02 June 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఉపఎన్నికలు నిర్వహించాలి: భూమన

Written By news on Saturday, June 8, 2013 | 6/08/2013

రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు పరాకాష్టకు చేరాయని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. టీడీపీతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఎమ్మెల్యేలపై వేటు వేశారని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికలు జరగవనే కాంగ్రెస్‌, టీడీపీలు ధీమా ఉన్నాయన్నారు. 

రెండు నెలల క్రితం సస్పెండ్ చేసి వుంటే ఎన్నికలు జరిగేవని, అప్పడు కాంగ్రెస్‌-టీడీపీలకు డిపాజిట్లు గల్లంతయ్యేవని చెప్పారు. పథకం ప్రకారమే అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందు సస్పెండ్ చేశారని ఆరోపించారు. ధైర్యముంటే ఉప ఎన్నికలు నిర్వహించాలని భూమన సవాల్ విసిరారు.

Maro Prajaprasthanam: Sharmila's Speech in Anaparthi, EGDT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రస్థానం పాదయాత్ర 173వ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పొలమూరుపాకలు వద్ద ముగిసింది. ఈరోజు షర్మిల 13.1 కిలోమీటర్ల మేర నడిచారు. ముక్కినాడ, పీరా రామచంద్రపురం, దుప్పలపూడి, ఇందిరానగర్, అనపర్తి మీదుగా పాదయాత్ర సాగింది.


టీడీపీ ఆదేశానుసారమే ఆలస్యంగా ఎమ్మెల్యేలపై వేటు

ఉపఎన్నికలను తప్పించుకునేందుకే కాంగ్రెస్‌ అనర్హత డ్రామా ఆడిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ ఆదేశానుసారమే ఆలస్యంగా ఎమ్మెల్యేలపై వేటు వేశారని అన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఆ స్థానాల్లో ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. టీడీపీ, కాంగ్రెస్‌ల కుట్రను ఎన్నికల సంఘం గుర్తించాలని కోరారు.

15 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు

విప్ ధిక్కరించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేలు 15 మందిని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ అనర్హులుగా ప్రకటించారు. వారిలో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా, ఆరుగురు టిడిపి ఎమ్మెల్యేలు. విప్ ధిక్కరించామని, తమను అనర్హులుగా ప్రకటించమని మార్చిలోనే ఈ15 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. అయినా రెండున్నర నెలల పాటు విచారణ సాగింది. ఉప ఎన్నికలు రాకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు కలిసి విచారణ ప్రక్రియను సాగదీశారని భావిస్తున్నారు. 

అనర్హులుగా ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు:
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి - దర్శి
మద్దాల రాజేష్ - చింతలపూడి
ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి -కాకినాడ
గొట్టిపాటి రవి- అద్దంకి
సుజయ కృష్ణ రంగారావు - బొబ్బిలి
పేర్ని నాని - మచిలీపట్నం
ఆళ్ల నాని - ఏలూరు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పుంగనూరు
జోగి రమేష్ - పెడన

అనర్హులుగా ప్రకటించిన టిడిపి ఎమ్మెల్యేలు:
ప్రవీణ్ కుమార్ రెడ్డి - తంబళ్లపల్లి
కొడాలి నాని - గుడివాడ
తానేటి వనిత - గోపాలపురం
అమర్ నాథ్ రెడ్డి - పలమనేరు
వై.బాలనాగిరెడ్డి - మంత్రాలయం
సాయిరాజ్ - ఇచ్చాపురం

మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వేణుగోపాలచారి, రామకోటయ్య, హరీశ్వరరెడ్డిలపై విచారణను వాయిదా వేశారు. గంగుల కమలాకర్ అనర్హత పిటిషన్ శాసనసభాపతి వద్ద పెండింగ్ లో ఉంది.

special edition on 'Ade Jagan'

Sharmila's Padayatra in Rajanagaram Constituency

ఎన్నికలను సవాల్ గా తీసుకోండి:విజయమ్మ

 స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్ గా తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఆమె శనివారం లోటస్ పాండ్ లో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రతి ప్రజా సమస్యపై వైఎస్ఆర్‌సీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయలని విజయమ్మ పార్టీ నేతలకు సూచనలు చేశారు.

ఆంధ్రా ప్రాంత రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా కన్వీనర్లు, పార్లమెంట్ అబ్జర్వర్లు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. రేపు, ఎల్లుండి తెలంగాణ, రాయలసీమ ప్రాంత నేతలతో విజయమ్మ సమీక్ష నిర్వహిస్తారు.

Take local body polls as a challenge, Vijayamma tells partymen

సిబిఐ కి సూటి ప్రశ్నలు

ధర్మాన, సబితా మంత్రులుగా ఉన్న్నప్పుడు Judicial custody అవసరం లేదన్న సిబిఐ ఇప్పుడు మాత్రం కస్టడీ కావాలంటోంది అదీకూడా వాళ్ళు బైట ఉంటె సాక్షాలను తారుమారు చేస్తారని. మరి మంత్రులు గా ఉన్నప్పుడు సాక్షాలను తారుమారు చేసే అవకాసం ఉందా లేకపోతె పదవిలో లేని మాజీలకు అవకాసం ఉందా?

పొతే ఆర్ధిక కేసులలో GO లన్నీ వ్రాత పూర్వకంగా ఉన్నాయి , మంత్రి పదవిలో ఉన్న లేకున్నా మార్చేది ఏమి లేదు.

కాకపోతే అప్పుడు సోనియా నుంచి సంకేతం లేదు, ఇప్పుడు ఉంది. అంటే తేడ!

సోనియా మాజీ కార్యదర్శిపై కేసు మూసేసిన సీబీఐ.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సన్నిహితుడు, ఆమె మాజీ వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జిపై దాఖలైన ఆదాయానికి మించి ఆస్తుల కేసును సీబీఐ మూసేసింది. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనడానికి తమకు తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంది. పలు ఆధారాల కోసం పదేళ్ల కిందట అమెరికాకు విన్నవించామని, వాటిని ఇప్పటివరకు అందించలేదని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. విన్సెంట్ జార్జి 1990 తర్వాత పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించారని, దక్షిణ ఢిల్లీలో విలాసవంతమైన నివాస గృహాలు, వాణిజ్య భవనాలు కొన్నారని, బెంగళూరు, చెన్నై, కేరళలలో పలు ఆస్తులు కూడబెట్టారని, ఢిల్లీ సరిహద్దులో వ్యవసాయ భూమి కొనుగోలు చేశారన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది.


సోర్స్: CV Reddy

ముక్కినాడ నుంచి షర్మిల పాదయాత్ర

వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం 173వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం ఆమె తన పాదయాత్రను ముక్కినాడ నుంచి ప్రారంభించారు. అక్కడ్నుంచి పేరా రాంచంద్రపురం, దొప్పలపూడి, ఇందిరా నగర్‌, అనపర్తి-దేవీ చౌక్‌, పొలమూరు పాకల మీదుగా సాగుతుంది. అనపర్తి-దేవీచౌక్‌లో జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఆమె ఇవాళ మొత్తమ్మీద 13.1 కిలో మీటర్లు నడవనున్నారు.

సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి వచ్చాకే జగన్ కేసు విచారించాలి : తెలంగాణ లోక్‌సత్తా

సీబీఐ, ఈడీలకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాకే వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసు విచారణ జరిపితే మంచిదని తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు కంచర్ల ధర్మారెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. జగన్‌పై పలు అభియోగాలు మోపుతున్న సీబీఐ, ఈడీలకు ప్రస్తుతం స్వయం ప్రతిపత్తి లేదని, ఆ రెండు సంస్థలు అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అవినీతిని తెలంగాణ లోక్‌సత్తా పార్టీ ఎప్పుడూ సమర్థించబోదని.. అయితే ఈ కేసులో అధికార పార్టీ ప్రజాస్వామ్య విలువలను తొంగలో తొక్కుతోందని అభిప్రాయపడ్డారు.

జైల్లో కాదు జనం గుండెల్లో..


‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిని జైల్లో పెట్టామని కాంగ్రెస్, టీడీపీ సంబరపడుతున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డిని కాదు జనాన్ని, జనం కలల్ని జైల్లో పెట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు నిశ్శబ్దంగా తమ ఓటు హక్కుతో ప్రజా వ్యతిరేక పాలకులకు బుద్ధి చెబుతారు. సీబీఐ పెట్టిన కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపుతోనే అని ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ర్టంలో చిన్న పిల్లవాడిని అడిగినా జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఎవరు? ఎందుకు? పెట్టారో చెబుతారు. అరచెయ్యి అడ్డుపెట్టి సూర్యుడ్ని ఆపలేరు.’ ఇవీ శుక్రవారం మదనపల్లెలో నిర్వహించిన చైతన్యపథం సదస్సులో వక్తల అభిప్రాయాలు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే...

మంత్రులకో న్యాయం జగన్‌కో న్యాయమా?

వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో 2004లో క్యాబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకున్న మంత్రులు సచ్చీలురా? ఆనాడు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలకు జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధం ఏమిటి? మంత్రులకు సంబంధం లేకపోతే.. జగన్‌మోహన్‌రెడ్డికి ఏం సంబంధం? ఇదెక్కడి న్యాయం. చంద్రబాబు హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. ఆయనపై విచారణ కోరితే సిబ్బంది లేరని సీబీఐ తప్పుకుంటుంది. అదే జగన్ విషయంలో ఆగమేఘాలమీద విచారణ ప్రారంభించి, లేనిపోని అభియోగాలు మోపి అరెస్టు చేసింది. తండ్రి మాట విని ఆనాడు రాముడు అడవులకు వెళ్లాడు. ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చేందుకు ఓదార్పుయాత్ర చేసి జగన్ ఈనాడు జైలుకు వెళ్లాడు. ప్రజల గుండెల్లో జగన్‌కు రాముడికుండే స్థానం ఉంది. 
- బీఎస్‌ఆర్ ప్రసాద్, ఇంజినీరింగ్ కాలేజ్ లెక్చరర్, సీటీఎం 

పౌర స్వేచ్ఛను హరిస్తున్నారు 

ప్రజాస్వామ్యంలో పౌరుడికి ఉండే స్వేచ్ఛను హరిస్తున్నారు. నేడు యావత్ భారతదేశంలో ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టడం గురించే చర్చిస్తోంది. సోనియా, కిరణ్, చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు ప్రజలు అర్థం చేసుకున్నారు. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను ఓదార్చుతున్న జగన్‌మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న అభిమానాన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. సొంతంగా పార్టీ పెట్టుకున్నారనే అక్కసుతో కుట్రపన్ని సీబీఐ కేసుల్లో ఇరికించింది. పదికోట్ల ఆంధ్రుల శక్తి జగన్‌మోహన్ రెడ్డి. ఆయన త్వరలోనే బయటకు వచ్చి తనను నమ్ముకున్న వారిని కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. సీబీఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారింది. ఇదెంతో కాలం కొనసాగదు. 
- జింకా వెంకటాచలపతి, ట్రేడ్ యూనియన్ నాయకుడు, మదనపల్లె 

బెయిల్ ఇవ్వకపోవడం కక్షసాధింపే

ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరైనా ఏదేని కేసులో అరెస్టయితే 90రోజుల తరువాత బెయిల్‌పై విడుదలయ్యే హక్కు ఉంది. ప్రజల తరుపున నిలబడిన జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రం బెయిలు ఇవ్వకుండా ఏడాదిగా జైల్లోనే ఉంచడం కక్షపూరిత చర్య. దీన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వానికి,ప్రతిపక్ష టీడీపీకి బుద్ధి చెబుతారు. 
- సునీత, గృహిణి, ఆరోగ్యవరం

జగన్ వ్యక్తి కాదు శక్తి 

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక వ్యక్తి కాదు శక్తి. జైలుగోడలు, నిర్భంధాలు జగన్‌ను ఏమీ చేయలేవు. ఆడపడుచుల అన్న జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే జనం మధ్యలోకి వస్తాడు. ఆడవాళ్ల కన్నీళ్లను తుడుస్తాడు. ఎవరెన్ని కేసులు పెట్టినా జగన్‌మోహన్‌రెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరు. సత్యం, ధర్మం ఆయన పక్షాన ఉన్నాయి. చేయని తప్పులకు వేధింపులకు గురిచేసిన వారే ప్రజాగ్రహానికి కొట్టుకుపోతారు. 
- సత్య, గృహిణి, మదనపల్లె 

రైతు పక్షపాతి వైఎస్సార్

చిన్ననాటి నుంచే రైతులు పడ్డ కష్టాలను దివంగత వైఎస్‌ఆర్ ప్రత్యక్షంగా చూశారు. తాను వ్యవసాయం చేయడంతో వాటిలో కష్టనష్టాలు ఆయనకు తెలుసు. కాబట్టే రైతు సంక్షేమం కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉచిత విద్యుత్‌ను ప్రవేశపెట్టారు. రైతుల రుణాలను మాఫీ చేయడంతో ఎంతో మంది కన్నీళ్లను తుడిచారు. వైఎస్‌ఆర్ అకాల మరణంతో ఆయన తనయుడు రైతులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూడలేక కేంద్రంలోని పెద్దలు, రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ఏకమై ఆయనపై కేసులు బనాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నుపోటుదారుడైన చంద్రబాబు ఏకమైనా ప్రజలు వారి కుయుక్తులను అడ్డుకుని వారి కుట్రలను అంతం చేస్తారు. 
- గౌరీ శంకర్‌రెడ్డి, రైతు, ములకలచెరువు 

వైఎస్సార్ లేని లోటు తెలుస్తోంది 

వైఎస్సార్ లేని లోటు క్షణక్షణం తెలుస్తోంది. ఆ లోటును తీర్చడానికి ప్రజల్లోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని కొన్ని రాజకీయ శక్తులు అడ్డుకున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకునేందుకు జైలులో ఉంచినా ఇది తాత్కాలికమే కాని శాశ్వతం కాదు. కాంగ్రెస్, టీడీపీ పెద్దలు నేడు జగన్‌ను జైల్లో పెట్టామని సంబరపడిపోతున్నారు. వాస్తవానికి ఆంధ్ర రాష్ట్రంలోని 9 కోట్ల జనాన్ని జైల్లో పెట్టారన్న సంగతి వారికి తెలియడం లేదు. ఆ సంగతి త్వరలోనే తెలుస్తుంది. ప్రభుత్వమే సీబీఐని శాసిస్తోంది. సీబీఐ వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదు. సర్వోన్నతన్యాయస్థానం దేశ పౌరుడైన జగన్‌మోహన్ రెడ్డి హక్కులను కాపాడుతుందనే నమ్మకం ఉంది.
- విష్ణువ ర్థన్‌రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయుడు, మదనపల్లె 

