05 April 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

సొమ్మసిల్లి పడిపోయిన రోజా

Written By news on Saturday, April 11, 2015 | 4/11/2015


సొమ్మసిల్లి పడిపోయిన రోజా
తిరుపతి: చిత్తూరు జిల్లా పుత్తూరు సీఐ కార్యాలయం ఎదుట శనివారం ధర్నాకు దిగిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆమెను వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం పుత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ బీసీ రుణాల విషయమై అధికారులను ఎమ్మెల్యే రోజా నిలదీశారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు రోజాతో వాగ్వివాదానికి దిగారు. దాంతో రోజా ధర్నాకు దిగారు.
ఆ సమయంలో రోజా చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు గోరంతలు కొండంతలు చేశారు. టీడీపీ నాయకులు శుక్రవారం సాయంత్రం రోజా వ్యాఖ్యాలపై పుత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు చేసి ఎస్ఐ, సీఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం పుత్తూరు సీఐ కార్యాలయం ఎదుట రోజా ధర్నా నిర్వహించారు. ఆ క్రమంలో రోజా  సొమ్మసిల్లి పడ్డిపోయారు.
 

రైతులను ఏడిపించిన సర్కార్‌కు మనుగడ లేదు


రైతులను ఏడిపించిన సర్కార్‌కు మనుగడ లేదు
 • వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
బోనకల్: రైతులను కంటతడి పెట్టించిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సాగర్‌నీటి కోసం కాల్వపైకి వెళ్లిన రైతులు ఉమ్మనేనిబాబు, కళ్యాణపు శ్రీనివాసరావు, పెంట్యాల రమేష్, ఉమ్మనేని రవిలపై కేసులు పెట్టి జైలుకు పంపించిన విషయం విదితమే. తొమ్మిది రోజుల తరువాత విడుదలై  స్వగ్రామం గోవిందాపురం వచ్చినవారిని ఎంపీ శుక్రవారం పరామర్శించారు.

ఘటన తీరును అడిగి తెలుసుకున్నారు. పంటలు ఎండిపోతుంటే నీళ్లు అడిగిన రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ఏమిటని, ఈ విషయమై రైతులతో వెళ్లి నీటిపారుదల సీఈ, ముఖ్యమంత్రిని కలుస్తానన్నారు.

పంట చేతికందే సమయంలో నీళ్లు అందక ఎండిపోతుంటే అధికారులను బతిమిలాడినప్పటికీ విడుదల చేయలేదనీ, పైగా అధికారులు రైతు పెంట్యాల రమేష్ చొక్కా పట్టుకుని దౌర్జన్యం చేశారని పలు వురు రైతులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీ మాట్లాడుతూ  రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఉద్యమం చేస్తామన్నారు.

బాబూ.. పారిశ్రామికవేత్తలకో న్యాయం, రైతులకు మరో న్యాయమా?

Written By news on Friday, April 10, 2015 | 4/10/2015


'బాబూ.. పారిశ్రామికవేత్తలకో న్యాయం, రైతులకు మరో న్యాయమా?'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణ మండిపడ్డారు. కరువుపై చంద్రబాబుకు అవగాహన లేదని, అందుకే 2013 ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వనని చెబుతున్నారని విమర్శించారు.

పారిశ్రామికవేత్తలకు ఓ న్యాయం, రైతులకు మరో న్యాయమా అని విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణ తప్పుపట్టారు. చంద్రబాబుకు రాయలసీమపై నిజంగా ప్రేమ ఉంటే హంద్రీ నీవాకు 1500 కోట్ల రూపాయల నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తామని చంద్రబాబు, మంత్రులు పొంతనలేని హామీలు ఇస్తున్నారని అన్నారు. అక్రమ సంపాదన కోసమే పట్టిసీమ ప్రాజెక్టు ముందుకుతెచ్చారని ఆరోపించారు. ఎన్నికల హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదని వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రశ్నించారు. రుణమాఫీ హామీ అమలుగాక రైతులు, డ్వాక్రా మహిళలు అనేక కష్టాలు పడుతున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా ప్రజలు టీడీపీకి 2 ఎంపీ, 12 ఎమ్మెల్యే సీట్లు గెలిపించినా చంద్రబాబు జిల్లాకు చేసింది శూన్యమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సూచనలతోనే వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయని విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణ ఆరోపించారు.

ఏకే 47 లేకుండానే రైతుల ఎన్‌కౌంటర్


ఏకే 47 లేకుండానే రైతుల ఎన్‌కౌంటర్
 • ఏపీ సీఎం బాబుపై నిప్పులు చెరిగిన మేధాపాట్కర్
 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకే 47లు లేకుండానే రాజధాని గ్రామాల్లోని రైతులు, రైతుకూలీలను ఎన్‌కౌంటర్ చేస్తున్నారని ప్రముఖ సామాజిక ఉద్యమ నేత మేధాపాట్కర్ నిప్పులు చెరిగారు. తన చర్యలద్వారా చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్నారు. 

భూసేకరణ చట్టం లో మార్పులకోసం జారీ చేసిన రెండో ఆర్డినెన్స్‌కు నిరసనగా మే 5న ఢిల్లీలో 300 సంఘాలతో భారీఎత్తున ‘‘భూ అధికార్ ఆందోళన్’ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా రాయపూడిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏపీ రాజధాని నిర్మాణ నేపథ్యంలో దేశం దృష్టి మొత్తం ఈ ప్రాంతంపై ఉందని, బాబు పాలన లో ఏం జరుగుతోందని అందరూ గమనిస్తున్నారన్నారు.

రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు అప్పగించారని ప్రభుత్వం చెబుతోందని, ఇక్కడ రైతులు మాత్రం ప్రభుత్వం తమను బెదిరించి.. ఒత్తిడి తెచ్చి భూముల అప్పగింతకు అంగీకార పత్రా లు తీసుకున్నట్లు చెప్పారని ఆమె తెలిపారు. ఈ పత్రాలకు చట్టప్రకారం ఏమాత్రం విలువ లేదన్నారు. సీఆర్‌డీఏతో ఒప్పందం, పవర్ ఆఫ్ అటార్నీ చేసుకుంటేనే చట్టప్రకారం చెల్లుబాటవుతుందన్నారు. రాజధానిప్రాంత రైతులెవరూ ఇకమీదట ఎలాంటి పత్రాలమీద సంతకాలు కానీ, వేలిముద్రలు కానీ వేయొద్దని ఆమె సూచించారు.

ప్రభుత్వం తమను పెడుతున్న బాధలను వివరించడానికి ఈ ప్రాంతానికి చెందిన రైతులు, రైతుకూలీలు ఢిల్లీకి వచ్చి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారంటే ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. సీఆర్‌డీఏ చట్టవిరుద్ధంగా ఉందని, రాజధాని రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీగా మారిన దీన్ని జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక అంగీకరించబోదన్నా రు.

