25 May 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నేతగా మేకపాటి

Written By news on Saturday, May 31, 2014 | 5/31/2014

వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నేతగా మేకపాటిమేకపాటి రాజమోహన రెడ్డి- కొత్తపల్లి గీత
హైదరాబాద్: వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నేతగా మేకపాటి రాజమోహన రెడ్డి ఎన్నికయ్యారు. పార్లమెంటరీ పార్టీ ఉపనేతగా కొత్తపల్లి గీత, సెక్రటరీగా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి,  ట్రెజరర్‌గా బుట్టా రేణుక  ఎంపికయ్యారు.   పార్లమెంటరీ పార్టీ విప్‌గా వైవీ సుబ్బారెడ్డి, కో ఆర్డినేటర్‌గా మిథున్‌ రెడ్డిని ఎంపిక చేశారు. పార్లమెంటరీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా  వరప్రసాద్‌, అవినాష్‌ రెడ్డి, మిథున్‌రెడ్డిలను నియమించారు.

 వైఎస్‌ఆర్‌ సీపీ తెలంగాణ శాసనసభాపక్ష నేతగా అశ్వారావుపేట శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లు, శాసనసభాపక్ష ఉపనేతగా పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, విప్‌గా వైరా శాసనసభ్యుడు బానోత్‌ మదన్‌లాల్‌ ఎంపికయ్యారు.

పార్లమెంటరీ పార్టీ నేత ఎంపిక వైఎస్ జగన్ దే!

 వైఎస్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ సమావేశం లోటస్ పాండ్ లో ముగిసింది. పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకునే అధికారాన్ని వైఎస్‌   జగన్‌మోహన్ రెడ్డికి అప్పగిస్తూ ఎంపీలు శనివారమిక్కడ ఏకగ్రీవ తీర్మానం చేశారు. పార్లమెంట్‌లో రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం అంశాలవారీగా ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని మేకపాటి రాజమోహన్‌ రెడ్డి చెప్పారు. ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగితే వ్యతిరేకిస్తామన్నారు.

పార్టీ ఎంపీలంతా సముచిత రీతిలో స్పందించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతామని మేకపాటి స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలంతా తప్పకుండా హాజరు కావాలని జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణలో వైఎస్ ఆర్ సీపీ నిర్మాణాత్మక పాత్ర

తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ఆపార్టీ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీలోని బలోపేతం చేస్తామని ఆయన శనివారమిక్కడ తెలిపారు.
లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సమావేశం అనంతరం పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాము వైఎస్ జగన్ నేతృత్వంలో పని చేస్తామని, పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు

విదేశాల్లో ఉన్నందువల్లే సమీక్షకు గైర్హాజరు

విదేశాల్లో ఉన్నందువల్లే సమీక్షకు గైర్హాజరు
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్

అద్దంకి : తాను విదేశాల్లో ఉన్నందువల్లే ఒంగోలులో గురువారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ జిల్లాస్థాయి సమీక్ష సమావేశానికి హాజరుకాలేకపోయానని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్‌లో మాట్లాడారు. ‘నేను కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లాను. సమావేశాలు జరిగే విషయం ముందుగా తెలియకపోవడం వల్ల రాలేకపోయానే తప్ప మరే కారణం లేదు. ఆ విషయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేశా.

నేను సమావేశానికి రాని విషయాన్ని సాకుగా చూపి..ఎందుకు రాలేదు? వేరే పార్టీకి వెళతారా అంటూ కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. అటువంటి అసత్య ప్రచారాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్మవద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా.. బలమైన ప్రతిపక్షంగా ఉండి పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సార థ్యంలో ప్రజల సమస్యలపై పోరాడతాం. మళ్లీ ప్రజల మన్ననలు పొంది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయం’ అని చెప్పారు.  
 

ఫలితాలపై 4 నుంచి జగన్ సమీక్షలు

ఫలితాలపై 4 నుంచి జగన్ సమీక్షలు
హైదరాబాద్:  సాధారణ ఎన్నికల ఫలితాలను సమీక్షించడంతో పాటు పార్టీ నేతలు, శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 4 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ ఫలితాలను సమీక్షించడంతో పాటు పార్టీని బలోపేతం చేయడానికి మార్గనిర్ధేశం చేయనున్నారు. నియోజవర్గాలవారీగా ఏర్పాటు చేసే ఈ సమీక్షా సమావేశాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అక్కడి జెడ్పీటీసీ అభ్యర్థులు, మండల పార్టీ కన్వీనర్లతో పాటు నియోజకవర్గంలో 10 నుంచి 15 మంది ముఖ్య నేతలు పాల్గొంటారని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సమీక్షా సమావేశాల వివరాలను వెల్లడించారు. ఈ సమావేశాల అనంతరం భవిష్యత్తు కార్యాచరణతో, నేతల్లో ఆత్మస్థయిర్యం నింపి మరింత ఉత్సాహంగా పనిచేయించడమే లక్ష్యంగా జగన్ జిల్లాల్లో పర్యటిస్తారు.

మొదటగా జూన్ 4, 5, 6 తేదీల్లో రాజమండ్రిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గాలపై జగన్ సమీక్షిస్తారని మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి చెప్పారు. ‘9, 10 తేదీల్లో  కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సమీక్షా ఒంగోలులో ఉంటుంది. 11, 12ల్లో అనంతపురంలో రాయలసీమ జిల్లాల సమీక్షలు ఉంటాయన్నారు. శనివారం తెలంగాణ ప్రాంత పార్టీ ఎమ్మెల్యేల సమావేశంతో పాటు పార్టీ లోక్‌సభ సభ్యుల సమావేశం హైదరాబాద్‌లో వేరువేరుగా జరుగుతాయని అన్నారు. ఎంపీల సమావేశంలో పార్టీ పార్లమెంటరీ నాయకుడి ఎంపిక జరుగుతుందని తెలిపారు. లోక్‌సభ మొదటి విడత సమావేశాల్లో పార్టీ ఎలాంటి అంశాలను ప్రస్తావించాలన్న దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.

ఎస్పీవై రెడ్డికి నోటీసులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నంద్యాల నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలిచి తరువాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎస్పీవై రెడ్డికి నోటీసు ఇవ్వనున్నట్టు మైసూరారెడ్డి చెప్పారు. నిర్ణీత సమయంలోనే ఆయనకు నోటీసు ఇస్తామన్నారు. కొన్ని పత్రికలు, మీడియా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు పార్టీని వీడతారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, అది తప్పుడు ప్రచారమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

బాబుపై అభిమానం ఉంటే పేజీలు పేజీలు రాసుకోండి

Written By news on Friday, May 30, 2014 | 5/30/2014

'బాబుపై అభిమానం ఉంటే పేజీలు పేజీలు రాసుకోండి'
మాచర్ల : చంద్రబాబు నాయుడు మీద అభిమానం ఉంటే రోజూ పేజీలు పేజీలు రాసుకోండి అంతేకాని లేనిపోని అవాస్తవాలను రాసి ఎల్లో జర్నలిజం ద్వారా ప్రజలను మభ్యపెట్టవద్దని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఎల్లో మీడియాకు సంబంధించిన ఓ పత్రికలో తాను టీడీపీలో చేరుతున్నట్లు ఊహాగానాలతో వార్త ప్రచురించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎవరితో ఎప్పుడూ చర్చలు జరపలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో బలమైన ప్రతిపక్షాన్ని... బలహీనపరిచేందుకు వైఎస్ కుటుంబానికి అండగా ఉండే తనలాంటి వారిపై తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైండ్ గేమ్ ప్రారంభించిందని  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అందుబలో భాగంగా నీచ రాజకీయాలకు పాల్పడుతూ బేరసారాలను కొనసాగిస్తోందన్నారు. ఎవరూ టీడీపీ బేరసారాల గురించి పట్టించుకోకపోవడంతో ఏదో ఒకవిధంగా బురద జల్లి ఎమ్మెల్యేలు అధికంగా టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం చేయడంలో భాగంగా వైఎస్ కుటుంబం అండదండలతో మూడుసార్లు గెలుపొందిన తాను పార్టీ మారుతున్నానని విస్తృతంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీలోకి వెళ్లే అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. నిరాధార కథనాలను రాస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.

మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో విప్ జారీ అధికారం

వైఎస్సార్ సీపీకి రాష్ట్ర ఈసీ ‘గుర్తింపు’
 రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ
*  మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో విప్ జారీ అధికారం


 సాక్షి, హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కూడా లభించింది. ఇప్పటి వరకూ రిజిస్టర్‌‌డ పార్టీగానే పరిగణిస్తూ వచ్చిన ఈ పార్టీని ఇకపై గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ గుర్తింపు పొందిన పార్టీ కాదని, ఆ పార్టీకి స్థానిక సంస్థ ల పాలకవర్గాల ఎన్నికల్లో ‘విప్’ జారీ చేసే అధికారం లేదంటూ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారానికి దీంతో తెరపడింది.

కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే వైఎస్సార్ సీపీని గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా పరిగణిస్తూ ఆదేశాలిచ్చినందున, ఆ నిర్ణయాన్ని అనుసరించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అదే విధమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో శాసనసభ, కేంద్రంలో లోక్‌సభ కొలువుదీరిన అనంతరం జరగబోయే మండల, జిల్లా పరిషత్  అధ్యక్ష పదవులు, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ పదవులకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీ సభ్యులకు ఫలానా వారికి ఓటు చేయాలని ‘విప్’ (ఆదేశాలు) జారీ చేసే అధికారం వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఇపుడు లభించింది.

స్థానిక సంస్థల చట్టాలను పరిశీలించి నిర్ణయం..
కేంద్ర ఎన్నికల కమిషన్ తమకు గుర్తింపు ఇచ్చిన విషయాన్ని తెలియజేస్తూ వైఎస్సార్‌సీపీ సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఈ నెల 27న తమకు ఒక లేఖను సమర్పించారని, దానిలోని అంశాలను పరిశీలించి తాము ఈ గుర్తింపునిస్తున్నామని రాష్ట్ర కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం-1994, జీహెచ్‌ఎంసీ చట్టం- 1955, ఏపీ మున్సిపాలిటీల చట్టం-1965 ప్రకారం, 1968లో జారీ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ చిహ్నా ల కేటాయింపు ఆదేశాల ప్రకారం వైఎస్సార్‌సీపీ అన్ని రకాల అర్హతలను పూర్తి చేసినందున గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ హోదా ఇవ్వడంతో పాటు ‘సీలింగ్ ఫ్యాన్’ చిహ్నాన్ని కేటాయిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది

టీడీపీ దాడులను సహించేది లేదు: అంబటి

టీడీపీ దాడులను సహించేది లేదు: అంబటి
నెల్లూరు: వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులను సహించబోమని అంబటి హెచ్చరించారు. 
 
నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల సమావేశంలో అంబటి పాల్గొన్నారు. సమావేశమనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత వైఎస్సార్పీపీ కార్యకర్తలపై ప్రతీకార దాడులు చేస్తోంది అని అన్నారు. 
 
టీడీపీ దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. టీడీపీ దాడులను ఖండించి.. బాధితుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాలవారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చలు జరిపారు. 

వైఎస్ఆర్ సిపికి విప్ జారీ చేసే అధికారం

Written By news on Thursday, May 29, 2014 | 5/29/2014

వైఎస్ఆర్ సిపికి విప్ జారీ చేసే అధికారంవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: మునిసిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేసే అధికారం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్ఆర్ సిపికి గుర్తింపు ఇచ్చిన నేపధ్యంలో ఈ  గుర్తింపు తక్షణమే అమలులోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

వైఎస్ఆర్ సిపికి కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితమే గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లభించే అన్ని అర్హతలు ఆ పార్టీకి లభించాయి. మునిసిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకునేసమయంలో ఈ పార్టీకి విప్ జారీ చేసే అధికారం కూడా లభించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

హసన్ వాంగ్మూలంపై విచారణ జరిపించాలి

హసన్ వాంగ్మూలంపై విచారణ జరిపించాలి
నల్లధనంపై విచారణ బాబుతోనే ప్రారంభించాలి  ఎన్‌డీఏ సర్కారుకు వైఎస్సార్ సీపీ డిమాండ్
 
హైదరాబాద్:రాష్ట్రానికి చెందిన ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని విదేశాలకు తరలించానని గుర్రాల వ్యాపారి హసన్ అలీ గతంలో సీబీఐకి ఇచ్చిన వాగ్మూలంపై ఎన్‌డ్‌ఏ ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశం సరిహద్దులు దాటి వెళ్లిన నల్లధనాన్ని వెనక్కి తెప్పించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవటం పట్ల తమ పార్టీ హర్షం వ్యక్తంచేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. 1995 - 2005 మధ్య కాలంలో ఓ మాజీ ముఖ్యమంత్రికి చెందిన నల్ల డబ్బును తాను విదేశాలకు చేరవేశానని హసన్ అలీ సీబీఐకి చెప్పినట్లు వార్తలు వచ్చాయని.. ఆ మాజీ ముఖ్యమంత్రి జీవించే ఉన్నారని కూడా అతడు తన వాంగ్మూలంలో పేర్కొన్నారని ఆమె గుర్తుచేశారు. హసన్‌అలీ సీబీఐ దర్యాప్తు సందర్భంగా ఇచ్చినట్టు చెపుతున్న ఈ వాంగ్మూలం మీద ఎన్‌డీఏ ప్రభుత్వం తొలి విచారణ చేపట్టాలన్నారు. హసన్ అలీ చెప్పిన దానిని బట్టి.. సదరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని తెలిసిపోతోందని, అందువల్ల విచారణ జరిపిస్తే అన్ని విషయాలూ వెల్లడవుతాయని పద్మ పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్‌డీఏలో భాగస్వామి కనుక బీజేపీ ప్రభుత్వం విచారణ జరుపకుండా ఉపేక్షిస్తుందా? హసన్ అలీ చెప్పిన విషయాలను మరుగు పరుస్తోందా? అనే  అంశాలను బట్టి వారి నిష్పాక్షికత బయటపడుతుందని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం తన నిష్పాక్షికతను రుజువు చేసుకోవడానికి చంద్రబాబుపై విచారణ జరిపించి తీరాలని ఆమె డిమాండ్ చేశారు.

 రూ. 12 వేల కోట్లు ఎలా వచ్చాయి?

ఇప్పుడు మహానాడులో నీతి సూత్రాలు వల్లిస్తున్న చంద్రబాబు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. నియోజకవర్గానికి పది కోట్ల రూపాయల చొప్పున రూ. 3,000 కోట్లు, లోక్‌సభ నియోజకవర్గాల్లో దాదాపు అంతకు మూడు రెట్లు- అంటే రూ. 9000 కోట్లు ఖర్చు చేశారని వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఇన్ని నిధులు బాబుకు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు తన కొడుక్కి నేర్పిన సంస్కారం ఇదేనా!

టీడీపీ అట్టహాసంగా జరుపుకుంటున్న మహానాడులో మరణించిన మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, మృతి చెందిన వ్యక్తిని తూలనాడరాదన్న కనీస విచక్షణ కూడా కోల్పోయి మాట్లాడారని ఆమె విమర్శించారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ విదేశీ చదువు కోసం ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలను ముంచి ఉండొచ్చు కానీ వైఎస్ ఏనాడూ అలా ఆలోచించలేదని ఆమె పేర్కొన్నారు. వైఎస్ తన కుమారుడు జగన్ ఏ విధంగా అయితే ఎంబీఏ చదువుకున్నారో అదే విధంగా రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని అందరికీ ఫీజులు ప్రభుత్వమే కట్టేలా చేశారని ఆమె గుర్తుచేశారు. జగన్ తన ప్రసంగాల్లో చంద్రబాబు గారూ.. అనే సంబోధించారని, సంస్కారం తప్పి మాట్లాడలేదని, అది వైఎస్ తన కుమారుడికి నేర్పిన సభ్యత సంస్కారాలని ఆమె చెప్పారు. అదే మహానాడులో లోకేష్ వైఎస్, జగన్ గురించి మాట్లాడిన తీరు చూస్తే అది ఏ తరహా సభ్యతో, ఏం సంస్కారమో.. ఇదేనా చంద్రబాబు తన కుమారునికి నేర్పింది అని ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.