సచ్చీలుడిగా బయటపడతాడు

జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన కేసులు న్యాయస్థానాల్లో నిలబ డవు. కేవలం కక్ష సాధింపుకోసం పెట్టిన కేసులుగా తెలిసిపోతోంది. ఎవరెన్ని కేసులు పెట్టినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మనిషి. దీన్ని జీర్ణించుకోలేక కుయుక్తులు పన్నారు. న్యా యాన్ని, ధర్మాన్ని ఎంతోకాలం అణచివేయలేరు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. 
- రాజన్న, ఎంపీటీసీ సభ్యుల మాజీ అధ్యక్షుడు, రామసముద్రం 

పేదలకు విద్యా భిక్ష పెట్టారు

ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదవాలని వైఎస్సార్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ను పెట్టారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని జలయజ్ఞాన్ని ప్రవేశపెట్టారు. పాలకులు కుర్చీలకోసం తన్నులాడుకుంటున్నారే కాని వీటిని మరిచిపోయారు. వీటిని అమలు చేయమని అడిగిన జగన్‌మోహన్ రెడ్డిని మాత్రం జైలుపాలు చేశారు. సీబీఐ, ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ చదరంగంలో పావుగా మారింది. వారు చెప్పినట్టు నడుచుకుంటూ జగన్‌మోహన్‌రెడ్డిని వేధిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో చట్టబద్ధంగా పెట్టుబడులు పెట్టినవారిని వేధిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీలను ఆస్తులను జప్తు చేస్తూ వేధిస్తోంది.
- బిల్లూరి గోవింద్‌రెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్, మదనపల్లె 

కాంగ్రెస్, టీడీపీ గల్లంతు ఖాయం

ఆడబిడ్డలను కన్నీళ్లు పెట్టిస్తున్న కాంగ్రెస్, టీడీపీలు వచ్చే ఎన్నికల్లో మట్టికొట్టుకుపోతాయి. సీబీఐది కక్ష సాధింపు చర్య. జగన్ మోహన్‌రెడ్డికి ఓటు వేసే అవకాశం ఎప్పుడొస్తాందా అని యావత్ రాష్ట్ర మహిళలు ఎదురుచూస్తున్నారు. జగన్ తల్లి, భార్య, చెల్లెలు పడుతున్న కష్టం ఊరికే పోదు. అలాగే వారి ఉసురు కాంగ్రెస్,టీడీపీ నాయకులకు తగులుతుంది. మహిళాలోకం ఆగ్రహానికి వీరు కొట్టుకు పోతారు. త్వరలోనే జగన్‌మోహన్‌రెడ్డిని మా ఓటుతో గెలిపించి వైఎస్‌ఆర్ రుణాన్ని తీర్చుకుంటాం. 
- సుగుణ, గృహిణి, బసినికొండకాలనీ, మదనపల్లె 

కార్మిక బాంధవుడు వైఎస్సార్

చేనేత కార్మికులను ఆదుకుంది ఒక్క వైఎస్‌ఆర్ మాత్రమే. అప్పుల ఊబిలో ఇరుక్కున్న నేతన్న ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాన్ని అదుకున్న మహా నుభావుడు రాజశేఖరరెడ్డి ఒక్కరే. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎన్నో పథకాలు పెట్టారు. ఇప్పుడేమో నేతన్నలకు ఎలాంటి భరోసా లేదు. తిరిగి నేతన్నలు కోలుకోవాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిందే. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడానికి నేతన్నలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. 
- వెంకటశివారెడ్డి, నేతకార్మికుడు, నీరుగట్టువారిపల్లె

జగన్ శక్తిని ఆపలేరు

జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదలై ప్రజల్లోకి వస్తారు. సూర్యకాంతిని, జగన్ శక్తిని ఆపడం ఎవరి వల్లా కాదు. ఆరోజు దగ్గర్లోనే ఉంది. ప్రజ లకు అండగా నిల బడే నాయకుడిని విడిపించుకోవడం కోసం ఎదురుచూస్తున్నాం. జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి మాకు చేకూర్చిన లబ్ధి వల్లే సమాజంలో ఆర్థికంగా నిలబడ్డాం. ఆయన పథకాలు కొనసాగాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. వేరొకరి వల్ల రాష్ర్టంలో మహిళలకు భరోసా లేదు. మహిళల కన్నీళ్లు తుడిచిన జగన్‌మోహన్‌రెడ్డిని మహిళలే సీఎం చేస్తారు.
- ఉషారాణి, గృహిణి, దేవళంవీధి, మదనపల్లె

న్యాయం, ధర్మం అనేది లేదనిపిస్తోంది 

రాష్ట్రంలో చట్టం, న్యాయం, ధర్మం అనేది లేదనిపిస్తోంది. అవి కొంతమంది స్వార్థపరుల చుట్టాలుగానే మిగిలిపోయా యి. జనచైతన్య శక్తిని జైల్లో పెట్టామని కాం గ్రెస్, టీడీపీలకు తెలి సేరోజు దగ్గరలోనే ఉంది. ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీల నియతృత్వ పోకడలను తెగనరికే రోజులు వస్తున్నాయి. వైఎస్సార్ తన పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులకు పలు ప్రయోజనాలు చేకూర్చారు. అందుకే ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి వెంట మేమంతా ఉంటాం.
- టీ రామచంద్రారెడ్డి, రిటైర్డ్ ఉద్యోగి, మదనపల్లె 

జగన్ కోసం ఎదురుచూస్తున్నాం

వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేసిన జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజాదరణ పెరగడంతో ఓర్వలేక అక్రమంగా జైలుపాలు చేశారు. ప్రజల్లో జగన్‌మోహన్‌రెడ్డికి మరింత ప్రజాదరణ పెరిగింది. ఎప్పుడెప్పుడు బయటకొస్తారా అని జనం ఎదురుచూస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే రాజన్న రాజ్యం సాధ్యమౌతుందని ప్రజలు ఆశిస్తూ ఎన్నికల కోసం వేచిచూస్తున్నారు. నిశ్శబ్ద విప్లవం ద్వారా జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలని జనం కలలు కంటున్నారు. జనం కలలు నెరవేరే రోజు దగ్గర్లోనే ఉంది. 
- చంద్రశేఖర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు, మదనపల్లె 

తల్లికి, భార్యకు, బిడ్డలకు దూరం చేశారు

జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మనిషి అయి నా సగటు మనిషే. అతనికి తల్లి, భార్య, పిల్లలు ఉన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరిస్తోంది. ఆయన్ను తల్లికి, భార్యకు, పిల్లలకు దూరం చేశారు. దీన్ని ఆ దేవుడు కూడా క్షమించడు. జగన్‌మోహన్‌రెడ్డిని నాలుగుగోడల మధ్య ఉంచినంతమాత్రాన జనం గుండెల్లోంచి, వారి ప్రేమానురాగాల నుంచి ఆయన్ను దూరం చేయలేరు. ఆడబిడ్డలు పడుతున్న బాధ మాకు తెలుసు. మా ఓటు బ్యాంకు ద్వారా ప్రజాస్వామ్యానికి వేసిన సంకెళ్లను తెంచేస్తాం. 
- శాంతమ్మ, రిటైర్డ్ స్టాఫ్‌నర్సు, మదనపల్లె 

