20 March 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

గతంలో వైఎస్సార్, చిరంజీవి మీదకు మమ్మల్ని ఉసిగొల్పారు

Written By news on Friday, March 25, 2016 | 3/25/2016


'రాజకీయంగా సర్వనాశనం చేయాలనుకుంటున్నారు'
హైదరాబాద్: కక్షసాధింపుతో తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా నిలదీస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా సర్వనాశనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ బాధితులకు న్యాయం జరిగేందుకు గొంతు విప్పిన తనపై అన్యాయంగా కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీని కాపాడుకునేందుకు మహిళలను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తన సస్పెన్షన్ పై న్యాయస్థానంలో పోరాడతానని రోజా స్పష్టం చేశారు.

ఆమె ఇంకా ఏం మాట్లారంటే...
  • రోజాను ఏం చేయబోతున్నారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
  • దీనంతటికీ కారణం ఏంటి
  • అధికార పక్షానికి ఓట్లేసి, వాళ్లను అధికారంలో కూర్చోబెట్టేది వాళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని
  • వాళ్లమీద ఒత్తిడి తేవడం కోసం ప్రతిపక్షం ఉంటుంది
  • కానీ టీడీపీ చేస్తున్న తప్పులు, సీఎం ఉన్న ఇంటి దగ్గరే, విజయవాడ చుట్టుపక్కల కాల్‌మనీ సెక్స్ రాకెట్ విజృంభించి, దానిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఏడాది సస్పెండ్ చేశారు.
  • 17వ తేదీన 344 కింద వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చాము
  • 3 కోట్ల మంది మహిళలకు సంబంధించిన విషయమిది
  • చర్చ కోసం అడిగితే రెండుసార్లు వాయిదా వేసి, మూడోసారి సభలోకి వచ్చాక అంబేద్కర్ అంశాన్ని తీసుకొచ్చి, దాన్ని పక్కదోవ పట్టించారు.
  • 18వ తేదీ మరోసారి ఇదే అంశంపై నోటీసు ఇచ్చాం
  • అంబేద్కర్ కూడా ఇలాంటి అంశంపై చర్చ సాగించాలనే చెప్పేవారు
  • 58 మందిని 344(2) ప్రకారం సస్పెండ్ చేశారు
  • అదే సమయానికి అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీకే తెలుసు.
  • కేవలం కాల్‌మనీ అంశాన్ని పక్కదోవ పట్టించడానికే ప్రయత్నించారు
  • చంద్రబాబు ఒక ప్రకటన చేస్తానన్నారు.
  • కానీ అలా ప్రకటన చేస్తే తర్వాత దానిపై సమగ్ర చర్చ అనేది ఉండదు
  • ప్రతిపక్షంగా దీనిపై మేం పూర్తిగా పోరాడాం
  • కా.మ. సీఎం అన్నాను కాబట్టి నన్ను ఏడాది సస్పెండ్ చేశాననడం ఎంత దారుణమో అంతా గమనించాలి
  • పాత స్పీకర్లు, న్యాయ నిపుణులు ప్రతి ఒక్కరూ అది తప్పన్నారు
  • కా.మ. అని రాసిన ఈనాడు పేపర్ వాళ్లకు ఎందుకు ప్రివిలేజి నోటీసు ఇవ్వలేదు, సభకు ఎందుకు పిలవలేదు?
  • 58 మంది నినాదాలు చేస్తే ఒక్క రోజాను సస్పెండ్ చేయడం సరికాదని జగన్ చెప్పినా ఒప్పుకోలేదు
  • రోజా బయటకు వెళ్లేవరకు మీకు మైకివ్వం అని పట్టుబట్టారు
  • విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ తనకొచ్చిన ఫిర్యాదు ప్రకారం రైడ్ చేస్తే.. కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం మొత్తం బయటపడింది.
  • ఇది సాక్షి వాళ్లో, వైఎస్ఆర్‌సీపీ వాళ్లో చేసింది కాదు
  • ఇంట్లో భర్త ఉండగానే భార్యను, కూతురిని ఎత్తుకెళ్లిపోయారు
  • కాల్ మనీ సెక్స్ రాకెట్ బాధితులు ఆత్మహత్యాయత్నాలు చేశారు
  • టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ప్రశ్నించిన నన్ను అన్యాయంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు
  • జరిగింది చెప్పుకోవడానికి అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వస్తే మార్షల్స్ తో నన్ను గెంటించేశారు
  • ప్రివిలేజ్ కమిటీలో ఉన్న ఇష్యూ అనితకు సంబంధించినది
  • సస్పెన్షన్ మాత్రం కా.మ. సీఎం అన్నందుకు చేశారు
  • సస్పెన్షన్ పై న్యాయస్థానంలో పోరాడతా
  • అనితను పావుగా వాడుకుంటున్నారు. ఆమెపై ఎటువంటి కోపం లేదు
  • గతంలో వైఎస్సార్, చిరంజీవి మీదకు మమ్మల్ని ఉసిగొల్పారు
  • తన పార్టీని సేవ్ చేసుకోవడానికి అనితను పావుగా వాడుకుంటున్నారు

