30 August 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రిమ్స్ ను తనిఖీ చేసిన వైవీ సుబ్బారెడ్డి

Written By news on Saturday, September 5, 2015 | 9/05/2015

ఒంగోలు: ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రిమ్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఆస్పత్రిలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని రోగులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సమస్యను తక్షణమే తీర్చాలంటూ వైవీ సుబ్బారెడ్డి రిమ్స్ డైరెక్టర్ ను ఆదేశించారు.

రుణమాఫీ చేయకుండా రైతుయాత్రలా!


రుణమాఫీ చేయకుండా రైతుయాత్రలా!
హైదరాబాద్ : రైతులకు రుణమాఫీ చేయకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు యాత్రలు ఎలా చేస్తారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా డ్వాక్రా యాత్రలు కూడా చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. మ్యానిఫెస్టో అంతా కూడా అమలు చేసేశామని యాత్రలు చేసేట్టున్నారన్నారు. ఓటుకు కోట్ల కేసుకు భయపడి గతంలో కేబినెట్ సమావేశాన్ని విజయవాడలో పెట్టారని, ఇప్పుడు మళ్లీ విజయవాడలో పెడితే రైతులు అడ్డుకుంటారని హైదరాబాద్ లో పెట్టారని విమర్శించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పగటిపూట నిరంతరం 12 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారని, అధికారంలోకి రాగానే 7 గంటలు ఇస్తామని మాట మార్చారని, కానీ ఇప్పుడు 7 గంటలు ఇచ్చేది కూడా అనుమానమేనని అన్నారు. ఇక రాజధాని నగర నిర్మాణంలో సింగపూర్ పాత్రపై తమకు అనుమానాలున్నాయని పార్థసారథి చెప్పారు. చంద్రబాబు తన ఆస్తులు కాపాడుకోడానికి సింగపూర్ ప్రభుత్వానికి ఇక్కడి రాజధాని పనులు అప్పగించారని ఆరోపించారు. బందరు పోర్టుకు అన్నివేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. గతంలో వైఎస్ ఎప్పుడూ బహుళ పంటలు పండే భూములు ఇవ్వలేదని, ఇప్పుడు మాత్రం ప్రభుత్వం బందరు పోర్టుకు వేలాది ఎకరాలు ఎందుకు ఇస్తోందని నిలదీశారు.

అసెంబ్లీ జరిగిన తీరును మీరంతా గమనించే ఉంటారు

Written By news on Friday, September 4, 2015 | 9/04/2015


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభా సమావేశాలు 5 రోజులే నిర్వహించడం దారుణమన్నారు. చివరి రోజున ఓటుకు కోట్లుపై చర్చకు డిమాండ్ చేసినా పట్టించుకోలేదని వాపోయారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...

అసెంబ్లీ జరిగిన తీరును మీరంతా గమనించే ఉంటారు
ఐదు రోజుల పాటు అసెంబ్లీ పెట్టడం అన్నది దారుణం
15 రోజులు పెట్టమన్నా 5 రోజులే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం అన్యాయం
ఓటుకు కోట్లుపై వాయిదా తీర్మానం, 344 కింద నోటీసు ఇచ్చాం
సరైన పద్ధతిలో నోటీసు ఇవ్వలేదన్న వాదన పూర్తిగా అవాస్తవం
మొట్టమొదటి సారి దేశంలో ఎక్కడా జరగని విధంగా టీడీపీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లంచాలు తీసుకుని సంపాదించిన సొమ్మును ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు డబ్బు ఇస్తూ పట్టుబడటం జరిగింది.
ఇంత హార్ట్ కోర్ ఎవిడెన్స్ తో డబ్బు ఇస్తూ పట్టుబడితే అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వకపోవటం దేశ చరిత్రలో తొలిసారి అనుకుంటా.
అధికారం ఉందని, స్పీకర్ స్థానం కూడా వారిదేనని. చర్చకు అవకాశం ఇవ్వకుండా చేయటం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు.
దొంగ దొంగతనం చేస్తూ పట్టుబడితే...దొంగతనం చేస్తూ పట్టుబడటం తప్పుకాదు. నన్ను పట్టుకోవటం తప్పు అన్నట్లు ఉంది.
చంద్రబాబు ఏపీలో లంచాలు తీసుకుని సంపాదించిన డబ్బు నల్లధనం. ఆ డబ్బును విరజిల్లుతూ పట్టుబడిన పరిస్థితి.
8 మంది ఎమ్మెల్యేలను కొనడానికి సన్నద్ధం చేసుకోని 150 కోట్లు స్కామ్ చేశారు.
పట్టిసీమ నుంచి ఇసుక మాఫియా దాకా సాక్షాత్తూ సీఎంకే పర్సంటేజ్లు. మట్టి దగ్గర నుంచి బొగ్గు దాకా వాటాలే. సాక్షాత్తూ ముఖ్యమంత్రి భాగస్వామి కావటం. లంచాలు తీసుకోవటం.

షాక్ కొట్టిన కాకుల్లా గగ్గోలు పెడుతున్నారు


హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసుపై అసెంబ్లీలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇస్తే టీడీపీ ఎందుకు ఉలిక్కిపడుతోందని నగరి ఎమ్మెల్యే ఆర్కో రోజా ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ... తామిచ్చిన తీర్మానంపై టీడీపీ నేతలు షాక్ కొట్టిన కాకుల్లా గగ్గోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

ఈ కేసు కోర్టులో ఉన్నందున చర్చించబోమని స్పీకర్ చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. కోర్టులో ఉన్న వైఎస్ జగన్ కేసుల గురించి టీడీపీ నాయకులు ప్రతిరోజు మాట్లాడుతుంటే స్పీకర్ మౌనంగా ఉండడం బాధాకరమన్నారు. ఓటుకు కోట్లు కేసు తెలంగాణ సంబంధించిందని అంటున్నారని... అలాంటప్పుడు మత్తయ్యకు ఏపీ ప్రభుత్వం ఎందుకు రక్షణ ఇచ్చిందని ప్రశ్నించారు. ఈ కేసుతో ఏపీకి సంబంధం ఉందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో దోచుకున్న డబ్బుతో ఎమ్మెల్సీలను కొనడానికి ప్రయత్నించారని ఆరోపించారు.

ఆడియోలో ఉన్న 'వ్యాట్ అయామ్ సేయింగ్' వాయిస్ మీదా, కాదా చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ కేసు నుంచి బయటపడే మార్గాలు అన్వేషించేందుకు 15 సార్లు డీజీపీతో చంద్రబాబు భేటీ అయ్యారని తెలిపారు. రిషితేశ్వరి, వనజాక్షి కేసులో ఎన్నిసార్లు పోలీసులతో సమావేశమయ్యారని ప్రశ్నించారు. బ్రీఫిడ్ విత్ సీఎం బ్రీఫ్ కేసులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులకు దమ్ము ధైర్యంవుంటే 'ఓటుకు కోట్లు'పై చర్చకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.

కేసీఆర్ ఫోన్ చేసినట్టు రుజువుచేస్తే...

కేసీఆర్ తనకు ఫోన్ చేసినట్టు రుజువు చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రుజువు చేయకపోతే లేదంటే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏదైనా సమాచారం సభకు చెబుతున్నామంటే, ఆరోపణలు చేస్తున్నామంటే అందులో నిజాయితీ ఉండాలన్నారు. కేసీఆర్ తో చంద్రబాబు ఎన్నికల పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన విషయం మరిచిపోయారా అని నిలదీశారు. కేసీఆర్, చంద్రబాబు పొత్తు పెట్టుకున్న ఫోటోలను స్పీకర్ కు వైఎస్ జగన్ చూపించారు.

దొంగతనం చేస్తూ పట్టుబడి పట్టుకున్నవారిదే తప్పన్నట్టుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసును రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించారని ధ్వజమెత్తారు. ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబుది అవునో, కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని పంపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. 'వీటికి ఎవరూ సమాధానాలు చెప్పరు. సీఎం లంచాలు తీసుకుని, ఆ డబ్బును ఎమ్మెల్యేలకు ఇస్తూ పట్టుబడితే ఈ సభలో చర్చ జరగకూడదా? వీడియో, ఆడియో ఆధారాలు ఉన్నా.. చంద్రబాబు పేరు చార్జిషీట్ లో 22 సార్లు ఉన్నా చర్చ జరపారా? కానీ రోజూ నా గురించి ఎవరంటే వాళ్లు మాట్లాడొచ్చా? ఎవరంటే వాళ్లు తిట్టొచ్చా? అక్కడితో ఆగరు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా విడిచిపెట్టకుండా దూషణలు చేస్తారు. మైకు అధికారపక్ష సభ్యులకు ఎక్కువసార్లు వస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు' అని వైఎస్ జగన్ అన్నారు.

ఓటుకు కోట్లు కేసులో సమాధానం చెప్పకుండా చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. చంద్రబాబు సభలోకి వచ్చి ఎందుకు సమాధానం చెప్పరని నిలదీశారు. ఈ అంశంపై తప్పుదోవ పట్టించేందుకు సభను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

గోదావరిలో ముంచుతారా? సూదితో చంపిస్తారా?

ఓటుకు కోట్లుపై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందో చెప్పాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా వేసిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ' ఓటుకు కోట్లు మీద ప్రపంచం అంతా ప్రచారం జరిగింది. అన్ని పత్రికల్లో ఆ వార్తలు వచ్చాయి. దొంగతనం బయటపడింది. అయినా తెలుగుదేశం పార్టీ మంత్రులకు ఉలుకెందుకో అర్థం కావటం లేదు. ఏదైనా అడగండి కానీ ఓటుకు కోట్లు అంశంపై మాత్రం చర్చ వద్దు అంటున్నారు. నిజంగా ఆ కేసులో దొంగలు కాకుంటే చర్చకు ఎందుకు  వెనుకంజ వేస్తున్నారు.

ఏదైనా అడిగితే...ప్రతిపక్షాన్ని మీ కథ తేలుస్తాం...జాగ్రత్తగా ఉండండి అని బెదిరిస్తున్నారు. పెద్ద పెద్ద చూపులు చూస్తున్నారు. ఏం చేస్తారండి. గోదావరికి తీసుకు వెళ్లి నీళ్లలో ముంచేస్తారా? గుంటూరు ఆస్పత్రిలో చేర్చి ఎలుకలతో కరిపిస్తారా? లేదంటే నారాయణ కాలేజీలో చేర్పించి ర్యాగింగ్ చేయిస్తారా? ఎమ్మార్వో వనజాక్షిని కొట్టినట్లు రౌడీలతో మమ్మల్ని కొట్టిస్తారా?  పోనీ ఏలూరు తీసుకువెళ్లి ఇంజక్షన్ చేయించి చంపిస్తారా? ఎలా మా అంతు తేలుస్తారో చెప్పండి. ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదు... ఇది అసెంబ్లీ. మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలం. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం సాగిస్తాం.  సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీ స్థాయిని దిగజార్చుకోవటం  సరికాదు' అని హితవు పలికారు.

హోదా దీక్ష తేదీల్లో మార్పు: జగన్


'హోదా దీక్ష' తేదీల్లో మార్పు: జగన్
 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 15వ తేదీ నుంచి చేయతలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను వాయిదా వేసుకునే అవకాశం ఉన్నట్లు వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. వినాయకచవితి పండుగ  ఉన్నందువల్ల 15వ తేదీన కాకుండా మరో రోజు నుంచి దీక్ష ప్రారంభించాలని పార్టీ నేతలు సూచిస్తున్నట్లు ఆయన చెప్పారు. బహుశా 19 లేదా 20వ తేదీ నుంచి దీక్ష ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. తాను దీక్ష చేయడం వల్ల ప్రజలకు మేలే జరుగుతుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే ప్రభుత్వానికి కూడా ప్రత్యేక సాధనలో తన దీక్ష ఉపయోగపడుతుందన్నారు.
 ఇష్టం లేకుంటే భూములు ఇవ్వొద్దు: జగన్ భరోసా
 ఇష్టం లేకుంటే భూములివ్వొద్దని, బలవంతంగా సేకరించాలని చూస్తే ప్రతిఘటించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులను ఉద్దేశించి అన్నారు. కర్నూలు జిల్లాలోని తంగెడంచ, భాస్కరాపురం, బన్నూరు గ్రామాల్లో బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు ఎమ్మెల్యే వై.ఐజయ్య నేతృత్వంలో గురువారం అసెంబ్లీ లాబీల్లో వైఎస్ జగన్‌ను కలుసుకుని మొరపెట్టుకున్నారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, అవసరమైతే తాను కూడా ఆ గ్రామాలను సందర్శించి అండగా ఉంటానని జగన్ వారికి భరోసా ఇచ్చారు.