జగన్ ఒక ప్రభంజనం

జగన్ జైల్లో కాదు ప్రజ ల గుండెల్లో ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టినంత మాత్రాన ఆయన ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారనడం వాస్తవం కాదు. ఆయనపై సీబీఐ అభియోగాలు మోపాక ఏడాదిన్నర కాలం జనంలో ఉన్నారు. ఆ సమయంలో ఎవరిని ప్రభావితం చేశారో సీబీఐ చెప్పాలి. సీబీఐ స్వతంత్ర సంస్థ అయినా వెన్నెముక లేకుండా వానపాములా వ్యవహరిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి కడిగిన ముత్యంలా ప్రజల ముందుకొస్తారు. 
- గుణతేజ, బీటెక్ విద్యార్థి, మదనపల్లె 

మహిళల అండ జగన్‌కే

రాష్ట్రంలోని మహిళా లోకం అంతా జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంది. ఆయన తండ్రి వైఎస్సార్ మహిళల ఆర్థిక స్వయం సంవృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలు మాకు కొత్త జీవితాన్ని ఇచ్చాయి. ఆయన పథకాలన్నిం టినీ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగిస్తారనే నమ్మకం మాకు ఉంది. అందువల్లే మేము ఆయన్ను సొంత అన్నలా, తమ్ముడిలా, బిడ్డలా అభిమానిస్తున్నాము. వైఎస్‌ఆర్ మరణం తరువాత ఆయన తండ్రి లేని బిడ్డలను పలకరించేందుకు వచ్చాడు. కుటుంబ పెద్దలు మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలిచాడు. 
- శైలజ, గృహిణి, న్యూఈస్ట్‌పేట

వైఎస్ కుటుంబానికి అండగా ఉంటాం

=వైఎస్ కుటుంబానికి అండగా ఉంటాం

=జగన్‌తోనే రైతులకు, మహిళలకు భరోసా

=కాంగ్రెస్, టీడీపీలకు ఓటుతో జవాబు చెబుతాం

=మదనపల్లె చైతన్యపథంలో వక్తలు


‘‘సత్యం, ధర్మం జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం కక్షసాధించేందుకు ఆయనపై కేసులు పెట్టింది. ఏడాదిగా జైల్లో ఉంచి అయిన వారికి దూరం చేసింది. బెయిల్ రాకుండా కాంగ్రెస్, టీడీపీ అడ్డుపడు తున్నాయి.’’ ఇదీ ‘సాక్షి’ చైతన్యపథంలో పాల్గొన్న జనం మనోగతం.

మదనపల్లె, న్యూస్‌లైన్: అధికార పదవులు అనుభవించని జగన్ మోహన్‌రెడ్డి అవినీతికి ఎలా పాల్పడుతారో కాం గ్రెస్, టీడీపీ, సీబీఐ పెద్దలకే తెలియాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం మదనపల్లెలోxసాక్షిరూ. ఆధ్వర్యంలో చైతన్యపథం సదస్సు నిర్వహించారు. సదస్సుకు వ్యాఖ్యాతగా నరసింహారావు వ్యవహరించారు. సదస్సులో వివిధ వర్గాలకు చెం దిన మేధావులు, న్యాయనిపుణులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. సీబీఐ జగన్‌మోహన్‌రెడ్డిపై పలు కేసులు పెట్టి ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క చార్జిషీటు దాఖలు చేస్తామనడం న్యాయబద్ధం కాదని పలువురు అభిప్రాయపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసి ఏడాది కావొస్తున్పప్పటికీ బెయిల్ ఇవ్వకపోవడం ఆయనకు రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయడమేనని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 

భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులను కల్పించిందని, జగన్‌మోహన్ రెడ్డి కేసు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా కొనసాగుతోందని వారు అన్నారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా కొనసాగడం లేదనేందుకు పలు ఉదాహరణలున్నాయన్నారు. విచారణ పేరుతో జగన్‌మోహన్‌రెడ్డిని ఏడాదిగా జైల్లో ఉంచారని, ఆయనపై పెట్టిన కేసులు వీగిపోతే ఈ రిమాండ్ కాలాన్ని సీబీఐ ఆయనకు ఏ విధంగా తిరిగి ఇస్తుందని వారు ప్రశ్నించారు. జగన్‌మోహన్ రెడ్డిని ఏడాది పైబడి జైలులో ఉంచి బిడ్డలకు తండ్రిని, తల్లికి బిడ్డను, భార్యకు భర్తను దూరం చేశారని పలువురు మహిళలు కన్నీరుమున్నీరయ్యారు. కనీసం మానవత్వం, దయాదాక్షిణ్యాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడాన్ని మానవతావాదులంతా గర్హించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతన్నలకు ఇచ్చిన భరోసానే జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చారని దీంతో ఆయనలో వైఎస్‌ను ప్రజలు చూసుకుంటున్నారన్నారు.

జగన్‌మోహన్ రెడ్డిని ప్రజలకు దూరం చేసిన అధికార, ప్రతిపక్ష పార్టీలకు పుట్టగతులుండవని పలువురు మహిళలు శాపనార్థాలు పెట్టారు. ప్రజానాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కుట్రలతో జైలులో బంధించినా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలకు ఓటుతో బుద్ధి చెబుతామని సభలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు హెచ్చరించారు. ప్రజలంతా వైఎస్ కుటుంబానికి అండగా ఉన్నారంటూ వారిని ప్రజల నుంచి దూరం చేయడం ఏదుష్ట శక్తి వల్లా కాదని స్పష్టం చేశారు. చర్చావేదికలో వివిధ వర్గాలకు చెందిన యహసానుల్లా, శివారెడ్డి, యమలా సుదర్శనం, అమీన్‌పీర్, జేడీ ప్రేమ, ఎర్రయ్య, గోవిందరెడ్డి, గౌరీశంకర్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, చంద్రశేఖర్, సునిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

ఇంత దారుణమా?


* చంచల్‌గూడ జైలు, నాంపల్లి కోర్టు వద్ద జగన్ అభిమానులపై లాఠీచార్జి
* చంచల్‌గూడ జైలు, సీబీఐ కోర్టు వద్ద అభిమానులకు అడ్డంకులు
* విజయమ్మ, భారతి సహా కుటుంబ సభ్యులనూ అడ్డుకున్న పోలీసులు
* ఖాకీ జులుంపై అభిమానుల నిరసన

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరైన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఆయన్ను చూడ్డానికి వచ్చిన అభిమానులను అడుగడుగునా అడ్డుకుంటూ, లాఠీలు ఝళిపిస్తూ పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు. చంచల్‌గూడ జైలు వద్ద, నాంపల్లి కోర్టు వద్ద ప్రత్యేకంగా భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి అభిమానులను అడ్డుకున్నారు. ‘‘జగనన్నను కళ్లారా చూసి ఆరు నెలలైంది.. ఒక్కసారి చూడనీయన్నా’’ అంటూ కొందరు అభిమానులు ఎంత మొరపెట్టుకున్నా పోలీసు గుండె కరగలేదు. పైగా చంచల్‌గూడ జైలు వద్ద అభిమానులపై స్వల్ప లాఠీచార్జి చేశారు.

