16 June 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

'విచారణకు చంద్రబాబు జంకుతున్నారు'

Written By news on Saturday, June 22, 2013 | 6/22/2013

తిరుపతి : ఐఎంజీ భూ వ్యవహారంలో ముమ్మాటికీ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్‌ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విచారణ జరిపితే చంద్రబాబునాయుడు అవినీతి బండారం బట్టబయలు అవుతుందని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు.

అందుకే భూ పంపిణీపై విచారణకు చంద్రబాబు జంకుతున్నారని రామచంద్రారెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో లోపాయికారి ఒప్పందం వల్లే విచారణపై కాంగ్రెస్ సర్కార్ మౌనం పాటిస్తోందన్నారు. ప్రభుత్వం విచారించకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విచారణ జరుపుతామని ఆయన అన్నారు

వరదబాధితులకు వైఎస్ఆర్ సిపి వైద్యబృందం సేవలు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వరదబాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైద్యవిభాగం సేవలందిస్తోంది. డెహ్రాడూన్ విమానాశ్రయంలో ఆర్మీ తరలిస్తున్న యాత్రికులకు వైద్యం చేస్తున్నారు. ఆరుగురు డాక్టర్లు, ఆరుగురు వాలంటీర్లు సేవలందిస్తున్నారు. డాక్టర్లు నాగభూషణ్ రెడ్డి, అశోక్, పురుషోత్తంరెడ్డి, శర్మ, ఫణి, శివభారత్‌రెడ్డి సేవాకార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

YS Vijayamma solace to the uttarakhand peoples

YS Vijayamma speech in Panchayati Raj Sadassu at Vijayawada

Maha satha Chandi Yagam for Jagan's release

YS Vijayamma speech in Panchayati Raj Sadassu at Vijayawada

ధైర్యం సడలలేదు ప్రజలను వీడలేదు


కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, సీబీఐ, ఈడీ... వీటికితోడుగా కొన్ని ఎల్లో పత్రికలు, వాటి యజమానులు పనిగట్టుకుని జగన్‌కు వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తున్నారు. కాబట్టే న్యాయవ్యవస్థ మీద ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ మీద టీడీపీ నాయకులు, కాంగ్రెస్ మాజీమంత్రి శంకర్‌రావు ఇద్దరూ కలిసి కేసు పెట్టిన వెంటనే సీబీఐ రంగంలోకి దిగింది. చంద్రబాబుని విచారించేందుకు సీబీఐ దగ్గర లేని సిబ్బంది... రాత్రికి రాత్రే జగన్‌ని అరెస్టు చేయడానికి ఎక్కడి నుంచి ఊడిపడ్డారు! జగన్‌ని విచారణ పేరుతో తమ అధీనంలోకి తీసుకోడానికి ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడే సీబీఐకి సమయం దొరికిందా?

ప్రచారం ముందో, ప్రచారం తర్వాతో కూడా ప్రశ్నించవచ్చు కదా. అయినా జగన్‌చేసిన తప్పేంటి? తండ్రి మరణాన్ని తట్టుకోలేక వందలాదిమంది అభిమానులు చనిపోయారు. వారి కుటుంబాలను చూసి తల్లడిల్లిన జగన్ నల్లకాలువలో ఒకే ఒక్క మాట ఇచ్చారు. ‘స్వయంగా నేనే మీ ఇంటికి వచ్చి ఓదార్చుతాను’ అని చెప్పారు. ఇదే తప్పయితే - చనిపోయిన వారి కుటుంబ సభ్యులను భారతీయ సంప్రదాయం ప్రకారం పరామర్శించడానికి వెళ్లిన వారిది కూడా ఇక నుంచీ తప్పనుకోవాలా? అధిష్టానం అభీష్టానికి వ్యతిరేకంగా ఓదార్పుయాత్రకు వెళ్లారని సాకుగా చూపించిన కాంగ్రెస్ నాయకులు... టీడీపీతో కుమ్మక్కై, కుట్ర రాజకీయాలకు తెర తీసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. సీబీఐ కూడా తన వంతు పాత్రను పోషిస్తోంది. జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడట, అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వకూడదట!

అధికారంలో ఉన్న మంత్రులు బయట ఉన్నారు. మరి వాళ్లు సాక్షులను ప్రభావితం చేయరా? అసలు విషయం ఏంటంటే... జగన్ బయట ఉంటే, ప్రజల్లో తిరుగుతుంటే... తమ దుకాణాలు బంద్ అవుతాయన్న భయంతో కాంగ్రెస్, టీడీపీలకు చెమటలు పడుతున్నాయి. జగన్‌ను అవినీతిపరుడు అంటున్న కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ లీడర్ ఆజాద్‌గారు, ‘జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈ పాటికి మంత్రి అయి ఉండేవారనీ, తర్వాత ముఖ్యమంత్రి అయ్యేవారనీ’ అన్నారు. దీనినిబట్టి ప్రజలకు ఏం అర్థమౌతోందీ అంటే... కాంగ్రెస్ పార్టీని వీడినందుకే, ఓదార్పుయాత్ర తలపెట్టడం ద్వారా హైకమాండ్‌ను ఎదిరించినందుకే అవినీతిపరుడు అనే ముద్రవేశారు కానీ, నిజంగా కాదని!

చంద్రబాబులాగ పూటకొక మాట, రోజుకొక వేషం వేసి చీకట్లో చిదంబరాన్ని కలిస్తే ఎల్లో పత్రికలు ఆ విషయాన్ని విశ్లేషించవు. ఉదయించే సూర్యుడిలాగా పార్టీని పెట్టి అస్తమించే సూర్యుడిలాగా మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిన చిరంజీవి గురించి అవి రాయవు. త్వరలోనే ఈ కుటిల రాజకీయ నాయకులకు, తప్పుడు రాతలు రాసే ఎల్లో అధినేతలకు ప్రజలు బుద్ధి చెబుతారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, నాయకులకు, భరోసా ఇస్తూనే... ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా చివరకు జైలుకెళ్లినా ధైర్యంగా ఉండి... తల్లి, చెల్లిని ప్రజల్లోకి పంపారు. ప్రజల సమస్యలను తెలుసుకొమ్మన్నారు. ప్రజా సమస్యలపై పోరాడమని చెప్పారు. ఇదీ రాజకీయం అంటే ఇది. ఇదీ విశ్వాసం అంటే, ఇదీ విశ్వసనీయత అంటే.

- లాలూ, నిజామాబాద్

2004 నుంచే ఎందుకు?

* సాగునీటి ప్రాజెక్టులపై వ్యాఖ్యలు దారుణం: కృష్ణదాసు
* టీడీపీ, ఎల్లో మీడియా విమర్శలే యథాతథంగా కాగ్ నివేదికలో
* ఆ విమర్శలే పరమ ప్రమాణమన్నట్టుగా రాష్ట్ర ఏజీ మాటతీరు
* చూస్తుంటే కాగ్ ఒక పార్టీ ప్రాపకం కోసం పని చేస్తున్నట్టుంది
* సాగునీటి ప్రాజెక్టులు ప్రజాప్రయోజనార్థం చేసే నిర్మాణాలు
* ఇంగితమున్న వారెవరూ వ్యయ-లాభ నిష్పత్తిని చూడరు
* వైఎస్సే లక్ష్యంగా ‘2004’ నుంచే పరిశీలిస్తున్న కాగ్

అనుమతులు లేనిదే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టొద్దని, వాటివల్ల ఖర్చు పెరిగిపోతుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉప నేత ధర్మాన కృష్ణదాసు తీవ్రంగా తప్పుబట్టారు. కాగ్ ధోరణి చూస్తుంటే అది ఏదో రాజకీయ పార్టీ ప్రాపకం కోసం పని చేస్తున్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 2004-2012 మధ్య కాలంలో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంపై కాగ్ ప్రత్యేకంగా రూపొందించిన నివేదిక చూస్తే, ఈ దేశంలో సాగునీటి ప్రాజెక్టులు అనవసరమన్న భావన కలిగేలా ఉందన్నారు. ‘‘కాగ్ ప్రదర్శిస్తున్న ఈ వైఖరినే పాలకులు అనుసరించి ఉంటే భాక్రానంగల్, నాగార్జునసాగర్ వంటి ప్రతిష్టాత్మకం, దేశానికే తలమానికమైన బహుళార్థసాధక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేవి కావు. భారతదేశంలో, అదీ గోదావరి నదిపై బ్యారేజీ నిర్మిస్తే మనకేం ప్రయోజనమని నాటి బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్ధర్ కాటన్ అనుకుని ఉంటే గోదావరి జిల్లాలు ధాన్యాగారంగా పేరు గాంచేవి కావు’’ అన్నారు.

కృష్ణదాసు శుక్రవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు కరువు బారిన పడి విలవిల్లాడుతున్నా తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం పట్టించుకోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరే బాగుందన్న రీతిలో కాగ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆయన ఆక్షేపించారు. ‘‘దీనికితోడు, బాబు, ఆయన పార్టీ నేతలు, ఆయన కనుసన్నల్లో నడిచే ఎల్లో మీడియా ఎనిమిదేళ్లుగా చేస్తున్న ఆరోపణలు, విమర్శలే కాగ్ నివేదికలో చోటుచేసుకున్నాయి. పైగా ఎల్లో మీడియా ఆరోపణలే పరమ ప్రమాణాలన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న తీరు చూసి నేను విస్తుపోయాను. కాగ్‌కు తప్పులు పట్టడమే తప్ప ప్రజా సంక్షేమంతో పని లేదని కేంద్ర మాజీ మంత్రి, ప్రఖ్యాత జర్నలిస్టు అరుణ్ శౌరి చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యమని శుక్రవారం నాటి కాగ్ నివేదిక చూశాక నాకనిపించింది.

తప్పులు వెదకడమే తప్ప రాష్ట్ర ప్రజలకు ఆహారభద్రత, ఆరోగ్య భద్రత, విద్యా భద్రత వంటివి కాగ్‌కు పట్టవన్న అభిప్రాయం కలుగుతోంది. ఆహార భద్రతకు దోహదపడే సాగునీటి ప్రాజెక్టులకు కాస్ట్ రేషియో బెనిఫిట్‌ను ఈ దేశంలో ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరూ చూడరు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టొద్దట! వాటి నిర్మాణం వల్ల ఆర్థిక భారం పడుతుందట! కాంట్రాక్టర్లకు అయాచిత లబ్ధి చేకూరుతుందట! ఏమిటీ వ్యాఖ్యలు? పైగా, ఒక్కసారి ఇన్ని ప్రాజెక్టులు చేపట్టడమేమిటని అకౌంటెంట్ జనరల్ తుమ్మల వాణి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించడం చూశాను. రైతులకు, రాష్ట్రానికి మేలు కలుగుతుందని భావిస్తే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తాయి. భారీ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఎక్కడో ఓ చోట అవకతవకలు జరుగుతాయేమో. ఆరు దశాబ్దాల క్రితం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించినప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి సాగునీటి సౌకర్యం కల్పించడం తప్ప మరో మార్గం లేదు. ఆ ప్రాజెక్టులను ఈపీసీ ద్వారా చేపట్టాలా, లేదా మరో విధానంలోనా అన్నది నిర్ధారించాల్సింది, ప్రజల అవసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకునేది వారెన్నుకున్న ప్రభుత్వాలు మాత్రమే తప్ప కాగ్ కాదు’’ అని అన్నారు.

