15 July 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి అనుసరించిన వైఖరి సరైనదే

Written By news on Saturday, July 21, 2012 | 7/21/2012

రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి అనుసరించిన వైఖరి సరైనదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి చెప్పారు. దీనిని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా అర్ధం చేసుకుంటారనిన్నారు. జగన్ బెయిల్‌తో ప్రణబ్ ఓటుకు ముడిపెట్టడం తగదని ఆమె తెలిపారు. ఆ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మానసిక పరిస్థితి సరిగాలేదని తెలుస్తోందనిన్నారు. చట్టం, రాజ్యాంగం, న్యాయస్థానాల పట్ల లెక్కలేని తనాన్ని వెల్లడిస్తోందని శోభా తెలిపారు. సీబీఐ, కాంగ్రెస్ మీద మా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. సీబీఐతో కాంగ్రెస్సే కాదు టీడీపీ కూడా కుట్రకు పాల్పడిందని చెప్పారు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని శోభానాగిరెడ్డి చెప్పారు.

వైఎస్ఆర్ సీపీ ప్రొటోకాల్ కమిటీ

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రొటోకాల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులుగా శోభానాగి రెడ్డి, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాంలను వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ నియమించారు. పార్టీ అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షురాలి పర్యటనల కోసం ఆ ప్రాంత నాయకులతో సమన్వయం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు

టీఆర్‌ఎస్‌కు కలిగే బాధేమిటి?: బాజిరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల ధర్నాలో పాల్గొంటే టీఆర్‌ఎస్‌కు కలిగే బాధేమిటో అర్ధం కావడం లేదని ఆ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా చేనేత కార్మికుల కోసం విజయమ్మ పోరాడటంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే చేనేత కార్మికుల సంక్షేమం మీద టీఆర్‌ఎస్‌కు ఉన్న చిత్తశుద్దేమిటో అర్దమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రజా పోరాటాలను రాజకీయాల కోసం బలిచేయవద్దని బాజిరెడ్డి టీఆర్‌ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

చేనేత దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

ఖమ్మం: చేనేత కార్మికుల సమస్యలపై ఈ నెల 23న సిరిసిల్లలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చేపట్టనున్న దీక్ష పోస్టర్‌ను ఖమ్మం జిల్లా నాయకులు శనివారం ఆవిష్కరించారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొబ్బిలి భరత్‌ చంద్ర, కరీంనగర్ పట్టణ యువజన కన్వీనర్‌ కిషోర్‌ బాబు, లీగల్‌ సెల్‌ జిల్లా కన్వీనర్‌ పాపారావు, తదితర పార్టీ నాయకులు దీక్ష పోస్టర్‌ను విడుదల చేశారు. చేనేత ధర్నాపై టీఆర్ఎస్‌ చేస్తున్న రాజకీయాలను పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు.

సిరిసిల్లలో నేతన్నల ఉపాధి కోసం కేటాయించిన భూమిని మింగేసిన అధికారపార్టీ నేతలు

టెక్స్‌టైల్ పార్కులోని స్థలంపై కాంగ్రెస్ నాయకుల కన్ను
చక్రం తిప్పిన జిల్లా మంత్రి!

స్థలం పొందిన కాంగ్రెస్ కార్యకర్తలు వీరే...
1. నాగుల సత్యనారాయణ - 2.55 ఎకరాలు (ఈయన స్థానిక కాంగ్రెస్ కార్యకర్త. మంత్రి అనుచరుడు.)
2. కల్యాడపు కిరణ్ - 1.37 ఎకరాలు (ఈయన కాంగ్రెస్ కార్యకర్త కల్యాడపు సుభాష్ కొడుకు. సుభాష్ డీఎల్‌సీ సభ్యుడు కూడా)
3. ఎల్లా హేమలత -1.05 ఎకరాలు (ఈమె కాంగ్రెస్ కౌన్సిలర్ ఎల్లా లక్ష్మీనారాయణ భార్య)
4. ఎల్లా దేవదాసు - 1.05 ఎకరాలు (ఎల్లా లక్ష్మీనారాయణ సంబంధీకులు)

హైదరాబాద్, న్యూస్‌లైన్: సిరిసిల్ల నేత కార్మికులకు ఏడాది పొడవునా పని కల్పించేందుకు వీలుగా టెక్స్‌టైల్ పార్కులో కామన్ ఫెసిలిటీ కేంద్రం (సీఎఫ్‌సీ) ఏర్పాటుకు కేటాయించిన భూమిపై అధికార పార్టీ నేతలు వాలిపోయారు. నేతన్నల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేటాయించిన స్థలాన్ని కార్యకర్తలకు పంచేశారు. ఈ అడ్డగోలు బాగోతంలో జిల్లా మంత్రి చక్రం తిప్పారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి అతి విలువైన స్థలాన్ని కార్యకర్తలకు దక్కేలా చేశారు. అనుకున్నదే తడవుగా సీఎఫ్‌సీలో యూనిట్ల ఏర్పాటుకు స్థలం కేటాయించాలంటూ కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవడం.. అనంతరం వారికి స్థలం దక్కడం చకచకా జరిగిపోయింది. ఈ నెల 4న జిల్లాస్థాయి కమిటీ (డీఎల్‌సీ) సమావేశంలో సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కులో ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలకు భూమిని కేటాయిస్తూ నిర్ణయం జరిగింది. భూములు పొందిన వారిలో కాంగ్రెస్ కౌన్సిలర్ భార్యతో పాటు వుంత్రి అనుచరులు, కార్యకర్తలు ఉండటం గమనార్హం. దీంతో సీఎఫ్‌సీలో రంగుల అద్దకం, ప్రాసెసింగ్, టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుకు కేటాయించిన స్థలం కాస్తా కాంగ్రెస్ కార్యకర్తల పరమైంది. ఫలితంగా సిరిసిల్లలో నేతన్నల కష్టాలు మళ్లీ మొదటికొచ్చినట్టయింది!

ఇదీ వైఎస్ విజన్..

కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వరుసగా జరుగుతున్న కార్మికుల ఆత్మహత్యలు నివారించాలన్న లక్ష్యంతో నాడు వైఎస్ నష్టపరిహారం, బ్యాంకు రుణాలతో పాటు ఏడాదంతా ఉపాధి దొరికేందుకు వీలుగా ప్రత్యేక కార్యచరణ ప్రకటించారు. ఇందుకు ప్రత్యేకంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌ఎఫ్‌ఎస్) సంస్థతో అధ్యయనం చేయించారు. ఈ సంస్థ అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఇందులో ప్రధానంగా... సిరిసిల్ల కార్మికులు తయారుచేసే వస్త్రాలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లేవని నివేదిక తేల్చింది. ఈ సమస్యను అధిగమించేందుకు టెక్స్‌టైల్ పార్కులో సీఎఫ్‌సీ ఏర్పాటు చేయాలని నివేదిక పేర్కొంది. ఇందుకు వైఎస్ వెంటనే స్పందించారు. సీఎఫ్‌సీ ఏర్పాటుకు టెక్స్‌టైల్ పార్కులో 15 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే ఆయన మరణానంతరం సీఎఫ్‌సీ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా అధికార పార్టీ నేతలు ఈ స్థలంపై కన్నేశారు. ఈ స్థలం సీఎఫ్‌సీ కోసం కేటాయించారని అధికారులు మొత్తుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంత్రి తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతో.. ఇప్పటికే పార్కులో స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 200కి పైగా ప్రతిపాదనలను పక్కనపెట్టి మరీ కాంగ్రెస్ కార్యకర్తలకు స్థలం కేటాయించారు.

సీఎఫ్‌సీతో కార్మికులకు ఉపయోగం ఇదీ..
సిరిసిల్ల నేత కార్మికులు ఒకే తరహా వస్త్రాలను తయూరుచేస్తారు. ఫలితంగా మార్కెట్లో పెద్దగా డిమాండ్ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల నేతన్నల బాధలను తీర్చేందుకు సీఎఫ్‌సీ ఏర్పాటును వైఎస్ సంకల్పించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు అయ్యే వ్యయం రూ.16.80 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్లు గ్రాంటు కింద ఇస్తుంది. మరో రూ.2 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుందని వైఎస్ హామీనిచ్చారు. మిగిలిన రూ.4.80 కోట్లను పార్కులో యూనిట్లు ఏర్పాటు చేసే యాజమాన్యాలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ కేంద్రంలో ప్రాసెసింగ్, రంగుల అద్దకం, కాటన్ సైజింగ్ బీంలు, యార్న్ ట్విస్టింగ్, టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తారు. తక్కువ ధరకే ఈ సేవలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా పార్కులో తయారైన వస్త్రాలను ప్రాసెసింగ్ చేసి, రంగులు అద్ది.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తయారుచేసే వీలు ఏర్పడుతుంది. దీంతో మార్కెట్లో వస్త్రాలకు డిమాండ్ కూడా ఉంటుంది. ఏడాది మొత్తం కార్మికులకు ఉపాధి దొరుకుతుంది.

అంతర్జాతీయ పశుపరిశోధన కేంద్రంపై సీఎంకు వైఎస్ విజయమ్మ లేఖ


రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తలపెట్టిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రాన్ని(ఐజీకార్ల్) రాష్ట్రప్రభుత్వం విస్మరిస్తోందని... వెంటనే దాని వినియోగానికి చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి శుక్రవారం నాలుగు పేజీల లేఖ రాశారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ ఆమెరికా దేశాల రైతాంగానికి అవసరమైన మేలు జాతి పశువులను అందించేందుకు పులివెందులలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వైఎస్ శ్రీకారం చుట్టిన సంగతిని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2007-08 నుంచి 2009-10 ఆర్థిక సంవత్సరాలకు గాను ఈ ప్రాజెక్టు స్థాపన, నిర్వహణ కోసం రూ.386 కోట్ల నిధులను మంజూరు చేసి ప్రధాన నిర్మాణాలను పూర్తి చేయగా 2009 జనవరి 25వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభోత్సవం చేశారన్నారు. 

ఆ తర్వాత పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పరిశోధన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చాయని, అయితే, గత రెండేళ్ళుగా ప్రభుత్వ నిరాసక్తత కారణంగా మంజూరైన రూ.వంద కోట్ల నిధులు కూడా వెనక్కు వెళ్ళినట్లు చెప్పారు. పరిశోధనలు కూడా నిలిచిపోయిన ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రి, కార్యదర్శి, ముఖ్య కార్యనిర్వహణాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వైఎస్‌ఆర్ కలగన్న అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజయమ్మ లేఖలో కోరారు.

