06 January 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Shobha Nagi Reddy Press Meet 12th Jan 2013

Written By news on Saturday, January 12, 2013 | 1/12/2013

కాంగ్రెస్ కి ద్వారంపూడి గుడ్ బై ?





http://telugu.greatandhra.com/politics/jan2013/congres_dwarampudi_12.php

సహకార ఎన్నికలపై వైఎస్ఆర్ సీపీ సమీక్ష

సహకార ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. నేడు కర్నూలు, ఖమ్మం, చిత్తూరు, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నేతలతో సమీక్షా సమావేశం జరుపుతోంది. 16వ తేదీ ప్రకాశం, నల్లగొండ, నిజామాబాద్, 17వ తేదీగుంటూరు, పశ్చిమగోదావరి, విజయనగరం, ఆదిలాబాద్, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించనుంది.

తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ ధర్నా

విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం తిరుపతిలో ధర్నాకు దిగింది. తిరుచానూరు రోడ్డులో పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. 

ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాలకు కిరణ్ సర్కార్ తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. సామాన్యులు భరించలేని విధంగా ఛార్జీలు పెంచుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ధర్నాలో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరిపై వారు దుమ్మెత్తిపోశారు.

జగన్ కోసం ఎన్నారైల సంతకాలు 30 వేలు


జగన్ కోసం జనం సంతకాలు కార్యక్రమంలో 30 వేల మంది ప్రవాస భారతీయులు పాలు పంచుకుని తమ సంతకాలు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్(యుఏఇ)లో ఈ సంతకాల కార్యక్రమం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ శనివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. అమెరికా, ఆస్ట్రేలియాలోని తెలుగువారు ఆన్‌లైన్ ద్వారా పెద్ద సంఖ్యలో తమ సంతకాలు చేశారని వివరించారు.

ఎన్నారై విభాగం ప్రతినిధులు నరసారెడ్డి, సి.చంద్రశేఖర్ కువైట్‌లోనూ, ఛాయాదేవి, సోమిరెడ్డి, బ్రహ్మానంద్ దుబాయ్‌లోనూ సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారని ఆయన తెలిపారు. వారాంతపు సెలవుల్లో వీరంతా గుమికూడి తెలుగువారు నివసించే ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి డాక్యుమెంట్లపై సంతకాలు చేయించారు. ఈ సంతకాల ప్రతులను ఎప్పటికపుడు స్కాన్ చేసి ఆన్‌లైన్ ద్వారా హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారని వెంకట్ వివరించారు.

స్థానికులకే ప్రాధాన్యమివ్వాలి: భూమన

టీటీడీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగవకాశాల్లో స్థానికులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో తిరుమల వాసులకు పూర్తి భద్రత కల్పించబడిందని నేడు భద్రత కురువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల పట్ల టీటీడీ కఠినంగా వ్యవహరించడం తగదన్నారు. తిరుమల వాసులకు ఎలాంటి అన్యాయం జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు.

రెండు కోట్లకు చేరువైన జన సంతకం

ప్రజల ఒత్తిడి మేరకు సమయం పొడిగింపు
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ వచ్చే వరకూ సంతకాల సేకరణ

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన ‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది ప్రజలు సంతకాలు చేసినట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల సమన్వయకర్త పీఎన్వీ ప్రసాద్ చెప్పారు. ప్రజల ఒత్తిడి మేరకు ఈ కార్యక్రమాన్ని మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్‌మెంట్ వచ్చేవరకు కొనసాగించనున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దీనిని గుర్తించాలన్నారు. 

శుక్రవారం ఉదయానికి హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి 1.65 కోట్ల సంతకాలు చేరాయని, వీటిని స్కానింగ్ చేయిస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు కోటి సంతకాల స్కానింగ్ పూర్తయిందన్నారు. అన్ని జిల్లాల్లో మరో 30 లక్షల సంతకాలు పూర్తయ్యాయని, అవి శుక్రవారం రాత్రిలోపు పార్టీ కార్యాలయానికి చేరతాయని చెప్పారు. ఇవి పార్టీ నాయకులు సేకరించినవి మాత్రమేనని, మరికొంత మంది అభిమానులు, వెబ్‌సైట్ల ద్వారా వస్తున్న స్పందన వీటికి అదనమని వివరించారు. 
అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కై సీబీఐని అడ్డుపెట్టుకొని జగన్‌ను వేధిస్తున్న తీరుకు నిరసనగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రారంభం నుంచి వస్తున్న భారీ స్పందనను చూస్తే ప్రజల్లో ఆ రెండు పార్టీల కుమ్మక్కు కుట్రలపై ఎంత ఆగ్రహం ఉందో తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో సంతకాల సేకరణ కొత్త కాకపోయినప్పటికీ, ఇంత భారీఎత్తున అభిమానులు, తటస్థులు స్పందించడం ఎన్నడూ లేదని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం హర్షణీయమని అన్నారు. 

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేసిన మేలును మర్చిపోని ప్రజలు సంతకాలు చేస్తూ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రికార్డు స్థాయిలో సంతకాల సేకరణ చేశారు. ‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమంలో భాగంగా ఆయన 2,58,238 మంది చేత సంతకాలు చేయించారు. వాటిని పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు అందజేశారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఆమె 
అభినందించారు. 

రాజన్నా! నువ్వు మళ్లీ రావాలి!

కుటిల రాజకీయ వికటాట్టహాసంతో రాష్ట్రం తల్లడిల్లిపోతోంది.
కాలనాగులు విరజిమ్మే విషకీలల ధాటికి
జనం భయం నీడలో కాలం వెళ్లదీస్తున్నారు.
మంచిని పంచివ్వడమే తెలిసిన రాజన్నా...
ప్రజల మనిషిగా ఎదిగే శాంతి కపోతాన్ని,
అదేనయ్యా! మా మనసుల్లో నీ అంత స్థానం
కైవసం చేసుకున్న జగన్‌బాబును ఖైదు చేశారు చూశావా?
అయినా, వీరి అజ్ఞానం చూస్తే నవ్వొస్తోంది.
జగన్... జగన్ అంటూ...
ఎగసి ఉరుకులెత్తు జనఘోష ముందు
వీరి కుప్పిగంతులు ఏపాటి?!
****** 
నీ పథకాలు వారివని చెప్పుకున్నా
నీ స్థానంలో వారి ఫొటోలు పెట్టుకున్నా
నీ విశాల హృదయం వారు తెచ్చుకోగలరా
తెచ్చుకోగలిగితే ఈ నీచకృత్యాలకు ఒడిగట్టగలరా?
ప్రజల నుండి వేరుచేసి కర్కశ రక్కసులై
బందిఖానాలో జగన్‌ను పడవేసినా
ప్రతివాని గుండె పదునైన చురకత్తియై
విలయ తాండవంబు చేయకుండునా?
ఈ అజ్ఞానుల అక్కసును
తునాతునకలు చేయకుండునా?

- ఎ.వసంతలక్ష్మి, సరిపల్లి, ప.గో.జిల్లా

కుటిల రాజకీయ నాయకులకు ఇవి ఆఖరి రోజులు

మహానేత వైఎస్సార్ అంటే మాకెంతో అభిమానం. ఆయన మనమధ్య లేరంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావటం లేదు. రాజకీయ, ధనదాహం కోసం ఒక మంచి మనిషిని బలిచేసిన రాష్ట్రమిది. రాజకీయ పదవుల కోసం, కుంభకోణాలు చేసి డబ్బును వేలకోట్లలో దోచుకుంటున్న నాయకులకు ఆఖరిరోజులు ఇవే. ఎందుకంటే 2014లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ హయాం కూడా టీడీపీలా సమసిపోతుంది. కాంగ్రెస్ పార్టీ వై.ఎస్.జగన్‌ని ఏమీ చేయలేక ఆయన్ని ప్రజలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో చంద్రబాబుతో చేతులు కలిపి తప్పుడు కేసులు పెట్టించింది. అయితేనేం- జైల్లో ఉండి కూడా జనం కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించే మనిషి జగన్. వై.ఎస్.ఆర్. కూడా పాదయాత్ర చేసినప్పుడు ప్రజల అవసరాలు స్వయంగా పరిశీలించి, వాళ్లకోసం మెరుగైన సేవలు అందించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ‘‘రాజశేఖరరెడ్డి చేసింది కాదు, నేను ఇప్పుడు చేసేదే అసలైన పాదయాత్ర’’ అంటున్నారు! 

మొన్న మధ్యంతర ఎన్నికల్లో చంద్రబాబును ప్రచారానికి రాకుండా కొన్ని గ్రామాలు అడ్డుకున్నాయి. అప్పుడే ఆ విషయం మర్చిపోయినట్లున్నారు. ఇక ముఖ్యమంత్రి విషయానికొస్తే ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు. ఎక్కడ మీటింగ్ జరిగినా ‘నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను’ అంటూ ఏమీ చేయకుండానే మురిసిపోతాడు. బొత్స సత్యనారాయణకు కుంభకోణాలు తప్పితే ప్రజల హృదయాలు గెలుచుకోవడం తెలీదు. అసలు ఆయనకు ఎలా మాట్లాడాలో తెలిస్తే కదా! చిరంజీవి అయితే హాయిగా సినిమా వేషాలు వేసుకున్నా ప్రజలు ఇంకా అభిమానించేవారేమో! పార్టీ పెట్టి సగం అభిమానాన్ని కోల్పోయాడు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి మిగిలిన కొద్ది నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నాడు. 

ఇలాంటివాళ్లను అడ్డుపెట్టుకుని అధిష్టానం డ్రామాలు ఆడుతోంది. ఈ డ్రామా క్లైమాక్స్‌కి రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. ఆ రోజుకోసం రాష్ట్రం కాదు, దేశంలోని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. జనం ఊపిరి పీల్చుకోవాలంటే ఈ అరాచక నాయకులందరి రాజకీయ జీవితానికి ఆఖరి క్షణాలు రావాలి. 

- విద్య, ఉయ్యూరు

విజయమ్మ లేఖకు దువ్వూరి స్పందన!

Written By news on Friday, January 11, 2013 | 1/11/2013

పబ్లిక్ కౌంటర్ల మూసివేత సరికాదంటూ వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాసిన లేఖకు ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పందించారు. ఆర్‌బీఐలో పబ్లిక్ కౌంటర్లను మూసివేతపై వైఎస్ విజయమ్మ ఆందోళన వ్యక్తం చేస్తూ ఆర్‌బీఐ గవర్నర్‌కు లేఖ రాశారు. విజయమ్మ లేఖకు స్పందించిన దువ్వూరి సుబ్బారావు, సేవలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఆర్ బీఐ పబ్లిక్ కౌంటర్ల సేవలు ఇకనుంచి వాణిజ్య బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉంటాయని దువ్వూరి తెలిపారు. 

