2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Happy new year 2015

Written By news on Wednesday, December 31, 2014 | 12/31/2014


భూముల కోసం రైతులను భయపెడుతున్నారు:కల్పన


భూముల కోసం రైతులను భయపెడుతున్నారు:కల్పనఉప్పులేటి కల్పన
విజయవాడ: ఏపీ రాజధాని ప్రతిపాధిత ప్రాంతంలో భూసేకరణ కోసం రైతులను భయపెడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. ఆమె ఈ రోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ  రాష్ట్రంలో చంద్రబాబు పాలన అరాచకం సృష్టిస్తోందన్నారు. అధికార పార్టీ చెప్పిందే చట్టం, శాసనం అన్నవిధంగా పాలన సాగుతోందని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడినా, అవి చట్టపరమైనట్లుగా మాట్లాడుతున్నారన్నారు.

టీడీపీ వచ్చిన ఏడు నెలల కాలంలో 22 మంది వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలను హత్య చేశారని ఆమె చెప్పారు. తుళ్లూరు పంటపొలాల ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. రైతులను భయపెట్టడం కోసమే టీడీపీ నేతలు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కల్పన డిమాండ్ చేశారు.

వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు


వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు  2015 చిరస్మరణీయ సంవత్సరం కావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

2015లో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని వైఎస్ జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సుకు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని తెలుగు ప్రజలకు మేలు చేయాలని వైఎస్ జగన్ కోరారు.

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం


అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ఆగంతకుల దహనకాండతో భయాందోళనకు గురవుతున్న రాజధాని నిర్మాణ ప్రాంత గ్రామాలను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సందర్శించి బాధిత రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చింది. ఈ ఘటనపై తక్షణం  సీబీఐ లేదా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అంతేగాక నిందితులను వెంటనే పట్టుకుని దీని వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేయాలని కోరింది. ముందుగా బాధిత రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని లేని పక్షంలో వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించింది.

 అరండల్‌పేట (గుంటూరు) : రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన తుళ్లూరు, తాడేపల్లి మండల గ్రామాల్లో ఆదివారం రాత్రి కొందరు ఆగంతకులు సాగించిన దహనకాండకు రైతుల పొలాల్లోని షెడ్లు, వెదురుబొంగులు, డ్రిప్ పరికరాలు మొత్తం 13 చోట్ల దహనమయ్యాయి. ఈ ప్రాంతాల్లో రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ మంగళవారం పర్యటించింది.

 తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దం డ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో దహనమైన షెడ్లు, అరటితోటలను పరిశీలించి బాధిత రైతులతో నేరుగా మాట్లాడింది. వారికి అండగా నిలుస్తామని తెలిపింది.
  రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వబోమంటూ తీర్మానాలు చేసిన గ్రామాల్లోని ఈ సంఘటనలు జరిగిన తీరు చూస్తుంటే ఎవరో కావాలనే ఇదంతా చేసినట్లుగా అభిప్రాయపడింది.

 జరిగిన సంఘటనలపై వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి నిందితులపై చర్యలు చేపట్టాల్సిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బాధ్యత మరిచి పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించింది.ప్రభుత్వం చేతిలో పోలీసు వ్యవస్థ ఉండగా, వారితో విచారణ జరపకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడింది.

 పర్యటన సాగిందిలా....
 జిల్లా కేంద్రం గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరిన రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సాయంత్రం వరకు తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దాండ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో పర్యటించి రైతులను పరామర్శించింది.

 తొలుత కమిటీ లింగాయ పాలెం గ్రామానికి చేరుకుంది. బాధిత రైతు గుంటుపల్లి మధుసూదనరావు పొలం వద్దకు వెళ్లి దహనమైన వెదురు బొంగులు, పైపులైనులు, అరటి తోటను పరిశీలించింది. ఈ సందర్భంగా  రైతు తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే... ‘పొలంలో 3,500 వెదురు బొంగులు, 300 అరటి చెట్లు, డ్రిప్ పైపులు, షెడ్డు తగలబెట్టారు. ఎంతలేదన్నా రెండున్నర లక్షల నష్టం జరిగింది. నాకు పార్టీలతో సంబంధం లేదు. ఇలా ఎందుకు చేశారో, ఎవరు చేశారో కూడా అర్థం కావడం లేదు. నాకు నష్టపరిహారం అందకపోయినా ఇబ్బంది లేదు, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూస్తే చాలు.’

 అదే గ్రామంలో మరో పొలం వద్దకు వెళ్లి కమిటీ పరిశీలిస్తుండగా అక్కడికి చేరుకున్న కౌలు రైతు చిన్న మీరాసాహెబ్ మాటల్లో ఆవేదన వ్యక్తమైంది. ‘ఎకరం పొలం రూ. 30వేలకు కౌలుకు తీసుకుని పంట వేశా, 150 వెదురు బొంగులు, 100 అరటి చెట్లు, డ్రిప్ పైపులు తగలబడ్డాయి. లక్షన్నర వరకు నష్టపోయినట్టే. ఎవరో రెక్కీ నిర్వహించి మరీ వరుసగా తగలబెట్టినట్టు అర్థమవుతోంది. నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలి.’

  అక్కడి నుంచి ఉద్దండ్రాయునిపాలెంలో బూడిదగా మారిన పొలాన్ని పరిశీలించిన కమిటీ  రైతు జొన్నలగడ్డ వెంకట్రావును పరామర్శించడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరాడు. ‘ నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. మరో 16 ఎకరాలు కౌలుకు తీసుకుని అరటి వేశా.  నెల కిందట 14 వేల వెదురు బొంగులు, 150 ఎరువు బస్తాలు, జనరేటర్ డ్రిప్ పైపులు తగలబెట్టారు.10 లక్షలకు పైగానే నష్టపోయా. నేను రాజధానికి భూమి ఇచ్చేందుకు నిరాకరించాను. అయితే నాతో గ్రామంలోని వారంతా సోదర భావంతో ఉంటారు. ఎందుకిలా చేశారో తెలియడంలేదు.’

 అనంతరం కమిటీ వెంకటపాలెం గ్రామాన్ని సందర్శించింది. పలువురు రైతులను పరామర్శించి మనోధైర్యం నింపే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ, తాము ఎట్టి పరిస్థితుల్లో రాజధానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు.
 ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో  రైతు లంకా రఘునాధబాబు పొలంలో ఓ ఆగంతకుడు నిప్పు అంటిస్తుండగా, వెంబడించడంతో పారిపోయినట్టు స్థానికులు తెలిపారు.

 ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, రేపటి రోజున ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రతి రైతులో కనిపిస్తుందన్నారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే సమయంలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న మంత్రులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పచ్చని గ్రామాల్లో చిచ్చు పెట్టేందుకు కొంత మంది అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

  ఈ పర్యటనలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఉప్పులేటి కల్పన, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ, రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ పూనూరి గౌతమ్‌రెడ్డి, తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి హెనీ క్రిస్టినా, వైఎస్సార్ సీపీ మైనార్టీ, ఎస్సీ, సేవాదళ్ విభాగ కన్వీనర్‌లు సయ్యద్ మాబు, బండారు సాయిబాబు ఇంకా నాయకులు కొత్త చిన్నపరెడ్డి, దర్శనపు శ్రీనివాస్, రాచకొండ ముత్యాలరావు, సుద్దపల్లి నాగరాజు, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పంటలు కాలిపోయిన గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పర్యటన

Written By news on Tuesday, December 30, 2014 | 12/30/2014


పంటలు కాలిపోయిన  గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పర్యటన
గుంటూరు: గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో కాలిపోయిన పంట పొలాలను వైఎస్ఆర్ సీపీ రాజధాని రైతుహక్కుల పరిరక్షణ కమిటీ పరిశీలించింది. తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని ఆరు గ్రామాల్లో 13 చోట్ల పంట పొలాలు, తోటలు, షెడ్లు, వెదురుబొంగులు, డ్రిప్ పరికరాలను గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి తగలబెట్టిన విషయం తెలిసిందే. తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దండరాజుపాలెం, వెంకటపాలెం ఈ గ్రామాలలో కమిటీ పర్యటించింది. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత రైతులను కమిటీ సభ్యులు పరామర్శించారు.

రైతులకు అండగా ఉంటామని కమిటీ సభ్యులు రైతులకు హామీ ఇచ్చారు. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఈ గ్రామాలలో పర్యటించినవారిలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, గొట్టిపాటి రవి, ఉప్పులేటి కల్పన, వైఎస్ఆర్ సీపీ నేతలు నాగిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మర్రి రాజశేఖర్,  క్రిస్టియానా తదితరులు ఉన్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ఈ సంఘటనపై సీబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రజ్యోతి ఎండీ, ఎడిటర్లకు లీగల్ నోటీసులు

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్ లకు వైఎస్ఆర్ సీపీ లీగల్ నోటీసులు ఇచ్చింది. 13.12.2014న విశాఖపట్నం ఎడిషన్ లో ప్రచురించిన ఆర్టికల్ పై క్షమాపణ చెప్పాలని  నోటీస్ లో ఆ పార్టీ డిమాండ్ చేసింది.

నోటీస్ అందిన వారం రోజుల లోపల క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి ఆర్టికల్ ప్రచురించినట్లు ఆ నోటీస్ లో పేర్కొన్నారు.

వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశామని దాడి


వైఎస్సార్ సీపీకి ఓటెయ్యడం నేరమా?
మార్కాపురం : ఆరు నెలల క్రితం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమపై దాడి చేస్తున్నారని మార్కాపురం మండలం చింతగుంట్లకు చెందిన దళితులు పులుకూరి వెలుగొండయ్య, రూతమ్మ, మరియమ్మ, కొండమ్మ, తదితరులు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తికి తాము ఓట్లు వేయలేదన్న కోపంతో తమపై అక్రమంగా కేసులు బనాయిస్తూ ఇళ్లకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

క్రిస్మస్‌కు స్వగ్రామానికి వెళ్తే 24వ తేదీ రాత్రి తమపై దాడికి ప్రయత్నించటంతో తప్పించుకుని మార్కాపురం పట్టణానికి వచ్చి బంధువుల ఇంట్లో తల దాచుకున్నామన్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన పొలాల్లో టీడీపీ నేతలు జేసీబీలతో గుంతలు తీయించారని, సాగు చేసుకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి ఓట్లు వేయటమే తాము చేసిన నేరమా.. అని దళితులు ప్రశ్నించారు.