తెలుగుదేశంను మేమే సస్పెండ్ చేశాం

2009లో ఎన్నికైంది 92 మందిఆరుగురు రాజీనామా..
అయిదుగురి సస్పెన్షన్ ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం 81

హైదరాబాద్, న్యూస్‌లైన్: పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న నలుగురు శాసనసభ్యులపై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం అందుబాటులో ఉన్న నేతలు దాడి వీరభద్రరరావు, వీవీవీ చౌదరి తదితరులతో సమావేశమై నలుగురిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్‌ఆర్కే ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. రాష్ర్టపతి పదవికి జరిగే ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి (కర్నూలు జిల్లా మంత్రాలయం), కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (రంగారెడ్డి జిల్లా పరిగి), డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి (ఆదిలాబాద్ జిల్లా ముథోల్), చిన్నం రామకోటయ్య (కృష్ణా జిల్లా నూజివీడు) శుక్రవారం రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు. దీంతో వీరిపై చర్యలు తీసుకోవాలని పార్టీ భావించింది. అయితే ఎప్పటినుంచో పార్టీకి దూరంగా ఉంటున్న వీరికి నోటీసులు ఇవ్వటం, ఆ తరువాత సస్పెండ్ చేయటం వంటి చర్యలవల్ల అనవసరంగా ప్రాధాన్యతనిచ్చినట్లు అవుతుందని మొదట భావించారు. 

అలాగని పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్య తీసుకోకపోతే మిగిలిన వారు కూడా ఇదే తీరుగా వ్యవహరించటంతోపాటు, అధినేతకు పట్టులేదని ప్రజలకు, ముఖ్యంగా క్యాడర్‌కు త ప్పుడు సంకేతాలు వెళతాయనే భయంతో నలుగురినీ సస్పెండ్ చేయాలని హడావుడిగా నిర్ణయించారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున 92 మంది ఎమ్మెల్యేలుగా ఎంపికకాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 81కి చేరింది. గతంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జోగు రామన్న, గంపా గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చెన్నమనేని రమేష్, నాగం జనార్దన్‌రెడ్డి పార్టీని వీడి, మళ్లీ పోటీచేసి గెలుపొందారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఓటు హక్కును కాదనే అధికారం బాబుకు లేదు: బాలనాగిరెడ్డి
ఎన్నికల్లో ఓటు వేయటమనేది పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని కాదనే అధికారం చంద్రబాబుకు లేదు. పార్టీ నుంచి నన్ను వారు సస్పెండ్ చేసేదేమిటి? మూడేళ్లుగా నేనే పార్టీకి దూరంగా ఉంటున్నాను. ఎన్‌టీఆర్ కుటుంబసభ్యులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేసినపుడు స్పందించకుండా రాష్ర్టపతి ఎన్నికల్లో ఓటు వేసినందుకు సస్పెండ్ చేయటం బాధాకరం. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మాలాంటివారికి దేశ అత్యున్నత పదవికి జరిగే ఎన్నికల్లో ఓటు వేయాలనే ఆశ ఉంటుంది. వద్దని చెప్పటం ఎంతవరకు సమంజసం? పార్టీ వైఖరి సరికాదనే భావనతో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి భవిష్యత్ లేదు. అధినేత వ్యవహారశైలి ఛండాలంగా ఉంది. 

ఊహించని పరిణామం: చిన్నం
పార్టీ నుంచి సస్పెండ్ చేయటం ఊహించని పరిణామం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటం అనేది శాసనసభ్యుడిగా నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. సస్పెన్షన్ ఉత్తర్వులు అందిన తరువాత పూర్తిస్థాయిలో స్పందిస్తా. 

పార్టీని మేమే సస్పెండ్ చేశాం: కొప్పుల 
తెలుగుదేశంను మేమే సస్పెండ్ చేశాం. మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం పార్టీకి లేదు. ఏడాదిన్నర క్రితమే పార్టీకి 
రాజీనామా చేశాం. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి తెలంగాణ తెలుగుదేశం ఫోరం బయట పడాలి. 

అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే: వేణుగోపాలచారి
పార్టీలో ఉన్న అంతర్గత సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే మమ్మల్ని సస్పెండ్ చేశారు. తెలంగాణ కోసం ఐక్యతా దీక్ష చేపట్టిన రోజునే మేం పార్టీకి రాజీనామా చేశాం. అపుడు స్పందించని పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశామనే కారణంతో సస్పెండ్ చేయటం సరికాదు. ఓటు వేయాలా లేదా అనేది మా విచక్షణాధికారం... ఓటింగ్‌లో పాల్గొనమని అందరికీ చెప్పిన పార్టీనే ఓటు వేయకూడదని నిర్ణయం తీసుకోవటం సరికాదు.

సోమా సంస్థకే పోలవరం!

రెండో స్థానంలో ‘సూ’
సాంకేతిక అర్హత సాధించలేకపోయిన నాలుగు సంస్థలు

హైదరాబాద్, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ టెండర్లను సోమా - సీజీజీసీ కన్సార్షియం దక్కించుకుంది. గతంలో ఈ టెండర్ల కోసం పోటీపడి మొదటి స్థానంలో నిలిచిన సూ సంస్థ ఈసారి రెండో స్థానానికి పరిమితమైంది. ఈ టెండర్‌లో మొత్తం ఆరు సంస్థలు పోటీ పడగా నాలుగు సాంకేతిక అర్హతను సాధించలేదు. మిగిలిన రెండు సంస్థల ఫైనాన్షియల్ బిడ్‌లను అధికారులు శుక్రవారం తెరిచారు. ఇందులో మైనస్ 2.48 శాతానికే కోట్ చేసిన సోమా కన్సార్షియం ఎల్-1గా నిలిచింది. మైనస్ 1.33 శాతాన్ని కోట్ చేసిన సూ - పటేల్ కన్సార్షియం ఎల్-2గా నిలిచింది. ఎల్-1గా ఉన్న సోమ సంస్థకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో త్వరలో జరిగే హై పవర్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

పోలవరం రాక్‌ఫిల్ డ్యాం, స్పిల్‌వే నిర్మాణానికి రూ.4,717 కోట్ల అంచనా వ్యయంతో మే 16న టెండర్లు పిలిచారు. ఈనెల 5న సాంకేతిక బిడ్‌ను తెరిచారు. ఇందులో గామన్ ఇండియా - చిర్కే గెస్ట్రాయ్ - ఏఎమ్మార్, మధుకాన్ - సినో హైడ్రో కార్పొరేషన్, ఐవీఆర్‌సీఎల్ - ఫరబ్ ఇన్‌ఫ్రా, సూ - పటేల్, సోమ - సీజీజీసీ, ట్రాన్స్‌ట్రాయ్ - జేఎస్‌సీ కన్సార్షియంలు పొల్గొన్నాయి. వీటిలో సోమ, సూ కన్సార్షియంలే సాంకేతికంగా అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు సంస్థలు అనర్హతకు గురయ్యాయి. దాంతో సూ, సోమ సంస్థలకు చెందిన ఫైనాన్షియల్ బిడ్‌లను మాత్రమే శుక్రవారం తెరిచారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని రూ.4,599.99 కోట్లతోనే (-2.48%) పూర్తి చేయడానికి సోమ సంస్థ ముందుకు వచ్చింది. సూ సంస్థ మాత్రం రూ.4653.99 కోట్లతో (-1.33%) చేయడానికి సిద్ధపడింది. ఈ రెండు సంస్థల ప్రతిపాదనల మధ్య వ్యత్యాసం రూ.54 కోట్లు ఉంది. ఎల్-1గా నిలిచిన సోమ సంస్థకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని శుక్రవారం జరిగిన ఇంజనీర్-ఇన్-చీఫ్ కమిటీ సమావేశంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి సమాచారం అందించారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని హై పవర్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

ఖజానాపై రూ.477 కోట్ల భారం!: తాజా టెండర్ కారణంగా ప్రభుత్వం ఖజానాపై అదనంగా రూ.477 కోట్ల భారం పడనుంది. గత ఏడాది ఇదే అంచనా వ్యయం (రూ.4,717కోట్లు)తో పిలిచిన టెండర్లలో రూ.4,122 కోట్లకే (-12.61%) ప్రాజెక్టును నిర్మించడానికి సూ సంస్థ ముందుకు వచ్చింది. అంటే అప్పటి టెండర్‌తో పోలిస్తే ప్రస్తుతం ఎల్-1గా నిలిచిన సోమ సంస్థ రూ.477 కోట్లకు అదనంగా టెండర్‌ను దాఖలు చేసింది. గతంలో రెండో స్థానంలో నిలిచిన సోమ సంస్థ ఈసారి కోట్ చేసిన దానికంటే తక్కువకే.. మైనస్ 12.08 శాతానికి ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వచ్చింది. అయితే.. సోమ, సూ సంస్థల మధ్య వివాదం కారణంగా ఆ టెండర్లు రద్దయ్యాయి. దీంతో మళ్లీ మే నెలలో ప్రభుత్వం తాజాగా టెండర్లు పిలిచింది. అయితే, ఇప్పుడు ఈ రెండు సంస్థలూ గతసారి అవి కోట్ చేసిన ధరకంటే దాదాపు 10 శాతం ఎక్కువకు కోట్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో వేచి చూడాలి.

రాద్ధాంతం చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు

సిరిసిల్ల రూరల్ (కరీంనగర్), న్యూస్‌లైన్: సిరిసిల్ల నేతన్నల సమస్యలపై వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లలో ధర్నా చేయడానికి వస్తే అడ్డుకోవడం సరికాదని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. సిరిసిల్ల మండలం రాళ్లపేట, ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామాల్లో శుక్రవారం ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విజయమ్మ పర్యటనను తెలంగాణ వాదంతో ముడిపెట్టొద ్దన్నారు. నేతన్నల సమస్యపై స్పందించి వస్తుంటే అడ్డుకుంటామనడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్ నాయకులు పునరాలోచించి విజయమ్మ ధర్నాను అడ్డుకోవద్దని కోరారు. పేదోడి ప్రతీ గుండెలో, ప్రతీ ఇంటిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారని, అందుకే ప్రజలు తమ పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. 

రాజకీయ ప్రయోజనాలకే రాద్ధాంతం: భాస్కర్

వైఎస్ విజయమ్మ ధర్నాను అడ్డుకోవాలంటూ టీఆర్‌ఎస్ నాయకులు రాద్ధాంతం చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని పద్మశాలి జా తీయ పరిషత్ అధ్యక్షుడు కొక్కుల భాస్కర్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని తెచ్చేది లేదు.. రాజకీయాన్ని వదిలేది లేదన్నట్లుగా టీఆర్‌ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. విజయమ్మ ధర్నా ద్వారా నేతన్నలకు ఎంతో కొంత మేలే జరుగుతుందన్నారు. సిరిసిల్లలో చేనేత శిల్పి పరంధాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే కేటీఆర్ ఆ హామీని విస్మరించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం చూస్తుంటే నేతన్నలపై ఆయనుకున్న ప్రేమ ఏమిటో ఇట్టే అర్థమవుతుందన్నా. సిరిసిల్ల నేతన్నలు వాస్తవాలను గుర్తించి విజయమ్మకు స్వాగతం పలకాలని ఆయన కోరారు.

వైఎస్సార్సీపీ ఇంటింటి ప్రచారం

విజయమ్మ ధర్నాను విజయవంతం చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. రాజ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని సాయినగర్, ఇందిరానగర్, బీవైనగర్‌లో ప్రచారం నిర్వహించారు. మహిళలను గౌరవించే తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పాలని, విజయమ్మకు స్వాగతం పలకాలని ఆయన కోరారు. కార్మికుల సమస్యలపై సర్కారు కళ్లు తెరిపించేందుకే విజయమ్మ ధర్నా చేస్తున్నారని వివరించారు. ధర్నా పోస్టర్‌ను వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ ఆవిష్కరించారు. కాగా, వైఎస్సార్ యువజన విభాగం ఆధ్వర్యంలో విజయమ్మ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ధర్నాకు సహకరించాలని కోరారు. 

కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్: విజయమ్మ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మను శుక్రవారం ఓయూ లా కళాశాల వద్ద ఎదుట దహనం చేశారు. వైఎస్సార్ ఎస్‌యూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు టి రాహుల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ కోసం ఆత్మత్యాగాలకు పాల్పడిన అమరుల కుటుంబాలను కేటీఆర్ ఏనాడు పరామర్శించిన పాపాన పోలేదని రాహుల్‌రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. 

పెరిగిన ఫీజు విద్యార్థే చెల్లించాలి!


‘సుప్రీం’ తీర్పు ప్రకారం భారీగా పెరగనున్న వృత్తి విద్య ఫీజులు
రూ.3,600 కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు చేరనున్న రీయింబర్స్‌మెంట్
పెరిగిన భారాన్ని తప్పించుకునేందుకు ప్రభుత్వం అన్వేషణ
పాత ఫీజులే చెల్లించాలని యోచన
గ్రేడింగ్, మార్కులకు లింకుపై కసరత్తు
బీసీ, ఈబీసీలకు చెల్లింపులేం చే యాలన్నదానిపై సందిగ్ధం
నేడు కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం

హైదరాబాద్, న్యూస్‌లైన్: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వృత్తి విద్యా కోర్సుల ఫీజులు భారీగా పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ఆ ఫీజులు పెరిగితే.. విద్యార్థులకు రీయింబర్స్‌మెంటు పథకం కింద చెల్లించాల్సిన మొత్తం కూడా పెరగనుండడమే దీనికి కారణం. అయితే అదనపు భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు చెల్లిస్తున్నందున ఇంతకన్నా ఎక్కువ భరించవద్దనే యోచనలో ఉన్నట్లు సమాచారం. భారాన్ని తప్పించుకునేందుకు సర్కారు రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది.

నేడు ఉపసంఘం భేటీలో కీలక ప్రతిపాదనలు

కోర్టు తీర్పు ప్రకారం ఏ కోర్సుకు ఎంత ఫీజు పెరిగినా తమకు సంబంధం లేదని, ఇప్పటి వరకు చెల్లిస్తున్న మొత్తాన్ని మాత్రం ప్రభుత్వం యథాతథంగా చెల్లిస్తుందని, మిగిలిన మొత్తాన్ని విద్యార్థులే చెల్లించుకోవాలని చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు శనివారం సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వృత్తివిద్యా కోర్సులకు ఫీజులను ఖరారు చేయాల్సిన సమయం ఆసన్నం కావడం, ఒక్కో కళాశాలలో 40 నుంచి 150 శాతం వరకు ఫీజుల పెంపునకు అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ) ప్రతిపాదన చేసిన నేపథ్యంలో ఈ మంత్రివర్గ ఉపసంఘం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఫీజుల పథకం బడ్జెట్ మరింత పెరగనున్న నేపథ్యంలో ఈ పథకం అమలులో ఎలాంటి మార్పులు చేయాలన్న అంశంపై ఉపసంఘం కీ లక ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనుంది.

రూ.5 వేల కోట్లకు చేరనున్న ఫీజుల బడ్జెట్

ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్ బడ్జెట్ రూ.3600 కోట్లు ఉండగా, వృత్తివిద్యా కోర్సుల ఫీజులు పెరిగితే ఆ మొత్తం దాదాపు రూ.5 వేల కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫీజుల పథకంలో మార్పులు చేసేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతోందని చెబుతున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ బడ్జెట్ ప్రతియేటా పెరిగే అవకాశముందని, ఈ ఏడాది కొన్ని కళాశాలలకే ఫీజుల పెంపు పరిమితమైనా, వచ్చే ఏడాది మిగిలిన కళాశాలలు అనుమతి తెచ్చుకుంటాయని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఇలా అన్ని వృత్తివిద్యా కళాశాలల్లో ఫీజులు పెరిగితే ఫీజుల పథకం బడ్జెట్ భారీస్థాయికి చేరుతుందని వ్యాఖ్యానించారు. వార్షిక బడ్జెట్‌ను ప్రభావితం చేసేలా ఫీజుల పథకానికి నిధులివ్వాల్సి వస్తే మిగిలిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ నిర్వహణ పరిస్థితేంటని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో కొంత ఫీజును విద్యార్థులు భరించక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

సబ్‌ప్లాన్‌లో కలిపేద్దామా?

ఫీజుల భారాన్ని తప్పించుకునేందుకు ఎస్సీ, ఎస్టీలకు ఫీజుల చెల్లింపును సబ్‌ప్లాన్ బడ్జెట్‌లో కలిపే అవకాశంపై కూడా ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. అయితే, ఎస్సీ, ఎస్టీ ఫీజులను సబ్‌ప్లాన్‌లో కలిపితే ఏ శాఖ ద్వారా చెల్లింపులు జరగాలి, వివిధ శాఖల బడ్జెట్ నుంచి ఫీజులకు నిధులను మంజూరు చేయవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తోంది. కానీ, ఈ ప్రతిపాదన అమలుసాధ్యం కాదనే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. సబ్‌ప్లాన్ నిధుల్లో కలిపి ఎస్సీ, ఎస్టీలకు పెరిగిన ఫీజుతో సహా మొత్తం ఫీజును చెల్లిస్తే మరి బీసీ, ఈబీసీలకు ఎలా చెల్లించాలన్న దానిపై సమస్య ఏర్పడుతుందనే మీమాంసలో ఉంది.

ఈ పరిస్థితుల్లో పాత పద్ధతిలో ఫీజుల పథకాన్ని యథాతథంగా కొనసాగించి, పెరిగిన ఫీజులను విద్యార్థులే భరించాలని చెప్పేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. లేదంటే కోర్సుకు అత్యధికంగా ఖరారయిన ఫీజును తీసుకుని, అందులో 50 శాతం చెల్లిస్తామని, ఈ మొత్తాన్ని అన్ని కళాశాలలకు వర్తింపజేస్తామని, మిగిలినది విద్యార్థులే చెల్లించుకోవాలని చెప్పే అంశాన్ని కూడా తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ విధంగా కళాశాలల గ్రేడింగ్ పూర్తయ్యేవరకు ఫీజులు చెల్లించి ఆ తర్వాత మంచి గ్రేడింగ్ పొందిన విద్యాసంస్థలకే ఫీజుల పథకాన్ని అమలు చేయాలనే ప్రతిపాదనను కూడా మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించనున్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సుల మాదిరిగానే వృత్తి విద్యా కోర్సుల ఫీజుకూ ఒక పరిమితి నిర్ణయించి ఆ మేరకు ప్రభుత్వమే చెల్లించి.. మిగతాది విద్యార్థి చెల్లించే అంశాన్ని కూడా ప్రతిపాదనల్లో పెడుతున్నారు. ఇన్ని సమస్యలు, ప్రశ్నల నేపథ్యంలో ఫీజుల పథకం అమలుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం 26 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది.

మంత్రి మండలి అనుమతితోనే అన్ని కేటాయింపులు: నిమ్మగడ్డ

రాక్ చెల్లించిన సొమ్మును నిమ్మగడ్డ ఖాతాలో జమచేసుకున్నారు
ఈ దశలో బెయిల్ ఇస్తే దర్యాప్తునకు విఘాతం: సీబీఐ
ఇరువర్గాల వాదనలు పూర్తి...తీర్పు ఈనెల 30కి వాయిదా

హైదరాబాద్, న్యూస్‌లైన్:వాన్‌పిక్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రస్తుత ముఖ్యమంత్రి, రస్ ఆల్‌ఖైమా (రాక్) ప్రభుత్వం ఇప్పటికీ భావిస్తున్నాయని వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు. దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం మరోసారి విచారించారు. భూముల కేటాయింపుల్లో రహస్యమేమీ లేదని, అన్నింటికీ జీవోలు ఉన్నాయని... వాటిపై ఐఏఎస్ అధికారి మన్మోహన్‌సింగ్ సంతకం చేశారని ఉమామహేశ్వర్‌రావు తెలిపారు. ప్రభుత్వం భూములు కేటాయించిన లక్ష్యం నెరవేరకపోతే నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొన్నారు. వాన్‌పిక్ నిబంధనల మేరకే వ్యవహరించిందని, పరిహారం చెల్లించి భూములను కూడా స్వాధీనం చేసుకుందని చెప్పారు. వాన్‌పిక్ ప్రాజెక్టులోగానీ, రాయితీ ఒప్పందాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చట్టపరమైన చర్యలు చేపట్టవచ్చని, అయితే అవి నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదని వివరించారు. వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం రాక్ ప్రభుత్వం చెల్లించిన రూ. 450 కోట్లలో కొంత మొత్తాన్ని నిమ్మగడ్డ ప్రసాద్ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని... ఇందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్లు ఉన్నాయని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ వాదనలు వినిపించారు. 

రాక్ ఇచ్చిన డబ్బులో రూ. 150 కోట్లను రైతులకు పరిహారంగా చెల్లించారని, మిగిలిన డబ్బులో రూ. 140 కోట్లు జగన్ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టారని తెలిపారు. రాక్ తరఫున చైర్మన్ హోదాలో నిమ్మగడ్డ ఒప్పందంపై సంతకం చేశారని, డెరైక్టర్‌గా ఆయన ఏజెంట్ పరిధిలోకి వస్తారని... ఈ నేపథ్యంలో ఐపీసీ 409 సెక్షన్ ఆయనకు వర్తిస్తుందని పేర్కొన్నారు. అధికారులతో కుమ్మక్కై తమకు అనుకూలంగా జీవోలు జారీ చేయించుకున్నారని, అందుకే ఐఆర్‌ఏఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి నిందితునిగా మారారని వివరించారు. వాన్‌పిక్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నామని, ఈ దశలో నిమ్మగడ్డకు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు విఘాతం కల్గుతుందని నివేదించారు. నిమ్మగడ్డ పలుకుబడి కలిగిన వ్యక్తని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, తీర్పును ఈనెల 30కి వాయిదా వేశారు. 

టీడీపీ అభ్యర్థి అర్కలకు చుక్కెదురు


నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానంలో ఫలితం తారుమారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల కోటాలో నిజామాబాద్ నుంచి శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ నేత అర్కల నర్సారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. నర్సారెడ్డి ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డిగారి వెంకటరామిరెడ్డి 9 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ రెడ్డి కాంతారావు శుక్రవారం తీర్పునిచ్చారు. దీంతో మూడేళ్లుగా నడుస్తున్న వివాదానికి తెరపడింది. 2009 మార్చి 30న నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి నర్సారెడ్డి, కాంగ్రెస్ నుంచి వెంకటరామిరెడ్డి పోటీపడ్డారు. ఎన్నికల్లో నర్సారెడ్డి ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. 

