08 January 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ప్రోటోకాల్‌ ప్రకారం ఆహ్వానం ఉంది

Written By news on Wednesday, January 11, 2017 | 1/11/2017


‘ప్రోటోకాల్‌ ప్రకారం ఆహ్వానం ఉంది’
కడప :  పైడిపాలెం రిజర్వాయర్‌ వద్దకు వెళుతున్న వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి తదితర నేతలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పైడిపాలెం జలాశయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. కోవరంగట్టుపల్లి వద్ద అవినాష్‌ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.  వారిని గృహనిర‍్భంధం చేసేందుకు ప్రయత్నించారు. రిజర్వాయర్‌ వద్దకు వెళ్లకుండా భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం కార‍్యక్రమంలో పాల‍్గొనేందుకు తమకు ఆహ్వానం ఉందని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ పైడిపాలెం జలాశయానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. తమను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్‌ ప్రకారం తమకు ఆహ్వానం ఉందని వైఎస్‌ అవినాష్‌ రెడ్డి  తెలిపారు. కాగా అంతకు ముందు పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతలు సింహాద్రిపురం మండలం కోవనగుంటపల్లి చేరుకుని అక‍్కడ కబడ్డీ పోటీలను ప్రారంభించారు.

ప్రాజెక్ట్‌లపై శ్వేతపత్రం విడుదల చేయండి


హైదరాబాద్‌ : ఇరిగేషన్‌ ప్రాజెక్టుల చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు సర్కార్‌ కు ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సవాల్‌ విసిరింది. చంద్రబాబు హయాంలో ఎన్ని  ప్రాజెక్టులు కట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆ పార్టీ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టులను తాను కట్టానని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
పార్టీ కేంద్రకార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనా కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు.  పైడిపాలెం రిజర్వాయర్‌ ప్రారంభం నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని గృహ నిర్భంధం చేయడాన్ని శ్రీకాంత్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ప్రజల ఆవేదన

Written By news on Tuesday, January 10, 2017 | 1/10/2017

)
పింఛన్‌ లేదు.. రేషన్‌ లేదు

  •     ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ప్రజల ఆవేదన  
  •     మన ప్రభుత్వంతో అందరికీ న్యాయం జరుగుతుందన్న ప్రతిపక్ష నేత
  •     పింఛన్ల కోసం కోర్టులో కేసు వేద్దామని స్పష్టీకరణ
  •     కర్నూలు జిల్లాలో ఐదో రోజు కొనసాగిన యాత్ర
  •     ఇద్దరు రైతు కుటుంబాలకు జగన్‌ పరామర్శ
రైతు భరోసా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి, కర్నూలు: సారూ... నా పేరు సుబ్బమ్మ. ప్రభుత్వం నాకు ముసలోల్ల పింఛను ఇవ్వట్లేదు. ఎట్లాగైనా ఇప్పించండి సారూ!

 సారూ... నా పేరు బయ్యన్న. మాది ఓంకారం చెంచుగూడెం. మాకు రచ్చబండ రేషన్‌ కార్డులిచ్చినారు. వాటికి ఏడాది నుంచి రేషన్‌ ఇస్తలేరు. మేము ఏం తిని బతకాలి?

సార్‌.. నా పేరు శాంతుడు. మాది లింగాపురం. నాకు 80 ఏళ్లు. నాకు పింఛన్‌ రావడం లేదు. ఎట్టా బతకాలి?  
‘రైతు భరోసా యాత్ర’లో సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు విన్నవించిన సమస్యలు ఇలాంటివి ఎన్నెన్నో... చంద్రబా బు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఒక్క సమస్యనైనా పరిష్కరించడం లేదని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మండి పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంపై గట్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు. పింఛన్ల కోసం కోర్టులో కేసు వేసి పోరాడుదామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలిసి భరోసానిచ్చేందుకు ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర కర్నూ లు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో సోమ వారం ఐదో రోజుకు చేరుకుంది.

