది. నిజానికి వైఎస్సార్‌ని చూస్తే పొలిటీషియన్‌లా కనిపించరు. మన కుటుంబ సభ్యుడిగా అనిపిస్తారు. ప్రజల మీద ఆయనకున్న ప్రేమ, వాత్సల్యం ఎప్పటికీ ఎవ్వరమూ మరిచిపోలేనివి. ఆయన పరిపాలనలో ప్రజలంతా సుభిక్షంగా, ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న తరుణంలో దేవుడు కూడా తనకు అలాంటి మహానేత కావాలనుకున్నాడేమో, ఆయన్ని మన నుండి దూరం చేశాడు. 

ఆ సమయంలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయింది. ఇక మన జీవితంలోకి వెలుగు రాదు, అలాంటి నాయకులు ఇక రారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలో, సన్నటి సూర్యకిరణంలా జగన్ రూపంలో వెలుగొచ్చింది. జగన్‌లో ఆ మహానేతను చూసుకున్నారంతా. ప్రజలకు, ఆ కుటుంబానికి మధ్యన ఇలా బంధం వేసింది దేవుడే తప్ప, ఈ స్వార్థపరులైన నాయకులు కాదు. వైఎస్సార్‌ని జగన్‌లో చూసుకుని సంతోషించే సమయంలో ఆయన్ని జైలుకు పంపడంతో ప్రజలంతా ఆవేదనకు లోనయ్యారు. ఆ కుటుంబం మీద కనీస మానవత్వం మరచి, పదవుల కోసం ఎవరు ఎంత గొంతు చించుకుని ఎన్ని అభాండాలు వేసినా ప్రజలు నమ్మేస్థితి లేదు. 

జగన్‌ని ఎంత అణగదొక్కాలని చూస్తే, అంతగా... ఉవ్వెత్తు కెరటంలా ఎగసి పైకొస్తాడు. విజయమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే ప్రతి మహిళ కళ్లల్లో నీళ్లు వస్తాయి. భర్తని పోగొట్టుకుని, ఉన్న ఇద్దరు బిడ్డల్లో ఒకరిని జైలుపాలు చేసుకుని, మరొకరిని ప్రజల మధ్యకు పంపించిందా తల్లి. ఆ కుటుంబం మీద నిందవేసే నాయకుల్లారా... ఆ తల్లి కన్నీళ్లే మీకు శాపంగా మారతాయని గుర్తుంచుకోండి. ఈ రాష్ట్రమంతా జగన్ వెంట, ఆయన కుటుంబసభ్యుల వెంట అండగా ఉంది. 

- జి.లీలావతి, ఇసిఐల్, హైదరాబాద్

రెండు న్యాయాల పాలనలో ఉన్నాం!

స్వాతంత్య్రం రాక మునుపు బ్రిటిష్‌వారు, తమను వ్యతిరేకించినవాళ్లను జైల్లో పెట్టించారని పుస్తకాల్లో చదివాను. కానీ ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను. అవును. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఆనాటి అరాచకాన్ని తలపిస్తున్నాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీ అంటే చాలా గౌరవం, ఇష్టం. కానీ ఇప్పుడు జగనన్న విషయంలో ఇది కాంగ్రెస్ పాలన కాదు, బ్రిటిష్ రాజ్యం అనిపిస్తోంది. 

వాస్తవంగా కొంతమంది మీద ఒక అభియోగం మోపినప్పుడు, ఆ కేసుకి సంబంధించిన అందరికీ చట్టం ఒకేలా వర్తిస్తుంది. అంతేకానీ కొంతమందికి ఒకరకంగా, కొంతమందికి మరొక రకంగా ఉండదు. మరి జగన్‌ను, మరికొంతమందిని మాత్రమే జైల్లోపెట్టి, మిగతావారిని బయట ఉంచింది ఈ ప్రభుత్వం. కోర్టువారికి ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదో, వారు సీబీఐని ఎందుకు ప్రశ్నించడం లేదో నాకు అర్థం కాని విషయం. నిజంగా జగన్ సాక్షులను భయపెట్టే వ్యక్తే అయితే, ఆయన బయట ఉన్నప్పుడే భయపెట్టి ఉండాలి. సీబీఐ కూడా ఇంతవరకు ఒక్కర్ని కూడా ఆయన భయపెట్టినట్టు రుజువులు చూపలేకపోయింది. ‘జగన్‌కు ఇప్పట్లో బెయిల్ రానే రాదు’ అని ఏప్రిల్ 5న చంద్రబాబు అన్నట్లు వార్తాపత్రికల్లో చదివాను. అసలు ఆయనకి ఈ విషయం ఎలా తెలుసని నా సందేహం. నాకే కాదు, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ ఈ సందేహం వచ్చింది. 

