17 March 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Sharmila's foot march at Mangalagiri Constituency, Guntur

Written By news on Saturday, March 23, 2013 | 3/23/2013

ముగిసిన 99వ రోజు షర్మిల పాదయాత్ర

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర 99వ రోజు మంగళగిరి నియోజకవర్గంలో రేవేంద్రపాడు వద్ద ముగిసింది. ఇప్పటి వరకు ఆమె 1,362.2 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు.

పసుపు పంట పరిశీలించిన షర్మిల

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల రేవేంద్రపాడు వద్ద పసుపు పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఆమెకు చెప్పుకున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బాగా బతికినట్లు వారు తెలిపారు. ఇప్పుడు ధరలు లేక దిగాలుపడుతున్నామన్నారు. షర్మిల వారితో మాట్లాడుతూ జగనన్న వస్తే రైతులందరినీ ఆదుకుంటారని భరోసా ఇచ్చారు.

జగన్‌ పాలనలో రైతే రాజు: ఇంద్రకరణ్‌రెడ్డి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయన పాలనలో రైతే రాజు అని మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ లో గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్ధన్ మాట్లాడుతూ భూకొనుగోలు పథకంలో అర్హులైనవారికి అయిదు ఎకరాల భూమి ఇస్తామన్నారు.


 కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాపాడుతున్నారని వైఎస్‌ఆర్ సీపీ నేత కొణతాల రామకృష్ణ విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమయ్యారన్నారు. దివంగత మహానేత ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు. అవసరమైతే కొనుగోలు చేసి విద్యుత్ అందించారని చెప్పారు.

మచిలీపట్నంలో వైఎస్ఆర్ సిపి సమావేశం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బందర్ లోక్ సభ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో సమస్యలు, పార్టీకి సంబంధించిన అంశాలు చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ నేతలు పిల్లి సుభాస్‌చంద్రబోస్, సామినేని ఉదయభాను, కొడాలి నాని, కె.నాగేశ్వరరావు, నాగిరెడ్డి, పడమటి సురేష్‌బాబు తదితరులు హాజరయ్యారు.

TDP MLA Praveen kumar reddy fire on Chandrababu

Konatala Ramakrishna Press Meet 23rd March 2013

సిబిఐ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలేదు

కేంద్రంలో సీబీఐ, రాష్ట్రంలో సీబీసీఐడీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాలే లేవని, ఆ రెండింటి చలవతోనే ఈ ప్రభుత్వాలు బతికి బట్టకడుతున్నాయని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అయినా, మరెవరైనా సరే మూడు నెలల్లో చార్జిషీట్ దాఖలు వేయాలన్నారు. అలా ఛార్జి షీట్ దాఖలు చేయకపోతే సీబీఐ అధికారదుర్వినియోగానికి పాల్పడినట్లేన్నారు.

Bhumana karunakar Reddy Press Meet 23rd March 2013

జగనన్నని జైల్లో ఉంచినంత మాత్రాన జనం కాంగ్రెస్‌ను నమ్ముతారా?!


ఈ కుటిల రాజకీయాలను చూస్తుంటే మనసుకు ఎంతో బాధ కలుగుతోంది. జగన్‌ను, ఆయన కుటుంబ సభ్యులను ఎందుకిలా అందరూ కలిసి అన్యాయంగా యాతన పెడుతున్నారో అర్థం కావడంలేదు. భర్త దూరంగా ఉండి, మనసులో బాధ బయటికి చెప్పుకోలేక భారతిగారు ఎంతగా కుమిలిపోతున్నారో అప్పుడప్పుడు సాక్షి ఫ్యామిలీలో ఆమె రాసే లేఖలను బట్టి తెలుస్తోంది. అలాగే అమ్మ విజయమ్మ బాధ ఎవరూ తీర్చలేనిది. భర్త దూరం అయ్యి విజయమ్మగారు, జైలు పాలైన భర్తను చూస్తూ భారతి గారు, నాన్న కోసం అలమటిస్తూ పిల్లలు ఎంతగా దుఃఖిస్తున్నారో కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు అంతగా ఆనందిస్తున్నారు.

అమ్మా... భయపడకండి! దుర్మార్గులకు ఆనందం కొంతవరకు మాత్రమే. నీతిమంతులను దేవుడు ఎల్లప్పటికీ జ్ఞాపకం చేసుకుంటాడు. ‘దుఃఖ పడువారలు ధన్యులు. మీరు ఓదార్చబడుదురు’ అనే బైబిల్ వాక్యం మీ జీవితాలలో నెరవేరుతుంది. అమ్మా విజయమ్మా... ఈ కష్టాలు చూడమని మా దేవుడు వైయస్సార్ మిమ్మల్ని వదిలి వెళ్లలేదు. ఇటువంటి నీతిమాలిన ప్రభుత్వాలు కూడా ఉంటాయి అని తెలియజేయటానికి మాత్రమే వెళ్లారు. మరల మా ‘రాజన్న’ రాజ్యం వస్తుంది. మా జగనన్న తీసుకువస్తాడు. ఎప్పుడూ వైయస్సార్‌గారిలా మీ కుటుంబం అంతా నవ్వుతూ ఉండాలని మా ఆశ. మేము జీవితాంతం మీకు తోడుగా ఉంటాం. ఎందరు కలిసినా, ఎన్ని కుట్రలు చేసినా జగనన్నకు ఏమీ కాదు. త్వరలోనే జగనన్న బయటకు వస్తాడు.

- దండే మధుకృష్ణ, పెంటపాడు, ప.గో.జిల్లా

జగనన్నని జైల్లో ఉంచినంత మాత్రాన జనం కాంగ్రెస్‌ను నమ్ముతారా?!

జగనన్నా! మీ రాకకోసం జనం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. మీరు ఓదార్పు యాత్రలో ఉండగా ఇంట్లో సీబీఐ సోదాలు చేస్తున్నప్పుడు మీరు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఎందుకంటే మీరు ఏ తప్పూ చేయలేదు. పైగా, క్షణం కూడా విరామం లేకుండా ఓదార్పుయాత్ర కొనసాగిస్తున్నారనీ, అధికార పార్టీ పెద్దలకు నిద్రలేకుండా చేస్తున్నారని, మీపై అన్యాయంగా సీబీఐ ఎంక్వైరీ వేయించి, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ అభిమానులను ఈ ప్రభుత్వం తీవ్రమైన మనోవేదనకు గురిచేసింది. అంతకు అంతా కాంగ్రెస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. జైలు నుంచి విడుదల చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే కుంటి సాకుతో మీకు బెయిల్ రాకుండా సీబీఐ ఏవో సాకులు చెబుతోంది.

ఈ ధోరణి వల్ల రానున్న ఎన్నికలలో తమ పార్టీకే తీవ్రనష్టం జరుగుతుందనే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు ఊహించలేకపోవడం విడ్డూరం. ఇప్పుడున్న ప్రభుత్వం వైయస్సార్ రెక్కల కష్టం నుండి వచ్చిందనే వాస్తవాన్ని మరిచిపోయిన ఈ కాంగ్రెస్ పెద్దలకు విశ్వాసమన్నదే లేదని మీ అరెస్ట్‌తోనే జనానికి అర్థమయింది. వైయస్సార్ గారు ఉన్నప్పుడు గోడమీద పిల్లుల్లా ఉన్న ఈ నాయకులు, ఆయన అకాల మరణం తరువాత పులుల్లా మారిపోయారంటే పరిస్థితి అర్థమవుతోంది. ఈ నీచప్రభుత్వానికి రానున్న ఎన్నికలలో ఒక్క స్థానం వచ్చినా ఎక్కువే. ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తిని జైల్లో ఉంచినంత మాత్రాన జనం కాంగ్రెస్‌ని నమ్మరు. జనం గుండెల్లో ఉన్న వ్యక్తినే జనం నమ్ముతారు. జైల్లో ఉండగా ఎన్నికలు నిర్వహించినా జగనన్నే గెలుస్తాడు. అది తథ్యం!

- జి.సుబ్రహ్మణ్యం, భీమవరం, ప.గో.జిల్లా

చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com

మంత్రి కొండ్రుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట వినతి

రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి కొండ్రు మురళీమోహన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. ఈ ఉద్యోగులను వెంట తీసుకెళ్లి శుక్రవారం మురళికి శ్రీకాంత్‌రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఆరోగ్యశ్రీ ఉద్యోగ నియామకాలను ఔట్‌సోర్సింగ్ ద్వారా కాకుండా, ఆరోగ్యశ్రీ ట్రస్టే చేపట్టి, జీవో నెంబర్ 3 ప్రకారం వేతనాలివ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

వైఎస్ ఆశయాలు సాధించి తీరుతాం

జైలులో జగన్‌తో ప్రత్యేక ములాఖత్

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు తనవంతు కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడు కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన శుక్రవారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ గురువైన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌ను అక్రమంగా జైలు పాలుచేసి ఇప్పటికి మూడు వందల రోజులు గడిచాయన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు తాను వచ్చినట్లు పేర్కొన్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వనప్పటికీ కుత్బుల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తనకు పార్టీలు, కులమతాలకు అతీతంగా గెలిపించిన ప్రజల అభీష్టం మేరకే ఆనాడు తాను వైఎస్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్‌కు మద ్దతు ఇవ్వాలన్న ప్రజల కోరిక మేరకు ఆయనకు అండగా నిలిచేందుకు నిశ్చయించుకున్నట్లు తెలిపారు. 

