25 August 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Please write protest letters to Hon'ble President and PM of India

Written By news on Saturday, August 31, 2013 | 8/31/2013

Dear YSRCP Supporter,

It is disheartening to see shabby treatment of AP by Congress high command with their unilateral & irresponsible statement of state division a month ago without giving any clarity on division basis or criteria. Weak Congress leadership in the state and cruel machinations of main opposition party TDP are responsible for this mess. Politically, YSRCP President Sri YS Jaganmohan Reddy is fighting for Telugu people’s pride and future, putting even his health and vital organs at stake.

Please write to Hon’ble President and Prime Minister of India questioning their silence while AP state which is an integral part of India with nearly 100 million population are going through severe rough phase politically, administratively and economically.
Complain central and state government’s ignorance towards ‘life at stand-still’ in many parts of the state for over a month.  Also, mention to President and Prime Minister of India about governments’ indifference towards fasting political leader Sri YS Jagan for not acknowledging his efforts for the cause. We need to rise and register our protest to the heads of the country for the sake of future generations of Andhra Pradesh.

Please use following info. to send your protest letters:
President of India Fax Numbers: 011-23017824 / 23017920 / 23011689
President of India Mail id: secy.president@rb.nic.inusgrievance@rb.nic.in
Prime Minister of India Fax Numbers: 011-23019545 /23016857 / 23017429
Thank you

దీక్షతో తీవ్రంగా నీరసించిన జగన్: నిమ్స్ వైద్యులు

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ఏకపక్ష, నిరంకుశ వైఖరికి నిరసనగా ఏడు రోజుల పాటు చేసిన నిరవధిక నిరాహార దీక్షతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా నీరసించిపోయారని నిమ్స్ వైద్యులు తెలిపారు.

ఆయన కోలుకోడానికి సమయం పడుతుందని వెల్లడించారు. తాము ప్రస్తుతానికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని తెలిపారు. జగన్ బాగా బరువు తగ్గిపోయారని, ఆయన శరీరంలో నీరు బాగా తగ్గిపోయిందని చెప్పారు. కేవలం ఫ్లూయిడ్స్ మాత్రమే కాక నోటి ద్వారా కూడా ఆహారం తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత మాత్రమే శరీరం సాధారణ స్థితికి చేరడానికి వీలుంటుందని జగన్కు వారు సూచిస్తున్నారు.

బరువు బాగా తగ్గిపోయారని, గతంలో ఆయన ఎంత బరువు ఉండేవారో తెలియకపోయినా, ప్రస్తుతం మాత్రం బాగా తగ్గినట్లు చెప్పగలమని వైద్యులు అన్నారు. ప్రతిరోజూ అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నామని, రేపటికి కొంతవరకు ఆయన కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

Exclusive Song on YS Jagan's Deeksha

మొద్దుబారిన ప్రభుత్వం

మొద్దుబారిన ప్రభుత్వంఓ పార్టీ అధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు మద్దతుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంలో చలనంలేదు. రాష్ట్రాన్ని విభజించడం అనివార్యం అయితే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్టన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చంచల్ గూడ జైలులోనే ఆమరణదీక్ష చేపట్టి ఏడురోజులైనా ప్రభుత్వంలో కదలికలేదు. ఆయన దీక్షకు సీమాంధ్రలోని అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నా ప్రభుత్వం మాత్రం  మొద్దుబారిపోయింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వానికి తోడుపోయారు. ఆయన కూడా నోరు మెదపడంలేదు.
జగన్ ఈ నెల 25న నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అయిదు రోజులకు ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నిరాహార దీక్ష విరమించమని జైలు అధికారులు, వైద్యులు చెప్పినా ఆయన వినలేదు. ఆయన బాగా నీరసించిపోవడం, ఆరోగ్యం ఆందోళనకర పరిస్థితులకు చేరడంతో అయిదవ రోజు గురువారం అర్ధరాత్రి ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆయన పల్స్ రేటు పడిపోయింది. సుగర్ లెవల్స్ పడిపోయాయి. ఆయన దీక్ష విరమించకపోతే శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారు. తాను అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు దీక్ష విరమించేదిలేదని జగన్ స్పష్టం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సమైక్యాంధ్రవాదులు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం నుంచి స్పందనలేదు. ఒక్క ప్రభుత్వ ప్రతినిధి కూడా ఆస్పత్రివైపు కన్నెత్తి చూడలేదు.

జగన్ ఆరోగ్యం గంటగంటకు క్షీణిస్తోంది. దాంతో వైద్యులలో ఆందోళన ఎక్కువవుతోంది. ఆయన ఆరోగ్యంపై వైద్యుల బృందం రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. చివరకు  జగన్‌ను వేరే ఆస్పత్రికి తరలించాలని కోరుతూ జైళ్ల శాఖ అధికారులకు ఉస్మానియా సూపరింటెండెంట్ శుక్రవారం సాయంత్రం ఒక లేఖ రాశారు. ‘‘ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఒంట్లో కీటోన్స్ బాగా పెరిగాయి. దీనివల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ఆస్కారముంది. ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి జగన్‌మోహన్‌రెడ్డి నిరాకరిస్తున్నారు’’ అని వివరించారు. ఆయనను నిమ్స్‌కు పంపాల్సిందిగా  ఉస్మానియా సూపరింటెండెంట్ జైళ్ల శాఖ అధికారులకు సూచించారు. ‘‘ప్రాణం కంటే ముఖ్యమైనదేదీ లేదని వైద్యులు జగన్ కు చెప్పాను. ఇక ఆలస్యం చేయకుండా ఆహారం తీసుకోవాలని సూచించాను. కానీ జగన్ సున్నితంగా తిరస్కరించారు. దీక్ష కొనసాగిస్తాను'' చెప్పారు. శారీరకంగా పూర్తిగా నీరసించిన స్థితిలో ఉండి కూడా జగన్ తమతో ఓపికగా, చిరునవ్వుతో మాట్లాడటం పట్ల వైద్యులు విస్మయం వ్యక్తం చేశారు. జగన్‌లోని సంకల్ప శక్తి తమను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయనకు పరీక్షలు చేస్తున్న ఒక వైద్యుడు ‘సాక్షి’తో అన్నారు.


‘‘నేనొక లక్ష్యం కోసం దీక్ష చేస్తున్నాను. అది నెరవేరే వరకూ దీక్ష విరమించబోను. రాష్ట్ర ప్రయోజనాల కంటే నా ప్రాణం విలువైనదేమీ కాదు. రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించకపోతే, పట్టించుకోకపోతే ఎలా? అన్ని ప్రాంతాలకూ న్యాయం చేయడం సాధ్యం కాదనుకుంటే ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలి. అడ్డగోలుగా తీసుకున్న విభజన నిర్ణయం వల్ల కృష్ణా ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదంలో పడింది. అదే జరిగితే... కృష్ణా బేసిన్ ఇటు తెలంగాణలోనూ, అటు సీమాంధ్రలోనూ ఉన్నందున రెండు ప్రాంతాల ప్రజలూ తీవ్ర ఇక్కట్ల పాలవుతారు. కృష్ణా డెల్టా ఎడారవడమే గాక కొత్త అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తుతాయి. అటు రాయలసీమలో, ఇటు తెలంగాణలోనూ మిగులు జలాలపై ఆధారపడ్డ ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కూడా వట్టిపోతాయి. అవన్నీ మొండిగోడలుగా మిగులుతాయి. అందుకే నేను దీక్ష చేయాల్సి వస్తోంది. అనాలోచితంగా రాష్ట్రాన్ని విడదీసి ఇలాంటి పెను సమస్యలు సృష్టించే బదులు సమైక్యంగానే కొనసాగించడమే అందరికీ శ్రేయస్కరం. ప్రజల కోసం మనం చేసే పనుల రాష్ట్రానికి ప్రయోజనం కలిగి, తద్వారా ఓట్లయినా, అధికారమయినా రావాలి. అంతే తప్పితే కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసమే పనులు చేయడం నైతిక రాజకీయం కాజాలదు.చంద్రబాబు నాయుడు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఏమాత్రం ఆలోచించినా ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇంతటి కీలక తరుణంలో ఎవరూ గట్టిగా నిలదీయకపోతే ఎలా? పార్టీలన్నీ చిత్తశుద్దితో వ్యవహరించాల్సిన అవ సరముంది. ఇన్ని రోజులుగా నేను చేస్తున్న దీక్ష వల్ల ఏ కొద్దిగానైనా రాష్ట్ర హితం కోసం ఆలోచిస్తారని, ప్రజలకు కొంతయినా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అని ఉస్మానియా వైద్యులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

