23 December 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పార్లమెంట్‌ను సమావేశపర్చాలి: వాసిరెడ్డి

Written By news on Saturday, December 29, 2012 | 12/29/2012

దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి నిర్భయ మృతి నేపథ్యంలో మహిళలకు రక్షణ కల్పించే చట్టాల సమీక్షకు తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 13 రోజులపాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన బాధితురాలి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. దేశంలో మహిళల రక్షణకు పెనుమార్పులు తేవాల్సిన ఆవశ్యకతను ఈ ఉదంతం చాటిచెబుతోందన్నారు. యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు అత్యంత గర్హనీయమని మండిపడ్డారు.

జగన్ కోసం... జనం సంతకం (One Crore Signatures For Jagan)











click above image for 
ONLINE SIGNATURE


తేదీ: 22 డిసెంబర్ 2012
మాన్యశ్రీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి...

ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకుంటున్న విజ్ఞప్తి...

జగన్ కోసం... జనం సంతకం
     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ సభ్యులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్థారించాల్సిన సీబీఐ సంస్థ- జగన్మోహనరెడ్డిని దోషిగా చిత్రీకరించటానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం..

     ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు వైయస్ జగన్మోహనరెడ్డిగారిని 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచటాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.




మీరూ చేయికలపండి!

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ 'జగన్ కోసం... జనం సంతకం' పేరిట ప్రారంభించిన కోటి సంతకాల సేకరణలో మీరూ పాలుపంచుకోండి. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సంతకాలు చేసిన తర్వాత ఫార్మ్‌లో తెలిపిన పార్టీ కేంద్ర కార్యాలయం చిరునామాకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించగలరు.


Plot No.883-884, Road Number. 45
Jubilee Hills, Hyderabad - 500033
AndhraPradesh, India.
040-23609696 , 23609595 ,
http://www.ysrcongress.com/home/koti_santhakaalu.html

బాధితురాలికి వైఎస్‌ఆర్ సీపీ సంతాపం

ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ మృతి నేపథ్యంలో ఈ దేశంలో మహిళలకున్న రక్షణ, చట్టాల సమీక్షకు తక్షణమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించిన బాధితురాలికి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.

మహిళల రక్షణకు పెనుమార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఈ ఉదంతం చాటి చెబుతోందని ఆమె అన్నారు. గ్యాంగ్ రేప్ జరిగిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు అత్యంత గర్హనీయం అని ఆమె దుయ్యబట్టారు. సంఘటన జరిగిన రెండో రోజునే ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మాట్లాడుతూ రాత్రిళ్లు మహిళలకు రక్షణ కల్పించలేమని మాట్లాడ్డం ఏమిటని ఆమె అభ్యంతరం తెలిపారు.

వారం రోజుల పాటు యువత, విద్యార్థులు ఢిల్లీని ముట్టడించిన తరువాతనే దిగివచ్చి కేసులో సత్వరం చార్జిషీటు వేస్తామని, నిందితులకు శిక్షపడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిందని ఆమె అన్నారు. అసలు ఈ వ్యవహారాన్ని తొలి నుంచీ శాంతిభద్రతల కోణంలోనే చూస్తున్నారని ఆందోళన చేస్తున్న వారిని ఎలా అదుపు చేయాలని ఆలోచించారే తప్ప మహిళల రక్షణ గురించి చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు.

శాంతిభద్రతల కోణంలో ఆలోచించారు కనుకనే విషమ పరిస్థితిలో నిర్భయను ఢిల్లీ నుంచి సింగపూర్‌కు తరలించారని ఆమె అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తరలింపు ప్రమాదం అని వైద్యులు చెప్పినా చేశారంటే ఇందులో రాజకీయ కోణం ఉందని సోనియా నివాసమైన టెన్, జన్‌పథ్‌లో ఈ నిర్ణయం జరిగినట్లు ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

అర్థరాత్రి మహిళలు ఎందుకు తిరగాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బాధ్యతారాహిత్యంగా మాట్లాడ్డం చూస్తే మహిళల పట్ల ఆయనకు ఎంత చులకన అభిప్రాయం ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్రపతి కుమారుడు చేసిన వ్యాఖ్యలు కూడా దారుణమన్నారు. అందరూ సిగ్గుతో తల దించుకోవాల్సిన ఈ సంఘటన తరువాత ఉన్నత స్థాయిలో మహిళల రక్షణ గురించి చర్చించాల్సి ఆవశ్యకత కనిపిస్తోందని అందుకే పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పర్చాలని ఆమె కోరారు.

నిర్భయకు నివాళి
అత్యాచార బాధితురాలు మృతి చెందినట్లు తెలిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె చిత్రపటాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ నాయకురాలు గాయత్రితో పాటు పలువురు నేతలు పాల్గొని ఆమె మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. బాధితురాలి కుటుంబం మనోవేదన నుంచి కోలుకోవాలని వారు కోరారు. 

ప్రోటోకాల్ విషయంలో బాలినేని ఆగ్రహం

 ప్రోటోకాల్ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని ఆయన మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేగా తనను ఆహ్వానించకపోవటం అన్యాయమని బాలినేని అన్నారు. అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానపరిచారని ఆయన ధ్వజమెత్తారు. 

అధికార పార్టీకి కొమ్ముకాసే అధికారులు ఆ పార్టీ కండువాలు వేసుకుని తిరిగితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్ర కాంగ్రెస్ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆరోపించారు. ఈ విషయమై ప్రివిలైజేషన్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.

' కాంగ్రెస్ ఎంపీలవి దిగజారుడు మాటలు'

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలపై ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు దిగిజారి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలేనని అన్నారు.

ప్రజలు ఎవరిని తరిమి కొడతారో త్వరలోనే తెలుస్తుందని గోనె వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన వెనక తిగిరి ఇప్పుడు విమర్శించటం తగదన్నారు. దమ్ముంటే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణపై బహిరంగ చర్చకు రావాలని గోనె సవాల్ విసిరారు.

YSRCP Leader Vasi Reddy Padma pressmeet for Delhi Gang Rape Victim

సీబీఐకి కోర్టులే కళ్లెం వేయాలి!


న్యాయస్థానాలు అన్ని అంశాలను పక్షపాత ధోరణికి అతీతంగా, సమన్వయ దృష్టితో చూసి నిర్ణయాలు తీసుకోవాలి. న్యాయ, సాంకేతిక అంశాలతో పాటు నిందితుని హక్కులు, స్వేచ్ఛాస్వాతంత్య్రాల అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. నిందితుడిని విచారణ జరపకుండా, కనీసం చార్జిషీట్లు అయినా దాఖలు చేయకుండా జైలులో నెలల తరబడి నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం!

ప్రజాభిప్రాయం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై రెండు విధాలుగా ఉంది. ఆయన బలమైన వ్యక్తి త్వమే అందుకు కారణం. కొంద రు ఆయనను ఇష్టపడితే మరి కొందరు ఇష్టపడరు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉంటా యి. ఎక్కువ మందికి ఆయనపై నిర్దిష్టమైన అభిప్రాయం ఉండక పోయే అవకాశం కూడా లేకపో లేదు. ఆరు నెలలకు పైగా జైలు జీవితం గడుపుతున్న జగన్‌కు రాష్ట్ర హైకోర్టు గత సోమవారం మరోమారు బెయిల్ ఇవ్వ నిరాకరించింది. ఆయన ఈ ఏడాది క్రిస్మస్ పర్వదినాన్ని జైల్లోనే జరుపుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ నాయకుడిగా అనేక ఆరోపణలను ఎదుర్కొం టున్నారు. వాటిలో క్విడ్ ప్రో కో ఒప్పందాలు, ఆదాయా నికి మించిన ఆస్తుల ఆర్జన ముఖ్యమైనవి. కేంద్ర నేరపరి శోధక సంస్థ సీబీఐ కొన్ని మాసాలుగా ఆ ఆరోపణలపై విచారణ జరుపుతున్నది.

జగన్ అనుకూల, వ్యతిరేక శిబిరాలకు చెందని సామా న్య ప్రజలు, చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ సంస్థలు ప్రజా స్వామికంగా విధులు నిర్వహించాలని కోరుకునేవారు న్యాయవ్యవస్థ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల సంతోషంగా లేరు. చట్టపరమైన పాలనను ఆహ్వానించే వారే వీరంతా! చట్టం సరైన పంథాలో నడవాలని, నింది తుడు విచారణలో దోషి అని తేలితే శిక్ష అమలు కావాలని వారు కోరుకుంటారు. న్యాయస్థానాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగమన్నది తెలిసిందే. అవి వ్యక్తుల హక్కులను గౌరవించాలని, మరీ ముఖ్యంగా తమ ప్రజా స్వామిక, రాజకీయ హక్కులను గౌరవించి తీరాలని వారు కోరుకుంటారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను రక్షిం చడంలో సాంకేతిక అంశాలు అవరోధం కారాదన్నది అందరూ అంగీకరించేదే.

జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ నిరాకరించిన నేపథ్యం లో రాజ్యాంగం వాగ్దానం చేసిన హక్కులు, స్వేచ్ఛకు సం బంధించి, వాటి నిరాకరణకు సంబంధించి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ చర్చలో మూడు అంశాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఒకటి: జగన్ (ఆ మా టకు వస్తే, ఏ నిందితుడి హక్కు అయినా)కు ఉన్న బెయిల్ పొందే హక్కు. రెండు: జగన్(ఎవరికైనా)కు దేశ పౌరు నిగా రాజ్యాంగం అందుబాటులోకి తెచ్చిన హక్కులు, స్వేచ్ఛ వగైరా. మూడు: నిందితుడిని బట్టి సీబీఐ దర్యాప్తు తీరుతెన్నులు మారడం. సీబీఐపై వచ్చే ఒత్తిడులు, దాని విచారణాధికారాలపై విధించే ఆంక్షలు, సీబీఐపై ఎవరు ఒత్తిడి తెస్తున్నారనే అంశంపై కర్ణపిశాచి గుసగుసలు పరి గణనలోకి తీసుకోవలసినంత ముఖ్యాంశాలు కావు.