విజయవాడ-గుంటూరు మధ్య 120 రకాల పంటలు పండే భూముల్ని బాబు ప్రభుత్వం నాశనం చేయాలనుకుంటోందన్నారు. కాగా మేధాపాట్కర్ వెంట రిటైర్డ్ ఐఏఎస్ దేవసహాయం, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు నాయకులు ఉండవల్లి బాలాజీరెడ్డి, మల్లెల హరీంద్రనాథ్ చౌదరి, హక్కుల నాయకురాలు సంధ్య, మనోరమ, శ్రీ వాణి,  సీహెచ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
 
ప్రజాభీష్టానికి విరుద్ధం...

భూసమీకరణ రాజధాని నిర్మాణంకోసం జరుగుతున్న ప్రక్రియగా లేదని మేధాపాట్కర్ విమర్శించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, చండీగఢ్ లాంటి కొత్త రాజధానుల నిర్మాణం ఇలా జరగలేదన్నారు. ప్రధాని మోదీ 2013 భూసేకరణ చట్టాన్ని సవరించాలని చూస్తుంటే, సీఎం చంద్రబాబు సహాయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజధాని నిర్మాణం చివరకు సింగపూర్ ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి పోతోందన్నారు. రాజధాని జోన్‌లో మరో 100 గ్రామాలను కలుపుతారంటున్నారని, ఇలాగే ముందుకుపోతే బాబుకు ఇబ్బందులు తప్పవని అన్నారు. బాబు సింగపూర్ భాగస్వాముల ప్రయోజనం కోసమే విశాఖలోని భోగాపురం, మంగళగిరిలో అంతర్జాతీయ విమానాశ్రయాలు కడతామని చెబుతున్నారన్నారు.
 
భూ రాజకీయాన్ని బాబు ఇంతటితో ఆపాలి

బాబు భూసమీకరణ రాజకీయాన్ని ఇంతటితో ఆపితే మంచిదని, తాను మళ్లీ ఎన్నికలు ఎదుర్కోవాలనే విషయం గుర్తుంచుకోవాలని ఆమె హితవు చెప్పారు. బాబు ఇప్పటికైనా ప్రజ లకు అబద్ధాలు చెప్పడం మాని వ్యవసాయానికి పనికిరాని ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టుకోవాలని సూచించారు. భూసమీకరణపై రాజకీయ పార్టీలు పార్టీ లెటర్‌హెడ్‌లపై తమ విధానాన్ని రాతపూర్వకంగా చెప్పాలన్నారు. భూసమీకరణ ప్రక్రియను ఇంతటితో ఆపేయాలని తమ సంస్థ తరఫున ప్రధానికి లేఖ రాస్తామన్నారు. బాధితులకు అండగా ఈ పోరాటాన్ని జాతీయస్థాయికి తీసుకెళతామన్నారు. చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/ak-47-without-the-farmers-encounter-229040

ఆ పరిపాలన ఇచ్చే దిశగా కలసి కృషిచేద్దాం

⇒ ప్రజాప్రస్థానం 12వ వార్షికోత్సవంలో వైఎస్ జగన్
⇒ పిల్లల చదువు, వైద్య చికిత్స..పేదలు అప్పుల్లో కూరుకుపోయేవిగా వైఎస్ గుర్తించారు
⇒ ఈ సమస్యలను వారికి లేకుండా చేసేందుకే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు
⇒ ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత ఆయనదే
⇒ చంద్రబాబు తొమ్మిదేళ్లలో 17 లక్షల పింఛన్లు ఇస్తే.. వైఎస్ 78 లక్షల పింఛన్లు ఇచ్చారు
⇒ మళ్లీ వైఎస్సార్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు..
⇒ ఆ పరిపాలన ఇచ్చే దిశగా కలసి కృషిచేద్దాం పార్టీ శ్రేణులకు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు


సాక్షి, హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజాప్రస్థానం వల్లనే ఆ తరువాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక దేశంలోనే ఎవరూ చూడని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమ పాలనను అందించారని, ఇప్పటికీ ఆయన పాలన మనందరికీ స్ఫూర్తిగా నిలిచిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేదవాడు అప్పుల్లో కూరుకుపోయేది ప్రధానంగా తన పిల్లల చదువులకయ్యే ఖర్చుకోసం, రెండోది ఆరోగ్యం ప్రమాదకరంగా దెబ్బతిన్నప్పుడు చికిత్సకయ్యే ఖర్చుకోసం అనే విషయాలను వైఎస్ గుర్తించారని, ఈ రెండు సమస్యలను ప్రజలకు లేకుండా చేసేందుకే ఆయన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారని జగన్ చెప్పారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో 1,475 కిలోమీటర్ల మేరకు 11 జిల్లాల్లో పాదయాత్ర చేసి సరిగ్గా 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తొలుత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన మాట్లాడారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏడాదికి పేదలకోసం రెండు లక్షల ఇళ్లు నిర్మించడమే గగనమైందని, కానీ వైఎస్ ఏటా పది లక్షల ఇళ్లను నిర్మించారని జగన్ తెలిపారు.

మొత్తం ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లను నిర్మించిన ఘనత వైఎస్‌దేనన్నారు. చంద్రబాబు 17 లక్షల పింఛన్లు ఇస్తే వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక 78 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు చేపట్టారు కనుకనే వైఎస్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. మళ్లీ వైఎస్సార్ పాలన రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆ పరిపాలన ఇచ్చే దిశగా అంతా కలసి కృషి చేద్దామని జగన్ అన్నారు.
 
వైఎస్ పాదయాత్ర చరిత్రాత్మకం...

దివంగత వైఎస్సార్ 12 ఏళ్ల కిందట చేసిన పాదయాత్ర చరిత్రాత్మకమైందని, మలమల మాడే ఎండల్లో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఆయన ఈ సుదీర్ఘమైన యాత్ర చేశారని జగన్ అన్నారు. భయంగొలిపే ఎండల్లో వైఎస్ పాదయాత్ర చేసిన ఫలితంగా ఆయనకు వడదెబ్బ సోకి వారం రోజులపాటు అనారోగ్యానికి గురయ్యారని, ఆ సమయంలో తాను కూడా రాజమండ్రికి వెళ్లి చూశానని  జగన్ తన తండ్రి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు.

 ‘‘ఆ రోజుల్లో చంద్రబాబు సర్కారు యూజర్ చార్జీల దగ్గరి నుంచి కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీల వంటివన్నీ పెంచేసి ప్రజలను వరుసగా బాదేస్తూ ఉండేది. ప్రజలపై భారం మోపడానికే ఈ సర్కారు ఉన్నదా! అనేలా బాబు పాలిస్తూ ఉండేవారు. చార్జీల వాతలిలా ఉంటే మరోవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులుండేవి. ఒక హెచ్‌పీ విద్యుత్‌కు అప్పటిదాకా ఉన్న చార్జీని రూ.50 నుంచి 665 రూపాయలకు చంద్రబాబు అప్పట్లో పెంచేశారు’’ అని ఆయన గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ హామీ ఇస్తే... ‘అపుడు కరెంటు తీగలు బట్టలారేసుకోవడానికే పనికి వస్తాయి...’ అని చంద్రబాబు అవ హేళన చేశారన్నారు.

