28 December 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

నమ్మిన రైతుకు వెన్నుపోటు!

Written By news on Saturday, January 3, 2015 | 1/03/2015


నమ్మిన రైతుకు వెన్నుపోటు!
రైతుల్ని ఎన్ని విధాలా రుణభారం నుండి తప్పించవచ్చన్నది పక్కనబెట్టి, రైతుల్ని ఎన్ని విధాలా రుణమాఫీ పథకం నుండి తప్పించవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. రుణమాఫీతో విముక్తి ప్రసాదించకపోగా, రైతు ప్రపంచంలో కొత్త కల్లోలాన్ని సృష్టించింది. ఏపీ రైతుల్లో చంద్రబాబు మీద ఏ కాస్త అనుమానం వచ్చినా కొత్త ప్రభుత్వం రూపు రేఖలే మారిపోయి ఉండేవి.

రైతు రుణమాఫీ చేసి తీరుతానని గత ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దా నం చేశారు. అది సాధ్యం కాదని తన రాజకీయ ప్రత్యర్ధి జగన్మో హన్‌రెడ్డి అన్నప్పుడు బాబు ఎద్దే వా చేశారు. అసాధ్యాన్ని సాధ్యం చేసే చరిత్ర తమకు ఉన్నదన్నారు.  టీడీపీ ఎన్నికల ప్రణాళికలోను రై తు రుణమాఫీ హామీని ప్రముఖంగా ప్రచురించారు. ఐదు కోట్ల మంది జనాభా గల రాష్ర్టంలో ఉన్న దాదాపు 85 లక్షల మంది రైతులు తమ రుణవిముక్తి ప్రదాత చంద్ర బాబు రూపంలో వచ్చాడని నమ్మారు. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదమూడు జిల్లాల్లో టీడీపీకి పడిన ఓట్లలో అత్యధికం రైతు కుటుంబాల నుండి వచ్చినవే.  

ఈ ఎన్నికల్లో టీడీపీ, వైయస్సార్ సీపీల మధ్య ఓట్ల తేడా వెంట్రుకవాసి మాత్రమే. ఏపీ రైతుల్లో చంద్రబాబు మీద వెంట్రుకవాసి అనుమానం వచ్చినా కొత్త ప్రభుత్వం రూపు రేఖలే మారిపోయి ఉండేవి. వ్యవసాయాన్ని వృత్తిగా కొనసాగించడం వేరు. వ్యవ సాయ భూమిని కలిగి ఉండటం వేరు. వ్యవసాయాన్ని వృత్తిగా సాగించేవాళ్లలో కౌలు రైతులు, వ్యవసాయ కూలీ లు ఉంటారు. వాళ్లిద్దరూ చంద్రబాబు రుణమాఫీ ఖాతా లో లేరు. బాబు ఖాతాలో ఉన్నది వ్యవసాయ భూమిని కలిగి ఉన్న రైతులు మాత్రమే.

తొలి అడుగులోనే వారు వ్యవసాయ జనాభాని సగానికి పైగా నరికేశారు. రైతు రుణాల్లో పంటరుణం, వ్యవసాయరుణం, కుటుంబ రుణం ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయని వ్యవ సాయార్థిక అంశంపై పరిశోధనా వ్యాసం రాసిన చంద్ర బాబుకు మరింత లోతుగా తెలుసు. ఎన్నికల ప్రచారం లోనూ, ఎన్నికల ప్రణాళికలోనూ బాబు రైతు రుణం మాఫీ చేస్తానని చెప్పారే గానీ పంటరుణం మాత్రమే మా ఫీ చేస్తానని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు.  పంట రుణం సాధారణంగా ఎకరాకు 20 - 25  వేల రూపాయల మేర మాత్రమే ఉంటుంది. రెండెకరాల రైతుగా జీవితాన్ని మొదలు పెట్టిన చంద్రబాబుకు పంటరుణం వేల రూపాయల్లోనూ, రైతు రుణం లక్షల రూపాయల్లోనూ ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసు.

ఎన్నికల ముందు రైతు రుణాలన్నీ వ్యవసాయ రుణాలన్న చంద్రబాబు, వారి ప్రచారకర్తలు వాటిని ఇప్పు డు తుంగలో తొక్కారు. ఇప్పుడు పంటరుణాన్ని సహితం పక్కన పెట్టడానికి వాళ్లంతా పడరానిపాట్లు పడుతు న్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనే కొత్త ఆయుధాన్ని కనిపె ట్టింది వీళ్లే. రైతులు పంటరుణం ఎంత తీసుకున్నారు? అనేదాన్ని పక్కనపెట్టి, పంటరుణం  ఎంత తీసుకోవడా నికి అర్హులు? అనేదాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రాతిపదికగా తీసుకుంటుంది. అంటే రైతులకున్న పంటరుణంలో కూ డా వీరు భారీ కోత పెట్టారన్నమాట.

అనేక వ్యవసాయ పరపతి సొసైటీలతో పాటూ కొన్ని బ్యాంకు ల్లో కూడా టైటిల్ డీడ్, పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టుకోకుండానే పంటరుణం ఇవ్వడం అనేది చాలా కాలంగా సాంప్రదాయంగా వస్తోంది. దానికి విరుద్ధంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం డాక్యుమెంట్లు తాకట్టు పెట్టని పంట రుణాల్ని అండర్ ప్రాసెస్‌గా ఆన్‌లైన్లో పెడుతున్నా రు. అలాంటి రుణాలు ఎప్పటికీ మాఫీ కావని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సిహెచ్ కుటుంబరావు తేల్చేశారు. ఆస్తులు, పొలాలు పంచుకున్న తరువాత కూడా అన్నద మ్ములు ఒకే ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉండ టం గ్రామీణ ప్రాంతంలో సాధారణ విషయం. అనేక సందర్భాల్లో అన్నదమ్ముల పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉం టాయి.  అలాంటి అన్నదమ్ములు చెరో కొంత భూమి మీద చెరో కొంత పంటరుణాన్ని తీసుకుని ఉంటే, ఇద్దరి లో ఒక్కరికి మాత్రమే పంటరుణం మాఫీ అవుతుంది. ఒక రేషన్ కార్డుపై ఒకరికే రుణ మాఫీ అనేది కొత్త నిబంధన. అంటే, చంద్రబాబు పంటరుణం పథకం గ్రామీణ ఉమ్మడి కుటుంబాల్లో కొత్త చిచ్చు రగుల్చుతోంది.

