28 August 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రైతులను మోసం చేయడంలో ఆయనది పీహెచ్‌డీ

Written By news on Saturday, September 3, 2016 | 9/03/2016


రైతులను మోసం చేయడంలో ఆయనది పీహెచ్‌డీ
కడప :
రైతులను మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ తీసుకున్నారని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ఆయకట్టుకు నీళ్లు అందించకపోవడానికి నిరసనగా కడప కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన రైతు మహాధర్నాలో భారీ సంఖ్యలో పాల్గొన్న రైతులు, రైతు నాయకులను ఉద్దేశించి  ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
 
 • రాష్ట్రంలో కరువు బారిన పడిన రైతులను ఆదుకోవాల్సిందిపోయి అసలు రాష్ట్రంలో కరువే లేదని చంద్రబాబు అంటున్నారు
 • ఒక్కసారి మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు చూడండి
 • వైఎస్ఆర్ బతికున్నప్పుడు అవి ఏస్థాయిలో ఉండేవి, చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టులను పట్టించుకునే నాథుడు ఉన్నాడా
 • 2014లో గండికోట సభలో బాబు.. కనీసం 10 టీఎంసీలు 2015 ఖరీఫ్‌కి ఇస్తానన్నాడు. కానీ 2016 కూడా అయిపోవస్తున్నా గండికోట ప్రాజెక్టు ముందుకు కదల్లేదు
 • ఇంతవరకు ఆ ముంపు గ్రామాల సమస్యలు తీర్చలేదు
 • ప్రాజెక్టులోకి నీళ్లు తేవాలంటే.. ముందు పెండింగ్ పనులు పూర్తిచేయాలి
 • గండికోటకు నీళ్లు రావాలంటే కెనాల్, వరద కాలువ పూర్తి చేయాలి
 • దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 80 శాతం పనులు జరిగితే, మిగిలిన 20 శాతం ఇంతవరకు పూర్తికాలేదు
 • ఏదైనా ప్రాజెక్టులో నీళ్లు నింపాలంటే ఇంకా ఆ ప్రాంతంలో ముంపునకు గురయ్యే గ్రామాల వాసులకు పరిహారం ఇవ్వాలి
 • గ్రామస్తులకు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వకుండా గండికోటకు ఎలా 10 టీఎంసీల నీళ్లిస్తారు
 • ఇక.. ఒక్కసారి తెలుగుగంగ ప్రాజెక్టు చూద్దాం. అందులో బ్రహ్మంసాగర్ అంతర్భాగం. చంద్రబాబు ఎప్పుడు జిల్లాకు వచ్చినా అందులో 12 టీఎంసీల నీళ్లు ఉండేలా చూస్తామంటారు.
 • ప్రాజెక్టు ఇప్పటికే కట్టి ఉన్నా.. రెండున్నరేళ్ల నుంచి చంద్రబాబు ఏం చేశారని చూస్తే, బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుకు ఒక్కటంటే ఒక్క టీఎంసీ కూడా నీళ్లివ్వలేదు
 • ఒకవైపు శ్రీశైలం నుంచి నీళ్లు పొంగి పొరలిపోతున్నా.. తర్వాత నాగార్జున సాగర్ నుంచి సముద్రంలోకి వెళ్లి 92 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా బ్రహ్మంసాగర్ మాత్రం చంద్రబాబుకు కనిపించలేదు, ఇక్కడ 12 టీఎంసీలు పెట్టాలన్న ధ్యాస లేదు
 • బుద్ధి ఉన్న ఎవరికైనా ఒకటి తెలుస్తుంది. వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్‌కు నీళ్లు రావాలి. అంటే, 0-20 కిలోమీటర్ల మధ్య కెనాల్ వీక్‌గా ఉంది, దానికి రిపేర్లు చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరకు నేను కూడా చంద్రబాబుకు, మంత్రులకు ఎన్నోసార్లు చెప్పాం. కానీ ఇంతవరకు చంద్రబాబు ఆ రిపేర్ల గురించి పట్టించుకోకపోగా.. మళ్లీ రైతులను మోసం చేయడానికి బ్రహ్మంసాగర్‌లో 12 టీఎంసీలు నింపుతానంటాడు
 • ఇలాంటి మనిషిని ఎక్కడ పెట్టాలని అడుగుతున్నా.. పిచ్చాసుపత్రిలో పెట్టాలా, బంగాళాఖాతంలో కలపాలా అని అడుగుతున్నా
 • ఆయన నోరు తెరిస్తే చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు
 • బ్రహ్మసాగర్ నుంచి ఆర్టీపీపీకి కూడా నీళ్లు రావాలి. లేకపోతే కరెంటు ఉండదు. ఈయన సీఎం అయ్యాక వర్షాలు రాకుండా పోయాయి.
 • ఆర్టీపీపీ కూడా మూతపడితే ఇక కరెంటు కోసం ఎవరివైపు చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి
 • ఆర్టీపీపీ మూతపడితే సంతోషించేది చంద్రబాబే. ఆ పేరు చెప్పి దాన్ని సింగపూర్ వాళ్లకు అమ్మేస్తారు
 • చంద్రబాబు ఈ ప్రాజెక్టులకు చేసింది శూన్యం