పరిస్థితి విషమిస్తుండటంతో శుక్రవారం సాయంత్రం బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు  వైద్యులు ప్రయత్నించగా జగన్ అంగీకరించలేదు. ‘‘నాలో దీక్ష చేసే శక్తి ఇంకా ఉంది. మీరు అర్ధరాత్రి వేళ నా గదిలోకి వచ్చినా మీలో ప్రతి ఒక్కరినీ గుర్తు పట్టగల స్థితిలో ఉన్నాను. గతంలో ఏడు రోజులు దీక్ష చేశాను. దయచేసి నా దీక్షను మీరు బలవంతంగా నిలిపివేయవద్దు. మీరు చేసే వైద్య పరీక్షలకు నేను పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ మంచినీళ్లు మినహా ఏ రకమైన ద్రవహారాన్నీ తీసుకోను. మీరు కూడా బలవంతంగా నాకు ఆహారం ఇచ్చేందుకు ప్రయత్నించకండి. వైద్యులుగా మీరు చేస్తున్న సేవలకు నా కృతజ్ఞతలు...’’ అని వారితో అన్నారు. చివరకు చేసేదిలేక ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సూచన మేరకు శుక్రవారం రాత్రి 11.40 ప్రాంతంలో జగన్‌ను పోలీసులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

నిమ్స్ లో కూడా జగన్ దీక్ష కొనసాగించారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి గానీ, ప్రధాన ప్రతిపక్షం నుంచి గానీ స్పందనలేదు.  కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కనీసం మానవత్వం కూడా లేదని తేలిపోయింది. ఒక ప్రజా నేత రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యపై  ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే వారు నోరు మెదపకపోవడం ఎంద దారుణం! ఇది రాజకీయంగా ఆలోచించే సమయమా?

జగన్ శారీరకంగా బలహీనపడిపోయి, ఆరోగ్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో వైద్యలు ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి ప్రయత్నించినా ఆయన ససేమిరా అన్నారు. ఆయన పట్టుదలతో తెలుగు ప్రజల కోసం దీక్ష కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితి చాలా ప్రమాదకరంగా వుందని, ఫ్లూయిడ్స్‌ ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదమని నిమ్స్ వైద్యుల బృందం ఇచ్చిన సమాచారానికి చంచల్ గూడ జైలు అధికారులు స్పందించారు. సెక్షన్‌ 593 నిబంధన ప్రకారం బలవంతంగానైనా ఐవి ఫ్లూయిడ్స్‌ ఎక్కించేందుకు నిమ్స్‌ డాక్టర్లకు అనుమతి ఇచ్చారు.  ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన దశలో  151 గంటలుగా  చేస్తున్న జగన్ నిరాహర దీక్షను వైద్యులు బలవంతంగా  భగ్నం చేశారు. డాక్టర్లు బలవంతంగా జగన్‌కు  ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. అయితే జగన్‌ పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులపాటు చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/insensitive-government-61743

'చంద్రబాబు సీడబ్యూసీ-2 గా వ్యవరిస్తున్నారు'

'చంద్రబాబు సీడబ్యూసీ-2 గా వ్యవరిస్తున్నారు'
విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీడబ్యూసీ-2గా వ్యవరిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత జూపూడి ప్రభాకర రావు విమర్శించారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న యాత్ర కాంగ్రెస్ ను బతికించడానికేనని జూపూడి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిజమైన ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డినేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కుట్రలకు రాష్ట్రం బలైపోయిందని ఆయన మండిపడ్డారు.
 
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.  ఏదైనా పోరాడి సాధిద్దామని అన్నారు. సీమాంధ్రలో ఉద్యమం ఎగసి పడుతున్న తరుణంలో  బాబు యాత్ర ఎలా చేస్తారని వైఎస్సార్ సీపీ ప్రశ్నిస్తోంది.

దీక్షలు భగ్నం చేసినా ప్రజలమధ్యనే ఉంటాం:విజయమ్మ

దీక్షలు భగ్నం చేసినా ప్రజలమధ్యనే ఉంటాం:విజయమ్మ
హైదరాబాద్: ప్రభుత్వం తమ దీక్షలను భగ్నం చేసినా తాము ప్రజల మధ్యనే ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు.  వైఎస్ జగన్ ప్రజలందరికీ అండగా, తోడుగా ఉంటారన్నారు. ఇప్పటికీ జగన్ నిరసంగానే ఉన్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వం దీక్షలు మాత్రమే భగ్నం చేయగలిగిందన్నారు. తాము ప్రజల వెంటే ఉంటామని చెప్పారు.

సమన్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు. సెప్టెంబరు 2న తిరుపతి నుంచి షర్మిల బస్సుయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు.  రాష్ట్రం అగ్నిగుండంగా మండుతోందని, స్కూళ్లు, కాలేజీలు పనిచేయడం లేదని చెప్పారు. ప్రజలంతా రోడ్లపైనే ఉన్నారన్నారు.

తెలంగాణ ప్రాంతానికి దివంగత మహానేత డాక్టర్  వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి ఎంతో ఉందని చెప్పారు. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనేది వైఎస్‌ఆర్‌సీపీకి లేదని స్పష్టం చేశారు.

షర్మిల బస్ యాత్ర వివరాల వెల్లడి

షర్మిల బస్ యాత్ర వివరాల వెల్లడిషర్మిల ఫైల్ ఫొటో
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల బస్సు యాత్ర వివరాలను ఆ పార్టీ నేతలు  తలశిల రఘురాం, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విడుదల చేశారు. ఆమె నాలుగు జిల్లాల్లో బస్సుయాత్ర చేస్తారు. సెప్టెంబరు 2వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి షర్మిల నివాళులర్పిస్తారు.   సాయంత్రం 4 గంటలకు ఆమె తిరుపతి వెళతారు. తిరుపతి లీలామహల్‌ సెంటర్‌ వద్ద బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. ఆ రోజు రాత్రి ఆమె తిరుపతిలో బసచేస్తారు. 3వ తేదీ  ఉదయం చిత్తూరులో, సాయంత్రం మదనపల్లిలో జరిగే బహిరంగ సభలలో ప్రసంగిస్తారు.

4వ తేదీ ఉదయం అనంతపురం జిల్లా కదిరిలో, సాయంత్రం అనంతపురంలో పర్యటిస్తారు. 5 ఉదయం కర్నూలు జిల్లా డోన్ లో, సాయంత్రం కర్నూలు టౌన్‌లో పర్యటిస్తారు. 6 ఉదయం నంద్యాలలో, సాయంత్రం ఆళ్లగడ్డలో పర్యటిస్తారు. 7న ఉదయం వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరులో, సాయంత్రం బద్వేలులో పర్యటిస్తారు.

ఇదిలా ఉండగా,  వైఎస్‌ఆర్ సీపీ నేతలు భూమన కరుణాకర రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి  తిరుపతిలో జరిగే బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షర్మిల బస్సుయాత్ర సమైక్యవాదులకు మరింత బలాన్నిస్తుందన్నారు.

