06 July 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వైఎస్ జగన్ వినతి

Written By news on Saturday, July 12, 2014 | 7/12/2014

‘లోటు’ పూడ్చండి
విభజన చట్టం హామీలను నెరవేర్చండి..
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వైఎస్ జగన్ వినతి

 
 ఏపీ రెవెన్యూ లోటు భర్తీపై కేంద్ర బడ్జెట్‌లో స్పష్టత లోపించింది
 ఆ లోటును పూడ్చకపోతే రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వస్తాయి
 రాజధాని, మౌలిక వసతుల నిర్మాణానికి తక్షణం నిధులు ఇవ్వండి
 పోలవరం ప్రాజెక్టుకు రూ. 4,000 కోట్లు విడుదల చేయండి
 రివైజ్డ్ బడ్జెట్‌లో ఆయా అంశాలపై స్పష్టతనిస్తామన్న జైట్లీ
► గెయిల్ బాధితులకు ఇతర దేశాల తరహాలో పరిహారం ఇవ్వాలని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు జగన్ విజ్ఞప్తి
 కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో జగన్ మర్యాదపూర్వక భేటీ
 
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటును పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. తక్షణమే సంబంధిత చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కోరారు. కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రెవెన్యూ లోటు భర్తీ సహా అనేక అంశాల్లో అస్పష్టత ఉందని.. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అనేక అంశాలను సైతం కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించలేదని జగన్ కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తెచ్చారు. రాజధాని సహా అన్నీ కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పలు హామీలను గుర్తు చేస్తూ జైట్లీకి ఓ వినతిపత్రం అందజేశారు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చిన జగన్ శుక్రవారం మధ్యాహ్నం పార్టీ ఎంపీల బృందంతో కలిసి పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో ఆయన చాంబర్‌లో భేటీ అయ్యారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి సంబంధించిన పలు అంశాలను జైట్లీ దృష్టికి తెచ్చినట్టు వివరించారు. ‘‘కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి చాలా విషయాల్లో స్పష్టత లోపిం చిందని జైట్లీకి చె ప్పాం. వీటిపై స్పష్టత ఇవ్వాలని కోరాం. ముఖ్యంగా రెవెన్యూ లోటు విషయానికి వచ్చేటప్పటికి కొందరు రూ. 10 వేల కోట్లు, 11 వేల కోట్లు, 12 వేల కోట్లు, మరికొందరు రూ. 15 వేల కోట్లు అంటున్నారు. అటువంటి రెవెన్యూ లోటు పూడ్చకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. రెవెన్యూ లోటు పూడుస్తామని (నాటి) ప్రధానమంత్రి పార్లమెంటులో చెప్పడం జరిగింది. రాష్ట్రవిభజన చట్టంలోనూ దీన్ని ప్రస్తావించారు. అయితే ఏపీ రెవెన్యూ లోటు భర్తీ వంటి అంశాన్ని కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో మీరు ఎక్కడా ప్రస్తావించలేదు. అలాంటి అంశంపై స్పష్టత ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడతామని కేంద్ర ఆర్థికమంత్రికి చెప్పాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. సెప్టెంబర్‌లో రివైజ్డ్ బడ్జెట్ వస్తుందని, దాంట్లో ఈ అంశాలన్నిటిపై స్పష్టతనిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సహా అన్ని విషయాలను వినతిపత్రంలో పేర్కొన్నాం. పోలవరం ప్రాజెక్టుకు కనీసం రూ. 4,000 కోట్లు ఇస్తేనే ఆ పనులు జరుగుతాయి.. లేదంటే పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తికాదని మేం జైట్లీకి చెప్పడం జరిగింది. అన్నీ అంశాలు ఆయన సానుకూలంగా విన్నారు. మంచి చేస్తానని చెప్పారు. మంచి జరుగుతుందని మేం ఆశిస్తున్నాం’’ అని జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. అనంతరం వైఎస్ జగన్ పార్లమెంట్ లోపల పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జగన్ వెంట వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరప్రసాదరావు, బుట్టా రేణుక ఉన్నారు.

గెయిల్ బాధితులకు సాయం పెంచాలి...

తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న గెయిల్ దుర్ఘటనలో బాధితులకు సాయం పెంచాలని.. జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌కు విజ్ఞప్తి చేశారు. జగన్.. పార్టీ ఎంపీలతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం శాస్త్రిభవన్‌లో ప్రధాన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అందరు ఎంపీలతో కలిసి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశాం. మొన్న ఓఎన్‌జీసీలో జరిగిన దుర్ఘటన వంటివి మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే.. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఇతర దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే ఏవిధంగా నష్టపరిహారం ఇస్తారో అదేవిధంగా ఇవ్వాలని కోరాం. అలాగైతేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని గట్టిగా చెప్పాం. ఆయిల్‌కి ధర నిర్ణయించేటప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం డాలర్లలో నిర్ణయిస్తారు. దేశీయ మార్కెట్‌లోనూ డాలర్ల రూపంలో లెక్కిస్తున్నా రు. అదే నష్టపరిహారం విషయానికి వచ్చేసరికి వేరే దేశాలతో ఎందుకు పోల్చడం లేదు? ఆ దేశాల మాది రిగా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదా? అని మంత్రిని అడగడం జరిగింది. ఈ మేరకు ఓ వినతిపత్రం ఇచ్చాం. ఇది కొత్త చర్చకు నాంది పలుకుతుందని మంత్రి స్పందించారు. గట్టిగా ప్రయత్నించండి.. ఇలాంటివి చేయగలిగితేనే మీరు మంచి మంత్రిగా గుర్తింపు పొందుతారని మేం ఆయనను కోరాం. ఆయ న చేస్తారన్న నమ్మకం ఉంది’’ అని జగన్ తెలిపారు.

పోలవరం ఆంధ్రప్రదేశ్‌కి వరం..

పోలవరం ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ వరం లాంటిదని జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. ‘‘పోలవరం ప్రాజెక్టు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బతకదు. అటువంటి ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తికావాలి. అది పూర్తయితేనే రైతుల మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. అది జరక్కపోతే వ్యవసాయమే కష్టమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. కనీసం కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆ దిశగా బిల్లు పాస్ చేయడం సంతోషించదగ్గ పరిణామం’’ అని ఆయన పేర్కొన్నారు.

పూర్ణ, ఆనంద్ లకు వైఎస్ భారతి సన్మానం

Written By news on Friday, July 11, 2014 | 7/11/2014

పూర్ణ, ఆనంద్ లకు వైఎస్ భారతి సన్మానం
హైదరాబాద్: అతి పిన్నవయస్సులో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిన మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌కుమార్‌లను సాక్షి మీడియా గ్రూప్ చైర్ పర్సన్ వైఎస్ భారతి సన్మానించారు. ఈ సందర్భంగా సాహసయాత్ర వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. అత్యంత ప్రతికూల వాతావరణాన్ని ఎదిరించి ఎవరెస్టు శిఖరంపై భారతపతాకాన్ని ఎగురువేసి యువతీయువకుల్లో అంతులేని విశ్వాసం నింపారని ప్రశంసించారు. మీ విజయం మరెందరికో స్ఫూర్తినిస్తుందని అన్నారు. పూర్ణ, ఆనంద్ లకు ఉజ్వల భవిష్యత్ సొంతం కావాలని వైఎస్ భారతి ఆకాంక్షించారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఈ ఇద్దరు ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన తెలుగు తేజాలుగా నిలిచారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా 14 ఏళ్ల మాలావత్ పూర్ణ రికార్డు సృష్టించింది.

అరుణ్ జైట్లీతో వైఎస్ జగన్ భేటీ

అరుణ్ జైట్లీతో వైఎస్ జగన్ భేటీవీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. విభజన నేపథ్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ లో తలెత్తిన సమస్యలను జైట్లీకి దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు విజ్ఞాపన ప్రతం సమర్పించారు. తాము చెప్పిన విషయాలను ఆర్థిక మంత్రి సావధానంగా విన్నారని భేటీ అనంతరం వైఎస్ జగన్ తెలిపారు. తమ విజ్ఞాపనల పట్ల సానుకూలంగా స్పందించారని చెప్పారు.

