11 October 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ రిలే దీక్షలు

Written By news on Saturday, October 17, 2015 | 10/17/2015


హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు... కార్యకర్తలు శనివారం చేపట్టిన రిలే దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రారంభమైనాయి. ఈ నెల 21వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ దీక్షలు చేపట్టనున్నారు. అలాగే ఈ నెల19న ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టనున్నాయి.  అందులోభాగంగా ఆర్టీసీ డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేయనున్నాయి. ఈ నెల 20వ తేదీ సాయంకాలం నియోజకర్గ కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షల వివరాలు...
అనంతపురం జిల్లా:
రాయదుర్గం : మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
తాడిపత్రి : స్థానిక వైఎస్ఆర్ సీపీ నేతలు చేపట్టిన రిలే దీక్షలకు మద్దతు తెలిపిన సీపీఐ నేతలు నర్సింహయ్య, రంగయ్య. అలాగే రాజధాని శంకుస్థాపనకు వెళ్లకూడదన్న వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సీపీఐ నేతలు ఈ సందర్బంగా స్వాగతించారు. వైఎస్ జగన్ నిర్ణయం అభినందనీయమన్నారు.
కల్యాణదుర్గం: వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
మడకశిర : పార్టీ సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
కర్నూలు జిల్లా :
కర్నూలు : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జి.జయరామ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
బనగానపల్లె : స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రాంరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
నంద్యాల : పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
కడప జిల్లా:
కడప : ప్రత్యేక హోదా కోరుతూ పులివెందుల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రిలే దీక్షలు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
రైల్వే కోడూరు : స్థానిక గాంధీ విగ్రహాం వద్ద వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి బండారు సుభద్రమ్మ ఆధ్వర్యంలో రిలే దీక్షలు
ప్రొద్దుటూరు : స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు
బద్వేల్ : పట్టణంలో వైఎస్ఆర్ సీపీ నేత బీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు
జమ్మలమడుగు : వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు
చిత్తూరు జిల్లా :
తిరుపతి: స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే దీక్షలు... పాల్గొన్న స్థానిక ఎంపీ వర ప్రసాద్, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మమత.
జీడీ నెల్లూరు : ఎమ్మెల్యే నారాయణ స్వామి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
పీలేరు : స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
పలమనేరు : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అమర్నాధ్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
సత్యవేడు : స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేత ఆదిమూలం, మునిశేఖర్రెడ్డి, రాధారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
నెల్లూరు జిల్లా :
ఇందుకూరుపేట : ఇందుకూరుపేటలో వైఎస్ఆర్ సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
ప్రకాశం జిల్లా :
పరుచూరు : నియోజకవర్గం ఇంఛార్జ్ గొట్టిపాటి భరత్కుమార్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
గిద్దలూరు : ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం. అశోక్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.


గుంటూరు జిల్లా :
రేపల్లె : వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆధర్వంలో రిలే దీక్షలు, పాల్గొన్న కౌన్సిలర్లు,  కార్యకర్తలు.
అమరావతి : స్థానిక పార్టీ సమన్వయకర్త పాణెం అనిమిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
చిలకలూరిపేట: గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.. పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్లు.
గుంటూరు : నగరంలోని కొత్త బస్టాండ్ ఎదుట వైఎస్ఆర్ సీపీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు.
వినుకొండ : స్థానిక పార్టీ ఇంచార్జీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు.
మాచర్ల : స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు.
కృష్ణాజిల్లా :
పెడన : పెడన బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ సీపీ నేత రాంప్రసాద్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు.
మైలవరం : నియోజకర్గం ఇంఛార్జ్ జోగి రమేష్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
 
పశ్చిమ గోదావరి జిల్లా :
కొయ్యలగూడెం : వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
నరసాపురం : వైఎస్ఆర్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
తూర్పుగోదావరి జిల్లా :
జగ్గంపేట : స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, నవీన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
కడియపులంక: స్థానిక జాతీయ రహదారిపై దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ సీపీ నేత ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
ముమ్మడివరం :  స్థానిక నాయకుడు గుత్తుల సాయి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
రాజమండ్రి : స్థానిక కోటగుమ్మం సెంటర్లో వైఎస్ఆర్ సీపీ నేత,  ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వరంలో రిలే దీక్షలు.
రంపచోడవరం : వైఎస్ఆర్ సీపీ నేత, పార్టీ ఎమ్మెల్యే రాజేశ్వరి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నాయకులు ఉదయ్ భాస్కర్, బాలకృష్ణ పాల్గొన్నారు.
మండపేట : స్థానిక నాయకుడు పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
రామచంద్రాపురం : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
పి. గన్నవరం : పార్టీ నేత కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
రాజోలు : బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
పిఠాపురం : పార్టీ సమన్వయ కర్త పెండెం దొరబాబు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
విశాఖపట్నం జిల్లా :
విశాఖ కలెక్టరేట్ : వైఎస్ఆర్ సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, కోలా గురువులు, జాన్ వెస్లీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
ఇసుకతోట : పార్టీ నేతలు వంశీకృష్ణ శ్రీనివాస్, కొయ్య ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
గురుద్వార్ : వైఎస్ఆర్ సీపీ నేతలు ఉషాకిరణ్, రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు
ఎన్ఏడీ కొత్త రోడ్డు : మాజీ ఎమ్మెల్యే మళ్లా విజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు
పెందుర్తి : పార్టీ నేత ఆదీప్ రాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు
అనకాపల్లి : ఆర్డీవో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేత ఆధ్వర్యలో రిలే దీక్షలు
పాడేరు : రిలే దీక్షను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ
తగరపువలస: బీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్ కర్రి సీతారం ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
నర్సిపట్నం : నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమాశంకర్గణేశ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
పాయకరావుపేట : నియోజకవర్గ ఇంఛార్జ్ చెంగల వెంకట్రావ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు
ఎలమంచిలి :  నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు
విజయనగరం జిల్లా :
సాలూరు : స్థానిక ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో రిలే దీక్షలు
శ్రీకాకుళం జిల్లా :
శ్రీకాకుళం : పట్టణంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
టెక్కలి : నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
పాతపట్నం : స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
రణస్థలం : పార్టీ సమన్వయకర్త గొల్లె కిరణ్కుమార్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
అముదాలవలస : పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
పాలకొండ : స్థానిక ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
రాజాం : స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.

నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ లేఖ


మోదీజీ.. కలిసే అవకాశం ఇవ్వండి: వైఎస్ జగన్
హైదరాబాద్ :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఈనెల 22వ తేదీన అమరావతి రాజధాని శంకుస్థాపనకు వస్తున్న సందర్భంగా కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి వస్తానని, తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో వైఎస్ జగన్ కోరారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, గతంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశామని, తాజాగా గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేశానని చెప్పారు. అయితే తన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న సందర్భంగా కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరతున్నామన్నారు. ప్రత్యేక హోదాపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి వినతిపత్రం అందిస్తామన్నారు. గన్నవరం లేదా తిరుపతిలో కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.