బాధితులకు అండగా ఉండాలి :ఆర్డీఓను కోరిన ఎమ్మెల్యే జంకె
చింతగుంట్ల దళితులకు అండగా ఉండాలని ఆర్డీఓను ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కోరారు. సోమవారం బాధితులతో ఆయన ఆర్డీఓను కలిశారు. వాటర్‌షెడ్ పథకం నెపంతో తమ పార్టీ కార్యకర్తల పొలాలను ప్రత్యర్థులు పొక్లెయిన్లతో త వ్విస్తున్నారని, పొలం గట్ల వెంబడి ఉన్న చిల్లకంపను వారే కొట్టుకుని అమ్ముకుంటున్నారని, ఈ సంఘటనపై విచారణ జరపాలని ఆర్డీఓను ఎమ్మెల్యే కోరారు.

బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ప్రభుత్వ పథకాల అమలులో వివక్ష చూపొద్దన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తానని, సర్వేయర్‌ను పంపించి పొలం హద్దులు చూపిస్తానని, వాటర్‌షెడ్ అధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యేకు ఆర్డీఓ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు మార్కాపురం ఎంపీపీ ఎల్.మాలకొండయ్య ఉన్నారు.

జనం కోసమే జగన్ దీక్ష


జనం కోసమే జగన్ దీక్ష
 సాక్షి, రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనవరిలో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టే రెండురోజుల నిరశన దీక్షను విజయవంతం చేయాలని పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఉభయగోదావరి జిల్లాల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీక్ష సందర్భంగా కార్యాచరణపై చర్చించేందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు.. రాజమండ్రిలో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసన సభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే జగన్ దీక్షకు ఉపక్రమిస్తున్నారని చెప్పారు. వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేస్తుంటే గోడును ప్రధాన ప్రతిపక్షానికి చెప్పుకోవాలని రైతులు చూస్తున్నారన్నారు. అధికారంలోకి రాక ముందు చంద్రబాబు ఏం చెప్పారు, వచ్చాక ఏం చేస్తున్నా చేస్తున్నదేమిటి అన్నదానిపై నాడు, నేడు అంటూ ఊరూరా ఫ్లెక్సీలు కట్టి ఎండగట్టాలన్నారు.

 ఇది కోతల సర్కారు : సాయిరెడ్డి
 పార్టీ ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలకు మధ్యలో ఉంటుం దన్న ఉద్దేశంతోనే నిరశన దీక్షకు జగన్ తణుకును ఎంపిక చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పెన్షన్లు ఇలా అన్నింటిలో కోత పెడుతోందని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.

 గుణపాఠం నేర్పుదాం : ధర్మాన
 పార్టీ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన మాట్లాడుతూ వైఎస్ జగన్ దీక్ష ప్రభుత్వానికి గుణపాఠం కావాలన్నారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలబడలేక పోతోందని ప్రజలను నమ్మించాలని కుయుక్తులు పన్నుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై గళమెత్తి, ప్రభుత్వ వైఫల్యాలను సమర్థంగా ఎండగట్టాం. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తత్తరపాటుకు గురయ్యారు. అందుకే కొత్త గేమ్‌కు తెరలేపింది. ఈ దీక్షలను విజయవంతం చేయడం ద్వారా ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడతామన్న విశ్వాసానికి బలం చేకూర్చాలి’ అన్నారు.

 ‘పశ్చిమ’ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి
 పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ దీక్షను విజయవంతం చేసేందుకు పశ్చిమగోదావరి జిల్లా శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయన్నారు. ప్రభుత్వ హామీలను నమ్మి మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళలు ఉభయగోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్నారన్నారు. తణుకు మాజీ ఎమ్మెల్యే  కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీ బాండ్లంటూ ప్రభుత్వం ఇచ్చిన కాగితాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావని బ్యాంకులు తిప్పి పంపుతున్నాయ న్నారు. చంద్రబాబు మోసపూరిత వ్యక్తిత్వాన్ని రైతులు ఇప్పుడు గమనిస్తున్నారన్నారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల పార్టీ శ్రేణులు జగన్ దీక్షను విజయవంతం చేయాలన్నారు.

 పార్టీ తణుకు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ చీర్ల రాధయ్య మాట్లాడుతూ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ చేస్తున్న తొలి దీక్షను విజయవంతం చేసేందుకు తామంతా సిద్దంగా ఉన్నామన్నారు. సమావేశంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, తానేటి వనిత, తెల్లం బాలరాజు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు,  తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ తోట గోపీ, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త  తలారి వెంకట్రావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

టీడీపీ నేతల దాడి : కోమాలో ఎమ్మార్వో

Written By news on Monday, December 29, 2014 | 12/29/2014


అనంతపురం : అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. తము చెప్పినా రేషన్ డీలర్ ను మార్చలేదన్న కారణంతో గుడిబండ తహసీల్దార్ (ఎమ్మార్వో) పై టీడీపీ కార్యకర్తలు సోమవారం దాడి చేశారు. ఆ దాడితో తీవ్రంగా గాయపడిన తహసీల్దార్ కోమాలోకి వెళ్లారు. దీంతో ఆయన్ని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
తహసీల్దార్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడే చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. అయితే టీడీపీ నేతల బెదిరింపులు భరించలేక ఇప్పటికే అయిదుగురు ఎమ్మార్వోలు దీర్ఘకాల సెలవుపై వెళ్లారు.  టీడీపీ నేతల దౌర్జన్యాలకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 

మంత్రి పత్తిపాటికి చేదు అనుభవం

 గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెనుమాకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి పత్తిపాటి పుల్లారావుకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. ఏపీ రాజధాని గ్రామాల్లో పంటలు తగలబడిన విషయం తెలిసిందే. దాంతో మంత్రి ...పెనుమాక గ్రామంలో సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి చేసిన వ్యాఖ్యలుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో మంత్రి తన పర్యటనను పూర్తి చేయకుండానే వెనుదిరిగారు.

మంత్రి బాధితుల మాటలు వినకుండా వేరేవారి మాటలు వింటారా? అంటూ రైతులు ఆగ్రహం చెందారు.  ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ జై జవాన్ ...జై కిసాన్ అనకుండా... ఏపీ సర్కార్ ..'జై జపాన్...కిల్ కిసాన్' అన్నచందంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

రైతులపై చేయి వేస్తే ఊరుకునేది లేదు


'రైతులపై చేయి వేస్తే ఊరుకునేది లేదు'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: రాజధాని గ్రామాల్లో రైతులను భయభ్రాంతులకు గురి చేసి భూములు లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.  స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకోవాలని.. ఇవ్వని రైతులను వదిలేయాలని అంబటి తెలిపారు. ఈ క్రమంలో రైతులపై చేయి వేస్తే ఊరుకునేది లేదని అంబటి హెచ్చరించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని గ్రామాల్లో దుశ్చర్యపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలన్నారు.
 
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బురదజల్లే యత్నం చేస్తున్నారన్నారు. రాజధాని రైతులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు పార్టీకి చెందిన వ్యక్తులే ఈ ఘటన పాల్పడి ఉంటారని అనుమానాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇది ప్రజాస్వామ్యమా?రాక్షస పాలనా? అన్న అనుమానం ప్రజలకు కలుగుతోందన్నారు.

చంద్రబాబే ఈ సంఘటన వెనుక ఉన్నారా?

 ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో అరాచకంపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ నేతలు పార్థసారధి, మేరుగ నాగార్జున సోమవారమిక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  తుళ్లూరు మండలంలో పలు గ్రామాల్లో దుండగులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.  వైఎస్ఆర్ సీపీ నేతలు ఈరోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ కుట్ర వెనుక రాష్ట్ర ప్రభుత్వమే ఉందని ప్రజలు అనుమానిస్తున్నారని విమర్శించారు. పంటలు పండే భూములను లాక్కోవాలని చూడటం... రైతులు ఎదురు తిరిగితే సర్కార్ రాక్షసంగా వ్యవహరిస్తోందన్నారు.

చంద్రబాబే ఈ సంఘటన వెనుక ఉన్నారా? అని ప్రజలు అనుమానిస్తున్నారని పార్థసారధి ఆరోపించారు. ఈ ఘటనపై గవర్నర్ వెంటనే స్పందించి కేంద్రానికి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. తమకు పోలీసులపై నమ్మకం లేదన్నారు. కండితుడుపు చర్యగా విచారణ జరిపితే సహించేది లేదని అన్నారు. అందరూ సంతోషంగా ఏర్పాటు చేసుకోవాల్సిన రాజధానిని ...బలవంతంగా,అమానుషంగా వ్యవహరించటం సరికాదన్నారు. ఈ సంఘటన వెనుక ఉన్న శక్తులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ నేతలు కోరారు.

విభేదాలు సృష్టించి.. హీరో కావాలని చూస్తున్నారు

Written By news on Sunday, December 28, 2014 | 12/28/2014


'విభేదాలు సృష్టించి.. హీరో కావాలని చూస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పార్ధసారథి మండిపడ్డారు. మంత్రుల్లో విభేదాలు సృష్టించి చంద్రబాబు హీరో కావాలని చూస్తున్నారని పార్ధసారథి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ సర్కార్ అన్ని చోట్ల విఫమైందన్నారు. అటువంటి టీడీపీ సర్కార్ లోకి వైఎస్సార్ సీపీ సభ్యులు ఎందుకు వెళతారని పార్ధసారథి ప్రశ్నించారు.
 