ఓటుకు కోట్లుపై దద్దరిల్లిన అసెంబ్లీ

ఓటుకు కోట్లుపై ఏపీ అసెంబ్లీ శుక్రవారం దద్దరిల్లింది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ చివరి రోజు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టడంతో అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే పది నిమిషాల పాటు వాయిదా పడింది. కాగా  ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ఆరంభమయ్యాయి.  ఓటుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

అయితే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ...వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు ...స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. ఓటుకు కోట్లు కేసుపై చర్చ జరపాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. సభ జరిగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ...ఫలితం లేకపోవటంతో సమావేశాలను పది నిమిషాలపాటు వాయిదా వేశారు.

ఆ జీవోలో ఎక్కడైనా ఉందా?

Written By news on Thursday, September 3, 2015 | 9/03/2015


ఆ జీవోలో ఎక్కడైనా ఉందా?
హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ రైతుల కష్టాలు తీరుతాయని పదే పదే చెబుతున్న ఏపీ ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టు జీవోలో రాయలసీమకు నీటి తరలింపు అంశాన్ని ఎక్కడా కూడా పేర్కొనని ప్రభుత్వం.. అసలు నీటిని ఎలా తరలిస్తుందనే దానికి ముందు సమాధానం చెప్పాలన్నారు. పట్టిసీమ కోసం పోలవరం ప్రాజెక్టుని గాలికి వదిలేశారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టే నిధులతో హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తవుతాయనే సంగతిని ప్రభుత్వం గుర్తించాలన్నారు.
 
ఏపీ శాసనసభలో ప్రభుత్వ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరిని వైఎస్ జగన్ తప్పుబట్టారు.  దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కరువు, నీటి ప్రాజెక్టులు అనే రెండూ వేర్వేరు అంశాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పడం నిజంగా సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం, స్పీకర్ కలిసి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు.
 
పట్టిసీమ ప్రాజెక్టుపై చంద్రబాబు పదే పదే అబద్ధాలు చెబుతున్నారన్నారు. పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకున్న రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం రెండు జీవోలు విడుదల చేయడానికి గల కారణాలు ఏమిటని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రైతులు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న అనంతపురం జిల్లాలో తాను పరామర్శయాత్ర చేయడం వల్లే.. ఆ రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

యనమలకు ఆ దమ్ము, సత్తా లేవు


'యనమలకు ఆ దమ్ము, సత్తా లేవు'
హైదరాబాద్: అసలు, వడ్డీలతో సహా రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ డబ్బులు ఇవ్వకుండా నామమాత్రంగా ఏడు వేల కోట్లు మాత్రమే ఇచ్చారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. అవి వడ్డీలకు కూడా చాలకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని..  అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని మండిపడ్డారు.

కరువు సాయం కోసం కేంద్రం నుంచి సాయం కూడా సరిపడ తెచ్చుకోలేక పోవడం సిగ్గు చేటన్నారు. ఎప్పుడు చూసినా తాను మేధావినని చెప్పుకొనే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వెటకారంగా సమాధానాలు ఇచ్చారే  తప్పా..  కనీసం కేంద్రం నుంచి  నిధులను తెచ్చుకునే దమ్ము,  సత్తా కూడా లేదనే సంగతిని తెలుసుకోవాలన్నారు.

ఏపీ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ.. కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి చేసి రైతులకు సాయం చేయాలి.  దాన్ని పక్కన పెట్టి అసెంబ్లీలో ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. జీవో నెంబర్ 690లో లక్షన్నర మాత్రమే ఇవ్వాలని చెప్పారు.  అంటే ఈ రైతులు మనుషులు కారా?. వీళ్లకు ఐదు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదా?అని రోజా ప్రశ్నించారు.

దమ్మిడీ సాయం కూడా అందించట్లేదు


హైదరాబాద్ :రాష్ట్రంలో కరువు పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నా.. ప్రభుత్వం మాత్రం రైతులకు దమ్మిడీ సాయం కూడా చేయడం లేదని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై అసెంబ్లీలో గురువారం సాయంత్రం జరిగిన స్వల్పకాల చర్చలో ఆయన మాట్లాడారు. ఇన్పుట్ సబ్సిడీలు సరిగా ఇవ్వడం లేదని, రైతులకు రుణ భారం విపరీతంగా పెరిగిపోతోందని, అందుకే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆయన ఏమన్నారంటే...

రాష్ట్రంలోని 556 మండలాల్లో కరువు తీవ్రంగా ఉంది
కానీ కేవలం 238 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించారు
మామూలుగా అయితే సెప్టెంబర్ మూడోవారంలో ఎన్యుమరేషన్ మొదలుపెట్టి అక్టోబర్ నాటికి కరువు మండలాలుప్రకటించాలి
కానీ డిసెంబర్ 17 రాత్రి పూట జీవో జారీచేశారు. 18 నుంచి అసెంబ్లీ ఉందనే అలా ఇచ్చారు.
అయితే రైతులకు దమ్మిడీ సాయం కూడా అందలేదు
మళ్లీ కేబినెట్ ఏప్రిల్ 22 న సమావేశమైంది
అందులో 1067 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు
కలెక్టర్లు 1500 కోట్లు కావాలని అడిగారు
కానీ అదీ ఇవ్వలేదు.. దమ్మిడీ సాయం కూడా చేయలేదు
జూలై 22 న మళ్లీ కేబినెట్ సమావేశమైంది
ఈ సమావేశంలో.. 1067 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని 692 కోట్లకు తగ్గించింది
కరువు తీవ్రత పెరుగుతుంటే సబ్సిడీ పెరగాల్సింది పోయి.. ఇలా తగ్గించేశారు
పోనీ అవైనా ఇచ్చారా అంటే అదీ లేదు
ఇచ్చింది 2014-15కు సంబంధించి కేవలం 190 కోట్లు మాత్రమే ఇచ్చారు
వారం క్రితం మరో 100 కోట్లు.. అంటే మొత్తం 290 కోట్లే ఇచ్చారు
కలెక్టర్లు 1500 కోట్లు అడిగితే చివరకు 290 కోట్లు ఇచ్చారు
ఇది కేవలం 2014-15 పరిస్థితి మాత్రమే
ఇక 2013-14లో వరుసగా తుఫానులు, కరువు వచ్చాయి. అందరం జిల్లాలకు వెళ్లాం. సహాయం చేస్తామన్న మాట ప్రతి నోట్లోంచి వచ్చింది
కానీ ఈ ప్రభుత్వం సహాయం చేసిందా అంటే.. ఏకంగా 1690 కోట్ల రూపాయలను పూర్తిగా ఇవ్వబోమని చెప్పేశారు
ఇదే శాసన సభలో లిఖితపూర్వకంగా ఆ విషయం చెప్పారు
ఒకవైపు కేంద్రం నుంచి డబ్బులు తీసుకుంటున్నారు గానీ వాటిని వేరేవాటికి మళ్లిస్తున్నారు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందడం లేదు
ఈ సంవత్సరం విషయం తీసుకుంటే.. మంత్రిగారు చదువుతూ ఈ ఖరీఫ్ లో 554 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంటే, 378 ఎంఎం మాత్రమే కురిసిందన్నారు.
తీవ్రమైన కరువు ఛాయలు కనిపిస్తున్నాయన్నారు
అది వాస్తవమే. ఈ సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ లో విత్తనాలు ఎంత వేశారు, ఎంత వేయాల్సి ఉందనే లెక్కలు గమనిస్తే,
నూనె గింజలు.. 11.98 లక్షల హెక్టార్లలో వేయాలి కానీ 5.69 లక్షల హెక్టార్లలోనే వేశారు. అంటే అది కేవలం 47 శాతం
పప్పుధాన్యాలు 25.96 లక్షల హెక్టార్లలో వేయాలి 15.04 లక్షల హెక్టార్లలో అంటే 57.93 శాతమే వేశారు
వరి 16.75 లక్షల హెక్టార్లలో వేయాలి 8.54 లక్షల హెక్టార్లలో వేశారు 50.98 శాతమే అంటే 50 శాతం క్రాప్ హాలిడే ప్రకటించారు
పత్తి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.. 76 శాతం వరకు వేశారు
రైతులు ఇంత దారుణంగా పంటలు వేయకపోవడానికి ఒక కారణం ప్రకృతి అయితే రెండోది చంద్రబాబు నాయుడి పుణ్యం
ఖరీఫ్ కు 29,022 కోట్ల పంటరుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే 21,018 కోట్లు ఇచ్చారు
సాధారణంగా గతంలో ఎప్పుడూ లక్ష్యం కంటే ఎక్కువగా రుణాలు ఇచ్చేవారు
2011-12లో 48,000 కోట్లు లక్ష్యం అయితే 58,511 కోట్లు ఇచ్చారు
2012-13లో 52,972 కోట్లు అనుకుంటే 73,648 కోట్లు ఇచ్చారు
2013-14 లో 67,224 కోట్లు లక్ష్యం 73,494 కోట్లు ఇచ్చారు
చంద్రబాబు సీఎం అయిన తర్వాత 2014-15లో 56,019 కోట్లు లక్ష్యం పెట్టుకుంటే 39,938 కోట్లు మాత్రమే ఇచ్చారు
ఈ సంవత్సరం ఖరీఫ్లో 21,018 కోట్లు మాత్రమే లక్ష్యంగా ఇచ్చారు. దీన్నిబట్టే రైతుల దుస్థితి ఏంటో తెలుస్తుంది
చంద్రబాబు సీఎం అయ్యేనాటికి రైతులకు 87 వేల కోట్ల రుణాలు ఉండేవి
కానీ మార్చి 31 నాటికి బ్యాంకర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం 95,597 కోట్లకు పెరిగినట్లు కనిపిస్తున్నాయి.
వ్యవసాయానికి సంబంధించిన లక్ష్యాల సాధన కంటే తక్కువగా ఇచ్చారు
రెండోవైపు రుణాలు మాత్రం పెరిగిపోయాయి
అంటే అప్పులు పెరిగిపోతున్నాయి, రైతులు మాత్రం అప్పులు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు
7వేల కోట్లు రుణమాఫీకి ఇచ్చామంటున్నారు
కానీ 87 వేల కోట్లకు ఈ 18 నెలలకు వడ్డీ వేసుకుంటే అది కూడా సరిపోవట్లేదు.
ఇంతకుముందు లక్ష రూపాయల వరకు రుణం వడ్డీ లేకుండా వచ్చేది
3 లక్షల వరకు అయితే పావలా వడ్డీకి వచ్చేది
కానీ ఇప్పుడు 14 శాతం వరకు అపరాధ వడ్డీ వసూలు చేస్తున్నారు
రుణాలు రెన్యువల్ కాక పంట బీమా అందని పరిస్థితి ఏర్పడింది
రైతులకు వడ్డీయే 15- 16వేల కోట్లు అవుతుంది. మీరిచ్చేది కనీసం వడ్డీలకు కూడా సరిపోవట్లేదు.
రాష్ట్రంలో ఈ ఏడాది 196 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
అనంతపురంలోనే 101 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
చనిపోయిన ప్రతి ఇంటికీ నేను వెళ్లి పరామర్శిస్తున్నా

ఈ సమయంలో పల్లె రఘునాథరెడ్డి కల్పించుకుని పట్టిసీమ ప్రాజెక్టు గురించి ప్రస్తావించగా, దానికి కూడా సమాధానం ఇస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కానీ, స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాత్రం, పట్టిసీమ గోదావరి జిలాల సబ్జెక్టు నిన్ననే అయిపోయిందని, ఈరోజు కేవలం కరువు గురించే చెప్పాలని అన్నారు. దీనిపై సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ సమయంలో మళ్లీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు స్పీకర్ అవకాశం ఇవ్వగా, ఆయన కూడా పట్టిసీమ అంశాన్ని ప్రస్తావించారు. దాంతో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు.. రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులున్నాయని, కరువు గురించిన వివరాలు మాత్రమే చెప్పాలని స్పీకర్ కోడెల ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్కు సూచించారు.

