27 May 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Download Peddayana, Peddayana mp3 song & video (ysr& jagan songs)

Written By news on Saturday, June 2, 2012 | 6/02/2012

Sharmila By Election Campaign at Koyyalagudem,Polavaram

Y S Vijayamma Receives Public affection





YS Vijayamma By Election Campaign at T.Narasapuram,Polavaram


'రానున్నరోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేల రాక'

అనంతపురం : వైఎస్ఆర్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలోకి తరలి వస్తారని వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీలో చేరే అవకాశం ఉందని ఆయన శనివారమిక్కడ అన్నారు. కొన్ని చానళ్లు, పత్రికలు జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని వాటిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

అనంతపురంలో మాజీ కార్పొరేటర్ అబు సాలెహతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. వారందరికి వైఎస్ వివేకానందరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్‌, తోపుదుర్తి కవిత, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తదితరులు హాజరయ్యారు.

రాజన్న రాజ్యం వచ్చేలా తీర్పు ఇవ్వండి: షర్మిల

టి. నరసాపురం: ఉప ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయతకు ఓటు వేయాలని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ సోదరి షర్మిల కోరారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో తల్లి విజయమ్మతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాజన్న రాజ్యం వచ్చేలా తీర్పు ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల తీర్పు గురించి దేశమంతా ఎదురుచూస్తోందని అన్నారు. సొంతమామకు వెన్నుపోటు పొడిచిన వారికి ఓటు వేయొద్దన్నారు. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలరాజుకు ఓటు వేసి గెలిపించాలని షర్మిల కోరారు. రైతన్న కోసం బాలరాజు పదవిని వదులుకున్నారని, ఆయనకు ఓటు వేస్తే వైఎస్సార్ మీ గుండెల్లో ఇంకా బతికేవున్నారని నమ్మకం కలుగుతుందని అన్నారు. బాలరాజుకు ఓటేస్తే జగన్ నిర్దోషని అర్థమవుతుందన్నారు. బాలరాజుకు ఓటేస్తే జగన్ రాజన్న రాజ్యం తెస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఏ సందర్భంలోనూ జగన్ సాక్షులను ప్రభావితం చేయలేదని తెలిపారు. వైఎస్సార్ ఇచ్చిన అధికారంతో ఆయన కుటుంబాన్ని కుళ్లబొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.



చంద్రబాబుకు చేదు అనుభవం


వై.కోట: వైఎస్‌ఆర్‌ జిల్లా వై.కోటలో శనివారం రోడ్ షోలో పాల్గొన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురయింది. చంద్రబాబు రోడ్‌ షోలో 'జై జగన్‌' అంటూ జనం నినాదాలు చేశారు. జగన్‌ను విమర్శిస్తే ఊరుకోమని బాబుకు గ్రామస్తుల హెచ్చరిక జారీ చేశారు.

వైఎస్ బతికుంటే పోల'వరం' అయ్యేది: విజయమ్మ


టి. నరసాపురం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి వుంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే ఉభయగోదావరి జిల్లాలకు సమృద్దిగా నీరు లభించేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రైతుల పక్షాన నిలిచిన బాలరాజును చూస్తే గర్వంగా ఉందన్నారు. ఏ తప్పు చేయలేదని జగన్ ధైర్యంగా వున్నారన్నారు. కుట్రలన్నీ తీరిపోతాయని, ప్రజలు ధైర్యంగా ఉండాలని జగన్ తనతో చెప్పారని తెలిపారు. ప్రజాకోర్టులో న్యాయం జరుగుతుందని మీ ముందుకు వచ్చానని అన్నారు.

వైఎస్సార్ రెండు సార్లు కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారని విజయమ్మ గుర్తు చేశారు. ముఖ్యమంత్రికాగానే వైఎస్సార్ చాలా సంక్షేమ పథకాలు చేపట్టారనన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఒక్కొటిగా తీసేస్తోందని ఆరోపించారు. వైఎస్సార్ మరణంపై చాలా మందికి అనుమానాలున్నాయని అన్నారు. వైఎస్సార్ మరణంపై సీబీఐ హడావుడిగా దర్యాప్తు పూర్తి చేసిందన్నారు. చట్టాలను గౌరవించి జగన్ సీబీఐ సహకరించారని విజయమ్మ తెలిపారు.


కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రోడ్ షోలో భాగంగా శనివారం రాత్రి కొయ్యలగూడెం చేరుకున్న విజయమ్మకు అపూర్వ స్వాగతం లభించింది. మహానేత సతీమణిని చూసేందుకు తరలివచ్చిన జనంతో కొయ్యలగూడెం కిక్కిరిసింది. ఎటుచూసినా జనమే కనిపించారు. వీధులన్ని జనంతో నిండిపోయి జనసంద్రాన్ని తలపించాయి. విజయమ్మ వెంట ఆమె కుమార్తె షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పోలవరం అభ్యర్థి బాలరాజు, ఆళ్ల నాని తదితరులు ఉన్నారు.

ysrcp hunger strike 2nd day at darna chowk,Indira park

Written By news on Friday, June 1, 2012 | 6/01/2012


Special Edition on "DharmaYuddam" 1st June 2012

YS Sharmila Speech in By Election Campaign at Narsapur

YS Vijayamma Speech in By Election Campaign at Narsapur

విజయమ్మ ప్రచారానికి విద్యుత్ నిలిపివేత

నర్సాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైఎస్ విజయమ్మ ప్రచారంలో విద్యుత్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. విజయమ్మ ప్రచారానికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అధికారుల తీరుపై స్తానిక ప్రజలు మండిపడ్డారు. 

సీఎం కిరణ్‌కు ఈసీ నుంచి మరో నోటీసు

మే 11న తిరుపతిలో సీఎం కిరణ్ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. కాంగ్రెస్ కాకుండా ఇతరులకు ఓటేస్తే తిరుమల పవిత్రత దెబ్బతింటుందని సీఎం వ్యాఖ్యలు చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోగా వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సీఎంకు ఈసీ ఆదేశించింది.

నా బిడ్డ ఏనాడూ సీఎం క్యాంపు ఆఫీసుకు కూడా వెళ్లలేదే

సీబీఐ చెప్పమన్నట్లు చెప్పనందుకు ఈ రోజు అరెస్టు చేశారు..
జగన్ ఎంపీ.. ఆయన దర్యాప్తుపై ప్రభావం చూపుతారు అంటున్నారు
తొమ్మిది నెలలుగా జగన్ ఎంపీ కాదా? ఇంతకాలం లేనిది ఇప్పుడెందుకు?
పాయకరావుపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో విజయమ్మ ప్రచారం

విశాఖపట్నం-ద్రాక్షారామ, న్యూస్‌లైన్ ప్రతినిధులు:‘నా బిడ్డ జగన్‌బాబు ఏం తప్పు చేశాడు? రాజశేఖరరెడ్డి గారు సీఎంగా ఉన్నపుడు పక్కనే ఉన్న ఆయన క్యాంప్ ఆఫీసుకు కూడా జగన్ ఏరోజూ వెళ్లలేదే! కనీసం సెక్యూరిటీలో చూసిన వారున్నారా? జగన్ ఏనాడైనా మంత్రులతోనైనా.. ఆఫీసర్లతోనైనా మాట్లాడాడని చెప్పగలరా? మరెందుకు జగన్‌ను వేధిస్తున్నారని అడుగుతున్నా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కాంగ్రెస్, టీడీపీని నిలదీశారు. ఉప ఎన్నికల ప్రచారం రెండో రోజు గురువారం విజయమ్మ విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్లలో, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామలో భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. ఆమెతోపాటు ప్రచారంలో జగన్ సోదరి షర్మిల కూడా పాల్గొని ప్రసంగించారు. విజయమ్మ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ఇంతకాలం ఎవర్నయినా ప్రభావితం చేశాడా?

జగన్‌బాబుపై తొమ్మిది నెలలుగా సీబీఐ విచారణ జరుగుతున్నా.. వాళ్లు తప్పు చూపడానికి ఒక్క ఆధారమూ లేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు దగ్గరపడే సమయానికి.. కోర్టుకు హాజరుకావాలని సమన్లు.. దానికంటే ముందే సీబీఐ విచారణకు రమ్మని పిలవడం జరిగాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది.. ముందస్తు బెయిల్ ఇవ్వండి అని జగన్ బాబు కోర్టును కోరారు. మిమ్మల్ని అరెస్టు చేసే పరిస్థితులు లేవు.. బెయిల్ అవసరం లేదని జడ్జి కూడా చెప్పారట. దీంతో సీబీఐ విచారణకు హాజరై జగన్‌బాబు వారికి పూర్తి స్థాయిలో సహకరించాడు.. రోజూ 8 నుంచి 10 గంటలపాటు విచారణ చేసినా.. ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన సమాధానం చెప్పారు. అయితే సీబీఐ వాళ్లు చెప్పమన్నట్లు ఆయన చెప్పలేదని.... తమకు సహకరించడం లేదంటూ అరెస్టు చేశారు. ఆయన ఎంపీ.. బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారు.. బెయిల్ కూడా ఇవ్వొద్దు అంటున్నారు. తొమ్మిది నెలలుగా విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఆయన ఎంపీనే.. ఇంతకాలం తను ఎవర్నయినా ప్రభావితం చేశాడా? మీరే చెప్పండి(ప్రజల్ని ఉద్దేశించి) ఇంతకాలం జగన్ ఓదార్పు యాత్రచేసుకుంటూ మీ మధ్యనే ఉన్నాడు. ఇంతకాలంలో ఎవర్నయినా ఇన్‌ఫ్లూయన్స్ చేశాడా?(లేదు.. లేదు.. అంటూ జన స్పందన). జగన్‌బాబు ఏ తప్పు చేశాడని మీరంతా ఈ ప్రభుత్వాన్నీ, సీబీఐని అడగాల్సిన సమయమొచ్చింది.

ఆయన మరణంపై అన్నీ అనుమానాలే..

వైఎస్ మరణం వెనక చాలా అనుమానాలున్నాయి. సాధారణ ప్రజానీకానికి ఉన్న అనుమానాలే నాకూ ఉన్నాయి. ఆ దుర్ఘటన జరిగిన రోజే నేను జగన్‌బాబును అడిగా.. ‘ఎవరైనా నాన్నను ఏమైనా చేశారా? మనం కనుక్కోలేమా?’ అని అడిగా. ‘అమ్మా మనం అధికారంలో ఉంటే తప్ప మనం ఏ విషయమూ కనుక్కోలేం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా అనుకుంటే తప్ప ఏం జరిగిందో బయటకు రాదమ్మా..’ అని చెప్పాడు. ప్రమాదం జరిగిన తర్వాత ఇంటికొచ్చాక సూరీడు చెప్పాడు.. ‘సార్ కూడా అడిగారమ్మా.. మూడు నాలుగు నెలలుగా పక్కనపెట్టిన ఈ హెలికాప్టర్‌ను ఎందుకు తీసుకొచ్చారని అడిగారమ్మా’ అని చెప్పాడు. 