Special Edition on Kutralapai Sharmila Dhvajam

Jagan Kosam Janam Santakam Extended

జగన్ కోసం జనం సంతకం పొడిగింపు

 జగన్‌ కోసం జనం సంతకం కార్యక్రమం పొడిగించినట్టు వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాకు వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ 'రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ వచ్చేంతవరకు జగన్ కోసం జనం సంతకం కార్యక్రమం కొనసాగించడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది అని అన్నారు.

ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని.. కోటిన్నరకు పైగా దాటిన సంతకాలు జరిగాయన్నారు. సేకరించిన సంతకాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకొస్తుండడంతో విపరీతమైన రద్దీ ఏర్పడిందన్నారు. జగన్ కోసం సంతకాలు 2 కోట్లకు పైగా దాటే అవకాశముందన్నారు.

సహకార ఎన్నికలపై జిల్లాలవారీ సమీక్ష

సహకార సంఘాల ఎన్నికలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించనుంది. సమావేశాల వివరాలను పార్టీ గురువారం విడుదల చేసింది. 11వ తేదీ(శుక్రవారం) విశాఖ, నెల్లూరు, రంగారెడ్డి జిల్లాలు, 12వ తేదీ(శనివారం) కర్నూలు, ఖమ్మం, చిత్తూరు, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, 16వ తేదీ(బుధవారం) ప్రకాశం, నల్లగొండ, నిజామాబాద్, 17వ తేదీ(గురువారం) గుంటూరు, పశ్చిమగోదావరి, విజయనగరం, ఆదిలాబాద్, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలలో ఈ సమావేశాలు ఏర్పాటవుతాయని వివరించింది.

http://www.ysrcongress.com/news/news_updates/sahakaara_ennikalapai_jillaalavaaree_sameeksha.html

ఇది కాలపరీక్ష మాత్రమే


భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో డెబ్భై భారీ, చిన్న ప్రాజెక్టులను ఏకకాలంలో ప్రారంభించిన ధీశాలి వై.ఎస్. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు పరచిన ఏకైక ముఖ్యమంత్రి కూడా ఆయనే. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు, ఢిల్లీలో చక్రం తిప్పిన వారు ఇప్పుడు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎల్లో మీడియా సాయంతో వై.ఎస్.పైన, ఆయన కుమారుడు జగన్‌పై బురద జల్లుతున్నారు. కానీయండి. నిజాన్ని దాచడం, సూర్యుణ్ణి ఆపటం ఎవరితరమూ కాదు. కాలపరీక్షలో జగన్ గెలుస్తాడు. సీబీఐ ఓడుతుంది. రాముడు వనవాసం చేసినా, పాండవులు అరణ్యవాసం చేసినా, జీసస్ శిలువ మోసినా, హరిశ్చంద్రుడు కాటి కాపరైనా, నలమహారాజు కురూపి అయినా, జగన్ జైలుకు వెళ్లినా అంతా కాలపరీక్షలో భాగమే. త్వరలోనే వై.ఎస్. జగన్ పాలన ఒక స్వర్ణయుగంగా ప్రారంభం కావడమన్నది తథ్యం.

- కరపాటి రాజేంద్ర కుమార్, నూజివీడు, కృష్ణాజిల్లా


తొందరలోనే తీపి కబురు అందుతుంది

నిద్రపోతున్న వాడిని లేపవచ్చు కానీ నిద్ర నటిస్తున్న వారిని ఎవరు లేపగలరు? అలాగే జగన్ అరెస్ట్ సక్రమమైతే తొంభై రోజులలో బెయిల్ వచ్చేది కానీ, అది అక్రమ అరెస్ట్ కనుకే బెయిల్ కోసం ఇంకా వేచిచూడాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో జగన్ బయటకు వస్తే ఆంధ్ర రాజకీయాల్లో సునామీ రావడం ఖాయం. అందుకే ఢిల్లీ పెద్దలు, వాళ్ల కనుసన్నల్లో నడిచే సీబీఐ జగన్ బయటకు రాకుండా అడ్డుపడుతున్నారు. కొత్త సినిమా ‘వస్తున్నా మీ ముందుకు’లో చంద్రబాబుది అంతా నటనే అని ఇప్పటికే ఆంధ్రలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది చంద్రబాబు యాత్ర. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేని ఎల్లో మీడియా అల్లిన కట్టు కథలు జగన్‌కు ఆదరణను చాలా పెంచాయి. ఎందుకంటే అవి ఎప్పుడూ ఏకపక్షంగానే కథలు అల్లి పత్రికా విలువలనే దిగజార్చాయి. ఇక ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా? జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా? అని ఎదురుచూసే ఆంధ్రప్రజలకు తొందరలోనే తీపి కబురు అందుతుంది.

- సువ్వాడ దుర్గాప్రసాద్, కాలంరాజుపేట, విజయనగరం

ఎన్ని ‘చేతులు’ అడ్డుపడినా...అరుణోదయం అయ్యే తీరుతుంది

చావుదప్పి కన్ను లొట్టబోయి ఉన్న స్థితిలో కాంగ్రెస్‌కు జవజీవాలు తీసుకొచ్చింది వైయస్ రాజశేఖరరెడ్డి అనడంలో సందేహం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా ఉన్నారు. కరెంటు కోతల్లేవు. ఆంధ్ర తెలంగాణ గొడవలు అస్సల్లేవు. ఆ పెద్దాయన వృద్ధులకు కొడుకయ్యాడు. వికలాంగులకు ఊతమయ్యాడు. రోగులకు వైద్యుడయ్యాడు. అలాంటి మహానుభావుడి తనయుడు జగన్‌ను జైల్లో పెట్టడం అన్యాయం, అక్రమం. అయినా ‘పులి’ బోనులో ఉన్నా పులే, బయటికి వచ్చినా పులే. దాని విలువ తగ్గదు. జగన్‌కి వచ్చిన పాపులారిటీ చూసి ఓర్వలేని కొన్ని రాజకీయ పార్టీలు చేసిన రాక్షసపు కుట్ర ఫలితమే జగన్ నిర్భంధం అని స్పష్టంగా తెలుస్తోంది.

జగన్‌ను జైల్లో పెట్టడం ఆయన మంచికే అని ఈ రాజకీయ విలన్లకు తెలియదు. అయినా పళ్లున్న చెట్టుకే రాళ్లు పడతాయ్. మోడువారిన చెట్టును ఎవరు పట్టించుకుంటారు? నిద్రాహారాలు లేకుండా బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ పర్యటించినప్పుడు జనంలో జగన్‌కున్న బలాన్ని కళ్లారా చూసిన కొన్ని రాజకీయ పార్టీలు ఆయనపై కుట్ర పన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. వైయస్సార్ చనిపోయిన వెంటనే ఎన్ని గుండెలు ఆగిపోయాయి! అసలు ఇంత కుముందు ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడయినా ఇంత ప్రజాభిమానం సంపాదించుకున్నాడా? అలాంటి కుటుంబం జగన్‌ది. జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఎన్ని అరచేతుల్ని అడ్డుపెట్టినా సూర్యకిరణాల్ని ఆపలేరు.

- సిహెచ్. వి.వి.ఎస్ మూర్తి, పాల్వంచ, ఖమ్మం జిల్లా

ఎన్ని వందల కి.మీ. నడిచినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు

ఎన్ని వందల కి.మీ. నడిచినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు
సీఎంగా ఉన్నప్పటి వాగ్దానాలు ఏమయ్యాయి?
విద్యుత్ చార్జీలు పెంచినా విమర్శించవేం?
నువ్వు రుణమాఫీ చేస్తానంటే ప్రజలు నమ్మాలా?

సాక్షి, హైదరాబాద్: వంద రోజులు పూర్తి చేశానని పండుగ చేసుకుంటూ ‘పైలాన్’ను ఆవిష్కరించుకున్న చంద్రబాబు తన పాదయాత్రలో చెప్పిన అబద్ధం మళ్లీ చెప్పకుండా వందలాది అబద్ధాలాడి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బాబు తన యాత్రను తొలి నుంచీ సినీ ప్రముఖుల సలహాలతోనే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ ప్రజాప్రస్థానానికి, బాబు పాదయాత్రకు నక్కకు, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందన్నారు. ఎవరు ఎలాంటి సమయంలో, ఎన్ని రోజుల్లో పాదయాత్ర చేశారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. 

వంద రోజులు కాదు కదా, ఇంకా ఎన్ని వందల, వేల కిలోమీటర్లు నడిచినా ప్రజలు బాబును విశ్వసించరన్నారు. బాబు పాదయాత్రలో ఎన్ని అబద్ధాలు చెప్పారో అంబటి ఉదహరిస్తూ... ‘‘ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుందని తాను ఆనాడే చెప్పానని, ప్రస్తుత సంక్షోభానికి అదే కారణమని యాత్రలో బాబు చెప్పారు... అంటే దీని ఉద్దేశం ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని పరోక్షంగా చెప్పినట్లు కాదా? తాను అధికారంలోకి వస్తే విద్యార్థులకు సైకిళ్లు ఇస్తానని చెబుతున్నాడు. అలాగైతే 1999లో విద్యార్థినులకు సైకిళ్లు ఇస్తానని బాబు ఇచ్చిన హామీ ఏమైంది? కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్య హామీ ఏమైంది?’’ అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తానని, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తానే ప్రవేశపెట్టానని బాబు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అవును నిజమే... తన కుమారుడు లోకేష్‌బాబు చదువుకోవడానికి సత్యం రామలింగరాజు నుంచి డబ్బు తీసుకుని ఫీజు చెల్లించారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

కిరణ్ సర్కారును విమర్శించరేం?

వైఎస్ చేసిన తప్పుల వల్లనే ఇపుడు విద్యుత్ సమస్యలు తలెత్తాయని బాబు విమర్శించడంపై అంబటి అభ్యంతరం తెలిపారు. ఇప్పటి కిరణ్ సర్కారు చేతగానితనాన్ని ఏమనకుండా వైఎస్‌ను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘రోశయ్య సీఎంగా ఉన్నపుడు విద్యుత్ చార్జీలు పెంచితే... నువ్వు నిరసన ప్రకటించకుండా మౌనంగా ఎందుకు ఉన్నావు? ఇపుడు కిరణ్ సర్కారు మళ్లీ చార్జీలు పెంచితే ఎందుకు విమర్శించడం లేదు?’’ అని నిలదీశారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తానని బాబు మభ్యపెడుతున్నారన్నారు. 2004కు ముందు అధికారంలో ఉన్నపుడు బాబుకు రైతుల రుణాల మాఫీ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చెందిన సర్వేల ఘనాపాటి ఒకరు ఇటీవల చేయించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 191 అసెంబ్లీ స్థానాలు, టీడీపీకి 11, కాంగ్రెస్‌కు 29, టీఆర్‌ఎస్‌కు 48 స్థానాలు వస్తాయని వెల్లడైందన్న విషయం తెలుసుకున్న బాబుకు మతి భ్రమించిందని... నైరాశ్యంలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. 