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా సమర్ధవంతంగా పనిచేస్తున్నారని ఆ పార్టీ మంత్రులే చెబుతున్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు ఆరు నెలల్లో సాధించినది ఏమీ లేదని ఆ పార్టీ ఎంపీలే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేఈ లాంటి బలమైన నేతను అణదొక్కేందుకు యత్నాలు జరుగుతున్నాయన్నారు. రుణమాఫీ సక్రమంగా జరగలేదని స్పీకరే అన్నారని పార్ధసారథి తెలిపారు.

బాబు సర్కారు నిర్లక్ష్యం వల్లే వృద్ధులకు కష్టాలు: అంబటి


బాబు సర్కారు నిర్లక్ష్యం వల్లే వృద్ధులకు కష్టాలు: అంబటి
 వైఎస్సార్‌సీపీ నేత అంబటి ఆగ్రహం 
 సాక్షి, హైదరాబాద్: పింఛన్లు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నందువల్లే వృద్ధుల ప్రాణాలు పోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం కనమనపల్లెలో ఓ వృద్ధుడు ఆకలికి తాళలేక మరణించాడని ఆవేదన వ్యక్తంచేశారు.

చంద్రబాబు గద్దెనెక్కిన తరువాత 4 నెలలుగా ఆ వృద్ధునికి పింఛన్ నిలిపివేశారని, వారం రోజులుగా తినడానికి ఏమీ లేక అతను ఆకలితో మరణించాడని, ఇది చాలా దారుణమైన ఘటనని అన్నారు. ఆ వృద్ధునికి ఏడెనిమిదేళ్లుగా పింఛను వస్తోందన్నారు. అయితే, వయస్సు ధృవీకరణ పత్రం లేదన్న కారణంతో కొద్ది నెలల క్రితం పింఛన్ నిలిపి వేశారని తెలిపారు.బయోమెట్రిక్ విధానం వల్ల 70, 80 ఏళ్ల వృద్ధుల చేతి వేళ్లు అరిగిపోయి పింఛనుకు అర్హత పొందలేక పోతున్నారని తెలిపారు.

వాటా ప్రకారం నీరు అందించాలి

Written By news on Saturday, December 27, 2014 | 12/27/2014


వాటా ప్రకారం నీరు అందించాలి: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ముండ్లమూరు : మోదేపల్లి మేజర్ పరిధిలోని సాగర్ ఆయకట్టు భూములకు వాటా ప్రకారం నీరు అందించి రైతులను ఆదుకోవాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి సంబంధితాధికారులకు ఆదేశించారు. దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డితో కలిసి శుక్రవారం సాయంత్రం పర్యటించారు. పీబీసీ పరిధిలోని రవ్వారం లాకుల వద్ద జమ్మలమడక మేజర్, మోదేపల్లి మేజర్లకు సంబంధించిన నీటి పంపకాలు ఎలా జరుగుతున్నాయనే వివరాలు
అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మోదేపల్లి మేజర్‌లో ఆయకట్టు గ్రామాలైన ఉమామహేశ్వరపురం, ఈదర, కొమ్మవరం, వేములబండ, అయోధ్యనగర్, రమణారెడ్డిపాలెం, నాయుడుపాలెం, పూరిమెట్ల గ్రామాల్లోని దిగువ భూములకు నీరు సరఫరా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండల వైసీపీ కన్వీనర్ సుంకర బ్రహ్మారెడ్డి ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. నాట్లు వేయడం పూర్తి కాకముందే అధికారులు వారాబంధి విధానాన్ని అమలు చేస్తున్నారని, మోదేపల్లి మేజర్‌కు వాటా ప్రకారం 365 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా 150 క్యూసెక్కులకు మించి రావడంలేదని ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం మోదేపల్లి మేజర్‌లో 2,300 ఎకరాలలో,  జమ్మలమడక మేజర్‌లో 1600 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారని, సాగు ఎక్కువగా ఉన్న మోదేపల్లి మేజర్‌కు అదనంగా నీరు సరఫరా చేసి రైతులను ఆదుకునేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన ఎంపీ సాగర్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. నీటి సరఫరా విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. వాటా ప్రకారం నీరు రప్పించి రైతులకు సరఫరా చేయాలని సూచించారు.

ఇప్పటికే అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో నీరు సక్రమంగా పంటకు అందకుంటే నష్టాలపాలవుతారనే విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలన్నారు. ఎన్‌ఎస్పీ సిబ్బంది నిత్యం కాలువపై పర్యటించి నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎన్‌ఎస్పీ డీఈ ఎ.అనుమాయమ్మ, ముండ్లమూరు, తాళ్ళూరు వైసీపీ కన్వీనర్లు బ్రాహ్మారెడ్డితోపాటు వెంకటరెడ్డి, రైతులు అన్నపురెడ్డి భిక్షాలురెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, గాదె నాసరరెడ్డి, సుంకిరెడ్డి, చింతల అంజిరెడ్డి, గూడాల సుబ్బారెడ్డి, బిజ్జం సుబ్బారెడ్డి, సురా గురుస్వామిరెడ్డి, మన్నంగి అంజిరెడ్డి, ఇరుగుల కొండారెడ్డి, అబ్బని అంజిరెడ్డి, మైలా శ్రీరాములు, జే ఈలు క్రాంతికుమార్, శివరామకృష్ణ, ప్రసాదులు ఉన్నారు.

నేనున్నానని..

Written By news on Friday, December 26, 2014 | 12/26/2014


నేనున్నానని..
సాక్షి, కడప/పులివెందుల : టీడీపీ ప్రభుత్వ ఆరంభం నుంచి ఆత్మహత్య చేసుకున్న తు కుటుంబాలను పరామర్శిస్తానని అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నాలుగు రోజుల్లోనే పులివెందుల నుంచి పరామర్శ యాత్ర ప్రారంభించారు. అప్పులు ఎక్కువై.. తీర్చే దారిలేక.. విషపు గుళికలు మింగి తనువు చాలించిన చిన్నరంగాపురానికి చెందిన గంగిరెడ్డి యాదవ్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. గురువారం సాయంత్రం గ్రామంలో యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి భార్య, పిల్లలను ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు.
 
 వైఎస్ జగన్‌కు ప్రశంసల జల్లు :
 క్రిస్మస్‌పండుగ నాడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతోనే గడిపారు. చర్చిలో ప్రార్థనల అనంతరం నేరుగా క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజలతో మమేకమయ్యా రు. వారు చెబుతున్న సమస్యలు వింటూ పరి ష్కారానికి చొరవ చూపారు. అసెంబ్లీలో ప్రభుత్వంపై చేసిన ఎదురుదాడి, రైతుల పక్షాన చూ పిన తెగువ, రాజధానికి సంబంధించిన బిల్లు విషయంలో రైతుల తరఫున పోరాటంపై పలువురు వైఎస్ జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తా రు. కొందరుపూలబొకేలతో అభినందించగా మరికొందరు శాలువాలు కప్పి సన్మానించారు. ప్రజల తరఫున పోరాడటానికి జగన్ ఉన్నారన్న ధైర్యం జనంలో నింపావని కొనియాడారు.
 
 రుణమాఫీ అమలు కాలేదని.. :
 పులివెందుల మున్సిపాలిటీలోని చిన్నరంగాపురం గ్రామంలో కౌన్సిలర్ వీరశేఖరమ్మ ఇంటి కి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంటి వద్దకు వైఎస్ జగన్ రాగానే గ్రామానికి చెందిన వికలాంగ రైతు హరినారాయణరెడ్డి కలిశారు. నాలుగేళ్లయింది.. బంగారు రుణం ’80వేలు.. క్రాప్ లోను ’90వేలు తీసుకున్నానని.. రుణమాఫీ పెసా కాలేదని.. గ్రామానికంతా కలిపి నలుగురు రైతులకే వచ్చిందని వైఎస్ జగన్‌కు వివరించారు. దీనికి స్పందించిన వైఎస్ జగన్ ఇదంతా మోసపూరిత ప్రభుత్వమన్నా..  రైతులను నిలువునా బాబు ముంచాడు.. మీ తరఫున పోరాటానికి సిద్ధమని ఊరడించారు.
 
 పీబీసీకి అదనంగా ఒక టీఎంసీ నీరు అందించండి :
 కరువు రైతులను ఆదుకొనేందుకు పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు (పీబీసీ)కి అదనంగా మరో టీఎంసీ నీటిని అందించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మంత్రిని డిమాండు చేశారు. గురువారం పులివెందులలోని ఇంట్లో వైఎస్ జగన్‌రెడ్డి సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, అనంతపురం, వైఎస్‌ఆర్‌జిల్లాల కలెక్టర్లతో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయానికి సంబంధించి వివరాలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. ప్రతి ఏటా పీబీసీకి అన్యాయం జరుగుతోందని.. వచ్చిన నీరు కాస్తా అనంతపురం జిల్లాలోని కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పులివెందుల నియోజకవర్గాలలోని ప్రజలకు తాగునీరు అందించాల్సి ఉందన్నారు.
 
  ఆయకట్టుకు 1.2టీఎంసీలు.. తాగునీటి అవసరాలకు 2టీఎంసీల చొప్పున కేటాయించారని.. అవి కూడా సక్రమంగా రావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సింహాద్రిపురం, లింగాల మండలాల్లో చీనీ, అరటి రైతులు వేలాది ఎకరాల్లో చెట్లను నరికివేశారని.. ఈ సారి కూడా ఆయకట్టుకు రాకపోతే చెట్లను మరిన్ని వందల ఎకరాల్లో కొట్టేసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. పీబీసీకి అదనంగా ఒక టీఎంసీ నీరు ఇవ్వడంతోపాటు పోతిరెడ్డిపాడు, గండికోట వరద కాలువకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.
 
