01 April 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రాజకీయ హీరో జగన్: హరిరామజోగయ్య

Written By news on Saturday, April 7, 2012 | 4/07/2012


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రాజకీయ హీరో అని మాజీ ఎంపి హరిరామజోగయ్య అన్నారు. సాక్షిటివి 'న్యూస్ మేకర్' కార్యక్రమంలో అయన మాట్లాడారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో జగన్ తోపాటు తాను పర్యటించానని చెప్పారు. జగన్ ఏ గ్రామానికి వెళ్లినా ఆయనని చూసేందుకు గ్రామస్తులు అందరూ తరలివస్తున్నారన్నారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని చెప్పారు. 'జగన్ ని చూసేందుకు జనం ఎందుకు ఇలా తరలి వస్తున్నారని ఆలోచించాను. ఆయన సినిమా హీరో కాదు. ఏ సినిమాలో నటించలేదు. అయినా ఎందుకు ఇంతమంది ఆయనని చూసేందుకు వస్తున్నారు? ఆయన ప్రస్తుతం ప్రజా నాయకుడు, పొలిటికల్ హీరో. ఇన్నేళ్ల నా రాజకీయ అనుభవంతో చెబుతున్నాను. 2014లో జగనే సిఎం. ఇది నా మాట కాదు. ప్రజల మాట' అని అన్నారు. 


ప్రజారాజ్యం పార్టీలో చేరడం తన జీవితంలో చేసిన పెద్దతప్పు అని బాధపడ్డారు. ఉపఎన్నికల విషయంలో ఆంధ్రజ్యోతి సర్వే బోగస్ అని చెప్పారు. వాళ్లు మద్దతు తెలిపే పార్టీ గెలుస్తుందని చెప్పి, ఓటర్లను ఆ పార్టీ వైపు తిప్పుకునే విధంగా ఇటువంటి సర్వేలు ప్రకటిస్తుంటారని వివరించారు. 

కాంగ్రెస్ పార్టీ చర్యలే జగన్ ని హీరోని చేశాయన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నీతిమంతులా? ఎవరేంటో ప్రజాకోర్టులో తేలుతుందని హరిరామజోగయ్య అన్నారు.

డబ్బు మూటలతో కాంగ్రెస్, టీడీపీ సిద్ధం: జగన్

రామచంద్రపురం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో కూలీల ఉపాధి కరువయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో శనివారం రాత్రి జరిగిన సభలో అశేషంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికలకు కాంగ్రెస్, టీడీపీ డబ్బు మూటలతో సిద్ధమవుతున్నాయని ఆరోపించారు. అప్యాయత, అనురాగాలకు డబ్బుతో వేలం వేయాలని చూస్తున్నాయని చెప్పారు. రామచంద్రపురానికి వళ్లీ వస్తానని, రెండు రోజులు పర్యటిస్తానని హామీయిచ్చారు. రైతులు, పేద కూలీల కోసం పదవి వదులుకున్న పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ఉప ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను జగన్ కోరారు.

Blood donation camp by Dr. Profulla reddy (ysrcp jublihills leader)

Blood donation camp by Dr. Profulla reddy on world health day for THALASSEMIA AND SICKLE CELL SOCIETY along with Bajireddy Govardhan ,Raj Takur,Challa Madhu,Ravi kumar.

A total of around 150 people donated blood for the children who suffers from Thalassemia disease .తీవ్ర నిరాశలో చంద్రబాబు: కొణతాల

తెలుగుదేశం పార్టీ విధానాల్లో స్థిరత్వం లోపించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ అన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఏ విధానాలతో ప్రజల ముందు వెళతారో స్పష్టం చేయాలన్నారు. తీవ్ర నిరాశలో ఉన్న చంద్రబాబు వ్యక్తిగత విమర్శలతో స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. బాబు భూ పోరాటం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో బడాబాబులకు కట్టబెట్టిన భూముల మాటేంటని కొణతాల సూటిగా ప్రశ్నించారు. ముందు ఈ భూముల్లో జెండాలు పాతి పోరాటం చేయాలన్నారు.

Chevireddy Bhaskar Reddy Fire on Anam Vivekananda Reddy


Konatala RamaKrishna Press Meet 7th April 2012

YS Jagan road Show at Ramachandrapuram, East Godavari


YS Jagan Odarpu yatra special Nenunnanu 7th April

Sobha Nagireddy Comments on ys jagan

Grand Welcome To Ys Jagan In Kandulapalem At E.G

YS Jagan Ramachandrapuram Election Campaign in EGDT

ఎల్లుండి సంగారెడ్డిలో పర్యటించనున్న జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ సోమవారం మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన అల్లర్లలో నష్టపోయిన బాధితులను ఆయన పరామర్శిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్దన్ శనివారమిక్కడ తెలిపారు.

సర్వేలకు అందని ఫలితాలు : శోభానాగిరెడ్డి


కాణిపాకం : ఉప ఎన్నికల్లో సర్వేలకు అందని ఫలితాలు రానున్నాయని, వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని జనాభీష్టం ప్రతిఫలించనున్నదని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. కడప, పులివెందుల, కోవూరు ఫలితాల తరహాలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ గెలుపు తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజల నిర్ణయాన్ని మార్చలేరని అన్నారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ..చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో శోభానాగిరెడ్డి పూజలు నిర్వహించారు.


మహా పాదయాత్రకు అపూర్వ ఆదరణ


రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం అనే నినాదంతో గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ ఆశయాలను తీసుకెళ్లాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తలపెట్టిన 141 రోజుల మహా పాదయాత్రకు 100 రోజు స్థానిక బట్వాడిపాళెంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమం ఉద్ధేశం నెరవేరాలని అనారోగ్య కారణాలను కూడా లెక్క చేయకుండా కోటంరెడ్డి చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలోనే ఆ పార్టీ నేతలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఆయన వస్తున్నారని తెలిసి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు బట్వాడిపాళెం సెంటర్‌కు చేరుకుని ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చి సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. అక్కడ నుంచి 100 రోజు పాదయాత్ర ప్రారంభమైంది. అంబటిరాంబాబు, గోవర్దన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డిలకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. భారీ గజమాల వేసి సత్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకన్నారు. పాస్టర్స్ అసోసియేషన్ తరుపున వైఎస్ జగన్‌ను ఆశీర్వదిస్తూ ప్రార్థనలు చేశారు. జిల్లాలో ఆనం సోదరుల ఆగడాలు, వారి ఊసరవెల్లి రాజకీయాలతోపాటు వైఎస్ జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్న కుట్రల గురించి వైఎస్సార్‌సీపీ నేతలు వివరిస్తూ వైఎస్సార్‌సీపీ ఆశయాలను గడప గడపకు తీసుకెళ్లే కార్యక్రమానికి అంబటి రాంబాబు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కొనసాగించారు.