 • జీఎన్ఎస్ఎస్‌కు ఆయన తన తొమ్మిదేళ్ల పాలనలో 11 కోట్లు ఇచ్చారు. వెలిగోడుకు 13 కోట్లు ఇచ్చారు. అయినా నీళ్లు వదిలితే ఆ ప్రాజెక్టులలోకి వచ్చే పరిస్థితి ఉందంటే, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండటమే కారణం
 • అందుకే కొద్దోగొప్పో డ్యాంలు, కెనాల్స్ పూర్తయ్యాయి కాబట్టి కాస్తయినా నీళ్లు వస్తున్నాయి
 • ఇదే చంద్రబాబు హంద్రీనీవా గురించి మాట్లాడతారు. అనంతపురం తనకు ప్రాణం అంటారు
 • సొంత మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ప్రజలకు వెన్నుపోటు పొడవడం కష్టం కాదు
 • మూడు ప్రాజెక్టులకు కెనాల్ సిస్టం అభివృద్ధి చేసి ఉంటే మార్గమధ్యంలో వందల చెరువులకు నీళ్లు వచ్చేవి
 • అలా ఉంటే ఈవాళ అత్యధికంగా వేరుశనగ పంట వేసి నష్టపోయిన అనంతపురం జిల్లాకు తోడుగా ఉండేది
 • జీడీపల్లెకు 1.5 టీఎంసీ నీళ్లు ఇన్నాళ్లకు వచ్చాయి. పీఏబీఆర్‌లో 1 టీఎంసీ. అక్కడ నింపడం ఇప్పుడు మొదలుపెట్టాడు
 • రైతులను మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ తీసుకున్నాడు
 • ప్రజలను మోసం చేయడంలో ఆయన కొడుకు నారా లోకేష్ కూడా తండ్రి బాటలోనే ఉన్నారు
 • కడపలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి చంద్రబాబు ఒకమాట, లోకేష్ ఒకమాట మాట్లాడతారు
 • ఎవరైనా కొడుకులకు తండ్రి మంచి మాటలు చెబుతారు. కానీ చంద్రబాబు మాత్రం ఆయన పార్టీ, కొడుకు అందరికీ.. రైతులను ఎలా మోసం చేయాలో నేర్పుతారు. రైతులకు సులభంగా అబద్ధాలు చెబితే మోసం చేయొచ్చు కదా, దానివల్ల అధికారంలోకి వస్తామని నేర్పుతారు
 • ఇంకా ఒక అడుగు ముందుకేసి బ్యాంకుల్లో రైతులు పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు సీఎం కావాలని ఒక అబద్ధం ఆడండని చెబుతారు
 • రైతులనే కాదు.. చివరకు ఆడవాళ్లను కూడా మోసం చేసే కార్యక్రమం చేశాడు
 • డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అంటారు
 • చివరకు చదువుకునే చిన్నపిల్లలను కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదు. మామూలుగా అయితే ఎవరైనా వాళ్ల తిట్లు భయంకరంగా ఉంటాయని అనుకుంటారు
 • జాబు రావాలంటే బాబు సీఎం కావాలని అబద్ధాలు చెప్పించాడు. చివరకు ఏ స్థాయిలో అబద్ధాలు ఉన్నాయంటే సీఎం కుర్చీలో కూర్చోడానికి, ఆ తర్వాత కూడా అబద్ధాలు
 • చంద్రబాబు పాలన గురించి నాలుగు ముక్కలు చెప్పాలంటే.. అబద్ధం, మోసం, దుర్మార్గం, వెన్నుపోటు
 • చంద్రబాబును ఉద్దేశించి డిమాండ్ చేస్తున్నాం
 • నీ పుణ్యమాని కేసీ కెనాల్‌ పరిధిలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఇప్పటివరకు లేదు
 • 92 వేల ఎకరాల ఆయకట్టును బతికించడానికి జనవరి 15 నాటికి నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తున్నాం
 • ముంపుగ్రామాల సమస్యలు తీర్చి గండికోట పనులు పూర్తి చేయాలి, గండికోటకు కనీసం 12 టీఎంసీల నీళ్లయినా నిల్వ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం
 • చిత్రావతిలో 90 శాతం పనులు వైఎస్ హయాంలో జరిగితే, 10 శాతం పనులు ఇంతవరకు చంద్రబాబు పూర్తి చేయలేకపోయాడు.. ఆ పనులు వెంటనే పూర్తిచేయాలి
 • తెలుగుగంగ ద్వారా బ్రహ్మసాగర్‌లో కనీసం 12 టీఎంసీలు నిల్వచేయాలి. వెంటనే మరమ్మతులు పూర్తిచేయాలి
 • తెలుగు గంగ, జీఎన్ఎస్ఎస్, వెలిగోడు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి
 • శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు
 • ఆ ప్రాజెక్టును విద్యుత్తు కోసం కాకుండా రైతుల కోసం ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నాం
 • కడప జిల్లా ప్రజలు, యువకులు ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎదురు చూస్తున్నారు
 • వైఎస్ హయాంలో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఎంతోకొంత కదలిక వచ్చింది.
 • ఆ ఫ్యాక్టరీ పెట్టాలని, 10 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న స్పృహ కూడా లేదు
 • కనీసం ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా

నేడు కడపలో జగన్ మహాధర్నా

రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించకపోవడానికి నిరసనగా శనివారం కడపలో నిర్వహించనున్న రైతు మహాధర్నాలో   వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు.

హోదాపై వీధి నాటకం


హోదాపై వీధి నాటకం
రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టి బాబు ఆడిన డ్రామా
- ‘ఓటుకు కోట్లు’ దర్యాప్తు నేపథ్యంలో కేంద్రంతో కాళ్లబేరం
 
 సాక్షి, హైదరాబాద్:  ‘స్విస్ చాలెంజ్’, ‘ఓటుకు కోట్లు’ వ్యవహారాలలో కోర్టులు ఇస్తున్న తీర్పులతో తలబొప్పికట్టిన సీఎం చంద్రబాబు పరువు కాపాడుకోవడం, ప్రజల దృష్టి మళ్లిం చడం కోసం ప్రత్యేకహోదా పేరుతో హస్తినలో ‘ప్యాకేజీ’అనే వీధినాటకం ఆడిస్తున్నారని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బాబు డెరైక్షన్‌లో కేంద్ర మంత్రి సుజనాచౌదరి నాయకత్వంలో ఢిల్లీలో జరుగుతున్నదంతా ఈ నాట కంలో భాగమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నా యి. రెండున్నరేళ్లుగా చంద్రబాబునాయుడు ఎన్నడూ ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టిన పాపాన పోలేదన్న విషయం అందరికీ తెల్సిం దే. మరోవైపు ప్యాకేజీయే ఇవ్వబోతున్నట్లు కేంద్రం ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి కూడా విదితమే. 

హోదా సంజీవని కాదు అని వ్యంగ్యంగా మాట్లాడిన చంద్రబాబు వైఎస్సార్సీపీ ఉధృత పోరాటాలతో ప్రజలలో భావోద్వేగాలు పెరగడం గమనించి స్వరం మార్చారు. రూ.1.90లక్షల కోట్ల నిధులిచ్చామన్న కేంద్రాన్ని.. ఎక్కడిచ్చారు..? రోడ్లకిచ్చిన నిధులన్నీ కలిపిచెబుతున్నారని హూం కరించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో పునర్విచారణకు ప్రత్యేక కోర్టు ఆదేశించగానే మళ్లీ కేంద్రం ముందు మోకరిల్లారు. ప్రత్యేక హోదా కోసం చర్చలు జరుపుతున్నట్లు బిల్డప్ ఇచ్చా రు. మరోవైపు కేంద్రం కొన్ని ప్రతిపాదనలతో ముసాయిదా తయారు చేసిందని అవన్నీ హోదా కన్నా ఎక్కువగానే ఉంటాయని అనుకూల మీడియాలో ప్రచారం చేయించారు. ఐదుకోట్ల మంది ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టి, కోట్లాది మంది నిరుద్యోగుల భవిష్యత్‌ను బలిపెట్టి చంద్రబాబు ఆడించిన నాటకం ఇది. సుజనా వంటి పాత్రధారులు శతవిధాలుగా శ్రమించినా అది రక్తికట్టలేదు.

 దృష్టి మరల్చేందుకే...: కోర్టు ఆదేశాలతో ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరగబోతోందన్న భయంతో రాష్ర్టప్రభుత్వం తరఫున ప్యాకేజీకి కొన్ని ప్రతిపాదనలు చేసి వాటిని కేంద్రం దృష్టికి తెచ్చే బాధ్యతను సుజనాచౌదరికి సీఎం అప్పగించారని తెలుస్తోంది. తీరా అవన్నీ పాత ప్రతిపాదనలేనని,కొత్తవేవీ లేవని అధికారులంటున్నారు. రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, విభజన చట్టంలోని హామీల అమలుకు ప్రతిపాదనలతో కూడిన ప్రకటనే కేంద్రం ఇచ్చే ప్యాకేజీ అని అధికారవర్గాలంటున్నాయి. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని పట్టుపట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మెట్టుదిగిపోయి ప్యాకేజీ అంటూ ప్రతిపాదనలు సమర్పించడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది.

