14 June 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఏపీలో బాబు ఎందరు రేవంత్ లను పురమాయిస్తారో!

Written By news on Saturday, June 20, 2015 | 6/20/2015

epilo baabu endaru revant lanu puramaayistaaro!
హైదరాబాద్ : ప్రజా ప్రతినిధుల సంఖ్యను బట్టి దామాషా పద్ధతిలో ఎమ్మెల్సీ స్థానాలను కేటాయిస్తే రాజకీయ బేరసారాలు ఆగిపోతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో టీడీపీకి బలం లేని జిల్లాల్లో కూడా పార్టీ అభ్యర్థులను ప్రకటించడం చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎందరు రేవంత్‌రెడ్డిలను ప్రజా ప్రతినిధుల కొనుగోలుకు పురమాయిస్తారోనని నెహ్రూ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ధర్మోపన్యాసాలు వల్లిస్తే చాలదని ఆచరించి చూపాలన్నారు. ఆయా పార్టీలకు శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఎమ్మెల్సీ పదవులను కేటాయించాలని చంద్రబాబు అన్నారని, ప్రస్తుతం స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి జరుగబోతున్న ఎన్నికల్లో ఆయా పార్టీలకు బలం ఉన్న చోటే పోటీ చేద్దామని నెహ్రూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. తమకు గాని, తమ పార్టీ అధ్యక్షుడికి గాని సంతలో పశువుల్లా ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదని ప్రజాస్వామ్యంపై  గౌరవం ఉన్న పార్టీగా తాము అందుకు కట్టుబడి ఉంటామన్నారు. మంచి సంప్రదాయాన్ని నెలకొల్పేందుకు బాబు ముందుకు వచ్చి టీడీపీకి బలం ఉన్న జిల్లాల్లోనే కౌన్సిల్ అభ్యర్థులను పోటీ చేయిస్తే మంచిదని పేర్కొన్నారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, విశాఖ జిల్లాల్లో రెండు పదవులున్నా విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేయడాన్ని నెహ్రూ తప్పు పడుతూ దీనిపై తాము న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు. ఒకే గ్రూప్‌గా నోటిఫికేషన్ వచ్చినట్లయితే టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు చెరొక స్థానం వచ్చే పరిస్థితి ఉండేదని ఇపుడలా కాకుండా చేశారని ఆయన దుయ్యబట్టారు.

షర్మిల పరామర్శ యాత్ర షెడ్యూల్

హైదరాబాద్ : ఈ నెల 29 నుంచి నాలుగు రోజులు పాటు రంగారెడ్డి జిల్లాలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర చేయనున్నారు. 29వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు ఈ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని 15 మంది కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా కలుసుకుని పరామర్శిస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తరఫున సోదరి వైఎస్ షర్మిల పరామర్శయాత్రను చేపడుతున్నారు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇదివరకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు పూర్తి కాగా, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఆయన సోదరి షర్మిల పరామర్శ యాత్రను పూర్తిచేసి ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనున్నారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ ప్రధానకార్యదర్శి, పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కె.శివకుమార్ తెలిపారు. శనివారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్‌రెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా పరామర్శయాత్ర షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు. 

పరామర్శ యాత్ర షెడ్యూల్ ఇదీ: 29న ఉదయం లోటస్‌పాండ్‌లోని తమ నివాసం నుంచి షర్మిల బయలుదేరి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెలగూడలో అంజయ్య కుటుంబాన్ని మొదట పరామర్శిస్తారు. అక్కడి నుంచి మంకాళ్ గ్రామంలో ఎంగల జోసెఫ్ కుటుంబాన్ని కలుసుకుంటారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని దండుమైలారం గ్రామంలో పోకల్‌కార్ మేహష్‌జీ కుటుంబాన్ని పరామర్శిస్తారు. 30న మేడ్చల్ నియోజకవర్గంలోని కండ్లకోయలో సుముద్రాల సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని, ఆ తర్వాత మేడ్చల్ గ్రామంలో కొల్తూరి ముత్యాలు కుటుంబాన్ని ఆమె పరామర్శిస్తారు. అక్కడి నుంచి ఇదే నియోజకవర్గంలోని కేసారం గ్రామంలో చెన్నూరి వెంకటేష్ కుటుంబాన్ని, మూడుచింతలపల్లి గ్రామంలోని జామా కృష్ణయ్య కుటుంబాన్ని, లక్ష్మాపూర్ గ్రామంలోని నూతనకంటి మహేశ్ కుటుంబాన్ని ఆమె కలుసుకుంటారు. జులై 1న చేవెళ్ల నియోజకవర్గం ఎన్కెపల్లి గ్రామానికి చెందిన ఈడిగ సుగుణ కుటుంబాన్ని, పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్‌కు చెందిన కల్ప కృష్ణారెడ్డి కుటుంబాన్ని, పరిగిగ్రామంలోని బంగరిగళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని, తాండూరు నియోజకవర్గంలోని గొట్టిగఖుర్దు గ్రామానికి చెందిన ఆవునల లక్ష్మణయ్యచారి కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు. 2న వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి గ్రామంలో కమ్మరి నారాయణ కుటుంబాన్ని, మోమిన్‌పేట్ గ్రామంలో అరిగె యాదయ్య కుటుంబాన్ని, ఎన్కెతల గ్రామంలో ఆలంపల్లి వెంకటేశ్ కుటుంబాన్ని కలుసుకుని ఆమె తమ పరామర్శయాత్రను ముగిస్తారు. 

22న ఏర్పాట్లపై సమీక్ష.. ఈ నెల 22న (సోమవారం) లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా పరామర్శ యాత్ర ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించేందుకు పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరగనుంది.

విజయం.. వైఎస్సార్ సీపీదే!

ఎమ్మెల్సీ ఎన్నికలపై ముత్తుముల ధీమా..
దర్శి:  శాసన మండలి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు త థ్యమని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గ ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో శుక్రవారం నిర్వహించిన సమావే శం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో 992 ఓట్లుకు గాను వైఎస్‌ఆర్ సీపీకి 492 మంది సభ్యులున్నారని.. స్వతంత్య్ర సభ్యుల మద్దతు తమకే ఉన్నందున విజయం వైఎస్సార్ సీపీని వరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ధనవంతులే రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తగా అట్లా చిన్న వెంకట రెడ్డిని గుర్తించి.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించడం అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నిబద్ధతకు నిదర్శనమన్నారు.

టీడీపీ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన విషయం అందరికీ తెలిసిందేనని తెలిపారు. అదే సంప్రదాయాన్ని జిల్లాలో కొనసాగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ పార్టీ గుర్తుతో గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు వైఎస్సార్ ఆశయాల కోసం చిన్నవెంకట రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ,మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న వెంకటరెడ్డి పాల్గొన్నారు.

బాబుకు 23 ప్రశ్నలు

మీడియాకు విడుదల చేసిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అస్థిరపరుస్తున్నారంటూ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది.
తమ పార్టీపై ప్రశ్నలను సంధిం చడానికి ప్రతిగా పలు ప్రశ్నలను మీడియాకు విడుదల చేసింది. చంద్రబాబుకు, టీడీపీకి వైఎస్సార్ కాంగ్రెస్ సూటి ప్రశ్నలు..

