21 August 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదు

Written By news on Saturday, August 27, 2016 | 8/27/2016


’కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదు’
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడున్న పది జిల్లాల పాలనే గాడిన పడలేదన్నారు. తాజాగా కొత్త జిల్లాలంటూ గ్రామాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నారని శివకుమార్ ధ్వజమెత్తారు. ఇప్పుడు జిల్లాల కోసం పోరాడాల్సి వస్తుందని ఆయన అన్నారు. కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై ఇప్పటికే వేలాది ఫిర్యాదులు అందాయని శివకుమార్ పేర్కొన్నారు.

స్విస్ చాలెంజ్ కాదు చంద్రన్న చాలెంజ్


'స్విస్ చాలెంజ్ కాదు చంద్రన్న చాలెంజ్'
హైదరాబాద్: స్విస్ చాలెంజ్ పేరుతో సింగపూర్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. విదేశీ కంపెనీలకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. తనవాళ్లకు మేలు చేసేందుకు సీఎం చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు.

అమరావతి నిర్మాణంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. సింగపూర్ కంపెనీలతో కలిసి ఏర్పాటు అమరావతి డెవలప్ మెంట్ ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతోందని బుగ్గన గణాంకసహింతగా వివరించారు. సింగపూర్ కంపెనీలు చేసేవి కేవలం భూముల వ్యాపారం మాత్రమేనని తెలిపారు. సింగపూర్ కంపెనీలకు అన్నివిధాలా మేలు చేసే సౌకర్యాలు కల్పించినా వారు పెట్టే పెట్టుబడులు మాత్రం నామమాత్రమని చెప్పారు. భారతదేశ చట్టాల్లో లేనివిధంగా సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు సర్కారు ఒప్పందాలు చేసుకుందన్నారు. ఈ ఒప్పందాలేవీ భారతదేశ నిబంధనలకు అనుకూలంగా లేవన్నారు. అప్పులు ఆంధ్రప్రదేశ్ కు.. లాభాలకు సింగపూర్ కు తరహాలో ఒప్పందాలున్నాయన్నారు.

మన ఒప్పందాలు చూసి మిగతా రాష్ట్రాలు నవ్వుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. ఎన్నో సంస్థలు పెట్టి ప్రజలను గందరగోళారికి గురి చేస్తున్నారని వాపోయారు. అయినవారికి మేలు చేసేందుకు ఏ నుంచి జడ్ వరకు అన్ని అక్షరాలు వాడుకుని ఇష్టమొచ్చినట్టుగా సంస్థలు స్థాపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సింగపూర్ కంపెనీలు అల్లుళ్ల కంటే ఎక్కువై కూర్చుకున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో తరిమెల నాగిరెడ్డి 'తాకట్టులో భారతదేశం' అనే పుస్తకం రాశారని ఇప్పుడు ఎవరైనా పుస్తకం రాస్తే 'అమ్మకానికి ఆంధ్రప్రదేశ్' అని పేరు పెడతారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.

వైఎస్‌ కుటుంబం నుంచి నన్ను వేరు చేసే కుట్ర

Written By news on Thursday, August 25, 2016 | 8/25/2016


'వైఎస్‌ కుటుంబం నుంచి నన్ను వేరు చేసే కుట్ర'
శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం నుంచి తనను వేరు చేయడానికే కొన్ని పత్రికల యాజమాన్యాలు కుట్ర పన్నుతున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. గురువారం ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. అవాస్తవ కథనాలతో వైఎస్‌ఆర్‌సీపీని బలహీన పర్చాలనుకుంటున్నారని మండిపడ్డారు.

వైఎస్‌ఆర్‌ వల్లే బీసీలు అధికంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి జరిగిందని ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ.. శ్రీకాకుళం జిల్లాకు ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత పథకాన్ని ఇవ్వలేదని ధర్మాన విమర్శించారు.