2004 నుంచే ఎందుకు?
దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నింటికీ 2004నే కాగ్ ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటోందో అర్థం కావడం లేదని కృష్ణదాసు ఆశ్చర్యం వెలిబుచ్చారు. గతేడాది భూ కేటాయింపులకు సంబంధించి కూడా 2004-09 కాలాన్నే కాగ్ పరిగణనలోకి తీసుకుందని గుర్తు చేశారు. ‘‘అంతకుముందు తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబు తన హయాంలో లక్షలాది ఎకరాలను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేశారు. మరి ఆ కేటాయింపులను ఎందుకు సమీక్షించలేదు?’’ అని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే దివంగత నేత వైఎస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో అనుసరించిన భూ కేటాయింపుల విధానాన్నే వైఎస్ కూడా కొనసాగించారని ఆయన గుర్తు చేశారు.

‘‘అలాంటప్పుడు ఐదేళ్ల వైఎస్ హయాంనే కాగ్ ఎందుకు పరిగణనలోకి తీసుకున్నట్టు? ఆ నివేదికలోనూ ఎల్లో మీడియా కథనాల మాదిరి వ్యాఖ్యలుండటం ఏమిటి? ఇక్కడ కాగ్ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తోందో వీటిని బట్టే అర్థమవుతోంది’’ అన్నారు. కాగ్ పేర్కొన్నట్టుగా ప్రాజెక్టుల అంచనా వ్యయం ఆషామాషీగా పెరగదని గుర్తు చేశారు. ‘‘పునరావాస కార్యక్రమాలు, భూ సేకరణకు వెచ్చించాల్సిన నిధులతో పాటు స్టీలు, సిమెంటు ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతాయి కాబట్టి అంచనా వ్యయంలో మార్పు వస్తుంది. కాబట్టి ప్రజలను పక్కదారి పట్టించాలని కాగ్ ప్రయత్నించడం సరి కాదు. జలయజ్ఞం పనులను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) విధానాన్ని అమలు చేశారు. దానిప్రకారం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

అదనంగా చెల్లింపులుండవు. సరైన పరిశీలన లేకుండా ఇచ్చిన డిజైన్లు అనుమతించబడవు. అదే టీడీపీ హయాంలో కాంట్రాక్టర్లతో ఆ పార్టీ నాయకులు సిండికేటై టెండర్ బాక్సులే ఎత్తుకెళ్లిన సంఘటనలున్నాయి. మరి కాగ్ తన నివేదికలో వాటిని కూడా ప్రస్తావిస్తే బాగుండేది. 2004 ఎన్నికలకు ముందు జూరాల విద్యుత్ హౌస్‌ను రూ.46.36 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకుని ఓ ఏజెన్సీకి కట్టబెట్టారు. అంతకుముందు వారు చేపట్టిన ఎస్సారెస్సీ స్టేజ్-2 అంచనా వ్యయాన్ని 28.32 శాతం, వరద కాల్వ అప్రోచ్ కెనాల్‌ను 90 శాతం, హెడ్ రెగ్యులేటర్‌ను 104 శాతం, అలుగునూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను 45 శాతం, అవుకు రిజర్వాయర్‌ను 22 శాతం, కే సీ కెనాల్‌ను 50 శాతం (0-16 కి.మీ. వరకు), తెలుగుగంగను 100 నుంచి 150 శాతం పెంచారు. ఎస్సార్బీసీ అంచనాలను ఏకపక్షంగా 90 శాతం పెంచారు. మరి ఇవన్నీ కాగ్‌కు ఎందుకు గుర్తుకు రాలేదు?’ అని కృష్ణదాసు ప్రశ్నించారు.

నాడు వైఎస్ ఏమన్నారంటే...
సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయన్న టీడీపీ ఆరోపణలపై దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన సమాధానంలో కొన్ని అంశాలు...

‘‘భవిష్యత్తు ఆహార అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ దేశానికి నీరు ఎంతో అవసరం. ఎక్కువ నీటిని రైతులకు అందుబాటులోకి తేవడమే అదనపు ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఉన్న ఏకైక మార్గం. అందుకోసం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అత్యవసరం. గతంలో ఈ ప్రయత్నం చేయని వారిని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలి. ఈ ప్రాజెక్టులను అమలు చేయని రాజకీయ నాయకుల వ్యవహార శైలి నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతి దశలోనూ తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా వాళ్లు సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. మానవమాత్రులమైన మనం ఇక్కడ శాశ్వతం కాదు.

మన మేం చేశామనేది మన తర్వాత కూడా నిలిచిపోవాలి. మన దేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చిన విదేశీ ప్రభుత్వ ప్రతినిధి అయిన కాటన్ ఇలాంటి ప్రాజెక్టులను కట్టించడంలో ఉన్న సమస్యలను 1850ల్లోనే ఎదుర్కొన్నాడు. అలానే కేంద్రం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా అనేక మేజర్, మైనర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. తొమ్మిదేళ్ల విలువైన కాలాన్ని వృథా చేసినందుకు సిగ్గుపడాల్సిన టీడీపీ, ప్రాజెక్టులు కట్టకుండా మమ్మల్ని అడ్డుకుంటోంది. గత శతాబ్ద కాలంలో దేశ జనాభా 500 శాతం పెరిగింది. వచ్చే 30 ఏళ్లలో మరో 50 కోట్ల జనాభా పెరగబోతోంది. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆహారధాన్యాలు, కూరగాయల సమస్య, గతంలోలా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తకూడదు. నీటిని సముద్రంలోనికి వదలడం ఒక నేరం. ప్రతిపక్ష పార్టీలు, వారికి అండగా ఉన్న మీడియా సహకారంతో పొందుతున్న వికృతానందాన్ని అంగీకరించేందుకు మేం సిద్ధంగా లేము. జలయజ్ఞంపై వారు చేస్తున్న దుష్ర్పచారాన్ని నేను ఆపలేను. అవినీతి లేకుండా ప్రాజెక్టులు కడితే వాళ్లను ఆపిందెవరు?’’

జగన్‌పై కుట్రలు తొలగాలి

వైభవంగా మొదలైన యాగం
పాల్గొన్న వందలాది జగన్ అభిమానులు 
కంకణధారణ చేసిన వైఎస్ వివేకానందరెడ్డి 

సాక్షి, హైదరాబాద్: లోక కల్యాణార్థం నిర్వహించే శతచండీయాగం వందలాది వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శుక్రవారమిక్కడి కూకట్‌పల్లిలో ఘనంగా ప్రారంభమైంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రలు తొలగిపోవాలని యాగం సందర్భంగా పూజలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు, జగన్ అభిమానులు హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు గోపూజ, వృషభ పూజ, అశ్వపూజ, గోప్రదక్షిణ, యాగ మంటప ప్రవేశం జరిగాయి. గోవులను, అశ్వాలను, వృషభాలను మంటపం వద్దకు తీసుకొచ్చి పూజలు చేశారు. అనంతరం వేదబ్రహ్మ కేఎల్ సత్యనారాయణస్వామి బృందం గణపతి పూజ, స్వస్తివచనం, నాంది కంకణధారణ, షోడశ కుంభపూజ, కలశస్థాపన, మహారుద్ర పారాయణం, సుబ్రహ్మణ్య సూక్తపారాయణం నిర్వహించింది. వైఎస్ జగన్ కుటుంబసభ్యునిగా వైఎస్ వివేకానందరెడ్డి పాల్గొని కంకణధారణ చేశారు. 

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో సంకల్పం చెప్పారు. మూడు రోజులు సాగే ఈ యాగంలో పాల్గొనేందుకు వందలాది మంది కంకణ ధారణ చేశారు. తర్వాత పంచముఖ హనుమత్ పారాయణం, మహానైవేద్యం, మహామంగళహారతి నిర్వహించారు. తర్వాత కార్యక్రమాల కమిటీ చెర్మైన్ వడ్డేపల్లి నర్సింగరావు, రాజేశ్వరరావుల ఆధ్వర్యంలో వెయ్యిమందికి అన్నప్రసాద వితరణ చేశారు. 

సాయంత్రం ఐదు గంటలకు వేద ఘోష, అంకురార్పణ, దీక్షాహోమం, సుందరకాండ పారాయణం, శతచండీ పారాయణం, నవగ్రహ జపాలు, సహస్రమోదక శతనారికేళ మహాగణపతి హోమం, సుబ్రహ్మణ్య స్వరసప్తసూక్త హోమం, మహాబలి, మహాపూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ మెమోరియల్ ఫౌండేషన్ సభ్యులు వెంకటకృష్ణారెడ్డి, భక్తవత్సల రెడ్డి, పట్టుబాల భాస్కర్‌రెడ్డి, రాకేష్ రెడ్డిలు తమ సతీమణులతో సహా పాల్గొన్నారు.జగన్‌పై జరుగుతున్న కుట్రలు తొలగిపోవాలని సంకల్పం చెప్పారు. వడ్డేపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొని లోకకల్యాణార్థం జగన్‌పై సాగుతున్న కుట్రలు తొలగిపోవాలని సంకల్పిస్తూ పూజలు చేశారు. సినీనటుడు విజయచందర్, వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూధన్‌రెడ్డి, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.

జిల్లాల వారీగా బీసీ రిజర్వేషన్లు ఖరారు..

జిల్లాలో ఏ పంచాయతీ ఎవరికి రిజర్వ్ చేశారో ఈ నెల 25లోగా గెజిట్ నోటిఫికేషన్
జిల్లా కలెక్టర్లు, డీపీవోలకు పంచాయతీరాజ్ కమిషనర్ రాంగోపాల్ ఆదేశాలు
జిల్లాల నుంచి వచ్చిన జాబితాలను ఈసీకి సమర్పించనున్న అధికారులు
21,590 గ్రామ పంచాయతీల ఎన్నికలకు వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్!

 పంచాయతీ ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేసింది. బీసీ రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా తీసుకోవడంవల్ల పలు జిల్లాల్లో అన్ రిజర్వుడు స్థానాలు తగ్గిపోయాయని కొందరు శాసనసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రభుత్వం రిజర్వేషన్ల విధానాన్ని జిల్లాలవారీగా మార్చింది. దీని ఆధారంగా ప్రతి జిల్లాలో కేటగిరీలవారీగా రిజర్వేషన్ల సంఖ్యను పంచాయతీరాజ్ కమిషనర్ రాంగోపాల్ శుక్రవారం అన్ని జిల్లాలకు పంపించారు. 

