26 January 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

సమైక్యాంధ్ర ఛాంపియన్‌ జగనే:ఎస్ పివై రెడ్డి

Written By news on Saturday, February 1, 2014 | 2/01/2014

సమైక్యాంధ్ర ఛాంపియన్‌ జగనే:ఎస్ పివై రెడ్డిఎస్పీవై రెడ్డి
కర్నూలు: సమైక్యాంధ్ర ఛాంపియన్‌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అని ఆ పార్టీ నేత, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు.  జగన్‌ చెప్పినట్లుగా సీఎం, మంత్రులు రాజీనామా చేసి ఉంటే, రాజకీయ సంక్షోభంతో తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చేది కాదని ఆయన చెప్పారు.

తమ ప్రాంత రైతులకు సాగునీటి కేటాయింపుల్లో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని కోరడం కోసం తాను సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కలిస్తే, దానిపై కొన్ని వార్తా చానెళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని ఆయన నిన్న ఖండించిన విషయం తెలిసిందే.  ఆ రకంగా ప్రసారం చేయడం బాధకలిగించిందని కూడా ఆయన చెప్పారు.

టికెట్లు ఇస్తామంటే పార్టీలో చేరేందుకు నేతలు సిద్ధం

 పార్టీ టిక్కెట్లు ఇస్తామంటే టీడీపీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ మంత్రులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నాయని శోభానాగిరెడ్డి విమర్శించారు.

ఇక్కడ పార్టీలో అవకాశం లేనివారే ఇతర పార్టీలవైపు చూస్తున్నారని ఆమె చెప్పారు. విభజనపై అసెంబ్లీలో చర్చ సమయంలో చంద్రబాబు మాట్లాడకపోవడం ఒక డ్రామా అని శోభానాగిరెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా అఫిడవిట్లు ఇచ్చారని ఆమె చెప్పారు. చంద్రబాబు మాత్రం లేఖ గానీ, అఫిడవిట్లు గానీ ఇవ్వలేదని శోభానాగిరెడ్డి విమర్శించారు.

వైఎస్సార్సీపీ అధ్యక్ష ఎన్నిక షెడ్యూలు విడుదల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. ఇడుపులపాయలో ఆదివారం జరగనున్న పార్టీ రెండో ప్లీనరీ సందర్భంగా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించారు.

అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూలును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటన కూడా ఆయన విడుదల చేశారు.

వైఎస్ఆర్ సీపీ కాంగ్రెసేతర,లౌకిక ప్రతిపక్షపార్టీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెసేతర, లౌకిక ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. రాష్ట్ర కమిటీ సమావేశానికి శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకే పరమితమని వ్యాఖ్యానించారు.
సీపీఎం ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలకు సిద్ధమైదని ప్రకాష్ కారత్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు తరువాత తమ విధానాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సీపీఐ, సీపీఎం పొత్తులపై రాష్ట్ర కమిటీలు నిర్ణయిస్తాయని ప్రకాష్ కారత్ తెలిపారు. టీడీపీ మతతత్వ బీజేపీతో దోస్తీ కడుతోందని ఆయన ఆరోపించారు.

రేపు వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీ

రేపు వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీ
నేడు ఇడుపులపాయలో సీజీసీ భేటీ: ఉమ్మారెడ్డి 
 సాక్షి, హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో ప్లీనరీ (ప్రజాప్రస్థానం) ఫిబ్రవరి రెండో తేదీన నిర్వహించనున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో జరగనున్న ఈ ప్లీనరీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నికతోపాటు ఇతర సంస్థాగత కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. నేడు (శనివారం) పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సమావేశమై, అధ్యక్ష ఎన్నికలకు కావాల్సిన షెడ్యూలును ప్రకటించి దానిపై రెండో తేదీన ఫలితాలు ప్రకటించడంతోపాటు ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్లీనరీ విస్తృతస్థాయి సమావేశం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశంలో రెండేళ్లుగా పార్టీ చేసిన వివిధ కార్యక్రమాలతో పాటు సమైక్యాంధ్రప్రదేశ్ కోసం చేసిన కృషిపై ఒక నివేదిక ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ప్లీనరీ వివరాలు...
 
  ప్లీనరీలో మొదట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి మృతి చెందిన నేతలకు సంతాపం తెలియజేసిన తర్వాత పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రారంభోపన్యాసం చేస్తారు.
-     ఆ తర్వాత రైతు శ్రేయస్సుకోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని, ఆర్థిక తదితర అంశాలపై పలు తీర్మానాలను ప్రవేశపెడతారు.
 -    మరోప్రజాప్రస్థానం ద్వారా సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల ప్రసంగం సమావేశం మధ్యలో ఉంటుంది.
-  ఆ తర్వాత జిల్లాల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఆమోదిస్తారు. ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతనంగా ఎన్నికైన పార్టీ అధ్యక్షుడి సందేశం ఉంటుంది.

 ఎన్నిక క్రమమిదీ...
-     ఫిబ్రవరి 1న (శనివారం) మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకు సీజీసీ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. 3 నుంచి 4 గంటల వరకు అధ్యక్ష పదవికి నామినేషన్లను స్వీకరిస్తారు. 4 నుంచి 4.30 వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 5గంటలకు ఆమోదిత నామినేషన్ల పేర్లను ప్రకటిస్తారు.
-     ఫిబ్రవరి 2న (ఆదివారం) ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. 11.30 నుంచి 12.30 వరకు ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారు

ప్రతిపక్ష స్థానానికీ మచ్చ తెచ్చావ్ !

సమైక్య శంఖారావంలో చంద్రబాబుపై జగన్ నిప్పులు
ప్రతిపక్ష నాయకుడిగా ఉండి విభజనకు సహకరిస్తావు
ఒక ప్రాంతం వారితో తెలంగాణ అనిపించావు..
మరోప్రాంతం వారితో సమైక్యాంధ్ర అనిపించావు
44 రోజులపాటు సమావేశాలు జరిగితే ‘జై సమైక్యాంధ్ర’ అనడానికి నోరు రాలేదా?
విభజన ద్రోహులైన సోనియా, కిరణ్, చంద్రబాబులను ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు

 
సమైక్య శంఖారావం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘‘ఓట్లు, సీట్ల కోసం, కొడుకును ప్రధానమంత్రి కుర్చీపై కూర్చోబెట్టడం కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజిస్తుంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అందుకు సహకరిస్తావు. ఒకవైపు సైగ చేసి తెలంగాణ ఎమ్మెల్యేలతో జై తెలంగాణ అనిపించావు.. మరోవైపు సీమాంధ్ర ఎమ్మెల్యేలకు సైగ చేసి సమైక్యాంధ్ర నినాదాలు చేయించావు.. 44 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ‘జై సమైక్యాంధ్ర’ అన్న ఒక్క పదం అనడానికి నోరు రాలేదా? తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానానికే కాదు ఇప్పుడు కుమ్మక్కు రాజకీయాలతో ప్రతిపక్ష స్థానానికీ మచ్చ తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
 
 ఒక పార్టీ అధినేతగా ఉండి.. ఒక సమస్యపై ఒక్కొక్కరితో ఒక్కోలా మాట్లాడించే చంద్రబాబు అసలు నాయకుడేనా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ జగన్ చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం నెల్లూరు జిల్లాలో సాగింది. నాయుడుపేట, మునుబోలు, గూడూరుల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో జగన్ మాట్లాడారు. సోనియా అడుగులకు మడుగులొత్తుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌ను, ప్యాకేజీలతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
 