ప్రజలు పడుతున్న బాధల్లో వారికి తోడుగా నిలబడి.. మీకు అండగా ఉండటానికి మేమొస్తున్నామని వైఎస్ ఒక భరోసాను పాదయాత్రలో ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ వైద్య విభాగం నేత గోసుల శివభరత్‌రెడ్డి, హిందూపురం లోక్‌సభా నియోజకవర్గం వైసీపీ నేత డి.శ్రీధర్ , తెలంగాణకు చెందిన నేత సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Man claims woodcutters were taken to forest, shot

Written By news on Thursday, April 9, 2015 | 4/09/2015

Police officials standing at the encounter site. (Photo: Deccan Chronicle)
Police officials standing at the encounter site. (Photo: Deccan Chronicle)
Chennai: Countering claims made by the police that the men who went to cut down red sanders were shot dead in an encounter, one man who reportedly escaped from the scene and reached his village claimed that the bus they were travelling in was intercepted, the men arrested and taken to the forests where they were shot dead in cold blood.
Even as the first batch of kin of encounter victims arrived at the Ruia Government Hospital on Wednesday to confirm the identities of the deceased, Sekar of Gandhinagar, Polur taluk, who claimed to be a survivor, reached his village in the Tiruvannamalai hills on Tuesday morning to inform that seven others had been arrested by the AP police near Nagari, 50 km from the encounter scene.
“By the time we considered options to get them out on bail, police personnel from Kannamangalam police station reached us with photographs of the deceased, saying they were killed in an encounter near Tirupati,” said G. Karunakaran, brother of one of the 20 persons who were shot down.
The seven had left their homes on Monday.
They had boarded a bus from Tiruvannamalai to Chittoor when the members of the Red Sanders Anti-Smuggling Task Force intercepted the bus near Nagari, about 50 km from the encounter scene on Monday evening.
“All of them are casual labourers and go to work at different places. I have known them to work in Tiruppur, Chennai, Chittoor and even in Kerala on construction jobs,” said Sivakumar of Anantapuram.
Sekar, who looks older than the rest and who had a woman passenger sitting beside him in the bus, escaped arrest as the cops overlooked him while arresting seven others.
Sekar caught the next bus back home and spread the word among the villagers about the arrest only to learn in a few hours that the men were no more.

http://www.deccanchronicle.com/150409/nation-current-affairs/article/man-claims-woodcutters-were-taken-forest-shot

రాజధానిపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు


'రాజధానిపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూములపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని మంగళగిరి వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వ్యాఖ్యానించారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

హైకోర్టు తీర్పు రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల విజయంగా ఆర్కే అభివర్ణించారు. ఇప్పటికైనా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం భూ సమీకరణ అంశంలో పునరాలోచించాలని ఎమ్మెల్యే ఆర్కే సూచించారు.

బాబు కుట్రలో దోషులవుతున్న పోలీసులు


బాబు కుట్రలో దోషులవుతున్న పోలీసులు
తిరుపతి:  సీఎం చంద్రబాబు కుట్రలో పోలీసులు దోషులుగా మిగులుతున్నారని, శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటరే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. రుయా ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న పోలీసులను బుధవారం ఆయన పరామర్శించారు.

అనంతరం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసులకు, అటవీ సిబ్బందికే రక్షణ లేకపోతే, ప్రజలకు, ప్రకృతి సంపదకేం రక్షణ ఉంటుందన్నారు. ఈ విషయంలో అందరూ పార్టీలకతీతంగా పోలీసులకు, అటవీ సిబ్బందికి అండగా నిలవాలన్నారు.
 

ప్రజా ప్రస్థానం 12వ వార్షికోత్సవం నేడు


ప్రజా ప్రస్థానం 12వ వార్షికోత్సవం నేడు
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో సాహసోపేతమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టి గురువారం నాటికి సరిగ్గా పన్నెండేళ్లు. కరవు కాటకాలతో ప్రజలు అల్లాడుతున్నప్పుడు... నిరాశ,నిస్పృహలతో రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు... తమను ఆదుకునే వారేరని ప్రజలు ఎదురుచూస్తున్న దయనీయ పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రతిపక్ష నేతగా రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9న సాహసోపేతమైన పాదయాత్రకు నడుం బిగించారు.రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి జూన్ 15 న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు అప్రతిహతంగా కొనసాగించారు.

నడి వేసవిలో 40 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా 11 జిల్లాల్లో 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకొచ్చే 690 గ్రామాల ప్రజలను పలకరిస్తూ ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు. ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర లక్ష్యాలను స్మరించుకోవడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం 12 వ వార్షికోత్సవ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొంటారు.

వారి ప్రాణాలు తీయడం ఎంత వరకు న్యాయం?:వైఎస్ జగన్


వారి ప్రాణాలు తీయడం ఎంత వరకు న్యాయం?:వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: తుపాకులేమీ లేని 20 మంది కూలీల ప్రాణాలను బలిగొనడం ఎంతవరకు న్యాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీల కాల్చివేత ఘటనపై ఆయన ట్వీట్ చేశారు. ‘‘వారి చేతుల్లో ఎలాంటి తుపాకులు లేనప్పుడు 20 మంది కూలీల ప్రాణాలను తీయడం ఎంతవరకు సమంజసం’’ అని  వైఎస్‌జగన్ తన ట్విటర్ ఖాతాలో ప్రశ్నించారు.
 

ఉన్నత విలువల కోసం పాటుబడి న్యాయవాది అశోక్:వైఎస్ జగన్

Written By news on Wednesday, April 8, 2015 | 4/08/2015

హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్ఆర్ అశోక్ ఉన్నత విలువల కోసం పాటుపడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. అశోక్ మృతికి ఆయన సంతాపం తెలిపారు.

ప్రముఖ న్యాయవాదిగా పేరు ఘడించిన అశోక్ కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కమీషన్ కాకతీయగా మార్చొద్దు


కమీషన్ కాకతీయగా మార్చొద్దు
 • అవినీతికి ఆస్కారమివ్వొద్దు: వైఎస్సార్‌సీపీ
సాక్షి, హైదరాబాద్:  చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ కార్యక్రమం కమీషన్ కాకతీయ, గ్రాండ్ కాకతీయగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులకు ప్రయోజనం కలిగించేవిధంగా కమీషన్ల వ్యవహారంగా, పార్టీ కార్యక్రమంగా ముద్రపడకుండా చూడాలని సూచించింది. మంగళవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధానకార్యదర్శులు శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డిలతో కలిసి ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి మీడియాతో మాట్లాడారు.

మిషన్ కాకతీయ పనులు మొదలుపెట్టగానే అవకతవకలు జరుగుతున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయని చెప్పారు. రైతులకు దీర్ఘకాల ప్రయోజనాలు చేకూరేలా శాస్త్రీయకోణంలో మిషన్ కాకతీయ పనులు చేయాలని సూచించారు. మిషన్ కాకతీయలో ఒక్క రూపాయి అవినీతికి కూడా తావివ్వొద్దని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ సూచించారు. దీనిని కమీషన్ల కార్యక్రమంగా నిర్వహించినా, ఎక్కడైనా అవకతవకలు జరిగినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకుంటారని స్పష్టం చేశారు.