సంపాదనే ‘ఆనం’ ధ్యేయం

ఆనం సోదరులు సంపాదనే ధ్యేయంగా ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మహాపాదయాత్ర 100వ రోజు కార్యక్రమంలో మాట్లాడారు. ఆనం సోదరులు పదవులు, అక్రమ సంపాదన కోసం ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ నీచమైన రాజకీయాన్ని చేస్తున్నారన్నారు. నాడు వైఎస్‌జగన్‌కు ముఖ్యమంత్రి పదవి వస్తుందని భావించి, ఆయన కోసం తన ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్దమని ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించారన్నారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఆనం సోదరులు ఫ్లేటు పిరాయించారన్నారు. వారికి ఇది కొత్త కాదన్నారు. ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్‌రావు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇలా ఎవరు అధికారంలో ఉంటే వారికి తొత్తులుగా మారి రాజకీయాలు చేసే నీచులని విమర్శించారు. శ్రీధర్‌రెడ్డి పార్టీ ఆశయాలను, దివంగత మహానేత సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు చేపట్టిన మహా పాదయాత్ర అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. వైఎస్ జగన్ పలు సందర్భాల్లో గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఎలా జరపాలో నెల్లూరు వెళ్లి శ్రీధర్‌రెడ్డిని చూసి నేర్చుకోండంటూ పలువురు నేతలకు చెప్పారన్నారు. అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న 100వ రోజు కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. శ్రీధర్‌రెడ్డికి 25 సంవత్సరాల రాజకీయ అనుభవంలో కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభించలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ఇస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పోరాట పటిమ తనకు చిన్నప్పటి నుంచి తెలుసనన్నారు. 141 రోజు పాదయాత్ర చేయాలని తన వద్దకు వచ్చినప్పుడు, అది సాధ్యమో కాదో ఆలోచించుకోమని చె ప్పానన్నారు. 100 రోజులు పాదయాత్ర పూర్తి చేయడం సామాన్యమైన విషయం కాదన్నారు. ప్రజల్లో వైఎస్‌జగన్‌పై ఉన్న ప్రేమాభిమానాలు, ఆపాయ్యాయతా అనురాగాలను చూస్తుంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని అర్ధమవుతుందన్నారు. అవినీతికి నాంది పలికిన చంద్రబాబు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్‌ను అష్టకష్టాలు పెట్టాలని కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. సీబీఐతో విచారణ చేయించాయన్నారు. చివరికి సీబీఐ విచారణ కొండను తవ్వి, ఎలుకను పట్టిన చందంగా తయారైందన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ పి. అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ శ్రీధర్‌రెడ్డితో తనకు ఉన్న సోదరభావం ఎన్నడు విడిపోనిదన్నారు. అనం సోదరుల నియంతృత్వాన్ని ఎదుర్కొని స్వతంగా రాజీవ్ భవన్‌ను ఏర్పాటు చేసి, తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నామన్నారు. ఆనం సోదరుల ఆగడాలను సమష్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉప ఎన్నికల్లో కోవూరుకంటే ఎక్కువ మెజారీటీ ఇచ్చి నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలో వైఎస్సార్‌సీపీ పట్టు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ తాను వంద రోజుల పాదయాత్రలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానం, ఆదరణ కల్లారా చూసి తరించనన్నారు. ప్రజలు ఆయన్ను ఆరాధ్య దైవంగా ప్రేమిస్తూ, ఆయన కుమారుడు వైఎస్ జగన్ నాయకత్వంపై చూపుతున్న ఆదరణ అంతా ఇంతా కాదన్నారు. 100 రోజులు పాదయాత్ర చేయడంలో లభించిన ఆత్మసంతృప్తి అంతా ఇంతా కాదన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్‌యాదవ్, రాఘవరెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, రూప్‌కుమార్‌యాదవ్, ఆనంద్‌బాబు, బాబ్జి, పురుషోత్తం, శ్రీకాంత్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

jagan tour 06/04/2012

‘ముందున్నవి మంచిరోజులే’నన్న వారి నమ్మకాన్ని పదింతలు చేస్తూ జగన్ ముందుకు

వర్షాకాలంలో ఒక్కోరోజు కుండపోతగా వర్షం కురిసి, వాగూవంకా వెల్లువెత్తడం సహజమే. అన్ని రుతువుల్లో అభిమాన వర్షం కురిపించగల ‘మమతల మంత్రవిద్య’ మాత్రం గోదారి గడ్డ సొంతం. తన మేలు కోరే వారిని, తన కోసం పోరే వారిని వాత్సల్యపు వెల్లువలో తడిసి ముద్ద చేయడం ఈ ప్రాంతపు రివాజు. రామచంద్రపురం ఉప ఎన్నికలో ప్రచారం సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌పై ఈ సీమ మమకారం వరదలెత్తుతోంది. గతంలో మహానేత వైఎస్ చవిచూసిన అవ్యాజానురాగాల్నే తానూ ఆస్వాదిస్తూ, పులకరిస్తూ, ప్రతిచోటా తన కోసం ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తున్న వేలమందిని ప్రేమతో పలకరిస్తూ, ‘ముందున్నవి మంచిరోజులే’నన్న వారి నమ్మకాన్ని పదింతలు చేస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. 
రామచంద్రపురం, న్యూస్‌లైన్ ప్రతినిధి : ఊరూరా, వాడవాడలా జనం పంచే ఆత్మీయత, అనురాగాలను చవి చూస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రామచంద్రపురంలో రెండో రోజు శుక్రవారం పర్యటించారు. దాదాపు ప్రతి గ్రామంలో ఆయనను చూసేందుకు, ఆయన పలుకులు వినేందుకు మహిళలు, యువత కాన్వాయ్‌కు అడ్డం పడ్డారు. వెల కట్టలేని ఆ అభిమానానికి జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. షెడ్యూల్‌లో తీవ్రజాప్యం జరుగుతున్నా లక్ష్యపెట్టకుండా వారితో మాట్లాడిన తరువాతే ముందుకు కదిలారు. ఈ కారణంగా పర్యటన అనుకున్న దాని కన్నా నాలుగు గంటలు ఆలస్యంగా నడిచింది. గంగవరం శివాలయంలో పూజల్లో పాల్గొన్న జగన్ గుడ్ ఫ్రైడే సందర్భంగా కుందూరులోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

మనసుంటే క్షణాల్లోనే ‘మార్గం’...
జగన్ పర్యటనకు ఆటంకం కల్పించాలనుకున్న అధికార పార్టీ పెద్దల కుట్రలను దంగేరు ప్రజలు తిప్పికొట్టారు. దంగేరు-శివల మధ్య నిర్మాణంలో ఉన్న రోడ్డుపై గొయ్యిని తవ్వడంతో దంగేరు వెళ్లేందుకు దారి లేకపోయింది. ఎలాగైనా జగన్‌ను తమ గ్రామంలోకి తీసుకురావాలనుకున్న జనం అప్పటికప్పుడు మట్టితో గోతిని పూడ్చారు. అయితే అధికారపక్షం నేతలు అధికారులను పంపి ఆ పూడికను తొలగింపజేశారు. అయినా పట్టువీడని జనం... పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో రాకపోకలకు తాత్కాలిక ఏర్పాట్లు చేసి జగన్‌ను తమ గ్రామానికి తీసుకు వెళ్లగలిగారు. దంగేరు శివారు శెట్టిబలిజపేట దుర్గమ్మగుడి వద్ద వాసంశెట్టి వెంకటరమణ తదితరులు రోడ్డుకు అడ్డం పడి జగన్‌ను మాట్లాడాకనే ముందుకు వెళ్లనిచ్చారు.