1,52,00,000 ‘‘జగన్ కోసం జనం సంతకం’’


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వేధించేందుకు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సీబీఐని ఉపయోగించుకొని చేస్తున్న నీచమైన కుతంత్రాలకు నిరసనగా చేపట్టిన ‘‘జగన్ కోసం జనం సంతకం’’ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం గడువు గురువారం (జనవరి 10)తో ముగిసింది. ఇప్పటిదాకా 1.52 కోట్ల సంతకాలు పూర్తయినట్లు పార్టీ కార్యాలయ సమన్వయకర్త పీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి గురువారం నాటికి 1.02 కోట్ల సంతకాలు అందినట్లు చెప్పారు. మిగతావి శుక్రవారం ఉదయానికి అందుతాయన్నారు. ప్రజల నుంచి సేకరించిన సంతకాలన్నింటినీ రెండు మూడు రోజుల్లో స్కానింగ్ చేసి సీడీలలో పొందుపరిచాలని పార్టీ ఆలోచిస్తోంది. సంతకాల హార్డ్‌కాపీలతోపాటు ఈ సీడీలను కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకోవాలని నేతలు భావిస్తున్నారు.

'ఆరెండు పార్టీలకు జగన్ ఫోబియా'

రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల నుంచి చూసి ఓర్వలేక టీఆర్ఎస్, టీడీపీలు అక్బరుద్దీన్ వ్యాఖ్యల విషయంలో తమ పార్టీని తప్పుబడుతున్నాయని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు.

అక్బరుద్దీన్ వాఖ్యలను తమ పార్టీ నేతలు ఖండించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వేరే మతాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ఇప్పటికి తమ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోందన్నారు. టీఆర్ఎస్‌, టీడీపీలకు జగన్ ఫోబియా పట్టుకుందని అందుకే విలువలు లేకుండా మాట్లాడుతున్నారని జ్యోతుల ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Ambati Rambabu Press Meet 10th Jan 2013

Special Edition on Annadatha

Written By news on Thursday, January 10, 2013 | 1/10/2013

రాజకీయాలలో చంద్రబాబు శకం ముగిసిందా!


టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన పాదయాత్ర వంద రోజుల ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంటే, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి రాజాకీయాలలో చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయిందని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ శకం ( ముగిసిందని, ఆయన ఎంత ప్రయత్నించినా పాలనాపగ్గాలు చేపట్టలేరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వంద, వెయ్యి కిలోమీటర్లే కాదు జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలలో పాదయాత్రలు చేసినా ఏ మాత్రం ప్రయోజనం ఉండదన్నారు. 

http://kommineni.info/articles/dailyarticles/content_20130110_5.php

బాబు, రాంకీ.. ఓ ఫార్మా సిటీ

ఫార్మా సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వేరొకచోట కూడా ఉంటే బావుంటుందని బీడీఎంఏ భావిం చింది. నాటి సీఎం చంద్రబాబునాయుడిని ఈ మేరకు కోరింది. దీంతో ఇతర ప్రాంతంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలని 1999లో బాబు ప్రభుత్వం భావించింది. విశాఖపట్నంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామంటూ 2000వ సంవత్సరం జూలై 18న జీవో ఎంఎస్ నెంబరు 381ని విడుదల చేసింది. ఇందుకు పరవాడ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంచుకుంది. ఫార్మా కాలుష్యం దృష్ట్యా పరవాడ సరికాదని అభ్యంతరాలొచ్చాయి. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా... పరవాడను ఖరారు చేస్తూ 2001 సెప్టెంబరు 24న జీవో ఎంఎస్ నెంబరు 501ని విడుదల చేశారు.

ఎల్ అండ్ టీకే టెండర్ల ప్రక్రియ...
బాబు హయాంలో ఏం చేసినా ఎల్ అండ్ టీకే దక్కాలి. ఫార్మా పార్కు టెండర్ల ప్రక్రియను నడిపించే బాధ్యతను ఎల్ అండ్ టీ రాంబోల్ కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్‌కు అప్పగించారు. టెండర్లు ఆహ్వానిస్తూ 2002 అక్టోబరు 31న, డిసెంబరు 17న ప్రకటనలొచ్చాయి. రాంకీ ఎన్విరో ఇంజినీర్స్, రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో 11 ఇతర సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. కానీ రాంకీతో పాటు ఏడుగురు బిడ్డర్లే ఆర్‌ఎఫ్‌పీ పత్రాల్ని ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేశారు. చివరకు జూమ్ డెవలపర్స్, మరిది, వర్ట్సిలా సంస్థలు మాత్రమే సవివర ప్రతిపాదనల్ని సమర్పించాయి. వీటిలో మారిషస్‌కు చెందిన క్రిస్సన్‌తో కలిసి జూమ్ డెవలపర్స్ వేసిన ప్రతిపాదన మాత్రమే అర్హత పొందింది. ఏపీఐఐసీ ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వలేదన్న కారణంతో జూమ్ ప్రతిపాదనను కూడా రద్దు చేశారు. 

బీవోటీగా నిబంధనలు మార్చిన చంద్రబాబు...
టెండర్ల ప్రక్రియ రద్దయిపోవటంతో చంద్రబాబు కొత్త ఆలోచన చేశారు. 2003 జూన్ 28న అధికారులతో సమావేశమై... బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ బదులు బిల్డ్ ఆపరేట్ ఓన్ ప్రాతిపదికన చేపట్టాలనుకున్నారు. అంటే నిర్మించి, నిర్వహించి ప్రభుత్వానికి అప్పగించే బదులు... సదరు ప్రయివేటు సంస్థ యాజమాన్యంలోనే ఇది కొనసాగుతుందన్న మాట. తర్వాత నెలరోజులకు... అంటే 2003 జూలైన 31న రాంకీ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చి ఏపీఐఐసీకి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన సమర్పించింది. దానిపై ఇన్‌ఫ్రా కమిటీ నేరుగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించింది. దీంతో రాంకీతో చర్చలు జరిపే అధికారాన్ని నేరుగా ఏపీఐఐసీకి అప్పగిస్తూ 2003 నవంబరు 14న చంద్రబాబు స్వయంగా ఒక నోట్‌ను ఆమోదించారు. మూడు నెలల్లో మొత్తం సిద్ధమైపోయింది. ప్రాజెక్టును అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవటం... ఎంఓయూ కుదర్చుకోవటం... చకచకా జరిగిపోయాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే బాబు ఎంఓయూ కుదుర్చుకున్నారు. చివరికి ‘రాంకీ ఫార్మా సిటీ’ సంస్థను 2004 మార్చి 11న... అంటే ఎన్నికలకు రెండు నెలల ముందు రిజిస్టరు చేశారు. 24 గంటలు కూడా తిరక్క ముందే... 2004 మార్చి 12న రాంకీతో కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిప్రకారం ఈ సంస్థలో రాంకీకి 89 శాతం, ఏపీఐఐసీకి 11 శాతం వాటా ఉంటాయి. ఏపీఐఐసీ తన వాటా మేరకు భూమిని సమకూరుస్తుంది. 

గ్రీన్ బెల్ట్‌పై వైఎస్ సమావేశాలు...
వై.ఎస్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కొన్ని సమావేశాల్లో ఫార్మాసిటీ... దాన్లో వదలాల్సిన గ్రీన్‌జోన్‌పై పలు ప్రతిపాదనలొచ్చాయి. ఫార్మా సిటీలో నో డెవలప్‌మెంట్ జోన్‌గా ప్రకటించే గ్రీన్‌బెల్ట్ ఏరియా... బౌండరీ చుట్టూ ఒక కిలోమీటర్ ఉంటే బాగుంటుందని, అది గోడకు అవతల 500 మీటర్లు, ఇవతల 500 మీటర్లు ఉంటే బాగుంటుందని, అక్కడ ఉడాయే నేరుగా వాణిజ్య ప్రాతిపదికన మొక్కలు పెంచాలని ప్రతిపాదించారు. అయితే బయటి వారి నుంచి భూముల్ని కొనకుండా కిలోమీటర్ మేర గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేయటం సాధ్యం కాదని తరువాతి సమావేశంలో ‘ఉడా’ చెప్పటంతో... దాన్ని 250 మీటర్లకు తగ్గిస్తే చాలనుకున్నారు. అయితే ఇలా చేయటం వల్ల ఫార్మాసిటీలో వెయ్యి ఎకరాల వరకూ పోతుందని ఫార్మాసిటీ యాజమాన్యం చెప్పటంతో గోడకు వెలుపల 250 మీటర్లు, గోడ లోపల మాత్రం 50 మీటర్లు ఉంటే చాలనుకున్నారు. ఇవన్నీ సంప్రతింపులే తప్ప ఎక్కడా ఒక్క జీవో కూడా జారీ కాలేదు. 

గమనించాల్సిందేంటంటే ప్రస్తుతం గోడకు లోపల గ్రీన్‌బెల్ట్ 50 మీటర్లుగా ఉంది. దీని రాంకీ సంస్థ వదిలిన స్థలం 58.95 ఎకరాలు. ఇది చంద్రబాబు నాయుడి హయాంలో ప్రతిపాదించినదే. అంటే నాటి ఒప్పందం యథాతథంగా ఉన్నట్టే. 

అసలు వైఎస్ 250 మీటర్ల గ్రీన్‌బెల్ట్ ఉండాలని ప్రతిపాదించినపుడు... తాము చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న కన్సెషన్ ఒప్పందం ప్రకారం 50 మీటర్లకే అంగీకరించామని, దానికే పరిమితం కావాలని ముఖ్యమంత్రిని రాంకీ సంస్థ కోరే అవకాశం లేదా? అలా కోరినపుడు మునుపటి ఒప్పందమే కనక ఆయన సరేననే అవకాశం లేదా? అవన్నీ వదిలేసి... సాక్షిలో పెట్టుబడి పెట్టారు కనకే ఈ మేలు చేశారనటం ఎంతవరకు సమంజసం?