రాజకీయాలు చేయడానికి రాలేదు

Written By news on Monday, August 22, 2016 | 8/22/2016


'రాజకీయాలు  చేయడానికి రాలేదు'
హైదరాబాద్ : మానవతా దృక్పధంతో రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవాలని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా  కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10మంది దుర్మరణం చెందగా, మరో 17మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ జగన్ సోమవారం పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆయన ఆరా తీశారు.

అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ....'బస్సు ప్రమాదం ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. గత నెల (జూలై 24న) కూడా ఓ బస్సు నీళ్లలో పడి, ఓ పాప చనిపోయింది. నెలరోజులు కూడా కాకముందే మళ్లీ అదే ప్రాంతంలో ప్రమాదం. ప్రయివేట్ బస్సు సాకుతో ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదు. చికిత్స పొందుతున్న బాధితులు కోలుకోవాలంటే ఇంచుమించు ఆరు నెలలైనా పడుతుంది. ఏరకంగా చూసుకున్నా వాళ్లు బయటకు వెళ్లి పనులు చేసుకోలేని పరిస్థితి. వీరిని ఆదుకునే విషయంలో ప్రభుత్వం స్పందించాలి. ప్రజలకు ప్రైవేట్ బస్సా? ఇంకో బస్సా అని తెలియదు. ప్రయాణికులు చేసిన తప్పేంటి?. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఆదుకోవటంతో పాటు, గాయపడి చికిత్స పొందుతున్నారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు, చికిత్స పొందుతున్నవారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. మానవతా దృష్ట్యా వారిని ఆదుకోవాలి. ప్రైవేట్ బస్సు యాక్సిడెంట్ అయితే థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ఉంటుంది. ఆ బస్సుకు సంబంధించిన ఇన్సురెన్స్ త్వరగా వచ్చేలా చూడాలి.

నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం లేదు. రాజకీయాలు చేయడానికి రాలేదు. ఎవరినీ తప్పుపట్టదలచుకోలేదు. ప్రమాదం జరిగింది ప్రయివేట్ బస్సు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బాధితులకు తోడుగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఘటన జరిగినా వెళ్లడం లేదు. ఆయన రాకున్నప్పటికీ బాధితుల్ని ఆదుకోవాలి.
ఇక ప్రయివేట్ బస్సుల వ్యాపారాలన్నీ టీడీపీ నేతలే చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి కూడా విన్నవిస్తున్నా. ఇదే బ్రిడ్జిపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. కాస్త దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతున్నా' అని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులకు అన్నవిధాలా అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

అదెలా సాధ్యం బాబూ?!

Written By news on Sunday, August 21, 2016 | 8/21/2016


అదెలా సాధ్యం బాబూ?!
‘‘అమరావతిలో 2018 ఒలింపిక్స్..’’ జూలై 2న సీఎం ప్రకటన
‘‘అమరావతిలో అతిత్వరలో ఒలింపిక్స్ నిర్వహిస్తాం..’’
 ఆగస్టు 20న పునరుద్ఘాటన

నాలుగేళ్లకొకమారు నిర్వహించే ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ క్రీడల పండుగ... ఒలింపిక్స్‌ను చంద్రబాబుగారు రెండేళ్లలో ఎలా నిర్వహించబోతున్నారో అర్ధం కాక నెల క్రితం అందరూ తలలు పట్టుకున్నారు. కానీ బాబు తప్పు సవరించుకోలేదు.. తన ఆకాంక్షను శనివారం పునరుద్ఘాటించారు. అమరావతిలో అతిత్వరలో ఒలింపిక్స్‌ను నిర్వహిస్తారట. అసలు ఒక రాష్ర్టప్రభుత్వానికి ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఎంత ఖర్చవుతుంది? ఒలింపిక్స్ నిర్వహించే అవకాశమెలా వస్తుంది? దానికి ఎలాంటి ప్రక్రియ ఉంటుంది? ఇలాంటి అంశాలపై ప్రాథమిక అవగాహన లేకుండా సీఎం ఇలాంటి బాధ్యతారహిత ప్రకటనలు చేయడమేమిటని ప్రజలు విస్తుపోతున్నారు. 2020 ఒలింపిక్స్ టోక్యోలో నిర్వహించాలని ఎప్పుడో నిర్ణయమైపోయింది.