 ఆ భయానక రోజులు ప్రజలకు ఇంకా గుర్తున్నాయి..
 ‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి నాలుగున్నరేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నారు. ఆయన పేరు వింటే చంద్రబాబు లాంటి వారి గుండెల్లో ఇప్పటికీ రైళ్లు పరిగెడతాయి. ఒకవ్యక్తి చనిపోయి నాలుగున్నర సంవత్సరాలు దాటిపోతున్నా ఇప్పటికీ చంద్రబాబు వైఎస్‌పై బురద చల్లని రోజు లేదు. జగన్‌ను విమర్శించని రోజు లేదు. అధికారంలోకి వచ్చేందుకు ఎత్తులు, పైఎత్తులు, వెన్నుపోట్లు, కుమ్మక్కు రాజకీయాలనే నమ్ముకున్న చంద్రబాబులాంటి వారికి ... మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ అన్నా, రాజకీయాల్లో ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వారన్నా గుండెల్లో రైళ్లు పరిగెత్తడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నాకు ఇప్పటికీ ఆ రోజులు గుర్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ భయానక రోజులు ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. పల్లెలకు వెళ్లినప్పుడు వృద్ధులు నాయనా.. పింఛన్ ఇప్పించు అని ప్రాధేయపడేవారు.
అప్పుడు నెలకు రూ.75 పింఛన్ ఇచ్చేవారట. ఆ రూ.75 కోసం ఆ వృద్ధులు అంతగా ప్రాధేయపడే పరిస్థితిని చూసి బాధేసేది. ఎమ్మార్వోకో, ఆర్డీవోకో ఫోన్ చేస్తే.. ఆ గ్రామంలో పింఛన్ల కోటా పూర్తయ్యిందని, ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న వృద్ధుల్లో ఎవరో ఒకరు చనిపోతే అప్పుడు మరో వ్యక్తికి పింఛన్ ఇస్తామని చెప్పేవారు. వరుస కరువులతో రైతులు సతమతమవుతున్న సమయంలో.. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ ఆ రైతులకు కనీసం ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబును కోరితే.. ఉచితంగా విద్యుత్ ఇస్తే.. తీగలపై బట్టలారేసుకోవాల్సిందే అని హేళన చేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి. డ్వాక్రా మహిళల నుంచి ముక్కుపిండి మరీ రూపాయిన్నర వడ్డీ వసూలు చేసిన ఆ రాక్షస పాలనను ఎవరూ మర్చిపోలేరు.
 
  కూతుర్నిచ్చిన సొంతమామనే వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన రోజులు ప్రజలకు గుర్తుకొస్తున్నాయి. ఎన్నికలకు ముందు రూ.2 కిలో బియ్య ఇస్తామని చెప్పి.. గెలిచాక కిలో రూ.5.25 చేసిన చంద్రబాబు గుర్తున్నాడు. మద్యపాన నిషేధం నినాదంతో మహిళల ఓట్లు దండుకుని గెలవగానే.. ‘ఈనాడు’లో మద్యనిషేధం అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని వార్తలు రాయించి, పల్లెపల్లెలో బెల్టుషాపులకు తెరతీసిన రోజులు గుర్తుకొస్తున్నాయి.
 
 ప్రజల గుండె చప్పుడు విన్న నేత వైఎస్..
 తొమ్మిదేళ్ల చంద్రబాబు రాక్షస పాలనను అంతమొందించేందుకు దివంగత నేత తన ప్రాణాలను పణంగా పెట్టి ఎర్రటి ఎండల్లో 1,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అధికారం చేపట్టిన మరుక్షణమే పేదరికానికి వైద్యం చేసే డాక్టరయ్యారు. పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదల కోసం ‘ఆరోగ్యశ్రీ’ తెచ్చారు. అక్కాచెల్లెళ్లను లక్షాధికారులను చేసేందుకు పావలా వడ్డీ పథకం పెట్టారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు, నిజాయితీకి చిరునామాగా నిలిచారు. కానీ వైఎస్ మనకు దూరమయ్యాక రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థే చెడిపోయింది. రాజకీయాలంటే ఎత్తులు, జిత్తులతో కూడిన చదరంగంగా మార్చేశారు. అక్రమంగా కేసులు పెడతారు. వ్యక్తులను తప్పిస్తారు. జైలుపాలు చేస్తారు. చివరకు ఓట్లు, సీట్లకోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కూడా వెనకాడరు. 44 రోజుల పాటు అసెంబ్లీలో చర్చ జరిగింది. అందులో చంద్రబాబు రెండు ప్రాంతాల వారితో రెండు రకాలుగా మాట్లాడిస్తారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ప్రెస్‌మీట్ పెట్టి అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు.
 
 అన్ని రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘జై సమైక్యాంధ్ర’ అన్న ఒక్క పదం అనడానికి చంద్రబాబుకు అవకాశం లేకుండా పోయిందా? ఇక సీఎం కిరణ్ సోనియా గీసిన గీత దాటకుండా ఒకవైపు విభజనకు సహకరిస్తూనే మరోవైపు సమైక్యవాదిగా, అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న వాడిగా పోజులిస్తారు. రాష్ట్రాన్ని విభజించాలని సోనియా నిర్ణయించి 8 నెలలు కావస్తోంది. ఆరోజే జూలై 30నే మా రాష్ట్రాన్ని విభజించడానికి అంగీకరించనని సోనియా ముఖాన కిరణ్ రాజీనామా లేఖ పడేస్తే పరిస్థితి ఇంత వరకూ వచ్చేదా? వీరి కుట్రలను ఎవరూ చూడటం లేదనుకుంటున్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు. వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండె చప్పుడు ఒక్కటై ఓ కెరటంలా లేస్తుంది. ఆ కెరటం ఉప్పెనై ఈ కుట్రదారులను బంగాళాఖాతంలో కలిపేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మనమంతా ఒకటవుదాం. 30 పార్లమెంటు స్థానాలను గెల్చుకుందాం. అప్పుడు రాష్ట్రాన్ని విభజించే ధైర్యం ఎవరు చేస్తారో చూద్దాం.
 
 యాత్ర సాగిందిలా
 శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా కాళహస్తిలో బయల్దేరిన జగన్.. పెళ్లకూరు వద్ద నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. గుర్రపుతోట, చెంబడిపాళెం, ఎగువచావలి తదితర గ్రామాల మీదుగా మధ్యాహ్నానికి నాయుడుపేట చేరుకుని సభలో ప్రసంగించారు.
 
 సాయంత్రానికి మునుబోలు సభలో మాట్లాడారు. రాత్రి 8 గంటల సమయంలో గూడూరు చేరుకుని సభలో ప్రసంగించారు. అనంతరం పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఇంట్లో బస చేశారు. యాత్రలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్, పార్టీ నేతలు సంజీవయ్య, కాకాని గోవర్ధన్ రెడ్డి, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇడుపులపాయలో పార్టీ ప్లీనరీ నేపథ్యంలో ముఖ్యమైన విషయాలపై చర్చించేందుకు జిల్లాలో శనివారం నాటి యాత్రకు జగన్ విరామం ఇచ్చారని పార్టీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.