నాంపల్లి కోర్టు వద్ద లాఠీలతో నెట్టివేశారు. జగన్ కుటుంబీకులను సైతం ఆయన దరికి రానివ్వకుండా పోలీసులు తమ కర్కశత్వాన్ని చాటుకున్నారని అభిమానులు మండిపడ్డారు. నాంపల్లి కోర్టుకు రెండు వైపుల నుంచి వెళ్లే మార్గాలను బారికేడ్‌లతో మూసివేయడంతో ఆ వైపుగా వెళ్లే వాహనదారులు, కోర్టులో వివిధ కేసుల నిమిత్తం హాజరయ్యే వారు కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. సుమారు ఆరు నెలల తరువాత వైఎస్ జగన్ జైలు బయటకు వస్తున్నారనే విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉదయం నుంచే జైలు వద్దకు చేరుకున్నారు. అయితే వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యురాలు విజయారెడ్డితోపాటు కొందరు కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు.

చెదరని చిరునవ్వుతో జగన్..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డిని పోలీసులు వేర్వేరు వాహనాల్లో నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు తరలించారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఉదయం 9.55 గంటలకు చంచల్‌గూడ జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. లేత గులాబీ రంగు హాఫ్ హ్యాండ్స్ షర్ట్.. గచ్చకాయ రంగు ప్యాంటు ధరించి ఉన్న ఆయన చెదరని చిరునవ్వుతో కనిపించారు. అక్కడ వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ఆయన కోసం సిద్ధంగా ఉన్న వాహనంలో ఎక్కారు. అప్పటికే ఆ బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని బాంబ్‌స్క్వాడ్ బృందం తనిఖీలు చేసింది. వెనకాముందూ పోలీసు వాహనాల భద్రతతో ఆయన్ను నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చారు. కాగా డబీర్‌పురా వైపు నుంచి వస్తున్న అభిమానులను పోలీసులు అక్కడే అడ్డుకుని వెనక్కు పంపించివేశారు. జగన్‌మోహన్‌రెడ్డి వాహనం నాంపల్లికి వెళ్లే క్రమంలో చంచల్‌గూడ చౌరస్తా వద్ద పెద్ద సంఖ్యలో వేచి ఉన్న కార్యకర్తలు ఒక్కపెట్టున నినాదాలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ముందుకు కదిలారు. దీంతో పోలీసులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జి చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లాఠీచార్జి జరుగుతున్నా కార్యకర్తలు జై జగన్ అనే నినాదాలు ఆపలేదు. దీనిపై వైఎస్‌ఆర్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా సమన్వయకర్త జనార్దన్‌రెడ్డి తదితరులు నిరసన వ్యక్తం చేశారు.

కుటుంబీకులనూ అడ్డుకున్న పోలీసులు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైఎస్ భారతితోపాటు జగన్ కుటుంబ సభ్యులను కూడా నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కోర్టుకు ఫర్లాంగు దూరం నుంచే బారికేడ్లు ఏర్పాటుచేసి ఉండటంతో విజయమ్మ, భారతితోపాటు జగన్ కుటుంబ సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి.. నాంపల్లి కోర్టు ఆవరణ వరకూ నడిచేవచ్చారు. కోర్టు ఆవరణలోకి వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారంతా తమ కుటుంబ సభ్యులేనని, కోర్టు ఆవరణలోకి వెళ్లేందుకు అనుమతించాలని విజయమ్మ, భారతి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు వినలేదు. దీనిపై విజయమ్మ, భారతి ఆవేదన వ్యక్తంచేశారు. కోర్టులో విచారణ పూర్తయిన అనంతరం విజయమ్మ, భారతి బయటకు వెళ్లే క్రమంలో వారి వాహనాన్ని కార్యకర్తలు వెంబడిస్తూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే జగన్‌మోహన్‌రెడ్డి వాహనం కోర్టు ఆవరణ నుంచి బయల్దేరగానే ఆయనను చూసేందుకు భారీ ఎత్తున కార్యకర్తలు ఎగబడ్డారు. దీంతో కోర్టు ఆవరణ నుంచి మెయిన్ రోడ్డులోకి వాహనం వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. కార్యకర్తలు మాత్రం జై జగన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూనే ఉన్నారు.

నల్ల జెండాలతో నిరసనలు..
జైలుకు తరలించే సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెల్లాల రామ్మోహన్ నేతృత్వంలో మహిళా కార్యకర్తలు కోర్టు వద్దకు భారీగా చేరుకుని జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా నినాదాలు చేశారు. నల్ల జెండాలను పట్టుకుని పెద్ద పెట్టున నినాదాలు చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టుచేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని నాంపల్లి కోర్టు నుంచి తరలించే క్రమంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో కొద్ది నిమిషాలు జగన్ వాహనం ముందుకు సాగలేదు. దీంతో పోలీసులు వారందర్నీ లాఠీలతో పక్కకు నెట్టి వాహనాన్ని పంపించివేశారు. జగన్‌మోహన్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యే సమయంలో, కోర్టు నుంచి తిరిగి వెళుతున్న సమయంలోనూ కొందరు న్యాయవాదులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు.

ఇంత దారుణమా?
వైఎస్ భారతి ఆవేదన
నాంపల్లి కోర్టు ఆవరణలోకి వెళ్లేందుకు తమ కుటుంబ సభ్యులను కూడా అనుమతించకపోవడం దారుణమని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతి అన్నారు. కోర్టు వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. కోర్టు ఆవరణలోకి వెళుతున్న తమను అడ్డుకున్న పోలీసుల తీరును ఆమె తప్పుపట్టారు. తమ ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? వేరే ఎక్కడైనా ఉన్నామో అర్థం కావడంలేదని నిరసన వ్యక్తంచేశారు. తమకే ఇలాంటి పరిస్థితి ఉంటే... ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కోర్టుకు హాజరవుతున్న సమయంలో ఇంత పోలీసు నిర్బంధం అవసరమా అని వైఎస్ విజయమ్మ ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. కోర్టు ఆవరణలోకి వెళుతున్న తమ కుటుంబీకులను కూడా పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ కుటుంబీకులను కోర్టు ఆవరణలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై న్యాయవాదులు కూడా నిరసన వ్యక్తంచేశారు.

జగన్ అరెస్టుపై జాతీయ స్థాయిలో చర్చ అవసరం

* రాష్ట్రంలో పౌర హక్కులకు భంగం వాటిల్లుతోంది 
* పోలీస్ ప్రాసిక్యూటర్‌గా మారిన అశోక్ భాన్ 
* సాక్షి చైతన్య పథంలో న్యాయనిపుణుల అభిప్రాయం 

మదనపల్లె, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు, సీబీఐ అనుసరిస్తున్న వైఖరి, కోర్టులో బెయిల్ ఇవ్వక పోవడం వంటి అంశాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని పలువురు మేధావులు, న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. జగన్ అరెస్టు విషయంలో మానవ హక్కుల సంఘం నేతలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ర్టంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం పరితపించిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం క న్నీళ్లు పెట్టిస్తోందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చైతన్యపథం చర్చావేదికలో న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మదనపల్లె బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, న్యాయవాది యహసానుల్లా మాట్లాడుతూ 26 జీవోల జారీలో ప్రమేయం ఉన్న మంత్రులు సచ్ఛీలురయితే, అధికారమే లేని జగన్ అవినీతిపరుడెలా అవుతారని ప్రశ్నించారు. 

