08 September 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

It is clear..Jagan kosame delhi ki

Written By news on Saturday, September 14, 2013 | 9/14/2013



















courtesy:greatandhra

సమైఖ్య శంఖారావం 11&12 Sept 2013 images

'వైఎస్ ఒకే ఒక్కడిగా రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడారు'

'వైఎస్ ఒకే ఒక్కడిగా రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడారు'
కాకినాడ :  శ్రీకృష్ణ కమిటీ సూచనలను పక్కన పెట్టి...  రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ  ఎందుకు  విభజించాలి అనుకుంటుందో చెప్పాలని షర్మిల ప్రశ్నించారు.  సమైక్య శంఖారావంలో భాగంగా ఆమె శనివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రసంగించారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఎవరికి లాభం..? తెలుగజాతి ఒక్కటిగా ఉంటే ఎవరికి నష్టం.. ? వైఎస్‌ఆర్‌ లాంటి సీఎం ఆవిర్భవిస్తే  తట్టుకోలేని బలహీనత ఎవరికి ఉంది..? అంటూ  షర్మిల నిప్పులు చెరిగారు. మంచి పనుల ద్వారా ఓట్లు, సీట్లు సంపాదించుకునే సత్తా..  కాంగ్రెస్‌ పార్టీకి ఉండి ఉంటే..ఈ రోజు ఈ గతి పట్టి ఉండేది కాదన్నారు. చెడు చేసైనా వారి స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకుందన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి వైఎస్ఆర్  చేసిన సేవలను ఆమె గుర్తు చేశారు. వైఎస్ ఆర్ బతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టి ఉండేది కాదని ప్రధానమంత్రి సహా కోట్ల మంది అభిప్రాయపడుతున్నారని షర్మిల తెలిపారు. ఒక్క వైఎస్‌ మాత్రమే విభజన అనే గొడ్డలికి అడ్డంగా నిలబడి ఒకే ఒక్కడిగా రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడారన్నారు.  

అసలు అన్యాయం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి... రోశయ్య కమిటీ వేశారని, 2009లో టీఆర్‌ఎస్‌, టీడీపీ పొత్తు కుదుర్చుకున్నా నాలుగు పార్టీలు కలిసి..ఏకధాటిగా యుద్ధం చేసినా వైఎస్‌ఆర్‌ ఒకే ఒక్కడిగా నిలబడి ఒంటి చేత్తో పోరాటం చేసి ఆ ఎన్నికల్లో గెలిచారని షర్మిల గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి తప్ప ప్రత్యేక రాష్ట్రం కాదని  వైఎస్‌ నిరూపించారని అన్నారు. వైఎస్‌ఆర్‌ లాంటి సత్తా ఉన్న సీఎం లేకపోబట్టే  రాష్ట్రానికి ఈ గతి పట్టిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.


రాష్ట్ర విభజన  చేయండి అంటూ..18 అక్టోబర్‌, 2008న కేంద్రానికి చంద్రబాబు  రాసిన లేఖను చదివి షర్మిల వినిపించారు. చంద్రబాబు రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ..కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖను సమైక్య వాదులకు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎన్జీవోలకు జీతాలు ఇవ్వక పోయినా.. జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. వారికి జీతాలు ఇవ్వడమే కాకుండా...వారిని గౌరవిస్తూ....ఒక నెల  బోనస్‌ కూడా ఇస్తుందని..జగనన్న తరపున మాట ఇస్తున్నట్లు.. షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏపీఎన్జీవోలను వేధించడంపై మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది మీరా... మేమా?

చితిమంటలపై చలికాచుకుంటున్న చంద్రబాబు

 తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు న్యూఢిల్లీ యాత్ర ఎందుకో ప్రజలకు వివరించాలని శోభానాగిరెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బెయిల్ ను అడ్డుకునేందుకా లేక గతంలో తెలంగాణ అనుకూలంగా ఇచ్చిన లేఖ సరైనదే అని చెప్పుకోవడానికా అని చంద్రబాబును శోభానాగిరెడ్డి ప్రశ్నించారు.
 
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో ఉద్యమం అట్టుడుకుతుంటే తెలుగుదేశం పార్టీ గొప్పలకుపోతోందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 30 లోక్ సభ సీట్లు గెలుస్తామని చెబుతున్న టీడీపీని చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. మీకేమైనా కోపం ఉంటే తమపై చూపాలని, అంతేకాని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని చంద్రబాబుకు ఈ సందర్భంగా శోభానాగిరెడ్డి హితవు పలికారు.
 
కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది మీరా... మేమా అని ఆమె ప్రశ్నించారు. జగన్ బయటకు వస్తున్నారంటే మీకు ఎందుకంత భయం పట్టుకుంటుందో అర్థంకావడం లేదని అన్నారు. చంద్రబాబుకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఇలాగే వ్యవహారిస్తే భవిష్యత్ లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు వాతలు పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని శోభానాగిరెడ్డి అన్నారు.  
 