ప్రాజెక్టుల పరిశీలనకు వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర


ప్రాజెక్టుల పరిశీలనకు వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర
 • 15, 16, 17 తేదీల్లో యాత్ర
 • ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాల్గొననున్న వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రపరిశీలన చేసి అక్కడి రైతులతో ముఖాముఖిగా మాట్లాడేందుకు ఈ నెల 15, 16, 17 తేదీల్లో తమ పార్టీ బస్సు యాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలసి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ బస్సు యాత్రలో పాల్గొంటారని చెప్పారు. 15వ తేదీ ఉదయం రాజమండ్రిలో యాత్ర ప్రారంభించి.. ధవళేశ్వరం, పోలవరం కాలువలు, పట్టిసీమ ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ, వెలుగొండ, బనకచర్ల క్రాస్, పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా హెడ్‌రెగ్యులేటర్ వరకూ మూడు రోజుల పాటు యాత్ర కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కోస్తా, రాయలసీమల్లో ప్రతిపాదిత ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని కోరుకుంటున్నామని, అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధిని తమ పార్టీ కాంక్షిస్తోందని చెప్పారు. దానిగురించే ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

పోలవరాన్ని ఎందుకు అటకెక్కిస్తున్నారు?
అన్ని అనుమతులూ లభించడంతో పాటు ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న తరుణంలో బృహత్తరమైన పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. పోలవరాన్ని విభజన చట్టంలో పేర్కొన్నారని, అయినా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇపుడున్న ప్రాజెక్టులపై ప్రతి ఏటా రూ. 2,000 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల వరకూ ఖర్చు చేసి రెండు మూడేళ్లలో వాటిని పూర్తి చేయాలని తమ పార్టీ కోరుతోందన్నారు. కానీ బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఆశాజనకంగా లేవని.. టీడీపీ నేతలు చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోందని విమర్శించారు. రాయలసీమకు నీళ్లిస్తామని చెబుతున్న వారు హంద్రీ-నీవా, గాలేరు-నగరికి పూర్తిస్థాయిలో నిధులెందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు.

 రాయలసీమలోని 7,000 చెరువులకు నీళ్లు ఇవ్వగలిగామని టీడీపీ మంత్రి ఒకరు సంతోషంగా చెప్పారని, అయితే అందుకు కారణమైన మహనీయుడు ఎవరనే విషయం చెప్పలేదని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులనే మొక్కలు నాటి పెంచి పోషించిన వ్యక్తి పేరును చెట్టు ఫలాలు తింటున్నపుడైనా స్మరించుకోవాలనే కనీస విజ్ఞత వారికి లేకుండా పోయిందన్నారు. పదేళ్ల క్రితం ఎవరు కృషి చేస్తే.. ఇప్పుడు చెరువులకు నీళ్లివ్వగలిగారో చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ఈరోజు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు ఈ స్థాయిలో ఉన్నాయంటే అందుకు కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డేనని గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. పులిచింతల, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, పట్టిసీమ కాలువలు.. ఇలా ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా వాటి ని తీర్చిదిద్దిన ఘనత వైఎస్‌దేనని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు చేయకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని అప్పట్లో వైఎస్ ఆలోచించారని ఆయన అన్నారు

మృతుల పక్కన పడివున్న పెయింట్ మార్కుల ఎర్రదుంగలు ఎక్కడివి?


కూలీలను కాల్చేశారుమంగళవారం చిత్తూరు జిల్లా సచ్చినోడి బండ వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన ఎర్రచందనం కూలీలు
11 మంది  సచ్చినోడి బండలో..

9 మంది  చీకటీగల కోనలో..  

ఎర్రచందనం చెట్లు నరికేందుకు స్మగ్లర్లు తెచ్చిన 20 మంది కూలీలను కాల్చి చంపిన పోలీసులు

శేషాచలం కొండల్లో  తెల్లవారుజామున 2 చోట్ల భారీ ‘ఎన్‌కౌంటర్’

 

 మృతులు తమిళనాడు కూలీలు కూంబింగ్ సందర్భంగా ఎన్‌కౌంటర్ జరిగింది: టాస్క్‌ఫోర్స్
► రాళ్లు, గొడ్డళ్లతో దాడికి దిగితే.. ఎదురు కాల్పులు జరిగాయన్న డీఐజీ
► కూలీలను పట్టుకొచ్చి కాల్చి చంపారంటూ ఆరోపణల వెల్లువ
► మృతుల పక్కన పడివున్న పెయింట్ మార్కుల ఎర్రదుంగలు ఎక్కడివి?
► మిగతా వారు దుంగలతోనే పారిపోయారా?
► {పజాసంఘాలు, హక్కుల వేదికలు, పార్టీల మండిపాటు
► ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు
► చంద్రబాబుకు ఘాటుగా లేఖ రాసిన తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం

 
 
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులు రక్తమోడాయి. పొట్టకూటికోసం తమిళనాడు నుంచి వచ్చిన ఎర్రచందనం కూలీలు 20 మంది పోలీసుల తుపాకుల తూటాల బలయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో చేష్టలుడిగిన ప్రభుత్వం కూలీలపై ప్రతాపం చూపిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆత్మరక్షణలో భాగంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఈ 20 మంది కూలీలు చనిపోయారని పోలీసులు చెప్తున్నా.. అక్కడ అలాంటి ఆనవాళ్లు ఏవీ కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలు గాలింపు చేపడుతున్నాయి. జరిపిన ‘రెండు ఎన్‌కౌంటర్ల’లో ఒక్క కూలీని కూడా గాయాలతో కానీ ప్రాణాలతో కానీ పట్టుకోకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఘటనా ప్రాంతా ల్లో మృతదేహాలు పడివున్న తీరు, వారిపక్కన పేర్చినట్లు ఉన్న ఎర్రచందనం దుంగలు, ఆ దుంగలపై పోలీసులకు పట్టుబడిన దుంగలపై వేసే పెయింట్ గుర్తులు ఉండటం వంటి పరిస్థితులు ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న కూలీలను పట్టుకెళ్లి అక్కడ కాల్చిచంపి.. ఎదురు కాల్పులని చిత్రీకరిస్తున్నారన్న ఆరోపణలు ప్రజా సంఘాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ పలు రాజకీయ పక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మానవహక్కుల సంఘాలు కూడా ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని నినదించాయి. చనిపోయిన వారంతా తమిళనాడుకు చెందినవారే కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఘాటుగా లేఖరాశారు. తమిళనాడు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా ‘ఎన్‌కౌంటర్’ ఘటనపై ఆరా తీసింది.
 