ఒకవైపు రాజకీయాల్లో నిబద్ధత.. మరోవైపు వెన్నుపోటు

 ఒకవైపు రాజకీయాల్లో నిబద్ధత.. మరోవైపు వెన్నుపోటు. ఒకవైపు పదవులు, ప్రాణాలను సైతం లెక్కచేయని తత్వం, మరోవైపు పదవీకాంక్షతో ఎంతకైనా తెగబడే తెంపరితనం. ఇవీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, సీఎం చంద్రబాబు నాయుడికి మధ్య తేడాలు. అధికారం రాకపోయినా పర్వాలేదు గానీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చేది లేదని జననేత నిలబడితే, అలవి కాకపోయినా రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి లాంటి హామీలిచ్చి అడ్డదారిలో అధికారం దక్కించుకున్న నేత చంద్రబాబు.
  • రాజధాని శంకుస్థాపనకు రాలేను, పిలవకండని చంద్రబాబు నాయుడు సర్కార్ కు బహిరంగ లేఖ రాయడం ద్వారా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తనవి ముక్కుసూటి రాజకీయాలని రుజువు చేసుకున్నారు. వైఎస్ జగన్ చర్యల్లో రాజకీయం కంటే స్వచ్ఛత, నిజాయితీ ఉంటుందనడానికి ఇదో ఉదాహరణ.
  • రాష్ట్ర విభజన అంశంపై కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాగే తమ పార్టీది సమైక్యవాదమని తెగేసి చెప్పారు. అదే చంద్రబాబు మాత్రం వాట్ ఐయామ్ సేయింగ్ అంటూ, రెండుకళ్ల సిద్ధాంతంతో దాటవేశారే తప్ప స్పష్టమైన వైఖరి మాత్రం చెప్పలేదు.
  • 150 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ ను సీఎం చేయాలని సంతకాలు చేసినప్పటికీ... సీఎం పదవి కోసం ఆయన అడ్డదారి పట్టలేదు. కానీ చంద్రబాబు మాత్రం సీఎం పదవి కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచారు.
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బులిస్తే కిరణ్ సర్కార్ ను పడగొట్టొచ్చనే సలహాలు వచ్చినా వాటిని వైఎస్ జగన్ పట్టించుకోలేదు. ప్రజా సమస్యలపై నిబంధనల ప్రకారం అవిశ్వాసం తీర్మాణం పెట్టారే తప్ప సర్కార్ ను కూలగొట్టలేదు. ఇది జగన్ చేతగానితనమని కామెంట్లు చేసిన వారున్నారు, కానీ ఆయన మాత్రం తాను చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు రాజకీయాలు చేయలేనని తేల్చి చెప్పారు.
  • సొంతవారినైనా అవసరానికి వాడుకుని వదిలేయం చంద్రబాబు సొంతమైతే.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం.. అధికారం దక్కకపోయినా ఫర్వాలేదనే తత్వం జగన్ ది.
  • 2014 ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాసరావు తన టీమ్ తో సహా వైఎస్ఆర్ సీపీలో చేరుతానని.. అందరికీ టికెట్లు ఇవ్వాలన్నారు. టికెట్లు ఇస్తానని ముందే ఇతర నేతలకు మాటిచ్చాను... వారిని మోసం చేయలేనంటూ గంటా లాంటి చాలామంది సీనియర్లను జగన్ తన పార్టీలోకి తీసుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం అలాంటి వారందరినీ తీసుకుని ముందు టికెట్లు ఇస్తానన్న వారందరినీ మోసం చేశారు.
  • రైతులకు రుణమాఫీ చేసేంత ఆర్థికస్థాయి రాష్ట్రానికి లేదని, అమలు చేయలేని హామీని ఎలా ఇస్తామని నిజాయతీగా వ్యవహరించిన నేత వైఎస్ జగన్. కానీ చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు.
  • రాజకీయాలలో స్వచ్ఛత, ముక్కుసూటితనం, మాట నిలబెట్టుకోవడం, హుందాగా వ్యవహరించడం వంటివి అంతరిస్తున్నాయనే వారు వైఎస్ జగన్ శైలిని పరిశీలించాలి.
  • వెన్నుపోటు, కుటిలత్వం, మోసం చేయడం, నమ్మినవారిని నట్టేట ముంచడం, ఇచ్చిన మాట తప్పడం వంటి లక్షణాలున్న చంద్రబాబుది రాజకీయ దివాళకోరుతనమో.. చతరుతతో విజ్ఞులైన వారే ఆలోచించాలి.

నేటి నుంచి వైఎస్ఆర్ సీపీ హోదా పోరు

 ఏపీకి  ప్రత్యే హోదా కోరూతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరును ఉద్రిక్తం చేసింది. ఇందులో భాగంగా శనివారం నుంచి ఈ నెల 21 వరకు అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు చేపట్టనున్నారు. 18 వ తేదీన ర్యాలీలు, అనంతరం సమావేశాలు నిర్వహిస్తారు. 19 న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు, 20 న మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. 21 వ తేదీన అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు చేపడతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేవరకు పోరాటం చేయాలని పార్టీ ఈ కార్యక్రమాలను చేపడుతోంది.

జగన్ రానన్న కారణాలకు జవాబేదీ?


జగన్ రానన్న కారణాలకు జవాబేదీ?
టీడీపీ నేతలను ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు రానన్న దానిపై విమర్శలు చేస్తున్నారు.. ఆయన రాలేనని స్పష్టంగా పేర్కొన్న కారణాలకు మంత్రులు, టీడీపీ నేతలు ఎందుకు జవాబు చెప్పలేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కె.పార్థసారథి ప్రశ్నించారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘శంకుస్థాపన కార్యక్రమానికి వైఎస్ జగన్ ఎందుకు రావడంలేదో... అందుకు కారణాలను స్పష్టంగా పేర్కొన్నారు.

ఆయనను తిట్టడానికే మంత్రివర్గంలో పనిచేస్తున్న కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగన్ పేర్కొన్న కారణాలలో ఒక్క అంశంపైనైనా లోపాలు సరిదిద్దుకోలేదు. కనీసం వాటిపై చర్చించనూ లేదు. మీ మాటలను మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం’ అని పార్థసారథి అన్నారు. రాజధాని నిర్మాణంపై రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ, ప్రజాసంఘాలు వ్యతిరేకించినా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఒక్క అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించలేదని పార్థసారథి దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
 
* రాజధానికి రైతులు స్వచ్ఛందంగా భూములివ్వకపోతే బలవంతంగానైనా భూసేకరణ చట్టం ద్వారా సేకరిస్తామని సీఎం చంద్రబాబు బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. రైతుల మెడపై కత్తి పెట్టి వారి భూములను తీసుకొన్నారు. అలాంటప్పుడుై రెతుల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా తీసుకున్నట్టు ఎలా అవుతుంది?
* రాజధాని నిర్మాణానికయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని విభజన చట్టంలోనే పేర్కొన్నారు. అలాంటప్పుడు బలవంతంగా సేకరించిన భూములను సింగపూర్ కంపెనీలకిచ్చి వారిచేత భవనాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఏమిటో మంత్రులు చెప్పగలరా?
* కోర్ క్యాపిటల్ నిర్మాణానికి 1,400 ఎకరాలు, రోడ్లు వంటి మౌలిక వసతులకు మరో 500 ఎకరాలు సరిపోతుందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖే శివరామకృష్ణన్ కమిటీకి నివేదిక అందజేసింది. ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా 33 వేల ఎకరాలను సేకరించింది. ఆ ప్రాంతంలో ఉన్న 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కలుపుకున్నారు. ఎందుకో చెప్పగలరా?
* సమీకరించిన భూముల్లో మూడు పంటలు పండే భూములు లేవంటూ ప్రభుత్వమే గ్రీన్‌ట్రిబ్యునల్‌కు తప్పుడు నివేదికలిచ్చింది.  
* జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాసిన తర్వాత శంకుస్థాపనకు రూ.10 కోట్లే విడుదల చేశామని మంత్రులు చెబుతున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఇంతకు మించి ఖర్చు పెట్టబోమని స్పష్టంగా చెప్పగలరా? మన మట్టి- మన నీరు కార్యక్రమానికి జిల్లాకు రూ.3కోట్లు చొప్పున రూ.39 కోట్లు.. విమానాల ఏర్పాటుకు రూ.150 కోట్లు.. శంకుస్థాపన ప్రాంతంలో భూమి చదును, సభావేదికకు రూ.15 కోట్లు.. తాత్కాలిక రోడ్లు వంటి వాటికి రూ.35 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ దుబారా ఖర్చులు ఎందుకో చెప్పగలరా?
* రాజధాని గ్రామాల్లోని కౌలు రైతులు, ఇతర చేతివృత్తుల వారికీ, వ్యవసాయ కూలీలకు ప్రతి నెలా రూ.2,500 పింఛనుగా ప్రభుత్వం ఇస్తామంది. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు?
* రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటేనే ఆ పేరుతో చంద్రబాబుకు సింగపూర్ కంపెనీలతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అస్కారం ఉంటుంది. అందుకే ఆయన ప్రత్యేక హోదాకు అడ్డుపడి రాష్ట్రం ఆర్థికంగా బలపడకుండా చేస్తున్నారు.

చెర్లోపాళెం దుర్ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

 ప్రకాశం జిల్లా కందుకూరు మండలం చెర్లోపాళెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ప్రమాద స్థలి, ఆసుపత్రులకు వెళ్లి బాధితులకు సహాయం అందించాల్సిందిగా పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ మేరకు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పార్టీ జిల్లా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదంలో దుర్మరణం చెందినవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కందుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిని నాయకుల ద్వారా తెలుసుకున్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రకాశం జిల్లా పుట్లూరు మండలం చేవూరు నుంచి పెళ్లి బృందం డీసీఎంలో మాలకొండ వెళుతుండగా ఎదురుగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఎక్కువ సమయం బస్సును నడపటం వల్ల డ్రైవర్ కునుకుపాటుకు లోనుకావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మరణించగా, మరో15 మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

లక్షల కోట్ల కుంభకోణం క్రతువుకు నేను రాలేను...