గ్రీన్‌బెల్ట్‌పై రాంకీకి వైఎస్ చేసిన మేలేమీ లేదు. మునుపటి ఒప్పందాన్నే పాటించారు. దీనికే ‘సాక్షి’లో రాంకీ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందన్న సీబీఐ వాదన నిజమైతే... 2,143 ఎకరాల్ని సింగిల్ టెండరు ప్రాతిపదికగా కట్టబెట్టేసిన చంద్రబాబునాయుడికి రాంకీ ఎంత ముడుపులిచ్చి ఉండాలి? అంత హడావుడిగా ఎన్నికల ముందు ఒప్పందం కుదుర్చుకున్నారెందుకు? ఎంత ముడుపులు తిని ఉంటారు? ఇవన్నీ సీబీఐకి గానీ, ఈడీకి గానీ పట్టవా? ఎమ్మార్ కేసులో 2005 కన్నా ముందు ఏం జరిగిందనేది తాను దర్యాప్తు చేయబోనని భీష్మించుకున్న సీబీఐ... రాంకీ వ్యవహారంలోనూ అదే చేస్తోంది. ఎంతసేపూ ఈ చార్జిషీట్లో 2005 నుంచి 2009 మధ్య జరిగిన లావాదేవీల ప్రకారం... అంటోందే తప్ప అసలు రాంకీకి ఇచ్చిందెవరు? 2004 ఏప్రిల్లో ఆ సంస్థ ఏర్పాటయిన 24 గంటల్లో కన్సెషన్ ఒప్పందం ఎలా కుదిరింది? అంతకు ముందే భూములు ఎలా అలాట్ చేశారు? అనేవి దర్యాప్తు చేయటమే 
లేదు. ఎందుకని? 

వాన్‌పిక్ మాదిరే రాయితీలు...
ఫార్మాసిటీతో చంద్రబాబు హడావుడిగా 
కుదుర్చుకున్న ఈ కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం...

అమ్మకం పన్ను, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు పూర్తిగా మినహాయించారు. 
{పభుత్వానికి, ఉడాకు చెల్లించాల్సిన చార్జీలేమైనా ఉంటే వాటిని తగ్గించటానికైనా, పూర్తిగా రద్దు చేయటానికైనా అవసరాన్ని బట్టి ఏపీఐఐసీ రికమెండ్ చేస్తుంది. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అవకాశాలున్న అన్ని రాయితీలూ వచ్చేలా ఏపీఐఐసీ సహకరిస్తుంది. 
అయితే 2000 మార్చిలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొన్న విధంగా గ్రీన్ బెల్ట్ ఉండేలా డెవలపర్ చూసుకోవాలి. (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొన్న ప్రకారం చంద్రబాబు గ్రీన్‌జోన్‌కు నిర్దేశించిన మొత్తం భూమి 352 ఎకరాలు)
మొత్తం భూమిని రాంకీ పేరిటే కేటాయిస్తారు. అది ప్లాట్లుగా చేసి, తనే ధర నిర్ణయించి విక్రయిస్తుంది. దీన్లో గ్రీన్‌బెల్డ్ జోన్ ఉంటుంది. 
ఈ కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం 2005 ఫిబ్రవరి 28న ఉడాకు ‘రాంకీ’ లే ఔట్ ప్లాన్‌ను అందజేసింది. ఈ లేఔట్ ప్లాన్ ప్రకారం గ్రీన్‌జోన్ మొత్తం 352 ఎకరాలుంటుంది. దీన్లో గ్రీన్ బెల్ట్ ఏరియా 58.95 ఎకరాలు. ఈ మేరకు ఉడాకు లేఔట్ సమర్పించిన రాంకీ... ఆమోదం కూడా పొందింది. 
{Xన్ జోన్ అంటే మొత్తం ఫార్మాసిటీలో పచ్చదనానికి కేటాయించే ప్రాంతం. గ్రీన్ బెల్ట్ అంటే చుట్టూ కారిడార్‌ను ఆనుకుని ఉండే ప్రాంతం. 

పరవాడలో ఫార్మాసిటీ కోసం చంద్రబాబునాయుడు చేసిన ప్రయత్నాలను అప్పట్లో ఏపీఐఐసీ ఘనంగా ప్రకటించింది. దీనిపై 2002లో 18పేజీల ప్రజెంటేషన్‌ను కూడా తయారు చేసింది. ఈ ప్రజెంటేషన్ యథాతథంగా...

అయినవాళ్లయితే దోషులేనా?

జగతితో లింకులు చూపిస్తూ రాంకీ సంస్థకువేధింపులు
దానికి ఫార్మాసిటీ పేర 2,143 ఎకరాలు కట్టబెట్టింది చంద్రబాబే
ఎల్ అండ్ టీ ద్వారా టెండర్ల ప్రాసెసింగ్; 13 సంస్థలొచ్చినా తిరస్కృతి
తాను జోక్యం చేసుకుని బీఓటీ పద్ధతిని స్వయంగా మార్చిన బాబు
2003లో రాంకీ ముందుకు రావటంతో హడావుడిగా అప్పగింత
ఆపద్ధర్మ సీఎంగా ఉంటూనే ఓకే; గ్రీన్‌బెల్ట్‌కు 58 ఎకరాలు చాలని అనుమతి
తరవాత వైఎస్ హయాంలో గ్రీన్‌బెల్ట్ పెంపుపై చర్చ; చివరికి విరమణ
ప్రస్తుతం బాబు నాటి ఒప్పందం ప్రకారమే గ్రీన్‌బెల్ట్
బీడీఎంఏ సంస్థలకు తక్కువ ధరకే ప్లాట్లు కేటాయించాలని వైఎస్ షరతు
దీనివల్ల దాదాపు 382 కోట్ల ఆదాయాన్ని నష్టపోయిన రాంకీ
గ్రీన్‌బెల్ట్ పెంచకపోవటమే వైఎస్ చేసిన మేలంటూ రాంకీకి సీబీఐ వేధింపులు
వైఎస్ నిర్ణయాలతో రాంకీకి లబ్ధికి బదులు నష్టం.. అన్నీ వదిలి సీబీఐ దార్లోనే ఈడీ


ఆయనతో అనుబంధం ఉంటే చాలు. ఒకవేళ అనుబంధం లేకున్నా... ఆయన హయాంలో చిన్న ప్రాజెక్టు చేపడితే చాలు. ప్రాజెక్టు కూడా చేపట్టకపోయినా... అప్పటికే ఉన్న ప్రాజెక్టుకు ఆయన హయాంలో కనీసం ఒక్క అనుమతి వస్తే చాలు.. అంతెందుకు!! ఆయనతో ఎక్కడైనా ఒక చిన్న లింకు కలిస్తే చాలు. 

సోదాలు... దాడులు... ఆపై అటాచ్‌మెంట్లు..!! 
వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని వేధించడానికి సీబీఐ, ఆ వెనక ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అనుసరిస్తున్న మార్గమిదే. సీబీఐ మొదటి చార్జిషీట్‌ను అనుసరించి... అందులో పేర్కొన్న ఆస్తుల్ని అటాచ్ చేసిన ఈడీ... ఇపుడు మూడో చార్జిషీట్ దగ్గరకొచ్చింది. దాన్లో సీబీఐ పేర్కొన్న మేరకు రాంకీ సంస్థకు వైజాగ్ ఫార్మాసిటీలో ఉన్న 135.46 ఎకరాల భూమిని అటాచ్ చేసింది. ఆ సంస్థ జగతిలో రూ.10 కోట్ల మేర పెట్టుబడి పెట్టిందన్న ఆరోపణల మేరకు జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 కోట్ల ఎఫ్‌డీలను, రూ.3.2 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లను అటాచ్ చేస్తూ ఈడీ ఒక నోట్ విడుదల చేసింది. నిజంగా సీబీఐ చెబుతున్నట్లు వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఫార్మాసిటీ ద్వారా రాంకీ లబ్ధి పొందిందా? అసలు రాంకీకి ఆ ప్రాజెక్టు కేటాయించిందెవరు? ఆ మాటకొస్తే ఆ ప్రాజెక్టును తెచ్చిందెవరు? వైఎస్సార్ హయాంలో ఏం జరిగింది? రాంకీకి నిజంగా లబ్ధి కలిగిందా లేక రాంకీ నష్టపోయిందా? జగతిలో రాంకీ సంస్థ నిజంగానే పెట్టుబడి పెట్టిందా? సీబీఐ, ఈడీ చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలెంత?

బాబు- వైఎస్సార్... ఎవరేం చేశారు?

ఏం జరిగింది? 
విశాఖ ఫార్మాసిటీ ప్రతిపాదించింది చంద్రబాబునాయుడు. దానికోసం టెండర్లు పిలిచిందీ... సంస్థల్ని ఎంపిక చేసిందీ అన్నీ ఆయనే. ఆ సంస్థలన్నిటినీ తిరస్కరించి మళ్లీ టెండర్లు పిలిచింది కూడా ఆయనే. రెండవ సారి రాంకీ తప్ప ఎవ్వరూ రాకపోవటంతో... నేరుగా రాంకీకి కట్టబెట్టిన బాబు... నెలరోజుల్లో ఎన్నికలుండగా... 2004 ఏప్రిల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే రాంకీకి ఈ ప్రాజెక్టును అప్పగించి సంతకాలు కూడా చే సేశారు. రాంకీ వాటా ఎంతో, దాన్లో గ్రీన్‌బెల్ట్ ఎంత ఉండాలో.. అన్నీ అప్పుడే నిర్ణయించేశారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక... కొన్ని ప్రతిపాదనలు రావటంతో గ్రీన్‌బెల్ట్ పెంచాలనే యోచన చేశారు. అలా చేస్తే ఫార్మా సంస్థలకు స్థలం ఉండదని రాంకీ చెప్పటంతో తన ఆలోచన విరమించుకున్నారు. దీంతో బాబు హయాంలో కుదిరిన ఒప్పందమే ప్రస్తుతం అమల్లో ఉంది. 

సీబీఐ ఏమంటోంది?
కానీ సీబీఐ ఏం చెబుతోందంటే... వై.ఎస్.రాజశేఖరరెడ్డి గ్రీన్‌బెల్ట్ పెంచాలనే ప్రతిపాదన చేయటాన్ని ప్రస్తావిస్తూ... అలా పెంచకుండా ఉండటం ద్వారా రాంకీకి భారీగా లబ్ధి చేకూర్చారని. అందుకు ప్రతిగా జగతి పబ్లికేషన్స్‌లో రాంకీ సంస్థ రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టిందని!!