ఉదయం 9 గంటలకు లింగాపురం నుంచి బయలుదేరిన జగన్‌కు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. దారి పొడవునా ఆయనకు ప్రజ లు తమ సమస్యలను విన్నవించారు. జగన్‌ వారికి ధైర్యం చెబుతూ మన ప్రభుత్వం వచ్చేలా దేవుడిని కోరుకోవాలని అన్నారు. మన ప్రభుత్వంతో అందరికీ మేలు జరుగు తుందని తెలిపారు. లింగాపురం నుంచి బయలుదేరిన ఆయన ఓంకారేశ్వరంలో దేవుడిని దర్శించుకుని పూజలు చేశారు. అక్క డి నుంచి కడమల కాల్వ మీదుగా వెంగళరెడ్డి పేటకు చేరుకుని వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. అనంతరం బి.కోడూరుకు చేరుకుని రైతు దూదేకుల చాంద్‌బాషా కుటుంబాన్ని కలిసి భరోసానిచ్చారు. అక్కడి నుంచి పుట్టపల్లి, అబ్బీపురం మీదుగా తిమ్మాపురం చేరుకుని రైతు చిన్నస్వామి కుటుంబాన్ని కలసి ధైర్యం చెప్పారు. ఐదో రోజు భరోసా యాత్ర దాదాపు 30 కిలోమీటర్లకు పైగా సాగింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే మొత్తం 12 గంటల పాటు యాత్ర కొనసాగింది.


ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం
భరోసా యాత్రలో భాగంగా చేపట్టిన రోడ్‌ షోలో గ్రామంలోని ప్రజలు రోడ్డు మీదకు వచ్చి తమ సమస్యలను వైఎస్‌ జగన్‌కు ఏకరువు పెట్టారు. తమకు ఇంతవరకు ఇల్లు కట్టివ్వలేదని ఒకరు... 80 ఏళ్లు వచ్చినా పింఛన్‌ ఇవ్వట్లేదని మరొకరు... తమ పొలాలకు నీరివ్వడం లేదని ఇంకొందరు ఆయన వద్ద బోరున విలపించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏ ఒక్క మేలు చేయడం లేదని, ఆయనది మొదటి నుంచీ అదే తీరని జగన్‌ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంపై గట్టిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రధానంగా వృద్ధులకు పింఛన్లను కూడా ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా కోర్టులో కేసు వేసి మరీ పోరాడి ప్రభుత్వానికి బుద్ధి చెబుదామన్నారు. తాము నారు పోసుకున్న తర్వాత నీరు ఇవ్వబోమంటూ ప్రభుత్వం దండోరా వేస్తోందని రైతులు వాపోయారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లున్నప్పటికీ రెండో కారు పంటకు సాగునీరు ఇవ్వకపోవడం దారుణమని వైఎస్‌ జగన్‌ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మూడో కారు పంటకు నీరిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రైతులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. మన ప్రభుత్వం వస్తోంది.. ప్రజలకు ఒక్క మేలూ చేయని చంద్రబాబు ప్రభుత్వం పోవాలని గట్టిగా దేవుడిని కోరుకోవాలని ప్రజలతో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మన ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని హామీనిచ్చారు.

జ్వరం వస్తే దవాఖానా లేదు
దోమల బెడద ఎక్కువవుతోందని, ప్రభుత్వం తమకు కనీసం దోమతెరలు కూడా పంపిణీ చేయలేదని ఓంకారం చెంచుగూడేనికి చెందిన చెంచులు జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జ్వరం వస్తే వెళ్లడానికి ప్రభుత్వ దవాఖానా కూడా లేదని అన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా అందరికీ మేలు జరుగుతుందని వైఎస్‌ జగన్‌ అభయమిచ్చారు.

ఆ మరణాలపై విచారణ చేయాలి


ఆ మరణాలపై విచారణ చేయాలి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌
హైదరాబాద్‌: కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థుల మరణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థులు చనిపోవడం తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగుల్చుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  గుంటూరులో వంశీకృష్ణ అనే విద్యార్థి మరణిస్తే దాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలచి వేస్తోందన్నారు.

ఆ ప్రాధాన్యత ఎందుకో?
‘‘రాష్ట్రమంతటా నారాయణ, శ్రీచైతన్య స్కూళ్లే ఉండాలా? సర్కారు ఉచిత విద్యను అందిస్తున్నా విద్యార్థులు కార్పొరేట్‌ స్కూళ్ల పైపు మొగ్గు చూపడానికి ప్రభుత్వ విధానాలే కారణం. ప్రభుత్వ పెద్దలకు ఆర్థిక వనరులు చేకూర్చే సంస్థలుగా ప్రైవేటు స్కూళ్లు తయారయ్యాయి. బినామీ పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్‌ విద్యా సంస్థలు స్వర్గధామంగా మారాయి కాబట్టే ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో భూముల వ్యవహారాలు, పెద్ద వ్యాపారాల్లో ‘ముఖ్య’నేతకు బినామీ ఎవరంటే నారాయణే అని చిన్నపిల్లలు కూడా చెబుతారు.

నారాయణ వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉండటంతో వీరంతా ఒక్కటై విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు’’ అని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. విద్యార్థుల మరణాలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తే వైఎస్సార్‌సీపీ తోడుగా నిలుస్తుందన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తుతామన్నారు.

Popular Posts

Topics :