Written By news on Friday, October 16, 2015 | 10/16/2015


లక్షల కోట్ల కుంభకోణం క్రతువుకు నేను రాలేను...వీడియోకి క్లిక్ చేయండి
రాజధానికి కాదు.. ఆ పేరుతో జరుగుతున్న రియల్ వ్యాపారానికి వ్యతిరేకం
♦ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ లేఖ
♦ అన్నదాతల కడుపుకొట్టే దోపిడీ వ్యవహారం
♦ పేద రైతుల భూములు విదేశీ ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం
♦ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు, ప్రజల మనోభావాలు మీకు పట్టవు..
♦ అమరావతి పేరుతో సాగుతున్న కుంభకోణానికి మద్దతునివ్వలేను
♦ ఆహ్వానాలు పంపొద్దు... ఆ తర్వాత అభాండాలు వేయద్దు


సాక్షి, హైదరాబాద్: ‘‘రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించడం, ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగడం, మీకు నచ్చిన ప్రైవేటు విదేశీ కంపెనీలకు ఆ భూములను కట్టబెట్టడం, అందుకు విదేశీ కంపెనీల ద్వారా లక్షల కోట్లు తరలించడం... మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పేరుతో సాగిస్తున్న అతిపెద్ద కుంభకోణానికి మద్దతునివ్వలేను కనుక అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రాలేను’’ అని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గురువారం ఒక బహిరంగ లేఖ రాశారు. రాజధాని నిర్మాణానికి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని, అయితే దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మీరు సాగిస్తున్న కుంభకోణాన్ని సమర్థించలేను కనుకనే శంకుస్థాపనకు రాలేనని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అందరికీ ఆహ్వానాలు పంపిస్తామని మీరు ప్రకటించడాన్ని ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్నాననీ, అయితే మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, లక్షల కోట్ల అక్రమ సంపాదనకు, విదేశీ కంపెనీల ద్వారా విదేశాలకు లక్షల కోట్లు తరలించడానికి, రైతుల కడుపు కొట్టడానికి ఈ శంకుస్థాపన చేస్తున్నందున ప్రజలందరి తరఫున అలాంటి దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్నామని జగన్ తెలిపారు.

రాజధాని పేరుతో జరుగుతున్న కుంభకోణానికి సంబంధించి వివిధ అంశాలను ప్రస్తావిస్తూ శంకుస్థాపనకు రాలేకపోవడానికి జగన్ ఆ లేఖలో ఎనిమిది కారణాలను వివరించారు. అందువల్ల తనకు ఎలాంటి ఆహ్వానాలు పంపొద్దని కోరారు. ఆహ్వానం పంపినప్పటికీ జగన్ రాలేదని, ఆ తర్వాత తనపై ఒక బండ విసరొద్దని అన్నారు. మీ ఆదేశాల మేరకు ఇప్పటికే అరడజను మంది మంత్రులు చేయబోయేది అదేనన్న విషయం తనతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసని జగన్ పేర్కొన్నారు.
 
1
ప్రజలకు ఇష్టం లేక పోయినా బలవంతంగా మీ అధికారాన్ని ఉపయోగించి రైతుల భూములు లాక్కుని, వారి ఉసురు మీద మీరు రాజధానిని కడుతున్నారు. మూడు పంటలు పండే మాగాణి భూములను పూలింగ్ పేరిట ైరె తుల మెడ మీద కత్తి పెట్టి లాక్కున్న మీ వైఖరికి వ్యతిరేకంగా ఇప్పటికే మేము పలు సందర్భాల్లో దీక్షలు చేసినా, నిరసనలు తెలిపినా మీ తీరు మారలేదు. అందుకే రాదల్చుకోలేదు.
 
2
రాజధాని ప్రాంతంలో 30వ సెక్షన్, 144వ సెక్షన్‌ను ఎందుకు అమలు చేస్తున్నారు? ప్రజలు ఆనందంతో ఉంటే మరెందుకు ఈ సెక్షన్లు అమలులో ఉన్నాయి? అక్కడ ఈ నిషేధ సెక్షన్లు గత సంవత్సర కాలంగా ఎందుకు ఉపయోగిస్తున్నారు?
 
3
గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును బేఖాతరు చేస్తూ కోర్టును, ప్రజల మనోభావాలను లెక్క చేయని మీ వైఖరిని నిరసిస్తున్నాం.
 
4
అసైన్డ్ భూములు, పేదల భూములు అంటే చులకన భావంతో అవి మీ అత్తగారి సొత్తు అన్నట్లు, మీ ఇష్టం వచ్చినట్లు ఆక్రమించుకునే మీ మనస్తత్వానికి నిరసన తెలుపుతున్నాం.
 
5
మీ కమిషన్ల కోసం, మీ లంచాల కోసం మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజల కడుపు కొడుతున్నారు. మీకు నచ్చిన ప్రైవేటు, విదేశీ సింగపూర్ కంపెనీలకు మీ ఇష్టం వచ్చినట్లుగా భూములు ఇస్తున్న మీ వైఖరికి నిరసనగా, మీరు చేస్తున్న ఈ కుంభకోణంలో మీకు మద్దతు తెలుపకూడదనే భావనతో రాదల్చుకోలేదు.
 
6
కేంద్రం ఇప్పటికే రూ.1,850 కోట్లు రాజధాని కోసం డబ్బులు ఇచ్చింది. రింగురోడ్డు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆంధ్రప్రదేశ్ కు ఇంకా చేస్తామని చెబుతోంది. ఈ డబ్బును ఖర్చు చేసి బిల్లులు పెట్టండి  మీ అవసరం మేరకు ఇంకా ఇస్తాం అంటోంది. విభజన చట్టం ప్రకారం మనకు ఇవ్వాల్సినవన్నీ నెరవేరుస్తాం అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నపుడు రాజధాని నిర్మాణానికి ప్రైవేటు సింగపూర్ కంపెనీలతో లేక ప్రైవేటు విదేశీ కంపెనీలతో ఏం పని?

రాజధానిలో ఉండాల్సిన హైకోర్టు, సచివాలయం, శాసనసభ, ప్రభుత్వ కార్యాలయాలకు కావాల్సింది అక్కడే ఉన్న ప్రభుత్వ భూముల్లో కట్టుకొని, రోడ్లు వేసి, జోనింగ్ చేసి ప్రజలు రియల్ ఎస్టేట్ చేసుకుంటారో లేక వారి భూములు వారే అట్టి పెట్టుకుంటారో ప్రజల ఇష్టానికి వదిలేయకుండా బలవంతంగా మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేద ప్రజల భూములను లాక్కోవడానికి నిరసనగా- మేం రాదల్చుకోలేదు.
 
7
మీ వాళ్లను బినామీలుగా పెట్టుకుని రాజధాని ప్రాంతంలో వందల ఎకరాలు కొనుగోలు చేయించి, ఆ భూములను వదలి వేసి పేదల భూములను మాత్రం వారికి  ఇష్టం లేక పోయినా లాక్కొన్న మీ వైఖరికి నిరసనగా రాదల్చుకోలేదు.
 
8
ప్రజల డబ్బును దుబారా చేస్తున్నారు. ఒక్క రోజు తతంగాన్ని జరిపేందుకు  దాదాపు రూ.400 కోట్లు బూడిదపాలు చేస్తున్న మీ తీరుకు నిరసన వ్యక్తం చేస్తున్నాం.
 
‘చివరిగా ఒక్క మాట... రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. మీరు శంకుస్థాపన చేస్తున్నది ప్రజల రాజధానికి కాదు. పేద ప్రజల రాజధానికి అసలే కాదు, అది మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, లక్షల కోట్ల అక్రమ సంపాదనకు, విదేశాలకు విదేశీ కంపెనీల ద్వారా లక్షల కోట్లు తరలించడానికి, రైతుల కడుపు కొట్టడానికి మీరు చేస్తున్న శంకుస్థాపన. కాబట్టే ప్రజలందరి తరపునా ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్నాం’ అని జగన్  లేఖలో పేర్కొన్నారు.