అంటే చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలిపారని స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన తన పాదయాత్రలో ‘‘గేదెకు గడ్డి వేస్తే పాలు ఇస్తుంది కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గడ్డి అనే తమ ఓటును దున్నపోతుకు వేశారు’’ అని కూడా చంద్రబాబు అన్నట్లు అదేరోజు చదివాను. అటువంటప్పుడు మొన్న అన్ని పార్టీలూ కలిసి అవిశ్వాసం పెడితే, చంద్రబాబుగారు ఎందుకు మద్దతు ఇవ్వనట్లు? దీన్నిబట్టి చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని స్పష్టమౌతోంది. అసలు చంద్రబాబుకి విశ్వసనీయత అంటే అర్థం తెలిస్తే, మామగారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చుండేవారే కాదు. దీన్నిబట్టి అర్థమౌతున్న ఇంకో విషయం ఏమిటంటే, చంద్రబాబు అధికారం కోసం ఎన్ని తప్పులైనా చేస్తారని.

ఇక, ‘జగన్‌కు డబ్బు పిచ్చి పట్టింది’ అని ఎల్లో మీడియా రాస్తోంది. డబ్బే ముఖ్యమనుకుంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించకుండా మౌనంగా తన పని తాను చేసుకుని ఉంటే, ఈ కేసులు ఉండేవి కాదని ఆయనకు మాత్రం తెలీదా. తెలిసీ జగన్ తను ప్రజలకు ఇచ్చినమాటకు కట్టుబడ్డారు. కష్టాలు కొనితెచ్చుకున్నారు. జగన్‌కి డబ్బు ముఖ్యం కాదు, మాట ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ఎవరు ఎటువైపు ఉన్నా ప్రజలందరూ జగన్ వెంటే ఉన్నారు. ఒక సగటు మనిషిగా ప్రజలందరూ ఏం మాట్లాడుకుంటారో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. జగన్ విడుదల కోసం రాష్ట్రప్రజలంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

- న్యాయవాది, నెల్లూరు

జగనన్న బాణాన్నే

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు... ఆ పార్టీ విధానమేమిటో... సిద్ధాంతమేమిటో ఆవిష్కరించినప్పుడు... రాజన్న రాజ్యం గురించి పార్టీ పెట్టిన రోజే విశదీకరించినప్పుడు మొదలైన కుట్రలు, కుతంత్రాలు ఆయనను జైలులో బందీని చేశాయి.
అయినప్పటికీ ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ ఆయన సోదరి షర్మిల సాహసోపేతంగా ‘మరో ప్రజాప్రస్థానా’నికి శ్రీకారం చుట్టారు. చెల్లెలికి జగనన్న నిర్దేశించిన లక్ష్యం సామాన్యమైంది కాదు. అది అంత చేరువలో లేదని ఆమెకూ తెలుసు. తాను నడిచేది రాచబాట కాదన్న విషయమూ తెలుసు. అయినా అకుంఠిత దీక్ష, మొక్కవోని ధైర్యంతో షర్మిల అడుగేశారు. నాన్న దీవెనలు... అమ్మ ఆశీస్సులు.... అన్న మాట... వీటన్నింటినీ గుండెల్లో నింపుకుని ముందుకు కదిలారు. తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి అడుగులో అడుగు వేసుకుంటూ కదిలినప్పుడు బహుశా షర్మిల కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఒక మహిళ. ఆమెకు అనేక ఆటుపోట్లు. ఆమెపై అనేకానేక నిందలు, నిష్టూరాలు. అయినా అవేవీ ఆమె పాదయాత్రకు అడ్డు రాలేదు. అప్పుడు ఆమె ముందున్నది ఒకే లక్ష్యం. ఇచ్చిన మాట కోసం పరితపిస్తూ నిలబడిన జగనన్న. ఆ అన్న మాటకు కార్యరూపమివ్వాలన్న ఉక్కు సంకల్పంతో షర్మిల. ఆ లక్ష్యాన్ని సాధించాలనే తపనే తనను ముందుకు నడిపిందన్నది ఆమె చెప్పే మాట.

2012 అక్టోబర్ 18న ఇడుపులపాయలో మొదలుపెట్టి... ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 2,000 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత కూడా షర్మిలలో ధైర్యం అణుమాత్రమైనా సడల్లేదు. ప్రపంచంలోనే ఏ మహిళా ఇంతటి సాహసోపేతమైన పాదయాత్ర చేయలేదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆమె లక్షలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. అడుగు తీసి అడుగేసిన ప్రతి చోటా వేలాదిగా అవ్వలు, తాతలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్లు, చెల్లెళ్లతో ప్రత్యక్షంగా మాట్లాడారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. పిల్లలను ఎత్తుకుని ప్రేమగా ముద్దాడారు. తండ్రి దీవెన... అన్న మాట... సాహస పాదయాత్రకు పురిగొల్పితే... అడుగు పెట్టిన ప్రతి చోటా ప్రజలు చూపిస్తున్న అపూర్వ ఆదరాభిమానాలు తనను మరింత ఉత్సాహంతో ముందుకు నడుపుతున్నాయని చిరునవ్వుతో చెబుతున్నారు షర్మిల. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఒక మహిళ తలపెట్టిన ఈ పాదయాత్ర విజయవంతంగా 2,000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ప్రారంభించి 10 జిల్లాల మీదుగా గురువారం నాటికి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని రావికంపాడు గ్రామానికి షర్మిల చేరుకున్నారు. 2,000 కిలోమీటర్ల మైలురాయికి గుర్తుగా అక్కడ ఏర్పాటు చేసిన తండ్రి వైఎస్ నిలువెత్తు విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అంతకు కొద్దిముందు, ఉద్విగ్నభరితమైన వాతావరణంలో ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి కె.సుధాకర్‌రెడ్డికి షర్మిల ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...

