16 March 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

చంద్రబాబు మాటపై నిలబడరు: వైఎస్ షర్మిల

Written By news on Saturday, March 22, 2014 | 3/22/2014

చంద్రబాబు మాటపై నిలబడరు: వైఎస్ షర్మిలవీడియోకి క్లిక్ చేయండి
చీరాల: మాట మీద నిలబడటం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చేతకాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమాన్ని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు ఆచరణ సాధ్యంకాని హామీల్ని ఇస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని కోరారు. జనపథం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా చీరాలలో శనివారం జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. చీరాలలో ఆమెకు కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

రాష్ట్రాన్ని విభజించవద్దంటూ జగనన్న జాతీయ నేతలను కలిసి అభ్యర్థించారని షర్మిల గుర్తుచేశారు. జగనన్న ఆధ్వర్యంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. జగనన్నకు ఒక్క అవకాశం ఇస్తే.. మీ సంక్షేమం కోసం జీవితాన్ని ధార పోస్తారని షర్మిల చెప్పారు. జగనన్నను సీఎం చేసుకుని, రాజన్న రాజ్యాన్ని స్థాపిద్దామని షర్మిల కోరారు.

ఆయన హయాంలో భయానక పరిపాలన

మోసం చేయడమే చంద్రబాబు నైజంవీడియోకి క్లిక్ చేయండి
తూ.గో: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏనాడూ అభివృద్ధిని పట్టించుకోని చంద్రబాబు..ఇప్పుడు అబద్దాల హామీలతో ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆయన నీచమైన రాజకీయాలు చేసేందుకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల రోడ్ షోలో భాగంగా జిల్లాలోని పెద్దాపురం సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. చంద్రబాబుకి ఏమైనా తెలిసి ఉంటే అది మోసం చేయటమేనిని జగన్ ఎద్దేవా చేశారు. అసలు మోసం చేయడమే బాబు నైజమని అభివర్ణించారు.
 
ఆరోగ్యం కోసం అప్పులు చేసి జీవితాంతం ఊడిగం చేసే పాడు రోజులు చూశామని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. ఆయన హయాంలో భయానక పరిపాలన చూశామన్నారు. బాబు పాలనలో నిరుపేదలకు పక్కాఇళ్లు వచ్చేవికావని, వరుస కరువులతో చితికిపోయిన రైతన్నలను కరెంట్ బిల్లుల కోసం జైళ్లల్లో పెట్టిన ఘనుడు చంద్రబాబునేనని జగన్ తెలిపారు. బక్కచిక్కిన రైతులను చంద్రబాబు ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. గ్రామగ్రామాన బెల్ట్‌షాపులు ఏర్పాటు చేసిన ఘనత మాత్రం బాబుకే దక్కుతుందని జగన్ స్పష్టం చేశారు. 'లక్షన్నర కోట్ల అప్పు మాఫీ చేస్తానని అబద్దాలతో వస్తున్నాడు. పదేళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు... ఆల్ ఫ్రీ వాగ్దానాలతో మోస పోకండి. ఎన్నికల తర్వాత చంద్రబాబు పార్టీ ఉంటుందో లేదో చెప్పడం కష్టం. చంద్రబాబుకు లేనిది, నాకు ఉన్నది విశ్వసనీయత ఒక్కటే' అని జగన్ తెలిపారు. 
 
పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఆయనకు  ప్రజలను మోసం చేయడం ఏమంత కష్టం కాదన్నారు. ఆనాడు రైతులను జైల్లో పెట్టించిన బాబు.. రైతులకు రుణాలు మాఫీ చేస్తానంటూ ఎన్నికల ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  పేదవాడి ఆరోగ్యం కోసం తపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్సారేనని జగన్ తెలిపారు. ప్రతీ పేదవాడు పెద్దాసుపత్రులకు వెళ్లగలిగేలా చేసింది మాత్రం ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అని ప్రజలకు మరోమారు గుర్తు చేశారు. తిరిగి రాజన్న రాజ్యాన్ని చూడాలంటే రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆత్మకూరు అంటేనే భయం: కంటనీరు పెట్టుకున్న విజయమ్మ

ఆత్మకూరు అంటేనే భయం: కంటనీరు పెట్టుకున్న విజయమ్మ
కర్నూలు: ఆత్మకూరు అంటేనే చాలా భయమేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు.   వైఎస్ఆర్ కాంగ్రెస్ జనపథంలో భాగంగా  కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఈరోజు  జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ప్రజల కోసం ఆ రోజు రాత్రికి తిరిగివస్తానన్న రాజశేఖర రెడ్డి గారు తిరిగిరాని లోకానికి వెళ్లడంతో ఆత్మకూరు అంటేనే భయం కలుగుతోందని కంటనీరు పెట్టుకున్నారు.

ప్రజల కోసం వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ది పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ లతోపాటు వారిని బీసీ ఈలో కలపడంతో వారికి ఎంతో ఉపయోగపడిందన్నారు. ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, తెలుగు గంగ ఇరిగేషన్ వీటి ద్వారా ఈ జిల్లాలో రైతులు రెండు సార్లు పంటలు పండిచుకుంటున్నారని చెప్పారు.  ఆ ఘనత వైఎస్ఆర్ దేనన్నారు.  2006లో సిద్ధాపురం ఇరిగేషన్ కు  వైఎస్ శంకుస్థాపనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.   ఆయన మరణాంతరం ఈ పనులు నిలిచిపోయాయని బాధపడ్డారు. అవి పూర్తికావాలంటే జగన్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు.  జగన్ ముఖ్యమంత్రి అయితే శ్రీశైలం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

కాంగ్రెస్ లీడర్లకు పునరావాస కేంద్రంగా టీడీపీ

టీడీపీకి ఎమ్మెల్యేలు, కేడర్ లేదా?
హైదరాబాద్:  టీడీపీకి ఎమ్మెల్యేలు కరువైనట్లు ఉన్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. శనివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. టీడీపీకి కేడర్ తో పాటు,  ఎమ్మెల్యేలు ఎవరూ లేనట్లు ఆ పార్టీలో చేరిన కాంగ్రెస్ వారిని చంద్రబాబు నాయుడు పెద్ద బలంగా  భావిస్తున్నారని విమర్శించారు.  ఆనాడు ఎఫ్ డీఐల విషయంలో కాంగ్రెస్ కు టీడీపీ సహకరించిన విధానాన్ని వాసిరెడ్డి పద్మ మరోమారు గుర్తు చేశారు. అప్పట్నుంచి రెండు పార్టీ విధానాలు ఒకటేనన్న విషయం అందరికీ అర్ధమైందన్నారు. ఇక టీడీపీ దుకాణాన్ని మూసుకోవాల్సిందేనన్నారు.
 
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఓదర్పుయాత్ర చేయొద్దనడం నుండి రాష్ట్ర విభజన వరకు కాంగ్రెస్ ఎన్నో తప్పులు చేస్తూ పోతే, దానికి టీడీపీ పునరావాసం అయిందన్నారు. చంద్రబాబుకు ప్రజల కోసం పాటుపడడానికి ఏనాడు చేతులు రాలేదు కాని, ఈ రోజు పార్టీలో చేరిన వారికి పచ్చ జెండాలు కప్పడానికి మాత్రం చేతులు వస్తున్నాయని విమర్శించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీని ఎవరూ నమ్మడం లేదని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
 
కాంగ్రెస్ నేతలను చేర్చుకునేందుకు బాబు చేస్తున్న హడావిడి చూస్తుంటే జాలేస్తుందన్నారు. కాంగ్రెస్ లీడర్లకు పునరావాస కేంద్రంగా టీడీపీ మారిందన్నారు. లీడర్లు తప్ప కేడర్ లేని పార్టీ కాంగ్రెస్‌ అని ఆమె అభివర్ణించారు. చంద్రబాబూ... మీకు కాంగ్రెస్‌ వాళ్లంటే ఎందుకంత మమకారం? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.  సోనియా గాంధీ. చంద్రబాబులది ఒకే విధానమని, జగన్‌ను ఎలా ఎదుర్కోవాలన్నదే వీరి సిద్ధాంతమని తెలిపారు. చంద్రబాబు ఇంకా ఊతకర్రలతో నడవాలనుకుంటున్నారని, 65ఏళ్లు వచ్చినా అధికారంపై ఆశ చావలేదని పద్మ విమర్శించారు.