విషమైనా తీసుకుంటా.. టీడీపీలో చేరను


విషమైనా తీసుకుంటా..  టీడీపీలో చేరను
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని

 మచిలీపట్నం టౌన్ : ‘విషమైనా తీసుకుంటా కానీ టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు’ అని  వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. ప్రాణం ఉన్నంత వరకూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అండగా ఉంటూ, వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. తాను టీడీపీలో చేరుతున్నారంటూ కొంతకాలంగా షికారుచేస్తున్న పుకార్లను ఖండిం చారు. స్థానిక రామానాయుడుపేటలోని పార్టీ కార్యాల యంలో గురువారం పేర్ని నాని విలేకరులతో మాట్లాడుతూ తాను టీడీపీలో చేరుతున్నానని ఓ పత్రిక (సాక్షి కాదు)లో వచ్చిన వార్తకు ఎలాంటి విశ్వసనీయత లేదని స్పష్టంచేశారు.

కాంగ్రెస్ పార్టీని బతికించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ అధిష్టానం వేధింపులకు గురిచేయడం, కక్ష సాధింపులకు దిగడంతో తాను మనస్తాపానికి గురై వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకుని, ఏడాదిన్నరకు ముందే ఎమ్మెల్యే, విప్ పదవులను త్యజించి వైఎస్సార్ సీపీలో చేరానని గుర్తుచేశారు. తాను పదవుల కోసమే ఆలోచించే వ్యక్తినే అయితే ఏడాదిన్నరకు ముందే క్యాబినెట్ హోదా గల విప్ పదవిని వదలి పార్టీ మారేవాడినే కాదన్నారు.

తనకు వైఎస్సార్‌పై ఉన్న అపారమైన, అచంచలమైన ప్రేమాబిమానాలు ఉన్నాయని, తన ఊపిరి ఉన్నంత వరకూ వైఎస్ కుటుంబానికి అండగానే ఉంటానే తప్ప పార్టీలు మారే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. తనకు ఊహ వచ్చినప్పటి నుంచీ టీడీపీపై వ్యతిరేకతతోనే పెరిగానని, అలాంటి తాను నేడు ఆ పార్టీలో ఏమి ఆశించి చేరాలని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తన హయాంలో చేసిన అభివృద్ధి మైలు రాళ్లు అనేకం ఉన్నాయని అవే తనకు సంతృప్తిని ఇస్తాయని పేర్కొన్నారు.

శ్వాస ఉండి రాజకీయాల్లో ఉన్నతంకాలం తాను వైఎస్ కుటుంబంతోనే ఉంటానని ఉద్ఘాటించారు. మునిసిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు శీలం మారుతిరావు(బాబ్జీ), కౌన్సిలర్లు లంకా సూరిబాబు, మేకల సుబ్బన్న, తాళ్లపాలెం సర్పంచి వాలిశెట్టి రవిశంకర్, మాజీ కౌన్సిలర్ చిటికిన నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఆ 8 మంది గురించి మాట్లాడడం అనవసరం

Written By news on Wednesday, March 23, 2016 | 3/23/2016


'ఆ 8 మంది గురించి మాట్లాడడం అనవసరం'
నెల్లూరు: ప్రతిపక్షం గొంతు నొక్కాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, విపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో బుధవారం జరిగిన సభలో ఆనం విజయకుమార్ రెడ్డికి పార్టీ కండువా వేసి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. అనైతిక రాజకీయాలు ఎక్కువ కాలం కొనసాగబోవని ఆయన అన్నారు. చంద్రబాబు మోసాలపై తమ పోరాటం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.

వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...
  • ఎండను ఖాతరు చేయకుండా, ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో చికాకు కన్పించకుండా అప్యాయతను పంచిపెడుతున్న అందరికీ చేతులు జోడించి శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను
  • విజయన్నను మన పార్టీలో చేర్చుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది
  • రాష్ట్ర ప్రజల మనోభావాలకు విజయన్న చేరిక అద్దం పడుతోంది
  • మొన్న వెళ్లిపోయిన 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడడం అనవసరం
  • ప్రతిపక్షమంటే ప్రజల గొంతు, మాట్లాడలేని ప్రజల గొంతు
  • చంద్రబాబు మోసాలకు అవస్థలు పడుతున్న ప్రజల గొంతే ప్రతిపక్షం
  • అలాంటి ప్రతిపక్షం గొంతు నొక్కేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు
  • తన పార్టీ టికెట్ పై గెలవకపోయినా అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాలు చేస్తున్నారు
  • రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రజలు మన వైపు చూస్తారు
  • రాజకీయాలలో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయత అనే రెండు గుణాలు ఉండాలి
  • ఈ రెండు గుణాలు లేకుంటే ఇంట్లో పెళ్లాం కూడా మీ వెంట నడిచే పరిస్థితి ఉండదు
  • అధికారం కోసం, కుర్చీ కోసం సొంత మామను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు వ్యక్తిత్వం
  • ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక మోసగించడం చంద్రబాబు విశ్వసనీయత
  • కొనుగోళ్లకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడం అనవసరం
  • సోనియాతో చంద్రబాబు కుమ్మక్కై కేసులు పెట్టినా నేను భయపడలేదు
  • దేవుడిని, ప్రజలను నమ్ముకుని ముందడుగు వేశాం
  • 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో ఢిల్లీ మొత్తం మనవైపు చూసేలా చేశాం
  • చంద్రబాబు తన పాలన మెరుగు పరుచుకోవాలి, ఇచ్చిన హామీలు అమలుచేయాలి
  • ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాగానే చంద్రబాబు అందరినీ మోసం చేశారు
  • ఎన్నికలప్పుడు ఏ మాటలు చెప్పారో అవి నెరవేర్చాలి. కానీ చంద్రబాబు ప్రజలను, వారికి ఇచ్చిన మాటను గాలికి వదిలేశాడు
  • నీచమైన రాజకీయాలు ఎక్కువ రోజులు నిలబడవు
  • బ్రిటిష్ పాలకులు, హిట్లర్ లాంటివాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు
  • ప్రజల కోపానికి బంగాళాఖాతంలో కలిసిపోక తప్పదు, చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు
  • చంద్రబాబుతో  పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మాకు కావాలి
  • విజయన్నను సాదరంగా ఆహ్వానిస్తున్నా, మా కుటుంబ సభ్యుడిగా ఆయన ఉంటాడని గట్టిగా చెబుతున్నా

సన్నిహితుల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన ఆనం


సన్నిహితుల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన ఆనం
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు కార్తికేయరెడ్డి, వారి అనుచరులు బుధవారం వైఎస్ జగన్ మెహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. కస్తూరిదేవి గార్డెన్స్‌ లో జరిగిన సభలో ఆనం విజయకుమార్ రెడ్డి, ఆయన తనయుడు కార్తికేయరెడ్డికి పార్టీ కండువాలు వేసి వైఎస్ జగన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. విజయకుమార్‌రెడ్డి ఇటీవల జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే తన అనుచరులు, సన్నిహితులు కస్తూరిదేవి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

ఈ సందర్భంగా కార్తికేయరెడ్డి మాట్లాడుతూ... వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్థన్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి నాయుడుపేట మొదలు ప్రతిచోటా ఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికారు. దీంతో ఆయన నెల్లూరుకు చేరుకోవడం ఆలస్యమైంది. కస్తూరిదేవి గార్డెన్స్ లో కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం నుంచి లోపలకు రావడానికి వైఎస్ జగన్ కు చాలా సమయం పట్టింది.

‘కృష్ణపట్నం’ పనుల్లో అక్రమాలు ఇవిగో..


అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం) పనుల్లో అనేక అక్రమాలు జరిగాయి. టెండర్లు పిలవకుండా పనులను బిట్లుబిట్లుగా విభజించి అడ్డగోలుగా నామినేషన్ పద్ధతిలో అధికార పార్టీ వారికి కట్టబెట్టారు. దీనివల్ల భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయి. దీనిపై హౌస్‌కమిటీ వేస్తే అక్రమాలను నిరూపిస్తా’’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ పనులను నామినేషన్ పద్ధతిపై ఇవ్వవచ్చా? అని గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు.
టెండర్ల ద్వారానే పనులు ఇచ్చామని, ఒక్క పని కూడా నామినేషన్‌పై ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమివ్వడాన్ని గోవర్ధన్‌రెడ్డి తప్పుబట్టారు. ‘‘ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే మీ అధికారులే సమాచారం ఇచ్చారు.  నామినేషన్ పద్ధతిపైనే పనులు ఇచ్చినట్లు ఇవిగో పక్కా ఆధారాలు (పత్రాలు చూపిస్తూ). మీరు నామినేషన్‌పై పనులు ఇవ్వలేదంటున్నారు.  మీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా? ఈ సభ ద్వారా ప్రజలను మంత్రి తప్పుదోవ పట్టించవద్దు. హౌస్ కమిటీ వేయండి లేదా విచారణ జరిపించండి. అక్రమాలు నిరూపిస్తాం. సభకు ఆధారాలతో రావాలని గతంలో సీఎం అన్నారు. అందుకే ఆధారాలు సమర్పిస్తున్నాం.విచారించి చర్యలు తీసుకోండి’’ అని గోవర్ధన్‌రెడ్డి కోరారు. ఆధారాలిస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మొత్తం ఆధారాలు స్పీకరుకు సమర్పిస్తున్నానని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

