13 April 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రాష్ట్ర దశ-దిశలు మార్చుకుందాం:వైఎస్ జగన్

Written By news on Saturday, April 19, 2014 | 4/19/2014

'రాష్ట్ర దశ-దిశలు మార్చుకుందాం:వైఎస్ జగన్
రాపూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బూటకపు హామీలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో సాధ్యంకాని హామీలను ఇస్తున్న చంద్రబాబు కల్లిబొల్లి మాటలతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. ఎన్నికల రోడ్ షోలో భాగంగా నెల్లూరు జిల్లాలోని రాపూరులో ప్రసంగించిన జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు నోటికొచ్చిన అబద్ధాలాడుతూ మోస పూరిత రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. ఆ తొమ్మిదేళ్ల తన పాలనలో ఇచ్చిన హామీలను ఎందుకు నేరవేర్చలేదని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం 20లక్షల ఉద్యోగాలుంటే.. మూడున్నర కోట్ల ఉద్యోగాలను ఎలా ఇస్తారో ప్రజలకు తెలపాలని జగన్ డిమాండ్ చేశారు.  ఆనాటి ఆయన పాలనలో విద్యార్థుల కష్టాలను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు ఏదో చేస్తానంటూ మాయమాటలు చెబుతున్నారని జగన్ నిలదీశారు. ఎన్నికల ముందు రెండు రూపాలయ కిలో బియ్యమిస్తామని,అనంతరం  రూ.5.25 చేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు.
 
చంద్రబాబు తన పాలనలో వృద్ధులకు ముష్టివేసినట్టు 75 రూపాయలు ఇచ్చేవారన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా తింటాడని జగన్ మరోమారు గుర్తు చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు అన్నీ ఫ్రీ అంటూ మాయమాటలు చెప్పి మోసం చేయడానికి వస్తున్నారని, ఆ విషయాన్ని అంతా గమనించాలని ప్రజలకు సూచించారు. ఆయనలా విశ్వసనీయతలేని రాజకీయాలు తాను చేయలేనని జగన్ స్ఫష్టం చేశారు. ప్రజా సంక్షేమం కోసం ప్రమాణస్వీకారం రోజునే  ఐదు సంతకాలు చేస్తానన్నారు. అక్కచెల్లెమ్మల కోసం అమ్మఒడి పథకం ఫైలుపై మొదటి సంతకం చేస్తానని, అవ్వాతాతల పెన్షన్‌ రూ.200 నుంచి 700 చేస్తూ రెండో సంతకం, రైతన్నలకు అండగా ఉండేందుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిపై మూడో సంతకం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాల్గో సంతకం చేయడమే కాకుండా, అన్ని రకాల కార్డుల జారీ చేసేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఐదో సంతకం చేస్తానని తెలిపారు.  ఈ ఐదు సంతకాలతో రాష్ట్ర దిశా-దశను మార్చుకుందామని జగన్ ప్రజలకు భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో విశ్వసనీయతకు కట్టుబడి ఉండే వైఎస్సార్ సీపీనే గెలిపించాలని విన్నవించారు.

Jagan Magic - Android Game


https://play.google.com/store/apps/details?id=com.dexati.jaganmagic

ఇంటర్నెట్‌, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లను విరివిగా ఉపయోగించుకుంటూ, ముఖ్యంగా యువతతో ఎక్కువగా కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఉపయోగించుకుంటున్న పార్టీలు తమ విజయంకోసం ఇంటర్నెట్‌ ప్రచారంలో ప్రత్యర్థ పార్టీలకంటే ఒక అడుగు ముందే ఉన్నామని నిరూపిస్తున్నారు. అది పార్టీ ప్రచారమైనా, సంక్షేమ పధకాలను వివరించే పనైనా, వైరివర్గాలను తూర్పారపట్టడానికైనా నిర్ణయాత్మకమైనపాత్ర పోషిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు వాడుకుంటున్నారు.
ఈ విషయంలో రాష్ట్రంలోని కొన్ని పార్టీలు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ జాతీయ పార్టీలతో పోటీ పడుతున్నాయి. ఇదే కోవలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ‘జగన్ మేజిక్’ అనే ఆండ్రాయిడ్ గేమ్ ని రూపొందించి గూగుల్ ప్లేస్టోర్ లో ఉంచారు. ఈ గేమ్ లో మొత్తం పదిహేను స్టేజీలు ఉంటాయి. 
ఒక్కొక్క జిల్లాని ఒక స్టేజి గా, తెలంగాణా మొత్తాన్ని ఒక స్టేజిగా మరియు ఆఖరి స్టేజిగా ఇండియాను ఉంచారు. అంటే జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక్క జిల్లాలో వోట్లని కలెక్ట్ చేసుకుంటూ తర్వాత తెలంగాణా, ఇండియా స్టేజి దాకా వెళ్ళేటట్లు రూపొందించారు. రెండు రాష్ట్రాల్లో జగన్ నిర్ణయాత్మకమైన పాత్ర పోషించడమే కాకుండా కేంద్రంలో కీలక పాత్ర పోషించడం తథ్యమని దానిని ఈ గేమ్ ద్వారా చూపించే ప్రయత్నం చేశామని వెల్లడించారు.
ఈ క్రింద ఇచ్చిన లింక్స్ లో ‘జగన్ మేజిక్’ ఆండ్రాయిడ్ గేమ్ ను చూడవచ్చు.




Jagan Magic - screenshotJagan Magic - screenshot

కేంద్ర ఐబీ రిపోర్ట్‌ : జగన్‌కే బ్రహ్మరథం!!

ఎవరెవరు చేయిస్తున్న సర్వేలు.. జ్యోతిష్యబ్రహ్మలు వెలువరించే ఉగాది ఫలితాల్లా.. ఎవరికి అనుకూలమైన సంకేతాలను వారికి ఇస్తుండవచ్చు గాక...! వివిధ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేలు  పరస్పర భిన్నమైన ఫలితాలను వెలువరిస్తూ.. ఏకంగా.. సర్వేలు జరిగే తీరు, చేసే సంస్థల విశ్వసనీయతనే ప్రశ్నార్థకంగా మారుస్తుండవచ్చు గాక...! అయితే, సాక్షాత్తూ కేంద్రప్రభుత్వ ఆధీనంలో పనిచేసే.. కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో పాలక పక్షానికి తప్పుడు నివేదిక ఇస్తుందనుకోవడం భ్రమ. అలాంటి నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో వారి నివేదిక ప్రకారం.. సీమాంధ్ర రాష్ట్రం యావత్తూ.. జగన్‌కు బ్రహ్మరథం పట్టబోతున్నది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏకపక్షంగా ప్రజలు అధికార పీఠంపై కూర్చోబెట్టబోతున్నట్లుగా కేంద్ర ఇంటెలిజెన్స్‌ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. 
ఆ ప్రచారం ప్రకారం సీమాంధ్రలో పార్టీలు గెలవబోతున్న సీట్ల వివరాలు ఇలా ఉంటున్నాయి. 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌     130 నుంచి 135
తెలుగుదేశం            35 నుంచి 45
కాంగ్రెస్‌                  1 నుంచి 2 
వైఎస్సార్‌ సీపీ ఎలాంటి శషబిషలు లేకుండా.. ఏకపక్షంగా అధికారంలోకి రాబోతున్నట్లుగా ఇంటెలిజెన్స్‌ నివేదిక పేర్కొంటున్నది. 
మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు సీమాంధ్ర ఎన్నికల ఫలితాలపై చాలా మందిలో ఉత్కంఠ ఉంది. వైఎస్సార్‌ మరణం తర్వాత.. ఆయన పేరిట పార్టీ స్థాపించిన జగన్‌.. ఆ తరువాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో ప్రభంజన సదృశంగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికలలో ఆయన ఎలా నెగ్గుకొస్తారో చూడాలని చాలామందిలో ఆసక్తి ఉంది. దానికి తగ్గట్లుగా జాతీయ స్థాయి సంస్థలే అయినా.. ఈ రాష్ట్రంలో వేర్వేరు సంస్థలు చేస్తున్న సర్వేలు వేర్వేరు ఫలితాల్ని ఇస్తున్నాయి. నీల్సన్‌ సర్వేలు జగన్‌కు ఏకపక్షంగా అధికారం కట్టబెడితే.. ఎన్‌డీటీవీ సర్వేలు జగన్‌కు అంత సీన్లేదని అంటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సర్వే ల మీదనే జనానికి మొహం మొత్తుతోంది.
సరిగ్గా ఇలాంటి సమయంలో కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో వారి నివేదిక అంటూ పైన పేర్కొన్న గణాంకాలు లీక్‌ అయ్యాయి. వీటి ప్రకారం జగన్‌ అధికారంలోకి వస్తున్నట్లే. 130నుంచి 135 స్థానాలంటే.. ఫలితాల్లో ఎంత వ్యత్యాసం వచ్చినా.. సింపుల్‌ మెజారిటీతో గద్దె ఎక్కడం తప్పదని పలువురు అంటున్నారు. భాజపాతో పొత్తులని, కత్తులని... రకరకాల డ్రామాలకు తెరతీసి.. మోడీకి ఒక ఓటు బ్యాంకు మేనియా ఉన్నదని.. దాన్ని క్యాష్‌ చేసుకోగలమని రకరకాల ఎత్తులు వేసిన చంద్రబాబు ప్రయత్నాలు ఏమీ ఫలించేలా లేదు. ఆయన గరిష్టంగా 45 సీట్లు దాటకపోవచ్చునని ఐబీ రిపోర్టు చెబుతోంది. 
ఇక కాంగ్రెస్‌ పరిస్థితి ఎంత నీచంగా తయారైందో ఈ నివేదిక తేటతెల్లం చేస్తోంది. అరచేతిలో స్వర్గాన్ని చూపించే మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చినప్పటికీ... కాంగ్రెస్‌కు దిక్కులేదన్నది ఈ నివేదిక తేలుస్తున్న సారాంశం. కాంగ్రెస్‌ కేవలం 1 లేదా 2 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతున్నదన్నమాట. ఇంతకూ కాంగ్రెస్‌ 0 వద్ద ఆగిపోతుందని జనం అనుకుంటోంటే.. గెలిచే ఆ ఒక్క హీరో ఎవరా అని పలువురు జోకులేసుకుంటున్నారు.