తిరుపతి: చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండలు పోలీసుల తుపాకుల మోతతో దద్దరిల్లాయి. చంద్రగిరి మండ లం శ్రీవారిమెట్టు సమీపంలోని రెండు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం జరిగిన భారీ ‘ఎన్‌కౌంటర్’లో 20 మంది ఎర్రచందనం కూలీలు మృతి చెందారు. పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం.. ‘‘ఎర్రచందనం చెట్లు నరి కేందుకు స్మగ్లర్లు తీసుకొచ్చిన కూలీల కదలికలపై అటవీ  అధికారులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సోమవారం రాత్రి 7 గంటల సమయంలో సమాచారం అందింది. దీం తో.. ఒక్కో బృందంలో 12 మంది టాస్క్‌ఫోర్స్, ముగ్గురు అటవీ సిబ్బంది చొప్పున రెండు బృందాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ బృందాలకు ఉదయం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో వంద మందికి పైగా కూలీలు తారసపడ్డారు. ఎర్రచందనం కూలీలు పోలీసు బృందాలపైకి రాళ్లు రువ్వారు. గొడ్డళ్లతో దాడులకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు లొంగిపోవాలని కూలీలను హెచ్చరిం చారు. గాల్లోకి కాల్పులు జరిపారు. చివరకు ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ కూలీలు చనిపోయారు. సచ్చినోడి బండ ప్రాంతంలో 11 మంది, ఈతగుంట సమీపంలోని చీకటీగల కోనలో 9 మంది మృతిచెందారు. మిగతా కూలీలు శేషాచలం అడవిలోకి పారిపోయారు. కూలీలు రాళ్లు రువ్వడంతో ఎనిమిది మంది పోలీసులకు గాయాలయ్యాయి.’’ అడవుల్లోకి పారిపోయినవారి కోసం టాస్క్‌ఫోర్స్, పోలీసులు, అట వీ శాఖ ఆధ్యర్యంలో భారీగా సిబ్బందిని మోహరించి గాలింపు కొనసాగిస్తున్నామని పోలీసుఅధికారులు తెలిపారు. కడప, తిరుపతి, రేణిగుంట, చిత్తూరు ప్రాంతాల్లో పోలీసులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గాయపడిన పోలీసులు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలంలో మూడు గొడ్డళ్లు, రెండు నాటు తుపాకులను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. మృతి చెందిన వారంతా తమిళనాడుకు చెందిన కూలీలే అని భావిస్తున్నారు. మృతదేహాలకు పంచనామా చేసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ విచారణకు ఆదేశించారు.  
 
ఎన్‌కౌంటర్‌పై అనుమానాలెన్నో?
 
తిరుపతి: శేషాచల అడవుల్లో ఎర్ర కూలీలపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు నుంచి 6.5 కిలోమీటర్ల దూ రంలో ‘ఎన్‌కౌంటర్’ ప్రదేశాలున్నాయి. రెం డు ప్రదేశాలకు మధ్య దాదాపు కిలోమీటరు దూరం ఉంది. రెండు చోట్లా మృతదేహాలు పడివున్న తీరు, వారిపక్కన ఉన్న దుంగలను పరిశీలిస్తే.. ‘ఎన్‌కౌంటర్’పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు టాస్క్‌ఫోర్స్ బృం దాలకు.. రెండు ప్రాంతాల్లో.. ఒకే సమయం లో ఎర్రచందనం కూలీలు తారసపడ్డారని.. రెండు చోట్లా కూలీలు దాడికి దిగటంతో.. లొంగిపోవాలని హెచ్చరించి, గాలిలోకి కాల్పులు జరిపి, ఆపై ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు చెప్తున్నారు.  కిలోమీటరు దూరంలోని రెండు ప్రదేశాల్లో ఒకేసారి ‘ఎదురు కాల్పులు’ జరగటం సందేహాస్పదమని పరిశీలకులు అంటున్నారు. వారు లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటంటే...

⇒  రెండుచోట్లా పోలీసు కాల్పుల్లో మృతి చెం దినవారి మృతదేహాలు.. కేవలం పది మీటర్ల విస్తీర్ణంలోపలే.. పక్కపక్కనే, చుట్టూ పేర్చినట్లుగా, గుంపుగా పడి కనిపిస్తున్నాయి. ఒక చోట 11, మరొక చోట 9 మృతదేహాలు పడివున్నాయి. ఎక్కువమందికి కడుపు, ఛాతీ, తల భాగాల్లో తూటా గాయాలు తగిలినట్లు కని పిస్తున్నాయి. ఎదురు కాల్పుల్లో ఇలా గుం పుగా పక్కపక్కనే చనిపోవటం సాధ్యమా?

⇒   ఒక్కో కూలీ మృతదేహం పక్కనే ఒక్కో ఎర్రచందనం దుంగ ఉంది. కొందరు దానిపై చేయి వేసినట్లు, కాలు వేసినట్లు, దానిపై పడి ఉన్నట్లు ఉన్నారు. కానీ.. మృతదేహాల మధ్య కానీ.. ఒక్కో మృతదేహానికి, దానిపక్కనే పడివున్న దుంగకు కానీ పెద్దగా ఎడం లేదు. ఎర్రచందనం దుంగలు మోస్తున్న వారు.. మోస్తున్నట్లే కాల్పుల్లో చనిపోయారా? కూలీలు నిజంగా దుంగలు మోస్తూ టాస్క్‌ఫోర్సుపై దాడులకు దిగడం సాధ్యమేనా?

⇒  మృతదేహాల పక్కన ఉన్న దుంగలు పాతబడిన దుంగలని స్పష్టంగా తెలుస్తోంది. వాటిపై ఎర్ర రంగు పెయింట్ గుర్తుల ఆనవాళ్లు, ఆ గుర్తులను గీరి చెరిపివేసేందుకు ప్రయత్నించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లపై దాడిలో అటవీ సిబ్బంది స్వాధీనం చేసుకున్న దుంగలపై ఇలా పెయింట్‌తో గుర్తు వేసి పక్కనపెడతారు. కూలీలు అడవుల్లో నరికిన దుంగలను పట్టుకెళతారు కానీ.. వాటికి రంగులతో గుర్తులు వేసి పట్టుకెళ్లరు. దీనినిబట్టే.. పోలీసులు గతంలో తాము స్వాధీనం చేసుకుని పెయింట్ మా ర్కులు వేసిన దుంగలను తెచ్చి కూలీల మృతదేహాల వద్ద పడేసినట్లు స్పష్టమవటం లేదా?

⇒  వంద మంది కూలీలు దుంగలు మోస్తూ ఎదురుపడ్డారని టాస్క్‌ఫోర్సు అధికారులు చెప్తున్నారు. పోలీసుల ‘ఎన్‌కౌంటర్’లో 20 మంది చనిపోతే.. మిగతా వారంతా పారిపోయారని అంటున్నారు. కానీ.. చనిపోయిన కూలీల దగ్గర మాత్రమే ఎర్రచందనం దుంగలు పడి ఉన్నాయి. అంటే.. మిగతా 80 మంది కూలీలు ఎర్ర చందనం దుంగలను పడేయకుండా.. వాటిని మోసుకుంటూనే.. పోలీసులకు, వారి తూటాలకు చిక్కకుండా పారిపోయారా?

ఖుషీఖుషీగా నారా లోకేష్


ఖుషీఖుషీగా నారా లోకేష్
సోషల్ మీడియాలో ఫొటోల హల్‌చల్
 
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్.. అమెరికాలోని స్నేహితులతో కలసి తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియాలో ఇప్పుడా ఫొటోల వీక్షకులు విపరీతంగా పెరిగిపోయారు.