లోటు బడ్జెట్‌తో ఉన్న ఏపీలో సదుపాయాల కొరత ఏర్పడిందని, ఐటీ కార్యకలాపాలు లేవని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. ఏపీకి మౌళిక వస్తువుల తయారీ ,ఉన్నత విద్యా, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు చాలా అవసరమని అన్నారు. ఉన్నతమైన ప్రమాణాలతో రాజధాని నిర్మాణం చేయాలని సూచించారు. పన్ను రాయితీలను కల్పించాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాను, ప్రత్యేక ఆర్ధిక ప్రోత్సాహక ప్యాకేజీని 15 సంవత్సరాలపాటు ఇవ్వాలని కోరారు. ఇవన్నీ జరగాలంటే పెద్దమొత్తంలో ఆర్ధిక సహాయం కావాలంటూ లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు.

విభజన బిల్లులో పేర్కొన్నట్లుగా రాష్ట్రానికి నిట్, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ విపత్తుల నిర్వహణ విశ్వవిద్యాలయాన్ని తొందరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 13వ షెడ్యూల్‌లో పేర్కొన్నట్లుగా కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖలో పెట్రోలియం కాంప్లెక్స్‌, విశాఖపట్నం,విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలని కోరారు. విశాఖలో మెట్రో రైల్, విజయవాడ-తెనాలి-గుంటూరులలో మెట్రోపాలిటిన్ అర్బన్ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు తెలిసి చేసిన దగా రుణాల మాఫీ

'చంద్రబాబు తెలిసి చేసిన దగా రుణాల మాఫీ'వీడియోకి క్లిక్ చేయండి
విజయవాడ: పంట రుణాల రీషెడ్యూల్‌ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. రైతు రుణమాఫీ -సాగునీటి కొరతపై విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమవేశంలో ఆయన పాల్గొన్నారు. విభజన తర్వాతనే చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారని, అన్ని రుణాలను మాఫీచేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌లు తొలిసంతకాలను అమలుచేసి చూపారని చెప్పారు. చంద్రబాబు మాత్రం తొలిసంతకంతో కమిటీ వేశారని తెలిపారు. చంద్రబాబు తెలిసి చేసిన దగా రుణాల మాఫీ అన్నారు. రీషెడ్యూలు అంటే భారం పెంచడం కాదా అని ప్రశ్నించారు. మూడేళ్లు లేదా ఐదేళ్లలోనైనా రుణాలు తీర్చాల్సిందేనని, ఆ మేరకు వడ్డీ కూడా పెరగదా అని అన్నారు. రీషెడ్యూలుతో రైతులు రుణవిముక్తులవుతారా అని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.

కొత్త చరిత్రకు బదులు రక్త చరిత్ర

'కొత్త చరిత్రకు బదులు రక్త చరిత్ర సృష్టిస్తున్నారు'
హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో కొత్త చరిత్రకు బదులు రక్త చరిత్రను సృష్టిస్తున్నారని టీడీపీ నేతలపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే యత్నం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన పద్మ.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రపతిని, ప్రధాని కలిస్తే కేసులు మాఫీ అవుతాయని మాట్లాడుతున్న టీడీపీ నేతలు.. అసలు న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజల తరుపున పోరాటం చేసే క్రమంలో రాష్ట్రపతిని, ప్రధాని కలిస్తే.. కేసులు మాఫీ అవుతాయా?అంటూ నిలదీశారు.
 
ముందు కేసుల మాఫీ సంగతిని పక్కకు పెట్టి.. మీరిచ్చిన రుణమాఫీని అమలు చేయాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. గత టీడీపీ హయాంలో జరిగిన హత్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే యత్నం చేస్తున్నారని.. ఇది సరైన విధానం కాదని పద్మ సూచించారు.

ఒంటిగంటకు జైట్లీతో వైఎస్ జగన్ బృందం భేటీ

న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. ఆయనతో పాటు పార్టీనేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా జైట్లీని కోరనున్నారు.

అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లను వైఎస్ జగన్ బృందం కలుసుకోనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు, సమస్యలపై వారికి వినతిపత్రం సమర్పించటంతో పాటుగా కొత్త రాష్ట్రం పురోభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలందించాలని కోరతారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: వైఎస్ జగన్

  • టీడీపీ అరాచకాలపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి జగన్ ఫిర్యాదు
  •   ఏపీలో ఎన్నికల తర్వాత దారుణమైన పాలన సాగుతోంది
  •   17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను హతమార్చారు
  •   తక్షణం జోక్యం చేసుకోండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి 
  •   నేడు ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ కానున్న వై.ఎస్. జగన్ 
  •  స్వయంగా సీఎం స్థాయి వ్యక్తే ప్రలోభపెడుతున్నారు
  •  అధికార పార్టీ అరాచకాలతో ప్రజాస్వామ్యం ఖూనీడండి
  •  పార్టీ ఎంపీల బృందంతో కలసి ఇరువురితో విడివిడిగా భేటీలు
  •  ప్రణబ్, రాజ్‌నాథ్‌లకు జగన్‌మోహన్‌రెడ్డి వినతులు
  •  మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం: జగన్
 
 నేడు ప్రధాని, కేంద్ర మంత్రులతో జగన్ భేటీ 
 వైఎస్సార్  సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌లను కలుసుకోనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు, సమస్యలపై వారికి వినతిపత్రం సమర్పించడంతో పాటుగా కొత్త రాష్ట్రం పురోభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలందించాలని కోరతారు.
 
 రాష్ట్రపతికిచ్చిన  వినతిపత్రంలో ముఖ్యాంశాలు
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినట్టు మే 16న ఎన్నికల సంఘం ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.
  •   టీడీపీ నాయకులు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ దాడులు చేస్తున్నారు.
  •   పోలీసులు సైతం వీరి దురాగతాలపై కేసులు నమోదు చేయలేని పరిస్థితి ఉంది.
  •   వీటన్నింటినీ ముఖ్యమంత్రే పోత్సహిస్తున్నారు.
  •   ఎన్నికల ఫలితాలు వచ్చిన ఎనిమిది రోజుల్లోనే వైఎస్సార్‌సీపీకి అధికారిక గుర్తింపులేదని చెబుతూ ఓ ఎంపీని వాళ్ల పార్టీలోకి చేర్చుకున్నారు. మరికొందరినీ ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు.
  •   ఐదేళ్లు స్పీకర్‌గా పనిచేసిన టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు అధికారిక గుర్తింపు లేకపోతే అనర్హత వేటు పడదంటూ ప్రచారం చేశారు.
  •   టీడీపీ అరాచకాలు చూస్తుంటే ఇటీవల వాయిదా పడిన ఎన్నికల్లోనూ న్యాయం జరుగుతుందనే నమ్మకం లేకుండా పోరుుంది. 
  •   ఇదే పరిస్థితి ఉంటే ఆళ్లగడ్డ, నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో ముందే ఉహించగలం.
  •   టీడీపీ ప్రభుత్వ వైఖరి చూసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురవుతున్నాయి.
  •   ఇలాంటి చర్యలన్నిటినీ వెంటనే నిలిపివేయాలని సూచిస్తూ కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు పంపేలా మీరు సూచించండి.
 
 రాజ్‌నాథ్‌కు వినతి..
  •  కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాన్ని టీడీపీ ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేయకుండా చర్యలు తీసుకోండి.
 