⇒ ఓటు, కోట్లు కేసులో మీరు కేసీఆర్ కాళ్లు పట్టుకునేందుకు సిద్ధం అయ్యారా?లేదా?
⇒ ఢిల్లీలో బేరం, రాయబారం కుదుర్చుకునేందుకు సుజనా చౌదరిని ఉపయోగించి కేటీఆర్ కాళ్లా వేళ్లా పడ్డారన్నది నిజం అవునా? కాదా?
⇒ ఢిల్లీలో మీ కేంద్ర మంత్రుల్ని, ఎంపీలను ఉపయోగించి ఎన్డీఏ పెద్దలందరినీ ప్రాధేయపడి గవర్నర్ ద్వారా కాంప్రమైజ్ ఫార్ములా పంపారా? లేదా?
⇒ ఆంబోతు, కీలుబొమ్మ వంటి మాటలు మాట్లాడవద్దని తాఖీదులు ఇచ్చారంటే ఇది మీ రాజీలో భాగం కాదా? గవర్నర్‌ను అప్పుడు ఎందుకు అవమానించారు? ఇప్పుడు ఎందుకు మంచి చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు?
⇒ గాంధీ అనే తాబేదారును ఫోరెన్సిక్ సాక్ష్యాలు తారుమారు చేసేందుకే ఇప్పటికిప్పుడు ఏపీ అడ్వైజర్‌గా వేసుకున్నది నిజం కాదా?
⇒ మీరు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది నిజం అవునా? కాదా? ఆ వాయిస్ రికార్డింగ్‌లో ఉన్నది మీ గొంతు అవునా? కాదా?
⇒ మీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షలతో దొరికాడా?లేదా?
⇒ సెక్షన్-8 ప్రకారం గవర్నర్‌కు శాంతిభద్రతల విషయంలో, పోలీసు అంశాల్లో తుది అధికారం ఉంటుందన్న విషయం మీరు అడ్డంగా దొరికిపోయేవరకు గుర్తుకు రాలేదన్నది నిజం కాదా?
⇒ ఫోన్‌లో రికార్డు చేయటం తప్పు, ఎమ్మెల్యేకి రూ. 5 కోట్లు ఇచ్చి కొనటం ఒప్పు అన్నది మీ అభిప్రాయమా?
⇒ 2008 అక్టోబర్ 18నే తెలంగాణను విడగొట్టండి అని మీ పార్టీలో ఉన్న ఆంధ్రా నాయకులు, రాయలసీమ నాయకులు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయటం, ఆ తీర్మాణాన్ని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి పంపటం నిజం అవునా? కాదా?
⇒ టీఆర్‌ఎస్ కంటే ముందే ఏపీని విడగొట్టండని తీర్మానం చేసి పంపింది మీ పార్టీ అవునా? కాదా?
⇒ 2009లో మీరు, కేసీఆర్ ఒకరి కండువాలు ఒకరిమీద కప్పుకుని, ఒకరినొకరు కౌగిలించుకుని ఎన్నికల్లో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుని పోటీ చేసింది నిజం అవునా? కాదా? అప్పుడు మీరు టీఆర్‌ఎస్‌కు ఎన్ని మూటలు సమర్పించుకున్నారో చెప్పే ధైర్యం మీకుందా?
⇒ 2008 మొదలు ప్రతి మహానాడులోనూ తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టండి అని మీరు తీర్మానాలు చేశారా? లేదా?
⇒  వైఎస్ మరణం తర్వాత కేసీఆర్ నిరాహార దీక్ష మొదలు పెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా రోశయ్య పెట్టిన ఆల్ పార్టీ మీటిం గ్‌లో ఏపీని విడగొట్టండని టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికింది మీరు అవునా? కాదా?
⇒ రాష్ట్ర విభజనకు పార్లమెంటులో మొదటి ఓటు వేసింది మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు అవునా? కాదా?
⇒ మీరు ఏపీ సీఎం అయిన తర్వాత కూడా మహబూబ్‌నగర్, కరీంనగర్‌లలో మావల్లే తెలంగాణ వచ్చిందని చెప్పటం నిజం కాదా?
⇒  పోలవరం ప్రాజెక్టును కట్టొద్దు, కేవలం లిఫ్ట్‌లతో సరిపెట్టండి అన్న తెలంగాణవాదుల డిమాండ్‌ను పట్టిసీమ పేరిట అమలు చేయటంలో ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక కుట్ర దాగి ఉండటం నిజం కాదా?
⇒ రేవంత్‌రెడ్డి మోసిన మూటలు పట్టిసీమ నుంచి మీరు కొట్టిన వందల కోట్ల సొమ్ము నుంచి బయటకు తీసినవి అవునా? కాదా?
⇒ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎలాంటి అనుమతులూ లేకుండా కేసీఆర్ ప్రారంభించినా మీరు కనీసం ఉత్తరం ముక్క కూడా రాయకపోవడం నిజం కాదా?
⇒ దొంగల్లా దొరికి కూడా దబాయిస్తున్నారంటే రాజీ కుదుర్చుకున్నారన్నది స్పష్టం కాదా?
⇒ నీ దొంగతనానికి, ఏపీ ప్రజలకు సంబంధం ఏమిటో చెప్పగలవా?
⇒ స్టీఫెన్‌సన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని జగన్ ఉత్తరం రాశారని అంటున్నావు. ఈ ఆరోపణ చేయటానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి. ఆ లేఖను బయటపెట్టగలవా?
⇒ మేము ఎమ్మెల్యేని ధారాదత్తం చేయలేదు. నువ్వే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌కు ధారాదత్తం చేసింది నిజం అవునా? కాదా?

చంద్రబాబు, దేవినేని ఉమాకు రాజకీయ సమాధి తప్పదు

Written By news on Friday, June 19, 2015 | 6/19/2015

వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్
సాక్షి, విజయవాడ :
 ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ప్రజలు రాజకీయ సమాధి చేస్తారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ చెప్పారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో పూర్తి ఆధారాలతో చిక్కిన చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి , ప్రజల దృష్టి మరల్చడానికి   చంద్రబాబు, దేవినేని ఉమా టీడీపీ కార్యకర్తలను  రెచ్చగొడుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ దిష్టిబొమ్మలను తగలబెట్టిస్తున్నారని మండిపడ్డారు.

అక్కడి పోలీసులు చంద్రబాబుపై సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు మొదలుకొని మహిళల వరకు అందరినీ మోసం చేసిన చంద్రబాబును, జిల్లావాసులను మోసం చేస్తున్న ఉమాను ప్రజలు రాజకీయ సమాధి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యకర్తలను రెచ్చగొట్టే మంత్రి ఉమాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌ను విమర్శించడం, దిష్టిబొమ్మలు దహనం చేయడం లాంటివి చేస్తే ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.

ప్రజల తీర్పును తిరగరాద్దాం!