వైఎస్సార్ సీపీకి మద్దతు పలుకుతూ వైఎస్ ఆశయాలను సాధించే దిశగా ప్రజలతో కలిసి ముందుకు వెళతానన్నారు. పనిచేసేవారికే ప్రజలు పట్టం కడతారు తప్ప.. హంగు ఆర్భాటాలకు పోయే నాయకులను దరిచేరనివ్వరన్నారు. నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, అనుచరులు, కార్యకర్తలతో చర్చించి త్వరలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. ఆయన వెంట గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, దూళ్ళపల్లి సహకార సంఘం చైర్మన్ నవీన్‌గుప్తా, వైఎస్సార్ సీపీ నాయకుడు వడ్డేపల్లి నర్సింగరావు, కంటోన్మెంట్ మాజీ చైర్మన్ జంపాన ప్రతాప్, వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్‌గౌడ్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి నవీన్‌గౌడ్ తదితరులు ఉన్నారు. జగన్‌ను కలిసినవారిలో భారతీరెడ్డి, శ్రీకాకుళం మాజీ ఎంపీ పాలవలస రాజశేఖర్, పశ్చిమగోదావరి జిల్లా నాయకుడు రాజీవ్‌కృష్ణ ఉన్నారు.

ఉగాది తరువాత కాంగ్రెస్ ఖాళీ : వడ్డేపల్లి

ఉగాది పండుగ తరువాత రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీలో చేరేందుకు నిశ్చయించుకున్నారని వడ్డేపల్లి నర్సింగరావు అన్నారు. వైఎస్ ఆశీస్సులతో నేతలంతా కలిసికట్టుగా ముందుకు వెళుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తే తప్ప వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి అమలు కావని స్పష్టం చేశారు.

పల్లె కన్నీరు పెడుతోంది

* పొట్టకూటికోసం తిప్పలు పడుతున్నాం 
* షర్మిలతో గోడు చెప్పుకున్న రైతన్నలు, కూలీలు 
* చేతికి వచ్చే సమయంలో పంటలన్నీ ఎండుతున్నాయి
* మొక్కజొన్న.. వరి.. అరటి.. పసుపు.. చేమ ఏ పంట చూసినా కన్నీళ్లే
* ఉచిత కరెంటు అని చెప్పి వేలకు వేలు బిల్లులు ఇస్తున్నారు
* పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేట్టు లేవు..
* త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని షర్మిల భరోసా
* ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబే కాపాడుతున్నాడని ధ్వజం 

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రైతన్న కన్నీరు పెడుతున్నాడు.. పల్లె కళ తప్పుతోంది.. ఒకప్పుడు బాగా బతికి నలుగురికి ఉపాధి చూపిన రైతులే ఇప్పుడు పొట్టకూటి కోసం కూలి పనులు చేసుకుంటున్నారు. పూలమ్మిన చోటే కట్టెలు ఏరుకొని బతుకీడుస్తున్నారు. పాలుపోసుకునే దశలో మొక్కజొన్న... పొట్టకొచ్చిన వరి చేను.. మొగ్గ తొడిగిన అరటి తోట, కుందనపు బొమ్మలా ఉన్న పసుపు, చేమ, కంద ఇలా... ఒక్కటేమిటి కరెంటు లేక.. నీళ్లు లేక అన్ని పంటలు ఎండుతున్నాయి. ఆదుకోవాల్సిన పాలకులు కరెంటు చార్జీలతో రైతులను పీల్చిపిప్పి చేస్తున్నారు.

‘ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బతికేదమ్మా.. మాకు దిక్కెవరు..?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలను రైతన్నలు దీనంగా అడిగారు. శుక్రవారం మరో ప్రజాప్రస్థానంలో ఎక్కడికి వెళ్లినా షర్మిలకు ఈ దయనీయ దృశ్యాలే కనిపించాయి. వారి కష్టాలకు చలించిన షర్మిల... త్వరలోనే జగనన్న వస్తాడని, రైతన్న రాజ్యం తెస్తాడని వారికి భరోసానిస్తూ ముందుకు సాగారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం శుక్రవారం గుంటూరు జిల్లా మంగళరిగి నియోజకవర్గంలోని పల్లెల్లో కొనసాగింది. గ్రామాల గుండా వెళ్తున్నప్పుడు షర్మిల దాదాపు 100 మందికి పైగా రైతులతో మాట్లాడారు. రచ్చబండలో మహిళలతో కలిసి పల్లె కష్టాలను తెలుసుకున్నారు. 

రాజన్న రాజ్యంలో రైతే రాజు

‘‘అమ్మా.. అన్నా.. ఒక్క మాటైతే భరోసాగా చెబుతున్నా. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం స్థాపిస్తారు. రాజన్న రాజ్యంతో రైతన్నే రాజు. అప్పటివరకు దయచేసి మీ పంట పొలాలు అమ్ముకోవద్దు.. అంతకంటే విలువైన మీ ప్రాణాలు తీసుకుకోవద్దు’’ అని షర్మిల రైతులను కోరారు. మోరంపూడిలో రచ్చబండలో రైతులు , మహిళలతో ఆమె మాట్లాడారు. పలు చోట్ల పంట పొలాల్లో రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏమన్నారో షర్మిల మాటల్లోనే..
‘‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతులను పురుగులను చూసినట్లు చూశారు. వ్యవసాయం దండగన్నారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని లెక్కలు వేసి చూపించారు. వేలకు వేలు కరెంటు బిల్లులు వేసి రైతులను, పల్లెలను పీల్చి పిప్పి చేసిన ఆయన మళ్లీ పాదయాత్ర అంటూ పల్లెల వెంట తిరుగుతున్నారు. 

సరే పాదయాత్ర చేస్తున్నాడు కదా..! ప్రజా సమస్యలు అర్థం చేసుకుంటారు అనుకున్నాం. ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి కూలగొడతారు అనుకున్నాం. కానీ ఆయనకు ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యం. ఆయనకు కావాల్సింది రాజకీయాలు. రైతులు ఏమైపోయినా ఆయనకు పట్టదు. నాడు సొంత మామనే వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు ఆయనపై సీబీఐ విచారణ తప్పించుకోవడానికి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోట్లు పొడవడం, అధికారం కోసం అడ్డదార్లు తొక్కడం చంద్రబాబు నైజం. చంద్రబాబే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్నారు. ఆయన చేస్తున్న పాదయాత్ర ప్రజల కోసం కాదు. ఆయన కోసం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించడం కోసం..’’

యాత్ర సాగిందిలా..

శుక్రవారం 98వ రోజు మరోప్రజా ప్రస్థానం దుగ్గిరాల మండలం గాంధీనగర్ నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి పెనుమూలి, కంఠం రాజుకొండూరు, మంచికలపూడి, మోరంపూడి, పేరుకలపూడి గ్రామాల మీదుగా సాగింది. పేరుకలపూడి శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 13.6 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1,349.3 కి.మీ. యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో మర్రి రాజశేఖర్, ఆర్‌కే, వాసిరెడ్డి పద్మ, లక్ష్మీ పార్వతి, మేరుగ నాగార్జున, తాడి శకుంతల,తలశిల రఘురాం, వైఎస్ కొండారెడ్డి, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు. 

పాలు పోసుకునే వేళ కోతలు

మొక్కజొన్న కంకి పాలుపోసుకునే సమయంలో కరెంటు కోతలు పెట్టారు. కంకి ఎదగలేదమ్మా... ఆయిల్ ఇంజిన్ తీసుకొచ్చి నీళ్లు పెడదామంటే.. ఊళ్లో అప్పు పుట్టలేదు. ఎదిగిన చేను చూస్తుండగానే ఎండిపోయింది. రూ.5 మిత్తికి అప్పు తీసుకొచ్చినా. రెండు తడులకు కూడా ఆ డబ్బు సరిపోలేదమ్మా.. వైఎస్సార్ ఉన్నప్పుడు వానలు పిలిస్తే పలికినయి. ఏడాదికి పండే పంట కూడా ఆరు నెలలకే చేతికి అందేది.
- భీమవరపు అమ్మిరెడ్డి, షేక్‌మున్న,
మొక్కజొన్న రైతులు-పెనుమూలి 