కారులో ప్రయాణించే వారికి సైతం తామెటుపోతున్నదీ తెలిసే సమాచార వ్యవస్థ అందుబాటులో ఉండగా, ఒక ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో ఎటు వెళ్లేదీ చూపించే మిషన్ పూర్తిగా చెడిపోయిందంటే ఎలా నమ్మాలి? బ్లాక్ బాక్సులో కేవలం ఏడు నిమిషాల పాటు మాత్రమే సంభాషణలున్నాయి. అవి కూడా పైలట్లు సంభాషించుకున్నవే. వైఎస్ సహా మిగిలిన వారు మాట్లాడిన సంభాషణలు ఏమైనట్టో అర్థం కావడంలేదు. కేవలం తమకు కావాల్సిన సంభాషణలు మాత్రమే ఉంచుకొని మిగిలిన సంభాషణలను తొలగించారన్న అనుమానాలు ఆనాడే కలిగాయి. మొదట ఈ ప్రమాదానికి క్యుములోనింబస్ మేఘాలే కారణమని చెప్పినప్పటికీ చివరకు ఆ సమయంలో అసలా మేఘాలే లేవని అంటున్నారు. కేవలం పైలట్ తప్పిదంవల్లే ప్రమాదం జరిగినట్టుగా తేల్చేశారు. పైగా రెండున్నర గంటల పాటు గాలిలో తిరిగేందుకు సరిపడా ఇంధనం హెలికాప్టర్‌లో ఉన్నప్పటికీ ఎందుకు ఆ ప్రయత్నం పైలట్లు చేయలేద నే దానిపై అనేక అనుమానాలున్నాయి.

నా బిడ్డను ఏం చేస్తారోనని భయంగా ఉంది

ఈ రోజు పెద్దలు చెప్తున్నారు.. వైఎస్ మరణంపై విచారణ బాగానే జరిగింది.. అందులో దోషంలేదు అంటున్నారు. ఇందులో దోషం ఉందని మీకు(ప్రజల్ని ఉద్దేశించి) అనిపించడం లేదా?(ఉందీ.. ఉందీ.. వైఎస్‌ను చంపేశారూ.. అంటూ పెద్ద ఎత్తున జన స్పందన). ఈ అనుమానాలేవీ ఇంతవరకు నివృత్తి చేయలేదు.. ఆ రోజు వైఎస్ మరణంపై జరిగినట్లే ఈ రోజు జగన్‌బాబుపైనా విచారణ జరుగుతోందని నాకు భయంగా ఉంది. ఆ రోజు ఆయన్ను పోగొట్టుకున్నాను.. ఈ రోజు మళ్లీ జగన్‌ను ఏం చేస్తున్నారు వీళ్లు.. ఎందుకు కటకటాల్లో పెట్టాల్సి వచ్చింది? నా బిడ్డ ఏం చేశాడని..? నిజంగా నాకు చాలా భయమేస్తోంది. అందుకే ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తుందోనన్న భయంతోనే కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఈ రోజు జగన్‌ను జైలుకు పంపే కుట్ర చేశారు. మీ ప్రేమాప్యాయతల ముందు వారి కుట్రలు, కుతంత్రాలు ఏమాత్రం నిలబడవని నిరూపించండి. రైతులు, రైతు కూలీలకు అండగా నిలబడి తమ పదవులను సైతం వదిలేసుకున్న వైఎస్ అభిమాన నేతల్ని గెలిపించండి.

అన్న బయట ఉంటే ఆ రెండు పార్టీలకూ వణుకే: షర్మిల

తన అన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయట ఉంటే అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీలకు వణుకు పుడుతుందని, అందువల్లనే ఆ రెండు పార్టీలు కుమ్మక్కై ఆయనను జైలుకు పంపాయని జగన్ సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. గురువారం పాయకరావుపేట, రామచంద్రపురం ఉప ఎన్నికల ప్రచారంలో తల్లి విజయమ్మతోపాటు ఆమె పాల్గొని ఉద్వేగంగా ప్రసంగించారు. కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన వైఎస్ కుటుంబాన్ని వేధింపులకు గురిచేసేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు టీడీపీతో కుమ్మక్కై సీబీఐని ఇష్టమొచ్చినట్టు వాడుకుంటున్నాయని విమర్శించారు. వైఎస్ ఏ తప్పూ చేయలేదని, ఆయన ఆలోచన అంతా పేద ప్రజలు, రైతుల కోసమేనని అన్నారు. 

‘ఏ ప్రాజెక్టు చేపడితే ఎంత మందికి ఉపాధి లభిస్తుంది.. ఏ పథకం ప్రవేశపెడితే ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది’ అనే ఆలోచనలతోనే ప్రాజెక్టులు చేపట్టారని చెప్పారు. రాజన్న పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగలేదని, రైతు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలన్న తలంపుతోనే జలయజ్ఞాన్ని చేపట్టారని గుర్తుచేశారు. చనిపోయిన వైఎస్ తిరిగొచ్చి నిజం చెప్పలేరన్న ధైర్యంతోనే ఆయనను అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు, దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ మరణం తరువాత ప్రజల ఆదరణ, ప్రేమలను చూరగొన్న జగన్‌ను సైతం ఏదో విధంగా అణగదొక్కాలన్న ఆలోచనతో తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటు మళ్లీ రాజన్న రాజ్యం రావడానికి నాందిపలకాలని కోరారు.

సీబీఐవి అర్థం లేని ఆరోపణలు

 ఇవన్నీ భవిష్యత్తులో జరుగుతాయని సీబీఐ చెబుతోంది
* ఇందుకు ఆధారాలుంటే చూపమనండి
* అన్నీ అనుమానాలు, ఊహాగానాలే
* వీటి ఆధారంగానే జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది
* సీబీఐ కోర్టు వీటినే పరిగణనలోకి తీసుకుంది
* మీ విచక్షణాధికారం ఆధారంగా వాటిని తొలగించండి
* హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్
* నేడు కూడా కొనసాగనున్న వాదనలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పార్లమెంట్ సభ్యుని హోదాలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారంటూ సీబీఐ అర్థం లేని ఆరోపణలు చేస్తోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ తెలిపారు. అంతేకాక సీబీఐవి కేవలం అనుమానాలు మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. ఎంపీ హోదా కారణంగా ఓ వ్యక్తికి రిమాండ్ విధించడం సరికాదని వివరించారు. భవిష్యత్తులో అలా జరగొచ్చు, ఇలా జరగొచ్చు అంటూ సీబీఐ చెబుతోందని, వీటి ఆధారంగానే జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసిందని, అరెస్ట్ మెమోలో సైతం ఇవే కారణాలను పేర్కొందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీని ఆధారంగా జగన్ అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించాలని ఆయన కోర్టును కోరారు. 

తనను సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద రిమాండ్‌కు పంపడాన్ని సవాలు చేస్తూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో జగన్‌ను తమ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ గురువారం విచారించారు. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. అంతకు ముందు ఈ పిటిషన్లను ఎప్పుడు విచారించాలనే విషయంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. జగన్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు ఇవ్వనున్నదని, ఒకవేళ సీబీఐ కోర్టు జగన్‌కు బెయిలిస్తే, హైకోర్టు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి, వారికి అనుకూలంగా తీర్పునిస్తే, జగన్‌కిచ్చిన బెయిల్ రద్దవుతుందని, దీని వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందువల్ల తమ పిటిషన్‌ను ముందు విచారించాలని రంజిత్‌కుమార్ పట్టుపట్టారు. 

ఇదే సమయంలో సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్ జోక్యం చేసుకుంటూ, జగన్‌ను 14 రోజుల వరకు మాత్రమే కస్టడీలో విచారించగలమని, ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయాయని, అలస్యం అయ్యే కొద్దీ రోజులు గడిచిపోతున్నాయని, అందువల్ల ముందు తమ పిటిషన్‌ను విచారించాలని కోరారు. దీంతో న్యాయమూర్తి ఇరుపక్షాలు ఏ ఏ తేదీల్లో పిటిషన్లు దాఖలు చేశారో పరిశీలించారు. ఇద్దరూ కూడా 29న పిటిషన్లు దాఖలు చేసినట్లు రికార్డుల్లో ఉండటంతో, ఇరుపక్షాల పిటిషన్లను ఒకేసారి విచారిస్తానని స్పష్టం చేసి, ముందు వాదనలు వినిపించే అవకాశం రంజిత్‌కుమార్‌కు కల్పించారు. అయితే సమయాభావం దృష్ట్యా ఇరుపక్షాలు కూడా చెరో అర్ధగంట వాదనలు చెప్పాలని సూచించారు. 

దాంతో రంజిత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ... సీబీఐ ఎటువంటి స్పష్టమైన ఆధారాలు చూపకుండా, కేవలం ఊహల ఆధారంగా ఆరోపణలు చేస్తోందని, ఆశ్చర్యకరంగా ఈ ఊహలను, ఆరోపణలను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుని, జగన్‌ను రిమాండ్‌కు పంపిందని ఆయన కోర్టుకు నివేదించారు. కింది కోర్టు వేటి ఆధారంగా సీబీఐ ఆరోపణలను పరిగణనలోకి తీసుకుందో అర్థం కావడం లేదని, సీబీఐ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సీబీఐ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొందని, విచక్షణాధికారాల ఆధారంగా ఈ ఉత్తర్వులను తొలగించాలని ఆయన న్యాయమూర్తిని కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని, అప్పటి నుంచి మొన్నటి వరకు జగన్‌ను విచారణకు పిలవడం గానీ, నోటీసులు జారీ చేయడం గానీ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 

ఎన్నికల సమయంలో తిరగనివ్వకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అన్యాయంగా జగన్‌ను అరెస్ట్ చేశారని తెలిపారు. మే 25న తమ ముందు హాజరు కావాలంటూ సీబీఐ జగన్‌కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, ముందస్తు బెయిల్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, తాము సమన్లు జారీ చేశాం కాబట్టి, జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేయబోదని చెప్పిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయినప్పటికీ సీబీఐ అధికారులు మే 27న జగన్‌ను అరెస్ట్ చేశారని, వాస్తవానికి సమన్లు జారీ చేసిన తరువాత కూడా జగన్‌ని అరెస్ట్ చేయాలంటే సీబీఐ అధికారులు కోర్టు అనుమతిని తీసుకోవాలని, కాని వారు అలా చేయలేదని, అందువల్ల జగన్ అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించాలని రంజిత్‌కుమార్ కోర్టును అభ్యర్థించారు. 

సీబీఐ అధికారులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని, రిమాండ్ రిపోర్ట్‌లో మొదటి చార్జిషీట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 25, 26, 27 తేదీల్లో జగన్‌ను సీబీఐ అధికారులు దాదాపు 30 గంటల పాటు విచారించారని, ఈ విచారణలో వారికి అనుకూలంగా సమాధానాలు చెప్పాలని ఒత్తిడి తెచ్చారని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమంటూ రంజిత్‌కుమార్ తన వాదనలు ముగించారు. సీబీఐ వాదనలు శుక్రవారం ఉదయం వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

చిరు రాజకీయ అజ్ఞాని: గోనె ప్రకాష్‌

ఆలమూరు/ఆత్రేయపురం/కొత్తపేట (తూర్పు గోదావరి), న్యూస్‌లైన్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందంటూ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజకీయ అజ్ఞానిగా మాట్లాడుతున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్‌రావు విమర్శించారు. ఎక్కడ ఏ పథకం సక్రమంగా అమలవుతుందో నిరూపించాలని డిమాండ్ చేశారు. రావులపాలెంలో, కొత్తపేటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

2009 ఎన్నికల్లో వైఎస్ కిలో బియ్యం రూ. రెండు పథకంలో 20 కేజీల నుంచి 30 కేజీలకు, ఉచిత విద్యుత్‌ను ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతానని వాగ్దానమిచ్చారన్నారు. వీటిని అమలు చేయకపోవడంతో పాటు వైఎస్ చేపట్టిన ఇతర పథకాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వాన్ని వెనకేసుకు వచ్చిన చిరంజీవి ఇక ప్రజల్లోకి రాకూడదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న 18 ఉప ఎన్నికల్లో ఐదు స్థానాలను గెలిపించి తీరతానని ప్రగల్భాలు పలికిన చిరంజీవి కోరి టికెట్లను ఇప్పించుకున్న తిరుపతి, రామచంద్రపురం, నరసాపురం నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించాలని సవాల్ విసిరారు. 