కొన్ని నెలల క్రితం రాష్ట్ర హైకోర్టు జగన్ మొదటి బెయిల్ దరఖాస్తును విచారించినప్పుడు, నిందితుడు ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనకూడదో చెప్పవల సిందిగా సీబీఐని నిలదీసింది. నిందితుడిపై ఆరోపణ ఇంకా రుజువు కాలేదు కనుక అతనికి ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకొనే న్యాయసమ్మతమైన హక్కు మరే ఇతర పౌరునికి ఉన్నట్లే ఉంటుంది. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసే రోజు సాయంత్రం, సబార్డినేట్ జడ్జీల అవినీతి ఆరోప ణలకు సంబంధించి టీవీ చానెళ్లలో వార్తలు గుప్పుమ న్నాయి. అంతే... జగన్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసి పుచ్చింది.

తదనంతరం జగన్ స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌పై ఉన్న అన్ని కేసులలో చార్జిషీట్లు దాఖలైన తరువాతే ఆయన బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తీర్పునిస్తూ ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జగన్‌పై నమోదైన కేసులలో ఒక్కో కేసుకు విడిగా బెయిల్ అడిగే హక్కు, పొందే హక్కు ఆయనకు ఉంది. కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్నది అప్రస్తుతం. ఇందుకు విరుద్ధంగా అన్ని కేసులలో చార్జిషీట్లు దాఖలైన పిమ్మటే బెయిల్ దరఖాస్తు చేసుకోవా లని ఆంక్షలు విధించడం, రాజ్యాంగం పౌరులకు కల్పిం చిన హక్కుల ఉల్లంఘనే.

సీబీఐ ఒకవేళ ఎవరినైనా విచారణ నిమిత్తం జైలులో పెట్టదలిస్తే, సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన తరువాత కూడా ఆ పని చేయవచ్చు. కొత్త కేసులను నమోదు చేయ వచ్చు. చార్జిషీటు దాఖలు చేయడంలో, ఏదో ఒక నెపంతో జాప్యం చేయవచ్చు. సీబీఐ తలుచుకుంటే విచారణ ఆరం భించకముందే జగన్‌ను నెలల తరబడి జైలుపాలు చేయ గలదు. జగన్ కేసులో సీబీఐ చేసింది అచ్చంగా ఇదే! కానీ రాజ్యాంగ నిర్దేశకుల ఉద్దేశం అది కాదు.

సీబీఐ మాజీ డెరై క్టర్ ఇటీవల పత్రికాముఖంగా చేసిన కొన్ని వ్యాఖ్యలను బట్టి చూస్తే, సీబీఐ కేంద్ర సర్కార్ ఒత్తిడులకు లోబడ కుండా స్వతంత్రంగా వ్యవహరించడం లేదనే మెజారిటీ ప్రజాభిప్రాయం నిజమేననిపిస్తుంది. కేంద్ర మాజీ మం త్రి, డీఎంకే ఎంపీ రాజా ఏడాది కాలం జైలులో ఉన్నారు. బెయిల్‌పై బయటకు కూడా వచ్చేశారు. అయినా ఆయ నపై ఆరోపణలు ఇంకా నిరూపణ కాలేదు. కరుణానిధి కుమార్తె కనిమొళి ఏ ఆరోపణలు లేకుండానే నెలల తర బడి జైలు జీవితం గడిపారు. చార్జిషీటు దాఖలు కావడా నికి ముందు రాజా ఏడాదిపాటు జైలులో మగ్గవలసి వచ్చింది.

2జీ కుంభకోణానికి సంబంధించిన కేసులు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడమే కాదు, వాటి విచారణ సుప్రీంకోర్టు ఇంకా చేపట్టనేలేదు. చార్జిషీట్లు దాఖలైన పిమ్మటే రాజా, కనిమొళిలకు కారాగారం నుంచి విమోచన లభించింది. మన పరిశోధక సంస్థలు, న్యాయస్థానాల సామ ర్థ్యాన్ని ఒక్కసారి అమెరికా సంస్థలతో పోల్చి చూస్తే కొన్ని వాస్తవాలు తెలుసుకోవచ్చు. ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ చేసి నందుకు గాను 2011 అక్టోబర్ 26న అమెరికా ప్రభుత్వం మన ఎన్నారై, గోల్డ్‌మన్ సాక్స్ సంస్థ మాజీ డెరైక్టర్ రజత్ గుప్తాపై చార్జిషీటు దాఖలు చేసింది.

తన మిత్రుడు, వ్యా పార భాగస్వామి, హెడ్జ్ ఫండ్ వ్యవస్థాపకుడు, శ్రీలంక దేశీయుడు అయిన రాజా రాజరత్నంకు కీలకమైన సంస్థా గత రహస్య సమాచారాన్ని అందజేశాడన్నది రజత్‌గుప్తా పై ఆరోపణ. 2012, మే 22న ఈ కేసు విచారణ ప్రారం భమైంది. కేవలం 20 రోజుల్లో అంటే జూన్ 12న అతను దోషి అని న్యాయస్థానం నిర్ధారించింది. అదేరోజు పోలీ సులు అతనిని అరెస్టు చేశారు. విశేషమేమిటంటే కొన్ని గంటల వ్యవధిలోనే బెయిల్‌పై అతడు విడుదలయ్యాడు. రెండేళ్ల జైలు శిక్ష పడినప్పటికీ, అప్పెల్లేట్ కోర్టు అతని శిక్షా కాలాన్ని కొంతమేర తగ్గించింది. అది వేరే కథ.

ఇక జగన్ కేసు విషయానికి వస్తే... హైకోర్టు బెయిల్ నిరాకరించిన పిదప, జైలులో 90 రోజుల నిర్ణీత కాలం ముగిసినందున, సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేయడంలో విఫలమైనందున బెయిల్ ఇవ్వవలసిందిగా కోరుతూ జగన్ మరోమారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గడువు ముగిసే లోపల సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేయలేక పోతే బెయిల్ కోరుకునే హక్కు నిందితుడికి ఉంటుంది. జగన్ తాజా బెయిల్ దరఖాస్తును జస్టిస్ శేషశయనరెడ్డి విచారించారు. డిసెంబర్ 20, 21న వాదప్రతివాదనలు జరిగాయి. కేసులో వాదనకు ఢిల్లీ నుంచి అడిషనల్ సొలి సిటర్ జనరల్ హరేన్ పి రావెల్‌ను సీబీఐ రప్పించగా, సుప్రసిద్ధ క్రిమినల్ లాయర్ సి.పద్మనాభరెడ్డి జగన్ తరఫున వాదించారు.

అప్పటిదాకా కేసు 19ఎలో జగన్‌ను అరెస్టు చేసినట్లు చెబుతూ వచ్చిన సీబీఐ ఆ రోజు జగన్‌ను కేవలం వాన్‌పిక్ కేసులో అరెస్టు చేసినట్లు కోర్టులో చెప్పుకున్నది. వాన్‌పిక్ కేసులోనే రాష్ట్ర మాజీ మ్రంతి మోపిదేవి వెంకటరమణ అప్పటికే జైలులో ఉన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ - సెక్షన్ 437 కింద సాధారణ బెయిల్‌కు జగన్ మరో దర ఖాస్తు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. సీబీఐ కేసుకు సంబంధించి కొత్తగా చేసిన ఉపాఖ్యానం ఆయన బెయి ల్‌కు ఉపకరించకపోవడం గమనార్హం. వాస్తవానికి వాన్ పిక్ కేసులో ఆగస్టు 13 నాటికే సీబీఐ చార్జిషీటు దాఖలు చేసి ఉన్నందున, నిందితునికి బెయిల్ కోరే హక్కు ఉంది.

సుప్రీంకోర్టు అక్టోబర్ 5న జగన్‌కు బెయిల్ నిరా కరిస్తూ ఉత్తర్వులు జారీచేసిన సందర్భంగా, మూడు నెలల కాలంలో విచారణ పూర్తిచేయగలమని సీబీఐ కోర్టుకు విన్న వించుకుంది. సీబీఐ కోరిన గడువు 2013 జనవరి 5 నాటికి పూర్తి కాబోతున్నది. జగన్ కోరిన సాధారణ బెయిల్ పిటి షన్‌పై వాదప్రతివాదనలను బుధవారం విన్న జస్టిస్ శేషశ యనరెడ్డి, విచారణను జనవరి 4కు వాయిదా వేస్తూ కేసు స్థితిగతులపై పూర్తి నివేదిక సమర్పించవలసిందిగా సీబీఐ ని ఆదేశించారు. జగన్ కేసులో అందుకే జనవరి 4 కీల కమైన రోజు కాబోతున్నది.

ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే క్రమంలో సాధార ణంగా మూడంచెలు ఉంటాయి. 1. రాష్ట్ర ప్రభుత్వం ఎవ రైనా కొందరు వ్యక్తులు లేదా సంస్థలకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. వాటిని అప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదిస్తుంది. ఇతర అధికారిక ప్రక్రియలు అందుకు తోడవుతాయి. 2. తీసుకున్న నిర్ణయాలకు సం బంధించి ప్రభుత్వం జీఓ జారీ చేస్తుంది. 3. లబ్ధిదారు కాకుండా మరెవరైనా అర్హత లేకుండా క్విడ్ ప్రో కో పద్ధతి లో లబ్ధిపొందుతుంటే అది ప్రభుత్వం తెలుసుకుంటుంది.

ఈ మూడంచెలలో మొదటి రెండు అంచెలకు రాజ్యం అధికారికంగా బాధ్యత వహిస్తుంది. ఈ రెండు దశలలో సాగే ప్రక్రియ సంబంధిత కార్యదర్శులు, మంత్రుల సాధి కారిక అభిప్రాయాలతో, లిఖితపూర్వకంగా పత్రరూపంలో ఉంటుంది. కాబట్టి సాక్ష్యాన్ని వక్రీకరించడం, తప్పుదోవ పట్టించడం కుదరని పని.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంగానీ, రోశయ్య ప్రభు త్వంగానీ అంతకు మునుపు అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఏనాడూ విభేదించలేదు. ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రద్దు కూడా చేయ లేదు. వైఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ మంత్రి వర్గం సముచితంగా తీసుకున్న సమష్టి నిర్ణయాలేనని చెబుతూ వాటిని తదుపరి ప్రభుత్వాలు సొంతం చేసుకు న్నాయి కూడా! అంతేకాదు సుప్రీంకోర్టు తప్పు పట్టిన ఆరుగురు మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయసహాయం కూడా అందిస్తున్నది. ఆ విధంగా మంత్రుల శీల సంర క్షణకు ప్రభుత్వం ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నది.

జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం, సాక్ష్యాన్ని నామరూపాలు లేకుండా చేసే ప్రమా దం ఉందని, అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ న్యాయస్థానం ఎదుట వాదించింది. సాక్షులందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు. సాక్ష్యాలేమో అధికారిక పత్రాలు. మరి అలాంటప్పుడు వాటిని ధ్వంసం చేయడం ఎలా సాధ్యం?

దర్యాప్తు పూర్తికాని దశలో బెయిల్ కోరే హక్కు నింది తునికి లేదని సీబీఐ వాదించింది. కానీ వాస్తవం ఏమిటం టే పౌరుని హక్కుల రక్షణ ప్రజాస్వామ్యవ్యవస్థ బాధ్యత. ఒక పౌరుడు నిందితుడైనా కాకున్నా రాజ్యాంగం దఖలు పరచిన హక్కులు అతనికి ఉండనే ఉంటాయి. పూర్తిస్థాయి విచారణ జరగకుండా, నేర నిర్ధారణ కాకుండా ఎవరినీ శిక్షించడానికి వీల్లేదని నేర శిక్షాస్మృతి చెబుతున్నది. సందేహాతీతంగా నేర నిరూపణ జరిగి నింది తునికి శిక్ష ఖరారైనప్పుడు అతని హక్కులకు శిక్షా కాలంలో చట్టం అనివార్యంగా కొన్ని పరిమితులు విధిస్తుంది. అంత వరకే! రాజ్యాంగం ఖైదీలకు సైతం హక్కులు కల్పించింది.

జగన్ కేసులో విచారణ ఇంకా ఈ దశకు చేరుకోలేదు. ఇప్ప టిదాకా ఆయన కేవలం నిందితుడు మాత్రమే. ఆయన నేరం ఇంకా నిరూపణ కావలసి ఉంది. ఈ దశలో న్యాయ స్థానాలు రాజ్యాంగం దేశ ప్రజలకు హామీ ఇచ్చిన ప్రాథ మిక హక్కులతోపాటు రాజ్యాంగ స్ఫూర్తిని సైతం దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. నిందితుడు ప్రస్తుత సందర్భం లో రాజకీయ నాయకుడు. దృశ్యానికి ఇది ఒకవైపు. నియ మాలు, నిబంధనలు, విధానాలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు దృశ్యానికి మరోవైపు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామిక స్ఫూర్తి ఇంకోవైపు. ఈ మూడు కోణాలనూ గమనంలోకి తీసుకుంటే తప్ప న్యాయం జరగదు.

న్యాయస్థానాలు ఈ అన్ని అంశాలను పక్షపాత ధోర ణికి అతీతంగా, సమన్వయ దృష్టితో చూసి నిర్ణయాలు తీసుకోవాలి. న్యాయ, సాంకేతిక అంశాలతో పాటు నింది తుని హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాల అంశాన్ని పరిగణ నలోకి తీసుకోవాలి. నిందితుడిని విచారణ జరపకుండా, కనీసం చార్జిషీట్లు అయినా దాఖలు చేయకుండా జైలులో నెలల తరబడి నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం!
(‘ది హన్స్ ఇండియా’ సౌజన్యంతో...)

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=55057&Categoryid=1&subcatid=18

కోటి ఆశల భారం...ఆ భుజాలపైనే...


వందమంది దోషులు తప్పించుకున్నా ఫరవాలేదు కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదన్న చర్వితచర్వణమైన ప్రజా స్వామ్యపు చిలకపలుకులు చిన్నప్పటినుంచీ వినీవినీ మా చెవులు తుప్పు పట్టిపోయాయి. మనదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమని నమ్మిన మా మనసుల్లో ... ఇప్పుడు అది అవాస్తవమేమోనన్న అనుమానపు బీజాలు మొలకెత్తుతున్నాయి.

భూమాత సహనాన్ని పుణికిపుచ్చుకుని ఓర్పుతో జైలు గోడల మధ్య నలిగిపోతున్నా... కోట్లాదిమంది ఆశల్ని అచంచలమైన దీక్షతో భుజాన మోస్తున్న ఆ మనిషిని చూసిన తర్వాత కూడా ఇది ప్రజాస్వామ్యమేనని ఎలానమ్మాలి? అసత్యాల, అవాస్తవాల కలబోతను న్యాయస్థానమనే తెరమీద ప్రదర్శిస్తూ... ఆ నాటకాన్ని రక్తికట్టించడానికి నిస్సిగ్గుగా రోజుకొక పాత్రను తెరమీదకు తెస్తున్న హస్తిన కుతంత్రాన్ని అసహ్యించుకోవాల్సి వస్తోంది. వాస్తవాలను విస్మరించి, అబద్ధాన్ని విశ్వవ్యాప్తం చేసే కుట్రలో ప్రజాస్వామ్యపు మూలస్తంభాలు సైతం పాత్రధారులు కావడం ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా భావించాలి?

ఆయన మీకు రాజకీయ శత్రువే కావచ్చునేమో కానీ, తండ్రి వాత్సల్యం కోసం తపిస్తున్న ఇద్దరు బిడ్డల తండ్రి కూడా. భర్తను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తల్లికి సాంత్వన కలిగించాల్సిన పుత్రుడు కూడా. తను కన్నీరు కారిస్తే... భర్తనే నమ్ముకున్న ప్రజలు ఎక్కడ నిరాశానిస్పృహలకు లోనవుతారోనని గుండెలోతుల్లోంచి తన్నుకొస్తున్న బాధని పంటి బిగువున అదిమిపెట్టిన ఒక మహిళకు జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త కూడా. కోట్లాదిమంది అనుభవిస్తున్న కష్టాలను ఆకళింపు చేసుకున్న జ్ఞాని కూడా...

ఇప్పటికైనా ప్రజల ఆవేశాన్ని ప్రామాణికంగా తీసుకోండి. పదే పదే అదే అబద్ధాన్ని ప్రజల హృదయాలలోకి బలవంతంగా చొప్పించడం ద్వారా జనం హృదయాల్లో ఇప్పటికే గాఢంగా ముద్రితమైపోయిన ఆ వాస్తవాన్ని బయటకు పంపించలేరన్న వాస్తవాన్ని గుర్తించండి. ఇప్పుడో అప్పుడో ఆ తండ్రి వస్తాడని, మోకాళ్ల మీద కూర్చుని... తమ చెక్కిలి మీద వెచ్చటి కన్నీటిని తుడుస్తాడని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఆ చిన్నారుల క్షోభ మీకు శాపంగా పరిణమించకముందే మేల్కొనండి. అన్న ఆశయాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచేందుకు తపనపడుతున్న ఆ సోదరి ఆవేశం మీ అహంకారపు పునాదుల్ని పెకలించకముందే జాగ్రత్తపడండి.

ప్రజల అవసరాలను, ఆశలను, ఆచరణలోకి మళ్లించిన ఆ ‘పెద్దాయన’ గుర్తుల్ని బలవంతంగా చెరిపివేసే రాక్షసక్రీడను ఇప్పటికైనా ఆపండి. ప్రజల కన్నీటి ఉప్పెనలో మీ అత్యాశాసౌధం పేకమేడలా కూలకముందే వాస్తవాన్ని గ్రహించండి. జైలుగోడల మధ్య ఉంచి మంచితనపు స్వరూపాన్ని ప్రజలకు దూరం చేశామన్న మీ పైశాచికపు కుడ్యానికి ప్రజాభిమానపు గవాక్షం ఒకటి ఎక్కడో తెరిచే ఉందన్న వాస్తవం గ్రహించే ప్రయత్నం చేయండి.

- వాసవీ మోహన్,
సూరారం, హైదరాబాద్


భయం లేదు జగనన్నా!

అన్నా జగనన్నా,
భయం లేదురన్నా
జగమంతా నీవైపే
జనమంతా నీవైపే

సీబీఐ చేస్తున్నది
చిన్న పెద్దకు తెలుసు
జైలులోన నిన్ను పెట్టి
జాగీరులు పొందుతోంది
జనులు ఎరుగరనుకుంది

బెయిలివ్వక చేస్తుంది
బెబ్బులివని బెదురుతోంది
భయం లేదు జగనన్నా
భువి అంతా నీవైపే

రెండు వేల పద్నాలుగు
రానున్నది త్వరగన్నా
ముఖ్యమంత్రి నీవన్నా
మురిపం ప్రజ తీర్పన్నా
ఇది దేవుని ఆదేశం
జనసంద్రం సందేశం

- కోట చినసత్యనారాయణ
తెర్లాం మండలం, విజయనగరం

వైఎస్సార్‌సీపీ టీచర్స్ ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ

వైఎస్సార్ కాంగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ డైరీని శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘ఆపస్’కు చెందిన పలువురు ఉపాధ్యాయులు విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌టీఎఫ్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్ కన్వీనర్ కె.ఓబుళపతి, నేతలు కె.జాలిరెడ్డి, ఎస్‌ఎల్‌వి.రెడ్డి, పి.అశోక్‌కుమార్, టి.ప్రకాష్, వీజే కెనడి తదితరులు పాల్గొన్నారు.