నేడు నెల్లూరుకు వైఎస్ జగన్

► పార్టీలో చేరనున్న ఆనం వర్గీయులు
► బహిరంగసభ, పార్టీ కార్యాలయం ప్రారంభం
► ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యేలు


సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు నెల్లూరుకు రానున్నట్లు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి ఇటీవల జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయ న అనుచరులు, సన్నిహితులు బుధవారం కస్తూరిదేవి గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో  చేరనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాట్లను మంగళవారం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పార్టీ అధ్యక్షు డు జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట కు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన ఉదయం 10గంటలకు నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా విజయకుమార్‌రెడ్డి, ఆయన అనుచరులు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు వెల్లడించా రు.
ఆ తర్వాత మాగంటలేవుట్‌లో నూతనంగా నిర్మించి పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు. అనంతరం పినాకిని అతిథిగృహానికి చేరుకుంటా రు. అక్కడ పార్టీ శ్రేణులతో సమావేశమవుతారన్నారు. సమావేశం అనంతరం తిరిగి రేణిగుంటకు చేరుకుని హైదరాబాద్‌కు పయనమవుతారని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు వారు పిలుపునిచ్చారు.

ప్రాజెక్టులు కట్టిన వాళ్లకంటే గేట్లెత్తినోళ్లు గొప్పా?


ప్రాజెక్టులు కట్టిన వాళ్లకంటే గేట్లెత్తినోళ్లు గొప్పా?
అసెంబ్లీలో నిలదీసిన విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యమేస్తోంది. ప్రాజెక్టులు కట్టినవాళ్ల కంటే నీళ్లొచ్చినప్పుడు ఆ గేట్లు ఎత్తే లస్కర్లే గొప్ప వాళ్లన్నట్లు బాబు మాట్లాడుతున్నారు’’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడారు. అంతర్జాతీయ జల దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాజెక్ట్‌ల గురించి వాస్తవాలను బహిర్గతం చేశారు. చంద్రబాబు మాటల్లోని డొల్లతనాన్ని బయటపెట్టారు. పులిచింతల, పోతిరెడ్డిపాడు, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, పోలవరం కుడి కాలువ, పట్టిసీమ వంటి ప్రాజెక్టులపై చంద్రబాబు మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు.
‘‘తోటపల్లి ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని ముఖ్యమంత్రి అంటు న్నారు. దీని అంచనా వ్యయం రూ.527.23 కోట్లయితే ఆయన తొమ్మిదేళ్ల హయాంలో ఖర్చు చేసింది కేవలం రూ.3 కోట్లే. వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఐదేళ్ల హయాంలో రూ.398 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్ మరణానంతరం పగ్గాలు చేపట్టిన పాలకులు రూ.51.95 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడేమో తోటపల్లిని తానే ప్రారంభిస్తున్నానని చంద్రబాబు అంటున్నారు. అంటే ప్రాజెక్టులు కట్టిన వాళ్లకంటే నీళ్లొచ్చినప్పుడు గేట్లు ఎత్తే లస్కర్లు గొప్పవాళ్లని చంద్రబాబు చెబుతున్నట్టుగా ఉంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయాలు, చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో చేసిన ఖర్చు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల హయాంలో వెచ్చించిన మొత్తం, వైఎస్ మరణానంతరం చేసిన ఖర్చును గణాంకాలతో సహా అసెంబ్లీలో వివరించారు.
కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది మీరే
ఈపీసీ(ఇంజనీరింగ్-ప్రొక్యూర్‌మెంట్-కన్‌స్ట్రక్షన్) కాంట్రాక్టుల్లో పెంపుదల వెసులుబాటు లేకపోయినా కాంట్రాక్టు వ్యయం పెంచుకునేందుకు జీవో 22, జీవో 63లను తెచ్చి కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది మీరు కాదా? అని జగన్ ప్రశ్నించారు. ఈ జీవోల ప్రకారం మీకు నచ్చిన కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పి, వ్యయం పెంచి వారికి లబ్ధి కలిగేలా చేయడం అందరికీ తెలిసిందేనన్నారు.
 ప్రాజెక్ట్‌లకు నిధులివ్వలేని అధ్వాన్న పరిస్థితి
అంతర్జాతీయ జల దినోత్సవానికి సంబంధించిన అంశాలపైనే మాట్లాడాలని, దీనికి సంబంధం లేని విషయం గురించి మాట్లాడకూడదని ప్రతిపక్ష నేతను స్పీకర్ పలుమార్లు అడ్డుకున్నారు. దీనిపై జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ... ఇది ఎలా రిలవెంట్ కాదో చెప్పాలని అన్నారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులకు ఎంత కేటాయించారు? ఇప్పుడు సీఎం అయ్యాక ఎంత కేటాయింపులు చేశారు? అనేది రిలవెంట్(సంబంధిత అంశం) ఎందుకు కాదు అని పేర్కొన్నారు. ‘‘పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించే పరిస్థితి లేదు. చివరకు పట్టిసీమకు పెట్టే ఖర్చులను పోలవరం ప్రాజెక్టులోనే చూపిస్తున్నారు. పట్టిసీమకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేని అధ్వాన్న పరిస్థితి ఉంది. ఇవన్నీ నీటికి సంబంధించినవి కాదా?’’ అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు సభలో గంటసేపు మాట్లాడిన తర్వాత స్పీకర్ ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. జగన్ ప్రసంగానికి దాదాపు 6 సార్లు అడ్డు తగులుతూ మైక్ కట్ చేశారు.
 హాస్టళ్లు తగ్గించే కార్యక్రమం చేయొద్దు
రాష్ట్రంలో హాస్టళ్లను తగ్గించే కార్యక్రమం చేయవద్దని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో బాలుర ఆశ్రమ పాఠశాల గురించి టీడీపీ సభ్యుడు శ్రీరాం రాజగోపాల్ అడిగిన ప్రశ్నకు మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత లేచి హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా చేయడం మంచిదేనని, దీనిని ఎవరూ కాదనడానికి లేదని, అయితే ఈ కార్యక్రమం పేరుతో ఉన్న హాస్టళ్లను తగ్గించవద్దని కోరారు. స్పందించిన మంత్రి.. తక్కువ విద్యార్థులున్న హాస్టళ్లలోని విద్యార్థులను వేరేచోటకు పంపిస్తామని చెప్పారు. తద్వారా హాస్టళ్ల మూసివేత తప్పదని పరోక్షంగా తేల్చిచెప్పారు.