ఓట్ల లెక్కింపుల్లో అవకతవకలు జరిగాయని, రీకౌంటింగ్ నిర్వహించాలని కోరుతూ వెంకటరామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు... ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివాదాస్పదంగా మారిన మూడు ఓట్లు వెంకటరామిరెడ్డికి అనుకూలంగా ఉన్నాయని గతంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నర్సారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా...వివాదాస్పంగా మారిన మూడు ఓట్లను ముందుగా లెక్కించిన తర్వాత మిగిలిన మొత్తం ఓట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలైన ఓట్లను తిరిగి లెక్కించిన తర్వాత... వెంకటరామిరెడ్డి 9 ఓట్లతో గెలుపొందినట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. 

ఓట్లను ఇలా లెక్కించారు: పిటిషనర్, ప్రతివాదితోపాటు ఇరువర్గాల న్యాయవాదులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో వివాదాస్పదంగా మారిన 26 ఓట్లను గుర్తించారు. 16 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. మిగిలిన 10 ఓట్లలో వెంకటరామిరెడ్డికి 7 ఓట్లు వచ్చినట్లు గుర్తించారు. దీంతో గతంలో వచ్చిన 335+7 ఓట్లతో కలిసి మొత్తం 342 ఓట్లు వెంకటరామిరెడ్డికి వచ్చాయి. ఈ నేపథ్యంలో 9 ఓట్ల తేడాతో వెంకటరామిరెడ్డి గెలుపొందినట్లు హైకోర్టు నిర్ధారించింది. 

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా: అర్కల

హైకోర్టు తీర్పు అనంతరం ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి శుక్రవారం ఎన్‌టీఆర్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. 

సైకిల్ ‘గాలి’ తీస్తున్న బాబు

రాష్ట్రపతి ఎన్నికల్లో బాబు వైఖరిని తప్పుబడుతున్న నేతలు
- నాయకత్వ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటున్న సీనియర్లు
- థర్డ్ ఫ్రంట్‌లో కాంగ్రెస్ మద్దతు తీసుకోలేదా? కేంద్రంలో మంత్రి పదవులు పొందలేదా?
- ఇప్పుడు ప్రణబ్‌కు ఓటు వేయకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?
- ఆనాడు బీజేపీతో అంటకాగి ఇప్పుడు అంటరానిదంటే నమ్ముతారా?
- అధికారంలో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుని ఓడిపోగానే మతతత్వ పార్టీ అయిందా?
- ఓటు హక్కు వినియోగించుకోవాలని లెక్చర్లిచ్చిన మనమే.. దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలకు దూరంగా ఉండాలా?.. పార్టీ నాయకత్వం స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతోందన్న విషయాన్ని ప్రజలు గ్రహించారంటున్న నేతలు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిం ది నేనే’’.. అంటూ గొప్పలు పోయిన చంద్రబాబు.. గురువారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ధైర్యమే చేయలేకపోయారు. ఓటు విలువపై ఊకదంపుడు ప్రసంగాలు చేసిన టీడీపీ అధినేత.. తనతోపాటు పార్టీ ప్రజాప్రతినిధులందరినీ ఓటు హక్కుకు దూరంగా ఉంచారు. అత్యంత కీలకమైన దేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలన్న చంద్రబాబునాయుడు నిర్ణయంపై ఆ పార్టీ నేతల్లో ఇప్పటికీ విస్తృతమైన చర్చ జరుగుతూనే ఉంది. 

జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో బాబు విఫలమవుతున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పార్టీలో పటిష్టమైన నాయకత్వం లేదనడానికి ఇది నిదర్శనమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘దేశంలో ఏక పార్టీల పాలనకు కాలం చెల్లింది. ముందున్నది సంకీర్ణ ప్రభుత్వాల యుగమే’’ అని ఊదరగొట్టిన చంద్రబాబు.. రాష్ట్రపతి ఎన్నిక లకు దూరంగా ఉండటం సరైన నిర్ణయం కాదని అంటున్నారు. 

అత్యున్నతమైన రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఒక దిశా నిర్దేశం లేకుండా వ్యవహరించడమేనని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ‘‘జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీయే భాగస్వామ్య పక్షాలు సైతం యూపీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. యూపీఏకు దూరంగా ఉంటున్న సీపీఎంలాంటి పార్టీలు కూడా ప్రణబ్ ముఖర్జీకి మద్దతిచ్చాయి. దీనిని ఆషామాషీ రాజకీయంగా చూడాల్సిన సందర్భంకాదు’’ అని వారు అన్నారు. ‘‘ఎన్నికల్లో ఓటు వేయటం పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని కాదనే అధికారం చంద్రబాబుకు లేదు’’ అని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి వ్యాఖ్యానించారు. 

‘‘ఈ ఎన్నికకు దూరంగా ఉండాలన్న పార్టీ వైఖరి సరికాదనే వైఖరితో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది కచ్చితంగా రాజకీయంగా చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయం’’ అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం సోయిలో లేదన్న ప్రచారం ఇప్పటికే ప్రజల్లో బాగా నాటుకుపోయిందని, ఇలాంటి తరుణంలో కీలకమైన అంశంలో చొరవ తీసుకోకుండా రంగం నుంచి తప్పుకోవడం ఎత్తుగడ వ్యవహారం అనిపించుకోదన్న భావన చాలా మంది నేతల్లో వ్యక్తమవుతోంది. 

‘‘రాష్ట్రపతి ఎన్నికల్లో వైఖరిని వెల్లడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తర్జనభర్జన పడినప్పటికీ, నిర్ణయాధికారాన్ని పార్టీ అధ్యక్షుడికి కట్టబెట్టారు. ఆయన జైలులో ఉన్నప్పటికీ, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, మరో నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డిలు వెళ్లి ఆయనతో చర్చించి కచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించగలిగారు. అలాంటిది మూడు దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ కేంద్రంలో చక్రం తిప్పామని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు తప్పించుకోవడం సరైన విధానం కాదు’’ అని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండటానికి చంద్రబాబు చెబుతున్న కారణాలను అదే పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ‘‘ఏ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని చె బుతున్నామో అదే పార్టీ మద్దతుతో కేంద్రంలో మంత్రి పదవులను అనుభవించలేదా? ఏ బీజేపీని మతతత్వ పార్టీగా ప్రచారం చేస్తున్నా మో అదే పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకోవటంతో పాటు లోక్‌సభ స్పీకర్ పదవిని తీసుకోలేదా? అప్పుడు లేని అభ్యంతరాలు రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మాత్రమే ఎందుకు వచ్చాయి’’ అనే అనుమానాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. బలహీనమైన నాయకత్వానికి ఇది బల మైన ఉదాహరణ అని అభివర్ణిస్తున్నారు. 

1999, 2004 ఎన్నికల్లో ఏకంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీ మతతత్వ పార్టీ అన్న సాకు వెతుక్కోవడం విచి త్రంగా ఉందని రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన రోజు నుంచే రంగంలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఆ రోజు కూడా ఎవరికి ఏయే పార్టీలు మద్దతునిస్తున్నాయో స్పష్టంగా తెలుసు. 

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తామని ఆనాడే చెప్పి ఉండాల్సింది. బీజేపీ మతతత్వ పార్టీ అయినందున అది మద్దతిచ్చిన అభ్యర్థికి ఓటు వేయబోమని కూడా ఆరోజే ప్రకటించాల్సింది. పోలింగ్‌కు రెండ్రోజుల ముందు వరకు సాగదీయడమంటే నాయకత్వంలోనే లోపం ఉందన్న విషయం స్పష్టంగా కనబడుతోంది’’ అని ఆ ఎమ్మెల్యే చెప్పా రు. పార్టీ నిర్ణయం మేరకు ఎవరో ఒకరికి ఓటు వేయాలని రెండ్రోజుల ముందే హైదరాబాద్ వచ్చానని, ఓటింగ్‌నకు దూరంగా ఉండాలన్న బాబు నిర్ణయం తెలిసి విస్మయం చెందానని ఆయన చెప్పారు. ‘‘నాతోపాటు అయిదుగురం కాంగ్రెస్ మద్దతుతో కేంద్రంలో మంత్రులుగా పనిచేశాం. తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. 

లోక్‌సభ స్పీకర్ పదవీ తీసుకున్నాం. బీజేపీతో పొత్తుతో రాష్ట్రంలో అధికారం సాధించాం. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది?’’ అని సీనియర్ ఎమ్మెల్యే వేణుగోపాలచారి అన్నారు. ‘‘సైద్ధాంతిక విభేదాలున్న టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐలతో కూడా మా పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయవద్దని చెప్పటం సరికాదు. ఓటు వేయాలా లేదా అనేది మా విచక్షణాధికారం. ఓటింగ్‌లో పాల్గొనాలని అందరికీ చెప్పిన పార్టీనే ఓటు వేయకూడదని నిర్ణయించటం సరికాదు’’ అని ఆయన అన్నారు. 


వెంటాడుతున్న నిజాలు
‘‘చంద్రబాబు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 1996లో కాంగ్రెస్ మద్దతుతో కేంద్రంలోని యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో పదవులు తీసుకుని అధికారాన్ని అనుభవించాం. అప్పట్లో ఢిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారు. 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్‌డీఏ విజయం సాధించింది. అప్పటివరకూ బీజేపీ మసీదులు కూలుస్తుంటే తాము మసీదులు కట్టిస్తున్నామని ఊరూవాడ ప్రచారం చేసిన చంద్రబాబు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. బీజేపీ పంచన చేరారు. 

కార్గిల్ యుద్ధం సమయంలో బీజేపీకి దేశవ్యాప్తంగా ఆదరాభిమానాలు పెరగటాన్ని గ్రహించి 1999 సాధారణ ఎన్నికల్లో అదే పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, వాజ్‌పేయి కార్డును ఉపయోగించి చంద్రబాబు రాష్ట్రంలో అధికారం సాధించారు. తరువాత గుజరాత్ రాష్ట్రంలో గోద్రా సంఘటన అనంతరమూ చంద్రబాబు బీజేపీని అంటిపెట్టుకున్ని ఉన్నారు. 2004 ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు కొనసాగించారు. ఆ ఎన్నికల్లో అటు కేంద్రంలో బీజేపీ కూటమి, ఇటు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కూటమి చిత్తుగా ఓడిపోయాయి. బీజేపీ ప్రాభవం కోల్పోతోందని గ్రహించిన చంద్రబాబు.. ఆ పార్టీకి దూరం కావడం ప్రారంభించారు. 

అయితే, ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి మైనారిటీలను దూరం చేసుకోవడమేనని గమనించిన తర్వాత.. బీజేపీ మతతత్వ పార్టీ అంటూ విమర్శించడం మొదలెట్టారు. ఇవన్నీ అవకాశవాద ఎత్తుగడలేనని ప్రజలు గ్రహించారు. మా నాయకత్వంలో స్థిర నిర్ణయం లేదన్న విషయాన్ని పసిగట్టారు’’ అని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కీలక విషయాల్లోనూ ఏ వైఖరీ లేకపోవటమే తమ పార్టీ వైఖరిగా మారిపోయిందని వారు అంటున్నారు. 