Sharmila's speech in Kakinada

Sharmila's speech in Amalapuram

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించిందే చంద్రబాబు

తమను ఫిరాయింపుదారులని, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ కు బెయిల్ కోసం డీల్ అంటూ టిడిపి నేతలు చేస్తున్న విమర్శలపై శాసనసభ్యురాలు శోభ నాగిరెడ్డి మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టింది చంద్ర్రబాబు అయితే, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించి పదవులు పోగొట్టుకున్న చరిత్ర వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ దని ఆమె అన్నారు.తనపై కేసులు రాకుండా కాంగ్రెస్ తో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది చంద్రబాబు అయితే, సోనియాగాందీని ఎదుర్కుని పదహారు నెలలుగా జైలు లో ఉన్న నేత జగన్ అని ఆమె అన్నారు. గతసారి అవివ్వాసం పెడితే విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ ను చంద్రబాబు రక్షిస్తే,రరెండోసారి కూడా పదిహేను మంది ఎమ్మెల్యేలు పదవులు త్యాగం చేశారని అన్నారు.చంద్రబాబుపై నమ్మకం పోవడం వల్లనే ,గతంలో తామంతా పొగిడిన వారం పార్టీకి గుడ్ బై చెప్పామని శోభ వ్యాఖ్యానించారు.

CHIRANJEEVI GETS A SHOCK TREATMENT

.
In a novel protest against Union Minister Chiranjeevi for not resigning in favour of united AP, the Ruya doctors in Tirupati gave him a shock treatment. Yes, we mean literally not to the person though but to his photo. They also did the same to the pictures of TDP chief Chandrababu Naidu, AICC president Sonia Gandhi and TRS chief KCR.
To wake them up from their slumber, the doctors resorted to this idea. A man was seen sitting with the photo of Chiru, while a doctor administered shock treatment.
Meanwhile, with power employees joining the Samaikyandhra agitation, the agitation which entered its 44th day on Friday has further intensified, stalling work in government offices.
As part of the Samaikyandhra agitation, protesters raised slogans in support of united Andhra Pradesh and took out massive rallies, formed human chains in Ananthapur, Vizag, Nellore, East and West Godavari and other districts. Lakhs of employees are participating in the strike call given by the APNGOs demanding that the state remain united. Many places in the Seemandhra region observed bandh in support of the striking employees as all the business establishments, schools, colleges, cinema theaters and banks remained closed.
- Siva@Sakshipost


http://www.sakshipost.com/index.php/news/state/26584-chiranjeevi-gets-a-shock-treatment.html

చంద్రబాబు మైండే కుట్రలమయం

తెలంగాణ ప్రకటన వచ్చాక టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుకు మతి చలించినట్టు కనిపిస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి పాలిట్ బ్యూరో సభ్యుడు జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.
 ప్రతి నిమిషం అబద్ధాలు ఆడుతూ, అందరినీ దగా చేసే చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్న టీడీపీని బ్రోకర్ల.. జోకర్ల.. కాంట్రాక్టర్ల.. వైస్రాయ్.. వెన్నుపోటు.. విద్రోహాల పార్టీ అనాలా? ఊసరవెల్లి పార్టీ అనాలా? ఏ పేరుతో పిలవాలి? అపి ప్రశ్నించారు. చంద్రబాబు మైండే కుట్రల నిలయమని ఆయన మండిపడ్డారు.

courtesy:kommineni.info

రేపు విజయనగరం సాలూరులో షర్మిల బహిరంగ సభ

విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన బస్సు యాత్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబ శివరాజు చెప్పారు. బస్సు యాత్రలో భాగంగా షర్మిల 15న ఆదివారం సాలూరు రానున్నట్టు తెలిపారు. ఆ రోజు సాయంత్రం సాలూరులో జరిగే భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారని చెప్పారు. దీనికి సంబంధించి పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
 
 రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుపోతుంటే కాంగ్రెస్ నేతలకు పట్టకపోవడం దారుణమని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలతో రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందన్నారు. ప్రజల మనోభావాలను గుర్తెరిగిన పార్టీగా వైఎస్‌ఆర్ సీపీ పని చేస్తోందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ అధినేతతో పాటు స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందేనన్నారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు వారి బాధల్లో భాగస్వాములయ్యేందుకు వైఎస్‌ఆర్ కుటుంబం మొత్తం పని చేస్తోందన్నారు.