వైఎస్సార్‌సీపీలోనే ఉంటా: ఎస్పీవెరైడ్డి

వైఎస్సార్‌సీపీలోనే ఉంటా: ఎస్పీవెరైడ్డి
సాగునీటి సమస్యపైనే సీఎంను కలిశా  
 సాక్షి, హైదరాబాద్: తమ ప్రాంత రైతులకు సాగునీటి కేటాయింపుల్లో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని కోరడం కోసమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశానని, అంతే తప్ప అందులో మరే ఉద్దేశం లేదని వైఎస్సార్‌సీపీ నేత, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి చెప్పారు. కర్ణాటక రైతులు దౌర్జన్యంగా తుంగభద్ర డ్యామ్ నుంచి కేసీకెనాల్‌కి, రాజోలిబండ, ఆర్డీఎస్‌లకు నీళ్లు బంద్ చేయడంతో ఆ సమస్యను వివరించడం కోసం సీఎంను కలిశానన్నారు. దీనిపై అనవసరంగా కొన్ని వార్తా చానెళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేయడం బాధాకరమని ఆయన అన్నారు.
 
 పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీని వదిలి... తనంటత తానే వైఎస్సార్‌సీపీలో చేరానని, అదే పార్టీలో ఉంటానని వివరించారు. ‘జగన్ నాకు చాలా సన్నిహితుడు. రాజశేఖరరెడ్డితో వ్యక్తిగత సంబంధముంది.. నేను మున్సిపల్ చైర్మన్‌గా ఉంటే అది చాలా చిన్న పదవి అని, ఎంపీగా వెళ్లాలని చెప్పి, లోక్‌సభకు పంపించిన మహానుభావుడు. ఆ కుటుంబం మీద మాకు ఎప్పటికీ కృతజ్ఞత భావం ఉంటుంది’ అని అన్నారు. నిజాయితీగా బతికే తన లాంటి రాజకీయ నాయకుడి పై వార్త ప్రసారం చేసే ముందు ఒక్క సారి ఫోన్ చేసి వివరణ అడిగుంటే సమాధానం చెప్పేవాడినన్నారు. ప్రజలకు సంబంధించిన పనుల మీద వెళితే దానిని కూడా వక్రీకరించడం మంచిదికాదన్నారు

YS Jagan speech in Naidupet, Nellore district

Written By news on Friday, January 31, 2014 | 1/31/2014

పేదవాడి చదువు రాజశేఖరుని స్వప్నం

పేదవాడి చదువు రాజశేఖరుని స్వప్నం
నెల్లూరు: పేదవాడు చదువు కోవడమనేది ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి స్వప్నమని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావంలో భాగంగా జిల్లాలోని గూడూరు సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు.ప్రతీ పేదవాడు ఉన్నత చదువులు చదువుకుని గొప్పవాడు కావాలని రాజశేఖర రెడ్డి ఎప్పుడూ తాపత్రాయపడేవారన్నారు. నేటి పరిస్థితులు చూస్తే బాధేస్తుందన్నారు. అసలు ప్రజల గురించి ఆలోచించే నాయకుడే లేడని జగన్ తెలిపారు.
 
తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో నలభై నాలుగు రోజుల పాటు చర్చ జరిగినా, చంద్రబాబు రెండు చేతుల సిద్ధాంతాన్ని పాటించారని, అసెంబ్లీలో ఒక చేతితో సీమాంధ్ర, మరో చేతితో తెలంగాణ నినాదాలు చేయించారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్నికాపాడుకోవడానికి ప్రజలంతా ఒక్కటి కావాలని జగన్ పిలుపునిచ్చారు.

YS Jagan exclusive interview with NDTV

ముగ్గురు సైకోలు రాష్ట్రాన్ని విభజిస్తున్నారు

'ముగ్గురు సైకోలు రాష్ట్రాన్ని విభజిస్తున్నారు'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులపై ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వీరు ముగ్గురు సైకోలు మాదిరిగా ప్రవర్తిస్తూ రాష్ట్ర విభజనకు పూనుకుంటున్నారని విమర్శించారు. పదవీ వ్యామోహం వల్ల విభజనకు సహకరించిన సీఎం తన వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయిందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నానని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
 
కిరణ్, చంద్రబాబు కుమ్మక్కులో భాగంగానే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా కూర్చుండిపోయారన్నారు. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలని బాబు దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారన్నారు.  అసెంబ్లీ సాక్షి కాంగ్రెస్, టీడీపీలు డ్రామాలాడుతున్నాయని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

ఢిల్లీ కోట బద్దలుకొట్టి సమైక్యరాష్ట్రం సాధించుకుందాం

ఢిల్లీ కోట బద్దలుకొట్టి సమైక్యరాష్ట్రం సాధించుకుందాంవీడియోకి క్లిక్ చేయండి
నాయుడుపేట : ఢిల్లీ కోటను బద్దలు కొట్టి సమైక్యాంధ్రను సాధించుకుందామని నాయుడుపేట సమైక్య శంఖారావం సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో 44 రోజుల పాటు చర్చ జరిగినా, చంద్రబాబు రెండు చేతుల సిద్ధాంతాన్ని పాటించారని, అసెంబ్లీలో ఒక చేతితో సీమాంధ్ర, మరో చేతితో తెలంగాణ నినాదాలు చేయించారని ఆయన మండిపడ్డారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన సమైక్య శంఖారావానికి హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ఆవేశంగా ప్రసంగించారు. ప్రతి పేదవాడి చదువు రాజశేఖరుడి స్వప్నమని, కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలకతీతంగా పలికే పేరు వైఎస్ఆర్‌ అని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుల గుండెల్లో ఇప్పటికీ రైళ్లు పరిగెట్టిస్తున్న నేత వైఎస్ఆర్ అని ఆయన చెప్పారు.

రాజకీయనాయకుడంటే నేనున్నానని ప్రజలందరికీ భరోసా ఇచ్చేవాడిలా ఉండాలని, చంద్రబాబుకు అది లేదని జగన్ అన్నారు. రాజకీయమంటే చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో బతకటమేనని వైఎస్ఆర్ నిరూపించారని, ఈసారి ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు. 30 ఎంపీ స్థానాలు సాధించి మనమే ప్రధానిని నిర్ణయిద్దామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ అహంకారానికి - తెలుగు ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందని జగన్ చెప్పారు. రాష్ట్రం విడిపోతే  రైతన్నకు నీరెక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. అలాగే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ తాగునీరు ఎలా తెస్తారని నిలదీశారు.

అవన్నీ అవాస్తవ కథనాలు: ఎస్పీవై రెడ్డి

అవన్నీ అవాస్తవ కథనాలు: ఎస్పీవై రెడ్డి
హైదరాబాద్ : తనపై కొన్ని టీవీ చానెళ్లు అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నాయని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. అది సరైన పద్ధతి కాదని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. వైఎస్ఆర్ సీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసే ముందుకు వెళుతున్నానని....మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఎస్పీవై రెడ్డి తెలిపారు.
తనును మరోసారి వివాదాల్లోకి లాగవద్దని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన మాట వాస్తవమేనని.. తన వ్యక్తిగత పనిపై సీఎం కార్యదర్శిని కలిసేందుకు వెళ్లినట్లు ఎస్పీవై రెడ్డి తెలిపారు. తన నిజాయితీని శంకించాల్సిన పనిలేదని ..మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న తనను ఎంపీగా పోటీ చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డే ప్రోత్సహించారన్నారు

సమైక్యానికి జై కొట్టిన వారికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మద్దతు

రాజీనామా చేసి పడేయాల్సింది: వైఎస్ జగన్
చిత్తూరు: అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు తిరగబడడంతో, ఉనికి కోసం కొత్త పార్టీ వైపు సీఎం కిరణ్ ఆలోచిస్తున్నారని నెల్లూరులో చెప్పారు. సమైక్యమే తన ఏకైక డిమాండ్ అని.. సమైక్యానికి జై కొట్టిన వారికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మద్దతు ఉంటుందని ఎన్డీటీవీతో వైఎస్ జగన్ చెప్పారు.