చంద్రబాబే ప్రత్యేక హోదాకు అడ్డు


చంద్రబాబే ప్రత్యేక హోదాకు అడ్డు
ఏఎన్‌ఐ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన బాబు
దాన్నుంచి బైటపడడం కోసమే హోదాపై ఒత్తిడి తేవడం లేదు
విభజన చట్టంలో హామీలకే ప్యాకేజీ పేరు
హోదా నిరాకరిస్తూ మోసం చేస్తున్నారు...
* మా పోరాటం ఆపేది లేదు..
హైదరాబాద్: పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు కాకపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు దాన్నుంచి బైటపడడం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని ఫణంగా పెట్టారని జగన్ విమర్శించారు.  విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాతోనే సాంత్వన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. గురువారం నాడు జగన్‌మోహన్‌రెడ్డి ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోరుతూ ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష, ఆసుపత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన తొలిసారిగా మాట్లాడారు.

ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘నిరవధిక నిరాహార దీక్ష ఎందుకు చేశాం? ఈ దీక్షకు కారణాలున్నాయి. పార్లమెంటు సాక్షిగా ఆనాడు అధికార పక్షం, మొత్తం ప్రతిపక్షం ఏకమయ్యాయి. విభజనకు అనుకూలంగా ఓటేశాయి. పార్లమెంటు వేదికగా ఆనాడు ప్రత్యేక హోదాకు అన్ని పక్షాలు హామీ ఇచ్చాయి. ఇవాళ అవే పక్షాలు మాట తప్పుతున్నాయి. అలాంటపుడు ఇక పార్లమెంటుకు విశ్వసనీయత ఎక్కడుంటుంది? మేం అడుగుతున్న మౌలికమైన ప్రశ్న ఇది.  రాష్ర్టవిభజనతో హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోతోంది.

ఎందుకంటే హైదరాబాద్ నుంచే 60శాతం ఆదాయం వస్తుంది. 95శాతానికి పైగా సాఫ్ట్‌వేర్ సంస్థలు, 70శాతానికి పైగా మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వాటిలో ఉపాథి అవకాశాలు కూడా కోల్పోయాం. వీటన్నిటినీ కోల్పోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అయితే ఇపుడు దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఇపుడు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారు. ఇదేమి న్యాయమో అర్ధం కావడం లేదు. రాష్ర్ట విభజన సమయంలో అనేక హామీలు ఇచ్చారు. పోలవరం నిర్మిస్తామన్నారు.

రాజధాని నిర్మాణానికి డబ్బు ఇస్తామన్నారు. కేంద్రసంస్థలను ఇస్తామన్నారు. ఎయిర్‌పోర్టులు కడతామన్నారు.. ఇలా అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ విభజన చట్టంలోనే ఉన్నాయి. ఇపుడు అందరూ మాటమారుస్తున్నారు. ఆ హామీలకే కొత్త పేరు పెడుతున్నారు. దానికి ప్రత్యేక ప్యాకేజీ అనే కొత్త పేరు తగిలించారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక పక్క ప్రత్యేక హోదాను నిరాకరిస్తూ మరో పక్క అబద్దాలాడుతూ మోసం చేస్తున్నారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన వాటికే కొత్తగా ప్రత్యేక ప్యాకేజీ అనే పేరు పెట్టడం మోసగించడమే. మాకు ఆకాంక్ష ఉంది. మేం పోరాడతాం. మా దురదృష్టమేమిటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాడడం లేదు.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వంపై రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. కానీ చంద్రబాబు  కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు వత్తిడి చేయడం లేదు? ఇప్పటికి 18 నెలలు గడచిపోయాయి. ఇప్పటికీ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదు. ఒకనెల గడువిస్తున్నా.. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరిస్తా అని చంద్రబాబు ఎందుకు అల్టిమేటమ్ ఇవ్వడం లేదు.

చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఎందుకంటే ఆయన ఓటుకు కోట్లు కేసులో ఆడియోటేపులతో సహా అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక కుంభకోణాలలో సంపాదించిన డబ్బును తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తూ ఆయన దొరికిపోయారు. ఆ కేసునుంచి బైటపడడం కోసమే ఆయన హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు’’.

వందల కోట్లు ‘మట్టి’పాలు


వందల కోట్లు ‘మట్టి’పాలు
♦ రాజధాని శంకుస్థాపన పేరిట సర్కారు ఆర్భాటం
♦ మంచినీళ్లలా ఖర్చు  
♦ దేశ, విదేశీ ప్రముఖులకు అతిథి సత్కారాలు..
♦ 20 ప్రత్యేక విమానాలు, 15 ప్రత్యేక హెలికాప్టర్లు అద్దెకు
♦ ఫోర్ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లలో 2,300 గదులు...
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి శంకుస్థాపన హంగుల కోసం ప్రభుత్వం రూ.కోట్లలో ఖర్చు చేస్తోంది.ప్రచార యావతో దుబారా, దుర్వినియోగానికి సిద్ధపడుతోంది.

ప్రజా సమస్యలతో ముడిపడి ఉన్న అనేక పనులకు సంబంధించిన రూ.3 వేల కోట్ల మేర బిల్లులను నిలిపి మరీ శంకుస్థాపనకు నిధులను వెచ్చిస్తోంది.ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లిన విషయాన్ని మరిచి అతిథుల పేరిట ఆర్భాటం చేస్తోంది.నిధులు ఖర్చుచేస్తున్న తీరుపై  విస్మయం వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు గొప్పలకు పోతున్న వైనంపైనా విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అయినవారు అందినకాడికి దండుకుంటున్న తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
అద్దెకు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లు
ప్రధాని నరేంద్రమోదీ సహా 65 మంది కేంద్రమంత్రులు, సింగపూర్, జపాన్‌లకు చెందిన మంత్రులు, ఆ దేశాలకు చెందిన కార్పొరేట్ యజమానులు, ప్రతినిధి బృందాలు, 29 రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు, 543 మంది లోక్‌సభ, 244 మంది రాజ్యసభ సభ్యులు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు సహా 1,500 మంది వీవీఐపీలకు ఆహ్వానాలు అందించారు. వీరితోపాటూ వివిధ రంగాలకు చెందిన వందలాది ప్రముఖులను, వివిధ దేశాలకు చెందిన 149 మంది దౌత్యవేత్తలనూ ఆహ్వానించారు. మొత్తంగా 21 వేలకుపైగా వీఐపీ ఆహ్వాన పత్రికలను ముద్రించారు.

వీటి ముద్రణకే రూ.కోట్లు వెచ్చించారంటూ ఓ ఉన్నతాధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవడానికి 20 ప్రత్యేక విమానాలు.. గన్నవరం, శంషాబాద్ విమానాశ్రయాల నుంచి శంకుస్థాపన ప్రాంతానికి చేర్చేందుకు 15 ప్రత్యేక హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు.

ఒక్కో విమానానికి రోజుకు రూ.7.50 కోట్లు, హెలికాప్టర్ల కోసం రూ.4 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు.(హెలికాప్టర్లు గంటల ప్రాతిపదికన అద్దె.. ఫ్లయింగ్, వెయిటింగ్ చార్జీలు వేర్వేరుగా ఉంటాయి). వీవీఐపీలు వచ్చినా.. రాకున్నా అద్దె మాత్రం చెల్లించాల్సిందే. విమానాలు, హెలికాప్టర్ల అద్దెకే రూ.150 కోట్ల మేరకు వెచ్చిస్తున్నారు. హెలికాప్టర్లు దిగేందుకు వీలుగా 15 ప్రాంతాల్లో హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు. ఇందుకు రూ.3కోట్లకుపైగా ఖర్చు చేశారు.
 
అతిథ్యం అదిరిపోయేలా!
దేశ, విదేశాల నుంచి వచ్చే వీవీఐపీలకు విజయవాడలో బస కల్పిస్తున్నారు. ఇందుకు ఈ నెల 21 నుంచి 23 వరకూ విజయవాడలో వివిధ స్టార్ హోటళ్లు, ప్రైవేటు అతిథి గృహాలన్నింటినీ అద్దెకు తీసుకున్నారు. విజయవాడలో ఫోర్ స్టార్ హోటళ్లలో 300 గదులు, త్రీస్టార్ హోటళ్లలో 500 గదులు, ప్రైవేటు అతిథి గృహాలలో 1,500 గదులను రిజర్వు చేసుకున్నారు. వీటికి రోజుకు(సగటున) రూ.6వేల చొప్పున మూడు రోజులపాటూ చెల్లిం చనున్నారు. వీవీఐపీలు బస చేయడానికే రూ.10 కోట్లకుపైగా కేటాయిస్తున్నారు. వారికి మరో రూ.10 కోట్లతో దేశ, విదేశీ రుచులతో విందు ఏర్పాటు చేయనున్నారు.
 