కేంద్రప్రభుత్వం నుంచి వైదొలుగుతామని, మంత్రుల చేత రాజీనామా చేయిస్తామని... అల్టిమేటమ్ జారీ చేయడంతో పాటు కేంద్రంపై వత్తిడి తీసుకురావడానికి అనేక మార్గాలున్నా వాటిని వదిలేసి రాష్ర్టప్రభుత్వం ఇలా దేబిరించే ధోరణిని ఎంచుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి 1.60 లక్షల కోట్ల రూపాయల నిధులిచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఎక్కడిచ్చారు..? రోడ్లకు ఇచ్చిన నిధులన్నీ కలిపి చెబుతున్నారని, కేంద్రం మనకు అన్యాయం చేసిందని చంద్రబాబు ఈ మధ్య ప్రకటనలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో ఊరట లభించగానే అలాంటి హూంకరింపులు వదిలేశారు. కేసు నుంచి బైటపడడం కోసమే.. ఏవో కొన్ని ప్రతిపాదనలతో ఓ మెమొరాండం తీసుకుపోయి కేంద్ర మంత్రులతో, బీజేపీ నేతలతో భేటీలు జరిపి హడావిడి చేశారు తప్ప రాష్ట్రానికి మేలు చేయాలన్న చిత్తశుద్ధి లేదని దీనిని బట్టి అర్ధమౌతోందని విశ్లేషకులంటున్నారు.

 రాష్ర్టప్రతిపాదనలకు ఆమోదం ఎక్కడ?
 ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇస్తున్న నిధులను 90 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుండగా రాష్ట్రం 40 శాతం నిధులను భరించాల్సి వస్తోంది. ఇందుకు బదులు కేంద్రమే 90 శాతం నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ విధంగా ఇస్తే  కేంద్రం నుంచి అదనంగా ఏడాదికి 3,000 కోట్ల రూపాయలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీనిని ఐదేళ్ల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. విదేశీ ఆర్థిక సాయం ప్రాజెక్టుల్లో 90 శాతం కేంద్రం భరించాలన్న రాష్ట్ర ప్రతిపాదనను కూడా ముందుగానే కేంద్రం తోసిపుచ్చింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తీసుకోవడానికి అంగీకరించినా రాష్ట్ర విభజన తేదీ నుంచి అయ్యే వ్యయాన్ని మాత్రమే భరిస్తామని, అంతకు ముందు వ్యయం భరించబోమని కేంద్రం పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు నిధులను నాబార్డు ద్వారా సమకూర్చాలని కేంద్రం నిర్ణయించింది. నాబార్డు నుంచి తీసుకునే నిధులను 70% తాము భరించేందుకు, మిగతా 30% రాష్ట్రం భరించేందుకు కేంద్రం అంగీకరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పారిశ్రామిక రాయితీలను ఇవ్వాలని కోరగా తిరస్కరించింది. అసలు  హోదా వస్తే రాష్ర్టప్రభుత్వం ప్రతిపాదించిన ఇవన్నీ ఆటోమేటిక్‌గా అమలులో ఉంటాయని, కొత్తగా కేంద్రాన్ని అర్ధించనక్కరలేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అలాంటి సంజీవని వంటి  హోదాను వదిలేయడం, ఒక్కొ క్క దానికి అడిగి లేదనిపించుకోవడం ఎందుకని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
 
 సర్కారు తప్పిదాలతో నిధులకు ఎసరు...
 పారిశ్రామిక రాయితీల కోసం ఏడాదికి రూ.500 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని రాష్ర్టప్రభుత్వం కోరింది. దీనిపై కూడా కేంద్రం ఇంకా అంగీకారం తెలపలేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఏడాదికి జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున ఏడు జిల్లాలకు 350 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం కొనసాగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇది కొత్తదేమీ కాదు.. ఇప్పటికే గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏడు జిల్లాలకు 700 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఆ నిధులను ఆ జిల్లాలకు ఖర్చుచేయనే లేదు. వెనుకబడిన జిల్లాలకు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇచ్చిన 700 కోట్ల రూపాయల్లో ఇప్పటికి కేవలం 14.56 కోట్ల రూపాయలనే ఖర్చు చేసినందున ఈ ఆర్థిక సంవత్సరంలో 350 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించినప్పటికీ కేంద్రం విడుదల చేయలేదని అధికారులు గుర్తు చేస్తున్నారు.