రుణమాఫీకి సంబంధిత పత్రాలు పోయిన సంద ర్భాల్లో  వాటి ట్రూ- కాపీల కోసం  బ్యాంకుల, పాలక మండళ్లు, రెవెన్యూ అధికారులను కలవాల్సి ఉంటుంది. వ్యవసాయదారుల్లో  అత్యధికులు నిరక్షరాస్యులు. వయో వృద్ధులు. ఇన్ని కార్యాలయాల చుట్టూ తిరిగి రుణ  మాఫీ పత్రాలని సక్రమంగా సేకరించి, సమర్పించడం అనేది వాళ్లవల్ల అయ్యే పనికాదు. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవ సాయ భూములు ఉండి, ఇతర రాష్ట్రాల్లో ఆధార్ కార్డులు ఉన్న రైతులు రుణమాఫీ పొందడానికి అనర్హులని ప్రణాళి కా సంఘం ప్రకటించింది. ఆరు నెలల క్రితం విడిపోయిన తెలంగాణ రాష్ర్టంలోనే కాదు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఆంధ్రా రైతులు పెద్ద సంఖ్యలో నివాసం ఉంటున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణు డు హైదరాబాద్‌లోని ఆంధ్రా రైతు లకు రుణమాఫీ అం శాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.

వారి ప్రకటన వచ్చిన గంటలోపే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సిహెచ్ కుటుంబరావు ప్రతిస్పందిస్తూ అది అసాధ్యమని తేల్చేశా రు. ఇప్పటికీ హైదరాబాద్‌లోనే నివాసం ఉంటూ, అక్కడే ఆధార్ కార్డు ఓటరు ఐడి కలిగి ఉన్న చంద్రబాబు గారికి పొరుగు రాష్ర్టంలో ఎమ్మెల్యేగా పోటీచేసి, ముఖ్యమంత్రి కావడానికి  కూడా సహకరించిన నిబంధనలు, రైతుల దగ్గ రికి రాగానే అడ్డుకట్టగా ఎలా మారిపోతున్నా యో  మరి. రైతుల్ని ఎన్ని విధా లా రుణభారం నుండి తప్పించవచ్చు అని కాక, రైతుల్ని ఎన్ని విధాలా రుణమాఫీ పథకం నుం డి తప్పించవచ్చు అని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తు న్నది. ఇది విషాదం!

(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు సామాజిక విశ్లేషకులు)

http://www.sakshi.com/news/opinion/back-farmer-believers-199379

పంటలను కాల్చినవారిని అరెస్ట్ చేయరా?


పంటలను కాల్చినవారిని అరెస్ట్ చేయరా?
హైదరాబాద్: రాజధాని భూముల్లో పంటలను దహనం చేసినవారిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై  మంగళగిరి వైఎస్సాఆర్‌సీపీ  ఎమ్మేల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోంద న్నారు.

వైసీపీ వ్యక్తుల పేర్లు చెప్పమని కొంతమందిని నిర్భంధించి చిత్రహింసలు పెడుతున్నారన్నారు. మంగళగిరి రైతులను ఇప్పటికీ తుళ్లూరు పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు.  టీడీపీ మంత్రులు, ఎమ్మేల్యేలు భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే  న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. పేద రైతులకు, రైతు కూళీలకు వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు

అధికారంలో ఉన్నాం... తలచుకుంటే ఏమైనా చేస్తాం


'అధికారంలో ఉన్నాం... తలచుకుంటే ఏమైనా చేస్తాం'
కడప: మా ప్రభుత్వం అధికారంలో ఉంది... మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేస్తానంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్ఆర్ సీపీ నేతలను బెదిరించారు. శనివారం కడపలో జరిగిన జెడ్పీ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఎంపీ సీఎం రమేష్ జెడ్పీ సమావేశానికి ఎలా వస్తారంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమళ్లు ప్రసాద్ రెడ్డి ఉన్నతాధికారులను ప్రశ్నించారు. జడ్పీ సమావేశంలో ఉండటానికి సీఎం రమేష్ అనర్హుడంటూ మినిట్స్ లో రూల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే రూలింగ్ చేయడానికి జెడ్పీ చైర్మన్ కు అధికారం లేదని జిల్లా కలెక్టర్...  సీఎం రమేష్ ను వెనకేసుకు వచ్చారు. దీంతో వైఎస్ఆర్ జడ్పీటీసీ సభ్యులు జెడ్పీ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆ క్రమంలో సీఎం రమేష్ ఆగ్రహంతో ఊగిపోతూ పై విధంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు ఏపీకి... అలాగే ఏపీకి చెందిన పలువురు ఎంపీలు తెలంగాణకు ఎంపికయ్యారు.  సీఎం రమేష్ తెలంగాణకు కేటాయించారు. దీంతో తెలంగాణకు చెందిన ఎంపీ ఆంధ్రప్రదేశ్ జెడ్పీ సమావేశానికి ఎలా హజరవుతారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.

సుధీర్‌రెడ్డి సేవలు మరువలేం


సుధీర్‌రెడ్డి సేవలు మరువలేం
వైఎస్సార్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి
త్వరలోనే పార్టీ అధినేత పరామర్శకు వస్తారని వెల్లడి
నివాళులర్పించిన సజ్జల రామకృష్ణారెడ్డి

 
నయీంనగర్ : రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెంది న వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్ రెడ్డి సేవలు మరువలేనివని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్థానిక రెడ్డి కాలనీలోని సుధీర్‌రెడ్డి ఇంట్లో శుక్రవారం ఆయ న పెద్దకర్మ నిర్వహించారు. పొంగులేటి, పార్టీ అధినేత వై. ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యా రు. సుధీర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుధీర్‌రెడ్డి తల్లిదండ్రులు అరుణాదేవి, ఎల్లారెడ్డిలను, సోదరుడు సుమన్‌రెడ్డిని పరామర్శించారు.

అనంతరం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సుధీర్‌రెడ్డి మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులతో సుధీర్‌రెడ్డి అనుబంధం వెలకట్టలేనిద న్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్న వైఎస్సార్ ఆశయాల సాధన కోసం సుధీర్ కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. త్వరలోనే పార్టీ అధినేత జిల్లాకు వచ్చి సుధీర్‌రెడ్డి కుటుం బాన్ని పరామర్శిస్తారని వెల్లడించారు.

వైఎస్సాఆర్‌సీపీ జిల్లా నాయకులు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నాడెం శాంతికుమార్, మునిగాల విలియమ్స్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ముని గాల కల్యాణ్‌రాజు, ఎ.కిషన్, నాయకులు కాయి త రాజ్‌కుమార్, చల్లా అమరేందర్‌రెడ్డి, నాగపూ రి దయాకర్, బొడ్డు శ్రవణ్, నాగవెల్లి రజనీ కాంత్, రఘు, విజయ్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ మాక్స్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువు మైల రఘోత్తంరెడ్డిని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంతకుముందు పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు మునిగాల విలియమ్స్ ఇంటికి వెళ్లారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతంపై పలువురు నాయకులతో చర్చించారు.