జగన్ వెంటే నడుస్తా: ఎమ్మెల్యే ముస్తఫా

తాను జీవితాంతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తానని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా స్పష్టం చేశారు. పదవుల కోసం కక్కుర్తిపడి అడ్డగోలుగా నడిచే నైజం తనది కాదన్నారు. తొలినుంచి నిజాయితీగా రాజకీయంగా ఎదిగానన్నారు. గుంటూరులో బుధవారం విలేకరుల సమావేశంలో ముస్తాఫా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి వెళుతునట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

ఎటువంటి నిర్ధారణ లేకుండా పలు మీడియాల్లో వస్తున్న కథనాలు ఏమాత్రం సబబు కాదన్నారు. రాజకీయంగా తన ఎదుగుదలకు బాసటగా నిలిచిన వైఎస్ జగన్ రుణాన్ని తీర్చుకుంటానని స్పష్టం చేశారు. కొన్ని పార్టీల నేతలు తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పలువురు టీడీపీ నేతలు సైతం లేనిపోని వ్యాఖ్యలు చేయటం అర్థరహితమన్నారు.
 
ఎంపీని మర్యాదపూర్వకంగానే కలిశాను..
గతంలో ఉన్న రాజకీయ పరిచయంతోనే తాను తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశానని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఎమ్మెల్యే సమాధానమిచ్చారు. ఇందులో ఎలాంటి దురుద్దేశమూ లేదన్నారు. అలా కలిసినంత మాత్రాన లేనిపోని పెడార్థాలు తీయడం ఎంతవరకు సబబని ముస్తఫా ప్రశ్నించారు.

రక్త చరిత్ర మీది కాదా చంద్రబాబు?

Written By news on Tuesday, May 27, 2014 | 5/27/2014

రక్త చరిత్ర మీది కాదా చంద్రబాబు?
హైదరాబాద్:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. చంద్రబాబు ఒక విషసర్పం లాంటివాడని విమర్శించారు. ఈ రోజు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గట్టు మాట్లాడుతూ.. హత్యా రాజకీయాలను ప్రోత్సహించింది మీరు కాదా?అంటూ బాబును నిలదీశారు. ఆయన రక్తచరిత్ర ఉన్న వ్యక్తి అని గట్టు ఎద్దేవా చేశారు. ఆనాడు ఎన్టీఆర్ చివరి ప్రసంగాన్ని మరోసారి మహానాడు వేదికపై ప్రసారం చేయగలవా? అంటూ ప్రశ్నించారు.
 
టీడీపీ మహానాడు అనేది 'సొంతడబ్బా-పరనిందలా' కనిపిస్తోందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ కార్యకర్తలను చంపుతున్నది వాస్తవం కాదా?అని గట్టు నిలదీశారు. ఎన్నికల హామీలను నెరవేర్చేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగుతా : బుట్టా రేణుక

వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగుతా : బుట్టా రేణుక
వీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ : తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. ఆమె మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ మారే ఉద్దేశ్యం లేదని, తాను వైఎస్ఆర్ సీపీలోనే ఉన్నానని తెలిపారు. కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు బుట్టా రేణుక పేర్కొన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే బాబును కలిసినట్లు చెప్పారు.

రాజకీయంగా తనకు ఎలాంటి అనుభవం లేనందువల్లనే కొంత గందరగోళానికి గురైన మాట వాస్తవమని బుట్టా రేణుక అంగీకరించారు. అందువల్లే ఇటువంటి పరిణామాలు జరిగాయని ఆమె తెలిపారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని బుట్టా రేణుక తెలిపారు. ఈ ఎపిసోడ్ కు ఇంతటితో ముగింపు పలుకుతున్నట్లు ఆమె చెప్పారు. భవిష్యత్ లో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాదని బుట్టా రేణుక తెలిపారు.

ఆది నుంచీ అదే మోసం..!

ఆది నుంచీ అదే మోసం..!
* నాటి మద్య నిషేధం నుంచి నేటి రైతు రుణమాఫీ వరకూ ఈనాడు తీరిదే..
ఎన్నికలకు ముందు ఒకలా.... తర్వాత మరోలా...
బాబుకు దన్నుగా కథలు.. కథనాలు

 
 నాడు: ‘‘రైతుల రుణాలు మాఫీ చేసి చూపిస్తా. 30 ఏళ్ల అనుభవంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తా.. సీమాంధ్రని స్వర్ణాంధ్రగా చేస్తా’’
 - ఏప్రిల్ 1న మేనిఫెస్టో విడుదల సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు ఘనంగా చెప్పిన మాటలివి...
 
 నేడు:  ‘‘పాదయాత్ర సమయంలో ప్రజల బాధలు చూసి రైతు రుణమాఫీ హామీ ఇచ్చా. అపుడు రాష్ర్తం సమైక్యంగా ఉంది. ఇపుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో.. ఎంత బడ్జెట్ ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి’’
 - మే 17న ఈనాడు ఇంటర్వ్యూలో చంద్రబాబు
 
నచ్చినవారిని ఆకాశానికెత్తడం, అనుకూల కథనాలు వండివార్చడం, అందరూ వాటిని నమ్మితీరాలన్నట్లు పదేపదే వల్లెవేయడం ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. అలాగే శత్రువులుగా తాను భావించినవారిపై కత్తిగట్టి నిజానిజాలతో నిమిత్తం లేని అసత్యాల శరసంధానంలోనూ ఆయన సిద్దహస్తుడే.  మూడున్నర దశాబ్దాలకు పైగా ఆయన చేస్తున్న అక్షరయజ్ఞం ఇదేనన్నది సగటు పాఠకులందరికీ తెలుసు. సమయానుకూలంగా పాలసీలను మార్చేసుకోవడం, దండలో దారంలా పైకి కనబడనీయకుండా వాటిని పాఠకులపై రుద్దడంలో రామోజీరావు నేర్పు మరెవరికీ సాధ్యంకాదు. ఎన్నికల ముంగిట రంగుల హంగులతో ప్రచురించిన ప్రత్యేక సంచికలో పనిగట్టుకుని మరీ ప్రత్యర్దులపై బురదజల్లిన రామోజీరావు తన సయామీ కవల చంద్రబాబు గురించి, ఆయనిచ్చిన హామీల గురించి మాత్రం పుంఖానుపుంఖాలుగా ప్రత్యేక కథనాలు వండివార్చారు.
 
 తనకు ససేమిరా నచ్చని జగన్‌మోహనరెడ్డిపై అభూతకల్పనల కథనాలకు, చివరకు ఆయన వ్యక్తిత్వ హననానికి కూడా దిగజారారు. సంపాదకీయాలలో దుర్బాషలాడారు. మరి ఇప్పుడేం జరుగుతోంది. చరిత్ర పునరావృత మవుతోంది. రామోజీ అసామాన్యులు.... ఒకప్పుడు ఆయన మద్యనిషేధం కోసం ఉద్యమించారు... అంతేనా? మద్యనిషేధాన్ని చంద్రబాబు ఎత్తేయడం ఎంత సబబో చెప్పారు కూడా.. రైతు రుణమాఫీ వంటివి చంద్రబాబు వల్లనే సాధ్యమని వందల కథనాలు వండివార్చారు...  ఇపుడు అదే రైతు రుణమాఫీ హామీ అమలు ఎంత అసాధ్యమో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.. అదీ రామోజీ అసలు రూపం. అటు చంద్రబాబు, ఇటు రామోజీ నమ్మిన జనాలను ఎలా వంచిస్తారో తెలిపే కథనమే ఇది...
 