ఇక రాజధానిలో ప్రభుత్వ భవనా ల నిర్మాణాలకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు నివేదికను, డిజైన్లను పంపిస్తేనే తదుపరి నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. తాత్కాలిక రాజధాని నిర్మాణాలకు నిధులు ఇవ్వబోమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం ఇచ్చిన 1,050 కోట్ల రూపాయల వినియోగ పత్రాలను పంపించేందుకు వీలుపడని పరిస్థితి నెలకొంది. ఈ నిధులను శాశ్వత రాజధాని భవనాలకు వినియోగించిన తరువాత... ఆ వినియోగ పత్రాలను పంపిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తామన్న రూ.450 కోట్లను కేంద్రం విడుదల చేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం మీద హస్తినలో ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్యాకేజీ నాటకానికి రాష్ట్ర సర్కారు తెరతీసినా రాష్ట్రానికి కొత్తగా ఒరిగేదేమీ లేదని అధికారులు పేర్కొంటున్నారు.

హైకోర్టును ఆశ్రయించడమంటే తప్పు ఒప్పుకున్నట్లే

Written By news on Friday, September 2, 2016 | 9/02/2016


హైకోర్టును ఆశ్రయించడమంటే తప్పు ఒప్పుకున్నట్లే
సీఎంపై ఉమ్మారెడ్డి ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో తనపై ఏసీబీ విచారణ జరపరాదని హైకోర్టును ఆశ్రయించడంద్వారా సీఎం చంద్రబాబు తాను తప్పు చేశానని సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్లయిందని శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పిటిషన్ వేశారంటేనే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన స్వరం తనదేనని చంద్రబాబే నిర్ధారించుకున్నట్లయిందన్నారు. ఉమ్మారెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గురువారం హడావుడిగా లంచ్‌మోషన్‌ద్వారా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడాన్నిబట్టి దీనిపై ఆయనెంతగా ఆందోళన చెందుతున్నారో అర్థమవుతోందన్నారు.

ఈ కేసు సాంకేతికంగా నిలబడదని, చంద్రబాబు స్వరపరీక్షకోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపేటపుడు ఏసీబీ అనుమతి తీసుకోలేదని, అసలిది ఏసీబీ పరిధిలోకే రాదని, ఎన్నికల కమిషన్ పరిధిలోనిది కనుక ఏసీబీ విచారణను నిలిపేయాలని రెండురోజులుగా కొన్ని పత్రికల్లో లీకులొస్తున్నాయన్నారు. గతంలో కూడా చంద్రబాబు ఏ విచారణా జరక్కుండా కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకున్నారని ఉమ్మారెడ్డి అంటూ.. ఏలేరు కుంభకోణంలో ఏవిధంగానైతే విచారణ జరక్కుండా స్టే తెచ్చుకున్నారో, ‘ఓటుకు కోట్లు’ కేసులోనూ అలాగే సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ హైకోర్టుకు వెళ్లడం దురదృష్టకరమని అన్నారు.

 ప్రత్యేక హోదా చర్చలేమిటో వెల్లడించాలి
 ప్రత్యేకహోదా ఇవ్వకపోతే స్నేహపూర్వకంగానే విడిపోతామని చంద్రబాబు బీజేపీకి అల్టిమేటం ఇచ్చినట్లుగా పత్రికల్లో రెండురోజులుగా లీకులొస్తున్నాయని, ఈ వ్యవహారాన్ని అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.

దురుద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర


భూమనకు సీఐడీ నోటీసులు
హైదరాబాద్: తుని ఘటన కేసులో వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

తుని ఘటన కేసులో తనకు నోటీసులివ్వడం దురుద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర అని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు సర్కారు వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.  

జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపు ఐక్యగర్జన సభ నిర్వహించిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే.

దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు


దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు: వైఎస్ జగన్
ఇడుపులపాయ: సీఎం చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో పూర్తిగా కూరుకుపోయారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పాలనను గాలికి వదిలేసి ఈ కేసు నుంచి బయట పడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో శుక్రవారం పంట పొలాల్లో రెయిన్ గన్ల పనితీరును వైఎస్ జగన్ పరిశీలించారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా సాధనపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. ఓట్లుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి స్వయంగా పట్టుబడడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని తెలిపారు. పట్టుబడిన తర్వాత కూడా చంద్రబాబు అరెస్ట్ కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకున్న అధికారాలు, పరిచయాలను ఉపయోగించుకుని తప్పించుకుంటున్నారని ఆరోపించారు. తన కేసుల మాఫీ గురించి సుజనా చౌదరిని ఢిల్లీకి పంపారని అన్నారు.

చంద్రబాబు పాత్రపై విచారణకు ప్రత్యేక కోర్టు ఆదేశించిన వెంటనే సుజనా చౌదరి పరుగున వెళ్లి అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అమిత్ షాలను కలిశారని గుర్తు చేశారు. హైదరాబాద్ వచ్చి గవర్నర్ తో భేటీ అయ్యారని వెల్లడించారు. ప్రత్యేకహోదా గురించి కలిసామంటూ జనం చెవుల్లో పూలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాకు, గవర్నర్ కు సంబంధం ఉందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన అంతా మోసం, అబద్ధం అని వ్యాఖ్యానించారు. డబ్బు సంపాదన, కేసుల నుంచి ఎలా బయటపడాలనే దాని గురించే చంద్రబాబు ఆలోచిస్తుంటారని అన్నారు.