'న్యాయం చేసే సత్తా లేనప్పుడు.. విభజించే హక్కు మీకెక్కడిది'

Written By news on Friday, September 13, 2013 | 9/13/2013

శ్రీమతి షర్మిల సమైఖ్య శంఖారావం
ఓట్ల కోసం, సీట్లకోసం కోట్లాదిమందికి కాంగ్రెస్ అన్యాయం చేసింది అని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బహిరంగసభలో షర్మిల మండిపడ్డారు. అమలాపురంలో ఏర్పాటు చేసిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో మాట్లాడుతూ... సీమాంధ్ర ప్రజల తరఫున ఎంతమంది టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు నిలబడ్డారు షర్మిల అని ప్రశ్నించారు.  వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజీ నామాలు చేసిన రోజునే... మిగతా పార్టీల ఎమ్మెల్యేలూ చేసుంటే విభజన ప్రక్రియ ఆగి ఉండేది అని అన్నారు. 
 
న్యాయం చేసే సత్తా మీకు లేనప్పుడు.. విభజించే హక్కు మీకెక్కడిది అని షర్మిల నిప్పుల చెరిగారు. రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని వైఎస్‌ఆర్ సీపీ డిమాండ్ చేస్తోంది అని అన్నారు.  నిర్బంధంలో ఉండికూడా తన కష్టాన్ని పక్కనపెట్టి... ప్రజలకోసం వారంరోజులు జగనన్న నిరాహారదీక్ష చేశారని షర్మిల తెలిపారు.  జైల్లో ఉన్నా... జనంలో ఉన్నా జగనన్న జననేతేనని,  కోట్లాదిమందికి అన్యాయం జరిగితే జగనన్న చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోరు అని అన్నారు.  జగనన్నను ఆపడం ఈ టీడీపీ, కాంగ్రెస్ నాయకుల తరం కాదు సవాల్ విసిరారు. 

నిర్భయ తీర్పును స్వాగతించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

గతేడాది డిసెంబర్ లో న్యూఢిల్లీ సామూహిక అత్యాచారం గురైన నిర్భయ కేసులో దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం స్వాగతించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు గట్టు రామచంద్రరావు శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మానవ మృగాలుగా ప్రవర్తించిన దోషులకు ఇది సరైన శిక్ష అని ఆయన అభివర్ణించారు. దేశంలో మహిళలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరం విఫలం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
గతేడాది డిసెంబర్ లో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫార్మాసీ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఆమె న్యూఢిల్లీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించారు. అయితే నిర్భయ అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ నెలాఖరున మరణించింది. ఆ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి.
 
దీంతో ఆ ఆరుగురు నిందితులను కఠినంగా శిక్షించాల దేశంలోని పలు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాకేత్ కోర్టు నలుగురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే మరో ఇద్దరు నిందితుల్లో ఒకరు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు బాలనేరస్తుడు కావడంతో అతడికి ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

వైఎస్ జగన్‌ త్వరలోనే బెయిల్‌పై విడుదల

వైఎస్ జగన్‌ త్వరలోనే బెయిల్‌పై విడుదల: మేకపాటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే బెయిల్ పై విడుదల అవుతారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. న్యాయవ్యవస్థపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి పూర్తి నమ్మకం ఉంది అని మేకపాటి వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు సమైక్యరాష్ట్రంలోనే జరుగుతాయని తాము భావిస్తున్నామని ఆయన మీడియాతో అన్నారు.
 
సమైక్య రాష్ట్రంలోనే వైఎస్ జగన్‌ ముఖ్యమంత్రి పదవిని చేపడుతారని మేకపాటి ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో జగన్ కీలక పాత్ర పోషిస్తారు అని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. 

Sharmila's speech in Eluru

Sharmila's speech in Ravulapalem

రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల్ని చక్కదిద్దే సత్తా ఒక్క జగన్....

జగన్ను మర్యాదపూర్వకంగానే కలిశా: బాలశౌరి

హైదరాబాద్ : తెనాలి మాజీ ఎంపీ బాలశౌరి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైల్లో కలిశారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ తాను జగన్ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల్ని చక్కదిద్దే సత్తా ఒక్క జగన్కే ఉందన్నారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు బాలశౌరి ప్రకటించారు. బాలశౌరితో పాటు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాలశౌరీ  కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గత నెల మొదటివారంలోనే రాజీనామ చేశారు.  లోక్సభ ఎన్నికల్లో వల్లభనేని బాలశౌరి తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు బాలశౌరి మద్దతు కూడా ప్రకటించారు.
 

వైఎస్ జగన్ ను కలవనున్న బాలశౌరి

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను చంచల్ గూడ జైల్లో బాలశౌరి కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి గతనెల మొదటివారంలోనే రాజీనామ చేశారు.
 
14వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో వల్లభనేని బాలశౌరి తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు బాలశౌరి మద్దతు తెలిపిన విషయం విదితమే.

తెలుగుదేశం కు సంబందించినవారే ఫోన్ లు చేస్తున్నారు...

బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశంతో పొత్తు గురించి తాము ఆలోచించడం లేదని, తెలుగుదేశం కు సంబందించినవారే ఫోన్ లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న నౌక అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.చంద్రబాబు తమతో పొత్తు చారిత్రక తప్పిదమని అన్నారని,ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. 


courtesy:kommineni

మనుషులా లేక ఊసరవెల్లులా..

పదవి రాకముందు ఒకమాట.. వచ్చిన తర్వాత మరోమాటా?: షర్మిల
 ఢిల్లీ దర్బారులో వంగివంగి సలాం చేస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు...
 గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
 తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లే కాంగ్రెస్ విభజనకు పూనుకుంది
 ఓట్లు, సీట్ల కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ..రాష్ట్రాన్ని చీల్చాలనుకుంటోంది
 టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలంగా ఉంటే.. వైఎస్సార్ సీపీ, సీపీఎం,
 ఎంఐఎం మాత్రమే సమైక్యంగా ఉండాలన్నాయి
 చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకోవాలి.. పార్టీ నేతలతో రాజీనామా చేయించాలి..
 అప్పటిదాకా సీమాంధ్రలో అడుగుపెట్టనీయకుండా తరిమికొట్టండి

 
సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:  ‘‘ఈరోజు రాష్ట్రమంతా అట్టుడికిపోతోంది. కోట్ల మంది గుండెలు రగిలిపోతున్నాయి. మా ఓట్లు దండుకొని మా కళ్లే పొడుస్తారా? మా ఓట్లు దండుకొని మా బతుకులే బుగ్గిపాలు చేస్తారా? అని ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే.. మన నాయకులు మాత్రం ఓట్లేసిన ప్రజల కంటే తమ పదవులే ముఖ్యమని మళ్లీ నిరూపించుకున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ‘‘పదవి రాకముందు ఒకమాట, పదవి వచ్చిన తరువాత ఒకమాట మాట్లాడుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు గారు మనుషులా లేక ఊసరవెల్లులా..’’ అంటూ నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంత మంది నేతలు సీమాంధ్రకు ఉండి కూడా.. అందరూ ఢిల్లీ దర్బారులో వంగివంగి సలాం చేస్తూ తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని, ఓట్లేసి గెలిపించిన తెలుగు ప్రజలకు వెన్నుపొడిచారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సుయాత్ర గురువారం పదో రోజు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సాగింది. కృష్ణా జిల్లా కైకలూరు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభలకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే...
 
‘‘కేబినెట్ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌గారు అన్నారు.. కాంగ్రెస్ పార్టీ విభజన చేస్తుందని, ఆ విషయం గురించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిగారికి, బొత్స గారికి మొదట్నుంచే పూర్తిగా తెలుసునని చెప్పారు. అంటే మన సీఎంకు కాంగ్రెస్  పార్టీ ఇంత నీచమైన ఆలోచన చేస్తుందని తెలిసి కూడా దానికి అడ్డుచెప్పలేదు ఎందుకని? కేవలం పదవి ఊడిపోతుందేమోనన్న భయంతోనే విభజనకు అడ్డు చెప్పలేదు. కాంగ్రెస్ ఈ ఆలోచన చేస్తుందన్న విషయం దిగ్విజయ్‌సింగ్ గారు ప్రకటన చేసేంత వరకు కిరణ్ కుమార్‌రెడ్డి గారు గోప్యంగా ఉంచిన మాట వాస్తవం కాదా? చేయాల్సిన అన్యాయం అంతా చేసేసిన తర్వాత.. ప్రజలు తనను సమాధానం చెప్పమని ఎక్కడ నిలదీస్తారోనని, ప్రజలు అడగాల్సిన ప్రశ్నలన్నింటినీ మళ్లీ ప్రజల్నే అడిగారంటే ఈ సీఎంకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయని అనుకోవాలి.
 
బాబూ.. చేసిందంతా చేసి మొసలి కన్నీరా?
ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్షం నేత చంద్రబాబుగారికి ఏమైనా చలనం ఉందా? అసలు చ లనం ఎలా ఉంటుంది? రాష్ట్ర విభజనకు కారణమే ఆయన. ఒక బ్లాంకు చెక్కు ఇచ్చేసినట్టు తెలంగాణ  ఇచ్చేసుకోండి అని తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాసిచ్చింది ఈ చంద్రబాబుగారే. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని విభజించే సాహసం చేసిందంటే అందుకు కారణం. చంద్రబాబు. పట్టపగలే ఇలా సీమాంధ్రుల గొంతు కోసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర అని చేస్తున్నాడట. ఇది హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టుగా ఉంది. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చేసి ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు.
 