మ్యాచ్ ఫిక్సింగ్‌లతో కుదేలు
ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేసుకోవడమూ పార్టీని మరింత కుంగదీసిందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల అనంతరం జరిగిన అనేక ఉప ఎన్నికలు, శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చంద్రబాబు సందర్భానుసారంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న విషయం బహిరంగ రహస్యమే. ఇటీవలి ఉప ఎన్నికలతో సహా అన్ని ఎలక్షన్లలో పరస్పరం ఓట్లు బదలాయించుకున్న విషయమూ బయటపడింది. సందర్భాన్ని బట్టి అటు కాంగ్రెస్‌తో, ఇటు బీజేపీతోనూ చెలిమి చేయడం, కీలకమైన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తప్పుడు నిర్ణయం తీసుకోవడంద్వారా ప్రజల్లో పార్టీ మరింత పలచనైపోయిందన్న అభిప్రాయం పార్టీలో సర్వత్రా వ్యక్తమవుతోంది.

‘మర’ణమగ్గంపై ‘సిరి’నేత!

వస్త్రోత్పత్తి చేసే వృత్తి నైపుణ్యం తమదైనా, లాభాలు పెట్టుబడిదారుల హక్కుభుక్తమయ్యాయి. చేనేతకన్నా మరమగ్గాలు మెరుగైన జీవితాన్ని ఇస్తాయని ఆశించిన నేతన్నలకు నిరాశే ఎదురైంది. సగటు చేనేత కార్మిక కుటుంబం రోజువారీ కూలీ ఈ నాటికీ రూ.100 నుంచి రూ.150కు మించడంలేదు. మరమగ్గాల కార్మికుల ఆదాయం కూడా ఇంతకు మించి లేకపోవడం గమనార్హం.

మరమగ్గాలపై నేసే నేతన్నల సమస్యలకు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ముఖచిత్రంగా మారిం ది. సిరిసిల్ల ఊరి పూర్వ నామం ‘శ్రీశాల’. నిజాం కాలంలో చేనేత రంగంలో అగ్రగామిగా నిలిచింది. సిరిసిల్లతో పాటు కరీంనగర్ జిల్లాలో ఇంకా అనేక చోట్ల చేనేత ఉచ్ఛదశలో ఉండేది. 1987-88 చేనేత జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 5 లక్షల చేనేత మగ్గా లుంటే ఒక్క కరీంనగర్ జిల్లాలోనే లక్షకుపైగా చేనేత మగ్గాలుండేవి. 

జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, కమలాపూర్, మెట్‌పల్లి, వేములవాడ, పెద్దపల్లి మొదలైన ప్రాంతాలలో వేలాదిగా చేనేత వృత్తిదారులు ఉండేవారు. ఇంకా చెప్పాలంటే చేనేత మగ్గంలేని గ్రామాలు కరీంనగర్ జిల్లాలో బహుస్వల్పం. ఇంతటి ప్రాధాన్యం గల ఈ ప్రాం తంలో కరువు, గిట్టుబాటు సమస్యల కారణంగా వేలాది మంది చేనేత పనివారు పశ్చిమ భారతానికి వలస వెళ్లారు. 1960, 1970లలో షోలాపూర్, భివండి, సూరత్ వంటి పట్టణాలలో మిల్లులు, మరమగ్గాలలో పనిచేసేందుకు నేతన్నలు వలసబాట పట్టారు. ఈ వలసల అనుభవం నుంచి మరమగ్గాలను తమతమ గ్రామాలకు తీసుకు రావాలనే ఆలోచన వారిలో తలెత్తింది. 

ఈ క్రమంలో సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1961లో ప్రధాన చేనేత కేంద్రమైన సిరిసిల్లకు పత్తిపాక విశ్వనాథం సోదరులు రెండు జోడీల మరమగ్గాలు (సాంచాలు) తెచ్చుకున్నారు. 1961లో ఆరం భమైన మరమగ్గాల ప్రస్థానం 1980ల నాటికి వేగం పుం జుకుంది. 1982లో తలెత్తిన సంక్షోభం సిరిసిల్ల నేతన్నల జీవితాలను అతలాకుతలం చేసింది. 1990ల నాటికి వాటి సంఖ్య 25 వేలకు చేరుకుంది. అయితే ఆ ఏడాది పరిశ్రమ కుప్పకూలిన ఫలితంగా ఎందరో నేతన్నలు, అద్దకం రం గుల వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2001లో 32 వేల మరమగ్గాలుండగా, సంక్షోభానికి సాక్షీభూతంగా వాటిలో సగం తుక్కు కింద అమ్మేశారు. ఈ ఒక్క ఏడాది లోనే 156 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల పట్టణంలో మొత్తం 33 వేల మరమగ్గాలున్నాయి. 

సంక్షోభం మూలాలు
చేనేత రంగ సంక్షోభం ఈ నాటిది కాదు. ఆధునిక సమాజ పురోగమనంలో యాంత్రికీకరణ మూలంగా సంప్రదాయ జ్ఞానం, ఉత్పత్తులు నిరాదరణకు గురవుతున్నాయి. సామ్రాజ్యవాద కుట్రలో భాగంగా బ్రిటిష్ పాలకులు చేనేత పరిశ్రమ నడ్డివిరిచారు. చేనేత కార్మికుల బొటన వేళ్లను నరికి దేశీయ నైపుణ్యాన్ని బుగ్గిచేయాలని చూశారు. ఈ పరిణామమే జాతీయోద్యమంలో విదేశీ వస్త్ర బహిష్క రణకు దారితీసింది. 

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మన పాలకులు వస్త్రరంగంలో చేనేత పరిశ్రమను గుర్తించి ప్రోత్సహించారు. స్థానిక మార్కెట్ల కోసం ఉత్పత్తి చేసే నేతన్నలు, దేశ-విదేశీ వినియోగదారుల కోసం ఉత్పత్తి చేయడం ఆరంభించారు. కానీ నూలు, రంగుల ధరలకు అనుగుణంగా తాము తయారు చేసిన వస్త్రాలకు ధర పలకకపోవటంతో నష్టాలపాలై నేతన్నలు ఇతర వృత్తులు చేపట్టాల్సి వచ్చింది. అన్ని ఉత్పత్తి రంగాలలో వచ్చిన యాంత్రికీకరణ వస్త్రరంగంలోనూ ప్రవేశించింది.

ఫలితంగా యంత్రాలపై వస్త్రాలు ఉత్పత్తి చేయడం ఆరంభ మైంది. మరమగ్గాలపై పనిచేసిన నేతన్నలు తామే స్వయంగా మరమగ్గాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయిం చడంతో తొలిదినాల్లో సిరిసిల్ల కేంద్రంగా మగ్గాల ఏర్పాటు ఉధృతంగా సాగింది. మరమగ్గాలు నెలకొల్పేందుకు లక్ష లాది రూపాయల పెట్టుబడి అవసరమవుతుంది. అయితే హెచ్చు మోతాదులో పెట్టుబడులు తప్పనిసరి కావడంతో సంపన్నులు, వడ్డీ వ్యాపారులు ఈ రంగంలోకి వచ్చారు. ఫలితంగా వృత్తి నైపుణ్యం తప్ప ధనబలం లేని నేతన్నలు కూలీలుగా మారిపోయారు. 

దీంతో నేతన్నలు అనివా ర్యంగా పరాయీకరణకు గురయ్యారు. వస్త్రోత్పత్తి చేసే వృత్తి నైపుణ్యం తమదైనా, లాభాలు పెట్టుబడిదారుల హక్కుభుక్తమయ్యాయి. చేనేతకన్నా మరమగ్గాలు మెరు గైన జీవితాన్ని ఇస్తాయని ఆశించిన నేతన్నలకు నిరాశే ఎదురైంది. సగటు చేనేత కార్మిక కుటుంబం రోజువారీ కూలీ ఈ నాటికీ రూ.100 నుంచి రూ.150కు మించడం లేదు. మరమగ్గాల కార్మికుల ఆదాయం కూడా ఇంతకు మించి లేకపోవడం గమనార్హం.

అత్యధిక జనాభా, నిరుద్యోగం గల మన దేశానికి యూరప్ అభివృద్ధి నమూనాయే పరిష్కారమార్గం అని బల్లగుద్ది వాదించేవారు మరమగ్గాల సంక్షోభం గురించి అడిగితే ఏం సమాధానం చెబుతారు? చేనేత కార్మికులు ఇంకా పాతకాలపు మగ్గాలపై పనిచేస్తున్నారని, మరమగ్గా లను ప్రోత్సహించాలని కాక మరేం చెబుతారు! మరి మరమగ్గాలను ప్రోత్సహించడంలోనూ మన ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నది సిరిసిల్ల అనుభవం నిగ్గుదేర్చింది. 

కారణాలు లెక్కకు మిక్కిలి
వేలాది మంది కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సిరిసిల్ల అర్ధశతాబ్దంగా ఉపాధి కల్పిస్తున్నది. ఈ రంగానికి ప్రధాన వనరు ఇంధనం. విద్యుత్తు ధరలు పెరగడంతో 2000 సంవత్సరం సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమలో క్షీణ దశకు నాంది పలికింది. పరిశ్రమ ఒక్కసారిగా కాటన్ వస్త్రా లతయారీ నుంచి పాలిస్టర్ వస్త్రాల తయారీ వైపు మొగ్గ డంతో ఇక్కడి ఉత్పత్తిదారులు హైదరాబాద్‌లోని పెట్టు బడిదారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నూలు, రంగుల అద్దకం, సైజింగ్, మార్కెటింగ్ వంటి విషయాలపై ఏనాడూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించ లేదు. నేతన్నల ఆకలి చావులు, ఆత్మహత్యల నేపథ్యంలో సానుభూతి ఒలకబోసే ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప చిత్తశుద్ధితో వస్త్ర పరిశ్రమను అభివృద్ధి పర్చాలని భావించలేదు. 

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పవర్‌లూం పార్కు ఏర్పాటు చేసినా అది పెట్టుబడిదారులకు, మాస్టర్ వీవర్లకే ప్రయోజనం చేకూర్చింది. ఇంతాచేసి కార్మికులు కోరుతున్నది పనికి తగిన వేతనం, ఆరోగ్య రక్షణ, వృత్తి భద్రత, పిల్లల చదువులు వంటి కనీస అవసరాలు. కానీ అవి ప్రభుత్వానికి గొంతెమ్మ కోరికల్లా కనిపిస్తున్నాయి. ఈ నాటికీ నేతన్నల జీవితాలు ఏ విధంగా చూసినా దుర్భరంగానే ఉన్నాయి. సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న నేత పనివారి భార్యలు సంఘంగా ఏర్పడటం సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడటమే నేతన్నల వంతైంది.

నేతకు వైఎస్ చేయూత
2004 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం రైతులతోపాటు నేతన్నలకు ఆపన్న హస్తం అందించటంలో ముందుంది. ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలకు లక్షన్నర ఎక్స్‌గ్రేషియాను ప్రకటిం చింది. ముఖ్యంగా సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ అభి వృద్ధికి 50 శాతం విద్యుత్ సబ్సిడీని ఖచ్చితంగా అమలు పరిచింది. 