తాళ్లపోడు వద్ద ప్రచారరథంపై నుంచి మాట్లాడేందుకు సిద్ధమవుతున్న జగన్‌ను దగ్గర నుంచి చూడాలని ఆత్రుతతో మహిళలు ఆయన కిందికి దిగిరావాలని పట్టుబట్టారు. ‘మీ మాటల కంటే మిమ్మల్ని చూడాలనే ఇంతసేపు ఇక్కడ ఉన్నాం’ అంటూ పదేపదే విజ్ఞప్తి చేయడంతో జగన్ ప్రచారరథం దిగివచ్చారు. మసకపల్లిలో వైఎస్ అభిమానులు తలో కొంత చందాలు వేసుకుని వైఎస్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆయనకు ఎస్సీ, బీసీల్లో ఉన్న ఆదరణ చెక్కుచెదరలేదనడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ప్రతి పల్లెలో మహిళలు, వృద్ధులు జగన్ రాక కోసం, ఆయనతో చేయి కలిపేందుకు తహతహలాడడం కనిపించింది. జగన్ కూడా పర్యటన ఆద్యంతం విసుగూ విరామం లేకుండా వారితో చేయి కలుపుతూ ముందుకు సాగారు. 

ఎల్లలు లేని జనాభిమానం...
అమెరికాలో స్థిరపడ్డ పిల్లంకకు చెందిన సాగి సుదర్శనరాజు సెలవు పెట్టి మరీ మసకపల్లిలో జగన్‌ను కలిసేందుకు రావడం ఆయనపై జనాభిమానానికి ఎల్లలు లేవని స్పష్టం చేస్తోంది. ఉదయం 10 గంటలకు కె.గంగవరంలో ప్రారంభమైన పర్యటన అడుగడుగునా జాప్యం కావడంతో మసకపల్లిలో మహానేత వైఎస్ నిలువెత్తు విగ్రహావిష్కరణ సభతో రాత్రి 8.30 గంటలకు ముగించాల్సి వచ్చింది. కె.గంగవరంలో ప్రారంభమైన పర్యటన కూనుమిల్లిపాడు, ఎర్రపోతవరం, బాలాంత్రం, మసకపల్లిల వరకు సాగింది. కూనుమిల్లిపాడు, ఎర్రపోతవరం, బాలాంత్రంలలో వైఎస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. తొలుత గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని వివిధ ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, జగన్ వారితో ఫొటోలు తీయించుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పాతకోట గ్రామానికి చెందిన ఆనందరావు, సుశీల దంపతుల చిన్నారికి ‘విజయమ్మ’గా జగన్ నామకరణం చేయడంతో వారు మురిసిపోయారు. 

త్వరలో జరగనున్న రామచంద్రపురం ఉప ఎన్నికల్లో విలువల కోసం పదవిని వదులుకున్న మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు మద్దతు కోరుతూ పర్యటన సాగినా, ఓటు హక్కులేని విజయనగరం వలసకూలీలను, చిన్నారులను ఆప్యాయంగా పలకరించడం జగన్ కేవలం ఓట్ల కోసం రాలేదన్న విషయాన్ని స్పష్టం చేసినట్టయ్యింది. జగన్ అదే సందర్భంలో కూలీ పనులు చేసుకునే తల్లులు పిల్లలను చదివిస్తే నెలకు రూ. 500 వంతున అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లభాషా బోధనను కూడా అందుబాటులోకి తీసుకువస్తానని, ఇంజనీరింగ్ వరకు చదివించే బాధ్యతను తీసుకుంటానని భరోసా కల్పించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్న పాలక, ప్రతిపక్షాల కుళ్లు కుతంత్రాలను ఉప ఎన్నికల్లో తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని కోరారు. పర్యటన అనంతరం జగన్ హసన్‌బాద చేరుకుని పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఇంట బస చేశారు

Center for Economics and Social Studies Survey on Babu

ఆ జీఎమ్మార్ ఎవరో...?

ఎమ్మార్ తెలుసు... శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎమ్మార్ తెలుసు.. మన పార్టీలో ఈ జీఎమ్మార్ ఎవరబ్బా.. కోటరీలో కొత్త కేరక్టరా!! అని టీడీపీ తమ్ముళ్లు కంగారు పడ్డారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ధర్నా చేసిన చంద్రబాబు అటు నుంచి అటే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. వెళుతూ వెళుతూ నేనూ, జీఎమ్మార్ కలిసి వెళుతున్నామని చెప్పారట. దీంతో తమ్ముళ్లలో కంగారు పుట్టింది. జీఎమ్మార్ అంటే శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎమ్మారేనా.. లేక కొత్త కేరక్టరా అని లోతుగా విచారించగా.. పార్టీ ప్రధాన కార్యదర్శి, పారిశ్రామికవేత్త కూడా అయిన గరికపాటి మోహన్‌రావని తేలిందట. సాధారణంగా చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ఎవరికీ చెప్పరు. ఎవరితో కలిసి వెళుతున్నారన్న విషయం మరొకరికి తెలియనీయరు. ఒకవేళ తెలియాలని అనుకున్నా.., తెలిసీ తెలియని విధంగా, అస్పష్టంగా చెప్పి, ఎదుటి వారు గందరగోళ పడే విధంగా చేస్తుంటారని పార్టీలో అందరూ చెప్పుకుంటారు. బుధవారంనాడు కూడా గరికపాటిని తీసుకెళ్తున్న విషయం సూటిగా చెప్పేందుకు ఇష్టపడకే జీఎమ్మార్‌తో కలిసి వెళుతున్నానని చెప్పారట. పార్టీలో అవసరాన్నిబట్టి పారిశ్రామికుల పేర్లను ఆ రకంగా బాబు వాడుతుంటారని, అదే ఆయన వ్యాపార రహస్యమని చెవులు కొరుక్కుంటున్నారు.