అమెరికా మిత్రబృందంతో కలసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో లోకేష్ జరిపిన విహారయాత్రకు సంబంధించిన ఆ ఫొటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో దర్శనమీయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటోలు తొలుత ‘ఇండియా-అన్‌అఫీషియల్.బ్లాక్‌స్పాట్.ఇన్’ అన్న లింక్ ద్వారా సైట్‌లో వెలుగుచూడగా.. ఆ తర్వాత సోషల్ మీడియాలోకెక్కాయి. ఇప్పుడా లింక్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించినప్పటికీ సోషల్ మీడియాలో ఆ ఫొటోలు హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి.

http://img.sakshi.net/images/cms/2015-04/61428448322_Unknown.jpg
http://img.sakshi.net/images/cms/2015-04/41428448060_Unknown.jpg
http://img.sakshi.net/images/cms/2015-04/51428448219_Unknown.jpg
 
http://www.sakshi.com/news/andhra-pradesh/nara-lokesh-photes-hulchal-in-social-media-228490?pfrom=home-top-story

పక్కా బూటకపు ఎన్ కౌంటర్: చెవిరెడ్డి

Written By news on Tuesday, April 7, 2015 | 4/07/2015


పక్కా బూటకపు ఎన్ కౌంటర్: చెవిరెడ్డి
తిరుపతి: శేషాచల అడవుల్లో జరిగింది పక్కా బూటకపు ఎన్ కౌంటర్ అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి రోపించారు. ఎక్కడో పట్టుకొచ్చి 20 మందిని కాల్చిచంపారని అన్నారు. నిజమైన ఎన్ కౌంటర్ అయితే ఒకరు చనిపోయిన తర్వాత మిగతావాళ్లు పారిపోయే అవకాశముందన్నారు. కానీ సంఘటన స్థలంలో శవాలు గుట్టలగా పడివుండడంతో ఇది బూటకపు ఎన్ కౌంటర్ అన్న అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి


'సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి'
హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో అమాయక కూలీలను హతమార్చడం దారుణమని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి అన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎన్ కౌంటర్ పై న్యాయవిచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. కూలీల వద్ద ఆయుధాలు ఏమైనా ఉన్నాయా, వారేమైనా కాల్పులు జరిపారా అని ప్రశ్నించారు.

చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ ఎన్ కౌంటర్ జరిగిందన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యతో పోరుగు రాష్ట్రాల ముందు దోషులుగా నిలిచే పరిస్థితి తలెత్తిందని వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు

ధైర్యవంతుడైన అధికారిని కోల్పోయాం- వైఎస్ జగన్


ధైర్యవంతుడైన అధికారిని కోల్పోయాం- వైఎస్ జగన్
హైదరాబాద్: ఎస్ఐ సిద్ధయ్య మృతి పట్ల  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధయ్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఒక ధైర్యవంతుడైన పోలీసు అధికారిని కోల్పోయామని ఆయన తెలిపారు.

నల్గొండ జిల్లా జానకీపురంలో శనివారం ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య మంగళవారం సాయంత్రం మరణించారు. నాలుగు రోజులుగా ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు కృషి చేసినా ఫలితం లేకపోయింది.

ఈనెల 15,16,17 తేదీల్లో వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర


'ఈనెల 15,16,17 తేదీల్లో వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర'
హైదరాబాద్: వచ్చే వారంలో వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర చేపడుతున్నట్లు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్సార్ సీపీ బస్సు యాత్రకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 15,16,17 తేదీల్లో వైఎస్సార్ సీపీ బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 15వ తేదీన రాజమండ్రి నుంచి బస్సుయాత్ర ఆరంభం కానుందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను పరిశీలించేందుకు మూడు రోజుల యాత్రను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ యాత్రలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొంటారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ప్రాజెక్టులను పరిశీలించడంతో పాటు రైతుల స్థితిగతులను తెలుసుకునేందుకు వారితో ముఖాముఖి కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. ధవళేశ్వరం, పోలవరం, పట్టిసీమ, కృష్ణా బ్యారేజ్, వెలుగొండ, బనకచర్ల, పోతిరెడ్డి, హంద్రీనీవా ప్రాజెక్టులను పరిశీలిస్తామన్నారు. వైఎస్సార్ మరణాంతరం ప్రాజెక్టులపై ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాలన్నదే తమ బస్సుయాత్ర ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి లేదు

 ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డికి లేదని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక వైఎస్ గెస్ట్ హౌస్‌లో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంపీ సురేష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, మైనార్టీ నగర అధ్యక్షుడు ఎస్‌ఎండీ షఫీ, బీసీ విభాగం నగర అధ్యక్షుడు మహిమలూరి వెంకటేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టిసీమను అడ్డుకొంటూ వైఎస్ జగన్ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని సతీష్‌రెడ్డి మాట్లాడటం దారుణమన్నారు.

జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టు ఎందుకు చేపట్టారని మాత్రమే వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నారని, ఇది తెలుసుకోకుండా విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి పదినెలలు కావొస్తున్నా స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేసిన పాపాన పోలేదన్నారు. నిధులేమీ విడుదల చేయకుండా నీళ్లు ఎలా ఇస్తారో సతీష్‌రెడ్డి చెప్పాలన్నారు. నీటి ఎద్దడిని ముందే ఊహించిన ఎంపీ అవినాష్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషాలు నెలరోజులకు ముందునుంచే ఇరిగేషన్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడి అలగనూరు, వెలుగోడు రిజర్వాయర్‌ల నుంచి నీరు విడుదలయ్యేలా కృషి చేశారన్నారు.

నేడు కడప కార్పొరేషన్‌లో రెండు, మూడు రోజులకు నీరిస్తున్నారంటే  వారి కృషే కారణమన్నారు. మరో వైపు పీబీసీ నీటికోసం వైఎస్ అవినాష్‌రెడ్డి పాదయాత్ర చేయగా, గండికోట ప్రాజెక్టును పూర్తి చేయాలని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి ఆమరణ దీక్ష చేశారని గుర్తు చేశారు. పీబీసీకి ప్రభుత్వం నీటిని విడుదల చేశాక చొంగచాటుగా గండికొట్టిన ఘనత టీడీపీ నేతలకే దక్కుతుందన్నారు. దీనిపై కూడా వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గండికొట్టిన ప్రాంతం వద్ద నిరసన తెలిపి అరెస్ట్ కూడా అయ్యారన్నారు. జిల్లాలో నీటి సమస్యపై చిత్తశుద్దితో పోరాటం చేస్తున్నది వైఎస్‌ఆర్‌సీపీయేనన్నారు.

సతీష్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు మెప్పుకోసం విమర్శలు చేయడం సరికాదన్నారు. పదవుల కోసం టీడీపీ నేతలు పిరికివారిగా మారారని విమర్శించారు. సతీష్‌రెడ్డికి దమ్ముంటే చంద్రబాబును నిలదీసీ జిల్లాకు రావలసిన నీళ్లు, నిధులను సాధించాలని సవాల్ విసిరారు.

చంద్రబాబు అరకును దత్తత తీసుకోవడం వెనుక కుట్ర !