 రుణమాఫీ నుంచి ఏమార్చే ప్రయత్నాలు
 రైతు రుణమాఫీ గురించి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని రామోజీరావు ఆకాశానికెత్తడం అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూలలోనూ ఇదే ప్రధానాంశం. ‘రుణమాఫీ అమలుచేసి చూపిస్తా’ అంటూ చంద్రబాబు నొక్కి చెప్పిన విషయాలను తాటికాయంత అక్షరాలతో రామోజీ అచ్చేశారు. అదేకాదు జిల్లాల టాబ్లాయిడ్‌లలోనూ పేజీలకు పేజీలు ప్రత్యేక కథనాలు వండివార్చారు. రుణమాఫీ అమలయితే 60 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది అంటూ ఆ 60 లక్షల కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేయబోతున్నారంటూ కథనాలు ప్రచురించారు. రుణమాఫీ అమలైతే అమృత వర్షమే అంటూ ఫుల్‌పేజీ కథనాలు వండివార్చారు. ఆకాశాన్నంటే స్థాయిలో రామోజీ నాయకత్వంలోని ఎల్లో మీడియా చేసిన ప్రచారం వల్లో, నిజంగా రైతులు నమ్మారో గానీ అనుకున్న లక్ష్యం నెరవేరింది. నాడు అలా అచ్చేసిన రామోజీ నేడు చేయాల్సిందేమిటి? చంద్రబాబు ఇచ్చిన హామీలలో అత్యంత కీలకమైనదీ.. రైతాంగమంతా ఎదురుచూస్తున్నదీ... రుణమాఫీ గురించే కాబట్టి దాని అమలు కోసం పోరాడాలి.
 
  క్షణం కూడా ఆలస్యం చేయకుండా రుణమాఫీని అమలు చేసి రైతుల కళ్లల్లో కాంతులు చూడాల్సిందిగా చంద్రబాబును కోరాలి. కానీ దీనిపై రామోజీరావు తీరువేరుకదా... అందుకే ఆయన ఈనాడులో కొత్త కథనాలు మొదలుపెట్టారు. రుణమాఫీ అమలు ఎంత అసాధ్యమో చెప్పేందుకు అనువైన కథనాలు సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు రుణమాఫీ ఎలాగూ చేయడు కాబట్టి ఆయనపై జనానికి ఎలాంటి ఆగ్రహం కలగకుండా ఉండేందుకు వీలుగా కొత్త కథలు మొదలుపెట్టారు. ‘తొలి అడుగే భారం’, ‘10వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో ఏపీ కార్యకలాపాలు మొదలు’ అంటూ అచ్చేసిన కథనం ఈ కోవలోనిదే. రైతులను ఏమార్చడానికి, బాబును కాపాడడానికి రామోజీ ఎలాంటి ఎత్తులు వేస్తారో తెలుసుకునేందుకు ఇదే నిదర్శనం. అలవిమాలిన హామీ లిచ్చిన చంద్రబాబును  గండం నుంచి గట్టెక్కించేందుకు రామోజీ  చేస్తున్న ప్రయత్నాలకు అంతేలేదు.
 
 తొలి అడుగులు ఇబ్బందే అని ఒకరోజు, బాబు ముందు ఎన్నో ఇబ్బందులున్నాయని మరో రోజు కథనాలు వండివార్చారు.  గెలిచిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ రుణమాఫీపై ఎన్నో పిల్లిమొగ్గలు కనిపించాయి. దశలవారీగా అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామంటూ ఆయన లొల్లాయి కబుర్లుచెప్పారు. అంతేకాదు అపుడు ఉమ్మడి రాష్ర్టం ఉంది.. ఇపుడు రాష్ర్టం విడిపోయింది గనుక నేను నట్లు బోల్టుల దగ్గర్నుంచి అన్నీ వెతుక్కోవాలి అంటూ ఏవేవో కబుర్లు చెబుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో, బడ్జెట్ ఎంతో ఎవరికీ తెలియదు అనేంత వరకు బాబుగారు వెళ్లారు. ఎన్నికలకు ముందు నోటికొచ్చినట్లల్లా వాగ్దానాల వర్షం కురిపించిన చంద్రబాబు ఇపుడు నీళ్లునములుతుండడానికి కారణమేమిటి? అపుడు ఇష్టం వచ్చినట్టల్లా హామీల వర్షం కురిపించి ఇపుడు సాకులు వెతుక్కోవడమేమిటి? ఒకవైపు అదను సమీపిస్తున్నది.రైతులు ఖరీఫ్ కోసం సమాయత్త మవుతున్నారు. బాబుగారిని నమ్ముకుని రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు కొత్తరుణాలివ్వడానికి ససేమిరా అంటున్నాయి. భవిష్యత్తుపై ఆందోళనతో అన్నదాతలు దిక్కుతోచనిస్థితిలో అల్లాడుతుంటే అధికారపార్టీ అధినేత మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. తాను చేయదలుచుకున్నదేమిటో చెప్పకుండా రైతుల్లో ఆందోళనను ఇంకా పెంచుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి జరుగుతున్న జాప్యంపైనా ఎల్లోమీడియాలో అనుకూల కథనాలు ఎన్నోవస్తున్నాయి. రుణమాఫీపై ఆలోచన చేస్తున్నారని, అది తేలేవరకు ప్రమాణస్వీకారం చేయకూడదని తీర్మానించుకున్నారని ప్రచారం మొదలుపెట్టేశారు. ఎల్లో మీడియాలోని మరో తోకరాయుడు ఇప్పటికే జోలెపట్టి విరాళాలు సేకరిస్తూ, రాష్ర్టం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో తెలియజేస్తూ, జనాలను కన్నీటి పర్యంతం చేస్తూ తనవంతు ప్రయత్నం తానూ చేస్తున్నాడు. ఇలాంటి విపత్కర స్థితిలో రాష్ర్టం ఉంటే... ఆయ నే అడుక్కునే పొజిషన్లో ఉంటే ఇక మనమేం అడుగుతాంలే అని అమాయక రైతులు అన్నీ వదిలేసి తమ బాధలేవో తాము పడతారన్నది వీరి దూ(దు)రాలోచన. ఎలాగూ బాబు తానిచ్చిన హామీలను నెరవేర్చలేరు గనుక అనేకానేక సమస్యలే అందుకు కారణమంటూ రైతుల దృష్టిమరల్చడానికి ఎల్లోమీడియా పడరానిపాట్లు పడుతున్నది.
 
 మద్యనిషేధానికి ముందూ.. తర్వాతా..
 కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉండగా మధిరాసుర మర్ధన చేయండంటూ ఈనాడు దినపత్రికలో నిత్యం ఓ కార్యక్రమంలా ప్రత్యేక పేజీలు ముద్రించి రామోజీ స్వయంగా ఉద్యమానికి అక్షరసారధ్యం వహించారు. అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రామోజీ మద్యనిషేధ ఉద్యమం కొండెక్కింది. పనిగట్టుకుని మరీ చేసిన మద్యనిషేధ ప్రచారాన్ని రామోజీ వదిలేశారు. పోటీ పత్రిక ‘ఉదయం’ ఆర్థిక మూలాలు లిక్కర్ ద్వారా సంపాదించిన సొమ్ములో ఉన్నాయి కాబట్టి వాటిని చిదిమేయడమే లక్ష్యంగా మద్యనిషేధానికి నాడు రామోజీ ఊతమిచ్చారు. పనిలోపనిగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పైనా వ్యతిరేకతను ఎగదోయడం అందులో భాగం. డజన్లకొద్దీ సంపాదకీయాలు, నిరంతరం కార్టూన్లతో ఉద్యమం నడిపిన రామోజీరావు ఒక్కసారిగా అన్నీ ఆపేశారు. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత మద్యం ముడుపుల మత్తులో చంద్రబాబు, తన హోటళ్ల వ్యాపార అవసరాల కోసం ‘ఈనాడు’ రామోజీ కలసికట్టుగా మద్యనిషేధానికి తూట్లు పొడిచారు.
 
