05 June 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్

Written By news on Saturday, June 11, 2016 | 6/11/2016


రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు శనివారం అడ్డుకున్నారు. ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు వైఎస్ఆర్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను తదితరులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్నారు. అయితే వారిని రాజమండ్రి విమానాశ్రయం వద్దే పోలీసులు అడ్డుకోవడంతో, ఆ చర్యను నిరసిస్తూ నిరసనకు దిగారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని కోరుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు కాపు నేతలను ఎక్కడకక్కడ ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు.

చేసిన అభివృద్ధి ఏమీలేకే జగన్‌ను ఆడిపోసుకుంటున్నారు

Written By news on Friday, June 10, 2016 | 6/10/2016


చేసిన అభివృద్ధి ఏమీలేకే జగన్‌ను ఆడిపోసుకుంటున్నారు
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం
జగన్‌ను తిట్టేందుకే ప్రభుత్వ ఖర్చులతో కడపలో మహాసంకల్పం

సాక్షి, హైదరాబాద్: తమ రెండేళ్ల పాలన గురించి ప్రజలకు గొప్ప చెప్పుకోవడానికి చేసిందీ ఒక్కటీ కనిపించక సీఎం చంద్రబాబుసహా టీడీపీ నేతలందరూ ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికిప్రతి విషయంలోనూ జగన్‌మోహన్‌రెడ్డిని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ డబ్బులతో కడపలో మహాసంకల్ప దీక్ష నిర్వహించింది రెండేళ్ల పాలనలో సాధించిన విషయాలు చెప్పుకోవడానికా?
లేదంటే జగన్‌ను ఆడిపోసుకోవడానికా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని పూర్తిగా పార్టీ కార్యక్రమం మాదిరి నిర్వహించారని దుయ్యబట్టారు. రెండేళ్ల పాల నలో ప్రభుత్వం సాధిం చిన అభివృద్ధి ఏంటన్నది చెప్పుకోవడానికి ఒక్క అంశమైనా ఉందా? అని ప్రశ్నించారు. తుని ఘటనసహా ప్రతి విషయంలోనూ సీమ రౌడీలంటూ నిత్యం ఆ ప్రాంత ప్రజలపై  బాబు ద్వేషం వెళ్లగక్కుతున్న మాట నిజంకాదా? అని నిలదీశారు.
‘బ్రీఫ్డ్ మీ’ టేపుల్లో దొరికినందుకే  కేసీఆర్ అంటే భయం
ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తానెందుకు భయపడతానని బాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కానీ, తాను భయపడట్లేదని కూడా ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారని పద్మ ఎద్దేవా చేశారు. ‘బ్రీఫ్డ్ మీ’ అంటూ ఆడియో టేపుల్లో దొరికిపోయారు కాబట్టే మోదీ అన్నా, కేసీఆర్ అన్నా భయమని... అందువల్లే కృష్ణానదిపై టీ సర్కారు అనుమతుల్లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినా ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారని ధ్వజమెత్తారు.

నన్ను ఇబ్బంది పెట్టేందుకే టీడీపీ ప్రయత్నం


నన్ను ఇబ్బంది పెట్టేందుకే టీడీపీ ప్రయత్నంపార్టీ ఫిరాయించిన అశోక్ రెడ్డి, పోతులపై అసెంబ్లీ సెక్కటరీకి ఫిర్యాదు చేస్తున్న బుగ్గన
దేవినేని ఉమాపై పీఏసీ చైర్మన్ బుగ్గన ధ్వజం
సాక్షి, హైదరాబాద్:  ‘‘ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నన్ను ఇబ్బంది పెట్టేందుకు అధికార టీడీపీ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించింది. ఇందులో భాగంగా భూసేకరణ చట్టం నిబంధనలు సైతం పాటించకుండానే నా సొంత భూములను తీసుకోవడానికి యత్నించింది. ఈ ప్రయత్నాలకు కోర్టు ద్వారా అభ్యంతరం తెలిపితే.. అభివృద్ధికి అడ్డుపడుతున్నానని నాపై మంత్రి దేవినేని ఉమా ఆరోపణలు చేయడం దుర్మార్గం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తప్పుపట్టారు.