రైతులపై చంద్రబాబు ఏమాత్రం ప్రేమ లేదని వైఎస్ జగన్ అన్నారు. 2013-14లో రైతులకు ఇన్​ ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టారని చెప్పారు. 2014-15లో కలెక్టర్లు ఇచ్చిన నివేదికలను కుదించి రూ.600 కోట్లే ఇచ్చారని తెలిపారు. 11 ఏళ్ల క్రితమే రెయిన్ గన్లు వాడుకలోకి వచ్చాయన్నారు. నీళ్లు లేకుండా రెయిన్ గన్లుతో ఏం ఉపయోగమని ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి నీళ్లు అందించాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీళ్లకు అవకాశమున్నా కేవలం 15 టీఎంసీలే ఉంచుతున్నారని అన్నారు. కృష్ణా, గోదావరి డెల్టాలు, రాయలసీమ కరువుతో అల్లాడుతున్న పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అన్నదాతలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

క్రైం నెంబరు 11 విచారణపై ఎలాంటి స్టే లేదు


హైదరాబాద్ :
ఏసీబీ కోర్టు జారీచేసిన మెమోపై మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చింది తప్ప క్రైం నెంబరు 11 విచారణపై ఎలాంటి స్టే లేదని.. అందువల్ల తెలంగాణ ఏసీబీ తన కేసు విచారణను కొనసాగించుకోవచ్చని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కేసు పెండింగ్‌లోనే ఉంటుందని, కేసు విచారణకు ఎలాంటి ఆటంకాలు కలిగించలేదని మరో సీనియర్ న్యాయవాది అరుణ్‌కుమార్ తెలిపారు. హైకోర్టు ఇచ్చినది కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని ఆయన అన్నారు.

చంద్రబాబు ఎప్పటినుంచో మాయమాటలు చెబుతూనే ఉన్నారని, కేసు దాఖలు చేసేటప్పుడే తాము చంద్రబాబును స్టేకు వెళ్లొద్దని చెప్పామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. విచారణను ఎదుర్కోవాల్సిందిగా సవాలు చేశామన్నారు. విచారణలో నిర్దోషివని తేలితే ప్రజలందరికీ కడిగిన ముత్యానివే, నిప్పువే అని తెలుస్తుందని చెప్పామని ఆయన అన్నారు. కానీ.. దోషిగా తేలితే భవిష్యత్తు తన దెబ్బతింటుందనే భయంతోనే చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారని ఆయన తెలిపారు. అసలు ఏసీబీని ఆశ్రయించడానికి తనకు అర్హత లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది అన్నారని.. కానీ న్యాయస్థానం మాత్రం తనను అనర్హుడిగా ప్రకటించలేదు, ఆయనను శాశ్వతంగా ఈ కేసు నుంచి బయట పడేయలేదని గుర్తు చేశారు. కేవలం ఏసీబీ కోర్టు మెమోపై 8 వారాలు మాత్రమే స్టే ఇచ్చిందని అన్నారు. ఈ స్టే వెకేట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హైకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. తాము సమర్పించిన సాక్ష్యాలు సరైనవేనని భావించడం వల్లే ఏసీబీ కోర్టు తెలంగాణ ఏసీబీని కేసు పునర్విచారణకు ఆదేశించిందని ఆర్కే గుర్తుచేశారు.

చంద్రబాబు మాటలు హాస్యాస్పదం: వైఎస్ జగన్

Written By news on Thursday, September 1, 2016 | 9/01/2016


చంద్రబాబు మాటలు హాస్యాస్పదం: వైఎస్ జగన్
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం గోరంట్లలో వేరుశెనగ రైతులతో మాట్లాడారు. ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. వేరుశెనగ రైతుల సమస్యలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెయిన్ గన్ వ్యవస్థ పదేళ్లుగా అందుబాటులో ఉన్నా తానే సృష్టించినట్లు చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. పంట ఎండిపోయే వరకూ బాబు స్పందించలేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
18వేల ఎకరాల్లోనే పంట ఎండిపోయినట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారన్నారు. నెలరోజులుగా ఎండిన పంటలను కాపాడటంలో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యానికి రైతులు నిండా మునిగిపోయారని వైఎస్ జగన్ విమర్శించారు. రెయిన్ గన్ లతో పంటను కాపాడామని ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టేందుకే చంద్రబాబు హడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పంటను ఎలాగూ కాపాడలేకపోయిన ప్రభుత్వం కనీసం ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

దోషిగా తేలుతానన్న భయంతోనే క్వాష్ పిటిషన్


దోషిగా తేలుతానన్న భయంతోనే క్వాష్ పిటిషన్
హైదరాబాద్ :
ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరగాలని ఏసీబీ కోర్టు ఇప్పటికే ఆదేశించిందని, అందువల్ల కోర్టు ఉత్తర్వుల ప్రకారం విచారణ జరగాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. తనపై కేసు కొట్టేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. సీఆర్‌పీసీ 156 (3) కింద విచారణ జరిగితే చంద్రబాబు దోషా.. నిర్దోషా అన్న విషయం తేలిపోతుందని ఆయన చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రను తేల్చేందుకు, ఆయనను దోషిగా చేర్చాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆర్కేనే.