మన భవిష్యత్‌ను మనమే

'ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన ఘనత బాబుది'
ఒంగోలు : ఓటు వేసే ముందు ఒక్కసారి వైఎస్‌ఆర్‌ను గుర్తుకు తెచ్చుకోవాలని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల శనివారం ప్రకాశం జిల్లా అద్దంకిలో పర్యటించారు. షర్మిలకు అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమెకు బ్రహ్మరధం పట్టారు.  ఈ  సందర్భంగా షర్మిల మాట్లాడుతూ  రైతులను రాజులా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని, ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత ఆయనదేనని అన్నారు. వైఎస్ఆర్ రైతుల పక్షపాతి అని,ఆయన హయాం...రైతుల పాలిట స్వర్ణయుగమని ఆమె గుర్తు చేశారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ తో పేదలకు పెద్ద చదువులు అందయని షర్మిల తెలిపారు. చంద్రబాబు 16లక్షల మందికి పింఛన్లు ఇస్తే... వైఎస్‌ఆర్‌ 71లక్షల మందికి పింఛన్లు ఇచ్చారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసింది వైఎస్‌ రాజశేఖరరెడ్డేనని షర్మిల అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కిరణ్ సర్కార్ వైఎస్ పథకాలకు తూట్లు పొడిచిందని ఆమె మండిపడ్డారు. పిల్లనివ్వటమే కాకుండా, రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన ఘటన చంద్రబాబుదన్నారు. హార్స్‌ పవర్‌ ఛార్జీని రూ.50 నుంచి 600 చేసిన ఘనుడు చంద్రబాబు అని షర్మిల ధ్వజమెత్తారు.

మన భవిష్యత్‌ను మనమే నిర్ణయించుకుందామని షర్మిల అన్నారు. ప్రధానమంత్రి కుర్చీలో ఎవరు కుర్చోవాలో మనమే నిర్ణయిద్దామని ఆమె అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నూతన అధ్యాయం నిర్మించుకుందామని, ప్రజల సంక్షేమం కోసం జగనన్న తన జీవితాన్ని త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసి...మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని షర్మిల పిలుపునిచ్చారు

జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: ముత్యాల పాప

జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: ముత్యాల పాప
కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ది ఒక్క వైఎస్ జగన్ వల్లే సాధ్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాల పాప స్పష్టం చేశారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ముత్యాల పాప పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ముత్యాల పాప మాట్లాడుతూ... స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమన్నారు. ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ కూడా పాల్గొన్నారు.
 

కేంద్రంలో జగన్ కీలకపాత్ర పోషిస్తారు

'కేంద్రంలో జగన్ కీలకపాత్ర పోషిస్తారు'
చిత్తూరు: తెలుగుదేశం పార్టీకి ప్రజాబలం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో 150 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 30 ఎంపీ సీట్లు గెలుచుకుని కేంద్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలన్నీ కలిసినా తమకు ప్రతిపక్షం కాలేవని ఆయన అన్నారు.

మండపేట.. మమకారపు కోట

మండపేట..   మమకారపు కోట
‘తాపేశ్వరం కాజా’ను ‘తీపిలో రారాజు’ అనొచ్చు. ఆ వంటకం పొరల నడుమ ఇమిడి ఉండే తేనెలాంటి మధురాతి మధురమైన రసమే దానికి కారణం. అలాంటి మాధుర్యాన్నే తలదన్నే మమతల మధువు ప్రజల మనసు పొరల నుంచి జాలు వారుతుండగా తనివి తీరా చవి చూశారు జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.

 మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ సాగిస్తున్న ఆయన శుక్రవారం మండపేటలో రోడ్ షో నిర్వహించారు. ఆ పట్టణానికి ప్రతీక వంటి కలువపువ్వు సెంటర్‌తో సహా ప్రతి కూడలిలో జనాభిమానం వేలరేకులుగా వికసించింది.
 
 సాక్షి, మండపేట :
 ఎవరైనా ఎన్నికల ప్రచారం అంటే ‘మా అభ్యర్థికి ఓటేయండి. మా గుర్తుకు ఓటేయండి’ అని అభ్యర్థిస్తారు. కానీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ప్రజల బాగోగులు, కష్టసుఖాలు తెలుసుకుంటూ.. ‘ఆ మహానేత వరవడి పదిలంగానే ఉంది’ అన్న భరోసాను కలిగించారు.
 
 ఎండ మండినా, ఉక్కబోసినా.. అణుమాత్రం అలుపెరగక, వేలమందితో మమేకమయ్యారు. ‘అవ్వా ఎలాగున్నావ్.. అయ్యా బాగున్నవా.. అమ్మా ఏంచేస్తున్నావ్’ అంటూ ఎదలోతుల్లోంచి ఎగసే ఆత్మీయతను పంచారు. వారిని అక్కున చేర్చుకున్నారు. ఇక ప్రజలు.. నిప్పులు చెరిగే ఎండను నలుసంత లక్ష్యపెట్టకుండా తమ అభిమాననేతను చూసేందుకు బాటలకిరువైపులా గంటల తరబడి నిరీక్షించారు. జననేతను చూడగానే పట్టలేని ఆనందంతో జేజేలు పలికారు. ఆయనను దగ్గరగా చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు.
 
ఆయనను ఎన్నికల ప్రచారానికి వచ్చిన నాయకునిలా కాక తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తూ ఆప్యాయతానురాగాలు కురిపించారు. తన వ ద్దకు రాలేని అశక్తులను చూసి, ఎద కదిలిన జననేత తానే వాహనం దిగి వారి దగ్గరకు వెళ్లి అనునయించారు. అది చూసిన జనం ‘మహానేత తనయుడనిపించుకున్నారు.
 
ఆయనలాగే మా కష్టాలు కడతేర్చేందు కు కంకణం కట్టుకున్నారు’ అంటూ మురిసిపోయారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదో రోజైన శుక్రవారం మండపేటలో జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన రోడ్ షోకు కనివినీ ఎరుగని స్పందన లభించింది. పార్టీ మండపేట కో ఆర్డినేటర్ గిరజాల వెంకటస్వామినాయుడు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పినిపే విశ్వరూప్, మండపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ఎస్ చౌదరిలతో కలిసి నిర్వహించిన ఈ రోడ్ షో సాగినంత మేరా మండపేట మొత్తం కదిలివచ్చిందా అన్నట్టు జనసంద్రమైంది. దారులకిరువైపులా జనం కిక్కిరిసిపోయారు.
 
 అడుగడుగునా హారతులు..
మెయిన్‌రోడ్లోని చౌదరి గెస్ట్‌హౌస్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రోడ్ షో పెదకాల్వవంతెన వరకూ సాగింది. కామత్ మోటార్స్ ఎదురుగా పార్టీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో వందలాదిమంది మహిళలు, యువకులు జగన్ బొమ్మలతో ఉన్న ప్లకార్డులు చేబూని అపూర్వ స్వాగతం పలికారు.
 
 ప్రత్యేకంగా రూపొందించిన ‘ఫ్యాన్’ను జననేతకు బహూకరించారు. రాజారత్నం సెంటర్ నుంచి ఎస్సీ కాలనీ, కొండపల్లివారి వీధి, న్యూ కాలనీ, మారేడుబాక సెంటర్, కేపీ రోడ్డు సెంటర్, కలువపువ్వు సెంటర్ వరకు రోడ్లు జనప్రవాహాన్ని తలపించాయి. అడుగడుగునా మహిళలు హారతులివ్వగా, యువకులు, చిన్నారులు పూలవర్షం కురిపించారు. ఎస్సీ పేట, కొండపల్లివారి వీధి, న్యూ కాలనీ వాసులు రోడ్లపైకి వచ్చి జగన్నినాదాలు చేశారు.
 
 జగన్‌ను చూసిన వృద్ధులు తమ కుమారుడే కష్టపడుతున్నట్టు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయనను అక్కున చేర్చుకొని ‘నువ్వు చల్లంగుండాలయ్యా’ అని దీవించారు. వారితో పాటు మహిళలు ఆయనకు తాపేశ్వరం కాజా, తొక్కుడులడ్డూ, కొబ్బరి నీళ్లు, శీతల పానీయాలు ఇచ్చి తమ అభిమానాన్ని చాటారు. ‘మేమంతా నీకు అండగా ఉంటాం. నీకే ఓటేస్తాం’ అంటూ స్పష్టం చేశారు. వారి మమతానురాగాలకు ఉద్వేగానికి లోనైన జననేత ‘మరో రెండు నెలల్లో రాజన్న రాజ్యం వస్తుంది.. మీ అందరికీ మంచి రోజులొస్తాయి’ అని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.
 