మంత్రి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నానని ఆరోపణలు చేస్తున్న మంత్రి ఉమా ఆయన ఇంటిలో ఆరడుగుల స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం ఒకవేళ మున్సిపాలిటీవారు నిబంధనలు పాటించకుండా తీసుకుంటే అభ్యంతరం వ్యక్తం చేస్తారా? లేదంటే మౌనంగా ఉంటారా? అన్నది తేల్చిచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుగ్గన గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం చెరువుపల్లికి సంబంధించి మంత్రి దేవినేని ఉమా చెబుతున్న తొమ్మిదెకరాల భూములకు 1929 నుంచి దస్తావేజులున్నాయని చెప్పారు. అయితే తమకెలాంటి నోటీసులివ్వకుండా.. ప్రతిపక్షంలో ఉన్న తనను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం రెవెన్యూ, పోలీసు, సాగునీటి శాఖల అధికారులతో బలవంతంగా భూముల స్వాధీనానికి ప్రయత్నించిందన్నారు. అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు.
 
అశోక్‌రెడ్డి, పోతులపై అసెంబ్లీ కార్యదర్శికి బుగ్గన ఫిర్యాదు
 పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం గురువారం అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. పీఏసీ చైర్మన్, పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీ ఇన్‌చార్జ్ కార్యదర్శి సత్యనారాయణను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

వైఎస్సార్ సీపీ సమన్వయకర్తల నియామకం


ఏపీలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తల నియామకం
, హైదరాబాద్:విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త సమన్వయకర్తలను నియమించింది. పాయకరావుపేట నియోజకవర్గానికి నలుగురు సభ్యులతో సమన్వయ క మిటీని ఏర్పాటు చేసింది.

మాజీ ఎమ్మెల్యేలు చంగల వెంకట్రావు, గొల్ల బాబూరావు, పార్టీ నేతలు చుక్కాల రామారావు, వీసం రామకృష్ణలను కమిటీ సభ్యులుగా నియమించింది. యలమంచిలి నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా బొడ్డేడ ప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఉభయ గోదావరి జిల్లాలకు వైఎస్ జగన్

Written By news on Wednesday, June 8, 2016 | 6/08/2016


ఉభయ గోదావరి జిల్లాలకు వైఎస్ జగన్
హైదరాబాద్: విజయవాడలో ఈ నెల 13న జరగాల్సిన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశం 14కు వాయిదా పడిందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15, 16 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన చెప్పారు. 15న పశ్చిమ గోదావరి, 16న తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు మండలాల్లో జగన్ పర్యటిస్తారని వెల్లడించారు.

ప్రభుత్వ వైఫల్యాలపై కదంతొక్కిన వైస్ఆర్ సీపీ


ప్రభుత్వ వైఫల్యాలపై కదంతొక్కిన వైస్ఆర్ సీపీ
► రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండేళ్ల పాలనలో చేసిన మోసాలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని నేతలు ఆరోపించారు.

వైఎస్సార్ జిల్లా: సీఎం చంద్రబాబు మోసాలపై జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని పులివెందులలో వైఎస్ ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజంపేటలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్ నాథ్ రెడ్డి, కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు జమ్మలముడుగులో వైఎస్సార్ సీపీ నేత సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

శ్రీకాకుళం: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ఆముదాలవలస పోలీస్ స్టేషన్ లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

విజయనగరం: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నేతల నేతృత్వంలో స్థానిక పోలీస్ స్టేషన్లలో బాబు మోసాలపై చర్యలు తీసుకోవాలని కంప్లయింట్‌ చేశారు.