ఫ్రీ కరెంటు అని.. రూ.12 వేల బిల్లు 

ఎకరా రూ.25 వేలకు కౌలుకు తీసుకొని మూడు ఎకరాల్లో పసుపు పెట్టినా. 10 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. నీళ్లు లేక పంట పోయింది. పసుపు మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.4,500 పడుతోంది. ఎకరాకు రూ.లక్ష దాక పెట్టుబడి పెట్టినా. తోటకు నీళ్ల తడి పెట్టడానికే రూ.40 వేల ఖర్చు వస్తోంది. కరెంటేమో..! రోజుకు రెండు గంటలు కూడా ఇడుస్తలేరు. అది కూడా ఏ అర్దరాత్రో... అపరాత్రో ఇస్తున్నారు. మొన్ననే నా తమ్ముడు రాత్రి కరెంటు పెట్టబోతే బాయికాడ పాము కరిచింది. ఫ్రీ కరెంటు అన్నారు కానీ.. రూ 12,000 బిల్లు కట్టించుకున్నారు. మళ్లీ ఇప్పుడు రూ.10,000 బిల్లు వచ్చింది. 
- బనిగి సాహెబ్, పసుపు రైతు, కంఠంరాజు కొండూరు

‘ఏలేరు’కు సర్కారు మోకాలడ్డు

ఏలేరు సాధన కోసం పాదయాత్రకు శ్రీకారం 
ఏలేశ్వరంలో భారీ బహిరంగ సభ

జగ్గంపేట, న్యూస్‌లైన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏలేరు ఆధునికీకరణ పనులపై నిర్లక్ష్యంగా వ్యవహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు మైసూరారెడ్డి అన్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.138 కోట్లు కేటాయించి, 2009లో శంకుస్థాపన చేసినప్పటికీ ప్రభుత్వం పనులు చేపట్టలేదు. ప్రస్తుత బడ్జెట్‌లోను నిధులు కేటాయించకపోవడంతో ఏలేరు ఆధునికీకరణ సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో పాదయాత్రకు శుక్రవారం రాత్రి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నుంచి శివారు ఆయకట్టు ఉన్న పిఠాపురం వరకు ఏడు రోజుల పాటు 71.9 కిలోమీటర్ల మేరకు జరగనున్న ఈ పాదయాత్ర ఏలేరు ప్రాంతంలోని గ్రామాల మీదుగా సాగుతుంది. ఈ యాత్రను ఏలేశ్వరంలో మైసూరారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో రైతాంగాన్ని ఉద్దేశించి మైసూరారెడ్డి మాట్లాడారు. 2009లో ఏలేరు పనులకు రాజశేఖరరెడ్డి నిధులు కేటాయించగా, ఇప్పటివరకు కనీసం మట్టితవ్వకం పనులు కూడా చేపట్టలేదని దుయ్యబట్టారు. జగన్ ద్వారానే ఏలేరు సాధ్యమవుతుందని చెప్పారు. రైతు సమస్యల పరిష్కారంలో ముందుంటామంటూ.. పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఇటీవల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బేరసారాలు సాగించుకున్నారని ఆరోపించారు. తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి కోసం పదవులను కూడా త్యాగం చేసి శాసనసభ్యులు ఓటు వేశారన్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏలేరు ప్రాంతానికి చెందిన పళ్లంరాజు కేంద్రంలోను, తోట నరసింహం రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నప్పటికీ నిధులు సాధించలేక పోయారన్నారు. వైఎస్సార్ మా నాయకుడని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. ఆయన ప్రకటించిన ప్రాజెక్టులను చేపట్టకపోతే 2014 ఎన్నికల్లో ప్రజలు అడుగుతారని, ఈ ప్రభుత్వం ఇబ్బంది పడకతప్పదన్నారు. 

ఏం సమాధానం చెబుతారో మీకే తెలుసని రైతులను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో ఓటు వేయాల్సిన చంద్రబాబు.. తన ఎమ్మెల్యేలతో అది వీగిపోయేలా చేశారన్నారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఏలేరుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ ప్రాంతానికి చెందిన మంత్రి నిధులు తేవడంలో విఫలమయ్యారని, ప్రస్తుత ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం ఆధునికీకరణకు రూ.258 కోట్లు నిధులు అవసరమవుతాయన్నారు. ఏలేరు ప్రాంత రైతుల కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ఏలేరు ఆధునికీకరణకు డాక్టర్ రాజశేఖరరెడ్డి పెద్ద మనసుతో నిధులు కేటాయించారన్నారు. రైతుల కోసం ఇన్ని ప్రాజెక్టులు చేపట్టిన ఘనత భారతదేశంలో ఏ ఒక్కరికీ లేదని చెప్పారు.

Magzine story on Janame Sakshi

షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర శనివారం మంగళగిరి నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి శనివారం ఉదయం బయలుదేరి చినపాలెం, పెదపాలెం, శృంగారపురం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం కొత్తపాలెం, నూతక్కి మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.

పర్యటించే ప్రాంతాలు
మంగళగిరి నియోజకవర్గం: చినపాలెం, పెదపాలెం,
శృంగారపురం, కొత్తపాలెం, నూతక్కి

ఇప్పటికి ఏడు జిల్లాల్లో 43 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈ నెల 26వ తేదీన కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తుందని పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. సరిగ్గా ఆదివారం నాటికి వంద రోజులు పూర్తయ్యే షర్మిల యాత్ర ఆ తరువాత మరో రెండు రోజుల పాటు గుంటూరు జిల్లాలో కొనసాగుతుందని, 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీదుగా కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తుందని ఆయన వివరించారు. కృష్ణా జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 275 కిలోమీటర్ల మేరకు ఆమె నడుస్తారని అన్నారు. ఇప్పటికి షర్మిల ఏడు జిల్లాల్లో 43 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా తన పాదయాత్రను చేశారని ఆయన తెలిపారు. వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా మంగళగిరిలో ఏర్పాటయ్యే బహిరంగ సభకు పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు.

'దేవినేని ఉమపై సీబీఐ విచారణ చేపట్టాలి'

Written By news on Friday, March 22, 2013 | 3/22/2013

చంద్రబాబు, దేవినేని ఉమపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జలీల్‌ఖాన్‌, గౌతంరెడ్డి, సామినేని ఉదయభానులు డిమాండ్ చేశారు. మల్లెల బాబ్జీ హత్య, దేవినేని ఉమ వదిన చనిపోయిన తీరుపై విచారణ చేయించాలని వారన్నారు. టీడీపీ నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోవడంతో దేవినేని ఉమకు మతి భ్రమించిందని వారు వ్యాఖ్యానించారు. 

ఇకనైనా దేవినేని ఉమ పద్ధతి మార్చుకోవాలని జలీల్‌ఖాన్‌, గౌతంరెడ్డి, సామినేనిలు హెచ్చరించారు. షర్మిల పాదయాత్ర ఆదరణను చూడలేకే బ్రదర్ అనిల్‌పై ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జలీల్‌ఖాన్‌, గౌతంరెడ్డి, సామినేని ఉదయభానులు ఆరోపించారు. 

ముగిసిన 98వ రోజు షర్మిల పాదయాత్ర

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మరో ప్రస్థానం 98వ రోజు పాదయాత్ర ముగిసింది. అంతకు ముందు పెరుకలపూడిలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి ఆమె పూలమాలవేసి నివాళుర్పించారు. ఇప్పటి వరకు షర్మిల 1349.3 కిలోమీటర్లు నడిచారు.

26 నుంచి షర్మిల కృష్ణా జిల్లా పాదయాత్ర

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మరో ప్రస్థానం పాదయాత్ర ఈ నెల 26 నుంచి కృష్ణా జిల్లాలో మొదలవుతుందని ఆ పార్టీ నేతలు జలీల్ ఖాన్, ఉదయభాను, గౌతంరెడ్డి, తలశిల రఘురాం చెప్పారు. ఈనెల 26 
మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల పాదయాత్ర విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకుంటుందని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కెనాల్ రోడ్డు మీదుగా షర్మిల పాదయాత్ర సాగుతుంది. ఆ తరువాత కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ లో బహిరంగ 
సభ జరుగుతుంది. 26న పశ్చిమ, 27న సెంట్రల్ 28న తూర్పు నియోజకవర్గాలలలో ఆమె పాదయాత్ర చేస్తారు. కృష్ణా జిల్లాలో 272 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేస్తారు. మొత్తం 14 నియోజకవర్గాలలో నెల రోజులపాటు పాదయాత్ర కొనసాగనుంది. 

పాదయాత్ర 100వ రోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో షర్మిల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు 7 జిల్లాల్లో 43 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర సాగింది. మొత్తం 109 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర జరుగనుంది.

త్వరలో వైఎస్ఆర్ సిపిలో చేరతా:శ్రీశైలం గౌడ్

తన అనుచరులతో చర్చించి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ ఉదయం ఆయన చంచల్ గూడ జైల్లో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ప్రజలు జగన్ కు అండగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీచేస్తానని చెప్పారు. 

MLA Kuna Srisailam Goud met YS Jagan

Jupudi Prabhakar press meet

దుగ్గిరాల నుంచి షర్మిల పాదయాత్ర

వైఎస్ షర్మిల పాదయాత్ర నేటితో 98వ రోజుకు చేరింది. శుక్రవారం ఆమె మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను మంగళగిరి నియోజకవర్గం గాంధీనగర్ నుంచి ప్రారంభించారు. గాంధీనగర్, పెనుమూలి, కంఠంరాజు కొండూరు, మంచికలపూడి మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం మోరంపూడి, పేరికలపూడి మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.