ఇంతటి సాహసోపేతమైన పాదయాత్ర చేయాల్సి వస్తుందని మీరెప్పుడైనా ఊహించారా?
లేదు. ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. కుట్రపూరితంగా జగనన్నను కేసుల్లో ఇరికించి జైలులో పెడతారని అనుకోలేదు.

{పపంచ చరిత్రలోనే ఏ మహిళా చేయని సాహసం చేసి రికార్డు నెలకొల్పారు. మరి కాసేపట్లో 2,000 కిలోమీటర్ల మైలురాయిని దాటబోతున్న సందర్భంలో మీరెలా ఫీలవుతున్నారు?
నేను రికార్డుల కోసం యాత్ర చేయడం లేదు. జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు చెప్పాల. వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాల. అదే చేస్తున్నా. ఇందులో రికార్డులంటారా... దాని గురించి ఆలోచించడం లేదు.

ఇప్పటిదాకా దాదాపు పది జిల్లాల్లో పాదయాత్ర చేశారు. ఎంతోమందిని కలిశారు. వారి నుంచి మీకు ఎలాంటి స్పందన లభిస్తోంది?
ఎంతగానో ఆదరిస్తున్నారు. పెద్దలు, యువకులు ఒకరేంటి... అందరూ ఎంతో ఆప్యాయత కనబరుస్తున్నారు. ప్రత్యేకించి మహిళలు నన్ను ఒక కూతురిగానో, ఒక అక్కగానో భావిస్తున్నారు. చిన్న పిల్లలైతే ఎంతో ఆప్యాయంగా అక్కా అంటూ పలకరిస్తుంటే కొన్నిసార్లు ఉద్వేగానికి లోనవుతున్నా. వారితో మాట్లాడిన ప్రతి చోటా రాజశేఖరరెడ్డి గారి గురించి తలచుకుంటున్నారు. జగనన్న ఎప్పుడొస్తాడని అడుగుతున్నారు.

పాదయాత్ర ప్రారంభించిన తొలిరోజు మీరు ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ కాలినడకకు శ్రీకారం చుట్టారు. ఈ రోజుకు 2,000 కిలోమీటర్లు నడిచారు. మరి మీ లక్ష్యం నెరవేరుతోందా?
కచ్చితంగా. జరుగుతున్న అన్యాయాలను చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వింటున్నారు. జనం కష్టాల్లో పాలుపంచుకోవాలని నేనొస్తే, మా కష్టాల్లో పాలుపంచుకోవాలని వారు కోరుకుంటున్నారు. లక్ష్యమంటారా... నెరవేరుతోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగాలని పాదయాత్ర మొదలు పెట్టినప్పుడే సంకల్పించాం. అంతవరకు సాగుతుంది.

ఎండనకా వాననకా కుటుంబానికి దూరంగా ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర చేయాలంటే ఎంతో గుండె నిబ్బరం కావాలి. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి తొలి అడుగు వేసినప్పుడు మీ అనుభూతి ఏంటి? సుదీర్ఘ లక్ష్యం గుర్తుకు రాలేదా?
నాకు గుర్తొచ్చేదొక్కటే. జగనన్న బయటకు రావడం. జనంలో ఉండే జగనన్నను కాళ్లూ చేతులు కట్టేసి జైల్లో పెట్టినప్పుడు... ఆ కుట్రలు, కుతంత్రాలను చూస్తున్నప్పుడు, సాధించాలన్న తపనే తప్ప మరో భావన రాలేదు. పాదయాత్ర అంటారా... 2003లో నాన్నగారు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా చేసిన పాదయాత్రను ప్రత్యక్షంగా చూశాను. దాంట్లో ఎదురయ్యే కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి ఇది నాకు పెద్దగా కష్టమనిపించలేదు. అభిమానించే ప్రజలుంటే ఎన్ని కష్టాలైనా బలాదూరే. పైనున్న నాన్న సంతోషిస్తారు. ఈ జన్మకు అది చాలదా!