2024 ఒలింపిక్స్‌కు కూడా బిడ్డింగ్ పూర్తయిపోయింది. ఇక మిగిలింది 2028 ఒలింపిక్సే. అదీ ఒలింపిక్స్ నిర్వహిస్తామని ఒక రాష్ర్టప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం లేదు. దేశం ప్రతిపాదించాల్సి ఉంటుంది. పరిపాలన, నిర్వహణా సామర్థ్యం, చట్టపరమైన చిక్కులు, క్రీడాగ్రామాల సదుపాయాలు.. ఇలా ఎన్నో అంశాలను పరిశీలిస్తారు. అనేక దశలలో వడపోత అనంతరం దేశాన్ని ఫైనల్ చేస్తారు. ఒలింపిక్స్ నిర్వహణంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇప్పటికి ఒలింపిక్స్ నిర్వహించిన 10 దేశాలు దివాలా తీశాయట. బీజింగ్ ఒలింపిక్స్ నిర్వహించిన చైనా 42 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అంటే 2.73 లక్షల కోట్లు. మరి అంత సామర్థ్యం ఏపీకు ఉందా?  తెలుగుతేజం పివి సింధు ఒలింపిక్స్‌లో రజతం సాధించి దేశ ప్రతిష్టను దిగంతాలకు చాటిన నేపథ్యంలో చంద్రబాబు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు.

గోపీచంద్‌కు తమ హయాంలో భూమి కేటాయించడం వల్లనే ఇదంతా సాధ్యమైందని చంద్రబాబు ప్రకటించేశారు. ఎవరు ఏం సాధించినా దానిని తనకు ఆపాదించుకోవడం చంద్రబాబుకు కొత్తకాదు. సెల్‌ఫోన్ తానే కనిపెట్టానని, హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని ఆయన తరచూ ప్రకటిస్తుండడం ఈ కోవలోనివే. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు చేస్తున్న ఇలాంటి ప్రకటనలు చూసి హైదరాబాద్‌లో పర్యటిస్తున్న స్విట్జర్లాండ్ మంత్రి పాస్కల్ కొచెపిన్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ప్రకటనలు చేస్తే మా దేశంలో జైలులోనైనా పెడతారు.. లేదంటే పిచ్చాసుపత్రికైనా పంపిస్తారు’’ అని ముఖంపైనే చెప్పిపోయారు.    http://www.sakshi.com/news/hyderabad/how-is-it-possible-babu-384321?pfrom=home-top-story

టీఆర్‌ఎస్‌కు టీడీపీకి ఉన్న లోపాయికారీ ఒప్పందమేంటి?