  సజావుగా సాగని నిషేధం అవసరమా అనే సన్నాయి నొక్కులతో సంపాదకీయాలు... కల్తీ కల్లుతో జనారోగ్యం కుదేలవు తోందంటూ పతాక శీర్షికల్లో బూటకపు వార్తలు... ఇలా నెలల తరబడి ఈనాడులో వ్యూహాత్మక కథనాల ద్వారా రామోజీ రంగం సిద్ధం చేశారు. బాబు కూడా తనవంతుగా మద్యనిషేధం కారణంగా ఖజానా బక్కచిక్కిపోతున్నదంటూ మొసలికన్నీళ్లతో ఆ నాటకాన్ని రక్తి కట్టించారు. అలా అంతా కలసి నెలలతరబడి నాటకం నడిపిన తర్వాత మద్యనిషేధాన్ని బాబు అటకెక్కించారు. అంతేకాదు ఏకంగా మద్యప్రవాహానికి గేట్లెత్తేశారు.  ఆ తర్వాత బెల్టుషాపులతో చంద్రబాబు ఊరూరా మద్యం ఏరులుగా పారించినా రామోజీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఒకేదెబ్బకు రెండుపిట్టలు అన్న చందాన అటు ప్రత్యర్థిని మట్టికరిపించిన రామోజీ ఆనక నమ్మినబంటుకు అలా మేలు చేశారన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా మద్యనిషేధ ఉద్యమం కోసం ఈనాడులో రోజూ రెండు పేజీలు కేటాయించిన రామోజీ తెలుగుదేశం ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తేశాక ఆ విషయం ఇక తనకు సంబంధం లేదన్నట్లు వదిలేశారు.
 
 అధికారపార్టీ అడ్డదారులు..
 హామీల అమలు కష్టమని తేలిపోవడంతో దిక్కుతోచని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇపుడు కొత్త నాటకాలకు తెరతీశారు. రాష్ర్టంలో ఏకైక బలమైన ప్రతిపక్షపార్టీగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. హామీల నుంచి జనం దృష్టిని మరల్చడం, ప్రతిపక్ష పార్టీని బలహీనపరచడం అనే జంట కుట్రలకు పదునుపెడుతున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఈనాడు నాయకత్వంలోని ఎల్లోమీడియా వంతపలకడం కొత్తేమీ కాదు గానీ ప్రజాస్వామ్యాన్ని ఇంత బహిరంగంగా ఖూనీచేయడానికి తెగబడడం, ప్రజలు గమనిస్తున్నారన్న స్పృహను వదిలేయడం విచారకరం. ఎన్నికల ఫలితాలు విడుదలై పట్టుమని పదిరోజులు కూడా కాలేదు... కనీసం ప్రజాప్రతినిధులు ప్రమాణస్వీకారమైనా చేయలేదు.. కానీ అప్పుడే కుట్రపూరితంగా జరుగుతున్న ఈ వ్యవహారం చూస్తే అధికారపార్టీ భవిష్యత్తులో ఏ మార్గాన నడవబోతున్నదో తెలుస్తూనే ఉంది.
 
 ఒకరిద్దరిని ప్రలోభపెట్టి తమవైపుకు తిప్పుకున్న తెలుగుదేశం నాయకుల కుటిలనీతికి... మరికొందరు కూడా వెళ్లబోతున్నారంటూ ఎల్లోమీడియా ఆడుతున్న మైండ్‌గేమ్‌కు ఎన్నికల సంఘం బ్రేక్‌వేసింది. ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి సరిపడినన్ని స్థానాలు గెలుచుకున్న ఓ రాజకీయపార్టీ ఇంకా ప్రమాణస్వీకార కార్యక్రమాన్నయినా జరుపుకోకముందే ఎందుకిలా ప్రతిపక్షపార్టీ నేతలను ఆకర్షించే దిగజారుడు రాజకీయం చేస్తున్నదో తెలుసుకోవడానికి పెద్దగా శ్రమపడనక్కరలేదు..  ఓటేసిన రైతులు రుణమాఫీ కోసం మోరలెత్తి చూస్తున్న విషయాన్ని గ్రహించి వారి దృష్టిని మరల్చడానికి ఇదొక మార్గంగా ఎంచుకున్నారంతే....
 - పి. శ్రీనివాసరావు

ఎన్ని కష్టాలెదురైనా జగన్ వెంటే నడుస్తాం

ఎన్ని కష్టాలెదురైనా జగన్ వెంటే నడుస్తాం
కార్యకర్తల వెన్నంటి ఉంటా ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్
 నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌లైన్:  టీడీపీ నాయకుల్లా స్వప్రయోజనాల కోసం అమ్ముడుపోయే వారు వైఎస్సార్‌సీపీలో ఎవరూ లేరని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటే నడుస్తామని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ స్పష్టం చేశారు.
 
స్థానిక మాదాల చంద్రశేఖర్ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో అనిల్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆ పార్టీని వదిలి టీడీపీలో చేరనున్నారన్న ప్రచారాన్ని ఖండించారు. చంద్రబాబుకు మెజార్టీ రావడంతోనే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయన్నారు. తాను గెలిచానన్న ఆనందం కంటే జగనన్నను సీఎం చేయలేకపోయామనే బాధ వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వైఎస్సార్ రాజకీయ భవిష్యత్‌ను కల్పిస్తే జగనన్న ఎమ్మెల్యేను చేశారన్నారు.

ఎమ్మెల్యే అన్న మూడు అక్షరాలే చేరాయి..
అనిల్ పేరుకు ఎమ్మెల్యే అనే మూడు అక్షరాలు చేరాయే తప్ప తన జీవితంలో ఎలాంటి మార్పులేదన్నారు. ఏమైపోతామో, ఏమవుతోందో తెలియని రోజు నుంచి తనతోపాటు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల వెంటే నడుస్తామని వాగ్దానం చేశారు.
 
అబ్దుల్‌అజీజే మేయర్..
జగనన్న ఇచ్చిన మాట మేరకు అబ్దుల్‌అజీజ్ నగరపాలక సంస్థ మేయర్ కావ డం ఖాయమన్నారు. అలా కాని పక్షం లో మహానాయకుడు వైఎస్సార్‌కు ద్రో హం చేసినవారమవుతామన్నారు. ఆగ స్టు నుంచి మిషన్-2019 పేరుతో జగనన్నను సీఎం చేసేందుకు రెట్టించిన అంకితభావంతో కృషి చేస్తానన్నారు. కార్పొరేటర్ రూప్‌కుమార్ మాట్లాడుతూ అనిల్‌కుమార్‌యాదవ్ విజ యం యువతదేనన్నారు. కార్పొరేటర్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రారంభం నుంచి అనిల్‌కుమార్‌యాదవ్ పడిన కష్టానికి ప్రతి ఫలం దక్కిందన్నారు.

 
 ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌యాదవ్‌ను ఘనంగా సన్మానించారు. నాయకులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, పుట్టా రామకృష్ణారెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మునీర్‌సిద్ధిఖ్, దార్ల వెంకటేశ్వర్లు, కర్తం ప్రతాప్‌రెడ్డి, షేక్ సుభాన్, ఎండీ ఖలీల్‌అహ్మద్, ఎం విజయభాస్కర్ రెడ్డి, పోలంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌ఆర్ ఇంతియాజ్, రవిచంద్ర, గూడూరు శ్రీధర్‌రెడ్డి, దామవరపు రాజశేఖర్, టి.రఘురామిరెడ్డి, యూ మాధవయ్య, జి.వెంకటేశ్వర్లు, అతహర్, వి.మహేష్, టి.శ్రీనివాసులు, వందవాసి రంగ, ఎం ప్రశాంత్, డి.అశోక్, గంధం సుధీర్‌బాబు, ఎండీ తారిఖ్, ఆర్ జెస్సీ, లలిత పాల్గొన్నారు.