YS Bharathi addressing to media at NIMS

Sharmila to begin bus yatra on September 2

Vijayamma addressing to media at NIMS

జగన్ దీక్ష : నిమ్స్ ఆస్పత్రి వద్ద దృశ్యాలు

Sakshi





జగన్ ఆరోగ్యం విషయమై భయపడ్డాం:వైఎస్ భారతి

జగన్ ఆరోగ్యం విషయమై భయపడ్డాం:వైఎస్ భారతి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ఆరోగ్యం విషయంలో నిన్న, ఈరోజు మధ్యాహ్నం తాము భయపడినట్లు ఆయన సతీమణి వైఎస్ భారతి చెప్పారు. నిమ్స్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి కూడా డాక్టరేనని చెప్పారు. దీక్ష విరమించనని తాము ఎంత చెప్పినా జగన్ విరమించలేదన్నారు. ఆ  తరువాత జగన్ ఆరోగ్యం విషయంలో తాము చాలా ఆందోళన చెందినట్లు తెలిపారు.  కోర్టు ఆర్డర్ తీసుకువచ్చి చూపించి వైద్యులు బలవంతంగా జగన్ ఆమరణదీక్షను భగ్నం చేసినట్లు తెలిపారు. పల్స్ రేటు పడిపోయినా, కిడ్నీలు దెబ్బతింటాయని చెప్పినా భయంలేదా అని డాక్టర్లు జగన్ ను అడిగినట్లు చెప్పారు.  'స్పందించవలసినప్పుడు స్పందిచాలి గదా' అని జగన్ అన్నట్లు ఆమె తెలిపారు. 8 నుంచి పది మంది డాక్టర్లు వచ్చి జగన్ కు బలవంతంగా ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించినట్లు చెప్పారు. తన ముందు జగన్ కు మూడు  సెలైన్ బాటిళ్లు ఎక్కించినట్లు తెలిపారు.  ఏడు రోజుల నుంచి ఆహారం తీసుకోనందున ఇప్పుడు వెంటనే ఆహారం పెట్టరని చెప్పారు. డాక్టర్లు అందరూ మంచివారేనని చెప్పారు. ఎక్కడైనా డాక్టర్లు పేషెట్స్ ని బాగానే చూస్తారన్నారు.

జగన్ తన వద్ద ఎటువంటి రాజకీయాలు మాట్లాడలేదని భారతి చెప్పారు. ఎల్లుండి షర్మిలమ్మ బస్సు యాత్ర మొదలు పెడతారన్నారు. ప్రస్తుతం జగన్ కు రక్త పరీక్షలు చేస్తున్నారు

మహిళలని కూడా చూడకుండా దురుసుగా....

నిమ్స్ వద్ద వైఎస్ఆర్ సిపి కార్యకర్తల అరెస్ట్
హైదరాబాద్: నిమ్స్ వద్ద వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు.  రాష్ట్రాన్ని విభజించడం అనివార్యం అయితే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్టన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షను వైద్యులు బలవంతంగా భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఏడు రోజుల నుంచి దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం క్షీణించిందని తెలిసి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో నిమ్స్ కు తరలి వచ్చారు. ఆయన దీక్షను భగ్నం చేశారని తెలిసిన తరువాత జనం మరింతగా పెరిగిపోయారు.

కార్యకర్తలు కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆస్పత్రి బయట జై జగన్ నినాదాలతో మారుమ్రోగిపోయింది. పోలీసులు వారిపై దౌర్జన్యం చేశారు. మహిళలని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. పలువురు మహిళలతోపాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనాలలో ఎక్కించుకొని తీసుకువెళ్లారు

నిమ్స్ లో జగన్ దీక్ష భగ్నం

 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బలవంతంగా నిమ్స్ వైద్యలు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు.   గత ఏడు రోజులుగా దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించటంతో ఆయన దీక్షను బలవంతంగా భగ్నం చేశారు. దీక్షను భగ్నం చేసేందుకు వైద్యులకు ఉన్నతాధికారుల నుంచి నిమ్స్ వైద్యులకు అనుమతి లభించింది.
 
నిమ్స్‌ డైరెక్టర్‌కు జైలు అధికారుల లేఖ పంపారు. జైలు నిబంధల ప్రకారం బలవంతంగా అయినా ఫ్లూయిడ్స్ ఎక్కించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 590 నిబంధన ప్రకారం అత్యవసర చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము జైలు అధికారుల ఆదేశాలను పాటిస్తామని నిమ్స్ వైద్యులు తెలిపారు. ప్లూయిడ్స్ ఎక్కించిన తర్వాత కనీసం నాలుగు రోజులు చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు.

please send fax or mail to the contacts below.



pls send fax  or mail to the contacts below..


President  of India 

Fax : 011-23017290/011-23017824
email : reception-officer@rb.nic.in


Prime minister

Prime minister  Fax No: 011- 23019545/23016857
Email :   http://pmindia.gov.in/feedback.php


We sent below mail to President of India and PM of India. Appreciate if you too can do the same.


Dear Sir,

In the wake of centre’s move to bifurcate the state Andhra Pradesh, YSR Congess party president Sri YS Jaganmohan Reddy resigned from his Member of Parliament and is observing  indefinite hunger strike since 24th Aug 2013.
 Now his sugar levels went very low and it looks like his life is in danger now.
Still he is so stubborn and refused to take intravenous fluids and very seriously considering fast till the all three regions of Andhra Pradesh be equally treated.
Hence we request you to please intervene so that Sri Jaganmohan reddy withdraws his indefinite fast.

 Thanks,
Sudhakar Reddy.




నచ్చచెప్పినా జగన్‌ వినటం లేదు: భారతి

నచ్చచెప్పినా జగన్‌ వినటం లేదు: భారతి
హైదరాబాద్ : నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతితో  వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సాయంగా ఉండేందుకు ఆయన సతీమణి వైఎస్ భారతి శనివారం నిమ్స్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నిన్న సాయంత్రం నుంచి  జగన్‌కు బాగాలేదని డాక్టర్లు చెప్పారని తెలిపారు. దీక్ష విరమించమని వైఎస్ విజయమ్మ ఎంత నచ్చ చెప్పినా జగన్‌ వినలేదని... ఆయన ఎవరి మాట వినరన్నారు. జగన్‌ ఆరోగ్యం విషమంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా క్షేమంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారని వైఎస్‌ భారతి తెలిపారు.

మరోవైపు ఏడు రోజులుగా కొనసాగిస్తున్న దీక్షతో ప్రమాదకరంగా తయారైన జగన్‌ ఆరోగ్యం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా దీక్ష విరమించాలని పార్టీ నేతలు, అభిమానులు, ప్రజలు కోరుతున్నారు.ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నేతలు విశాఖలోని సింహాచలం కొండపైకి మోకాళ్లపై పాకుతూ వెళ్లారు. అలాగే జగన్ ఆరోగ్యంపై విజయవాడలోనూ అభిమానులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. యనమలకుదురులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు, అభిషేకాలు చేశారు.

అంతకంతకూ క్షీణిస్తున్నజగన్ ఆరోగ్యం

ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తూ, ప్రమాదకరంగా తయారైనా మొక్కవోని పట్టుదలతో వైఎస్‌ జగన్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో కొనసాగిస్తున్న దీక్ష ఏడో రోజూ కొనసాగుతోంది. వెంటనే ఫ్లూయిడ్స్‌ ఎక్కించకపోతే చాలా ప్రమాదమని నిమ్స్‌ డాక్టర్లు చెప్తున్నారు. ఈ రోజు ఉదయం డాక్టర్లు జగన్‌పై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. నిల్చుంటే బిపి డౌనై పడిపోయే స్థితిలో జగన్‌ వున్నారని, షుగర్‌ లెవెల్స్‌ కూడా బాగా డౌన్‌ అయ్యాయని చెప్పారు. అంతేగాక కిడ్నీ పారామీటర్స్‌ కూడా ఆందోళనకర స్థాయిలో డౌన్‌ అవుతున్నాయని వారు చెప్పారు.
 