విజయమ్మ రాకతో వణుకు
వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రచారంతో అధికార కాంగ్రెస్‌కు, ప్రతిపక్ష తెలుగుదేశానికి వెన్నులో వణుకు పుడుతోందని గోనె, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న అన్ని స్థానాల్లో క్లీన్‌స్విప్ చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. 

నర్సాపురంలో విజయమ్మ ప్రచారం షెడ్యూల్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం (01-06-12) పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని ఈ క్రింది గ్రామాల్లో పర్యటిస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. ఆమె వెంట నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు ఉంటారని చెప్పారు.

ఉదయం 9 గంటలకు నర్సాపురం మండలం గొంది నుంచి రోడ్ షో ప్రారంభం
చిట్టవరం, సరిపల్లి, మల్లవరంలంక, మల్లవరం, కొప్పర్రు, శేరేపాలెం, కొత్తపాలెం, మొగల్తూరు, సీతారాంపురం నర్సాపురం స్టీమర్‌రోడ్డులో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ

2more MLA with JAGAN


విశాఖపట్నం, న్యూస్‌లైన్: అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి బాసటగా నిలిచారు. ఆ కుటుంబంపై కక్ష సాధింపులకు నిరసనగా ఇప్పటికే ఏలూరు, బొబ్బిలి ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, సుజయకృష్ణ రంగారావులు తమ సంఘీభావాన్ని తెలిపారు. వీరిలో రంగారావు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరతానని ప్రకటించారు. తాజాగా విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి, కాకినాడ టౌన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలు కూడా వీరికి జతకలిశారు. గురువారం పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిసి వారు తమ మద్దతు తెలియజేశారు. 

తన సతీమణి మహాలక్ష్మితో సహా వచ్చిన చంద్రశేఖరరెడ్డి.. కోటవురట్ల సభను ముగించుకుని వస్తున్న విజయమ్మను ఎస్.రాయవరం మండలం దార్లపూడి సమీపంలో కలుసుకుని తాము అండగా ఉంటామని చెప్పారు. అనంతరం విజయమ్మ కాన్వాయ్ పెద గుమ్ములూరు గ్రామంలోకి ప్రవేశించే సమయానికి పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు ఎదురేగి వచ్చారు. జయమణి కూడా వైఎస్సార్ కుటుంబానికి తన సంపూర్ణ మద్దతును తెలియజేశారు.

రెండ్రోజుల్లో నిర్ణయం: ద్వారంపూడి

‘వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. ఎమ్మెల్యే అయ్యాను. ఇన్నాళ్లూ ఆ కుటుంబంపై జరుగుతున్న కక్ష సాధింపులను ఓర్చుకున్నాం. జగన్‌ను జైలుకు పంపడంతో మనసుకు చాలా బాధ కలిగింది. కష్టాల్లో వున్న జగన్‌కు మద్దతు తెలపడం బాధ్యతగా భావిస్తున్నాను. వైఎస్ కుటుంబానికి అండగా వుండాలని సంఘీభావం తెలపడానికి వచ్చాం. రెండ్రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై వారి నిర్ణయాన్ని శిరసా వహిస్తా’

కక్ష సాధింపు చర్యలపై ఆవేదన చెందుతున్నా: జయమణి
‘వైఎస్ నాకు టికెటిచ్చారు. ఆయన వల్లే గెలిచాను. ఆయనంటే మాకెంతో గౌరవం, అభిమానం. వైఎస్ కుటుంబంపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలకు సాటి మహిళగా ఆవేదన చెందుతున్నాను. వైఎస్ సతీమణి విజయమ్మకు సంఘీభావం తెలపడానికి ఇక్కడకు వచ్చాను.’ 

మరింత మంది ఎమ్మెల్యేలు వస్తారు: రంగారావు

‘వైఎస్ జగన్ అరెస్టు కక్ష సాధింపు అన్న భావన చాలా మంది ఎమ్మెల్యేల్లో ఉంది. కొందరు బయటకు వచ్చారు. మరికొందరు బయట పడకుండా మనసులో ఆవేదన చెందుతున్నారు. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు జగన్‌కు సంఘీభావం తెలపడానికి సిద్ధంగా వున్నారు’.

YSRCP IT Wing 72hrs Hunger Strike against Jagan's Arrest

Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012

Huge Crowd for YS Vijayamma By Election Campaign

YS Sharmila By Election Campaign

Special Edition 'Prajala Manishi'

YS Vijayamma By Election Campaign at Draksharamam,Ramachandrapuram

'లగడపాటి, చంద్రబాబు అవినీతికి ఆద్యులు'

ప్రకాశం: లగడపాటి, చంద్రబాబు అవినీతికి ఆద్యులు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జేష్ఠ రమేష్‌బాబు ఆరోపించారు. అధికారం కోసం ఇద్దరూ మామను వెన్నుపోటు పొడిచి పదవిని లాక్కున్నవారేనని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను విమర్శించే అర్హత లగడపాటికి లేదు అని హెచ్చరించారు. లగడపాటి .. నీకు కోట్ల ఆస్తి ఎలా వచ్చిందో ప్రజలకు చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జేష్ఠ రమేష్‌బాబు డిమాండ్ చేశారు.

వైఎస్ మరణంపై అనేక అనుమానాలు: విజయమ్మ


ద్రాక్షారామం: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాద ఘటనపై అనేక అనుమానాలున్నాయని ద్రాక్షారామం ఎన్నికల ప్రచార సభలో విజయమ్మ అన్నారు. ప్రమాదం వెనుక ఉన్న అసలు విషయాలు బయటపెట్టాలని విజయమ్మ డిమాండ్ చేశారు. పాత హెలికాప్టర్‌ను ఎందుకు పర్యటనకు పెట్టారని వైఎస్‌కూడా అడిగారట అని ద్రాక్షారామం సభంలో విజయమ్మ తెలిపారు. ప్రమాద కారణాలు తెలిపే వాయిస్‌ రికార్డుల్లో కొంత భాగమే ఎందుకు ఉందని విజయమ్మ అనుమానం వ్యక్తం చేశారు. దీనివెనుక ఏం కుట్ర జరిగిందని రాష్ట్రప్రభుత్వం ఎందుకు అధికారులను నిలదీయలేదని విజయమ్మ ప్రశ్నించారు. ఆరోజు జరిగినట్టే ఇవాళ కూడా జగన్‌కు జరుగుతుందమోనని భయంగా ఉందని విజయమ్మ అన్నారు. తన కొడుకు జగన్ బాబు ఏం తప్పు చేశాడని జైల్లో వేశారని విజయమ్మ నిలదీశారు.

మాటపై నిలబడినందుకే జగన్ బాబు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారని... మాటకు కట్టుబడి ఉండాలని మహానేత వైఎస్‌, జగన్‌కు నేర్పించారని విజయమ్మ తెలిపారు. వారం రోజుల పాటు సీబీఐ మా ఇంట్లో సోదాలు జరిపిందని, గతంలో ఏ నాయకుడి ఇంట్లోనైనా ఇలా సోదాలు చేశారా అని విజయమ్మ విజయమ్మ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏనాడూ ఏ అధికారితోనూ జగన్‌ మాట్లాడేవాడు కాదని, తొమ్మిదినెలల విచారణ కాలంలో సీబీఐ ఒక్క ఆధారాన్నీ సంపాదించలేకపోయారని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. వైఎస్ విజయమ్మ రాకతో ద్రాక్షారామం జనసంద్రంగా మారింది. విజయమ్మ మాట్లాడినంత సేపు ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది.

వైఎస్ ఆత్మ ఘోషించేది మీ చర్యల వల్లే: అంబటి

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆత్మ ఘోషించేది కాంగ్రెస్ నాయకుల చర్యల వల్లనేనని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడే మాటలకు వై.ఎస్ ఆత్మ ఘోషిస్తోందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ‘విజయమ్మ మాటలకు వై.ఎస్ ఆత్మఘోషిస్తోందని ఈ నాయకులు అంటున్నారు. రాజశేఖరరెడ్డి మృతికి తట్టుకోలేక మరణించి 700 మంది కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తామని ఏఐసీసీ ప్రకటించింది. ప్రకటించిన సాయాన్ని ఎందుకు ఇవ్వలేక పోయారు? ఆ కుటుంబాల వారు అడగనిదే లక్ష రూపాయల డబ్బు ఇస్తానని ప్రకటించిన ఏఐసీసీ ఆ తరువాత దానిని అమలు చేయనందుకు వై.ఎస్ ఆత్మ ఘోషించదా! మరణించిన 700 మంది ఆత్మలు ఘోషించవా? వై.ఎస్ హత్యకు గురయ్యేలా తామే చేశామనే అపరాధభావనతో లక్ష రూపాయలు ఇవ్వలేదా?’ అని రాంబాబు నిలదీశారు. 

జగన్‌ను జైలుకు పంపి ఇక తమదే రాజ్యమనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామనీ సంతసించిన బొత్స, లగడపాటి వంటి నేతలకు రెండు రోజులగా విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిళ ప్రచారానికి లభిస్తున్న ప్రజాదరణ చూసి మతి పోయిందనీ అందుకే ఏం చేయాలో తెలియక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. శ్రీకాకుళం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల్లో విజయమ్మ, షర్మిళ పర్యటనకు లభిస్తున్న స్పందన, సభలు విజయవంతం అవుతున్న తీరు రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా మిగిలి పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ అరెస్టుతో భాధల్లో ఉన్న తమకు విజయమ్మకు ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ స్పందన ఊరటను కలిగిస్తోందని ఆయన అన్నారు. 

జగన్‌ను జైలుకు పంపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని జరిగిన కుట్రలను ప్రజలు తిప్పి కొట్టారని ఆయన అన్నారు. విజయమ్మ పర్యటలను కొన్ని మీడియా సంస్థలు తక్కువ చేసి చూపిస్తున్నాయనీ ఇది ప్రజాస్వామ్యంలో ధర్మం కాదని ఆయన అన్నారు. మీడియా, పత్రికలకు ఎవరి ఎజెండా వారికి ఉండవచ్చనీ అందులో త ప్పు కూడా లేదని అయితే వాస్తవిక సంఘటనలను అలాగే చూపించడ మనేది ప్రజాస్వామ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. 