ప్రతి నేతన్న కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు కోసం రూ.50 వేల చొప్పున సుమారు రూ.100 కోట్ల రుణ సౌకర్యం కల్పించింది. ఆకలి చావులతో పాటు, ఆత్మ హత్యలు జరిగిన ప్రతి కుటుంబానికి అదనంగా రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, ఆరోగ్య వసతి కల్పించారు. కానీ గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం విద్యుత్ సబ్సిడీ రూ.4 కోట్ల మేర రీయింబర్స్ చేయలేదు. ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు లక్షన్నర ఎక్స్‌గ్రేషియా చెల్లింపులో అలక్ష్యం కనబరుస్తున్నది. 

క్షుద్ర రాజకీయం...
వైఎస్‌ఆర్‌సీపీ ఇటీవల ప్రజాసమస్యలపై పోరాడుతున్నది. గతంలో ధర్మవరంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కా రానికి ధర్నా నిర్వహించారు. ఈ నెల 23న విజయమ్మ నేతన్నలకు అండగా దీక్ష నిర్వహించేందుకు సిరిసిల్ల వస్తున్న సందర్భంగా వివాదం సృష్టించడం అసమం జసం. ఆరు నెలల క్రితం ‘రైతు దీక్ష’ చేసిన జగన్‌ను ఆర్మూ ర్‌లో అడ్డుకోని టీఆర్‌ఎస్, నేతన్నల కోసం దీక్ష చేపట్టిన విజయమ్మను అడ్డుకోవడంలోని ఆంతర్యం ఏమిటి? ప్రజాసమస్యలపై ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోరాడ తారు. తమను పరామర్శించడానికి వచ్చే ప్రతి ఒక్కరినీ నేతన్నలు స్వాగతించారు. ఓటు రాజకీయమైనా, సీటు రాజకీయమైనా నేతన్నలకు భవిష్యత్‌పై ఆశ. విజయమ్మ రాకతో నైతిక మద్దతు తమకు లభిస్తుందని వారు అభిలషిస్తున్నారు.

నేతన్నల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి, తెలంగాణ అంశాన్ని తెరపైకి తేవడం టీఆర్‌ఎస్ ఓటు రాజకీయంలో భాగమేనని నేత కార్మికులు భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయ రంగంలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలీలు ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ వారిది కీలకపాత్ర. అయినా టీఆర్‌ఎస్ పార్టీ ఏనాడూ చేనేత కులస్తులను నాయకులుగా ఎదగనీయలేదు. అసెంబ్లీ, లోక్‌సభ ప్రవేశం కోరే పద్మశా లీలకు ఏనాడూ బీ-ఫారం ఇవ్వలేదు. 

కానీ కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్ పార్లమెంట్ స్థానాలలో పద్మ శాలీలను ఓడించిన ఘనత ఆ పార్టీకే దక్కుతుంది. సిరిసిల్లను కబ్జా చేసింది టీఆర్‌ఎస్ పార్టీనే. పద్మశాలీల ఓటు బ్యాంకు పూర్తిగా దూరం అవుతుందనే భయంతోనే విజయమ్మ ధర్నాను ఆ పార్టీ అడ్డుకోజూస్తుంది తప్ప, తెలంగాణ రాష్ట్ర సాధనపై చిత్తశుద్ధితో కాదు. ప్రాంతీయ ఉద్యమం పేరుతో నేతన్నలకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పడానికి సిరిసిల్ల సిద్ధంగా ఉంది. 

- తడ్క యాదగిరి 
కన్వీనర్ తెలంగాణ పద్మశాలి ఉద్యమ వేదిక

'ధర్నా' పరిశీలనకు హైకోర్టు సూచన

Written By news on Friday, July 20, 2012 | 7/20/2012

సిరిసిల్లలో ఈనెల 23న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ చేయతలపెట్టిన ధర్నాకు అనుమతి ఇచ్చే విషయం పరిశీలించాలని హైకోర్టు కరీంనగర్ పోలీసులకు సూచన చేసింది. సిరిసిల్లలో విజయమ్మ ధర్నాకు అనుమతి ఇవ్వాలని ఆ పార్టీ నాయకుడు యాదగిరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్నాకు అనుమతి ఇచ్చే అంశం పరిశీలించాలని కరీంనగర్ పోలీసులకు సూచించింది.  

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలు వేణుగోపాలచారి, హరీశ్వర్ రెడ్డి, రామకోటయ్య, బాలనాగిరెడ్డిలను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని టిడిపి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి టిడిపి ఎమ్మెల్యేలు ఐదుగురు ఓటు వేశారు. మరో ఎమ్మెల్యే కొడాలి నానిని కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మని కలిసిన రోజునే సస్పెండ్ చేశారు.

సోమ కంపెనీకి దక్కిన పోలవరం టెండర్

పోలవరం టెండర్ సోమ కంపెనీకి దక్కింది. పోలవరం టెండర్లను అధికారులు ఈరోజు తెరిచారు. 4712 కోట్ల రూపాయలు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆరు కంపెనీలు పోటీ పడ్డాయి. నాలుగు కంపెనీలు సరైన డాక్యుమెంట్లు సమర్పించనందున ఆ టెండర్లను తిరస్కరించినట్లు ఇంజనీర్-ఇన్-ఛీఫ్ వెంకటేశ్వర్లు తెలిపారు. రెండు కంపెనీల టెండర్లు ప్రాజెక్టు నిర్మాణవ్యయానికి దగ్గరగా ఉన్నాయి. ఎల్-1గా సోమ అండ్ కంపెనీ 4,599.99 కోట్ల రూపాయలకు కొటేషన్ దాఖలు చేసింది. ఎల్ -2గా ఎస్ఇడబ్ల్యూ కంపెనీ 4,653.99 కోట్ల రూపాయలకు కొటేషన్ దాఖలు చేసింది. సోమ కంపెనీకి టెండర్ దక్కిందని వెంకటేశ్వర్లు చెప్పారు.

How Chandrababu Naidu lost the plot

How Chandrababu Naidu lost the plot
HYDERABAD: Ad guru Alyque Padamsee remembers the time that he was communications advisor to Chandrababu Naidu circa 2000 AD. "Clinton was coming to Hyderabad and Naidu wanted to impress the US president so that he could endorse the city as an international investment destination," Padamsee says adding that there was only a window of fifteen minutes that Naidu would have with Clinton, one to one, to make an impression." It was decided that this time would be used to request Clinton to apply for a driving license online and even before the fifteen minutes got over, the driving license would be delivered online. This would demonstrate the strides that Andhra Pradesh had made in e-goveranance, "the ad guru remembers. In the event, things went as planned leaving a mighty pleased US President who went to his next public meeting with Indian corporate chiefs commending Naidu and Hyderabad to them. A few weeks later Clinton was in Tokyo brandishing the driving license that he secured in fifteen minutes in Hyderabad before Japanese corporates.

But that was then. Twelve years later Chandrababu Naidu seems to have lost the plot with a steady exodus of partymen from the Telugu Desam Party (TDP). In the latest, 5 MLAs of TDP defied the party line and cast their vote in the Presidential poll. Naidu has told his legislators and Parliamentarians to keep away. Evidence suggests that 4 of these MLAs are bound for Jagan's YSR Congress, while one of them wants to switch over to the Congress party. "There is growing disenchantment in TDP. Many more are waiting in the wings ready to leave. Our party does not seem to be going anywhere," says a senior party leader. The specific cause of worry is that although in opposition since 2004, TDP is unable to benefit from the anti- incumbency. Political analysts point out that the beneficiary of the anti- incumbency of the Congress is YSR Congress. "Though in the opposition, the voter is treating us at par with the ruling party. That is why we did not pick up a single seat in the last round of elections to 18 assembly seats, where even the Congress got two seats," the leader adds.

Analysts point out that much of the problem has arisen because Naidu has given up what is called in marketing parlance USP (unique selling proposition). The first state leader to take up liberalization, the chief minister credited as the founder of modern Hyderabad, Naidu took a U-turn after he was voted out of power in 2004. Journalists remember that he almost became apologetic about economic reforms after he lost the polls. Instead he started concentrating on farmers' issue, but made little impact because Y S Rajasekhara Reddy who was in power had opened the treasury to farmers and other rural folks in the form of various incentives like free power etc. This made Naidu make better promises to farmers but to no impact because YSR had established himself as the messiah. After his death, his son Jagan has inherited the mantle of YSR. Jagan also benefited (and left Naidu at a disadvantage) because of the changing demographic profile of voters. With youth now comprising a third of the voters, Naidu (although remarkably fit at 61) cannot match Jagan in sheer appeal to the youth. "The world has changed Naidu cannot connect with the youth. He kept on harping on corruption not realizing that the voter takes it as a given that all politicians are corrupt. They vote for the person who they feel will share the booty with them," a TDP leader reasons.Given the fact that Naidu seized power by dethroning his father in law N T Rama Rao (NTR), he runs TDP with an iron hand with no role for anybody else. There is no empowered second line to expand the party and the talk is that Naidu is pushing his son Lokesh as a successor. But Lokesh is not seen as a political animal. Earlier there was talk of NTR junior, the grandson of the NTR and also a successful Telugu film hero being groomed for the leadership of TDP. "NTR junior besides being a cine star and young (in his late twenties) has a remarkable likeness to his grandfather NTR. This can help us to revive old memories of NTR who is held in great respect by voters," a TDP insider points out. But Chandrababu Naidu has reservations about NTR junior who consequently is these days drifting away towards Jagan and YSR Congress. Party sources speculate that Naidu is also mulling about grooming Brahmani, his Stanford educated daughter in law as a TDP leader. This could not be immediately confirmed, but Brahmani is also the grand -daughter of NTR.

NTR had built a powerful alliance of the numerically strong other backward castes (OBCs) and the prosperous and industrious Kammas( his own caste) to stride into power. Analysts point out that the Kammas remain with TDP but the OBCs have started moving away. This is also impacting on the organizational structure of the party -that penetrates to the grass-root levels. "If Naidu cannot prevent the disintegration in the organization, the party is gone forever. The question is whether he will be able to think and act out of the box and rise like a sphinx," says a party man. A million dollar question that.

http://timesofindia.indiatimes.com/india/How-Chandrababu-Naidu-lost-the-plot/articleshow/15055263.cms

Two ex-mlas meet to ys jagan at chanchalguda jail

All eyes on Jagan during Prez poll


He might have arrived almost two hours late but jailed YSR Congress MP, Y.S. Jagan Mohan Reddy, stole the limelight the moment he came to the Assembly House on Thursday to cast his vote in the Presidential election.
YSRC chief Y.S. Jagan Mohan Reddy comes out with his mother Y.S. Vijayalakshmi after casting his vote for the Presidential election in the Assembly on Thursday.
Supposed to arrive between 10 am and 10.15 am, the Lok Sabha MP from Kadapa finally arrived at 12.20 pm due to a delay at the jail. Immaculately dressed in a blue shirt and gray trousers, Mr Jagan Reddy, lodged in Chanchalguda jail since May 28 in the disproportionate assets case against him, was brought under heavy police escort. The court had earlier permitted him and another jailed former minister, Mr Mopidevi Venkataramana, who arrived about half an hour earlier, to cast their vote in the Presidential election.
Both spent about 10 minutes at the polling station before being taken back to jail post-vote. Received with a peck on the cheek and forehead from mother Vijayalakshmi, an MLA and acting president of YSR Congress, Mr Jagan Reddy reportedly had a brief chat with her inside the Assembly building. “A visibly moved Ms Vijayalakshmi blessed him,” an official said.
The police did not allow him to interact with the others and the waiting media. The environment electrified the moment Mr Reddy stepped off the car (a black Mahindra Scorpio), with slogans of “Jai Jagan... Jai YSR” from the assembled supporters. Party MLAs such as Ms Srikanth Reddy and Ms Sobha Nagi Reddy and MP Mekapati Rajamohan Reddy rushed towards him, throwing security cover to wind.
Greeting the waiting party leaders, mediapersons and police personnel with a smile and ‘namaskar’, he rushed to the polling booth along with the other YSRCP leaders. Jagan cast his vote along with mother Ms Vijayalakshmi, 17 party MLAs and Mr Mekapati Rajamohan Reddy. While he wished several Congress MLAs present there, senior Congress leader Mr Gade Venkat Reddy was seen waiting outside for nearly half-an-hour to greet Mr Jagan Mohan Reddy.