భారీ ధర చెల్లించి విద్యుత్ కొనేందుకు సిద్ధమైన సర్కారు

యూనిట్ ధర రూ.20 దాకా చేరుతుందని ట్రాన్స్‌కో వారించినా వినని వైనం
కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డికి సంబంధించిన కంపెనీతోనూ చర్చలు

భవిష్యత్తులో విద్యుత్ సరఫరా, ధరలు ఎలా ఉంటాయో తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఈస్ట్‌కోస్ట్ విద్యుత్ ప్లాంటుతో 25 ఏళ్లపాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ నుంచి మొత్తం 300 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం యూనిట్‌కు రూ.3.466 వసూలు చేస్తామని ఈస్ట్‌కోస్ట్ కంపెనీ చెబుతున్నా.. 25 ఏళ్లలో యూనిట్ ధర రూ.20 దాకా చేరుతుందని ట్రాన్స్‌కో చెబుతోంది. అంటే యూనిట్ విద్యుత్‌కు రూ.20 వెచ్చించాల్సిన పరిస్థితులు వస్తాయన్నమాట! రెండేళ్ల తర్వాత అంటే 2015 జనవరి నుంచి 25 ఏళ్ల పాటు ఈస్ట్‌కోస్ట్ కంపెనీ నుంచి రాష్ట్రం విద్యుత్‌ను కొనుగోలు చేయనుంది. మున్ముందు కరెంటు సరఫరా, డిమాండ్, ధరలు ఎలా ఉంటాయో అంచనా వేయకుండానే ఏకంగా 25 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఏమిటన్న ట్రాన్స్‌కో సీఎండీ సమారియా మాటలను పెడచెవిన పెడుతూ.. ప్రభుత్వం చివరికి ఈస్ట్‌కోస్ట్ వైపే మొగ్గడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈస్ట్ కోస్ట్ కంపెనీ ఏర్పాటు అవుతుండటమే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డికి చెందిన థర్మల్ పవర్ టెక్ కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి.

ఒప్పందం వెనుక ఒత్తిళ్లు..!

రానున్న 25 ఏళ్లకుగానూ 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా 620 మెగావాట్ల విద్యుత్ (సుమారు 14.6 మిలియన్ యూనిట్లు)ను యూనిట్‌కు 3.466 రూపాయల చొప్పున విక్రయిస్తామని ఈస్ట్‌కోస్ట్ కోట్ చేసి ఎల్-1గా నిలిచింది. అయితే బిడ్డింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇప్పుడు 300 మెగావాట్లు మాత్రమే ఇస్తానని ఈ కంపెనీ అంటోంది. బొగ్గు, ఆపరేషన్, నిర్వహణ (ఓ అండ్ ఎం) ఖర్చులు పెరగడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే యూనిట్ ధర ప్రతి ఏటా పెరుగుతుంది. ఇలా కంపెనీ నుంచి 25 ఏళ్ల తర్వాత కొనే యూనిట్ విద్యుత్ ధర ఏకంగా రూ.20కి చేరుకోనుంది. భవిష్యత్తులో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తెలియకుండా ఇప్పుడు ఇంత అధిక ధరను వెచ్చించి కొనాల్సిన అవసరం లేదని ట్రాన్స్‌కో సీఎండీ సమారియా వాదించినట్టు సమాచారం. 

అయినా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చి ఈ కంపెనీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అలాగే బిడ్డింగ్‌లో ఎల్-5 ఉన్న థర్మల్ పవర్‌టెక్‌తోనూ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. యూనిట్ ధరను (రూ.3.685కు) తగ్గించుకోవాలని పవర్‌టెక్‌ను ఇంధనశాఖ కోరింది. అయితే అందుకు ఆ సంస్థ ససేమిరా అంటున్నట్టు సమాచారం. ఈ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిళ్లు తెస్తున్నారు. ఎల్-2గా వచ్చిన హిందుజాతో నేరుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంటుండగా, ఎల్-3గా వచ్చిన ఎథెనా, ఎల్-4గా వచ్చిన నెల్‌క్యాస్ట్ బిడ్డింగ్ నుంచి తప్పుకున్నాయి.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=513846&Categoryid=1&subcatid=33

రెండు కళ్లు.. నాలుగు నాలుకలు

ఎన్నికల కోసం 2008లో తెలంగాణవాదం మొదలుపెట్టిన టీడీపీ

 అంశం ఒక్కటే.. సమయం, అవసరాన్నిబట్టి మాటలు మారిపోయాయి. ఇన్ని మాటలు చెప్పటం ఎవరికైనా సాధ్యపడుతుందా.. ఒక్క తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి తప్ప..! చిదంబరం ప్రకటనకు ముందొక మాట. ఆ తర్వాత మరో మాట. తెలంగాణ ఉప ఎన్నికలప్పుడు ఒక ముచ్చట. అవి ముగిశాక ఇంకొక ముచ్చట. పరకాలలో మరో మాట. ఆ ఎన్నిక ముగియగానే ఆ ముచ్చటా మారిపోయింది. ఇలా నాలుగేళ్లలో అనేకానేక మలుపుల మాటలు. పేరుకు ప్రధాన ప్రతిపక్షం. ప్రధాన సమస్యపై నిలకడలేనితనం. ‘మా పార్టీ వైఖరి ఏ ఎండకా గొడుగు అన్న చందంగా ఉంది’ అని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించేంతటి పరిస్థితి. శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్ర హోం శాఖ మంత్రికి అందజేసిన లేఖలోనూ ఇదే విధమైన అస్పష్ట వైఖరిని ప్రదర్శించారన్న విమర్శలు వస్తున్నాయి.

అప్పుడు అధికారం కోసం..

తెలుగుదేశం పార్టీ తొలుత సమైక్య వాదాన్ని ప్రదర్శించింది. అయితే, 2009లో జరిగే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం 2008లో తెలంగాణకు అనుకూలమని ప్రకటించింది. ఆ ఏడాది దసరా పండుగ రోజున టీడీపీ పొలిట్‌బ్యూరో తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయించిందని అధినేత చంద్రబాబు ప్రకటించారు. తర్వాత పది రోజులకే ‘తెలంగాణకు అనుకూలంగా టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చిందని మీకు తెలియజేస్తున్నాం’ అంటూ అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ రాశారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని, తెలంగాణ ఏర్పాటుకు శాసనపరమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రచారం కూడా చేశారు.

చిదంబరం ప్రకటనపై అగ్గిమీద గుగ్గిలం!

ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన దరిమిలా 2009 డిసెంబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ తెలంగాణకు మద్దతు పలుకుతుందని ఆ పార్టీ ప్రతినిధులు చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే (డిసెంబర్ 9న) అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణకు అనుకూల ప్రకటన చేశారు. మరుసటి రోజు టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టడంతో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. ‘తెలంగాణ అంశంపై ఎవ్వరితోనూ చర్చించకుండా, నచ్చచెప్పకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. ఒకరు అడుగుతారు, మరొకరు ఇస్తారు. కాంగ్రెస్ దీన్ని ఒక మ్యాచ్‌ఫిక్సింగ్‌లా చేసింది. స్వీయ రాజకీయ ప్రయోజనాలేవో ఆశించి ఇలా వ్యవహరించింది. సోనియాగాంధీ ఏమీ ఆలోచించకుండా అర్ధరాత్రి నిర్ణయం ప్రకటించి చేతులు దులుపుకున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు.

రెండు కళ్ల సిద్ధాంతం

2010 ఫిబ్రవరి 4న చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. ‘తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్ల లాంటివి. తెలంగాణ, సమైక్య వివాదాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే’ అని ప్రకటించారు. ఈ ప్రకటన పెద్ద వివాదాన్ని రేపింది. దీంతో కొద్దిరోజులు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత అదే ఏడాది తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేశారు. 2010 జూన్ 19న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ‘తెలంగాణ, సీమాంధ్ర రెండూ నాకు రెండు కళ్ల వంటివని నేను ఎందుకు అన్నానో తెలుసా? రెండు కళ్లంటే రెండు రాష్ట్రాలని అర ్థం’ అని మాట మార్చారు.

నేను తటస్థం

తెలంగాణలో రెండు కళ్ల సిద్ధాంతం పనిచేయకపోవడంతో చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. ‘రాష్ర్ట విభజన విషయంలో నేను తటస్థంగా ఉంటా. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఇరు ప్రాంతాల నేతలకు చెప్పాను. ఈ విషయంలో అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీనే’ అని 2011 మే 9న చెప్పారు.

మహానాడులో కొత్త తీర్మానం

2009 సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్న టీడీపీ.. 2011 మే 29న మహానాడులో కొత్త తీర్మానాన్ని ఆమోదించింది. ‘తెలంగాణ విషయంలో ఇంకా ఎంతకాలం ఈ అనిశ్చితి కొనసాగిస్తారు? ఈ విషయంలో టీడీపీ చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పేసింది. కేంద్రం సత్వర నిర్ణయం తీసుకొని ఈ అనిశ్చితిని తొలగించాలి. చేతకాకపోతే ఆ విషయాన్ని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అంటూ తీర్మానం చేసింది. మరోపక్క రెండు ప్రాంతాల నేతలు ఒకరు సమైక్యం, మరొకరు తెలంగాణ ఉద్యమాలు చేసుకోవడానికి బాబు అంగీకారం తెలిపారు. ‘రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలు వారి ప్రాంతాల మనోభావాలను ప్రతిబింబించక తప్పదు. అందుకే పార్టీ అధ్యక్షుడిగా నేను ఏది చెబితే అదే పార్టీ వైఖరి. మిగతా ఎవరేం చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం లేదా వారి ప్రాంత అభిప్రాయం మాత్రమే’ అని 2011 జూలై 29న చంద్రబాబు మరో విధంగా మాట్లాడారు.

ఉప ఎన్నికల కోసం మాట మారింది!!

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు విభజన వాదాన్ని అంగీకరించలేదని ఎన్నికల ఫలితాల ప్రకటించిన వెంటనే చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది చెప్పి వారం గడవక ముందే 2011 మార్చి 11న కామారెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడతూ.. ‘నేనెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇకపైనా మాట్లాడబోను’ అని మాట మార్చేశారు. 

పార్టీని గెలిపిస్తే ఉద్యమమే చేస్తాం

ఉప ఎన్నికలలో పార్టీ వరసగా ఓటమిని ఎదుర్కోవడంతో తమను గెలిపిస్తే తెలంగాణ కోసం ఉద్యమం చేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది మే 24న పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మా పార్టీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని గెలిపిస్తే ఆయనతోనే చిదంబరానికి లేఖ పంపిస్తాం. ఇక్కడి నుంచే ఉద్యమం చేస్తాం’ అని ప్రకటించారు. ఆ ఉప ఎన్నికలు ముగియగానే ‘తెలంగాణపై త్వరలో స్పష్టత ఇస్తాం’ అంటూ మరోసారి మాట మార్చారు. 