డాక్టర్‌ శేషగిరి నేతృత్వంలో వైద్యుల బృందం వైఎస్‌ జగన్‌కి వైద్య పరీక్షలు నిర్వహించింది. అయితే జగన్‌ వైద్యాన్ని నిరాకరిస్తున్నారని,  తన ప్రాణం కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, దీక్షను ఆపేది లేదని ఆయన చెప్పినట్లు వైద్యులు వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి జగన్‌ ఆరోగ్య స్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తామని వారు చెప్పారు. మరోవైపు క్షీణిస్తున్న జగన్‌ ఆరోగ్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఎంతో మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు నిమ్స్‌ ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు ఆస్పత్రి వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు

వైఎస్ జగన్ నాయకత్వం ప్రజలకు అవసరం:ఏబీకే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వెంటనే విరమించాలని సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ శనివారం హైదరాబాద్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయాల్సిన మీరు త్యాగాలకు పూనుకోవద్దని ఆయన జగన్కు ఈ సందర్భంగా హితవు పలికారు.
 
వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు బాసటగా నిలవాల్సిన సమయంలో ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం మీ నాయకత్వం ప్రజలకు చాలా అవసరమని ఈ సందర్భంగా జగన్కు ఏబీకే ప్రసాద్ గుర్తు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే రాష్ట్రాన్ని చీల్చేందుకు సిద్దమైందని ఏబీకే ప్రసాద్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.

జగన్ కి సహయంగా ఉండేందుకు భారతికి కోర్ట్ అనుమతి


జగన్ ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో జగన్ కి సహయంగా   అనుమతి.
ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు ఆసుపత్రిలో జగన్ ఉన్నత కాలం సహయంగా ఉండేందుకు అనుమతి .

 ఏడు రోజులుగా దీక్ష కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి సాయంగా ఉండేందుకు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ,  సతీమణి భారతికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు వరకూ వారు జగన్ తో ఉండేందుకు న్యాయస్థానం అంగీకరించింది. జగన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకూ వారు సాయంగా ఉండేందుకు కోర్టు అనుమతి తెలిపింది. కోర్టు తీర్పుతో విజయమ్మ, భారతి .... నిమ్స్ కు బయల్దేరారు.

కాగా రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచమని కోరుతూ జగన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండటంతో ఆరోగ్యం క్షీణించింది. దాంతో ఆయనకు సాయంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ జగన్ సతీమణి.భారతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. జగన్ తల్లి విజయమ్మ లేదా తనను సాయంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు విచారణ చేపట్టి, విచారణను నేటికి వాయిదా వేశారు. ఈ పిటిషన్ నిమిత్తం భారతి శుక్రవారం స్వయంగా కోర్టుకు హాజరై విజ్ఞప్తి చేశారు.

డాక్టర్ లు పర్యవేక్షిస్తుండగా కళ్ళుతిరిగి పడిపోయిన జగన్

డాక్టర్ లు పర్యవేక్షిస్తుండగా  కళ్ళుతిరిగి పడిపోయిన జగన్.  50కి  పడిపోయిన సుగర్ లెవెల్స్  ,బి‌పి110/70

అడుగడుగునా అవమానాలే !

అడుగడుగునా అవమానాలే !

వైఎస్ కుటుంబంపై సర్కారు కక్షసాధింపు
జగన్ అరెస్టు నుంచి నేటిదాకా పలు సందర్భాల్లో బట్టబయలు
జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకు  నిరసనగా రోడ్డుపై బైఠాయించిన తల్లి, భార్య, సోదరిపై దౌర్జన్యం
బలప్రయోగం చేసి బలవంతంగా ఇంటికి తరలింపు
ఉప ఎన్నికల ప్రచారంలో విజయమ్మ సూట్‌కేసు తనిఖీ
ఇంటికెళ్లి వ్యక్తిగత వస్తువులూ జల్లెడ పట్టిన వైనం
బార్, స్విమ్మింగ్‌పూల్ కట్టుకున్నారంటూ ఎల్లోమీడియా శివాలు
ఈ విషప్రచారంపై ఏనాడూ కిమ్మనని ప్రభుత్వం, సీబీఐ
విజయమ్మ దీక్షను భగ్నం చేసి పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలింపు
ఏ హోదా లేని టీడీపీ నేతలను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు
జగన్‌ను ఆస్పత్రికి తరలించే ముందు కనీసం కుటుంబ సభ్యులకూ చెప్పలేదు

హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి... తుది శ్వాస దాకా రాష్ట్రానికి పెద్ద దిక్కుగా నిలిచిన మరపురాని మహా నేత. ముఖ్యమంత్రిగా, సీఎల్పీ నాయకునిగా, విలువలకు మారుపేరైన రాజకీయ నేతగా, వైద్యునిగా రాష్ట్ర ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు అమూల్యం. అన్ని పార్టీల మన్ననలూ పొందిన అరుదైన నాయకుడు వైఎస్సార్. రాష్ట్ర రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసి జన హృదయాల్లో నిలిచిపోయారు. అలాంటి వైఎస్ భౌతికంగా ఈ లోకాన్ని వీడినప్పటి నుంచీ ఆయన కుటుంబం అష్టకష్టాలు పడుతోంది. అడుగడుగునా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, తండ్రి ఆశయ సాధన కోసం పాటుపడతానని ఆయన తనయుడు, పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాగ్దానం చేసినప్పటి నుంచీ ఆ కుటుంబంపై చెప్పలేనన్ని వేధింపులు అనునిత్యం కొనసాగుతూనే ఉన్నాయి.
 
 చెప్పినట్టు మాట వినలేదన్న కారణంగా జగన్‌ను ఏడాదికి పైగా జైలు నిర్బంధంలో ఉంచి ఆయన కుటుంబాన్ని అనునిత్యం అవమానానికి, వేధింపులకు గురి చేస్తున్నారు. అది చాలదన్నట్టు వైఎస్ సతీమణి విజయమ్మ, కోడలు భారతి, కూతురు షర్మిల... ఇలా దాదాపు ఆయన సొంత మనుషులందరిపైనా ఈ వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. జగన్‌ను జైలుపాలు చేసింది మొదలు, రాష్ట్ర ప్రజల హితం కోసం జైలులోనే నిరాహార దీక్ష చేస్తున్న ఆయనను తాజాగా ఉస్మానియాకు తరలించేదాకా.. సందర్భమేదైనా ఆ కుటుంబాన్ని అవమానాలపాలు చేయడమే సింగిల్ పాయింట్ ఎజెండా అన్నట్టుగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అడుగడుగునా వారికి వంతపాడే ఎల్లో మీడియా కూడా అందుకు అన్నివిధాలా తోడ్పాటు అందించేందుకు అహర్నిశలూ శ్రమిస్తోంది.
 
విచారణకంటూ పిలిచి:  వాస్తవానికి జగన్ ఆస్తులకు సంబంధించిన కేసులో మర్నాడు కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, విచారణ చేస్తామంటూ పిలిపించి, రాత్రి సమయంలో అరెస్టు చేసింది సీబీఐ. విచారణకు అన్నివిధాలా సహకరిస్తున్న వ్యక్తిని, తెల్లారితే కేసు కోర్టులో విచారణకు రానుండగా అకారణంగా ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులను ఘోర అవమానానికి గురిచేశారు. రాత్రి సమయంలో రోడ్డుపై బైఠాయించి కన్నీళ్ల మధ్య నిరసన తెలిపిన జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిలను వేధింపులకు గురిచేశారు. పోలీసులను పెట్టి బలవంతంగా అక్కడి నుంచి తరలించిన తీరు ఇప్పటికీ రాష్ట్ర ప్రజల కళ్లలో మెదులుతోంది. ఆ రోజున విజయమ్మ, భారతి, షర్మిల పడ్డ మానసిక వేదన అందరికీ గుర్తుకొస్తూనే ఉంది. ఆ తర్వాత ఏకంగా వైఎస్ కుటుంబం నివాసాన్ని కూడా లక్ష్యం చేసుకుంది సీబీఐ. విచారణ పేరుతో లోటస్‌పాండ్‌లోని వారి ఇంట్లో నానా హంగామా సృష్టించారు సీబీఐ అధికారులు. వ్యక్తిగత వస్తువులను దాచుకునే సూట్‌కేసులను కూడా జల్లెడ పట్టారు.
 