- See more at: http://telugu.greatandhra.com/politics/elections-2014/central-ib-reort-jagan-ke-bramharadham-52009.html#sthash.tmduDVUV.dpuf

Exclusive IB Report : It's YS Jagan All the Way !

TV Channels and Newspapers are busy publishing their survey reports for the upcoming elections. Though all the reports are predicting a thumping win for Bharatiya Janata Party at the center, surveys in Andhra Pradesh seem to be different.
Already some channels have come up with some manipulative survey reports and the people have started to think about the credibility of those channels after seeing the numbers.
Now, we have got some exclusive information from the Central Intelligence Bureau that has predicted a landslide victory for YS Jagan Mohan Reddy led YSR Congress Party.
According to the Intelligence Bureau, YSRCP is all set to win 130-135 seats followed by Telugu Desam Party with 35-45 seats and then there will be Congress which might win 1 or 2 seats.
One can easily understand after going through this report that YSRCP will have a clear majority in the state.
Recently, Nielsen survey has also predicted a clear majority for YS Jagan and NDTV have predicted that TDP will win and form the government in the state.
Jagan started YSRCP after the death of his father and former Chief Minister YS Rajasekhara Reddy. Jagan showed his stamina by winning with a record majority in the last by-elections.
With this leaked IB reports, we can see here that YSRCP will be able to form the government comfortably and Jagan might become the Chief Minister of Seemandhra. This report is a major jolt for Chandra Babu Naidu and Telugu Desam Party. It's a do-or-die situation for TDP and their party is taking these elections as a final battle.
Naidu is leaving no stone unturned and that is the reason why he is ready to team up with BJP in Seemandhra, knowing the fact that they can't even win more than 5 seats. According to the IB reports, TDP will be sitting in the opposition again for the next five years.
Biggest loser in this election will be the Congress Party. After the state has been separated, Congress leaders have left the party and joined in YSRCP and TDP.
Leaders like Chiranjeevi, Raghuveera Reddy and Kanna etc are finding it hard to campaign. Chiranjeevi himself understood his situation and opted for Rajya Sabha as he knew what would happen if he contest. The party doesn't even have leaders to contest from all the constituencies and the cadre has already gone along with their leaders into different parties. Congress Party doesn't have any chance to win at least a single seat in Seemandhra.
Let us wait and see who will be that lucky person to win.

- See more at: http://www.greatandhra.com/politics/elections-2014/exclusive-ib-report-its-ys-jagan-all-the-way-55733.html#sthash.xY056Wmw.PPr8ICjp.dpuf

కువైట్ లో ఎన్నికల ప్రచార పోస్టర్ విడుదల



వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్, శాసన సభ అభ్యర్ధుల విజయం కొరకు ఎన్నికల ప్రచార పోస్టర్ లను విడుదల చేస్తున్నా వైయస్సార్ సి.పి. కువైట్ సభ్యులు 
కువైట్: కువైట్ మాలియా ప్రాంతములో వైయస్సార్ సి.పి. ఎన్.ఆర్.ఐ. కన్వినర్ మేడపాటి వెంకట్,  కువైట్ కో ఆర్డినేటర్ ఇలియాస్ గారి ఆదేశానుసారం జైంట్ కోఅర్డినేటర్ యం. బాలిరెడ్డి గారి ఆధ్వర్యములో ఎన్నికల ప్రచార పోస్టర్ లను విడుదల చేశారు. 
ఈ సందర్భముగా బాలిరెడ్డి గారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయితనే సిమాంధ్ర అభివృద్ధి జరుగుతుంది గల్ఫ్ ఉన్నా వారి సమస్యలు పరిష్కార మార్గం దొరుకుతుందనే  ఒకే ఒక ఉద్దేశముతో కువైట్ లో ప్రచారము నిర్వహించాలని పోస్టర్ లు మరియు 20 వేల కరపత్రాలు తయారు చేశామన్నారు, కువైట్ లో ఉన్న మన సిమాంధ్ర పని చేసె చోట నివాసాలు వెళ్లి వారి కుటుంబ సభ్యులను, బంధువులను, మిత్రులను మే 7న జరిగే సర్వతిక ఎన్నికలలో వైయస్సార్ సి.పి. పార్లమెంటు శాసన అభ్యర్ధుల ఫ్యాన్ గుర్తుకు ఓటు వేపించలని టెలిఫోన్ ద్వారా తెలపాలని ప్రచారము చేసి అభ్యర్ధుల విజయం కొరకు తమ వంతు సహాయము చేస్తామని తెలిపారు.
గల్ఫ్ లో ఉన్నా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వారిపై అధరాపడి ఉంటారు కాబట్టి విరి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత,విలువ ఇస్తారు కాబట్టి కువైట్ లో ఉన్న వారి ఒక ఫోన్ కాల్ చాలు తప్పకుండా కుటుంబ సభ్యులు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తారని నమ్మకం మనకుందన్నారు.
ఈ కార్యక్రమములో కమిటీ సభ్యులు 
యం. వి. నరసా రెడ్డి,  యన్. మహేష్ రెడ్డి, టి.జి.భాస్కర్ రెడ్డి,  నాగారాజ్, సి. చంద్రశేఖర్ రెడ్డి,  ఆకుల ప్రభాకర్, యం. చంద్రశేఖర్ రెడ్డి, రమణ యాదవ్, షేక్ ఇక్బాల్, ఆర్. ప్రకాష్, యన్. చంస్రశేఖర్ రెడ్డి, మరియు వై.యస్. ఆర్. అభిమానులు  షేక్ ఆజీస్, సజ్జద్, శంషిర్ ఖాన్, అబూ తురాబ్, కృష్ణ రెడ్డి, మహాబూబ్ బాష, షేక్ ఖాసిం, తదితరులు పాల్గొన్నారు

ఈనాడు-టీడీపీలపై తక్షణమే చర్యలు తీసుకోండి

ఈనాడు, టీడీపీలు కుమ్మక్కయ్యాయని వైఎస్సార్ సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలపై బురద చల్లేందుకు ఈనాడు పత్రికను టీడీపీ వాడుకుంటోందని ఈసీకి వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది. పాంచజన్య పేరుతో ఎన్నికల స్పెషల్ పేజీల్లోని వార్తలు ఓటర్లును ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆ ఫిర్యాదులో వైఎస్సార్ సీపీ పేర్కొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తో పాటు జగన్ పై బురదచల్లేందుకు ఈనాడు పత్రిక-టీడీపీలు కలిసి వార్తలు ప్రచురిస్తున్నాయని తెలిపింది.
 
విచారణలో ఉన్న కేసులను ప్రచురించకూడదన్న నిబంధనను ఈనాడు ఉల్లంఘిస్తుందని వైఎస్సార్ సీపీ జనరల్ సెక్రటరీ కె.శివకుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు

వైఎస్సార్ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది

'వైఎస్సార్ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది'వీడియోకి క్లిక్ చేయండి
మహబూబ్ నగర్: ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ ప్రాంత ప్రజలతో విడదీయరాని బంధం ఉందని వైఎస్సార్ సీపీ నేత షర్మిల అభిప్రాయపడ్డారు. ఆ క్రమంలోనే ఆయన ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా తెలంగాణ ప్రాంతం నుంచే ఆరంభించేవారని ఆమె తెలిపారు. ఈ రోజు ఎన్నికల రోడ్ షోలో భాగంగా మహబూబ్ నగర్ సభకు హాజరైన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహినిని ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ..మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్ కే దక్కుతుందని మరోమారు గుర్తు చేశారు. ఆయన పాలనలో ఏ ఒక్క ఛార్జీలు పెంచలేదని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో రెండుసార్లు అధికారాన్ని కట్టబెడితే.. ఆయన పేరును ఆ పార్టీ ఎఫ్ఐఆర్ లో చేర్చిందని మండిపడ్డారు.
 