విశాఖపట్టణం: విశాఖ వన్ టౌన్, త్రీ టౌన్, నర్సీపట్నం, పాయకరావుపేట పోలీస్ స్టేషన్లలో వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు రామకృష్ణ, గురువులు, జాన్ వెస్లీ, అమర్ నాథ్, వంశీకృష్ణ, గణేష్, గొల్ల బాబురావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఫిర్యాదు చేశారు.

తూర్పుగోదావరి: చంద్రబాబు మోసాలపై జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పి.గన్నవరం, పెద్దాపురం, సఖినేటిపల్లి, ముమ్మడివరం,అమలాపురం, కొత్తపేట, రాజమండ్రి, కడియం పోలీస్ స్టేషన్లలో నేతలు కొండేటి చిట్టిబాబు, సుబ్బారావునాయుడు,ఆలూరు కృష్ణంరాజు, గుత్తులసాయి, చిట్టబ్బాయ్, విశ్వరూప్, జగ్గిరెడ్డి, ఆదిరెడ్డి వాసు, రౌతు సూర్యప్రకాశరావు, వెంకటస్వామినాయడు ఆధ్వర్యంలో ఫిర్యాదులు చేశారు.

పశ్చిమగోదావరి: భీమవరం, నర్సాపురం పోలీస్ స్టేషన్లలో మాజీ ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో కంప్లయింట్‌ చేశారు.

కృష్ణాజిల్లా: ఎన్నికలకు ముందిచ్చిన హామీల్లో బాబు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ వైఎస్ఆర్ సీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో బాబు మోసాలపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధ నేతృత్వంలో విజయవాడ గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కైకలూరులో వైఎస్సార్ సీపీ నేత డీఎన్ ఆర్ ఫిర్యాదు చేశారు.

గుంటూరు: గుంటూరు జిల్లా వ్యాప్తంగా నేతలు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. గుంటూరు అరండల్ పేటలో లేళ్ల అప్పిరెడ్డి, ముస్తఫా, కావటి మనోహర్ నేతృత్వంలో, గురజాలలో జంగా కృష్ణమూర్తి, మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే, వినుకొండలో బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఫిర్యాదులు సమర్పించారు.

ప్రకాశం: చంద్రబాబు మోసాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా స్థానిక పీఎస్ లలో ఫిర్యాదులు చేశారు. చీరాలలో బాలాజీ, ఒంగోలు వన్ టౌన్ లో కొప్పంప్రసాద్, వెంకట్రావు, వేణుగోపాల్ నేతృత్వంలో బాబుపై కేసులు నమోదు చేయాలని కంప్లయింట్‌ చేశారు.

నెల్లూరు: బుచ్చిరెడ్డిపాళెంలో జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు మోసాలపై ఫిర్యాదు చేశారు.నెల్లూరు నగరంలోని నాల్గవ పోలీస్ స్టేషన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కంప్లయింట్‌ చేశారు.

చిత్తూరు: ఎన్నికల సందర్భంగా ఆరొందల హామీలు ఇచ్చిన చంద్రబాబు... ఏ ఒక్కటీ అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని తిరుపతిలో ఆయన ఫిర్యాదు చేశారు. బాబు మోసాలపై జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. మదనపల్లెలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, నగరిలో ఎమ్మెల్యే రోజా, బంగారు పాల్యెంలో ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్వంలో ఫిర్యాదు చేశారు

అనంతపురం: చంద్రబాబు మోసాలపై అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పార్టీ నేత డాక్టర్ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో కంప్లయింట్‌ చేశారు.

కర్నూలు: కర్నూలు త్రీ టౌన్ లో ఎమ్మెల్యే గౌరు సరిత, గౌరు వెంకటరెడ్డి నేతృత్వంలో, ఆలూరులో ఎమ్మెల్యే జయరాం, బనగానపల్లెలో మాజీ మంత్రి కాటసాని రాంరెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.

Popular Posts

Topics :