 సోదాలు జరిగిందే తడవుగా, ఏనాడూ మద్యాన్ని దగ్గరికైనా రానీయని జగన్ తన ఇంట్లో ఏకంగా బార్ నిర్మించుకున్నారని, స్విమ్మింగ్‌పూల్ కట్టుకున్నారని ఎల్లో మీడియా చేసిన విష ప్రచారం ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఇంతటి విషప్రచారం జరుగుతున్నా సీబీఐ అధికారులు, ప్రభుత్వం గానీ జోక్యం చేసుకోలేదు. దాన్ని ఖండించే ప్రయత్నమూ చేయలేదు. ఆరోపణలను నిరూపించాలంటూ వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు సవాలు చేయడంతో అంతా తోకముడిచారు. జగన్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
 
 ఎన్నికల ప్రచారంలోనూ: ప్రజల తీర్పు కోరే సమయంలోనూ వైఎస్ కుటుంబాన్ని నిత్యం అవమానాలకు గురిచేశారు. ప్రజా కంటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఓటేసిన 15 మంది వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను అనర్హతకు గురి చేసినందుకు ఉప ఎన్నికలు జరగడం తెలిసిందే. రాజీనామా చేసిన శోభా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించే ఆళ్లగడ్డ, రాజ్యసభకు ఎన్నికయిన చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన తిరుపతి అసెంబ్లీ స్థానాలకు కూడా అప్పుడే ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరి జిల్లాల్లో విజయమ్మ ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా వాహనాన్ని తనిఖీ చేసే నెపంతో ఆమెను తీవ్రంగా అవమానించారు. ఆమె సూట్‌కేసులను, వాటిలోని దుస్తులను కూడా తీసి మరీ తనిఖీలు చేశారు. గతంలో ఏ పార్టీ నాయకునికి గానీ, నాయకురాలికి గానీ ఇలాంటి అవమానం జరగలేదు.
 
 దీక్షల్లోనూ వివక్షే : ప్రజల పక్షాన దీక్షలు చేస్తున్న సందర్భంలోనూ వైఎస్ కుటుంబానికి అవమానాలే ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోరాటాలు చేసిన వైఎస్ కుటుంబం... రాష్ట్ర విభజన విషయంలో కూడా అన్ని పార్టీలు, అందరు రాజకీయ నాయకులకన్నా స్పష్టమైన వైఖరితో ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. పార్టీ అధ్యక్షునితో పాటు గౌరవాధ్యక్షురాలు ప్రజాప్రతినిధులుగా తమకున్న పదవులకు రాజీనామా చేశారు. నిరవధిక దీక్షలకు దిగారు. గుంటూరులో దీక్ష చేపట్టిన విజయమ్మను ఐదోరోజు అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.
 
 ఆ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతల పట్ల అతి కర్కశంగా వ్యవహరించారు. పైగా విజయమ్మను ఉద్దేశపూర్వకంగా సాధారణ పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించి అవమానించారు. ఏ హోదా లేని టీడీపీ నేతలను దర్జాగా ఆంబులెన్సులో ఆసుపత్రికి పంపిస్తున్న వైనం అందరూ చూస్తున్నదే. తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైల్లోనే నిరవధిక దీక్షకు దిగారు. ఐదురోజుల తర్వాత గురువారం ఆయనను ఆసుపత్రికి తరలించిన సమయంలోనూ అలాగే వ్యవహరించారు. పైగా ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదు. మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని జగన్‌ను పరామర్శించేందుకు వెళ్లిన విజయమ్మను, భారతిని గంటకు పైగా అనుమతించనేలేదు. వైఎస్ కుటుంబాన్ని ఇలా అడుగడుగునా వేధిస్తున్న తీరు ప్రజలను ఆలోచింపజేస్తోందని రాజకీయ పరిశీలకులంటున్నారు.

జగన్ హెల్త్ బులిటెన్ విడుదల

'జగన్ నిలబడే పరిస్థితుల్లో కూడా లేరు'

'జగన్ నిలబడే పరిస్థితుల్లో కూడా లేరు'వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు శనివారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిమ్స్ వైద్యుడు డాక్టర్ నగేష్ మాట్లాడుతూ దీక్ష విరమించేందుకు జగన్ అంగీకరించటం లేదని, ఆయన నిలబడితే కిందపడిపోయే పరిస్థితి ఉందని అన్నారు. జగన్ కు వెంటనే ప్లూయిడ్స్ ఎక్కించాలని నగేష్ తెలిపారు.

వైద్యానికి జగన్ సహకరించటం లేదని వైద్యులు వెల్లడించారు. బాడీ టెంపరేచర్ తగ్గిపోతుందని, బీపీ, పల్స్, షుగర్ లెవల్స్ తగ్గిపోయినట్లు చెప్పారు. కీటోన్స్ 4+కు చేరుకున్నాయన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రమే వెల్లడించిన వైద్యులు..... బీపీ, షుగర్, పల్స్ రేట్ తదితర అంశాలపై వివరాలను వెల్లడించలేదు. డాక్టర్ శేషగిరిరావు నేతృత్వంలో ఏడుగురు వైద్య బృందం జగన్ మోహన్ రెడ్డికి పరీక్షలు నిర్వహించారు.
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మరోసారి జగన్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. సమన్యాయం చేయాలంటూ వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష నేటికి ఏడోరోజుకు చేరింది. నిమ్స్ లో కూడా ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు.

జగన్ పరిస్థితి ఆందోళనగానే ఉంది: వైవీ

నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరిస్థితి ఆందోళనగా ఉందని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి శనివారం నిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో వెల్లడించారు. ప్లూయిడ్స్ తీసుకోవడానికి ఆయన నిరాకరిస్తున్నారని తెలిపారు. జగన్ దీక్ష కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కూడా జగన్ ను కలవనివ్వకుండా నిలువరిస్తున్న అధికారులు, పోలీసుల తీరు పట్ల వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణ దీక్ష శనివారం ఆరో రోజుకు చేరుకుంది. దాంతో ఆయనను గరువారం అర్థరాత్రి ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో కూడా ఆయన చేపట్టిన దీక్షను విరమించేందుకు నిరాకరించారు. దాంతో వైఎస్ జగన్ ను శుక్రవారం అర్థరాత్రి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
 
కానీ ఆయన అక్కడ కూడా వైద్యుల సూచనలు పాటించకుండా ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. దాంతో ఆయన ఆరోగ్యంపై సర్వత్రా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, తలసిల రఘురాం, మిధున్ రెడ్డిలు శనివారం ఉదయం నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి జగన్ ఆరోగ్యంపై పైవిధంగా స్పందించారు.