సమైక్యానికి మద్దతు ఇచ్చే అన్ని పార్టీలను కలుస్తామన్నారు. బీజేపీ నుంచి కమ్యూనిస్టుల వరకు అందర్నీ కలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించడం న్యాయం కాదన్నారు. విభజనతో 70 శాతం మందికి నీళ్లు రావని అన్నారు. హైదరాబాద్ లేకుండా కొత్త రాష్ట్రం జీతాలు కూడా ఇవ్వలేదని చెప్పారు.

సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పుడు సీఎం ఏం చేశారని ప్రశ్నించారు. అప్పుడే రాజీనామా చేసి సోనియా మొహం మీద పడేయాల్సిందన్నారు. రాజ్యంగ సంక్షోభం సృష్టిస్తే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నారు. ఏపీఎన్జీవో సమ్మెకు కూడా సీఎం తూట్లు పొడిచారని ఆరోపించారు. వీలైనంత కాలం సీఎంగా ఉండాలన్నదే కిరణ్ లక్ష్యమని అన్నారు. సమైక్యమే తన ఏకైక అజెండా అని జగన్ పునరుద్ఘాటించారు

2న నెల్లూరులో జగన్ సమైక్య శంఖారావం రద్దు

హైదరాబాద్ : ఫిబ్రవరి 2వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో ఆదివారం నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం రద్దు అయినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్  కన్వీనర్ తలశిల రఘురాం ప్రకటించారు.
కాగా సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం జిల్లాలో ప్రారంభం కానుంది. నాల్గో విడతలో చిత్తూరు జిల్లాలో 11 రోజుల పాటు కొనసాగిన శంఖారావం యాత్రకు అపూర్వ స్పందన లభించింది. 12వ రోజు శుక్రవారం ఉదయం జిల్లాలోని సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది

బీజేపీ, టీడీపీలు సమైక్య పార్టీలుగా కనిపిస్తున్నాయా?

కాంగ్రెస్, టీడీపీల కోవర్టు

రఘురామకృష్ణంరాజుపై వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా, కాంగ్రెస్, టీడీపీల కోవర్టులా పనిచేసినందువల్లే నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి రఘురామకృష్ణంరాజును తప్పించినట్లు పార్టీ నేతలు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, సర్రాజు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు రఘురామలాంటి వ్యక్తులు సహాయపడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం వారు మీడియాతో మాట్లాడారు. రఘును పార్టీ బాధ్యతల నుంచి తప్పించగానే దివాలాకోరు వ్యాఖ్యలతో జగన్‌పై బురదచల్లుతున్నారని దుయ్యబట్టారు. జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చూస్తుంటే ఆయన స్క్రిప్టు ఎక్కడిదో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. జగన్ పనితీరు, నాయకులను కలుపుకునే విధానం పార్టీ పెట్టినప్పటి నుంచి తమకు, నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజానీకానికి తెలుసునన్నారు. పార్టీలో చేరి 90 రోజులు కూడా లేని రఘులాంటి వ్యక్తి జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తే ఏ ఒక్క కార్యకర్తా సహించరని హెచ్చరించారు. ఏ పార్టీలో చేరినా ఆయనకు నర్సాపురం ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారని శేషుబాబు, సర్రాజు హెచ్చరించారు.
 
 ప్రసాదరాజు ఏమన్నారంటే...
 
 కాంగ్రెస్, టీడీపీలకు కోవర్టులా పనిచేస్తున్న రఘును లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించాలన్న జిల్లా నేతల విజ్ఞప్తి మేరకే పార్టీ అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
 నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకులను పక్కన పెట్టాలని జగన్‌పై రఘు తీవ్ర ఒత్తిడి చేశారు. కానీ మా నాయకుడు మాలాంటి వారి పక్షాన  నిలిచినందుకు సహించలేక ఆరోపణలు చేస్తున్నారు.
 
 నిన్నటివరకు జగన్ ఇంద్రుడు, చంద్రుడని రఘు చెప్పారు. రాష్ట్ర విభజనకు కారణం కిరణ్, చంద్రబాబులే అని మాట్లాడారు. ఒక్క రోజులోనే మార్పు వచ్చిందా? పార్టీ నుంచి బయటకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సూటిగా చెప్పగలరా? జగన్ విభజనవాదంటూ వితండవాదం చేస్తున్న ఆయనకు, తాను చేరబోయే బీజేపీ, టీడీపీలు సమైక్య పార్టీలుగా కనిపిస్తున్నాయా?
 
 రఘు నన్ను కలవలేదు: వెంకయ్యనాయుడు
 
 రఘురామకృష్ణంరాజు గురువారం తనను కలసినట్టు వచ్చిన వార్తలను బీజేపీ నేత వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. రఘురామ తన ఇంటికి అల్పాహార విందుకు రాలేదని, వాస్తవానికి తాను హైదరాబాద్‌లోనే లేనని తెలిపారు. తాను విజయవాడ నుంచే బెంగుళూరు వెళ్లానని, ప్రస్తుతం అక్కడే ఉన్నానని పేర్కొన్నారు.
 
 రఘురామకృష్ణంరాజుకు స్వస్తి
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న వ్యాపార వేత్త రఘురామ కృష్ణంరాజును ఆ బాధ్యతల నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తప్పించారు. రఘురామ కృష్ణంరాజు వ్యవహారశైలి మీద ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సమన్వయకర్తల నుంచి అందిన ఫిర్యాదుల దృష్ట్యా... జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
 

విభజనను ఆపేందుకు పార్లమెంటులోనూ పోరాటం

 విభజన బిల్లు మీద అసెంబ్లీ తీర్మానంపై వైఎస్ జగన్
ప్రజల ‘జై సమైక్యాంధ్ర’ నినాదం అసెంబ్లీలో ప్రతిధ్వనించింది..
విభజనను ఆపేందుకు పార్లమెంటులోనూ పోరాటం
* అమ్మ, నేను, ఎమ్మెల్యేలంతా రాష్ట్రపతిని కలుస్తాం
అసెంబ్లీ తిప్పిపంపిన బిల్లును పార్లమెంటుకు పంపొద్దని రాష్ట్రపతిని ఒప్పించే ప్రయత్నం చేస్తాం..
వచ్చే ఎన్నికల్లో 30 పార్లమెంటు స్థానాలు సాధించి ‘సమైక్యాంధ్ర’ను శాశ్వతం చేసుకుందాం..
 

‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈ రోజు అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును వెనక్కు పంపుతూ తీర్మానించారు. ఇది నిజంగా సంతోషించదగ్గ వార్త. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మనసు మారి విభజన బిల్లు వెనక్కు పంపుతున్నారంటే ఆ ఘనత ప్రజలదే. నెలకుపైగా చిత్తూరు జిల్లాలో పల్లె పల్లె చుడుతూ సాగిన ‘సమైక్య శంఖారావం యాత్ర’లో మీరు దిక్కులు పిక్కటిల్లేలా చేసిన ‘జై సమైక్యాంధ్ర’ నినాదం అవకాశవాద రాజకీయాలు చేయాలనుకున్న వారి గుండెల్లో సింహనాదమైంది. అసెంబ్లీలో మార్మోగింది. చివరకు విభజన బిల్లును వెనక్కు తిప్పి పంపేందుకు కారణమైంది. ఈ ఘనత చిత్తూరు జిల్లా ప్రజలదే’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో నాలుగో విడత ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ చివరి రోజు గురువారం చంద్రగిరి నియోజకవర్గంలో సాగింది. 11వ రోజు యాత్రలో భాగంగా చంద్రగిరిలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం జగన్ మాటల్లోనే..
 