ఆ తర్వాత మళ్లీ వైఎస్ జగన్కు అవకాశం వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా 196 మంది చనిపోయారని నేను చెబితే, మంత్రిగారు మాత్రం మమ్మల్ని భయపెట్టేలా తప్పులు చెబుతున్నారు.
మైకులు ఎలా కట్ చేస్తున్నారో కూడా ప్రజలంతా చూస్తున్నారు
ఇంతవరకు చనిపోయిన 196 మందిలో ప్రతి ఇంటికీ పోతా. వాళ్లు చెప్పే కథలు, గాధలు వినండి.. మార్చగలిగితే మార్చండి.
చనిపోయిన వాళ్లలో కొంతమందికి పరిహారం వచ్చింది, మరికొందరికి ఇవ్వలేదు
మొదట్లో 5 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు అడిగితే 1.5 లక్షలు మాత్రమే అప్పుల వాళ్లకోసం ఇచ్చామంటున్నారు
మిగిలిన 3.5 లక్షలు జాయింట్ అకౌంట్ అంటున్నారు
మేం పంట వేస్తే, వేసినట్లు రుజువు చేస్తే, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఇస్తారట అని చెప్పారు
కానీ ఈరోజు ఆ 35 వేలు వడ్డీ కూడా రైతులకు అందడం లేదు.
చివరకు ఏ స్థాయికి వెళ్లిందంటే, 5 లక్షలు కూడా ఇవ్వడం దండగని, దాన్ని 2 లక్షలకే పరిమితం చేస్తూ జీవో విడుదల చేశారు
ఆ చనిపోయిన కుటుంబాలకు ఒక్కసారిగా డబ్బు వాళ్ల చేతుల్లో పెడితే ఉపయోగం ఉంటుంది
ఈ సమయంలో మళ్లీ వైఎస్ జగన్ మైకు కట్ అయింది.. మంత్రి పత్తిపాటి పుల్లారావు కల్పించుకున్నారు. తాము జీవో మార్చలేదని, లక్షన్నర అప్పులు తీర్చుకోడానికి, 3.5 లక్షలు కుటుంబం గడవడానికి ఇస్తున్నట్లు చెప్పారు.

తర్వాత జగన్ మాట్లాడుతూ...

నిజంగా అలా తగ్గించకపోతే చాలా సంతోషం. తగ్గించిన జీవో కాపీ కాసేపట్లో వస్తుంది.
అది పక్కన పెడితే మీరు ఇస్తామని చెబుతున్న ఈ 5 లక్షల్లో 3.5 లక్షలు బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్ అని పేరు చెబుతున్నారు గానీ దాంతో రైతులకు దమ్మిడీ లాభం లేదు
ఆ సమయంలో మళ్లీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కల్పించుకుని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. వైఎస్ జగన్ అవాస్తవాలు చెబుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆత్మహత్యల లెక్కలు రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానన్నారు

మళ్లీ వైఎస్ జగన్కు అవకాశం వచ్చింది

అనంతపురం జిల్లాలో 26 రోజులు ఉండి 46 ఇళ్లకు వెళ్లాను. ఇంకా అందరి ఇళ్లకూ వెళ్తాను, ఎందరికి పరిహారం అందిందో, ఎందరికి అందలేదో చెబుతాను
రాష్ట్ర విపత్తు నివారణ నిధుల కోసం ప్రతి యేటా కేంద్రం నిధులు ఇస్తుంది
దాంతో పాటు ప్రతి యేటా సగటున 5 శాతం ఎస్కలేషన్ కూడా ఇస్తారు
ఈ నిధులు మనం మన నిధులతో కలిపి ఇన్పుట్ సబ్సిడీ లాంటి అవసరాలకు వాడతాం
కానీ 2013-14లో వాళ్లు మనకు నిధులిస్తే వాటిని మళ్లించాం
1690 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొట్టేశాం
2014-15కు 1067 కోట్ల నుంచి 692 కోట్లకు తగ్గించారు. అందులోనే 290 కోట్లు మాత్రమే ఇచ్చారు
విపత్తు నివారణ నిధుల నుంచి మనం 2014-15కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం
ఇక ఈ సంవత్సరం పరిస్థితి ఏంటని అడుగుతున్నాం
ఈ సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు బెల్ కొట్టి మైకు కట్ చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది

వినే ఓపిక లేకపోతే ఇక ఈ సభ ఎందుకని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేశంగా ప్రశ్నించారు.
ప్రతిపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను ముట్టడించారు.
అయినా స్పీకర్ మాత్రం ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు
విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యనే కాలువ శ్రీనివాసులు తన ప్రసంగాన్ని కొనసాగించారు
రాష్ట్రంలో కరువును రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారంటూ ప్రతిపక్షంపై ఆరోపించారు.

వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియంలోకి వచ్చి నినాదాలు చేయడంతో మళ్లీ వైఎస్ జగన్కు అవకాశం ఇచ్చారు

ప్రతిపక్షం నుంచి ఉన్న ఒక్క గొంతు మాట్లాడుతుంటే మధ్యలో పదేపదే అవాంతరాలు కల్పిస్తున్నారు
కేంద్రం ఇచ్చే నిధుల్లో 2014-15 సంవత్సరానికి కూడా ఈ సంవత్సరపు నిధులను ఉపయోగిస్తున్నారుఈ సమయంలో మళ్లీ స్పీకర్ కల్పించుకుంటూ కేవలం 10 నిమిషాల సమయం ఇస్తామన్నారు. ఒక నిమిషం కూడా మాట్లాడకముందే మళ్లీ మంత్రి రావెల కిశోర్ బాబు కల్పించుకుని ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నాయకుడి మీద ఒంటికాలిపై లేచారు.

వైఎస్ఆర్ కు కుటుంబ సభ్యుల నివాళి

Written By news on Wednesday, September 2, 2015 | 9/02/2015


వైఎస్ఆర్ కు కుటుంబ సభ్యుల నివాళి
ఇడుపులపాయ : దివంగత మహానేత డాక్టర్  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరో వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు  బ్రదర్ అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు వైఎస్ సమాధి వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నివాళులు అర్పించినవారిలో వైఎస్ఆర్ సోదరి వైఎస్ విమలమ్మ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ సుధాకర్ రెడ్డి, వైఎస్ పురుషోత్తమరెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు తదితరులు ఉన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

వైఎస్ఆర్ ఫోటో తొలగింపుపై సభలో ఆందోళన

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. అసెంబ్లీ లాంజ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో తొలగింపుపై ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ జోహార్ అని నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే వైఎస్ఆర్ ఫోటో తిరిగి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ సభ్యుల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల... సభ్యులు ఆందోళన విరమించి వారివారి స్థానాల్లో కూర్చోవాలని సూచించారు. అయినా వైఎస్ఆర్ సీపీ సభ్యులు తమ పట్టు వీడలేదు. సభలో ఏదైనా అంశంపై చర్చకు రావాలంటే ...వాయిదా తీర్మానం ద్వారానో, మరోద్వారానో రావాలని స్పీకర్ అన్నారు. కరువు, తాగునీటిపై వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్ఆర్ సీపీ ...ఆ విషయాన్ని వదిలేసి వైఎస్ఆర్ ఫోటో తొలగింపుపై చర్చకు పట్టుపట్టడం సరికాదన్నారు.

ప్రకటన రాకుంటే నిరవధిక నిరాహార దీక్ష: వైఎస్ జగన్

Written By news on Tuesday, September 1, 2015 | 9/01/2015

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 15లోపు ప్రత్యేక హోదాపై ప్రకటన  రాకుంటే నివరధిక నిరాహార దీక్ష చేపడతామని ఆయన వెల్లడించారు.  వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రంపై అందరూ కలిసికట్టుగా ఒత్తిడి తేవాలన్నారు.
అప్పటికీ కేంద్రం నుంచి ప్రకటన రాకుంటే ...సెప్టెంబర్ 15వ తేదీన గుంటూరులో నివరధిక నిరాహార దీక్ష చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు.  ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి తన మంత్రులను చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకుంటానంటే కేంద్రంలో కదలిక వస్తుందని వైఎస్ జగన్ అన్నారు. కేంద్రంపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేస్తామన్నారు.


వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే....
 • ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశాం
 • ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ సీపీ పోరాడుతోంది
 • దీనికి కోసం కేంద్రంపై పోరాడాలి
 • చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
 • కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావాలి
 • చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నాం
 • అసెంబ్లీలో టీడీపీ తీరును ఎండగట్టాం
 • 15వ తేదీలోపు ప్రత్యేక హోదాపై ప్రకటన రాకుంటే గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తాం
 • బీజేపీ సభ్యులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు
 • ఓటుకు కోట్లు కేసులో బయటపడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు
 • హోదా కోసం చంద్రబాబు గట్టిగా అడగలేకపోవటం వల్లే కేంద్రం తేలిగ్గా తీసుకుంటోంది

ప్రత్యేక హోదాతో లాభాలివే: వైఎస్ జగన్


హైదరాబాద్ : ప్రత్యేక హోదా వేరు, ప్రత్యేక ప్రోత్సహకం వేరన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలను ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తప్పుబట్టారు. స్పెషల్‌ స్టేటస్‌ అంటే ఏంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటనే విషయాన్ని వైఎస్ జగన్‌ సోదాహరణంగా అసెంబ్లీలో వివరించారు. ప్రత్యేక హోదాతో ఉత్తరాఖండ్‌ ఎలా లబ్ది పొందిందో వివరణ ఇచ్చారు.

ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఇష్టాయిష్టాల ప్రకారం నిధులందుతాయని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటువంటి ఫాలో అప్ చేయలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు ప్రణాళిక సంఘం రద్దు అయిందని అంటున్నారని, కాని ప్రణాళిక సంఘం దగ్గర ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా లేఖ ఏడు నెలలుగా మగ్గిపోయిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు, ముఖ్యమంత్రి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. పొరుగు రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్నాయని, ఫైనాన్స్‌ కమిషన్‌ వద్దని చెప్తుండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు వస్తాయని, వేల కోట్ల రూపాయల పెట్టుబడుల రాకతో అనేక మందికి ఉద్యోగాలు వస్తాయని వైఎస్ జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం తానేం చేయబోతున్నారో గంటన్నర ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా చెప్పలేదని వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రతిపక్షమైన తమపై అనవసరంగా అభాండాలు వేశారని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారన్న చంద్రబాబు ఆరోపణలను జగన్‌ ఖండించారు. ముఖ్యమంత్రి ప్రసంగమంతా అర్థసత్యాలు, అభాండలుగా సాగిందని అన్నారు.

* ప్రత్యేక హోదాతో కేంద్రం నుంచి రాష్ట్రానికి గ్రాంటులు వస్తాయి
* ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సమానం కాదు.. రెండూ వేర్వేరు అంశాలు
* 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఉన్నాయి. వీటికి ఆదాయ, కస్టమ్స్ సుంకాలు వంద శాతం మినహాయింపు
* అటువంటి ప్రయోజనాలు వేరే ఏ రాష్ట్రానికైనా ఉన్నాయా అని అడుగుతున్నా
* రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ఏఐబీపీ నిధుల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు 90 శాతం గ్రాంటుగా వస్తుంది
* ప్రత్యేక హోదా లేకపోతే 70 శాతం రుణంగా వస్తుంది
* ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి కేంద్రం ఎన్ని డబ్బులు ఇవ్వాలనే దానికి ఫార్ములా అంటూ ఏమీ లేదు
* ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ జమ్మూకశ్మీర్ రూ.70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు
* నరేంద్ర మోదీ దయ తలిస్తే ఎంత ప్యాకేజీ అయిన వస్తుందనడానికి ఇదే నిదర్శనం
* కోటిన్నర జనాభా ఉన్న కశ్మీర్ కు అంత ప్యాకేజీ ఇస్తే 5 కోట్ల జనాభా ఉన్న ఏపీకి ఎంత ఇవ్వాలి

YS Jagan mohan reddy challenges Chandra babu naidu in assembly

ఛాలెంజ్!

ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కూడా తానే పంపానని అంటారేమోనంటూ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఓటుకు కోట్లు విషయమై సభలో గందరగోళం జరిగిన తర్వాత టీడీపీకి చెందిన రావెల కిశోర్ బాబు, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు వ్యక్తిగత విమర్శలు చేయడంతో... వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
 • ఎవరు టాపిక్లో ఉన్నారు, ఎవరు లేరన్నది ప్రజలంతా చూశారు.
 • ఒక్కడిని చేసి ఇంతమంది వెంట పడుతున్నారన్నది అంతా చూస్తున్నారు
 • నేను ఒక్కడిని మాట్లాడుతుంటే ఆయన మాట్లాడతారు, ఈయన మాట్లాడతారు, అడ్డుపడతారు, బురద జల్లుతారు
 • వాళ్లంతా ఎంత బాగా తిట్టారో అర్థమైంది. అబద్ధాలు చెబుతూ అచ్చెన్నాయుడు ఏమన్నారు.. టీఆర్ఎస్కు నేను మద్దతు ఇచ్చానా
 • నేను, కేసీఆర్కు లెటరిస్తే ఆ విషయం నీకెలా తెలిసింది.. కేసీఆర్ నీకిచ్చారా?
 • స్టీఫెన్సన్ ఎవరో నాకు తెలియదు. నేను లెటర్ ఇస్తే ఆయనకు పదవి ఇచ్చారంటున్నారు
 • నేను ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే నువ్వు రుజువు చెయ్యి.. నేను రాజీనామా చేస్తా.
 • లేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని నిండు సభలో ఛాలెంజ్ చేస్తున్నా
 • ఛాలెంజ్... ఛాలెంజ్.. ఛాలెంజ్...
 • చంద్రబాబు రాజీనామా చేస్తారా
 • నేను ఎవరినైనా ఎమ్మెల్సీ చేయాలన్నా.. ఎవరినైనా రాజ్యసభకు పంపాలన్నా నాకు ఇంతమంది ఎమ్మెల్యేలున్నారు. నేను కోరుకున్నవాళ్లను పంపుతాను
 • ఇంకా నయం.. రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపాను, నేనే డబ్బులిచ్చానని చెప్పలేదు. ఆ ఫోన్లలో కూడా మాట్లాడింది, వీడియోల్లో ఉన్నది కూడా నేనేనని చెప్పలేదు. అప్పటివరకు సంతోషం.
 • ఎమ్మెల్యేలను కొనడానికి 150 కోట్ల బ్లాక్ మనీ పెట్టి మీరు సిద్ధమయ్యారు
 • మోదీ గారి దగ్గర చంద్రబాబు సాష్టాంగపడ్డారని చెప్పడానికి ఈ విషయం ప్రస్తావనకు తీసుకు రావాల్సి వచ్చింది.

మా వాళ్లు.. దే బ్రీఫ్డ్ మీ!

ప్రత్యేక హోదా గురించి చర్చ సమయంలో ఓటుకు కోట్లు అంశం సభలో చర్చకు రావడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పదే పదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి అధికార పక్ష సభ్యులు వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దాంతో జీఎస్టీ లాంటి ముఖ్యమైన అంశాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే సమయంలో ఓటుకు కోట్లు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. వైఎస్ జగన్ ఏమన్నారంటే...
 • జీఎస్టీ లాంటి అత్యంత ప్రధానమైన అంశంపై చంద్రబాబు ఎందుకు పోరాటం చేయట్లేదు?
 • ఇటీవలే తెలంగాణలో ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయిన పరిస్థితుల మధ్య ఆయన ఉన్నారు. అందుకే కేంద్రంపై పోరాటం చేయలేకపోతున్నారు.
 • పట్టిసీమ నుంచి ఇసుక మాఫియా దాకా పర్సంటేజీలు తీసుకుంటూ, మట్టి నుంచి బొగ్గు దాకా కమీషన్లు తీసుకుంటున్నారు
 • జీవో 21 నుంచి లైసెన్సులు ఇచ్చేవరకు, స్టీలు ధరలు తగ్గుతున్నా.. అన్ని ధరలు తగ్గుతున్నా విద్యుత్ ఉత్పత్తి ధర మాత్రం పెరుగుతూనే ఉంది
 • కృష్ణపట్నంలో మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 8 కోట్ల రూపాయలు ఉంది
 • ఆర్టీపీపీలో ఒక మెగావాట్కు 6 కోట్లు ఉంది
 • వీటిలో వచ్చిన మొత్తాలను లంచాలుగా తీసుకున్నారు. వాటిని ఇష్టారాజ్యంగా ఖర్చుపెట్టారు.
 • 26 సార్లు మీపేరు చార్జిషీట్లో పెట్టారు.. గుర్తుంచుకోండి.
 • ''మా వాళ్లు దే బ్రీఫ్డ్ మీ..  ఫర్‌ ఎనీ థింగ్‌ ఐయామ్‌ విత్‌ యూ, డోంట్ బాదర్.. వాట్‌ ఆర్ దే స్పోక్‌ వి విల్‌ ఆనర్‌''
 • ఇదంతా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వాళ్లు నిర్ధారించారు
అంటూ చంద్రబాబు కుట్ర మొత్తాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. దాంతో అధికార పక్ష సభ్యులంతా ఒక్కసారిగా లేచి విరుచుకుపడ్డారు. మంత్రి రావెల కిశోర్ బాబు, విప్ ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు లేచి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎదురుదాడికి దిగారు. ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి నినాదాలు చేశారు.

అబద్ధాలు, అర్ధసత్యాలతో అభాండాలు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధించేందుకు ఏం చేశారో, చేస్తారో సీఎం చంద్రబాబు చెప్పలేదని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శాసనసభలో ప్రత్యేక హూదాపై ప్రభుత్వం ఇచ్చిన నోట్ లో లేని విషయాలు చంద్రబాబు ప్రస్తావించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో సోదాహరణంగా వివరించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రకటన చేసిన తర్వాత వైఎస్ జగన్ మాట్లాడారు.

వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే....
 •  చంద్రబాబు ప్రసంగానికి మా సభ్యులెవరూ ఆటంకం కలిగించలేదు, సమయం కూడా నమోదు చేశాం
 •  ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు చాలా చెప్పుకొచ్చారు, తానేం చేశాడో, చేయబోతాడో చెప్పలేదు
 •  చాలా విషయాలు నోట్ లో లేనివి చెప్పారు, అబద్ధాలు, అర్ధసత్యాలతో అభాండాలు వేశారు
 •  డిసెంబర్ 2013, ఫిబ్రవరి 2014లో 19 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి.
 •  8 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాం,  ఒక్కసారి కూడా అడ్మిట్ కాలేదు
 •  డిసెంబర్ లో 3 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాం, మళ్లీ ఫిబ్రవరిలో 5 సార్లు నోటీసు ఇచ్చాం
 •   నోటీసు ఎవరు ఇచ్చినా తీసుకుంటారు కానీ దానికి మద్దతుగా 50 మంది లేచి నిలబడితేనే నోటీసు ఆమోదిస్తారు
 •  అవిశ్వాసం తీర్మానానికి 50 మంది మద్దతు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆరోజు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి
 •  లోక్ పాల్ బిల్లు కోసం అవిశ్వాసం ఈరోజు ఉపసంహరించి, రేపు మళ్లీ పెట్టాలని స్పీకర్కు లేఖ రాశా
 •  అవిశ్వాస తీర్మానం నోటీసు వెనక్కు తీసుకోపోయివుంటే లోక్ పాల్ బిల్లుకు జగన్ వ్యతిరేకమని బండ వేసేవారు
 •  అయ్యా.. ఇంగ్లీషు రాకపోతే కాస్త నేర్చుకోండి
 •  కిరణ్ సర్కారును కాపాడేందుకు చంద్రబాబు విప్ జారీచేయడం సిగ్గుచేటు
 •  70% పరిశ్రమలు, 90% సాఫ్ట్ వేర్ హైదరాబాద్ లోనే ఉన్నాయి
 •  సీమాంధ్రకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి
 •  ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని పార్లమెంటులో హామీ ఇచ్చారు
 •  నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, టీడీపీ నాయకులంతా ప్రధాని చెప్పినదానికి హర్షం తెలిపారు
 •  తాము అధికారంలోకి వస్తే ఐదు కాదు.. పదేళ్లు ఇస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు
 • అటువంటి హామీని ఈరోజు పట్టించుకోకపోతే పార్లమెంట్ కు ఉన్న క్రెడిబిలిటీ గురించి మనకు మనమే ప్రశ్నించుకోవాలి
 •  తర్వాత కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి పదే పదే చెప్పారు.
 • చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా హామీలే వినిపించేవి
 • రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేయాలంటే బాబు సీఎం కావాలని అనేవారు
 • బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని వినిపించేది
 • జాబు రావాలంటే బాబు రావాలని అనేవారు
 • జాబు ఇవ్వలేకపోతే ఇంటింటికీ 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రతి గోడ మీద కనిపించేది
 •  చంద్రబాబు మైకు పట్టుకుంటే చాలు.. ప్రత్యేక హోదా తెస్తాం అనేవారు
 • 15 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రత్యేక హోదా సాధించలేదు
 •  ప్రత్యేక హోదాతో కేంద్రం నుంచి రాష్ట్రానికి గ్రాంటులు వస్తాయి
 • ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సమానం కాదు.. రెండూ వేర్వేరు అంశాలు
 • 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఉన్నాయి. వీటికి ఆదాయ, కస్టమ్స్ సుంకాలు వంద శాతం మినహాయింపు
 • అటువంటి ప్రయోజనాలు వేరే ఏ రాష్ట్రానికైనా ఉన్నాయా అని అడుగుతున్నా
 • రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ఏఐబీపీ నిధుల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు 90 శాతం గ్రాంటుగా వస్తుంది
 • ప్రత్యేక హోదా లేకపోతే 70 శాతం రుణంగా వస్తుంది
 • ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి కేంద్రం ఎన్ని డబ్బులు ఇవ్వాలనే దానికి ఫార్ములా అంటూ ఏమీ లేదు
 • ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ జమ్మూకశ్మీర్ రూ.70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు
 • నరేంద్ర మోదీ దయ తలిస్తే  ఎంత ప్యాకేజీ అయిన వస్తుందనడానికి ఇదే నిదర్శనం
 • కోటిన్నర జనాభా ఉన్న కశ్మీర్ కు అంత ప్యాకేజీ ఇస్తే 5 కోట్ల జనాభా ఉన్న ఏపీకి ఎంత ఇవ్వాలి

నేను హోం వర్కు చేస్తా.. ఆయన చేయరు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అసెంబ్లీలో జరిగిన చర్చలో మాటల తూటాలు పేలాయి. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడే సందర్భంలో.. ''మేం ఈ జనరేషన్, చంద్రబాబు పాత జనరేషన్. ఆయనకు తెలియని చాలా విషయాలు మాకు తెలుసు. మేం హోంవర్కు చేస్తాం.. ఆయన స్టడీ చేయరు, ఆయనకు ఓపిక లేదు'' అన్నారు. దాంతో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు లేచి తన సహజ శైలిలో పాత విషయాలు తవ్వితీస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బురద చల్లేందుకు ప్రయత్నించారు.