వైఎస్సార్ కు కాంగ్రెస్ అన్యాయం చేసినా.. తెలుగు ప్రజలు మాత్రం ఆయన్ను గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారన్నారు. వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంద్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టడానికి బాబు నానా తంటాలు పడ్డారని ఎద్దేవా చేశారు. విప్ జారీ చేసి మరీ..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడిన ఘనత చంద్రబాబుకే చెందుతుందన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యల కోసం రోజుల తరబడి ఎన్నో పోరాటాలు చేశారని షర్మిల తెలిపారు. ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్న వైఎస్సార్ సీపీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్క్షప్తి చేశారు.
 

నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు

నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు
హైదరాబాద్:  సీమాంధ్రలో లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు చివరి రోజుకావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు కూడా అధిక సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఈ రోజు నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం.

లోక్ సభ స్థానాలు:
వైఎస్ఆర్ జిల్లా కడప  -  వైఎస్‌ అవినాష్‌రెడ్డి
కృష్ణా జిల్లా  మచిలీపట్నం -  కొలుసు పార్థసారధి
శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం  -  రెడ్డి శాంతి


శాసనసభ స్థానాలు :
శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం -  ధర్మాన ప్రసాదరావు
విజయనగరం జిల్లా విజయనగరం - కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం జిల్లా సాలూరు -  పి.రాజన్నదొర

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు - మేకా శేషుబాబు
పశ్చిమగోదావరి జిల్లా  నర్సాపురం  -  కొత్తపల్లి సుబ్బారాయుడు
కృష్ణా జిల్లా  పెడన  -   వేదవ్యాస్‌
కృష్ణా జిల్లా పెనమలూరు  - కె.విద్యాసాగర్‌
గుంటూరు జిల్లా సత్తెనపల్లి -  అంబటి రాంబాబు
ప్రకాశం జిల్లా పర్చూరు  -   గొట్టిపాటి భరత్
ప్రకాశం జిల్లా మార్కాపురం  - జంకే వెంకటరెడ్డి

అనంతపురం జిల్లా  కదిరి  - అక్తర్‌ చాంద్‌బాషా
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు - ఆదినారాయణరెడ్డి
వైఎస్ఆర్ జిల్లా కమలాపురం - పి.రవీంద్రనాథ్‌రెడ్డి
చిత్తూరు జిల్లా కుప్పం  - చంద్రమౌళి

వైఎస్‌ఆర్‌ సీపీ-సీపీఎం కూటమిదే విజయం

'ఫ్యాను గాలికి నిప్పు తోడైంది'తమ్మినేని వీరభద్రం
ఖమ్మం:  వైఎస్‌ఆర్‌ సీపీ ఫ్యాన్‌ గాలికి సీపీఎం నిప్పు తోడైందని, ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ-సీపీఎం కూటమిదే విజయం అని సీపీఎం తెలంగాణ  రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం, వైఎస్‌ఆర్‌ సీపీల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ పాలేరు శాసనసభ స్థానంలో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న  పోతినేని సుదర్శనరావు విజయం తథ్యం అన్నారు.

చంద్రబాబు జిరాక్స్ సుజనాచౌదరి

'చంద్రబాబు జిరాక్స్ సుజనాచౌదరి'
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు మనీల్యాండరీంగ్ ద్వారా విదేశాల నుంచి వేల కోట్లు రూపాయిలు రాష్ట్రానికి తరలిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఆరోపించారు. శనివారం హైదరాబాద్ లో గట్టు రామచంద్రరావు విలేకర్లతో మాట్లాడుతూ.... సుజనా చౌదరిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  జిరాక్స్ సుజనా చౌదరి అని ఆయన ఆరోపించారు. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. సుజనాచౌదరి మనీ ల్యాండరింగ్ కుంభకోణం పై విచారణ జరపాలని గట్టు రామచంద్రరావు ప్రభుత్వాన్ని కోరారు.

టీడీపీ పేరును కాంగ్రెస్ దేశంగా మార్చుకోండి:గిరిబాబు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పూర్తిస్థాయిలో శ్రమిస్తానని సినీనటుడు గిరిబాబు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఆయన శనివారమిక్కడ చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నదే తన తాపత్రయమని గిరిబాబు తెలిపారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేది జగన్ మాత్రమేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసమే చంద్రబాబు నాయుడు ఆరాటపడుతున్నారని గిరిబాబు విమర్శించారు. చంద్రబాబు సహా ఆ పార్టీలో ఉన్నది కాంగ్రెస్ నేతలేనని , టీడీపీ పేరును కాంగ్రెస్ దేశంగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పదిలం

'తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పదిలం'
వరంగల్ : వైఎస్ఆర్ ఆశయాలను స్పూర్తిగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేసే సత్తా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల స్సష్టం చేశారు. శనివారం వరంగల్ జిల్లా మరిపెడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగించారు. వైఎస్ఆర్ పాలన సువర్ణయుగమన్ని తెలిపారు. మహానేత పరిపాలనలో ప్రవేశ పెట్టిన ఏ పథకాన్నైనా అద్భుతంగా అమలు పరిచారన్నారు. ఆయన హయాంలో ఆర్టీసీ, కరెంట్... ఇలా ఏ ఒక్క ఛార్జీ పెరగలేదని గుర్తు చేశారు.

వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పోడిచిందని ఆరోపించారు. వైఎస్ఆర్ హయాంలో మంజూరైన ఇళ్లకు కనీసం బిల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదని... అలాగే కరెంట్ ఛార్జీలు పెంచి రూ. 32 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుందని అన్నారు. వైఎస్ఆర్ ఆకస్మిక మరణంతో ఆయన అభిమానులు ఎక్కువ మంది తెలంగాణలోనే చనిపోయారన్నారు. తెలంగాణలో 60 శాతం మంది ప్రజలు ఇంకా వైఎస్ ఆర్ ను గుండెల్లోనే పెట్టుకున్నారని తెలిపారు. ఏ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టిన లోను కాకుండా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వెయ్యాలని తెలంగాణ ప్రజలకు సూచించారు.

రాష్ట్ర చరిత్రను మార్చే అయిదు సంతకాలు

'రాష్ట్ర చరిత్రను మార్చే అయిదు సంతకాలు'వీడియోకి క్లిక్ చేయండి
రైల్వే కోడూరు : ప్రజలకు వెన్నుపోటు పొడవటం చంద్రబాబు నాయుడుకు కొత్తేమీ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన రైల్వేకోడూరులో వైఎస్ఆర్ జనభేరిలో  మాట్లాడుతూ అన్ని ఫ్రీగా ఇస్తానని, రుణాలు మాఫీ చేస్తానంటూ నిస్సిగ్గుగా బాబు అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబూ... రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో మీకు తెలుసా .... అని జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

అధికారం కోసం చంద్రబాబు దొంగ్ హామీలు ఇస్తున్నారని, ఆయనలా నిజాయితీ లేని రాజకీయాలు తాను చేయలేనని వైఎస్ జగన్ అన్నారు. బాబులా అబద్ధాలు చెప్పలేను అని...వైఎస్ఆర్ నుంచి వారసత్వంగా వచ్చింది విశ్వసనీయతేనని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర చరిత్రను మార్చే అయిదు సంతకాలు చేస్తానని చెప్పారు. అక్కాచెల్లెమ్మలకు భరోసా ఇస్తున్నానని, మీ పిల్లవాడ్ని బడికి పంపించండని సూచించారు. అక్కా చెల్లెమ్మల జీవితాల్లో వెలుగు తెచ్చేలా 'అమ్మ ఒడి' పథకం అమలుపై తొలి సంతకం చేస్తానని వైఎస్ జగన్ తెలిపారు. రాజకీయమంటే పేదవాడి గుండె చప్పుడు వినడం అని ఆయన అన్నారు.

తాను సీఎం అయ్యాక అయిదు సంతకాలు చేస్తానని  జగన్‌ చెప్పారు. ఆ సంతకాలు రాష్ట్ర చరిత్రను మారుస్తాయన్నారు. అక్కా చెల్లెళ్ళ కోసం మొదటి సంతకం అమ్మఒడి పథకంపై పెడతానన్నారు. ఈ పథకంతో పిల్లల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తానన్నారు.  ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం పెట్టిస్తానన్నారు. రెండవ సంతకం అవ్వా, తాతలకు. రూ.200 పింఛన్‌ను రూ.700కు పెంచుతూ చేస్తానన్నారు. మూడవ సంతకంగా రైతులకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక ఏడాదికి 10లక్షల ఇళ్లు నిర్మిస్తానని, అయిదేళ్లలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పారు.

పోటెత్తిన కోట

పోటెత్తిన కోట
విశాఖ పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేసిన వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కోట జనాలతో పోటెత్తింది. జగన్‌మోహన్ రెడ్డి మాతృమూర్తికి జనాలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. జనం కష్టాలు తీర్చిన రాజన్న సతీమణి  విజయం సాధించాలని కోరుకున్నారు.జామి, ఎస్.కోట, వేపాడ, ఎల్.కోట మండలాల్లో రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగించారు. రాష్ర్టంలో రాజకీయ పరిస్థితి, చంద్రబాబు మోసపూరిత విధానాలు, కిరణ్ డబుల్ గేమ్,  స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ సాగిన ఆమె ప్రసంగం ప్రజలను ఆలోచింపచేసింది.   
 