అధికారపక్షానికి వైఎస్ జగన్ చురకలు

Written By news on Tuesday, March 22, 2016 | 3/22/2016


అధికారపక్షానికి వైఎస్ జగన్ చురకలు
-మీ తొమ్మిదేళ్లలో ప్రాజెక్టులకు ఎంత వ్యయం చేశారో చూశారా?
-మీరు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూంటే ఆశ్చర్యమేస్తోంది
-అధికార పక్షానికి చురకలంటించిన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి
-వైఎస్ హయాంలో ప్రాజెక్టులకు చేసిన వ్యయం చదివినిపించిన ప్రతిపక్షనేత
-జీవో నెం.22, జీవోనె.63 లతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది ఎవరో అందరికీ తెలుసన్న నేత
-జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూండగా ఆరుసార్లు మైక్‌కట్


హైదరాబాద్: 'పాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు మాట్లాడుతూంటే చాలా ఆశ్చర్యమేస్తోంది. ప్రాజెక్టులు కట్టినోళ్లకంటే నీళ్లొచ్చినప్పుడు ఆ గేట్లు ఎత్తే లష్కర్లే గొప్పవాళ్లన్నట్టు బాబు చెబుతున్నారు' అంటూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీలో అంతర్జాతీయ జలదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడిన అంశాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాస్తవాలను అసెంబ్లీలో చెప్పారు.

చంద్రబాబు నాయుడు... పులిచింతల, పోతిరెడ్డిపాడు, గాలేరునగరి, మంద్రినివా, పోలవరం కుడికాలువ, పట్టిసీమ ప్రాజెక్టులపై మాట్లాడుతూంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశానంటున్నారు..దీని అంచనా వ్యయం 527.23 కోట్లయితే ఆయన తొమ్మిదేళ్ల కాలంలో ఖర్చు చేసింది కేవలం రూ.3కోట్లే. వైఎస్ తన ఐదేళ్ల హయాంలో రూ.398 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్ మరణానంతరం రూ.51.95 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు తోటపల్లిని నేనే ప్రారంభిస్తున్నానని అంటున్నారు...అంటే ప్రాజెక్టులు కట్టిన వాళ్లకంటే నీళ్లొచ్చినప్పుడు గేట్లు ఎత్తే లష్కర్లు గొప్పవాళ్లని చంద్రబాబునాయుడు చెబుతున్నట్టుందని అన్నారు. వంశధార ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1242,90 కోట్లయితే బాబు తొమ్మిదేళ్ల హయాంలో కేవలం రూ.44.26 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అదే వైఎస్ ఐదేళ్ల హయాంలో రూ.657 కోట్లు ఖర్చు చేశారని, వైఎస్ మరణానంతరం రూ.138.96 కోట్లు వెచ్చించారన్నారు.