 ఈ ఏడాది వరద నీరు సక్రమంగా నిలబెట్టుకోలేక వందల టీఎంసీల నీరు సముద్రం పాలయ్యాయని.. పోతిరెడ్డిపాడు - గండికోట మధ్య కాలువ పనులు పూర్తి చేయడం ద్వారా కనీసం 25టీఎంసీలనుంచి 30టీంఎసీల నీటిని నిలబెట్టుకోవచ్చునన్నారు. తద్వారా నీరు గండికోటకు తీసుకరావచ్చునని.. దీంతో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలకు నీరు అందుతుందని తెలియజేశారు. అలాగే ముంపు గ్రామాలకు సంబంధించి పరిహార సమస్యలు తీర్చాల్సి ఉందని.. వెంటనే ఆ దిశగా కూడా చర్యలు చేపట్టాలని కోరినట్లు వైఎస్ అవినాష్ స్పష్టం చేశారు. మంత్రితోపాటు అనంత, వైఎస్‌ఆర్‌జిల్లాల కలెక్టర్లు కూడా న్యాయం చేస్తామని చెప్పడమేకాక సానుకూలంగా స్పందించినట్లు ఆయన వివరించారు.
 
 మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై పోరాడుతా :
 బాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసేయడమే పనిగా పెట్టుకున్నారని.. దీనిపై ఇప్పటికే అసెంబ్లీలో పోరాటం చేశానని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల రింగ్ రోడ్డు సమీపంలో వైఎస్ జగన్‌ను పలువురు మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబు అడ్డగోలుగా తొలగిస్తున్నారని  మొరపెట్టుకున్నారు. వారి కోసం పోరాటం చేస్తామని హామి ఇచ్చారు.
 
 క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో...  
 పులివెందులలో గురువారం క్రిస్మస్ వేడుకల్లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులంతా స్థానిక సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలలో పాల్గొన్నారు. వైఎస్ జగన్‌రెడ్డితోపాటు మామ ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, పెదనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి, చిన్నాన్నలు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి తదితరులు కూడా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాలు పంచుకున్నారు.
 
 చర్చి వద్దనే ఆరుబయట మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, విమలమ్మ కుమారుడు యువరాజారెడ్డి, వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ కుమార్తెలు హర్ష, వర్ష తదితరులు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అలాగే జీసెస్ చారిటీస్‌లోని చర్చిలో కూడా వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ,  వైఎస్ జగన్ సోదరి షర్మిలమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ మేనేత్తలు కమలమ్మ, రాజమ్మలు ప్రత్యేక ప్రార్థనలలో పాలుపంచుకున్నారు.
 
 వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, మేయర్
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలను పలువురు నేతలు కలుసుకున్నారు. ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, డీసీసీబీ చెర్మైన్  ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చెర్మైన్ విష్ణువర్థన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఇతర పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిసి చర్చించారు. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం అనేక అంశాలపై చర్చించారు.

ఎంపీ ల్యాడ్స్ నిధుల ప్రతిపాదనలో ఖమ్మం ఎంపీ ముందంజ


పొంగులేటి టాప్
ఎంపీ ల్యాడ్స్ నిధుల ప్రతిపాదనలో
ఖమ్మం ఎంపీ ముందంజ


ఖమ్మం జెడ్పీసెంటర్: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగులు వేస్తున్నారు. తన నియోజకవర్గానికి ఎంపీ నిధులతో పాటు ఇతర నిధులు తెప్పించి అభివృద్ధి చేసేందుకు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల ప్రతిపాదనలో ఆయనే ముందున్నారు. జిల్లాలో అభివృద్ధి పనుల్లో తనదైన మార్క్ కోసం పార్లమెంట్ నియోజకవర్గం మొత్తానికి నిధులు కేటాయింపు కోసం రూపకల్పన చేశారు.

ప్రభుత్వం ప్రతి ఏటా విడుదల చేసే నిధులను  ఖర్చు చేయడానికి ఎంపీలకు తీరిక లేక కోట్లాది రూపాయలు వెనక్కి వెళ్ళిన సంఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. అయితే ఖమ్మం పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన పొంగులేటి ఆరు నెలల్లోనే తన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో అత్యంత ప్రాధాన్యాలను గుర్తించి వాటిని పూర్తి చేసేందుకు ఏక కాలంలో ప్రతిపాదనలు పంపారు. ఎంపీ కోటాలో నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.5 కోట్లు విడుదల చేస్తుంది.

ఖమ్మం ఎంపీ పొంగులేటి పరిధిలో  2014-15కు గానూ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఐదు కోట్లు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు చేసి మంజూరుకు ఫైల్ పంపారు. ఈ ఐదు కోట్లు నిధులతో సీసీ రోడ్లు, తాగునీటి పథకాలు, సైడ్ డ్రైయిన్లు, పైపు కల్వర్టులు, సైడ్ వాల్స్ తదితర అవసరాలకు కేటాయించారు.

వాటిలో ఖమ్మం డివిజన్‌లో 118 పనులకు రూ.374 లక్షలు, కొత్తగూడెం డివిజన్‌లో 20 వర్కులకు రూ.60 లక్షలు, ఆర్‌డబ్ల్యూఎస్ కొత్తగూడెంలో ఒక పనికోసం రూ.3 లక్షలు, ఖమ్మం కార్పొరేషన్‌లో 4 పనులకు రూ.13 లక్షలు, కొత్తగూడెం మున్సిపాలిటిలో 4 పనులకు రూ.11 లక్షలు, నీటి ఎద్దడి నివారణ కోసం, మంచినీటి సరఫరా కోసం ప్రతిపాదనలు చేశారు.  ఖమ్మం, కొత్తగూడెం డివిజన్ల నుంచి సంబంధిత పీఆర్‌ఐ కార్యనిర్వాహక ఇంజినీర్లు అంచనాలు తయారు చేసి ముఖ్య ప్రణాళిక అధికారికి పంపారు. కలెక్టర్ ఇలంబరితి పరిపాలన పరమైన మంజూరు చేయాల్సి ఉంది. ఇంజనీర్లు అంచనాలు తయారు చేసి ముఖ్య ప్రణాళికాధికారికి పంపారు. కలెక్టర్ ఇలంబరితి పరిపాలన మంజురి చేయాల్సింది.

అభివృద్ధే లక్ష్యంగా..
అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అందించే ఎంపీ నిధులతో పాటు అదనపు నిధుల కోసం పొంగులేటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏడాదిలో చెపట్టాల్సిన పనులను ఆరునెలల కాలంలోనే గుర్తించి ప్రతిపాదనలు పంపారు. రానున్న వేసవి దృష్ట్యా మం చినీటి ఎద్దడికి ప్రణాళికలు చేస్తున్నారు. నియోజకవర్గంలో నీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించారు. వాటికి నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తున్నారు.

ప్రత్యేక స్థానం..
ఒకప్పుడు ఎంపీ అయిన వెంటనే నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని పరిస్థితి జిల్లాలో ఉండేది. ప్రస్తుత ఎంపీ పొంగులేటి మాత్రం తనదైన శైలిలో ప్రతి వారం జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. వాటికి సంబంధించిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు.

అండగా ఉంటా ధైర్యంగా ఉండండి


అండగా ఉంటా ధైర్యంగా ఉండండి
  • ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
  • అసెంబ్లీలో ప్రకటన అనంతరం.. సొంత నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టిన ఏపీ విపక్షనేత
సాక్షి, కడప: పంటలు పండక..పెట్టిన పెట్టుబడులుకూడా రాక.. తెచ్చిన అప్పులు తీరే దారిలేక.. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు గంగిరెడ్డి యాదవ్ కుటుంబాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వైఎస్సార్ జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురానికి వెళ్లి గంగిరెడ్డి కుటుంబంతో మాట్లాడి ధైర్యం నింపారు.

టీడీసీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఓదార్చుతానని ప్రతిపక్షనేతగా ఇటీవల అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు మొదట తన నియోజకవర్గం నుంచే దానికి ఆయన శ్రీకారం చుట్టారు. ముందుగా గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తుండగానే.. గంగిరెడ్డి భార్య రమాదేవి, కుమారుడు రాజ్‌కుమార్, కుమార్తె కుమారి కన్నీళ్ల పర్యంతమయ్యూరు. జగన్ వారిని ఓదార్చుతూ అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఎలాంటి అవసరం వచ్చినా.. స్థానికంగా నా తమ్ముడు అవినాష్ (కడప ఎంపీ) ఉన్నాడు.. భయపడొద్దని వారికి ధైర్యం చెప్పారు. ఎంత భూమి సాగు చేసేవారు.. ఎంత అప్పు చేశారు.. పెట్టుబడుల పరిస్థితి ఏమిటని రమాదేవిని అడిగారు. 5 ఎకరాల భూమి ఉండేదని.. అందులో మూడు బోర్లు వేసినట్లు ఆమె వెల్లడించారు.  నీరు పూర్తిస్థాయిలో పడకపోగా.. ఉన్న చీనీచెట్లు ఎండిపోయాయని ఆమె వివరించారు.

దీంతో పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో భయపడిపోయామని.. తర్వాత ధైర్యంగా మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని అందులో పొద్దుతిరుగుడు, శనగ తదితర పంటలు సాగు చేసినా పెట్టుబడులు కూడా రాకపోవడంతో తన భర్త గంగిరెడ్డి ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

బ్యాంకులో రుణం ఏమైనా తీసుకున్నారా.. రుణమాఫీ జరిగిందా అని జగన్ ఆమెను అడిగారు. అప్పులు ఎక్కడ దొరకకపోవడంతో బ్యాంకులో మరిదికి సంబంధించిన బ్యాంకు పాసు పుస్తకం, బంగారు నగలు తాకట్టు పెట్టి రూ. 40 వేలు తెచ్చుకున్నామని ఆమె వివరించారు. రూ. 28 వేలు మాత్రమే మాఫీ అయ్యిందంటున్నారు కానీ.. ఇంతవరకూ  ఆ సమాచారం లేదని చెప్పారు. గంగిరెడ్డి పిల్లలు రాజ్‌కుమార్, కుమారిలను ఓదార్చారు.