రాష్ట్రం కన్నా నా ప్రాణం ముఖ్యం కాదు

రాష్ట్రం కన్నా నా ప్రాణం ముఖ్యం కాదు
ఉస్మానియా వైద్యులకు స్పష్టం చేసిన జగన్
ఇంతటి కీలక తరుణంలోనూ ఎవరూ నిలదీయకుంటే ఎలా?
విభజన జరిగితే కృష్ణా డెల్టా పూర్తిగా ఎడారవుతుంది
తెలంగాణ, సీమాంధ్రల్లోని ప్రజలంతా ఇక్కట్లపాలవుతారు

హైదరాబాద్: ‘‘నేనొక లక్ష్యం కోసం దీక్ష చేస్తున్నాను. అది నెరవేరే వరకూ దీక్ష విరమించబోను. రాష్ట్ర ప్రయోజనాల కంటే నా ప్రాణం విలువైనదేమీ కాదు. రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించకపోతే, పట్టించుకోకపోతే ఎలా? అన్ని ప్రాంతాలకూ న్యాయం చేయడం సాధ్యం కాదనుకుంటే ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలి. అడ్డగోలుగా తీసుకున్న విభజన నిర్ణయం వల్ల కృష్ణా ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదంలో పడింది. అదే జరిగితే... కృష్ణా బేసిన్ ఇటు తెలంగాణలోనూ, అటు సీమాంధ్రలోనూ ఉన్నందున రెండు ప్రాంతాల ప్రజలూ తీవ్ర ఇక్కట్ల పాలవుతారు. కృష్ణా డెల్టా ఎడారవడమే గాక కొత్త అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తుతాయి. అటు రాయలసీమలో, ఇటు తెలంగాణలోనూ మిగులు జలాలపై ఆధారపడ్డ ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కూడా వట్టిపోతాయి. అవన్నీ మొండిగోడలుగా మిగులుతాయి. అందుకే నేను దీక్ష చేయాల్సి వస్తోంది. అనాలోచితంగా రాష్ట్రాన్ని విడదీసి ఇలాంటి పెను సమస్యలు సృష్టించే బదులు సమైక్యంగానే కొనసాగించడమే అందరికీ శ్రేయస్కరం. ప్రజల కోసం మనం చేసే పనుల రాష్ట్రానికి ప్రయోజనం కలిగి, తద్వారా ఓట్లయినా, అధికారమయినా రావాలి. అంతే తప్పితే కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసమే పనులు చేయడం నైతిక రాజకీయం కాజాలదు.
 
చంద్రబాబు నాయుడు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఏమాత్రం ఆలోచించినా ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇంతటి కీలక తరుణంలో ఎవరూ గట్టిగా నిలదీయకపోతే ఎలా? పార్టీలన్నీ చిత్తశుద్దితో వ్యవహరించాల్సిన అవ సరముంది. ఇన్ని రోజులుగా నేను చేస్తున్న దీక్ష వల్ల ఏ కొద్దిగానైనా రాష్ట్ర హితం కోసం ఆలోచిస్తారని, ప్రజలకు కొంతయినా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అని ఉస్మానియా వైద్యులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా, నిరంకుశ వైఖరితో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 25 నుంచీ చంచల్‌గూడ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను గురువారం అర్ధరాత్రి వేళ ఉస్మానియా ఆస్పత్రికి తరలించడం తెలిసిందే. జైల్లో ఐదు రోజుల పాటు ఏ రకంగా నిరాహార దీక్ష కొనసాగించారో, ఆరో రోజు శుక్రవారం కూడా ఉస్మానియాలో అదే మాదిరిగా ఆయన దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా తనకు వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యులతో శుక్రవారం పలు సందర్భాల్లో మాట్లాడుతూ జగన్ పై వ్యాఖ్యలు చేశారు. ఆహారం తీసుకోవాలని వైద్యులు కోరగా సున్నితంగా తిరస్కరించారు. పరిస్థితి విషమిస్తుండటంతో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు శుక్రవారం సాయంత్రం ప్రయత్నించగా ఆయన అంగీకరించలేదు. ‘‘నాలో దీక్ష చేసే శక్తి ఇంకా ఉంది. మీరు అర్ధరాత్రి వేళ నా గదిలోకి వచ్చినా మీలో ప్రతి ఒక్కరినీ గుర్తు పట్టగల స్థితిలో ఉన్నాను. గతంలో ఏడు రోజులు దీక్ష చేశాను. దయచేసి నా దీక్షను మీరు బలవంతంగా నిలిపివేయవద్దు. మీరు చేసే వైద్య పరీక్షలకు నేను పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ మంచినీళ్లు మినహా ఏ రకమైన ద్రవహారాన్నీ తీసుకోను. మీరు కూడా బలవంతంగా నాకు ఆహారం ఇచ్చేందుకు ప్రయత్నించకండి. వైద్యులుగా మీరు చేస్తున్న సేవలకు నా కృతజ్ఞతలు...’’ అని వారితో పేర్కొన్నారు. ఉస్మానియా సూపరింటెండెంట్ సూచన మేరకు శుక్రవారం రాత్రి 11.40 ప్రాంతంలో జగన్‌ను పోలీసులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
 
 ఆందోళనకరంగా పరిస్థితి
 అంతకుముందు శుక్రవారం రాత్రి దాకా ఉస్మానియాలో ఐదుగురు వైద్యుల బృందం జగన్‌కు నాలుగు దఫాలు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఆహారం తీసుకునేందుకు జగన్ నిరాకరించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘గంటగంటకూ మీ ఆరోగ్యం క్షీణిస్తోంది. మీరు ఆహారం తీసుకోకపోతే శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇప్పటికే శరీరంలో పలు ప్రతికూల మార్పులు చోటుచేసుకున్నాయి’’ అని చెప్పారు. అయినా వారి సూచనను జగన్ సున్నితంగా తిరస్కరించారు. ఎంత చెప్పినా దీక్ష కొనసాగించేందుకే జగన్ మొగ్గుచూపారని, కనీసం ద్రవాహారం తీసుకోవాలని సూచించినా సున్నితంగా తిరస్కరించారని వైద్యులు చెప్పారు. ఆయనకు వారు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ‘‘జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శరీరంలో కీటోన్స్ (గ్లూకోజ్ నిల్వలు తగ్గి, కొవ్వులు శక్తి రూపంలో వినియోగమవుతున్నప్పుడు విడుదలయ్యే చెడు పదార్థాలు) పెరుగుతున్నాయి. సాధారణంగా అవి నార్మల్‌గా, అంటే జీరోగా ఉండాలి. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు కీటోన్స్ 3గా నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమాయానికి 4ను దాటాయి. కీటోన్స్ పెరగడం వల్ల మూత్రపిండాలపై దుష్ర్పభావం పడుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గిపోయింది. నిమిషానికి 72గా ఉండాల్సిన పల్స్ రేటు 50-60కి పడిపోయింది. బీపీ 110/70కి, చక్కెర నిల్వలు 100 నుంచి 60కి పడిపోయాయి’’ అని వివరించారు. చక్కెర నిల్వలు పడిపోవడంతో హైపో గ్లైసీమియా వస్తుందని వైద్యులు హెచ్చరించారు. దీనివల్ల శరీరం నీరసించిపోవడం, కళ్లుతిరగడం, పల్స్‌రేటు మరింతగా పడిపోవడం జరుగుతుందని చెప్పారు. మరికొద్ది గంటల్లో జగన్ ఆహారం తీసుకోకపోతే తీవ్ర ప్రమాదం జరిగే ఆస్కారముందని తెలిపారు.
 
 రెండుగంటలు వైద్యుల భేటీ: ఓవైపు జగన్ హెల్త్ బులెటిన్ల కోసం ఆస్పత్రి బయట మీడియా ఎదురుచూపులు. అవి సకాలంలో రాకపోయేసరికి అభిమానుల్లో ఆందోళన. లోపల జగన్ ఆరోగ్యం ఎలా ఉంది, బులెటిన్‌లు ఎప్పుడు విడుదల చేస్తారు, అసలు ఏం జరుగుతోందంటూ వారు ఆందోళన చెందారు. ఉస్మానియా వైద్యులు జగన్ ఆరోగ్యంపై రెండు గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాందాస్, ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పుట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏడుగురు స్పెషలిస్టు వైద్యులు సమావేశమయ్యారు. వారంతా జగన్ ఆరోగ్య పరిస్థితిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాటి ఆధారంగా రూపొందించిన నివేదికను వైద్య విద్యా సంచాలకులు శుక్రవారం సాయంత్రం డీఎంఈకి పంపారు. జగన్‌కు చేయాల్సిన వైద్య పరీక్షలతో పాటు ఉస్మానియాలో వసతుల లేమిపై చర్చించారు.
 