రాంగోపాల్‌వర్మను జగన్ బెదిరించినట్లుగా లగడపాటి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదనీ ఆయన అబద్ధాలు చెబుతున్నాడని రాంబాబు అన్నారు. బఫూన్‌లాంటి రాజగోపాల్ కేవలం జగన్‌ను బద్నాం చేసేందుకే ఎన్నికల సమయంలో వర్మను బెదిరించినట్లు చెబుతున్నారని ఆయన అన్నారు. ‘జగన్, వర్మను బెదిరించి ఉంటే ఆనాడే ఎందుకు చెప్పలేదు, ఇపుడే ఎందుకు బయట పెడుతున్నారు, వర్మ ఎవరికీ భయపడే వ్యక్తి కాదే! సంచలనాలు చేసి సినిమాలు తీసే వ్యక్తి వర్మ గారు, అలాంటి వ్యక్తిని నిజంగా జగన్ బెదిరించి ఉంటే అపుడే ఫిర్యాదు చేసి ఉండొచ్చు. ఇంత కాలం మౌనంగా ఉండి ఇపుడు చెప్పడం అంటే ఇది లగడపాటి వంటి వారు చేస్తున్న కుట్రలో భాగస్వాములు కావాలనుకుంటున్నారేమో!’ అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లగడపాటి తన ఫాంహౌస్‌లో జరిగిన పేలుళ్లపై కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆపాదించాలని చూశారనీ అయితే సంఘటన జరిగిన కొన్ని గంటలల్లోనే అందుకు కారణం తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులని తేల్చారనీ రాంబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తున్న గుండె గల ఎమ్మెల్యేలు, మనసున్న వారూ జగన్‌కు మద్దతుగా నిలుస్తారనీ ఎంత మంది వస్తారనేది తాను చెప్పలేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇండియాలో ఇకపై రోమింగ్ ఛార్జిలు ఉండవని

న్యూఢిల్లీ: కొత్త టెలికాం విధానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2012 సంవత్సరపు జాతీయ టెలికాం విధానం ప్రకారం ఇండియాలో ఇకపై రోమింగ్ ఛార్జిలు ఉండవని కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. ఒక దేశం-ఒక లైసెన్స్ విధానం అంటూ కపిల్ సిబాల్ కొత్త భాష్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..లైసెన్స్ విధానాన్ని సరళీకృతం చేశామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రానికి సంబంధించిన సర్వీస్ ప్రోవైడర్ పరిధిలో ఉన్నా ప్రస్తుత మొబైల్ నంబర్ ను కొనసాగించేలా పూర్తి స్థాయిలో నంబర్ పొర్టబిలిటీని అమలు చేసే దిశగా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం ప్రయత్నాలు ప్రారంభించనుందని కపిల్ సిబాల్ తెలిపారు.

ysrcp hunger strike at darna chowk,Indira park




భన్వర్ లాల్ ను కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు

నెల్లూరు పార్లమెంటరి నియోజకవర్గానికి పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుబ్బరామిరెడ్డి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను వైఎస్ఆర్ సీపీ నేతలు గురువారం కలిశారు. భన్వర్ లాల్ ను కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు .. తిరుపతిలో కాంగ్రెస్ నేతలు ఓటర్లను బెదిరిస్తూ బ్లాక్‌ మెయిల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. 

కాంగ్రెస్ నేత వీహెచ్ మౌనదీక్ష హడావుడిని సుమోటాగా తీసుకుని చర్య తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల ద్వారా ఓటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈసీని కలిసిన వారిలో వైఎస్ఆర్ సీపీ నేతలు బాజిరెడ్డి, ఎడ్మకిష్టారెడ్డి, శివకుమార్ లు ఉన్నారు. 

MLA Dwarampudi, MLA Jayamani met YS Vijayamma

Ramachandrapuram public response on Vijayamma speech

Police over action - YS Vijayamma convoy checked

'మధ్యంతర బెయిల్ ఇవ్వండి'

ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం కుదరకపోతే.. మధ్యంతర బెయిల్ ను మంజూరు చేయాలని బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జూన్‌ 10 తేది సాయంత్రం 5 గంటల వరకు ప్రచారంలో పాల్గొంటానని, 11న తేదిన హాజరవుతానని కోర్టును వైఎస్ జగన్ అభ్యర్థించారు. ప్రచారం నిర్వహించిన తర్వాత.. ప్రతిరోజు స్థానిక పీఎస్‌లో రిపోర్టు చేస్తానని బెయిల్ పిటిషన్‌లో వైఎస్ జగన్ పేర్కోన్నారు. అయితే ప్రచారానికి జగన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది. పార్టీ అధ్యక్షుడు ప్రచారానికి వెళ్లకపోతే ఎలానంటూ కోర్టు సీబీఐ వాదనకు అభ్యంతరం తెలిపింది.

'2014 వరకు బెయిల్ ఇవ్వరా?'

2014 వరకు జగన్‌ ఎంపీగా కొనసాగుతారని.. సాక్షులపై ప్రభావం చూపుతారని అప్పటివరకు బెయిల్ ఇవ్వరా? అని జగన్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేశాక సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న ప్రశ్నే తలెత్తదని వారు అన్నారు. పార్లమెంటులో 115 మంది ఎంపీలు నేరాల్లో చిక్కుకున్నారని.. కేసు విచారణపై ప్రభావం చూపుతారని వారందర్ని జైల్లో పెట్టారా? అని కోర్టుకు నివేదించారు. కోర్టు పరిధిలో అంశం ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా ఎలా అరెస్టుచేస్తారు? న్యాయవాదులు సూటిగా ప్రశ్నించారు. 

రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో తనను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, బలప్రయోగం చూపుతారని అంటున్న సీబీఐ వాదనలు సరికావు జగన్ బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. తొమ్మిదినెలలుగా సీబీఐ ఈకేసులో దర్యాప్తుచేస్తోందని... తాను ఎక్కడా సాక్ష్యాలు తారుమారు చేసినట్టుగాని, సాక్షులను ప్రభావితం చేసినట్టుగాని సీబీఐ ఎక్కడా చెప్పలేదని.. కోర్టు ఎలాంటి షరతులు విధించినా అంగీకరిస్తామని.. బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో అభ్యర్థించారు. 

మార్కెట్లో హెచ్చుతగ్గుల ప్రకారం షేర్ల విలువ పెరుగుతూ, తగ్గుతూ ఉంటుందని, అంత మాత్రాన 10 రూపాయల షేరును 350 కి పెంచారని సీబీఐ చెప్తోందని, అలాంటప్పుడు ఎస్‌బీఐ షేరు విలువ 10 రూపాయల నుంచి 2600 రూపాయలకు పెరగలేదా అని, ఫేస్‌బుక్‌ షేరు విలువ ఒక డాలర్‌ నుంచి 38 డాలర్లకు పెరిగిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాంటి సందర్భాలలో తనది తప్పు ఎలా అవుతుందని, ఆర్థికపరమైన అంశాలు ఏమైనా ఉంటే.. అవి సీబీఐ పరిధిలోకి రావని, హవాలా కేసుల పరిశీలనకు ప్రత్యేక దర్యాప్తు సంస్థలు ఉన్నాయని కోర్టుకు వెల్లడించారు. 

రామచంద్రపురంలో విజయమ్మ రోడ్ షో!

గొల్లపాలెం: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ విజయమ్మ రోడ్‌షో ప్రారంభించారు. గొల్లపాలెంవద్ద వేలాది కార్యకర్తలు విజయమ్మకు స్వాగతం పలికారు. గొల్లపాలెం, ఆర్యవటం, హస్నాబాద్‌ మీదుగా ద్రాక్షారామం వరకు రోడ్‌షో జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. గురువారం సాయంత్రం ద్రాక్షారామంలో విజయమ్మ బహిరంగసభ ఏర్పాటు చేశారు. కాకినాడ సమీపంలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయమ్మ ప్రచార వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. 

విజయమ్మకు ఎమ్మెల్యే ద్వారంపూడి సంఘీభావం

కోటవురట్ల : కాకినాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిశారు. ద్వారంపూడి కోటవురట్లలో విజయమ్మను కలిసి తన సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బొబ్బిలి ఎమ్మల్యే సుజయకృష్ణ రంగారావు, పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి కూడా విజయమ్మను కలిశారు

ఎమ్మెల్యే పదవికి ఆళ్లనాని రాజీనామా

ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని, రేపటి నుంచి పూర్తిస్థాయిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆళ్లనాని స్పష్టం చేశారు. హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను ఆయన గురువారం కలిశారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ జగన్ చాలా ధైర్యంగా ఉన్నారని, ప్రజలను ధైర్యంగా ఉండమని చెప్పారన్నారు. వైఎస్ విజయమ్మ పర్యటన ప్రజలు, కార్యకర్తల్లో ధైర్యం పెంచుతుందని ఆళ్ల నాని తెలిపారు. 

బెయిల్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా పడింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ తో పాటు సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పై గురువారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు పూర్తికాగా, తీర్పు శుక్రవారం వెలువడనుంది.



కుట్రలో భాగమే జగన్ అరెస్ట్ : విజయమ్మ


కోటవురట్ల : జగన్‌ మోహనరెడ్డిని జనం నుంచి విడదీసి తీరాలన్న కాంగ్రెస్, టీడీపీల పన్నాగంలో భాగంగానే సీబీఐ అరెస్ట్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె విశాఖపట్నం జిల్లా కోటవురట్లలో ప్రజల నుద్దేశించి ప్రసంగించారు.

వైఎస్ మరణం ఎలా జరిగిందన్న విషయంలో కూడా ఇదే తరహా రాజకీయం జరిగిందని విజయమ్మ ఆరోపించారు. పెట్టుబడుల కేసులో తొమ్మిది నెలలుగా ఎటువంటి విచారణ జరపని సీబీఐ ఉప ఎన్నికల ముంచుకొచ్చిన తరుణంలో అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందని అమె సీబీఐని ప్రశ్నించారు.

జగన్‌కు కడదాకా తోడు

వైఎస్ సమాధి వద్ద ప్రతిజ్ఞ 
వైఎస్సార్ సీపీలో వివేకా చేరిక

పులివెందుల(వైఎస్‌ఆర్‌జిల్లా), న్యూస్‌లైన్: మహానేత పై విమర్శలు గుప్పించడమే కాక, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఇబ్బందులకు గురిచేస్తున్న పాలక ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టేందుకు వైఎస్ జగన్‌కు కడదాకా తోడుంటామని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కార్యకర్తలు, నాయకులతో ప్రతిజ్ఞ చేయిం చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన వివేకా తన అనుచరగణంతో ఉదయం ఇడుపులపాయకు తరలివచ్చారు. వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించి కార్యకర్తలతో కలసి వైఎస్ సమాధి వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రణమిల్లిన వివేకా కొద్దిసేపు ప్రార్థన చేశారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచి కష్టకాలంలో పాలుపంచుకుంటూ ముందుకు నడుస్తామని సమాధి సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. 


జగన్‌పై కక్షసాధింపు...: రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడేనని.. రాజకీయంగా ఎదుర్కోలేక పాలక, ప్రతిపక్షాలు కుట్రపన్ని రాజకీయ కారణాల తోనే యువనేత వైఎస్ జగన్‌రెడ్డిపై కక్ష సాధింపునకు పూనుకున్నాయని వివేకానందరెడ్డి దుయ్యబట్టారు. వైఎస్‌సమాధి వద్ద కార్యకర్తలనుద్దేశించి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని రాజన్న తన రెక్కల కష్టంతో అధికారంలోకి తెస్తే ఈ రోజు ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేబినెట్ మంత్రుల ఆమోదంతోనే భూ కేటాయింపులు జరిగినట్లు వెల్లడించారు. చంద్రబాబు అవినీతిపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై సీబీఐ అభియోగాలు మోపుతూ, జగన్‌పై నిందలు వేస్తున్నా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయకపోవటం దారుణమని దుయ్యబట్టారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని వివేకా ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం రాయచోటి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయానికి చేరుకున్న వివేకా నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రఘురామిరెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

జనం కోసం బతికేలా జగన్‌ను పెంచారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని జైలుకు పంపామని సంబరపడుతున్న కాంగ్రెస్, తెలుగుదేశం నేతలకు విజయమ్మ ప్రచారంతో గుండెల్లో దడ మొదలైందని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. జగన్ అక్రమ అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు సీబీఐ చేస్తున్న దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారన్నారని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌లాంటి కొడుకును కన్నందుకు విజయమ్మను చూసి రాష్ట్ర ప్రజలు గర్వపడుతున్నారని చెప్పారు. జనంకోసం బతికేలా జగన్‌ను విజయమ్మ పెంచారని కొనియాడారు. 