ఇక పుష్కరం ప్రాజెక్టు విషయానికొస్తే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.608.04 కోట్లు అయితే బాబు హయాంలో ఖర్చు చేసింది రూ.7.60 కోట్లు మాత్రమేనని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.384.64 కోట్లు ఖర్చు చేశారని, ఆయన మరణానంతరం రూ.61.77 కోట్లు వెచ్చించారని అన్నారు. తాడిపూడి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.467.70 కోట్లయితే బాబు తన హయాంలో కేవలం రూ.3.23 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వైఎస్ హయాంలో 384.64 కోట్లు అని, వైఎస్ మరణానంతరం రూ.55.19 కోట్లు వెచ్చించారని అన్నారు. వెంకటనగరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.124.18 కోట్లయితే బాబు తొమ్మిదేళ్ల హయాంలో ఒక్క రూపాయికూడా ఖర్చు చేయలేదని, అదే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.75.54 కోట్లు ఖర్చు చేశారని, ఆయన మరణానంతరం 8.14 కోట్లు ఖర్చుచేశారన్నారు.

ముసురుమిల్లి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.207 కోట్లయితే బాబు హయాంలో పైసా ఖర్చు చేయలేదని, వైఎస్ హయాం ఐదేళ్లలో 148.97 కోట్లు వ్యయం చేశారని, వైఎస్ మరణానంతరం కూడా రూ.44.58 కోట్లు ఖర్చు చేశారన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.592.18 కోట్లయితే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లూ ఖర్చు చేసింది కేవలం రూ.2.20 కోట్లు అని, వైఎస్ తన ఐదేళ్ల పాలనలో రూ.536.23 కోట్లు ఖర్చు చేశారని, ఆయన మరణించిన తర్వాత రూ.32.12 కోట్లు ఖర్చు చేశారన్నారు. భూపతిపాలెం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.146.39 కోట్లయితే బాబు తన తొమ్మిదేళ్ల పాలనలో కేవలం రూ.4.98 కోట్లు మాత్రమే చేశారని, అదే వైఎస్ తన ఐదేళ్లలో రూ.124.34 కోట్లు ఖర్చు చేశారని దీన్నిబట్టి చూస్తే...చంద్రబాబు ప్రాజెక్టులపై మాట్లాడ్డం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదన్నారు.

కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది అందరికీ తెలిసిందే
కాంట్రాక్టు వ్యయం పెంచుకునేందుకు ఈపీసీ కాంట్రాక్టుల్లో పెంపుదల వెసులు బాటు లేకపోయినా జీవో నెం.22, జీవో నెం.63లను తెచ్చి కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఈ జీవోల ప్రకారం మీరు నిర్ణయించుకున్న (సెలక్టివ్) కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పి, వ్యయం పెంచి వారికి లబ్ధికలిగేలా చేసింది అందరికీ తెలిసిందేనన్నారు.

ఇది ఎలా రిలవెంట్‌కాదు?
పదే పదే అంతర్జాతీయ జలదినోత్సవం సంబంధించినదే మాట్లాడాలని, దీనికి సంబంధించని అంశం మాట్లాడకూడదని స్పీకర్ అడ్డుకున్నారు. దీనిపై జగన్‌మోహన్‌రెడ్డి... ఇది ఎలా రిలవెంట్ కాదో చెప్పాలని అన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులకు ఎంత కేటాయించారు, ఇప్పుడు సీఎం అయ్యాక ఎంత కేటాయింపులు చేశారు అన్నది రిలవెంట్ ఎందుకు కాదు అన్ని ప్రశ్నించారు. పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించే పరిస్థితి లేదు. చివరకు పట్టిసీమకు పెట్టే ఖర్చులు పోలవరం ప్రాజెక్టుల్లోనే చూపిస్తున్నారు. పట్టిసీమకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేని అధ్వాన్న పరిస్థితి ఉంది...ఇవన్నీ నీటికి సంబంధించినవి కాదా అని జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు గంట ప్రసంగం తర్వాత జగన్‌మోహన్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తే సుమారు 6 సార్లు అడ్డు తగిలి మైక్ కట్ చేశారు.