ప్రధాని మోదీని తీసుకొస్తా: ఎంపీ పొంగులేటి


ప్రధాని మోదీని తీసుకొస్తా: ఎంపీ పొంగులేటి
* దత్తత గ్రామం గంగారంలో ఎంపీ పొంగులేటి

సతుపల్లి: దేశంలోనే అత్యంత ఆదర్శ గ్రామంగా గంగారంను తీర్చిదిద్దుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం  జీపీలో శుక్రవారం రాత్రి దత్తత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానిమోదీని గంగారం తీసుకొస్తానన్నారు.

గ్రామంలో తాగునీరు, డ్రెయినేజీలు, రోడ్లు, పచ్చదనం తదితర కార్యక్రమాలపై జిల్లా యం త్రాంగం దృష్టి సారిస్తుందన్నారు. గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు.

రాజధాని నిర్మాణం వెనక బాబు కుట్ర


రాజధాని నిర్మాణం వెనక బాబు కుట్ర
గుంటూరు సిటీ : రాజధాని నిర్మాణం వెనక పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సింగపూర్ సహకారంతో రాజధాని నిర్మించే ముసుగులో అక్కడ ఉన్న తన ఆస్తులను ఇక్కడికి డంప్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పన్నిన పన్నాగమిదని ఆరోపించారు.

గుంటూరు అరండల్‌పేటలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం పోలూరి విలేకరులతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాలంలో సంపాదించిన ఆస్తులన్నీ అప్పట్లోనే సింగపూర్ తరలించారన్నారు. దీనిపై తెహల్కా డాట్ కామ్‌తో సహా పలు జాతీయ పత్రికలు కూడా వార్తా కథనాలు ప్రచురించాయనీ పేర్కొన్నారు.

మళ్లీ అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని ఉపయోగించుకుని ఇప్పుడా ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకు బాబు అనేక కుయుక్తులు పన్నుతున్నారనీ, అందులో రాజధాని నిర్మాణం ఒకటనీ వివరించారు. వీటన్నింటినీ బట్టబయలు చేసేందుకు వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నడుం బిగించిందన్నారు. రాజధాని భూ సేకరణ విషయంలో చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధే ఉంటే ముందుగానే ఆయన హైకోర్టులో దీనిపై కేవియట్ ఎందుకు దాఖలు చేస్తారని వెంకటరెడ్డి ప్రశ్నించారు.

దీని వలన కేసులు ఆగుతాయనుకోవడం భ్రమేనని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ తరుపున న్యాయవాదులు మొత్తం రాజధాని గ్రామాల బాధిత రైతాంగానికి బాసటగా నిలుస్తుందని స్పష్టంచేశారు. వారి కోసం కేసులు ఉచితంగా వాదించి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. దీని కోసం పది మంది సీనియర్ న్యాయవాదులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆ కమిటీ నేతృత్వంలో రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి అమల్లో ఉన్న చట్టాలు, సీఆర్‌డీఏ బిల్లు తదితరాలపైఅవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.

ఎంఎన్సీలకు ఏపీని తాకట్టు పెట్టేస్తారా

Written By news on Friday, January 2, 2015 | 1/02/2015


'ఎంఎన్సీలకు ఏపీని తాకట్టు పెట్టేస్తారా'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో బహుళ జాతీయ సంస్థల (ఎంఎన్సీల) రిటైల్ ఔట్ లెట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి ఇవ్వడం దారుణమని వైఎస్ఆర్ సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఈ అనుమతుల వెనక ఉన్న గుట్టేంటని ప్రశ్నించారు. ఎంఎన్సీలకు ఏపీని తాకట్టుపెట్టడమే మీ లక్ష్యమా అని పద్మ నిలదీశారు.

అనుమతి ఇచ్చినందుకు టీడీపీ ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్లు ముడుపులు అందాయని పద్మ ప్రశ్నించారు. గతంలో ఎఫ్ డీఐలను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడెందుకు మారారని పద్మ విమర్శించారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో మరోలా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. కోట్లాదిమంది చిల్లరవర్తకులు మీకు గుర్తుకు రాలేదా అంటూ పద్మ.. చంద్రబాబును విమర్శించారు.

ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైఎస్సార్ సీపీపై ఆరోపణలు


మంగళగిరి: అసెంబ్లీని మోసం చేసిన చంద్రబాబు ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైఎస్సార్ సీపీపై ఆరోపణలు చేయడం తగదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఆర్‌డీఏ బిల్లులో రూల్స్ లేవని అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి లేవనెత్తితే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బిల్లు పాస్ అయిన తరువాత రూల్స్ చర్చకు వస్తాయని చెప్పి అకస్మాత్తుగా రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు.

తుళ్లూరులో మాట్లాడిన చంద్రబాబు ఒక్కసారి అసెంబ్లీ రికార్డులు తిరగదోడి చూసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ గానీ, తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి గానీ ఏనాడూ రాజధానిని వ్యతిరేకించలేదని, అసెంబ్లీ సాక్షిగా రాజధాని ఎక్కడైనా నిర్మించుకోండని, అయితే ఆ ప్రాంతంలోని రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, పేదల భవిష్యత్తును అర్థం చేసుకుని విధి విధానాలు రూపొందించాలని మాత్రమే కోరామన్నారు.

ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా చేసి ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెబుతున్న చంద్రబాబు నాయుడు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాజధానిని ఇడుపులపాయలో కట్టాలని చూస్తున్నాడని అబద్ధాలు చెప్పడం ప్రపంచంలో ఏ  నాయకుడు ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడన్నారు. ఎంత సేపటికీ భూములు లాక్కొని సింగపూర్‌కు అప్పగించి సింగపూర్‌లో తన ఆస్తులను పెంచుకోవాలనే ఆలోచనే తప్ప స్థానిక ప్రజల మనోభావాలను గుర్తించకపోవడం దారుణమన్నారు.

సీనియర్ నేతగా వుండి ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కృషి చేస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అధికారం ఇచ్చారు కదా అని ప్రజలను తప్పుదోవ పట్టించి ఎల్లకాలం తానే ముఖ్యమంత్రిగా వుంటాననే భ్రమలో చంద్రబాబు ఎవ్వరినీ పరిగణనలోకి తీసుకోకుండా ఒంటెత్తు పోకడలు పోతున్నారన్నారు. తన కేబినెట్‌లోని మంత్రుల అభిప్రాయాలు సైతం తీసుకోకుండా నియంతలా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై పార్టీలోనే గాక ప్రజల్లోనూ అసంతృప్తి నెలకొందని, త్వరలోనే ప్రజలు తిరగబడటం ఖాయమని గుర్తుంచుకోవాలన్నారు.