జగన్ అక్రమ అరెస్టుపై దివంగత సీఎం వైఎస్‌ఆర్ సతీమణిగా విజయమ్మ చేపట్టిన నిరసనపై పోలీసులు ప్రవర్తించిన తీరుకు రాష్ట్ర ప్రజలు కంటతడి పెట్టారని తెలిపారు. దీనిపై కూడా కాంగ్రెస్, టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఉప ఎన్నికల్లో విజయమ్మకు దీటుగా స్పందిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పడంపై గట్టు మాట్లాడుతూ... కడప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసి, 16 మంది మంత్రులు, 40 ఎమ్మెల్యేలు పోగై దీటుగా ప్రచారం చేస్తే ఏమైందో గుర్తుచేసుకోవాలన్నారు. కోవూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఓటుకు వెయ్యి రూపాయలు పంచినా, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై బైండోవర్ కేసులు బనాయించినా ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ది చెప్పారని గుర్తుచేశారు. అదే విధంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధినేత్రి ధీటుగా ప్రచారం చేస్తే ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని ఆయన ఎద్దేవా చేశారు. 

జగన్‌పై కేసు ప్రభుత్వానిదే
‘‘ఈ రోజు జగన్‌పై ఉన్న కేసు, ఆరోపణలు ప్రభుత్వంపై వచ్చినవే. 26 జీవోల వల్ల లబ్ధిపొందిన వారే జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. కనుక జీవోలకు సంబంధించి ప్రభుత్వమే జవాబు చెప్పాలి. జగన్‌పై వచ్చిన కేసు ప్రభుత్వం వల్లే కనుక నేరం జరిగిందా లేదా అనేది వారే తేల్చాలి’’ అని కాంగ్రెస్ నేతలకు గట్టు సూచించారు. ఎన్నికల్లో విజయమ్మ ప్రచారం చేస్తే జనం ఏవగించుకుంటారని పీసీసీ చీఫ్ బొత్స చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రేమ, అభిమానాలను డబ్బుతో కొనాలని చూసిన సోనియాను తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొ న్నారు. ‘‘తండ్రికి వెన్నుపోటు పొడిచి అక్రమంగా సీటు లాక్కుని... చెప్పులు వేయించి... ఆయన మరణానికి కారకుడైన భర్త చంద్రబాబును నిలదీయకుండా మిన్నకుండిపోయిన భువనేశ్వరే గాంధారి’’ అని గట్టు వ్యాఖ్యానించారు. తమ పార్టీలోనే గాంధారిని పెట్టుకొని టీడీపీ నేతలు ఇతరులను విమర్శించడం సరైంది కాదని హితవు పలికారు.

నా భర్త భద్రతకు ఆదేశాలివ్వండి

జగన్‌పై కేసులన్నీ రాజకీయ దురుద్దేశపూరితమే
అన్యాయంగా అరెస్టు చేయడంతో జైల్లో ఉన్నారు
గతంలో జైల్లో హింసాత్మక, హత్య ఘటనలు చోటుచేసుకున్న ఉదంతాలున్నాయి
ఈ నేపథ్యంలో ఎంపీ, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అయిన నా భర్త భద్రతపై మాకు భయంగా ఉంది
పోలీసులు, జైలు అధికారులు పట్టించుకోవడం లేదనే ఆందోళన మాలో ఉంది
కొన్ని రాజకీయ శక్తులు, కొందరు శత్రువులు తమకు అంది వచ్చే ప్రతి అవకాశాన్నీ పూర్తిగా వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నారు
అందుకే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నా
హైకోర్టుకు చెప్పిన భారతి.. నేడు విచారణ 


హైదరాబాద్, న్యూస్‌లైన్: జైల్లో ఉన్న తన భర్త వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, జైళ్ల శాఖ డీఐజీలను అందులో ప్రతివాదులుగా చేర్చారు. ‘‘జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ న భర్తను అన్యాయంగా అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది. సీబీఐ కస్టడీ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఆయన్ను రిమాండ్‌కు పంపింది. దాంతో ఆయన ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. జగన్ కడప పార్లమెంట్ స్థానం నుంచి 5.43 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు. 

అంతేగాక రాష్ట్రంలో ప్రబల రాజకీయ శక్తిగా ఎదుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆయన అధ్యక్షుడు. నా భర్తపై ఉన్న శత్రుభావంతో, కొందరు రాజకీయ నాయకుల మద్దతుతో కేసు నమోదు చేశారు. శత్రుత్వమున్న వ్యక్తులే హైకోర్టును ఆశ్రయించి, పిటిషన్లు వేశారు. అవన్నీ రాజకీయ దురుద్దేశపూరితమే. నా భర్తను, మా కుటుంబాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వేధింపులకు గురి చేసేందుకే కేసులు పెట్టారు. వాటిని మేం చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రస్తుతం జైల్లో ఉన్న నా భర్తకు తగిన భద్రత లేకుండా పోయింది. 

రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఆయన భద్రత గురించి జైలు అధికారులు పట్టించుకోవడం లేదనే భయాందోళన నాకుంది. జైలులో పలువురు విచారణ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న వారున్నారు. గతంలో జైలులో పలు హింసాత్మక, హత్య ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్లే జగన్ భద్రత గురించి మేం భయపడుతున్నాం. రాజకీయాల్లో నా భర్త ఎదుగుదలను చూడలేని కొన్ని రాజకీయ శక్తులు, నా భర్త పట్ల శత్రుభావం వ్యక్తం చేసే కొందరు వ్యక్తులు తమకు అందివచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. 

ఆయన్ను రాజకీయంగా నిరోధించేందుకు వారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశముందని మేం నమ్ముతున్నాం. నా భర్త ఎంపీ అయినా ఆయన భద్రత విషయంలో జైలు అధికారులు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. వారి చర్యలు నా భర్త భద్రతకు ప్రమాదం కలిగించేలా, రాజ్యాంగం ద్వారా ఆయనకు సంక్రమించిన హక్కులను కాలరాసేలా ఉన్నాయి. ఆయన భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాసినట్టే అవుతుంది. 

నా భర్తకేమైనా హాని జరిగితే నాతో పాటు, మా కుటుంబసభ్యుల జీవితాలపై తీవ్ర ప్రభావముంటుంది. జగన్ భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. అందుకు మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయిస్తున్నా’’ అని భారతి పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్ భద్రతకు తగిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం విచారించనున్నది.

జగన్ భద్రత గాలికి

పట్టనట్లు వ్యవహరిస్తున్న సీబీఐ
పట్టించుకోని ఐఎస్‌డబ్ల్యూ విభాగం
జైల్లో సెక్యూరిటీపై నిపుణుల సందేహాలు 


హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి భద్రత విషయంలో సీబీఐ, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని సీబీఐ పట్టనట్లు వ్యవహరిస్తోందని, బాధ్యత వహించాల్సిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) పట్టించుకోవట్లేదని గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సోమవారం దిల్‌కుశ గెస్ట్‌హౌస్ నుంచి చంచల్‌గూడ జైలు వరకు జగన్‌ను సీబీఐ తరలించిన తీరు, చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే భద్రతను పూర్తిగా గాలికొదిలేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. 


జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న పలువురు నిపుణులు జైల్లో జగన్ భద్రతపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్న నాయకుడు. ఈ కేటగిరీలో ఆయన భద్రత కోసం 58 మంది సిబ్బందితో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, మూడు ఎస్కార్ట్‌లు, ఇంటి వద్ద పికెట్ ఉంటాయి. సీబీఐ విచారణకు పిలవడంతో శుక్ర, శని, ఆదివారాల్లో వీటితోనే దిల్‌కుశ గెస్ట్‌హౌస్‌కు హాజరయ్యారు. జగన్‌ను అరెస్టు చేసినట్లు సీబీఐ ఆదివారం సాయంత్రం ప్రకటించడంతో అప్పటినుంచి మరుసటి రోజు ఉదయం వరకు దిల్‌కుశలోనే ఉన్నారు. 

ఆయన్ను సీబీఐ అధికారులు సోమవారం ఉదయం 10.30 గంటలకు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరుపరుస్తారన్నది ఆదివారం రాత్రి తెలిసిన విషయమే. ట్రాఫిక్ మళ్లింపులు తదితర అంశాలకు సంబంధించి పోలీసులు మీడియాకు జారీ చేసిన నోటిఫికేషన్స్‌లోనూ ఈ విషయం ఉంది. అంటే జగన్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళతారన్న విషయం ప్రతి ఒక్కరికీ పూర్తిగా తెలుస్తుంది. అయినప్పటికీ సీబీఐ అధికారులు జగన్‌ను సోమవారం ఉదయం బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కాకుండా సాధారణ వాహనంలోనే కోర్టుకు తరలించారు. 

ఆయనను కోర్టుకు తరలించే సందర్భంగా భద్రత విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను సీబీఐ గాలికొదిలేసింది. కోర్టు విచారణ పూర్తయిన తరవాత చంచల్‌గూడ జైలుకు కూడా జగన్‌ను సాధారణ వాహనంలోనే తరలించారు. నాంపల్లి కోర్టు కాంప్లెక్స్ నుంచి చంచల్‌గూడ వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం జనసమ్మర్ద ప్రాంతాల మీదుగా ఇలా తీసుకువెళ్లడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందన్నది నిపుణుల మాట. వీఐపీల భద్రతను సమీక్షించాల్సిన, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సైతం జగన్ విషయంలో పట్టనట్లు వ్యవహరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సీబీఐ జగన్‌ను అరెస్టు చేసినప్పటి నుంచి ఏ నిమిషం ఏమి జరుగుతోందనే విషయం వారి నుంచి తెలుసుకుని పరిస్థితులకు తగ్గట్టు సలహాలు, సూచనలు అందించడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఐఎస్‌డబ్ల్యూపై ఉంది. అయితే జగన్‌ను దిల్‌కుశ నుంచి సీబీఐ కోర్టుకు, అక్కడ నుంచి చంచల్‌గూడ జైలుకు ఎలా తరలిస్తున్నారు? ఏ వాహనం వాడుతున్నారు? ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? అనే విషయాలపై ఐఎస్‌డబ్ల్యూ దృష్టి పెట్టలేదని స్పష్టంగా తెలుస్తోంది. సాధారణంగా పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేస్తే... నిందితుడికి సంబంధించిన ప్రైవేట్ వాహనాన్ని వినియోగించడానికి అనుమతించరు. పోలీసులకు లేదా ప్రభుత్వానికి చెందిన వాహనంలోనే తరలిస్తుంటారు. 