తన మీద ఉన్న కేసుల విషయమై హోం వర్కు చేస్తారన్నారు. దానికి వెంటనే వైఎస్ జగన్ దీటుగా స్పందించారు. చంద్రబాబు ఈమధ్య ఓటుకు కోట్లు కేసు గురించి ఎక్కువగా హోం వర్కు చేస్తున్నారని ఆయన అనగానే ఒక్కసారిగా సభ మొత్తం నవ్వులతో మునిగిపోయింది.

చంద్రబాబు ఔట్డేటెడ్

చంద్రబాబు నాయుడు ఔట్ డేటెడ్ రాజకీయవేత్త అని, తాను ఈ జనరేషన్కు చెందిన నాయకుడినని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. సెల్ఫోన్లు కూడా తానే తెచ్చానని, ప్రపంచానికి ఐటీని పరిచయం చేసిన ఘనత తనదేనని కూడా చంద్రబాబు చెబుతారంటూ ఎద్దేవా చేశారు. ఆయన ఏమన్నారంటే...
 • ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం కేవలం ప్రధానమంత్రి, కేబినెట్కు సంబంధించిన విషయం.
 • ఇక్కడ మాత్రం కేబినెట్ నిర్ణయం అయిపోయినా, తీర్మానం అయిపోయినా పనులు జరగట్లేదు
 • ఇప్పుడు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. వీటిలో ఏ రాష్ట్రానికీ పార్లమెంటులో చట్టం ద్వారా ప్రత్యేక హోదా రాలేదు.
 • ప్రధానులు కేబినెట్లో తీర్మానం పెట్టి ఆమోదం పొందితే వచ్చింది
 • ఒక్కోసారి ఏం చేస్తున్నారంటే అయోమయంగా చెబుతున్నారు. అసలు ప్రత్యేక హోదా అన్నది లేదని, ఇప్పుడు రద్దు చేశారని కొందరు మంత్రులు అంటారు.
 • అసలు హోదా ఉందా లేదా అని మా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఓ లేఖ రాశారు.
 • దానికి మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉపసంహరించే ఆలోచన లేదని స్పష్టం చేశారు
 • ఒకసారి 14వ ఆర్థికసంఘం ఒప్పుకోలేదు కాబట్టి సమస్యలు వచ్చాయంటారు
 • కొంతమంది ఒడిషా, మహారాష్ట్ర, తమిళనాడు అడ్డు తగులుతున్నాయంటారు
 • ఈ మూడు రాష్ట్రాలు ఆరోజు మన రాష్ట్రాన్ని విభజించేటప్పుడు అప్పుడు కూడా ఉన్నాయి కదా.. అవన్నీ ఉండగానే మాటిచ్చారు
 • ఇప్పుడు వాటి పేరు చెప్పడం ఎంతవరకు ధర్మం
 • ఔట్ డేట్ అయిపోయిన, అరకొర జ్ఞానం ఉండే చంద్రబాబు నాయుడు చెప్పే విషయాలను వినాల్సిన ఖర్మ ఈ సభకు పట్టింది
 • సెల్ఫోన్లు నేనే తెచ్చానని చంద్రబాబు చెబితే వినాల్సిన ఖర్మ మాకేంటి
 • 20 ఏళ్ల క్రితం ఈరోజే చంద్రబాబు తన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు
 • ఎవరు చెప్పినా రెండు రెళ్లు నాలుగే అవుతుంది.. ఎవరుచెప్పినా వాస్తవాలు వాస్తవాలే.
 • మిమ్మల్ని బోనులో పులిలా పెట్టి కొట్టే కార్యక్రమం ఏదో జరుగుతున్నట్లు ఉంది.. దాన్నుంచి బయటపడి రాష్ట్రం కోసం పోరాడండి
 • పార్లమెంటులోని ఆర్థికమంత్రిత్వ శాఖలో ఉండే పార్లమెంటరీ రీసెర్చి సంస్థ ఇచ్చిన పత్రాలు వీళ్లకు పనికిరావు
 • ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాలకు కేటాయింపులతో సంబంధం లేదు
 • కేంద్రం విధించే పన్నులను రాష్ట్రాలకు విభజించే విషయాన్నే ఆర్థిక సంఘం చూస్తుంది
 • నాన్ ప్లాన్ గ్రాంటులు, రుణాల విషయం చూసుకుంటుంది
 • ప్రణాళికా సంఘం మిగిలిన విషయాలు చూస్తుంది. కేంద్ర సాయం, అదనపు సాయం అన్నీ చూస్తుంది.
 • ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు పెద్దగా బాగుపడలేదన్నట్లు బాబు చెబుతున్నారు
 • ఉత్తరాఖండ్.. చాలా చిన్న రాష్ట్రం. ప్రత్యేక హోదా వచ్చాక రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  ఇవి అంతకుముందు కంటే 42 రెట్లు ఎక్కువ. అక్కడ 130 శాతం యూనిట్లు వచ్చాయి. 490 శాతం ఉద్యోగావకాశాలు పెరిగాయి.
 • 10వేల కొత్త కంపెనీలు హిమాచల్ ప్రదేశ్లో వచ్చాయి.
 • ప్రత్యేక హోదా వల్ల ఎంత గొప్ప మేలు జరుగుతుందంటే, ఐదేళ్ల పాటు కేంద్ర ఎక్సైజ్ పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఆదాయపన్ను కూడా ఐదేళ్ల పాటు కట్టక్కర్లేదు. మరో ఐదేళ్లు 70 శాతం పన్ను మినహాయింపు ఉంటుంది.
 • ఇవి కాక ఈమధ్య కాలంలోనే కొన్ని రాష్ట్రాలకు రవాణా రీయింబర్స్మెంట్ కూడా చేస్తున్నారు
 • ఇలాంటి ప్రయోజనాలు మన రాష్ట్రానికి ఉంటే.. 972 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న మన రాష్ట్రానికి అన్ని రాష్ట్రాల నుంచి పారిశ్రామిక వేత్తలు వస్తారు
 • లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వస్తాయి. అదంతా ఈ ప్రోత్సాహకాలతోనే సాధ్యమవుతుంది.
 • ఈమధ్య కాలంలోనే జీఎస్టీ బిల్లు వస్తోంది. అది వస్తే ఎక్సైజ్ డ్యూటీ ప్రయోజనాలు రావని సీఎం అన్నారు

ప్రత్యేక ప్యాకేజీ భిక్షతో సమానం

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తానే మేలు జరుగుతుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక ప్యాకేజీ అనేది భిక్షతో సమానమని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ  పెద్దబాబు చంద్రబాబుకా, చినబాబు లోకేశ్ కా అని ప్రశ్నించారు.

చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. భారత దేశంలో ఇప్పటికి చాలా రాష్ట్రాలు విడిపోయాయని, రాజధానిని కూడా విడిచి వెళ్లిపోయిన రాష్ట్రం ఏపీ ఒక్కటేనని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే అనేక రకాలుగా మేలు జరుగుతుందన్నారు. ఏపీలో పారిశ్రామీకరణ జరగాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదా రావాలన్నారు.

మాకు 5 సెకన్లకే కట్.. మీకు 27 నిమిషాలా!

ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే 5 సెకన్లకోసారి మైకు కట్ అవుతుంది గానీ మంత్రులు, ఇతర అధికార పక్ష నేతలకు మాత్రం 27 నిమిషాల అవకాశం ఎలా వచ్చిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నాడు అసెంబ్లీ 15 నిమిషాల పాటు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా పాయింట్ లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
 • సీఎం దర్శకత్వంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి
 • సభను టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డుకుంటున్నారు
 • అనేక సమస్యలున్నాయి.. నిత్యావసరాల ధరలు, కరువు, రైతు ఆత్మహత్యలు, అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలు
 • చంద్రబాబు సినిమా పిచ్చికి బలైన పుష్కర ప్రాణాలున్నాయి
 • రాష్ట్ర పరువు, ప్రతిష్ఠలను దిగజార్చిన ఓటుకు కోట్లు ఘటన ఉంది
 • రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉంది
 • అసెంబ్లీలో తీర్మానం పెట్టాలంటే ఇన్నాళ్లూ ఉలుకూ పలుకు లేని చంద్రబాబు అనేక మంది ఆత్మహత్యలకు కారణమయ్యారు
 • ఎట్టకేలకు వైఎస్ జగన్ ఒత్తిడితో టీడీపీ ముందుకొచ్చినా, అది తూతూ మంత్రంగానే ఉంది
 • నిన్న సీఎం 10 పేజీల స్టేట్ మెంట్ చదివారు. అయితే, స్టేట్ మెంట్ లో అంటే ఆ నోట్ లో ఉన్న విషయాలు మాత్రమే చదవాలి, దానిపై చర్చలో ఏమైనా చెప్పచ్చు.
 • కానీ దుర్మార్గంగా స్టేట్ మెంట్ ఒక పేజీ చదువుతూనే అందులో లేని అంశాలను చెబుతూ జగన్ ను రెచ్చగొట్టేలా మాట్లాడారు
 • జగన్ మాట్లాడుతుంటే 5 సెకన్లకోసారి మైకు కట్ అవుతుంది. అధికార పక్షానికి మాత్రం 27 నిమిషాలు అవకాశం ఇస్తారు
 • చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై వెంటనే ప్రకటన చేయాలి.
 • సమస్యలున్నాయి గానీ, అవన్నీ ప్రత్యేక హోదా తర్వాతే
 • అసలు ఆ అంశమంటే ప్రభుత్వానికి భయమెందుకో నాకు అర్థం కావట్లేదు
 • ప్రత్యేకహోదా తీర్మానానికి ఒక విలువ ఉండాలంటే కేంద్రంలో ఉన్న మీ మంత్రులు రాజీనామా చేయాలి
 • అలా కాకుండా మాయమాటలతో ప్రభుత్వాన్ని మోసం చేయద్దు
 • ఢిల్లీలో ఒకమాట, హైదరాబాద్ లో ఒకమాట చెబుతున్నారు
 • బీజేపీ మంత్రులు కూడా అప్పుడో మాట, ఇప్పుడోమాట అంటున్నారు
 • ప్రత్యేక హోదా సాధన కోసం చిత్తశుద్ధితో ముందుకు రావాలి
 • అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపి కాలపరిమితితో కూడిన తేదీని నిర్ణయించాలని కోరుతున్నాం
 • రెచ్చగొట్టే మాటలతో సభను నిలిపివేయడం కాకుండా సభను సజావుగా నడవనివ్వాలని కోరుతున్నాను

ప్రత్యేక హోదాతో ప్రజలకు ఏం లాభం కలుగుతుందో తెలియనివ్వండి

ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ప్రారంభం నుంచే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి చర్చించాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టగా, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. దానిపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెల్ లోకి వచ్చి నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ చర్చకు డిమాండ్ చేశారు. ఆ సమయంలో ప్రతిపక్షం నుంచి జి.శ్రీకాంత్ రెడ్డికి మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..