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకే జిల్లా ప్రజలు మద్దతు ఇచ్చారు
అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించాలి
వైఎస్సార్ సీ
పీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల పిలుపు
 
గిద్దలూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న అట్ల చినవెంకటరెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక తన నివాస గృహంలో కొమరోలు, గిద్దలూరు, రాచర్ల మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వైఎస్సార్‌సీపీ నాయకులతో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధిష్టానం నిర్ణయానుసారం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, నగర పంచాయతీ కౌన్సిలర్లు చినవెంకటరెడ్డికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీకి పట్టు ఉందని.. అయితే ఏమాత్రం గెలుపునకు అవకాశం లేని అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించిందన్నారు.

ఓటుకు నోటు అన్న నినాదంతో టీడీపీ నేతలు స్థానిక ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలు సాధించేందుకు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ప్రజలు తీర్పునిచ్చారన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్ని గెలుపొందగలిగామన్నారు. ప్రజలు ఎలాంటి విజయాన్ని ఇచ్చారో అదే విధంగా ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఓట్లను కొనుగోలు చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో బృందాలు తిరుగుతున్నాయని హెచ్చరించారు. గిద్దలూరు, కొమరోలు ఎంపీపీలు కడప వంశీధరరెడ్డి, కే.అమూల్య, వైఎస్సార్‌సీపీ కొమరోలు మండల కన్వీనర్ హెచ్.సార్వభౌమరావు, వైస్ ఎంపీపీ డి.ఆంజనేయులు, సొసైటీ చైర్మన్ కె. వెంకటేశ్వర్లు, నాయకులు రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పలువురు నాయకులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

వైఎస్సార్సీపీ మహబూబ్‌నగర్ జిల్లా న్యాయవిభాగం అధ్యక్షునిగా మద్దిరాల

Written By news on Thursday, June 18, 2015 | 6/18/2015


వనపర్తి రూరల్ (మహబూబ్‌నగర్) :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా న్యాయవిభాగం అధ్యక్షునిగా వనపర్తికి చెందిన నేత మద్దిరాల విష్ణువర్దన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నియామక ఉత్తర్వులను గురువారం శ్యాంసుందర్‌రెడ్డి చేతుల మీదుగా విష్ణువర్దన్‌రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుకున్నారు. తనపై నమ్మకం ఉంచి పార్టీలో ఉన్నత స్థానం కల్పించిన పెద్దల ఆదేశం మేరకు పార్టీ అభివృద్ధ్ది కోసం కృషి చేస్తానని విష్ణువర్దన్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయనతో పాటు స్థానిక నాయకులు భాస్కరాచారి, రాజశేఖర్, మహేష్, బుడ్డన్న, జైపాల్‌రెడ్డి, వెంకట్రావ్, వెంకటేష్ ఉన్నారు.

చేతనైతే పాలమూరు ఎత్తిపోతల ఆపండి

హైదరాబాద్: ఎలాంటి అనుమతుల్లేకుండా శంకుస్థాపన చేసిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తక్షణమే నిలిపి వేయించాలని వైఎస్సార్‌సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వారిద్దరూ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ‘ఓటుకు నోటు’ వ్యవహారం నుంచి బయట పడటానికి అష్టకష్టాలు పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎత్తిపోతల ప్రాజెక్టు కారణంగా రాయలసీమ, నాగార్జునసాగర్ కింద ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడే ఈ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి పక్కదోవ పట్టిస్తున్నారని, వాస్తవానికి ఆయన చెప్పింది నిజం కాదని వారు ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికి పోయిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తన విషయం మాట్లాడుకుంటున్నారే తప్ప ఎత్తిపోతల పథకం గురించి కేంద్రానికి ఫిర్యాదు కూడా చేయలేదని వారు విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలనను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని ప్రజల, రైతుల సమస్యలు అసలు పట్టించుకోవడం లేదన్నారు. నాలుగేళ్లలో పూర్తి చే యాల్సిన పోలవరం పనులు పూర్తిగా నిలిచి పోయాయని అక్కడ ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదని తెలిపారు. ఈ వ్యవహారంలో దోషులపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కోరితే తప్పవుతుందా! అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

బుకాయించడం బాబుకే చెల్లింది


'బుకాయించడం బాబుకే చెల్లింది'
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గురువారం కడపలో నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆంధ్రప్రదశ్ పరువు - ప్రతిష్టను మంటగలిపారని ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికినా బుకాయించడం బాబుకే చెల్లిందని విమర్శించారు.
అధికారం చేపట్టిన ఏడాదికి హైదరాబాద్ లో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజల రక్షణ బాబుకు గుర్తొచ్చిందంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పరిపాలిస్తున్న రాష్ట్రంలోనే ప్రజలుకు రక్షణ లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

నా ఓటుకు మరో నాలుగున్నర కోట్లు ఇస్తానని బేరమాడారు

నా ఓటుకు మరో నాలుగున్నర కోట్లు ఇస్తానని బేరమాడారు
‘ఓటుకు కోట్లు’ కుట్రను బట్టబయలు చేసిన స్టీఫెన్‌సన్
కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం
ప్రత్యక్ష సాక్షులుగా స్టీఫెన్‌సన్ కుమార్తె జెస్సికా, బం
ధువు మార్క్‌టేలర్
ఈ ముగ్గురి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న
నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్
ఈ వ్యవహారానికి సూత్రధారి చంద్రబాబేనన్న స్టీఫెన్‌సన్
టీడీపీకి చెందిన కీలక వ్యక్తుల పాత్రపైనా వివరణ
నేడు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు సీల్డ్‌కవర్‌లో పంపించే అవకాశం


 భయపడాల్సిన పనిలేదు, నేనున్నానంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు. కలసి పని చేద్దామంటూ ఆహ్వానించారు..

 - స్టీఫెన్‌సన్

సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పన్నిన కుట్రను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ బట్టబయలు చేశారు. ఈ కేసులో చంద్రబాబుతోపాటు టీడీపీ ముఖ్య నేతల కీలక పాత్రను బహిర్గతం చేశారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే తమ వాళ్లు ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు మిగతా రూ.4.5 కోట్లు ఇస్తామని చంద్రబాబు నేరుగా తనకు హామీ ఇచ్చారని స్టీఫెన్‌సన్ వాంగ్మూలంలో వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ‘భయపడాల్సిన పని లేదు, తానున్నానంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు. కలసి పనిచేద్దామంటూ ఆహ్వానించారు..’ అని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతల పేర్లతోపాటు కీలక సమాచారాన్ని కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.50 లక్షలను అందజేస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రేవంత్ డబ్బు ఇవ్వజూపిన దృశ్యాలతో పాటు స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడిన ఆడియో రికార్డులు బహిర్గతమయ్యాయి.