వైఎస్సార్‌సీపీని, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ కాలయాపన చేయడం మాని ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవహరించి, తన సీనియారిటీని నిరూపించుకోవాలన్నారు. రాజధాని గ్రామాల్లో భూములను సింగపూర్ ప్రభుత్వానికి, తన వందిమాగధులకు అప్పగించి డబ్బు సంపాదనే ధ్యేయంగా పని చేస్తే ఆయా ప్రాంతాల్లోని రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు భూములపై ఆధారపడిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సీపీ బాసటగా నిలుస్తుందన్నారు.

ఖమ్మం జిల్లాలో నేటి నుంచి పొంగులేటి పర్యటన


జిల్లాలో నేటి నుంచి పొంగులేటి పర్యటన
ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.

అనంతరం కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నపురెడ్డిపల్లిలో నిర్వహించనున్న పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఆదివారం కూసుమంచి మండలంలోని వివిధ గ్రామాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఏడాది మొదటిరోజే.. అబద్దాలా?

Written By news on Thursday, January 1, 2015 | 1/01/2015

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్త సంవత్సరం రోజు చంద్రబాబు ...కొన్ని పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లోని విషయాలన్నీ అబద్దాలేనని ఆమె గురువారమిక్కడ అన్నారు. ప్రతీ మాట ప్రజల్ని వంచించే విధంగా ఉందని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏడాది మొదటి రోజే అబద్దాలు చెబితే ఎలా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. మాటల గారడి పక్కనపెట్టి చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బాబు పాలనంతా బాదుడే బాదుడు అని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు ఆందోళన కలిగించే అంశమని ఆమె అన్నారు.

వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లపై టీడీపీ కౌన్సిలర్ల దాడి


వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లపై టీడీపీ కౌన్సిలర్ల దాడి
పింఛన్లపై నిలదీసినందుకు దౌర్జన్యం కన్నీటి పర్యంతమైన కౌన్సిలర్లు
 హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ భేటీలో ఘటన

 
 హిందూపురం: పింఛన్ల సమస్యపై ప్రశ్నించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్లపై అధికార టీడీపీ కౌన్సిలర్లు దాడి చేశారు.  వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు చైర్మన్ పోడియం ఎదుట బైఠాయించారు.చైర్‌పర్సన్ వారి ఆందోళనను పట్టిం చుకోకుండా ఏకపక్షంగా ఎజెండాను ఆమోదించినట్లు ప్రకటించి సమావేశాన్ని ముగించారు. అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఇందుకు వేదికైంది. చైర్ పర్సన్ రావిళ్ల లక్ష్మి, కమిషనర్ వీరభద్రరావు సమక్షంలో బుధవారం కౌన్సిల్ సమావేశం జరిగింది.
 
 ప్రారంభంలో మున్సిపల్ మేనేజర్ బాల కృష్ణ ఎజెండాలోని అంశాలను చదువుతూ.. పింఛన్ల కోసం మంగళవారం వృద్ధులు, వికలాం గులు ధర్నా చేస్తుండగా వైఎస్సాఆర్‌సీపీ కౌన్సిలర్లు వారికి మద్దతు పలుకుతూ తనను ఇబ్బంది పెట్టారని చెప్పారు. దీంతో టీడీపీ కౌన్సిలర్ రోషన్ అలీ.. ధర్నాలు చేసి బెదిరిస్తారా?అని వాదనకు దిగారు. వృద్ధులు, వికలాంగులు ఉదయం నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాస్తుంటే పింఛను ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరికాదని ప్రతిపక్ష కౌన్సిలర్లు శివా, ఆసీఫుల్లాలు ప్రశ్నించారు.
 
 బాధితుల పక్షాన నిలిచిన తమనే దోషులుగా చేస్తారా? అని నిలదీశారు. దీంతో రోషన్ అలీతో పాటు మరో టీడీపీ కౌన్సిలర్ రామ్మూర్తి వారిపైకి దూసుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లు రజనీ, జయమ్మలు వారిని అడ్డుకున్నారు. టీడీపీ కౌన్సిలర్లు నెట్టి వేయడంతో వారిద్దరి చేతులకు రక్త గాయూలయ్యూరుు. మహిళా కౌన్సిలర్లపై దాడి చేసి, దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు పోడియం ఎదుట బైఠాయించారు. ఈ లోగా అజెండాలోని అంశాలకు ఆమోదం తెలుపుతున్నామని,చెప్తూ చైర్ పర్సన్ నిష్ర్కమిం చారు. తమపై దాడి జరిగితే కనీసం సాటి మహిళగా ఆమె స్పందించక పోవడం బాధాకరమం టూ వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లు కన్నీటి పర్యంతమయ్యూరు. టీడీపీ కౌన్సిలర్లను అరెస్ట్ చేయూలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టారు. అనంతరం ర్యాలీగా వెళ్లి వన్‌టౌన్ సీఐ ఈదురు బాషాకు ఫిర్యాదు చేశారు.
 
 కమిషనర్‌కు ఫిర్యాదు
 హిందూపురంలోని నాలుగవ వార్డులో వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయలేదని కౌన్సిలర్ రజని కౌన్సిల్ దృష్టికి తెస్తుండగా.. టీడీపీ కౌన్సిలర్లు రోషన్ అలీ, వెంకటస్వామి, రామ్మూర్తి, చైర్ పర్సన్ వ్యక్తిగత కార్యదర్శి శంకర్, ఉద్యోగి విజయభాస్కర్‌లు కులంతో పేరుతో దూషించి, అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడి చేశారని వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న ఉద్యోగులు విజయ భాస్కర్, శంకర్‌లను ఇకపై కౌన్సిల్ హాలులోకి రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ మాట్లాడుతూ.. సభలో ఇలా జరగడం దురదృష్టకరమని, ఫిర్యాదును పోలీసులకు పంపిస్తానని చెప్పారు.