శృంగవరపుకోట, న్యూస్‌లైన్: జనప్రయోజనం కోసం ఆరాటపడి, ప్రజలకు మేలు చేయాలని, పది కాలాలపాటూ నిలిచే పనులు చేపట్టిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మైపై ప్రజలు అభిమాన జల్లులు కురిపించారు. ఆత్మీయ అతిథికి  నీరాజనం పలికారు. ప్రియతమనేత సతీమణికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జై జగన్ నినాదాలు   రోడ్‌షో ఆద్యంతం మిన్నంటాయి.  విజయమ్మ రాకతో నియోజక వర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉప్పొంగింది.  విశాఖ లోక్‌సభ పరిధిలోని ఎస్.కోట నియోజకవర్గంలో ఆమె శుక్రవారం ప్రచారం నిర్వహించా రు. జామి మండలంలో భీమసింగి గ్రామం వద్ద నియోజకవర్గంలోకి ప్రవేశించిన విజయమ్మకు అపూర్వ స్వాగతం లభించింది.  
 
విజయమ్మ వస్తున్న సమాచారం తెలుసుకున్న ప్రజలు ఆత్మీయ అతిథికి స్వాగతం పలికేందుకు    రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. తొలిసారి ఎన్నికల ప్రచారానికి వచ్చిన విజయమ్మను జనం తమ ఆత్మబంధువుగా  ఆదరించారు. భీమసింగి జంక్షన్ వద్ద విజయమ్మ, వైఎస్సార్సీపీ పాలకమండలి సభ్యుడు  కొణతాల రామకృష్ణ నియోజక వర్గంలోకి అడుగుపెట్టారు. ఎస్.కోట నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి రొంగలి జగన్నాథం, విజయనగరం నేతలు గాదె శ్రీనివాసులునాయుడు, బోకం శ్రీనివాస్, వేచలపు చినరామునాయుడు, కోళ్ల గంగాభవానిలు వారికి ఘన స్వాగతం పలికారు. జామి జంక్షన్‌లో విజయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. రోడ్‌షోలో పలు చోట్ల తనను చూసేందుకు వచ్చిన మహిళల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.
 
సంతగవిరమ్మపేట గ్రామ మహిళలు విజయమ్మకు హారతులు పట్టారు. అడగడుగునా జనం నీరాజనాలు పలికారు.  విజయమ్మ రాక తె లుసుకున్న గ్రామస్తులు  దారి పొడుగునా బారులు తీరి స్వాగతం పలికారు. తొలిసారిగా ఎస్.కోట వచ్చిన విజయమ్మకు అపూర్వ ఆదరణ లభించింది. సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా  రాజన్నకు ముందు చంద్రబాబు పాలనలో వైఫల్యాలను, రాజన్న తర్వాత వచ్చిన కిరణ్ పాలనలో లోపాలను విజయమ్మ సోదాహరణంగా వివరించారు. ప్రజల కష్టాల గురించి ప్రస్తావించారు.  రాజన్నలో రాజసం, తెగువ, పట్టుదల, అన్నింటికి మించి సేవచేసే గుణం ఉన్న జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్గించారు.  
 
అభివృద్ధి , సంక్షేమం రెండు కళ్లలా రాజన్నపాలన సాగించారని చెప్పారు.   కాంగ్రెస్, తెలుగుదేశం కుట్రలను ఎండగట్టారు. వేపాడ మండలం బొద్దాం గ్రామంలో స్థానికులు రాజన్న పాలన తీసుకు రావాలని, పేదలను ఆదుకోవాలని కోరడంతో ‘‘మీరంతా ఆదరిస్తే జగన్ అధికారంలోకి వస్తాడు. రాజన్న పెట్టిన ప్రతి సంక్షేమ పథకాలన్నీ   పూర్తిగా కొనసాగిస్తాడు’’ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేపాడ వెళుతుండగా  సోంపురం వద్ద రైల్వేగేటు పడడంతో కాన్వాయ్ ఆగింది. ఈసందర్భంగా కొందరు మహిళలు, గ్రామస్తులు రాజన్న కాలంలో అమలైన సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.
 
ఈ సందర్భంగా వారి అభ్యర్థనపై స్పందించిన విజయమ్మ మాట్లాడుతూ మాట తప్పని, మడమ తిప్పని నైజం నాయన నుంచి జగన్‌కు అలవడింది,  గతంలో రాజన్న అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని నడిపిస్తాడు. అంతకన్నా ఎక్కువగా ప్రయోజనం చేకూరేలా అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, 104, 102 వంటి పథకాలు ఏర్పాటు చేసి అమలు చేస్తారంటూ  ప్రజలకు భరోసా ఇచ్చారు.
 
వేపాడలో వెల్లువలా వచ్చిన జనం జై జగన్‌అంటూ  నినాదాలతో హోరెత్తించారు. రాత్రి 9.30 గంటల సమయంలో లక్కవరపుకోట చేరుకున్న విజయమ్మను చూసేందుకు వేలసంఖ్యలో వచ్చిన జనం నిరీక్షించారు. విజయమ్మ ప్రసంగాన్ని ఆద్యంతం విన్నారు. విజయమ్మ రోడ్‌షో కోసం ఎక్కడా ప్రచారం చేయకపోయినా,  పలు గ్రామాల నుంచి జనం పెద్ద సంఖ్యలో  సభలకు హాజరైన జనం మహానేతపై తమకున్న అభిమానాన్ని చాటిచెప్పారు. యువనేత జగన్ వెంట నడుస్తాం అన్న భరోసా ఇచ్చారు.

సాయిప్రసాద్‌రెడ్డి హయాంలో అభివృద్ధి...మీనాక్షినాయుడు హయాంలో అధోగతి

సాయిప్రసాద్‌రెడ్డి హయాంలో అభివృద్ధి...మీనాక్షినాయుడు హయాంలో అధోగతి
 ఆదోని, న్యూస్‌లైన్ : ఒక సువర్ణయుగం తర్వాత ఐదేళ్లపాటు అభివృద్ధి కుంటుపడింది. కొత్త పథకాలు లేవు.. ఉన్న పథకాలు సక్రమంగా అమలుకావు.. గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు, కాలువలు లేక వీధులన్నీ మురుగుకుంటలుగా మారా యి.. అర్హులైన వారు వందలసార్లు వినతులు ఇచ్చినా పింఛన్లు మంజూరు కాలేదు.. సమస్యలను పరిష్కరించి ప్రజా సంక్షేమానికి కృషి చేయాల్సిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంపై సాకులు చెబుతూ చేతులు దులుపుకున్నాడు.. ఎమ్మెల్యేనే ప ట్టించుకోకపోవడంతో ప్రభుత్వమూ నియోజకవర్గ అభివృద్ధిని మరించింది.. ఇలాంటి దుస్థితి నెలకొన్నది ఆంధ్రా ముంబాయిగా పేరు గాంచిన ఆదోని నియోజకవర్గంలో.. అందుకే ప్రజలు ఈ సారిఎన్నికల్లో తమ సమస్యలను పరిష్కరించే నాయకుడి వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు.
 
2004 నుంచి 2009 వరకు ఆదోని ఎమ్మెల్యేగా ఉన్న సాయిప్రసాద్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒప్పించి భారీ మొత్తంలో నిధులు విడుదల చేయించారు. దాదాపు రూ.120 కోట్లకుపైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు.
 
ఆ సమయంలో జరిగిన అభివృద్ధి పనుల్లో ముఖ్యమైనవి

- ఆదోని పట్టణంలో బైపాస్ రోడ్డుకు రూ.11 కోట్లు మంజూరు. దాదాపు 80 శాతం పనులు పూర్తి అయ్యాయి.
 
- బళదూరు - ఆదోని మధ్య కాజ్‌వేను దాదాపు రూ.2.11 కోటత్లో పూర్తి చేశారు. ఇప్పడు వరద వచ్చినా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందీ లేదు.
 
- పెద్దహరివాణంలో రూ.26 లక్షలతో చేపట్టిన అదనపు ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మా ణం వల్ల వేసవిలో నీటి ఎద్దడి తీరింది.
 
- కుప్పగల్లు ప్రధాన కేంద్రంగా రూ.4.5 కోట్లతో తాగు నీటి పథకం నిర్మాణం చేపట్టారు. దీంతో కుప్పగల్లు, పాండవగల్లు, గణేకల్లు, బల్లేకల్లు, జాలిమంచి గ్రామాలకు రక్షిత మం చినీరు అందుబాటులోకి వచ్చాయి.
 
- నాగ నాథనహళ్లి ప్రధాన కేంద్రంగా 12 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేం దుకు అవసరమైన తాగు నీటి పథకం నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు అయ్యాయి. దీనివల్ల ఆదోని నియోజకవర్గంలోని నాగనాథనహళ్లి, ఢణాపురం, చాగి గ్రామాల ప్రజల దాహార్తి తీరింది.
 