ఓపిక పట్టండి.. వచ్చేది మన సర్కారే..
 ఏడేళ్ల క్రితం వంట చేస్తుండగా ముఖమంతా కాలిపోయిన అరివి లోవమ్మ అనే మహిళ రాజారత్నం సెంటర్లోజగన్‌ను కలిసి ఆదుకోవాలంటూ గోడు వెళ్ల బోసుకుంది. ‘మన ప్రభుత్వమొచ్చిన వెంటనే ఆదుకుంటా’నని జగన్ భరోసా ఇచ్చారు. ట్రైసైకిల్‌పై వచ్చిన నందికోళ్ల రాజు, దుర్గా దున్నా అనే వికలాంగుల వద్దకు తానే వెళ్లి పరామర్శించారు.
 
 ‘మరో రెండు నెలల్లో మీకు పింఛన్ వెయ్యి రూపాయలు చేస్తా’నని చెప్పారు. అంధురాలైన లంకా నారమ్మ ఇంటికి వెళ్లి ‘పింఛన్ వస్తోందా తల్లీ’ అని ఆరా తీశారు. రావడం లేదని చెప్పగా ‘కొంచెం ఓపిక పట్టమ్మా.. 1000 పింఛన్ ఇప్పిస్తా’నని ధైర్యం చెప్పారు. ముమ్మిడివరపు నాగమణి అనే పోలియో బాధితురాల్ని పరామర్శించారు. న్యూ కాలనీలో రెండుకాళ్లు చచ్చుబడిన నిమ్మలపూడి సత్యనారాయణ ఇంటికి వెళ్లి పరామర్శించారు.
 
 పార్వతమ్మ అనే 95 ఏళ్ల వృద్ధురాలిని కాన్వాయ్‌పై నుంచే చూసి ఆమె వద్దకు వెళ్లి ‘అవ్వా బాగున్నావా’ అంటూ పలకరించడంతో ‘నువ్వు చల్లంగుండు బాబూ’ అని దీవించింది. తనపై కొండంత అభిమానంతో, కడలంత నమ్మకంతో వచ్చిన  వారందరికీ అభివాదం చేస్తూ, జననేత వారి కష్టసుఖాలను ఓపిగ్గా విన్నారు. పట్టణ పరిధిలో సుమారు ఆరు కిలోమీటర్ల మేర సాగిన రోడ్  షోకు ఏకంగా పది గంటలకు పైగా పట్టిందంటే జన నేతపై జనాదరణ ఏ స్థాయిలో అర్థమవుతుంది.
 
 మారుమూలన ఉన్న తమ పేటలకు ఏ రాష్ర్టస్థాయి నాయకులూ రాలేదని, జగన్ ఒక్కరే తమ గడప దగ్గరకు వచ్చారని సామాన్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. రోడ్ షోలో రాష్ర్ట మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, సీఈసీ సభ్యుడు రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్, కో ఆర్డినేటర్లు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు, బొంతు రాజేశ్వరరావు, అనంత ఉదయభాస్కర్, అనుబంధ విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, రాష్ర్ట యూత్, బీసీ కమిటీల సభ్యులు తాడి విజయభాస్కరరెడ్డి, పెంకే వెంకట్రావు, యువజన నాయకుడు జక్కంపూడి రాజా, మిండగుదిటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. మండపేటలో రోడ్ షో అనంతరం జగన్ సామర్లకోట చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు.

స్థానిక ఎన్నికల్లో విజయభేరి మోగిస్తాం

స్థానిక ఎన్నికల్లో విజయభేరి మోగిస్తాంవైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
దొండపాడు(మేళ్లచెర్వు), న్యూస్‌లైన్ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకుని విజయభేరి మోగి స్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని దొండపాడు గ్రామంలో ఆ పార్టీ నాయకుడు గున్నంనాగిరెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బలంగా ఉన్న ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిధిలో వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందన్నారు. స్థానికంగా కాంగ్రెస్, టీడీపీ, బీ జేపీ యేతర పార్టీలతో పొత్తులు ఉంటాయన్నారు.
 
  కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఒకే నెలలో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి   ఉన్నప్పుడే హుజూర్‌నగర్  నియో జకవర్గంలో అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. మేళ్లచెర్వు మండలం దొండపాడు, నక్కగూడెం ఎత్తిపోతల పథకాలు, పులిచింతల ముంపు గ్రా మా ల ప్రజలకు పునరావాస ప్యాకేజీ, మం డలంలోని పరిశ్రమలకు పూర్తి స్థాయి సౌ లభ్యాలు, ఇతర అభివృద్ధి పనులు రాజశేఖరరెడ్డి హ యాంలోనే జరిగినట్లు చెప్పారు.
 
 గత 20 ఏళ్లుగా ఎమ్మెల్యే, మం త్రిగా ఉన్న ప్రస్తు త టీపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండలానికి ఒక్క పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను గానీ తీసుకరాలేక పోయారని విమర్శించారు. ఆయన వెంట వేముల శేఖర్‌రెడ్డి,  మల్లయ్య యాదవ్, విజయభాస్కర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంతులేని అభిమానం ముందు మండుటెండ కూడా చిన్నబోయింది

మార్కాపురం సభలో మాట్లాడుతున్న షర్మిల
‘జన’భేరి
  ఒంగోలు :అంతులేని అభిమానం ముందు మండుటెండ కూడా చిన్నబోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వంలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల గిద్దలూరులో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన సభకు జనం వేలాదిగా తరలివచ్చారు. ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. మార్కాపురంలో సాయంత్రం 4 గంటలకు రావాల్సిన షర్మిల ఆరు గంటలకు వచ్చినా..ఆమె కోసం ప్రజలు వేయికళ్లతో ఎదురుచూశారు.

షర్మిల జనభేరి యాత్ర శుక్రవారం ఉదయం పది గంటలకు కనిగిరి నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్ సీపీ  నియోజకవర్గ సమన్వయకర్త ముక్కుకాశిరెడ్డి ఆమెకు వీడ్కోలు పలకగా..అక్కడ నుంచి గిద్దలూరు చేరుకున్నారు. ఆమెకు దారిపొడవునా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆమె వెంట వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. గిద్దలూరులో షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి వైఖరిని ఎండగట్టారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో విసిగిపోయిన ప్రజలు ఆయన్ను ఓడించారని తెలిపారు. వైఎస్సార్ చేపట్టిన పథకాలను గుర్తుచేశారు.

 మున్సిపాలిటీలతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఓటువేయాలని కోరారు. గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్  అభ్యర్థి వెంకటసుబ్బమ్మలను ప్రజలకు పరిచయం చేశారు. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు పార్టీ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని తెలిపారు.

ఆయన మరణించి ఐదేళ్లు దాటుతున్నా ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేకపోతున్నారన్నారు. మున్సిపల్ నుంచి శాసనసభ ఎన్నికల వరకు అన్నింటా కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. బడుగు, బలహీనవర్గాల వారికి అండగా నిలబడేది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్,  దర్శి, గిద్దలూరు సమన్వయకర్తలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వై వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు రంగారెడ్డి, భాస్కర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి తదితరులతో పాటు, గిద్దలూరు పరిసర ప్రాంతాల్లోని మండలాల కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు.

 మార్కాపురంలో  పోటెత్తిన అభిమానం..
 మార్కాపురంలో  పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. దాదాపు అరగంటపాటు సాగిన షర్మిల ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, ఉడుముల శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ కనకదుర్గ ఇతర మున్సిపల్ వార్డు అభ్యర్థులు,  పార్టీ నాయకులు పాల్గొన్నారు.  

షర్మిల మార్కాపురంలో సభ ముగించుకుని, త్రిపురాంతకం మీదుగా గుంటూరు జిల్లా వినుకొండకు బయలుదేరారు. మార్గ మధ్యంలో అడుగడుగునా ఆమెకు ఘన స్వాగతం లభించింది. చిన్న పిల్లలను ముద్దాడుతూ, ఆశీర్వదించేందుకు వచ్చిన ముసలివారిని అక్కున చేర్చుకుంటూ షర్మిల పర్యటన సాగింది.