సభలో ద్వంద్వ ప్రమాణాలు

Written By news on Monday, March 21, 2016 | 3/21/2016


సభలో ద్వంద్వ ప్రమాణాలు
ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్న అధికారపక్షం
 
(కె. సుధాకర్ రెడ్డి)
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏకైక ప్రతిపక్షం పట్ల అధికార తెలుగుదేశం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. శాసనసభలో తమను ప్రశ్నించే వారే ఉండకూడదన్న ధోరణితో వెళుతున్నట్టు ఆయా సందర్భాలు స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యురాలు ఆర్.కె.రోజాను శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెండు చేసిన వ్యవహారం, తదనంతరం ఉత్పన్నమైన పరిణామాలపై పౌర సమాజంలో తీవ్ర చర్చ సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన 14వ శాసనసభ ఇప్పటివరకు ఏడుసార్లు సమావేశం కాగా, ప్రతి సమావేశంలోనూ ప్రతిపక్షం పట్ల విషం చిమ్ముతూ నిందాపూర్వక ధోరణి, ఎదురుదాడి కొనసాగించడం తప్ప ఏనాడూ ప్రజాస్వామిక స్పూర్తిని ప్రదర్శించలేదని జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా సభకు వచ్చారు మీకు నిబంధనలు, సంప్రదాయాలు తెలియవు నేర్చుకోండి... అంటూ ప్రతిపక్షాన్ని గేలి చేస్తూనే మరోవైపు అధికార పార్టీయే వాటికి తిలోదకాలివ్వడాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులు తమను తిట్టారంటూనే తీవ్రస్థాయిలో అభ్యంతరకర పదజాలం ఉపయోగిస్తూ ఎదురుదాడి చేయడం, ప్రతిపక్షనేతపై మూకుమ్మడిగా వ్యక్తిగతదాడి చేయడం అధికారపార్టీ ద్వంద్వప్రమాణాలకు నిదర్శనమంటున్నారు.

న్యాయ మూర్తులను, న్యాయ వ్యవస్థలను గౌరవించాలంటూ శాసనసభ వేదికగా గంటకుపైగా చ ర్చ చేసిన అధికార పక్షం నేతలే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించకపోవడం గమనార్హం. ప్రతిపక్షం గొంతెత్తకూడదన్న లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక ధోరణికి రోజా సస్పెన్షన్ వ్యవహారాన్ని ఉదహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో  ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ నీతికి ఉదాహరణగా అనేక సందేహాలు, సమాధానాలు లేని ప్రశ్నలెన్నో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అప్రజాస్వామిక ధోరణికి ఉదాహరణలెన్నో...
  • శాసనసభ 340 (2) నిబంధన కింద సస్పెండు చేసే అధికారం లేదని, దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రోజా ప్రకటించిన తర్వాత డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. అప్పటికే సస్పెన్షన్ వేటుకు గురైన రోజా విషయాన్ని ఆ కమిటీ పరిశీలించి దానిని హక్కుల కమిటీకి నివేదించింది.
  • రోజాను అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో (డిసెంబర్ 18న) ఏడాది పాటు సస్పెండు చేయగా, రెండు నెలల తర్వాత  ఫిబ్రవరి 21న సభా హక్కుల కమిటీ (ప్రివిలేజెస్ కమిటీ)ని నియమించారు. సస్పెండు చేసిన రెండు నెలల తర్వాత ఏర్పడిన ఆ కమిటీ అదే అంశంపై రోజాకు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది.
  • సస్పెన్షన్ తీర్మానం పెట్టినప్పుడు సభలో వివరణ ఇచ్చుకోవడానికి ఒక్క క్షణం అవకాశం ఇవ్వలేదు గానీ, కమిటీ ముందు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
  • ఇకపోతే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రస్తుత శాసనసభ ఇప్పటివరకు (ప్రస్తుతం జరుగుతున్నవి 7వ సమావేశాలు) మొత్తం ఏడు సార్లు సమావేశం కాగా అనేక సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడిని, ఆయనతో పాటు సభలో లేని, తిరిగొచ్చి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేసిన ఎమ్మెల్యేను సభా హక్కుల కమిటీలో నియమించారు. (సభలో లేని వ్యక్తిపై దూషణలు కాదు కదా అసందర్భంగా ఆరోపణలు చేయడానికి కూడా నిబంధనలు అంగీకరించవు)
 
ద్వంద్వప్రమాణాలకు రుజువులివిగో..
శాసనసభ్యురాలు ఆర్ కె రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ చేసిన తీర్మానం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
అలా చెప్పిన వారే ఆ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తారు.

శాసన వ్యవస్థలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలే వని ఒకవైపు చెబుతారు.
మరోవైపు హైకోర్టు మధ్యంతర తీర్పుపై స్టే కోరుతూ అప్పీలు చేస్తారు.

రోజాను ఏడాది పాటు సస్పెండు చేయమన్నది శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించినట్టు చెబుతారు.
కానీ ఆరోజు ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకించిన అంశాన్ని ప్రస్తావించరు.

రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ తీర్మానం చేసిన తర్వాత దానిపై ప్రతిపక్షం అభ్యంతరం చెబితే తీర్మానం చేయడం పూర్తయింది కాబట్టి దానిపై చర్చకు అనుమతించబోమన్నారు. అది అయిపోయింది. ఆ అంశంపై మాట్లాడొద్దని అడ్డుకున్నారు.
ఆ వ్యవహారంపై మళ్లీ చర్చించడానికి వీలులేదన్న వారే... ఆ తీర్మానం  చెల్లదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు దానిపై మళ్లీ చర్చించాలని చెబుతారు.

శాసనసభ కార్యదర్శి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వీకరిస్తారు.
కానీ రోజాను కనీసం అసెంబ్లీ పరిధిలోకి కూడా రానీయకుండా మార్షల్స్ పెట్టి అడ్డుకుంటారు.

రోజాపై విధించిన సస్పెన్షన్ తీర్మానం చెల్లదని శాసనసభ కార్యదర్శిని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ప్రతిని ఆయన స్వీకరిస్తారు.
కానీ దానిపై శాసనసభ కార్యదర్శి మాత్రం అప్పీలుకు వెళ్లరు.

న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శికి శాసనసభా వ్యవహారాలు, నిర్ణయాలతో ఎలాంటి సంబంధం ఉండదు.
కానీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయనతో ధర్మాసనం ముందు అప్పీలు చేయిస్తారు.

శాసనసభ నిబంధన 340 (2) కింద రోజాను ఏకంగా ఏడాది పాటు సస్పెండు చేసే అధికారం లేదని ప్రతిపక్షం అన్నప్పుడు మాకు రూల్స్ తెలుసు అంటారు.
కానీ హైకోర్టులో వాదనలు వినిపించే ముందు పొరపాటున 340 (2) నిబంధన కింద అని వచ్చిందనీ, నిజానికి రాజ్యాంగంలోని 194 నిబంధన కింద సస్పెండు చేశామని చెప్పారు. శాసనసభలో నియమ నిబంధనలను ప్రతిపక్ష నేత విడమరిచి సోదాహరణకు చెబుతున్నప్పుడు... ఏకంగా రూల్స్‌ను సస్పెండు చేస్తున్నారు. (స్పీకర్‌పై ప్రతిపక్షం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్ష నేత రూల్ 71 (2), రూల్ 72 (3) కింద పద్ధతి ప్రకారం చేపట్టాలన్నప్పుడు ఆ రూల్స్‌ను ఎత్తివేస్తూ అధికార పార్టీ తీర్మానం చేసింది)

ఆయా అంశాలపై ప్రతిపక్షం నిరసనలను టెలికాస్ట్ చేయకుండా నియంత్రిస్తారు.
కానీ ప్రతిపక్ష సభ్యుల నిరసనల సందర్భంగా శాసనసభ ప్రతిష్టకు భంగకలిగించే విధంగా ప్రవర్తించారంటూ వారిపై వేటు వేస్తారు.

సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడటానికి మైక్ ఇవ్వరు.
కానీ సభలో వాడకూడని (అన్-పార్లమెంటరీ) భాష మాట్లాడారని నిందిస్తారు.

ప్రతిపక్ష సభ్యులు హుందాగా వ్యవహరించాలని అంటారు..
కానీ వారిని రాయడానికి వీల్లేనంత తీవ్రమైన పరుషపదజాలంతో తిట్టిపోస్తారు.

నన్ను నువ్వు అని ఏకవచనంతో సంబోధిస్తున్నారంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి రగడచేస్తారు..
అదే సమయంలో తమ మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రతిపక్షనాయకుడిపై వ్యక్తిగత దాడి చే యిస్తారు. నిరాధార ఆరోపణలు గుప్పిస్తారు.

సభాపతి మైక్ ఇవ్వనంత వరకు ఏ సభ్యుడు మాట్లాడినా అవి రికార్డుల్లోకి వెళ్లవు.
రికార్డుల్లోకి వెళ్లని మాటలకు సంబంధించిన (అది కూడా ప్రతిపక్ష సభ్యులకు సంబంధించి మాత్రమే) ఆడియో సీడీలు బయటకు లీక్ చేసి మీరు ఇలా అడ్డగోలుగా మాట్లాడారంటూ వాటిపై రాద్ధాంతం చేస్తారు.

స్పీకర్ అనుమతితోనే ఆ సీడీలను విడుదల చేశామని ఒకరోజు చెబుతారు.
ఆ ఆడియో సీడీల బయటకు పొక్కడంపై తాను ఎవరికీ అనుమతి ఇవ్వలేదంటూ స్పీకర్ ఆ మాటలను ఖండించినా, దానిపైన అధికార పక్షం మళ్లీ మాట్లాడదు.
http://www.sakshi.com/news/hyderabad/rolling-parties-duel-standards-in-ap-assembly-325208?pfrom=home-top-story

Popular Posts

Topics :