-జి.హొసళ్లి-బదినేహాలు గ్రామాల మధ్య రూ.1.3 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో కౌతాళం మండలంలోని కుంటనహాళు, ఉప్పరహాళు, బాపురంతో పాటు హచ్చొళ్లి మీదుగా కర్ణాటక వెళ్లే ప్రయాణికులకు దాదాపు 20 కి.మీ. ప్రయాణభారం భారం తగ్గింది.
 
- దాదాపు రెండు దశాబ్దాలుగా క్రీడాకారులు, క్రీడల ప్రేమికుల కోరికను తీర్చేందుకు పట్టణంలో రూ.32 లక్షలతో మినీ స్టేడియం నిర్మించారు.
 
- పట్టణంలోని  దాదాపు రూ.50 లక్షలతో పార్క్ నిర్మాణం చేపట్టారు.
 
- 2004 వరకు ఒక్కరికి పింఛన్ మంజూరు కావాలంటే అప్పటి వరకు లబ్ధిదారుల్లో ఎవరో ఒకరు చనిపోవా ల్సి వచ్చేది. కానీ వైఎస్‌ఆర్ వచ్చిన త ర్వాత నియోజకవర్గంలో 16 వేల మం ది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు మంజూరు చేశారు.
 
సాయిప్రసాద్‌రెడ్డి తర్వాత 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీకి చెందిన మీనాక్షినాయుడు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. తాను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనని, ప్రభుత్వం సహకరించడం లేదనే సాకు చూపుతూ అభివృద్ధిని విస్మరించారు. దీంతో ప్రజా సంక్షేమం స్తంభించిపోయింది. మండగిరి గ్రామ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.6 కోట్లు మాత్రం మంజూరు అయ్యాయి. ఆ నిధులకు సంబంధించి టెండరు ప్రక్రియ మాత్రమే పూర్తయ్యింది.
 
రూరల్ మండలంలోని చిన్నగోనేహాళు వంకపై బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే ప్రకటించారు. కానీ ఇంత వరకు పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఉద్యోగుల జీత భత్యాలు ప్రభుత్వమే భరిస్తున్నందున ప్రజలు చెల్లిస్తున్న వివిధ రకాల పన్నులు మునిసిపల్ ఖజానాలో జమఅయ్యాయి. ఆ నిధులతోనే కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. మీనాక్షినాయుడు పాలనాకాలంలో అనర్హులనే సాకుతో వందలాది మంది పింఛన్లు రద్దు అయ్యాయి.
 
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వాటిని పునరుద్ధరించాలని వేడుకుంటున్నా ఫలితం కనిపించలేదు. మంచి ప్రభుత్వం, స్థానికంగా సమర్థుడైన నాయకుడు లేకపోవడం వల్లే తమ పరిస్థితి ఇలా అయ్యిందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోడానికి సిద్ధమవుతున్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో వైఎస్ తెగువ జగన్‌లో

జగన్‌తోనే వైఎస్ సువర్ణయుగం
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో వైఎస్ తెగువ జగన్‌లో ఉంది: విజయమ్మ
 
 విశాఖపట్నం/ శృంగవరపుకోట (విజయనగరం): ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి మనసున్న మనిషి. ముఖ్యమంత్రిగా ప్రతి సంక్షేమ పథకాన్ని కుల, మతాలకు అతీతంగా అమలుచేశారు. ఆయన పాలనలో ప్రతి ఇంటికీ నలుగురైదుగురు లబ్ధిదారులు సంక్షేమ ఫలాలు పొందారు. ఆయన పాలనంతా సువర్ణయుగం. ఒక్క పన్ను కూడా రాష్ట్ర ప్రజలపై మోపని మహానీయుడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఆయన తర్వాత అంతటి తెగువ జగన్ మోహన్‌రెడ్డిలో ఉంది. చేయని నేరానికి జైలుకు వెళ్లాడు. ఎన్ని కష్టాలొచ్చినా నిరంతరం ప్రజల గురించే ఆలోచించాడు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జగన్‌బాబు విలవిల్లాడిపోతాడు. గడిచిన నాలుగున్నరేళ్లుగా ఎండనకా, వాననక నిరంతరం ప్రజలమధ్యే తిరిగాడు.

వివిధ ప్రజల సమస్యలపై స్పందించి జలదీక్ష, రైతుదీక్ష , ఫీజుపోరు వంటివెన్నో చేశాడు. వైఎస్ సువర్ణ యుగం జగన్‌తోనే సాధ్యం.. అందుకే ప్రజల కోసం పనిచేసే జగన్‌ను సీఎంను చేద్దాం’’ అని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం లోక్‌సభకు గురువారం నామినేషన్ వేసిన విజయమ్మ శుక్రవారం పార్లమెంట్ పరిధిలోని భీమిలి నియోజకవర్గంలోగల పద్మనాభం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. విజయనగరం జిల్లా జామి, శృంగవరపుకోట, వేపాడ, ఎల్.కోట మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. విజయమ్మవెంట వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ, ఎస్.కోట వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆర్.జగన్నాథం, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు తదితరులు పాల్గొన్నారు.        
 

జగన్ ప్రభంజనం ముందు పార్టీలన్నీ ఖాళీ

ఫ్యాను గాలికి టీడీపీ కొట్టుకుపోతుంది
  •     జగన్ ప్రభంజనం ముందు పార్టీలన్నీ ఖాళీ
  •      తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
 తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: సీమాంధ్రలో వీచే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఫ్యాను గాలికి తెలుగుదేశం పార్టీ ఎంగిలిఆకులా కొట్టుకుపోతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పరిధిలోని గాలివీధిలో శుక్రవారం వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు మౌలానా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు. ముస్లిం, మైనార్టీలను ఊచకోత కోసిన  బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెబుతామంటూ గాలివీధిలోని ముస్లింలంతా ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు వెనకాడడని మండిపడ్డారు.

తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను అష్టకష్టాలకు గురిచేశాడన్నారు. మళ్లీ అధికారాన్ని చేజిక్కుంచుకునేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. జనంలో జగనన్నకు ఉన్న ఆదరణకు మరో పదేళ్లపాటు చంద్రబాబు ప్రతిపక్షంలోనే ఉంటాడని స్పష్టం చేశారు. జగనన్న అధికారంలోకి రాగానే మొదటి సంతకం పొదుపు సంఘాల్లోని రూ.20వేల కోట్ల మహిళా రుణాల మాఫీకోసం చేస్తారన్నారు.

‘అమ్మ ఒడి’ పేరుతో బిడ్డలను బడికి పంపించే ప్రతి తల్లిదండ్రులకు ప్రతి నెలా రూ.500ల చొప్పున వారిఖాతాలో వేసేందుకు రెండో సంతకం చేస్తారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు వంద రూపాయలకే విద్యుత్ సరఫరా అందిస్తారన్నారు. సీమాంధ్రలోని దాదాపు 50లక్షల మంది పేదలకు సొంత ఇల్లు కల్పిస్తారన్నారు. పేదలకు ఐదు లక్షల విలువచేసే వైద్యం ఉచితంగా అందించేందుకు జిల్లాకు ఒక సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తారని తెలిపారు.

జగనన్న నాయకత్వంలో తాను తిరుపతిని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం తిరుపతిని రూ.450 కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రగల్బాలు పలికి చివరకు రూ.450 కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తనను తిరిగి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే నగరంలోని అన్ని సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్‌కే.బాబు, పోతిరెడ్డి వెంకటరెడ్డి, ఎంవీఎస్.మణి, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, హర్ష, గిరిధర్‌రెడ్డి, కట్టా గోపీయాదవ్, బొమ్మగుంట రవి, పెరుగు బాబూయాదవ్, ఎస్‌కే. ముస్తఫా, తాల్లూరి ప్రసాద్, తిమ్మారెడ్డి, కన్నయ్య, చలపతి, టైలర్ బాబు, రఫీఖాన్, అబ్బాస్, షఫీ, ఖాదర్ అహ్మద్, రవి ముదిరాజ్, చెలికం కుసుమ, గీత, పుణీత, గౌరి పాల్గొన్నారు.
 

నాపై పోటీకి దమ్ముందా?

నాపై పోటీకి దమ్ముందా?
    * సమైక్యద్రోహి కిరణ్
    *కమీషన్ల కోసమే కండలేరు తాగునీటి పథకం
    * ప్రజల సొమ్ము దోచుకోలేదని ప్రమాణానికి సిద్ధమేనా ?
    * రాజంపేట వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డి ధ్వజం

 పీలేరు, న్యూస్‌లైన్ : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా ఆయన సోదరుల్లో ఎవరికైనా దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన పీలేరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై పోటీ చేసి డిపాజిట్టు తెచ్చుకున్నా రాజకీయాల నుంచి వైదొలగడానికి సిద్ధమేనన్నారు. మూడన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజల దాహార్తి తీర్చలేని కిరణ్ ఏ మొహం పెట్టుకుని నామినేషన్ వేస్తార ని ప్రశ్నించారు.