 ఆరోజే సీఎం రాజీనామా చేసి ఉంటే..
 ‘‘ఈ రోజు అసెంబ్లీ రాష్ట్ర విభజన బిల్లును వెనక్కు పంపుతూ తీర్మానం చేసింది. ఇది సంతోషించదగ్గ పరిణామం. అయితే నిన్నటి దాకా సోనియా గీచిన గీత దాటకుండా కిరణ్, ప్యాకేజీల కోసం కుమ్మక్కు రాజకీయాల్లో మునిగిపోయిన చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా తామే సమైక్య చాంపియన్లమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తన కొడుకును ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకుగాను మన రాష్ట్రాన్ని విభజించేందుకు సోనియా గాంధీ పూనుకొన్న మరుక్షణమే ‘మా రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు నీకెక్కడుంది?’ అని కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా పత్రాన్ని ఆమె ముఖాన పడేసి వచ్చినట్లయితే పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? ఒక వైపు సమైక్యవాదినంటారు.. మరోవైపు సోనియా గీచిన గీత దాటరు.
 
 ఉవ్వెత్తున ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు వారిని బెదిరించి సమ్మె విరమింప చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన బిల్లును 17 గంటల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక చేత్తో సైగ చేసి తన పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేల చేత సమైక్యాంధ్ర అనిపిస్తారు. ఇంకో చేత్తో సైగ చేసి తెలంగాణ ఎమ్మెల్యేల చేత రాష్ట్ర విభజన నినాదం చేయిస్తారు. ఈ క్షణం వరకూ చంద్రబాబు నోట ‘సమైక్యాంధ్ర’ మాటే రాలేదు. పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి జడిసి వీరిద్దరూ ఈ రోజు విభజన బిల్లును వెనక్కు పంపడానికి నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రాంతానికో మాట మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలకు తెరతీస్తున్న వేళ.. కార్యకర్త మొదలుకుని పార్టీ అధ్యక్షుడి వరకూ ‘సమైక్యాంధ్ర’ కోసం రాజీలేని పోరాటం చేసింది ఒక్క వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మాత్రమే.
 
 ఢిల్లీకి సమైక్య పోరాటం..
 రాజకీయాల్లో విశ్వసనీయతకు, నిజాయితీకి మారుపేరుగా వైఎస్ నిలిస్తే.. వంచనకు, కుమ్మక్కుకు, వెన్నుపోటుకు ప్రతీకగా చంద్రబాబు చరిత్రలో స్థిరపడిపోయారు. మహానేత మరణించాక రాష్ట్రానికి కష్టాలొచ్చాయి. సోనియా తన కొడుకు కోసం ప్రజల భవిష్యత్తును అంధకారం చేసేలా రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నం చేస్తోంది. దివంగత నేత స్ఫూర్తితో విభజన ప్రయత్నాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తుదికంటా అడ్డుకుంటోంది. ఇకపైసమైక్య పోరాటాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో కూడా కొనసాగిస్తుంది. అమ్మ విజయమ్మ, నేను, మన పార్టీ ఎమ్మెల్యేలు అందరం రాష్ట్రపతిని కలుస్తాం. అసెంబ్లీ వెనక్కు తిప్పి పంపిన బిల్లును పార్లమెంటుకు పంపడం భావ్యం కాదని ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తాం. ఈ లోపు ఎన్నికల్లో మనం 30 పార్లమెంటు స్థానాలను సాధించి సమైక్యాంధ్రను శాశ్వతం చేసుకుందాం.’’
 
 పదకొండో రోజు యాత్ర సాగిందిలా...
 గురువారం చిత్తూరు జిల్లా తుమ్మల కుంటలో ధ్యానమందిర ప్రారంభోత్సవంతో సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మొదలైంది. తర్వాత పేరూరు మీదుగా జనార్దన నగర్ చేరుకున్న జగన్ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ నుంచి హరిపురం చేరుకుని, దివంగత నేత వైఎస్ మరణవార్త విని గుండెపోటుతో చనిపోయిన చినసామి రాజు కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ నుంచి పేరూరు క్రాస్, తాటితోపు, చెర్లోపల్లి క్రాస్, వుదిపట్ల మీదుగా పెరుమాళ్ల పల్లి చేరుకుని అక్కడ దివంగత నేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ నుంచి శ్రీనివాస మంగాపురం మీదుగా రాగిమాను కుంట చేరుకుని, వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన మారయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ నుంచి చంద్రగిరి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించడంతో చిత్తూరు జిల్లాలో యాత్ర ముగిసింది. చివరిరోజు యాత్రలో జగన్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు నెల్లూరు జిల్లాలో సమైక్య శంఖారావం

సమైక్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రవేశించనుంది. ఆయన సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో ఉదయం 10 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, సాయంత్రం 6 గంటలకు గూడూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగే సభల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 1న ఉదయం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోనూ, సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలోనూ జరిగే సభల్లో ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 2న ఆయన ఇడుపులపాయలో జరిగే రెండో ప్రజాప్రస్థానం(ప్లీనరీ)కుహాజరవుతారని పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
 చిత్తూరులో 26 రోజులపాటు యాత్ర: చిత్తూరు జిల్లాలో 26 రోజుల పాటు సాగిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర గురువారంతో ముగిసింది.
 
  జిల్లాలో 2013 నవంబర్ 30న ప్రారంభమైన ఈ యాత్ర నాలుగు విడతలుగా సాగింది. మొత్తం 26 రోజుల పాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన 24 మందికి చెందిన కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. తిరుపతి నియోజకవర్గంలో రెండు కుటుంబాలను ఓదార్చాల్సి ఉన్నప్పటికీ అక్కడి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఉండటంతో ప్రస్తుతానికి మినహాయించారు. త్వరలో అక్కడ కూడా పర్యటిస్తారని రఘురామ్ తెలిపారు.

 నాల్గో విడతలో చిత్తూరు జిల్లాలో 11 రోజుల పాటు కొనసాగిన శంఖారావం యాత్రకు అపూర్వ స్పందన లభించింది. 12వ రోజు శుక్రవారం ఉదయం జిల్లాలోని సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది.
 
 ఈ యాత్ర రెండురోజుల పాటు జిల్లాలో సూళ్లూరుపేట, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల పరిధిలోని 13 మండలాలు, 108 గ్రామాల మీదుగా కొనసాగుతుంది. జగన్‌మోహన్‌రెడ్డి శంఖారావం యాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లా కంటే యాత్రను రెట్టింపు విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలు సమైక్యోత్సాహంతో ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి రానున్నారు.
 
 తొలిరోజు శంఖారావం యాత్ర వివరాలు
 శుక్రవారం ఉదయం సూళ్లూరుపేట మండలంలోని పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ తెలిపారు.
  ఉదయం 10 గంటలకు నాయుడుపేటలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.  
  మధ్యాహ్నం 3 గంటలకు మనుబోలులో నిర్వహించే సభలో జగన్ ప్రసంగిస్తారు.
 సాయంత్రం 5 గంటలకు గూడూరు సభలో ప్రసంగిస్తారు.
  రాత్రి గూడూరులో బస చేస్తారు.
 రెండోరోజు యాత్ర వివరాలు
  శనివారం ఉదయం 10 గంటలకు వెంకటగిరి బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు.      సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు బహిరంగసభలో ప్రసంగిస్తారు.