Written By news on Monday, April 6, 2015 | 4/06/2015


'టీడీపీపై ప్రజా వ్యతిరేకత మొదలైంది'
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ మరోసారి మండిపడింది.  సోమవారం పాడేరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సదస్సు లో పార్టీ నేతలు ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను తప్పుబట్టారు. టీడీపీ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజా వ్యతిరేకత మొదలైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలు 300 అంశాలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టును తన కోటరీకే అప్పగించేందుకు చంద్రబాబు ఈ ప్రాజెక్టు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. అన్ని ప్రాజెక్టుల నుంచి చంద్రబాబుకు కమీషన్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు అరకును దత్తత తీసుకోవడం వెనుక కుట్ర దాగి ఉందని మరో నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. బాక్సైట్ గనులను తవ్వుకునే పన్నాగం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నట్లు ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమకోసం వైఎస్సార్ సీపీ నుంచి ఎప్పుడూ మద్దతు ఉంటుందన్నారు. గిరిజనుల అభివృద్ధికి పాటుపడిన ఎమ్మెల్యేను ఎంచుకున్నందుకు గిరిజనులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. . కార్యకర్తలు పార్టీ వెన్నంటే ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తేవాలని ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. పది నెలల్లోనే టీడీపీ 60 శాతంపైగా ఆదరణ కోల్పోయిందని ధర్మాన తెలిపారు

వైఎస్సార్ సీపీ తెలంగాణ కమిటీలో 17 మంది నియామకం


 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీతోపాటు అనుబంధ సంఘాలకు బాధ్యులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదంతో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఈ జాబితాను విడుదల చేశారు. రాష్ట్ర కమిటీలో ఏడుగురు కార్యదర్శులు, 8 మంది సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు కార్యనిర్వహక సభ్యులకు చోటు కల్పించారు. రంగారెడ్డిజిల్లాకు చెందిన జి.ధనలక్ష్మి, బి.రఘోత్తమ్‌రెడ్డి, కుసుమ కుమార్‌రెడ్డి, టి.కుమారయాదవ్, ఎస్‌కే యేసుదాని, సామ యాదిరెడ్డి, జి.వెంకట్‌రెడ్డిలను కార్యదర్శులుగా నియమించారు. మెదక్ జిల్లాకు చెందిన కె.బాలకృష్ణారెడ్డి, ఆర్.చంద్రశేఖర్, కరీంనగర్‌కు చెందిన సెగ్గెం రాజేశ్, రంగారెడ్డి జిల్లాకు చెందిన డి.గోపాల్ రెడ్డి, సి.అరుణారెడ్డి, రమా ఓబుల్‌రెడ్డి, జె.వరలక్ష్మి, బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డిలను జాయింట్ సెక్రెటరీలుగా నియమించారు. వీరితోపాటు హైదరాబాద్‌కు చెందిన కసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, బ్రహ్మయ్యలను ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమించారు.

 అనుబంధ సంఘాల్లోనూ నియామకాలు

 తెలంగాణ రాష్ట్ర కమిటీతోపాటు అనుబంధ సంఘాల్లో 24 మంది బాధ్యులను ప్రకటించారు. పార్టీ ఐటీ వింగ్ అధ్యక్షునిగా ఎం.సందీప్‌కుమార్, గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షునిగా మెరుగు శ్రీనివాసరెడ్డిని నియమించారు. ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా బి.శ్రీవర్ధన్‌రెడ్డి, పబ్లిసిటీ అండ్ కల్చరల్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా జె.అమర్‌నాథ్‌రెడ్డి, ప్రోగ్రాం కో-ఆర్డినేషన్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా పి.సంతోష్ కుమార్, ట్రేడ్ యూనియన్ వింగ్ ప్రధాన కార్యదర్శులుగా ఎం.శివాజీ, డి.కృష్ణం నాయుడు, కార్యదర్శులుగా పి.మాధవ నర్సింహారెడ్డి, ఎ.రామమోహన్‌రెడ్డి, యువజన విభాగం ప్రధాన కార్యదర్శులుగా రేగళ్ల సతీష్‌రెడ్డి, డి.సత్యమూర్తి, ఠాగూర్ అమిత్ నారాయణ్‌సింగ్, కార్యదర్శిగా కేవీ కృష్ణారెడ్డి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జుల్లే బెన్నేలా, సంయుక్త కార్యదర్శిగా నస్రీన్ కౌసర్, విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా గందె మోహన్, మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా హైదర్ అలీ, కార్యదర్శులుగా మహమ్మద్ బిన్ ఒమర్ బిన్ ఖలీఫా, ఎస్‌కే మౌసమ్, సంయుక్త కార్యదర్శిగా అబ్దుల్ వాజిద్, సేవాదళ్ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ అమన్ ఎస్. అలగ్, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా గుంజ వెంకట్రావు, ఎస్సీ సెల్ సెక్రెటరీగా ఎం.మైఖేల్, క్రిస్టియన్ మైనారిటీ విభాగం సెక్రెటరీగా క్రిసోలైట్‌ను నియమించినట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది.

వైఎస్సార్‌సీపీ సదస్సు నేడు


వైఎస్సార్‌సీపీ సదస్సు నేడు
ఎమ్మెల్యే ఈశ్వరి ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున ఏర్పాట్లు
హాజరుకానున్న పార్టీ  త్రిసభ్య కమిటీ సభ్యులు
ముఖ్యనేతలు, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలు రాక

 
పాడేరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సదస్సు పాడేరులో సోమవారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని 5 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గస్థాయి సదస్సులు పాడేరులో ప్రారంభమవుతుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజుతోపాటు ముఖ్య నేతలు ధర్మా న ప్రసాదరావు, సుజయ్‌కృష్ణ రంగారావు, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, అరకు పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జి బొడ్డేడ ప్రసాద్‌తోపాటు ఉత్తరాంధ్రలోని అరకు, మాడుగుల, కురుపాం, పాలకొండ, రంపచోడవరం, రాజాం, పాతపట్నం, సాలూరు ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడు, పుష్పశ్రీవాణి, కళావతి, రాజేశ్వరి, కంబాల జోగులు, కలమట వెంకటరమణమూర్తి, రాజన్నదొర, రంపచోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి అనంతబాబు హాజరవుతున్నారు.

పాడేరులో జరుగుతున్న వైఎస్సార్‌సీపీ తొలి నియోజక వర్గ సదస్సుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక పట్టణ పురవీధుల్లో వైసీపీ ర్యాలీ అనంతరం స్థానిక వెంకటరమణ థియేటర్‌లో సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యేక హోదాపై మౌనం ఎందుకు?


ప్రత్యేక హోదాపై మౌనం ఎందుకు?
 • వైఎస్సార్‌సీపీ సూటి ప్రశ్న
 • ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు
 • తీసుకోవడం లేదని నిలదీసిన బుగ్గన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో ఎందుకు గట్టిగా పోరాడలేకపోతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారని, అసలు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తారో లేదో కూడా తెలియని గందరగోళ పరిస్థితి ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మన రాష్ట్రానికి ఆర్థిక సహాయం ప్రకటిస్తూ ప్రత్యేక హోదా ఇచ్చే విషయం పరిశీలనలో ఉందని చెప్పారని, మరో మంత్రి ఇంకా చూస్తున్నాం అని చెబుతున్నారని తెలిపారు. ఈ గందరగోళం అంతా ఎందుకు? అసలు టీడీపీ ప్రభుత్వం ఈ అంశంపై కే ంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగలేకపోతోందని ప్రశ్నించారు. అసలు విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఉందా లేదా అని ప్రశ్నించారు.