జగన్ వినియోగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం వ్యక్తిగతమైంది కాదు. ఆయన భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విభాగమైన ఐఎస్‌డబ్ల్యూ కేటాయించిందే. అయినప్పటికీ ఆయన భద్రత విషయాన్ని సీబీఐ పట్టించుకోలేదు. మరోవైపు జగన్ హాజరవుతున్న నేపథ్యంలో సోమవారం నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు తీసుకున్న ప్రత్యేక భద్రతా ఏర్పాట్లంటూ ఏమీ లేవు. వారి దృష్టంతా వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులపైనే ఉండటంతో... వారిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

లోపలకు, బయటకు వచ్చే వారిని పూర్తి స్థాయిలో తనిఖీ చేయడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అనుమానితుల్ని గుర్తించడానికి చేసిన ఏర్పాట్లు లేవు. ఈ పరిణామాలను బేరీజు వేస్తున్న సెక్యూరిటీ రంగ నిపుణులు జైల్లో జగన్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ఖైదీ హోదాలో, స్పెషల్ బ్యారక్‌లో ఉన్నప్పటికీ... ప్రభుత్వం, సీబీఐ చూపిస్తున్న నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిక్కుల్లో ‘అధినాయకుడు’!

నిపుణుల కమిటీతో సినిమా పరిశీలన.. నేనూ చూస్తా: సీఈఓ
టీడీపీకి ప్రచారంగా లేదా ఇంకో పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలుంటే చర్యలు
ఫిర్యాదు రుజువైతే టీడీపీ అభ్యర్థుల వ్యయంలో సినిమా వ్యయం జమ

హైదరాబాద్, న్యూస్‌లైన్: బాలకృష్ణ హీరోగా నటించిన అధినాయకుడు సినిమా చిక్కుల్లో చిక్కుకుంది. ఆ సినిమాపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పందించారు. వైఎస్‌ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి ఎం.మారెప్ప, అధికార ప్రతినిధి రెహమాన్, వెంకట్‌ప్రసాద్‌లు సచివాలయంలో బుధవారం ఆయనను కలసి విజ్ఞాపన పత్రం అందజేశారు. నిపుణుల కమిటీతో సినిమాను పరిశీలింప చేస్తానని, స్వయంగా తాను కూడా సినిమా చూస్తానని ఈ సందర్భంగా భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు రుజువైతే ఆ సినిమా తీయడానికైన మొత్తం వ్యయాన్ని టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా జమ చేస్తామని తెలిపారు. 


అప్పుడు టీడీపీ అభ్యర్థులు ఎన్నికల వ్యయం సీలింగ్ అధిగమిస్తారని... తద్వారా అనర్హులవుతారని వివరించారు. సినిమాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలను కించపరిచే విధంగా బాలకృష్ణ డైలాగులున్నాయని, ఉప ఎన్నికల నేపథ్యంలోనే సినిమాను విడుదల చేయనున్నారంటూ కొన్ని డైలాగులను కూడా ఫిర్యాదుతో పాటు అందజేశారని భన్వర్‌లాల్ తెలిపారు. ఆ డైలాగులు టీడీపీ అభ్యర్థులకు ప్రచారం చేసేలా ఉన్నా లేదా మరో పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా వాటిని పెయిడ్ న్యూస్ తరహాలోనే పరిగణిస్తామని చెప్పారు. బాలకృష్ణ కూడా స్వయంగా ఉప ఎన్నికల ప్రచారానికి తాను రాను గానీ సినిమాను పంపిస్తానని పేర్కొన్నట్లు తెలిపారని, అదే వాస్తవమైతే అధినాయకుడు సినిమా తెలుగుదేశం అభ్యర్థుల ప్రచారంగానే భావించాల్సి వస్తుందని, సినిమా చూసిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటానని భన్వర్‌లాల్ తెలిపారు. ఉప ఎన్నికల జిల్లాల్లో ఇప్పటివరకు రూ.25 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే 1.61 లక్షల లీటర్ల అక్రమ మద్యంను స్వాధీనం చేసుకోవడంతో పాటు 10,683 కేసులు నమోదు చేయగా 3,617 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అన్ని పార్టీలకు చెందిన 29,619 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన చెప్పారు.

మనోభావాలను కించపరిచే డైలాగులు: మారెప్ప
వైఎస్‌ఆర్ అభిమానులు, ప్రజల మనోభావాలను కించపరిచేవిధంగా అధినాయకుడు సినిమాలో డైలాగులు, హావభావాలు ఉన్నాయని ఎన్నికల అధికారికి వివరించినట్లు మాజీమంత్రి మారెప్ప తెలిపారు. భన్వర్‌లాల్‌కు విజ్ఞాపన పత్రం అందించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అధినాయకుడు సినిమా హీరో తెలుగుదేశం పార్టీకి ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారని తెలిపారు. తాను ఉప ఎన్నికల ప్రచారానికి రాబోనని, తన సినిమాను ప్రచారానికి పంపుతున్నానని బాలకృష్ణ స్వయంగా ప్రకటించారని వివరించారు. రాజకీయ అంశాలతో నిర్మితమైన అధినాయకుడు సినిమాను ఉప ఎన్నికల సమయంలో విడుదల చేయకుండా నిలుపుదల చేయాలని కోరారు. ఆ సినిమా తెలుగుదేశం పార్టీకి ఉప ఎన్నికల్లో ఉపయోగపడేవిధంగా నిర్మించినందున నిర్మాణ ఖర్చు రూ.50 కోట్లను ఆ పార్టీ అభ్యర్థుల ఖర్చుగా పరిగణించాలని కోరారు. జూన్ ఒకటవ తేదీన ఆ సినిమాను విడుదల చేయడం ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని ఎన్నికల అధికారికి వివరించారు. 

జగన్‌కు మద్దతుగా కదిలిన జనం


న్యూస్‌లైన్‌నెట్‌వర్క్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలు బుధవారం పలు జిల్లాల్లో రిలే దీక్షలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడతో పాటు పలుప్రాంతాల్లో రిలేదీక్షలు చేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ ఆధ్వర్యంలో జగ్గంపేట సెంటర్‌లోని వైఎస్ విగ్రహానికి పాలు, నెయ్యి, జలాభిషేకాలు చేశారు. నల్లగొండలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో రిలే నిరాహార దీక్ష చేశారు. మిర్యాలగూడ మండలం అవంతీపురం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం గుట్టపైకి అర్ధనగ్నంగా మోకాళ్లపై మెట్లెక్కి, పూజలు చేశారు. దేవరకొండలో లగడపాటి దిష్టిబొమ్మకు అంతిమ సంస్కారాలు జరిపి, దహనం చేశారు.


చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి, తవణంపల్లె, బెరైడ్డిపల్లెలో రిలే దీక్షలు జరిగారుు. పశ్చిమగోదావరిజిల్లా భీమవరం, ఉండి నియోజకవర్గ కేంద్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో దీక్షలు జరిగాయి. ఏలూరులో మాజీ మేయర్ తాడిగడప రామారావుతో పాటు మాజీ కార్పొరేటర్లు పలువురు దీక్షలు చేపట్టారు. భీమవరం ప్రాంత సీనియర్ నేత రాయప్రోలు శ్రీనివాసమూర్తితో పాటు వందమంది కార్యకర్తలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సంఘీభావం ప్రకటించారు. కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడులో సోనియా, కిరణ్‌ల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. కరీంనగర్‌లో జరిగిన దీక్షల్లో పార్టీ జిల్లా కన్వీనర్ పుట్ట మధు, వేములవాడలో వైఎస్సార్‌సీపీ నేత ఆది శ్రీనివాస్ పాల్గ్గొన్నారు. సిరిసిల్లలో మౌనప్రదర్శన నిర్వహించారు. ముస్తాబాద్‌లో మహాత్ముని విగ్రహం వద్ద కళ్లకు గంతలతో నిరసన వ్యక్తం చేశారు. 

విజయనగరం, అనంతపురం జిల్లాల్లో రిలేదీక్షలు, దిష్టిబొమ్మల దహనాలు, శాంతిర్యాలీలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరం నిర్వహించారు. పులివెందులలోని పాతగంగిరెడ్డి ఆస్పత్రి ప్రాంగణంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 300మంది పైగా కార్మికుల, మహిళలు దీక్షల్లో పాల్గొన్నారు. మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వీరపునాయునిపల్లెలో రిలే దీక్షలు ప్రారంభిం చారు. బద్వేలులో వివిధ మతాలకు చెందిన ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు నిర్వహించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలుచోట్ల నిరాహార దీక్షలు నిర్వహించారు. విశాఖ జిల్లా పాడేరులోని అంబేద్కర్ సెంటర్‌లో రిలే దీక్షలు చేశారు.

బెంగళూరులో ధర్నా: ఉద్యాన నగరి బెంగళూరులో వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు కాంగ్రెస్, సీబీఐ వైఖరిని నిరసిస్తూ బుధవారం పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. టౌన్‌హాలు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగరం నలుమూల నుంచి భారీ సంఖ్యలో జగన్ అభిమానులు హాజరయ్యారు. కాంగ్రెస్, సీబీఐలకు వ్యతిరేకంగా వారు చేసిన నినాదాలు ఆ ప్రాంతమంతటా మార్మోగాయి. కర్ణాటక డాక్టర్ వైఎస్‌ఆర్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో చిన్న,పెద్ద తేడా లేకుండా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మొదలుకుని, రోజువారీ కూలీలు సైతం పాల్గొన్నారు.

విజయమ్మకు మేనకాగాంధీ సంఘీభావం

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు సోనియాగాంధీ తోడికోడలు, బీజేపీ ఎంపీ మేనకాగాంధీ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయమ్మకు మేనక ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు. సోనియా వల్ల తానూ ఇబ్బందులు పడ్డానన్న విషయాన్ని గుర్తు చేశారు.

‘సోనియా మీ కుటుంబాన్ని పెడుతున్న కష్టాలు నాకు తెలుసు. ఈ కష్టాలను నేనే కాదు, యావ త్ దేశం చూస్తోంది. మీరు నిబ్బరంగా ముందుకు కదలండి. ధైర్యంగా ఉండండి. మీ కుటుంబానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మీ ఆవేదనలో పాలు పంచుకుంటున్నాను. మీ ఇబ్బందులన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నాను’ అని మేనక అన్నారు. తొలుత విజయమ్మను పలకరించిన ఆమె తర్వాత కొద్దిసేపు కుమార్తె షర్మిలతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుని తన సంఘీభావాన్ని ప్రకటించారు.

పాలకుల ‘చేతి’లో పనిముట్టు!