 జైళ్ల శాఖకు ఉస్మానియా సూపరింటెండెంట్ లేఖ
 జగన్‌ను వేరే ఆస్పత్రికి తరలించాలని కోరుతూ జైళ్ల శాఖ అధికారులకు ఉస్మానియా సూపరింటెండెంట్ శుక్రవారం సాయంత్రం లేఖ రాశారు. ‘‘ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఒంట్లో కీటోన్స్ బాగా పెరిగాయి. దీనివల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ఆస్కారముంది. ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి జగన్‌మోహన్‌రెడ్డి నిరాకరిస్తున్నారు’’ అని వివరించారు. ఆయనకు ఏ క్షణంలోనైనా బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు అనుమతివ్వాలని లేఖలో ఆయన కోరారు. అంతేగాక, ‘ఉస్మానియాలో వసతుల లేమి ఉంది. పైగా ఆస్పత్రి పోలీసుల దిగ్బంధంలో ఉండటంతో సామాన్య రోగులకు ఇబ్బందిగా ఉంది’ అని వివరించారు. ఈ కారణాల రీత్యా జగన్‌ను వేరే ఆస్పత్రికి తరలించేందుకు అనుమతివ్వాలని కోరారు. ఏ ఆస్పత్రికి తరలించాలో సూచించాలంటూ జైళ్ల శాఖ అధికారులు తిరిగి లేఖ రాయడంతో, నిమ్స్‌కు పంపాల్సిందిగా వారికి ఉస్మానియా సూపరింటెండెంట్ సూచించారు.
 
 మీ ప్రాణం ముఖ్యమని చెప్పాను: డాక్టర్ అశోక్‌కుమార్
 జగన్‌మోహన్‌రెడ్డికి వైద్యం అందించిన ఉస్మానియా వైద్య బృందానికి డాక్టర్ అశోక్‌కుమార్ సారథ్యం వహించారు. శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించిన సందర్భంగా పలుమార్లు వైఎస్ జగన్‌తో తాను ప్రత్యేకంగా మాట్లాడినట్టు ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ‘‘ప్రాణం కంటే ముఖ్యమైనదేదీ లేదని చెప్పాను. ఇక ఆలస్యం చేయకుండా ఆహారం తీసుకోవాలని సూచించాను. కానీ జగన్ సున్నితంగా తిరస్కరించారు. దీక్ష కొనసాగిస్తానన్నారు’’ అని చెప్పారు. జగన్‌కు వైద్యం అందించిన ఉస్మానియా బృందంలో డాక్టర్ అశోక్‌కుమార్‌తో పాటు డాక్టర్ శ్రీధర్ (జనరల్ సర్జరీ), డాక్టర్ జయంతీ రమేశ్ (ఎండోక్రైనాలజీ), డాక్టర్ లక్ష్మణరావు (కార్డియాలజీ), డాక్టర్ మనీషా సహాయ్ (నెఫ్రాలజీ) ఉన్నారు.
 
 వెన్నునొప్పితో బాధపడుతున్న జగన్
 
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి వెన్నునొప్పితో బాధపడుతున్నారు. దాంతో ఉస్మానియాలో ఆయనకు వేడినీళ్ల కాపడం పెట్టడంతో పాటు, వీపుకు కొన్ని రకాల ఆయింట్‌మెంట్లు రాశారు. వాటితో ఆయనకు కొంత ఉపశమనం కలిగినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న కారణంగా శక్తి బాగా సన్నగిల్లినందుకే వెన్నునొప్పికి గురై ఉండవచ్చని వివరించారు. అయితే జగన్‌లోని సంకల్ప శక్తి తమను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయనకు పరీక్షలు చేస్తున్న ఒక వైద్యుడు ‘సాక్షి’తో అన్నారు. శారీరకంగా పూర్తిగా నీరసించిన స్థితిలో ఉండి కూడా తమతో ఆయన ఓపికగా, చిరునవ్వుతో మాట్లాడారని వివరించారు.

జగన్ అనారోగ్యంతో ఉన్నారు.. సాయానికి అనుమతించండి

జగన్ అనారోగ్యంతో ఉన్నారు.. సాయానికి అనుమతించండి
సీబీఐ కోర్టును కోరిన వైఎస్ భారతి
నిబంధనలు అనుమతించవన్న న్యాయమూర్తి
మానవీయ కోణంలో అనుమతించాలన్న భారతి
నిర్ణయాన్ని నేటికి వాయిదా వేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్: రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచమని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆరోగ్యం క్షీణించటంతో ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి సాయంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ఆయన సతీమణి వై.ఎస్.భారతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జగన్ తల్లి విజయమ్మ లేదా తనను సాయంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం విచారించారు. ఏ నిబంధన మేరకు వారిని అనుమతించాలని కోరుతున్నారని ఈ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆమరణ నిరాహార దీక్ష చేయటం జైలు నిబంధనలకు విరుద్ధమని, దాన్ని నేరంగా పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. దీక్షపై జైలు నిబంధనల మేరకు చట్టపరిధిలో వ్యవహరించవచ్చని.. అందుకు తమకు అభ్యంతరం లేదని అశోక్‌రెడ్డి తెలిపారు. జగన్‌ను ఈ కోర్టే జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిందని.. రిమాండ్‌లో ఉన్న నిందితునికి సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే విచక్షణాధికారం ఈ కోర్టుకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఆమరణ నిరాహార దీక్షతో జగన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ప్రస్తుతం ఆస్పత్రికి తరలించిన నేపథ్యంలోనే.. ఆయన భార్యను లేదా తల్లిని సాయంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతున్నామని తెలిపారు.
 
 ‘‘ఆరు రోజులుగా జగన్ దీక్ష చేస్తున్నారు. పూర్తి నీరసంగా ఉన్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. కీటోన్స్ 4 ప్లస్ ఉన్నాయి, దీంతో మూత్రపిండాలకు ప్రమాదం ఏర్పడుతుంది. హార్ట్‌బీట్ 56కు, షుగర్ లెవల్స్ 60కి పడిపోయాయి. బీపీ 110/70గా ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. అందుకే కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో జగన్‌కు సాయంగా ఉండాలని కోరుతున్నారు. భార్యను లేదా తల్లిని మాత్రమే అనుమతించాలని కోరుతున్నాం’’ అని అశోక్‌రెడ్డి వివరించారు. కోర్టు అనుమతిస్తే తప్ప కుటుంబ సభ్యులను సాయంగా ఉండేందుకు అనుమతించబోమని జైలు అధికారులు పేర్కొంటున్నారని.. తమ కస్టడీలో ఉన్న నిందితునికి సంబంధించి నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం ఈ కోర్టుకు ఉందని స్పష్టంచేశారు. మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ తరఫున హాజరైన స్పెషల్ పీపీ విక్రమ్ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు నిబంధనలు అనుమతించవని, మానవీయ కోణంలోనే వారు కోరుతున్నారని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని శనివారం ఉదయం 10.30 గంటలకు వెలువరిస్తామని తెలిపారు.
 
 జగన్ తరలింపుపై కోర్టుకు సమాచారం
 ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారటంతో వైద్యం కోసం గురువారం అర్ధరాత్రి ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని చెంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమాచారం అందించారు. జైలు నిబంధనల ప్రకారం ములాఖత్‌లు నిలిపివేశామని అందులో పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం జగన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల అభిప్రాయాన్ని అందులో వివరించారు.
 