మంత్రితో మాట్లాడిన జగన్


పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోట ప్రాజెక్టు వరకు పెండింగ్‌లో ఉన్న వరద కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని తద్వారా కొన్ని వందల టీఎంసీల నీరు సముద్రం పాలు కాకుండా కొంతమేరైనా నిల్వ చేసుకోవడానికి వీలుంటుందని  జగన్‌మోహన్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును కోరారు. గురువారం మధ్యాహ్నం పులివెందులలోని తన నివాసంనుంచి  ఉమామహేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడారు.

ఈ ఏడాది  వచ్చిన వరద నీరు సక్రమంగా వినియోగించుకోలేక సముద్రం పాలవుతోందని  గుర్తు చేశారు. అలాగే మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ నుంచి పీబీసీకి 3.2 టీఎంసీలు కేటాయించినా.. సీబీఆర్‌కు మాత్రం 1.5 టీంఎంసీల నీరు మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని.. కాలువల్లో నీరు రావడంతో వృథా కావడం.. తుంపెర్ డీప్‌కట్ వద్ద రీడింగ్ తీసే గేజ్ లోపంవల్ల ఏటా పీబీసీ ఆయకట్టుకు నీరు రావడం లేదన్నారు.  పీబీసీకి అదనంగా ఒక టీఎంసీ కేటాయించాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన  దేవినేని త్వరలోనే గండికోట, చిత్రావతి ప్రాజెక్టులను సందర్శించి న్యాయం చేస్తానని వైఎస్ జగన్‌కు హామీ ఇచ్చారు.

మహానేతకి ఘనంగా నివాళులు

Written By news on Wednesday, December 24, 2014 | 12/24/2014

ఇడుపులపాయ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఇడుపులపాయ చేరుకున్న ఆయన .. వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద కొద్దిసేపు మౌనంగా ప్రార్థించారు. వైఎస్ జగన్ వెంట ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు.

కాగా వైఎస్ జగన్  కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి ఈరోజు ఉదయం ఎర్రగుంట్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇడుపులపాయకు వెళ్లారు. మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో గడపనున్నారు.

అనంతరం ఇటీవల చక్రాయపేట మండలం దేవరగట్టుపల్లెలో గుండె పోటుతో మృతి చెందిన వైఎస్‌ఆర్ సీపీ మండల యూత్ కన్వీనర్ వెంకటసుబ్బయ్య సోదరుడు నాగభూషణం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ పులివెందులకు చేరుకుంటారు. 25వ తేదీన (గురువారం) ఉదయం పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.

ఎన్టీ రామారావును దించివేయడంలో సహకరించినందుకే ..


'ఎన్ టీఆర్ పదవీచ్యుతిలో డీజీపీ పాత్రధారి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా జాస్తి వెంకట రాముడిని నియమించడాన్ని సవాలు చేస్తూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాముడి నియామకం జరిగిందని, అందువల్ల ఆయన నియామకపు జీవోను నిలిపేసి, రాముడి కన్నా సీనియర్ అధికారికి డీజీపీ బాధ్యతలు అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఆయన తన పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరారు. ఎన్టీ రామారావును సీఎం పదవి నుంచి దించివేయడంలో సహకరించినందుకే రాముడిని ...చంద్రబాబు డీజీపీగా చేశారని కొడాలి నాని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

గతంలో ఎన్టీ రామారావును గద్దె దించేందుకు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్ లో ఉంచారు. ఆ హోటల్ హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో ఉందని, దానికి డిప్యూటీ కమిషనర్ గా రాముడు వ్యవహిరించారని, తనకు అప్పుడు సహకరించినందుకే చంద్రబాబు...ఇప్పుడు రాముడిని డీజీపీని చేశారని కొడాలి నాని తన పిటిషన్ లో పేర్కొన్నారు. వీటన్నింటి దృష్ట్యా రాముడు నిష్పాక్షికంగా పోలీసు బలగాలను నడిపిస్తారనే విశ్వాసం ప్రజలకు కలగడం లేదని, అంతేకాకుండా 1993లో రాముడు పుట్టిన తేదిని సవరించడం జరిగిందని, దానివల్లే ఆయనకు మరో రెండేళ్లపాటు డీజీపీగా కొనసాగే అవకాశం వచ్చిందన్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డీజీపీగా రాముడు నియామకాన్ని రద్దు చేయాలని, కేసు తేలేంతవరకు డీజీపీ బాధ్యతలను మరో సీనియర్ అధికారికి అప్పిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు.

అంకితభావం ఆయన సొంతం


అంకితభావం  ఆయన సొంతం
వైఎస్సార్ సీపీ యువజన నేతగా ప్రత్యేక గుర్తింపు
ఇటీవలి ఎన్నికల్లో ‘పశ్చిమ’ ఎమ్మెల్యేగా పోటీ

 
వరంగల్ : రోడ్డు ప్రమాదం యువ నాయకుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రాణాలను బలిగొంది. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన సుధీర్‌రెడ్డి ఆకస్మిక మృతి పార్టీ వర్గాలను కలవరపరిచింది. తొలి నుంచి వైఎస్సార్ సీపీకి అంకితభావం ఉన్న నాయకుడిగా ఆయన పేరొందారు. ధర్మసాగర్ మండలం మలక్‌పల్లిలో మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన భీంరెడ్డి ఎల్లారెడ్డి, అరుణాదేవి దంపతులకు సుధీర్‌రెడ్డి మూడో సంతానం. 1979 ఫిబ్రవరి 9వ తేదీన జన్మించిన ఆయన హన్మకొండలో డిగ్రీ వరకు విద్యనభ్యసించారు.  ప్రస్తుతం హన్మకొండలో తల్లితో కలిసి నివసిస్తున్నారు. సుధీర్‌రెడ్డి తండ్రి ఎల్లారెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాస్తులపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. సుధీర్‌రెడ్డి చిన్నతనం నుంచి చురుకైన వాడిగా పేరొందిన ఈయన క్రమంగా వైఎస్.రాజశేఖరరెడ్డి వీరాభిమానిగా, కాంగ్రెస్ పార్టీపై మక్కువ పెంచుకున్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూనే వైఎస్ మరణాంతరం జగన్ యువసేన ఏర్పాటు చేశారు. జగన్ యువసేన జిల్లా కన్వీనర్‌గా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌ను స్థాపించిన మరుక్షణం ఆ పార్టీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జగన్  అందించిన మార్గమే తన మార్గమంటూ తరచూ చెప్పే వారు. రాష్ట్ర విభజన సమయంలో సైతం మొండితనంతో వైఎస్సార్ సీపీకి అండగా నిలిచారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆయన ప్రాచుర్యం పొందారు.  వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌పై కేసులు పెట్టి జైలుకు పంపిన సందర్భంలో ఆయన విడుదలయ్యేవరకు ‘బ్లాక్‌షర్ట్’ ధరించి నిరసన తెలియజేస్తానంటూ అదే పద్ధతిని పాటించి తన అభిమానాన్ని చాటుకున్నారు. సీబీఐ అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందంటూ ప్రచారం నిర్వహించారు. తర్వాత క్రమంలో పలువురు నాయకులు పార్టీని వీడినప్పటికీ వెనుకంజ వేయకుండా వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్నారు. కేసులు పెట్టినా, దాడులు జరిగినా... వెరవకుండా పార్టీకి అంకితభావం గల నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ పక్షాన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.

ప్రచారంలో సైతం తనదైన ప్రత్యేకతను సుధీర్‌రెడ్డి కనబరిచేవారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిర్వహించిన పరామర్శయాత్రలో జిల్లాలోని మరికొందరు యువకులతో కలిసి పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన స్వయంగా నిర్వహించారు. అంతలోనే ప్రమాదంలో భీంరెడ్డి మృతిచెందడాన్ని పార్టీ శ్రేణులు జీర్నించుకోలేకపోతున్నారుు.

పలువురి సంతాపం

భీంరెడ్డి సుధీర్‌రెడ్డి ఆకస్మిక మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే మృతిచెందడంపట్ల ఆవేదన వ్యక్తం చేశా రు. పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్, యువజన కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి, మిత్రుడు కూనూరు శేఖర్‌గౌడ్, వీసం సురేందర్‌రెడ్డి, వేరుుస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తదితరులు సంతాపం తెలియజేశారు.
 
సుధీర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
నేడు అంత్యక్రియలకు రానున్న పొంగులేటి
 
హన్మకొండ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి ఆకస్మిక మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుధీర్ రెడ్డి మరణ వార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం అంత్యక్రియలకు వస్తున్నట్లు తెలిపారు. సుధీర్‌రెడ్డి పార్టీలో అంకితభావం గల నాయకుడని, క్రీయాశీల కంగా పనిచేసేవారని శ్రీనివాసరెడ్డి అన్నారు.  ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి, శివకుమార్ తదితరులు సుధీర్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారం వరంగల్‌కు వస్తున్నారు.

సుధీర్ రెడ్డి రోడ్డు ప్రమాదంపై అనుమానాలు


సుధీర్ రెడ్డి రోడ్డు ప్రమాదంపై అనుమానాలుసుధీర్ రెడ్డి మృతదేహం
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ యువనేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి(30)కి జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని సీఐ డేవిడ్ రాజు చెప్పారు. వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో తరాలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధీర్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని  ఎస్పీ అంబర్ కిషోర్ ఝా  సీఐని ఆదేశించారు. ప్రమాద స్థలాన్ని టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన రెడ్డి, డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి సందర్శించారు.

సుధీర్ రెడ్డి మృతికి ఉపముఖ్యమంత్రి రాజయ్య, మంద్రి చందూలాల్, ఎమ్మెల్యే లు సురేఖ, వినయ్య భాస్కర్,రమేష్, ఎంపిలు కడియం శ్రీహరి, సీతారామ్ నాయక్, టీఆర్ఎస్ నేతలు మురళీధర్ రావు, రవీంద్ర రావు, కుడా మాజీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, వైఎస్ఆర్ సీపి నేతలు గట్టు శ్రీకాంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నాడెం శాంత కుమార్, సింగిరెడ్డి భాస్కర రెడ్డి, డాక్టర్ ప్రపుల్లా రెడ్డి, చల్లా మధుసూధన్, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, డీసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, టీపిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస రావు, టీడీపి జిల్లా ఉపాధ్యక్షుడు ఖాదర్ అలీ, అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.