వారి తరఫున పోరాటమే పార్టీ ధ్యేయo


ప్రజల చేతిలో పాశుపతాస్త్రం వైఎస్‌ఆర్‌సీపీ
 విజయనగరం మున్సిపాలిటీ :  ప్రజల చేతిలో పాశుపతాస్త్రం వైఎస్‌ఆర్ సీపీ అని, వారి తరఫున పోరాటమే పార్టీ ధ్యేయమని ఆ పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుజయ్  కృష్ణరంగారావు  అన్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా  ప్రతిపక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని, వారి తరఫున ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని చెప్పారు.   జిల్లాలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి స్వగృహంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు.  అనంతరం ఆయన విలేకరులతో  మాట్లాడారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి త్వరలోనే జిల్లా కమిటీలను నియమిస్తామని, మరో నెల రోజుల వ్యవధిలో మండల, గ్రామ స్థాయి కమిటీలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

 జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ   మండల, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడంలో భాగంగా జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించినట్లు ప్రకటించారు. వీరు స్థానిక శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతో చర్చించి గ్రామ స్థాయి కమిటీలను నియమిస్తారన్నారు.  ఇంతకుమందు నిర్వహించిన సమావేశంలో అందరి సూచనలు, సలహాలతో  జిల్లా పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల జాబితాలను రూపొందించినట్టు చెప్పారు.  రాష్ట్ర పార్టీ ఆమోదం తరువాత వాటిని ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక  విధానాలను  నిరసిస్తూ   పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పోరాటం చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు  తెలిపారు.

  ఎన్నికలకు ముందు  ఇచ్చిన అన్ని హామీలు అమలయ్యేలా ప్రభుత్వంపై  ఒత్తిడితెస్తామన్నారు. అనంతరం సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర మాట్లాడుతూ  పింఛన్లు, ఎస్సీ,బీసీ కార్పొరేషన్ రుణాల లబ్ధిదారుల పరిశీలనకు... నిబంధనలకు నీళ్లొదలి, చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా కమిటీలను  నియమించిన ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషన ర్లపై   2వ తేదీన  కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు  తెలిపారు. తప్పుడు నివేదికలు ఇచ్చి,  కమిటీలు నియామకం చేపట్టిన అధికారులను బాధ్యులు చేసి క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నట్లు చెప్పారు.

 స్థానికంగా అన్నీ తెలిసిన సామాజిక కార్యకర్తలను ఈ కమిటీల్లో నియమించాలని జీఓలు చెబుతుంటే, అధికారులు మాత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తల పేర్లను సూచించి కమిటీలు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు.  కమిటీల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు ప్రజలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.  తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసిస్తూ పోరాటాలు చేస్తున్నామని తెలిపారు.   కమిటీల నియామక విషయంపై అసెంబ్లీలో చర్చించిన సందర్భంలో సీనియర్ నాయకులు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ‘ మా పార్టీ ప్రభుత్వంలో ఉంది , మా ఇష్టం’ అని సమాధానం చెప్పటం బాధాకరమన్నారు.  పలు అంశాలపై   అసెంబ్లీలో  మాట్లాడవలసి ఉంటుందని, అవసరమైతే పోట్లాటకు సిద్ధమని చెప్పారు.   జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభా సమావేశాల్లో ప్రకటించారని, ఆ నిర్ణయానికి వారు కట్టుబడకుంటే శాసనసభను కించపరిచినట్లేనని విలేకరుల అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

 సమావేశంలో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ టీడీపీ   కార్యకర్తలకు   సంక్షేమ పథకాల  కమిటీల్లో స్థానం కల్పించడం వల్ల సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. పేదలకు జరుగుతున్న అన్యాయంపై  బాధ్యత వహించేది పార్టీ నాయకులా.. ప్రభుత్వమా అన్ని ప్రశ్నించారు. తమ పార్టీ మండల గ్రామ స్థాయి కమిటీలు నియమించటం ద్వారా ప్రజలకు మరింత చేరవవుతామన్నారు.  ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, ఎస్‌కోట నియోజకవర్గ ఇన్‌చార్జ్  నెక్కల.నాయుడుబాబు, పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్  జమ్మాన.ప్రసన్నకుమార్, ఏఎంసీ మాజీ  చైర్మన్ అంబళ్ల.శ్రీరాములనాయుడు,  జిల్లా పరిషత్  మాజీ వైస్ చైర్మన్ గుల్లిపిల్లి సుదర్శనరావు, వేచలపు చినరామునాయుడు, మామిడి అప్పలనాయుడు,  పతివాడ అప్పలనాయుడు , వల్లిరెడ్డి శ్రీను, జరజాపు  ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 నియోజకవర్గ పరిశీలకులు వీరే....
     కురుపాం - పువ్వల మాధవరావు
     పార్వతీపురం- ఎస్.పరీక్షిత్‌రాజు
     బొబ్బిలి - జరజాపు ఈశ్వరరావు
     సాలూరు-  అవనాపు విజయ్
     గజపతినగరం - మామిడి అప్పలనాయుడు
     ఎస్‌కోట- పీరుబండి  జైహింద్‌కుమార్
     విజయనగరం- అంబళ్ల శ్రీరాములనాయుడు
     నెల్లిమర్ల - జి.ఎస్‌రాజు, కడియాల రామకృష్ణ
     చీపురుపల్లి- గొర్లె వెంకటరమణ

Happy new year 2015

Written By news on Wednesday, December 31, 2014 | 12/31/2014


భూముల కోసం రైతులను భయపెడుతున్నారు:కల్పన


భూముల కోసం రైతులను భయపెడుతున్నారు:కల్పనఉప్పులేటి కల్పన
విజయవాడ: ఏపీ రాజధాని ప్రతిపాధిత ప్రాంతంలో భూసేకరణ కోసం రైతులను భయపెడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. ఆమె ఈ రోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ  రాష్ట్రంలో చంద్రబాబు పాలన అరాచకం సృష్టిస్తోందన్నారు. అధికార పార్టీ చెప్పిందే చట్టం, శాసనం అన్నవిధంగా పాలన సాగుతోందని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడినా, అవి చట్టపరమైనట్లుగా మాట్లాడుతున్నారన్నారు.

టీడీపీ వచ్చిన ఏడు నెలల కాలంలో 22 మంది వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలను హత్య చేశారని ఆమె చెప్పారు. తుళ్లూరు పంటపొలాల ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. రైతులను భయపెట్టడం కోసమే టీడీపీ నేతలు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కల్పన డిమాండ్ చేశారు.

వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు


వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు  2015 చిరస్మరణీయ సంవత్సరం కావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

2015లో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని వైఎస్ జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సుకు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని తెలుగు ప్రజలకు మేలు చేయాలని వైఎస్ జగన్ కోరారు.

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం


అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ఆగంతకుల దహనకాండతో భయాందోళనకు గురవుతున్న రాజధాని నిర్మాణ ప్రాంత గ్రామాలను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సందర్శించి బాధిత రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చింది. ఈ ఘటనపై తక్షణం  సీబీఐ లేదా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అంతేగాక నిందితులను వెంటనే పట్టుకుని దీని వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేయాలని కోరింది. ముందుగా బాధిత రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని లేని పక్షంలో వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించింది.