ప్రజలు రోజూ బిందె నీరు రూ. 3 నుంచి రూ. 5కు కొనుక్కోవాల్సిన దుస్థితి ఆయనవల్లే వచ్చిందని కిరణ్‌పై మండిపడ్డారు. పీలేరు లో ప్రభుత్వ భూముల తోపాటు గుట్టలు, పుట్టలు, చెట్లు, వాగులు, వంకలు ఆక్రమించి వందల కోట్లు దండుకున్నది ఆయన అనుచరులేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదవిపోయే ముందు కమీషన్ల కోసం కండలేరు నుంచి తాగునీరు జిల్లాకు తరలించే ప్రక్రియ చేపట్టలేదా ? అని ప్రశ్నించారు. కమీషన్లు, ప్రజాధనాన్ని మూడన్నరేళ్లలో దోచుకోలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ నల్లారి సోదరులకు సవాల్ విసిరారు. రూ. 9 కోట్లతో  ఏర్పాటు చేసిన కాంతి కిరణాలు మొహం చాటేశాయని, వీటిని ఏర్పాటు చేసిందీ కమీషన్ కోసం కాదా ? అని  ప్రశ్నించారు.

రాష్ట్రంలో సమైక్య ద్రోహిగా మొదటి స్థానం కిరణ్‌కుమార్‌రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కేంద్రానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఆయన సమైక్యవాదినంటూ ఇప్పుడు డ్రామాలాడితే ప్రజలు నమ్మరన్నారు. సమైక్య ద్రోహులు జై సమైక్యాంధ్ర అంటూ పార్టీని ఏర్పాటు చేయడం సిగ్గు చేటన్నారు. ఆ పార్టీకి ఇవే చివరి ఎన్నికలన్నారు. పీలేరు ప్రజలు కిరణ్ సోదరుల మాయమాటలు నమ్మే పరిస్థితిలో ఇక ఎన్నడూ ఉండరని తెలిపారు.

రూ. 7 కోట్లతో పీలేరు పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించవచ్చని, సీఎంగా ఈ పని కూడా చేయని కిరణ్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఒక్క రోజైనా అన్నదమ్ములు ఎండలో కష్టపడ్డారా ? వ్యాపారాలేమైనా చేశారా ? ఏమి చేయకనే వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కిరణ్ రోడ్‌షోలు జనం లేక అట్టర్ ఫ్లాప్ అయ్యాయని విమర్శించారు. సొంత జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేని కూడా తన వెంట పెట్టుకోలేని కిరణ్‌కు ఆయన సత్తా ఏ పాటిదో చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకుంటున్న చంద్రబాబును చరిత్ర క్షమించదన్నారు. ముస్లిం మైనారిటీలు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని గుర్తించి ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. సీమాంధ్రలో 130 నుంచి 150 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో పార్టీ నేతలు నారే వెంకట్రమణారెడ్డి, మల్లెల రెడ్డిబాషా, బీడీ నారాయణరెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, షామియానా షఫీ, లోకనాథరెడ్డి, ఎస్ హబీబ్‌బాషా, దండు జగన్‌మోహన్‌రెడ్డి, సదుం నాగరాజ, మల్లికార్జునరెడ్డి, గడిబాషా, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, అల్లాబక్షు, మల్లెల మస్తాన్, బాబ్జిరెడ్డి,  మధుకర్‌రెడ్డి, ఆదినారాయణ, శ్రీనాథపురం మణి, జయపాల్‌రెడ్డి, వెంకటరమణ, మార్కొండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జలం..జీవం

జలం..జీవం
 గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించిన అపరభగీరథుడు వైఎస్సార్

*80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ,
*2.56 లక్షల మందికి తాగునీటి సౌకర్యం
*రూ. 592 కోట్లు విడుదల చేసిన నాటి సీఎం వైఎస్  రాజశేఖరరెడ్డి
*మహానేత మరణానంతరం గుండ్లకమ్మను గాలికొదిలేసిన కాంగ్రెస్  

 
బాబు విదిల్చింది కేవలం రూ.33 కోట్లు
2004లో చంద్రబాబు పాలనా కాలం ముగియబోతుండగా ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవాలనే దురుద్దేశంతో గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తానని మొక్కుబడిగా జీఓ జారీ చేశారు. ఆగమేఘాలపై శిలాఫలకం వేశారు. తీరా ప్రాజెక్ట్ నిర్మాణానికి చంద్రబాబు కేటాయించింది ఎంతా అంటే కేవలం రూ. 33 కోట్లు.
 
గుండ్లకమ్మ నది నుంచి ఏటా 3.5 నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా కలుస్తుంది. ఈ నీటి వృథాను అరికడితే వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కావడంతో పాటు రెండున్నర లక్షల మందికి తాగునీరు అందుతుంది. వైఎస్సార్  కంటే ముందు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. వైఎస్సార్ సీఎం కాగానే జలయజ్ఞంలో భాగంగా  * 592 కోట్లు కేటాయించి మద్దిపాడు మండలంలోని చిన్నమల్లవరం వద్ద 3.875 టీఎంసీల సామర్థ్యం గల కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్మించారు.
 
మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, కొరిశపాడు, ఇంకొల్లు, జే.పంగులూరు, చినగంజాం, ఒంగోలు మండలాల పరిధిలోని 80,060 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు ఎడమ కాలువ కింద 27.975 కిలోమీటర్ల పొడవునా 50,060 ఎకరాలను సాగులోకి తీసుకురావాలని నిర్ణయించారు. కుడి కాలువ కింద 27.262 కి.మీ పొడవునా 28 వేల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో అన్నంగి తప్ప మిగిలిన 11 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించారు.
 
వైఎస్సార్ మరణంతో పనుల్లో జాప్యం
వైఎస్సార్ హయాంలో చకచకా సాగిన ప్రాజెక్టు నిర్మాణ పనులు.. ఆయన మరణించాక  నత్తనడకన సాగుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావస్తున్న దశలో వైఎస్సార్ మృతి రైతులను కుంగదీసింది. ప్రాజెక్ట్ పూర్తవుతుందా..? అనే అనుమానం రైతుల్లో గుబులు రేపింది. అనుకున్నట్లుగానే కుడి, ఎడమ ప్రధాన కాలువల టెయిల్ ఎండ్ ప్రాంతాల్లో పనులను పూర్తి చేయడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. ల్యాండ్ ఎక్విజేషన్ లబ్ధిదారులకు బకాయిలు చెల్లించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
 
పైసా విడుదల చేయని కిరణ్ సర్కార్
వైఎస్సార్ మరణించాక సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గుండ్లకమ్మ గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ప్రాజెక్ట్‌కు వైఎస్ విడుదల చేసిన నిధులే తప్ప వారు ఒక్క పైసా విడుదల చేయలేదు. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ గడువు పెంచుకుంటున్నారే తప్ప నిర్మాణం పూర్తి చేయాలని ఏనాడూ ఆలోచించలేదు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గురించి మాటమాత్రమైనా ప్రస్తావించిన దాఖలాల్లేవు.  
 
రూ.20 కోట్లిస్తే పెండింగ్ పనులు పూర్తి
గుండ్లకమ్మ కుడి, ఎడమ ప్రధాన కాలువల పరిధిలోని మేజర్ కెనాల్స్, మైనర్ కెనాల్స్, ఫీల్డ్ చానెల్స్ నిర్మాణ పనులు *20 కోట్లు కేటాయిస్తే పూర్తవుతాయి. కాలువల పొడిగింపు పూర్తయితే శివారు భూములకూ నీరందించవచ్చు. క రవది కాలువను దేవరంపాడు చివరకు పొడిగించి సర్వీస్ రోడ్లు వేయాల్సి ఉంది. పశువులకు తాగునీటి సదుపాయం కోసం ర్యాంపులు, వాటర్ లెవెల్స్ చెక్ చేసుకునేందుకు గేజ్ వెల్స్ నిర్మించాలి. ఈ పనులన్నీ మూడేళ్లుగా ముందుకు కదల్లేదు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏనాడూ నోరెత్తలేదు.. ప్రభుత్వమూ పట్టించుకోలేదు.  
 
నిధులు అలాగే ఉన్నాయి
ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ కింద భూసేకరణకు, కాలువల పొడిగింపు కోసం కేటాయించిన నిధుల్లో  18 కోట్లు మిగిలి ఉన్నాయని కాలువ బాధ్యతలు చూస్తున్న డీఈ సత్యభూషణ్ తెలిపారు. కుడి కాలువ కింద ఆగిపోయిన పనులకు కేటాయించిన *2.6 కోట్లు కూడా అలాగే ఉన్నాయని సంబంధిత అధికారి నాగేశ్వరరావు తెలిపారు.