ఒక సమస్యపై పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ 250 కి.మీ. పాదయాత్ర చేశారు. అదే ఇప్పటివరకు ఒక మహిళ సాధించిన రికార్డు. మీరు ప్రపంచంలోనే ఎవరూ చేయని సాహసానికి ఒడిగట్టారు. దీనికి కారణమేంటి?
చెప్పాను కదా... జగనన్నకు ఈ పరిస్థితి రాబట్టే నేను పాదయాత్ర చేపట్టాల్సి వచ్చింది. ఈ పాదయాత్ర రూట్ మ్యాప్ జగనన్నే తయారు చేశారు. ప్రజల్లో ఉండాలని చెప్పారు. తండ్రి అడుగుజాడల్లో పాదయాత్ర చేయాలని చెప్పారు. జగనన్న ఎప్పుడూ ప్రజలను నమ్ముకుంటారు. జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలను ప్రజలకు వివరించమన్నారు. అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తుంటే... ప్రజలను వంచిస్తుంటే... మనకు నమ్మకమైన, మనల్ని నమ్మే ప్రజలకు వాస్తవాలు చెప్పమన్నారు. అందుకే ఈ పాదయాత్ర.

పాదయాత్ర సంకల్పంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నదేమిటి?
అన్న మాట. జగనన్న మాట. నాన్న ఆశీర్వాదం. జగనన్న నిర్బంధంలో ఉన్నారన్న బాధ.

కరువు కాటకాలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నప్పుడు నేనున్నానంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి వారిలో భరోసా నింపడానికి ఆనాడు ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశారు. ఆ తర్వాతి పరిణామాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 300 రోజులకు పైగా రాష్ట్రమంతా పర్యటిస్తూ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఇటీవలి కాలంలోనే విజయమ్మ కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఇప్పుడు మీరు. ఇలా మొత్తం కుటుంబం ప్రజల మధ్యే ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
వైఎస్ ప్రజల మనిషి. జగనన్న ప్రజల్లో మనిషి. నాన్న చనిపోతూ తనకొక పెద్ద కుటుంబాన్నిచ్చారని నల్లకాలువ సభలో అన్న చెప్పారు. ప్రజల కోసం బతకలేనప్పుడు ఎందుకీ జీవితమని నమ్మేవారు నాన్నగారు. ఆయన చనిపోయాక జగనన్న చేయగలిగినంత కాలం చేశారు. ఇప్పుడు ఆయనను నిర్బంధించారు. అందుకే ఆ తర్వాత వరుసలో నేను చేరా.

మీరు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత కొన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం మీపై వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి. సందర్భోచితంగా మీరు సమాధానాలూ చెబుతున్నారు. ఇలాంటి ఆరోపణలు, విమర్శలను మీరెలా చూస్తారు?
ఆ విమర్శలు ఎందుకొస్తున్నాయో ప్రజలకు తెలుసు. జగనన్న ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు ప్రజల ఆదరాభిమానాలను చూసి ఓర్వలేక ఆయన్ను జైలులో పెట్టారు. ఇప్పుడు నేను చేస్తున్న పాదయాత్రలో ప్రజలు ఎంతో ఆప్యాయంగా వచ్చి నన్ను పలకరిస్తుంటే... తండోపతండాలుగా కదిలొచ్చి పాదయాత్రకు సంఘీభావం చెబుతుంటే... ఇలా ఆరోపణలు చేయడం కన్నా ఇంకేం చేస్తారు! షర్మిలను అప్రతిష్టపాలు చేయాలి! ఆ ప్రయత్నంలోనే ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. ప్రజల అండ ఉన్నంత కాలం ఎవరెన్ని నిందలు మోపినా భయపడాల్సిన పని లేదు.

వైఎస్ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీవే తప్ప వైఎస్‌వి కాదని రెండు మూడేళ్లుగా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. పైగా ఇప్పుడు అంతకన్నా మంచి పథకాలను అమలు చేస్తున్నామని చెబుతున్నారు. మీరిప్పుడు ప్రజల్లో తిరుగుతూ ప్రత్యక్షంగా కలిసి మాట్లాతున్నారు కదా. కాంగ్రెస్ నేతలు చెబుతున్న విషయాల్లో పొంతన ఉందా?
సంక్షేమ పథకాలు వైఎస్‌వి కాదనుకుంటే మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవెందుకు లేవు? వాళ్ల పథకాలు కావని అక్కడే తేలిపోతోంది. పైగా నాన్నగారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటికీ వీళ్లు తూట్లు పొడిచారు. నేను ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లంతా అదే చెబుతున్నారు. ప్రజలెప్పుడూ అబద్ధాలు చెప్పరు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్కడికెళ్లినా తమ్ముళ్లు, చెల్లెళ్లు చెబుతున్నదిదే. ఫీజు కట్టే స్తోమత లేక మధ్యలో చదువు ఆపేయాల్సిన పరిస్థితి ఉందని కన్నీళ్లపర్యంతమై మరీ చెబుతున్నారు. వీళ్లు ఏ పథకం సరిగా అమలు చేస్తున్నారో చెప్పమనండి! ఉచిత విద్యుత్‌కు తూట్లు పొడిచారు. ఊళ్లలో కరెంటే ఉండటం లేదు. 30 కిలోల బియ్యం మాటే మరిచిపోయారు. నిరుపేదల ఇళ్లు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. వృద్ధుల పింఛన్లు కూడా అంతే. వారి నోటికాడ బుక్కను లాగేస్తున్నారు. ఎంత దారుణం! వడ్డీ లేని రుణాలని చెబుతున్నారే... గ్రామాల్లోకి వచ్చి ప్రజలను అడిగితే అందులోని వాస్తవం తెలుస్తుంది. ఉపాధి హామీ పథకమైతే దారుణంగా తయారైంది. పలుచోట్ల అభయహస్తం అమలు కావడమే లేదని చెప్పారు. 108 అంబులెన్సులను తగ్గించారు. వైఎస్ సంకల్పించిన పథకానికే పేరు మార్చి బంగారు తల్లి అని పెట్టారని వాళ్ల మంత్రులే చెబుతున్నారు కదా!