ఈ పోరాటం ఆగదు: వైఎస్ జగన్

Written By news on Thursday, January 30, 2014 | 1/30/2014

ఈ పోరాటం ఆగదు: వైఎస్ జగన్
చిత్తూరు: టి. బిల్లును ఢిల్లీకి తిప్పిపంపినా విభజనపై పోరాటం ఆగిపోదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిస్తూ చేపట్టిన సమైక్య శంఖారావంలో భాగంగా చంద్రగిరి సభలో ప్రసంగించిన జగన్.. విభజన బిల్లుపై అసెంబ్లీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్ సీపీ పోరాటమే కారణమన్నారు.  రాష్ట్ర విభజనపై  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ,  వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో త్వరలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని జగన్ తెలిపారు. పార్లమెంటుకు బిల్లు పంపొద్దని ఆయన్ను కోరతామని వైఎస్ జగన్ అన్నారు.
 
రాష్ట్రపతిని ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. రాబోయో ఎన్నికల్లో మనమంతా ఒక్కటై 30 స్థానాలు తెచ్చుకున్నాక రాష్ట్రాన్ని విభజించే దమ్ము, ధైర్యం ఎవ్వరికి ఉండదన్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడతామని అన్నారు. సోనియా గాంధీతో చంద్రబాబు కుమ్మక్కై ప్యాకేజీ లు అడుగుతున్నారని జగన్ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు రాకుండా ఓడించాలని వైఎస్ జగన్ చెప్పారు.

ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యం ఉంచుతారో వారినే ప్రధానిని..

'మాటమీద నిలబడిన వ్యక్తి వైఎస్సార్ ఒక్కరే'
చిత్తూరు:  పేదరికంతో వైద్యం అందక ఎవరూ చనిపోకూడదని ఆరోగ్యశ్రీ అనే పథకంతో వైద్యం కల్పించిన మహా నాయకుడు ఎవరైనా ఉంటే అది ఆ దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఒక్కరేనని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావంలో భాగంగా చంద్రగిరి సభకు హాజరైన జగన్..అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. పేదవాడి గుండె చప్పుడు, మనసెరిగి వారి సంక్షేమం కోసం వైఎస్సార్ పాటు పడిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్కా, చెల్లెల్లకు కోసం వైఎస్సార్ పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి ఆదుకున్నారన్నారు. విశ్వసనీయతకు, ఆప్యాయతకు మారుపేరు వైఎస్సార్ అని, మాట ఇస్తే..కష్టమైనా, నష్టమైనా ఆ మాట మీదే నిలబడేవారని జగన్ తెలిపారు.
 
రైతన్నల ఆత్మహత్యల గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. మద్యపాన నిషేదం చేస్తానని చెప్పిన బాబు.. అధికారం చెపట్టిన తరువాత బెల్టుషాపులు తెరిపించాడన్నారు.కాంగ్రెస్ కు డిపాజిట్ లేకుండా చేసి, ప్యాకేజీలు అడుగుతున్న బాబును తరిమికొట్టినపుడే సమైక్య వాదం గెలుస్తుందన్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యం ఉంచుతారో వారినే ప్రధానిని చేద్దామని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జగన్ను విమర్శించే స్థాయి ఆయనకు లేదు

వీడియోకి క్లిక్ చేయండి

హైదరాబాద్: స్వార్థ ప్రయోజనాల కోసమే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పార్టీని వీడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని ఆరోపించారు. డబ్బు మదంతో వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు.

రఘురామ కృష్ణంరాజు అవకాశవాది అని నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు.  రాజకీయ అవకాశవాదంతో జగన్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని చెప్పారు. తనను నమ్ముకున్న వారికి జగన్ అన్యాయం చేయరని అన్నారు. నరసాపురంలో ఎవరి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. రఘురామ కృష్ణంరాజు లాంటి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ పై ఆయన ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని టిక్కెట్లు ఇచ్చేది లేదని కృష్ణంరాజుకు జగన్ స్పష్టం చేశారని చెప్పారు. నిన్నటివరకు సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక నేత జగన్ అంటూ ప్రశంసించిన ఆయన ఇప్పడు అవకాశవాదంతో తమ నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాగా, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతల నుంచి రఘురామ కృష్ణంరాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలగించింది. నియోజవర్గంలో అసెంబ్లీ సమన్వయకర్తల ఫిర్యాదుల మేరకు ఈ చర్య తీసుకున్నట్టు వైఎస్సార్ సీపీ 

Bhumana Karunakar Reddy press meet on January 30

YS Vijayamma addressing to media over Telangana Bill

విభజనకు దారి చూపిన బాబు, కిరణ్: భూమన

విభజనకు దారి చూపిన బాబు, కిరణ్: భూమన
హైదరాబాద్: చంద్రబాబు, కిరణ్ సమైక్య ముసుగులో ఉన్న ద్రోహులని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ధ్వజమెత్తారు. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చింది సీఎం కిరణేనని ఆరోపించారు. ఊసరవెల్లిగా రంగులు మార్చే వ్యక్తి కిరణ్ అని దుయ్యబట్టారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. చంద్రబాబు ఏనాడైనా సమైక్య మన్న మాట అన్నారా అని ప్రశ్నించారు. సోనియా గాంధీకి ఆయన తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కిరణ్ గబ్బిలంలా పదవిని పట్టుకుని వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజనకు మొదటి ద్రోహి సీఎం కిరణ్ అన్నారు. కోర్‌కమిటీలో గంగిరెద్దులా తల ఊపారని చెప్పారు. పదవి కోసం సీఎం, పార్టీ కోసం చంద్రబాబు విభజనకు దారి చూపారన్నారు. విభజన రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. విభజనకు వ్యతిరేకంగా శాసనసభలో చార్రిత్రాత్మక పాత్ర పోషించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. సమైక్యరాష్ట్రం కోసం నాలుగు నెలలుగా లక్షలాది మంది కార్యకర్తలు విరోచితంగా పోరాడారని భూమన తెలిపారు

రఘురామకృష్ణంరాజు సస్పెన్షన్

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నరసాపురం లోక్ సభ నియోజకవర్గ సమన్వయ కర్త రఘురామకృష్ణం రాజును పార్టీ సస్పెండ్ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వకర్తల ఫిర్యాదు మేరకు ఆయనను సస్పెండ్ చేసినట్లు వై.కాంగ్రెస్ ప్రకటించింది. 

విభజనను క్రికెట్ తో పోల్చొద్దు: విజయమ్మ

విభజనను క్రికెట్ తో పోల్చొద్దు: విజయమ్మ
హైదరాబాద్: రాష్ట్ర విభజనను క్రికెట్ తో పోల్చవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కోరారు. రాబోయే ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. విభజన బిల్లు తిరస్కార తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు.