మనరాష్ట్రంలో 8 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 5 కోట్ల మంది సీమాంధ్రులే. ఇంత మందికి అన్యాయం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇన్ని కోట్ల మంది ప్రజల పక్షాన నిలబడి వారి పక్షాన గొంతు విప్పాల్సింది పోయి చంద్రబాబు గారు తనకు ఏమీ పట్టనట్టు తన స్వార్థం కోసం మౌనంగా ఉన్నాడంటే ఈయనను ప్రధాన ప్రతిపక్షం నాయకుడు అనలా లేకపోతే దుర్మార్గుడు అనలా? తెలుగుదేశం పార్టీతో సహా ఐదు పార్టీలు ఈ విభజనకు అనుకూలంగా ఉన్నాయని ప్రకటిస్తే.. మూడు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం విభజనకు అనుకూలం అని ఎప్పుడూ చెప్పలేదు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం నిజాయితీ ఉన్నా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం తప్పయిపోయిందని చెంపలు వేసుకొని చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడం తగదు అని చెప్పి అందుకు నిరసనగా ఆయన, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలి. చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకునేంత వరకు, ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీల చేత రాజీనామాలు చేయించేంత వరకు ఆయననుగాని, టీడీపీ నాయకులను గాని సీమాంధ్రలో అడుగుపెట్టడానికి వీలులేదని తరిమితరిమి కొట్టాలి.
 
ఎన్నిసార్లు చెప్పినా...  దున్నపోతు మీద వాన పడ్డట్టేనా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోతుందని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఇలా ఆరోపించడం మొదటిసారి కాదు, ఆఖరిసారి కాదు. మేం ఎన్నిసార్లు సమాధానం చెప్పినా దున్నపోతు మీద వాన పడినట్టే. అయినా సరే చంద్రబాబు గారికి మళ్లీ సమాధానం చెప్తున్నాం. ఎఫ్‌డీఐ ఓటింగ్ విషయంలో రైతులు, చిన్న వర్తకులను మోసం చేసి కాంగ్రెస్‌తో కుమ్మక్కై మీ ఎంపీలను గైర్హాజరు పరిచింది మీరు కాదా చంద్రబాబు? ఏకంగా రూ.32 వేల కోట్ల కరెంటు చార్జీల భారం ప్రజల నెత్తిన మోపితే అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదని నిస్సిగ్గుగా విప్ జారీ చేసి మరీ ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడింది మీరు కాదా? పార్లమెంటు ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల దాకా.. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఉప ఎన్నికలు ఇలా ఏ ఎన్నికలైనా కాంగ్రెస్‌తో పాలునీళ్లలా కలిసి పోయి కుమ్మక్కైంది మీరు కాదా చంద్రబాబూ..?
 
 ఐఎంజీ, ఎమ్మార్ లాంటి కేసుల్లో తనపై విచారణ జరగకుండా చీకట్లోనే చిదంబరాన్ని కలిసి చీకటి ఒప్పందాలు చేసుకొన్నది మీరు కాదా? ఆఖరికి వైఎస్సార్ చనిపోయారన్న ఇంగితం కూడా లేకుండా ఆయన మీద రూ.లక్ష కోట్లని అబద్ధపు ఆరోపణలు చేసి, కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టించింది మీరు కాదా? ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడగొడతామని చెప్తున్నా ఆ విభజనకు మీరు మద్దతు పలుకుతున్నారే ఇది మీ కుమ్మక్కుకు రుజువు కాదా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీకి చెందిన నాయకులు అందరూ రాజీనామాలు చేసి, నిరాహార దీక్షలు చేశారు. ఇది అన్యాయం రాష్ట్రాన్ని విడగొట్టొద్దని లేఖలు రాస్తున్నారు. పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి మీరేం చేశారు చంద్రబాబు గారు? ఇది అన్యాయమని, దానికి నిరసనగా మీరుగాని మీ ఎమ్మెల్యేలుగాని, ఎంపీలు గాని రాజీనామాలు చేశారా? తెలంగాణకు అనుకూలంగా మీరు ఇచ్చిన లేఖను  వెనక్కి తీసుకున్నారా? విభజనకు మద్దతు పలుకుతోంది, ఈ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైంది మీరు కాదా.. గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి చంద్రబాబు గారూ..?
 
ప్రజల తరఫున ఎందరు నేతలు గొంతెత్తారు?
హఠాత్తుగా ఎలాంటి పరిష్కారం చూపించకుండానే మన రాష్ట్రాన్ని విడగొడుతున్నారన్న సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులంతా రాజీనామాలు చేశారు. సీమాంధ్రకు చెందిన ఎందరు కాంగ్రెస్, టీడీపీ నాయకులు వాళ్ల పదవులను త్యాగం చేసి ప్రజల తరఫున గొంతెత్తారు? వైఎస్సార్సీపీ నాయకులు రాజీనామా చేసినప్పుడే కాంగ్రెస్, టీడీపీ నాయకులు కూడా రాజీనామాలు చేసి ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని దేశమంతా చూసి ఉండేది, కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగి ఉండేది. ఈ విభజన ప్రక్రియే ఆగిపోయి ఉండేది. కానీ ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఓట్లేసిన ప్రజల కంటే పదవులే ముఖ్యమని నిరూపించుకున్నారు’’
 
