30 October 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రేపు విశాఖలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ

Written By news on Saturday, November 5, 2016 | 11/05/2016


రేపు విశాఖలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ
ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు... ముస్తాబవుతున్న నగరం
సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ ఉద్యమించి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్న ఘన చరిత్ర విశాఖపట్నం సొంతం. ఇప్పుడు అదే నగరంలో ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభ నిర్వహించేందుకు సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రాభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమరశంఖం పూరించనున్నారు.

విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే జై ఆంధ్రప్రదేశ్ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణానికి  స్వాతంత్య్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం, సభా వేదికకు గురజాడ అప్పారావు పేరిట నామకరణం చేశారు. సభకు తరలివచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇది ఐదు కోట్లమంది ఉద్యమం
రాజధానిలో ఉద్యోగాలను దూరం చేసిన ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా 1972లో రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో యువత ప్రత్యేక రాష్ర్టం కోసం ‘జై ఆంధ్ర’ నినాదంతో మహోద్యమం సాగించిన సంగతి తెల్సిందే.  నేడు సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా లభించిన ‘ప్రత్యేక హోదా’ను పాలకులు నిరాకరించడం, ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలను దూరం చేయడానికి నిరసనగా ‘జై ఆంధ్రప్రదేశ్’ నినాదంతో జగన్‌మోహన్ రెడ్డి ఉద్యమిస్తున్నారు. ప్రత్యేక హోదాపై ‘యువభేరి’ సదస్సులతో యువతను చైతన్యపరుస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ఇపుడు ప్రత్యేక హోదా సాధన కోసం ‘జై ఆంధ్రప్రదేశ్’ నినాదంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇపుడు ఈ ఉద్యమం ఐదు కోట్ల మంది ఆంధ్రుల చేతుల్లోకి వెళ్లింది.

ఏర్పాట్లను సమీక్షిస్తున్న విజయసాయిరెడ్డి
విశాఖ తరహాలోనే జై ఆంధ్రప్రదేశ్ సభలను రాష్ర్టవ్యాప్తంగా మరో ఐదు చోట్ల నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం విశాఖపట్నంలో పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, రాష్ర్ట ప్రొగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా తదితరులతో కలిసి మున్సిపల్ స్టేడియంలో సభఏర్పాట్లను పరిశీలించారు. ఆయన సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు దగా చేసిన తీరు, రెండున్నరేళ్లలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు జై ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహిస్తున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

సభపై కక్ష సాధింపు
జై ఆంధ్రప్రదేశ్ సభ కోసం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు విశాఖలోని ప్రధాన కూడళ్లు, రహదారులను పార్టీ జెండాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ జెండాలతో నిండిపోయాయి. అయితే నగర పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెచ్చి జెండాలు, తోరణాల్ని తొలగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఓ పక్క జనచైతన్య యాత్రల పేరిట టీడీపీ చేపట్టిన కార్యక్రమాలకోసం నగరంలో ఎక్కడపడితే అక్కడ ఆ పార్టీ జెండాలు కడుతున్నా తొలగించని అధికారులు పనిగట్టుకుని వైఎస్సార్‌సీపీ జెండా లు, తోరణాలను తొలగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం

Written By news on Wednesday, November 2, 2016 | 11/02/2016

 ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌. జగన్ మోహన్ రెడ్డి బుధవారం చంద్రగిరిలో జరిగిన బంధువుల వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గాన చంద్రగిరి చేరుకున్నారు. స్థానిక వైఎస్‌ఎంఆర్‌ కల్యాణ మండపంలో జరిగిన బంధువుల వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులు శుభకర్‌రెడ్డి, నళినీరెడ్డిలను ఆశీర్వదించారు. అనంతరం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని.. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. 
 
కాగా చాలా రోజుల తర్వాత చంద్రగిరి నియోజకవర్గానికి విచ్చేస్తున్న అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రేణిగుంటలో అభిమానులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి మీదున్న దామినేడు నుంచి చంద్రగిరి వరకూ రోడ్డుకు ఒకవైపున పార్టీ జెండాలు పట్టుకుని 7 వేల మంది అభిమానులు ఆయన కోసం వేచి ఉన్నారు. హైవే మీద 20 కిలోమీటర్ల పొడవున భారీ జెండాలను ఏర్పాటు చేశారు. 