‘వైఎస్సార్‌సీపీ’ ఇక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ

‘వైఎస్సార్‌సీపీ’ ఇక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ
వైఎస్సార్‌సీపీకి ఫ్యాన్ గుర్తు రిజర్వ్ చేసిన ఈసీ
ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన మూడో రాష్ట్ర పార్టీగా అవతరణ
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల మేరకు లభించిన గుర్తింపు
రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇక లాంఛనమే

 
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇటీవలి లోక్‌సభ, శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి లభించిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను రాష్ట్ర పార్టీగా గుర్తించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం జారీ చేసిన ఆదేశాల్లో (నం.56/రివ్యూ/2013/పీపీ-2) పేర్కొంది. ఇప్పటివరకు కేవలం రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల చట్టంలోని గుర్తులు  (రిజర్వేషన్, కేటాయింపు) ఆర్డర్ 1968 నిర్దేశించిన విధివిధానాలన్నింటినీ పూర్తి చేసిందని, అందువల్ల ఇకనుంచి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర పార్టీగా గుర్తింపును ఇచ్చినట్టు ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ శర్మ పేరుతో జారీ అయిన ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతోపాటు పార్టీ అభ్యర్థన మేరకు సీలింగ్ ఫ్యాన్ గుర్తును వైఎస్సార్ కాంగ్రెస్‌కు రిజర్వ్ చేసినట్టు ఆ ఆదేశాల్లో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఆదేశాలను తన వెబ్‌సైట్‌లో పెట్టడమే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పంపారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ గుర్తును తొలగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో  రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన పార్టీల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు టీడీపీ, టీఆర్‌ఎస్‌లు మాత్రమే ఉన్నాయి.

తాజా ఆదేశాలతో రాష్ట్ర పార్టీల జాబితాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా చేరింది. అయితే నిబంధనల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఆ పార్టీ నాయకులు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను కలసి గుర్తింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు పత్రాన్ని దరఖాస్తుతోపాటు జత చేయనున్నారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు రావడం ఇక లాంఛనప్రాయమే కానుంది. తాజా పరిణామాల ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్ గుర్తింపు పొందిన పార్టీ కానందున అందులోంచి వేరే పార్టీల్లోకి వెళ్లే ప్రజాప్రతినిధులకు ఫిరాయింపుల చట్టం వర్తించదంటూ దుష్ర్పచారం సాగిస్తున్న టీడీపీ నేతల నోటికి తాళం పడినట్లయింది. త్వరలో జెడ్పీ, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఎవరైనా తమ పార్టీ ఇచ్చే విప్‌ను ధిక్కరించే పక్షంలో వారిపై అనర్హత వేటు పడనుంది.

ప్రజాసమస్యలు గాలికొదిలి మైండ్‌గేమ్‌లా?

ప్రజాసమస్యలు గాలికొదిలి మైండ్‌గేమ్‌లా?
బాబుపై ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే గడికోట ధ్వజం

హైదరాబాద్: ప్రతిపక్షాన్ని బలహీనం చేయాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు ఏమాత్రం ఫలించవని, ఇక మీదట రోజురోజుకూ బలహీనపడేది తెలుగుదేశం పార్టీయేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. టీడీపీ ప్రలోభాలకు లొంగి ఒకరిద్దరు పార్టీ ఫిరాయించినంత మాత్రాన పార్టీ బలహీనపడదని సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉత్పన్నమవుతున్న ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు... తమ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించేలా ‘మైండ్ గేమ్’ ఆడటం సరికాదన్నారు.

‘‘ఎన్నికల ముందు ఇచ్చిన సాధ్యం కాని హామీలను చంద్రబాబు నెరవేర్చకపోతే ఆరు నెలల్లో టీడీపీలోని వాళ్లే ఇతర పార్టీల వైపు చూడాల్సి వస్తుంది. ఓవైపు విభజన వల్ల తలెత్తిన స్థానికత సమస్యతో విద్యార్థులు, ఉద్యోగులు సతమతమవుతున్నారు. మరోవైపు రాజధాని ఎక్కడో, ఏ ఆఫీసు ఎక్కడుంటాయో తెలియని స్థితిలో ప్రజలుంటే బాబు వాటిని పట్టించుకోకుండా ప్రజల దృష్టిని మళ్లిం చేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. రుణాల మాఫీ వంటి వాటిపై తొలి సంతకం చేయాల్సి వస్తుందనే భయంతోనే.. పార్టీ గెలిచినా ప్రమాణ స్వీకారం చేసే తేదీని బాబు నిర్ణయించుకోలేదు’’ అని దుయ్యబట్టారు. రాజకీయ డ్రామాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

వైఎస్ఆర్ సీపీకి ఈసీ గుర్తింపు

Written By news on Monday, May 26, 2014 | 5/26/2014

వైఎస్ఆర్ సీపీకి ఈసీ గుర్తింపువీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించింది. వైఎస్ఆర్ సీపీకి గుర్తింపునిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. 1968 నాటి పార్టీ గుర్తుల చట్టంలో అన్ని నిబంధనలను వైఎస్ఆర్ సీపీ సంతృప్తి పరిచిందని ఈసీ తెలిపింది. సీలింగ్ ఫ్యాన్ గుర్తు పూర్తిగా వైఎస్ఆర్ సీపీకే చెందుతుందని పేర్కొంది. గుర్తింపు లభించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేసే అధికారం లభిస్తుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే అరుదైన గౌరవం సాధించింది. ఈ ఎన్నికల్లో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో సొంత రాష్ట్రంలో ఎక్కువ ఓట్ల శాతం సాధించిన పార్టీగా వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించింది. పొత్తులేవీ లేకుండా ఒంటరిగా పోటీ చేసిన రాజకీయ పార్టీల్లో అత్యధిక శాతం ఓట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించింది.

వైఎస్ఆర్ సీపీని వీడే ప్రసక్తే లేదు: పెద్దిరెడ్డి

వైఎస్ఆర్ సీపీని వీడే ప్రసక్తే లేదు: పెద్దిరెడ్డి
చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని పుంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ వీడుతున్నట్లు తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన సోమవారమిక్కడ అన్నారు. వైస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. అయిదేళ్ల కాలంలో ప్రజల తరపున పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు సొంతజిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచామని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి గుర్తు చేశారు.

ఇప్పుడు కూడా చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు

'ఇప్పుడు కూడా చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు'
నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు నిద్ర పట్టడం లేదని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.  ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కుట్రలు, కుయుక్తులు మాని ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు కృషి చేయాలని హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ వీడుతున్నారంటూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా మైండ్ గేమ్ ఆడుతోందని భూమన మండిపడ్డారు

చంద్రబాబు పులితోలు కప్పుకున్న నక్క

'చంద్రబాబు పులితోలు కప్పుకున్న నక్క'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతున్నారంటూ వచ్చిన కథనాలను వైఎస్ఆర్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి  ఖండించారు. వీరిరువురు సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు.

ప్రజలకు భరోసా కల్పించాలే వ్యవహరించాలే కానీ, ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి వైఎస్ఆర్ సీపీ నేతలను తనవైపు తిప్పుకోవటం ఎంతవరకూ సమంజమని ప్రశ్నించారు. ఒకప్పుడు మనం ఎక్కడకు పోతున్నామని ప్రశ్నించిన చంద్రబాబే... ఇప్పుడు  ఎందుకింత దిగజారి వ్యవహరిస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు నాయుడు పులితోలు కప్పుకున్న నక్క అని, మూడు నెలల్లో ఆయన బండారం బయటపడుతుందని అన్నారు.

ప్రతిపక్షం నిలదీస్తుందనే భయంతో దాన్ని లేకుండా చేయాలని చంద్రబాబు తపన పడుతున్నారన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేవరకూ తాము పోరాడుతూనే ఉంటామన్నారు.  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల తరపున పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. నేతలెవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడరన్నారు. రాజకీయాల్లో ఉన్నంతవరకూ జగన్ వెంటే ఉంటామని వారు స్ఫష్టం చేశారు. ప్రలోభాల కోసమో, మరోదాని కోసమో .....ఒకరిద్దరూ వెళ్లినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఒకరిద్దరూ పార్టీ మారినంత మాత్రాన మిగిలినవారంతా అదే బాటలో వెళ్తారని కథనాలు రాయడం హాస్యాస్పదమన్నారు.