సీఎం సమాధానం చెప్పాలి
♦ అఖిలపక్షానికి వైఎస్సార్‌సీపీని ఎందుకు పిలవలేదు: గట్టు
♦ రాజ్యాంగ విరుద్ధంగా జిల్లాల విభజన
♦ కేసీఆర్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్
♦ ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన
సాక్షి, హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన అంశంపై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పిలవలేదో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమాధానం చెప్పాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష భేటీకి వైఎస్సార్‌సీపీని ఆహ్వానించనందుకు నిరసనగా శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ‘నిశ్శబ్ద నిరసన’ చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తే తాము చూస్తూ కూర్చోబోమని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపున్న పార్టీని, ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న పార్టీని పక్కనపెట్టడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. ‘టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉంటూ ఎర్రబెల్లి దయాక ర్‌రావు చట్టసభలో టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. అలాంటి టీడీపీని అఖిలపక్ష భేటీకి ఎలా పిలిచారు? టీఆర్‌ఎస్‌కు టీడీపీకి ఉన్న లోపాయికారీ ఒప్పందమేంటి? ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి విలీనం చేసుకోవడం.. ఆ పార్టీ లేదంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అంటే ఎనలేని గౌరవమని తరచూ చెప్పే సీఎం ఆ రాజ్యాంగాన్నే ఎందుకు ఉల్లఘిస్తున్నారు..’’ అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
 క్షమాపణ చెప్పాలి...
అఖిలపక్షానికి వైఎస్సార్‌సీపీని పిలవనందుకు క్షమాపణ చెప్పాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ డిమాండ్ చేశారు. త్వరలో తాము కోర్టులో వేసే పిటిషన్‌కు ప్రభుత్వమే కదులుతుందని చెప్పారు. కేసీఆర్ మోసపు, అహంకార పాలనను సాగనివ్వమని అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ కుటుంబ పాలనకు అంతం పలకాలని పార్టీ మరో ప్రధాన కార్యదర్శి మతిన్ ముజాదుద్దీన్ ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ నేతలంతా తొలుత బోట్‌క్లబ్ నుంచి ప్రదర్శనగా అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని.. అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌రావు, జె.మహేందర్‌రెడ్డి, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కె.అమృతసాగర్ (మహిళా విభాగం), బండారి వెంకట రమణ (సేవాదళ్), బి.శ్రీవర్దన్‌రెడ్డి (ఐటీ విభాగం), నర్ర భిక్షపతి (ట్రేడ్ యూనియన్), డాక్టర్ ప్రఫుల్లారెడ్డి (డాక్టర్స్ విభాగం), జిల్లాల అధ్యక్షులు బొడ్డు సాయినాథ్‌రెడ్డి (హైదరాబాద్), ఎం.భగవంత్‌రెడ్డి (మహబూబ్‌నగర్), నాడెం శాంతికుమార్ (వరంగల్), తుమ్మలపల్లి భాస్కర్‌రావు (నల్లగొండ), బెంబడి శ్రీనివాస్‌రెడ్డి (రంగారెడ్డి), అక్కెనపల్లి కుమార్ (కరీంనగర్), నాయుడు ప్రకాష్ (నిజామాబాద్), ఇతర నాయకులు శ్యామల (గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు), డాక్టర్ మవీన్, పి.బాలక్రిష్ణారెడ్డి, రఘురామిరెడ్డి, రహీమ్ షరీఫ్ పాల్గొన్నారు.
 పలువురు నేతల అరెస్ట్
నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను పొలీసులు అరెస్టు చేశారు. గట్టు శ్రీకాంత్‌రెడ్డిని పోలీసు వ్యాన్‌లోకి బలవంతంగా ఎక్కిస్తుండగా ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కార్యకర్తలు, నాయకులు ఆయనను హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స సాయంత్రం శ్రీకాంత్‌రెడ్డి డిచార్జ్ అయ్యారు. ఇక నేతలు కె.శివకుమార్, కె.అమృతసాగర్, ఎం.శ్యామల, భగవంత్‌రెడ్డి, కేసరి సాగర్, హిరాణిరెడ్డి, మేరి, విష్ణుప్రియ, ఇందిరారెడ్డి, పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా వైఎస్సార్‌సీపీ నేతలు తమ నిరసన కొనసాగించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు.
ఎంతకాలం మోసం చేస్తారు?
బీడు భూములకు నీరు, లక్ష ఉద్యోగాలు అని హామీలు గుప్పించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఒక్క ఎకరాకు నీరివ్వలేదని, ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. పూటకో మాట, వారానికో ప్రకటన చేస్తూ ప్రజల్ని ఎంత కాలం మోసగిస్తారని ప్రశ్నించారు. మండలాల ప్రాతిపదికన జిల్లాల విభజన అంటూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయం మేరకు జరిగే విభజనను మాత్రమే తాము అంగీకరిస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఏ ప్రాతిపదికన టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని, అప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

Popular Posts

Topics :