 అరండల్‌పేట (గుంటూరు) : రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన తుళ్లూరు, తాడేపల్లి మండల గ్రామాల్లో ఆదివారం రాత్రి కొందరు ఆగంతకులు సాగించిన దహనకాండకు రైతుల పొలాల్లోని షెడ్లు, వెదురుబొంగులు, డ్రిప్ పరికరాలు మొత్తం 13 చోట్ల దహనమయ్యాయి. ఈ ప్రాంతాల్లో రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ మంగళవారం పర్యటించింది.

 తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దం డ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో దహనమైన షెడ్లు, అరటితోటలను పరిశీలించి బాధిత రైతులతో నేరుగా మాట్లాడింది. వారికి అండగా నిలుస్తామని తెలిపింది.
  రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వబోమంటూ తీర్మానాలు చేసిన గ్రామాల్లోని ఈ సంఘటనలు జరిగిన తీరు చూస్తుంటే ఎవరో కావాలనే ఇదంతా చేసినట్లుగా అభిప్రాయపడింది.

 జరిగిన సంఘటనలపై వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి నిందితులపై చర్యలు చేపట్టాల్సిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బాధ్యత మరిచి పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించింది.ప్రభుత్వం చేతిలో పోలీసు వ్యవస్థ ఉండగా, వారితో విచారణ జరపకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడింది.

 పర్యటన సాగిందిలా....
 జిల్లా కేంద్రం గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరిన రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సాయంత్రం వరకు తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దాండ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో పర్యటించి రైతులను పరామర్శించింది.

 తొలుత కమిటీ లింగాయ పాలెం గ్రామానికి చేరుకుంది. బాధిత రైతు గుంటుపల్లి మధుసూదనరావు పొలం వద్దకు వెళ్లి దహనమైన వెదురు బొంగులు, పైపులైనులు, అరటి తోటను పరిశీలించింది. ఈ సందర్భంగా  రైతు తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే... ‘పొలంలో 3,500 వెదురు బొంగులు, 300 అరటి చెట్లు, డ్రిప్ పైపులు, షెడ్డు తగలబెట్టారు. ఎంతలేదన్నా రెండున్నర లక్షల నష్టం జరిగింది. నాకు పార్టీలతో సంబంధం లేదు. ఇలా ఎందుకు చేశారో, ఎవరు చేశారో కూడా అర్థం కావడం లేదు. నాకు నష్టపరిహారం అందకపోయినా ఇబ్బంది లేదు, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూస్తే చాలు.’

 అదే గ్రామంలో మరో పొలం వద్దకు వెళ్లి కమిటీ పరిశీలిస్తుండగా అక్కడికి చేరుకున్న కౌలు రైతు చిన్న మీరాసాహెబ్ మాటల్లో ఆవేదన వ్యక్తమైంది. ‘ఎకరం పొలం రూ. 30వేలకు కౌలుకు తీసుకుని పంట వేశా, 150 వెదురు బొంగులు, 100 అరటి చెట్లు, డ్రిప్ పైపులు తగలబడ్డాయి. లక్షన్నర వరకు నష్టపోయినట్టే. ఎవరో రెక్కీ నిర్వహించి మరీ వరుసగా తగలబెట్టినట్టు అర్థమవుతోంది. నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలి.’

  అక్కడి నుంచి ఉద్దండ్రాయునిపాలెంలో బూడిదగా మారిన పొలాన్ని పరిశీలించిన కమిటీ  రైతు జొన్నలగడ్డ వెంకట్రావును పరామర్శించడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరాడు. ‘ నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. మరో 16 ఎకరాలు కౌలుకు తీసుకుని అరటి వేశా.  నెల కిందట 14 వేల వెదురు బొంగులు, 150 ఎరువు బస్తాలు, జనరేటర్ డ్రిప్ పైపులు తగలబెట్టారు.10 లక్షలకు పైగానే నష్టపోయా. నేను రాజధానికి భూమి ఇచ్చేందుకు నిరాకరించాను. అయితే నాతో గ్రామంలోని వారంతా సోదర భావంతో ఉంటారు. ఎందుకిలా చేశారో తెలియడంలేదు.’

 అనంతరం కమిటీ వెంకటపాలెం గ్రామాన్ని సందర్శించింది. పలువురు రైతులను పరామర్శించి మనోధైర్యం నింపే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ, తాము ఎట్టి పరిస్థితుల్లో రాజధానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు.
 ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో  రైతు లంకా రఘునాధబాబు పొలంలో ఓ ఆగంతకుడు నిప్పు అంటిస్తుండగా, వెంబడించడంతో పారిపోయినట్టు స్థానికులు తెలిపారు.

 ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, రేపటి రోజున ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రతి రైతులో కనిపిస్తుందన్నారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే సమయంలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న మంత్రులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పచ్చని గ్రామాల్లో చిచ్చు పెట్టేందుకు కొంత మంది అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

  ఈ పర్యటనలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఉప్పులేటి కల్పన, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ, రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ పూనూరి గౌతమ్‌రెడ్డి, తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి హెనీ క్రిస్టినా, వైఎస్సార్ సీపీ మైనార్టీ, ఎస్సీ, సేవాదళ్ విభాగ కన్వీనర్‌లు సయ్యద్ మాబు, బండారు సాయిబాబు ఇంకా నాయకులు కొత్త చిన్నపరెడ్డి, దర్శనపు శ్రీనివాస్, రాచకొండ ముత్యాలరావు, సుద్దపల్లి నాగరాజు, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పంటలు కాలిపోయిన గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పర్యటన

Written By news on Tuesday, December 30, 2014 | 12/30/2014


పంటలు కాలిపోయిన  గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పర్యటన
గుంటూరు: గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో కాలిపోయిన పంట పొలాలను వైఎస్ఆర్ సీపీ రాజధాని రైతుహక్కుల పరిరక్షణ కమిటీ పరిశీలించింది. తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని ఆరు గ్రామాల్లో 13 చోట్ల పంట పొలాలు, తోటలు, షెడ్లు, వెదురుబొంగులు, డ్రిప్ పరికరాలను గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి తగలబెట్టిన విషయం తెలిసిందే. తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దండరాజుపాలెం, వెంకటపాలెం ఈ గ్రామాలలో కమిటీ పర్యటించింది. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత రైతులను కమిటీ సభ్యులు పరామర్శించారు.

రైతులకు అండగా ఉంటామని కమిటీ సభ్యులు రైతులకు హామీ ఇచ్చారు. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఈ గ్రామాలలో పర్యటించినవారిలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, గొట్టిపాటి రవి, ఉప్పులేటి కల్పన, వైఎస్ఆర్ సీపీ నేతలు నాగిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మర్రి రాజశేఖర్,  క్రిస్టియానా తదితరులు ఉన్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ఈ సంఘటనపై సీబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రజ్యోతి ఎండీ, ఎడిటర్లకు లీగల్ నోటీసులు

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్ లకు వైఎస్ఆర్ సీపీ లీగల్ నోటీసులు ఇచ్చింది. 13.12.2014న విశాఖపట్నం ఎడిషన్ లో ప్రచురించిన ఆర్టికల్ పై క్షమాపణ చెప్పాలని  నోటీస్ లో ఆ పార్టీ డిమాండ్ చేసింది.