తోడుగా ఉంటామని మీకు మాటిస్తున్నాం..
ఇది ప్రజాస్వామ్య దేశమనే సంగతి కూడా మరిచిపోయి కాంగ్రెస్ అడ్డగోలు విభజనకు పూను కుంది. కేవలం ఓట్లు, సీట్ల కోసం టీఆర్‌ఎస్‌ను తమలో కలుపుకోనైనా సరే రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న ఏకైక లక్ష్యంతో కోట్ల మంది ప్రజలను అన్యాయం చేయడానికి సిద్ధమైంది. తెలుగువారి భిక్షతో కేంద్రంలో, రాష్ట్రంలో గద్దెనెక్కి కూర్చొని తెలుగువారికే వెన్నుపోటు పొడిచింది. ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, మహిళలు.. ఒక్కరు కాదు... ఇద్దరు కాదు... కోట్లమంది రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కానీ దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై కూడా కేసులు పెట్టింది. ఎన్జీవోలైతే వారి జీతాలను కూడా త్యాగం చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం జీతాలివ్వకుండా వారి కడుపు మీద కొట్టే ప్రయత్నం చేస్తోంది.  మీ అందరికీ అండగా మేం నిలబడతామని, మీతో కలిసి పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్జీవో సంఘాలకు, ఎన్జీవో సభ్యులకు మాటిస్తున్నాం.    
- షర్మిల

ఆత్మగౌరవ యాత్రను అర్ధంతరంగా ఆపేసింది అందుకే

జగన్ బెయిల్‌ను అడ్డుకునేందుకే..విస్తరించు & ప్లే క్లిక్ చేయండి
* చంద్రబాబు ఢిల్లీ యాత్రపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
* ఆత్మగౌరవ యాత్రను అర్ధంతరంగా ఆపేసింది అందుకే
* గతంలో చిదంబరం వద్దకు బృందాన్ని పంపి ఈడీని ఉసిగొల్పారు
* కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కువల్లే జగన్‌పై కేసులు..
* కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షిస్తున్నది చంద్రబాబే
 
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఆత్మగౌరవ యాత్రను రద్దుచేసుకుని మరీ ఢిల్లీకి వెళుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన అంశాలపై మాట్లాడటానికే తాను ఢిల్లీ వెళ్లి ప్రధాని, రాష్ట్రపతిని కలుస్తున్నట్లు చంద్రబాబు పైకి చెబుతున్నా... లోపల చేయబోతున్నది మాత్రం జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలేనని దుయ్యబట్టారు. జగన్ ప్రభంజనంలో తాను, తన పార్టీ కొట్టుకుపోతామనే భయంతోనే చంద్రబాబు అడ్డగోలు విమర్శలు చేస్తున్నాడని చెప్పారు.

ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జగన్ కేసులో చార్జిషీటు వేసే గడువు ఈ నెల 9వ తేదీతో ముగిసింది కనుక తనకున్న హక్కు మేరకు జగన్ బెయిల్ పిటిషన్ వేసుకున్న తరుణంలో... బెయిల్‌ను అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు ఢిల్లీకి పయనమవుతున్నారనేది పచ్చినిజమని మండిపడ్డారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినపుడల్లా ఏదో ఒక కొత్త నాటకం ఆడి బెయిల్ రాకుండా కోర్టులను ప్రభావితం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. గతంలో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులతో నాటకాలాడించిన చంద్రబాబు ఇప్పుడు తానే స్వయంగా అందుకు ఉపక్రమిస్తున్నారని విమర్శించారు. గత ఏడాది డిసెంబర్‌లో బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినపుడు కూడా తమ పార్టీ నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని ఆర్థిక మంత్రి పి.చిదంబరం వద్దకు పంపి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్) చేత ఆస్తుల జప్తునకు ఆదేశాలు ఇప్పించారని గుర్తుచేశారు. అసలు చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రను అర్ధంతరంగా ఇపుడు ఎందుకు ముగించారో, ఎందుకు ఢిల్లీ వెళుతున్నారో ప్రజలకు జవాబు చెప్పాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది బాబే
వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైందని ప్రతి విషయంలోనూ ఆరోపించే చంద్రబాబు వాస్తవానికి ఆయనే అధికార పార్టీతో మిలాఖత్ అయ్యారని ఉమ్మారెడ్డి నిప్పులు చెరిగారు. తనలో 30 శాతం కాంగ్రెస్ రక్తం ఉందన్న చంద్రబాబు ఎన్ని సందర్భాల్లో ఆ పార్టీతో కుమ్మక్కయ్యారనేది ప్రజలకు తెలుసునన్నారు. మాజీమంత్రి శంకర్రావు జగన్‌పై కేసు వేస్తే అందులో ఎర్రన్నాయుడును చంద్రబాబే ఇంప్లీడ్ చేయించారని, కాంగ్రెస్, టీడీపీ కలిసి ఆడిన నాటకం వల్లే జగన్‌పై కేసులు వచ్చాయని చెప్పారు.

ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై తమ ఓట్లన్నీ ఆ పార్టీకి మళ్లిస్తే టీడీపీ అభ్యర్థుల డిపాజిట్లు పోలేదా అని ఆయన ప్రశ్నించారు. చిత్తూరు, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను పోటీ చేయించకుండా కాంగ్రెస్‌కు సహకరించి వారితో కుమ్మక్కు కాలేదా? అని ప్రశ్నించారు. శాసనసభనుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కూడా పార్టీ నేత ప్రతిభా భారతిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. చంద్రబాబు తన పాదయాత్రలో ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు.. దిగి పోవాలి..’ అని విమర్శించి అవిశ్వాస తీర్మానం పెట్టలేదన్న విషయాన్ని మరిచిపోయారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పెట్టిన  అవిశ్వాస తీర్మానంపై చరిత్రలో లేని విధంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. గైర్హాజరు కావడం అంటే ప్రభుత్వాన్ని రక్షించ డమే కదా అని ప్రశ్నించారు. ఆరోజు చంద్రబాబు కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టి ఉంటే రాష్ట్రానికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఉమ్మారెడ్డి చెప్పారు.

విభజన పాపం చంద్రబాబుదే
యూపీఏ ప్రభుత్వం అడగ్గానే రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన ఘనత చంద్రబాబుదని ఉమ్మారెడ్డి విమర్శించారు. సీడబ్ల్యూసీ విభజన నిర్ణయాన్ని వెల్లడించిన ఒక్క రోజులోనే నాలుగైదు లక్షల కోట్ల రూపాయలిస్తే కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకుంటామని తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఘనత కూడా ఆయనదేనని ఎద్దేవా చేశారు. బాబు తన బస్సు యాత్రలో ఏ రోజైనా సమైక్యాంధ్ర జిందాబాద్ అన్నారా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారా? విభజన చేయాలంటూ తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటానని చెప్పారా? తన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించారా? అసలు ఆయన ఎందుకు ఆత్మ గౌరవయాత్రను చేశారు? యాత్ర ద్వారా ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

నిన్నటివరకూ తనది రెండు కళ్ల సిద్ధాంతమని చెప్పిన బాబు ఇపుడు ఒక కాలు కృష్ణా, మరోకాలు మూసీ నదిలో పెట్టి రెండు కాళ్ల విధానాన్ని అనుసరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, అంతర్జాతీయ వేదికల్లో పాల్గొన్న వ్యక్తిగా చంద్రబాబు బస్సుయాత్రలో మాట్లాడిన మాటల ఆయన స్థాయికి తగినట్టే ఉన్నాయా? అని మండిపడ్డారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు పశువులని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై అభ్యంతరం తెలుపుతూ... కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారిన చంద్రబాబు ఇతరులను విమర్శించడం సరికాదన్నారు.

ఇటలీకి ఇడుపులపాయకూ లింకు ఉందని అసంబద్ధమైన ఆరోపణలు చేశారని, వాస్తవానికి అలాంటి లింకు చిదంబరానికి, చంద్రబాబుకూ మధ్యే ఉందని చెప్పారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు ఎవరూ లేకుండా ఢిల్లీలో అర్ధరాత్రి వేళ ఒక ఎంపీని వెంట బెట్టుకుని చిదంబరంతో మాట్లాడి వచ్చారని తెలిపారు. దిగ్విజయ్‌కూడా బాబు తనకు మంచి స్నేహితుడన్నారని గుర్తుచేశారు. తనను చూసి షర్మిల పాదయాత్ర, బస్సు యాత్ర చేస్తోందనే  బాబు వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని, ఆ మాటకొస్తే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని చూసే కదా మీరు పాదయాత్ర సంకల్పించింది అని ఆయన ప్రశ్నించారు.

నేడు తూర్పు గోదావరి జిల్లాలోకి షర్మిల బస్సు యాత్ర

తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలన్నది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం. అడ్డగోలు విభజనను సహించరాదన్నది జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. ఆవిర్భావం నుంచి తెలుగువారి ఐక్యత, అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సమైక్యాంధ్ర పరిరక్షణ బాధ్యతను భుజానికెత్తుకుంది. అన్నదమ్ముల్లా అరవై ఏళ్ల పాటు కలిసిమెలిసి ఉన్న తెలుగువారి మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ అధినాయకత్వ వైఖరికి నిరసనగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల పూరించిన సమైక్య శంఖారావ ం నేటి నుంచి రెండురోజులపాటు ‘తూర్పు’న ప్రతిధ్వనించనుంది.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : మూడువేల పై చిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మొట్టమొదటి మహిళగా ప్రపంచ రికార్డును నెలకొల్పిన షర్మిల ఇప్పుడు సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం జిల్లాలో అడుగిడుతోంది. తిరుపతిలో ఈనెల 2న శ్రీకారం చుట్టిన ఈ యాత్ర ఇప్పటివరకు చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సాగింది. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా జూన్ 4న జిల్లాలో అడుగుపెట్టి 21 రోజుల పాటు 270.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన షర్మిల జిల్లాలోనే 2500 కిలోమీటర్ల మైలు రాయిని దాటారు.
 