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ ఎంపీలతో కలసి గురువారం సాయంత్రం రాష్ట్రపతికి, కేంద్ర హోంమంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నారని వారి దృష్టికి తెచ్చారు. వీటన్నింటినీ ఖండించాల్సిన ముఖ్యమంత్రే దిగజారుడు రాజకీయాలతో స్వయంగా తానే ప్రలోభాలకు గురిచేస్తున్న పరిస్థితి ఉందని వారికి నివేదించారు. గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరప్రసాద్‌రావు, కొత్తపల్లి గీత, బుట్టా రేణుకలతో కలసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో అరగంటకు పైగా భేటీ అయ్యారు. అనంతరం పార్టీ ఎంపీల బృందంతో జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా అశోక రోడ్డులోని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ నివాసానికి వెళ్లారు. 15 నిమిషాలకు పైగా ఆయనతో భేటీ అయ్యా రు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా ఖూనీ చేస్తున్నారో వివరించి, వినతిపత్రం సమర్పించారు. తొలుత రాష్ట్రపతి భవన్ వద్ద, అనంతరం రాజ్‌నాథ్ నివాసం వద్ద జగన్ మీడియాతో మాట్లాడారు. 
 
 ఏపీలో దారుణ పాలనపై వివరించాం
 ‘‘ఏపీలో ఎన్నికల తర్వాత ఎటువంటి దారుణమైన పాలన సాగుతోందో రాష్ట్రపతిని కలసి వివరించాం. ఎన్నికల తర్వాత దాదాపు 17 మంది వైసీపీ కార్యకర్తలు హత్యకాబడ్డారు, 110 మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. బాధాకరమైన విషయమేమిటంటే.. ఈ దాడుల్లో చనిపోయిన, గాయపడిన, నష్టపోయినవారు 50 శాతంపైగా ఎస్సీలు, మహిళలే. ఇలాం టి దారుణ పాలన ఏపీలో జరుగుతుండగా.. ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఎంపీపీ చైర్మన్లు, మునిపల్ చైర్మన్ల ఎన్నికలు, జెడ్‌పీ చైర్మన్ల ఎన్నికల్లో ఎటువంటి దారుణాలు జరిగాయో సవివరంగా రాష్ట్రపతికి నివేదించాం. చివరకు ఎంపీటీసీలను, జెడ్‌పీటీసీలను, కౌన్సిలర్లను సైతం ఏవిధంగా కిడ్నాప్ చేశారో, భయపెట్టారో, ప్రలోభపెట్టారో ప్రెసిడెంట్‌కి చెప్పాం. 
 
 సీఎం స్థాయి వ్యక్తే ప్రలోభపెడుతున్నారు
 ప్రజాస్వామ్యంలో వేరొక పార్టీ గుర్తుపై ఎన్నికలు జరిగినప్పుడు సీఎం స్థాయి వ్యక్తి ఏకంగా ఫోన్‌లో జెడ్‌పీటీసీలతో మాట్లాడి ప్రలోభపెడుతుంటే.. మరోవైపు మంత్రులు జెడ్‌పీటీసీలను ఎత్తుకుని వెళ్లడం, బెదిరింపులకు పాల్పడటం చేస్తావుంటే.. మా బాధ ఎక్కడికి వెళ్లి చెప్పుకోవాలో అర్థంకావట్లేదు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ను కలిశాం. గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. ఇప్పుడు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాం. ఈ దారుణ పాలన గురించి నిజంగా చాలా చాలా బాధతో రాష్ట్రపతికి వివరించాం. కనీసం ఇప్పటికైనా స్పందన వస్తుందని, కదలిక వస్తుందని ఆశిస్తున్నాం’’ అని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రపతి అన్ని అంశాలను సానుకూలంగా విన్నారని ఆయన చెప్పారు. ‘‘కేంద్ర హోంమంత్రికి మీరు చెప్పండి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి గట్టిగా సిఫారసు చేయండని కోరాం. ఆయన చేస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 
 
 కేంద్ర హోంమంత్రి మంచి చేస్తారని ఆశిస్తున్నాం
 రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదులకు సంబంధించి ఆధారాలున్నాయా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఈ అంశాలన్నీ మీడియాలో వస్తూనే ఉన్నాయి. వాటి పేపర్ కటింగ్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఈ వార్తలు వచ్చాయి’’ అని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఇంకా దేశంలో పార్టీ గుర్తులపై ఎన్నికలెందుకని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవాళ్లే చైర్మన్లను ఎంపికచేసేలా బిల్లు పాస్ చేయించుకుంటే సరిపోతుంది కదా అని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై, ప్రజాతీర్పుపై గౌరవం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించడం ఎందుకని జగన్ మండిపడ్డారు. రాష్ట్రపతికి వివరించిన అంశాలన్నిటినీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కూ వివరించా మని తెలిపారు. హోంమంత్రి మంచి చేస్తారన్న నమ్మకం ఉందని, మంచి జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.

చెవిరెడ్డి కట్టడికి ‘అధికార’ కుట్ర!

చెవిరెడ్డి కట్టడికి ‘అధికార’ కుట్ర!
  •       చంద్రగిరి ఎమ్మెల్యేపై పోలీసులను ఉసిగొల్పుతున్న గల్లా
  •      టీడీపీ నేతల ఆజ్ఞలకు జీ హుజూర్ అంటున్న ఎస్పీ
  •      చెవిరెడ్డిపై కేసుల వివరాలను అందించాలంటూ పోలీసులకు హుకుం
  •      ఒక్క క్రిమినల్ కేసూ లేకపోవడంపై ఆశ్చర్యం
  •      అయినా రౌడీషీట్ తెరవాలంటూ ఎస్పీపై టీడీపీ కీలకనేతల ఒత్తిడి
సాక్షి ప్రతినిధి, తిరుపతి :  ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది టీడీపీ నేతల తీరు..! చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, టీడీపీ కీలకనేతలు దొడ్డిదారిని ఎంచుకున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి.. చెవిరెడ్డిని కట్టడి చేసేందుకు పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇదే అదునుగా తీసుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకుని.. కీలకమైన పోస్టింగ్ పొందేందుకు ఎత్తులు వేస్తున్నారు. చెవిరెడ్డిపై నమోదైన కేసుల వివరాలను తక్షణమే ఇవ్వాలంటూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేయ డం పోలీసు వర్గాలనే నివ్వెరపరిచింది. వివరాలిలా..
 
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సొంతూర్లు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గల్లా అరుణకుమారి అప్పట్లో కూడా పోలీసులపై ఒత్తిడి తెచ్చి చెవిరెడ్డిపై పదుల సంఖ్యలో కేసులు అక్రమంగా బనాయించారనే విమర్శలు బలంగా విన్పించాయి.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా.. ప్రజలకు దన్నుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోరాటాలు చేశారు.. ఇప్పుడు చేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనప్పుడు.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలు చేసినపుడు చెవిరెడ్డిపై వివిధ పోలీసుస్టేషన్లలో పోలీసులు కేసులు నమోదు చేశా రు. విద్యుత్ స్తంభాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు రాయించినందుకు కూడా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులన్నింటి వెనుక గల్లా అరుణకుమారి ఉన్నారన్నది బహిరంగ రహస్యం. ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో కలయదిరుగుతూ ప్రజలకు దన్నుగా నిలుస్తున్నారు. ఇది గల్లా అరుణకుమారి, టీడీపీ కీలకనేతలకు కంటగింపుగా మారింది. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు, నక్సల్స్, ఫ్యాక్షన్ ప్రభావిత నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పర్యటించకుండా చేసేందుకే ఇటీవల భద్రతను కుదించేలా టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు.

ఫలితంగా చెవిరెడ్డికి ఉన్న 2+2 భద్రతను 1+1కు కుదించారు. టీడీపీ నేతలు అంతటితో ఆగలేదు.. చెవిరెడ్డిపై రౌడీషీటర్ ముద్రవేసి అప్రతిష్టపాలు చేయడానికి కుట్రపన్నారు. చెవిరెడ్డిపై ఎలాగైనా రౌడీషీట్ ఓపెన్ చేయాలని తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబుపై గల్లా అరుణకుమారితో పాటు టీడీపీ కీలక నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

వ్యక్తిపై దాడి, హత్యాయత్నం వంటి వా టికి పాల్పడి క్రిమినల్ కేసులు నమోదైన వారిపై మా త్రమే రౌడీషీట్ ఓపెన్ చేయాలన్నది నిబంధన. కనీ సం మూడు క్రిమినల్ కేసులు ఉన్న వారిపై మాత్రమే రౌడీషీట్ తెరవవచ్చు. కానీ.. చెవిరెడ్డిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకు అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు చెవిరెడ్డిపై నమోదైన కేసుల వివరాలను తక్షణమే అందించాలంటూ బుధవారం పోలీసులను ఆదేశించారు.