ఒక కేసులో ఒకసారి చార్టిషీటు దాఖలు చేస్తే అదే అంతిమ నేరారోపణ పత్రం అవుతుందని స్పష్టం చేశారు. జగన్ కేసు విషయంలో చార్టిషీట్లు వేసుకుంటూ పోతున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. జగన్‌ను ప్రజలకు దూరంగా ఉంచాలనే వ్యూహంలో భాగంగానే చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు యమలా సుదర్శనం మాట్లాడుతూ జగన్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న అశోక్ భాన్ పోలీస్ ప్రాసిక్యూటర్‌గా మారిపోయారన్నారు. రామోజీరావు దళితుల భూములను ఆక్రమించి ఫిలిం సిటీ నిర్మిస్తే, ఆ అక్రమాలపై విచారణ ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. చంద్రబాబు భూ కుంభకోణాలపై ఎందుకు ప్రశ్నించరన్నారు. మదనపల్లె ముస్లిం మతపెద్ద అమీన్ పీర్ మాట్లాడుతూ రోజూ ఐదుసార్లు నమాజ్ చేసే సమయంలో జగన్ విడుదల కోసం అల్లాను ప్రార్థిస్తున్నానన్నారు. నరసింహారావు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ జేడీ ప్రేమ, వ్యాపారి శివారెడ్డి, రైతు నాయకుడు వై.ఎర్రయ్య మాట్లాడారు.

రాక్షస విలువలు రాజ్యమేలుతున్నాయి...

ఓ కవి అన్నారు: ‘‘చట్టాలన్నీ కోర్టులన్నీ... నేతి బీరలో నేయి చందమే... సామాన్యులకవి ఎండమావులే... రాక్షస విలువలు రాజ్యమేలెడి నరకప్రాయపు సంఘంలోన, మనిషికి మనిషికి బంధాలన్నీ మార్కెట్లోని సరుకులాయెనే, గుండెగాయం కెలుకుతున్నా... రాక్షస పీడన నెదిరించాలి. పిశాచ గుణాల ఆనందానికి మారణహోమం జరుగుతున్నది.. నీతి న్యాయం భారమవుతోంది...’’ అని. ఈ చరణాలన్నీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వర్ణించడానికి కరెక్ట్‌గా అమరిపోతాయి. యువనేత జగన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కక్షసాధింపుకు నిదర్శనగా నిలుస్తాయి. కుమ్మక్కు రాజకీయాల సిగ్గులేనితనానికి ఆనవాళ్లుగా నిలుస్తాయి. న్యాయం గొంతు నొక్కే సీబీఐ వంటి కేంద్ర కాపలాదారులకీ ఇది వర్తిస్తుంది. కుట్రలకు కుతంత్రాలకు కేంద్రంగా మారిన విశ్వాస ఘాతుకులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. 

ఎవరికి తెలియనివి... జగన్ విషయంలో కేంద్రరాష్ట్రాల కుట్రలు! ఎవరికి తెలియదు తెహల్కా పత్రిక బాబును కుంభకోణాల సూత్రధారిగా ప్రపంచంలోనే అవినీతి నేతగా చూపించినా, ఆయన కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాష్ట ప్రభుత్వాలను కాపాడుతున్నాడని, ప్రతిఫలంగా అవినీతి విషయంలో సీబీఐ విచారించకుండా ప్రభుత్వం నుండి భరోసా పొందాడని. సీబీఐని కాంగ్రెస్ జేబుసంస్థగా అత్యున్నత న్యాయస్థానం కూడా పరిగణించిందని ప్రజలందరికీ తెలిసిన విషయమే. జగన్ విషయంలో చట్టాలన్నీ... కోర్టులన్నీ నేతి బీరలో నేతి చందంగానే మారాయని, మూకుమ్మడి దాడిలో జగన్‌ను బలిపశువును చేస్తున్నారని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

జగన్ విషయంలో కింకర్తవ్యం... వివేకానందుడి హితవుల్లాగే... ‘ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి’ అన్నట్లు, ‘గెలుపు భారమైనా భరించు... ఓటమిని తేలికగా అంగీకరించకు’ అన్నట్లు ఉండాలి. నేటిమాటగా చెప్పాలంటే ‘ఓ పోరాట యోధుడా... యువనేతా... రేపటి విజయం నీదైనప్పుడు నీ ఓరిమే ఆయుధంగా విజయ దుందుభి ఎగురవెయ్. సిగ్గులేని కుమ్మక్కునేతలకు, చేతగాని ప్రభుత్వాలకు... నీ నిశ్శబ్దాన్ని రేపటి మహోద్యమంగా చరిత్ర నిలిపే సాక్షిగా ఎదుగు. న్యాయం కరువైనా, నీ సంకల్పమే పోరాటంగా ఉవ్వెత్తున ఎగిసిపడు. ప్రజాభిమానం నీ వెంటే. కుమ్మక్కు రాజకీయాలు ప్రజాగ్రహంలో కొట్టుకుపోవటం ఖాయం.

- పోలేపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వ్యాపారవేత్త, విరుగంబాక్కం, చెన్నై

ఆరు నెలల తర్వాత తొలిసారి

Photo
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ వి. విజయసాయిరెడ్డిలను పోలీసులు శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చారు. జగన్ కంపెనీల్లో దాల్మియా, భారతి సిమెంట్స్ కంపెనీ పెట్టుబడులపై సీబీఐ సమర్పించిన ఐదో చార్జిషీట్(సీసీ నెంబర్ 12/2013)కు సంబంధించి వీరిని నేరుగా హాజరుపరచాలని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఆదేశించడంతో పోలీసులు ఆ మేరకు వీరిని తీసుకొచ్చారు. న్యాయమూర్తి వీరి హాజరును నమోదు చేసుకున్నారు. చివరిసారిగా జగన్ గత డిసెంబర్ 5న నేరుగా కోర్టుకు హాజరయ్యారు. ఆరు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన జైలు బయటి ప్రపంచాన్ని చూశారు.



వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కె.శ్రీనివా సులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, గుర్నాథరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, వైఎస్సార్ సీపీ డాక్టర్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ శివభరత్ రెడ్డి తదితరులు శుక్రవారం కోర్టుకు వచ్చారు.

జనసంద్రమైన కోర్టు

- జగన్‌ను హత్తుకుని కన్నీరు పెట్టుకున్న విజయమ్మ
- నాన్న ఉంటే ఈ కష్టాలు అనుభవించేవాడివా అంటూ ఆవేదన
- తల్లిని అక్కున చేర్చుకుని మనోధైర్యాన్ని పంచిన జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో అక్కడే ఉన్న తల్లి విజయమ్మ కుమారుణ్ణి చూసి తల్లడిల్లారు. దుఃఖం ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఆప్యాయంగా బిడ్డను ఆలింగనం చేసుకుని దాదాపు 10 నిమిషాలు మౌనంగా నిలబడిపోయారు. నాన్న ఉంటే ఇలా కష్టాలు అనుభవించేవాడివా అంటూ విలపించారు. కన్నీటి పర్యంతమవుతున్న తల్లిని చూసి జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. 