ఈ ఏడాది జూలై 10న చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈ అంశంపై పార్టీలోని నాయకులతో మాట్లాడుతున్నాను. మధ్యలో ఉప ఎన్నికలు రావటంవల్ల అందరితో మాట్లాడటం కుదరలేదు. అందరి అభిప్రాయాలు తీసుకొని త్వరలోనే స్పష్టత ఇస్తాం’ అని చెప్పారు. చివరకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో తెలంగాణ అంశం తేల్చడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ చంద్రబాబు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు.

తాజాగా శుక్రవారం కేంద్ర హోం మంత్రికి పంపిన లేఖలోనూ ఆయన ఏ విషయాన్నీ స్పష్టంగా చెప్పలేదు. 2008లో అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీకి అందజేసిన లేఖ మీ వద్దే ఉందని, దాన్ని తామింతవరకు ఉపసంహరించుకోలేదని మాత్రం పేర్కొన్నారు. 2009లో యూపీఏ-1 ప్రభుత్వం పోయి యూపీఏ-2 ప్రభుత్వం ఏర్పడినందున ఆ లేఖలోని విషయాలనే మరోసారి చెబితే బాగుండేదని, అలా చేయకపోవడంవల్ల అనుమానాలు రేకెత్తిస్తోందని తెలంగాణ ప్రాంత ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. తమ రాజకీయ అవసరానికి తగినట్టుగా వాడుకునే విధంగా తప్పించుకునే ధోరణితో లేఖ ఇవ్వడం వల్ల ప్రజల్లో విశ్వసనీయత లేకుండా పోతోందని సీమాంధ్ర ఎమ్మెల్యే ఒకరు వాపోయారు.

తెలంగాణకు అనుకూలంగా టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది: 2008లో అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ

మా పార్టీ తెలంగాణకు మద్దతు పలుకుతుంది.. : 2009 డిసెంబర్ ఏడో తేదీన ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ప్రతినిధులు 
తెలంగాణ అంశంపై ఎవ్వరితోనూ చర్చించకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు.. : 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణకు అనుకూల ప్రకటన చేసిన మరుసటి రోజు చంద్రబాబు

తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్ల లాంటివి.. : 2010 ఫిబ్రవరి 4న చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం 

రెండు కళ్లంటే రెండు రాష్ట్రాలని అర ్థం.. : 2010 జూన్ 19వ తేదీన ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు

తెలంగాణపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలి: 2011 మే 29న మహానాడులో తీర్మానం

యూపీ ప్రజలు విభజన వాదాన్ని అంగీకరించలేదు: 2011 యూపీ ఎన్నికలు ముగియగానే చంద్రబాబు వ్యాఖ్య

నేనెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు: ఆ తర్వాత కొద్ది రోజులకే కామారెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

మా పార్టీ అభ్యర్థిస్తే ఇక్కడి నుంచే ఉద్యమం చేస్తాం : ఈ ఏడాది మే 24న పరకాల ఉప ఎన్నికల సభలో చంద్రబాబు

తెలంగాణపై త్వరలో స్పష్టత ఇస్తాం : ఈ ఏడాది జూలై 10న చంద్రబాబు

sakshi

వైఎస్సార్‌సీపీలో చెల్లుబోయిన వేణు


సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వేణుతోపాటు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ గొల్ల ప్రవీణ్‌కుమార్, బ్రాహ్మణ సంఘాల నేత పాటిబండ రాజేంద్రకుమార్ తదితరులు కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మూలింటి మారెప్ప, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, తూర్పుగోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

YSRCP Leader subhash comments on All Parties meet

Written By news on Friday, December 28, 2012 | 12/28/2012

వైఎస్ఆర్ సిపిలో చేరిన జెడ్ పి మాజీ చైర్మన్

తూర్పుగోదావరి జిల్లా పరిషత్(జెడ్ పి) మాజీ చైర్మన్ వేణుగోపాలకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్ లో ఈరోజు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయనతోపాటు రాజోలు నియోజకవర్గ ప్రముఖ కాంట్రాక్టర్ గొల్ల ప్రవీణ్ కుమార్, తాడిపత్రి మునిసిపాలిటీ మాజీ చైర్మన్ నజీర్ సాహెబ్ తనయుడు మున్నాలు చేరారు.

జగన్ విడుదలకు ఐటీ నిపుణులు సంతకాలు

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ‘జగన్ కోసం జనం సంతకం’ పేరిట పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. దాదాపు 300 మంది ఐటీ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






YSRCP leader Bajireddy govardhan reddy press meet on All party meeting

Mysoora Reddy , Mahender Reddy speak to media after all party meeting

'తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నాం'

తెలంగాణ సెంటిమెంట్‌ను తాము గౌరవిస్తున్నట్టు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ పార్టీ తమ వైఖరి వెల్లడించకుండా, అధికారంలోలేని ఇతర పార్టీలపై ఒత్తిడి తెస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మొదట తన వైఖరిని స్పష్టంచేసి తీరాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు.

Central Response to YSVijayamma's Letter

నార్వే ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లేఖకు కేంద్రం స్పందించింది. కేంద్ర మంత్రి వయలార్ రవి వైఎస్ విజయమ్మకు లేఖ రాశారు. తమ పిల్లలను వేధిస్తున్నారన్న ఆరోపణలపై చంద్రశేఖర్ దంపతులు నార్వేలో జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. కేంద్రం తరపున వారికి సాధ్యమైనంత వరకు సాయం చేస్తామని వయలార్ రవి ఆ లేఖలో పేర్కొన్నారు.

సమస్యకు పరిష్కారం కోరాం

 తెలంగాణ అంశంపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. తెలంగాణపై రాజకీయ పార్టీలు ఏమీ చెప్పినా ప్రయోజనం లేదని, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజనపై సర్వాధికారాలు కేంద్రానివేనని ఆపార్టీ పేర్కొంది. 

కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోందని, ఇప్పటికైనా అన్ని విషయాలు, అన్ని సమస్యలు కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రజల మనోభావాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తోందని తెలిపింది.

Final decission on Telangana will be taken within 1 month

 తెలంగాణ అంశంపై నెలరోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భేటీలో ఎనిమిది పార్టీలు పాల్గొన్నాయని, అన్ని పార్టీలు సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరాయన్నారు. 

అందరి అభిప్రాయాలు, వాదనలు విన్నామని, కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో వెల్లడైన అభిప్రాయాల మేరకే నిర్ణయం ఉంటుందని షిండే తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. తెలంగాణపై ఇదే చివరి అఖిలపక్షమని షిండే తెలిపా

ఆ విజయం మహానేత చలవే

 ‘నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికలలో నేను సాధించిన విజయం నాది కాదు. అది పూర్తిగా మహానేత వైఎస్సార్‌దే. నన్ను చూసి ప్రజలు ఓట్లు వేయలేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుట్రలకు బలైపోయిన వైఎస్సార్ కుమారుడు ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలబడినందుకే వేశారు. 2004లో కేవలం 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన నేను ఈ ఉపఎన్నికలలో రెండున్నర లక్షల మెజార్టీతో గెలవగలిగాను’ అని ఎంపీ మేకపాటి రాజ మోహన్‌రెడ్డి చెప్పారు. ‘కదలిక ఇమామ్’ రాసిన ‘జనం చెక్కిన శిల్పం వైఎస్’ పుస్తకావిష్కరణ సభ గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. 

ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ మహానేత చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాలలో ఆయనను చిరస్థాయిగా నిలిపాయన్నారు. ‘వైఎస్సార్‌తో ఎందరో లబ్ధి పొందారు. కనీస అర్హత లేని వారు సైతం మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. ఆయన అకాల మరణం తర్వాత జన హృదయాలలోంచి ఆయనను చెరిపేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. జగన్ ఎప్పటికైనా దేశం గర్వించదగ్గ నాయకుడవుతాడు’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యురాలు విజయారెడ్డి, రచయిత భూమన్, ఐటీ సెల్ కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాసులు నాయుడు, నాగిరెడ్డి, శరత్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సామాజిక వైద్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

రాజ్యాంగేతర శక్తిగా సోనియా...
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గొప్ప రాజకీయనాయకురాలు కాదు. ప్రజలుకు సేవచేసి ఆమె రాజకీయాల్లోకి రాలేదు. ఆమెకు ఆ అర్హత కూడా లేదు. రాజ్యాంగేతర శక్తిగా మారి దేశరాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆమెకు ఎలాంటి హోదా లేకపోయినా గవర్నర్ న రసింహన్ తరచూ ఆమెను కలుస్తున్నారు. వైఎస్సార్ రెక్కల కష్టం మీద ఏర్పడిన కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రస్తుతం ఆయన పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడటం లేదు. 
- శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

సత్యం నివురు గప్పిన నిప్పు...
సత్యం నివురు గప్పిన నిప్పులాంటిది. అబద్దాలతో దానిని ఎంతో కాలం దాచలేరు. జగన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ కాంగ్రెస్ పెద్దలు ఏదో ఒక అబద్ధం చెప్పుతూ ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నారు. ఏ తప్పూ చేయని జగన్‌ను ఎంతోకాలం నిర్భందించలేరు. త్వరలోనే ఆయనను విడుదల చేయక తప్పని పరిస్థితి వస్తుంది. 
- వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి

మనం కాదు జనమే అండగా ఉన్నారు
జగన్‌మోహన్ రెడ్డికి జనమే అండగా ఉన్నారు. ఆయన తరుపున వారే యుద్ధం చేస్తున్నారు. వైఎస్సార్ నీడ జగన్‌పై ఉన్నంత వరకు ఆయనను ఎవ్వరూ ఏమీ చేయలేరు. 
- గట్టు రామచంద్రారావు, వైఎస్సార్‌సీపీ అధికారప్రతినిధి

నెల జీతగాళ్లను వదలను...
వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు ఆయన వద్ద అనేక మంది పని చేశారు. వీరిలో కొంత మంది నెల జీతగాళ్లూ ఉన్నారు. వైఎస్సార్ పేరును అడ్డంపెట్టుకుని రూ. కోట్లు అక్రమంగా సంపాదించుకున్నారు. మరికొందరు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు పొం దారు. ఆయన అకాల మరణం తర్వాత వీరంతా కలిసి మహానేతను నేరస్థుడిగా చిత్రీకరిస్తున్నారు. ఆయన కుమారుడిని జైలు పాలు చేశారు. ఇలాంటివారిని జగన్ క్షమించి వదిలేసినా.. నేను మాత్రం వదలబోను. ఇప్పటికే వైఎస్సార్ బయోగ్రఫీ కూడా రాస్తున్నా. త్వరలోనే అందుబాటులోకి తెస్తా. 
- ఇమామ్, రచయిత

SAVE CORRUPTION, SAYS CHADRABABU !