పోలీసులు అందించిన కేసుల్లో ఒక్కటీ క్రిమినల్ కేసు లేకపోవడంతో ఏదో ఒక కేసు బనాయించాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చెవిరెడ్డిపై ఎలాగైనా రౌడీషీట్ తెరిచి.. టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకుని, కీలకమైన పోస్టింగ్ పొందాలని ఎస్పీ వ్యూహం రచించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చెవిరెడ్డిని కట్టడి చేసేందుకు టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. అక్రమ కేసులు బనాయించే యత్నంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బడ్జెట్‌లో తెలంగాణపై వివక్ష

బడ్జెట్‌లో తెలంగాణపై వివక్ష
 సాక్షి, ఖమ్మం: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని విమర్శించారు. కేంద్రం బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన  ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి ఈ బడ్టెట్‌లో కేంద్రం నిధులు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు.

 కేంద్రం ఆదుకుంటుందేమోన్న ఆశలు నీరుగారిపోయాయన్నారు.  గ్రామీణాభివృద్ధి , వ్యవసాయ, ఉపాధి హామీ పథకాలకు నిధుల కేటాయింపును కేంద్రం విస్మరించిందని పేర్కొన్నారు.  నిత్యావసర వస్తువులపై భారాన్ని తగ్గింగచలేదన్నారు. మొత్తంగా ఈ బడ్జెట్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.

రుణమాఫీ అంటే రీషెడ్యూలా..?

రుణమాఫీ అంటే రీషెడ్యూలా..?
  • రైతులను మోసం చేస్తే సహించం
  •  ప్రభుత్వమే  రైతుల డాక్యుమెంట్లు, నగలు విడిపించాలి
  •  ఉప్పులేటి కల్పన
పామర్రు :  రైతులకు రుణాలు మాఫీ చేస్తారో లేదో  చెప్పకుండా రీషెడ్యూలింగ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  డ్రామాలాడుతున్నారని  పామర్రు ఎమ్మెల్యే, శాసనసభలో వైఎస్సార్‌సీపీ  డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ధ్వజమెత్తారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే రుణమాఫీపై తొలి సంతకం చేస్తున్నానని రైతులను వంచించారని,  నెల గడుస్తున్నా ఈ దిశగా తీసుకున్న చర్యలేమీ లేవని అన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై టీడీపీ ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదన్నారు.   తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ అన్ని హామీలను అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటుంటే  ఇక్కడి ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు.  అసలు ప్రభుత్వం   ఉన్నదా లేదా అనే అనే అనుమానం ప్రజలకు కలుగుతోందని చెప్పారు.

వ్యవసాయ రుణాలు పూర్తి మాఫీ అన్న ప్రభుత్వం ఇప్పుడు వివిధ రకాల  ఆంక్షలు పెడుతూ రైతులను నిలువునా మోసం చేస్తోందని కల్పన ఆరోపించారు.  ముఖ్యమంత్రితో సహా ఆర్థిక, వ్యవసాయశాఖ మంత్రులు  రైతుల రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.  ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా  రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకడం లేదని,   అధిక  వడ్డీకి అప్పులు చేయాల్సివస్తోందన్నారు.   

ఇటువంటి తరుణంలో చంద్రబాబు రీషెడ్యూల్ దిశగా ఆలోచన చేయడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వమే బ్యాంకులకు హామీ ఇచ్చి రైతుల తాకట్టు పెట్టిన భూమి డాక్యుమెంట్లు, నగలను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు.  కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలు తీరేలా  పూర్తిగా 10 టీఎంసీల నీరు విడుదల య్యేలా  ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు శ్రద్ధ చూపాలని కోరారు.    

రైతులకు అన్యాయం చేస్తే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని వారితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.   ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నత్తారవి, కారపాటి కోటేశ్వరరావు, గారపాటి సతీష్, విమలారావు, శ్రీపతి కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
 

అంకెలన్నీ ఆచరణ సాధ్యమా?

Written By news on Thursday, July 10, 2014 | 7/10/2014

అంకెలన్నీ ఆచరణ సాధ్యమా?
హైదరాబాద్: నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి ఆర్థిక బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు అన్నారు. బడ్జెట్‌లో పేర్కొన్న అంకెలన్నీ ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌ విభజన చట్టంలో ప్రస్తావించిన అనేక అంశాలు బడ్జెట్‌ ప్రసంగంలో లేవని చెప్పారు.

ఏపీకి కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేవని పెదవి విరిచారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఏపీ పరిస్థితి దుర్భరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విధాన పరమైన నిర్ణయాల్లో కొన్ని మాత్రమే సానుకూలంగా ఉన్నాయని అన్నారు. ఏపీకి స్పెషల్ కేటగిరి హోదా, రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్ట్‌ , ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలకు బడ్జెట్ ప్రసంగంలో చోటు దక్కలేదని సోమయాజులు తెలిపారు.

రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడులా?

రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడులా?
గుంటూరు: రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యతిరేకించారు. రక్షణ శాఖలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు, దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకు రక్షణ రంగంలో 49 శాతం వరకు ఎఫ్ డీఐలు అనుమతించాలని గురువారం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ లో కేంద్రం ప్రతిపాదించింది.

కాగా, బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి రుణమాఫీ ప్రస్తావన రాలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఊసే లేదన్నారు. ఏపీలో రూ.15,900 కోట్ల లోటు బడ్జెట్‌లో ఉందని, దీని భర్తీ విషయంలో కేంద్రం మౌనంగా ఉందని విమర్శించారు. విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రో రైలు ప్రస్తావన రాలేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన పరిపాలన: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన పరిపాలన: వైఎస్ జగన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిపాలన కొనసాగుతుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ నెల 3,4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ చైర్మన్ల, మండలపరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకాలు సృష్టించారని ఆయన విమర్శించారు. గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన వైఎస్ జగన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ అమానుషంగా దాడికి పాల్పడిందన్నారు.
 
టీడీపీ చేసిన దాడిలో వెనుకబడినవారు, మహిళలు అధికంగా గాయపడ్డారన్నారు. సర్కారు ఏర్పడిన నెలరోజుల్లోనే 17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను హతమార్చడం, 119 మందిని తీవ్రంగా గాయపర్చడం బాధాకరమన్నారు. ఇటీవల మున్సిపల్ చైర్మన్ల, మండలపరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు ఫోన్ చేసి ప్రలోభాలకు గురి చేయడం చాలా సిగ్గుచేటన్నారు. ఇప్పటికే ఈ ఉదంతాలపై గవర్నర్ నరసింహన్ కు నివేదిక అందించడమే కాకుండా , రాష్ట్రపతికి కూడా వివరించామని జగన్ తెలిపారు. దీనిపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు. ఇప్పటికే టీడీపీ ఆగడాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా జగన్ తెలిపారు

రాష్ట్రపతిని కలిసిన వైఎస్ జగన్

రాష్ట్రపతిని కలిసిన వైఎస్ జగన్
న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను కేంద్రంలోని పెద్దలకు వివరించేందుకు గురువారం ఢిల్లీకి బయల్దేరిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆయనతోపాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కూడా రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ రోజు రాత్రి 7.30 ని.లకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో జగన్ సమావేశం కానునన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ చైర్మన్ల, మండలపరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు, ప్రభుత్వ అధికార దుర్వినియోగం వంటి అంశాలను ఆయన రాజ్ నాథ్ కు వివరించనున్నారు.
 
చంద్రబాబు నాయుడు సర్కారు ఏర్పడిన నెలరోజుల్లోనే 17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను హతమార్చడం, 110 మందిని తీవ్రంగా గాయపర్చిన ఉదంతాలను వివరించనున్నారు. శుక్రవారం కూడా ఢిల్లీలోనే ఉండనున్న జగన్ .. ప్రధాని నరేంద్ర మోడీతో కూడా  సమావేశమయ్యే అవకాశం ఉంది.