మరో ప్రజాప్రస్థానానికి రెండు ఉద్దేశాలని తొలి రోజు మీరు చెప్పారు. ఆ రెండింటినీ ప్రజలకు వివరిస్తున్నప్పుడు వారి నుంచి స్పందన ఎలా ఉంది?
పాదయాత్ర మొదటి రోజున చెప్పాను. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, అసమర్థ ప్రభుత్వాన్ని పడగొట్టకుండా కాపాడుతున్న ప్రధాన ప్రతిపక్ష టీడీపీని నిలదీయడం. ఈ రెండంశాల గురించి చెబుతున్నప్పుడు ప్రజలంతా అవును కరెక్టే కదా అంటున్నారు. బాగా అర్థం చేసుకుంటున్నారు. చాలా స్పందిస్తున్నారు.

నిజానికి ఈ యాత్ర జగనన్న చేయాల్సిందని, ఆయన తరఫున మిమ్మల్ని పంపారని మీరు చెబుతున్నారు. అది విని ప్రజలు ఎలా స్పందిస్తున్నారు?
జగనన్న రావాలన్న ఆకాంక్షను ప్రతి ఒక్కరిలోనూ చూస్తున్నాను. అన్న ఎప్పుడెప్పుడు బయటకొస్తారా అని వారు దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. జగనన్న రావాలి, రాజన్న రాజ్యం తేవాలి. అదే వాళ్లు కోరుకుంటున్నారు.

జగన్ బయటకు రావాలని ఆశిస్తున్న అభిమానులు, ప్రజలకు మీరిచ్చే సందేశమేంటి?
దేవుడున్నాడన్నది ఎంత నిజమో జగనన్న బయటకు రావడమన్నది కూడా అంతే నిజం. వైఎస్ కుటుంబాన్ని ఆదరించే, జగనన్నను అభిమానించే వారందరికీ నేనొక్కటే చెబుతున్నా. దేవుడున్నాడన్నది ఎంత నిజమో జగనన్న బయటకు రావడం కూడా అంతే నిజం. అదే నమ్మకం, విశ్వాసంతో ఉండండి.