నోటీస్ అందిన వారం రోజుల లోపల క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి ఆర్టికల్ ప్రచురించినట్లు ఆ నోటీస్ లో పేర్కొన్నారు.

వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశామని దాడి


వైఎస్సార్ సీపీకి ఓటెయ్యడం నేరమా?
మార్కాపురం : ఆరు నెలల క్రితం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమపై దాడి చేస్తున్నారని మార్కాపురం మండలం చింతగుంట్లకు చెందిన దళితులు పులుకూరి వెలుగొండయ్య, రూతమ్మ, మరియమ్మ, కొండమ్మ, తదితరులు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తికి తాము ఓట్లు వేయలేదన్న కోపంతో తమపై అక్రమంగా కేసులు బనాయిస్తూ ఇళ్లకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

క్రిస్మస్‌కు స్వగ్రామానికి వెళ్తే 24వ తేదీ రాత్రి తమపై దాడికి ప్రయత్నించటంతో తప్పించుకుని మార్కాపురం పట్టణానికి వచ్చి బంధువుల ఇంట్లో తల దాచుకున్నామన్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన పొలాల్లో టీడీపీ నేతలు జేసీబీలతో గుంతలు తీయించారని, సాగు చేసుకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి ఓట్లు వేయటమే తాము చేసిన నేరమా.. అని దళితులు ప్రశ్నించారు.

బాధితులకు అండగా ఉండాలి :ఆర్డీఓను కోరిన ఎమ్మెల్యే జంకె
చింతగుంట్ల దళితులకు అండగా ఉండాలని ఆర్డీఓను ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కోరారు. సోమవారం బాధితులతో ఆయన ఆర్డీఓను కలిశారు. వాటర్‌షెడ్ పథకం నెపంతో తమ పార్టీ కార్యకర్తల పొలాలను ప్రత్యర్థులు పొక్లెయిన్లతో త వ్విస్తున్నారని, పొలం గట్ల వెంబడి ఉన్న చిల్లకంపను వారే కొట్టుకుని అమ్ముకుంటున్నారని, ఈ సంఘటనపై విచారణ జరపాలని ఆర్డీఓను ఎమ్మెల్యే కోరారు.

బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ప్రభుత్వ పథకాల అమలులో వివక్ష చూపొద్దన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తానని, సర్వేయర్‌ను పంపించి పొలం హద్దులు చూపిస్తానని, వాటర్‌షెడ్ అధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యేకు ఆర్డీఓ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు మార్కాపురం ఎంపీపీ ఎల్.మాలకొండయ్య ఉన్నారు.

జనం కోసమే జగన్ దీక్ష


జనం కోసమే జగన్ దీక్ష
 సాక్షి, రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనవరిలో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టే రెండురోజుల నిరశన దీక్షను విజయవంతం చేయాలని పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఉభయగోదావరి జిల్లాల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీక్ష సందర్భంగా కార్యాచరణపై చర్చించేందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు.. రాజమండ్రిలో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసన సభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే జగన్ దీక్షకు ఉపక్రమిస్తున్నారని చెప్పారు. వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేస్తుంటే గోడును ప్రధాన ప్రతిపక్షానికి చెప్పుకోవాలని రైతులు చూస్తున్నారన్నారు. అధికారంలోకి రాక ముందు చంద్రబాబు ఏం చెప్పారు, వచ్చాక ఏం చేస్తున్నా చేస్తున్నదేమిటి అన్నదానిపై నాడు, నేడు అంటూ ఊరూరా ఫ్లెక్సీలు కట్టి ఎండగట్టాలన్నారు.

 ఇది కోతల సర్కారు : సాయిరెడ్డి
 పార్టీ ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలకు మధ్యలో ఉంటుం దన్న ఉద్దేశంతోనే నిరశన దీక్షకు జగన్ తణుకును ఎంపిక చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పెన్షన్లు ఇలా అన్నింటిలో కోత పెడుతోందని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.

 గుణపాఠం నేర్పుదాం : ధర్మాన
 పార్టీ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన మాట్లాడుతూ వైఎస్ జగన్ దీక్ష ప్రభుత్వానికి గుణపాఠం కావాలన్నారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలబడలేక పోతోందని ప్రజలను నమ్మించాలని కుయుక్తులు పన్నుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై గళమెత్తి, ప్రభుత్వ వైఫల్యాలను సమర్థంగా ఎండగట్టాం. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తత్తరపాటుకు గురయ్యారు. అందుకే కొత్త గేమ్‌కు తెరలేపింది. ఈ దీక్షలను విజయవంతం చేయడం ద్వారా ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడతామన్న విశ్వాసానికి బలం చేకూర్చాలి’ అన్నారు.

 ‘పశ్చిమ’ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి
 పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ దీక్షను విజయవంతం చేసేందుకు పశ్చిమగోదావరి జిల్లా శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయన్నారు. ప్రభుత్వ హామీలను నమ్మి మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళలు ఉభయగోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్నారన్నారు. తణుకు మాజీ ఎమ్మెల్యే  కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీ బాండ్లంటూ ప్రభుత్వం ఇచ్చిన కాగితాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావని బ్యాంకులు తిప్పి పంపుతున్నాయ న్నారు. చంద్రబాబు మోసపూరిత వ్యక్తిత్వాన్ని రైతులు ఇప్పుడు గమనిస్తున్నారన్నారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల పార్టీ శ్రేణులు జగన్ దీక్షను విజయవంతం చేయాలన్నారు.