జిల్లా జనాభాలో బీసీలకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఆ వర్గాలకు గతంలో తక్కువ స్థానాలు వచ్చిన జిల్లాల్లో ఇప్పుడు ఎక్కువ రాగా, మరికొన్ని జిల్లాల్లో తగ్గాయి. బీసీల జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో ఎక్కువ స్థానాలు రిజర్వు అయ్యాయి. బీసీ జనాభా తక్కువగా ఉన్న జిల్లాల్లో ఆమేరకు తగ్గిపోయాయి. రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే బీసీలకు 34 శాతం స్థానాలు దక్కాయి. మొత్తం 6,926 స్థానాలు వారికి లభించాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల సంఖ్యలో ఎటువంటి మార్పులు ఉండవు. బీసీలు, అన్ రిజర్వుడు స్థానాల సంఖ్య మాత్రం మారింది. బీసీల స్థానాలు పెరిగిన జిల్లాల్లో ప్రధానంగా కరీంనగర్, విశాఖపట్టణం, శ్రీకాకుళం, ఆదిలాబాద్, విజయనగరం, ఖమ్మం, వరంగల్, చిత్తూరు, మెదక్, కృష్ణా, వైఎస్సార్, నల్లగొండ, మహబూబ్‌నగర్, అనంతపురం ఉన్నాయి. 

దీంతో ఈ జిల్లాల్లో అన్ రిజర్వుడు స్థానాలు తగ్గాయి. మిగతా వాటిలో బీసీల స్థానాలు తగ్గి, అన్ రిజర్వుడు స్థానాలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21,590 పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇందులో షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న 1,218 గ్రామ పంచాయతీలన్నింటినీ ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 20,372 గ్రామ పంచాయతీలకు జిల్లాల్లో ఆయా కేటగిరీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీనిప్రకారం ఎస్టీలకు షెడ్యూల్ ఏరియాలోని 1,218 పంచాయతీలోపాటు రిజర్వేషన్ల దామాషాలో మరో 1,279 దక్కాయి. అంటే ఎస్టీలకు మొత్తం 2,497 స్థానాలు లభించాయి. ఎస్సీలకు 3,958 స్థానాలు లభించాయి. అన్‌రిజర్వుడు కేటగిరీలో 8,209 పంచాయతీలు ఉన్నాయి. మహిళలకు 50 శాతం స్థానాలు రిజర్వ్ చేశారు. తద్వారా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మహిళలు 10,795 స్థానాల్లో సర్పంచ్‌లుగా ఎన్నిక కానున్నారు. జిల్లాలో ఏ పంచాయతీ ఎవరికి రిజర్వ్ చేశారన్న వివరాలతో ఈ నెల 25వ తేదీలోగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపాలని రాంగోపాల్ జిల్లాల కలెక్టర్లు, డీపీవోలను ఆదేశించారు. జిల్లాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి, ఆ జాబితాలు వచ్చిన వెంటనే ప్రభుత్వానికి నివేదించిన తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు. ఆ తర్వాత వారం రోజులకు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. అంటే.. వచ్చేనెల మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.

మైండ్ గేమ్ కాదు.. మైండ్‌లెస్ గేమ్

- వైఎస్ కుటుంబమే లక్ష్యంగా సీబీఐ, కాంగ్రెస్, టీడీపీ కుట్రలు 
- మైండ్ గేమ్ కాదు.. మైండ్‌లెస్ గేమ్ 
- ఆత్మన్యూనతా భావంతోనే జగన్‌కు సంకెళ్లు 
- సాక్షి చైతన్య పథంలో నంద్యాల వాసుల ధ్వజం

సాక్షి ప్రతినిధి, నంద్యాల: జనాదరణ కలిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజల మధ్య లేకుండా చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలకు కూడా తిలోదకాలిచ్చాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. జగన్‌ను ఆయన కుటుంబాన్ని కష్టాలపాల్జేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నామనే అపోహతో కాంగ్రెస్ పెద్దలు మైండ్‌లెస్ గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా నంద్యాలలో శుక్రవారం ‘సాక్షి చైతన్య పథం’ సదస్సు నిర్వహించారు. స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సదస్సులో మనస్తత్వ శాస్త్ర నిపుణుడు బి.బాలాజీసింగ్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కుటుంబాన్ని వేధిస్తున్నామని సంబరపడుతున్న కాంగ్రెస్‌కు, కోట్లాది కుటుంబాలు జగన్‌ను తమ హృదయాల్లో దాచుకున్నాయనే విషయం అర్థంకావడం లేదన్నారు. 

ఆత్మన్యూనతా భావంతో సీబీఐని పావుగా వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న మైండ్‌లెస్ గేమ్ ఇదని ఆయన విశ్లేషించారు. న్యాయవాది రామసుబ్బయ్య మాట్లాడుతూ జగన్ కోసం రాజ్యాంగాన్ని, ఐపీసీ సెక్షన్లనే సీబీఐ తారుమారు చేస్తోందన్నారు. ఏ నేరానికైనా దర్యాప్తు పూర్తి చేసిన తర్వాతే చార్జిషీటు దాఖలు చేస్తారని, జగన్ విషయంలో మాత్రం బెయిల్ రాకుండా చూసేందుకే ఒక చార్జిషీటుకు అనుబంధ చార్జిషీట్లు వేస్తున్నారన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, కనీస న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.

సీబీఐ స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తే జగన్‌కు ఎప్పుడో బెయిల్ వచ్చేదన్నారు. రిటైర్డ్ టీచర్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ 26 జీవోల విషయంలో మంత్రులకు క్లీన్‌చిట్ ఇస్తున్న ముఖ్యమంత్రి కిరణ్, జగన్‌ను నిందితుడిగా చూడటంతోనే ఇదంతా రాజకీయ కుట్రగా తేలుతోందన్నారు. రిటైర్డ్ ఫారెస్టు అధికారి సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ వైఎస్ మరణంపై అనుమానాలున్న నేపథ్యంలో జగన్ ముఖ్యమంత్రి అయితే తమ కుట్రలన్నీ వెలుగులోకి వస్తాయనే కాంగ్రెస్ పెద్దలు ఆయన్ను జైలులో ఉంచుతున్నారని అభిప్రాయపడ్డారు. జీఎం బీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ విలియం ఫిలిప్ మాట్లాడుతూ వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు బెంగళూరులో ఉండి వ్యాపారాలు చేసుకున్న జగన్ నిందితుడెలా అవుతారని ప్రశ్నించారు. వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం కూడా నేరమే అనే కొత్త అర్థాన్ని సీబీఐ ఇప్పుడు చెబుతోందని ధ్వజమెత్తారు. ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ సీబీఐ విచారణను, కోర్టు తీర్పులను ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన దుయ్యబ ట్టారు.

గల్ఫ్ కార్మికులను ఆదుకోండి


 సౌదీ అరేబియా, కువైట్ దేశాల్లో అమలు చేస్తున్న ‘నితాఖత్’ విధానం వల్ల ఉపాధి కోల్పోయి వెనుదిరిగి వచ్చే రాష్ట్రానికి చెందిన కార్మికులను ఆదుకోవాలని, ఇందుకోసం తక్షణం ఒక విధానాన్ని రూపొందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆమె శుక్రవారం ఒక లేఖ రాశారు.

సౌదీ అరేబియా, కువైట్ దేశాలు అమలు చేయనున్న కఠినమైన కార్మిక చట్టాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. వీటి కారణంగా సౌదీ అరేబియాలో పనిచేస్తున్న 6 లక్షల మంది, కువైట్‌లోని 1.5 లక్షల మంది రాష్ట్రానికి చెందిన కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని విజయమ్మ ఆందోళన వ్యక్తంచేశారు. సీఎంకు విజయమ్మ రాసిన లేఖ సారాంశమిలా ఉంది..

సౌదీ ప్రభుత్వం అమలు చేయబోయే ‘నితాఖత్’ విధానం వల్ల ఆ దేశస్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇతర దేశాల నుంచి అక్కడకు వలస వెళ్లిన కార్మికులు ఉద్యోగావకాశాలు కోల్పోతారు. మరో గల్ఫ్ దేశమైన కువైట్ కూడా అక్రమంగా ఆ దేశంలో నివసిస్తూ ఉపాధి పొందుతున్న వారిని గుర్తించి వారిని స్వదేశాలకు తిప్పి పంపే ప్రక్రియను ప్రారంభించింది.

వచ్చే నెల 3వ తేదీ లోపు సౌదీ అరేబియాలో పనిచేసే వలస కార్మికులు నివాస, ఉపాధి ధృవీకరణ పత్రాలను సరిచేసుకోవాలని అక్కడి ప్రభుత్వం గడువు విధించింది. అలాగే భారత జాతీయులను నియంత్రించడానికి కువైట్ ప్రభుత్వం కూడా తీవ్ర చర్యలు తీసుకుంటోంది. ఈ కారణంగా ఒక్క మన రాష్ట్రానికి చెందిన వారే 1,50,000 మంది ఉపాధి కోల్పోయి తిరిగి రానున్నారు.

దీనివల్ల భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని కోల్పోవడంతో పాటు, ఉపాధి కోల్పోయిన కార్మికులు స్వదేశానికి వెల్లువలాగా వ స్తారు. వారి సమస్యలను సత్వరం పరిష్కరించకపోతే అలివిగాని రీతిలో సామాజిక సమస్యలు తలెత్తవచ్చు. అందుకే వీరి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ ఏడాది మే 17వ తేదీన మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు నేనొక లేఖ రాశాను. విదేశాంగ మంత్రిత్వ శాఖ, ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖలు కలిసి ఆ రెండు దేశాలపై దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చి, అక్కడ నివసిస్తున్న ప్రవాసులకు మరికొంత కాలం వీసా గడువును పొడిగించేలా చూడాలని కోరాను.

తద్వారా అక్కడ పనిచేస్తున్న మన దేశ కార్మికులు దశల వారీగా, గౌరవపూర్వకంగా స్వదేశానికి రావడానికి అవకాశం కల్పించాలని కోరాను. అయితే, ఈ బాధ్యతను కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదలివేసిందని పత్రికల ద్వారా తెలుసుకున్నాను. సౌదీ అరేబియాలోని 6 లక్షల మంది, కువైట్‌లోని 1.5 లక్షల మంది మన కార్మికుల స్థితిపై ఆందోళన చెందుతున్నాను.

కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ (పాత బస్తీ), వైఎస్సార్ కడప, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఈ కార్మికుల్లో కొందరు వృత్తి నైపుణ్యం గలిగిన వాళ్లు, పాక్షిక నైపుణ్యం గల వారు ఉన్నారు. వీరిలో ఒకటిన్నర లక్షల మంది రానున్న రెండు నెలల్లో వెల్లువలాగా స్వదేశానికి వచ్చేస్తే, మన రాష్ట్రం సమస్యల్లో పడుతుంది. వలస కార్మికులను పంపేయాలనే అంటువ్యాధి వంటి ఆలోచన ఇతర గల్ఫ్ దేశాలకు కూడా పాకితే ఇది పెను సమస్యగా మారుతుంది. ఆ పెను సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మీ ప్రభుత్వ యంత్రాంగం మరింతగా సన్నద్ధం కావాలి.

ఇలా తిరిగి వచ్చిన కార్మికులు తీవ్ర నిరాశా నిసృ్పహలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు గతంలో జరిగాయి. ఇలా కార్మికులు నిరాశా నిస్పృహలకు లోనయ్యే ప్రమాదాన్ని ప్రభుత్వ చర్యల ద్వారా నివారించవచ్చు. ఇప్పుడ గల్ఫ్ నుంచి తిరిగి వచ్చే కార్మికుల, వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రతినిధులుగా మనం వెను వెంటనే ఒక స్పష్టమైన రాష్ట్ర విధానంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కింది చర్యలు తక్షణం తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ కోరుతోంది.

1. భారత కార్మికులు తెలియక చేసే పొరపాట్లకు వారిపై కేసులు పెట్టకుండా మన విదేశీ మంత్రిత్వ, ప్రవాస వ్యవహారాల శాఖలు నిరంతరం అక్కడి ప్రభుత్వాలతో మంతనాలు నెరపుతూ ఉండాలి.

2. అక్కడి మన వారు సజావుగా, దశలవారీగా వెనక్కి తిరిగి రావడానికి ఏర్పాట్లు చేయాలి.

3. ఉపాధి కోల్పోయి, దుఃఖంలో ఉన్న వారు తిరిగి రావడానికి ఉచితంగా ప్రయాణపు ఏర్పాట్లను చేయాలి.

4. ఉపాధి కోల్పోయి వెనుదిరిగి వచ్చే గల్ఫ్ బాధితులకు పునరావాసం కల్పించడంతో పాటు వారికి తగిన కౌన్సెలింగ్, శిక్షణను ఇచ్చి ఇక్కడ ఉపాధి లభించేలా చేయడానికి ప్రత్యేకంగా రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలి.

5. తిరిగి వచ్చే వారి కార్మికుల నైపుణ్యానికి తగినట్లుగా, వారు చేయగలిగే ఉద్యోగాలను రాష్ట్రంలో పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి.

6. వలస కార్మికులకు ఉపాధి కల్పించే సంస్థలు, వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా నిర్దేశించాలి. తద్వారా యోగ్యత లేని సంస్థలు, దళారీలు లేకుండా చేయడానికి వీలు కలుగుతుంది.

దొంగలతో బాబు దోస్తీ: భూమన

ఐఎంజీ భూ కేటాయింపుల్లో అవకతవకలే లేకపోతే.. దానిపై చంద్రబాబే స్వయంగా విచారణకు సిద్ధపడాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు దొంగలు, దోపిడీదారులతో చేతులు కలిపారని.. ఐఎంజీ అవకతవకలపై తాము ఆధారాలను బయటపెడితే సిగ్గు లేకుండా ఆ పార్టీ ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి భూమన శుక్రవారం అసెంబ్లీ వద్ద మాట్లాడారు. వైఎస్‌కు బిల్లీరావుతో సంబంధం ఉందంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. వైఎస్‌కు, బిల్లీరావుకు సంబంధం ఉందంటూ టీడీపీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ అంతకు ముందు ఆరోపించారు. దీన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. 

ఇజ్రాయెల్‌లో అధికారిక సమావేశంలోకి దొంగలా బిల్లీరావు రావడంపై వైఎస్ ఆనాడు అక్కడే నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. దీనిపై చంద్రబాబు శాసనసభలో ఫోటోలు ప్రదర్శిస్తే వైఎస్ సమగ్ర వివరణ కూడా ఇచ్చారన్నారు. యూరో లాటరీ కోలా కృష్ణమోహన్ నుంచి రూ.కోట్ల ఫండ్ తీసుకోవడం, దొంగనోట్లు ముద్రిస్తూ పట్టుబడిన రామకృష్ణగౌడ్‌తో ఫోటోలు దిగడం, స్టాంపుల కుంభకోణంలో జైలుశిక్ష అనుభవించిన కృష్ణయాదవ్‌తో సంబంధాలు.. ఇలా ప్రతీ రంగంలో చంద్రబాబుకు భాగం ఉందన్నారు. వైఎస్ తండ్రి రాజారెడ్డి హత్య కేసులో నిందితులకు చంద్రబాబు తన నివాసంలో నెల రోజులు ఆశ్రయం కల్పించారని ఆరోపించారు. 

తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలుస్తాం


 తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధిస్తుందని మాజీ మంత్రి, ఆ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు కొండా సురేఖ చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంటలో నిర్వహించిన వైఎస్సార్ స్మారక గ్రామీణ క్రికెట్ పోటీల్లో విజేతలకు శుక్రవారం ఆమె బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సురేఖ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో వాతావరణం తమపార్టీకి అనుకూలంగానే ఉందన్నారు. సీబీఐ చార్జిషీట్‌లో పేర్లు నమోదైన మంత్రులను అరెస్టు చేయాలని టీడీపీ కోరడంపై ఆమె మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే అలాగే చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశముందన్నారు. బీసీ ఓటర్ల గుర్తింపులోనూ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

‘కృష్ణపట్నం’పై ఈనాడు కట్టుకథలు

నిజాలకు పాతరేస్తూ ఆద్యంతం విషపు రాతలు
ఎంవోయూ కుదరనే లేదంటూ అడ్డంగా అబద్ధాలు
చంద్రబాబు హయాంలోనే కృష్ణపట్నం ఎంవోయూ
వైఎస్ మరణం తర్వాతే 4,731 ఎకరాల అప్పగింత
నిజాల్ని మరుగుపరిచి కట్టుకథలల్లడం ఎలాంటి జర్నలిజం?

సాక్షి, హైదరాబాద్: ఐఎంజీ భూ కేటాయింపుల కుంభకోణంపై దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ‘ఈనాడు’ ఏదో ఒక కట్టుకథనం రాస్తుందని తాము ముందే ఊహించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అనుకున్నట్టుగానే... కృష్టపట్నం మెగా ఇండస్ట్రియల్ పార్కుకు భూ కేటాయింపులు అక్రమమని గావుకేకలు పెడుతూ, వాటికి దివంగత వైఎస్సే కారణమని షరామామూలుగానే బురదజల్లుతూ పతాక శీర్షికన ఈనాడు పత్రిక అక్కసు వెళ్లగక్కిందని ఎద్దేవా చేసింది. ఐఎంజీ భూ కుంభకోణం అంశాన్ని ఎలాగైనా పక్కదారి పట్టించేందుకే పచ్చ కూటమి పెద్దన్న ఇలా స్వయంగా రంగంలోకి దిగిందంటూ దుయ్యబట్టింది. అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కూడా లేకుండానే భూ కేటాయింపులు జరిపారంటూ పచ్చి అబద్ధాలతో కూడిన రాతల ద్వారా నిజాలకు పాతరేసే ప్రయత్నం చేసిదని మండిపడింది. నిజానికి కృష్ణపట్నంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే ఎంవోయూ జరిగిందని తెలిపింది. సదరు జీవో కాపీలను కూడా మీడియాకు విడుదల చేసింది. పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ అప్పగింతలు వైఎస్ మరణానంతరమే జరిగాయని కూడా పేర్కొంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబురావు, కాపు రామచంద్రారెడ్డి, ఎ.అమరనాథరెడ్డి శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లోనూ, అనంతరం ‘సాక్షి’తోనూ మాట్లాడారు. 

ఐఎంజీ భూ కేటాయింపులపై దర్యాప్తు కోసం తాము అసెంబ్లీలో పట్టుబడుతున్న నేపథ్యంలో ఎలాగైనా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ‘ఈనాడు’ ప్రయత్నిస్తుందని ముందే ఊహించామని వారు చెప్పారు. బాబు హయాంలోనే కుదిరిన ఎంఓయూను మాటమాత్రమైనా ప్రస్తావించకుండా కట్టుకథ అల్లిందంటే... ఇదంతా ఎవరి ప్రయోజనాల కోసమో అందరికీ అర్థమవుతోందన్నారు. మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం 1996 ఆగస్టు 12లో బాబు హయాంలోనే నాట్కో ఫార్మాతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) కుదుర్చుకున్న ఎంవోయూను ఎమ్మెల్యేలు చూపించారు. ‘‘తర్వాత అటు కృష్ణపట్నం పోర్టుతో పాటు పార్కు ఏర్పాటు విషయంలోనూ నాట్కో తప్పుకోవడంతో, దాని స్థానంలో నవయుగ కంపెనీ ముందుకు వచ్చింది. కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌పేరుతో కార్యకలాపాలు చేపడుతోంది. పైగా దానికి కేటాయింపులన్నీ బాబు హయాంలో కుదుర్చుకున్న ఎంవోయూ ప్రకారమే జరుగుతున్నాయి. 

ఇలా బాబు ఒక ఫార్మా కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకుంటే ‘ఈనాడు’కు అది తప్పుగా కన్పించదు. దాన్ని ఆధారంగా చేసుకుని, ప్రాజెక్టును రాబట్టేందుకు వైఎస్ భూమి ఇస్తే అది తప్పయింది! నిజానికి కృష్ణపట్నం ప్రాజెక్టు గతంలో బాబు హయాంలో కుదిరిన ఒప్పందానికి కొనసాగింపే తప్ప కొత్తదేమీ కాదు. ఇప్పటికీ నాట్కోకు కృష్ణపట్నం ఇన్ఫోటెక్‌లో వాటా ఉంది. అదీగాక చాలా ప్రాజెక్టులకు వేలాది ఎకరాలను జీవోలు లేకుండా, కేవలం ప్రాజెక్టు నివేదిక ఆధారంగా ఏపీఐఐసీ కేటాయిస్తూ వచ్చింది. కృష్ణపట్నం విషయంలోనూ జరిగింది అదే. డీఎఫ్‌ఆర్ ఆధారంగానే భూములను కేటాయించారు. ఇదేదో కొత్త పద్ధతి అయినట్టు ఈనాడు రాయడం హాస్యాస్పదం. పాఠకుల విజ్ఞతను అది అంత తక్కువగా అంచనా వేస్తోందా?’’ అంటూ తూర్పారబట్టారు. ఈ ఉదంతంపై ఏ చర్చకైనా సిద్ధమన్నారు. టీడీపీ సిద్ధమా అంటూ సవాలు విసిరారు. ఎలాగోలా వైఎస్సార్‌సీపీని, దివంగత వైఎస్‌ను, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని కించపరచేందుకు ‘ఈనాడు’ విశ్వప్రయత్నాలు చేస్తోందంటూ దుయ్యబట్టారు. ఆ క్రమంలో వాస్తవాలను ఈ స్థాయిలో మరుగునపరిచేంతగాదిగజారడం ఏ జర్నలిజం విలువ అవుతుందని ప్రశ్నించారు.