‘‘పని చేతగాని వాడు తన చేతగాని తనా నికి పనిముట్లను నిందిస్తాడు. యువకు లుగా ఉద్యోగంలో చేరిన నాటి నుంచీ మాకిచ్చే శిక్షణలో నేర్పింది ఏమిటంటే... ఎవరో ఒకరిని బలిగొంటూవుండాలి. కాబట్టి బలిపశువుల కోసం వెతుకుతుం డటం మాకు నిత్యకృత్యం! మేం చేసే తప్పులను, ఘోరాలను, దురదృష్టకర ఘట్టాలను వాటితో సంబంధం లేని వాళ్ల పైకి, అమాయకులపైకి నెట్టడం. ఇదే మాకిచ్చే శిక్షణ సారాంశం’’.
-ఒక విశ్రాంత పోలీసు అధికారి ఉవాచ

‘నలచంపువు’లో ఓ శ్లోకం ఉంది. దానర్థం - ‘విశ్వాన్నంతా భరించే భూమికే పర్వతాల భారం తెలుస్తుంది’’!
అలాగే పన్నులనూ, తన్నులనూ భరించే ప్రజాబాహుళ్యానికే రాజ్యపాలనా విధానాల, ప్రభుత్వ అకృత్యాల, ఆగడాల భారం తెలు స్తుంది! పాలకుడికి ప్రతికూలంగా ఉండే వారెప్పుడూ సుఖంగా ఉండలేరట! అందుకే, భృత్యులు, వందిమాగధులు, డూడూ బస వన్నలు లేకుండా పాలకులూ, పాలకులు లేకుండా భృత్యులూ మనుగడ సాగించలేరు! అన్నట్టు కొలది రోజులనాడే (12-5-2012), దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి 1998 దాకా డెరైక్టర్‌గా పనిచేసి విశ్రాంత ఉన్నతాధికారిగా ఉన్న జోగీందర్‌సింగ్ తన అనుభవాలను నెమరువేసుకుంటూ సీబీఐ పనితీరుపై ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తిగొలిపే అంశాలు బయటపెట్టారు. ‘‘సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ప్రధానమంత్రి కార్యాలయం, లేదా హోంశాఖ చెప్పినట్టు చేయాలి. కానీ ఆ సలహాల్లో కూడా నిలకడ ఉండదు. సీబీఐ తరచు నిందలపాలవడానికి ఇదో కారణం. సీబీఐపై అనేకానేక ఆరోపణలు వెల్లువెత్తు తున్న దృష్ట్యా ఆ సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి విధిగా ఉండాలి...’’ అన్నది ఆ ఇంటర్వ్యూ సారాంశం.


జోగీందర్‌సింగ్ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ప్రధాన సంచాలకుడుగా పనిచేసి ఉన్నందున, ఆయన అభిప్రాయాల్ని తేలిగ్గా ఎవరూ కొట్టివేయడానికి లేదు. ఎందుకంటే, ఆయన చేసిన ఫిర్యాదుల్లో ఎక్కువ పాళ్లు స్వానుభవం నుంచి రూపుదిద్దుకున్నవే. నిజానికి అత్యంత శక్తిసామర్థ్యాలు గలవారే ఈ సంస్థలోకి రిక్రూట్ అవుతుంటారు. కానీ ఈ సంస్థ కేంద్ర విజిలెన్స్ కమిషన్ లాగా, కేంద్ర ఎన్నికల సంఘం లాగా స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ కాదు. స్వతంత్రంగా దర్యాప్తు చేసి నిర్భయంగా తన విచారణ ఫలితాల్ని వెల్లడించగల స్వేచ్ఛ ఉన్న సంస్థ కూడా కాదు. అందుకే అనేక సందర్భాల్లో శక్తియుక్తులు, విచక్షణాజ్ఞానం గల ఉన్నతాధికారులు ఉండి కూడా ప్రయోజనం ఉండటం లేదు. 

కేంద్ర పాలనా పగ్గాలు ఏ రాజకీయపక్షం లేదా ఏ సంకీర్ణ ప్రభుత్వం చేతుల్లో ఉంటాయో, ఆ రాజకీయపక్షం స్వార్థ ప్రయోజనాలను కాపాడే సంస్థగా సీబీఐ పావు కావలసివస్తోంది. మొన్నటి బీజేపీ-ఎన్‌డీఏ సంకీర్ణ ప్రభుత్వం గానీ, నేటి కాంగ్రెస్-యూపీఏ సంకీర్ణ సర్కార్ గానీ ఇందుకు మినహాయింపు కాదు! ఉభయపక్షాలూ ఆ సంస్థను రాజకీయ స్వప్రయోజనాల కోసమే కాక, ప్రత్యర్థులను పట్టిపల్లార్చే నేర మనస్తత్వంతో ప్రతిపక్ష నాయకుల విజయావ కాశాల్ని దెబ్బతీయడం కోసం కూడా వాడుకున్నాయి. 
అది 1998. ఢిల్లీలో జోగీందర్‌సింగ్‌ను కలుసుకుని పది నిమిషాలు ముచ్చ టించే అవకాశం నాకు కలిగింది. కేంద్రపాలకులు సీబీఐని వాడుకునే తీరుపై కొంత చర్చ జరిగింది. అప్పటికి కొద్ది మాసాల ముందు ఆయన రిటైర్ అయ్యారు. అదే సందర్భంలో బీజేపీ హయాంలో ‘పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాదదాడి’ గురించిన పూర్వాపరాల ప్రస్తావన కూడా వచ్చింది.

అది వేరే గాథ అనుకోండి! బీజేపీ హయాంలో అదొక సిగ్గుచేటైన సంఘటన. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో తలెత్తిన ‘జైన్-హవాలా’ కేసులో సీబీఐ విచారణ తీరును పసికట్టిన సుప్రీంకోర్టు, సీబీఐ కేంద్ర పాల కులకు కాకుండా తనకు బాధ్యత వహించాలని ఆదేశించవలసి వచ్చింది. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని నిలబెట్టడం కోసమే ఆనాడు సుప్రీంకోర్టు ఆ విధంగా ఆదే శించిందన్నది సుస్పష్టం. రాజ్యాంగం ప్రసాదించిన ‘న్యాయస్థానాల స్వతంత్ర ప్రతిపత్తి’ని దెబ్బతీసే విధంగా పాలనావ్యవస్థ రాజ్యాంగ పరిధుల్ని అతిక్రమిం చి తరచూ జోక్యం చేసుకోడానికి పాల్పడిన ఘట్టాలు కోకొల్లలుగా ఉన్నాయి. 

1975 నాటి ఎమర్జెన్సీ పాలనతో ప్రారంభమైన ఈ ‘చీకటి తప్పు’ల పర్వం ఏదో ఒక రూపంలో ఈ రోజుకీ కొనసాగుతూనే ఉంది. దేశ సంపదను దేశీయ, విదేశీ బడా గుత్తవర్గాలు, బహుళజాతి సంస్థలూ కలిసికట్టుగా దోచుకుపోతుంటే సీబీఐని రంగంలోకి దింపి పాలకపక్షాలు ఎందుకు దేశ ఆర్థికవ్యవస్థను సంరక్షిం చుకోవడం లేదు? ఓట్ల-సీట్ల కొనుగోళ్ల కోసమో, లేదా పార్లమెంటులోనో, శాసనసభల్లోనో ఎదురయ్యే ఏ అవిశ్వాస తీర్మాన భారాన్ని దించుకోడానికో పాలక పక్షాలు సీబీఐ, ఏసీబీ, సిట్ వంటి విచారణ సంస్థలను రంగంలోకి దింపుతున్నాయన్నది దాచేస్తే దాగని సత్యం. అభియోగాలను, విచారణక్రమా న్ని తమ ప్రయోజనాలకు అనుగుణంగా తిప్పుకోడానికి పాలక వర్గాలు ప్రయ త్నిస్తున్నందుననే అనేక ఘట్టాలలో సీబీఐ విచారణ సంస్థ పరువు బజారున పడవలసి వస్తోంది.


ఈ మాట నిజం కాకపోతే - సీబీఐకి పన్నెండేళ్ల క్రితమే అప్పగించిన బోఫోర్స్ శతఘు్నల కొనుగోలు కుంభకోణం ఈ క్షణం దాకా ఒక కొలిక్కి రాకుం డా ఉండేది కాదు. ఈ కుంభకోణంలో సుమారు రూ.67 కోట్లు లంచంగా పుచ్చు కున్నది మన దేశంలో తిష్టవేసిన ఇటలీ వ్యాపారి అట్టావియో కత్రోచీ అని నాటి స్వీడన్ పోలీసు శాఖ అధిపతి స్టెన్ లిండ్‌స్ట్రామ్ తేల్చిచెప్పాడు. రాజీవ్ కుటుం బానికి సన్నిహితుడే అయినా, ఆ ముడుపులు రాజీవ్‌కు ముట్టకుండా కత్రోచీకి ముట్టాయని పాత్రికేయురాలు చిత్రా సుబ్రహ్మణ్యానికి లిండ్‌స్ట్రామ్ వెల్లడిం చడం అందరికీ తెలిసిందే! కాని కత్రోచీని అరెస్టు చేసి, విచారించకపోగా, అర్ధాంతరంగా అర్ధరాత్రిపూట ఢిల్లీ నుంచి విమానంలో దేశ సరిహద్దుల్ని దాటిం చడం దేశ ప్రజలు ఇంకా మరవలేదు. సీబీఐ నేరగాళ్లను వెంటాడే క్రమంలో విదేశీ ప్రభుత్వాలకు పంపించే ‘లెటర్ రొగేటరీ’ పత్రాలన్నీ నాలుక గీసుకోడా నికి కూడా పనికిరాకుండా పోవడానికి కారణం - ప్రతిఫలాపేక్ష (క్విడ్ ప్రో కో) కొద్దీ రాజకీయ లబ్ధి కోసం పాలక పక్షాలు విచారణ సంస్థల చేతులూ, కాళ్లూ ఆడకుండా చేయడమే! 

అంతేగాదు, సీబీఐ ప్రతిపత్తిని మసకబార్చడంలో యూపీఏ సంకీర్ణ ప్రభు త్వం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రుల విషయంలో అనుసరించిన పద్ధతులు ఎంత ఏహ్యమైనవో ఒకటి రెండు ఉదాహరణలు కనువిప్పు కలిగిస్తాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నచోట కేంద్రప్రభుత్వం పార్లమెంటులో తమ సంఖ్యా బలానికి కలిగే ఇబ్బందిని బట్టి ఆయా ముఖ్యమంత్రులను లొంగదీసుకోడానికి ప్రయ త్నించడం ఇటీవల ఒక ఆనవాయితీగా మారింది. ఇందుకోసం సీబీఐని ధారా ళంగా వినియోగించుకోవడమూ జరుగుతూవస్తోంది. ఇందుకు తొలి ఉదా హరణ - పీవీ నరసింహారావు మంత్రివర్గం విశ్వాస తీర్మానం పార్లమెంటు నుంచి పొందవలసి వచ్చినప్పుడు జార్ఖండ్ ముక్తిమోర్చా లాంటి ప్రతిపక్ష సభ్యుల్ని ‘క్విడ్ ప్రో కో’ (లాభ లబ్ధి సూత్రం)గా సంత పశువుల్లా కొనుగోలు చేయడం! అదే పద్ధతిని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయంసింగ్‌ను యూపీలో లొంగదీసుకోవడానికి 2005లో అతని కుటుంబానికి ఉండవలసిన దానికన్నా ‘ఎక్కువ విలువైన ఆస్తులున్నా’యన్న అభియోగాన్ని మోపి కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.

కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం 2007-2008లో భారతదేశ రక్షణ ప్రయోజనాలకు విరుద్ధమైన అణుశక్తి వినియోగపు ఒప్పం దాన్ని అమెరికాతో కుదుర్చుకున్న సందర్భంగా పార్లమెంటు నుంచి ఆమోద ముద్ర పొందవలసివచ్చింది. అప్పుడు వామపక్షాలు సహా అందుకు అభ్యం తరం తెలపడంతో పరువు కోసం సమాజ్‌వాదీ పార్టీకి ఉన్న 21 మంది పార్ల మెంటు సభ్యుల ఓట్లు కాంగ్రెస్‌కు అవసరమయ్యాయి. ఇందుకు ముదరాగా ములాయం కుటుంబంపై ‘అసాధారణ ఆస్తుల’కు సంబంధించి పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోడానికి సీబీఐకి కాంగ్రెస్ ఆదేశాలిచ్చింది. ములాయం కుటుంబ ఆస్తులపై అసలు ప్రజావ్యాజ్యం పిటిషన్ తొలిసారిగా వేసినవాడు విశ్వనాథ చతుర్వేది. 