ప్రత్యేక రహదారులు : గన్నవరం విమానాశ్రయం, మంగళగిరి, జగ్గయ్యపేట, కృష్ణా కరకట్టల నుంచి ఉద్దండరాయునిపాలెంకు వరకూ ప్రత్యేక రహదారులు నిర్మిస్తున్నారు. ఇందుకు ఇప్పటికే రూ.28 కోట్లకుపైగా ఖర్చు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చేందుకు రూ.5 కోట్లు కేటాయించారు. ఈ రహదారుల్లో కొత్తగా మిరిమిట్లు గొలిపే లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.5 కోట్లు మంజూరు చేశారు.
 
250 ఎకరాల్లో సభ: శంకుస్థాపన అనంతరం లక్ష మందితో సభ నిర్వహించేందుకు వీలుగా 250 ఎకరాలను చదును చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు చేశారు. సాంసృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదికలను తీర్చిదిద్దడం కోసం రూ.15 కోట్లను వెచ్చించబోతున్నారు. లక్ష మంది ప్రజలకు భోజన ఏర్పాట్ల కోసం రూ.పది కోట్లను మంజూరు చేశారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కొత్త వస్త్రాల పంపిణీకీ రూ.కోట్లలో ఖర్చు కానుంది.అతిథుల జ్ఞాపికలకు గాను  రూ.2.5 కోట్లకుపైగా వెచ్చిస్తున్నారు.
 
హోరెత్తిపోయేలా ప్రచారం: పత్రికలు, టీవీ చానల్స్‌ల్లో ప్రకటనలకు రూ.20 కోట్ల మేరకు ఖర్చు చేయనున్నారు. శంకుస్థాపనను చిత్రీకరించే బాధ్యతను నేషనల్ జియోగ్రఫీ చానల్‌కు కట్టబెట్టారు. అధికారుల బస, ఆతిథ్యం, తదిత రాలకు సాధారణ పరిపాలన ప్రొటోకాల్ విభాగం రూ.22 కోట్లు వెచ్చించనుంది.  
 
ఊరూరా పండుగా!: శంకుస్థాపనకు రాష్ట్రంలో 16 వేల గ్రామాల నుంచి కిలో మట్టి, పావు లీటరు నీటిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పసుపు గుడ్డ సంచిలో మట్టిని, రాగి పాత్రలో నీటిని సేకరించే కార్యక్రమానికి ఆయా జిల్లాల్లో వివిధ శాఖల పద్దుల కింద రూ.కోట్లు వెచ్చించారు. ప్రతీ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పది నిముషాల నిడివి గల వీడియో క్లిప్పింగ్స్‌ను, ఐదు ఫొటోగ్రాఫ్స్‌ను జిల్లా కలెక్టర్లు సీఆర్‌డీఏకు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు గాను ఒక్కో జిల్లాకు సగటున రూ.3 కోట్ల వరకూ ఖర్చు చేయాలని నిర్ణయించారు. అంటే.. మట్టి సేకరణకే రూ.39 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

మీ స్ఫూర్తే నన్ను నడిపిస్తోంది: వైఎస్ జగన్

Written By news on Thursday, October 15, 2015 | 10/15/2015


మీ స్ఫూర్తే నన్ను నడిపిస్తోంది: వైఎస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు పోరు ఆగదని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నాకు మీరిచ్చిన మద్దతు, నా పై చూపించిన ఆప్యాయత మరవలేనిదని ప్రజలను ఉద్దేశించి ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధించాలనే మీరిచ్చిన స్పూర్తే తనను నడిపిస్తుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు మన పోరు కొనసాగుతోందని వైఎస్ జగన్ తెలిపారు.  
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద ఏడు రోజులపాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించటంతో పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న వైఎస్ జగన్ ను వైద్యులు నిన్న సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
 Deeply touched by your support, commitment & affection. Your spirit kept me going.Our battle will continue till we achieve #APSpecialStatus.

రాజధాని శంకుస్థాపనకు నాకు ఆహ్వానం వద్దు


రాజధాని శంకుస్థాపనకు నాకు ఆహ్వానం వద్దు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన కోసం తనకు ఎలాంటి ఆహ్వానం పంపొద్దని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆహ్వానం పంపినా హాజరు కాలేదని తర్వాత తనపై బండ విసరొద్దని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈమేరకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. మీరు, మీ ఆదేశాల మేరకు మీ అరడజను మంది మంత్రులు చేయబోయేది ఇదేనని ఈపాటికే తనకు, ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కార్యక్రమానికి రాకపోవడానికి కారణాలను కూడా జగన్ సవివరంగా ఈ లేఖలో తెలిపారు. అవి ఇలా ఉన్నాయి... (లేఖ పూర్తి పాఠం ఇక్కడ చూడండి)

1) ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మీ అధికారాన్ని ఉపయోగించి రైతుల భూములు లాక్కొని, వారి ఉసురు మీద మీరు రాజధాని కడుతున్నారు. మూడు పంటలు పండే మాగాణి భూములను పూలింగ్ పేరిట రైతుల మెడమీద కత్తిపెట్టి లాక్కున్న మీ వైఖరికి వ్యతిరేకంగా ఇప్పటికే మేం పలు సందర్భాల్లో దీక్షలు చేసినా, నిరసనలు తెలిపినా మీ తీరు మారలేదు. అందుకే రాదలచుకోలేదు.

2) రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30, సెక్షన్ 144ని ఎందుకు అమలుచేస్తున్నారు? ప్రజలు ఆనందంతో ఉంటే మరి ఎందుకు ఈ సెక్షన్లు అమలులో ఉన్నాయి? అక్కడ ఈ నిషేధ సెక్షన్లు గత సంవత్సర కాలంగా ఎందుకు ఉపయోగిస్తున్నారు?

3) గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును బేఖాతరు చేస్తూ కోర్టును, ప్రజల మనోభావాలను రెండింటినీ లెక్క చేయని మీ వైఖరికి నిరసనగా రాదలచుకోలేదు.

4) అసైన్డ్ భూములు, పేదల భూములు అంటే చులకన స్వభావంతో అవి మీ అత్తగారి సొత్తు అన్నట్లు, మీ ఇష్టం వచ్చినట్లు ఆక్రమించుకునే మీ మనస్తత్వానికి నిరసనగా రాదలుచుకోలేదు.

5) మీ కమీషన్ల కోసం, మీ లంచాల కోసం మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజల కడుపు కొడుతున్నారు. మీకు నచ్చిన ప్రైవేటు, విదేశీ సింగపూర్ కంపెనీలకు మీ ఇష్టం వచ్చినట్లు భూములు ఇస్తున్న మీ వైఖరికి నిరసనగా, మీరు చేస్తున్న ఈ స్కాంలో మీకు మద్దతు తెలపకూడదన్న భావనతో రాదలచుకోలేదు.

6) కేంద్రం రూ. 1850 కోట్లు రాజధాని కోసం డబ్బులు ఇచ్చింది. రింగ్ రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కు ఇంకా చేస్తామని కూడా చెబుతోంది. ఈ డబ్బును ఖర్చుచేసి బిల్లులు పెట్టండి ఇంకా ఇస్తాం.. మీ అవసరం మేరకు అంటోంది. విభజన చట్టం ప్రకారం మనకు ఇవ్వాల్సినవన్నీ నెరవేరుస్తాం అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పుడు రాజధాని నిర్మాణానికి ప్రైవేటు సింగపూర్ కంపెనీలతో లేక ప్రైవేటు విదేశీ కంపెనీలతో ఏం పని? రాజధానిలో ఉండాల్సిన హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలకు కావాల్సింది అక్కడే ఉన్న ప్రభుత్వ భూముల్లో కట్టుకొని, రోడ్లు వేసి, జోనింగ్ చేసి ప్రజలు రియల్ ఎస్టేట్ చేసుకుంటారో, లేక వారి భూములు వారే అట్టిపెట్టుకుంటారో ప్రజల ఇష్టానికి వదిలేయకుండా బలవంతంగా మీ సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేద ప్రజల భూమును లాక్కోవడానికి నిరసనగా.. మేం రాదలచుకోలేదు.