'సీబీఐ కాంగ్రెస్ తొత్తులా వ్యవహరిస్తోంది'

సీబీఐ కాంగ్రెస్‌ పార్టీకి తొత్తులా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్వతంత్ర ప్రతిపత్తితో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఉపయోగపడటం లేదని ఆయన శుక్రవారమిక్కడ ఆక్షేపించారు. తనను వ్యతిరేకించిన పార్టీలను వేధించేందుకు కాంగ్రెస్‌ సీబీఐని ఆయుధంలా వాడుకుంటోందని భూమన ధ్వజమెత్తారు.

డీఎంకే నేత స్టాలిన్‌ నివాసంపై జరిగిన దాడులతో సీబీఐ కాంగ్రెస్‌ మధ్య బంధం బయటపడిందని విమర్శించారు. పది నెలలుగా జగన్‌ను ప్రజల నుంచి దూరంగా ఉంచినా ప్రజాదరణ వెల్లువెత్తుతుందని భూమన అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి సీబీఐ, ఈడీలను దుర్వినియోగపరచడం ప్రజాస్వామానికి మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.

వైఎస్ఆర్ సీపీలో చేరిన మువ్వ ఆనంద్

ఏలూరుకు చెందిన పారిశ్రామిక వేత్త మువ్వ ఆనంద్ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో శుక్రవారం ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

Sharmila's speech in Amruthalur, Guntur 19032013

Sharmila's Speech at Market Center, Tenali

YSRCP Leader Somayajulu speaks to media in YSRCP office

CBI, a puppet in hands of congress

జగన్ కోసం -300 రోజులు

ఏ తప్పూ చేయకపోయినా అక్రమాస్తులంటూ జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారు. ఈ పాపం కాంగ్రెస్. టీడీపీలదే, రాజకీయంగా పోటీ ఉన్నప్పుడు రాజకీయంగానే ఎదుర్కోవాలి. అంతేగాని కుట్ర
లు, కుతంత్రాలు సరికాదు. జగన్‌ను జనం నుంచి దూరం చేయాలన్న ఆ రెండు పార్టీల కుయుక్తులు ఏనాటికీ ఫలించవు. త్వరలోనే జగన్ బయటకు రావడం, రాష్ట్రానికి సీఎం కావడం ఖాయం. పులి బయట ఉన్నా బోనులో ఉన్నా పులే అనే విషయం మరచి జగన్‌ని జైల్లో పెట్టి ప్రజల నుంచి దూరం చేయాలని ఆ రెండు పార్టీలు వృథాగా ప్రయాసపడుతున్నాయి. అంతేనా, షర్మిల పాదయాత్రకు తరలి వస్తున్న జనసందోహాన్ని చూసి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు వణికిపోతున్నారు. 

ఇప్పటికైనా వారు తమ తప్పును తెలుసుకుని మసులుకోకపోతే సగం స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేరు. రాష్ట్రంలో తొంబై శాతం మంది ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు ఎంతోమంది తల్లులు తమ బిడ్డే అన్నట్లుగా నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో, తల్లుల ఆశీర్వాదంతో జగన్ నిర్దోషిగా బయటకి వస్తాడు. 

అమ్మా విజయమ్మ, తల్లీ భారతీ, సోదరీ షర్మిలా... మీకు కోట్లమంది కుటుంబ సభ్యులున్నారు. మా గుండెల్లో మీరున్నారు. విజయమ్మగారూ మీరు బాధపడకండి. మీ ప్రార్థనను ఆ దేవుడు తప్పక ఆలకిస్తాడు. తప్పకుండా జగనన్న తొందరగా బయటికి వచ్చి వీళ్లందరికి బుద్ధి చెప్తాడు. 

- నీలం శివగంగాధర,
వీరపునాయునిపల్లె, వైయస్సార్ జిల్లా

సోలార్ టెండర్లలో భారీ కుంభకోణం: భూమన

సోలార్ విద్యుత్ కొనుగోలు టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల ఖజానాకు రూ.రెండువేల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ఈ టెండర్ల వ్యవహారంలో అధికారపార్టీ, ప్రధాన ప్రతిపక్షం(టీడీపీ) రెండూ మిలాఖత్ అయ్యాయని, కొందరు పెద్దలకు రూ.600 కోట్లు ముడుపులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఈ కుంభకోణం బాగోతం బయటపడాలంటే టెండర్లకు సంబంధించిన ఫైళ్లను శాసనసభ ముందుంచాలని డిమాండ్ చేశారు. భూమన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తికి ఏమాత్రం సంబంధంలేని ట్రాన్స్‌కో టెండర్లు పిలవడంలో ఉన్న మతలబేంటని ప్రశ్నించారు. సౌర విద్యుత్ టెండర్లలో జెన్‌కోను భాగస్వామ్యం చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

విద్యుత్‌పై లెఫ్ట్ పోరుకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం

 విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించాలని కోరుతూ పది వామపక్ష పార్టీలు చేపట్టనున్న ఆందోళనకు సంఘీభావం తెలపడంతోపాటు తాము కూడా ఈ సమస్యలపై ముందుండి పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వామపక్షాల తరపున వై.వెంకటేశ్వరరావు (సీపీఎం), గాదె దివాకర్ (న్యూడెమోక్రసీ), జానకిరాములు (ఆర్‌ఎస్‌ిపీ) గురువారం వైఎస్సార్ సీపీ కార్యాలయానికి వచ్చి పార్టీ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి, గట్టు రామచంద్రరావు, జనక్‌ప్రసాద్‌తో చర్చలు జరిపారు. తమ ఆందోళనకు మద్దతివ్వడంతోపాటు విడిగా కూడా ఉద్యమం చేపడితే మంచిదని వామపక్ష నేతలు సూచించారు. 

అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి విద్యుత్ చార్జీలపై దిగివచ్చేలా చేయడానికి అంతా కలిసి పోరాడాలని సూచించినట్టు తెలిపారు. విద్యుత్ కోతలు తగ్గించాలని, ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారీగా పెంచతలపెట్టిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించాలని, మర్చంట్ (వ్యాపార) పవర్ ప్లాంటుల విధానాన్ని రద్దు చేయాలని, ఇంధన సర్‌చార్జి సర్దుబాటును రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 23 నుంచి వామపక్షాలు నిరాహారదీక్షలు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. చార్జీల పెంపును ఈ నెల 23, 26వ తేదీల మధ్యలోనే రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించే అవకాశం ఉన్నందున ఈ ఆందోళనకు పూనుకుంటున్నామని దివాకర్ తెలిపారు

వైఎస్‌ఆర్ స్మృతివనం నిర్వహణకు కమిటీ

కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని వెలుగోడు రిజర్వ్‌ఫారెస్టులో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతి వనం ప్రాజెక్టు నిర్వహణ, పనుల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శామ్యూల్ గరువారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు కలెక్టరు అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్ ఫీల్డ్ డెరైక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగాను, కర్నూలు రెవెన్యూ డివిజినల్ అధికారి, నంద్యాల రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు, కర్నూలు ఉద్యాన శాఖ ఉప సంచాలకులు, ఆత్మకూరు వన్యప్రాణి సంరక్షణ విభాగం డివిజినల్ ఫారెస్ట్ అధికారి సభ్యులు. 

వారి ఇళ్లపై దాడులు చేయలేదేం?

వైఎస్సార్‌సీపీ నేత సోమయాజులు ధ్వజం
యూపీఏకు మద్దతు ఉపసంహరించగానే డీఎంకే నేత స్టాలిన్ ఇంటిపై దాడులే నిదర్శనం
సంబంధం లేదంటూనే దాడులు ఎలా ఆపారు? 
జగన్ కేసులో ఇదే జరుగుతోంది


 సీబీఐ దర్యాప్తు సంస్థ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారిందని మరోసారి రుజువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వానికి డీఎంకే మద్దతు ఉపసంహరించిన రెండు రోజుల్లోనే ఆ పార్టీ నేత స్టాలిన్ ఇంటిపై సీబీఐ దాడులు చేయటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. సోమయాజులు గురువారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘సీబీఐని యూపీఏ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు వినియోగించుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత రెండేళ్లుగా చెబుతూ వస్తోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసులో ఇదే జరుగుతోంది. 

ఇటీవల పార్లమెంట్ ఉభయసభల్లో లోక్‌పాల్‌పై జరిగిన చర్చలో సీబీఐ తీరును, యూపీఏ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప దాదాపుగా ప్రతిపక్ష పార్టీలన్నీ దుయ్యబట్టాయి. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌ను ప్రయోగిస్తున్నాయని ఆరోపించాయి. అయితే వాటి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోమని, అవి స్వతంత్రంగానే వ్యవహరిస్తాయని ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి చిదంబరం చెప్పారు. కానీ ఇపుడు జరుగుతున్నదేమిటి? శ్రీలంకలో తమిళుల ఊచకోతపై కేంద్రానికి డీఎంకే మద్దతు ఉపసంహరించుకోగానే స్టాలిన్ నివాసంపై సీబీఐ దాడులు చేయలేదా?’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 

సీబీఐ దాడులు ఇంతలోనే ఎలా ఆగాయి?