ఎంఓయూ సారాంశమిదీ...

మెగా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు కోసం నాట్కో ఫార్మాతో 1996 ఆగస్టు 12న ఏపీఐఐసీ కుదుర్చుకున్న ఎంవోయూ వివరాలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వివరించారు. ‘‘కృష్ణపట్నం పోర్టు పరిసరప్రాంతాల్లో మెగా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు అపార అవకాశాలున్నాయని, భూమిని ఏపీఐఐసీ సేకరిస్తుందని అందులో పేర్కొన్నారు. ఎంవోయూ కుదిరిన 180 రోజుల్లోగా పార్కు పూర్తిస్థాయి సాధ్యాసాధ్యాల నివేదికను తయారు చేయాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. తమ భాగస్వాములుగా ఫ్లోర్ డేనియల్-యూఎస్‌ఏ, ఇటోచు కార్పొరేషన్-జపాన్, హాలండ్‌కు చెందిన హమ్ డ్రెడ్జింగ్ ఉన్నాయని నాట్కో పేర్కొంది.

డీఎఫ్‌ఆర్ సిద్ధమయ్యాక ప్రాజెక్టు అమలుకు సరైన కో-ప్రమోటర్‌ను ఏపీఐఐసీ ఎంపిక చేసుకుంటుందని, తొలి ప్రాధాన్యత నాట్కోకే ఉంటుందని ఎంవోయూలో స్పష్టంగా పేర్కొన్నారు. ఎంవోయూపై అభ్యంతరాలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని, సాధ్యపడకుంటే ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నాట్కో స్థానంలో వచ్చిన నవయుగ ఇందుకు అనుగుణంగా డీఎఫ్‌ఆర్‌ను తయారు చేసి ఏపీఐఐసీకి సమర్పించింది. భూమిని కేటాయించాలని కోరింది. ఈ నేపథ్యంలోనే 4,731.15 ఎకరాలను కంపెనీకి ఏపీఐఐసీ సేల్ డీడ్ చేసింది. అది కూడా వైఎస్ మరణానంతరం’’ అని వారన్నారు. లోక్‌సత్తా శాసనసభాపక్ష నేత జయ ప్రకాశ్ నారాయణే అప్పట్లో ఏపీఐఐసీ ఎండీ హోదాలో నాట్కో ఫార్మాతో ఎంవోయూ కుదుర్చుకున్నారని గుర్తు చేశారు.

వైఎస్ మరణించాకే భూమి అప్పగింత!

‘‘ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు భూమిని ఏపీఐఐసీ సేకరిస్తుంది. ఆ వ్యయాన్ని కంపెనీయే భరిస్తుంది. అందుకోసం ఏపీఐఐసీకి అదిప్పటికే రూ.102.33 కోట్లు చెల్లించింది. అలా సేకరించిన భూమిని కంపెనీకి ఏపీఐఐసీ అప్పగించింది వైఎస్ మరణానంతరం కావడం విశేషం. ఆయన 2009 సెప్టెంబరు 2న మరణించారు. అక్టోబరు 1న 2,682.77 ఎకరాలను, 2010 సెప్టెంబర్ 18న మరో 2,048.38 ఎకరాలను కంపెనీకి ఏపీఐఐసీ సేల్ డీడ్ చేసింది. భూమి ధరను ప్రభుత్వం నిర్ణయించకపోవడం వల్ల మిగతా భూ కేటాయింపు మూడేళ్లుగా ముందుకు సాగడం లేదు’’ అని ఎమ్మెల్యేలు వివరించారు.

జగన్ నిర్దోషి అని నా ఓటుతో తీర్పు చెబుతా...

కాంగ్రెస్, టీడీపీ పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది: షర్మిల
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 186, కిలోమీటర్లు: 2,472

మరో ప్రజా ప్రస్థానం నుంచి ‘సాక్షి’ప్రతినిధి: ‘ఏడాది కాలం నుంచి చూస్తున్నా. వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డికి బెయిల్ రేపొస్తది.. మాపొస్తది అని చెప్తున్నారు. ఎంత అన్యాయం అమ్మా.. వైఎస్ పేదోళ్ల కోసం పని చేసినందుకు జగనన్నను జైల్లో పెట్టారా? లేకుంటే ఆయన 35 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినందుకు ఆయన కొడుకును జైల్లో పెట్టారా? కోర్టులో జడ్జి తీర్పును నేను ఏమీ అనడం లేదమ్మా. కానీ నేను కూడా తీర్పు చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని నా ఓటుతో తీర్పు చెప్తా. కోర్టులో జడ్జీలు చెప్పే తీర్పుకు తిరుగుంటుందేమో గానీ, జనం తీర్పుకు తిరుగు లేదమ్మా’ - మరో ప్రజా ప్రస్థానంలో శుక్రవారం షర్మిలతో బంగారయ్యపేట గ్రామానికి చెందిన 75 ఏళ్ల విశ్రాంత రైతు కన్నారావు ఉద్వేగంతో అన్న మాటలివి! వైఎస్ హయాంలో ఆదర్శ రైతు పతకాన్ని అందుకున్న ఆయన, ఆ సందర్భంగా మహా నేత ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని షర్మిలకు చూపించారు. షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగింది.

దారి పొడవునా రైతులు, వృద్ధులు, మహిళలు, చేతివృత్తుల వారు షర్మిలను కలిశారు. వారి సమస్యలేమిటని షర్మిల అడిగితే.. ‘జగనన్న ఎప్పుడు బయటికి వస్తాడమ్మా?’ అంటూ వాళ్లే ఆమెను అడుగుతున్నారు! మీరు చూపుతున్న అభిమానమే జగనన్నకు అండ అని వారికి షర్మిల బదులిచ్చారు. ‘‘జగనన్న జైల్లో ఉన్నా ధైర్యంగానే ఉన్నారు. వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోతే అనాథలయింది మా ఒక్క కుటుంబం మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలంతా అనాథలైపోయారని జగనన్న అర్థం చేసుకున్నారు. కాబట్టే జగమంత కుటుంబాన్ని నాన్న తనకు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రజలంతా తన కుటుంబమే అనుకున్నారు. వైఎస్సార్ ఈ రాష్ట్ర ప్రజలను ప్రేమించారు. తన జీవితాన్ని పూర్తిగా వారికోసమే అంకితం చేశారు. కానీ తనది జగమంత కుటుంబం అనుకున్న జగనన్నను ఈ రోజు ఆ జనం నుంచే వేరు చేశారు.

కాంగ్రెస్, టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం అమాయకుని జీవితాన్ని బలిపెట్టారు. వీళ్ల పాపాలను దేవుడు లెక్కపెడుతున్నాడు. రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ పాపాత్ములను ఎప్పుడెప్పుడు శిక్షిద్దామా అని వారు ఎదురు చూస్తున్నారు. వీళ్ల పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉంది. తమకు రాజన్న రాజ్యం కావాలని తీర్పు చెప్పడానికి కోట్ల గొంతులు వేచి ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌కి వేసే ప్రతి ఓటూ... జగనన్న నిర్దోషి అని వారు నమ్ముతున్నారని చాటి చెప్పనుంది. దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో, ఆయన మంచివాళ్ల పక్షాన నిలబడతాడనేదీ అంతే నిజం. ఒక రోజు తప్పక వస్తుంది. ఆ రోజున జగనన్న బయటికి వస్తారు. మనందరినీ రాజన్న రాజ్యం వైపు నడిపిస్తారు’’ అని షర్మిల అన్నారు. అవకాశం వచ్చినప్పుడు జగనన్నను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

శుక్రవారం 15.5 కిలోమీటర్లు పాదయాత్ర

షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం 186వ రోజు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శాంతి ఆశ్రమం ఆర్చ్ నుంచి మొదలైంది. శంఖవరం, బంగారయ్యపేట, రైతులపూడి గ్రామాల మీదుగా సాగింది. ఆమె 15.5 కిలోమీటర్లు నడిచి రాత్రి 7.30కు రైతులపూడి శివారులోని బసకు చేరుకున్నారు. యాత్ర ఇప్పటి వరకు 2,472 కి.మీ. సాగింది. నేతలు వరపుల సుబ్బారావు, చెలమలశెట్టి సునీల్, కొల్లి నిర్మల కుమారి, విప్పర్తి వేణుగోపాల్, అనంతబాబు, చింతా కృష్ణమూర్తి, బొంతు రాజేశ్వరరావు, జ్యోతుల నవీన్ తదితరులు షర్మిలతో పాటు నడిచారు. జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, చిర్ల జగ్గిరెడ్డి, ముదునూరి ప్రసాదరాజు తదితరులు షర్మిలను కలిశారు.

YSRCP fires on the fake news of "Eenadu"

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో శనివారం (187వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి శుక్రవారం ప్రకటిం చారు. బంగారయ్యపేట సమీపం లోని రాత్రి బస నుంచి శనివారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. ములగపూడి సమీపంలో మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. అనంతరం రాజవరం వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. అక్కడికి సమీపంలో రాత్రి బస చేస్తారు. శనివారం మొత్తం 14.4 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.

పర్యటించే ప్రాంతాలు : - రౌతులపూడి, బలరామపురం, ములగపూడి, రామకృష్ణాపురం, రాజవరం

వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి ఖమ్మం కాంగ్రెస్ నేత!

Written By news on Friday, June 21, 2013 | 6/21/2013

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా నాయకుడు డాక్టర్ రామచంద్రనాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం లోటస్ పాండ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో రామచంద్రనాయక్ పార్టీలో చేరారు. రామచంద్రనాయక్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి విజయమ్మ ఆహ్వానించారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వైరా కాంగ్రెస్‌ అభ్యర్థిగా నాయక్‌ పోటీచేశారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వీడేదిలేదు: కొండా సురేఖ

ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడేదిలేదని వైఎస్ఆర్ సిపి నాయకురాలు కొండా సురేఖ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. కొందరు పనిగట్టుకుని పార్టీపై దుష్పచారం చేస్తున్నారన్నారు. తెలంగాణలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న మంత్రులను తొలగించకుంటే ప్రభుత్వానికే నష్టం అన్నారు. 

పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌ సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా జరగలేదని చెప్పారు. రిజర్వేషన్ల ప్రక్రియలో పూర్తిగా అవకతవకలున్నాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందెందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. 