ఏది నిజం?
ఇక్కడ గమనించాల్సిందొక్కటే. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో గ్రీన్‌బెల్ట్ పెంచాలనే ప్రతిపాదనలు రావటం... వాటిపై ఆయన కొందరు అధికారులతో మాట్లాడటం తప్ప ఎన్నడూ దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులూ విడుదల కాలేదు. ఈ సమావేశాల్లో రాంకీ సంస్థ ప్రతినిధులు పాల్గొనలేదు కూడా. ముఖ్యమంత్రి యోచన తెలిశాక రాంకీ ప్రతినిధులు స్పందించారు. ఒక సమావేశానికి హాజరై... గ్రీన్‌బెల్ట్ పెంచితే తమకు కేటాయించిన భూమిలో సగం పోతుందని, దానివల్ల తగినన్ని పరిశ్రమలు రావని వివరించారు. దీంతో వైఎస్ తన యోచన విరమించుకున్నారు. దీంతో గ్రీన్‌బెల్ట్‌కు సంబంధించి బాబు హయాంలో కుదిరిన ఒప్పందమే ఇప్పటికీ అమల్లో ఉంది. మరి దీన్ని వైఎస్సార్ రాంకీకి లబ్ధి చేకూర్చినట్లుగా భావించవచ్చా?

పెట్టుబడుల సంగతేంటి?
ఏం జరిగింది?

రాంకీ సంస్థకు చెందిన కొందరు సబ్ కాంట్రాక్టర్లు రెండు సంస్థల ద్వారా జగతి పబ్లికేషన్స్‌లో రూ.10 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. అదేమీ రహస్యం కాదు. జగతిలో మిగతా షేర్ హోల్డర్లు కొన్న ధరకే వారు కూడా షేర్లు కొనుగోలు చేశారు. 

సీబీఐ ఏమంటోంది?
గ్రీన్‌బెల్ట్‌ను పెంచకపోవటం ద్వారా వైఎస్ రాంకీకి లబ్ధి చేకూర్చారని. ప్రతిగా ఆ సంస్థ కొందరు వ్యక్తుల ద్వారా తన సొమ్మును జగతిలోకి పెట్టుబడుల రూపంలో మళ్లించిందని!

ఏది నిజం?
టీడబ్ల్యూసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఎరెస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు జగతి పబ్లికేషన్స్‌లో 2,77,777 షేర్లు కొనుగోలు చేశాయి. అందుకోసం రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ఈ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసినవారు, డెరైక్టర్లు రాంకీలో సబ్ కాంట్రాక్టర్లు. ఇక్కడ గమనించాల్సిందొక్కటే. గ్రీన్‌బెల్ట్‌ను పెంచటం గానీ, తగ్గించటం గానీ జరగనపుడు దానివల్ల రాంకీకి లబ్ధి కలగటమనే ప్రశ్న ఎక్కడిది? అందుకోసమే వారు పెట్టుబడి పెట్టే అవకాశం ఇంకెక్కడుంటుంది?

రాంకీకి లాభమా... నష్టమా?

సీబీఐ ఏమంటోంది?
వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రాంకీకి లబ్ధి చేకూరటం వల్లే ఆ సంస్థ జగతి పబ్లికేషన్స్‌లో 10 కోట్లు పెట్టుబడి పెట్టిందని సీబీఐ చార్జిషీట్లో పేర్కొంది. ఆ మేరకే ఈడీ కూడా ఆ సంస్థకు ఫార్మాసిటీలో ఉన్న ఆస్తుల్ని అటాచ్ చేసింది.

ఏది నిజం?
వైఎస్సార్ హయాంలో గ్రీన్‌బెల్ట్ పెరగటం గానీ, తగ్గటం గానీ జరగలేదు. సరికదా... ఫార్మాసిటీలో స్థలాలన్నీ బడా సంస్థల పరం కాకుండా ఆయనో షరతు పెట్టారు. బల్క్‌డ్రగ్ ఉత్పత్తిదారుల సంఘంలో (బీడీఎంఏ) సభ్యత్వం ఉన్న సంస్థలకు ఎకరా రూ.15 లక్షలకే ఇవ్వాలని, 450 ఎకరాలను వీటికివ్వాలని షరతు పెట్టారు. ఇది బాబుతో ఒప్పందంలో లేని షరతు. దీనివల్ల ఎకరాకు రూ.85 లక్షల చొప్పున 382 కోట్లకు పైగా రాంకీ సంస్థ నష్టపోయినట్లు లెక్క. (ఎకరా కోటికి విక్రయించడాన్ని దృష్టిలో పెట్టుకుంటే). మరి వైఎస్సార్ లబ్ధి చేకూర్చినట్లు భావించాలా? మరో ముఖ్యాంశమేంటంటే ఒప్పందం ప్రకారం రాంకీ సం స్థకు అమ్మకం పన్ను, సీవరేజి ఫీజు, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్ వంటివి వెనక్కు రావాలి. వీటి విలువ దాదాపు రూ.400 కోట్ల పైనేనని అంచనా. ఇవేవీ ఇంతవరకూ ఆ సం స్థ చేతికి రాలేదు. మరి వైఎస్సార్ గనక రాంకీ సంస్థకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నారనుకుంటే ఇవన్నీ ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? దీనికి సమాధానం సీబీఐ దగ్గర ఉందా?

బాబు, రాంకీ.. ఓ ఫార్మా సిటీ 
ఫార్మా సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వేరొకచోట కూడా ఉంటే బావుంటుందని బీడీఎంఏ భావిం చింది. నాటి సీఎం చంద్రబాబునాయుడిని ఈ మేరకు కోరింది. దీంతో ఇతర ప్రాంతంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలని 1999లో బాబు ప్రభుత్వం భావించింది. విశాఖపట్నంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామంటూ 2000వ సంవత్సరం జూలై 18న జీవో ఎంఎస్ నెంబరు 381ని విడుదల చేసింది. ఇందుకు పరవాడ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంచుకుంది. ఫార్మా కాలుష్యం దృష్ట్యా పరవాడ సరికాదని అభ్యంతరాలొచ్చాయి. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా... పరవాడను ఖరారు చేస్తూ 2001 సెప్టెంబరు 24న జీవో ఎంఎస్ నెంబరు 501ని విడుదల చేశారు.

ఎల్ అండ్ టీకే టెండర్ల ప్రక్రియ...
బాబు హయాంలో ఏం చేసినా ఎల్ అండ్ టీకే దక్కాలి. ఫార్మా పార్కు టెండర్ల ప్రక్రియను నడిపించే బాధ్యతను ఎల్ అండ్ టీ రాంబోల్ కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్‌కు అప్పగించారు. టెండర్లు ఆహ్వానిస్తూ 2002 అక్టోబరు 31న, డిసెంబరు 17న ప్రకటనలొచ్చాయి. రాంకీ ఎన్విరో ఇంజినీర్స్, రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో 11 ఇతర సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. కానీ రాంకీతో పాటు ఏడుగురు బిడ్డర్లే ఆర్‌ఎఫ్‌పీ పత్రాల్ని ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేశారు. చివరకు జూమ్ డెవలపర్స్, మరిది, వర్ట్సిలా సంస్థలు మాత్రమే సవివర ప్రతిపాదనల్ని సమర్పించాయి. వీటిలో మారిషస్‌కు చెందిన క్రిస్సన్‌తో కలిసి జూమ్ డెవలపర్స్ వేసిన ప్రతిపాదన మాత్రమే అర్హత పొందింది. ఏపీఐఐసీ ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వలేదన్న కారణంతో జూమ్ ప్రతిపాదనను కూడా రద్దు చేశారు. 

బీవోటీగా నిబంధనలు మార్చిన చంద్రబాబు...
టెండర్ల ప్రక్రియ రద్దయిపోవటంతో చంద్రబాబు కొత్త ఆలోచన చేశారు. 2003 జూన్ 28న అధికారులతో సమావేశమై... బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ బదులు బిల్డ్ ఆపరేట్ ఓన్ ప్రాతిపదికన చేపట్టాలనుకున్నారు. అంటే నిర్మించి, నిర్వహించి ప్రభుత్వానికి అప్పగించే బదులు... సదరు ప్రయివేటు సంస్థ యాజమాన్యంలోనే ఇది కొనసాగుతుందన్న మాట. తర్వాత నెలరోజులకు... అంటే 2003 జూలైన 31న రాంకీ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చి ఏపీఐఐసీకి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన సమర్పించింది. దానిపై ఇన్‌ఫ్రా కమిటీ నేరుగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించింది. దీంతో రాంకీతో చర్చలు జరిపే అధికారాన్ని నేరుగా ఏపీఐఐసీకి అప్పగిస్తూ 2003 నవంబరు 14న చంద్రబాబు స్వయంగా ఒక నోట్‌ను ఆమోదించారు. మూడు నెలల్లో మొత్తం సిద్ధమైపోయింది. ప్రాజెక్టును అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవటం... ఎంఓయూ కుదర్చుకోవటం... చకచకా జరిగిపోయాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే బాబు ఎంఓయూ కుదుర్చుకున్నారు. చివరికి ‘రాంకీ ఫార్మా సిటీ’ సంస్థను 2004 మార్చి 11న... అంటే ఎన్నికలకు రెండు నెలల ముందు రిజిస్టరు చేశారు. 24 గంటలు కూడా తిరక్క ముందే... 2004 మార్చి 12న రాంకీతో కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిప్రకారం ఈ సంస్థలో రాంకీకి 89 శాతం, ఏపీఐఐసీకి 11 శాతం వాటా ఉంటాయి. ఏపీఐఐసీ తన వాటా మేరకు భూమిని సమకూరుస్తుంది. 

గ్రీన్ బెల్ట్‌పై వైఎస్ సమావేశాలు...
వై.ఎస్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కొన్ని సమావేశాల్లో ఫార్మాసిటీ... దాన్లో వదలాల్సిన గ్రీన్‌జోన్‌పై పలు ప్రతిపాదనలొచ్చాయి. ఫార్మా సిటీలో నో డెవలప్‌మెంట్ జోన్‌గా ప్రకటించే గ్రీన్‌బెల్ట్ ఏరియా... బౌండరీ చుట్టూ ఒక కిలోమీటర్ ఉంటే బాగుంటుందని, అది గోడకు అవతల 500 మీటర్లు, ఇవతల 500 మీటర్లు ఉంటే బాగుంటుందని, అక్కడ ఉడాయే నేరుగా వాణిజ్య ప్రాతిపదికన మొక్కలు పెంచాలని ప్రతిపాదించారు. అయితే బయటి వారి నుంచి భూముల్ని కొనకుండా కిలోమీటర్ మేర గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేయటం సాధ్యం కాదని తరువాతి సమావేశంలో ‘ఉడా’ చెప్పటంతో... దాన్ని 250 మీటర్లకు తగ్గిస్తే చాలనుకున్నారు. అయితే ఇలా చేయటం వల్ల ఫార్మాసిటీలో వెయ్యి ఎకరాల వరకూ పోతుందని ఫార్మాసిటీ యాజమాన్యం చెప్పటంతో గోడకు వెలుపల 250 మీటర్లు, గోడ లోపల మాత్రం 50 మీటర్లు ఉంటే చాలనుకున్నారు. ఇవన్నీ సంప్రతింపులే తప్ప ఎక్కడా ఒక్క జీవో కూడా జారీ కాలేదు. 