రీషెడ్యూల్ పేరుతో ఏపీ సర్కారు నయా డ్రామా

రీషెడ్యూల్ పేరుతో ఏపీ సర్కారు నయా డ్రామా
వైఎస్సార్‌సీఎల్పీ ఉప నేత జ్యోతుల ధ్వజం
 సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాలను మాఫీ చేస్తారో లేదో చెప్పకుండా రీషెడ్యూలుకు రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అంగీకరించిందని చెప్పి చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రామాలెందుకు ఆడుతోందని వైఎస్సార్‌సీ ఎల్పీ ఉప నేత జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. రుణ మాఫీపై స్పష్టత ఇవ్వాలని బుధవారం డిమాండ్ చేశారు.
 
రుణాలను రీషెడ్యూల్ చేయడం కొత్తేమీ కాదని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు నిబంధనల ప్రకారం అమలు చేసేదేనని తెలిపారు. అయితే, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అదేదో ఇప్పుడే జరుగుతున్నట్లు మరో డ్రామాకు తెరలేపుతున్నారని, రుణ మాఫీపై స్పష్టత ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.
 
 డాక్యుమెంట్ల మాటేమిటి? నగలు తిరిగి ఇస్తారా?
 ‘‘రీషెడ్యూల్ చేస్తే అప్పుల కోసం రైతులు బ్యాంకుల్లో ఉంచిన డాక్యుమెంట్లు, కుదువపెట్టిన ఆడపడుచుల నగలు తిరిగి రావు. వాటిని రైతులకు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా? ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి, రైతుల డాక్యుమెంట్లను, బంగారాన్ని ఇప్పించాలి’’ అని నెహ్రూ కోరారు.

సాయంత్రం కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు పలువురు పార్టీ ముఖ్యనేతలు కూడా హస్తిన వెళ్లారు. వైఎస్ జగన్ గురువారం సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్నారు.

 అలాగే శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో జగన్ భేటీ కానున్నారు. వీరితో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా వైఎస్ జగన్ సమావేశం అవుతారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ చైర్మన్ల, మండలపరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు, ప్రభుత్వ అధికార దుర్వినియోగం వంటి అంశాలను ఆయన వీరి దృష్టికి తేనున్నారు. చంద్రబాబు నాయుడు సర్కారు ఏర్పడిన నెలరోజుల్లోనే 17 మంది వైఎస్ఆర్  కాంగ్రెస్ కార్యకర్తలను హతమార్చడం, 110 మందిని తీవ్రంగా గాయపర్చిన ఉదంతాలను వివరించనున్నారు.

వైఎస్ఆర్ సీపీ నేతలకు చిత్రహింసలు

Written By news on Wednesday, July 9, 2014 | 7/09/2014

'వైఎస్ఆర్ సీపీ నేతలకు చిత్రహింసలు'టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన ఇల్లు, ఫర్మీచర్. పక్కన గాయపడిన భాస్కరరావు
పెదవేగి: అధికార టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడెంలో పది రోజుల క్రితం వైఎస్ఆర్ సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటివరకు వారిని అరెస్ట్ చూపించలేదు.

జూన్ 30న అంకన్నగూడెం సర్పంచ్, టీడీపీ నాయకుడు చిదిరాల సతీష్ ఊరి పొలిమేర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే అతనిపై హత్యాయత్నం జరిగిందంటూ వైఎస్ఆర్ సీపీ నాయకులు మొరవినేని భాస్కరరావు, గోపాలరావు, సూర్యప్రకాశరావు, చంద్రశే్ఖర్ సహా దాదాపు 10మందిని అదుపులోకి తీసుకున్నారు.

స్టేషన్లు మారుస్తూ వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు తెలిసింది. టీడీపీ సర్పంచ్ పై దాడి చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. పోలీసుల వేధింపులతో భాస్కరరావు, గోపాలరావు అనారోగ్యం పాలయ్యారని సమాచారం. భాస్కరరావు నివాసంపై టీడీపీ నేతల దాడి విషయంలో కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోలేదు.

లోక్ సభలో ఆకట్టుకున్న కొత్తపల్లి గీత ప్రసంగం

లోక్ సభలో ఆకట్టుకున్న కొత్తపల్లి గీత ప్రసంగం
న్యూఢిల్లీ: ఆకాశానంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకు ఎంపీ కొత్తపల్లి గీత కోరారు. లోక్ సభలో తొలిసారిగా మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న ధరల గురించి ప్రస్తావించారు.

తమ బతుకులను బాగుచేస్తారనే నమ్మకంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ప్రజలు సంపూర్ణ మెజారిటీతో అధికారం కట్టబెట్టారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మోడీ సర్కారు ఉందన్నారు. ధరల పెరుగుదలను అరికట్టి సామాన్యులపై భారం తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల వ్యవస్థను సంస్కరించాలని సూచించారు. దేశమంతా 'ఒకే ధర' విధానాన్ని అమలు చేయాలని కోరారు.

తొలిసారిగా లోక్ సభలో మాట్లాడిన కొత్తపల్లి గీత ఏ మాత్రం తొణక్కుండా తాను చెప్పాల్పింది చెప్పారు. ఆమె ప్రసంగాన్ని సభ్యులు శ్రద్ధగా విన్నారు.  ఆమె లోక్ సభలో మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ స్థానంలో మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ ఉండడం విశేషం.

ఏపీ రైతులు అమాయకులు కాదు

'ఏపీ రైతులు అమాయకులు కాదు'
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీయిచ్చిన చంద్రబాబు ఇప్పుడు రీషెడ్యూల్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రు విమర్శించారు. రుణమాఫీ చేస్తారా, లేదా అనే దానిపై చంద్రబాబు సూటీగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకీ దాటవేత ధోరణి అంటూ ప్రశ్నించారు.

ఏపీ రైతాంగం చంద్రబాబు మాటలు నమ్మే అమాయకులు కాదన్నారు. ప్రజలను పూర్తిగా మోసం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఏదైనా హామీ ఇచ్చి కుదవపెట్టిన రైతుల డాక్యుమెంట్లు తిరిగి ఇప్పిస్తుందా అని ప్రశ్నించారు. బ్యాంక్‌ల నుంచి రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లను ప్రభుత్వమే ఇప్పించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చంద్రబాబు ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని, మీ సమాధానం కోసం రైతులు ఎదురు చూస్తున్నారని జ్యోతుల నెహ్రు అన్నారు.

మా ప్రాణాలకు ముప్పు

మా ప్రాణాలకు ముప్పు
జమ్మలమడుగు: టీడీపీ ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తోంది. అధికారులు కూడా అధికార పార్టీకే వత్తాసుపలుకుతున్నారు. బయటికి వెళితే తాము సురక్షితంగా ఇంటికి చెరుతామో లేదో అనే భయముంది అంటూ జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వాపోయారు. మంగళవారం ఉదయం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవగుడి గ్రామంలో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లను, ఎంపీటీసీలను కలిశారు. ఈ సందర్భంగా వారు జగన్‌మోహన్‌రెడ్డితో తమ బాధను చెప్పుకున్నారు.
 
 మా పరిస్థితి అగమ్యగోచరం..
 తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మా వారిపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉందని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 3,4 తేదీల్లో జమ్మలమడుగులో టీడీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయంలో ఉన్న తమపై రాళ్లు విసిరారు.పట్టణంలో భయోత్పాతం సృషించారు. కౌన్సిలర్ల ఇళ్ల వద్దకు వెళ్లి భయపెడుతున్నారు. తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆయన చెప్పారు.
 ప్రజా ప్రతినిధులపైనే దాడి చేస్తున్నారు...
 మున్సిపల్ ఛైర్మన్,వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపైనే కారం పొడి చల్లారు. అంతేకాకుండా టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తాము వీధుల్లోకి రావాలన్నా రాలేని పరిస్థితి. వారందరూ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని 15వార్డు కౌన్సిలర్ మార్తమ్మ తన ఆవేదనను వివరించారు.
 