''ప్రశ్నోత్తరాల సమయాన్ని పోగొట్టాలనేది మా ఉద్దేశం కాదు. 1.20 వరకు సభను జరగనివ్వకుండా చేసిందెవరు? రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రత్యేక హోదాతో ప్రజలకు ఏం లాభం కలుగుతుందో తెలియనివ్వండి. దానిమీద నిన్నటి సభలో స్పష్టత రాలేదు. ప్రత్యేక హోదాపై తీర్మానం చేస్తామని అన్నారు.. అది ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్ మెంట్ లో లేదు. ఒకవైపు కేంద్రంలో మంత్రులను కొనసాగిస్తూ ఇక్కడ పోరాటం చేస్తామంటే ఎలా కుదురుతుంది''

ప్రత్యేక హోదా కోసం మేం పోరాడితే అడ్వాంటేజ్ మీకే

సభలో మిగిలిన అంశాలన్నింటినీ వెంటనే సస్పెండ్ చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చించాలని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ రెండోరోజు సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రత్యేక హోదాపై చర్చ కోసం విపక్షం పట్టుబట్టడం, ప్రశ్నోత్తరాలను కొనసాగించేందుకే అధికార పక్షం మొగ్గు చూపడంతో.. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాట్లాడే అవకాశం వచ్చింది. ఆయనేమన్నారంటే..
 • ప్రత్యేక హోదా కోసం మేం పోరాడితే అడ్వాంటేజ్ మీకే
 • అయినా కూడా రాజకీయాలకు అతీతంగా మేం సహకరిస్తున్నాం
 • ముందువరుసలో ఉండిపోరాటం చేస్తున్నాం
 • నిన్న అసెంబ్లీ మొదలైంది. ప్రత్యేక హోదా మీద కేవలం అర్ధగంట చర్చ జరిగింది
 • 1.30కి చర్చ మొదలైంది, 2 గంటలకు మూసేశారు
 • చంద్రబాబు మాట్లాడిన మాటకు, ఇచ్చిన నోట్ కు సంబంధం లేదు
 • ఉన్నది ఐదు రోజులే, అందులో ఒక రోజు అయిపోయింది
 • ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్టు కాబట్టి, మిగిలినవన్నీ రద్దుచేసి, దీనిపై చర్చ మొదలుపెట్టండి
 • ముందు ఆయన ప్రకటన చేయమనండి. అది పూర్తయిన తర్వాత దానిపై చర్చ జరుపుదాం
 • ఇక్కడ ఆ విషయం మీద చర్చ జరగనివ్వకుండా చివరి అర్ధగంటకు పోస్ట్ చేస్తున్నారు.
 • అక్కడ కూడా అవాకులు, చవాకులు మాట్లాడుతూ చర్చకు అవకాశం లేకుండా చేస్తున్నారు
 • సభా సమయాన్ని ఐదు రోజుల నుంచి 15 రోజులకైనా పెంచండి, లేదా ప్రత్యేక హోదాపై చర్చను చేపట్టండి
 • మిగిలినవన్నీ సస్పెండ్ చేసి చర్చను వెంటనే చేపట్టండి

ప్రతిపక్ష నేత మైకుకే ఇబ్బంది

- ప్రతిపక్ష నేత మైకుకే ఇబ్బంది
సాక్షి, హైదరాబాద్:
 అసెంబ్లీ వర్షాకాల తొలిరోజు సమావేశాల్లో మైకులు ప్రత్యేకించి విపక్షం వైపున్నవి మొరాయించడంతో ప్రతి పక్ష వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలుసార్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. మైకులు ఎందుకు మొరాయిస్తున్నాయో పరీ క్షించి, బాగు చేయమని ఆదేశించాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాదరావే ‘మీలో ఎవరో వైరు తెంచుకున్నారని’ వ్యాఖ్యానించడం గమనా ర్హం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళులర్పించే సమయంలో జగన్ తొలిసారి మాట్లాడినప్పుడు బాగానే ఉన్న మైకు ఆ తర్వాత మూగబోయింది. మైకు పని చేయడం లేదని గమనించిన సిబ్బంది.. జేబుకు పెట్టుకునే మైక్రోఫోన్ తెచ్చి అమర్చారు. ఈ దశలో జగన్ ‘శ్రద్ధాంజలి ఘటించడానికి కూడా మాకు మైకులు రావు. వాళ్లకు(అధికార పక్షానికి) మాత్రం వస్తాయి. గొప్ప మేనేజ్‌మెంట్ జరుగుతోంది’ అని వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు, వైఎస్సార్‌సీపీ సభ్యుడు సుజయ్ కృష్ణ రంగారావు ముందున్న మైకులు పని చేయలేదు. ఈ దశలో స్పీకర్ ‘వైరు ఎవరో కట్ చేసుకున్నట్టున్నారు’ అని వ్యాఖ్యానించారు. పుష్కరాల మృతులకు సంతాపం తెలిపే తీర్మానం చర్చ సందర్భంలోనూ ప్రతిపక్ష నేత మైకే పని చేయలేదు. అప్పుడాయన ‘మైక్ సార్, మైకు... ఆన్ చేయండి. మా ఖర్మ ఏమిటంటే ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వాళ్లకు ఈ ప్రసారాల కాంట్రాక్టును కట్టబెట్టారు. వాళ్ల ఫోకస్ అంతా బాబు గారి మీదే ఉంటుంది. మావి ఏవీ కనిపించవు. వినిపించవు. టీవీల్లోనైనా, మైకుల్లోనైనా...’ అని అన్నారు. మూడో సారి కూడా జగన్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు అసహనం వ్యక్తం చేయగా స్పీకర్ మాత్రం ‘వైరు తెంచుకున్నారు. మీలో ఎవరో తెంచారు’ అని పునరుద్ఘాటించడం కొసమెరుపు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చిత్తశుద్ధితో పార్టీ వైఎస్సార్‌సీపీ ఒక్కటే


బాబు మాటలన్నీ అబద్ధాలే
ధ్వజమెత్తిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 •    ప్రత్యేక హోదాపై సీఎం ప్రకటనలోని అంశాలు ప్రతిలో లేవు
 •      ప్రకటన ప్రతిలోని అంశాలు, సీఎం ఉపన్యాసం వేర్వేరుగా ఉన్నాయి
 •      ఆ రెండూ ఒకటే అంటే నేను రాజీనామా చేస్తా
 •      లేకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా?
 •      చంద్రబాబు చెప్పిందే ప్రజల్లోకి వెళ్లాలనేలా సభ నిర్వహిస్తున్నారు
 •      మాపై వేసే అభాండాలకు సమాధానం చెప్పే అవకాశమే ఇవ్వలేదు
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలన్న విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటన చేస్తున్న సందర్భంలో చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై సభలో ఎమ్మెల్యేలకు పంపిణీ చేసిన ప్రకటన ప్రతిలోని అంశాలు, చంద్రబాబు ఉపన్యాసం రెండూ వేర్వేరుగా ఉన్నాయని తప్పుబట్టారు. ప్రకటనలో లేని అంశాలు, అర్ధసత్యాలు, అబద్ధాలు, వక్రీకరణలతో ఆయన ప్రసంగం సాగుతున్నందుకే తాము అభ్యంతరం తెలిపామని చెప్పారు. సభలో చంద్రబాబు వేసే అభాండాలకు సమాధానం చెప్పే అవకాశమే ఇవ్వలేదని ఆక్షేపించారు. సోమవారం శాసనసభ అర్ధంతరంగా వాయిదా పడిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటన ప్రతిని ఈ సందర్భంగా జగన్ చూపిస్తూ... ఇందులో ఉన్న అంశాలే బాబు ప్రసంగంలో ఉన్నాయేమో చెప్పండి.. రెండూ ఒకటే అంటే నేను రాజీనామా చేస్తా... లేకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా? అని సవాలు విసిరారు. చంద్రబాబు చెప్పిందే ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదనే కుట్రతో సభను నిర్వహిస్తున్న తీరును తాము ఇవాళ బహిర్గతం చేశామని చెప్పారు. స్పీకర్ కూడా ఈ కుట్రలో భాగస్వామి అయ్యే పరిస్థితి ఉండటం బాధ కలిగిస్తోందన్నారు. చంద్రబాబు మాట్లాడ్డం, ఇతరులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం కొన్ని పత్రికలు ఆయన ప్రసంగాలను పెద్దబ్యానర్లుగా చేసి రాయడం  రాజకీయ కుట్రలో భాగమని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...

సభలో కుటిల నీతి... :సాధారణంగా ప్రశ్నోత్తరాల సమయం 9 గంటలకు, 10 గంటలకు జీరో అవర్ ఉంటుంది. ఎపుడైనా ప్రశ్నోత్తరాల సమయం కొంత పొడిగిస్తే అది 12 గంటల వరకూ లేదా మరికొంత సమయం పొడిగించి ముగిస్తారు. ఆ తరువాతే 347, 317 నిబంధనల కింద ప్రస్తావనలు వస్తాయి. ఇది ప్రొసీజర్. గతంలో ఏ స్పీకర్ అయినా ఈ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన సందర్భం ఎక్కడైనా ఉందా? కానీ ఇక్కడ జరిగింది.ఆ తర్వాత 1.20, 1.30 గంటల ప్రాంతంలో చంద్రబాబు లేస్తారు. మైక్ పట్టుకుని అబద్ధాలు చెప్తారు, అభాండాలు వేస్తారు.  సమాధానం చెప్పడానికి మాకు ఒక్క నిమిషం కూడా మైక్ ఇవ్వరు. సరిగ్గా 2 గంటలకు సభ ముగించేస్తారు.చంద్రబాబు చెప్పేదే రావాలి... మిగిలిన వారు ఏం మాట్లాడినా బయటకు రాకూడదనే కుటిల నీతితో సభలో వ్యవహరించారు. రాజకీయాలు స్ట్రెయిట్‌గా  చేయాలి. సభలో మీ వాదనేమిటో వినిపించండి, నా విధానమేమిటో నేనూ చెబుతాను. ఇద్దరి వాదనలూ ప్రజలు తెలుసుకుంటారు, అవీ ముక్కు సూటి రాజకీయాలంటే.

లోక్‌పాల్‌కు అడ్డుపడకూడదనే...
 లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు రకరకాల తేదీలతో అబద్ధాలు చెప్పారు. అసలారోజుల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తుకు చేసుకుంటే... రాష్ట్రాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ఏకమై ఉన్న రోజులవి. చంద్రబాబు కూడా రాష్ట్రాన్ని విడగొట్టే విషయంలో వారితో కలిసిపోయారు. వారంతా కలిసి పోయినపుడు ఇక అవిశ్వాస తీర్మానానికి బలమెక్కడుంటుంది? ఏ రోజైతే మేము అవిశ్వాసం వెనక్కి తీసుకున్నామని చంద్రబాబు చెప్పారో ఆరోజు పార్లమెంటులో లోక్‌పాల్ బిల్లు పెట్టారని గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. ఆరోజు కనుక మేం అవిశ్వాసం నోటీసును అలాగే ఉంచితే... జగన్ లోక్‌పాల్‌కు వ్యతిరేకమని అభాండం వేసేవారు. వాస్తవానికి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చిత్తశుద్ధితో పోరాటం చేసిన వ్యక్తిని నేనే. పోరాడిన పార్టీ వైఎస్సార్‌సీపీ ఒక్కటే అని చెప్పడానికి గర్విస్తున్నాను. అదే చంద్రబాబు తెలంగాణలో సీట్ల కోసం రాష్ట్రాన్ని అమ్మేశాడు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా చంద్రబాబు వరంగల్‌కు వెళ్లి నా వల్లే తెలంగాణ వచ్చిందని గొప్ప గా చెప్పుకున్నారు. ఆరోజు తామే తొలుత తెలంగాణ రాష్ట్రానికి  రాజ్యసభలో ఓట్లేశామని చెప్పి టీడీపీ ఫ్లోర్‌లీడర్లు బయటకు వచ్చి రెండు వేళ్లు చూపించి మరీ చెప్పారు.  అయినా ఇవాళ్టి అంశం రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం.దీనిపై తీర్మానం పెట్టాలని ముం దుగా మేమే నోటీసిచ్చాం. మనం చేయబోయే తీర్మానానికి బలం చేకూరాలంటే, కేంద్రంపై ఒత్తిడి పెరగాలంటే కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను ఉపసంహరించుకోవాలని కోరాం. ప్రత్యేకహోదాకోసం మొన్న 29న బంద్ చేస్తుంటే... దాన్ని విఫలం చేయాలని చంద్రబాబు చూశారు. వేలాదిమందిని అరెస్టు చేయడంతోపాటు మహిళలను విద్యార్థులను ఇష్టమొచ్చినట్లు కొట్టారు. చంద్రబాబూ... ప్రత్యేక హోదాకు మీరు అనుకూలమా? వ్యతిరేకమా? తేల్చిచెప్పండి.
చంద్రబాబువల్లే మరణాలు
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ సృష్టించిన అయోమయంవల్లనే రాష్ట్రంలో ముగ్గురు చనిపోయారు. చంద్రబాబును పక్కనే పెట్టుకుని అరుణ్ జైట్లీ మాట్లాడిన మాటల్లో ప్రత్యేక హోదా గురించి ఒక్క మాటా లేదు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయని 14వ ఆర్థిక సంఘం అభ్యంతరం చెబుతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. చంద్రబాబు ఢిల్లీలో ఓరకంగా, విజయవాడలో మరోరకంగా మాట్లాడి కన్ఫ్యూజన్ సృష్టించడంతో ప్రత్యేక హోదా రాదని ముగ్గురు చనిపోయారు.అబద్ధాలు వక్రీకరణలతో రాజకీయాలు చేయవద్దు. ముఖ్యమంత్రి స్టేట్‌మెంట్ కాపీల్లో ఒక్క చోట కూడా ప్రసంగంలోని అంశాల్లేవని విజ్ఞులైన జర్నలిస్టులు గుర్తించాలి. మంగళవారం సభలో చంద్రబాబు మళ్లీ స్టేట్‌మెంట్ ఇస్తే... తర్వాత మాకు అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా మేం సమాధానం చెప్పి తీరుతాం. చంద్రబాబు గంట మాట్లాడినా, రెండు గంటలు మాట్లాడినా మేం కూడా మాకిచ్చే సమయంలో సమాధానాలిస్తాం.