''విచారణ అర్హత ఉందని ఏసీబీ కోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. నిజంగా చట్టాల మీద, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటే, అప్పీలుకు వెళ్లొద్దని స్పష్టంగా అడిగాను. విచారణ ఎదుర్కోడానికి మీకు ఎందుకు భయం.. దోషి అన్న విషయం మీకే తెలుసు కాబట్టే ఇలా చేస్తున్నారా? ఈ రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా గడుపుతూనే ఉన్న మీరు.. ఈరోజు ఎందుకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాల్సిందే. ఈ రెండు రోజుల్లో భయం లేనట్లు నటిస్తూనే గవర్నర్ వద్దకు ఎవరెవర్ని పంపారో ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది. చట్టంలో ఉన్న చుట్టాలు కూడా ఎవరూ రక్షించలేరని తెలియడం వల్లే క్వాష్ పిటిషన్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది'' అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.

దర్యాప్తు జరిగితే తాను దోషిగా తేలుతానన్న విషయం చంద్రబాబుకు తెలుసని, తన గొంతును ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లు ధ్రువీకరించినందు వల్లే బాబు భయపడుతున్నారని ఆర్కే అన్నారు. ఈ కేసులో తన పాత్ర బయట పడుతుందన్న భయంతోనే బాబు క్వాష్ పిటిషన్ వేశారన్నారు. గతంలో చాలామంది మహామహులు సీఆర్‌పీసీ 156 (3) కింద విచారణను ఎదుర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. జయలలిత, జస్వంత్ సింగ్, కేంద్రమంత్రులు అందరూ ఇదే సెక్షన్, క్లాజు కింద విచారణ ఎదుర్కొన్నారన్నారు. అసలు విచారణ ఎదుర్కోకుండానే కేసు నుంచి తప్పించుకోవాలని ఆయన కోరడమేంటని ప్రశ్నించారు.  దాన్ని బట్టే మీరు ఎంత తప్పు చేశారో తెలిసిపోతోందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వాళ్లు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన చెప్పారు.

హడావుడిగా గవర్నర్ ను కలవడం వెనుక కారణమేంటి?

Written By news on Wednesday, August 31, 2016 | 8/31/2016


'ఏదో ఒక రోజు చంద్రబాబు దొరకడం ఖాయం'
తిరుపతి: కేంద్ర మంత్రి సుజనా చౌదరి హడావుడిగా గవర్నర్ నరసింహన్ ను కలవడం వెనుక కారణమేంటి? అని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి  ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశానికి గవర్నర్ కు సంబంధం ఏమటి? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. బుధవారం తిరుపతిలో భూమన మీడియా సమావేశంలో మాట్లాడారు. గవర్నర్ తీరు పైనా అపనమ్మకం కలిగేలా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ విషయంపై రాజ్ భవన్ వర్గాలు ప్రకన ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఎవరికి లొంగరు కాబట్టి.. టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడే బాధ్యతను సుజనా తన భుజాలపై వేసుకున్నారంటూ విమర్శించారు.

హైదరాబాద్ లో చిన్నపాటి కేసుల్లో నిందితులనే అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. కానీ, రాజ్యాగం పదవిలో ఉన్న చంద్రబాబును ఎందుకు వదిలేశారు' అని భూమన ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు.. తాను నిప్పుంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబూ.. ఇప్పటివరకూ మీకు ఏ కోర్టు కడిగిన ముత్యమని తీర్పునిచ్చిందో? చెప్పాలన్నారు. స్మగ్లర్ వీరప్పన్ కూడా 20 ఏళ్లు పోలీసులకు దొరకలేదు. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలుసునని అన్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడించిన బిన్ లాడెన్ లాంటి ఘోరమైనటువంటి వాడికి కూడా ఆఖరి ఘడియ తప్పలేదని హితవు పలికారు. అలాగే చంద్రబాబు నేరాలు, ఘోరాల్లో ఇప్పటివరకూ దొరక్కపోయి ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు చంద్రబాబు దొరకడం ఖాయమని భూమన జోస్యం చెప్పారు.

