19 February 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

కొత్త అసెంబ్లీలోనైనా మాట్లాడే అవకాశం ఇవ్వండి

Written By news on Saturday, February 25, 2017 | 2/25/2017


'కొత్త అసెంబ్లీలోనైనా మాట్లాడే అవకాశం ఇవ్వండి'
హైదరాబాద్ :
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సమస్యలున్నాయని, కొత్త అసెంబ్లీలోనైనా సభను సజావుగా నడిపించి తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబునాయుడు మూడేళ్ల పాలనలో విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పటివరకూ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రస్తావించిన ఏ అంశం పైనా సభలో అధికార పక్షం క్లారిటీ ఇవ్వలేదని పేర్కొన్నారు. కేవలం మేం చెప్పిందే మీరు వినండి అనేలా అధికారపక్షం ప్రవర్తిస్తుందని విమర్శించారు. కొత్త అసెంబ్లీలోనైనా సాంప్రదాయాన్ని పాటించాలని, సభను సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికార పక్షం చేసే తప్పులను ఎత్తిచూపడమే విపక్షంగా తమ బాధ్యత అని చెప్పారు.

ఏపీలో తాగునీటి సమస్యలు, నిరుద్యోగ భృతి, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు లాంటి ఎన్నో సమస్యలున్నాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం చేసిన అక్రమాలు, పార్టీ ఫిరాయింపులు అంశం, స్విస్ ఛాలెంజ్ విధానం, రాజధాని కోసం చేపట్టిన భూ సేకరణ, సమీకరణపై ప్రశ్నించాల్సి ఉందన్నారు. అయితే హైదరాబాద్ లో జరిగిన సమావేశాలలో కనీసం ఒక్క రోజు.. ఒక్క సెషన్ కూడా సభ సజావుగా సాగనివ్వలేదని, ప్రతిపక్షాలకు సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. పల్లెలకు పల్లెలు వలసలు వెళ్లిపోతున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ అధికారులపై టీడీపీ నిందలు మోపుతోందని విమర్శించారు. కొంతమంది అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు వెలగపూడిలో మార్చి 6వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 13న ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.

నన్ను క్షమాపణ కోరే ముందు...

Written By news on Friday, February 24, 2017 | 2/24/2017


నన్ను క్షమాపణ కోరే ముందు...
తిరుమల: ఒత్తిడికి తలొగ్గి పనిచేయాల్సి వస్తోందని పోలీస్ అధికారులు చెప్పడం బాధాకరమని నగరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తనను క్షమాపణ అడిగే ముందు వారు ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకోవాలని కోరారు. గన్‌ మెన్లను నల్లబ్యాడ్జీలతో నిరసర తెలపమనం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు ఇంటి వద్ద వసతులు లేక ఎండలో మగ్గుతున్న పోలీసులు నిరసన తెలపాలని సూచించారు.

పోలీసులపై చింతమనేని ప్రభాకర్‌ దాడి చేసినప్పుడు అధికారుల సంఘం ఏం చేసిందని ప్రశ్నించారు. పుష్కరాల్లో అనేక మంది మరణిస్తే ఆ తప్పంతా పోలీసుల వైఫల్యమేనని చంద్రబాబు అన్నప్పుడు పోలీసు అధికారుల సంఘం ఏమైపోయిందని అడిగారు. తనను క్షమాపణ కోరే ముందు రాజధానిలో పోలీసుల అవస్థలపై నిరసన తెలపాలని ఎమ్మెల్యే రోజా అన్నారు.

ఈ ఎన్నికలు అవినీతికి, విలువలకు మధ్య జరిగే పోరాటం


నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ వివేకానందరెడ్డి
కడప: కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలు సమయంలో ఆయనతో పాటు ఎంపీ మిథున్‌ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం వివేకానందరెడ్డి మీడియాతో మాట్లాడారు. అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లే.. కడపలో ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
అమ్ముడు పోయేందుకు తామేమీ అంగట్లో సరుకులం కాదని.. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నిరూపించబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలు అవినీతికి, విలువలకు మధ్య జరిగే పోరాటమని, తాము 200కి పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తామని వైఎస్ వివేకానందరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాలలో త్వరలో ఖాళీ కానున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్‌ తేదీ మారే సూచనలు కన్పిస్తున్నాయి. స్థానిక సంస్థల నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల పోలింగ్‌ కూడా వచ్చేనెల 17న జరగనుండటమే ఇందుకు కారణం.

చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ

Written By news on Wednesday, February 22, 2017 | 2/22/2017


చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ
హైదరాబాద్‌: ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం చంద్రబాబుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, కోన రఘుపతి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు.

అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచినా చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదని లేఖలో వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. ఈ 33 నెలల్లో రూ. 2 వేల చొప్పున ఒక్కో కుటుంబానికి రూ. 66 వేలు చెల్లించాల్సివుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 1 కోటీ 75 లక్షల కుటుంబాలకు ఒక లక్షా 15 వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారని వివరించారు. నిరుద్యోగులకు బకాయిలతో పాటు భృతి మొత్తాన్ని చెల్లించేందుకు 2017-18 బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకుంటే తమ కార్యాచరణను ప్రకటిస్తామననారు.

(లేఖ పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

వైఎస్సార్ సీపీ కమిటీల్లో నియామకాలు

Written By news on Tuesday, February 21, 2017 | 2/21/2017


వైఎస్సార్ సీపీ కమిటీల్లో నియామకాలు
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీల్లో పలువురి నాయకులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు జరిపినట్లు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వంగవీటి రాధాకృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా షేక్ ఆసిఫ్‌ను నియమించారు. విజయవాడ సిటీ పార్టీ అధ్యక్షుడిగా, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ సింగిల్ కో ఆర్డినేటర్‌గా వెల్లంపల్లి శ్రీనివాస్, గ్రేటర్ రాజమండ్రి అధ్యక్షుడిగా కందుల దుర్గేష్‌ను నియమించారు. కొత్తగా నియమితులైన నాయకులకు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Popular Posts

Topics :