Telugu Desam Party chief Chandrababu Naidu on Thursday called upon people to 'protect corruption' in AP.

Addressing a gathering as part of his padayatra in Karimnagar District, Naidu in a slip of the  tongue and called upon to 'save corruption' in the state, instead of saying 'fight corruption'.
Launching a scathing attack on TRS supremo K. Chandrasekhara Rao, Naidu compared KCR with Kumbhakarna of Ramayana. He said KCR sleeps for six months and for the next six months raises his voice.
He also asked the gathering - When did the TRS help people of Telangana region?

http://www.sakshipost.com/index.php/news/state/9014-save-corruption-says-chadrababu

చంద్రబాబు పచ్చి అబద్దాల కోరా!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. రెండువేల ఎనిమిదిలోనే తెలంగాణకు అనుకూలంగా తాము చెప్పామని చంద్రబాబు అంటున్నారని, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి ప్రస్తావించకుండా ఆ సంగతి చెబితే సరిపోదన్నట్లుగా ఆయన మాట్లాడారు. రెండువేల ఎనిమిదిలో తీర్మానం చేశాక, తమతో పొత్తు పెట్టుకున్నారని,అంతేకాక అఖిలపక్ష సమావేశంలో కూడా తెలంగాణకు అనుకూలంగా చెప్పి, తదుపరి డిసెంబరు తొమ్మిదిన తెలంగాణ ప్రకటన వచ్చాక పదో తేదీన చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఇప్పుడు ఏమి చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరని ఆయన అన్నారు.తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో ఏమీ జరగదని , అయినా కూడా తాము వెళుతున్నామని ఆయన చెప్పారు. కేంద్రానికి చిత్తశుద్ది ఉంటే నేరుగా బిల్లు పెట్టవచ్చని ఆయన తెలిపార
http://kommineni.info/articles/dailyarticles/content_20121228_3.php


నిరసన తెలిపినందుకు నాన్‌బెయిలబుల్ కేసులు

ఢిల్లీలో విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌ను నిరసిస్తూ బుధవారం ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై పోలీసులు కక్షగట్టారు. మమత వైద్యకళాశాలలు, పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం పట్ట ణంలో నిర్వహించిన విద్యార్థుల ర్యాలీకి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ర్యాలీ ని ర్వహణకు పువ్వాడ ఫౌండేషన్ చైర్మన్, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ ముందుగా పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ర్యాలీతో ప్రజలకు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించారనే అభియోగంతో స్థానిక వన్‌టౌన్ పోలీసులు అజయ్‌కుమార్ తదితరులపై నాన్‌బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.

కాంగ్రెస్ జేబు సంస్థగా సీబీఐ

ఆళ్లగడ్డ (కర్నూలు), న్యూస్‌లైన్: స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐని కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి విమర్శించారు. 28 జీవోలపై సంతకం చేసిన మంత్రులు, అధికారులు తప్పు చేయనప్పుడు.. వాటిపై సంతకమే చేయని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎలా నిందలు వేస్తారని ప్రశ్నించారు. ఆళ్లగడ్డలో గురువారం నిర్వహించిన ‘జగన్ కోసం జనం సంతకాలు’ కార్యక్రమంలో భూమా దంపతులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐఎంజీ, ఎమ్మార్ ఆస్తుల కేసులో సంబంధం ఉన్న చంద్రబాబును సీబీఐ కాపాడుతోందన్నారు. తన పార్టీ ఎంపీలకు, సెక్యూరిటీ కి తెలియకుండా ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిసి బాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ వస్తున్న తరుణంలో కాంగ్రెస్, టీడీపీల మధ్య ఉన్న అవగాహన మేరకు సీబీఐతో మరో చార్జిషీట్ వేయించి అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం కోటి మంది కాదు, కాంగ్రెస్, టీడీపీల నాయకులు తప్ప యావత్తు ఆంధ్ర రాష్ట్రం సంతకం చేయడానికి సిద్ధంగా ఉంద’న్నారు.

జనం ఆశలన్నీ జగన్ మీదే

టీడీపీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలు కోట్లకు అమ్ముడుపోతున్నారని అబద్ధాలు పలుకుతున్న చంద్రబాబు, ఎన్ని కోట్లు తీసుకుని కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చారు? ఎన్ని కోట్లు చెల్లించి ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో బంధించి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు? ఎన్ని కోట్లు తీసుకుని ఈ ప్రజావ్యతిరేక కాంగ్రెస్ పార్టీని ‘అవిశ్వాస తీర్మానం’ ప్రవేశపెట్టకుండా కాపాడుతున్నారు?

ప్రపంచబ్యాంకు మెప్పుకోసం రాష్ట్రంలో అన్నిరంగాలనూ... ముఖ్యంగా వ్యవసాయాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు, రాష్ట్రంలో 3,500 మంది రైతుల ఆత్మహత్యలకు కారకుడైన చంద్రబాబు ప్రజల జ్ఞాపకశక్తిని చాలా తక్కువగా అంచనా వేసి ప్రజల మీద తనకున్న చులకన భావం వ్యక్తపరుస్తున్నాడు. ‘వ్యవసాయమే దండగ’ అన్న ఉద్దండుడు, ‘రైతులు తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అన్న పెద్దమనిషి, ‘రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలారేసుకోవలసిందే’ అని ఎద్దేవా చేసిన వ్యక్తి, ‘భూములు పంచితే పేదరికం పోదు’ అన్న పెద్దమనిషి, ‘నీటి ఎద్దడి పోవాలంటే తుఫానులే శరణ్యం’ అంటూ రైతులను ఆగర్భశత్రువుల్లా చూసిన ఘనుడు, ‘ఒకసారి పంట ఎండితే తెలిసొస్తుంది’ అంటూ అన్నదాతకు శాపనార్థాలు పెట్టిన వ్యక్తి, తన స్వీయరచన ‘మనసులో మాట’ పుస్తకంలో సబ్సిడీలు ఇవ్వరాదని రాసుకున్న వ్యక్తి... ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్రలో కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ రైతుల పట్ల మొసలికన్నీరు కార్చడం ఈ శతాబ్దపు వింత. చంద్రబాబు మర్చిపోయారేమో కానీ, 28 ఆగస్టు 2000లో విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా ఆందోళన చేసిన రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు రైతులను తుపాకులతో కాల్పించిన ఘటన, అంగన్‌వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన ఘటన ప్రజలు ఇంకా మర్చిపోలేదు.

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కూడా రాణించలేక పూర్తిగా విఫలమయ్యారని యావత్ ప్రజానీకం, రాజకీయ నిపుణులు, మేధావులు ఘంటాపథంగా చెబుతున్నారు. ‘సంక్షేమం నిల్ - బాదుడు ఫుల్’ కొనసాగిస్తున్న ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వం మాకొద్దు మొర్రో అని ఈ రాష్ట్ర ప్రజలంతా మొత్తుకుంటుంటే చంద్రబాబు ‘అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకుండా కుంటిసాకులతో కాలయాపన చేస్తున్నారు. అందుకే చంద్రబాబుని గానీ, కాంగ్రెస్‌ను గానీ నమ్మే స్థితి రాష్ట్రంలో లేదు. ప్రజల ఆశలన్నీ జగన్ మీదే. జగన్ తప్పక విడుదలవుతారు. తప్పక ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తారు. 

- ఆదిరెడ్డి యానాదిరెడ్డి, శ్రీకాళహస్తి, చిత్తూరు

ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం

ప్రపంచదేశాల్లోని ముఖ్యమంత్రుల్లో పేరుగాంచిన, ఉత్తమ పరిపాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి మన దివంగత నేత డా॥వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి. ఆయన ఎప్పుడైతే చనిపోయారో అప్పటినుండీ ఈ రాష్ట్రానికి శని పట్టింది. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆశయాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రజాసమస్యలపై పోరాటాలు, దీక్షలు చేస్తూ ప్రజలకు చేరువౌతున్న జగన్‌ని చూసి తట్టుకోలేని పాలకపక్షం, ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్థలు కలిసి ‘సీబీఐ’ అనే మంత్రదండాన్ని ఉపయోగించి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయించారు. 

జగనన్నను రాజకీయంగా ఎదుర్కోలేని కొందరు స్వార్థ రాజకీయ నిరుద్యోగులు, అసమర్థ పాలకులు దొడ్డిదారిన చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుని, ఆయన కుటుంబాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. నీచ రాజకీయాలు చేస్తూ వైఎస్సార్ కుటుంబంపై బురద చల్లాలని వారు ప్రయత్నిస్తున్నకొద్దీ ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా జగనన్న పట్ల జనస్పందన, ప్రేమాభిమానాలు అంతగా పెల్లుబుకుతున్నాయి. కాని ప్రజలకు కష్టాలు తీరే రోజు త్వరలో రానుంది. దేవుడు మావైపు ఉన్నాడు, రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం. ఇది జగమెరిగిన సత్యం. అతి త్వరలో జగనన్న బయటకు వస్తారు. వైఎస్సార్ కుటుంబానికి అండగా మేముంటాం. జననేత కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం.

- ఎస్.బి.బాల్‌రాజు, గోటూరు, మహబూబ్‌నగర్

చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com


sakshi

ఇద్దరు ప్రతినిధులు వెళ్తున్నప్పటికీ ఒకే అభిప్రాయం



 తెలంగాణ అంశంపై కేంద్ర హోంశాఖ నిర్వహించతలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ తన వైఖరి వెల్లడించాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అఖిలపక్షం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నందున ప్రధాన పార్టీగా కాంగ్రెస్ తన అభిప్రాయం చెప్పాలన్నారు. తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అని చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఆ విషయమేదో అధికారికంగా ప్రకటిస్తే ఈ గొడవే ఉండదన్నారు. శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫారసులపై ఇంతకాలం గడిచినా ఎలాంటి నిర్ణయం ప్రకటించడంలేదంటే వారి చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. హోంమంత్రి షిండే చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆ పదవికి తగిన వ్యక్తిలా క నబడటంలేదని విమర్శించారు. ఒక కేంద్ర మంత్రిగా ఆయన వద్ద సమగ్ర సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి విధాన నిర్ణయం ప్రకటించకపోగా... అవగాహన కోసం రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు వెళ్తున్నప్పటికీ ఒకే అభిప్రాయం చెప్తామని మైసూరా స్పష్టం చేశారు.