మంత్రి పదవులకు పవార్, ప్రఫుల్ రాజీనామా

న్యూఢిల్లీ : యూపీఏలో నెంబర్.2 పంచాయతీ కొనసాగుతోంది. కేంద్రమంత్రి వర్గంలో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య రెండో స్థానం కోసం ఏర్పడ్డ సంక్షోభం తారాస్థాయికి చేరింది. కేంద్రమంత్రి పదవులకు వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, భారీ పరిశ్రమల మంత్రి ప్రఫుల్ పటేల్ రాజీనామా చేశారు. వారు తమ రాజీనామా లేఖలను శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు పంపారు. కాగా వీరిరువురు నిన్న సాయంత్రమే రాజీనామా చేసినట్లు సమాచారం. శరద్ పవార్ ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రితో భేటీ కానున్నారు. అయితే రాజీనామాలపై అటు కాంగ్రెస్ కానీ, ఇటు ఎన్‌సిపి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

‘బీసీ’ బాబు కొత్త బాగోతం!బాబు తన వార్షిక బడ్జెట్‌లో బీసీల కోసం రూ.1,777 కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్ తన వార్షిక బడ్జెట్‌లో రూ.4,319 కోట్లు ఖర్చు చేశాడు. అంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజుల కింద శాచ్యురేషన్ పద్ధతిలో వైఎస్ వంద శాతం మందికి లబ్ధి చేకూర్చడం గమనార్హం. వైఎస్ పాలనలో మొత్తం 40 లక్షల మందికి పక్కా గృహాలు నిర్మిస్తే, అందులో 20 లక్షల మంది బీసీలు ఉన్నారు. పావలా వడ్డీ పథకం ద్వారా 70 లక్షల మంది బీసీ మహిళలు లబ్ధి పొందారు.ఇక టీడీపీకి భవిష్యత్తులేదని లోకం కోడైకూస్తోంది. విశ్లేషకుల మాట కూడా అదే, అయితే చం ద్రబాబు మాత్రం డవున్ బట్ నాట్ అవుట్ అంటున్నాడు. తన శ్రేణులకు కొత్త ఊపిర్లు పోసే ఉద్దేశంతోనూ బహు సంఖ్యాకుై లెన బీసీలను బుట్టలో వేసుకునే ఉద్దేశంతోనూ, 2014లో బీసీ లకు వంద సీట్ల నినాదం ఇచ్చాడు. తన తొమ్మిదేళ్ల ట్రాక్ రికార్డు చవిచూసిన వారిని ఈ నినాదం మోసగించ జాలదు.

దొందూ దొందే...!

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు జగన్ చేతిలో చావు దెబ్బతిన్నాయి. అధికారపార్టీ రెండు సీట్లు గెలిచినా, అవి టీడీపీతో కుమ్మక్కై గెలిచినవేనన్నది అందరికీ తెలిసిందే. మళ్లీ అవి గెలుస్తామన్న నమ్మకం కూడా లేదు. సానుభూతి పవనాలతో జగన్ నెగ్గాడని పైకి ప్రకటించుకున్నా, అంతకంటే బలమైన కారణాలు దాగున్నాయన్నది ఆ రెండు పార్టీలను వేధిస్తోంది. జగన్ పార్టీ ఓడి కాంగ్రెస్ గెలిచి ఉంటే టీడీపీ నేతలు ఎగిరి గంతేసేవాళ్లే. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న అవమానం ఆ పార్టీని కుంగదీస్తోంది. దీంతో బీసీల ఆదరణ సంపాదించడానికి కొత్త పన్నాగం పన్నుతోంది.

వైఎస్ తీరు అనన్యం!

బీసీల తక్షణావసరం ఆర్థిక సాధికారతేనని వైఎస్ సందేహాలకు అతీతంగా రుజువు చేశారు. ఇందుకు భిన్నంగా కొందరికి పదవుల ఆశ చూపి బీసీల ఓట్లన్నీ బుట్టలో వేసుకుని తాను ముఖ్యమంత్రి కావాలన్నదే బాబు లక్ష్యం. వందసీట్ల ఆశ చూపించి, గెలిచే బీసీలకే టిక్కెట్లన్న మెలిక పెట్టడంతోనే బాబు మోసకారితనం బయటపడింది. ఎన్టీఆర్ బలహీన వర్గాలకు అమలు జరిపిన పథకాలన్నిటినీ బాబు నీరుగార్చాడు. మద్యపాన నిషేధాన్ని రద్దుచేసి ఊరూరా బెల్టుషాపులకు గేట్లు తెరిచాడు. బియ్యం పథ కాన్ని రెండు రూపాయల నుంచి ఐదున్నరకు పెంచాడు. పెన్షన్‌ను 75 రూపాయలకు కుదించాడు. అది కూడా నాలుగైదు మాసాలకు ఒకసారి మాత్రమే ఇచ్చాడు. ఇప్పు డు అన్నీ ఉచితమేనంటూ ఆల్‌ఫ్రీ చంద్రబాబుగా కొత్త అవతారం ఎత్తాడు. ప్రజలు ఈ గిమ్మిక్కులను నమ్మరు.

వైఎస్ తన అనితరసాధ్యమైన సంక్షేమ పథకాలతో బీసీ జన సామాన్యానికి ఆర్థిక సాధికారత కల్పించాడు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో బీసీల కోసం పెట్టిన ఖర్చు కంటే, వైఎస్ తన ఐదేళ్ల పాలనలో పెట్టిన ఖర్చు రెండు మూడు రెట్లు ఎక్కువ. బాబు తన వార్షిక బడ్జెట్‌లో బీసీల కోసం రూ.1,777 కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్ తన వార్షిక బడ్జెట్‌లో రూ.4,319 కోట్లు ఖర్చు చేశాడు. అంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజుల కింద శాచ్యురేషన్ పద్ధతిలో వైఎస్ వంద శాతం మందికి లబ్ధి చేకూర్చడం గమనార్హం. ఉచిత విద్యుత్ మొదలు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు వరకు సింహభాగం బీసీలకే ఖర్చు చేశారు. చంద్రబాబు హయాంలో కేవలం 18 లక్షల మందికి పెన్షన్లు లభిస్తే, వైఎస్ దాన్ని అర్హులందరికీ వర్తింపజేసి 75 లక్షల మందికి మంజూరు చేశాడు.

పెన్షన్ మొత్తాన్ని రూ.200లకు పెంచి, వికలాంగులకు రూ.500 చేశాడు. వృద్ధులకే గాకుండా వితంతువులకు, నేత, గీత కార్మికులందరికీ పెన్షన్ వర్తింపచేశాడు. ప్రభుత్వోద్యోగుల్లాగా ప్రతినెలా ఒకటవ తేదీకి నేరుగా పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో పడే ఏర్పాటు చేశాడు. బియ్యం పథకంలోనూ బీసీలే అత్యధికంగా లబ్ధి పొందారు. వైఎస్ పాలనలో మొత్తం 40 లక్షల మందికి పక్కా గృహాలు నిర్మిస్తే, అందులో 20 లక్షల మంది బీసీలు ఉన్నారు. పావలా వడ్డీ పథకం ద్వారా 70 లక్షల మంది బీసీ మహిళలు లబ్ధి పొందారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా. ఈ విధంగా వైఎస్ హయాంలో ఆర్థిక సాధికారత లభించినందువల్లే ఉప ఎన్నికల్లో బీసీలంతా వైఎస్సార్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. వంద సీట్ల పాచికతో వారిని జగన్ నుంచి విడదీయడం బాబుకు అసాధ్యం.

ముదురుపాకానపడ్డ టీడీపీ సంక్షోభం!

చంద్రబాబు పదేపదే వల్లించే లక్షకోట్ల అవినీతి ఊతపదంలోని ప్రహసనాన్ని మైసూరారెడ్డి బట్టబయలు చేశారు. వైఎస్‌పై ఆ ఆరోపణలన్నీ వట్టివనీ, బాబును తృప్తిపరచడానికి తాను ఆడిన నాటకమని మైసూరా బయటపెట్టాడు. మైసూరా జగన్ పార్టీలో ప్రవేశించడంతో కడప జిల్లాలో టీడీపీ ఖాళీ అయింది. కమలాపురం సీటు కూడా దీంతో జగన్ ఖాతాలోకి వచ్చినట్లుగా భావించవచ్చు. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబు అసలు రూపాన్ని కళ్లకు కట్టాయి. ‘నాని మీద తిరగబడండి’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప, నానీ ఆరోపణలకు బాబు నుంచి దీటైన సమాధానం లేదు. 2009 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ టోకుగా ఓడిపోయిందనీ, దానికి బాధ్యతవహిస్తూ టీడీపీ అధ్యక్ష పదవికి బాబు రాజీనామా చేయాలని నాని మరో బాంబు పేల్చాడు.

తాను జగన్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదనీ, చంద్రబాబు రాజ్యసభ టిక్కెట్లు 300 కోట్లకు అమ్ముకున్నాడనీ తీవ్రంగా ఆరోపించాడు. చంద్రబాబు ముసుగేసుకుని కాంగ్రెస్ నాయకులను ఢిల్లీలో కలుసుకోవచ్చు కానీ, తాను విజయమ్మను, జగన్‌ను కలుసుకోరాదట! అంటూ ఎత్తిపొడిచినా బాబు కిమ్మనలేదు. పేదలు జగన్‌ను దేవుడుగా అభిమానిస్తున్నట్లు కూడా నానీ పేర్కొనడం విశేషం. అంతటితో ఆగక, తన ప్రవర్తనకు సంజాయిషీ కూడా అడగకుండా సస్పెండ్ చేయడం ఎక్కడి ప్రజాస్వామ్యమని బాబును నిలదీశాడు. రాష్ట్రాధికారాన్ని జగన్‌కు అప్పగించి చేతులెత్తడం తప్ప టీడీపీ, కాంగ్రెస్‌లకు మరో మార్గంలేదని సాక్షాత్తూ ఎల్లో పత్రికలు ఘోషించాయంటే, ఆ పార్టీలు ఎంత సంక్షోభంలో ఉన్నాయో అర్థమవుతోంది.

పుట్టి ముంచిన ‘కుమ్మక్కు’!