వైఎస్ఆర్ సీపీ నేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి మృతి

Written By news on Tuesday, December 23, 2014 | 12/23/2014

..

వరంగల్:  వైఎస్ఆర్ సీపీ యువనేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి(30) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సుధీర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కాజీపేట సమీపంలో తరాలపల్లి వద్ద కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

సుధీర్ రెడ్డి మృతికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సంగిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. సుధీర్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ జగన్ కు వీరాభిమానిగా గుర్తింపు పొందారు.

బాలచందర్ మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం


హైదరాబాద్: ప్రఖ్యాత సినీ దర్శకుడు కె. బాలచందర్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మశ్రీ అవార్డులతో పాటు తొమ్మిది జాతీయ ఫిల్మ్ అవార్డులు సాధించి దేశంలోనే అత్యన్నత స్థాయి దర్శకులలో ఒకరిగా ప్రసిద్ధి చెందిన ఆయన మరణం భారతీయ చలన చిత్రరంగానికి తీరని లోటు అని జగన్ ఓ ప్రకటనలో తెలిపారు.
 
అనేక ఆణిముత్యాల వంటి చిత్రాలను అందించిన ఆయన చలన చిత్ర రంగంలో ఒక కొత్త ఒరవడికి నాంది పలికారని కొనియాడారు. బాలచందర్ కుటుంబ సభ్యలకు ఆయన తన ప్రగాడ సంతాపం, సానుభూతిని తెలియజేశారు.

వైఎస్ జగన్ ను ప్రశంసించిన డిప్యూటీ సీఎం కేఈ

ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు రెండేళ్లు పడుతుందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని రాజధాని పనులు ప్రారంభిస్తామని  చెప్పారు. రాజధాని ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన వారి తరపున వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడి మైలేజ్ పొందారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు.
 
ఈ సందర్భంగా వైఎస్ జగన్ అసెంబ్లీలో వ్యవహరించిన తీరును కేఈ కృష్ణమూర్తి ప్రశంసించారు. కొన్ని చర్చల్లో వైఎస్ఆర్ సీపీకి మేలు జరిగే అంశాలున్నాయని కేఈ అన్నారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే బాధ్యత చంద్రబాబుపైనే ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రాయలసీమ మద్దతు ఉంటుందని, తమకు ప్రధానంగా కావల్సింది సాగునీరు అని అన్నారు.

కొల్లేరు సరస్సును చంద్రబాబు నాయుడు తవ్విస్తే...


బాబు తవ్విస్తే...వైఎస్ఆర్ పూడ్చేసినట్లు..
హైదరాబాద్ : కొల్లేరు సరస్సును చంద్రబాబు నాయుడు తవ్విస్తే...వైఎస్ రాజశేఖరరెడ్డి పూడ్చివేసినట్లు అధికార పార్టీ సభ్యులు చెబుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కొల్లేరు కాంటూరుపై మంగళవారం సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ చెరువులు తొలగించాలని సుప్రీంకోర్టు 2006లో ఆదేశిస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెరువులు తొలగించటం జరిగిందన్నారు.

అనంతరం ఆయన అసెంబ్లీలో కొల్లేరు కాంటూరుపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. అనంతరం ఆరు నెలలకే దురదృష్టవశాత్తూ వైఎస్ఆర్ చనిపోవటంతో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ సమస్యపై పట్టించుకోలేదని కొడాలి నాని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో సమస్యను పరిష్కరించాలని అన్నారు.

చంద్రబాబుకు అప్పుడు గుర్తు రాలేదా: వైఎస్ జగన్

కొల్లేరు కాంటూరు సమస్య పరిష్కారానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కొల్లేరును మూడో కాంటూరు వరకూ కుదించాలని ప్రభుత్వం మంగళవారం సభలో తీర్మానం పెట్టింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ 2008లోనే కొల్లేరుపై తీర్మానం జరిగిందరి,  కొల్లేరు కాంటూరుపై వైఎస్ రాజశేఖరరెడ్డి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారని గుర్తు చేశారు.

కొల్లేరు ప్రాంతవాసులు జీవనాన్ని అధ్యయనం చేసేందుకు వైఎస్ఆర్  కమిటీ కూడా వేసినట్లు చెప్పారు. 2008 నాటి తీర్మానాన్నిముందుకు తీసుకు వెళ్లాలని... రాజకీయ అవసరాల కోసం మరోసారి తీర్మానమా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలపై కాస్తోకూస్తో టీడీపీకి ప్రేమ వచ్చినందుకు సంతోషమన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు కొల్లేరు సమస్య గుర్తు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో కట్టుకథలు చెప్పిస్తున్నారని విమర్శించారు.  సుప్రీంకోర్టు తీర్పుపైనే కొల్లేరులో చెరువులు ధ్వంసం అయినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.

సామాజిక కార్యకర్తల ముసుగులో రౌడీషీటర్లకు.


హైదరాబాద్ : ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో చంద్రబాబు సర్కార్ తప్పుడు విధానాలు అవలంభిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ప్రభుత్వ కమిటీలలో అనధికార వ్యక్తులకు, టీడీపీ కార్యకర్తలకు స్థానం కల్పించడం సరికాదని వారు అన్నారు. సామాజిక కార్యకర్తల ముసుగులో రౌడీషీటర్లకు స్థానం కల్పిస్తూ స్థానిక సంస్థల స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు.  

ప్రభుత్వ కమిటీలో స్థానిక సంస్థల ప్రతినిధులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ అన్ని పథకాల్లో చంద్రబాబు తమ ఏజెంట్లను నియమించుకుని ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారని 

పైసా పెట్టుబడి కూడా లేని ల్యాండ్ డెవలపర్స్‌కు ఇచ్చిన హక్కులు, భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వకపోవడం దారుణo


రైతులను దొంగలతో పోలుస్తారా?
  • సీఆర్‌డీఏ బిల్లుపై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: పైసా పెట్టుబడి కూడా లేని ల్యాండ్ డెవలపర్స్‌కు ఇచ్చిన హక్కులు, భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వకపోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ల్యాండ్ పూలింగ్‌పై కోర్టుకెళ్ళే రైతుల ఆలోచనల గురించి ప్రభుత్వం చెప్పే మాటలు రైతులను అవమానించేలా ఉన్నాయని తప్పుపట్టారు. ఎర్ర చందనం దొంగలూ కోర్టుకు వెళుతున్నారనడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు.

శాసనసభలో సోమవారం సీఆర్‌డీఏపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 60 శాతం ప్రజల ఆమోదం ఉంటేనే భూసేకరణ చేపట్టాలన్న నిబంధనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయ భూములను సేకరించకూడదని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొందని, ప్రభుత్వం మాత్రం పూలింగ్ పేరుతో 50 వేలు, లక్ష ఎకరాలను రాజధాని కోసం సేకరిస్తోందని విమర్శించారు.

ఉన్న వ్యవసాయ భూములను ఇలా సేకరిస్తే ఆహారభద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. పేద రైతులు భూమలు ఇవ్వబోమని చెబుతుంటే, ఏ చట్టాన్నైనా తీసుకొచ్చి లాక్కుంటామని ఓ మంత్రి, మీరు కాదంటే దొనకొండలోనో మరో చోటనో రాజధాని పెడతామని మరో మంత్రి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ఏర్పాటు విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే ఇన్ని వేల ఎకరాల భూములు ఎందుకు సేకరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఆర్‌డీఏ బిల్లులో రైతులు, రైతుకూలీలకు ఏమాత్రం భద్రత లేదన్నారు.

ఎక్కడైనా భూమి ఇచ్చిన వారికి 70 శాతం, డెవలపర్‌కు 30 శాతం ఇవ్వడం సహజమని, కానీ రాజధాని విషయంలో ఇందుకు భిన్నంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డెవలపర్ ఎంపిక విషయంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఎలాంటి పెట్టుబడి లేని డెవలపర్ చిరవకు భూ యజమానిగా బిల్లులో పేర్కొనడం దారుణమన్నారు.

ఉపగ్రహాల తయారీలోనే ప్రపంచంలోనే భారత్ తన ప్రతిభను చాటుతుంటే, నిపుణులైన యువత మన దగ్గరుంటే, సింగపూర్‌ను ఆశ్రయించాల్సిన అవసరం ఏమిటన్నారు. చంద్రబాబుకు గొప్ప విజన్ ఉందని, అందుకే 30 ఏళ్ళ క్రితమే కృష్ణా జిల్లా వ్యక్తినే పెళ్లి చేసుకున్నారని రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ఇదే విజన్‌ను రాజధాని నిర్మాణం విషయంలో అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
 

కొల్లేరుపై కొంగ జపం


కొల్లేరుపై కొంగ జపం
 ఏలూరు :కొల్లేరుపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మళ్లీ కొంగ జపం చేస్తున్నారు. వివాదాస్పద 120 జీవో తీసుకువచ్చి 3.50 లక్షలమంది కొల్లేరు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన చంద్రబాబు ఇప్పుడు సరస్సు పరిధిని ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదించేందుకు శాసనసభలో తీర్మానం చేస్తామని నమ్మబలుకుతున్నారు. వాస్తవానికి 2008లోనే కొల్లేటి రైతుల దీనస్థితిపై స్పందించిన అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభయారణ్యం పరిధిని ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదిస్తూ తీర్మానం ఆమోదింపజేశారు. ఇప్పుడు మళ్లీ ఆ తీర్మానాన్నే శాసనసభలో ప్రవేశపెడతానంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు.