జగన్ విషయంలో సీబీఐ దర్యాప్తు కుట్రపూరితంగా జరుగుతోందని చాలాసార్లు ఆరోపించారు? 
అవును. నిజమే కదా. సీబీఐ ముమ్మాటికీ కాంగ్రెస్ కనుసన్నల్లో పని చేస్తోంది. అంతెందుకు... కోల్ గేట్ కుంభకోణంలో తేటతెల్లమైంది కదా. ఇంకా ఎవరిని మభ్యపెట్టడానికి? జగనన్నపై కేసు పెట్టిన మొదటి నుంచీ మేం చెబుతున్నదిదే. కచ్చితంగా కుట్రపూరితంగానే కేసు వ్యవహారం నడుస్తోంది. లేకపోతే జగనన్నపై విచారణ ప్రారంభించాలని అనగానే అగమేఘాలపై సీబీఐ దేశంలోని అధికారులందరినీ పిలిచి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతుంది. అదే చంద్రబాబుపై విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించినప్పుడు ఏమైంది? పదిహేను రోజులైనా బృందాలు కాదు కదా, ఒక్క అధికారి కూడా సీట్లోంచి కదల్లేదు కదా! తమకు ఆదేశాలు అందలేదంటూ తాత్సారం చేయలేదా? ఆ వ్యత్యాసం కనబడటం లేదా? అంతకన్నా సీబీఐ తీరుకు నిదర్శనం ఏం కావాలి? జగనన్నపై జరుగుతున్న కుట్రలు ఎన్నెన్నో! చెప్పుకుంటూ పోతే గంటలు కాదు కదా, రోజులైనా సరిపోవు. మా ధైర్యం ఒక్కటే... దేవుడున్నాడు.
బొగ్గు స్కాంపై నివేదికను కేంద్ర న్యాయ మంత్రి, ప్రధాని కార్యాలయ అధికారులు పరిశీలించి సవరించారని సీబీఐ సుప్రీంకోర్టులో అంగీకరించింది? 
అదే కదా చెబుతున్నా. ఒకో వ్యక్తి విషయంలో ఒక్కో రకంగా. తమకు కావాల్సిన వారి విషయంలో ఒక తీరు. ఇంకొకరి విషయంలో ఇంకో తీరు. మంత్రికి మాత్రమే సంబంధముంది తప్ప ప్రధానికి ఏమీ లేదని 2జీ కేసులో సీబీఐ చెబుతుంది. ప్రధాని కార్యాలయానికి కూడా ఏ సంబంధమూ లేదంటుంది. ఇక్కడికొచ్చే సరికి సీఎంకు (వైఎస్‌కు) సంబంధముంది గానీ మంత్రులకు లేదంటుంది. ఎటు అనుకూలంగా ఉంటే అటు మాట్లాడుతున్నారు. ఎవరిని ఇరికించాలనుకుంటే వారిని ఇరికిస్తారు. ఎవరిని జైల్లో పెట్టాలంటే వారిని పెడతారు. ఇక్కడ మంత్రులపై సీబీఐ ఈగ కూడా వాలనివ్వదు. మంత్రి పదవిలో ఉంటూ అధికారంలో ఉన్న వాళ్లేమో సాక్షులను ప్రభావితం చేయరట. ఏ అధికారమూ లేని జగనన్న మాత్రం బయటకొస్తే సాక్షులను ప్రభావితం చేస్తారట. ఇదేమైనా సమంజసమైన వాదనేనా? దీంట్లో ధర్మం, న్యాయం ఏమైనా ఉన్నాయా? వాళ్లు (సీబీఐ) ఎవరిని రక్షించాలంటే వారిని రక్షిస్తారు. తమను కాదన్నందుకు దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులపై సీబీఐని ప్రయోగించింది వాస్తవం కాదా? ముఖానికి రంగేసుకున్నంత మాత్రాన ఎవరూ గుర్తుపట్టలేరనుకుంటే ఎలా? సీబీఐ ఏమిటో, అది చేస్తున్న దర్యాప్తులేమిటో రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ రోజు దేశ ప్రజలందరికీ అర్థమైంది.

పాదయాత్రలో ఎంతోమంది బాధలు విన్నప్పుడు మీకేమనిపిస్తోంది?
జగనన్న తొందరగా బయటకు రావాలనిపిస్తోంది.

పది జిల్లాల్లో సాగిన పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలనెన్నింటినో ప్రస్తావించారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఎందుకని?
దున్నపోతుమీద వాన పడ్డ చందం. ముందే చెప్పాను కదా... ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అండ ఉన్నంత కాలం ఈ ప్రభుత్వానికేం ఢోకా లేదని! టీడీపీ అండగా నిలిచినంత కాలం స్పందించరు. ఇదంతా టీడీపీ అండ చూసుకునే. అయినా సీల్డు కవర్ లీడర్లకు ప్రజల సమస్యలు తెలిసే అవకాశమే ఉండదు. అయితే ప్రజలు మేల్కొన్నారు. టీడీపీ అండ చూసుకుని తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని వారు నిద్ర లేపనున్నారు. సమయమొచ్చినప్పుడు ఎలా నిద్ర లేపాలో, ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారు.


http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62455&Categoryid=1&subcatid=18

ఇవీ మన కిరణ్‌కుమార్‌రెడ్డి గారి పథకాలు.

* మరో ప్రజాప్రస్థానంలో షర్మిల ఉద్ఘాటన
* 2,000 కి.మీ. మైలురాయి దాటిన పాదయాత్ర
* వైఎస్ పాదయాత్రకు కొనసాగింపే ఈ మరో ప్రజాప్రస్థానం: షర్మిల
* జగనన్న ద్వారా రాజన్న రాజ్యం సాధించుకున్న రోజే మనకు పండుగ
* రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఈ కుట్రలను, 
* నరకాసురులను సంహరించాలి.. అప్పటిదాకా జరిగేది యుద్ధమే..
* వైఎస్ ఇమేజ్‌తో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
* ఆయనకు వెన్నుపోటు పొడిచింది.. ఆయన కుటుంబంపై రాళ్లు వేస్తోంది... టీడీపీతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తోంది 

నేను రికార్డుల కోసం యాత్ర చేయడం లేదు. జరుగుతున్న అన్యాయాలు, వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాలి. అదే చేస్తున్నా...

పెద్దలు, పిల్లలు... అందరూ ఎంతో అప్యాయత కనబరుస్తున్నారు. ప్రత్యేకించి మహిళలు నన్ను ఒక కూతురిగానో, ఒక అక్కగానో భావిస్తున్నారు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని నేనొస్తే.. మా కష్టాలు పంచుకోవాలని వారు కోరుకుంటున్నారు. 