తన అధికార ‘అవసరాల’ కోసం వ్యాజ్యాన్ని ఉపసంహ రించుకోవాలని తన వద్దకు ఇద్దరు సీనియర్ మంత్రులను కాంగ్రెస్ పంపించిం దని చతుర్వేది ప్రకటించడం బహిరంగ రహస్యమే! కానీ తీరా కాంగ్రెస్ ములాయంను లోబరచుకోడానికి వేసిన ఎత్తుగడలో భాగంగా చతుర్వేది పిటిషన్‌ను ముందు వాడుకుంది! ఈ బాగోతంలో నిన్నటి సొలిసిటర్ జనరల్, నేటి భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ వాహనవతి కూడా పాలు పంచుకోవడం పాలనావ్యవస్థ దిగజారుడు తనానికి నిదర్శనం! 

ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలపైన 2008లో సీబీఐ ములాయం కుటుంబానికి ఊరట కల్పించి ఉండకపోతే, ములాయంసింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ ఈ రోజున యూపీ ముఖ్యమంత్రి కాగలిగి ఉండేవాడే కాదు! బహుశా అందుకనే సుప్రీంకోర్టు ప్రసిద్ధ సీనియర్ న్యాయవాది అయిన కేటీఎస్ తులసి ‘ఈ పని చేయడం ద్వారా సీబీఐ తన సొంత ప్రతిష్టకే చెరపరాని చేటు తెచ్చుకుంది’ అని వ్యాఖ్యానించవలసి వచ్చింది! అంతేగాదు, ‘ఒక ఉన్నత దర్యాప్తు సంస్థ ఒక పార్టీ కుడికి జరగాలో, ఎడమకు జరగాలో నిర్ణయించజా లదు’ అని వ్యాఖ్యానించాడు. 

అంతేగాదు, చివరికి సీబీఐ తన అభియోగాన్ని సుప్రీంకోర్టు నుంచి ఉపసంహరించుకునే సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య అటు ప్రభుత్వానికీ, ఇటు సీబీఐకీ తలవంపులు తెచ్చేదిగా ఉంది. ‘‘కేంద్రం ఆదేశాల మీదనే సీబీఐ ఇలా ప్రవర్తిస్తోంది. ఈ ప్రవర్తన చాలా అసాధారణం, అత్యంత ఆశ్చర్యకరం’’ అని సుప్రీం కోర్టు అన్నది. అలాగే నిన్నగాక మొన్న కరుణానిధి కూతురు కనిమొళి, డీఎంకే నాయకుడు మాజీ మంత్రి రాజా ‘2జీ’ కేసుల నుంచి బెయి ల్‌పై ఎలా విడుదలయ్యారు? ‘క్విడ్ ప్రో కో’ వల్లనే? ఎలా? జూలైలో రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్-యూపీఏ అభ్యర్థికి డీఎంకే సభ్యుల ఓట్లు కావాలి! అందుకే వారి విడుదలకు ముందు కరుణానిధితో విందుగుడుపులు పూర్తయ్యాయి!

కేంద్ర ప్రభుత్వం తాజా లెక్కల ప్రకారం 2012, మార్చిలోగా గత మూడేళ్ల కాలంలో సీబీఐ రిజిస్టర్ చేసిన అవినీతి కేసులు 1,450. కాని వీటిలో ఎన్ని ‘క్విడ్ ప్రో కో’ సంతానమో, ఎన్ని నిజమైనవో, ఎన్నింటికి శిక్షలు పడ్డాయో మాత్రం వివరణ లేదు! ‘దొరికితే పట్టుకు న్నామ’న్నట్టుగా 2జీ స్కామును బయట పెట్టింది పత్రికలూ, కాగ్ మాత్రమే. ఆ తర్వాతగాని సీబీఐ రంగంలోకి దిగలేదు! అలాగే తరచుగా సీబీఐ కోర్టులు కూడా సీబీఐ పెట్టే అభియోగాల సామంజ స్యాన్ని గుచ్చిగుచ్చి అడగడానికి కారణం కూడా ప్రభుత్వాల ఆదేశాలకు సీబీఐ లోబడి ఉంటున్నందువల్లనే! కనుకనే బోఫోర్స్ దళారీలను సీబీఐ ఎంత పట్టుకోగలిగిందో, 1 లక్షా 70 వేల కోట్ల రూపాయల 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని కూడా అంతే పట్టుకుని ప్రభుత్వ బొక్కసానికి చేరుస్తుందని మనం నమ్మాలి! ఇక తాజా ఉదాహరణ ఆరుషీ కేసు. ఈ కేసు నడుస్తున్న తీరును కనిపెట్టిన సుప్రీంకోర్టు, కింది మేజిస్ట్రేట్ కోర్టును, సీబీఐ కోర్టునూ అనేక ప్రశ్నలు వేయాల్సి వచ్చింది! రాష్ట్ర హైకోర్టులోనూ ‘సాక్షి’ కేసుల్లో ఇలాంటి ప్రశ్నలనే సీబీఐ కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన వలసివస్తోంది. బెయిళ్ల కోసం నిందితులు పెట్టుకున్న దరఖాస్తుల విషయంలోనూ, ‘సాక్షి’ ఉద్యోగులకు సంబంధించిన సంస్థ నిర్వహణ ఖర్చుల తాలూకు ఖాతాలను స్తంభింపచేసిన విషయంలోనూ సీబీఐ అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవలసివచ్చింది.

ఈ దేశంలో 80 కోట్ల మంది ప్రజలు రోజుకి కేవలం తల ఒక్కింటికి 20 రూపాయల మీద బతుకులీడుస్తూ, మరో 10 శాతం మంది కటిక దారిద్య్రానికి కొంచం పైన అంతంత మాత్రంగా జీవితాలు గడుపుతున్నప్పుడు, జీవచ్ఛవా లుగా ఈసురోమంటూ ఉన్న ఈ ప్రజాబాహుళ్యంతో ఎలాంటి సౌభాగ్యవం తమైన భారతదేశాన్ని నిర్మించాలని దేశ పాలకులు, విధాన నిర్ణేతలూ అనుకుంటున్నారో... తబిశీల్లు తీసి సీబీఐ ప్రజలకు నివేదిస్తే ప్రజల దీవెనలకు ఆ సంస్థ అధికారులు అర్హులవుతారు. 100 మందికి పైగా పార్లమెంటు సభ్యులు ఎలా, ఏ ముదనష్టం ఆధారంగా, ఏ కాయకష్టం ఆధారంగా గత 60 ఏళ్లలో మహా కోటీశ్వరులయ్యారో ఏనాడైనా సీబీఐ మెడలు చాచి ఆరాలు తీసిందా? ప్రజల బొక్కసానికి జమపడవలసిన వేల కోట్ల రూపాయల సొమ్ములో ఎంత జమపడుతుందో ఆరా తీశారా? ఈ దేశంలో 389 కంపెనీలు ప్రభుత్వ బ్యాం కుల నుంచి రుణాలు తీసుకుని మొండి బకాయిలుగా తిరిగిరాని సొమ్ముగా లెక్క తేలిన 2 లక్షల కోట్ల రూపాయలను అధికారాన్ని ఉపయోగించి రాబట్టగలి గారా? రక్షణ రంగంలో 2000 సంవత్సరం నుంచి యుద్ధ సామగ్రి, పరికరాల కొనుగోళ్ల పేరిట సాగుతూ వచ్చిన వేల కోట్ల రూపాయల దోపిడీని ఎందుకు అరికట్టలేకపోయారు? సైనికుల శవపేటికల పేరిట కోట్లు కాజేసిన రాజకీయ రాబందులను ఎంత మందిని కొరత వేశారో సీబీఐ చెప్పగలదా? బ్యాంకుల నుంచి బడా పారిశ్రామికవేత్తలు తీసుకుని, తిరిగి చెల్లించని బకాయిలు 2010లో రూ.13,235 కోట్లు కాగా, అవి 2011 నాటికి సుమారు రూ.20,000 కోట్లకు ఎగబాకడానికి కారకులెవరో నిగ్గు తేల్చడానికి ఏనాడైనా కేంద్ర పాలకులు సీబీఐ సేవలను వినియోగించారా? జాతీయస్థాయి ఆరోగ్యనిధి కింద ఉత్తరప్రదేశ్ ఆరోగ్య నిధికి సంక్రమించిన రూ.8,000 కోట్ల నిధి ఏ గంగలో కలిసిందో సీబీఐ తేల్చగలిగిందా? 

అన్నట్టు ఇంతకూ స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న రూ.24 లక్షల కోట్ల భారతీయ బడాబాబుల నల్లధనాన్ని తీసుకురావడానికి సీబీఐని కేంద్ర పాల కులు ఎందుకు వినియోగించుకోలేకపోయారో చెప్పగలరా? మన దేశంలో పన్నుల భారీ ఎగవేతదార్లయిన మోతుబరులంతా మారిషస్‌లోనో, మాల్దీవు ల్లోనో వేల కోట్ల రూపాయలను మదుపు చేసుకుంటూంటే మన ‘ప్రజాస్వామ్య ప్రభుత్వం’ దాని దర్యాప్తు సంస్థలూ ఏం చేస్తున్నట్టు? అటూ ఇటూ కూడా రాయితీల పేరుతో పన్ను ఎగవేతలకు పెట్టింది పేరైన ‘డేగ’లను ఎంత మందిని పట్టుకుని కొరత వేయగలిగారు? ప్రపంచంలో పన్ను ఎగవేతదార్లకు తల, మొలా దాచుకుంటూ పన్నులు కట్టనక్కరలేకుండా ఉన్న 77 రాయితీ కేంద్రాలు ఉన్నప్పుడు విస్తారమైన దర్యాప్తు సంస్థలను చేతుల్లో ఉంచుకుని కూడా దేశ ప్రజల త్యాగాలపై జలగల్లా బతకనేర్చిన మోతుబరుల గుట్టు మట్టులను రట్టుచేయడంలో ఎందుకు పాలకులు విఫలమవుతున్నారో సమాధానం చెప్ప గలగాలి! స్వాతంత్య్రానంతరం విదేశాలకు తరలిపోయిన సొమ్ము 462 బిలి యన్ డాలర్లు అని 2010 నవంబర్‌లో ‘గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ రిపోర్టు’ వెల్లడించింది! ఈ సొమ్మును రాబట్టడానికి సీబీఐని కేంద్రం ఎందుకు విని యోగించడం లేదు? దేశంలో చెలామణిలో ఉన్న నల్లధనం, దేశ జాతీ యోత్ప త్తుల మొత్తం విలువలో 50 శాతం ఉండగా ఇందులో రూ.2.8 లక్షల కోట్లు విదేశాలకు తరలిందని పరిశోధనాసంస్థలు వెల్లడించినా సీబీఐని ఎందుకు రంగంలోకి దించలేదు? 
మనకు నియంతలు వద్దు కాని నియంత్రణ వ్యవస్థ కావాలి. వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేయాలంటే - దేశ ఆర్థిక నవనాడులను పరిరక్షించగల ఆర్థిక గూఢచారిత్వ శాఖ, పన్నులశాఖ, ఉన్నత దర్యాప్తు సంస్థలూ ఏకోన్ముఖంగా స్వతంత్ర సంస్థలుగా, కేవలం న్యాయస్థానాలకు మాత్రమే జవాబుదారీగా ఉండే సంస్థలుగా మనగలగాలి. 

Popular Posts

Topics :