కాపుపై కక్ష సాధిస్తున్నారు

కాపుపై కక్ష సాధిస్తున్నారువీడియోకి క్లిక్ చేయండి
వాసిరెడ్డి పద్మ ఆగ్రహం
 
 సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనానికి తట్టుకోలేక కాంగ్రెస్, టీడీపీలు రెండూ పోలీసులను ఉపయోగించుకుని తమ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కక్ష సాధింపులకు దిగుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.  ఇటీవల రాయదుర్గంలోని వందలాది మంది పార్టీ సర్పంచ్‌లపై బైండోవర్ కేసులు పెట్టి వారిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి వేధిస్తుంటే అందుకు నిరసనగా రామచంద్రారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన  సంఘటనను దృష్టిలో ఉంచుకునే పోలీసులు ఆయనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ జేబులోనూ, జేసీ దివాకర్‌రెడ్డి జేబులోనూ ఉంటూ వారి చేతిలో పావులాగా మారిపోయారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ఆయన ఇంటిపై సోదాలు చేసి ఏవో వస్తువులు దొరికాయని కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రామచంద్రారెడ్డి కుటుంబం రాజకీయాల్లోకి రాక ముందునుంచీ వందలాది మంది  నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించే దాతృత్వం ఉందని,  అందుకు సంబంధించిన వస్తువులు వారింట్లో ఉంటే దానిని సాకుగా చేసుకుని అరెస్టు చేశారని చెప్పారు. పోలీసులను అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నేతలు ఉపయోగించుకుంటున్న తీరును తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆమె చెప్పారు.
 
 డీజీపీకి ఫిర్యాదు: అనంతపురం జిల్లా రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి అక్కడి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కక్షకట్టి తప్పుడు కేసు నమోదు చేశారని వైఎస్సార్ సీపీ నేతలు రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. పార్టీ జన రల్ సెక్రటరీ కె.శివకుమార్ నేతత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవా రం డీజీపీని కలిసి వినతిపత్రం అందించింది. గతంలో ఆ ఇన్‌స్పెక్టర్ కొందరు అమాయకుల్ని పోలీసుస్టేషన్‌కు పిలిపించి దౌర్జన్యం చేశారని, ఆ సందర్భంలో రామచంద్రారెడ్డి పోలీసు దౌర్జన్యాన్ని ప్రశ్నించడంతోపాటు దానికి నిరసనగా పోలీసుస్టేషన్ వద్దే విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో కక్షకట్టిన ఇన్‌స్పెక్టర్ ఎన్నికల సందర్భంలో రామచంద్రారెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ఆయనపై తప్పుడు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయన ఇప్పటికీ ఎలాంటి నామినేషన్ దాఖలు చేయని నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన సెక్షన్లు వర్తించవని తెలి పారు. వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన డీజీపీ పూర్తి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ మేరకు అనంతపురం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

యువ నాయకత్వాన్ని కోరుకుంటున్న ప్రజలు

శ్రీకాకుళం అర్బన్:
 రాష్ట్ర ప్రజలంతా యువ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని 31వ వార్డు గుడివీధి, దమ్మలవీధి తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఇంటింటికీ పర్యటించి వైఎస్‌ఆర్ సీపీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు వివరించారు.
 
 ఫ్యాన్ గుర్తుపైనే ఓటువేసి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ నాయకుడైన జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగన్‌తోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా విశ్వసిస్తున్నారన్నారు.
 
 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులను ఎవరూ మరచిపోలేదన్నారు. ఇపుడు కూడా ఆ పార్టీకి ఓటువేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లేనన్నారు. పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెడతారన్నారు.
 
 తద్వారా ఇటు విద్యార్థుల చదువు, అటు ఆ తల్లికి కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి, చల్లా అలివేలు మంగ, పైడి రాజారావు, జె.ఎం.శ్రీనివాస్, అబ్దుల్ రెహమాన్, టి.కామేశ్వరి, ఎన్ని ధనుంజయ్, మండవిల్లి రవి, కె.ఎల్.ప్రసాద్, శిమ్మ వెంకట్రావు, గుడ్ల మల్లేశ్వరరావు, కోరాడ రమేష్, రావాడ జోగినాయుడు, చల్లా మంజుల, గుంట జ్యోతి, డబ్బీరు విజయలక్ష్మి, శ్రీనివాస్ పట్నాయక్, కర్నేని హరి, కూన వాసుదేవరావు, పొన్నాడ రుషి, పిల్లల నీలాద్రి, గుమ్మా నగేష్‌పాల్గొన్నారు.

నిజంగా స్వర్ణయుగమే..

వైఎస్ హయాంలో  ప్రతి మహిళా లక్షాధికారే
  • డ్వాక్రా గ్రూపులకు  వరదలా రుణాల పంపిణీ
  •  పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల అందజేత
 కార్పొరేషన్, న్యూస్‌లైన్ : స్వయం సహాయక సంఘాలకు (డ్వాక్రా) 2004-09 మధ్య కాలం ఒక స్వర్ణయుగం.  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక ఆసరా కల్పించారు. క్షేత్రస్థాయి నుంచి గ్రూపులను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టారు. నిర్లిప్తంగా ఉన్న ఇందిర క్రాంతిపథం విభాగాన్ని పటిష్టం చేశారు. బ్యాంకర్లతో మాట్లాడి స్వయంసహాయక సంఘాలకు ఇబ్బడిముబ్బడిగా రుణాలు మంజూరుచేయిం చారు.

ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానన్న మాటకు కట్టుబడ్డారు. పావలా వడ్డీ రుణాలు, పిల్లలకు స్కాలర్‌షిప్పులు, ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు, అభయహస్తం, ఆమ్‌ఆద్మీ, జనశ్రీ బీమాయోజన, దీపం వంటి పథకాలతో మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. ఉపాధి హామీ, పనికి ఆహారం వంటి పథకాల్లోనూ స్వయం సహాయక సంఘ సభ్యులకు భాగస్వామ్యం కల్పించారు.  గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించారు.
 
నెరవేరిన సొంతింటి కల
 
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించారు. చేతి వృత్తుల్లో రాణించారు.   అప్పులు సకాలంలో చెల్లించడంతో కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకొచ్చారు. ఒక్కో గ్రూపు (పదిమంది సభ్యులు)కు 2004కు ముందు లక్ష రూపాయల రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముప్పుతిప్పలు పెట్టేవారు.  వైఎస్ హయాంలో  ఒక్కో గ్రూపునకు రూ.5-10 లక్షల వరకు గ్రూపు రుణాలు అందాయంటే  మార్పును అర్థం చేసుకోవచ్చు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా గ్రూపుల్లోని అర్హులైన మహిళలకు ఇళ్లు కేటాయించారు.  మహిళ సొంతింటి కల నెరవేరినట్లయింది.
 
సంక్షేమ సంతకం.. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 12 వేల స్వయం సహాయక సంఘాలుండగా.. గుడివాడలో 1,689, జగ్గయ్యపేటలో 935, మచిలీపట్నంలో 3,369, నందిగామలో 640, నూజి వీడులో 709, పెడన లో 631, తిరువూరులో 602, ఉయ్యూరులో 625 డ్వాక్రా గ్రూపులు పనిచేస్తున్నాయి. ఎనిమిది మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పరిధిలో 2,67,465 మంది మహిళలు వైఎస్ వల్ల లబ్ధిపొందారు.

2009లో రెండోసారి అధికారంలోకి వచ్చాక  డ్వాక్రా సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో నెలవారీ పింఛన్ ఇచ్చేందుకు అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు.  నగరంసహా జిల్లాలో 44,378 మంది ఈ పథకంలో చేరారు. జనశ్రీ బీమాయోజన ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యురాలితో పాటు కుటుంబం మొత్తానికి బీమా కల్పించారు. పథకంలోని సభ్యుల పిల్లలకు  ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు  స్కాలర్‌షిప్పులు అందించారు. సంక్షేమ సంతకంతో వైఎస్ స్వయం సహాయక సంఘ మహిళల జీవితాల్లో  కొత్త వెలుగులు నింపారు.
 