స్టాలిన్ ఇంటిపై సీబీఐ ఎందుకు దాడులు చేసిందో, మళ్లీ అంతలోనే ఎందుకు ఆపారో చెప్పాలని సోమయాజులు డిమాండ్ చేశారు. దాడులు ఆపడానికి ప్రధాని, చిదంబరం, కమల్‌నాథ్ లాంటి వారు జోక్యం చేసుకోలేదా? అని ఆయన ప్రశ్నించారు. ‘సీబీఐ నిజంగా స్వతంత్రంగా వ్యవహరిస్తుంటే స్టాలిన్ ఇంటిపై దాడులు చేసినపుడు యూపీఏ ప్రముఖులు ఊరుకుని ఉండాలి కదా? మరి మధ్యలో ఎందుకు జోక్యం చేసుకున్నారు? దాడులు దురదృష్టకరమని, తమకు తెలియకుండానే జరిగాయని ఎలా వ్యాఖ్యానించారు? దీన్ని బట్టి చూస్తుంటే సీబీఐ పనితీరు రాష్ట్ర పోలీసుశాఖలోని ఎస్‌ఐ, సీఐ కంటే అధ్వానంగా తయారైంది. యూపీఏ ప్రభుత్వం ఏది చెబితే అది చేయడం, ఎలా ఆడమంటే అలా ఆడటం, ఎవరిపై కేసులు పెట్టమంటే వారి మీద మోపటం, ఎవరిని వేధించమంటే వారిని వేధించడమే సీబీఐ పనిగా మారింది’ అని సోమయాజులు వ్యాఖ్యానించారు. 

అనుమానంతోనే జగన్‌ను నిర్బంధించారు

కేవలం ఒక్క అనుమానంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఉంచారని సోమయాజులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘43 వేల కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని జగన్ కేసులో సీబీఐ ఆరోపణలు చేసింది. ఇప్పటికి 70 శాతం దర్యాప్తు పూర్తయిందని చెప్పింది. కానీ ఇప్పటికి వారు తేల్చామని చెబుతున్నది రూ.900 కోట్ల మేరకు మాత్రమే! ఇదేం విడ్డూరం?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 26 జీవోలు సక్రమమైనవని ఆరుగురు మంత్రులు, 8 మంది రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు సుప్రీంకోర్టుకు తెలియజేసిన తరువాత కూడా ఇందులో ఏదో జరిగిందనే అనుమానంతో జగన్‌ను జైల్లో పెట్టారన్నారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినపుడల్లా టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లి చిదంబరంకు ఓ వినతిపత్రం ఇవ్వడం, ఆయన తన ఆధ్వర్యంలోని ఈడీకి ఆదేశాలివ్వడం.. వారు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆదేశాలిచ్చి హడావుడి సృష్టించడం పరిపాటి అయిపోయిందన్నారు. ‘అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్న చోట జరుగుతున్నది ఇదేనా? అసలు ఇలాంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా’ అని ప్రశ్నించారు.

వారి ఇళ్లపై దాడులు చేయలేదేం?

‘బోఫార్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు చేసిందా? ములాయంసింగ్, మాయావతిపై ఇలాంటి కేసులే ఉన్నాయి కదా? వారి ఇళ్లపై సీబీఐ దాడులు చేసిందా? ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి ఇంటిపైనే 28 బృందాలతో ఏకకాలంలో దాడులు ఎందుకు నిర్వహించారు?’ అని సోమయాజులు మండిపడ్డారు.

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఆరోపణలు

‘వచ్చే సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఫలానా వారు పోటీ చేయవచ్చనే ఊహాగానంతో ఒక ఆంగ్లపత్రిక పేర్ల జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో ఉన్న వారిని కేంద్రం వేధిస్తోంది. ఓవైపు నుంచి ఆదాయపు పన్నుశాఖ, మరోవైపు నుంచి ఈడీ శాఖలు వారిని చుట్టుముట్టాయి. ఇదేం న్యాయం?’ అని సోమయాజులు ప్రశ్నించారు. సీబీఐ దురుద్దేశంతోనే జగన్‌పైనా ఆయన మద్దతుదారుల ఇళ్లపైనా దాడులు చేయడం, వేధించడం... ఆ వివరాలను తామంటే గిట్టని కొన్ని టీవీ చానెళ్లు, పత్రికలకు చెప్పడం.. వాటిని అవి భూతద్దంలో వేసి ప్రచారం కల్పించడం జరుగుతోందని మండిపడ్డారు.వీరభద్రారెడ్డి ఆత్మహత్యను కూడా బ్రదర్ అనిల్‌కుమార్‌కు ఆపాదిస్తూ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. 

చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు కాబట్టే ఆయనపై సీబీఐ దర్యాప్తులు లేవు

* కరుణానిధి యూపీఏ నుంచి తప్పుకోగానే ఆయన కుమారుడి ఇంటిపై దాడులు చేయించారు
* {పతిపక్షాలు పార్లమెంటులో దుమ్మెత్తిపోస్తే.. వెంటనే సీబీఐని వెనక్కి రప్పించారు
* జగన్.. కాంగ్రెస్‌కు వ్యతిరేకి అయ్యాడు కాబట్టే కేంద్ర దర్యాప్తు సంస్థను ప్రయోగించారు
* చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు కాబట్టే ఆయనపై సీబీఐ దర్యాప్తులు లేవు
* దర్యాప్తులు చేయించడం లేదు కాబట్టే చంద్రబాబు అవిశ్వాసం పెట్టలేదు 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడని.. అందుకోసం ఎందాకైనా నడిచేందుకు సిద్ధమయ్యాడని.. నాన్న కోసం గుండెపగిలిన ఆత్మబంధువుల కుటుంబాలను ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర చేస్తున్నాడన్న కక్షతో కాంగ్రెస్ పార్టీ జగనన్నను పొగబెట్టి పార్టీ నుంచి బయటికి పంపించింది. జగనన్న ఆ పార్టీకి వ్యతిరేకయ్యాడు కాబట్టే ఆయన మీద సీబీఐ అస్త్రం ప్రయోగించింది. అబద్ధపు కేసులు పెట్టి నాలుగు గోడల మధ్య బంధించింది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు కాబట్టే సీబీఐ ఆయన మీద ఏ కేసులూ పెట్టదు... ఏ విచారణలూ చేయదు. 

సీబీఐ కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మ అని తమిళనాడు సంఘటన(డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఇంట్లో సీబీఐ సోదాలు)తో మరోసారి రుజువైంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం గుంటూరు జిల్లా తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల్లో సాగింది. అక్రమ కేసులతో జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో బంధించడాన్ని నిరసిస్తూ.. నల్ల బ్యాడ్జీలు ధరించిన ప్రజలు దుగ్గిరాల మండల కేంద్రానికి భారీ ఎత్తున తరలి వచ్చారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

వ్యతిరేకిస్తే సీబీఐ దాడులే..

సీబీఐ గురించి చెప్పాల్సివస్తే ‘అది కేంద్రం చేతిలో కీలుబొమ్మ’ అని దాని మాజీ డెరైక్టర్ జోగీందర్ సింగే స్వయంగా చెప్పారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే ఈ పాటికి ఏ మంత్రో.. ముఖ్యమంత్రో అయిపోయి ఉండేవారు’ అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకుడు గులాం నబీ ఆజాదే చెప్పారు. తమనువ్యతిరేకించినందుకే ఆయన్ను ఇన్ని తిప్పలు పెడుతున్నామని ఆయనే ఒప్పుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమతో కుమ్మక్కయ్యారు కాబట్టి ఆయనపై సీబీఐ దర్యాప్తులు చేయించడం లేదు. దర్యాప్తులు చేయించడం లేదు కాబట్టి చంద్రబాబు.. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా, వైఎస్సార్ సీపీ అవిశ్వాసం పెడితే మద్దతివ్వకుండా కాపాడుతున్నారు. ఇంతకాలం యూపీఏలో ఉన్న తమిళనాడు పార్టీ డీఎంకే.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు మద్దతు ఉపసంహరించుకుంది. 

మంగళవారం డీఎంకే మద్దతు వెనక్కి తీసుకుంటే.. గురువారం ఉదయం ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఇంటి మీద ఈ సీబీఐ దాడి చేసింది. ఈ నిస్సిగ్గు వ్యవహారం జరిగిన కొన్ని గంటలకే ప్రతిపక్షాలు పార్లమెంటులో దుమ్మెత్తిపోశాయి. వెంటనే సీబీఐని వెనక్కి రమ్మని పిలిచారు. సీబీఐ.. పెట్టెలు సర్దుకొని తలాడించుకుంటూ వెనక్కి వెళ్లిపోయింది. స్వతంత్రంగా పని చేయాల్సిన సీబీఐ ఈ రోజు కేంద్ర పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారిందని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం మాత్రమే. కీలుబొమ్మ కాకపోతే.. దాడులెందుకు చేశారు? ఎందుకు మధ్యలోనే నిలిపేశారు?
కేంద్రం సమాధానం చెప్పాలి..