టిడిపి ఆరోపణలను ఖండించిన వైఎస్ఆర్

చంద్రబాబు హయాంలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్లీరావుతో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమావేశమయ్యారని టిడిపి చేసిన ఆరోపణల్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ ఖండించింది. తన ఇజ్రాయెల్‌ పర్యటనలోని ఓ సమావేశానికి బిల్లీరావు వస్తే అప్పుడే వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. దీనిపై అప్పట్లోనే శాసనసభలో చర్చ జరిగిందని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అసెంబ్లీ రికార్డుల రుజువుల్ని ఆయన మీడియా ముందుంచారు

YSRCP demands on vacancy posts

YSRCP mla Bhumana karunakar reddy fire on chandrababu

సీఎం కిరణ్‌కు విజయమ్మ లేఖ

వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పలు అంశాలపై లేఖ రాశారు. ఇందిర క్రాంతి పథం సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆ లేఖలో తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలు పెరగడం లేదని పేర్కొన్నారు. హేతుబద్ధమైన ఐకేపీ ఉద్యోగుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 108 ఉద్యోగుల భవితవ్యం అగమ్యగోచరంగా ఉందని తెలిపారు. తమ డిమాండ్లపై నోరెత్తినందుకు వారిపై అక్రమ కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. వారిని సస్పెన్షన్లకు గురి చేశారు. బదిలీలు కూడా చేశారని తెలిపారు. నిత్యావసరాలు ఆకాశాన్నంటున్నా 108 ఉద్యోగుల జీతాలు పెరగడం లేదు. ఇప్పటికైనా చొరవ తీసుకుని వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. \

గల్ఫ్ బాధితులను ఆదుకోండి: విజయమ్మ

గల్ఫ్ లో నూతనంగా అమల్లోకి వచ్చిన నితాఖత్ చట్టం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన తెలుగు వారిని ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కోరారు. ఈ మేరకు వైఎస్ విజయమ్మ శుక్రవారం సీఎంకు లేఖ రాశారు. నితాఖత్ చట్టం వల్ల సౌదీలో ఆరు లక్షల మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. కువైట్ లోనే లక్షా యాభై వేల మంది మన కార్మికులకు నష్టం వాటిల్లందన్నారు. వీరిని తక్షణమే ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఈ సందర్భంగా సీఎంకు రాసిన లేఖలో వైఎస్ విజయమ్మ గుర్తు చేశారు. 

ఇదే విషయంపై గతనెల17న ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు లేఖ రాసిన సంగతిని సీఎం కిరణ్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు. తెలుగువారికి న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. అరబ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. గల్ఫ్ బాధితుల కోసం రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గల్ఫలో ఉద్యోగాలు కోల్పోయినవారికి ఇక్కడ ఉపాధి కల్పించాలని సీఎంకు రాసిన లేఖలో వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. 

జగన్... జాతీయ నాయకుడు

‘ఎంతకాలం బతికాం అన్నది కాదు, బతికినంతకాలం ఎలా బతికాం అన్నదే ముఖ్యం’ అని నమ్మి, ఆచరించిన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి జగన్. తన తండ్రి మరణవార్త విని వందల సంఖ్యలో అభిమానులు గుండె పగిలి చనిపోయారని తెలిసి, చలించిపోయిన మంచి మనిషి జగన్. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఇచ్చిన మాటకోసం ‘ఓదార్పు యాత్ర’ మొదలుపెట్టినప్పుడే, ఈ రాష్ట్రంలోని ప్రతి కుటుంబమూ ఇలాంటి బిడ్డ ఉండాలని మనసులో అనుకున్నారు.

ఓదార్పుయాత్రలో నిష్కపటమైన ప్రతి పేదవాడి హృదయాన్ని, బాధల్ని, తన తండ్రి మీద ఉన్న అభిమానాన్ని చూసి, జగన్ ఉద్వేగం చెందారు. మానవత్వం, దేవుడంటే నమ్మకం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటం అనే ఈ మూడు సుగుణాల వల్లనే జగన్ ప్రజానాయకుడయ్యారు. తండ్రి చనిపోయాక గత మూడేళ్లుగా జగన్ ఎన్నో అనుభవాలను చవిచూడడంతో అతి పిన్న వయసులోనే ఈ కుమ్మక్కు, కుట్ర రాజకీయాల నుంచి ఎంతో నేర్చుకున్నారు. ఇప్పుడిక వై.ఎస్.జగన్ ముమ్మాటికీ జాతీయ నాయకుడు.

- కె.రజని, విజయవాడ
ప్రజలు జగన్‌కి అండగా ఉన్నారు
ప్రజానాయకుడైన జగన్‌గారిని నిర్బంధించి, వేధిస్తున్న సీబీఐ ఒక వాస్తవం విస్మరిస్తోంది. సీబీఐ అంటున్న ఈ అవినీతి, క్విడ్ ప్రోకోలు అసలు వర్తించేది చంద్రబాబుగారికే. కనుక మొదట ఆయన్నే జైల్లో పెట్టాలి. తను నీతిమంతుడిననీ, సత్యహరిశ్చంద్రుడినని నిరూపించుకోవడానికి బాబుగారు ఎన్నో తిప్పలు పడ్డారు. సీబీఐ అంటే భయపడి, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. తనపై దర్యాప్తును ఆపించుకున్నారు. ఇలా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయం చంద్రబాబుకి అలవాటే. ప్రతిపక్షనేత అయివుండీ కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా ఎన్టీయార్ ఆత్మకు సైతం మనశ్శాంతి లేకుండా చేస్తున్నారాయన. 

ఆయన పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలు భస్మాసుర ‘హస్త’ రూపంలో తిరిగి ఆయన్నే అంతమొందిస్తాయి. ప్రజాదరణ ఎటూ లేదు కాబట్టి చివరికి ఆయన కాంగ్రెస్ గూటికి చేరినా ఆశ్చర్యంలేదు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌కు వ్యతిరేకంగా దుష్ర్పచారాలు చేస్తున్న చంద్రబాబు ఒక విషయం తెలుసుకోవాలి. ఆయనలా జగన్ పిరికివారు కారు. విచారణను తప్పించుకోడానికి ఎవరి పంచనా చేరలేదు. జగన్ ధీశాలి. ఇచ్చిన మాట కోసం కట్టుబడిన నాయకుడు. కాంగ్రెస్, సీబీఐ, టీడీపీ.. జగన్‌ను ఎంతోకాలం ఇబ్బందిపెట్టలేవు. ఆ దేవుడు, ప్రజలు జగన్‌కి అండగా ఉన్నారు. త్వరలోనే ఆయన విడుదలై వస్తారు. ఆయన్ని ఇన్నాళ్లూ వేధించినవారందరికీ ప్రజలు బుద్ధి చెబుతారు. ఇది సత్యం. 
- కృష్ణమోహన్, నాయుడుపేట, నెల్లూరు జిల్లా

జగన్ అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ దీక్ష -నేడు ఢిల్లీకి వికలాంగుల యాత్ర

పెనుకొండ, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధినేత, కడప ఎంపీ జగన్ మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా పెనుకొండలో గురువారం వికలాంగులు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. వైఎస్‌ఆర్ ఆశయ సాధన కమిటీ అధ్యక్షుడు షరీఫ్ నేతృత్వంలో ఉదయం పట్టణంలోని దర్గా సర్కిల్‌కు చేరుకున్న వికలాంగులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్ష ప్రారంభించారు. శుక్రవారం పెనుకొండ నుంచి ఢిల్లీకి వికలాంగులు ట్రైసైకిళ్లపై ర్యాలీగా బయలుదేరి వెళతారు. 

ఓట్ల కోసమే సబ్‌ప్లాన్

సంక్షేమం మాటల్లో కాదు.. చేతల్లో చూపండి
రెండేళ్లలో ఒక్క పెన్షన్, రేషన్‌కార్డు అయినా ఇచ్చారా?

 రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల కోసమే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తెచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆరోపించారు. దళితులు వైఎస్సార్‌సీపీ వెంట ఉన్నారన్న దుగ్దతో హడావుడిగా ఈ చట్టం తెచ్చారే తప్ప వారిపై ప్రేమతో కాదని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని అప్పుడే మిమ్మల్ని(ప్రభుత్వాన్ని) అభినందిస్తారని అన్నారు. సబ్‌ప్లాన్ కేవలం 10 సంవత్సరాలకే పరిమితి చేయడం ఏమిటని ప్రశ్నించారు. గురువారం శాసనసభలో సంక్షేమ శాఖల పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందే కానీ పథకాల అమలు ఎక్కడా సజావుగా సాగడం లేదని విమర్శించారు. 

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి బడుగు బలహీనవర్గాలను ఆదుకోవడానికి పలు పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం వల్ల వారి హృదయాల్లో దేవుడిగా మిగిలిపోయారని తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ/ఎస్టీలకు రావాల్సిన నిధుల్లో 20 నుంచి 30 శాతం కూడా అందడం లేదన్నారు. ఎస్సీ/ఎస్టీ సబ్‌ప్లాన్ తెచ్చినట్లు ఘనంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇది అమలులోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క రేషన్‌కార్డు, పెన్షన్ మంజూరు చేశారా? అని నిలదీశారు. జనాభా ప్రతిపాదికన నిధులు విడుదల చేయాల్సి ఉన్నా సబ్‌ప్లాన్ చట్టం వచ్చిన తరువాత కూడా బడ్జెట్‌లో నాలుగువేల కోట్ల రూపాయలు కోత పెట్టారని విమర్శించారు. కొత్తగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని, ఎస్సీ/ఎస్టీల ఇళ్ల నిర్మాణానికి అదనంగా లక్ష రూపాయలు ఇస్తామని జీవో ఇచ్చారే తప్ప నిధులు విడుదల కాలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లోనే ఎస్సీ/ ఎస్టీల కోసం నోడల్ ఏజెన్సీని నియమించారని, ఇప్పుడు దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. 

నిధులు మళ్లించేవారిని, తప్పు చేసే అధికారులను శిక్షించాలనే నిబంధన సబ్‌ప్లాన్ చట్టంలో చేర్చాలని తమపార్టీ సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తాను చెప్పే అంశాల్లో అవాస్తవాలు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. పేద ఎస్సీల ఇళ్లకు 50 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం కిరణ్ స్వయంగా ప్రకటించినా ఇంతవరకూ దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, దీంతో ఎక్కడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దళితులకు ఆత్మహత్యలే శరణ్యం అన్నట్లుగా పరిస్థితులు దాపురించాయన్నారు. ఐదువేల మంది ఎస్సీఎస్టీ విద్యార్థులను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంతమందిని ఎంపిక చేసిందని ప్రశ్నించారు. దళిత విద్యార్థుల కోసం ఇంగ్లిష్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. వైఎస్ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదని, ఫీజులు సక్రమంగా అందేవని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ సేవల నుంచి 130 జబ్బులను తొలగించారని గొల్ల బాబూరావు అన్నారు. తెనాలిలో ఓ మహిళను నడిరోడ్డుపై హత్యచేస్తే అధికారపక్షం నుంచి ఒక్కరూ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.