తాము కోరినట్టుగా సమైక్య తీర్మానం ప్రవేశపెట్టి, ముందే ఓటింగ్ జరిపి ఉంటే విభజన బిల్లు ఇంతవరకు వచ్చేది కాదన్నారు. తమతో పాటు రాజీనామాలు చేయమంటే ఏ ఒక్క ఎమ్మెల్యే స్పందించలేదని గుర్తు చేశారు. బిల్లులో తప్పులున్నాయని సీఎం అంటున్నారని, బిల్లు వచ్చినప్పుడు సమగ్రంగా చూడక పోవడం సీఎం కిరణ్ బాధ్యతారాహిత్యమేనని విమర్శించారు. విభజన బిల్లుకు కిరణ్, చంద్రబాబే కారణమన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా 3 సార్లు నోటీసు ఇచ్చామని గుర్తుచేశారు. చంద్రబాబు ప్యాకేజీ కోరడం దురదృష్టకరమన్నారు.

అప్పులు పంచితే రెండు ప్రాంతాలకు నష్టం జరుగుతుందన్నారు. సమైక్యాంధ్రతోనే రాష్ట్రం ముందుకు వెళుతుందన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. త్వరలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామన్నారు. రాష్ట్రం కలిసే ఉండాలని వైఎస్ఆర్ కోరుకున్నారని తెలిపారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధికి వైఎస్ఆర్ కృషి చేశారని చెప్పారు. అందరం కలిసిఉంటేనే అభివృద్ధి సాధ్యమని వైఎస్ విజయమ్మ అన్నారు.

ఆంధ్రజ్యోతి ఎండీ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయండి

ఆంధ్రజ్యోతి ఎండీ ప్రాజెక్ట్  అనుమతి రద్దు చేయండిబుడమేరు కాల్వపై రాధాకృష్ణకు చెందిన పవర్ ప్లాంట్ (ఫైల్ పోటో)
విజయవాడ : నగరంలోని బుడమేరు కాలువపై ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు మంజూరు చేసిన పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జోగి రమేష్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ పవర్ ప్లాంట్ ఎదుట ధర్నా కు దిగారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, వేమూరి రాధాకృష్ణల మధ్య జరిగిన క్విడ్ ప్రోకోపై విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
 
రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పుకోలేదన్న విషయాన్ని ఈ సందర్బంగా జోగి రమేష్ గుర్తు చేశారు. అయినా ఆ పవర్ ప్లాంట్ కు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పచ్చ జెండా ఊపడం పట్ల జోగి రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. సీఎం కిరణ్ , రాధాకృష్ణలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు.
 
వరదలు వచ్చే ప్రతిసారి బుడమేరు కాల్వ ద్వారా విజయవాడ పట్టణంలో ముంపు సమస్య తలెత్తుతోంది. దాంతో కాల్వను ఆధునీకరణ చేయకుంటే విజయవాడకు ముంపు తప్పదని గతంలో ఇంజనీరింగ్ నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. బుడమేరు కాల్వ  ఆధునీకరణకు వేమూరి రాధాకృష్ణ ప్లాంటు అడ్డంకిగా మారింది. దీంతో చంద్రబాబు ఇచ్చిన ఎన్‌వోసీని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కారు రద్దు చేసింది. రోశయ్య హయాంలోనూ ఈ ప్రాజెక్టుకు అనుమతి నిరాకరించారు. ఇద్దరు సీఎంలు కాదన్న ప్లాంటుకు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ బిల్లు తిరస్కరణ.. అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ బిల్లు తిరస్కరణ.. అసెంబ్లీ నిరవధిక వాయిదావీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించింది. అనంతరం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి పంపిన తీర్మానాన్ని అసెంబ్లీ మూజువాణీ ఓటుతో తిరస్కరించినట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు కూడా ఆయన ప్రకటించారు.

బిల్లుపై చర్చ సందర్భంగా 9072 సవరణలు వచ్చాయని స్పీకర్ తెలిపారు. ఈ రికార్డులను భారత ప్రభుత్వానికి, రాష్ట్రపతికి పంపుతామన్నారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభ వాయిదా పడగానే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర నినాదాలు చేసుకుంటూ సభ నుంచి బయటకు వచ్చారు.
కాగా, బిల్లు గురించి కేవలం 86 మంది సభ్యులు మాత్రమే సభలో మాట్లాడగలిగారు. చివరి మూడు రోజులు తీవ్రమైన గందరగోళం తప్ప సభ కొద్దిసేపు కూడా సజావుగా సాగలేదు. 150 మంది సభ్యులు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను స్పీకర్ కు ఇచ్చారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపుతామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పార్టీలకు అతీతంగా ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేలు చీలిపోయారు. ఒక్క ఎమ్మెల్యే కూడా కుర్చీలలో కూర్చోలేదు. అంతా లేచి స్పీకర్ పోడియం వద్ద చేరుకున్నారు.

తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరగలేదని...బిల్లు ఓడిపోలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన తీర్మానంపై మాత్రమే ఓటింగ్ జరిగిందని... దాన్ని అందరూ గమనించాలని ఆయన గురువారమిక్కడ అన్నారు. విభజన బిల్లుపై ఫైటింగ్ జరగలేదని... సభ అభిప్రాయం కోసమే బిల్లు పంపామన్నారు. అసెంబ్లీలో రాజ్యాంగ ప్రక్రియ ముగిసిందని అన్నారు.

దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఓ కీలక ఘట్టం ముగిసిందని దిగ్విజయ్ అన్నారు. కేంద్ర కేబినెట్ లో చర్చ అనంతరం పార్లమెంట్ లో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఆర్టికల్-3 ప్రకారమే ముందుకు వెళతామన్నారు. అసెంబ్లీ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిందన్నారు.
ఇరు ప్రాంతాల కాంగ్రెస్ సభ్యుల్లో పరస్పర అభిప్రాయాలు ఉన్నందున... సభలో వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా వెలువరించేందుకు పార్టీ అవకాశం కల్పించిందన్నారు. వచ్చిన సవరణల్లో ఆమోదయోగ్యంగా ఉన్నవాటిని బిల్లులో చేర్చే విషయాన్ని కేబినెట్ చూసుకుంటుందన్నారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తామన్న నమ్మకం ఉందని దిగ్విజయ్ ఆశాభావం వక్యతం చేశారు.

20, 30 ఏళ్లపాటు జగన్‌తోనే

పార్టీ వీడే ప్రసక్తేలేదు:  వైఎస్సార్‌సీపీ
ఆ పత్రిక కథనం అవాస్తవం, హాస్యాస్పదం: తోట చంద్రశేఖర్
20, 30 ఏళ్లపాటు జగన్‌తోనే: బొడ్డు భాస్కర రామారావు

 
 సాక్షి, హైదరాబాద్:  తాము పార్టీని వీడిపోతున్నామని ఒక పత్రికలో వచ్చిన కథనం అసత్యం, అవాస్తవం, హాస్యాస్పదమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు లోక్‌సభా నియోజకవర్గం పరిశీలకులు తోట చంద్రశేఖర్, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు స్పష్టంచేశారు. ఆ పత్రికలో ఇలాంటి కథనాలు రాసే ముందు మీడియా విలువలు పాటించి తమను కూడా వివరణ కోరి ఉంటే బాగుండేదన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ పార్టీ వీడుతున్నట్లు వచ్చిన కథనాలను ఖండించారు. చంద్రశేఖర్ ఏమన్నారంటే...
 