జగన్ పర్యటనను అడ్డుకునేందుకు రోడ్డు ధ్వంసం

రామచంద్రపురం నియోజకవర్గ రోడ్‌షోలో భాగంగా వైఎస్ జగన్ శుక్రవారం కె.గంగవరంలో పర్యటించారు. జగన్‌కు అడుగడుగునా లభిస్తున్న ఆదరణ తట్టుకోలేక ఈ పర్యటనను అడ్డుకునేందుకు కొందరు మార్గమధ్యంలో రోడ్డును తవ్వేశారు. కూనిమిల్లిపాడు నుంచి దంగేరు వెళ్లే మార్గంలో దంగేరు శివారు రోడ్డును సీసీ రోడ్డుగా అభివృద్ధి చేస్తుండగా.. కొందరు రాత్రికి రాత్రి మధ్యలో గొయ్యి తవ్వేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు యుద్ధప్రాతిపదికన అక్కడే ఉన్న సిమెంట్, కంకర, ఇసుకతో గొయ్యి పూడ్చి జగన్ వాహనం వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు.

వంటగ్యాస్ సిలిండర్‌కు బ్లాక్‌మార్కెట్టే దిక్కు...


డీలర్ దగ్గర బుక్ చేస్తే 20 నుంచి 30 రోజులదాకా ఎదురుచూపులే
బ్లాక్‌లో కొంటే మాత్రం క్షణాల్లో ప్రత్యక్షం
అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ దోచుకుంటున్న ఏజెన్సీలు, డెలివరీ సిబ్బంది
రూ. 402 సిలిండర్ కు బ్లాక్ మార్కెట్‌లో రూ. 500 నుంచి రూ. 1000 
పక్కదారి పడుతున్న దీపం పథకం సిలిండర్లు
విద్యా సంస్థలు, హోటళ్లకు అక్రమంగా సరఫరా చేస్తున్న వైనం
చోద్యం చూస్తున్న అధికారులు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా..? అయితే మీరు ‘బుక్’ అయినట్టే! వారం.. 15 రోజులు.. 20 రోజులు.. నెల కూడా గడిచిపోయింది! కళ్లు కాయలు కాస్తున్నా.. బండ రాలేదు.. బాధ తీరలేదు!! వంటింటి కష్టాలు భరించలేక బ్లాక్‌లో కొనాలనుకుంటే మాత్రం క్షణాల్లో సిలిండర్ మీ ముందు ప్రత్యక్షం!! గ్యాస్ ఏజెన్సీల లాలూచీ, డెలివరీ బాయ్‌ల కక్కుర్తి, పౌర సరఫరాల శాఖ నిర్లక్ష్యం.. వెరసి గ్యాస్ వినియోగదారుడి జేబుకు చిల్లుపడుతోంది. రూ.402 సిలిండర్‌కు గత్యంతరంలేని పరిస్థితిలో బ్లాక్‌లో రూ.500-రూ. 1000దాకా ముట్టజెప్పుకోవాల్సి వస్తోంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా.. అనంతపురం నుంచి ఆదిలాబాద్ దాకా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పల్లెల్లో అయితే మరీ దారుణం. పనులు మానుకొని మరీ సిలిండర్లు తెచ్చే వాహనం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గ్యాస్ బండలు తెచ్చినందుకు ట్రాన్స్‌పోర్టు చార్జీల పేరుతో సిబ్బంది అడ్డగోలుగా వసూళ్లకు దిగుతున్నారు. పొరపాటున సిలిండర్ బండి వచ్చినప్పుడు లేకపోయారో.. అంతే! మళ్లీ సమీపంలోని పట్టణానికి వెళ్లి ఏజెన్సీలు, గోదాముల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గ్యాస్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో కొందరు కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తుండగా... ఇంకొందరు కిరోసిన్ స్టౌలను నమ్ముకుంటున్నారు. కొన్నిచోట్ల సహనం నశించిన కొందరు వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీ కార్యాలయాలను ముట్టడి స్తున్నారు. మరోవైపు కంపెనీల నుంచి గ్యాస్ పంపిణీ సరిగా లేకపోవడం వల్లే సిలిండర్ల సరఫరాలో జాప్యం జరుగుతోందని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.

‘దీపం’ ఉండగానే...

రాష్ర్టంలో మొత్తం రెండు కోట్లకుపైగా కుటుంబాలు ఉండగా.. ఒక కోటీ 47 లక్షల గ్యాస్ కనెక్షన్లు (సాధారణ, దీపం పథకం కలుపుకుని) ఉన్నాయి. వీటిలో దీపం పథకం కింద 37.36 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. చాలా జిల్లాల్లో డ్వాక్రా, స్వయం సహాయక సంఘాలకు ఉద్దేశించిన దీపం పథకం పక్కదోవ పడుతోంది. పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రముఖ విద్యా సంస్థలు.. ఏజెన్సీలు, డెలివరీ సిబ్బందితో కుమ్మక్కై పథకం సిలిండర్లను తన్నుకుపోతున్నాయి. నిబంధనల ప్రకారం వారు వాణిజ్య అవసరాల సిలిండర్లను వినియోగించాలి. అయితే వీటి ధర గృహావసరాల సిలిండర్ల కన్నా మూడు రెట్లు అధికం ఉండటంతో ఏజెన్సీలకు, డెలివరీ సిబ్బందికి ఎంతోకొంత ముట్టజెప్పి బ్లాక్‌లో దీపం సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు. దీపం కనెక్షన్లు ఏజెన్సీలకు కాసుల పంట పండిస్తున్నాయనేందుకు ఇటీవల నిజామాబాద్‌లో చోటుచేసుకున్న ఉదంతమే నిదర్శనం. ఫిబ్రవరిలో ఇక్కడ దీపం కనెక్షన్లను కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు పక్కదారి పట్టించాయి. ఒక ఏజెన్సీ సుమారు 800 దీపం కనెక్షన్లను బోగస్ డ్వాక్రా మహిళలకు కట్టబెట్టి సుమారు రూ.2.5 కోట్లు దండుకుంది. అయినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ఇలాంటి ఘటనలు అడపాదడపా వెలుగుచూస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఏజెన్సీలు చెలరేగిపోతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ను.. ఆటోలు, కార్లు (ఎల్‌పీజీతో నడిచేవి) తదితర వాహనాలకు అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. వంట సిలిండర్ల నుంచి చిన్న (మినీ) సిలిండర్లలోకి గ్యాస్ నింపి డిమాండ్‌ను బట్టి దాన్ని రూ.500, ఆపై ధరలకు అమ్ముకుంటున్నారు. ఇలా వంటగ్యాస్ అనేక మార్గాల్లో పక్కదారి పడుతుండటంతో సకాలంలో సిలిండర్లు అందక వినియోగదారులు అల్లాడిపోతున్నారు.