 ఇళ్ల ముందు కాపుకాస్తున్నారు..
 టీడీపీకి చెందిన నాయకులు తమ ఇళ్లముందుకు వచ్చి కాపుకాస్తున్నారు. తమపై నిఘా పెట్టారు. తమని ఎక్కడ ఏమిచేస్తారో అనే భయంతో బతుకుతున్నాం. ఇంట్లో ఎవ్వరూ ఉండకుండా బంధువుల ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. అందరూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ 8వార్డు కౌన్సిలర్ వెంకటేష్  వివరించారు.
 
 కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి..
 కార్యకర్తల్లో భరోసా నింపుతూ వారికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సూచించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింతగా పెరగవచ్చు. ఐదేళ్లపాటు టీడీపీ వారి అరాచకాలను ఎదుర్కొనేందుకు ప్రతి కార్యకర్త సన్నద్ధంగా ఉండాలి.
 
 మున్సిపల్ ఛైర్మన్,వైస్‌ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా ప్రిసైడింగ్ అధికారి, పోలీసులు కలిసికట్టుగా అధికార పార్టీకి వత్తాసు పలికి ఎన్నికలను వాయిదా వేయించారు. రాజ్యాంగంలో ఎక్కడాలేనివిధంగా టీడీపీ నాయకులు ఫోన్‌లు చేసి చెప్పినట్లు అధికారులు కూడా వ్యవహరిస్తూ వచ్చారు. ఎన్నిక లు నిర్వహించాల్సిన అధికారి అనారోగ్యమంటూ డ్రామాలాడి ఎన్నికలు వాయిదావేస్తున్నట్లు ప్రకటించకుండా వెళ్లిపోయారు అని ఆదినారాయణరెడ్డి విమర్శించారు.  
 
 అధైర్యపడవద్దు.. మంచి రోజులు వస్తాయి
 వేంపల్లె :  మంచి రోజులు వస్తాయి.. అధైర్యపడవద్దని.. దేవుని ఆశీస్సులు ఉంటే అంతా మేలు జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరుకు చెందిన జెడ్పీటీసీలతో అన్నారు. మంగళవారం ఇడుపులపాయలో వారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈనెల 13వ తేదీ నెల్లూరు జెడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో జగన్ వారితో సుదీర్ఘంగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో జెడ్పీటీసీలకు మంచి భవిష్యత్ రానుందన్నారు. డీడీఆర్‌సీ రద్దు చేయనున్నారని..జెడ్పీటీసీలదే ప్రధాన పాత్రగా ఉంటుందని తెలిపారు. నెల్లూరు జెడ్పీ పీఠం వైఎస్సార్‌సీపీకే దక్కుతుందని.. అధైర్యపడవద్దని చెప్పారు.
 

ఏపీ, తెలంగాణలకు అన్యాయం

ఏపీ, తెలంగాణలకు అన్యాయం: వైఎస్సార్ సీపీ
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేణుక, కొత్తపల్లి గీతలతో కలిసి మేకపాటి రాజమోహనరెడ్డి పార్లమెంటు వెలుపల మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘రెండు రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తున్నామని, కమిటీ వేసి చర్చించి చేస్తామని రైల్వే మంత్రి చెప్పారు.
 
 ఆ కమిటీ ఏమిటో, ఎప్పుడు వేస్తారో..! ఈ ప్రాజెక్టుల్లో వేటిని ఎప్పుడు, ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. చూద్దాం’’ అని అన్నారు. ‘‘విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రో కనెక్టివిటీ, విశాఖకు మెట్రో రైలు ప్రస్తావన లేదు. అనేక ఏళ్ల కిందట మంజూరై, బడ్జెట్‌లో ఆమోదం పొంది అమలుకు నోచుకోని ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి.నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు, ఎర్రగుంట్ల-నంద్యాల, కర్నూలు-మంత్రాలయం సహా చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి ప్రస్తావనే లేదు’’ అని విమర్శించారు.

మహానేత వైఎస్‌ఆర్ కు ఘన నివాళి


ఇడుపులపాయలో వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల, భారతి, కుటుంబసభ్యుల ప్రత్యేక ప్రార్థనలు
వేంపల్లె: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలు మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కుటుంబ సభ్యులతో కలసి వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ 65వ జయంతి వేడుకలు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో జరిగాయి. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డితోపాటు వైఎస్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిలమ్మ, కోడలు భారతిరెడ్డి, షర్మిల కుమార్తె అంజలి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి, ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే వైఎస్ పురుషోత్తమరెడ్డి, జగన్ మామ ఈసీ గంగిరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, కమలమ్మ, వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ అవినాష్‌రెడ్డి సతీమణి సమతారెడ్డి తదితరులు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెవరెండ్ నరేష్‌బాబు సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.    
 వైఎస్ ఆశయాలు సాధిస్తాం: ఎంపీలు
 వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి మహానేతను కోల్పోవడం రాష్ట్రానికే కాకుండా దేశానికి పెద్దలోటని వైఎస్సార్ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో దివంగత వైఎస్సార్ ఆశయ సాధనకు అంతా కృషి చేస్తామని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఢిల్లీలోని లోధీఎస్టేట్-26లో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరప్రసాదరావు, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక పాల్గొన్నారు. వైఎస్ చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం కేక్ కోశారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ..   ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా రాజశేఖరరెడ్డి పరిపాలన కొనసాగిందన్నారు. అందుకే ప్రజలు ఆయనను ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు.
 పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతల శ్రద్ధాంజలి
 హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి.. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తరువాత యర్రగొండపాలెం, మార్కాపురం ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి సంయుక్తంగా కేక్‌ను కోసి పంచారు. ఆ తరువాత పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కార్యాలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటుతో పాటు, పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు ఎన్.లక్ష్మీపార్వతి, నల్లా సూర్యప్రకాశరావు, వాసిరెడ్డి పద్మ, గట్టు రామచంద్రరావు, విజయచందర్, బి.జనక్‌ప్రసాద్, పీఎన్వీ ప్రసాద్, పుత్తా ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్‌సీ ఎల్పీ కార్యాలయంలో పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్  వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 
 మహానేతకు కాంగ్రెస్ నివాళి
 వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం స్థానిక ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. పంజగుట్టలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, నాయకులు వట్టి వసంతకుమార్, శైలజానాథ్, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


రాజన్నకు ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిని ప్రజలు తమ గుండెల్లో నిలుపుకున్నారు. ఆయన జయంతిని మంగళవారం వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. పలుచోట్ల వైఎస్‌ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. పూజలు నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

తిరుపతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి65వ జయంతిని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు మంగళవారం ఘనంగా జరుపుకున్నాయి. తిరుపతి తుడా సర్కిల్‌లో వైఎస్ విగ్రహానికి పార్టీ కేంద్రపాలకవర్గ సభ్యుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పూజలు నిర్వహించి, నివాళులర్పించారు. పార్టీ పట్టణశాఖ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మదనపల్లె పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్‌ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు దేశాయ్ తిప్పారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పలువురు పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై వైఎస్‌ఆర్ చిత్ర పటానికి పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. పుంగనూరులో జరిగిన జయంతి వేడుకల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, జెడ్‌పీటీసీ మాజీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ పాల్గొన్నారు. పలమనేరులో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయంలో వరుణయాగం జరిపించారు.

వర్షాలు విరివిగా కురిసి వ్యవసాయం అభివృద్ధి చెంది వైఎస్‌ఆర్ ఆశయాలు నెరవేరాలని మొక్కుకున్నారు. పేదలకు అన్నదానం చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో కార్యకర్తలు వైఎస్‌ఆర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గంగాధర నెల్లూరు నియోజవర్గంలోని పలు మండ లాల్లో జరిగిన వైఎస్‌ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.నారాయణస్వామి పాల్గొన్నారు.

ఆయన ఆధ్వర్యంలో కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో పార్టీ నాయకులు,కార్యకర్తలు వైఎస్‌ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో బి కొత్తకోట, మొలకలచెర్వు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల్లో వైఎస్‌ఆర్ జయంతి కార్యక్రమాలు జరిగాయి.