 వారికి కొల్లేరే ఆధారం
 కొల్లేరు ప్రపంచంలోని అతి పెద్ద మంచినీటి సరస్సులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని 9 మండలాల్లో 77వేల ఎకరాల్లో ఈ సరస్సు విస్తరించి ఉంది. కైకలూరు, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల పరిధిలో కొల్లేరును ఆనుకుని ఉన్న 125 గ్రామాల్లో మూడు లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. మున్నేరు, బుడమేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ వాగుల నుంచి వచ్చేనీరు, 18డ్రెయిన్ల ద్వారా వర్షాకాలంలో వచ్చే ముంపు నీరు కొల్లేరులోనే కలుస్తాయి.  ఇక్కడి ప్రజలంతా శతాబ్దాల తరబడి కొల్లేరులో చేపల వేటను ఆధారంగా చేసుకుని బతుకుసాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వెనుకబడిన తరగతులకు చెందిన వడ్డీలు కాగా, దళితులూ గణనీయంగా ఉన్నారు. 1974లో అప్పటి ప్రభుత్వం 118 జీవో జారీచేసి కొల్లేరులో చెరువుల తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. దీంతో కొల్లేరును ఆనుకుని ఉన్న గ్రామాల్లోని జిరాయితీ భూములను రైతులు చేపల చెరువులుగా మార్చుకున్నారు. గ్రామకంఠం, డీ ఫారం భూములను గ్రామస్తులు సొసైటీలుగా ఏర్పడి ఉమ్మడి చెరువులు తవ్వుకున్నారు. సొసైటీల పరిధిలో ఏర్పడిన చెరువుల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామంలోని అన్ని కుటుంబాల వారికి పంచేవారు.

 బాబు శాపం ఫలితం
 చేపల వేటతో జీవనం ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో 1999లో రామ్‌సార్(ఇరాన్) అంతర్జాతీయ ఒప్పందం, కొల్లేరు ప్రక్షాళన పేరుతో చంద్రబాబునాయుడు సర్కా రు జారీ చేసిన వివాదాస్పద జీవో 120 కొల్లేరు వాసుల జీవనాన్ని పాతాళంలోకి నెట్టేసింది.  308.5 చదరపు కిలోమీటర్ల కొల్లేరు ప్రాంతాన్ని అభయారణ్యంగా పరిగణిస్తూ ఈ ప్రాంతంలో చేపల సాగును నిషేధించారు. సరస్సు సముద్ర మట్టానికి ఎత్తును బట్టి కాంటూర్లను నిర్ణయిం చారు. కళ్లెదుటే కొల్లేరు ఉన్నా చేపలు పెంచుకునే అవకాశం లేదు. అభివృద్ధి పనులు చేపట్టడం నిషేధం. కొత్త వంతెనలు, రోడ్లు, భవనాలు నిర్మించరాదు. ఇలా ఆ జీవోలో పేర్కొన్న కఠిన నిబంధనలు కొల్లేరు ప్రజల జీవితానికి సంకెళ్లు వేశాయి. కూలి పనులు లేక వేలాది మహిళలు, పురుషులు వలసబాట పట్టారు. ఆర్థికంగా చితికిపోయిన వందలాది కుటుంబాలు ఆడపిల్లలకు పెళ్లిళ్లు సైతం చేయలేని దుస్థితికి చేరుకున్నాయి. వేలాదిమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు.

 తీర్మానంతో సరిపెట్టకుండా..
 నాడు వైఎస్ చేసిన తీర్మానాన్నే కొత్తగా కొలువుదీరిన ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టి చర్చ పెడతానని సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ వస్తున్నారు. నాడు అభయారణ్యం పరిధి తగ్గించాలని కొల్లేరు ప్రజలు గగ్గోలు పెట్టినా పట్టించుకోని చంద్రబాబు నేడు కాంటూరు కుదింపుపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామనడంపై ఇప్పటికీ కొల్లేటి వాసుల్లో సందేహాలున్నాయి. ఇప్పటికైనా సీఎం కొల్లేరు వాసుల కష్టాలపై నిజాయితీగా స్పందించి తీర్మానంతో సరిపెట్టకుండా కార్యచరణపై దృష్టి పెట్టాలని కొల్లేటి వాసులు కోరుతున్నారు. నిపుణులైన న్యాయవాదులను నియమించి సుప్రీం కోర్టులో కాంటూరు కుదిం పుపై గట్టిగా వాదనలు వినిపించేలా కృషి చేయాలనేది అక్కడి ప్రజల డిమాండ్. కొల్లేరు ప్రజల స్థితిగతులు, కాంటూరు కుదింపు వల్ల కలిగే లాభాలను సుప్రీం కోర్టుకు తెలియచేసేలా ఒత్తిడి తీసుకురావాలన్నదే కొల్లేటి వాసుల ఆకాంక్ష. రాష్ట్ర సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తే కొల్లేరులోని లక్షలాది మందికి మేలు కలుగుతుంది.

 మహానేత పోరాటం మరపురానిది
 సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఆదేశాల మేరకు 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొల్లేరు ఆపరేషన్ చేపట్టారు. నష్టపోయిన రైతులు, సొసైటీ సభ్యులకు ఊహించని రీతిలో నష్టపరిహారం అందించారు. 600 సొసైటీల్లో ఉన్న వేలాది మందికి స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికీ రూ.30 వేల రుణం అందించారు. ఆ మొత్తాలను తిరిగి చెల్లించలేకపోతున్నారని తెలిసి ఆ రుణాలన్నింటినీ రద్దు చేశారు. కొల్లేరు అభయారణ్యం పరిధిని ఐదో  కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదిస్తూ 2008లో శాసనసభలో తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానాన్ని  కేంద్రానికి పంపగా, కేంద్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలపై జైరాం రమేష్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. ఆ తర్వాత మహానేత మరణంతో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ర్ట ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకకపోవడంతో తీర్మానం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.

తాగునీటి సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం


హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, తాగునీటి సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల నిరసన మధ్య.. సీఆర్‌డీఏ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్టు సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.

రైలు ప్రయాణికులకు బీమా అవకాశం ఉందా?


రైలు ప్రయాణికులకు బీమా అవకాశం ఉందా?
ప్రశ్నోత్తరాల సమయంలో పొంగులేటి ప్రస్తావన
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే శాఖపై భారం తగ్గేలా ఏవైనా బీమా కంపెనీల భాగస్వామ్యంతో రైలు ప్రయాణికులకు ప్రమాద బీమా కల్పించే యోచన ఏదైనా ఉందా? అంటూ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్రాన్ని సోమవారం ప్రశ్నించారు.

అలాంటి సౌకర్యం లేనిపక్షంలో ప్రమాదాల్లో ప్రాణాలు, సామాన్లు కోల్పోయిన ప్రయాణికులకు పరిహారం చెల్లించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ ఆయన లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సమాధానమిస్తూ అలాంటి యోచనేదీ ప్రభుత్వానికి లేదని వివరించారు. బీమా అంశంతో సంబంధం లేకుండా ప్రస్తుతం పరిహారం అందజేస్తున్నట్టు తెలిపారు.

షరతులు, నిబంధనలు, పరిమితులు, కోతలు పెడతామని అప్పుడు చెప్పలేదేం?


రుణ మాఫీ పేరుతో ముంచేశారు..
* చంద్రబాబు సర్కారుపై ప్రతిపక్ష నేత జగన్ నిప్పులు
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి?
షరతులు, నిబంధనలు, పరిమితులు, కోతలు పెడతామని అప్పుడు చెప్పలేదేం?
యాభై వేల రూపాయల రుణం ఉంటే.. రూ. 15 కే మాఫీ అర్హత ఉందన్నారు
అందులోనూ తొలి విడత కింద మూడంటే మూడు రూపాయలే జమ చేశారు
తొలి విడత రుణ మాఫీ అంటూ ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వడ్డీలకూ సరిపోలేదు
ప్రభుత్వ నిర్వాకంతో రైతులు వడ్డీ రాయితీ, వడ్డీ లేని రుణాలు కోల్పోయారు
రుణ బకాయిలు తీరనందున ఈ ఏడాది పంటల బీమాకూ నోచుకోలేదు
580 మండలాల్లో కరవు తాండవిస్తోంటే 226 మండలాల్లోనే అని ప్రకటిచారు
ఏడు నెలల్లో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సర్కారు గుర్తించలేదు
ఎన్నికల హామీలను ఎలాంటి షరతులు, పరిమితులు లేకుండా అమలుచేయాలి


సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. రకరకా ల నిబంధనలు, పరిమితులతో రైతులను మో సం చేశారని, రుణమాఫీ పేరుతో రైతులను రుణగ్రస్తులను.. మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రుణమాఫీ చేస్తున్నామంటున్న ప్రభుత్వం.. వాస్తవంగా అనేక నిబంధనలతో రైతులను ఎంత దగా చేస్తోందో నిండు సభలో కేస్ స్టడీస్‌లతో సహా ఎండగట్టారు. తొలి విడత కిం ద జమ చేసిన మొత్తం.. వడ్డీ కిందకు కూడా సరిపోలేదన్నారు. ఐదేళ్లలో ఐదు వాయిదాల్లో చెల్లించే మొత్తాలు వడ్డీలకూ చాలకపోతే.. ఇక అసలు రుణం ఎప్పుడు తీరుతుందని నిలదీశారు.

 సర్కారు వైఖరి కారణంగా రైతులకు రుణ బకాయిలు తీరకపోగా.. వడ్డీ లేని రుణాలను కోల్పోయారని, పైగా అపరాధ వడ్డీ భారం పెరిగిపోతోందని, పంట బీమాకూ నోచుకోలేకపోయారని, ఈ ఏడాది కొత్త రుణాలూ లభించలేదని.. బ్యాంకర్ల కమిటీల లెక్కలను సభ ముందు పెట్టారు. ఇటు బ్యాంకుల్లో రుణ భారం పెరుగుతుండగా.. వ్యవసాయం కోసం ప్రైవేటు అప్పులు చేసిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం 344 నిబంధన కింద రాష్ట్ర శాసనసభలో రుణ మాఫీపై చర్చ జరిగింది. ఈ చర్చను ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

రైతులపై భారమని బ్యాంకర్లే చెప్పారు
‘‘వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? మార్చి 31 నాటికి రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు, రూ. 14,204 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సంఘం (ఎస్‌ఎల్‌బీసీ) 184వ సమావేశంలో సీఎం చంద్రబాబు సమక్షంలోనే చెప్పింది. రుణాలు రీషెడ్యూల్ చేసుకోకపోవడం వల్ల పంటల బీమా రక్షణ రైతులకు లేకుండా పోతోందని.. బ్యాంకర్లు స్పష్టంగా చెప్పారు.  