విభజన చట్టంపై రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న జరిగిన చర్చ సందర్భంగా మిగిలిపోయిన 13 జిల్లాలకు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారని, బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చేది తామే కనుక పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని కూడా చెప్పారని గుర్తుచేశారు. కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌కు వచ్చిన అప్పటి కేంద్రమంత్రి జైరామ్ రమేష్ కూడా ఈ విషయాలను ధ్రువీకరిస్తూ ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పలుసార్లు కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారని చెప్పారు.
 
అన్నీ అనుమానాలే..

రాజధాని నిర్మాణం విషయంలో సింగపూర్ కంపెనీలతో చేసుకుంటున్న ఒప్పందాలు, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం టెండర్లలో లోపాలు, అధికార దుర్వినియోగం వంటి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం మన హక్కుల సాధనకు గట్టిగా కృషిచేయడం లేదనేది స్పష్టం అవుతోందని రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ఏడాదిలో పూర్తికావాల్సిన పట్టిసీమ ప్రాజెక్టుకు బోనస్ రూపంలో టెండరును పెంచి ఇవ్వడంతో పాటుగా సింగపూర్ సంస్థతో, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థతో ఒప్పందాలు చేసుకోవడంలో అనేక లోపాలున్నాయని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్నే అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు తీరు


దళిత ద్రోహి చంద్రబాబు: మేరుగ
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదినెలల పాలనలో దళితులకు తీరని ద్రోహం చేశారని, వారికి కేటాయించిన నిధుల్లో భారీగా కోతలు విధించారని వైఎస్సార్ సీపీ ధ్వజమెత్తింది. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు పాలనలో నెరవేర్చలేదని విమర్శించారు. చంద్రబాబు తీరు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్నే అపహాస్యం చేసే విధంగా తయారైందన్నారు.

గత ఏడాది రూ.1.11 లక్షల కోట్ల పరిమాణం గల బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, వాస్తవానికి 1,12,067 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సవరించిన అంచనాల్లో చూపారని చెప్పారు. అందులో కేవలం 23 శాతం నిధులను మాత్రమే ప్లాన్ బడ్జెట్‌కు కేటాయించారన్నారు. గత పదేళ్ల సగటును తీసుకుంటే ప్లాన్ బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం నుంచి 35 శాతం వరకు ఉందని, అది ఒక్కో సంవత్సరంలో 38 శాతం వరకు ఇచ్చిన సందర్భాలున్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు ఎక్కువ నిధులు వెళ్లకూడదనే కుట్రతోనే చంద్రబాబు తన తొలి బడ్జెట్‌లో ప్లాన్ బడ్జెట్‌కు 23 శాతం నిధులే కేటాయించారని విమర్శించారు.

సబ్‌ప్లాన్ చట్టం లేని రోజుల్లో కూడా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి క్రమంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా దామాషాలో నిధులు కేటాయించారని, ఇప్పుడు చట్టం ఉండి కూడా చంద్రబాబు సబ్‌ప్లాన్‌కు ఎక్కువ నిధులు పోకుండా ఏకంగా ప్రణాళికా వ్యయాన్నే తగ్గించారని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయనపై దుమ్మెత్తి పోయడానికి ముందుకొచ్చే దళిత మంత్రులు సబ్‌ప్లాన్ నిధులు ఎందుకు తగ్గించారని సీఎం చంద్రబాబును ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.

తెలంగాణ వైఎస్ఆర్ సీపీలో పలు కమిటీల నియామకం

Written By news on Sunday, April 5, 2015 | 4/05/2015

హైదరాబాద్: తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి, వారి తరఫున పోరాటాలు సాగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు కమిటీలను నియమించింది.
 
 • హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా - అవినాశ్ గౌడ్
 • హైదరాబాద్ సిటీ సేవాదల్ అధ్యక్షుడిగా -డి సుధాకర్
 • రాష్ట్ర ఐటీ వింగ్ అధ్యక్షుడిగా -మల్లాది సందీప్ కుమార్
 • ఫిర్యాదుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా - మేరుగు శ్రీనివాసరెడ్డి
వీరితో పాటు ఏడుగురు రాష్ట్ర కార్యదర్శులు, ఎనిమిది మంది సంయుక్త కార్యదర్శులను నియమించారు.

ఇంటికయ్యే ఖర్చు రాజధానికి విరాళం ఇవ్వచ్చుగా


'ఇంటికయ్యే ఖర్చు రాజధానికి విరాళం ఇవ్వచ్చుగా'
హైదరాబాద్: చంద్రబాబు కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటూ రాజధాని ప్రాంతంలో రైతులను  చెట్ల కింద ఉండమంటారా అని వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటికయ్యే ఖర్చు రాజధానికి విరాళం ఇవ్వాలని సూచించారు.

టీడీపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విరాళాలు ఇవ్వకుండా ప్రజలను చందాలు అడగడం ఎంతవరకు సమంజసమని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిముందు ధర్నా చేసైనా నిధులు తీసుకురావాలని, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

6 నుంచి వైఎస్సార్సీపీ సదస్సులు

హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) నియోజకవర్గస్థాయి అవగాహనా సదస్సులను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఈ నెల 6న విశాఖజిల్లా పాడేరులో తొలి సదస్సును నిర్వహించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన నేతలతోపాటు పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీ, పంచాయితీవార్డు సభ్యులు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఈ సదస్సులకు కేంద్ర కార్యాలయం నుంచి త్రిసభ్య కమిటీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డి, సాగి దుర్గాప్రసాదరాజు హాజరవుతారు. ఉత్తరాంధ్రలో జరిగే ఈ సదస్సులో పార్టీ ప్రధాన కార్యదర్శులు ధర్మాన ప్రసాదరావు, సుజయ్‌కృష్ణ రంగారావు పాల్గొంటారు.

పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి


పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో జరిగిన రెండు దుర్ఘటనలపై ప్రభుత్వం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనల్లో పోలీసులు మరణిస్తే పరిహారమిచ్చి తమ పని అయిపోయిందని ప్రభుత్వం అనుకొంటే సరిపోదన్నారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. పోలీసు కుటుంబాలకు, గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరఫున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామన్నారు.
 
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కాల్పులు, ఇమాంపేట వద్ద గెయిల్ పరిశ్రమ గ్యాస్‌పైప్‌లైన్ లీకేజీలో ఇద్దరు మృతి సంఘటనలపై లోతైన అధ్యయ నం అవసరమన్నారు. పోలీసుల ధైర్య సాహసాలు అభినందించాల్సిందేనన్నా రు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిం దని చెప్పారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Popular Posts

Topics :