వైఎస్ మరణానంతరం కాంగ్రెస్, టీడీపీలు కలిసి రాష్ట్ర రాజకీయాలను భ్రష్టుపట్టించాయి. వైఎస్ మరణవార్త విని 650 మంది వైఎస్ అభిమానులు గుండె ఆగి మరణిస్తే, ఈ వార్త విన్న సోనియా-బాబులకు గుండె ఆగినంత పనయింది. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి వారు బెంబేలెత్తుతున్నారు! జగన్ ఓదార్పుయాత్రకు లభిస్తున్న అపూర్వ ప్రజాదరణ చూసి మరింతగా రెచ్చిపోతున్నారు.

అధికారాన్ని నిలబెట్టుకోడానికి కాంగ్రెస్, పోయిన అధికారాన్ని సాధించుకోడానికి చంద్రబాబు జగన్‌ను టార్గెట్ చేసి రాజకీయాలు నడిపిస్తున్నారు. వారికి అడ్డంకిగా ఉన్న జగన్‌ను ముందు తొలగించుకోవాలి. అందుకోసం కాంగ్రెస్, టీడీపీలు కుట్రపూరితమైన అవగాహనతో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయి. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో దానిని ప్రయోగాత్మకంగా అమలు జరిపి, ఉప ఎన్నికల్లో పూర్తిస్థాయిలో అమలుచేశారు. అయితే ఈ కుట్రలను, కుతంత్రాలను అర్థం చేసుకున్న ప్రజలు ఉప ఎన్నికల్లో తగు రీతిలో బుద్ధి చెప్పారు.
అధికార వ్యామోహంతో ఈ రెండు పార్టీలు 2014 లక్ష్యంగా కొత్త పన్నాగాలకు శ్రీకారం చుట్టాయి. కిరణ్ ఇందిరమ్మ బాటపడితే, చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ప్రకటించాడు. కాంగ్రెస్ మంత్రివర్గ కమిటీ ఆలోచనలు ఎంతసేపూ పదవులు పంచి పెట్టడం ద్వారా బలాన్ని పెంచుకునే వైపే పరిభ్రమిస్తున్నాయి. ధరలు తగ్గించడం, రైతులను ఆదుకోవటం వారికి చేతకాదు. వైఎస్ పేరు వినపడకూడదు... అంతా కాంగ్రెస్, సోనియా చలువేనని జనానికి నచ్చచెప్పాలి. వైఎస్ ముద్రను వారి గుండెల్లో నుంచి తుడిచివేయాలి. వైఎస్ రెక్కల కష్టంతో మంత్రులైన వారు ఇంత నీచానికి పాల్పడటం ప్రజల్లో అసహ్యాన్ని రేపుతోంది. పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే ద్రోహులను ప్రజలు ఎన్నటికీ క్షమించరు. అధికార భిక్ష పెట్టిన వైఎస్‌ను అవినీతిపరుడుగా, క్రిమినల్‌గా ఎఫ్‌ఐఆర్‌లో చేరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు! అందుకే ఉప ఎన్నికల్లో మట్టి కరిపించారు. చంద్రబాబు ఏకైక కార్యక్రమం వైఎస్, జగన్‌ల మీద బురదచల్లడమే! అది ఫలించకపోవడంతో, బీసీలను బుట్టలో వేసుకునే కొత్త పన్నాగం ఆలోచించాడు. చంద్రబాబు చరిత్ర అంతా కుట్రపూరితమేనని, స్వయాన ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ‘ఒక చరిత్ర-కొన్ని నిజాలు’ చదివితే అర్థమవుతుంది.

ప్రజలే చరిత్ర నిర్మాతలు!

ఉప ఎన్నికల్లో ఎన్ని వందల కోట్లు రూపాయలు వెదజల్లారో కిరణ్, బొత్సలు సెలవిస్తే నవతరానికి కొత్త వెలుగు ఇచ్చిన వారవుతారు! జగన్‌ను జైలుపాలు చేసి విజయాన్ని చెరపట్టాలని ఆశించిన ఈ రెండు పార్టీలను ప్రజలు చెవులు పిండి కూర్చోబెట్టారు. జగన్‌లేని లోటును విజయమ్మ జయప్రదంగా భుజాలకెత్తుకుని, ఆ బాటలోనే అవిశ్రాంతంగా ప్రయాణిస్తోంది. 2014 వరకు కూడా జగన్‌ను జైలులో బంధించి తమ పబ్బంగడుపుకోవాలన్నదే రెండు పార్టీల దుష్టతలంపుగా ఉంది. అయితే అది జరగని పని! చరిత్ర గమనాన్ని వారు శాసించలేరు. చరిత్ర చెత్తబుట్టలో ఉభయులూ చేరిపోక తప్పదు! జగన్‌ను ముఖ్యమంత్రిని చేసి, రాజన్న రాజ్యం మళ్లీ చూడాలన్నది సామాన్య ప్రజల దృఢ సంకల్పం!! 

వాన్‌పిక్‌తో ప్రభుత్వానికి నష్టం లేదు

వాన్‌పిక్ ప్రాజెక్టుతో ప్రభుత్వానికి పైసా నష్టం కూడా లేదని వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ప్రాజెక్టు కేటాయింపు, అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి తమకు మధ్య ఎలాంటి వివాదం లేదన్నారు. బెయిల్ మంజూరు చేయాలంటూ నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు గురువారం మరోసారి విచారించారు. రస్‌ఆల్‌ఖైమా (రాక్) ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రాజెక్టుల అభివృద్ధి ఒప్పందం జరిగిందని, నిమ్మగడ్డ రాక్‌కు మాత్రమే ఏజెంట్ అని ఉమామహేశ్వర్‌రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో నిమ్మగడ్డ నేరుగా ఒప్పందం చేసుకోలేదని, ప్రభుత్వం నుంచి నేరుగా భూమి కానీ, ఇతర రాయితీలు పొందలేదని చెప్పారు. అందువల్ల నిమ్మగడ్డకు ఐపీపీ 409 వర్తించదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నిమ్మగడ్డ నిర్దోషిగా విడుదలైతే... ఆయనకు జరిగిన నష్టాన్ని సీబీఐ ఎలా తీరుస్తుందని ప్రశ్నించారు. నిమ్మగడ్డను అరెస్టు చేసి 60 రోజులు దాటిందని, ఛార్జిషీట్ దాఖలు చేయనందున ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈలోగా కోర్టు సమయం ముగియడంతో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. అయితే శుక్రవారం 40 నిమిషాల్లోగా వాదనలు ముగించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు

రాజకీయాల నుంచి వైదొలగాలి

ఎన్నికల్లో స్పష్టమైన వైఖరి తీసుకోకుండా రాజకీయాల్లో ఎలా కొనసాగుతారు?
ఓటేయని చంద్రబాబు దేశద్రోహం చేసినట్లు కాదా?
కేసీఆర్ ఎవరెవరితో డీల్స్ కుదుర్చుకున్నారో ప్రజలకు తెలుసు
కాంగ్రెస్‌తో డీల్ ఉంటే.. జగన్‌పై కేసులెందుకు వస్తాయి?

హైదరాబాద్, న్యూస్‌లైన్: దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో స్పష్టమైన వైఖరి తీసుకోలేని పార్టీలు రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయరాదని టీడీపీ, టీఆర్‌ఎస్‌లు తీసుకున్న నిర్ణయాన్ని తూర్పారబట్టారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఓటేయాల్సిన బాధ్యత ఉంది.. ఓటేయక పోతే దేశద్రోహం చేసినట్లే... రాజ్యాంగానికి ద్రోహం చేసినట్లే’’ అని గతంలో చంద్రబాబు నీతులు వల్లించారని గుర్తు చేస్తూ మరి ఈ రోజు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయని చంద్రబాబు రాజ్యాంగానికీ, దేశానికీ ద్రోహం చేసినట్లు కాదా? రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టినట్లు కాదా? అని నిలదీశారు. చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకపోవడం దుర్మార్గమని, ఆయన చేతగానితనానికి, ఆయన గందరగోళంలో ఉన్నారనడానికి నిదర్శనం అని విమర్శించారు.

సుప్రీంకోర్టును అవమానిస్తారా?

జగన్ బెయిల్‌కు, రాష్ట్రపతి ఎన్నికకూ సంబంధం ఉందని టీడీపీ, టీఆర్‌ఎస్‌తో పాటు కొన్ని పత్రికలు ప్రచారం చేయడాన్ని గట్టు ఖండించారు. బెయిల్ ఇచ్చేది న్యాయస్థానం, ఓటు వేసేది రాష్ట్రపతికి అనే విషయాన్ని విస్మరించి తప్పుడు ప్రచారం చేస్తూ సుప్రీంకోర్టును కూడా అవమానిస్తున్నారని ఆయన అన్నారు. డీల్ (ఒప్పందం) కుదిరిందంటూ టీఆర్‌ఎస్ చేసిన విమర్శలను ఆయన తిప్పి కొట్టారు. టీఆర్‌ఎస్ నాయకుడు కేసీఆర్ ఎవరెవరితో ఎలా డీల్స్ కుదుర్చుకున్నారో ప్రజలకు బాగా తెలుసన్నారు. అసలు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లే డీల్స్ కుదుర్చుకోవడంలో సిద్ధ హస్తులని ఆయన అన్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నందుకే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్‌కు నామమాత్రపు ఓట్లు వచ్చాయన్నారు.

డీల్ ఉంటే.. కేసులెందుకు వేస్తారు?

కాంగ్రెస్‌తో తాము డీల్ కుదుర్చుకుని ఉంటే జగన్‌పై అక్రమ కేసులు ఎందుకు వస్తాయని గట్టు ప్రశ్నించారు. సీబీఐని అడ్డం పెట్టుకుని జగన్‌పై టీడీపీ, కాంగ్రెస్, రామోజీరావు కుట్ర పన్నుతున్న విషయం జగద్విదితం అని అన్నారు. సైకిల్ కాంగ్రెస్‌గా మారిన టీడీపీతోగాని, కాంగ్రెస్‌తోగాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యే పరిస్థితే రాదన్నారు. ఓటేయాలని నిర్ణయించుకున్నందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న మీడియా.. ప్రజాస్వామ్యంలో ఓట్లేయనిటీడీపీ, టీఆర్‌ఎస్‌లను ఎందుకు ప్రశ్నించదని ఆయన నిలదీశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మరో మార్గం లేనందువల్లనే తాము ప్రణబ్‌ైవె పు మొగ్గు చూపాల్సి వచ్చిందన్నారు. తమ పార్టీ ఎప్పుడూ లౌకిక వాదానికీ, దేశ సార్వభౌమత్వానికీ కట్టుబడి ఉంటుందని, దేశానికి ఇలాంటి సమస్యలు వచ్చినపుడు ముందుండి పోరాడుతుందని ఆయన అన్నారు. యనమల రామకృష్ణుడు చేసిన విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ చేతుల మీదుగా స్పీకర్ అయిన యనమల ఆ పదవికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించారని అన్నారు. తెలంగాణలో కూడా తమ పార్టీ బలోపేతం అవుతోందనేది పరకాల ఉప ఎన్నికల్లో తేలిందని, అందుకే టీఆర్‌ఎస్ తమను లక్ష్యంగా చేసుకుందని ఆయన పేర్కొన్నారు.

Popular Posts

Topics :