డీఎంకే మీద సీబీఐ చేత ఎందుకు దాడులు చేయించారు? ఎందుకు మళ్లీ వెనక్కి తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. డీఎంకే మీకు మద్దతు ఉపసంహరించుకుంది గనుకనే వారి మీద దాడులు చేశారా? అని అడుగుతున్నా.. ఒక వేళ అదే నిజమైతే ఆ నిజాన్ని ఒప్పుకోండి. లేదూ అందుకు కాదు.. వాళ్లు అవినీతికి పాల్పడ్డారు.. అందుకే సీబీఐ దాడులు చేసింది అని మీరు చెప్తే..! ఎందుకు మరి దాడులను మధ్యలోనే నిలిపివేసి వచ్చారో చెప్పండి. ఎప్పుడు సీబీఐని ప్రయోగించాలి? ఎవరి మీద ప్రయోగించాలి? ఎలా ప్రయోగించాలి? మళ్లీ వెనక్కి ఎలా తీసుకోవాలో కేంద్ర పాలకులే నిర్ణయిస్తున్నారు. ఇవాళ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందీ అంటే రాజకీయ పార్టీల కంటే సీబీఐ మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగాలని చూస్తోంది. కేంద్రంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉందీ అంటే.. వాళ్ల చేతిలో ఉన్న సీబీఐ అనే అస్త్రం ఒక్కటే కారణం.

ప్రజాస్వామ్యంలో కూడా ఇంత నీచంగా ఆలోచన చేస్తున్న కాంగ్రెస్ పరిపాలన చూసి ఇది మన దురదృష్టం అనుకోవాలో? లేకపోతే తామే దేవుళ్లం.. ఎవరిని కావాలంటే వాళ్లను తొక్కెయ్యగలమని అహంభావంతో వ్యవహరిస్తున్న వీళ్లను చూసి అసహ్యించుకోవాలో అర్థం కావడం లేదు. రాజకీయంగా జగనన్నను ఎదుర్కోలేక సీబీఐని ప్రయోగించి జైల్లో పెట్టారు. నిజంగా వీళ్లకు ధైర్యం ఉంటే.. కాంగ్రెస్, టీడీపీలకు వ్యతిరేకంగా అవిశ్వాసానికి మద్దతు పలికిన 15 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి. కుమ్మక్కు రాజకీయాలు నడిపే మీకు ప్రజల మధ్యకు వచ్చే ధైర్యం ఉందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున అడుగుతున్నా. కానీ వారికి ఆ ధైర్యం లేదు. ఉప ఎన్నికలకు వెళ్లినా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ల పార్టీల గుర్తుతో వెళ్లినా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మొత్తం సీట్లు గెలుచుకుంటుందని వాళ్లకు తెలుసు’’

14.2 కిలోమీటర్ల మేర యాత్ర: పాదయాత్ర 97వ రోజు గురువారం గుంటూరు జిల్లా తెనాలి నుంచి ప్రారంభమైంది. షర్మిల అక్కడి నుంచి తెనాలి పట్టణ వీధుల్లో దాదాపు 3.5 కిలోమీటర్లు నడిచారు. తెనాలిలో గుఱ్ఱం జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి కటివరం క్రాస్ రోడ్డు , నందివెలుగు మీదుగా దుగ్గిరాల చేరుకున్నారు. ఇక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేశారు. భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. గురువారం మొత్తం 14.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,335.7 కి.మీ యాత్ర పూర్తయింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి.. షర్మిలను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు కొద్దిదూరం నడిచారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో మర్రి రాజశేఖర్, ఆర్‌కే, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, పి. గౌతంరెడ్డి, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు బండారు సాయిబాబు మాదిగ, దేవళ్ల రేవతి, మేరాజోత్ హన్మంతు నాయక్ తదితరులు ఉన్నారు. 

100వ రోజు యాత్రకు హాజరుకానున్న పార్టీ ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్: ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలందరూ యాత్రకు హాజరవుతున్నారు. ఆదివారంతో యాత్ర వంద రోజులు పూర్తవుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆ రోజు సాయంత్రం బహిరంగ సభ జరుగుతుంది.

షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మంగళగిరి నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రొగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి గాంధీనగర్, పెనుమూలి, కంఠంరాజు కొండూరు, మంచికలపూడి మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం మోరంపూడి, పేరికలపూడి మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.

పర్యటించే ప్రాంతాలు
మంగళగిరి నియోజకవర్గం: గాంధీనగర్, పెనుమూలి,కంఠంరాజు కొండూరు, మంచికలపూడి, మోరంపూడి, పేరికలపూడి

సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ: షర్మిల

Written By news on Thursday, March 21, 2013 | 3/21/2013

'సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ' అనే విషయం మరోసారి స్పష్టమైందని వైఎస్ షర్మిల అన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె గురువారం తెనాలిలో మాట్లాడుతూ సాక్షాత్తూ సీబీఐ మాజీ డైరక్టర్‌ జోగిందర్‌ సింగే ఈ వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

యూపీఏకు మద్దతు విరమించిన మరుసటి రోజే.. డీఎంకే నేత స్టాలిన్‌ ఇంట్లో సీబీఐ సోదాలు జరపటం... నిరసనలు వెల్లువెత్తటంతో కేంద్రం ఒక కనుసైగ చేయటంతో సోదాలు ఆపేసిందని షర్మిల విమర్శించారు. కాగా షర్మిల పాదయాత్రలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను ఆమె విన్నారు 

కాంగ్రెస్ కు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలబోతోంది. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరడానికి గాను జగన్ ను కలవబోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.కుత్బుల్లాపూర్ నుంచి ఇండిపెండెంటుగా గెలిచి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న కూన శ్రీశైలం గౌడ్ శుక్రవారం నాడు జగన్ ను చంచల్ గూడ జైలులో కలవవచ్చని చెబుతున్నారు.ఇక మరో ఎమ్మెల్యే ఎల్.బి.నగర్ కు ప్రాతినిద్యం వహిస్తున్న సుదీర్ రెడ్డి అని చెబుతున్నారు.ఈయన పేరు అధికారికంగా దృవీకరణ కానప్పట్టికీ ఈయన పేరు బాగా ప్రచారంలోకి వస్తోంది.

Source:kommineni.info

సీబీఐకి అంత స్వాతంత్య్రం ఉంటే ఐఎంజీ భూములు, ఎమ్మార్‌పై ఎందుకు విచారించదు?

* స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్, టీడీపీలకు షర్మిల బహిరంగ సవాల్
* దమ్ముంటే అవిశ్వాసానికి మద్దతిచ్చిన 15 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఎన్నికలు పెట్టండి
* అధికారం ఉంది కదా అని సీబీఐని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు
* సీబీఐకి అంత స్వాతంత్య్రం ఉంటే ఐఎంజీ భూములు, ఎమ్మార్‌పై ఎందుకు విచారించదు?
* బొత్స మాఫియా డాన్ అని సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తుంటే ఎందుకు వినిపించదు?
* కరెంటు సంక్షోభం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్య ఫలితమే
* రాష్ట్రంలో ప్రజల కన్నీళ్లు చూస్తూ కూడా చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతివ్వలేదు

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేసేందుకు ముందుకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సవాలు విసిరారు. వైఎస్సార్ సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపి ప్రజాపక్షాన నిలిచిన 15 మంది కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి.. ఉప ఎన్నికలు నిర్వహించే దమ్ముందా అని రెండు పార్టీలకూ మరో సవాలు చేశారు. ఆ రెండు పార్టీలకూ ఆ దమ్ము లేదని, రాష్ట్రంలో ఏ ఎన్నికలొచ్చినా గత ఉప ఎన్నికల ఫలితాలే వస్తాయని భయమని అన్నారు. ‘‘ఉప ఎన్నికలొస్తే పదిహేనుకు పదిహేను సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుపోతుందని వారికి తెలుసు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో లాగా కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కవని వారికి హడల్. జగన్ నిర్దోషి అని ఉప ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారని వారికి భయం. తమకు ముఖ్యమంత్రిగా కిరణ్, చంద్రబాబు వద్దని, జగనన్నే సీఎంగా కావాలని ప్రజలు ఎలుగెత్తి చాటుతారని భయం. ఈ భయంతోనే కుట్రలు పన్ని జగనన్నపై అబద్ధపు కేసులు పెట్టి జైల్లో పెట్టారు’’ అని షర్మిల ఘాటుగా విమర్శించారు. ప్రజల సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వంతో కుమ్మక్కయిన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో సాగింది. తెనాలి మార్కెట్ సెంటర్‌లో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

సీబీఐని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు..