జిల్లాల వెతలు ఇవీ..

జిల్లాల్లో గ్యాస్ సరఫరా తీరుతెన్నులపై ‘సాక్షి’ తాజాగా జరిపిన పరిశీలనల్లో ఏజెన్సీల ఆగడాలు, బ్లాక్ బాగోతాలు వెలుగుచూశాయి. చాలా జిల్లాల్లో గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత 15-20 రోజులకుగానీ సిలిండర్ రావడం లేదు. బ్లాక్‌లో ఒక్కో సిలిండర్ రూ.500 నుంచి రూ.1000 దాకా పలుకుతున్నట్టు తేలింది. అనంతపురం జిల్లాలో నెలరోజుల దాకా వేచిచూడాల్సిన వస్తోంది. బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ రూ.750 దాకా ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో సిలిండర్లు పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నాయి. ఇక్కడ బ్లాక్‌లో ఒక్కో సిలిండర్ రూ.600 నుంచి 1000 వరకు పలుకుతోంది. సింగిల్ సిలిండర్ ఉన్న వారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. బుక్‌చేసిన 35 రోజులకుగానీ హెచ్‌పీ సిలిండర్ రావడం లేదు. అన్ని పట్టణాల్లో టీ బంకులు, హోటళ్లలో ఎక్కువగా గృహావసర సిలిండర్లనే వినియోగిస్తున్నారు. కర్నూలులోనూ ఇదే పరిస్థితి బుక్ చేసిన 25 రోజుల నుంచి 30 రోజులు ఆగాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా విజయవాడలో బుక్ చేశాక సిలిండర్ రావడానికి 16 రోజులదాకా పడుతోంది. డిమాండును బట్టి బ్లాక్‌లో సిలిండర్‌పై రూ.100-150 అధికంగా వసూలు చేస్తున్నారు. శ్రీకాకుళంలో బుక్ చేసిన 20 రోజులు తర్వాత గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్‌లతో పాటు అమలాపురం, పెద్దాపురం, మండపేట, సామర్లకోట తదితర పట్టణాల్లో గ్యాస్ సకాలంలో అందడంలేదు. గుంటూరు జిల్లాలో 20 ఇరవై రోజుల తర్వాత కాని వినియోగదారులకు సిలిండర్లు అందడం లేదు. గుంటూరులోని ప్రముఖ విద్యాసంస్థల హాస్టళ్లలో ప్రభుత్వ సబ్సిడీ సిలిండర్లనే వాడుతున్నారు. ఇటీవల ఓ నర్సింగ్ శిక్షణ సంస్థలో 80కి పైగా గృహవినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో అయితే బుక్ చేసిన తర్వాత 20 రోజుల నుంచి 30 రోజుల వరకు సరఫరా చేయలేమని డీలర్లే చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో గ్యాస్ కోసం ఆన్‌లైన్లో బుక్ చేసుకుంటే కనిష్టంగా 15 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బుక్ చేసిన తర్వాత 15-20 రోజులకు సిలిండర్లు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్త్తంగా సువూరు 100 వరకు అక్రవు రీఫిల్లింగ్ కేంద్రాలున్నాయి.

హైదరాబాద్‌లో గ్యాస్ దందా!

హైదరాబాద్‌లో కొన్ని ఏజెన్సీల కక్కుర్తి కారణంగా వంటగ్యాస్‌కు కృత్రిమ కొరత ఏర్పడుతోంది. వాణిజ్య గ్యాస్ రేటు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి గృహాల నిర్వాహకులు ఏజెన్సీలతో కుమ్మక్కవుతున్నాయి. దీంతో వినియోగదారులకు పడిగాపులు తప్పడం లేదు. గత నెలాఖరులో మూడ్రోజులపాటు పౌరసరఫరాల శాఖ సిబ్బంది నగరంలో దాడులు చేసి 750 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. రాజధానిలో సుమారు 13 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా 12.50 లక్షల సిలిండర్ల అవసరం ఉంటుంది. ఆన్‌లైన్ బుకింగ్ కొందరు డీలర్లకు కాసుల పంట పండిస్తోంది. బుకింగ్ చేయని వారి పేరిట కూడా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. వాటిని బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. నగరంలో ఎల్పీజీతో నడిచే ఆటోలు సైతం వంట గ్యాస్‌తోనే నడుస్తున్నాయి. వీటి సంఖ్య అధికంగా ఉండటంతో.. కొంతమంది ముఠాలుగా ఏర్పడి గ్యాస్ ఏజెన్సీల నుంచి భారీగా సిలిండర్లను ఫిల్లింగ్ కేంద్రాలకు తరలించి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. సైదాబాద్, అమీర్‌పేట, కూకట్‌పల్లి తదితర ప్రాంతాలు ఈ వ్యాపారానికి కేంద్రాలుగా ఉన్నాయి.

చిరు రాజీనామా నోటిఫై చేయరా?

రాష్ట్రపతి ఎన్నికలకంటే ముందుగా రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు తాను సిద్ధమవుతున్న నేపథ్యంలో చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని ఇంకా నోటిఫై చేయకుండా అసెంబ్లీ సచివాలయం జాప్యం చేయడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత నెల 29న చిరంజీవి రాజీనామా చేసినప్పటికీ.. ఇప్పటి వరకు తిరుపతి స్థానం ఖాళీ అయిన విషయాన్ని, ఉప ఎన్నిక నిర్వహించాలనే అంశంపై వివరాలను అసెంబ్లీ సచివాలయం ఇంకా ఎందుకు పంపించలేదంటూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయాన్ని(సీఈవో) కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించింది. దీనిపై సీఈవో కార్యాలయం అసెంబ్లీ సచివాలయ ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నప్పటికీ శుక్రవారం వరకు ఎలాంటి ఫలితం తేలలేదు. ఇప్పటికే ఖాళీ అయిన 17 అసెంబ్లీ స్థానాలతో పాటు చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి స్థానానికి కూడా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని.. తిరుపతి ఒక్క స్థానానికి విడిగా ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంటోంది. వెంటనే అసెంబ్లీ సచివాలయంతో మాట్లాడి, తిరుపతి అసెంబ్లీ స్థానం నోటిఫై అయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ సీఈవో కార్యాలయాన్ని కోరింది. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తూ అసెంబ్లీలో రైతుల పక్షాన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి అనర్హులైన 17 ఎమ్మెల్యేల స్థానాలు ఖాళీ అయిన విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్‌కు పంపడంలో అసెంబ్లీ సచివాలయం తీవ్ర జాప్యం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం రెండుసార్లు ఆరా తీసిన తర్వాతే వాటి వివరాలను అసెంబ్లీ సచివాలయం పంపించింది. సాధారణంగా ఎవరి రాజీనామానైనా అమోదించిన వెంటనే ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపిస్తారని ఎన్నికల కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోందని అంటున్నాయి. 