 పార్టీ తణుకు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ చీర్ల రాధయ్య మాట్లాడుతూ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ చేస్తున్న తొలి దీక్షను విజయవంతం చేసేందుకు తామంతా సిద్దంగా ఉన్నామన్నారు. సమావేశంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, తానేటి వనిత, తెల్లం బాలరాజు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు,  తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ తోట గోపీ, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త  తలారి వెంకట్రావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

టీడీపీ నేతల దాడి : కోమాలో ఎమ్మార్వో

Written By news on Monday, December 29, 2014 | 12/29/2014


అనంతపురం : అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. తము చెప్పినా రేషన్ డీలర్ ను మార్చలేదన్న కారణంతో గుడిబండ తహసీల్దార్ (ఎమ్మార్వో) పై టీడీపీ కార్యకర్తలు సోమవారం దాడి చేశారు. ఆ దాడితో తీవ్రంగా గాయపడిన తహసీల్దార్ కోమాలోకి వెళ్లారు. దీంతో ఆయన్ని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
తహసీల్దార్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడే చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. అయితే టీడీపీ నేతల బెదిరింపులు భరించలేక ఇప్పటికే అయిదుగురు ఎమ్మార్వోలు దీర్ఘకాల సెలవుపై వెళ్లారు.  టీడీపీ నేతల దౌర్జన్యాలకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 

మంత్రి పత్తిపాటికి చేదు అనుభవం

 గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెనుమాకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి పత్తిపాటి పుల్లారావుకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. ఏపీ రాజధాని గ్రామాల్లో పంటలు తగలబడిన విషయం తెలిసిందే. దాంతో మంత్రి ...పెనుమాక గ్రామంలో సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి చేసిన వ్యాఖ్యలుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో మంత్రి తన పర్యటనను పూర్తి చేయకుండానే వెనుదిరిగారు.

మంత్రి బాధితుల మాటలు వినకుండా వేరేవారి మాటలు వింటారా? అంటూ రైతులు ఆగ్రహం చెందారు.  ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ జై జవాన్ ...జై కిసాన్ అనకుండా... ఏపీ సర్కార్ ..'జై జపాన్...కిల్ కిసాన్' అన్నచందంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

రైతులపై చేయి వేస్తే ఊరుకునేది లేదు


'రైతులపై చేయి వేస్తే ఊరుకునేది లేదు'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: రాజధాని గ్రామాల్లో రైతులను భయభ్రాంతులకు గురి చేసి భూములు లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.  స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకోవాలని.. ఇవ్వని రైతులను వదిలేయాలని అంబటి తెలిపారు. ఈ క్రమంలో రైతులపై చేయి వేస్తే ఊరుకునేది లేదని అంబటి హెచ్చరించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని గ్రామాల్లో దుశ్చర్యపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలన్నారు.
 
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బురదజల్లే యత్నం చేస్తున్నారన్నారు. రాజధాని రైతులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు పార్టీకి చెందిన వ్యక్తులే ఈ ఘటన పాల్పడి ఉంటారని అనుమానాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇది ప్రజాస్వామ్యమా?రాక్షస పాలనా? అన్న అనుమానం ప్రజలకు కలుగుతోందన్నారు.

చంద్రబాబే ఈ సంఘటన వెనుక ఉన్నారా?

 ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో అరాచకంపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ నేతలు పార్థసారధి, మేరుగ నాగార్జున సోమవారమిక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  తుళ్లూరు మండలంలో పలు గ్రామాల్లో దుండగులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.  వైఎస్ఆర్ సీపీ నేతలు ఈరోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ కుట్ర వెనుక రాష్ట్ర ప్రభుత్వమే ఉందని ప్రజలు అనుమానిస్తున్నారని విమర్శించారు. పంటలు పండే భూములను లాక్కోవాలని చూడటం... రైతులు ఎదురు తిరిగితే సర్కార్ రాక్షసంగా వ్యవహరిస్తోందన్నారు.

చంద్రబాబే ఈ సంఘటన వెనుక ఉన్నారా? అని ప్రజలు అనుమానిస్తున్నారని పార్థసారధి ఆరోపించారు. ఈ ఘటనపై గవర్నర్ వెంటనే స్పందించి కేంద్రానికి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. తమకు పోలీసులపై నమ్మకం లేదన్నారు. కండితుడుపు చర్యగా విచారణ జరిపితే సహించేది లేదని అన్నారు. అందరూ సంతోషంగా ఏర్పాటు చేసుకోవాల్సిన రాజధానిని ...బలవంతంగా,అమానుషంగా వ్యవహరించటం సరికాదన్నారు. ఈ సంఘటన వెనుక ఉన్న శక్తులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ నేతలు కోరారు.

విభేదాలు సృష్టించి.. హీరో కావాలని చూస్తున్నారు

Written By news on Sunday, December 28, 2014 | 12/28/2014


'విభేదాలు సృష్టించి.. హీరో కావాలని చూస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పార్ధసారథి మండిపడ్డారు. మంత్రుల్లో విభేదాలు సృష్టించి చంద్రబాబు హీరో కావాలని చూస్తున్నారని పార్ధసారథి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ సర్కార్ అన్ని చోట్ల విఫమైందన్నారు. అటువంటి టీడీపీ సర్కార్ లోకి వైఎస్సార్ సీపీ సభ్యులు ఎందుకు వెళతారని పార్ధసారథి ప్రశ్నించారు.
 
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా సమర్ధవంతంగా పనిచేస్తున్నారని ఆ పార్టీ మంత్రులే చెబుతున్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు ఆరు నెలల్లో సాధించినది ఏమీ లేదని ఆ పార్టీ ఎంపీలే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేఈ లాంటి బలమైన నేతను అణదొక్కేందుకు యత్నాలు జరుగుతున్నాయన్నారు. రుణమాఫీ సక్రమంగా జరగలేదని స్పీకరే అన్నారని పార్ధసారథి తెలిపారు.

బాబు సర్కారు నిర్లక్ష్యం వల్లే వృద్ధులకు కష్టాలు: అంబటి


బాబు సర్కారు నిర్లక్ష్యం వల్లే వృద్ధులకు కష్టాలు: అంబటి
 వైఎస్సార్‌సీపీ నేత అంబటి ఆగ్రహం 
 సాక్షి, హైదరాబాద్: పింఛన్లు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నందువల్లే వృద్ధుల ప్రాణాలు పోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం కనమనపల్లెలో ఓ వృద్ధుడు ఆకలికి తాళలేక మరణించాడని ఆవేదన వ్యక్తంచేశారు.

చంద్రబాబు గద్దెనెక్కిన తరువాత 4 నెలలుగా ఆ వృద్ధునికి పింఛన్ నిలిపివేశారని, వారం రోజులుగా తినడానికి ఏమీ లేక అతను ఆకలితో మరణించాడని, ఇది చాలా దారుణమైన ఘటనని అన్నారు. ఆ వృద్ధునికి ఏడెనిమిదేళ్లుగా పింఛను వస్తోందన్నారు. అయితే, వయస్సు ధృవీకరణ పత్రం లేదన్న కారణంతో కొద్ది నెలల క్రితం పింఛన్ నిలిపి వేశారని తెలిపారు.బయోమెట్రిక్ విధానం వల్ల 70, 80 ఏళ్ల వృద్ధుల చేతి వేళ్లు అరిగిపోయి పింఛనుకు అర్హత పొందలేక పోతున్నారని తెలిపారు.

Popular Posts

Topics :