7) మీ వాళ్లను బినామీలుగా పెట్టుకొని రాజధాని ప్రాంతంలో వందల ఎకరాలు కొనుగోలు చేయించి, వారి భూములు వదిలేసి పేదల భూములు మాత్రం ఇష్టం లేకపోయినా లాక్కొన్న మీ వైఖరికి నిరసనగా మేం రాదలచుకోలేదు.

8) ప్రజల డబ్బును దుబారా చేస్తూ మీరు ఒక్కరోజు తతంగాన్ని జరిపేందుకు ప్రజల డబ్బు దాదాపు రూ. 400 కోట్లు బూడిదపాలు చేస్తున్న మీ తీరుకు నిరసనగా రాదలచుకోలేదు.

చివరిగా ఒక్కమాట.. రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. మీరు శంకుస్థాపన చేస్తున్నది ప్రజల రాజధానికి కాదు. పేద ప్రజల రాజధానికి అసలే కాదు. ఇది మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, లక్షల కోట్ల అక్రమ సంపాదనకు, విదేశాలకు విదేశీ కంపెనీల ద్వారా లక్షల కోట్లు తరలించడానికి, రైతుల కడుపు కొట్టడానికి మీరు చేస్తున్న శంకుస్థాపన. కాబట్టే ప్రజలందరి తరఫునా ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్నాం.

చంద్రబాబుకు ఆ పిచ్చి పీక్ స్టేజ్ కి చేరింది

Written By news on Wednesday, October 14, 2015 | 10/14/2015


'చంద్రబాబుకు ఆ పిచ్చి పీక్ స్టేజ్ కి చేరింది'
హైదరాబాద్ :  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్ ఆర్ సీపీ నేత బత్తుల బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని, ఆ పిచ్చి కాస్తా పీక్ స్టేజ్ కి చేరిందని ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ కార్యాలయంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేవన్న చంద్రబాబు, తన ప్రచారానికి మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.  రాజధాని శంకుస్థాపన పేరుతో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.

గోదావరి పుష్కరాలలో రూ.1650 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే అందులో రూ.1400 కోట్లు దుర్వినియోగం అయ్యాయని బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పథకాల పేరుతో వందల కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న అథితులకు వాళ్ల సొంత హోటల్స్ లో విడిది ఏర్పాటు చేసి ప్రజలు, ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెడుతున్నారని బత్తుల ఆరోపించారు.

విజయవాడలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేయడానికి నిరసనగా విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మార్చ్ ను పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం విజయవాడ పీడబ్ల్యూడీ గ్రాండ్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు మార్చ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది.

పీడబ్ల్యూడీ గ్రాండ్ వద్ద పోలీసులు మార్చ్ ను అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్ సీపీ నేతలకు, పోలీసులకు మధ్య  వాగ్వాదం జరిగింది. పోలీసులు వైఎస్ఆర్ సీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ తీరును వైఎస్ఆర్ సీపీ నేతలు ఖండించారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్ఆర్ సీపీ పోరాటం ఆగదని సీనియర్ నేత బొత్సా సత్యానారాయణ చెప్పారు. మరో నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేతలను, ప్రజాప్రతినిధులను ఏ మాత్రం గౌరవించకుండా పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యాన్ లో ఎక్కించారని ఉమ్మారెడ్డి అన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప్టిన మార్చ్ లో సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో వైఎస్ జగన్ గుంటూరు నల్లపాడు రోడ్డులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను.. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే.

478.93 ఎకరాల భూమి బంధువులకు..


జగ్గయ్యపేట... ఇక మరో భోపాల్పరిశ్రమ నిర్మిస్తే నిర్వీర్యం కానున్న జయంతిపురం ప్రాంతంలోని పచ్చటి పొలాలు
సాక్షి, జగ్గయ్యపేట అర్బన్: వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నిర్మించ తలపెట్టిన ఎరువుల కర్మాగారాలతో తమ ప్రాంతం కాలుష్య కాసారంగా మారుతుందని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని జయంతిపురం గ్రామప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జయంతిపురం 93వ సర్వే నంబరులోని 478.93 ఎకరాల భూమిని తన బంధువులకు చెందిన వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు కేటాయిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రాంతంలో భారీ ఎరువుల కర్మాగారాలను నెలకొల్పితే... భారీ ఎత్తున విడుదలయ్యే ఆన్‌హైడ్రస్ అమ్మోనియా, సత్సంబంధ లీకేజీల మూలంగా భారీ సంఖ్యలో వయోవృద్ధులు, పిల్లలు మృత్యువాత పడే ప్రమాదం, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, అంగవైకల్యాల బారిన పడే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామిక దుర్ఘటనల్లో అత్యంత ఘోరమైన భోపాల్ విషవాయు లీకేజీలాంటి దుర్ఘటనకు ఈ పరిశ్రమలు కారణం కావచ్చన్న ఆందోళనలకు అవుననే సమాధానం చెబుతున్నారు.

భోపాల్‌లో 31 ఏళ్ల కిందట యూనియన్ కార్బైడ్ పరిశ్రమలో విషవాయువుల లీకేజీ దుర్ఘటన 15 వేల మందిని బలిగొంది. దాని తాలూకా దుష్ర్పభావాలు నేటికీ వైద్యులకు కూడా అంతుచిక్కడం లేదు. ఇప్పుడు తమ ప్రాంతంలో అలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేసి, తమ ప్రాణాలతో ఆడుకునేకంటే ఆ భూములను నిరుపేదలైన రైతులకు పంచాలని జయంతిపురం, పరిసర గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆయా గ్రామాలలోని సుమారు 250 మంది పేద రైతులకు రెండెకరాల చొప్పున భూములు కేటాయిస్తే సాగు చేసుకుని బాగుపడతారని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వారు సిద్ధమయ్యారు. గురువారం జరిగే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు వారు సర్వ సన్నాహాలు చేసుకుంటున్నారు.

ప్రభుత్వ పెద్దల బంధుప్రీతికి బలికానున్న ప్రజల ప్రాణాలు
జయంతిపురం గ్రామానికి చెందిన రైతులు పూర్తిగా కృష్ణా డెల్టాపై ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్నారు. అలాంటి ప్రాంతంలో 478.93 ఎకరాల భూమిని ఒకే సంస్థకు, అందునా విషవాయువులు విడుదల చేసే కర్మాగారాలకోసం అతి తక్కువ ధరకు ధారాదత్తం చేయటం వెనుక పెద్ద మతలబు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే  బాలకృష్ణకు వీబీసీ కెమికల్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, సంచాలకుల హోదాలో ఉన్న ఎంఎస్‌పీ రామారావు స్వయానా వియ్యంకుడు. అందుకే పెద్దబాస్, చిన్నబాస్‌లు ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి బంధుగణాలకు భూములు కేటాయించుకున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమకు కేటాయించిన భూమిలో... రోజుకు 2‘2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 2‘400 మెట్రిక్ టన్నుల నైట్రిక్ యాసిడ్, 2‘500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్, 2‘3850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తిచేసే ఎరువుల కర్మాగారాలు, 2‘67.5 మెగావాట్ల సామర్థ్యంతో బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారం నెలకొల్పే యోచనలో వీబీసీ పరిశ్రమ ఉన్నట్లు సమాచారం.

ఆ కర్మాగాలు ఏర్పాటైతే వాటినుంచి వచ్చే కాలుష్యం భూగర్భ, ఉపరితల జలాల్లోకి వెళితే పెనుప్రమాద మే సంభవిస్తుంది. యూట్రోఫికేషన్ చర్య మూలంగా జల వాతావరణం మొత్తంగా కాలుష్య కాసారంగా మారుతుంది. రైతులు, తాగునీటి అవసరాలు తీర్చుకునే లక్షలాదిమందిపై తీవ్ర ఆరోగ్య సమస్యలు వెల్లువెత్తే ప్రమాదముందని నిపుణుల అంచనా. పారిశ్రామిక దిగ్గజాలైన టాటా, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి వారే ఈ రంగంలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటుంటే, నష్టాల్లో ఉన్న కోనసీమ గ్యాస్ పవర్ కంపెనీకి చెందిన ఎంఎస్‌పీ రామారావు ఏ ధైర్యంతో పెట్టుబడి పెట్టాలని యోచనలో ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

http://www.sakshi.com/news/district/govt-nod-to-vbc-fertilisers-and-chemical-limited-plant-in-jaggayyapeta-283656?pfrom=home-top-story

నేడు విజయవాడలో నిరసన మార్చ్


ప్రత్యేక హోదా ఉద్యమం ఆగదు
♦ నేడు విజయవాడలో నిరసన మార్చ్: అంబటి
♦ వైఎస్ జగన్ దీక్ష భగ్నం అప్రజాస్వామికం
♦ 17 నుంచి 21 వరకూ నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు

  గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామికమని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు ఎటువంటి ప్రయత్నం చేయని ప్రభుత్వం, హోదా సాధించే బాధ్యతను భుజాన వేసుకున్న జగన్‌పై కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.