 అంతేకాదు మరికొందరు ఎమ్మెల్యేలనూ కొనుగోలు చేసేందుకు చంద్రబాబుతో పాటు ఏపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, పలువురు నేతలు చేసిన కుట్ర మొత్తం ఏసీబీ జరిపిన దర్యాప్తులో బయటపడింది. దీంతో ఈ కేసులో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న ఏసీబీ అధికారులు.. కుట్రలో భాగస్వాములందరికీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదే సమయంలో ‘ఓటుకు కోట్లు’ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్‌సన్, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఆయన కుమార్తె జెస్సికా, ఆయన బంధువు మార్క్‌టేలర్‌ల వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలని ఏసీబీ నిర్ణయించింది. ఈ మేరకు నేర విచారణ చట్టం (సీఆర్‌పీసీ) సెక్షన్ 164 కింద హైదరాబాద్‌లోని నాంపల్లి మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తిరుపతి బుధవారం వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. వీటిని గురువారం సీల్డ్‌కవర్‌లో ఏసీబీ ప్రత్యేక కోర్టుకు పంపనున్నట్లు తెలిసింది. ప్రత్యేక కోర్టు నుంచి ఏసీబీ అధికారులు ఈ వాంగ్మూలాన్ని అధికారికంగా తీసుకుని.. ‘ఓటుకు కోట్లు’ కుట్రలో పాత్రధారులుగా ఉన్న వారికి నోటీసులు జారీచేసే అవకాశం ఉంది.

సీఆర్‌పీసీ సెక్షన్ 164 ఏం చెబుతోందంటే?
నేర విచారణ చట్టం(సీఆర్‌పీసీ)లోని సెక్షన్ 164 కింద సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నేరుగా నమోదు చేస్తారు. ఈ సాక్ష్యం నమోదుకు ముందు ఆ సాక్షులతో ‘అంతా నిజమే చెబుతున్నామని, అబ ద్ధం చెప్పబోమని’.. న్యాయమూర్తి ప్రమా ణం చేయిస్తారు. స్వచ్ఛందంగా వాస్తవాలు మాత్రమే వెల్లడించాలని స్పష్టం చేస్తూ... వారు వెల్లడించిన అన్ని అంశాలను నమో దు చేస్తారు. ఈ వాంగ్మూలాన్ని సీల్డ్ కవర్‌లో సదరు కేసును విచారిస్తున్న న్యాయస్థానానికి పంపుతారు. కేసు తుది విచారణ సమయంలోనూ ఇదే వాంగ్మూలాన్ని వారు న్యాయస్థానం ముందు ఇవ్వాల్సి ఉంటుం ది. ఇందుకు విరుద్ధంగా చెబితే భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 193 కింద వారిపై కేసు నమోదు చేయవచ్చు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యమిచ్చినట్లుగా రుజు వైతే వారికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

ముగ్గురి వాంగ్మూలాల నమోదు
 స్టీఫెన్‌సన్‌తోపాటు జెస్సి కా, మార్క్‌టేలర్‌లు బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. దాదాపు మూడు గంటలపాటు వీరి వాంగ్మూలాలను న్యాయమూర్తి నమోదు చేశారు. ఈ సమయంలో ఎవరినీ కోర్టు హాలులోకి అనుమతించలేదు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కోర్టు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన న్యాయమూర్తి.. తర్వాత మార్క్‌టేలర్, జెస్సికాల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ జెరూసలెం మత్తయ్య, రేవంత్‌రెడ్డితోపాటు టీడీపీకి చెందిన కీలక నేతలు తనను ప్రలోభపెట్టిన తీరును స్టీఫెన్‌సన్ వివరించినట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహ, సెబాస్టియన్‌లు తమ నివాసానికి వచ్చి రూ.50 లక్షలు ఇచ్చిన విషయాన్ని జెస్సికా, మార్క్‌టేలర్‌లు వివరించినట్లు సమాచారం.
http://www.sakshi.com/news/telangana/stephenson-reveals-the-note-for-vote-case-of-chandrababu-naidu-249495?pfrom=facebook

గవర్నర్‌పై విశ్వాసం లేకుంటే ...



వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన డిమాండ్
గవర్నర్‌పై విశ్వాసం లేకుంటే వైదొలగాలని మంత్రులకు సూచన

సాక్షి, హైదరాబాద్: ఏపీలో పరిపాలన పూర్తిగా పడకేసిందని, ఓటుకు కోట్లు కేసులో దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రజలపై దృష్టిని సారించడం లేదని, అందుకే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథితో కలిసి ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం పదవిని చేపట్టిన చంద్రబాబు దానిని అతిక్రమిస్తూ ప్రజాస్వామ్యంలో చెడు సంప్రదాయాలను నెలకొల్పుతున్నారని విమర్శించారు. పొరుగు రాష్ట్రంలోని ఒక దర్యాప్తు సంస్థ మీకు అనుకూలంగా వ్యవహరించేలా చేయడం లేదని గవర్నర్‌ను మార్చమంటారా? అని ప్రశ్నించారు.  ఓటుకు కోట్లు కేసులో బాబుపై సాక్ష్యాధారాలున్నందున విచారణకు సహకరించి కోర్టులో తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, సెక్షన్-8 అమలు చేయాలని, మా దగ్గర కూడా ఏసీబీ ఉందని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. గవర్నర్  నరసింహన్‌పై విశ్వాసం లేదని మాట్లాడుతున్న ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, రావెల కిశోర్‌బాబు మంత్రివర్గం నుంచి వైదొలగాలన్నారు.
 
బాబు ధ్యాసంతా ఏసీబీ కేసు నుంచి బయటపడడంపైనే

వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతల భేటీలో అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఓటుకు కోట్లు వ్యవహారం నేపథ్యంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా పడకేసిన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల గురించి ఆలోచించడం మానేసి తాను ఏసీబీ కేసు నుంచి ఎలా బయటపడాలనే అంశంపైనే ఎక్కువగా సమావేశాలు నిర్వహిస్తున్నారని సమావేశం అభిప్రాయపడింది.
 
తాను స్వయంగా ఆరోపణలు ఎదుర్కొంటూ రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌పై నిందలేయడాన్ని నేతలు గర్హించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ైవె వీ సుబ్బారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కె.పి.సారథి, అనంత వెంకటరామిరెడ్డి, బొత్స సత్యనారాయణ, గొట్టిపాటి రవికుమార్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఆ డబ్బు ఎక్కడిదో చెబుతారా?

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి
 
నందలూరు : ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడి ్డ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాడనేది సమాధానం చెప్పాలని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి  సీఎం చంద్రబాబును నిలదీశారు. ఎన్నికల నాటి హామీలను ఒకటి కూడా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. నందలూరుకు వచ్చిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. నంద లూరులో రైల్వే ట్రాక్షన్ లోకో షెడ్ సాధనకు కృషి చేస్తామని తెలిపారు.

 బాబును ఏ-1గా చేర్చాలి
 ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబునాయుడును ఏ-1గా చేర్చి, అరెస్ట్ చేయాలని కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, చంద్రబాబు అవినీతి సామ్రాట్‌గా ఎదుగుతున్నారని అన్నారు. వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తన పదవికి రాజీనామా చేసి, నిర్థోషిగా నిరూపించుకోవాలని సవాల్ చేశారు. ఈ వ్యవహరాల్లో తమ పార్టీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఏమాత్రం సంబంధం లేకున్నా, అకారణంగా నిందించడం సబబు కాదని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ైవె స్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్తకార్యదర్శి చొప్పా యల్లారెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.
 
 ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి
 రె వెన్యూ అధికారుల నిర్లక్షానికి బలవన్మరణానికి గురైన  రైతు సయ్యద్ మగ్బుల్ కుటుంబానికి  ప్రభుత్వంరూ. ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా  ప్రకటించాలని ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మృతుని కుటుంబాన్ని ఆయన పరామర్శింరు.  మృతుని కుమారునికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు అదనంగా భూమి ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. మృతుడి కుటుంబీకులపై కేసు నమోదు చేయడం సమంజసం కాదని, దీనిపై ఎస్‌పీతో మాట్లాడతానని తెలిపారు.  ఆయన వెంట కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి కూడా పరామర్శించారు.

 క్రీడల్లోనూ రాణించాలి
 స్థానిక జెడ్పీ హైస్కూల్ క్రీడామైదానంలో  బుధవారం నిర్వహించిన ఎన్‌సీసీ క్రికెట్ టోర్నీ ట్రోఫినీ ఎంపీ ఆవిష్కరించి మాట్లాడారు.  దివంగత  సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి కడపలో క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, క్రీడా పాఠశాలలను ఏర్పాటుచేసి క్రీడలను ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఐకేపీఎస్ నాయకుడు పోతురాజు మస్తానయ్య కోరిన విధంగా నందలూరు క్రీడామైదానం అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు.

వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలకు  నందలూరు నిలయమని కొనియాడారు. గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను ఎయిర్‌పోర్ట్ నుంచి స్వగ్రామాలకు తరలించేందుకు ఎంపీ మిథున్‌రెడ్డి తన సొంత నిధులతో వాహనాన్ని ఏర్పాటుచేశారని తెలిపారు.  జెడ్పీ వైస్‌చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నందలూరు క్రీడామైదానానికి అవసరమైన నిధుల కోసం కృష చేస్తానన్నారు.

బాబు అసలు రంగు బయటపడింది


ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల : ‘ఓటుకు నోటు’ వ్యవహారంతో బాబు అసలు రంగు బయటపడిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. బుధవారం బాకరాపురంలోని స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ‘ఓటుకు నోటు’వ్యవహారంలో అనేకమంది టీడీపీ నేతలు హస్తమున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఎమ్మెల్యేలను డబ్బుతో కొనడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని ఆరోపించారు. గతంలో తన మామ ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొడ్డిదారిన సీఎం పదవిని చేజిక్కించుకున్నారని విమర్శించారు.

స్టీఫెన్ సన్‌తో ఫోన్ సంభాషణలపై విచారణ సిద్ధమై తన నిజాయితీని నిరూపించుకోకుండా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎదురుదాడి చేయడం తగదన్నారు.అడ్డంగా దొరికిపోయిన దేశం నేతలు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో గవర్నర్‌ను కూడా దుర్భాషలాడటం దారుణమైన విషయమన్నారు. ప్రస్తుతం ఆంధ్రాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలను  డబ్బుతో వ్యవహారాలు నడపాలని బాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ఇంతటి అవినీతి చరిత్ర ఉన్న చంద్రబాబు తాను నిప్పు అని ప్రగల్భాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహారాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని త్వర లో ఆయనకు ప్రజలే తగిన రీతిలో జవాబు చెప్పే రోజు వస్తుందని జోస్యం పలికారు.

 ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్:
 బుధవారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు  సమస్యలను విని పరిష్కారానికి కృషి చేశారు. పులివెందుల మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డితోపాటు మున్సిపాలిటీలోని పలు సమస్యలపై ఆయన చర్చించారు. ప్రజల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప, కౌన్సిలర్లు,  వేల్పుల రాము, మల్లికేశవరెడ్డి, బలపనూరు శేఖరరెడ్డిలు, హాలు గంగాధరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాస్ ఆ గొంతు నీది కాదని చెప్పే ధైర్యం ఉందా?

వైఎస్ వివేకానందరెడ్డి
 
 రైల్వేకోడూరు రూరల్ : ఓటుకు నోటు వ్యవహారంతో ఫోన్‌లోని స్వరం తనది కాదని చెప్పే దమ్ము సీఎం చంద్రబాబుకు ఉందా అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి సూటిగా ప్రశ్నించారు.  రైల్వేకోడూరులోని వైఎస్‌ఆర్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం ఆయన ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి విలేకర్లతో మాట్లాడారు.  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు.

రాజధాని నిర్మాణం పేరిట విదేశీయాత్రలు చేయడం మినహా ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీ పరువును తెలంగాణ లో తీస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నాయకుడినా మనం ఎన్నుకున్నదని ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. అయితే ఆ పార్టీ బాస్‌తో తోపాటు నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. వర్షాలు లేక, పంటలు పండక, తాగేందుకు నీళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వానికి ఏమాత్రం స్పందనలేదన్నారు. ప్రభుత్వం ఉందా లేదా అనే భావన ప్రజలకు ఏర్పడిందన్నారు.

ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు మారెళ్ల రాజేశ్వరి, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి బండారు సుభద్రమ్మ, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్, క్షత్రియ నాయకులు క్రిష్ణమరాజు, జనార్ధన్‌రాజు, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం.నాగేంద్ర, ఎంపీటీసీ సభ్యులు రవికుమార్, సుధాకర్‌రాజు, పార్టీ నాయకులు హరిక్రిష్ణారెడ్డి, పద్మనాభరెడ్డి, నాగేంద్రరాజు, గంగయ్య, రమేష్ పాల్గొన్నారు.

తెలంగాణలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తాం


ప్రజలతో మమేకమైతే విజయం మనదే
టీఆర్‌ఎస్, టీడీపీలు ప్రజా విశ్వాసం కోల్పోయాయి
ఏడాదికాలంలో టీఆర్‌ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదు
అవినీతికి పాల్పడిన చంద్రబాబు
సీఎం పదవినుంచి దిగిపోవాలి
మహబూబ్‌నగర్ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి

మహబూబ్‌నగర్ అర్బన్:  టీఆర్‌ఎస్, టీడీపీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాయని, రానున్న కాలంలో తెలంగాణలో అధికార జెండా ఎగురేస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మా మిడి శ్యాంసుందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మ హబూబ్‌నగర్ పట్టణంలోని రాయల్ ఫంక్షన్‌హాల్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్‌ఆ ర్ అర్హత ఉన్న వారందరికీ పింఛన్లు ఇస్తే, కేసీఆర్ ఇంటికొకరికే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత వి ద్య, డబుల్ బెడ్‌రూం, ఎస్సీ,ఎస్టీలకు మూడెకరాల చొప్పున భూ పంపిణీ, మహిళలకు వడ్డీలేని రుణాలు, ముస్లింలకు కల్పిస్తామన్న 12శాతం రిజర్వేషన్ల అమలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

కల్లబొల్లి కబుర్లతో కాలయాపన చేయడం మినహా ఏడాది కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం అంటూ జిల్లా ప్రజలను మోసం చేయకుండా వైఎస్ ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, భీమా ప్రాజెక్టులను పూర్తి చేసి రబీ నాటికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. పంటరుణాల కోసం రుణపరిమితిని ఎకరానికి రూ.50 వేలకు పెంచాలని, పూర్తిగా రుణాలు మాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలను కొంటూ డబ్బులతో సహా పట్టుబడిన టీడీపీ  దొంగల పార్టీయని, అవినీతికి పాల్పడిన చంద్రబాబు నాయుడు వెంటనే సీఎం పదవి నుంచి దిగి పోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ పథకాలే పార్టీకి శ్రీరామ రక్షయని, ప్రజల ఎదుట కాలర్ ఎగురేసుకుంటూ తిరిగే హక్కు తమకే ఉందన్నారు. ఆగస్టు మాసాంతానికి గ్రామకమిటీలు పూర్తి చేయాలని నూతన మండలాధ్యక్షులకు సూచించారు.