మహిళా కౌన్సిలర్ ను వీడియో తీసిన టీడీపీ నేత

Written By news on Monday, August 31, 2015 | 8/31/2015

గుంటూరు: పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ కౌన్సిలర్.. వైఎస్ఆర్ సీపీ మహిళా కౌన్సిలర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. టీడీపీ కౌన్సిలర్.. మహిళా కౌన్సిలర్ ను వీడియో తీశాడు.  

ఈ విషయం గమనించిన వైఎస్ఆర్ సీపీ మహిళా కౌన్సిలర్ తనను ఎందుకు వీడియో తీశారని ఆయనను ప్రశ్నించారు. టీడీపీ కౌన్సిలర్ అనుచితంగా వ్యవహరించడమే గాక మహిళా కౌన్సిలర్ ప్రశ్నించినందుకు ఆ పార్టీ వారు దురుసుగా ప్రవర్తించారు.

స్టేట్ మెంట్ లో ఉంటే రాజీనామా చేస్తా


స్టేట్ మెంట్ లో ఉంటే రాజీనామా చేస్తా: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు స్టేట్ మెంట్ లో ఉంటే  తాను రాజీనామా చేస్తానని, లేదంటే చంద్రబాబు రాజీనామా చేయాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్టేట్ మెంట్ కు, సభలో ఆయన మాట్లాడిన అంశాలకు అసలు పొంతనే లేదన్నారు. తొలిరోజు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని, మధ్యాహ్నం 12 తర్వాత ప్రశ్నోత్తరాల సమయం జరిగిన సందర్భం ఇంతవరకు ఎప్పుడూ లేదని ఆయన అన్నారు.

అసెంబ్లీలో రాజకీయ కుట్రను తాము బహిర్గతం చేశామని.. కౌరవ సభను చూడలేదు గానీ, అంతకన్నా దారుణమైన సభ ఇదని ఆయన అన్నారు. రాజకీయాలు ఇంత దిగజారుతాయని నేను ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. మొత్తం అర్ధసత్యాలతో అంశాలను వక్రీకరించారని, పద్ధతి ప్రకారం చంద్రబాబు మాత్రమే మాట్లాడిన మాటలు జనంలోకి వెళ్లేలా చూశారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఈరోజు సభ మొత్తం రాజకీయ కుట్రతోనే నడిచిందని, ప్రజలను గందరగోళపరచడమే ఆయన లక్ష్యమని అన్నారు. అసలు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాకు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రం విడిపోయి ఇన్ని నెలలైనా అసలు తాను ప్రత్యేక హోదాకు అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సీఎం చంద్రబాబు అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రత్యేక హోదా కోసం బంద్ జరుగుతుంటే వాళ్లు దాన్ని తొక్కపెట్టడానికి ప్రయత్నించారన్నారు. చంద్రబాబు ఢిల్లీలో ఒకమాట, విజయవాడలో మరోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి గానీ, ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయడం తగదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

అధికారపక్షంతో కొట్లాడుతున్నామా... మీతో పోరాడుతున్నామా ?

వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభలో ప్రత్యేక హోదాపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. అయితే అందుకు అంగీకరించని స్పీకర్ కోడెల శివప్రసాద్..  ప్రశ్నోత్తరాలు చేపడతామని ప్రకటించడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎప్పుడైనా ప్రశ్నోత్తరాలు జరిగాయా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమైన అంశాలను తప్పుదోవ పట్టించవద్దని, చర్చ జరగకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

శాసనసభ సమావేశాలు జరిగేది ఐదు రోజులు మాత్రమే అని, 15 రోజుల సమావేశాలు జరపాలని కోరినా కాదన్నారని వైఎస్ జగన్ అన్నారు.  ప్రత్యేక హోదా కోసం పలువురు ప్రాణత్యాగం  చేశారని...హోదాపై తీర్మానం ఇచ్చినా...చర్చ జరిపేందుకు మాత్రం అనుమతి ఇవ్వటం లేదన్నారు.  

ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు మాత్రం అనుమతి ఇవ్వరని, అదే చంద్రబాబు మాత్రం 15 నిమిషాలు పాటు మాట్లాడేందుకు మాత్రం అనుమతి ఇస్తారని అన్నారు. తాము సభలో అధికారపక్షంతో కొట్లాడుతున్నామా... మీతో పోరాడుతున్నామా అనేది అర్థం కావటం లేదని వైఎస్ జగన్ అన్నారు.

వారికి దమ్మిడి కూడా ఇవ్వలేదు

ఏపీకి ప్రత్యేక హోదాకోసం ప్రాణాత్యాగం చేసినవారి కుటుంబాలకు ఇప్పటి వరకు ప్రభుత్వం దమ్మిడి కూడా ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంవల్లే వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని చంద్రబాబు అనలేదా, ప్రత్యేక హోదా రాదని మీడియా సమావేశంలో చంద్రబాబు చెప్పలేదా అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో ఆత్మ బలిదానానికి పాల్పడిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం యువత ఆందోళన చెందవద్దని సీఎం కోరారు. అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాత్యాగం చేసినవారి కుటుంబాలకు ఇప్పటి వరకు ప్రభుత్వం దమ్మిడి కూడా ఇవ్వలేకపోయిందని చెప్పారు. వారి కుటుంబాలను కనీసం పలకరించలేదని, పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు.

అచ్చెన్నాయుడికి స్పీకర్ మందలింపుహైదరాబాద్: శాసనసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు మరోసారి నోరు పారేసుకున్నారు. సభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దుర్భాషలాడారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపంగా సోమవారం అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... తొక్కిసలాట జరగడానికి సీఎం చంద్రబాబే కారణమని ఆరోపించారు. దీంతో అధికార సభ్యులు జగన్ ప్రసంగానికి అడ్డుతగిలారు. గోదావరి పుష్కరాలపై రోజంతా చర్చకు సిద్ధమంటూనే మంత్రి అచ్చెన్నాయుడు ఒంటికాలిపై లేచారు. జగన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. స్పీకర్ మందలించడంతో అచ్చెన్నాయుడు వెనక్కి తగ్గారు. తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్ష నేత నిలదీయడంతో ప్రభుత్వం ఇరుకున పడడంతో టీడీపీ సభ్యులు తమ నోటికి పనిచెప్పారు.

దగ్గరుండి 29మంది ప్రాణాలు తీశారు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గరుండి గోదావరి పుష్కర ఘాట్ వద్ద 29మంది ప్రాణాలు తీశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సామాన్యుల పుష్కర ఘాట్ వద్దకు వచ్చి సెలబ్రిటీల వ్యవహరించారని అన్నారు. సోమవారం శాసనభలో చంద్రబాబునాయుడు పుష్కర ఘాట్ మరణాలకు సంబంధించి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టిన  అనంతరం ఆయన మాట్లాడుతూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చంద్రబాబు తీరు ఉందని అన్నారు.

 వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సరస్వతీ ఘాట్ వద్దకు వెళ్లి స్నానం చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, అంతమంది ప్రాణాలు పోయేవి కావని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పబ్లిసిటీ కోసం షూటింగ్ ఏర్పాట్లు చేసుకొని చక్కగా మేకప్ వేసుకొని హీరోగా కనిపించాలని అక్కడికి వచ్చి విషాదం సృష్టించారని చెప్పారు. (ఈ సమయంలో వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారు). అనంతరం మరోసారి వైఎస్ జగన్ ఏమన్నారంటే..
ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకున్నప్పుడల్లా మైక్ కట్ చేస్తారు.

యుగానికి ఒక్కరే పుడతారు: వైఎస్ జగన్


యుగానికి ఒక్కరే పుడతారు: వైఎస్ జగన్
హైదరాబాద్ :  భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ అబ్దుల్ కలాం అని ఏపీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు.  కలాం మృతికి ఏపీ అసెంబ్లీ సంతాప తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కలాం మరణ వార్త దేశవ్యాప్తంగా తనతో పాటు...అందరినీ ఎంతగానో కలచివేసిన సంఘటన. కలాం లాంటి వ్యక్తులు యుగానికి ఒక్కరే పుడతారు.

అలాంటి మహానుభావుడు అట్టడుగు స్థాయిలోని మత్య్యకార కుటుంబంలో పుట్టి పేపర్ బాయ్ గా పనిచేసి... మహోన్నత స్థాయి అయిన రాష్ట్రపతి పదవి వరకూ ఎదిగిన వ్యక్తి.  రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఉపాధ్యాయుడిగా మారి తన జీవితాన్ని సామాన్యంగా బతికిన మహనీయుడు. రాజకీయాల్లో రోల్ మోడల్ ఎవరంటే అబ్దుల్ కలాం  మొదటి వరుసలో ఉంటారు. 84 ఏళ్ల వయసులో కూడా భారతదేశం గురించి జ్ఞానాన్ని పంచుతూ చదువుల తల్లి ఒడిలో ఒదిగారు. మా తరఫు నుంచి పార్టీ తరఫు నుంచి కలాంకు నివాళులు అర్పిస్తున్నాం'  అని తెలిపారు.

తీర్మానంపై వైఎస్ఆర్ సీపీ సభ్యుల పట్టు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభ అయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాదరావు... ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు చేతపట్టి ....నిరసనకు దిగారు.  ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలంటూ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వమే...ప్రత్యేక హోదాపై ప్రకటన చేయబోతుందని, దీనిపై చర్చ, తీర్మానం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత చర్చ ఉంటుందన్నారు. అయితే వెంటనే తీర్మానం పెట్టాలని వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.  ఈ  నేపథ్యంలో  సభలో గందరగోళం నెలకొంది.

వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు


'వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రకటన చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన సోమవారం మాట్లాడుతూ...  రాష్ట్ర విభజన జరిగింది ఏపీకి న్యాయం చేస్తామని ముగ్గురు కలిసి హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీని గాలికి వదిలేశారన్నారు. ఇప్పుడు  ప్రత్యేక ప్యాకేజీ అంటూ తెరమీదకు తెచ్చారని మండిపడ్డారు.

ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారని చెవిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కోరుకుంటే హోదా వస్తుందని ఆయన అన్నారు. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి వైపు నడిచేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో సహకరించేందుకు సిద్ధంగా ఉంటే చంద్రబాబు మాత్రం ప్యాకేజీలంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

ఏపీ ప్రజలను నిలువునా మోసం చేశారు

తెలుగుదేశం పార్టీ ప్రజలను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తిరుపతి సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతోమాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న ఆలోచన ఏపీ సర్కార్ చేయడం లేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా రావటం వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రత్యేక ప్యాకేజీల వల్ల ఎలాంటి లాభం ఉండదని గుర్తు చేశారు.