 -    పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి మేమంతా ప్రజల్లో విసృ్తతంగా తిరుగుతుంటే ఇలాంటి తప్పుడు కథనాలు రావడం విడ్డూరం. ఏలూరు లోక్‌సభా నియోజకవర్గం పరిధిలోని ఏడింటికి ఏడు అసెంబ్లీ స్థానాలను గెల్చుకునే దిశగా మేము ప్రయత్నిస్తున్నాం.
 -    ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు, పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డ వారు పనిగట్టుకుని తమ పార్టీలో నేతలకు గౌరవం లేదనే ప్రచారం చేస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదు.
 భాస్కరరామారావు ఏమన్నారంటే...
-    ‘మిడిల్ డ్రాప్’ అనే శీర్షికన వార్త ప్రచురించిన ఆ పత్రిక యజమానికి పేకాట బాగా అలవాటేమో, అందుకే అలాంటి వార్తలు రాస్తున్నారు.
-    రానున్న 20, 30 ఏళ్ల పాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి నడవాలనే ఉద్దేశంతోనే నా కుమారుడు వెంకటరమణ చౌదరి ఆ పార్టీలో చేరి విసృ్తతంగా కార్యక్రమాలు
 చేపడుతున్నారు.
-    నేను 1972 నుంచీ సర్పంచ్‌గా, జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని. నాపై ఇలాంటి రాతలు రాయడమేంటి?
 -    ఓ పత్రిక తమ సర్క్యులేషన్ పెంచుకోవడానికి, ఓ చానెల్ తన రేటింగ్ పెంచుకోవడానికి ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తే మా పార్టీ కార్యకర్తలు వాటి యాజమాన్యాలకు గుణపాఠం చెప్పే పరిస్థితి రానీయవద్దు

బిల్లు గడువు పొడిగించండి

బిల్లు గడువు పొడిగించండివీడియోకి క్లిక్ చేయండి
  •  రాష్ట్రపతికి వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష నేత విజయమ్మ లేఖ
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013పై అభిప్రాయాలు చెప్పేందుకు గడువు మరింత పొడిగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. సభ్యులందరి అభిప్రాయాలు వెల్లడించేందుకు ఫిబ్రవరి 28వరకు గడువు పొడిగించాలని కోరారు. ఈ మేరకు బుధవారం లేఖ రాశారు. పార్టీ శాసనసభాపక్ష ఉపనేత శోభానాగిరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్లో లేఖను విడుదల చేశారు. ‘సమైక్యాంధ్ర ప్రదేశ్‌కే కట్టుబడి ఉన్న మా పార్టీ రాష్ట్రాన్ని యథావిధిగా కొనసాగించాలని, అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాలని కోరుతూ రూల్ నంబర్ 77, 78ల కింద డిసెంబర్ 12న స్పీకర్‌కు నోటీసు ఇచ్చింది. మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండానే స్పీకర్ సభలో బిల్లుపై చర్చ ప్రారంభించారు. మా తీర్మానం తర్వాత చర్చ జరపాలని కోరినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో మా పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు సభ్యులు చర్చలో భాగస్వాములు అయి బిల్లును, విభజనను వ్యతిరేకిస్తూ అభిప్రాయాలు తెలిపారు. మొత్తంగా 279 మంది ఎమ్మెల్యేలలో 85 మంది మాత్రమే మాట్లాడారు. పై పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 28 వరకు గడువును పొడగించండి’ అని విజయమ్మ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడే కాంగ్రెస్, టీడీపీ శాసనసభ్యులు పదవులు వీడి ఉంటే విభజన ప్రక్రియ ఇంత  దూరం వచ్చేదే కాదన్నారు.
 
'తప్పుడు నిర్ణయం తీసుకుంటే చరిత్ర క్షమించదు'
రాష్ట్ర విభజన బిల్లుపై గురువారం రోజున అసెంబ్లీలో ఓటింగ్ తీసుకోవాలని విజయమ్మ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పోలీసులు ధర్నాను భగ్నం చేసి, పార్టీ కార్యాలయానికి తరలించిన అనంతరం లోటస్ పాండ్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ తాము చేస్తున్న ధర్నాను భగ్నం చేయడంపై విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో ఇప్పటికిలా మూడుసార్లు అరెస్టు చేసి తెచ్చారన్నారు. విభజన ప్రక్రియకు కేంద్రం పూనుకున్నప్పటి నుంచీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ అనేక విధాల పోరాటం చేస్తోందన్నారు. బుధవారం అసెంబ్లీలో తాము ధర్నాకు దిగింది కూడా సమైక్య తీర్మానం చేయాలని, విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలనేనన్నారు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే చరిత్ర క్షమించదన్నారు. అందుకే గురువారం సభలో తీర్మానం పెట్టి రాష్ట్రపతికి పంపాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై బహుశా స్పీకర్ గురువారం స్పందించవచ్చన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. స్పీకర్ నుంచి స్పష్టత రానందుకే ధర్నాకు పూనుకున్నామని ఆమె అన్నారు.

రేపు నెల్లూరు జిల్లాకు జగన్

నెల్లూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. శుక్ర, శనివారాల్లో జిల్లాలో సమైక్యశంఖారావం యాత్రలో జగన్ పాల్గొంటారు. ఈ విషయాన్ని పార్టీ సీజీసీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, ఆత్మకూరు, కావలి, గూ డూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు మేకపాటి గౌతమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, పాపకన్ను రాజశేఖర్‌రెడ్డి, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిలతో కలిసి ఎంపీ విలేకరుల సమావేశం నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా జగన్ పర్యటన వివరాలను ఆయన వెల్లడించారు. శుక్రవారం ఉదయం పది గంటలకు నాయుడుపేట బహిరంగ సభలో జగన్ పాల్గొంటారన్నారు. సాయంత్రం 3 గంటలకు మనుబోలు సభలో, 6 గంటలకు గూడూరులో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారన్నా రు. రాత్రికి గూడూరులో బస చేస్తారని ఎంపీ చెప్పారు. ఫిబ్రవరి 1న ఉదయం 10కి వెంకటగిరిలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారన్నారు. అదే రోజు సాయంత్రం 6కు ఆత్మకూరు బహిరంగ సభలో మాట్లాడుతారని ఎంపీ తెలిపారు. అనంతరం జగన్ పులివెందులకు వెళుతారన్నారు. సమైక్య శంఖారావం యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులుకు, సమైక్యవాదులకు ఎంపీ మేకపాటి పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో జగన్ యాత్రకు అపూర్వ ఆదరణ లభించిందన్నారు.
 
 నెల్లూరులో అంతకు మించి విజయవతం చేయాలని కోరారు. జగన్ యాత్ర విజయవంతానికి నియోజక వర్గ సమన్వయకర్తలు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని మేకపాటి కోరారు. పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఒక్కటే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్నారు.
 
 సమైక్యవాద పార్టీ అధినేతగా జిల్లాలో జరగనున్న జగన్ శంఖారావం యాత్రను పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు విజయవంతం చేయాలని మేరిగ మురళీధర్ కోరారు. ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజక వర్గంలో గత సంవత్సరం డిసెంబర్ 22 నుంచి పాదయాత్ర ప్రారంభించి 514 కిలో మీటర్లు కొనసాగించినట్టు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు యాత్ర నిర్వహించానన్నారు. యాత్ర వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నానన్నారు. ప్రజా సమస్యలు ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో  మరింత అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. ఈ విషయం జగన్‌తో చర్చిస్తానన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామాలతో పాటు పేదల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో ముఖ్యంగా నీటి సమస్యను పరిష్కరించాల్సి ఉందన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రజలు ఫ్లోరైడ్ వల్ల ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆనం అవినీతికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ మహిళా కన్వీనర్ బండ్లమూడి అనిత, స్పందన ప్రసాద్, పాండురంగారెడ్డి, వహీద్ బాషా, సన్నపరెడ్డి వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Popular Posts

Topics :