 నిజంగా స్వర్ణయుగమే..
 వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నిజంగా స్వర్ణయుగమే. ఆ రోజుల్లో పావలా వడ్డీ రుణాలు సక్రమంగా ఇచ్చేవారు. గత ప్రభుత్వ పాలనలో రుణాలందక నానా బాధలు అనుభవించాం.. మళ్లీ డ్వాక్రా సంఘాలకు నూతన తేజం రావాలంటే వైఎస్‌లాంటి మనిషి అధికారంలోకి రావాలి.
 - గంగునేని ప్రభావతి, శ్రీలక్ష్మీ డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు, మండవల్లి
 
 ఎందరికో లాభదాయకం..
 డ్వాక్రా మహిళలకు రుణాలు పెంచడంతోపాటు అభయహస్తం, పావలా వడ్డీరుణాలు అందించడమే కాకుండా పక్కా ఇళ్ల నిర్మాణం మహిళల పేరుతో జరిపించిన మహానేత వైఎస్ చరిత్రలో నిలిచిపోతారు. ఆయన మహిళలకు చేసిన సేవలను మేం ఎన్నటికీ మరువలేం. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలతో పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు మేలు చేశారు.     
 -వేల్పుల పద్మకుమారి, జిల్లా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు, పెనుగంచిప్రోలు
 
 మహిళలకు రాజన్న పెద్దపీట
 ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానని భరోసా ఇచ్చి.. ఆచరించి చూపి.. మహిళలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రిగా రాజన్న చరిత్రలో మిగిలిపోతారు. ఆయన ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాలకు రుణాలు సక్రమంగా అందేవి. ఆయన హఠాన్మరణం చెందాక మమ్మల్ని పట్టించుకున్న వారే లేరు. ఇది నిజంగా మా దురదృష్టం.      
 - వరిగంజి చాందినీకళ, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు, హనుమాన్‌జంక్షన్
 

బాబుకు ఓటడిగే ధైర్యముందా?

జగన్ తో మళ్లీ సువర్ణ పాలన
 కర్నూలు జిల్లా పర్యటనలో వైఎస్ విజయమ్మ ఉద్ఘాటన
 

 బాబుకు ఓటడిగే ధైర్యముందా?

 ‘‘చంద్రబాబూ నువ్వు రెండు ఎకరాల నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించావు? తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఏమి చేయకపోయినా నువ్వు.. రామోజీరావు, సీఎం రమేశ్, మురళీమోహన్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి వంటి వారికి మాత్రం రాష్ట్రాన్ని దోచి పెట్టావు. చంద్రబాబు అత్యంత అవినీతి పరుడని తెహల్కా డాట్ కామ్ ఏనాడో చెప్పింది. నాడు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి ఊరూరా బెల్ట్‌షాపులు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడిన ఘనత చంద్రబాబుదే. ఆడపిల్లలు పుడితే రూ. 5వేలు, మహిళలకు బంగారు మంగళసూత్రాలు, విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేకపోయారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటీ చేయని నీకు ఓటు అడిగే దమ్ము, ధైర్యం ఉందా చంద్రబాబూ?’’    - విజయమ్మ

 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేసీ కాల్వల పరిధిలో రైతులు ఏడాదికి రెండుసార్లు పంటలు పండించుకున్నారు. రైతులు ధర్నా చేసే అవకాశమే రాకుండా ఆయన పాలన సాగించారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లు కట్టిస్తే.. వైఎస్సార్ గుడిసే లేని రాష్ట్రం చేయాలన్న తలంపుతో ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించి పేదల సొంతింటి కల నెరవేర్చారు. జగన్ బాబు కూడా నాన్నలాగానే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. వైఎస్.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతి నెలా 1నే పింఛన్ అందించారు. అభయహస్తం పథకం పేరుతో 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చారు. వైఎస్ మరణంతో ఈ పథకంతోపాటు ఎన్నో పథకాలు మూలనపడ్డాయి. వైఎస్సార్ సంక్షేమ పథకాలు నిర్విఘ్నంగా అమలు కావాలంటే అది జగన్‌తోనే సాధ్యమవుతుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రంలో వైఎస్సార్ సువర్ణ పాలనను తిరిగి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. అమ్మ ఒడి, వృద్ధులకు రూ.700 పింఛన్, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ పథకాలపై జగన్‌బాబు హామీ ఇచ్చార న్నారు. రెండో రోజు శుక్రవారం ఆమె కర్నూలు జిల్లాలోని బనగానపల్లె నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, వెంకటాపురం, నంద్యాలలో విజయమ్మ రోడ్‌షో, బహిరంగ సమావేశాల్లో ప్రసంగించారు.

ప్రతి మహిళనూ లక్షాధికారిని చేస్తాను..

అక్కాచెల్లెళ్ల కన్నీరు తుడుస్తా
 రూ.20వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా
 తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో వైఎస్ జగన్ పునరుద్ఘాటన

 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు.. తీసుకున్న అప్పుకు ప్రతి నెలా రెండేసి వేలు వాయిదాలు కట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీలు కట్టేందుకు మరోసారి అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు తీర్చేందుకు పనులకు వెళ్లడమే కాకుండా తమ పిల్లలను కూడా పనులకు తీసుకువెళ్లే దయనీయ పరిస్థితి చూశాను. అక్కా, చెల్లెమ్మలకు అప్పుల ఊబి నుంచి విముక్తి కల్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు వారు తీసుకున్న డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించాను. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజే ఆ రుణాల మాఫీ ఫైలుపై సంతకం చేస్తాను.. అక్కాచెల్లెళ్ల కన్నీరు తుడుస్తాను’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదో రోజుశుక్రవారం మండపేట పట్టణంలో జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. జనస్పందన వెల్లువెత్తడంతో ఐదు కిలోమీటర్ల మేరరోడ్‌షోకు పదిగంటలకుపైగా పట్టింది. పురవీధుల్లో కిక్కిరిసిన జనసందోహం మధ్య రాత్రి 9 గంటల వరకు జగన్ పర్యటించారు. దారిపొడవునా జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. మంగళహారతులు పడుతూ, పూలవర్షం కురిపిస్తూ, భారీ బాణసంచాతో జననీరాజనాలు పలికారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో మండపేట రోడ్లన్నీ జనసునామీని తలపించాయి. దారి పొడవునా ప్రజలు జగన్‌ను కలిసి.. అధికారంలోకి రాగానే తమ కష్టాలు తీర్చాలంటూ పలు సమస్యలు చెప్పుకొన్నారు. రాబోయేది ప్రజల ప్రభుత్వమేనని జగన్ వారికి భరోసా ఇచ్చారు.
 
 ప్రతి మహిళనూ లక్షాధికారిని చేస్తాను..
 
 మండపేట మారేడుబాక సెంటర్‌లో బంధువుల ఇంటికి వచ్చిన పశ్చిమగోదావరి జిల్లా రెడ్డిపోలవరానికి చెందిన పోలపర్తి సాయికుమారి స్థానిక డ్వాక్రా సంఘ సభ్యులతో కలిసి జగన్ దగ్గరకొచ్చారు. ‘అన్నా మీరు.. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెబుతున్నారు.. రోజూ టీవీల్లో చూస్తున్నాం’ అని అన్నారు. ‘రుణమాఫీ అనేది భారంతో కూడుకున్న పని. అయినప్పటికీ నా డ్వాక్రా అక్కాచెల్లెమ్మల కోసం వారు తీసుకున్న రూ.20వేల కోట్ల డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానమ్మా. అంతేకాదు వడ్డీ లేని రుణాలిస్తాను. ఆ మహానేత కలలు కన్నట్టుగా ప్రతీ మహిళను లక్షాధికారిని చేస్తా. మీరంతా నిశ్చింతగా సంతోషంగా ఉండండి.. అదే నాక్కావాల్సింది’ అని జగన్ వారికి ధైర్యం చెప్పారు.
 
 వికలాంగులకు రూ.వెయ్యి పింఛను
 
 రోడ్ షో సాగుతుండగా.. ఎస్సీ కాలనీకి చెందిన ముమ్మిడివరపు నాగమణి అనే రెండు చేతులు, కాళ్లూ లేని వికలాంగురాలిని క్వాన్వాయ్‌పై నుంచే చూసిన జగన్ వాహనం దిగి ఆమె దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరిం చారు. కనీసం రెండు చేతులూ ఎత్తి నమస్కరించలేకపోతున్నానంటూ ఆమె విలపించడంతో జగన్ చలించిపోయారు. ‘అన్నా.. మీ నాన్న గారి దయ వల్ల మాకు రూ.500పింఛన్ వస్తోంది.. అయితే అది ఏమూలకూ సరిపోవడం లేదన్నా’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. మరో రెండు నెలల్లో రాజన్న కలలుగన్న మన ప్రభుత్వం రాగానే మీ పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచుతానమ్మా అంటూ జగన్ చెప్పడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయింది.
 