సాక్షి

YSRCP comments on All Parties Meet

అవినీతిని కాపాడుదామని నోరుజారిన బాబు!

Written By news on Thursday, December 27, 2012 | 12/27/2012

ఏపీలో అవినీతిని కాపాడుతామని చంద్రబాబు నోరు జారారు. పాదయాత్రలో భాగంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణకు టీఆర్‌ఎస్‌ ఎప్పుడూ ఉపయోగపడదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆరు నెలలు ఫామ్‌హౌస్‌లో కుంభకర్ణుడిలా పడుకుంటారని చంద్రబాబు విమర్శించారు.

సాదాసీదా అఖిలపక్షమే: వైఎస్ఆర్ సీపీ

శుక్రవారం జరుగనున్న సమావేశం సాదాసీదా అఖిలపక్షమేనని వైఎస్ఆర్ సీపీ నేతలు మైసూరారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గోనేందుకు ఢిల్లీ చేరుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలు మైసూరారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హోంమంత్రి మారినందున అఖిలపక్షం ఏర్పాటు చేయడం అవివేకం అని అన్నారు. 

తెలంగాణపై కాంగ్రెస్‌ తన వైఖరి చెప్పకుండా ఎన్ని అఖిలపక్ష భేటీలు పెట్టినా వృధానే అని మండిపడ్డారు. చంద్రబాబు పూటకో మాట చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. 2008లో లేఖ ఇచ్చింది, 2009లో యూ టర్న్‌ తీసుకుంది చంద్రబాబేనని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు మైసూరారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డిలు ధ్వజమెత్తారు.

'జనం చెక్కిన శిల్పం వైఎస్' పుస్తకావిష్కరణ

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై 'కదలిక' దినపత్రిక సంపాదకుడు ఇమామ్ రచించిన 'జనం చెక్కిన శిల్పం వైఎస్' పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి గురువారమిక్కడ ఆవిష్కరించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు , సాహిత్యాభిమానులు, వైఎస్ఆర్ సిపి నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా ...ఇచ్చిన మాట కోసం మడప తిప్పని నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్‌ లోని నాయకత్వ లక్షణాలను గుర్తించారన్నారు. ఆత్మస్తుతి ...పరనిందతో కాంగ్రెస్, టీడీపీలు తమను తాము మోసం చేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని మేకపాటి విమర్శించారు.

అఖిలపక్షానికి మహేందర్ రెడ్డి, మైసూరా

తెలంగాణపై అఖిలపక్ష సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పేర్లు ఖారారు అయ్యాయి. ఈ భేటీకి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, కేంద్రపాలక మండలి సభ్యుడు కేకే. మహేందర్ రెడ్డి హాజరు కాకున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఓ ప్రకటన చేసింది.

తెలుగుతల్లి విగ్రహం వద్ద భూమన నిరసన

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తీరుకు నిరనసగా తిరుపతిలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ఆందోళన చేపట్టారు. తెలుగు భాషాభిమానులు తెలుగు తల్లి విగ్రహంవద్ద నల్లజెండా కట్టి నిరసన తెలిపారు. కాగా భూమన నిరసన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు.

sakshi

చినబాబునూ , బరించలేం చంద్రబాబూ !





http://telugu.greatandhra.com/politics/1-12-2012/26_china_babu.php

బెయిలు ముందర ప్రతిసారీ ఇదే కుట్ర

బెయిలు ముందర ప్రతిసారీ ఇదే కుట్ర
నిమ్మగడ్డ ప్రసాద్ సలహాదారు వాంగ్మూలమంటూ ‘ఈనాడు’ శివాలు


ఏదో ఒక అంశాన్ని తీసుకుని సంచలనం సృష్టించేందుకు ప్రయత్నం
గతంలోనే ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సమయం చూసి రంగులు
వాన్‌పిక్ పోర్టు ప్రతిపాదన బాబుదే... స్కోడాకు అప్పగించిందీ ఆయనే
అది అమలు చేసే పరిస్థితి లేకపోవటంతో రాక్‌కు అప్పగింత
రాక్‌తో ఒప్పందం కుదిరింది 2008 మార్చిలో 
నిమ్మగడ్డ మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం అప్పటికే జగతి, భారతిలోకి
ఆ తరవాత 2009 సెప్టెంబర్లో వైఎస్సార్ మరణం
ఆయన మరణించాక మరో 55 శాతం పెట్టుబడులు పెట్టిన ప్రసాద్
అప్పటికే దేశంలో అగ్రగామి పత్రికగా నిలదొక్కుకున్న ‘సాక్షి‘
ఆ సమయంలో కూడా మొదట కొన్న రేటుకే షేర్లు కొన్న ప్రసాద్
మంచి ధరకు రావటంతో సాక్షిలో వాటా పెంచుకునే ప్రయత్నం
దాన్ని ఇప్పటికీ సహించలేకపోతున్న చంద్రబాబు, ఈనాడు
కాంగ్రెస్ ప్రభుత్వాలు తోడు రావటంతో రెచ్చిపోతూ రాతలు
బెయిలుపై విచారణ జరుగుతుండటం వల్లే రంగంలోకి ఏసీబీ?
సూరీడుపై దాడుల్ని వైఎస్సార్‌కు లింకు పెడుతూ ఎల్లో కథనాలు
సూరీడు కాంగ్రెస్ పెద్దలతో తిరుగుతున్న సంగతి కావాలనే పక్కకు
వైఎస్సార్ మరణించి మూడేళ్లు దాటినా ఆయనకే అంటగట్టే కుయత్నాలు
నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఎల్లో సిండికేట్

అరె!! ప్రతిసారీ ఇదేనా? ఒక్క వ్యక్తిపై ఇంత మంది కుట్రలా? ఒక వ్యక్తికి బెయిలు రాకుండా చేయటానికి ఇన్ని కుట్రలు పన్నాలా? ఆయన జైల్లోంచి బయటకు వస్తారనే భయంతో ఇన్నిన్ని కథలు నడిపించాలా? అసలు జనానికి మేలు చేయాల్సిన ప్రభుత్వం... నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన దర్యాప్తు సంస్థలు... అన్యాయాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్షం.. మూడూ కుమ్మక్కయిపోవటమనేది చరిత్రలో ఎక్కడైనా ఉందా? సరిగ్గా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు విచారణకు వచ్చినప్పుడో... తీర్పు రాబోతున్నప్పుడో వీళ్లెందుకు ఇంత డ్రామాలాడుతున్నారు? ఆయన బయటికొస్తారనే భయం కాకపోతే మరేమిటి? 

సీబీఐ లీకులివ్వటం... దానికి మసాలా జోడించి ఏదో జరిగిపోయిందనే రంగేస్తూ ‘ఈనాడు‘ సంచలనం సృష్టించే ప్రయత్నం చేయటం. ఇదంతా సరిగ్గా జగన్‌మోహన్ రెడ్డి బెయిలుపై విచారణ జరిగేటప్పుడో, తీర్పు రాబోయే ముందో ప్రచురించటం. ఒకసారి కాదు. ఇప్పుడు మొదలుపెట్టిందీ కాదు. ఉప ఎన్నికలకు ముందు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అరెస్టయ్యాక... జూన్ 1న ఆయన తొలిసారి బెయిలు కోసం పిటిషన్ వేశారు. అప్పటి నుంచి సీబీఐ-ఈనాడు- చంద్రబాబునాయుడు కలిసి ఈ హైడ్రామా ఆడుతూనే ఉన్నారు. ఈ మూడు పాత్రల్నీ కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తూనే ఉన్నాయి.

బుధవారం ‘జగన్‌తో వ్యాపార బంధం వద్దన్నా’ అంటూ నిమ్మగడ్డ ప్రసాద్ చార్టర్‌‌డ అకౌంటెంట్ వెంకటరమణమూర్తి సీబీఐకిచ్చిన వాంగ్మూలమంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనం కూడా అలాంటిదే. ఎందుకంటే ఈ వాంగ్మూలమేమీ ఆయన సీబీఐకి నిన్ననో, మొన్ననో ఇచ్చిందేమీ కాదు. అధికారికంగా ఇప్పుడు బయటపడిందీ కాదు. కావాలనే సమయం చూసుకుని సీబీఐ లీకులిచ్చింది. అందులో ఏమీ లేకున్నా... అదేదో మహాపరాధమైనట్లు, బుధవారమే ఇంతలా ప్రచురించటం వెనక మర్మం ఎవరికీ తెలియంది కాదు. 

ప్రసాద్ పెట్టుబడులెంత?
అసలు నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడుల గురించి వీళ్లు రాస్తున్న రాతల్లో నిజమేంటి? ఆయన ఏ పెట్టుబడికి సంబంధించయినా తన సలహాదారులందరితో చర్చించేవారని... చివరకు నిర్ణయం మాత్రం తనే తీసుకునేవారని ఆయన చార్టర్‌‌డ అకౌంటెంట్ చెప్పినదాంట్లో తప్పు ఏమైనా ఉందా? ఏ వ్యాపారవేత్తయినా చేసేది అదే కదా? మరి అందులో రామోజీరావుకు తప్పెందుకు కనిపించింది? అసలు జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడులెంత? ఎప్పుడెప్పుడు పెట్టారు? ఒకసారి చూద్దాం...

ఆ పెట్టుబడులు పెట్టిందెప్పుడంటే...
రస్ అల్‌ఖైమాతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది 2008 మార్చి 11న. రాక్ సీఈఓ ఖతర్ మసాద్ స్వయంగా వచ్చి దీనిపై సంతకాలు చేశారు. ఆ తరవాత రెండు నెలలకు ఈ ప్రాజెక్టు అమలు కోసం తన స్థానిక భాగస్వామిగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఎన్‌పోర్ట్స్‌ను ఎంచుకున్నారు. ఒకవేళ నిమ్మగడ్డ ప్రసాద్ ఈ ప్రాజెక్టును దక్కించుకున్నాకే జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే... అందుకే పెట్టారనే సీబీఐ వాదనను అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిందెప్పుడో తెలుసా?