జీవోలు సక్రమమైతే జగన్‌పై కేసులు ఎందుకు?

జీవోలు సక్రమమైతే జగన్‌పై కేసులు ఎందుకు? 
మోపిదేవికో న్యాయం.. ఇతర మంత్రులకో న్యాయమా? 
సాక్షి చైతన్యపథంలో వక్తలు 

రాయచోటి, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటిలో సాక్షి చైతన్యపథం సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్యుడు బయారెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్ హయాంలో జారీచేసిన జీవోలు సక్రమమే అని ప్రభుత్వమే ప్రకటిస్తున్నప్పుడు జగన్‌ను జైలులో పెట్టడమెందుకని ప్రశ్నించారు. న్యాయవాది పవన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేసు తీవ్రతను బట్టి 6 లేదా 9 నెలల లోపు బెయిల్ యివ్వాల్సి ఉన్నప్పటికీ జగన్ కేసు విషయంలో ఆ విధంగా జరగడం లేదన్నారు. జీవోల విడుదల కేసులో మంత్రి మోపిదేవి వెంకటరమణను జైలుకు పంపినా, అదే కేసులో సబిత, ధర్మానతో పాటు మరికొందరు మంత్రులను అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. బీసీ ఐక్యకులాల వేదిక జిల్లా కార్యదర్శి యానాదయ్య మాట్లాడుతూ పాలకులు అడ్డదారులు తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత సీబీఐ అస్త్రంతో వెంటాడి మరీ వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. 

ఇటీవల వెలుగుచూసిన పలు కుంభకోణాల్లో ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రుల పాత్ర ఉన్నట్లు బయటపడినా నైతికత లేకుండా అప్రజాస్వామికంగా వారు పదవుల్లో కొనసాగడం ఏమాత్రం సబబని ప్రశ్నించారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి పలు అక్రమాలు, కుంభకోణాలకు ఆజ్యం పోసిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. వాన్‌పిక్ తదితర సెజ్‌లకు భూ కేటాయింపు బాబు హయాంలోనే మొదలైందన్నారు. మైనార్టీ నేత బషీర్ అహమ్మద్ మాట్లాడుతూ జీవోలు సక్రమమైనవే అయినప్పుడు సీఎం కిరణ్ ఇంతకాలం మౌనంగా ఉండటం వెనుక పరమార్థమేమిటని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళ శంకరమ్మ మాట్లాడుతూ జగన్ ఏం తప్పు చేశాడని జైలులో పెట్టారని ప్రశ్నించారు. కేసును ఎటూ తేల్చకుండా జగన్‌ను నెలల తరబడి జైలులో పెట్టడం ఎంతవరకు సమంజసమంటూ ఆమె మండిపడ్డారు. ఈ సదస్సుకు స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 

వైఎస్ ఉంటే ..పోలవరం పారేది

పోలవరాన్ని అందరూ ఓట్లురాల్చే ప్రాజెక్టుగానే చూశారు
కానీ వైఎస్సార్ రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చూశారు
ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాలను సస్యశ్యామలం చేయవచ్చని సంకల్పించారు
ప్రాజెక్టు పూర్తయితే 7.21 లక్షల ఎకరాలకు సాగు నీరు,
25 లక్షల మందికి తాగు నీరు అందుతుంది
అందుకే పట్టుదలగా దాదాపు అన్నీ క్లియరెన్సులు సాధించారు
రూ. 3,310 కోట్లు ఖర్చు చేసి 38 శాతం పనులు పూర్తిచేశారు
ఈ చేతగాని పాలకులు ఆ శ్రమనంతా నిర్వీర్యం చేస్తున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 185, కిలోమీటర్లు: 2,456.5

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ప్రతినిధి: ‘‘పాదయాత్రలో నడుస్తూ మీ పంట పొలాలను చూశాను. అంతా మెట్ట భూమే కనిపిస్తోంది. వర్షం కురిస్తేనే పంటలు పండుతాయి, లేకుంటే లేదు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి వైఎస్సార్ పోలవరం ప్రాజెక్టుకు జీవం పోశారు. ఆయన బతికే ఉంటే పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ పాటికి నీళ్లు పారేవి. కానీ ఇప్పుడున్న పాలకులకు చిత్తశుద్ధి లేక దాని ఉసురు తీశారు. కాల్వల తవ్వకాలు అర్ధంతరంగా ఆగిపోయి కనిపిస్తున్నాయి. వైఎస్సార్ మన మధ్యనుంచి వెళ్లిపోయిన తరువాత పోలవరం ప్రాజెక్టును పట్టించుకునే వారే కరువయ్యారు. 

మెట్ట భూములను చూస్తుంటే చాలా బాధనిపించిందమ్మా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని గ్రామాల్లో కొనసాగింది. పాదయాత్రలో అడుగు కలిపిన రైతులందరూ పోలవరం పనులు పూర్తి కాకపోవడంపై విచారం వ్యక్తం చేయడంతో షర్మిల ఇలా స్పందించారు. ఉద్దండ జగన్నాథపురం గ్రామంలో నిర్వహించిన రచ్చబండలోనూ రైతులు పోలవరంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా షర్మిల ప్రసంగం ఆమె మాటల్లోనే... 

‘‘వైఎస్సార్ కంటే ముందు, ఆయన తరువాత చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు. అందరూ పోలవరం ప్రాజెక్టును ఓట్లు రాల్చే ప్రాజెక్టుగానే చూశారు తప్ప దాని నిర్మాణం చేపట్టాలని ఏ ఒక్కరూ అలోచన చేయలేదు. కానీ రాజన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రాజక్టుపై దృష్టి సారించారు. ధవళేశ్వరం బ్యారేజీ దాటి ఏటా సముద్రంలో కలుస్తున్న 3,000 టీఎంసీల నీటిలో కనీసం 300 టీఎంసీలనైనా వినియోగించుకోగలిగితే ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలను సస్యశ్యామలం చేయవచ్చనే గొప్ప సంకల్పంతో పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధిస్తాయన్నది ఆ మహానేత ఆశయం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 7.21 లక్షల ఎకరాలకు సాగు నీరు అందడంతో పాటు 540 గ్రామాల్లోని 25 లక్షల మందికి తాగు నీరు అందుతుంది. 960 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరిగి రాష్ట్రంలో విద్యుత్తు సమస్య కొంతవరకైనా తీరుతుంది. అందుకే అప్పటికి 62 సంవత్సరాలుగా నానుతున్న ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్సార్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర జల సంఘం డెరైక్టరేట్ నుంచి ప్రాజెక్టుకు కావల్సిన 20 క్లియరెన్సులను 2008 నాటికి సాధించారు. కీలకమైన టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ అనుమతులు కూడా 2009, ఫిబ్రవరిలో లభించాయి. 

నాన్న మన మధ్యనుంచి వెళ్లిపోయే నాటికి రూ.3,310 కోట్లు ఖర్చు చేసి 38 శాతం పనులు పూర్తిచేశారు. స్పిల్‌వే నిర్మాణం 15 శాతం, ఎర్త్‌డ్యాం నిర్మాణం ఐదు శాతం, ప్రధాన కాలువ నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయి. ఆ తరువాత నుంచి నేటివరకూ ప్రాజెక్టులో పురోగతి లేనేలేదు. మహానేత ప్రాజెక్టు నిర్మాణానికి సర్వశక్తులొడ్డి సాధించిన ఫలితాలన్నింటినీ ఈ చేతగాని పాలకులు నిర్వీర్యం చేస్తున్నారు. ప్రారంభంలో రూ.1,117 కోట్లతో అంచనాలు వేసిన హెడ్‌వర్క్ పనులు తాజాగా కిరణ్‌కుమార్‌రెడ్డి టెండర్లు పిలిచేనాటికి రూ.4,717 కోట్లకు చేరింది. తాజాగా వేసిన అంచనాల ప్రకారం రూ.7,332 కోట్లుగా చెప్తున్నారు’’ అని తెలిపారు. ఇక ప్రాజెక్టును ఎప్పటికి పూర్తిచేస్తారో ఎవరికీ తెలియడంలేదని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. 

185వ రోజు... 16 కిలో మీటర్లు...

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం 185వ రోజు తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శరభవరం గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడినుంచి చింతలూరు, శాంతి ఆశ్రమం, వెంకటనగరం, ఉద్దండ జగన్నాథపురం, కే కొత్తూరు గ్రామాల మీదుగా సాగింది. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మొత్తం 16 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,456.5 కి.మీ యాత్ర పూర్తయింది. తూర్పుగోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, జ్యోతుల నెహ్రూ, కొల్లి నిర్మలకుమారి, స్థానిక నాయకులు చెలమలశెట్టి సునీల్, విప్పర్తి వేణుగోపాల్, కొత్తపల్లి గీత, అనంతబాబు, చింత కృష్ణమూర్తి, జ్యోతుల నవీన్, రొంగలి లక్ష్మి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.

బాబుపై విచారణ జరపడం లేదేం?

ఐఎంజీ ఉదంతంలో బాబుపై విచారణ జరపడం లేదేం?
కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నందుకే కాదా?
కిరణ్, బాబులకు వైఎస్సార్‌సీపీ ప్రశ్నలు

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నందుకే వేల కోట్ల అవినీతి జరిగిన ఐఎంజీ భూ కేటాయింపులపై విచారణ జరగడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఈ కుంభకోణంపై ఆధారాలున్నాయని గతంలో చీఫ్ విప్‌గా ఉండగా చెప్పిన కిరణ్, ఇప్పుడు దానిపై విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించింది. అవిశ్వాసం సమయంలో తటస్థంగా ఉండటం ద్వారా ప్రభుత్వాన్ని కాపాడినందుకే కిరణ్ ఇలా కృతజ్ఞత చెల్లించుకుంటున్నారా అని ప్రశ్నించింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఎ.అమరనాథరెడ్డి, పి.రామకృష్ణారెడ్డి గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. కిరణ్, చంద్రబాబులకు ఈ సందర్భంగా వారు 20 ప్రశ్నలు సంధించారు...

1.టీడీపీతో కాంగ్రెస్ రాజకీయ ఫిక్సింగ్ చేసుకోకపోతే, ఐఎంజీ భూ కేటాయింపులపై విచారణ ఎందుకు జరపడం లేదు?

2.ఐఎంజీ భూ కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ జరపాలని గతంలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉండగా విలేకరుల సమావేశంలో, అసెంబ్లీలో డిమాండ్ చేసిన కిరణ్, ఇప్పుడు అధికారం చేతిలో ఉన్నా ఎందుకు విచారణ జరపడం లేదు? అవిశ్వాసం సమయంలో టీడీపీ తటస్థంగా ఉన్నందుకేనా?