సేవాభావంతో పని చేయాలి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి జిల్లాలో ప్రత్యేకమైన ఆదరణ ఉందని, పార్టీ శ్రేణులు సేవాభావంతో పనిచేసి ప్రజల అవపరాలు తీర్చాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం రాష్ర్ట అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి పిలుపునిచ్చారు. షర్మిలమ్మ జిల్లాలో చేసిన పాదయాత్ర, పరామర్శ యాత్రలను విజయవంతం చేసిన ఘనత పార్టీ కార్యకర్తలకే దక్కిందన్నారు. నదీ జలాలను జిల్లాకిచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తరలించాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరందించాలని డిమాండ్ చేశారు. సొంత మామ ఎన్‌టీఆర్‌ను అధర్మంగా గద్దెదించిన చంద్రబాబునకు ఆయన ఉసురు తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు జైలుకు పోతేనే వర్షాలు పడతాయని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఏపీలో జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతంగా పని చేస్తున్నారని, ప్రజలకోసం కష్టపడుతున్న జగనన్న తప్పకుండా సీఎం అవుతారన్నారు. తెలంగాణలో ఉన్న ఓటు బ్యాంకు ను చూసి ఇతర పార్టీలు వైఎస్సార్‌సీపీతో పొత్తుకోసం ఎదురుచూస్తున్నాయన్నారు. - ఎడ్మ కిష్టారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి

సమావేశంలో తీర్మానాలు
 
  • గతరబీ సీజన్‌లో అకాల వర్షాలు,ఈదురు గాలులకు పంటలు, పండ్ల తోటలు నష్ట పో యిన రైతులకు పరిహారంతో పాటు ఉచి తంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలి.
  • వైఎస్సార్ జిల్లాలో ప్రారంభించిన నాలుగు ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి.
  • తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వాలి.
  • జనాభాలో సగం భాగం ఉన్న మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలి.
  • అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
  • శ్రీశైలం ప్రాజెక్టు కుటుంబాల్లో 98 జీఓం ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి.
  • 1998 డీఎస్‌సీ అభ్యర్థులకు టీచర్ల నియామకాలు చేపట్టాలి.

కేసును తుదివరకు తీసుకెళ్లండి: ఈసీ

Written By news on Wednesday, June 17, 2015 | 6/17/2015

 ఓటుకు నోటు కేసును తుది వరకు అర్థవంతంగా తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుంచి తెలంగాణ సర్కారుకు ఓ లేఖ అందింది. వాస్తవానికి ఓటుకు నోటు కుంభకోణం గత నెల 31వ తేదీ రాత్రి వెలుగుచూసింది. మర్నాడే తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ కేసు వివరాలను అప్పట్లోనే ఎన్నికల కమిషన్ కు నివేదించారు.

అయితే, ఇప్పటికే తెలంగాణ ఏసీబీ ముమ్మరంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నందున దీన్నే కొనసాగించాలని ఈసీ తెలిపింది. దీన్ని 'లాజికల్ ఎండ్' వరకు తీసుకెళ్లాలని ఆ లేఖలో సూచించింది. రేవంత్ రెడ్డి, ఇతరులపై ఎల్విస్ స్టీఫెన్ సన్ చేసిన ఆరోపణల కేసును ముమ్మరంగా దర్యాప్తు చేయాలని, దాన్ని తుదివరకు అర్థవంతంగా విచారించాలని తెలిపింది. ఈ విషయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) లేఖ ద్వారా తెలిపారు.
నిన్న మొన్నటి వరకు ఓటుకు నోటు కేసుతో తెలంగాణ ఏసీబీకి సంబంధం లేదని, వాళ్లకు నోటీసులు ఇచ్చే హక్కు, అరెస్టు చేసే అధికారం లేదని టీడీపీ నేతలు వాదిస్తూ వచ్చారు. ఇది ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి, ఎన్నికల కమిషనే దీని గురించి చెప్పాలన్నారు. అయితే.. ఇప్పుడు నేరుగా ఎన్నికల కమిషనే కలగజేసుకుని, ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేయాలని, లాజికల్ ఎండ్ వరకు తీసుకెళ్లాలని సూచించడంతో.. తెలుగుదేశం పార్టీ నాయకులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. దీని గురించి ఇంక ఏమీ మాట్లాడే పరిస్థితి ఆ పార్టీ నాయకులకు కనిపించడం లేదు.

ఉమ్మారెడ్డి ఎన్నిక లాంఛనమే !


 
 పట్నంబజారు(గుంటూరు) : గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎన్నిక లాంఛనమేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు. అరండల్‌పేటలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో  కేవలం జిల్లా  నుంచి ఉమ్మారెడ్డి, మరో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి నామినేషన్ ధాఖలు చేశారన్నారు.

వైఎస్సార్‌సీపీకి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్‌ల మద్దతు 570కి పైగా ఉందని తెలిపారు. దీనితో ఏకగ్రీవం తథ్యమని, ఎన్నిక పక్రియ లాంఛనంగా జరుగుతుందని తెలిపారు. అపార అనుభవం ఉన్న రాజకీయ భీష్ముడు ఉమ్మారెడ్డి ఎన్నికవడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోటీకి సిద్ధమైనట్టు తెలిపారు.

పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు రావి వెంకటరమణ, రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున,పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ  ఉమ్మారెడ్డి అనుభవం జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.  అనంతరం పార్టీ నేతలు  ఉమ్మారెడ్డికి పుష్ఫగుచ్ఛాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. మిఠాయిలు పంపిణీ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), సంయుక్త కార్యదర్శి చందోలు డేవిడ్‌విజయ్‌కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్ నాయుడు, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి, ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొగిలి మధు, కిలారి రోశయ్య, డైమండ్‌బాబు, జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

'ఓటుకు కోట్లు'లో టీడీపీ ఎమ్మెల్యేకు ఏసీబీ నోటీసులు

Written By news on Tuesday, June 16, 2015 | 6/16/2015

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ ప్రత్యక్ష కార్యచరణకు దిగింది. రోజంతా ఏసీబీ నోటీసులిస్తుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటట వీరయ్యను విచారణ అధికారి ముందు హీజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఏసీబీ బృందం టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. నోటీసులను ఆయన ఇంట్లో వ్యక్తులకు అందచేశారు. వెంకట వీరయ్యకు నోటీసులు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు పట్ల దూకుడుగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. రేపు కూడా మరికింత మంది టీడీపీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు,  నోటీసులు జారీ చేసే అవకాశముందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

ఘర్షణ పెట్టి ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయాలని..


'వంద తప్పులు చేస్తున్నారు'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మంగళవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి.. చంద్రబాబు తీరును తప్పుబట్టారు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడాని పదే పదే తప్పులు చేసుకుంటూ వెళుతున్నారన్నారు.