‘‘అధికారం ఉంది కదా అని యూపీఏ ప్రభుత్వం.. సీబీఐని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటోంది. సీబీఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అని సీబీఐ మాజీ డెరైక్టరే స్వయంగా చెప్పారు. సీబీఐకి నిజంగా స్వాతంత్య్రమే ఉంటే.. ఐఎంజీ భూములు, ఎమ్మార్ పై ఎందుకు విచారణ చేయదు? సినీ నటుడు, కేంద్ర మంత్రి చిరంజీవి బంధువుల ఇంట్లో రూ.70 కోట్లు మంచం కింద దొరికితే సీబీఐకి ఎందుకు కనిపించదు? పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్రంలోనే అతిపెద్ద మాఫియా డాన్ అని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తే అది సీబీఐకి ఎందుకు వినిపించదు? అమాయకుడైన జగనన్నను మాత్రం 10 నెలలకు పైగా జైల్లో పెట్టి ఉంచారు.

కారణం కిరణ్ నిర్లక్ష్యమే: ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరెంటు లేదు. ఎటు చూసినా కోతలే. వైఎస్ వాగ్దానం చేసిన 9 గంటలు కాదుకదా కనీసం 3 గంటలు కూడా ఈ ప్రభుత్వం వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వడం లేదు. ఆ వచ్చే 3 గంటలు కూడా రాత్రి వస్తుందో, పగలు వస్తుందో తెలియట్లేదు. అర్ధగంటకోసారి, గంటకోసారి వాళ్లకు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తున్నారు. గ్రామాల్లో అయితే రెండు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. ఇక పరిశ్రమల దుస్థితి వర్ణణాతీతం. నెలకు 12 రోజులు కరెంటు కోతలు విధించడంతో 20 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. దీనికంతటికీ కారణం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. కేవలం కిరణ్ నిర్లక్ష్యం కారణంగానే, ఆయనకు ముందుచూపు లేకే రాష్ట్రం గతంలో ఎన్నడూ లేనంతగా కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కానీ కరెంటేదో 24 గంటలూ ఇస్తున్నట్టు ప్రభుత్వం సర్‌చార్జీల పేరుతో ప్రజల నెత్తిన రూ.32 వేల కోట్లు మోపి ప్రజల రక్తం పిండి వసూలు చేయాలని చూస్తోంది.

బాబూ.. ప్రజల కోసం కన్నీరు పెట్టావా?

మన ఖర్మేమిటంటే ఒకవైపు ఇంత అసమర్థ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే, మరోవైపు అంతే పనికిమాలిన చంద్రబాబు ప్రధానప్రతిపక్ష నేతగా ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి కష్టాలను విని భరోసా కల్పించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. రైతుల కష్టాలను చూసి తల్లడిల్లిపోయి మండే ఎండను కూడా ఎదిరించి ప్రజల కష్టాలను తెలుసుకుంటూ యాత్ర చేశారు. ఇప్పుడు చంద్రబాబేమో.. నెత్తిన ఫ్యాను పెట్టుకుని, ఏసీల్లో ఉంటూ యాత్ర చేస్తున్నారు. పొద్దున పేపర్లో చూశా. చంద్రబాబు దగ్గరికి వాళ్ల పార్టీ నాయకుడొకరు వెళ్లి బాబుగారూ మాకోసం చాలా కష్టపడుతున్నారు అని బాధపడ్డారట. దానికి చంద్రబాబు కూడా అవును అని తన మీద తనే జాలి కురిపించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారట. చంద్రబాబూ మిమ్మల్ని ఒక్క మాటడుగుతున్నా. ప్రజల కష్టాలను చూసి మీరు ఒక్కసారైనా కన్నీళ్లు పెట్టుకున్నారా? రైతన్నల బాధలు చూసి ఒక్క కన్నీటి చుక్కైనా కార్చారా? ఆలోచించుకోండి. మీకే అర్థమవుతుంది. మీమీద ఎంత ప్రేముందో, రైతుల మీద ఎంత ప్రేముందో! మేమూ పాదయాత్రలు చేస్తున్నాం. అధికారంలోకి వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలను అమలు చేస్తామని గర్వంగా చెప్తున్నాం. చంద్రబాబూ.. నువ్వు అధికారంలోకి వస్తే నీ పాలనను మళ్లీ అందిస్తానని చెప్పే ధైర్యం నీకుందా? లేదు చెప్పలేవు. ఎందుకంటే నీ హయాంలో వేల మంది రైతులు అల్లాడిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారని నీకు తెలుసు.

కాంగ్రెస్ సర్కారును గొడ్డళ్లతో నరకాలన్నావు..

ఈ సర్కారు పనికిరాదని, దుర్మార్గపు ప్రభుత్వమని, దీన్ని కత్తులు, గొడ్డళ్లతో నరకాలని తన పాదయాత్రలో చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇన్ని చెప్పి తీరా చేతల వరకు వచ్చేసరికి అవిశ్వాస తీర్మానంలో అసమర్థ, ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్నినెత్తిన పెట్టుకున్న చంద్రబాబు నాయకుడనాలా? ఊసరవెల్లి అనాలా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఉందంటే ఆ పాపం చంద్రబాబుదే. బాబు తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కేసులు విచారణ జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారు. ఈ రెండు పార్టీలకూ ఏమాత్రం ఆలోచన లేదు. నీతి, నిజాయితీల్లేవు. తెలిసిందల్లా కుమ్మక్కవడమే. మూడేళ్ల కిందట ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలుకొని నిన్నటి అవిశ్వాసం వరకు ప్రతి సారీ కుమ్మక్కవుతూనే ఉన్నారు.’’

13.6 కిలోమీటర్ల యాత్ర
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 96వ రోజు బుధవారం షర్మిల వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో 13.6 కిలోమీటర్లు నడిచారు. కూచిపూడి, పెదరావూరు, జగ్గడిగుంట, చినరావూరు, తెనా


జగన్‌ను దెబ్బతీసే కుట్ర

ఆయనపై సీబీఐ దర్యాప్తు కోరినవారు రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రత్యర్థులు
* జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా దర్యాప్తు కోరారు
* జగన్‌కు ఆర్థిక సలహాదారును కాబట్టే ఈ కేసులో నన్ను ఇరికించారు
* అభియోగాలన్నీ అవాస్తవం, ఆధారరహితం.. కొట్టివేయండి
* ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసిన విజయసాయిరెడ్డి
* సీబీఐకి న్యాయస్థానం నోటీసులు.. విచారణ ఏప్రిల్ 1కి వాయిదా 

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఆయన రాజకీయ ప్రత్యర్థులు హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తు కోరారని ఆడిటర్ విజయసాయిరెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్రావు, టీడీపీ నేత ఎర్రన్నాయుడులు వైఎస్‌కు రాజకీయ ప్రత్యర్థులని, రాజకీయంగా జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన రెండో చార్జిషీట్ సీసీ నంబర్ 9లో తనపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలని, ఎటువంటి ఆధారాలు చూపనందున వాటిని కొట్టివేయాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక కోర్టులో విజయసాయిరెడ్డి బుధవారం డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.

వైఎస్ రాజారెడ్డికి ఆడిటర్‌ను...

‘‘ఆడిటర్‌గా 1985-86లో నమోదు చేసుకున్నా. వీఎస్ రెడ్డి ఎస్‌పీ అసోసియేట్స్ ఆడిటింగ్ కంపెనీలో భాగస్వామిని. వైఎస్ కుటుంబానికి మూడు తరాలుగా ఆడిటర్‌గా సేవలు అందిస్తున్నా. జగన్‌మోహన్‌రెడ్డి తాత రాజారెడ్డి కంపెనీలకు ఆడిటర్‌గా పనిచేశాను. తర్వాత జగన్ కంపెనీలకు ఆర్థిక సలహాదారుగా, ఆడిటర్‌గా కొనసాగుతున్నా. అందుకే ఈ కేసులో నన్ను అక్రమంగా ఇరికించారు. జగన్‌తో కుమ్మక్కై జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు పెట్టించాననేది అవాస్తవం, ఆధారరహితం. 2006 నవంబర్ 14 నుంచి 2007 జూన్ 21 వరకు జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్‌గా ఉన్నా. ఆ సమయంలో బయటి నుంచి ఎటువంటి పెట్టుబడులు రాలేదు. నేను డెరైక్టర్‌గా తప్పుకున్న తర్వాత 2007 ఆగస్టు 9 నుంచే జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు వచ్చాయి. చట్టం మీద గౌరవం ఉండే వ్యక్తిని. చట్టవిరుద్ధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవర్తించను. ఆధారాలు లేకుండా నాపై అభియోగాల నమోదు ప్రక్రియను ప్రారంభించడం తగదు’’ అని సాయిరెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘‘నాపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలు. ఆధార రహితం. 