3.ఐఎంజీ భూ కేటాయింపులపై సీబీఐ దర్యాప్తు జరగాలని 2012 అక్టోబర్ 9న సీఎం హోదాలో అద్దంకిలో అన్న మీరు దర్యాప్తుకు ఎందుకు ఆదేశించలేదు?

4.ఐఎంజీ భూ కేటాయింపులపై లండన్ కోర్టుకైనా వెళ్లి పోరాడతానంటూ ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి, ఇప్పుడు అధికారం చేతిలో ఉన్నా దర్యాప్తుకు ఎందుకు చొరవ చూపడం లేదు?

5.ఐఎంజీ భూ కేటాయింపుల్లో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని తెలిసిన మీరు, దానిపై దర్యాప్తు కోరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసినట్టు?

6.టీడీపీతో, కాంగ్రెస్ మిలాఖత్ రాజకీయాలు నడుపుతుండటం వాస్తవం కాదా? అందులో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పరస్పరం సహకరించుకున్న విషయం వాస్తవం కాదా?

7.అవిశ్వాస తీర్మానం సందర్భంగా టీడీపీ తటస్థం సాకుతో మద్దతివ్వకుంటే ఐఎంజీ భూ కేటాయింపులపై బాబుపై దర్యాప్తు జరుపుతామంటూ బ్లాక్‌మెయిల్ చేయడం వాస్తవం కాదా?

8.టీడీపీ, కాంగ్రెస్ రహస్య మిత్రులని ఇండియాటుడే ప్రచురించిన వార్త నిజం కాదా?

9.కాంగ్రెస్‌లోని ప్రత్యర్థులపై ఆగమేఘాలపై విచారణలకు ఆదేశిస్తున్న మీరు చంద్రబాబుపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?

10.2014లో జరిగే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి మాయకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరు ఢిల్లీ స్థాయిలో చొరవ చూపుతున్నారని రాష్ట్ర ప్రజానికం కోడై కూస్తోంది? ఇది నిజంం కాదా?

11.2004-09 మధ్య కేవలం 46 మంది ఎమ్మెల్యేలే ఉన్నా కూడా ఒకసారి వైఎస్ సర్కారుపై, మరోసారి అప్పటి స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిపై అవిశ్వాసం పెట్టిన టీడీపీ... ఇప్పడు దాదాపు 80 మంది ఎమ్మెల్యేలుండి, అన్ని విపక్ష పార్టీలూ అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చినా కూడా మీరు మాత్రం దానికి మద్దతివ్వకుండా విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడినట్టు?

12.దివంగత వైఎస్ హయాంలో కిరణ్‌ను స్పీకర్‌గా నియమిస్తే టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మరిప్పుడు అదే కిరణ్ సీఎంగా ఎలా అర్హుడో ఆ పార్టీయే సమాధానం చెప్పాలి.

13.అధికార కాంగ్రెస్‌తో రాజకీయ ఫిక్సింగ్ చేసుకోకపోతే, 2013 మార్చి 16న అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేసి, వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని స్పీకర్‌కు, ఈసీని టీడీపీ తరఫున ఎందుకు డిమాండ్ చేయలేదు? వారిపై స్పీకర్ నిర్ణయం తీసుకునే దాకా వేచి చూశారేం?

14.కాంగ్రెస్‌తో రాజకీయ ఫిక్సింగ్ చేసుకోకపోతే... పార్టీపరంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను ముందే జరపాలని టీడీపీ గానీ బాబు గానీ ఎందుకు డిమాండ్ చేయడం లేదు?

15.2005లో పార్టీపరంగా మున్సిపల్ ఎన్నికలు జరిగి వాటి కాలపరిమితి 2010తో ముగిసింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు 2006లో పార్టీ పరంగా జరిగి వాటి కాలపరిమితి 2011లో ముగిసింది. పార్టీ పరంగా అదే క్రమంలో ముందుగా మున్సిపల్, మండల, జిల్లా పరిషత్, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదు?

16.కిరణ్, ఆయన సోదరులు అవినీతికి పాల్పడుతున్నారని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని పాదయాత్రలో, మహానాడులో, మీడియా సమావేశాల్లో ఆరోపణలు చేసిన చంద్రబాబు... కిరణ్ సర్కారును ఎందుకు కాపాడుతున్నట్టు?

17. కిరణ్, ఆయన సోదరులు అవినీతికి పాల్పడుతుండటంపై ఇప్పటిదాకా బాబు గానీ, టీడీపీ నేతలు గానీ గవర్నర్‌కో, దర్యాప్తు సంస్థలకో ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు?

18. బాబును ‘నడక మిత్రుడు’ అని అవిశ్వాస తీర్మానం సందర్భంగా కిరణ్ తన ప్రసంగంలో సంబోధించినా బాబు, ఆయన పార్టీ నేతలు ఇప్పటివరకు దాన్ని ఎందుకు ఖండించలేదు?

19.కళంకిత మంత్రులను తొలగించాలంటూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన టీడీపీ... కిరణ్, ఆయన సోదరుల అవినీతి, అక్రమాలపై ఏ దర్యాప్తు సంస్థలకూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?

20.వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పత్రిక, టీవీ చానల్ ప్రారంభిస్తే నానాయాగీ చేస్తున్న టీడీపీ.. కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స టీవీ చానళ్లు ప్రారంభిస్తే వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఈ వ్యవహారాలపై ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు?

మన యాత్రికులను ఆదుకోండి

వారి ప్రాణాలను కాపాడాలని వినతి

సాక్షి, హైదరాబాద్: ఉత్తరాఖండ్‌కు వెళ్లి వరదల్లో చిక్కుకున్న రాష్ట్రవాసులను వెంటనే ఆదుకోవాలని, వారి ప్రాణాలను కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ డిమాండ్ చేశారు. ఆమె గురువారం ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ మేరకు రెండు పేజీల లేఖను రాశారు. ఆచూకీ తెలియని యాత్రికుల కోసం ప్రత్యేక బృందాలను పంపాలని కోరారు. ఇప్పటికే మృతి చెందిన వారి మృత దేహాలను రాష్ట్రానికి తెచ్చేందుకు ప్రభుత్వమే చొరవ చూపాలని, మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. విజయమ్మ ముఖ్యమంత్రికి రాసిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.

గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, 

చార్ ధామ్ యాత్రకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన తెలుగువారి గురించి మా పార్టీ తీవ్రమైన ఆందోళన చెందుతోంది. ఉత్తరాఖండ్‌లో సంభవించిన బీభత్సం వందలాది మంది ప్రాణాలను బలిగొందన్న వార్త ఎంతగానో కలచివేసింది. అందులో అనేక తెలుగు కుటుంబాలు ఉండటం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఈ జల విలయం దేశం నలుమూలల నుంచి ఉత్తర కాశీ యాత్రకు వచ్చే యాత్రికుల పాలిట పెను విషాదంగా మారటం విచారకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్తరకాశీ, కేదార్‌నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన దాదాపు 70 వేల మందికి పైగా యాత్రికులు ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపోవడంవల్ల ప్రాణాపాయ స్థితిలో చిక్కుకు పోయారు. వారిలో చాలామంది మన రాష్ట్రానికి చెందిన వారు కావడం ఆందోళనకరం.

సుమారు ఐదు వేల మంది తెలుగువారు వరద బీభత్సంలో చిక్కుకు పోయి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి. వారిలో కొందరు మరణించినట్లు కూడా సమాచారం అందుతోంది. మరోవైపు వందలాది మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. హిమాలయాల్లోని అడవుల్లో, దాదాపు ఐదు డిగ్రీల చలిలో, తిండీ తిప్పలు లేకుండా, కనీసం తాగేనీరు సైతం లేకుండా... మనవారు ప్రాణాలు అరచేత పట్టుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారికి తక్షణ సహాయం అందించాలి. వారి ప్రాణాలను కాపాడాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంతోను, ఉత్తరాఖండ్ ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరిపి త్వరితగతిన సహాయ చర్యలు చేపట్టి, క్షేమంగా వారిని వారి స్వస్థలాలకు చేర్చాలి. ఇది ప్రభుత్వ కనీస బాధ్యత.

ఉత్తరాఖండ్ వరద బీభత్సం వార్తలు వెలువడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావాలని మా పార్టీ తరపున విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉంటే... రాష్ట్రానికి చెందిన ఇన్ని వందలమంది యాత్రికుల కుటుంబాల్లో ఈరోజున ఇంతగా ఆందోళన ఉండేది కాదు. సహాయ చర్యల్లో జాప్యం కారణంగా ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. రాష్ట్రం నుంచి వెళ్లిన యాత్రికుల్లో ఎంతమంది ఈ వరదల్లో చిక్కుకు పోయారన్న సమాచారం కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సహాయ చర్యలను ముమ్మరం చేయాలి. వరదల్లో చిక్కుకున్న వందలాది మంది తెలుగువారి ప్రాణాలను కాపాడాలి.

వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని గుర్తించి సహాయం అందించడం కోసం... రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక అధికారుల బృందాన్ని పంపాలి.

బాధితులైన తెలుగు యాత్రికులకు అవసరమైన నాణ్యమైన వైద్య సదుపాయాలు ఉచితంగా అందించాలి.
మృతదేహాలను తీసుకు వచ్చేందుకు ప్రభుత్వమే చొరవ చూపాలి. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. 
మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసంగా పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలి.
ఇట్లు
వై.ఎస్.విజయమ్మ 

జూన్ 24, 28న వైఎస్ఆర్‌సీపీ సదస్సులు!

Written By news on Thursday, June 20, 2013 | 6/20/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సదస్సులు నిర్వహించనున్నారు. ఈనెల 24న చిలకలూరిపేటలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రాంతీయ సదస్సు జరుగుతుందని.. గుంటూరు, ప్రకాశం జిల్లాల వైఎస్ఆర్‌సీపీ నేతలు ఈ సదస్సులో పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు. ఈనెల 28న ఘాట్‌కేసర్‌లో వైఎస్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్‌సీపీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. 

Sharmila Conducts Rachabanda At Jagannadhapuram, EGDT

Sharmila's padayatra in Prathipadu constituency

YSRCP open questions to CM

తెలుగువారిని తీసుకురావడంలో సర్కార్ విఫలం

సౌదీలోని తెలుగువారిని రాష్ట్రానికి తీసుకురావడంలో కిరణ్ సర్కార్ విఫలమైందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గురువారం ఆరోపించారు. 10 రోజుల్లోగా దేశాన్ని వదిలి వెళ్లాలని సౌదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ఈ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని ఆయన పేర్కొన్నారు. f

Golla Babu Rao speech in Assembly

Popular Posts

Topics :