మూడేళ్లయితే బదిలీలు..
ఇదిలా ఉండగా..ఉప ఎన్నికలు జరగనున్న స్థానాల్లో మూడేళ్ల నుంచి ఒకే చోట పనిచేస్తున్న వారితోపాటు సొంత జిల్లాలకు చెందిన అధికారులు, ఉద్యోగులను మరో చోటికి బదిలీ చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న ఇలాంటి అధికారులు, ఉద్యోగుల(రెవెన్యూ, పోలీసు) వివరాలను వెంటనే తెలియజేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. వాటి ఆధారంగా బదిలీలు చేపట్టాలని స్పష్టం చేశారు.

బాబు నింపింది పెద్దల బొజ్జలే! తొమ్మిదేళ్ల ‘సీఎం గిరీ’పై సెస్ విశ్లేషణ

అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని చంద్రబాబు కుదేలు చేశారు
కుండబద్దలు కొట్టిన సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ నివేదిక
బాబు హయాంలోనే భారీగా భూ సంతర్పణలు
పెట్టుబడిదారులకు ఆగమేఘాలపై అనుమతులు, ఉచిత లెసైన్సులు
ఇంత చేసినా.. కల్పించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మాత్రం శూన్యం
ఎన్టీఆర్‌ను కూలదోయడాన్ని టీడీపీ అంతఃకలహంగా తీసేయలేం
పెట్టుబడిదారీ వర్గ ఆకాంక్షల దన్నుతోనే బాబు గద్దెనెక్కారు
ఇందులో రామోజీరావు, ‘ఈనాడు’ పాత్ర చాలా కీలకమైనది
సీఎం కాగానే పెట్టుబడిదారులను బాబు నెత్తిన పెట్టుకున్నారు
ఆయన విధానాలతో పూర్తిగా ప్రైవేటు వ్యక్తులే లాభపడ్డారు
{పపంచబ్యాంకు పోస్టర్‌బోయ్‌గా దాని విధానాలను రాష్ట్రంపై రుద్దారు
ఐటీ జపంతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్లక్ష్యం చేశారు
పేదల పొలికేక దెబ్బకు 2004లో దారుణంగా ఓడారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు మాత్రమే ఆస్తులు పెంచుకుని లాభపడ్డారని సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) కుండబద్దలు కొట్టింది. ఆయన రూపొందించిన పారిశ్రామిక విధానం అందుకు మాత్రమే దోహదపడిందని తేల్చిచెప్పింది. ‘‘ప్రపంచబ్యాంకు పోస్టర్‌బోయ్‌గా మారి అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని బాబు కుదేలు చేశారు. ఐటీ జపంతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్లక్ష్యం చేశారు. ప్రైవేటు సంస్థలను నెత్తిన పెట్టుకుని ప్రభుత్వ రంగ సంస్థల పుట్టి ముంచారు. ఆయన హయాంలో పేరుకు పెట్టుబడులు కన్పించినా అందుబాటులోకి వచ్చిన ఉపాధి అవకాశాలు మాత్రం శూన్యం’’ అని వివరించింది. ఎన్టీఆర్‌ను కూలదోసి బాబును గద్దెనెక్కించడం వెనక పెట్టుబడిదారీ వర్గం ఆకాంక్షలే పని చేశాయని వెల్లడించింది. ఆ దిశగా అప్పటి టీడీపీ సంక్షోభాన్ని తారస్థాయికి పెంచడంలో రామోజీరావు పూర్తిగా విజయం సాధించారంటూ పూసగుచ్చింది. ఈ విషయంలో ‘ఈనాడు’ పోషించిన పాత్ర అత్యంత కీలకమని వివరించింది. పారిశ్రామికాభివృద్ధి కోసం వివిధ ముఖ్యమంత్రులు చేపట్టిన విధానాలను, సాధించిన ప్రగతిని రాజకీయ, ఆర్థిక కోణాల్లో విశ్లేషిస్తూ రూపొందించిన నివేదికను సెస్ ఇటీవల విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి...

1995లో బాబు సీఎం కావడాన్ని కేవలం టీడీపీలో జరిగిన సాధారణ నాయకత్వ మార్పుగా చూడరాదు. ఎన్టీఆర్ అనుసరించిన ప్రజాకర్షక సంక్షేమ పథకాల అమలుతో తమ వ్యాపారావకాశాలకు గండిపడిందని భావించిన పెట్టుబడిదారీ వర్గం.. టీడీపీలో నెలకొన్న సంక్షోభాన్ని ఒడుపుగా అందిపుచ్చుకుంది. సంక్షోభాన్ని పెంచి పోషించి తారస్థాయికి చేర్చడంలో ‘ఈనాడు’ పోషించిన పాత్ర అత్యంత కీలకం. ప్రజాబలంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను దించేసి.. ఆయన స్థానంలో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడంతో ఈ వర్గం విజయం సాధించింది.

పెట్టుబడిదారీ వర్గం అండతో బాబు అధికారంలోకి రావడంతో.. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడిదారుల అనుకూల రాష్ట్రంగా పేరు తేవడంలోనూ ఈ వర్గం తమదైన పాత్ర పోషించింది. బాబు గద్దెనెక్కగానే సీఎం కార్యాలయం పని చేయాల్సిన తీరునే మార్చేశారు. పెట్టుబడిదారులతో సీఎం నేరుగా ముఖాముఖి మాట్లాడడానికి వేదికగా సీఎంవో మారిపోయింది.

తమవల్ల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో చూపించడానికి ఒక మోడల్ స్టేట్, ఒక రోల్ మోడల్ సీఎం కోసం ప్రపంచబ్యాంకు, డీఎఫ్‌ఐడీ వంటివి వెతుకుతున్న రోజులవి. బాబు పెట్టుబడిదారీ అనుకూల విధానాలు, పారిశ్రామికవేత్తలతో భేటీల కోసం సీఎం హోదాలో ఆయన చూపుతున్న అత్యుత్సాహం ప్రపంచబ్యాంక్ ‘పోస్టర్ బాయ్’కి అతికినట్టు సరిపోయాయి. అలా అంతర్జాతీయ సంస్థల వెదుకులాట ఫలించింది. సంస్కరణవాదిగా పాశ్చాత్య మీడియాలో బాబుకు అత్యంత ప్రచారం లభించడానికి ప్రపంచబ్యాంకే కారణం.

ఎన్టీఆర్, అంతకు ముందు ముఖ్యమంత్రులు అనుసరించిన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ 1996లో ప్రపంచ బ్యాంకు నివేదిక ఇచ్చింది. ‘ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2 కిలో బియ్యం, మద్య నిషేధం వల్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3 శాతం అదనపు భారం ప్రభుత్వంపై పడింది. దాంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది’ అని బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. సంక్షోభం నుంచి బయటపడటానికి సంస్కరణలే మార్గమని సూచించింది.