గమనించాల్సిందేంటంటే ప్రస్తుతం గోడకు లోపల గ్రీన్‌బెల్ట్ 50 మీటర్లుగా ఉంది. దీని రాంకీ సంస్థ వదిలిన స్థలం 58.95 ఎకరాలు. ఇది చంద్రబాబు నాయుడి హయాంలో ప్రతిపాదించినదే. అంటే నాటి ఒప్పందం యథాతథంగా ఉన్నట్టే. 

అసలు వైఎస్ 250 మీటర్ల గ్రీన్‌బెల్ట్ ఉండాలని ప్రతిపాదించినపుడు... తాము చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న కన్సెషన్ ఒప్పందం ప్రకారం 50 మీటర్లకే అంగీకరించామని, దానికే పరిమితం కావాలని ముఖ్యమంత్రిని రాంకీ సంస్థ కోరే అవకాశం లేదా? అలా కోరినపుడు మునుపటి ఒప్పందమే కనక ఆయన సరేననే అవకాశం లేదా? అవన్నీ వదిలేసి... సాక్షిలో పెట్టుబడి పెట్టారు కనకే ఈ మేలు చేశారనటం ఎంతవరకు సమంజసం?

గ్రీన్‌బెల్ట్‌పై రాంకీకి వైఎస్ చేసిన మేలేమీ లేదు. మునుపటి ఒప్పందాన్నే పాటించారు. దీనికే ‘సాక్షి’లో రాంకీ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందన్న సీబీఐ వాదన నిజమైతే... 2,143 ఎకరాల్ని సింగిల్ టెండరు ప్రాతిపదికగా కట్టబెట్టేసిన చంద్రబాబునాయుడికి రాంకీ ఎంత ముడుపులిచ్చి ఉండాలి? అంత హడావుడిగా ఎన్నికల ముందు ఒప్పందం కుదుర్చుకున్నారెందుకు? ఎంత ముడుపులు తిని ఉంటారు? ఇవన్నీ సీబీఐకి గానీ, ఈడీకి గానీ పట్టవా? ఎమ్మార్ కేసులో 2005 కన్నా ముందు ఏం జరిగిందనేది తాను దర్యాప్తు చేయబోనని భీష్మించుకున్న సీబీఐ... రాంకీ వ్యవహారంలోనూ అదే చేస్తోంది. ఎంతసేపూ ఈ చార్జిషీట్లో 2005 నుంచి 2009 మధ్య జరిగిన లావాదేవీల ప్రకారం... అంటోందే తప్ప అసలు రాంకీకి ఇచ్చిందెవరు? 2004 ఏప్రిల్లో ఆ సంస్థ ఏర్పాటయిన 24 గంటల్లో కన్సెషన్ ఒప్పందం ఎలా కుదిరింది? అంతకు ముందే భూములు ఎలా అలాట్ చేశారు? అనేవి దర్యాప్తు చేయటమే 
లేదు. ఎందుకని? 

వాన్‌పిక్ మాదిరే రాయితీలు...
ఫార్మాసిటీతో చంద్రబాబు హడావుడిగా 
కుదుర్చుకున్న ఈ కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం...

అమ్మకం పన్ను, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు పూర్తిగా మినహాయించారు. 
{పభుత్వానికి, ఉడాకు చెల్లించాల్సిన చార్జీలేమైనా ఉంటే వాటిని తగ్గించటానికైనా, పూర్తిగా రద్దు చేయటానికైనా అవసరాన్ని బట్టి ఏపీఐఐసీ రికమెండ్ చేస్తుంది. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అవకాశాలున్న అన్ని రాయితీలూ వచ్చేలా ఏపీఐఐసీ సహకరిస్తుంది. 
అయితే 2000 మార్చిలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొన్న విధంగా గ్రీన్ బెల్ట్ ఉండేలా డెవలపర్ చూసుకోవాలి. (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొన్న ప్రకారం చంద్రబాబు గ్రీన్‌జోన్‌కు నిర్దేశించిన మొత్తం భూమి 352 ఎకరాలు)
మొత్తం భూమిని రాంకీ పేరిటే కేటాయిస్తారు. అది ప్లాట్లుగా చేసి, తనే ధర నిర్ణయించి విక్రయిస్తుంది. దీన్లో గ్రీన్‌బెల్డ్ జోన్ ఉంటుంది. 
ఈ కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం 2005 ఫిబ్రవరి 28న ఉడాకు ‘రాంకీ’ లే ఔట్ ప్లాన్‌ను అందజేసింది. ఈ లేఔట్ ప్లాన్ ప్రకారం గ్రీన్‌జోన్ మొత్తం 352 ఎకరాలుంటుంది. దీన్లో గ్రీన్ బెల్ట్ ఏరియా 58.95 ఎకరాలు. ఈ మేరకు ఉడాకు లేఔట్ సమర్పించిన రాంకీ... ఆమోదం కూడా పొందింది. 
{Xన్ జోన్ అంటే మొత్తం ఫార్మాసిటీలో పచ్చదనానికి కేటాయించే ప్రాంతం. గ్రీన్ బెల్ట్ అంటే చుట్టూ కారిడార్‌ను ఆనుకుని ఉండే ప్రాంతం. 

పరవాడలో ఫార్మాసిటీ కోసం చంద్రబాబునాయుడు చేసిన ప్రయత్నాలను అప్పట్లో ఏపీఐఐసీ ఘనంగా ప్రకటించింది. దీనిపై 2002లో 18పేజీల ప్రజెంటేషన్‌ను కూడా తయారు చేసింది. ఈ ప్రజెంటేషన్ యథాతథంగా...

పోలీసుల ఎదుట లొంగిపోక తప్పని పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్యే

 భూ కబ్జా, చీటింగ్‌కు పాల్పడిన కేసులో నిందితురాలైన ఖానాపూర్ టీడీపీ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్‌కు సుప్రీంకోర్టులో సైతం చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోరుతూ బుధవారం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సుమన్ రాథోడ్‌కు అన్ని కోర్టుల్లోను చుక్కెదురు కావడంతో పోలీసుల ఎదుట లొంగిపోక తప్పనిస్థితి ఏర్పడింది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్న ఎం.నర్సింహారావుకు చెందిన భూమిని తన అనుచరుల పేరుపై నకిలీ రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా తప్పుడు పత్రాలతో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కళాశాల ప్రిన్సిపల్ బి.వి.రామారావు నుంచి రూ.1.80 కోట్లు తీసుకుని విక్రయించిన కేసులో సుమన్‌రాథోడ్‌తోపాటు ఆమె అనుచరులు, బంధువులపై కేసు నమోదైన విషయం తెలిసిందే.




కాంగ్రెస్ నేత, కామిరెడ్డిపల్లి సుధాకరరెడ్డి హత్యకు కుట్రపన్నిన కేసులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌కు జిల్లా కోర్టు బుధవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో ధర్మవరం పోలీస్‌స్టేషన్‌లో శ్రీరామ్ లొంగిపోవాలని న్యాయమూర్తి సూచించారు. అనంతరం స్టేషన్ హౌస్ ఆఫీసర్‌నుంచి బెయిల్ ఉత్తర్వులు పొంది విడుదల కావచ్చని చెప్పారు. అయితే ఈ కేసులో పోలీసులు విచారణకు పిలిచిన ప్రతిసారీ వారికి సహకరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు చేపట్టరాదని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారికి కూడా బెయిల్ మంజూరైనట్లు తెలిసింది.


sakshi

ఒకరి మతాన్ని మరొకరు దూషించడం తప్పే

వీరి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది
దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయ లబ్ధికోసం ప్రజలను రెచ్చగొట్టడం సరికాదు: మైసూరా

 వైఎస్సార్ కాంగ్రెస్‌ది పూర్తిగా లౌకిక విధానమని, పరమత దూషణ, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని అంగీకరించబోమని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరుల పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘‘అక్బరుద్దీన్.., చంద్రబాబు.., కేటీఆర్.. లేక ఇంకెవరైనా సరే, ఒకరి మతాన్ని దూషించడం తప్పు. ఇలా దూషించిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దానికెవ్వరూ కాదనరు. కానీ, కొందరు రాజకీయ లబ్ధి కోసం, వారి పార్టీల మనుగడ కోసం ఇతర పార్టీలపై బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలను సన్మార్గంలో నడిపించాలి. ప్రజల్లో సహనం పెంపొందించడమే వారు చేయాల్సిన పని. అలా కాకుండా దీన్ని అవకాశంగా తీసుకుని ప్రజలను ఇంకా రెచ్చగొట్టడం సరికాదు’’ అని చెప్పారు. ‘‘అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. అయితే, అధికారంలో ఉన్నవారు ఒకరి విషయంలో ఒక రకంగా, మరొకరి విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే ఒక రకంగా, లేకుంటే మరో రకంగా వ్యవహరిస్తామని అనడం మంచి సంప్రదాయం కాదు. చట్టం అందరినీ ఒకేవిధంగా చూడాలి. మజ్లిస్ లేదా బీజేపీ లేదా టీఆర్‌ఎస్ లేదా ఇంకెవరైనా కావచ్చు. మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం తప్పు’’ అని చెప్పారు. ‘‘నాలుకలు చీరేస్తాం.. తంతాం... వంటి రకరకాల మాటలను కొందరు వాడుతున్నారు. వారినేమన్నా అంటున్నామా? అందరి విషయంలో సమానంగా వ్యవహరించాలి’’ అని అన్నారు. బీజేపీ, మజ్లిస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మతతత్వ పార్టీలని చంద్రబాబు చేసిన విమర్శలను ప్రస్తావించగా.. ‘‘ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నపుడు బాబుకు తెలియదా బీజేపీ మతతత్వ పార్టీ అని? వారిది గురువింద విధానం. ఎదుటి వారిని ఉద్దేశించి ఒక వేలు చూపుతున్నపుడు నాలుగు వేళ్లు మన వైపు చూస్తుంటాయనేది బాబు గుర్తెరిగితే మంచిది’’ అని అన్నారు. టీఆర్‌ఎస్ విమర్శలపై స్పందిస్తూ.. ‘‘బట్ట కాల్చి మీద వేసి వెళ్లడం సరికాదు. మర్రి చెన్నారెడ్డి హయాంలో జరిగిన అల్లర్లపై అప్పట్లో విచారణ జరిపిన కమిషన్ దాని నివేదికలో ఎక్కడా వైఎస్ పేరును పేర్కొనలేదు’’ అని తెలిపారు. ‘‘రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎదుర్కోలేకే తొలినుంచీ ఇలాంటి పస లేని ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి అని చెప్పి లేనిపోని నీలాపనిందలు వేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తప్పుపట్టారు. అయినా ప్రజలు ఉప ఎన్నికల్లో అందరికీ తగిన గుణపాఠం చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇంకేమీ లేక చివరకు ఇలాంటి విమర్శలకు కూడా దిగుతున్నారు’’ అని మైసూరా అన్నారు.
సర్‌చార్జి చాలక మళ్లీ విద్యుత్ చార్జీలు పెంపా?

