
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 83వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. శనివారం ఉదయం వైఎస్ జగన్ కావలి నియోజకవర్గం దుండిగం క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి దుండిగం, ఇతంపాడు క్రాస్‌రోడ్డు మీదుగా , మునుబోలుపాడు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ దివంగత నేత వైఎస్‌ఆర్ విగ్రహంతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.
మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. లింగాలపాడు క్రాస్ రోడ్డు మీదుగా బోదగుడి చేరుకుంటుంది. దివంగత నేత వైఎస్‌ఆర్ విగ్రహం ఆవిష్కరించడంతో పాటు పార్టీ జెండాను ఎగురవేస్తారు. అనంతరం బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. రాత్రి అక్కడే బసచేస్తారు.