ఏపీ, టీఎస్ పోలీసులకు గొడవ పెట్టాలని చూస్తున్నారని ఈ సందర్భంగా అంబటి పేర్కొన్నారు. ప్రస్తుతం ఘర్షణ పెట్టి ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయాలని చూస్తున్నారు. ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు రాజ్యాంగానికి సమాధానంగా చెప్పుకోవాల్సిన అవసరాన్ని టీడీపీ నేతలు తీసుకొచ్చారని అంబటి తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని అంబటి సూచించారు. నోటీసులు తీసుకుని విచారణకు సహకరించాలని చంద్రబాబుకు అంబటి సూచించారు. తమకు భయం లేదంటూనే టీడీపీకి చెందిన ఏడుగురు ముఖ్యనేతలు మీడియాతో మాట్లాడటం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. నేరం చేశారు కాబట్టే భయపడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. అసలు టీడీపీ నేతలకు హఠాత్తుగా సెక్షన్ -8 ఎందుకు గుర్తొచ్చిందని నిలదీశారు.

ఏపీని ఆఫ్ఘనిస్తాన్ లా తయారు చేశారు


'ఏపీని ఆఫ్ఘనిస్తాన్ లా తయారు చేశారు'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ మాదిరి తయారు చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు.  రాష్ట్రంలో దొంగల రాజ్యం నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో ఏ కార్యాలయానికి వెళ్లినా డబ్బులివ్వందే పనులు జరగడం లేదని.. అధికారుల పోస్టింగ్ ల సైతం  డబ్బులు ఇవ్వాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో పక్కా ఆధారాలున్నాయి కాబట్టే చంద్రబాబుకు ఏసీబీ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతోందన్నారు.


దేశానికే కాక యావత్ ప్రపంచానికి చంద్రబాబు ఒక చీడపురుగులాంటి వాడని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆయన బురద కడుక్కునేందుకు ఢిల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని.. అయినా బాబు జైలుకు వెళ్లక తప్పదన్నారు.

అవినీతికి నిదర్శనం చంద్రబాబేనని రాజంపేట వైఎస్సార్ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. హంద్రీవా జలాలను యేడాదిలో పూర్తి చేస్తామని ఇంతవరకూ పనులే ప్రారంభించలేదన్నారు. ఓటుకు నోటు విషయంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పాత్ర ఏంటని ప్రశ్నించారు. బలం లేని చోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి దూరంగా ఉంటే..అయినా బలం లేని చోట టీడీపీ అభ్యర్థులను నిలబెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటని నిలదీశారు. అంటే తెలంగాణలో మాదిరిగా ఓట్లు కొనుగోలు చేయడానికి సిద్ధమైందని.. దీనిపై కేంద్ర నిఘా సంస్థలు కన్నెయ్యాలన్నారు.

ఓటుకు కోట్ల వ్యవహారంలో శిక్ష తప్పదనే భయంతోనే చంద్రబాబు.. కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య గౌడ్ లు అభిప్రాయపడ్డారు. సెక్షన్ -8అంటే అక్రమాలు చేయడమా?, చంద్రబాబు డైరెక్షన్ లో అంతా జరిగిందని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్ట్ అవుతానన్న భయంతోనే ఇంటి దగ్గర పోలీసులను కూడా మార్చుకున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలంతా హ్యాపీగానే ఉన్నారని.. కావాలనే రెచ్చగొడుతున్నారని వారు విమర్శించారు.

చంద్రబాబు ఆలోచన అంతా ఓటు నోటు పైనే


'చంద్రబాబు ఆలోచన అంతా ఓటు నోటు పైనే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల గురించి ఆలోచించకుండా.... ఓటు నోటు గురించే ప్రతి క్షణం ఆలోచిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అవినీతి సొమ్ముతో తెలంగాణలో పార్టీని ఎలా రక్షించుకోవాలనే చంద్రబాబు ఆలోచన అని ఆరోపించారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదని... ఏ కార్యక్రమం జరిగినా రాజ్యాంగ ప్రకారమే జరగాలన్నారు. ఢిల్లీకి వెళ్లినా కేసుల నుంచి ఎలా బయటపడాలన్నదే చంద్రబాబు చర్చించారన్నారు. చంద్రబాబు స్వార్థం, స్వలాభం, రాజకీయ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ వ్యవహరిస్తే కేంద్రానికి చంద్రబాబు ఫిర్యాదు చేయొచ్చు.... కానీ ఎందుకు ఆ పని చేయడం లేదంటూ బాబును బొత్స ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ సర్కార్ వ్యవసాయాన్ని ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతుల వ్యవసాయ విధానాలు తెలుసా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.ఏపీలో రైతులకు రణాలు ఇవ్వడంపై బ్యాంకులు పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయ లబ్ది, రాజకీయ వ్యాపారాలు, వ్యక్తిగత లబ్ది కోసమే చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
వ్యక్తిగత స్వార్థం కోసమే చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల సమస్యపై చర్చించి అవసరమైన కర్యాక్రమాలు రూపొందించాలని బొత్స ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్ ను డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని బొత్స హెచ్చరించారు.

ఏపీలోనూ ‘ఓటుకు నోటు’ రాజకీయం

చంద్రబాబుపై ధ్వజమెత్తిన
 వైఎస్సార్‌సీపీ
 బలం లేక పోయినా కర్నూలు,
 ప్రకాశంలో టీడీపీ పోటీ
 చంద్రబాబు ప్రభుత్వాన్ని
 బర్తరఫ్ చేయాలి
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ అడ్డంగా దొరికిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే విధంగా ఓటుకు నోటు వ్యవహారాలకు తెరతీస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ శాసనమండలికి స్థానిక సంస్థల నుంచి జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అభ్యర్థులను పోటీ చేయిస్తున్నారని విమర్శించారు. మరింత మంది ‘ఆంధ్రా రేవంత్‌రెడ్డి’లను ప్రోత్సహించి వారిద్వారా కోట్లు కుమ్మరించి ఎమ్మెల్సీ స్థానాలను గెలవాలన్నదే చంద్రబాబు ఉద్దేశమని నిప్పులు చెరిగారు.
 
  డబ్బుతో అన్ని వ్యవస్థలనూ దిగజార్చుతున్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడని... అందుకే కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ జోక్యం చేసుకుని ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిదో సెక్షన్ అమలు కోసం ఆరాటపడుతున్న చంద్రబాబు, ప్రత్యేకహోదా విషయంలో ఎందుకు తపన పడటం లేదని సూటిగా ప్రశ్నించారు. మోడీ, చంద్రబాబుకు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటుకు నోటు వ్యవహారంపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
 
  తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పచ్చి నియంతల్లా వ్యవహరిస్తూ తమకు నచ్చని చానళ్ల ప్రసారాలను ఆపేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎమర్జెన్సీలో పత్రికలపై సెన్సార్ విధించిన ఇందిరాగాంధీ, ఆమె తనయుడు సంజయ్‌గాంధీ ఆ తరువాతి ఎన్నికల్లో  ఓడిపోయిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎన్నారై విభాగంలో నియామకాలు

Written By news on Monday, June 15, 2015 | 6/15/2015

వైఎస్సార్‌సీపీ ఎన్నారై విభాగంలో పలు నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. గల్ఫ్, యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్ (యుఏఇ), కువాయిత్ ఎన్నారై కమిటీల్లో జరిగిన నియామకాలు కింది విధంగా ఉన్నాయి. గల్ఫ్ కౌన్సిల్ లీడర్‌షిప్ టీమ్ కన్వీనర్‌గా బీహెచ్ ఇలియాస్(కువాయిత్)ను, కువాయిత్ విభాగం ఎన్నారై కమిటీ కన్వీనర్‌గా ఎం.బాలిరెడ్డి నియమితులయ్యారు.