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై ఓ వైపు ఇంధన సర్‌చార్జిని విధిస్తూ, మరోవైపు బొగ్గు ధర పెరిగిందని చెప్పి టారిఫ్‌ను ఎందుకు పెంచుతున్నారని మైసూరా ప్రశ్నించారు. ‘‘రైల్వే శాఖ చార్జీలు పెంచినట్లు ఇప్పుడే ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.13,000 కోట్ల మేరకు విద్యుత్ టారిఫ్ పెంచడానికి ఆమోదం తెలిపింది. ఓ వైపు నుంచి కేంద్రం, మరో వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతున్నాయి. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు’ అని అన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులకు రావాల్సిన సహజవాయువును మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాజెక్టుకు తరలించారని, దీనివల్ల మన రాష్ట్రంలో 1,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగడంలేదని, ఆ భారాన్ని కూడా రాష్ట్ర వినియోగదారులపైనే వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ బెయిల్‌పై వాదించడానికి సీబీఐకి న్యాయవాదులే లేరంటారా?: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ప్రతివాదనలు చేయడానికి న్యాయవాదులు అందుబాటులో లేరని చెప్పడానికి సీబీఐకి సిగ్గుండాలని మైసూరారెడ్డి దుయ్యబట్టారు. సీబీఐ దర్యాప్తు రాజకీయ జోక్యంతోనే జరుగుతోందనడానికి ఈ ఉదంతం చాలని అన్నారు. కక్ష సాధింపులో కాంగ్రెస్ అధిష్టానానికి సీబీఐ పావులా ఉపయోగపడుతోందని అన్నారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ రెండూ రాజకీయ ఒత్తిడితోనే పని చేస్తున్నాయని దుయ్యబట్టారు. జగన్‌పై ఈ అక్రమ కేసులు రావడానికి మూలం చంద్రబాబేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు కేంద్రంలో, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో మిలాఖత్ అయి కేసులు పెట్టించారని అన్నారు. ఆయనకు ఏ చట్టం తెలుసునని మాట్లాడుతున్నారో తనకైతే తెలియదన్నారు. జగన్ కోసం జనం సంతకం కార్యక్రమంలో స్వల్ప కాలంలోనే 1.26 కోట్ల మంది స్వచ్ఛందంగా సంతకాలు చేశారంటే ఎంత స్పందన ఉందో తెలుస్తుందని అన్నారు.

సీఎంకు ఓర్పు ఉండాలి
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారికి ఓర్పు ఉండాలని, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి మాత్రం ఆ ఓర్పు లేదని మైసూరా అన్నారు. సాక్షి టీవీ ప్రైమ్‌టైమ్ షోలో పాల్గొ న్న ఆయన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఉదంతంపై మాట్లాడుతూ ‘‘ఢిల్లీలో 28న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా కిరణ్ తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. అక్బరుద్దీన్ విషయాన్ని సీఎం కొంత వ్యక్తిగతంగానే తీసుకున్నట్లుగా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ వ్యవహారంపై గవర్నర్‌తో సీఎం సమాలోచనలు జరపడం, ప్రసంగం సీడీలను తయారు చేసి బయటికి పంపడం, సంక్లిష్టమైన సెక్షన్లను కేసులో పెట్టడంవంటి అంశాలన్నీ గమనిస్తే ప్రభుత్వ జోక్యం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఓ విధంగా రాజకీయ జోక్యమే’’ అని చెప్పారు.

జనంపై రూ.32 వేల కోట్ల విద్యుత్తు భారమా?

* జనంపై రూ.32 వేల కోట్ల విద్యుత్తు భారమా? 
* కర్నూలు ధర్నాలో విజయమ్మ నిప్పులు 

సాక్షి ప్రతినిధి, కర్నూలు: తొమ్మిదేళ్ల చంద్రబాబు నాయుడు బాటలోనే ప్రస్తుత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. చంద్రబాబు తన పాలనలో కరెంటు చార్జీలు వంద శాతం పెంచితే... వైఎస్ మరణం తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్ల విద్యుత్ భారం మోపుతోందని దుయ్యబట్టారు. బాబు దారిలో నడుస్తున్న ఈ సర్కారుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం కర్నూలు ఎస్‌ఈ కార్యాలయం వద్ద నిర్వహించిన మహాధర్నాలో విజయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ కిరణ్ పాలన తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం కరెంటు ఇవ్వకుండా, భారీగా చార్జీలు పెంచుతూ ప్రజలను వేధిస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా పాలించే అర్హత లేదని చెబుతున్న చంద్రబాబే అవిశ్వాసం పెట్టకుండా కిరణ్ సర్కారును కాపాడుతున్నారన్నారు. విజయమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే...

ప్రజలపై ఇంత భారమా..?
2009 ఎన్నికల ముందు వైఎస్సార్ రెండు హామీలనే ఇచ్చారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌తోపాటు రేషన్ బియ్యాన్ని 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచుతామన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టకుండా మరో హామీ ఇచ్చారు. 2004 నుంచి 2009 వరకు కరెంటు బిల్లులు ఏవిధంగా అయితే పెంచలేదో, వచ్చే ఐదు సంవత్సరాలు కూడా బిల్లులు పెంచనని చెప్పారు. కానీ వైఎస్ చనిపోయిన తర్వాత 2010-11 నుంచి 2012- 2013 వరకు రూ.6,870 కోట్ల కరెంటు భారం మోపగా... 2013-14లో మరో రూ.12,723 కోట్ల భారం మోపేందుకు సిద్ధమయ్యారు. ఇవి కాకుండా సర్దుబాటు చార్జీల పేరుతో రూ.11,924 కోట్లు జనంపై వేశారు. 

అంటే కరెంటు చార్జీల రూపంలోనే దాదాపు రూ.32 వేల కోట్ల భారం వేశారు. ఇవేగాక బస్సు చార్జీలతో పాటు అన్ని రకాల చార్జీలు పెంచేశారు. చంద్రబాబు హయాంను మళ్లీ గుర్తుకు తెస్తున్నారు. విద్యుత్ బిల్లులు కట్టకుంటే చంద్రబాబు రైతులను వే ధించారు. కేసులు పెట్టారు. రైతులను జైలుపాలు చేశారు. ఆయన బాధలు పడలేక 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ, కరెంటు, మంచినీరు, మునిసిపాలిటీ... ఏ పన్ను పెంచలేదు. రైతులకు రూ.1,259 కోట్ల రుణాలను మాఫీ చేశారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చారు. ఒక బల్బు, ఫ్యాన్ ఉన్న ఇళ్లకు ఉచిత కరెంటు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఉచిత కరెంటు ఇవ్వడం లేదు. కరెంటు కోతలు ఇష్టారాజ్యంగా విధిస్తున్నారు. పల్లెల్లో పగలు కరెంటు ఉండడం లేదు. రాత్రిళ్లు 3 గంటలు మాత్రమే ఇస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. పరిశ్రమలు మూత పడుతున్నాయి. కొన్ని ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. 2007లో కరెంటు సమస్య ఏర్పడితే వైఎస్సార్ రూ.17కు యూనిట్ చొప్పున కరెంటు కొని రూ.3.75కు పరిశ్రమలకు అందించి సంక్షోభం నుంచి కాపాడారు. కానీ ఈ సర్కారు ఇప్పుడు టెలిస్కోపిక్ విధానాన్ని కూడా ఎత్తేసి చార్జీలను రెట్టింపు చేయాలని ఆలోచించడం దారుణం.

ప్రజా సమస్యలు గాలికొదిలి.. పాదయాత్రలా?
ప్రజలు ఇన్ని బాధలు పడుతుంటే చంద్రబాబు వాటి గురించి పట్టించుకోవడం లేదు. అసెంబ్లీ జరుగుతుంటే సమస్యలు ప్రస్తావించడానికి కూడా రాకుండా పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్రలో మాట్లాడుతూ... ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు అని బాబు చెబుతున్నాడు. కానీ అవిశ్వాసం పెట్టమంటే పెట్టరు. చంద్రబాబుకు తన వాగ్దానాలను నిలబెట్టుకున్న చరిత్ర లేదు. 1994లో రెండు రూపాయలకు కిలోబియ్యం, సంపూర్ణ మద్య నిషేధం హామీలతో ప్రభుత్వం వచ్చింది. 1999లో ఆడపిల్లలు పుడితే రూ.6వేలు డిపాజిట్, పీజీ వరకు ఉచిత విద్యుత్, సైకిళ్లు ఇస్తామని చెప్పాడు. కానీ ఏమీ జరగలేదు. 2009లో నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తానని, కలర్ టీవీలు ఇస్తానని చెప్పినాడు. 2012లో రుణమాఫీ అంటున్నాడు. ఆయన ఏ ఒక్క వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేదు. చంద్రబాబు అంత చరిత్ర హీనుడు ఎవరూ లేరు. వైఎస్ పథకాలన్నీ నేనిస్తానని చెబుతున్నాడు. అందుకు బదులు రాజన్న రాజ్యం తెస్తానని చెబితే బాగుంటుంది.

మీ బాధ ల రికార్డులను ఎవరు అధిగమిస్తారు?
వైఎస్ పాదయాత్రను అధిగమించానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ బాబు పాలనలో ప్రజలు అనుభవించిన బాధల రికార్డులను ఎవరూ అధిగమించలే రు. ఆ రోజు దేశంలో 87 పరిశ్రమలు ప్రైవేట్ వాళ్లకు ఇస్తే... చంద్రబాబునాయుడు లక్షల కోట్లు విలువ చేసే 45 పరిశ్రమలను నామా నాగేశ్వరరావుకు కట్టబెట్టారు. అదీ రికార్డే. రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వారి పక్షాన లేని రికార్డు కూడా ఆయనదే. ప్రభుత్వ ఉద్యోగులను రోడ్లపైకి తెచ్చిన రికార్డు ఆయనదే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసినవన్నీ సవాలక్ష రికార్డులే.