చిత్తూరు డీసీసీబీ కార్యాలయం ఆవరణలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి జంగాలపల్లి శ్రీనివాసులు, పార్టీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. వృద్ధాశ్రమంలో అనాథలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మాజీ శాసనసభ్యుడు ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనుప్పల్లెలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

 కుప్పంలో పార్టీ నియోజకవర్గ నాయకుడు చంద్రమౌళి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్  విగ్రహానికి పాలాభిషేకం చేసి, స్థానిక బధిర పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంచిపెట్టారు. అన్నదానం చేశారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూజలు చే సి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.

బంగారుపాళెం, యాదమరి, త వణంపల్లెల్లో జరిగిన వైఎస్‌ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ సునీల్ పాల్గొన్నారు. సత్యవేడులో నియోజకవర్గం ఇన్‌చార్జ్ ఆదిమూలం ఆధ్వర్యంలో కార్యకర్తలు వైఎస్‌ఆర్ చిత్రపటానికి  నివాళులు అర్పించిన అనంతరం స్వీట్లు పంచిపెట్టారు.



రాజన్నా.. నిను మరువలేమన్నా
లావేరు: మండలంలోని అదపాక గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ జయంతి సందర్బంగా మంగళవారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు. ముందుగా గ్రామంలో వైసీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మరిచారని ఆయన విమర్శించారు. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు వైసీపీ ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, రణస్థలం జెడ్పీటీసీ గొర్లె రాజగోపాల్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ రొక్కం బాలక్రిష్ణ, రణస్థలం ఎఫ్‌ఎస్‌సీఎస్ అధ్యక్షడు బొంతు సూర్యనారాయణ పాల్గొన్నారు.

 రాజన్న పాలనలోనే రాష్ట్రం సుబిక్షం : ధర్మాన ప్రసాదరావు
 అరసవల్లి: వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలోనే రాష్ట్రం ఎంతో సుబిక్షంగా ఉందని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. మంగళవారం వైఎస్సార్ జయంతి సందర్బంగా వైఎస్సార్ కూడలిలో రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు.  కార్యక్రమంలో పార్టీ నేత రెడ్డి శాంతి, వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యుడు అందవరపు సూరిబాబు, రాష్ట్ర పార్టీ మహిళా విభాగ సభ్యురాలు కామేశ్వరి, మాజీ మున్సిపల్ చైర్మన్‌లు అందవరపు వరం తదితరులు పాల్గొన్నారు.

 పేదల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు : ఎమ్మెల్యే కంబాల
 రాజాం రూరల్: పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పట్టణంలోని మాధవ బజార్ జంక్షన్‌లో వైఎస్‌ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిది : ఎమ్మెల్యే కలమట
 పాతపట్నం: ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి అందించని సువర్ణ పాలన అందించిన ఘనత ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని ఆయన లేని లోటు పూడ్చలేనిదని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. స్థానిక ఆసుపత్రి జంక్షన్ వద్ద రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.  మండల కన్వీనర్ కొండాల అర్జునుడు, పార్టీ సీనియర్ నాయకులు గంగు వాసుదేవరావు, రేగేటి షణ్ముఖరావు, ఎరుకోల వెంకటరమణ, టి భుజంగరావు,జి లుట్టిబాబు, బంకి నరసయ్య, సిర్ల ప్రభాకరరావు, కొమరాపు రాము, బెన్న నాగేశ్వరరావు, బచ్చల వసంతరావు, నల్లి లక్ష్మణరావు, కనకల కర్రెన్న, ఇప్పిలి సింహాచలం, సిర్నిల్లి గురయ్య,రోణంకి లక్ష్మీపతి, శిష్టు తారకరామారావు, కొండాల ఎరకయ్య, అమర శ్రీరాములు, డకర సన్యాసి,ఎస్ గోవిందరాజులు,ఎస్ చిన్నయ్య, తేజ, జోగారావు, పాల్గొన్నారు.

 రోగుల పళ్లు పంచిన ఎమ్మెల్యే కళావతి
 పాలకొండ: పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. పాలకొండ పట్టణం, మండలంతో పాటు వీరఘట్టం, భామిని, సీతంపేటలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలకొండ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు.



నీ కీర్తి.. సదా స్ఫూర్తి
పాలమూరు:  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకలను మంగళవారం జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పలుచోట్ల జయంతి కార్యక్రమాలు జరిగాయి. ‘వైఎస్‌ఆర్ అమర్హ్రే.. రైతుబంధువు జోహార్’ అంటూ అంజలి ఘటించారు.
 
 రైతుల కోసం నిరంతరం తపించి వ్యవసాయానికి వన్నె తెచ్చిన వైఎస్ జన్మదినాన్ని ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించాలని పలువురు నేతలు డిమాం డ్ చేశారు. నీకీర్తి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి పార్టీ జిల్లా కార్యాల యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి మెట్టుగడ్డ సమీపంలో ఉన్న అంధుల ఆశ్రమ పాఠశాల, ఏనుగొండలో ఉన్న రెడ్‌క్రాస్ అనాథ ఆశ్రమంలో విద్యార్థులకు పండ్లు పంచిపెట్టారు.  
 
 జిల్లావ్యాప్తంగా
  వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి భగవంతురెడ్డి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లో వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కల్వకుర్తిలో నగర పంచాయతీ వైస్‌చైర్మన్ షాషెద్ ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు.
  జడ్చర్లలో వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ నాయకుడు పాండునాయక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీచేశారు. అచ్చంపేట మండలంలో పార్టీ మండల కన్వీనర్ కొండూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. బొమ్మన్‌పల్లిలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
 
 అనంతరం అక్కడి లెనిటి ఫౌండేషన్ అనాథవృద్ధుల ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్డు పంపిణీచేశారు. షాద్‌నగర్‌లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బొబ్బిలి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ముఖ్య కూడలిలో ఉన్న వైఎస్ విగ్రహనికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోన దేవయ్యతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
 
  మక్తల్ పట్టణంలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి అంజలి ఘటించి..వేడుకలు జరుపుకున్నారు. నర్వ మండలంలోని నర్వ, లంకాల, జిన్నారం, కన్మనూర్, జంగంరెడ్డిపల్లి, కల్వాల, యాంకి గ్రామాల్లో జయంతి కార్యక్రమాలు జరిగాయి. నారాయణపేటలో వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జమీర్‌పాషా, పట్టణ అధ్యక్షులు యూసుఫ్‌తాజ్ ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొత్తకోట మండలం అజ్జకొల్లు గ్రామంలో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. గోపాల్‌పేట మండలకేంద్రంలో వైఎస్ అభిమానులు, వైఎస్‌ఆర్ సీపీ నేతలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
 
 కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
 మహబూబ్‌నగర్ అర్బన్: జడ్చర్లలో కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి నిత్యానందం ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గద్వాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మునిసిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి, మార్కెట్‌యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి ఇతర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 వైఎస్‌ఆర్ రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని స్థానిక మునిసిపల్ చైర్‌పర్సన్ సి.రాధాఅమర్ కొనియాడారు. వైఎస్ జయంతిని పురస్కరించుకుని ఆమె మహబూబ్‌నగర్ పట్టణంలోని స్థానిక వైఎస్‌ఆర్ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఆయన సంక్షేమ పథకాలలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని కొనియాడారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు ముత్యాలప్రకాశ్ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. ఆయన ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా జిల్లా నుంచే ప్రారంభించే వారని గుర్తుచేశారు.


నిజామాబాద్ అర్బన్:  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌భవన్‌లో డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హుందాన్, అధికార ప్రతినిధి తిరుపతిరెడ్డి వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాహెర్‌బిన్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు. విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు.