మరో ప్రజాప్రస్థానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇది విజయ యాత్ర కాదు.. నిరసన యాత్ర. జగనన్న ద్వారా రాజన్న రాజ్యం సాధించుకున్న రోజే మనందరికి నిజమైన పండుగ. రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఈ కుట్రలను, కుతంత్రాలను, ఈ నరకాసురులను సంహరించిన రోజే నిజమైన పండుగ. అంతవరకు జరిగేది పోరాటమే.. అప్పటి వరకు జరిగేది యుద్ధమే..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఉద్ఘాటించారు. వైఎస్సార్ యజ్ఞంలా చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు కొనసాగింపే మరో ప్రజాప్రస్థానం అని చెప్పారు.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సాగింది. ఈ నియోజకవర్గంలోని రావికంపాడు గ్రామం చేరుకోగానే పాదయాత్ర 2,000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా రావికంపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన 24 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఇక్కడికి భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

వైఎస్‌కు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది..
వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఏ కేసులూ లేవు. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఆయన ఇంద్రుడు, భగీరథుడు అని పొగిడారు. ఇంత మంచి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలోనే ఎవరూ లేరని సోనియాగాంధీ గారు, మన్మోహన్‌సింగ్ గారు పొగిడారు. వైఎస్సార్ పథకాలు, ఆయన వ్యక్తిగత ఇమేజ్ ద్వారా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆయనకు వెన్నుపోటు పొడిచింది. వైఎస్సార్‌ను దోషి అన్నది.. ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో పెట్టారు. ఆయన కుటుంబం మీద రాళ్లు వేసింది.. వైఎస్సార్ కొడుకును జైలుపాలు చేసింది. వైఎస్సార్ ప్రతి పథకానికి తూట్లు పెట్టింది. ఆయన ఉద్దేశాలను విమర్శించింది. అన్నిటికీ మించి ఈ నాలుగేళ్ల కాలంలో ఈ టీడీపీతో కుమ్మక్కై నీచమైన రాజకీయాలు చేసింది. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్మూధైర్యం ఈ కాంగ్రెస్, టీడీపీలకు లేదు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేదు. అందుకే సీబీఐ వెనకాల దాక్కొని దాడి చేస్తున్నారు.

ఈ సీఎం పాలనలో ప్రజలు అల్లాడుతున్నారు..
ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారులో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. రైతులకు నీళ్లు, కరెంటు లేక వేసిన ప్రతి పంటలోనూ నష్టమొచ్చి అప్పుల పాలవుతున్నారు. పిల్లలు కూడా పనులకు పోతేనే ఇళ్లు గడిచే పరిస్థితి ఏర్పడింది అంటే ఈ పాపం కిరణ్ సర్కారుది కాదా అని అడుగుతున్నాం. ప్రజల గుండె చప్పుడు అర్థం చేసుకున్న మనిషి వైఎస్సార్ కనుక... ఆయన గుండెలోంచి అద్భుతమైన ఆలోచనలు పుట్టాయి. అందుకే అద్భుతమైన పథకాలు రూపొందించారు. చిత్తశుద్ధి, ప్రజల మీద స్వచ్ఛమైన ప్రేమ ఉన్న మనిషి కాబట్టే ఆ పథకాలను అమలు చేసి చూపించారు.

సీఎం కిరణ్ సొంత పథకాలివీ..
ఇప్పుడు సీఎం కిరణ్ కూడా సొంత పథకాలు చేస్తున్నారు. వాటి గురించి చెప్పాలి. జల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసే పథకం, మద్దతు ధర ఇవ్వకుండా రైతులను ముంచే పథకం, కరెంటు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టే పథకం, ఎరువుల ధరలు, గ్యాస్ ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, బస్సు చార్జీలు పెంచే పథకం, కరెంటు చార్జీలు పెంచే భారీ పథకం, మన ఆంధ్రప్రదేశ్‌ను అంధకారప్రదేశ్‌గా మార్చే పథకం, నెలలో సగం రోజులు కరెంటు ఇవ్వకుండా పరిశ్రమలను మూయించే పథకం, యువకులను నిరుద్యోగులుగా మార్చి వారి కుటుంబాలను రోడ్డున పడేసే పథకం, మేనిఫెస్టోలో 30 కిలోల బియ్యం ఇస్తామని చెప్పి 20 కిలోల బియ్యం ఇస్తూ ప్రజల సొమ్మును నెలకు రూ.400 దోచుకునే పథకం, ఫీజు రీయింబర్స్‌మెంటు తగ్గించే పథకం, ఆరోగ్యశ్రీని నీరుగార్చే పథకం, పక్కా ఇళ్లకు పాడెగట్టే పథకం, రేషన్ కార్డులను రద్దు చేసే పథకం, తక్కువ పని చేసి ఎక్కువ ప్రచారం చేసుకునే బంపర్ పథకం, వైఎస్సార్ మీద బురదజల్లే పథకం, సీబీఐని వాడుకొని జగనన్న మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టే మెగా పథకం... ఇవీ మన కిరణ్‌కుమార్‌రెడ్డి గారి పథకాలు. ఈ పథకాలన్నీ మన రాష్ట్ర ప్రజలకు గడపగడపకూ ఏ ప్రచారం లేకుండానే వెళ్లిపోతున్నాయి. ప్రజలందరికీ అర్థమవుతున్నాయి. 