జగన్ మీ పక్షానే ఉన్నానని చెప్పమన్నాడు
కర్నూలులో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా మహాధర్నాకు వెళుతున్నానని జగన్‌కు చెప్పగా... ‘అమ్మా నువ్వు ప్రజల కోసం వెళుతున్నావు. వైఎస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని చెప్పు. ప్రజల కోసం ధర్నాలు చేయవలసిన అవసరం ఉంది..’ అని అన్నట్లు విజయమ్మ చెప్పారు. జగన్ బాబును అక్రమంగా జైల్లో పెట్టినందుకు నిరసనగా సంతకాల ఉద్యమం కొనసాగించి అండగా నిలవాలని కోరారు. ధర్నా అనంతరం విజయమ్మ పార్టీ నాయకులతో కలిసి ట్రాన్స్‌కో ఎస్.ఇ పీరయ్యకు కరెంటు చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కర్నూలు జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో ఎమ్మెల్యేలు చెన్నకేశవ రెడ్డి, బాల నాగిరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ జిల్లా నాయకులు కోట్ల హరిచక్రపాణి రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉన్నతుడు రాజన్న... వారసుడు జగనన్న


కేంద్రంలో ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ నినాదంతో నిరుపేదలకు దగ్గరై భూసంస్కరణలు కొంతమేర అమలుచేసి అణగారిన వర్గాల నోట ఇందిరమ్మ రాజ్యం అనిపించుకుంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ రామరాజ్యం తీసుకొచ్చి కూడా ఇందిరమ్మ రాజ్యమని చెప్పడం విశేషం. గతంలో కాంగ్రెస్‌పార్టీ అంతర్గత కలహాల వల్ల ప్రజావిశ్వాసం కోల్పోయి, ఎన్టీఆర్, చంద్రబాబులకు బంగారు, వెండిపళ్లాలతో అధికారం అప్పగించింది. అంతటి దిక్కుమాలిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండగా, మళ్లీ ఆ పార్టీలో జవసత్వాలు నింపి, చంద్రబాబు నియంత పాలన నుంచి తెలుగుజాతిని విముక్తి చేయడానికి వై.ఎస్. పాదయాత్ర చేపట్టి, రెండుసార్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఒంటిచేత్తో గెలిపించారు. ఆయన అకాల మరణంతో రాష్ట్రం తిరోగమనం పాలైంది. ఆయన ఆశయాలు కొనసాగిస్తున్న జగన్‌ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న కాంగ్రెస్‌కు నూకలు చెల్లిపోతున్నాయి. జగన్ రాజ్యాధికారంలోకి రావడం ఖాయం.

- కోట మురళీధర్, టెక్కలి, శ్రీకాకుళం

నువ్వు లేక - నువ్వు రాక

కాలుతున్న కడుపులెన్నో
ఆరుతున్న గుండెలెన్నో
కూలిపోయెను గుడిసెలెన్నో
మూగబోయెను గొంతులెన్నో
ఎండిపోయెను పంటలెన్నో
రాలిపోయెను ఆశలెన్నో
ఎందుకంటే ఏమిటంటే
నువ్వు లేక నువ్వు రాక

ఆగిపోయెను శ్వాసలెన్నో
ఆవిరయ్యెను బతుకులెన్నో
పేదవాడి గుండె పగిలెను
పరిశ్రమలకు ఆయువు మూడెను
కార్మికులకు కాటి మిగిలెను
ఆక్రోశించెను హృదయాలెన్నో
ఎందుకంటే ఏమిటంటే
నువ్వు లేక నువ్వు రాక

నిన్ను నమ్మి నిరీక్షించే జనంలోకి వచ్చేయి
ఆరుతున్న ఆశలకు ఆయువై విచ్చేయి.

- అనంతు నాగయ్యగౌడ్, గరిడేపల్లి, నల్గొండ

జనం ముందు సీబీఐ ఎంత? చంద్రబాబు ఎంత?

అన్నా! నీవు బయటలేని కొత్తసంవత్సరం ఎందుకు? సంక్రాంతి ఎందుకు? నీవు బయటికొచ్చి ప్రజలమధ్య తిరిగే రోజే మాకు పండుగ రోజు. అన్నా! రాష్ట్ర ప్రజలు అమాయకులు కారు. వారికి అన్నీ తెలుసు. అయినా నీవు ప్రజల మనిషివి. నీవు జైల్లో ఉండటమేంటి? సీబీఐ వాళ్లు కాంగ్రెస్‌కు తొత్తులుగా మారారు. ఈ కాంగ్రెసే సీబీఐని పావులా వాడుకుంటోంది. ఆ విషయం ప్రజలకు ఎప్పుడో తెలుసు. దానికి తోడుగా రాష్ట్రంలో పనికిమాలిన, నీతిమాలిన, విలువలు లేని, ప్రతిపక్షంగా ఉండటానికి కూడా అర్హత లేని టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. దొంగనాటకం ఆడి అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కై, చీకట్లో దొంగచాటుగా వెన్నుపోటుదారుడైన చంద్రబాబు చిదంబరాన్ని కలుస్తూనే ఉన్నాడు. వీళ్ల ఆటలు చాలా రోజులు సాగవు. చంద్రబాబు ఆడే నాటకాలు అందరూ చూస్తున్నారు. కడప ఎన్నికల్లోనే భారీ మెజార్టీ ఇచ్చి జగనన్నను ప్రజాకోర్టులో నిర్దోషి అని ప్రజలు ఏనాడో తీర్పు చెప్పారు. ఇక వారి ముందు కోర్టులెంత? కాంగ్రెస్, చంద్రబాబు ఎంత? 2014లో జగన్ సీఎం కావడం ఖాయం.

- కె.బి.ప్రసాద్, కడలూరు, తమిళనాడు

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com

పేదలకష్టాలు పట్టని ప్రభుత్వాలు: మైసూరా

Written By news on Wednesday, January 9, 2013 | 1/09/2013

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పేదల కష్టాలు పట్టడం లేదని వైఎస్‌ఆర్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు మైసూరా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎడాపెడా ఛార్జీలు పెంచి పేదలపై పెనుభారం మోపుతున్నాయన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. 
వైఎస్‌ఆర్ సీపీది లౌకిక విధానం అని ఆయన స్పష్టం చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. మత విద్వేషాలు, ప్రాంతీయతత్వాన్ని ఎవరు రెచ్చగొట్టినా తప్పే అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విషయంలో సీబీఐ దర్యాప్తు దారుణంగా ఉందన్నారు. జగన్‌కు మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారని తెలిపారు.

Jagan Kosam Janakoti Santakam Promo 5

Jagan Kosam Janakoti Santakam Promo 4

YS Vijayamma Dharna against Power Charges hike at Kurnool

YS Vijayamma Dharna in Kurnoo

Special Edition on Sharmila Aarogyasri

Jagan kosam Janam Santakam' gets overwhelming response

YSRCP stages dharna against power sur charges

విద్యుత్ సబ్ స్టేషన్లు ముట్టడించిన వైఎస్ఆర్

విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనకు, విద్యుత్ కోతలకు నిరసన తెలుపుతూ, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడించారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ ఉచిత విద్యుత్ హామీ అమలుపై షరతులను రైతులు భరించలేరని తెలిపారు. డిస్కంలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతులపై విద్యుత్ భారం వేస్తున్నాయని విమర్శించారు. అధికారులు వ్యవసాయ బిల్లులను ఇంటి విద్యుత్ బిల్లులుగా చూపుతున్నారన్నారు. అధికారుల మోసంపై ఈఆర్‌సీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలను పెంచొద్దంటూ మంత్రులు, పార్టీ నేతలు మాట్లాడటంలో తప్పేమీ లేదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాల నిరసనలు కూడా సమర్ధనీయమేన్నారు. 

రంగారెడ్డి జిల్లా శంకరంపల్లిలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ముట్టడించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మహేశ్వరంలో కార్పొరేటర్ దీపాసురేఖ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ఎదుట వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. నల్గొండ జిల్లా కోదాడలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ముట్టడించారు. సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేపట్టిన వైఎస్‌ఆర్ సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తుంగతుర్తి సబ్‌స్టేషన్ ఎదుట విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైఎస్‌ఆర్ సీపీ ధర్నా నిర్వహించింది. భువనగిరిలో ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం ఎదుట వైఎస్‌ఆర్ సీపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. 

వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో వైఎస్‌ఆర్ సీపీ నేత జెన్నారెడ్డి, మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. నర్సంపేట సబ్‌స్టేషన్ ముందు వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నర్సంపేట మండలం లక్కేపల్లిలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి, రాస్తారోకో చేశారు. 

కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో ఆరుగురు ట్రాన్స్‌కో సిబ్బందిని నిర్బంధించి రైతుల రాస్తారోకో నిర్వహించారు. వేములవాడ సబ్‌స్టేషన్ ముందు వైఎస్‌ఆర్ సీపీ నేత ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సిరిసిల్లలో వైఎస్‌ఆర్ సీపీ నేత కె.కె.మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సెస్ కార్యాలయం ముట్టడించారు. మంథనిలో వైఎస్‌ఆర్ సీపీ నేత పుట్ట మధు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. హుస్నాబాద్‌లో వైఎస్‌ఆర్ సీపీ నేత సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేశారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపేట సబ్‌స్టేషన్‌ను వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు ముట్టడించారు. విద్యుత్ కోతలను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. 

తూర్పుగోదావరి జిల్లా తునిలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు ధర్నా చేశారు. రాస్తారోకో నిర్వహించారు. కృష్ణా జిల్లా మైలవరం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్‌బాబు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 
నెల్లూరు జిల్లా కావలిలో సబ్‌స్టేషన్ ఎదుట వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ ధర్నా చేశారు. గుంటూరు జిల్లా అచ్చంపేట సబ్‌స్టేషన్ ను వైఎస్ఆర్ సిపి నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. విద్యుత్ కోతలకు వారు నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ముట్టడించారు. కొండపి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ధర్నా చేశారు. 

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. రాస్తారోకో నిర్వహించారు. అనంతపురం జిల్లా లేపాక్షిలో వైఎస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించారు. మడకశిరలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఏడీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ధర్మవరంలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రాస్తారోకో నిర్వహించారు.

Popular Posts

Topics :