బాబుగారి బినామీ లీల.. 106 కోట్ల రుణం ఎగవేత

బాబుగారి బినామీ లీల..  106 కోట్ల రుణం ఎగవేత
మారిషస్ బోనులో సుజనా చౌదరి
 
 మంథా రమణమూర్తి, నూగూరి మహేందర్
 
 చంద్రబాబే కాదు... బాబు కుడి, ఎడమ కూడా పచ్చి మోసమేనన్న వాస్తవం మరోసారి బయటపడింది. తెలుగుదేశంలో కీలకంగా ఉంటూ... అన్నీ తానై నడిపిస్తున్న ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి విదేశీ కుంభకోణం గుట్టు రట్టయింది. సింగపూర్‌తో పాటు పన్ను స్వర్గాలుగా పేరున్న మారిషస్, కేమన్ ఐలాండ్స్, హాంకాంగ్ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున కంపెనీలను ఏర్పాటు చేసి... వాటి ద్వారా వందల కోట్ల రుణాలు తీసుకుని, ఆ డబ్బును దేశంలోకి తెచ్చి ఇతర అవసరాలకు ఖర్చుబెడుతున్నారన్న ఆరోపణలు నిజమేనని స్పష్టమైంది. మారిషస్‌లో రూ.120 కోట్లకు పైగా రుణాలు తీసుకుని, ఎగ్గొట్టిన కేసులో... హైదరాబాద్‌లో ఉన్న సుజనా యూనివర్సల్ చరాస్తుల్ని జప్తు చే మాల్సిందిగా సిటీ సివిల్ కోర్టు, 11వ అదనపు న్యాయమూర్తి ఆదేశించారు. కంపెనీకి నోటీసులు జారీ చేస్తూ... ఆ లోగా డబ్బులు విత్‌డ్రా చేస్తే కష్టం కనక ఆ సంస్థకు ఏడు బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను కూడా స్తంభింపజేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో సుజనా చౌదరికి చెందిన మూడు లిస్టెడ్ కంపెనీల్లో ప్రధానమైనదిగా ఉంటున్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కథ కంచికి చేరినట్లే కనిపిస్తోంది.
 
 అసలు ఏం జరిగిందంటే..
 
 గృహోపకరణాల తయారీ రంగంలో ఉన్న సుజనా యూనివర్సల్‌కు పీఏసీ వెంచర్స్ (సింగపూర్), సుజనా హోల్డింగ్స్ లిమిటెడ్ (దుబాయ్), నాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (హాంకాంగ్), సన్ ట్రేడింగ్ లిమిటెడ్ (కేమెన్ ఐలాండ్స్), హెస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్ (మారిషస్) పేరిట విదేశాల్లో పలు అనుబంధ కంపెనీలున్నాయి. వాటి పేర ఏటా వేల కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు చూపిస్తుంటారు కూడా. అయితే తమ గ్రూపు సంస్థల లావాదేవీలు చాలావరకూ బోగస్‌వేనని, రుణాల కోసం లేని టర్నోవర్‌ను చూపిస్తుంటామని గతంలో అమ్మకం పన్ను అధికారులకు సుజనా చౌదరే లిఖితపూర్వకంగా చెప్పటం ఈ సందర్భంగా గమనార్హం. హెస్టియా హోల్డింగ్స్ పేరిట కూడా గతేడాది ఏకంగా రూ.199 కోట్ల లావాదేవీలు చూపించారు.
 
 మారిషస్ బ్యాంకు నుంచి రూ.120 కోట్ల రుణం
 
 ఈ కంపెనీ 2010 నవంబరు 9న మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి కోటి డాలర్ల (దాదాపు 60 కోట్లు) రుణం తీసుకుంది. దీనికి సుజనా యూనివర్సల్ సంస్థ గ్యారెంటీ ఇచ్చింది. కొన్నాళ్లు రుణవాయిదాలు సవ్యంగానే చెల్లించిన సుజనా చౌదరి... తనకు మరింత రుణం కావాలని అదే బ్యాంకును కోరారు. దీంతో 2011లో ఈ రుణాన్ని 2కోట్ల డాలర్లకు (దాదాపు 120 కోట్లకు) పెంచుతూ మారిషస్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రుణ ఒప్పందాన్ని సవరించింది కూడా. అయితే 2012 జూన్ నాటికి మొత్తం 120 కోట్ల రూపాయలనూ విత్ డ్రా చేసుకున్న సుజనా చౌదరి... అప్పటి నుంచి రుణాన్ని తిరిగి చెల్లించటం మానేశారు. 2012 ఆగస్టు నాటికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టారు.
 
 మళ్లీ మళ్లీ అదే ఎగవేత ధోరణి...
 
 చెల్లించాల్సిన రుణాన్ని ఎగ్గొట్టడంతో మారిషస్ బ్యాంకు నోటీసులిచ్చింది. చివరకు హెస్టియా-సుజనా- మారిషస్ బ్యాంకు కలిసి పాత ఒప్పందాన్ని సవరిస్తూ మరో ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం చెల్లించాల్సిన గడువును బ్యాంకు పెంచింది. కానీ ఆ గడువులోగా కూడా సుజనా చౌదరి చెల్లింపులు చేయనేలేదు. దాదాపు రూ.102 కోట్లు బకాయి పడ్డారు. ఎప్పటికీ చెల్లించకపోవటంతో బ్యాంకు కోర్టుకెళ్లింది. సుజనా యూనివర్సల్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని ఆ సొమ్ము వసూలు చేసుకోవచ్చంటూ మారిషస్ కోర్టు బ్యాంకుకు డిక్రీ ఇచ్చింది. ఆ డిక్రీ ఆధారంగా హైదరాబాద్ సివిల్ కోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు కేసు దాఖలు చేయటంతో... సుజనా కార్యాలయంలోని చరాస్తులన్నిటినీ జప్తు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. దీన్ని పర్యవేక్షించడానికి బెయిలిఫ్‌ను కూడా నియమించింది. అంతేకాక సుజనా సంస్థకు నోటీసులిస్తూ... ఈ నెల 28లోగా దీనికి సమాధానం చెప్పాలని గడువిచ్చింది. ఈ సంస్థ గనక తన బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును విత్ డ్రా చేస్తే పిటిషనర్‌కు న్యాయం జరగదని భావించిన న్యాయస్థానం... అప్పటిదాకాా సుజనా యూనివర్సల్‌కు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లలో ఉన్న ఖాతాలను స్తంభింపజేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
 
 చెల్లించాల్సిన సొమ్ము రూ.106 కోట్లు
 
 మారిషస్ కోర్టు ఇచ్చిన డిక్రీ ప్రకారం సుజనా చౌదరి మారిషస్ బ్యాంకుకు చెల్లించాల్సిన సొమ్ము రూ.102 కోట్లు. దానికి వడ్డీ, కోర్టు ఖర్చులు కలిపి మొత్తం రూ.106 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికోసం బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేయటంతో పాటు పంజాగుట్ట, నాగార్జున హిల్స్‌లో ఉన్న సుజనా యూనివర్సల్ కార్యాలయంలోని కంప్యూటర్లు, ఏసీలు, టేబుళ్లు, కుర్చీలు, ఫ్యాన్లు, ప్రింటర్లు, ఫోన్లను అటాచ్ చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.
 
 అరెస్టు చేసే అవకాశం?
 
 రూ.106 కోట్ల రుణం ఎగవేసిన కేసులో సుజనా చౌదరికి నోటీసులిస్తూ ఈ నెల 28 వరకూ కోర్టు గడువిచ్చింది. దీనిప్రకారం 28లోగా ఆయన కోర్టుకు హాజరై... తాము రుణం ఎలా చెల్లిస్తామన్నది చెప్పాల్సి ఉంటుంది. ‘‘సుజనా యాజమాన్యం చెప్పే సమాధానంతో డిక్రీ హోల్డరు సంతృప్తి చెందితే సరే! లేనిపక్షంలో వారు డిక్రీ అమలు కోసం ఆయన్ను అరెస్టు చేయటానికి అనుమతివ్వాలని కూడా కోర్టును కోరే అవకాశం ఉంది. ఈ విషయంలో డిక్రీ హోల్డరుదే అంతిమ నిర్ణయమవుతుంది’’ అని న్యాయ నిపుణులు చెబుతుండటం గమనార్హం.
 
 అంత రుణమెలా ఇచ్చారు?
 
 నిజానికి సుజనా యూనివర్సల్ సంస్థ ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవరైతే చూపిస్తుంది కానీ... లాభాలు మాత్రం ఆ స్థాయిలో ఉండవు. చాలా వరకూ నష్టాలే నమోదు చేస్తుంటుంది. అందుకే షేర్ మార్కెట్లో కూడా ఈ సంస్థ షేరు నానాటికీ కిందకి పడిపోయి... ప్రస్తుతం రూపాయి పావలా దగ్గర ట్రేడవుతోంది. ఈ ధర వద్ద దీని నికర విలువ కేవలం రూ.21 కోట్లు. అంటే సంస్థ మొత్తం వాటాలన్నీ కలిపితే దాని విలువ రూ.21 కోట్లు. దీన్లోనూ యాజమాన్యం చేతుల్లో ఉన్నది 26 శాతం షేర్లే. మరి 21 కోట విలువైన సంస్థను చూసి రూ.120 కోట్ల రుణమెలా ఇచ్చారు? ఈ సంస్థ కూడా ఏ ధైర్యంతో తీరుస్తామనుకుంది? ఆ డబ్బును సుజనా చౌదరి ఏం చేశారు? ఇవన్నీ ఇపుడు ప్రశ్నలే. పెపైచ్చు సుజనాచౌదరికి ఈ సంస్థలో 26 శాతం వాటా ఉంది. దాని విలువ కేవలం రూ.ఐదారు కోట్లు. అలాంటి వ్యక్తి వందల కోట్ల మేర రుణాలు తీసుకుని వాటిని ఏం చేశారన్నది ఆద్యంతం మిస్టరీగానే కనిపిస్తోంది.
 