అందుకే ఈ రాష్ట్ర ప్రజలు తీర్పు చెప్పడానికి ఎప్పుడెప్పుడా అని వేచి ఉన్నారు. తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబుకు తెలుసు. ఆయనకు ఇంత తొందరగా ఎన్నికలు రావడం ఇష్టం లేదు. అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి ఒక భారీ పథకం వేశారు. ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసానికి మద్దతు పలకొద్దని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి.. ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు. చరిత్ర హీనుడు అయ్యారు. ఆరోజు ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతిచ్చి ఉంటే ఈ ప్రభుత్వం కూలిపోయి ఉంటే.. ఈ కరెంటు బాదుడు ప్రజల మీద పడకపోయి ఉండేది. అవిశ్వాసం పెట్టిన రోజున కిరణ్ ప్రభుత్వం 146 మంది సభ్యులతో మైనార్టీలో పడిపోయింది. అలాంటి మైనార్టీ సర్కారు ఇప్పుడు చంద్రబాబు గారి మద్దతుతో పనిచేస్తోంది.

2,000 కి.మీ దాటిన పాదయాత్ర
150 వరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని మధ్యాహ్నంవారిగూడెం గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి వెంకటాపురం, బొరంపాలెం, వల్లంపట్ల, ముల్లకుంట, మహాలక్ష్మిపురం, గ్రామాల మీదుగా రావికంపాడుకు చేరుకోగానే పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. 

ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.40 గంటలకు షర్మిల చేరుకున్నారు. గురువారం మొత్తం 11.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2001.7 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్నవారిలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఆళ్ల నాని, జోగి రమేష్, మద్దాల రాజేష్, తానేటి వనిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, మేకతోటి సుచరిత, పేర్ని నాని, గొల్ల బాబూరావు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, కూన శ్రీశైలం గౌడ్, గుర్నాథరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కురుముట్ల శ్రీనివాసులు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, దేశాయి తిప్పారెడ్డి, నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, నేతలు బొడ్డు భాస్కరరామారావు, జ్యేష్ట రమేష్‌బాబు, జ్యోతుల నెహ్రూ, చెరుకువాడ రంగనాథరాజు, కుడిపూడి చిట్టబ్బాయి, గ్రంథి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, తలశిల రఘురాం, మొవ్వ ఆనంద శ్రీనివాస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంవీవీఎస్ నాగిరెడ్డి, వైఎస్ కొండారెడ్డి, గోసుల శివభరత్‌రెడ్డి, సీహెచ్ రవీంద్రరెడ్డి, స్థానిక నాయకులు కర్ర రాజారావు, పాశం రామకృష్ణ, గంట ప్రసాద్ తదితరులున్నారు. 

వైఎస్ పాదయాత్రే స్ఫూర్తి..
‘‘నా పాదయాత్రకు స్ఫూర్తి వైఎస్సార్ చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర. చంద్రబాబు దుర్మార్గపు పాలనలో వేల మంది రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే, లక్షల మంది పొట్టకూటి కోసం వలసలు పోతుంటే, రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెప్పడానికి వైఎస్సార్.. మండుటెండలో ప్రజాప్రస్థానం పాదయాత్రను ఒక యజ్ఞంలా చేశారు. ఆ పాదయాత్రకు కొనసాగింపుగానే అదే ఉద్దేశంతోనే జగనన్న తరఫున ఈ పాదయాత్ర చే స్తున్నా. ఇది ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి చేస్తున్న పాదయాత్ర కాదు.. ప్రజలు కష్టాల్లో ఉన్నారు కాబట్టి, వారి కష్టాలను పట్టించుకోవడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కాబట్టి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రజల పక్షాన నిలబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజాన మోస్తోంది కాబట్టి, రాష్ట్రంలో రైతులకు, మహిళలకు, పేదలకు, విద్యార్థులకు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ద్రోహం చేస్తున్నాయి కాబట్టి చేస్తున్న పాదయాత్ర. మంచి రోజులు మళ్లీ వస్తాయని భరోసా కలిగించడానికి చేస్తున్న పాదయాత్ర. రాజన్న రాజ్యం మళ్లీ జగనన్నకే సాధ్యమవుతుందని చెప్పడానికి చేస్తున్న యాత్ర.’’ 
- షర్మిల

Popular Posts

Topics :