ఈ సూచనను బాబు తూ.చ. తప్పకుండా పాటించారు. విధానాలన్నీ సంక్షేమం నుంచి పెట్టుబడిదారుల అనుకూలంగా మారిపోయాయి. కేంద్రంలోనూ అనుకూల ప్రభుత్వాలు ఉండటం బాబుకు కలిసొచ్చింది. 1999 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి రావడంతో టీడీపీలో బాబు తిరుగులేని నేతగా మారిపోయారు. సంస్కరణలకు మరింత పదును పెట్టారు. ఆయన విధానాలు, సంస్కరణలు కేవలం పారిశ్రామిక సంబంధాలకే పరిమితమవకుండా మొత్తం పాలనా వ్యవస్థనే మార్చేస్తున్నాయంటూ మీడియా ఊదరగొట్టింది. ఐటీ ద్వారా స్మార్ట్ (సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్‌పరెంట్) పాలన అందిస్తున్నామంటూ ప్రభుత్వం భారీగా ప్రకటనలు గుప్పించింది.

బాబు హయాంలో ప్రైవేటు సంస్థలకు భారీ సంఖ్యలో పారిశ్రామిక లెసైన్సులిచ్చారు. వాటి సంఖ్యాపరంగా తమిళనాడు తర్వాతి స్థానం రాష్ట్రానిదే. కానీ అదే కాలంలో తమిళనాడులో అందుబాటులోకి వచ్చిన ఉద్యోగ (ఉపాధి) అవకాశాల్లో రాష్ట్రంలో కేవలం పదో వంతే సాధ్యపడింది!

పరిశ్రమలకు అనుమతులు, భూ కేటాయింపు, పన్నుల రద్దు, రాయితీల మంజూరులో పాలనాపరమైన జాప్యం (బ్యూరోక్రటిక్ డిలే) జరగకుండా ఉండేందుకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టారు. పెద్ద సంఖ్యలో పెట్టుబడులు వచ్చినట్టు కనిపించినా అవన్నీ సర్కారు చౌకగా ఇచ్చిన భూములు, ప్రోత్సాహకాలను సంపాదించడానికే పరిమితయ్యాయి. దాంతో బాబు సర్కారు విధానాలు ఉపాధి అవకాశాల కల్పనకు కాకుండా కేవలం కొద్దిమంది వ్యక్తుల ఆస్తుల కల్పనకే దోహదపడ్డాయి. పైగా సర్కారు విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలు మరింతగా బక్కచిక్కిపోయాయి.

అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ’మెక్ కిన్సే’ రూపొందించిన నివేదికను విజన్ 2020 పేరిట విధానపత్రంగా బాబు తీసుకొచ్చారు. తన హయాంలో వచ్చిన ‘మార్పు’ను ప్రజలకు చేరవేయడానికి మీడియాను ఆయన విస్తృతంగా వినియోగించుకున్నారు. సీఎం, అధికారులు పారిశ్రామిక సంఘాల, సామాజిక భేటీల్లో పాల్గొనడం, సీఐఐ, ఫిక్కీ వంటివి ఏర్పాటు చేసే సదస్సుల్లో మాట్లాడటం వంటివి ప్రధాన వార్తలుగా మీడియాలో వచ్చేవి.

ఏపీఐఐసీకి మున్నెన్నడూ లేనంత అధిక ప్రాధాన్యత కల్పించారు. భూ సేకరణ, ప్రాజెక్టు నివేదికలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర బాధ్యతలప్పగించి దాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. అందులో కార్పొరేట్ అనుకూల అధికారులను నియమించారు. వివిధ ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు చౌకగా భూములు కట్టబెట్టి పన్నుల రద్దుతో పాటు పలు ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పిస్తూ భారీగా అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కానీ పరిశ్రమల ఏర్పాటులో ఈ ఒప్పందాలన్నీ విఫలయమ్యాయి.

సైబారాబాద్‌ను రాష్ట్ర ముఖచిత్రంగా చూపుతూ ఐటీకి అత్యంత ప్రాధాన్యతనివ్వడం వెనక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉత్పాదక రంగం, ఆధునిక పారిశ్రామిక రంగాలను నిర్లక్ష్యం చేసిన వైనం దాగుంది. ఐటీ వల్ల అద్భుతాలు జరుగుతాయంటూ బాబు సర్కారు చేసిన ప్రచారం వాస్తవాలను విస్మరించింది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీ రంగం విస్తృతి సరిపోలేదు. సర్కారు నిర్లక్ష్యం ఫలితంగా వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది కుటుంబాలు కష్టాల కొలిమిలో కాలిపోతూ పెట్టిన పొలికేక ధాటికి 2004 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. కరువుకు సర్కారు నిర్లక్ష్యం తోడై వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతింది. దాంతో వ్యవసాయోత్పత్తులపై ఆధారపడ్డ పారిశ్రామిక రంగంపై కోలుకోలేని దెబ్బ పడింది.

2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు వ్యవసాయానికి తొలి ప్రాధాన్యమిచ్చింది. సాగునీటి రంగానికి భారీగా నిధులు కేటాయించింది. అయితే వ్యవసాయ, సాగునీటి రంగాలకు ప్రాధాన్యమివ్వడమంటే పారిశ్రామికరంగాన్ని నిర్లక్ష్యం చేయడం కాదని కూడా వైఎస్ సర్కారు నిరూపించింది. పెట్టుబడులను ఆకర్షించడంలో గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తర్వాత నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఉపాధి అవకాశాలూ గణనీయంగా పెరిగాయి.

వైఎస్ సర్కారు చొరవ వల్ల 57 నోటిఫైడ్, 99 సూత్రప్రాయ అనుమతులొచ్చిన సెజ్‌లు రాష్ట్రానికి వచ్చాయి. ఏపీఐఐసీ 30 సెజ్‌లను అభివృద్ధి చేసింది. మొత్తం సెజ్‌లలో ఐటీ, ఐటీ ఆధారిత సేవలకు సంబంధించినవి 95. అయితే ఈ ఐటీ సెజ్‌లలో కొత్త కంపెనీలు పెద్దగా రాలేదు. ఉన్న కంపెనీలే సెజ్‌లలో చేరి, పన్ను రాయితీలను సంపాదించాయి. అధునాతన పారిశ్రామికీకరణను వేగవంతం చేయడంలో సెజ్‌ల పాత్ర అనుమానాస్పద మే. భూ కేటాయింపులు పొందిన కొన్ని కంపెనీలు స్థిరాస్తి వ్యాపారం చేశాయనే ఆరోపణలున్నాయి.