జగన్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించినంత మాత్రాన ప్రత్యేక హోదా ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు. జగన్ దీక్షపై అనుమానాలున్నాయని రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారం తీసుకోకున్నా జగన్ ఎంతో ఉత్సాహంగా దీక్షలో కూర్చుంటున్నారని వ్యాఖ్యలు చేసిన మంత్రులు... జగన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో పోలీసులే బలవంతంగా జీజీహెచ్‌కు తరలించిన సంఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్ దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిన సంఘటనపై పార్టీ భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించారు.

► దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకూ ‘నిరసన మార్చ్’ నిర్వహిస్తారు. నిరసన మార్చ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
►17వ తేదీ నుంచి 21వరకూ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. 18వ తేదీన రిలే నిరాహార దీక్షా శిబిరాలకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివెళతారు. అక్కడ నిర్వహించిన సమావేశంలో పార్టీ నేతలు ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రసంగిస్తారు. 19న ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి, 20వ తేదీ సాయంత్రం నియోజకవర్గ కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, 21న ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నా చేపడతారు. ఈ నెల 22న రాజధాని శంకుస్థాపనకు హాజరుకానున్న ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

 ప్రధానిని  కలిసేందుకు లేఖ రాస్తాం..
 ప్రత్యేక హోదా ఆవశ్యకత, నిరవధిక నిరాహార దీక్ష భగ్నం చేసిన సంఘటనలను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారని అంబటి చెప్పారు. ఈనెల 22న రాజధాని శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ జగన్ లేఖ రాయనున్నారని తెలిపారు.

హిందూ ఆచారాలు మంటగలుపుతున్న బాబు


హిందూ ఆచారాలు మంటగలుపుతున్న బాబు
మైలలో ఉన్నప్పుడు తీసిన మట్టితో రాష్ట్రానికి అరిష్టం: ఎమ్మెల్యే చెవిరెడ్డి

 తిరుపతి రూరల్: ‘‘హిందూమత సంప్రదాయాలు, ఆచారాలను ముఖ్యమంత్రి మంటగలుపుతున్నారు. ఆయనకు దేవుడంటే భయమూ భక్తీ లేదు. అంతా నాటకమే. ఈనెల 8న చంద్రబాబు పెద్దనాన్న కుమారుడు మృతిచెందారు. దీంతో ‘అంటు’లో ఉన్న ఆయన సాక్షాత్తు టీటీడీ కల్యాణమండపంలో హోమాలు, పూజలు ఎలా చేస్తారు?’’ అని  వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి  ప్రశ్నించారు. అంటులో ఉన్న చంద్రబాబు తీసుకువచ్చే మట్టి, నీళ్ల వల్ల నూతన రాజధానికి అరిష్టం కలుగుతుందన్నారు. మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం తీరుపై ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు అపచారం...

Written By news on Tuesday, October 13, 2015 | 10/13/2015

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మతవిశ్వాసాలపై నమ్మకం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. చంద్రబాబు అపచారం చేశారని, ఆయన తీరు రాష్ట్రానికి అరిష్టమని ధ్వజమెత్తారు.  

ఐదు రోజుల క్రితం చంద్రబాబు పెదనాన్న కొడుకు మరణించడంతో, ఈ నెల 15న జరగాల్సిన ఆయన మనవడి పుట్టివెంట్రుకల కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని చెవిరెడ్డి చెప్పారు. కర్మక్రియలు పూర్తయ్యే వరకు శుభకార్యాలు చేయరని, దేవాలయాలకు వెళ్లరని..  అలాంటిది అమరావతిలో రాజధాని శంకుస్థాపన కోసం చంద్రబాబు నాగదేవత పూజలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇలా చేయడం రాష్ట్రానికి అరిష్టమని అన్నారు. తన ఇంట్లో శుభకార్యాన్ని రద్దు చేసుకున్న చంద్రబాబు.. ప్రభుత్వ పూజా కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని చెవిరెడ్డి నిలదీశారు. మతపెద్దలు ఈ విషయంపై చంద్రబాబును ప్రశ్నించాలని కోరారు.

లీజు ఖరారు కాకుండానే కోట్ల విలువైన భూమి ధారాదత్తం?

ఫిల్మ్‌నగర్ కల్చరల్ సొసైటీకి ఆగమేఘాలపై భూమి కేటాయింపు
*లీజు ఖరారు కాకుండానే కోట్ల విలువైన భూమి ధారాదత్తం
 *వారంలోనే దస్త్రాలు సిద్ధం..
* తెరవెనుక 'గంటా' మంత్రాంగం

 
విశాఖపట్నం :  వందలకోట్ల విలువైన భూములను పప్పుబెల్లాల్లా పంచేస్తున్నారు. వడ్డించే వాడు మనవాడైతే అన్నట్టుగా ఉంది జిల్లాలో భూముల పందేరం పరిస్థితి. కనీసం లీజు ఎన్నేళ్లకు ఇస్తున్నాం? ఎంత మొత్తానికో కూడా ఖరారు చేయకుండానే ధారాదత్తం చేస్తున్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోనే శంకుస్థాపన చేసిన ఫిల్మ్‌నగర్ క్లబ్ కథా కమామిషు తెలుసుకుంటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
 
 
 హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేంద్రంగా ఉన్న ఈ సొసైటీ కార్యకలాపాలను విశాఖలో విస్తరించేందుకు భూముల కేటాయింపు విషయమై తన బంధువైన ఓ సీనియర్ నిర్మాత ఒత్తిడితో మంత్రి గంటా శ్రీనివాసరావు తెర వెనుక మంత్రాంగం నడిపినట్లు తెలిసింది. ఫిల్మ్ నగర్ సొసైటీకి భూముల కేటాయింపుపై అంతాతానై చక్రం తిప్పారు. వారంలోనే దస్త్రాలు సిద్ధమయ్యాయి. కాపులుప్పాడలో మంగమారిపేట పక్కనే తొట్లకొండను ఆనుకొని 395,413 సర్వే నెంబర్లలో ఉన్న 17 ఎకరాలను సొసైటీ పేరిట ధారాదత్తం చేశారు. ఇక్కడ గజం రూ.10వేల నుంచి 15 వేలవరకు ఉంది. 17 ఎకరాల మార్కెట్ విలువ అక్షరాలరూ.100కోట్లకు పైమాటే. ఈ భూముల ప్రభుత్వ విలువే గజం రూ.4,638గా నిర్ణయించారు. అంటే ఇక్కడ ఎకరా 2కోట్ల 22లక్షల 64వేలుగా జిల్లా కలెక్టర్ యువరాజ్ నిర్ణయించారు.

ఈ లెక్కన చూసుకున్నా 17 ఎకరాల విలువ రూ.37.85 కోట్లకు పైమాటే. ఇంత విలువైన భూమిని  ఎలాంటి సంప్రదింపులూ జరపకుండానే మంత్రి గంటా ఒత్తిడితో జిల్లాయంత్రాంగం సొసైటీపరం చేసింది. ఎన్నేళ్లకు ఇస్తున్నాం..ఎకరా ధర ఎంతకు ఇస్తున్నాం? అనేది కూడా నిర్ణయించలేదు. పైసా కూడా లీజు మొత్తం చెల్లించ లేదు. కనీసం భూములను అప్పగించే ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. అంతా గోప్యంగానే.
రెండ్రోజుల క్రితం ఏర్పాటు మీడియా సమావేశంలో ఫిల్మ్‌నగర్ సొసైటీకి 17 ఎకరాల కేటాయింపు విషయమై ప్రతిపాదన అందిందని.. లీజు నిర్ణయించలేదని అధికారికంగానే ప్రకటించారు. ఇంతలోనే భూమిని స్వాధీనం చేసుకుని ఫిల్మ్ నగర్ పెద్దలు ఆదివారమే భూమిపూజ చేశారు. సోమవారం సీఎం చంద్రబాబు ఎయిర్‌పోర్టులో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించేశారు.
 