అనేక సమస్యలున్నా ఐదు రోజులకే పరిమితం చేసిన ప్రభుత్వం


‘హోదా’పై తీర్మానం
 •  ఏపీ అసెంబ్లీలో పట్టుబట్టనున్న వైఎస్సార్‌సీపీ.. నేటి నుంచి సమావేశాలు
 •  తీర్మానం బలపడాలంటే కేంద్రంలో టీడీపీ మంత్రులు తప్పుకోవాలి
 •  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైనా నిలదీతకు విపక్షం సిద్ధం
 •  అనేక సమస్యలున్నా ఐదు రోజులకే పరిమితం చేసిన ప్రభుత్వం
 •  కనీసం 15 రోజులైనా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్
 •  నేటి ఉదయం.. 9.30కి అసెంబ్లీ.. 10 గం.లకు మండలి
 సాక్షి, హైదరాబాద్
 రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధనపై అసెంబ్లీ సమావేశాల్లో తొలి అంశంగా ప్రత్యేక చర్చ చేపట్టడమేగాక, దానిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ గట్టిగా పట్టుబట్టనుంది. ఈమేరకు వాయిదా తీర్మానం ప్రతిపాదించనుంది. హోదా విషయమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు, తీర్మానానికి బలం చేకూరేలా కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ తన మంత్రులను ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేయనుంది. ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్‌సీపీ రాజీలేని ధోరణిని అవలంబిస్తుండటంతో నేటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, శాసనమండలి సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. సోమవారం ఉదయం 9.30 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతుండగా, ఈ సమావేశాలను కేవలం అయిదు రోజులకే పరిమితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలన్నిటినీ చర్చించడానికి కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని వైఎస్సార్‌సీపీ గట్టిగా కోరుతోంది.

 తొలిరోజు సమావేశాలు ప్రారంభానికి ముందుగానే స్పీకర్ అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా మండలి(బీఏసీ) సమావేశమై ఎజెండాను ఖరారు చేయనుంది. మరోవైపు ప్రస్తుత సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై తీర్మానం చేయడంతో పాటు గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట కారణంగా 30 మంది మృత్యువాత, ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి, రాజధాని పేరుతో భూసేకరణ, నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య, కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలు, రుణభారంతో రైతుల ఆత్మహత్యలు, ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు, పట్టిసీమ, అనేక అంశాల్లో చోటుచేసుకుంటున్న అవినీతిపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షం సన్నద్ధమైంది.

 పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడంలో ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ఈ నెల 29న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నిర్వహించిన రాష్ట్రబంద్ విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రస్తుత సమావేశాల్లో తొలిఅంశంగా ప్రత్యేకహోదాను చేర్చాలని పట్టుబడుతున్న వైఎస్సార్‌సీపీ దానిపై తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ తొలిరోజునే వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రత్యేకహోదా ఇవ్వాలని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం ఏడాదిన్నర కిందటే తీర్మానించినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయకపోవడానికి అధికార టీడీపీ కేంద్రంతో రాజీధోరణితో వెళ్లడమే కారణమని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఇందుకు కేంద్ర మంత్రివర్గంలోని తన మంత్రులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ అంశంపైనే తొలిరోజు చర్చకు పట్టుబట్టాలని ఆదివారం వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం సమావేశం నిర్ణయించింది.

 పక్షం రోజులైనా జరపాలి
 శాసనసభ గత బడ్జెట్ సమావేశాల పనిరోజులను బాగా కుదించిన అధికార టీడీపీ ఈసారి వర్షాకాల సమావేశాలనూ కేవలం అయిదు రోజులకే పరిమితం చేయాలని నిర్ణయించింది. కీలకమైన అనేక అంశాలపై చర్చించాల్సి ఉన్నందున ఈ సమావేశాలను కనీసం పక్షం రోజులైనా జరపాలని సభలో ఏకైక ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ పట్టుబట్టబోతోంది. రుణభారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడటమే కాకుండా రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్వల్పకాలిక సమావేశాల వల్ల ప్రయోజనం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అనేక వైఫల్యాలు, అనేక అంశాలు, సమస్యలున్నందునే ఈసారి సమావేశాలను కేవలం అయిదు రోజులకే పరిమితం చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు అధికార పార్టీ నేతలు చెబుతుండటం గమనార్హం.

 ప్రభుత్వానిది ఇరకాట పరిస్థితే
 ఈసారి సమావేశాల్లో ప్రతిపక్షం లేవనెత్తబోయే అంశాలన్నీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా ఉన్నాయి. ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై ఎలా వ్యవహరించాలన్న దానికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని, ఇరకాటంలో పెట్టే అంశాన్ని లేవనెత్తిన ప్రతి సందర్భంలోనూ వ్యక్తిగత దాడి చేయడం ద్వారా పక్కదారి పట్టించే వ్యూహంతో వెళ్లాలని చెప్పారు. ఇదే అంశాన్ని సోమవారం మధ్యాహ్నం జరిగే టీడీఎల్పీ సమావేశంలో మరోసారి చంద్రబాబు స్పష్టం చేయనున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగొద్దని సూచిస్తున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈసారి సమావేశాల్లో వాటిని ఎలా నియంత్రిస్తారన్నది చూడాల్సి ఉంది.

 అబ్దుల్ కలామ్ మృతికి సంతాపం
 సోమవారం ఉదయం సభ 9.30గంటలకు సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు నివాళులు అర్పిస్తుంది. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడుతుంది. తొలిరోజు సభ లో దేవాదాయ మంత్రి ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్(సవరణ) ఆర్డినెన్స్-2015, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఏపీ ఫార్మర్స్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఆర్డినెన్స్-2015ను సభలో ప్రవేశపెడతారు. శాసనమండలి ఉదయం 10గంటలకు సమావేశమౌతుంది. తొలుత మాజీ రాష్ట్రపతి కలాంకు నివాళులు అర్పిస్తుంది. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడతారు.

ఇప్పుడు రద్దు చేసినట్లు ప్రకటించడం హాస్యాస్పదం

Written By news on Sunday, August 30, 2015 | 8/30/2015


'ఇప్పుడు రద్దు చేసినట్లు ప్రకటించడం హాస్యాస్పదం'
శ్రీకాకుళం: జిల్లాలోని సోంపేట థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను తాజాగా ఏపీ కేబినెట్ రద్దు చేసినట్లు ప్రకటించడంపై వైఎస్సార్ సీపీ మండిపడింది. గతంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసిన సోంపేట థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు కేబినెట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ నేత తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు. 
కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ ను కూడా రద్దు చేస్తామని మహానాడులో తీర్మానం చేసిన సంగతి తమ్మినేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి ఇప్పుడు కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ ను ఎందుకు రద్దు చేయలేదని ప్రభుత్వాన్ని తమ్మినేని ప్రశ్నించారు. సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ భూములను ఇతరులకు కట్టబెట్టాలనే రహస్య ఎజెండాతోనే  ఇప్పటి ప్రభుత్వం మాయ చేయడానికి యత్నిస్తోందన్నారు.

ఏపీ శాసనమండలిలో వైఎస్ఆర్ సీపీ పక్షనేతగా ఉమ్మారెడ్డి

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్ఆర్ సీపీ పక్షనేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విప్ గా పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యవహరిస్తారు. రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్న నేపథ్యంలో ఆదివారంవైఎస్ఆర్ సీపీ శాసనసభా పక్షం సమావేశమైంది.

వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తాం


'ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తాం'
హైదరాబాద్: రేపట్నుంచి ఆరంభం కానున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి వాయిదా తీర్మానం ఇస్తామని వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది. ఆదివారం లోటస్ పాండ్ లో జరిగిన వైఎస్సార్ సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, ముత్యాలనాయుడు, ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజాలు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అయిన తొలిరోజే ప్రత్యేక హోదాపై వాయిదా తీర్మానం ఇస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శాసనసభలో ఏకగ్రీవం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేస్తామన్నారు.
 
దీంతోపాటు ఓటుకు కోట్లు కేసు, ఇసుక మాఫియా, రిషితేశ్వరి ఆత్మహత్య కేసు, కరువు, నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వాధికారులపై దాడులు, నీరు-చెట్టులోని అవినీతి అంశాలను సభలో లేవనెత్తుతామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులైనా జరపాలని బీఏసీ సమావేశంలో అడుగుతామన్నారు. టీడీపీ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా.. వైఎస్సార్ సీపీ మాత్రం గట్టిగా ప్రజా సమస్యలపై నిలదీస్తుందని ఎమ్మెల్యేలు తెలిపారు.

ఏపీని బీజేపీకి, మోదీకి తాకట్టు పెట్టారు


'ఏపీని బీజేపీకి, మోదీకి తాకట్టు పెట్టారు'
గుంటూరు: దోచుకొని, దాచుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని ప్రగల్భాలు పలికి, ఇప్పుడు ప్యాకేజీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు రాష్ట్రాన్ని బీజేపీకి, మోదీకి తాకట్టుపెట్టారని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబు అబద్దాలు చెబుతూ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపల్ బాబూరావును అరెస్ట్ చేయకపోవడం వెనుక కారణమేంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున ప్రశ్నించారు.

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తాం


'ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తాం'
హైదరాబాద్: రేపట్నుంచి ఆరంభం కానున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి వాయిదా తీర్మానం ఇస్తామని వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది. ఆదివారం లోటస్ పాండ్ లో జరిగిన వైఎస్సార్ సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, ముత్యాలనాయుడు, ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజాలు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అయిన తొలిరోజే ప్రత్యేక హోదాపై వాయిదా తీర్మానం ఇస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శాసనసభలో ఏకగ్రీవం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేస్తామన్నారు.
 
దీంతోపాటు ఓటుకు కోట్లు కేసు, ఇసుక మాఫియా, రిషితేశ్వరి ఆత్మహత్య కేసు, కరువు, నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వాధికారులపై దాడులు, నీరు-చెట్టులోని అవినీతి అంశాలను సభలో లేవనెత్తుతామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులైనా జరపాలని బీఏసీ సమావేశంలో అడుగుతామన్నారు. టీడీపీ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా.. వైఎస్సార్ సీపీ మాత్రం గట్టిగా ప్రజా సమస్యలపై నిలదీస్తుందని ఎమ్మెల్యేలు తెలిపారు.

సింగపూర్ కాదు ఎలుకలు లేని ఆస్పత్రి చాలు


'సింగపూర్ కాదు ఎలుకలు లేని ఆస్పత్రి చాలు'
గుంటూరు: సింగపూర్ లాంటి రాజధాని తమకు అవసరం లేదని, ఎలుకలు లేని ఆసుపత్రిని నిర్మిస్తే చాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొలుసు పార్థసారథి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మూషికాల దాడిలో శిశువు మృతి చెందిన ఘటనపై వైఎస్సార్‌సీపీ కమిటీ ఆదివారం విచారణ జరిపింది. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని నియమించారు. కొలుసు పార్థసారథి, అంబటి రాంబాబు, వంగవీటి రాధాకృష్ణ, డాక్టర్ నన్నపనేని సుధా, డాక్టర్ జగన్‌మోహన్‌రావు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరు గుంటూరు జీజీహెచ్‌లో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు.

ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయ్‌కుమార్‌ను సంఘటన గురించి ప్రశ్నించగా.. తాను తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టానని, తనకేమీ తెలియదని చెప్పారు. మూషికాల దాడిలో శిశువు మృతి చెందిన వార్డును కమిటీ సభ్యులు సందర్శించారు. మూషికాల దాడిలో శిశువు మృతిపై పూర్తి నివేదికను వైఎస్ జగన్‌కు అందిస్తామని, ఈ ఘటనపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. అరుదైన ఆపరేషన్‌లు నిర్వహించిన ఘన చరిత్ర కలిగిన గుంటూరు జీజీహెచ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం శోచనీయమని కొలుసు పార్థసారధి అన్నారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎలుకల దాడిలో శిశువు మృతి చెందడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తపా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి, పలు విభాగాల కన్వీనర్‌లు కావటి మనోహర్‌నాయుడు, కొత్తా చిన్నపురెడ్డి, సయ్యద్ మాబు, సునీల్, మొగిలి మధు తదితరులు పాల్గొన్నారు.

Popular Posts

Topics :