బరువెక్కిన గుండెతో తల్లిని అక్కున చేర్చుకొని ఓదార్చారు. విజయమ్మ కన్నీరు తుడుస్తూ.. గుండెనిబ్బరంగా ఉండాలంటూ మనోధైర్యాన్ని పంచారు. కోర్టు విచారణ అనంతరం న్యాయమూర్తి అనుమతితో దాదాపు 40 నిమిషాలపాటు విజయమ్మ, భార్య భారతి, మామ గంగిరెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో జగన్ మాట్లాడారు. ఉదయం 10.20 నిమిషాలకు కోర్టుకు చేరుకున్న జగన్.. 11.50 నిమిషాలకు తిరిగి జైలుకు వెళ్లిపోయారు. జైలుకు వెళ్తున్న సమయంలో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో కనిపించారు. చెరగని చిరునవ్వుతో ముందుకు కదిలారు. తనను కలిసేందుకు వచ్చిన న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ప్రజలతో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ఇక్కడే ఉన్న దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్‌ను జగన్ పలకరించారు. జగన్ పక్కనే ఉన్న విజయమ్మ కాళ్లకు పునీత్ దాల్మియా నమస్కరించారు.

జనసంద్రమైన కోర్టు
జగన్‌ను కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో కోర్టు ప్రాంగణం జనసంద్రమైంది. సీబీఐ ప్రత్యేక కోర్టు హాల్ న్యాయవాదులు, ఇతర కేసులకు చెందిన కక్షిదారులతో కిక్కిరిసిపోయింది. కోర్టు ప్రాంగణమైతే ఉదయం 10 గంటలకే న్యాయవాదులు, ఇతర కక్షిదారులతో కిక్కిరిసిపోయింది. దీంతో జగన్, సాయిరెడ్డి, సబిత సహా ఇతర నిందితులెవరూ న్యాయమూర్తి ముందుకు వెళ్లలేకపోయారు. దీన్ని గమనించిన న్యాయమూర్తి.. ఈ కేసుతో సంబంధం లేని వారంతా బయటకు వెళ్లిపోవాలని సూచిస్తూ విచారణను 10 నిమిషాలు వాయిదా వేశారు. ఈ మేరకు కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించాలని స్థానిక ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌కు ఆదేశాలు జారీచేశారు. 

నిందితులు, న్యాయవాదులు మినహా మిగిలిన వారంతా బయటకు వెళ్లిపోవాలని కోర్టు ఆఫీసర్ సత్యనారాయణ పదే పదే విజ్ఞప్తి చేశారు. దీంతో విజయమ్మ, భారతితోపాటు ఇతర కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి బయటకు వెళ్లిపోయారు. కాగా జగన్‌తో కరచాలనం చేసేందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పోటీపడ్డారు. తనకు అందుబాటులో ఉన్న వారందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. కోర్టు నుంచి జగన్‌ను జైలుకు తరలిస్తున్న సమయంలో జై జగన్ నినాదాలతో కోర్టు ప్రాంగణం దద్దరిల్లింది. ఉదయం 9 గంటల నుంచే పోలీసులు కోర్టు వద్ద భారీగా మోహరించారు. ప్రజలెవరూ జగన్‌ను కలవకుండా అన్ని ప్రయత్నాలూ చేశారు. అయినా వారి వ్యూహం ఫలించలేదు.

షర్మిల వెంట వానలోనే నడిచిన జనం

* జోరువానలోనే సాగిన మరో ప్రజాప్రస్థానం
* షర్మిల వెంట వానలోనే నడిచిన జనం
* అడుగడుగునా ఆదరణ.. హారతులు పట్టి ఆశీర్వాదాలు
* ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమంటూ షర్మిల ఉద్వేగం

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అమ్మా... నువ్వు నడుస్తూ ఆ చెయ్యి ఊపుతుంటే మీ నాన్నను చూసినట్టే ఉంది బిడ్డా.. మీ నాన్న ఉన్నన్ని రోజులు వర్షం పిలిస్తే పలికింది. ఆయనతోనే వెళ్లిపోయింది. నువ్వు పాదం పెట్టావు... మబ్బు కమ్ముకొస్తుంది... తొలకరి మొదలైనట్టే బిడ్డా..!’’ 
- వణుకుతున్న స్వరాన్ని సవరించుకుంటూ షర్మిలతో 75 ఏళ్ల వృద్ధురాలు వనజాక్షమ్మ అన్న మాటలివీ!

సాయంత్రం 6.22 అవుతోంది.. తోకాడ గ్రామంలో వర్షం కురుస్తోంది.. ఆ వానలో ఓ చంటిబిడ్డ తల్లి రోడ్డు పక్కన నిలబడి ఉంది. ఎడమ చంకలో బిడ్డ.. కుడిచేతిలో హారతి పల్లెం.. చినుకులకు ఎక్కడ ఆరిపోతుందోనన్న ఆరాటంతో సగం కొంగు హారతికి అడ్డంగా పెట్టింది.. మరో సగం చంటిబిడ్డపై కప్పింది.. షర్మిల వచ్చే వరకు హారతి ఆరనివ్వలేదు. షర్మిల రాగానే హారతి పట్టి, ఆనందంతో ఆశీర్వదించింది!!

ఇందులో మొదటి ఘటన వైఎస్సార్ కుటుంబంపై నమ్మకానికి అద్దం పడితే.. రెండోది ఆ కుటుంబంపై ప్రజలకు ఉన్న అభిమానానికి నిదర్శనంగా నిలిచింది. తూర్పుగోదావరి జిల్లాలో సాగిన మరో ప్రజాప్రస్థానంలో ఈ అపురూప దృశ్యాలు కనిపించాయి. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం రాజానగరం నియోజకవర్గంలో సాగింది. తోకాడ గ్రామంలో మహిళలంతా వర్షంలో తడుస్తూనే షర్మిల కోసం ఎదురు చూశారు. షర్మిల రచ్చబండపై అడుగు పెట్టగానే వాన జోరందుకుంది. కాసేపటికే భారీ వర్షంగా మారింది. అయినా మహిళలందరూ అలాగే కూర్చున్నారు. హోరున కురుస్తున్న వర్షంలో తడుస్తూనే షర్మిల ప్రసంగించారు. ప్రసంగం అనంతరం వర్షంలోనే మూడు కిలోమీటర్లు నడిచారు. గ్రామాల్లో మహిళలు, వృద్ధులు కూడా వానలోనే ఆమెతోపాటు నడిచారు. రచ్చబండలో షర్మిల ఏమన్నారో ఆమె మాటల్లోనే..

మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా..
‘‘అమ్మా... ఇంత భారీ వర్షంలో తడుస్తూ నా కోసం ఎదురు చూస్తున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. నాన్న గారి మీద, జగనన్న మీద ఇంత అభిమానం, ఆప్యాయత, అనురాగం చూపిస్తున్న మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. అమ్మా..! ఇప్పుడున్న ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం. ఈ పాలకులు ప్రజల నుంచి వచ్చిన వాళ్లు కాదు. ఢిల్లీ నుంచి సీల్డు కవర్‌లో వచ్చిన వాళ్లు. వీళ్లకు ప్రజా సమస్యలు అంటే ఏమిటో అర్థం కావు. ఈరోజు రైతులకు మద్దతు ధర లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందటం లేదు, మహిళలకు వడ్డీ లేని రుణాలు లేవు, ఇవాళ ఏ పల్లెకు వెళ్లి ఏ మహిళను పలకరించినా ‘అమ్మా... పూట గడవని పరిస్థితుల్లో మా పిల్లలను బడికి మాన్పించి పనులకు పంపిస్తున్నామమ్మా..’ అని బాధపడుతూ చెప్తున్నారు. 

ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దించేయడానికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెడితే చంద్రబాబు నాయుడు అవిశ్వాసానికి మద్దతివ్వకుండా రెండు చేతులు అడ్డం పెట్టి ఈ ప్రభుత్వాన్ని కాపాడారు. ఈ పన్నుల భారంలో కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి ఎంత పాపం ఉందో చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతే పాపం ఉంది. వీళ్లిద్దరూ కలిసి కుట్రలు చేసి, సీబీఐని కలుపుకొని జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టారు. ఏడాది కాలంగా జైల్లోనే ఉంచారు. అమ్మా..! జగనన్న ఏ తప్పూ చేయలేదు. జైల్లో జగనన్న ధైర్యంగా ఉన్నారు. త్వరలోనే బయటికి వస్తారు, రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయి వైఎస్సార్ సువర్ణయుగంలో అమలైన ప్రతి పథకానికి మళ్లీ జీవం పోస్తారు. అవకాశం వచ్చిన రోజున ఈ కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించాలని మా ప్రార్థన.’’

‘పచ్చ’ మీడియా పిచ్చి వేషాలు

 వైఎస్ కుటుంబంపై తనకున్న అక్కసును, అంతులేని విద్వేషాన్ని ఎల్లో మీడియా మరోసారి బయట పెట్టుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం కోర్టుకు హాజరైన సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ భారతి పోలీసులపై చేయిచేసుకున్నారంటూ యథేచ్ఛగా వికృత ప్రచారానికి తెగబడింది. అక్కడ చోటుచేసుకున్న పరిణామాలను షరామామూలుగా తాను పచ్చ కామెర్ల కళ్లతో చూడటమే గాక, లోకమంతటికీ అలాగే చూపించేందుకు విఫలయత్నం చేసింది. ఆ క్రమంలో కనీసస్థాయి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దిగజారి ప్రవర్తించింది. శుక్రవారం ఉదయం జగన్‌ను కలిసేందుకు వచ్చిన ఆయన మాతృమూర్తి వైఎస్ విజయమ్మను, వైఎస్ భారతిని, కుటుంబీకులను పోలీసులు ఒక పట్టాన కోర్టు ఆవరణలోకి రానివ్వలేదు. దానికి తోడు తమ అభిమాన నేతను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం, లోనికి వెళ్లేందుకు ఒకే ఒక ఇరుకైన గేటు అందుబాటులో ఉండటంతో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. 

దాంతో వైఎస్ కుటుంబమంతా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ క్రమంలో వయో వృద్ధుడైన తన తండ్రి ఈసీ గంగిరెడ్డిని పక్కకు తోసేస్తున్న ఒక పోలీసును వీపుపై తట్టి వైఎస్ భారతి వారించారు. ఆ తర్వాత తనవైపు తిరిగిన పోలీసులతో అదే విషయాన్ని ఆమె వివరంగా చెబుతుండటం కూడా స్పష్టంగా కన్పించింది. కానీ వైఎస్ వ్యతిరేకతను నిలువెల్లా నింపుకున్న ఎల్లో చానళ్లకు మాత్రం ఇదేమీ పట్టలేదు. పోలీసును వైఎస్ భారతి చేత్తో తడుతున్న దృశ్యాన్ని మాత్రమే దొరకబుచ్చుకుని, దానికి చిలువలు పలువలు జోడిస్తూ చెలరేగిపోయాయి. జరిగిందేమిటో తెలుసుకునేందుకు కనీసపాటి ప్రయత్నం కూడా చేయకపోగా, ‘పోలీసులపై చేయిచేసుకున్న భారతి’ అంటూ అడ్డంగా వక్రీకరించి తమ వంకరబుద్ధిని బయట పెట్టుకున్నాయి. అదే విజువల్‌ను పదేపదే ప్రసారం చేసి పైశాచికానందం పొందాయి.

వైఎస్ఆర్ ఫౌండేషన్ కు ఎన్నారై 57 లక్షల విరాళం!

Written By news on Friday, June 7, 2013 | 6/07/2013

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఫౌండేషన్‌కు అమెరికాకు చెందిన ఎన్నారై డా.ప్రేమ్‌సాగర్‌రెడ్డి రూ.57లక్షలను విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్‌ను ఆయన బంధువు పి.సుగుణాకర్‌రెడ్డి శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయమ్మకు అందజేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన పేద ప్రజల కోసం అమలు పరిచిన సంక్షేమ కార్యక్రమాలకు స్పందించి ప్రేమ్‌సాగర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం నిర్వాహణకు గతంలో రూ.25లక్షల విరాళాన్ని అందజేశారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన ఆశయాల్ని నెరవేర్చే దిశగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో కూడా వైఎస్సార్ ఫౌండేషన్ తరఫున ప్రేమ్‌సాగర్ పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయమ్మకు చెక్ అందజేసిన వారిలో సుగుణాకర్‌రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, జి.కరీం, టి.పూర్ణం, శ్రీకాంత్‌లు ఉన్నారు. 

YSRCP Leader Ambati Rambabu press meet at YSRCP office

YSRCP adopts 'winning strategy' in election

Satyam Vadha...Dharmam Chera...Song on YS Jagan

ప్రజాస్వామ్యమా?ఆటవిక సమాజమా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని చూసేందుకు వచ్చిన ప్రజలను నిర్బంధించాల్చిన అవసరమేంటి? అని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. సీబీఐ కంటే పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువైందన్నారు. మనం ఆటవిక సమాజంలో ఉన్నామా? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అని అడిడారు. రాష్ట్రంలో సైనిక పాలన నడుస్తోందా? లేక రాచరిక పాలన నడుస్తోందా? అని ప్రశ్నించారు. 

15వ లోక్‌సభలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఏకైక వ్యక్తి జగన్మోహన రెడ్డి అని తెలిపారు. అలాంటి వ్యక్తిని కలిసేందుకు వస్తే కర్ఫ్యూ వాతావరణం విధించడం సమంజసమేనా అని ఆయన అడిగారు. పోలీసుల నిర్వాకం వెనుక అదృశ్య ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానం వ్యక్తం చేశారు. కొండాసురేఖ సవాల్‌పై చంద్రబాబు ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? అని అడిగారు. చంద్రబాబు కేవలం కుప్పంకే పరిమితమయ్యే రోజు త్వరలోనే ఉందని అంబటి హెచ్చరించారు.

Nampally CBI Court to Chanchalguda jail

YS Jagan reach to Chanchalguda jail

Chanchalguda Jail to Nampally CBI Court

కుటుంబంతో మాట్లాడేందుకు జగన్ కు అనుమతి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుటుంబసభ్యులతో మాట్లాడుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. గంటపాటు ఆయన తన కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చని సూచించింది. దీంతో జగన్ కోర్టు ఆవరణలో తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. 

కాగా అంతకు ముందు వైఎస్ విజయమ్మ ... జగన్ ను చూసి కంటతడి పెట్టారు. కోర్టు హాలులో ఆయనను విజయమ్మ ఆలింగనం చేసుకున్నారు. జగన్ ఈ సందర్భంగా తల్లిను అనునయించారు. మీడియా ప్రతినిధులను కూడా జగన్ పలకరించారు.

Popular Posts

Topics :