 అందరికీ ధైర్యం చెబుతూ..
 
 ఎస్సీ కాలనీలోనే.. నిమ్మన మంగరాజు అనే వృద్ధుడు ఇంటి మెట్ల వద్ద వేచి చూస్తుం డడాన్ని గమనించిన జగన్ వాహనం దిగి ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. ఆయన బాగోలు అడిగి తెలుసుకున్నారు. మార్గమధ్యంలో కలిసిన పలువురు వృద్ధులు పింఛను డబ్బులు సరిపోవడం లేదని చెప్పగా.. తమ ప్రభుత్వం రాగానే రూ.200 పింఛన్‌ను రూ.700 చేస్తామని భరోసా ఇచ్చారు. రామాలయంసెంటర్‌లో జగన్‌ను కలిసిన పలివెల జయసుశీల అనే మహిళ.. తనకొడుకు పలివెల వెంకన్నకు రెండు కాళ్లూ లేవని, ఏమీచేయలేని స్థితిలో ఇంటిలోనే ఉంటున్నాడని బోరున విలపించింది. ఆమె కన్నీరును తుడిచిన జగన్.. మన ప్రభుత్వం రాగానే ఆదుకుంటానని చెప్పారు.
 
 వైద్యం చేయించుకోలేకపోతున్నా.. ఆదుకోండి..
 

 రాజారత్న రోడ్‌లో వేమగిరి లోవమ్మ అనే మహిళ జగన్‌ను కలిసి.. గతంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒళ్లంతా కాలిపోయిందని, భర్త రిక్షా కార్మికుడు కావడం తో ఆర్థిక స్థోమతలేక వైద్యం చేయించుకోలేకపోతున్నానంటూ వాపోయింది. ముఖమంతా కాలిపోయి మాట్లాడేందుకు సైతం ఇబ్బందిపడుతున్న ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చిన జగన్ ‘త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది.. తప్పకుండా మీ కష్టాలు తీరుస్తా’నని ధైర్యం చెప్పారు. అలాగే పూరిగుడిసెలో ఉంటున్న అన్నందేవుల పాపమ్మ వద్దకు వెళ్లిన జగన్ వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, రాజన్న రాజ్యంలో పింఛన్ పెంచుతామంటూ హామీ ఇచ్చారు.
 
 విజయమ్మగా నామకరణం..
 
 న్యూకాలనీలో వారా సూర్యచంద్రశేఖర్, చిన్నారి దంపతులు తమ మొదటి సంతానమైన మూడు నెలల పసికందును తీసుకొచ్చి పేరు పెట్టి ఆశీర్వదించాలని జగన్‌ను కోరారు. ఆ చిన్నారిని చేతిలోకి తీసుకొని జగన్ ముద్దాడి విజయమ్మగా నామకరణం చేశారు. వెన్నెముక దెబ్బతిని మంచాన పడ్డ టేకి కుమారస్వామి ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తనకు ఇద్దరు కుమార్తెలను పోషించడం చాలా ఇబ్బందిగా ఉందని, వారిద్దరికీ పెళ్లిళ్లు ఎలా చేయాలోనంటూ కన్నీటిపర్యంతమయ్యారు. సూర్యచంద్రా పేపర్‌మిల్లు నుంచి ఎటువంటి పరిహారం అందలేదని చెప్పగా, మీకు కాబోయే ఎమ్మెల్యే గిరజాల వెంకటస్వామినాయుడు అన్ని విధాలా సాయమందిస్తారని చెప్పారు. పరిహారం సమస్యను పరిష్కరించాలని జగన్ ఆయనకు సూచించారు.
 
 పార్టీలో చేరికలు..
 

 జగన్ సమక్షంలో విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, కామత్‌రాజు, బిఎన్ పాత్రుడు, జహీరాబాద్‌కు చెందిన మొయిద్దీన్ పార్టీలో చేరారు. వారికి జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రోడ్ షోలో అమలాపురం పార్లమెంటు అభ్యర్థి, ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, మండపేట కోఆర్డినేటర్ గిరజాల వెంకటస్వామి నాయుడు,  మండపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

జన బలం ఉన్న నేత జగన్

జన బలం ఉన్న నేత జగన్
నరసాపురం అర్బన్ :
దేశంలో ప్రజాబలం ఉన్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి ప్రసాదరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక 14వ వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని కొత్తపల్లి ప్రారంభించారు.
 
 అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాదరాజుతో కలిసి మాట్లాడారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, పేదల కష్టాలు తీరాలన్నా జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల వారు భావిస్తున్నారన్నారు. నరసాపురం మునిసిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా సాయినాథ్ ప్రసాద్‌ను ఎంపిక చేసినట్టు ప్రకటించారు.  31 వార్డుల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
 ఏడాదిలోనే వశిష్ట వంతెన
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏడాదిలోనే నరసాపురం వశిష్ట వంతెన నిర్మాణం జరుగుతుందని నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు. వంతెన ప్రాధాన్యతను, ఇక్కడి ప్రజల కోరికను జగన్‌మోహన్‌రెడ్డి అర్థం చేసుకున్నారన్నారు.
 
 పట్టణంలో పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలంటే వైసీపీని అధికారంలోకి తేవాలన్నారు. జిల్లాలోని అత్యధిక మునిసిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందన్నారు. చైర్మన్ అభ్యర్థి సాయినాథ్ ప్రసాద్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
 
 ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, పార్టీ సీనియర్ నేతలు పీడీ రాజు, పాలంకి ప్రసాద్, ఏడిద కోట సత్యనారాయణ (వైకేఎస్), దొంగ గోపి,  కూనపరెడ్డి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

స్ధానిక ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరవేయలి : ముమ్మడి బాలిరెడ్డి

Written By news on Friday, March 21, 2014 | 3/21/2014

కువైట్: కువైట్ మలియా ప్రాంతములో ఉన్నా పార్టీ కార్యాలయములో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ జాయింట్ కో అర్డినేటర్ యం. బాలిరెడ్డి గారి ఆధ్వర్యములో  రాష్ట్ర ఎన్. ఆర్. ఐ వర్కింగ్ కమిటి సభ్యులు అడ్ హక్ కమిటి సభ్యులతో సర్వ సభ్య సమావేశము నిర్వహించారు. ఈ సందర్భముగా బాలిరెడ్డి గారు మాట్లాడుతూ   కడప  కార్పోరేషన్,  పులివెందల, రాయచోటి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్, మైదుకూర్, లలో జరిగే మునిసిపాల్ ఎన్నికల కొరకు కువైట్ లో ఉన్నా ఆ ప్రాంతాల వివిధ సంఘాల నాయకులతో సమావేశము నిర్వహించి స్ధానిక ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు వారి కుటుంబ సభ్యుల ఓటు వేయమని అడగాలని తెలిపారు. కమిటి సభ్యులు కూడా మునిసిపాల్ ఎన్నికలు జరిగే ప్రాంతాలలో తమ బంధువులు స్నేహితులు ఉంటే మన పార్టీ అభ్యర్ధులకు మద్దతు పలకాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు

జగనన్న ఆధ్వర్యంలో నూతన అధ్యాయానికి నాంది

కిరణ్ కుమార్ పాలనలో అన్ని ధరలూ పెరిగాయి: వినుకొండ జనపథంలో షర్మిలవీడియోకి క్లిక్ చేయండి
గుంటూరు: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఓ ఒక్క పన్నూ పెరగలేదని, కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో అన్నీ ధరలు పెరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్ఆర్ ఇచ్చిన పెన్షన్లన్నీ కిరణ్ సర్కార్ తొలగించిందని విమర్శించారు. వైఎస్ఆర్ జనపథంలో భాగంగా శుక్రవారం గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన సభలో షర్మిల ప్రసంగించారు.

కిరణ్ పాలనను ప్రతిపక్షనేతగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏనాడు ప్రశ్నించలేదని చెప్పారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై విప్‌ జారి చేసి సర్కార్‌ను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని షర్మిల విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీకి ఓట్లు వేసిన ప్రజలను పిచ్చోళ్లను చేసి, కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని షర్మిల ఆరోపించారు. చంద్రబాబు చీకట్లో చిదంబరంను కలిసి కాంగ్రెస్‌కు దాసోహమయ్యారని అన్నారు.

పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబేనని షర్మిల విమర్శించారు. ఎన్టీయార్ పై చెప్పులేయించిన ఘనత కూడా చంద్రబాబుదేనని అన్నారు. ఉచితంగా వైద్యం అందించాలనే ఆలోచన బాబుకు రాలేదని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ ప్రతి పథకాన్ని అమలు చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. 9ఏళ్లలో రుణమాఫీ చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు  రాలేదని, రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ దుర్మార్గంగా వీడదీస్తుంటే, విభజనకు మద్దతుగా చంద్రబాబు  లేఖ ఇచ్చారని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని విభజించవద్దంటూ జగనన్న జాతీయ నేతలను కలిసి అభ్యర్థించారని షర్మిల గుర్తుచేశారు. జగనన్న ఆధ్వర్యంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. జగనన్నకు ఒక్క అవకాశం ఇస్తే.. మీ సంక్షేమం కోసం జీవితాన్ని ధార పోస్తారని షర్మిల చెప్పారు. జగనన్నను సీఎం చేసుకుని, రాజన్న రాజ్యాన్ని స్థాపిద్దామని షర్మిల కోరారు.

వైఎస్సార్ అంటేనే ఒక ఆశయం, నమ్మకం, భరోసా

వైఎస్సార్ అంటేనే ఒక ఆశయం, నమ్మకం, భరోసావీడియోకి క్లిక్ చేయండి
కర్నూలు:దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే ఒక ఆశయం, నమ్మకం, భరోసా అని వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. జిల్లాలోని ఆళ్లగడ్డ ఎన్నికల రోడ్ షో ప్రసంగించిన విజయమ్మకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.  కార్పొరేట్ వైద్యం చేయించుకోవడానికి పేదవాడు భయపడకూడదనే ఉద్దేశంతోనే ఆనాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంగతిని గుర్తు చేశారు. ప్రతీ పేదవాడికి వైద్యం దగ్గరగా ఉండాలని యోచన చేయబట్టే ఆరోగ్యశ్రీ పథకాన్నిరాజశేఖరెడ్డి ఆచరణలో పెట్టి విజయవంతమైయ్యారన్నారు.
 
అంతేకాకుండా అత్యవసర సేవల్లో భాగంగా108ను తీసుకువచ్చారని తెలిపారు. విద్యార్థుల కోసం  ఫీజురీయింబర్స్‌మెంట్‌ ను,రైతుల సౌభాగ్యం కోసం జలయజ్ఞం తలపెట్టారన్నారు. వైఎస్ఆర్ అంటేనే ఒక ఆశయం, నమ్మకం, భరోసా అని విజయమ్మ తెలిపారు. ప్రతి గ్రామంలో బెల్టుషాపులు పుట్టడానికి  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమన్నారు. ఇప్పుడు అన్నీ ఆల్ ఫ్రీ అంటున్నచంద్రబాబు తన హయాంలో పేదవాడికి ఏమైనా చేశారాని ఆమె ప్రశ్నించారు. విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచమని అడిగితే లాఠీఛార్జ్ చేయించారన్నారు. ఉద్యోగుల్లో 65 శాతం మంది అవినీతి ఉద్యోగులున్నారని ఆనాడు చంద్రబాబు ఆరోపించారన్నారు. ఆయన పాలన అంతా అవినీతిమయమేనని విజయమ్మ అభివర్ణించారు. రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకురావడానికి కృషి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వైఎస్ ఉంటే విద్యుత్ చార్జీలు పెరిగేవా?

విద్యుత్ చార్జీల పెంపు దారుణమని, దీనివల్ల రాష్ట్రంలోని సామాన్య ప్రజలపై వెయ్యి కోట్ల రూపాయల మేర భారం పడుతుందని వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో వైఎస్ఆర్ జనపథం కార్యక్రమానికి అశేష సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే బతికుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఆయన హయాంలో విద్యుత్ చార్జీలను ఒక్క రూపాయి కూడా ఏనాడూ పెంచలేదని వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని చెప్పారు. ఇక కర్నూలు జిల్లా బనగానపల్లె అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాటసాని రామిరెడ్డి, అలాగే నంద్యాల ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎస్పీవై రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ పరిశీలకులు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకోసం వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లాలవారీగా పార్టీ పరిశీలకులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. పరిశీలకుల వివరాలు..
 
కొయ్య ప్రసాదరెడ్డి (శ్రీకాకుళం), పిరియా సాయిరాజ్ (విజయనగరం), సుజయకృష్ణ రంగారావు (విశాఖపట్నం), జి.ఎస్.రావు (తూర్పుగోదావరి), కె.దొరబాబు (పశ్చిమ గోదావరి), పి.రామచంద్రారెడ్డి (కృష్ణా), డాక్టర్ జహీర్ అహ్మద్ (గుంటూరు), చిన వెంకటరెడ్డి (ప్రకాశం), జ్ఞానేందర్‌రెడ్డి (నెల్లూరు), వైఎస్ వివేకానందరెడ్డి (చిత్తూరు), పి.రవీంద్రనాథ్‌రెడ్డి (అనంతపురం), వైఎస్ అవినాష్‌రెడ్డి (వైఎస్సార్ కడప), చదిపిరాళ్ల నారాయణరెడ్డి-ఎమ్మెల్సీ (కర్నూలు), వినాయక్‌రెడ్డి (ఆదిలాబాద్), నాయుడు ప్రకాష్ (నిజామాబాద్), సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి (కరీంనగర్), డాక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి (మెదక్), గాదె నిరంజన్‌రెడ్డి (రంగారెడ్డి), గున్నం నాగిరెడ్డి (మహబూబ్‌నగర్), గట్టు శ్రీకాంత్‌రెడ్డి (నల్లగొండ), ఎం.సోమేశ్వర్‌రావు (వరంగల్), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఖమ్మం).

ఉత్సాహంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు

షర్మిల రోడ్‌షో సక్సెస్
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలిలో గురువారం నిర్వహించిన రోడ్‌షో విజయవంతమైంది. షర్మిలను చూడగానే హర్షధ్వానాల మధ్య జోహార్ వైఎస్సార్, జైజగన్ అంటూ పట్టణవాసులు నినాదాలు చేశారు. ఉదయం నెల్లూరు నుంచి కావలికి బయలుదేరిన షర్మిలకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.  రోడ్‌షో అనంతరం ఆమె ప్రకాశం జిల్లాకు తరలివెళ్లారు.
 
 - ఉత్సాహంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు
 కావలి, న్యూస్‌లైన్: కావలి పట్ట ణంలో గురువారం షర్మిల నిర్వ హించిన రోడ్‌షో సక్సెస్ అయిం ది. తొలుత స్థానిక ఏఎం బేకరీ సెంటర్ వద్ద పాస్టర్లు షర్మిలకు సంఘీభావం తెలిపారు. రాజ న్న బిడ్డను చూసేందుకు జనా లు పెద్దసంఖ్యలో వీధుల్లో గుమికూడారు. స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో షర్మిల ప్రసంగించారు. పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్, ట్రంకురోడ్డు పరిసర ప్రాంతాలు జనాలతో కిక్కిరిసాయి. ప్రజలు ఎం డను సైతం లెక్క చేయకుండా షర్మిల ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా ఆలకించారు.
 
 షర్మిల వైఎస్సార్ పేరు ఉచ్చరించినప్పుడల్లా ప్రజలు వెంటనే జోహార్ వైఎస్సార్ అంటూ ప్రజలు నినాదాలిచ్చారు. అక్కడి నుంచి రోడ్ షో పట్టణ ఉత్తర శివారు ప్రాంతం వరకు సాగింది. పట్టణంలోని వార్డుల్లో మున్సిపల్ కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న వారిని  షర్మిలకు ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి,  వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు పోనుగోటి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

వీఆర్ రామిరెడ్డిని ఆశీర్వదించండి

 వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డిని ఆశీర్వదించాలని తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలకు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థిగా వీఆర్ రామిరెడ్డి ఎన్నికల బరిలో ఉంటారని.. ఆయన్ను గెలిపించి జగన్‌బాబు సీఎం కావడానికి సహకరించాలన్నారు.
 
 ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె పట్టణంలోని వైఎస్ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. అంతకు మించిన అభివృద్ధి జరగాలంటే వైఎస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం అన్ని వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే అంబిక (రమేష్ రెడ్డి భార్య)ను చైర్‌పర్సన్ చేస్తామని చెప్పారు. అలాగే అనంత వెంకట్రామిరెడ్డిని కూడా గెలిపించాలని కోరారు

ఆడబిడ్డకు అపూర్వ స్వాగతం

ఆడబిడ్డకు అపూర్వ స్వాగతం
 తాడిపత్రిలో జనసంద్రం పోటెత్తింది.. తమ ఆడబిడ్డ వైఎస్ విజయమ్మ (పుట్టినిల్లు ఇదే నియోజకవర్గంలోని చీమలవాగుపల్లె)ను తాడిపత్రి ప్రజానీకం అక్కున చేర్చుకుంది.. తాడిపత్రిలోకి ప్రవేశించింది మొదలు బనగానపల్లికి బయలుదేరే వరకు జనం ఆమెపై బంతిపూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, అనంతపురం :  తాడిపత్రిలో వైఎస్ విజయమ్మ రోడ్‌షోకు రికార్డు స్థాయిలో జనం పోటెత్తడం వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపింది. నూతనోత్సాహంతో ఆ పార్టీ శ్రేణులు విజయం దిశగా కదంతొక్కుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జిల్లాలో కదిరి నుంచి వైఎస్ విజయమ్మ ప్రచార శంఖారావాన్ని పూరించారు. ఆదివారం కదిరి, పుట్టపర్తి, హిందూపురం.. సోమవారం మడకశిర, ధర్మవరం, అనంతపురం.. మంగళవారం కళ్యాణదుర్గం, రాయదుర్గం.. బుధవారం గుంతకల్లు, గుత్తి, పామిడిలో వైఎస్ విజయమ్మ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి అపూర్వ జనస్పందన లభించడంతో ప్రత్యర్థి పార్టీల నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
 
 బుధవారం రాత్రి బుక్కరాయసముద్రం సమీపంలోని ఎస్‌ఆర్‌ఐటీ కాలేజీలో బసచేసిన ఆమె.. గురువారం ఉదయం 10.30 గంటలకు అక్కడి నుంచి తాడిపత్రికి బయలుదేరారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ సొంతూరు తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి. అనంతపురం జిల్లా అల్లుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట వేశారు. తమ ఆడబిడ్డ పుట్టింటికి వస్తోండటంతో ఆ ప్రాంత ప్రజానీకం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
 
 ఆడబిడ్డ కోసం కదలివచ్చారు. తాడిపత్రి శివారులోని నందలపాడు క్రాస్ వద్దకు 11.20 గంటలకు చేరుకున్న వైఎస్ విజయమ్మకు వేలాది మంది ప్రజానీకం ఘన స్వాగతం పలికారు. నందలపాడు క్రాస్ నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం జనప్రవాహం పోటెత్తింది. వైఎస్ విజయమ్మ ప్రచారరథం వెంట జనం పరుగులు తీశారు. అభిమానసంద్రం అడుగడుగునా అడ్డుపడటం.. హారతులు పట్టడం.. బంతిపూల వర్షం కురిపించడంతో నందలపాడు సర్కిల్ నుంచి వైఎస్సార్ సర్కిల్‌కు చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టింది. రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి రెండు గంటల సమయం పట్టిందంటే జనం ఏ స్థాయిలో పోటెత్తారో విశదం చేసుకోవచ్చు. వైఎస్సార్ సర్కిల్‌లో ఇసకేస్తే రాలని రీతిలో కిక్కిరిసిన అభిమానులను ఉద్దేశించి వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి తాడిపత్రి, పులివెందులను రెండు కళ్లుగా భావించారు. తాడిపత్రి అభివృద్ధి కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేశారు.. చాగల్లు, పెండేకల్లు రిజర్వాయర్లను పూర్తి చేశారు. రూ.500 కోట్లతో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని మంజూరు చేశారు.. తాడిపత్రిలో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేశారు.. వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట వేస్తారు.. ఆశీర్వదించండి’ అంటూ వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. వైఎస్ విజయమ్మ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న జనం.. ‘తాడిపత్రి మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ ఖాతాలో వేసి.. ఆడబిడ్డకు కానుకగా ఇస్తాం’ అంటూ పెద్ద ఎత్తున స్పందించారు. వైఎస్ విజయమ్మ రోడ్‌షో బంపర్ హిట్ కావడం ‘తెలుగుదేశం - కాంగ్రెస్’ నేతల వెన్నులో వణుకు పుట్టించింది.

నేటి నుంచి గుంటూరు జిల్లాలో షర్మిల పర్యటన

నేటి నుంచి జిల్లాలో షర్మిల పర్యటన
21 నుంచి 25 వరకు రోడ్‌షో
 పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం
 వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ వెల్లడి

 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం నుంచి  జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఐదు రోజులపాటు జరగనున్న ఈ ప్రచార కార్యక్రమం వినుకొండ నుంచి ప్రారంభిస్తారు. జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 33 రోజులపాటు షర్మిల పాదయాత్ర చేశారు.
 
 ఈ సందర్భంగా జరిగిన సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధిష్టానంపై ఆమె చేసిన విమర్శలకు ప్రజల నుంచి  అనూహ్య స్పందన లభించింది.  పాదయాత్రలో భాగంగా పేద, బల హీనవర్గాల ప్రజల బాధలకు కొన్ని చోట్ల వెంటనే స్పందించి సహాయం అందించే ఏర్పాట్లు చేశారు.
 
 కొన్ని గ్రామాల్లో సామాజిక సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. అప్పులు తీర్చలేక కిడ్నీలు అమ్ముకున్న పేదవారిని పరామర్శించారు. ఆర్థిక వెసులుబాటు లేక చదవు మధ్యలో నిలిపివేసిన కొందరు విద్యార్థులు మళ్లీ కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విధంగా చూశారు.
 
 పాదయాత్రలో వృద్ధులు, మహిళలపై ఆమె చూపిన ఆదరణ, ఆప్యాయతలను జిల్లా ప్రజలు ఇంకా మననం చేసుకుంటూనే ఉన్నారు. పాదయాత్ర తరువాత గత ఏడాది ఆగస్టు 11 వ తేదీన గుంటూరులో విజయమ్మ చేపట్టిన దీక్షకు మద్దతుగా షర్మిల హాజరయ్యారు.  మారిన రాజకీయ పరిణామక్రమంలో విపక్షాల కుట్రలను  ప్రజలకు వివరించేందుకు జిల్లాలో గత ఏడాది సెప్టెంబరు 11న బస్‌యాత్రను నిర్వహించారు.
 
 పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ...
 ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ నెల 6,7 తేదీల్లో ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. పదిహేను రోజుల అనంతరం  జగన్ సోదరి షర్మిల ఎన్నికల  ప్రచారానికి వస్తుండటంతో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.
 
 వినుకొండ నుంచి ప్రారంభం..
 చిలకలూరిపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 21వ తేదీ నుంచి 25 వరకు జిల్లాలోని మున్సిపల్ పట్టణాల్లో పర్యటించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ వెల్లడించారు.
 
 గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల పర్యటన వివరాలను ఆయన ప్రకటించారు. 21న వినుకొండ 22న చిలకలూరిపేట, 23న బాపట్ల, పొన్నూరు, రేపల్లె, 24న తెనాలి, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, 25న మంగళగిరి, తాడేపల్లిలలో షర్మిల పర్యటిస్తారని మర్రి రాజశేఖర్ వివరించారు.ఈ క్రమంలో పలు చోట్ల రోడ్‌షోలు జరుగుతాయన్నారు.
 
 టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలు సతమతం...
 నాలుగేళ్లుగా మున్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడిందని, అధికారులలో జవాబుదారీతనం లోపించి  చిన్నసమస్యలు సైతం పరిష్కారానికి నోచకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మర్రి రాజశేఖర్ తెలిపారు.
 
 టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలతో, సమస్యలు పరిష్కారానికి నోచుకోక సతమతమౌవుతున్న ప్రజలు వైఎస్సార్ సీపీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. వరుస ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. షర్మిల పర్యటనలో పార్టీలోని అన్ని విభా గాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
 
 సమావేశంలో చిలకలూరిపేట పట్టణ కన్వీనర్ ఏవీఎం సుభానీ, మండల కన్వీనర్ చాపలమడుగు గోవర్ధన్, యడ్లపాడు మండల కన్వీనర్ చల్లా యజ్ఞేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Popular Posts

Topics :