 అప్పనంగా ఇస్తే ఊరుకోను..: ఎంపీ హరిబాబు
 ఎంపీ హరి బాబును ఆహ్వానించేందుకు సొసైటీ పెద్దలు  ప్రయత్నించగా ప్రతిఘటన ఎదురైంది. పరిశ్రమలకు, వాటర్ క్లబ్‌కు భూములివ్వ మని కోరితేలేవని చెబుతున్న జిల్లామంత్రులు ఏవిధంగా 17 ఎకరాలు కేటాయించారంటూ ఎంపీ వారిపై మండిపడ్డట్టు తెలిసింది. ఆర్‌టీఐ ద్వారా వివరాలు సేకరిస్తా..సీఎంను సైతం నిలదీస్తానంటూ తీవ్ర స్థాయిలో వారిని హెచ్చరించినట్లు తెలిసింది.

http://www.sakshi.com/news/district/visakhapatnam-as-a-film-hub-says-hrd-minister-ganta-srinivas-rao-283480?pfrom=home-top-story

ఈనెల 17 నుంచి 21 వరకూ అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు...


భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన వైఎస్ఆర్ సీపీ
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కార్యచరణ వివరాలను మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకూ వైఎస్ఆర్ సీపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకూ నిరసన మార్చ్ జరుగుతుందన్నారు. ఈ నిరసన మార్చ్ లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొంటారని అంబటి తెలిపారు.

*ఈనెల 17 నుంచి 21 వరకూ అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు
* 18న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు
*19న నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు
*20వ తేదీ సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ
*21న బస్సు డిపోల ముందు ధర్నాలు

జగన్ తో సంప్రదించాక ఉద్యమ కార్యాచరణ


జగన్ తో సంప్రదించాక ఉద్యమ కార్యాచరణ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ కోసం నిర్వహించిన వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంప్రదించాక పోరాట కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి.. వైఎస్ జగన్ ను కలవనున్నారు.

తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షను బలవంతంగా విరవింపజేసిన నేపథ్యంలో గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాయకులు సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్ విడుదల


వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్ విడుదలజీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు
గుంటూరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 24  గంటలు తమ పర్యవేక్షణలో ఉండాలని గుంటూరు ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్) వైద్యులు తెలిపారు. జగన్ కు క్రమేణా ప్లూయిడ్స్ అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్ ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని, మెల్లగా కోలుకుంటున్నారని చెప్పారు. జగన్ కు బీపీ 130/80, కీటోన్స్ 3 ప్లస్, యూరిక్ యాసిడ్ 13.2 గా ఉందని తెలిపారు. పూర్తిస్థాయిలో కోలుకునేదాకా జగన్ ఆస్పత్రిలోనే ఉండాలని ఆయన సూచించారు. ఏడు రోజుల పాటు నిరాహారదీక్ష చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పోలీసులు బలవంతంగా జీజీహెచ్ కు తరలించారు. ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మధ్యాహ్నంలోపు కార్యాచరణ ప్రకటిస్తాం

 జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షను బలవంతంగా భగ్నం చేసినంతమాత్రాన ప్రత్యేక హోదా ఉద్యమం ఆగదని, మరింత ఉదృతంగా ముందుకు వెళతామని వైఎస్సార్ సీపీ ముఖ్యనేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.  గడిచిన రెండు రోజుల నుంచి వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నప్పటికీ, లక్ష్యాన్ని సాధించేవరకు దీక్ష కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారని ఆయన తెలిపారు. అయితే పోలీసులు బలవంతంగా ఆసుపత్రిలో చేర్చి వైద్య సేవలు అందించడం మొదలుపెట్టిన తర్వాత జగన్ ఆరోగ్యం కాస్త కుదుటపడే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొన్నారు.

దీక్ష భగ్నం నేపథ్యంలో వైఎస్సార్ సీపీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఈ రోజు మధ్యాహ్నం లోగా ప్రకటిస్తామన్నారు. 'మంగళవారం 11 గంటలకు గుంటూరులోనే పార్టీ సీనియర్ల సమావేశం జరగనుంది. ఈ భేటీలో సమాలోచనలు జరిపి.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో చర్చిచి నిర్ణయాలు ప్రకటిస్తాం' అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు

దున్నపోతు మీద వాన పడినట్లు...


దున్నపోతు మీద వాన పడినట్లు...
గుంటూరు : ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే చంద్రబాబు అభినందించాల్సింది పోయి.. దున్నపోతు మీద వాన పడినట్లు చలనం లేకుండా ఉన్నారని, తన మంత్రులతో హీనమైన వ్యాఖ్యలు చేయించారని వైఎస్ జగన్ సోదరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. షర్మిల ఏమన్నారంటే..
  • వాళ్లు డిఫెన్సులో పడ్డారు. జగన్ దీక్ష మరింత ఉధృతం అయితే వాళ్ల పరిస్థితి ఘోరంగా ఉంటుందని వాళ్లకు తెలుసు
  • చంద్రబాబుకు పబ్లిక్ కంటే పబ్లిసిటీ మీదే దృష్టి ఎక్కువ
  • ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబుది.
  • కానీ ఆ బాధ్యతను ఆయన విస్మరిస్తే ఆ భారాన్ని జగన్ మోహన్ రెడ్డి తన భుజాన వేసుకున్నారు.
  • ఆ విషయాన్ని అభినందించాల్సింది పోయి దున్నపోతు మీద వానపడినట్లు చంద్రబాబు కనీసం చలనం లేకుండా వాళ్ల మంత్రులతో హీనమైన వ్యాఖ్యలు చేశారు.
  • అలాంటి మనిషి గురించి ఏం చెప్పాలి?
  • రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటూ పచ్చి అబద్ధాలు చెప్పిఅధికారంలోకి వచ్చిన ఈయనా ఒక నాయకుడేనా?
  • జగన్ తనకు చేతనైనంతంగా ఈ ఏడాదిన్నర నుంచి ప్రతి సందర్భంలోనూ ఉద్యమిస్తూనే ఉన్నారు.
  • ఒకవేళ కేంద్రం గానీ, రాష్ట్రం గానీ హామీ ఇవ్వకపోయినా ఈ పోరాటం ఇంతటితో ఆగదు.
  • జగనన్న రికవర్ అవుతారు, పోరాటం మళ్లీ కొనసాగుతుంది.

కనీసం 24 గంటలు పరిశీలనలో ఉండాలి


కనీసం 24 గంటలు పరిశీలనలో ఉండాలి
గుంటూరు : ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనీసం 24 గంటల పాటు తమ అబ్జర్వేషన్ లో ఉండాలని గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు తెలిపారు. వైఎస్ జగన్ ను ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించడం ప్రారంభించిన తర్వాత ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్ రాజు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి...
  • వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం 4.30 గంటల సమయంలో ఆస్పత్రిలో చేరారు.
  • తీసుకొచ్చేసరికి ఆయన డీహైడ్రేషన్ లో ఉన్నారు,
  • బీపీ130/90, పల్స్ 56 ఉన్నాయి.
  • షుగర్ 65 ఉంది. కీటోన్స్ 4+ వచ్చింది.
  • రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు, గుండెకు సంబంధించిన పరీక్షలు చేశాం.
  • కిడ్నీకి సంబంధించి బ్లడ్ యూరియా, సీరమ్ క్రియాటిన్ నార్మల్ గా ఉన్నాయి.
  • సీరమ్ యూరిక్ యాసిడ్ మాత్రం ఎక్కువగా ఉంది.
  • గుండె పరిస్థితి గురించి తెలుసుకోడానికి ఈసీజీ కూడా చేశారు.
  • ఈ పరీక్షల ఆధారంగా ఆయనకు ఐవీ ఫ్లూయిడ్స్ అందిస్తున్నాం.
  • ఆయన పరిస్థితి స్టేబుల్ గా ఉంది.
  • కనీసం 24 గంటలు మా అబ్జర్వేషన్ లో ఉంచాలన్నది మా డాక్టర్లందరి నిర్ణయం.
  • ఆయనకు విశ్రాంతి చాలా అవసరం.
  • ఐవీ ఫ్లూయిడ్స్ తో పాటు జ్యూసులు ఇవ్వాలని చెప్పాం.
  • యూరిక్ యాసిడ్, కీటోన్ బాడీస్ తప్ప మిగిలినవన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని చెప్పొచ్చు.

Popular Posts

Topics :