 
 ఇదీ మారిషస్ కంపెనీ చిరునామా...
 సూట్-జీ12, సెయింట్ జేమ్స్ కోర్ట్,
 సెయింట్ డెనిస్ స్ట్రీట్, పోర్ట్ లూయిస్, మారిషస్.

మాటపై నిలబడటమే నాకు తెలుసు

 మాటపై నిలబడటమే నాకు తెలుసు
వైఎస్సార్ జిల్లా ‘వైఎస్సార్ జనభేరి’లో జగన్‌మోహన్‌రెడ్డి


సాక్షి ప్రతినిధి, కడప: ‘‘రాజకీయాలంటే పేదల మనస్సు ఎరగాలి. పేదవాని మేలు కోసం తపించాలి. చనిపోయిన తర్వాత కూడా పేదల మనస్సులో చిరస్థాయిగా నిలవాలి. ఓట్లు, సీట్లు కోసం ఏ గడ్డయినా తినకూడదు. అధికారం కోసం అడ్డగోలుగా వ్యవహరించకూడదు. విశ్వసనీయత, విలువలతో ప్రజల మనస్సులు గెలవాలి. మాట చెబితే ఆ మాటపై నిలవడమే నాకు తెలుసు. చంద్రబాబు చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్తారు... నేనలా అబద్ధాలు చెప్పను. రాబోయే ఎన్నికల్లో కుళ్లు కుతంత్రాలకు సమాధి కట్టండి.

 పేదోళ్ల రాజ్యం కోసం, రాజశేఖరుడి సువర్ణయుగం కోసం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి’’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎలాంటి మేలు చేయని చంద్రబాబు అధికారం కోసం అడ్డదార్లు ఎంచుకుంటున్నారని, అందుకోసం ఆల్‌ఫ్రీ బాబుగా మారిపోతున్నారని, ఎన్నికలయ్యాక ప్రజల్ని వంచించితే సరిపోతుందనే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. ఆయన శుక్రవారం వైఎస్సార్‌జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో ‘వైఎస్సార్ జనభేరి’ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రోడ్డు షో నిర్వహించారు. పలు బహిరంగ సభల్లో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...

 ఐదు సంతకాలతో బంగారు భవిత అందిస్తా...
  ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయాక రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా అయ్యింది. రాష్ట్రంలో రాజశేఖరరెడ్డికి ముందు, తర్వా త అనేకమంది ముఖ్యమంత్రులను చూశాం. పేదల మనస్సు ఎరిగి, పేదల కోసం పనిచేసిన సీఎం రాజశేఖరరెడ్డిగారేనని చరిత్రలో నిలిచిపోయింది. అందుకు సాక్ష్యం ఆయన ప్రతిరూపం మీ గుండెల్లో ఉండిపోవడమే. అలాంటి సువర్ణ పాలన మళ్లీ అందిస్తా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆ ఘడియల్లోనే ఆ వేదికపైనే చేసే ఐదు సంతకాలు అన్ని వర్గాలకు చేయూతగా నిలవనున్నాయి.
*  కరువుతో చాలామంది అక్కాచెల్లెళ్లు బడికెళ్లాల్సిన పిల్లల్ని కూలి పనులకు తీసుకె ళ్తున్నారు. వారికొచ్చే వందతోపాటు, మరో రూ.50 వస్తే... వారం రోజులు పనికెళ్తే ఐదురోజులు తిండికి వస్తుందని పిల్లల్ని పనులకు తీసుకెళ్తున్నారు. ఇకపై ఏ అక్కాచెల్లెమ్మ కూడా బతికేందుకు పిల్లల్ని పనులకు తీసుకెళ్లకూడదు. అందుకోసం ‘అమ్మ ఒడి’ పథకంపై తొలి సంతకం చేస్తాను. పిల్లల్ని పాఠశాలకు పంపితే ఒకరైతే రూ.500, ఇద్దరు పిల్లలైతే రూ.1000 నెలనెలా ఆ తల్లి అకౌంట్‌లో జమ చేస్తా. నాణ్యమైన విద్య కోసం అన్ని పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడతా.
*  అవ్వతాత ల చిరునవ్వు కోసం ఓ మనవడిగా నెలనెలా రూ.700 చొప్పున పెన్షన్ అందించేందుకు రెండో సంతకం చేయబోతున్నా.
*  రైతుల పంటకు గిట్టుబాటు ధరలు ఉండడంలేదు. ఆ పంటను విక్రయించాక ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ కష్టాలు తప్పించేందుకు, గిట్టుబాటు ధర కల్పించి రైతన్నల మొహాల్లో చిరునవ్వు చూసేందుకోసం రూ. 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తా. కరువు, వరదలు వచ్చినప్పుడు తక్షణమే పరిహారం అందించే ందుకు రూ. 2 వేల కోట్లతో సహాయనిధి ఏర్పాటు చేస్తా. ఇందుకోసం మూడవ సంతకం చేస్తా.
*  అక్కాచెల్లెమ్మలకు అండగా నిలిచేందుకు ఆర్థిక చేయూత నిచ్చేందుకు నాల్గో సంతకంగా డ్వాక్రా రుణాలు రద్దు చేస్తా.
*  ఏ గ్రామానికి వెళ్లినా రేషన్‌కార్డు లేదని, పెన్షన్‌కార్డు లేదని, ఆధార్‌కార్డు లేదని పేదలు వాపోతున్నారు. అలాంటి వారికోసం, ఏ కార్డయినా 24 గంటల్లో అందేలా, అధికారుల చుట్టూ తిరగకుండా ఊరూరా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయిస్తా. అందుకోసం ఐదో సంతకం చేస్తా.
 అన్ని విధాలుగా అండగా నిలుస్తా...
*  ప్రతి పేదవారికి ఇళ్లు నిర్మించేందుకు ఐదేళ్లల్లో ఏడాదికి 10లక్షల ఇళ్లు చొప్పున 50లక్షల ఇళ్లు నిర్మిస్తా. 2019 నాటికి ఇళ్లులేని వారు చేతులు ఎత్తండి అంటే ఒక్కచేయి కూడ పైకి చూపకుండా చేస్తా. అంతేకాదు మార్జిన్ మనీ కూడ కట్టనవస రం లేదు. లక్ష వ్యయంతో ఇంటిని నిర్మించి ఆ ఇంటి పట్టాను అక్కాచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తా. ఆ పత్రాలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తా.
*  దివంగత ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి పేదలకు అత్యాధునిక వైద్యసేవలు అందించారు. మూగ చెవుడు ఉన్న పిల్లలకు ఆపరేషన్లు చేయాలంటే రూ.6లక్షలు ఖర్చవుతుంది. అలాంటి పిల్లలకు ఏడాది వయస్సులోపే చేయించాలంటూ నిబంధనలు మార్చేశారు. అలా 133 వ్యాధులను ఆరోగ్యశ్రీ నుంచి తప్పించారు. నేను ముఖ్యమంత్రిని అయ్యాక ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తా. అన్ని వ్యాధులకు చికిత్సలు అందేలా చూస్తా. 104, 108 మరింత మెరుగైన సేవలు అందించేలా చూస్తా.
*  ఇంజనీర్లు, డాక్టర్లు కావాల్సిన పిల్లలు మద్యం బెల్టుషాపుల వల్ల దారి తప్పుతున్నారు. ఏ గ్రామంలోనూ బెల్టుషాపు లేకుండా చేస్తా. అందుకోసం ఆ గ్రామం నుంచే మహిళా పోలీసులను ఎంపిక చేస్తాం.
*  రాష్ట్రంలో వేళాపాళాలేని విద్యుత్ కోతలున్నాయి. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. 2019 నాటికి విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తా. వ్యవసాయానికి పగలు ఏడుగంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తా.
*  పేదవాడికి విద్యుత్ బిల్లులు ఇప్పుడు వస్తున్నట్లుగాకుండా రూ.100లకే 150 యూనిట్లు అందేలా చూస్తాం. సర్‌చార్జీల పేరుతో ఇబ్బందులు లేకుండా వ్యవహరిస్తాం.
*  చదువుకున్న ప్రతి పిల్లాడికి ఉద్యోగ భద్రత కల్పిస్తా. ప్రతి తమ్ముడికి ఉద్యోగం దక్కేలా వ్యవహరిస్తాం. చంద్రబాబులా ప్రతి ఇంటికి ఉద్యోగమని నేను చెప్పను. చంద్రబాబు ఆచరణకాని హామీలతో మీ ముందుకు వస్తున్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు చేయలేదని నిలదీయండి. మీ ముద్దుబిడ్డగా నన్ను ఆశీర్వదించండి.

Popular Posts

Topics :