  సీబీఐ తీరుతో కన్నీటిపర్యంతమైన భారతి: జగన్‌కు సాయంగా ఉండాలన్న తమ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయటంతో వై.ఎస్.భారతి కన్నీటిపర్యంతమయ్యారు. శుక్రవారం తెలంగాణ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించిన నేపథ్యంలో తమ ఆవేదనను కోర్టు దృష్టికి తెచ్చేందుకు భారతి స్వయంగా కోర్టుకు వచ్చారు. జగన్‌కు సాయంగా ఉండేందుకు అనుమతించాలన్న తమ అభ్యర్థనపైనా సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయటంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘జగన్ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు. ఆస్పత్రిలో ఆయనకు సాయంగా ఉండేందుకు అనుమతి కోరుతున్నాం. ఎందుకు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు? మీకు మానవత్వం లేదా? అన్యాయంగా పదిహేను నెలలుగా జైలులో ఉంచారు’’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతకుముందు ఇదే అభ్యర్థనపై వీరు దాఖలు చేసిన మెమోను కోర్టు తిరస్కరించింది. ఇ ట్లా కోరేందుకు ఏ నిబంధన అనుమతించడం లేదని.. దీనిపై జైలు అధికారులే నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టంచేసింది. దీంతో వెంటనే జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకే తాము నడుచుకుంటామని జైలు అధికారులు పేర్కొన్నారని.. అందుకే ఈ కోర్టును ఆశ్రయించామని వివరించారు.

ఉస్మానియా నుంచి నిమ్స్‌కు ఫోటోలు



Photo


రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన ప్రాణం ముఖ్యం కాదంటూ ...

సాక్షి, హైదరాబాద్: హైడ్రామా నడుమ జగన్‌ను శుక్రవారం అర్ధరాత్రి 11.45 సమయంలో ఉస్మానియా నుంచి నిమ్స్‌కు తీసుకొచ్చాక ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం జరిగింది. మొదటిసారి జరిగిన ప్రయత్నాన్ని జగన్ తీవ్రంగా ప్రతిఘటించారు. దాంతో అర్ధరాత్రి 12.30 సమయంలో రక్త నమూనాలను సేకరించే నెపంతో మరోసారి ఫ్లూయిడ్స్ గొట్టాలను ఆయన ఒంట్లోకి గుచ్చేందుకు ప్రయత్నించారు. దాన్ని కూడా జగన్ అడ్డుకున్నారు.
 
 అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మరోసారి జగన్‌కు నచ్చజెప్పేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ‘‘ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. కాబట్టి ఫ్లూయిడ్స్ ఇచ్చేందుకు అంగీకరించండి’’ అని కోరారు. మరోవైపు ఆరు రోజులుగా ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతూ, శరీరంలో ప్రమాదకరమైన కీటోన్స్ సంఖ్య పెరగడంతో నెఫ్రాలజిస్టులను పిలిపించి పరీక్షలు చేయించారు.

నిమ్స్ లో ఏడోరోజు జగన్ దీక్ష

నిమ్స్ లో ఏడోరోజు జగన్ దీక్ష
హైదరాబాద్ :  రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన ప్రాణం ముఖ్యం కాదంటూ వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఏడోరోజు కూడా నిమ్స్ లో కొనసాగుతోంది. హైడ్రామా మధ్య అర్థరాత్రి ఉస్మానియా ఆసుపత్రి నుంచి వైఎస్‌ జగన్‌ను నిమ్స్‌కు తీసుకొచ్చాక ఫ్లూయిడ్స్‌ ఎక్కించేందుకు వైద్యులు యత్నించారు. అయితే వైద్యం చేయించుకునేందుకు జగన్‌ ప్రతిఘటించారు. ఫ్లూయిడ్స్‌ తీసుకునేందుకు నిరాకరించారు. దీక్ష కొనసాగిస్తున్నారు.

మరోవైపు జగన్‌కు ఈ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన నిమ్స్‌ వైద్యులు కాసేపట్లో హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయనున్నారు. మరోవైపు జగన్‌ ఆరోగ్యం క్షీణిస్తుండటంపై అభిమానులు, వైఎస్‌ఆర్‌ నేతల్లో ఆందోళన నెలకొంది. అటు జగన్‌ను చూసేందుకు జననేత కుటుంబీకులను అనుమతించలేదు. దీంతో జగన్‌ను దూరం నుంచే చూసి వైఎస్‌ విజయమ్మ, భారతి, బ్రదర్‌ అనిల్‌ వెనుదిరిగారు.

వైద్యానికి నిరాకరిస్తున్న జగన్, క్షీణించిన ఆరోగ్యం, పరిస్థితి విషమం

Photo
హైదరాబాద్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్టు వైద్యులు వెల్లడించారు.  చికిత్స కోసం వైద్యులు చేసిన ప్రయత్నాలను వైఎస్ జగన్ నిరాకరించారు.
వైద్యానికి జగన్ నిరాకరించడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తే, బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కిస్థామని ఉస్మానియా ఆస్పత్రి ఆర్ ఎం ఓ రఫీ తెలిపారు. 
షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గియాని, కీటోన్స్ 4+, షుగర్ లెవల్ 49కి పడిపోయినట్టు, బీపీ 110/70 ఉన్నట్టు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. 

జగన్ కుటుంబ సభ్యులకు నిమ్స్ లో అనుమతి నిరాకరణ



Photo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉస్మానియా ఆస్పత్రి నుంచి నిమ్స్ కు తరలించినా, ఆయనను చూసేందుకు మాత్రం కుటుంబ సభ్యులను నిమ్స్ లోకి కూడా అనుమతించలేదు.Photo
జగన్ ను తరలిస్తున్న విషయం తెలిసిన ఆయన తల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆయన భార్య వైఎస్ భారతి, బావ అనిల్ కుమార్ తదితరులు నిమ్స్ వద్దకు శుక్రవారం రాత్రి వెళ్లారు. కానీ, అధికారులు అనుమతించకపోవడంతో దూరం నుంచే ఆయనను చూసి, వెనుదిరగాల్సి వచ్చింది. జగన్ నిన్నటికంటే బాగా నీరసంగా కనిపించారని ఈ సందర్భంగా వైఎస్ భారతి విలేకరులతో అన్నారు. కాగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాకులోని 130 నెంబరు గది కేటాయించారు. ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు నిమ్స్ వద్దకు చేరుకున్నారు.

చాలా నీరసంగా కనిపించిన జగన్

Written By news on Friday, August 30, 2013 | 8/30/2013

 ఉస్మానియా నుండి బుల్లెట్ ప్రూఫ్ వాహనం లో జగన్ ని నిమ్స్ కి తరలించిన  అధికారులు.నిమ్స్ వద్దకు ముందే చేరుకున్న విజయమ్మ,భారతి. ట్రామా కేర్ సెంటర్ లో రూమ్ నెంబర్ 132 కేటాయింపు.మీడియా కంటపడకుండా వెనక గేటు నుండి జగన్ ని లోపలికి తీసుకు వెళ్ళిన పోలీసులు .

 రాత్రి 11.30 గంటల సమయంలో భారీ వాహన శ్రేణి వెంట రాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిమ్స్ కు మార్చారు. నల్లటి బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనంలో జగన్ ను తీసుకెళ్లగా దానికి ముందు, వెనక పోలీసు పైలట్ వాహనాలు, మీడియా వాహనాలు వెళ్లాయి. ముందుగానే ట్రాఫిక్ మొత్తాన్ని పోలీసులు క్లియర్ చేశారు. పలువురు మీడియా ప్రతినిధులు తరలింపు దృశ్యాలను కవర్ చేసేందుకు ద్విచక్ర వాహనాలపై కూడా వాహన శ్రేణి వెంట వెళ్లారు. సరిగ్గా 11.39 గంటలకు జగన్మోహన్ రెడ్డి వాహనం నిమ్స్ ప్రాంగణంలోకి చేరుకుంది. వాహనంలోంచి దిగిన జగన్ నల్లటి చారల టీషర్టు ధరించి, నడుచుకుంటూ ఆస్పత్రిలోకి వెళ్లారు. పోలీసు వాహనాలు నేరుగా ఎమర్జెన్సీ వార్డు వరకు వెళ్లాయి. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే వైద్య పరీక్షలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.






Popular Posts

Topics :