ప్రజల సమస్యల ను పరిష్కరించడంలో ముందుండేవారని, మాట ఇచ్చి మడమ తిప్పని నేత ని గుర్తు చేసుకున్నారు. జిల్లాలో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు నిరుపేదలకు ఎంతో అండగా నిలిచాయన్నారు. పార్టీ కష్టకాలంలో ఉంటే రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల, యూనివర్సిటి మంజూర్ చేసిన ఘనత ఆయనకే చెల్లుతుందన్నారు. పేదల అభ్యున్నతికి పాటుపడిన మహానీయుడు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా మరణించటం దురదృష్టకరమన్నారు.

 ఆయన మృతి పార్టీకి ఎప్పటి తీరనిలోటుగా మిగిలిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకు లు తిరుపతిరెడ్డి, రాజశేఖరరావు, భోజన్న, సుభాష్ జాదవ్, ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు, నందిపేట్, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి ఎంపీటీసీలు, వివిధ మండలాల అధ్యక్షులు, సర్పంచులు పాల్గొన్నారు.

 విద్యార్థులకు నోట్‌బుక్కులు, పలకల పంపిణీ
 వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని వైఎస్సార్‌సీపీ నాయకుడు వర్ని మండలం బడాపహాడ్‌లో స్కూల్ విద్యార్థులకు నోట్‌బుక్కులు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. వర్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలో ఆయా మండలాల్లో కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

జిల్లా కేంద్రంలో  వైఎస్‌ఆర్ వీరాభిమాని ఎజాజ్ తిరుమల టాకీస్ చౌరస్తాలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. బాల్కొండ మండలంలోని రెంజర్ల, మెండోరాలో వైఎస్సార్ అభిమానులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు జయంతి కార్యక్రమాలలో పాల్గొన్నారు. వైఎస్ చేసిన అ భివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో, దోమకొండలో. జిల్లాలోని పలు ప్రాంతాలలోనూ వైఎస్‌ఆర్ జయంతి కార్యక్రమాలు ఘ నంగా జరిగాయి.


నెల్లూరు : జిల్లాలో దివంగత ముఖ్యమం త్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకల ను మంగళవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకా లు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అన్నదానాలు నిర్వహించారు. వికలాంగులకు వస్త్రాలు పంపిణీ చేశారు. నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెం టర్‌లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జి ల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  మేరిగ మురళీధర్ ఆ ధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ జ యంతి వేడుకలను నిర్వహించారు.

 వైఎస్సార్ చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పార్టీ నేతలు బండ్లమూడి అనిత, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పాండురంగారెడ్డి, చంద్రమౌళి పా ల్గొన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ నాయకత్వంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ గాంధీబొమ్మసెంటర్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి ముక్కాల  పూ ల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్‌చేసి స్వీట్లు పంచారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి స్థానికులకు పంచి పెట్టారు.
 
 కార్యక్రమంలో విద్యార్థి నేతలు జయవర్ధన్, శ్రావణ్  పాల్గొన్నారు. కోవూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరి గాయి. ఆత్మకూరు, చేజర్ల మండలాల్లో పార్టీ నేత లు జయంతి వేడుకలు నిర్వహించారు. కావలిలో వైఎస్సార్ విగ్రహాలకు కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలతో నివాళులర్పించారు. కావలిలో వైఎస్సార్‌సీపీ నేతలు వికలాంగులకు దుస్తులు పంపిణీ చేశారు. గూడూరు టవర్ క్లాక్ వద్ద వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
 సర్వేపల్లిలో వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహిం చారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీ వయ్య వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్నా రు. పార్టీ నేతలు దబ్బల రాజారెడ్డి, సత్యనారాయణరెడ్డి, బాలాచంద్రారెడ్డి పాల్గొన్నారు. తడలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వెంకటగిరిలో స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు అనాథాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.  అన్నదానం చేశారు. తొలుత వైఎస్సార్ విగ్రహాని కి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఉదయగిరి, దుత్తలూరుతో పాటు అన్ని మండలాల్లో వైఎ స్సార్ విగ్రహాలకు పాలాభిషేకం, పూలమాలల తో అభిమానులు నివాళులర్పించారు.

రీషెడ్యూలు చేయడం వల్ల రైతుల రుణాలు వారి పేరుతోనే ఉంటాయి!

రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ సూత్రప్రాయంగాఅంగీకరించింది: ఏపీ ఆర్థిక మంత్రి యనమల
రీషెడ్యూల్ ఎన్నేళ్లు, ఎవరికి వర్తిస్తుంది, ఎవరు కట్టాలి, ఎలా కట్టాలో తర్వాత ఆలోచిస్తారట!


హైదరాబాద్: వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. దాన్నిప్పుడు అటకెక్కించినట్టే కన్పిస్తోంది. మాఫీ సంగతి పక్కనపెట్టి రుణాల రీషెడ్యూల్‌మీదే దృష్టి సారిస్తోంది. పైగా దీన్నే పెద్ద ఘనతగా చూపుకునే ప్రయత్నం చేస్తోంది. నిజానికి రీషెడ్యూలు చేయడం వల్ల రైతుల రుణాలు వారి పేరుతోనే ఉంటాయి. పైగా వడ్డీ భారీగా పెరిగి తడిసి మోపెడవుతుంది. వ్యవసాయ రుణాల రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ గవర్నర్ సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ మేరకు ఒకటీ రెండు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నెల పూర్తయిన సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రీషెడ్యూల్ ఐదేళ్లా, ఏడేళ్లా, విధివిధానాలేమిటి వంటివి ఉత్తర్వుల్లో స్పష్టమవుతాయన్నారు. రీషెడ్యూల్ ఎంతమందికి వర్తిస్తుందో విధివిధానాలు వచ్చాకే చెప్తామన్నారు. రుణ మాఫీ ఎప్పుడంటే మాత్రం స్పష్టతనివ్వలేకపోయారు. ‘‘ప్రస్తుతానికి రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ అంగీకరించింది. రీషెడ్యూల్ అవడం వల్ల రైతులకు ఈ ఖరీఫ్‌కు కొత్త రుణాలు అందుకునే అవకాశం దొరుకుతుంది. రుణమాఫీనా, రీషెడ్యూలా, ఏదైతేనేం.. రైతుల కోసం మేం అన్నిరకాలుగా ఆలోచిస్తున్నాం. తరవాత రుణ బకాయిలు ఎవరు కట్టాలో ఎలా కట్టాలో ఆలోచిస్తాం. రైతులపై మాత్రం భారం పడనీయం’’ అని చెప్పుకొచ్చారు. కౌలు రైతులకు రుణాల రీషెడ్యూల్ వర్తిస్తుందా? లేదా? కరువు, తుపాను ప్రభావిత మండలాల జాబితాలో లేని 86 మండలాలకూ రీషెడ్యూల్ వర్తిస్తుందా అని విలేకరులు ప్రశ్నించగా, ఆర్‌బీఐ రెండు రోజుల్లో విధివిధానాలు పంపిస్తుందని, దాని ప్రకారం ఎవరికి ఎలా వర్తింపచేయాలో చెప్తామని దాటవేశారు.
 
రైతుపై మరింత భారం రీషెడ్యూల్ యోచనపై బ్యాంకర్లు

హైదరాబాద్: రైతుల రుణ మాఫీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల బ్యాంకర్లు మండిపడుతున్నారు. ఎప్పటివరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారో చెప్పకుండా నాన్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫలానా తేదీవరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని, ఇప్పటికే రుణాలు కట్టిన వారుంటే వాటికి కూడా మాఫీ వర్తింపజేస్తామని జీవో జారీ చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఇలా జీవో జారీ చేస్తే రైతులు చాలా మంది రుణాలను చెల్లించి, కొత్తవి తీసుకుంటారని, తరువాత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆ మొత్తాన్ని చెల్లించవచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి 31లోగానో, లేదా మరో తేదీ వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పకపోవడం వల్ల రైతులు గందరగోళానికి గురవుతున్నారని అభిప్రాయపడుతున్నారు. రుణాల రీషెడ్యూల్ వల్ల రైతులపై 12 శాతం మేరకు వడ్డీ భారం పడుతుంది తప్ప, వారికి ఊరట లభించదనే బ్యాంకర్లు అంటున్నారు.

Popular Posts

Topics :