ఆయా దేశాల ప్రతినిధులుగా షేక్ ఫయాజ్ (కువాయిత్), మంత్రాల న్యామతుల్లా(సౌదీ అరేబియా), నాసర్ వలీ సయ్యద్, జి.విజయభాస్కర్‌రెడ్డి(యూఏఇ), ఆనంద్ ఈద, మందల వర్జిల్‌బాబు (ఖతార్), కుంతం దేవేందర్ (బహరిన్), షేక్ అల్లాఉద్దీన్ (ఎమెన్) నియమితులయ్యారు. వీరు కాక గల్ఫ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా జీఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి నియమితులయ్యారు.

బాబు విచారణకు సిద్ధపడాలి


బాబు విచారణకు సిద్ధపడాలి
ఓటుకు నోటు వ్యవహారంలో
 తన తప్పు ఒప్పుకోవాలి
 వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి డిమాండ్

 సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన తప్పును పాక్షికంగా ఒప్పుకుని విచారణకు సిద్ధపడాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంగ్ల టీవీ చానల్ ప్రతినిధి రాజ్‌దీప్ సర్దేశాయ్ కిచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు స్పష్టంగా తన నేరాన్ని అంగీకరించారనేది అర్థం అవుతోందన్నారు. తెలంగాణ ఏసీబీ అధికారులు మరిన్ని ఆధారాలు బయట పెట్టక ముందే అభాసు పాలు కాకుండా విచారణకు సిద్ధమై ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. విచారణకు సిద్ధపడటానికి భయపడే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగుతారని ఆయన ప్రశ్నించారు.

  ఆడియో టేపుల్లోని స్వరం మీదా? కాదా?, టేపులను విన్న వారికి ఆ స్వరం మీదే (చంద్రబాబుదే) అని విశ్వసించాల్సి వస్తోంది, దీనికేమంటారు? వంటి ప్రశ్నలకు జవాబులు చెప్పలేదన్నారు. విలేకరులకు చంద్రబాబుతో సర్దేశాయ్ ఇంటర్వ్యూ క్లిప్పింగ్‌ను అంబటి ప్రదర్శిస్తూ దీనిని అన్ని టీవీ చానెళ్లు ప్రసారం చేయాలని, అప్పుడే చంద్రబాబు నేరం చేశారో లేదో ఇట్టే తెలుసుకునే అవకాశం రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతుందని విజ్ఞప్తి చేశారు. తాము ఎమ్మెల్యేను ప్రలోభ పెడితే తెలంగాణ పోలీసులెవరు త మను పట్టుకోవడానికి అనే విచిత్రమైన వాదనను చంద్రబాబు చేశారని ఆయన అన్నారు.

 ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించింది కానే కాదని, టీడీపీ అధ్యక్షుడికీ, చట్టబద్ధమైన తెలంగాణ ఏసీబీకి మధ్య సాగుతున్న అంశమని అంబటి అన్నారు. తన టేపుల వ్యవహారం బయట పడినపుడే 8వ షెడ్యూలు అమలు జరగాలని చంద్రబాబు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని, ఏడాది కాలంగా ఈ విషయం ఎందుకు గుర్తుకు రాలేదని అంబటి సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్ల ఇళ్లను కూలగొట్టారని చెబుతున్న చంద్రబాబు ఇళ్లను పడగొట్టేటపుడు ఎందుకు నోరు మెదపకుండా ఉండి పోయారని ప్రశ్నించారు.

ఎంపీ పొంగులేటి హాస్టల్ నిద్ర


ఎంపీ పొంగులేటి హాస్టల్ నిద్ర
మధిర: ఖమ్మం ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధిరలోని గిరిజన బాలుర వసతిగృహంలో ఆదివా రం రాత్రి విద్యార్థులతో కలసి నిద్రించారు. విద్యార్థులకు సరైన వసతులు సమకూరుతున్నాయో లేదో తెలుసుకునేందుకే తాను హాస్టల్ నిద్ర చేసినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వసతిగృహ విద్యార్థుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులకు అందుతున్న ఆహారపదార్థాలు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తన పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటున్నానని తెలిపారు. గతం లో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో పర్యటించానన్నారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగక తప్పదన్నారు.

పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి లేదు: వైఎస్ జగన్

Written By news on Sunday, June 14, 2015 | 6/14/2015


పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి లేదు: వైఎస్ జగన్
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని లేఖలో కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టువల్ల రాయలసీమ నెల్లూరు, ప్రకాశం జిల్లాలో సాగునీటి వనరులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

విభజన చట్టం ప్రకారం నదీ జలాల నిర్వహణ బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టును చేపట్టినా వీటి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుకు ఎలాంటి నిర్ధిష్ట కేటాయింపులు జరగలేదని వైఎస్ జగన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుకోసం ఇప్పటికే శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రస్తుత ఆయకట్టుకు కూడా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ప్రాజెక్టు విషయంలో ఎట్టి పరిస్థితిలో మీరు జోక్యం చేసుకోవాలని ఉమాభారతిని కోరారు.

చంద్రబాబు నేరం అంగీకరించారు


'చంద్రబాబు నేరం అంగీకరించారు'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తన తప్పు ఒప్పుకుని హుందాగా వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 'ఒక ఓటు- 5 కోట్లు' కేసులో రోజుకో ఆధారాలు దొరుకుతున్నాయని అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబుకు ప్రత్యేకంగా లై డిటెక్టర్ పరీక్షలు అవసరం లేదని చెప్పారు. నేరాన్ని ఆయన అంగీకరించినట్టు స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన ఫోన్ ట్యాప్ చేయలేదని చంద్రబాబు చెప్పారని తెలిపారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నేరాన్ని అంగీకరించి జ్యుడీషియల్ విచారణకు కోర్టు ముందుకు వెళ్లాలని అన్నారు. 5 కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి చంద్రబాబుకు విచారణకు అంగీకరించాలని కోరారు. ఈ కేసు రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాప్ అయిందని, సెక్షన్ 8 అంటూ ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఒక వర్గం మీడియా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఏపీలోని 13 జిల్లాల్లో దోచి తెలంగాణలో తన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏపీలో భూమిపూజ, తెలంగాణలో ధనపూజ చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తెలంగాణలో పౌరుడు, ఏపీకి ముఖ్యమంత్రి అని అన్నారు. ఇప్పటివరకు చంద్రబాబుకు సెక్షన్ 8 ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు

Popular Posts

Topics :