 

విశాఖలో జగన్ బహిరంగ సభ


విశాఖలో జగన్ బహిరంగ సభ: బొత్స
అనకాపల్లి టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత, విభజన చట్టంలో ఉన్న అంశాల్ని ప్రజలకు వివరించేందు కు ఈ నెల 6న  విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘జై ఆంధ్ర ప్రదేశ్’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇందులో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి హోదా అవసరాన్ని వివరించడంతోపాటు టీడీపీ పాలనలో అవినీతి, సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నిర్వీర్యం తదితర అంశాలను జగన్ వివరిస్తారని బొత్స తెలిపారు. ఇక్కడి రూరల్ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి హోదా ఇస్తే పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబువన్నీ బడాయి మాటలే

Written By news on Tuesday, November 1, 2016 | 11/01/2016


చంద్రబాబువన్నీ బడాయి మాటలే: విశ్వేశ్వరరెడ్డి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని  సామాజిక అధ్యయనాల సంస్థ (సెస్‌) బయటపెట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైవీ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీ రైతాంగం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు సెస్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. సెస్ నివేదికతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలన్నీ బడాయి మాటలేనని తేలిపోయిందని ఎద్దేవా చేశారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీ రైతులు అప్పుల్లో మునిగిపోయారని నివేదికలో తేలిందని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రెండంకెల వృద్ధిరేటు అని, వ్యవసాయ మిషన్ అని గొప్పలు చెబుతున్నరని, అయితే అవన్నీ పచ్చి అబద్ధాలని సెస్ నివేదికతో తేలిపోయిందన్నారు.  ఇందుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదకే నిదర్శనమన్నారు. రుణమాఫీ చేసి ఉంటే....రాష్ట్రంలో 93 శాతం రైతులు  అప్పుల్లో ఎందుకు కూరుకుపోయి ఉంటారని  ప్రశ్నించారు.

చంద్రబాబు పాలనలో అన్నదాతలు అన్ని విధాలా అన్యాయమైపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి జపమే తప్ప చంద్రబాబు వ్యవసాయాన్ని ఏనాడు పట్టించుకోలేదని విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. రైతుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడొద్దని, సెస్ నివేదికతో అయినా ప్రభుత్వం కళ్లు తెరిచి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంక్షోభం నుంచి వ్యవసాయరంగం బయటపడే మార్గాలు వెతకాలని విశ్వేశ్వరరెడ్డి సూచించారు.

దుగ్గిరాల వైస్ ఎంపీపీ వైఎస్సార్‌సీపీ కైవసం

Written By news on Sunday, October 30, 2016 | 10/30/2016


దుగ్గిరాల వైస్ ఎంపీపీ వైఎస్సార్‌సీపీ కైవసం
 అధికార పార్టీ కుట్రలు విఫలం
 వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి: దుగ్గిరాల మండల ఉపాధ్యక్ష పదవిని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. దొడ్డిదారిన వైస్ ఎంపీపీ పదవిని సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వైఎస్సార్‌సీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్‌కే), నియోజకవర్గ నేతలు కలసి వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. దుగ్గిరాల మండల పరిషత్ ఉపాధ్యక్షుడి పదవిని గతంలోనే వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ పదవిపై ఒప్పందం కుదిరింది. ఆ మేరకు రెండో వ్యక్తి కోసం శుక్రవారం ఎన్నిక జరగాలి. ఈ నేపథ్యంలో వైస్ ఎంపీపీ పదవిని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ తీవ్రంగా శ్రమించింది.

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి తమవైపునకు తిప్పుకొనేందుకు కోరం లేదనే సాకుతో శుక్రవారం ఎన్నిక జరగకుండా శనివారానికి వాయిదా వేయించింది. టీడీపీ ఆగడాలను గుర్తించిన ఎమ్మెల్యే ఆర్‌కే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను ఈమని తీసుకెళ్లారు. వారిని శనివారం ఉదయమే మండల పరిషత్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అప్పటికే పోలీసులు భారీగా ఉండడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. టీడీపీ కార్యకర్తలు వచ్చి అల్లర్లు సృష్టించి ఎన్నికను నిలువరించాలని కుట్ర పన్నినా, అవి సాగలేదు. అధికారులు  ఎన్నిక నిర్వహించి ఈమని ఎంపీటీసీ సభ్యుడు మత్తె ఆనంద్(వైఎస్సార్‌సీపీ)ను ఉపాధ్యక్షుడిగా ప్రకటించి, ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ... ఈ ఎన్నిక టీడీపీ పతనానికి నాంది అని విమర్శించారు.

Popular Posts

Topics :