కొత్త రుణాలూ దక్కలేదు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ మాఫీ పేరుతో రైతులను ప్రభుత్వం మోసం చేయడం వల్ల.. ఈ ఏడాది వారికి కొత్త రుణాలూ అందలేదు. రైతులకు రూ. 56,019 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకుంటే.. ఇచ్చింది రూ. 7,263 కోట్లే. రబీకి ఇచ్చిన రుణాలు కలిపినా రూ. 10 వేల కోట్లు దాటలేదని తాజా లెక్కలు చెప్తున్నాయి. మిగతా రూ. 46 వేల కోట్ల రుణాలను రైతులు రూ. 2-3 వడ్డీకి ప్రయివేటు వ్యక్తుల నుంచి తెచ్చుకున్నారు. డ్వాక్రా రుణాల పరిస్థితీ అంతే. ఈ ఏడాది (2014-15)లో రూ. 12,274 కోట్లు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా.. నవంబర్ ఆఖరు వరకు ఇచ్చింది కేవలం రూ. 2,179 కోట్లే. డ్వాక్రా మహిళలు రూ. 10 వేల కోట్ల రుణాలు తీసుకొనే అవకాశాన్ని కోల్పోయారు.

ఎంత మాఫీ చేస్తున్నారో చెప్పరేం?
అధికారంలోకి వచ్చాక రకరకాల పరిమితులు, నిబంధనలు, షరతులు విధిస్తామని అన్నారా? బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి ఉపయోగించుకొనే ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ను మాఫీలో కోతలు వేయడానికి వాడుకుంటామని ఒక్కసారైనా ఎన్నికల ముందు చెప్పారా? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, ఆధార్, రేషన్ కార్డులకు ముడిపెడతామని, అందరికీ కాకుండా కొందరికే కొంతమేరే రుణ మాఫీ చేస్తామని, అది కూడా వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తామని, అది వడ్డీకీ సరి పోదని.. ఒక్కసభలో అయినా రైతులకు టీడీపీ చెప్పిందా? ప్రభుత్వం రుణ మాఫీకి ఇచ్చింది రూ. 4,644 కోట్లే.  ఇప్పటికైనా చంద్రబాబు.. రుణాల మాఫీకి ఎంత ఇస్తున్నా రు? వడ్డీకి ఎంత? అసలుకు ఎంత? చెప్పడం లేదు.

వడ్డీలేని రుణాలకు మంగళం ...
ప్రభుత్వం చెల్లించిన మాఫీ సొమ్ము పోనూ, మిగతా రుణాలను చెల్లించి రీషెడ్యూలు చేసి, 4% వడ్డీ ప్రయోజనం పొందాలని కొండపి సభలో చంద్రబాబు రైతులకు సూచించినట్లు ‘ఈనాడు’లో వచ్చింది. వడ్డీకి సరిపోయేంత కూడా మాఫీ సొమ్ము కింద ప్రభుత్వం జమచేయక రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉంటే.. రుణాలు చెల్లించి, రీషెడ్యూలు చేసుకోవాలని చంద్రబాబు సూచించడం ఏమిటి? ఎన్నికల ముందు రుణాలు చెల్లించవద్దని చెప్పి.. ఇప్పుడేమో చెల్లించమని చెప్పడం ఏమి న్యాయం? ‘ఏరు దాటాక...’ అన్నట్టు ఇప్పుడు బాబు ఇలా చెబుతున్నారు. 4% వడ్డీ ప్రయోజనం గురించి మాట్లాడుతున్నారంటే.. వడ్డీలేని రుణాలకు మంగళం పాడినట్లే కదా! కొంతమందికైనా వడ్డీ సొమ్ము మాఫీ కింద రాలేదు. కేస్ స్టడీస్ కొన్ని సభ దృష్టికి తెస్తా. ఇవన్నీ బ్యాంకు పత్రాలే.

రుణాల మంజూరు లక్ష్యానికి ఎంతో దూరంగా..
ఏటా రుణాల మంజూరు లక్ష్యం, బ్యాంకులు రైతులకు ఇచ్చిన రుణాల వివరాలను చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ మాఫీ పేరుతో రైతులను ప్రభుత్వం మోసం చేయడం వల్ల లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నదీ తెలిసిపోతుంది.
సంవత్సరం     లక్ష్యం               మంజూరైన మొత్తం
2011-12    రూ. 31,877 కోట్లు    రూ. 35,615 కోట్లు
2012-13    రూ. 35,654 కోట్లు    రూ. 50,060 కోట్లు
2013-14    రూ. 47,017 కోట్లు    రూ. 49,774 కోట్లు
2014-15    రూ. 56,019 కోట్లు    రూ. 7,263 కోట్లు
                                 (ఖరీఫ్ ముగిసే నాటికి)

తొలి వాయిదా మాఫీ ‘మూడు రూపాయలు’...
-    రూ. 50 వేల రుణం తీసుకుంటే రుణ మాఫీ అర్హత మొత్తం రూ.15 అని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు వాయిదాల్లో మాఫీ చేసిన రూ. 15 చెల్లిస్తామని, తొలిసారి రూ. 3ను బ్యాంకు ఖాతాకు  జమ చేసింది.
-    కృష్ణా జిల్లా నందివాడ జనార్థనపురానికి చెందిన మలినేటి రమ్య కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 2013 ఏప్రిల్ 19న మూడు ఎకరాల్లో వరి సాగుకు రూ. 70,350 రుణం తీసుకున్నారు. ఆమె రుణం తీసుకున్న సమయంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వరికి రూ. 24 వేలుగా నిర్ధారించారు. ప్రభుత్వం రుణ మాఫీ కోసం ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను రూ. 19 వేలుకు తగ్గించింది. దీని ప్రకారం ఆమె తీసుకున్న రుణంలో రూ. 57,190 మాఫీకి అర్హతగా ప్రభుత్వం నిర్ధారించింది. 2013 డిసెంబర్ వరకు వడ్డీతో కలిపి రూ. 59,800 మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పింది.

 వాస్తవంగా ఇప్పటి వరకు అయిన వడ్డీ రూ. 10,491. తొలి వాయిదా కింద ప్రభుత్వం జమ చేసిన మొత్తం రూ. 11,960. ఈ ఏ డాది వడ్డీని తీసేస్తే.. అసలుకు జమ అయ్యే మొత్తం రూ. 1469. అసలు నుంచి ఈ రూ. 1469ని తీసేస్తే.. ఇంకా రూ. 68,881 అప్పు బ్యాంకులో ఉంటుంది. 14 శాతం వడ్డీ రేటు ప్రకారం వచ్చే ఏడాది రూ. 9,643 వడ్డీ భారం పడుతుంది. ప్రభుత్వం వచ్చే ఏడాది రెండో వాయిదా కింద రూ. 11,960 జమ చేస్తుంది. వడ్డీపోనూ అసలులోకి జమ అయ్యే మొత్తం రూ. 1917. ఇలా ఐదేళ్లపాటు  వడ్డీకే సరిపోతుంది. ఐదు సంవత్సరాల తర్వాత బ్యాంకులో మిగిలే సొమ్మును ఎవరు తీర్చాలి?

-    తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీర వెంకటసత్యనారాయణ 0.55 ఎకరాల భూమిలో వరి సాగు కోసం 2013 జూలై 15న రూ. 34 వేల రుణం తీసుకున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ. 13,200 మాఫీకి అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. తొలి వాయిదా కింద రూ. 2,762ను ప్రభుత్వం జమ చేసింది. 14 శాతం వడ్డీ ప్రకారం.. ఆయన ఖాతాలో రూ. 4,760 వడ్డీని బ్యాంకు అసలుకు కలిపేసింది. ప్రభుత్వం చేసిన విచిత్రమైన రుణమాఫీ ఫలితంగా ఇంకా రూ. 2 వేల వడ్డీ రైతు మీద పడింది.
-    విజయనగరం జిల్లా చంద్రంపేటకు చెందిన బి.రామూనాయుడు 0.55 ఎకరాల మీద తీసుకున్న రుణంలో మాఫీ చేసిన మొత్తం రూ. 15. తొలి వాయిదా కింద ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ. 3. మూడంటే మూడు రూపాయలే.  

86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు...
ఏపీలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కరవుతో రైతులు అల్లాడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని రుణ ఊబిలో కూరుకుపోయాయి. ఫలితంగా టీడీపీ ప్రభుత్వం వచ్చాక 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సాధారణ వర్షపాతం కంటే 35 శాతం తక్కువగా వర్షపాతం నమోదయింది. 580 మండలాల్లో కరవు తాండవిస్తోందని స్వయంగా సంబంధిత మంత్రే చెప్తుంటే.. ప్రభుత్వం 226 మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించింది. అది కూడా శాసనసభ సమావేశాలకు ఒక రోజు ముం దు.. ఈ నెల 17న రాత్రి పది గంటలకు జీవో ఇచ్చింది. నవంబర్ ప్రారంభానికే కరవు మండలాల ప్రకటన వస్తే, రబీకి ఎలాంటి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలో నిర్ణయించడానికి, రైతులకు సకాలంలో అందించడానికి వీలవుతుంది.

86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వాటిని ప్రభుత్వం గుర్తిం చనూ లేదు. వారి పరిహారం చెల్లించాల్సి ఉం టుందనే కారణంతోనే ప్రభుత్వం గుర్తించడం లేదు. ఈ కుటుంబాలను కూడా ఇంటింటీకి వెళ్లి ఓదార్చుతాను. అప్పుడైనా మీకు బుద్ధొస్తుంది. షరతులు, నిబంధనలు, పరిమితులు లేకుండా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చంద్రబాబుకు సూటిగా చెప్తున్నా.’’

Popular Posts

Topics :