చార్జిషీట్, అనుబంధ చార్జిషీట్లలో నాపై మోపిన అభియోగాలకు సీబీఐ ఎటువంటి ఆధారాలూ చూపలేదు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినవారు క్విడ్‌ప్రోకో పద్ధతుల్లో పెట్టిన పెట్టుబడులు తదితర వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కానీ హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీబీఐ దర్యాప్తు కొనసాగింది. ఇందులో ప్రజాప్రయోజనమే లేదు. ప్రైవేటు వ్యక్తులు, ఇతరులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని నాపై మోపిన అభియోగాలను కొట్టివేయండి. నాపై అభియోగాలు నమోదు చేసేందుకు ఆధారాలు లేవు. అవినీతి నిరోధక చట్టం(పీసీ యాక్టు)లోని సెక్షన్ 9 కింద నాపై అభియోగాలు ఎలా మోపుతారు? నేను ప్రజాప్రతినిధిని కాదు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదు. పీసీ యాక్టులోని సెక్షన్ 9 నాకు వర్తించనే వర్తించదు. నేరపూరిత కుట్ర (120-బి), మోసం (420), నకిలీ డాక్యుమెంట్లను సృష్టించడం (468), నకిలీ డాక్యుమెంట్లను నిజమైనవిగా నమ్మించడం (471) తదితర అభియోగాలను నమోదు చేసేందుకు ఎటువంటి ఆధారాలు లేవు’’ అని సాయిరెడ్డి వివరించారు. సీబీఐ మోపిన అభియోగాలను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.

బెయిల్ షరతులు సడలించండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఏప్రిల్ 2న విచారణకు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ఢిల్లీ విభాగం నోటీసులు జారీచేసిందని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న తన బెయిల్ షరతులను సడలించాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆడిటర్ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. మే 26న తన కుమార్తె వివాహం ఉందని, ఈ నేపథ్యంలో ఈనెల 27 నుంచి జూన్ 10 వరకు హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న షరతులను సడలించాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు.. ఏవైనా అభ్యంతరాలుంటే తెలపాలని సీబీఐకి సూచిస్తూ విచారణను ఈనెల 22కి వాయిదా వేశారు.

జగన్ రిమాండ్ 1 వరకు పొడిగింపు

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు ఏప్రిల్ 1 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ గడువు ముగియడంతో బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు.

నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు, శరత్‌చంద్రారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, నిమ్మగడ్డ ప్రకాష్, విజయలక్ష్మీ ప్రసాద్, చంద్రమౌళి, ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, మన్మోహన్‌సింగ్, జగతి, జనని కంపెనీల ప్రతినిధి సీపీఎన్ కార్తీక్, భారతి సిమెంట్ నుంచి బాలాజీ, కార్మెల్ ఏషియా నుంచి రమేష్‌బాబు, సిలికాన్ బిల్డర్స్ నుంచి వేణుగోపాల్‌రాజు తదితరులు కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 1కు వాయిదా వేసింది. మరోవైపు జగన్ కంపెనీల్లో రాంకీ పెట్టుబడులకు సంబంధించి సమర్పించిన మూడో చార్జిషీట్ సీసీ నంబర్ 10, వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించి సమర్పించిన సీసీ నంబర్ 14 చార్జిషీట్లపై అభియోగాల నమోదు ప్రక్రియను కోర్టు బుధవారం ప్రారంభించింది. జగన్ కంపెనీల్లో ఫార్మా కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన సీబీఐ సమర్పించిన మొదటి చార్జిషీట్ సీసీ నంబర్ 8పై అభియోగాల నమోదు ప్రక్రియను ప్రారంభించేందుకు గడువు కావాలని సీబీఐ విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.

త్వరలో తుది చార్జిషీట్: సీబీఐ

జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో దర్యాప్తు కీలక దశలో ఉందని, త్వరలోనే తుది చార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. దర్యాప్తు ఏ దశలో ఉందో వివరిస్తూ సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ బుధవారం కోర్టులో మెమో దాఖలు చేశారు. ఇదిలా ఉండగా మార్చి 31లోగా అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తిచేసి తుది చార్జిషీట్ దాఖలు చేయాలని జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీబీఐకి మౌఖికంగా స్పష్టం చేసింది. ఇందుకు సీబీఐ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 31 ఆదివారం కావడంతో 30లోగానే సీబీఐ చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించే అవకాశం ఉం - See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=564223&Categoryid=1&subcatid=33#sthash.eeAEONRE.dpuf

షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా..

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర గురువారం తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల్లో సాగనుందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.

తెనాలి నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతం నుంచి గురువారం ఉదయం బయలుదేరి ఐతానగర్, బస్‌స్టాండ్, కఠివరం క్రాస్‌రోడ్, ఆటోనగర్ మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం నందివెలుగు, చింతలపూడి మీదుగా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.

పర్యటించే ప్రాంతాలు
తెనాలి నియోజకవర్గం: తెనాలి పట్టణంలోని ఐతానగర్, బస్‌స్టాండ్, కఠివరంక్రాస్‌రోడ్, ఆటోనగర్, నందివెలుగు, చింతలపూడి, మంగళగిరి నియోజకవర్గం: దుగ్గిరా

షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా..

Written By news on Wednesday, March 20, 2013 | 3/20/2013

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర బుధవారం వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో సాగనుందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

బసచేసిన ప్రాంతం నుంచి బుధవారం ఉదయం బయలుదేరి కూచిపూడి మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం పెదరావూరు, జగ్గడిగుంటపాలెం, చినరావూరు, స్వరాజ్ టాకీస్ రోడ్, వాహెబ్‌రోడ్(సత్యనారాయాణటాకీస్‌రోడ్), మెయిన్ రోడ్ మీదుగా పురవేదిక వద్దకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. అక్కడినుంచి రాత్రి బసకు చేరుకుంటారు.

పర్యటించే ప్రాంతాలు
వేమూరు నియోజకవర్గం: కూచిపూడి
తెనాలి నియోజకవర్గం: పెదరావూరు, జగ్గడిగుంట పాలెం, చినరావూరు, స్వరాజ్ టాకీస్ రోడ్, వాహెచ్‌రోడ్(సత్యనారాయణ టాకీస్ రోడ్), మెయిన్‌రోడ్, పురవేదిక 

రాష్ట్రం యూనిట్‌గా సర్పంచ్‌ల రిజర్వేషన్

గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల రిజర్వేషన్లు గతంలో మాదిరి జిల్లా యూనిట్‌గా కాకుండా రాష్ట్రం యూనిట్‌గా నిర్ణయించనున్నారు. 1995 నుంచి 2006 వరకు నిర్వహించిన మూడు దఫాల స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా కలెక్టర్లు సర్పంచ్‌ల సంఖ్యను నిర్ధారించి రిజర్వేషన్లు అమలు చేసేవారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా 73వ రాజ్యాంగ సవరణతోపాటు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణించనున్నారు. ఏ జిల్లాకు ఏ వర్గానికి ఎన్ని పంచాయతీ స్థానాలు రిజర్వ్ అవుతాయన్న విషయాన్ని పంచాయతీరాజ్ కమిషనర్ ప్రకటిస్తారు. ఒక్కో జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, జనరల్ రిజర్వేషన్ల సంఖ్యను కమిషనర్ ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిస్తారు. వాటి ఆధారంగా జిల్లాలో పంచాయతీలను రిజర్వ్ చేస్తారు. 

దీంతో పంచాయతీ రిజర్వేషన్లు పూర్తిగా మారిపోనున్నాయి. బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 18.30 శాతం, ఎస్టీలకు 8.25 శాతం, మిగిలినవి జనరల్ కేటగిరిగా పరిగణిస్తారు. రిజర్వ్, జనరల్ కేటగిరీల్లో 50 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈసారి 21,670 పంచాయతీల్లో సగం మంది మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నిక కానున్నారు. ఈనెల 26న అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను ప్రచురించనున్నారు.

జగన్ కు సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే పాయం

Written By news on Tuesday, March 19, 2013 | 3/19/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగా కేసులలో ఇరికించాయని సిపిఐ మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఈరోజు ఆయన జగన్ను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జగన్ను తప్పకుండా సీఎంను చేస్తారన్నారు. తాను అన్ని విధాల జగన్కు సహకరిస్తానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గాన్ని వైఎస్ అన్ని విధాల ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని చెప్పారు. అవిశ్వాస తీర్మానికి మద్దతివ్వకుండా టీడీపీ ప్రజలను మోసం చేసిందన్నారు 

యూపీఏ నుంచి వైదొలిగిన డీఎంకే

యూపీఏ సర్కార్ నుంచి డీఎంకే వైదొలిగింది. శ్రీలంకలో తమిళుల వ్యవహారంపై యూపీఏ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టు డీఎంకే మంగళవారం ప్రకటించింది. డీఎంకేకు చెందిన ఐదుగురు మంత్రులు కేంద్ర కేబినెట్‌ నుంచి రాజీనామా చేస్తారని పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ప్రకటించారు.

ఈరోజు సాయంత్రం మంత్రులు రాజీనామా లేఖల్ని ప్రధానికి అందజేసే అవకాశం ఉంది. చెన్నైలో ఏర్పాటు చేసిన పార్టీ అత్యవసర సమావేశంలో డీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. డీఎంకే నిర్ణయంతో యూపీఎ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. లోక్సభలో డీఎంకేకు 18మంది ఎంపీలున్నారు. డీఎంకే వైదొలగటంతో యూపీఏ బలం 230కి పడిపోయింది. - 

Popular Posts

Topics :