అనంతలో వైఎస్ఆర్ సీపీపై తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం

అనంతపురం : సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన గర్వంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రమణారెడ్డికి చెందిన రెండు వేల బొప్పాయి చెట్లను టీడీపీ కార్యకర్తలు నరికేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లిలో చోటుచేసుకుంది.

గతంలో కూడా తిరుపతి, అనంతపురం తదితర ప్రాంతాల్లో తెలుగుతమ్ముళ్లు ఇలాగే అరాచకాలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై వ్యక్తిగతంగా దాడులు చేయడం, వాళ్ల ఆస్తులు ధ్వంసం చేయడం, పవిత్రమైన తిరుమల కొండపైకి తాగి వెళ్లి అక్కడి దుకాణాలను ధ్వంసం చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు.

హామీలను అమలు చేయలేడంటూ ఇప్పట్నుంచే రంగం సిద్ధం చేస్తున్న ‘ఈనాడు’

బాబుకు ఎల్లో మీడియా వంతవీడియోకి క్లిక్ చేయండి
* బాబు హామీలను మైమరిపించడమే లక్ష్యం
హామీలను అమలు చేయలేడంటూ ఇప్పట్నుంచే రంగం సిద్ధం చేస్తున్న ‘ఈనాడు’
 
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చంద్రబాబు ప్రజల్లో చులక కాకుండా చూసేందుకు ఎల్లో మీడియా అప్పుడే రంగంలోకి దిగింది. బాబు త్వరలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో, ఆచరణ సాధ్యం కానీ హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తూ, చుట్టుముట్టబోయే అపకీర్తి బారి నుంచి ఆయనను కాపాడటానికి తనదైన రీతిలో వంచనకు తెర తీసింది. ఒక మీడియాగా ఎన్నికల హామీలను నిలుపుకోవాలంటూ ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి బాబును కాపాడే ప్రయత్నంలో నిమగ్నమైంది.

బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తూ బాబు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతుంటే... ఈ ఎల్లో మీడియా అందుకు వంత పాడుతుండటం పక్కా వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. చంద్రబాబు తానిచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురు చూస్తున్న ప్రజలను ఏమార్చడమే తక్షణ కర్తవ్యంగా ఎల్లో మీడియా వ్యవహరిస్తోంది. టీడీపీకి వంతపాడుతున్న ‘ఈనాడు’ సరిగ్గా 1997లో సంపూర్ణ మద్యనిషేధం ఎత్తివేత సందర్భంలో చేసిన మాదిరిగానే ఇప్పుడూ కథ నడుపుతోంది.

మద్య నిషేధం ఎత్తివేత తరహాలోనే..
1995లో దూబగుంటలో ఒక మహిళ ప్రారంభించిన సంపూర్ణ మద్య నిషేధ సామాజిక ఉద్యమాన్ని తన భుజానికెత్తుకున్న ‘ఈనాడు’ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్నే కొనసాగించింది. ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేసేదాకా దాన్ని కొనసాగించింది. తీరా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకోగానే అదే ‘ఈనాడు’ కొత్త పాట మొదలుపెట్టింది. సంపూర్ణ మద్య నిషేధంతో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ నాలుక మడతేసింది. ఆ మేరకు రోజూ పుంఖానుపుంఖాలుగా కథనాలను వండి వార్చింది. మద్య నిషేధాన్ని ఎత్తేస్తే తప్ప రాష్ట్రానికి దిక్కు లేదంటూ దిక్కుమాలిన ప్రచారంతో బాబు పనిని సులభతరంచేసింది.

‘విధిలేకే చంద్రబాబు మద్య నిషేధాన్ని ఎత్తేస్తున్నారు’ అన్న దశకు తీసుకొచ్చింది. సంపూర్ణ మద్య నిషేధం వల్ల ఖజానాకు రూ.1,400 కోట్ల లోటు ఏర్పడుతోందని, ఆ డబ్బే ఉంటే ఎంతో అభివృద్ధి చేయొచ్చని నానా కథలూ అల్లింది. అలా సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తేసేదాకా తనరాతలను కొనసాగించింది. ఇప్పుడు కూడా సరిగ్గా అదే మాదిరి కథ మొదలుపెట్టింది. ఇటీవలి ఎన్నికల్లో బాబు అలవికాని హామీలెన్నో ఇచ్చినా వాటన్నింటికీ ‘ఈనాడు’ పూర్తిగా వత్తాసు పలికింది. బాబు సీఎం అయితేనే ఆ హామీలు సాధ్యమవుతాయంటూ పేజీలకు పేజీలు రాతలు రాసింది. ఆయన చెబుతున్న రైతుల రుణాల మాఫీ సాధ్యమేనంటూ రోజూ రాస్తూ వచ్చింది.

అవేగాక డ్వాక్రా మహిళల రుణాల రద్దు, నిరుద్యోగ భృతి, ఇంటింటికో ఉద్యోగం, పెన్షన్ల వంటివన్నీ బాబు అమలు చేస్తారంటూ కథనాలు వండివార్చింది. అవిఆచరణ సాధ్యం కావని ఎవరైనా అంటే అంతెత్తున లేచింది. ఏం చేసైనా సరే, బాబును అధికార పీఠం ఎక్కించడమే ఏకైక అజెండాగా, ఫక్తు టీడీపీ పత్రిక స్థాయిలో బాకా ఊదింది. ఇప్పుడు బాబు అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో ఇదే ‘ఈనాడు’ మరోసారి అచ్చం ఆనాటి తరహాలోనే ఆయనను హామీల గండం నుంచి గట్టెక్కించే పనిలో పడింది.

‘తొలి అడుగులు ఇబ్బందే...’ అంటూ ఒక రోజు, ‘బాబు ముందు ఎన్నో ఇబ్బందులున్నాయి’ అంటూ మరో రోజు... ఇలా రోజుకోటి చొప్పున కథనాలను వండి వారుస్తోంది. అలా తన వ్యూహాన్ని మెల్లిగా తెరపైకి తీసుకొస్తోంది. బాబు ఎటూ తానిచ్చిన హామీలనూ నెరవేర్చలేరు గనుక అనేకానేక సమస్యలే అందుకు కారణమంటూ ఇప్పటి నుంచే పాఠకుల మెదళ్లకు ఎక్కించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు టీడీపీ చేస్తున్న నిస్సిగ్గు కుట్రలను కూడా అడ్డంగా సమర్థిస్తోంది. ‘వైఎస్సార్‌సీపీ నుంచి నేతలు జారుకుంటున్నారు’ అంటూ వాస్తవాలకు పచ్చ ముసుగేసి ఈనాడు సారథ్యంలోని ఎల్లో మీడియా ప్రచురిస్తోంది, చూపిస్తోంది.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తొమ్మిదో రోజునే ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ ఇలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బాబు తలవంపుల వ్యవహారాన్ని అదేదో గొప్ప విజయమన్నట్టుగా అభివర్ణిస్తున్నాయి. టీడీపీలోకి మరికొందరు వెళ్లనున్నారన్న ఆ పార్టీ నేతల మైండ్‌గేమ్‌కు కూడా తెగ ప్రచారం కల్పిస్తున్నాయి. హామీల అమలులో విఫలమయ్యే వేళ బాబుకు పలుగురాళ్లతో నలుగు పెట్టడానికి వైఎస్సార్‌సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉండకూడదనే కుటిలత్వంతో, ప్రజలను నట్టేట ముంచి మరీ బాబుకు వంతపాడుతున్న ఎల్లో మీడియా తీరు అందరికీ రోత పుట్టిస్తోంది.

హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే

హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికేవిలేకరుల సమావేశంలోమేకపాటి, గీత
* టీడీపీ అధినేత తీరును తప్పుపట్టిన వైఎస్సార్‌సీపీ
* బలమైన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీని దెబ్బతీయడానికే బాబు పన్నాగం
 
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలను ఎలా అమలు చేయాలో తెలియక వాటిపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. హామీల అమలును పక్కనబెట్టి ప్రతిపక్ష పార్టీ నేతల వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆయన తీరును ఎండగట్టింది. ఒకవైపు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రమాణానికి కె.చంద్రశేఖర్‌రావు అపాయింటెడ్ డే జూన్ 2నే ముహూర్తంగా పెట్టుకుంటే చంద్రబాబు మాత్రం వెనక్కి వెనక్కి వెళ్తున్నారని విమర్శించింది. వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొత్తపల్లి గీత ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

‘‘చంద్రబాబు చేయాల్సిన పనులు, ఎన్నికల వాగ్దానాలు చాలా ఉన్నాయి. రైతుల వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామన్నారు. చేనేత రుణాలు మాఫీ అన్నారు. వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు.. వికలాంగులకు రూ. 1,500 పింఛన్ ఇస్తామన్నారు. వీటన్నింటి అమలు గురించి ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో చంద్రబాబు వాటిపై దృష్టి పెట్టకుండా... వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలనో, ఎంపీలనో టీడీపీలోకి ఎలా లాక్కుందామనే అనైతిక చర్యలు మొదలుపెట్టారు’’ అని మేకపాటి విమర్శించారు.

‘‘చంద్రబాబు.. మీరు మొదట ఎన్నికల వాగ్దానాలు ఎలా నేరవేర్చాలో ఆలోచించండి. వ్యవసాయ పనుల సీజను మొదలవుతోంది. రైతులు రుణమాఫీ జరిగి కొత్త రుణాలు వస్తాయని ఎదురుచూస్తున్నారు. పెన్షన్ కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆశగా చూస్తున్నారు’’ అని హితవు పలికారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న పన్నాగంతో చంద్రబాబు పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం లేకుండా చేద్దామని ఆయన అనుకుంటే అది జరిగే పనికాదని హెచ్చరించారు.
 
పార్టీ మారేవారిపై వేటు తప్పదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరితే ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని మేకపాటి స్పష్టం చేశారు. ఈ విషయాన్నీ కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పిందన్నారు.  టీడీపీ నేతలు ఏం మభ్య పెట్టారో తెలియదుగానీ ఇద్దరు ఎంపీలు పార్టీ మా రారని తెలుస్తుందన్నారు. ఈ పార్టీలో గెలిచి ఆ తడి ఇంకా ఆరకముందే పార్టీ ఫిరాయిం చడమంటే ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారో కళ్లకు కడుతుందన్నారు. అయితే తాను గతంలో కాంగ్రెస్‌లో గెలిచినా ఆ పార్టీకి రాజీనామా చేసిన తరువాతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని గుర్తు చేశారు.  
 
నేను జగన్ వెంటే
జగన్‌మోహన్‌రెడ్డి వెంటే తాను వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉంటానని అరకు ఎంపీ కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. ఎన్నికల్లో పార్టీ గెలుపోటములు సహజమేనన్నారు. తాను పార్టీ మారతాననే ప్రచారం కేవలం ఉహాగానాలేనని కొట్టిపారేశారు. అలాంటి ఆలోచన కానీ, అవసరం కానీ తనకు లేదన్నారు.

అనర్హత తప్పదు

Written By news on Sunday, May 25, 2014 | 5/25/2014

అనర్హత తప్పదుసోమయాజులువీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తి మరో పార్టీలోకి వెళ్తే తప్పక అనర్హులవుతారని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సలహాదారులు సోమయాజులు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నంద్యాల లోక్ సభ సభ్యుడిగా గెలిచిన ఎస్ పివై రెడ్డి  ఈ రోజు ఉదయం ఢిల్లీలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనపై అనర్హత వేటు పడుతుందన్న భావనను సోమయాలు వ్యక్తం చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రకమైన అనైతిక చర్యకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు.
అయితే  ఎస్ పివై రెడ్డి పార్టీ మార్పిడికి తిరుగుబాటు నిబంధన వర్తించడని టిడిపి నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన ఎన్నికయ్యేనాటికి ఆ పార్టీకి గుర్తింపులేదన్నారు. ఎన్నికల్లో కామన్ గుర్తు ఉన్నప్పటికీ అభ్యర్థులను స్వతంత్రులుగానే గుర్తిస్తారని యనమల చెప్పారు. వైఎస్‌ఆర్‌ సీపీపై  యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను సోమయాజులు ఖండించారు.

ఇదిలా ఉండగా, ఎన్నికలలో పోలైన ఓటింగ్ శాతాన్ని బట్టి వైఎస్ఆర్ సిపి గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని యనమలే అన్నారు.

పార్టీని వదిలేసినా, వేరే పార్టీలో చేరినా పదవి పోతుంది

'పార్టీని వదిలేసినా,  వేరే పార్టీలో చేరినా పదవి పోతుంది'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్:ఒక పార్టీలో గెలిచిన తరువాత ఆ పార్టీని వీడినా, వేరే పార్టీలో చేరినా పదవి పోతుందని కేంద్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ మాడభూషి శ్రీధర్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదని ఆయన తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన శ్రీధర్..  పార్టీని వదిలేసినా, వేరే పార్టీలో చేరినా పదవి పోవడం ఖాయమన్నారు. దీనికి సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లో స్పష్టంగా ఉన్నాయన్నారు. రాజ్యాంగలోని పార్టీని రాజకీయ పార్టీగా లేదా లెజిస్లేచర్ పార్టీగా పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
 
అందులో అది గుర్తింపు పొందిన పార్టీయా? లేక గుర్తింపుపొందని పార్టీయా అన్న విషయాన్ని పేర్కొనలేదన్నారు. గుర్తింపు ఉన్నా, లేకపోయినా ఇదే నియమం వర్తిస్తుందన్నారు. ఒక పార్టీ నుంచి పోటీచేయడానికి అర్హత ఉన్నప్పుడు...ఆపార్టీని వదిలేసినప్పుడు కూడా అనర్హతలు వర్తిస్తాయన్నారు.

ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే

చంద్రబాబు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు: మేకపాటి
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి చేపట్టి వాగ్దానాలను నెరవేర్చాల్సిన శుభ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. 
 
'ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చంద్రబాబు నెరవేర్చాల్సినవి  చాలా ఉన్నాయన్నారు.  వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు పెంచుతానన్నారు. వాటిని ఎప్పుడు నెరవేరుస్తారా అని ప్రజలు ఆశతో ఉన్నారు' అని మేకపాటి అన్నారు. 
 
'పార్టీలు మారడం తప్పుకాదు, నేను కూడా కాంగ్రెస్‌ నుంచి వచ్చి రాజీనామా చేశాను. ఆతర్వాత మళ్లీ పోటీచేసి గెలుపొందాను. ఫలితాలు వచ్చి 9 రోజులు కాకముందే  పార్టీలు మారుతున్నారు. పార్టీ మారాలనుకుంటే... ముందు పార్టీకి, పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే నైతికంగా ఉంటుంది' అని మేకపాటి తెలిపారు. 
 
ఎన్నికల్లో గెలిచిన తొమ్మిది రోజుల్లోనే పార్టీ మారడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని ఆయన అన్నారు.  పార్టీ మారిన వారందరిపైనా ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలోకి చేరడంపై మేకపాటి అసంతృప్తిని వ్యక్తం చేశారు

వైఎస్సార్ సీపీని వీడే ప్రసక్తే లేదు:కొత్తపల్లి గీత

వైఎస్సార్ సీపీని వీడే ప్రసక్తే లేదు:కొత్తపల్లి గీత
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడతానని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని.. అవన్నీ ఊహాగానాలేనని అరకు ఎంపీ కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉండి పార్టీకి, ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కొత్తపల్లి గీత..  ఫిరాయింపు ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలని తాను అనుకోవడం లేదన్నారు. ఏడాదిన్నర క్రితమే అరకు పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేయమని వైఎస్ జగన్ తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె మరోమారు గుర్తు చేశారు.
 
పార్టీలో ఉండి చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక ఎస్టీ పార్లమెంటు సభ్యురాలిని తానేనన్నారు. వైఎస్సార్ సీపీని వీడతానని వార్తల రావడం బాధాకరమన్నారు.

Popular Posts

Topics :