జగతి పబ్లికేషన్స్‌లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు 2006 డిసెంబర్లోనే మొదలయ్యాయి. అంటే రాక్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవటానికి 14 నెలల ముందే. వాన్‌పిక్‌లోకి నిమ్మగడ్డ ప్రసాద్ ప్రవేశించడానికి దాదాపు ఏడాదిన్నర ముందే! పెపైచ్చు ఈ పెట్టుబడులు 2009 సెప్టెంబర్ తరవాతా సాగాయి. అంటే వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణించాక. దీనర్థమేంటి? 

జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్ సహా జగన్‌మోహన్ రెడ్డికి చెందిన సంస్థల్లో ప్రసాద్ పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.847 కోట్లు. 
దీన్లో 2008 మార్చి - 2009 సెప్టెంబర్ మధ్య... అంటే రాక్‌తో ఒప్పందం కుదిరిన నాటి నుంచి వైఎస్సార్ మరణించే వరకూ పెట్టిన పెట్టుబడి రూ. 172 కోట్లు. అంటే మొత్తం పెట్టుబడిలో 20 శాతం. అంటే మిగిలిన 80 శాతాన్ని రాక్‌తో ఒప్పందం కుదరకముందో... వైఎస్సార్ మరణించాకో చేసినట్టు. మరి ఏమాశించి ఆయన ఈ పెట్టుబడులు పెట్టారనుకోవాలి? ఒక ఇన్వెస్టరుగా మాత్రమే ఆలోచించి ఇన్వెస్ట్‌మెంట్లు చేశారనుకోవద్దా? 
కేవలం జగతి పబ్లికేషన్స్‌నే తీసుకుంటే దీన్లో పెట్టుబడి పెట్టిన రూ.450 కోట్లలో రూ.30 కోట్లు మాత్రమే ఆయన 2008 మార్చి-2009 సెప్టెంబర్ మధ్య పెట్టారు. అంటే 6 శాతమన్న మాట. మిగిలిన 94 శాతం రాక్‌తో ఒప్పందం కుదరక ముందో లేక వైఎస్సార్ మరణించాకో పెట్టినవే. దీన్ని క్విడ్ ప్రో కో అంటున్నవారు ఏ రకంగా ఆలోచిస్తున్నారో చెప్పటానికి ఇది చాలదూ!!

వాన్‌పిక్ బాబు తలలోంచి పుట్టిందే...
అసలు వాన్‌పిక్ ఆలోచన తెచ్చిందే చంద్రబాబునాయుడు. తొలుత ఆంధ్రా సీపోర్ట్స్ సంస్థ ఈ ప్రతిపాదన చేయగా చంద్రబాబు సరేనన్నారు. కుదరకపోవటంతో స్కోడా కంపెనీకి ధారాదత్తం చేశారు. కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్లానే దీన్నీ కట్టబెట్టే ప్రయత్నం చేసినా స్కోడా కంపెనీ ఈ ప్రాజెక్టు చేయలేని స్థితిలో రాక్ ప్రభుత్వం తెరపైకి వచ్చింది. ఇలా రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. 

సాక్షి విలువ చూసే ఆ పెట్టుబడి...
జగన్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల్లో 25 శాతాన్ని రాక్‌తో ఒప్పందానికి ముందే నిమ్మగడ్డ ఇన్వెస్ట్ చేశారు. తరవాత దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన ఏడాదికి మరో 55 శాతం పెట్టుబడులు పెట్టారు. ఇక్కడర్థం కావాల్సింది ఒక్కటే. అప్పటికి ‘ సాక్షి’ ఏర్పాటై నాలుగేళ్లు గడుస్తోంది. దేశంలోనే 8వ స్థానంలో ఉన్న అగ్రగామి పత్రికగా తన అగ్రగామి స్థానాన్ని పదిలపరచుకుంది. పెపైచ్చు అంతకు ముందు ఏ రేటుకైతే షేర్లు కొన్నారో... అప్పుడు కూడా అదే రేటుకు కొనగలిగారు ప్రసాద్. మరి దీన్ని ఒక తెలివైన ఇన్వెస్టరు తీసుకున్న నిర్ణయంగా చూడొద్దా? అప్పటికే చిరంజీవి, నాగార్జునలతో ‘మా టీవీ’ వంటి మీడియా సంస్థలో భాగస్వామిగా ఉన్న ప్రసాద్... మరో మీడియా సంస్థలో వాటాను పెంచుకోవటం కోసం అదనపు పెట్టుబడి పెడితే తప్పా?

వాటా విక్రయంతో లాభాలు...
దివంగత నేత వైఎస్సార్ మరణించేనాటికి జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడి దాదాపు 415 కోట్ల రూపాయలు. అయితే... వైఎస్సార్ మరణించాక భారతి సిమెంట్‌లో తన వాటాను విక్రయించటంతో ప్రసాద్ చేతికి రూ.620 కోట్లు వచ్చాయి. అంటే దాదాపు రూ. 200 కోట్ల లాభమన్న మాట. మరి ఈ అంశాన్ని సీబీఐ కానీ, ‘ఈనాడు’ కానీ ఎన్నడూ ఏ పరిస్థితుల్లోనూ ప్రస్తావించనే ప్రస్తావించవు. ఎందుకంటే దీన్ని ప్రస్తావిస్తే క్విడ్ ప్రో కో అనే తమ వాదనకు విలువుండదు కనుక. క్విడ్ ప్రో కో పెట్టుబడులకు లాభాలొస్తాయా? అంటూ అంతా నవ్విపోతారు కనుక. 

తనకు లాభం వచ్చాక... అగ్రగామిగా దేశంలోనే 8వ స్థానంలో నిలిచిన పత్రికలో వాటాను అంతకు ముందటి ధరకే కొనుగోలు చేసే అవకాశం రావటంతో ప్రసాద్ సహజంగానే ఒక ఇన్వెస్టరుగా తన నిర్ణయం తాను తీసుకున్నారు. వాటా పెంచుకోవాలనుకున్నారు. ‘ఈనాడు’ విలువతో సరిసమానంగా ఉన్న పత్రిక, దేశంలో నంబర్-8 స్థానంలో ఉన్న పత్రిక... ఇదే ‘ఈనాడు’ విలువలో సగం ధరకే లభిస్తుండటంతో తను సహజంగానే మొగ్గు చూపారు. కానీ ఇది ‘ఈనాడు’కు తప్పుగా అనిపిస్తోంది. అందుకే లీక్‌లతో తప్పుడు కథనాలు వండేస్తోంది. 

ఏసీబీనీ రంగంలోకి దించేశారు!!
ఇంకో చిత్రమేంటంటే బెయిలుపై విచారణకు ముందు సంచలనం చేయడానికి కొత్త ఎత్తులకు దిగటం. బుధవారం సూరీడు ఆస్తులపై ఏసీబీ దాడులంటూ జరిగిన హడావుడి... సూరీడును ఇప్పటికీ దివంగత వైఎస్‌కు వ్యక్తిగత సహాయకుడిగానే పేర్కొంటూ ఎల్లో మీడియా చేస్తున్న హల్‌చల్. వైఎస్ మరణించి మూడేళ్లు దాటినా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా ఆయనకు ఆపాదించే ప్రయత్నం చేయటమన్నది రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో కళ్లకు కట్టే అంశం. ఏ అధికారిపై సోదాలు జరిగినా... ఏ వ్యవహారం వెలుగుచూసినా దానికి వైఎస్సార్‌తో ఏదో ఒక లింకు పెట్టడానికి ఎల్లో మీడియా చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నవారికి వెగటు కలిగించేవే తప్ప నిజమనిపించేవి కావు.

సూరీడు ఎవరి మనిషి?
వైఎస్సార్ మరణించాక హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగితే కూకట్‌పల్లి మోతీనగర్‌లో కార్పొరేటర్‌గా తన తమ్ముడు గణేష్‌కు ఢిల్లీ పెద్దల, రాష్ట్ర పెద్దల ఆశీస్సులతో టికెట్టు ఇప్పించుకున్నారు సూరీడు. మొన్నటి ఉప ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా పని చేశారు సూరీడు. ఇక ఢిల్లీ నుంచి గులాంనబీ ఆజాద్ వచ్చినా, వయలార్ రవి వచ్చినా వాళ్లను సూరీడు కలుస్తూనే ఉన్నాడు... ‘ఈనాడు’లో ఫొటోలు వేస్తూనే ఉన్నారు. మరి ఇవన్నీ ఎల్లో మీడియా ఎందుకు గుర్తు చేయటం లేదు? దివంగత నేత వైఎస్సార్ మరణించి మూడేళ్లు దాటినా ఇప్పటికీ సూరీడుపై ప్రతికూల వార్తలు ఏమొచ్చినా వాటిని దివంగత నేత వైఎస్సార్‌కు అంటగట్టే ప్రయత్నమే చేస్తున్నారెందుకు? ఆ మధ్య సూరీడు కుమార్తె వివాహం జరిగితే వైఎస్సార్ కుటుంబ సభ్యలెవరూ హాజరు కాకున్నా... సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరై... పెద్ద పెద్ద ఫొటోలు కూడా పత్రికల్లో వచ్చినా దాన్నెందుకు పరిగణించటం లేదు? ఇవన్నీ వదిలి ఇప్పటికీ సూరీడును దివంగత నేతకు లింకు పెట్టే ప్రయత్నాలే చేస్తున్నారంటే అది బెయిలు పిటిషన్‌ను దృష్టిలో పెట్టుకుని కాదా? అలాగని చెప్పే ధైర్యం ఈ ఎల్లో మీడియాకు గానీ... తన చేతిలోని ఏసీబీని ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వానికి గానీ ఉందా? మరీ ఇంత నీచమైన రాజకీయాలు నడిపించాలా? అసలు ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క రోజైనా సూరీడు జగన్‌ను ఇంటి దగ్గరకు వచ్చి పలకరించారా?

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=54968&Categoryid=1&subcatid=1

Popular Posts

Topics :