రాజకీయ రంగంలో సమూలమైన మార్పులకు నాంది

ఈ ఫలితాల ఉత్తేజంతో 2014లో అఖండ విజయం సాధిస్తాం
మాకు అండగా ప్రభుత్వముందని పేదలు
గుండెలపై చెయ్యేసి చెప్పుకునేలా పాలిస్తాం
ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఇంగ్లిష్ మీడియం కూడా పెడతాం
తద్వారా బీఈడీ వారికి ఉద్యోగాలు కల్పిస్తాం

రామచంద్రపురం(తూర్పుగోదావరి), న్యూస్‌లైన్: త్వరలో జరగబోయే ఉప ఎన్నికలు రాజకీయ రంగంలో సమూలమైన మార్పులకు నాంది పలుకుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఆ ఫలితాలిచ్చే ఉత్తేజంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. పేదల పక్షాన నిలిచి అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసి ఎమ్మెల్యే పదవిని వదులుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ నియోజకవర్గం రామచంద్రపురంలో(తూర్పుగోదావరి జిల్లా) జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రెండో రోజు రోడ్‌షో నిర్వహించారు. కూనమిల్లిపాడు, బాలాంత్రం, మసకపల్లిలలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి పలు ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పర్యటనకు ముందు జగన్ మండల కేంద్రం కె.గంగవరంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఈడీ అభ్యర్థులు తమ సమస్యలను జగన్‌కు మొరపెట్టుకోగా రానున్న సువర్ణయుగంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. జగన్ ప్ర సంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ప్రభుత్వమంటే ప్రజలకు అండగా ఉండాలి: రాబోయే ఉప ఎన్నికల్లో సాధించబోయే విజయాలు పార్టీకి 2014 ఎన్నికలకు బూస్ట్, టానిక్‌లా పనిచేయాలి. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి రైతులకు, పేదలకు అండగా నిలిచిన 17 మంది ఎమ్మెల్యేలకు శాల్యూట్ చేస్తున్నా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఫలానా నేత తమ నాయకుడని ప్రతీ కార్యకర్త చెప్పుకునేలా, ఫలానా పార్టీ తమ పార్టీ అని గర్వపడేలా ఉండాలి. త్వరలోనే రాష్ట్రంలో సువర్ణయుగం వస్తుంది. అందులో పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాలు తమకు అండగా ప్రభుత్వం ఉందని గుండెలపై చెయ్యేసి చెప్పుకునేలా పాలన ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశపెడతాం. తద్వారా బీఈడీ వారికి ఉద్యోగాలు కల్పిస్తాం. అంతేకాదు, కూలి పనులు చేసుకునే తల్లులు తమ పిల్లలను బడికి పంపిస్తే ఒక్కో చిన్నారి పేరు మీద రూ.500 చొప్పున తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో వేస్తాం. ప్రతి విద్యార్థీ ఇంజనీరింగ్ పూర్తిచేసే బాధ్యతను ప్రభుత్వమే భరించే విధానాన్ని తీసుకొస్తాం. వృద్ధులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను రూ.700కు పెంచుతాం.

పరిష్కారం ప్రజలే ఆలోచించాలి: రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేయడం కన్నా ఉరి వేసుకోవడం మేలనుకునే పరిస్థితినిప్రభుత్వం తీసుకొచ్చింది. ఉపాధి లేక వలసలు పెరిగిపోతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. వీటన్నింటికీ పరిష్కారం ప్రజలే ఆలోచించాలి.

బోస్ ఓటమికి బాబు, కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు

ఎంపీ, ఎమ్మెల్యే పదవులను వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అందులోనూ పేదోడి కోసమో, రైతుల కోసమో ఆ పని చేయాలంటే మరీమరీ బాధపడతారు. అధికార పక్షంతో తలపడడం ఆషామాషీ కాదు. ఎక్కడికక్కడ మంత్రులు మోహరిస్తారు. మూటలకొద్దీ నోట్ల కట్టలు కుమ్మరిస్తారు. చెప్పుచేతల్లో లేనివారిని, నచ్చనివారిని పోలీసు కేసుల్లో ఇరికించి నానా ఇబ్బందులకు గురిచేస్తారు. ఆప్యాయత, అనురాగాలను వేలం వేసి కొనడానికి కూడా వెనుకాడరు. ఇవన్నీ ఉంటాయని తెలిసినా నిజాయతీగా నిలబడడం కోసం పదవీత్యాగం చేసిన ఘనత బోస్ అన్నదే(పిల్లి సుభాష్ చంద్రబోస్). వచ్చే ఉప ఎన్నికల్లో బోస్‌ను ఓడించడానికి చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలు ఏ రెండు పార్టీల మధ్యో, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యో కాదు.. ఆ ఎన్నికల్లో రైతులు, పేదలు ఓ వైపు ఉంటే, రాజకీయాల్లోని కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉంటాయి. ఈ రెండింటికి మధ్యే పోటీ. ప్రజల ఓటుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగించాలి.

వైఎస్సార్ సీపీలోకి ఎమ్మెల్యే ‘రౌతు’ సోదరుడు

రాజమండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు సోదరుడు, వ్యాపారవేత్త రౌతు వెంకటేశ్వరరావు శుక్రవారం జగన్‌మోన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కె.గంగవరంలో జగన్‌ను కలిసిన రౌతు పార్టీ విధానాలు, సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రామచంద్రపురం నియోజకవర్గంలో జగన్ మూడవ రోజు పర్యటన షెడ్యూల్

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మూ డవరోజైన శనివారం జరిపే పర్యటన వివరాలను పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ త లశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. 

శుక్రవారం రాత్రి హసన్‌బాదలోని మాజీ మంత్రి, పార్టీ సీఈసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఇంట బస చేసిన జగన్ శనివారం ఉదయం కందులపాలెం నుంచి పర్యటన ప్రారంభిస్తారని తెలిపారు.

* శనివారం ఉదయం కందులపాలెంలో వైఎస్‌ఆర్ విగ్రహం ఆవిష్కరణ
* అనంతరం భీమక్రోసుపాలెంలో మహానేత విగ్రహావిష్కరణ
* వట్రపూడి, అద్దంపల్లి, యర్రపోతవరంల మీదుగా వే గాయమ్మపేట, ద్రాక్షారామ, అద్దంపల్లిలలో పర్యటన
* అనంతరం వెల్లలో వైఎస్‌ఆర్ విగ్రహావిష్కరణ, ప్రజలనుద్దేశించి ప్రసంగం
* అనంతరం వెల్ల వంతెన మీదుగా రామచంద్రపురం చేరిక. రాజగోపాల్ సెంటర్లో జరిగే సభలో ప్రసంగంతో నియోజకవర్గంలో జగన్ పర్యటన ముగుస్తుంది.

Popular Posts

Topics :