 మళ్లీ రెండున్నర నెలల అనంతరం రాష్ర్ట విభజనపై కేంద్రం తీసుకున్న అసంబద్ధ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోనున్న సీమాంధ్రులకు అండగా నిలిచేందుకు జగనన్న తరపున సమైక్య శంఖారావం పూరించిన షర్మిల మళ్లీ జిల్లాకు వస్తున్నారు. పశ్చిమలో యాత్ర ముగించుకొని సిద్ధాంతం-గోపాలపురం వారధి మీదుగా శుక్రవారం ఉదయం షర్మిల జిల్లాలో ప్రవేశించ నున్నారు. ఆమె యాత్ర  కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం వద్ద ప్రారంభమై పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల మీదుగా  సాగనుంది.
 
 తొలిరోజు పర్యటనలో కోనసీమ ముఖద్వారమైనరావులపాలెం వద్ద రావులపాలెం మార్కెట్ సెంటర్‌లో సమైక్యవాదులనుద్దేశించి షర్మిల ప్ర


సంగించనున్నారు. అక్కడ నుంచి కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల మీదుగా  సాయంత్రం అమలాపురం చేరుకుని అక్కడి హైస్కూల్ సెంటర్‌లో సమైక్యవాదులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ముమ్మిడివరం నియోజకవర్గం మీదుగా తొలిరోజు యాత్ర సాగుతుంది. శనివారం ఉదయం ముమ్మిడివరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల మీదుగా కాకినాడ సిటీలోకి యాత్ర ప్రవేశిస్తుంది. కాకినాడ మెయిన్‌రోడ్డులో 216 జాతీయ రహదారిపై మసీద్‌సెంటర్‌లో కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జరిగే మహాధర్నాలో షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల మీదుగా యాత్ర తుని చేరుకుంటుంది. అక్కడ నుంచి పాయకరావుపేట వద్ద విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తుంది.
 
 ఘనస్వాగతానికి ఏర్పాట్లు
 రావులపాలెం : సిద్ధాంతం-గోపాలపురం వంతెన మీదుగా జిల్లాలో అడుగుపెడుతున్న షర్మిలకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీశ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. కొత్తపేట నియోజక వర్గ పార్టీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఇందు కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. జగ్గిరెడ్డితో పాటు జిల్లా ఇండస్ట్రియల్, వాణిజ్య, సేవాదళ్ కన్వీనర్లు మంతెన రవిరాజు, కర్రి పాపారాయుడు, మార్గన గంగాధర్, జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. రావులపాలెం మార్కెట్‌రోడ్డు సెంటర్‌లో జరిగే సభకు తరలి వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్తపేట నుంచి వచ్చే వాహనాలకు రావుల పాలెం జెడ్పీ హైస్కూల్‌లో, ఆలమూరు నుంచి వైపు వచ్చే వాహనాలకు జూనియర్ కళాశాల గ్రౌండ్స్‌లో, ఆత్రేయపురం నుంచి వచ్చే వాహనాలకు రావులపాలెం పంచాయతీ కార్యాలయ ఆవరణలో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్టు జగ్గిరెడ్డి తెలిపారు.
 
 సమైక్యశంఖారావాన్ని విజయవంతం చేయాలి : కుడుపూడి
 అమలాపురం : సమైక్యాంధ్ర పరిరక్షణకు షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పిలుపు నిచ్చారు. అమలాపురంలో పార్టీ జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యుడు టేకి రాజగోపాలరావు స్వగృహంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో చిట్టబ్బాయి మాట్లాడుతూ అమలాపురంలో జరిగే సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యాంధ్ర కోనసీమ ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, రైతు, కార్మిక జేఏసీ నాయకులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. సభకు తరలి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పి.గన్నవరం, రాజోలు నుంచి వచ్చే వాహనాలు బస్టాండ్ ఆవరణలో, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, అయినవిల్లి నుంచి వచ్చే వాహనాలు బైపాస్‌రోడ్డు మీదుగా వచ్చి స్థానిక విట్స్ స్కూల్ కాంప్లెక్స్‌లో, అల్లవరం వైపు నుంచి వచ్చే వాహనాలను ఆదిత్య జూనియర్ కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేయాలని సూచించారు.
 

Popular Posts

Topics :