వచ్చే నెల 29లోపు చంద్రబాబును విచారణ జరుపుతాం

 ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ బుధవారం మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విచారిస్తామని ఏసీబీ అధికారులు ఆ మెమోలో పేర్కొన్నారు. గతంలో దాఖలు చేసిన ఛార్జ్ సీట్ ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్ ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. (ఛార్జ్ షీట్ నెంబర్ 15/16గా నమోదు చేసుకుంది)
గతంలో నమోదైన ఎఫ్ ఐఆర్ ఆధారంగా విచారణ కొనసాగిస్తామని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా కోర్టుకు విన్నవించారు. సెప్టెంబర్ 29లోపు చంద్రబాబుపై విచారణ జరిపి నివేదిక సమర్పిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేత రేవంత్ రెడ్డి, ఉదయసింహా, సెబాస్టియన్ లను సెప్టెంబర్ 29న విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది.

ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు


‘ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు’
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసుపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబుతో లాలుచి పడకుండా విచారణ చేయించాలని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కేసును నీరు గార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి హుటాహుటిన హైదరాబాద్ వచ్చి గవర్నర్ ను కలవడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..
 • ఓటుకు కోటు కేసులో నెల రోజుల్లో విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. అస్సలు ఈ కేసు నిలవదని టీడీపీ నేతలు చెప్తుతున్నారు
 • అదే సందర్భంలో ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడితో సుజనా చౌదరి భేటీ అయ్యారు
 • వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 • ఈ ఉదయం సుజనా చౌదరి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు
 • గవర్నర్ తో హడావుడిగా సమావేశమయ్యారు
 • ప్రత్యేక హోదా గురించి మాట్లాడానని సుజనా చెబుతున్నారు
 • ప్రత్యేక హోదా రాజ్యాంగపరమైన అంశమా?
 • ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు?
 • రాజ్ భవన్ అను వ్యవస్థను... వ్యవస్థలానే ఉంచాలని కోరుతున్నాం
 • రాజ్ భవన్ గౌరవాన్ని దెబ్బతీయొద్దని కోరుతున్నాం
 • రాజ్ భవన్ ను రాజీభవనంగా, లాలుచిభవనంగాచేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం
 • గవర్నర్ కు తెలంగాణ సీఎం ఏసీబీ డీజీ, అడ్వకేట్ జనరల్ బ్రీఫ్ చేస్తారు
 • పరిపాలనలో భాగంగా వారు బ్రీఫ్ చేసివుండొచ్చు
 • బీజేపీ అధ్యక్షుడితో జరిగిన భేటీలో ప్రత్యేక హోదా అంశాన్ని చర్చిస్తే దాన్ని ప్రధానికి నివేదించాలి గానీ, గవర్నర్ కు చెప్తారా?
 • ఓటుకు కోట్లు కేసులో బీజేపీ మధ్యవర్తిత్వం వహిస్తోందని చెప్పదలిచారా?
 • చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాజ్యాంగానికి అతీతులమని చెప్పాలనుకుంటున్నారా?
 • రాజ్యాంగాన్ని కాపాడాల్సిన కేంద్రం, రాజ్ భవన్ ఇలాంటి కార్యక్రమాలకు వేదిక కావడం సమంజసమా?
 • కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టారని మొదట నుంచీ చెప్తున్నాం
 • చంద్రబాబును ఎవరూ కాపాడలేరని చెప్పిన తెలంగాణ సీఎం ఎందుకు ముందుకు కదల్లేకపోతున్నారు?
 • మొదటి చార్జిషీటులో చంద్రబాబు పేరు ఉన్నా ఆయనను ఎందుకు విచారించలేదు?
 • సామాన్యులకు ఒక న్యాయం, సీఎంకు మరో న్యాయమా?
 • రాజ్​ భవన్ లో ఏం జరిగిందో అధికారిక ప్రకటన ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరముంది
 • టెక్నికల్ అంశాలను అడ్డుపెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటు
 • అన్నిరోజులు మీవి కావని టీడీపీ నాయకులు, చంద్రబాబు గుర్తించాలి
 • ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తుపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించాలి

బాబు విజయవాడ వెళ్లడం వెనక పెద్దకథే..

Written By news on Monday, August 29, 2016 | 8/29/2016


బాబు విజయవాడ వెళ్లడం వెనక పెద్దకథే...
తిరుపతి : ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాలకు తావీస్తోందని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబును ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరన్న కేసీఆర్... 14 నెలలు అయినా ఆ కేసులో అనుబంధ ఛార్జిషీట్ వేయకపోవడం దేనికి నిదర్శనమన్నారు. ఉన్నపళంగా విజయవాడకు చంద్రబాబు నాయుడు పారిపోవడం వెనుక పెద్ద కథే నడిచిందని భూమన అన్నారు. కేసు నుంచి బయటపడేందుకు కేసీఆర్ కు రూ.500 కోట్లు చెల్లించడమే కాకుండా, ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని భూమన విమర్శించారు.

సాక్షాత్తు ముఖ్యమంత్రే లంచాలు ఇస్తూ దొరికిపోతే కేసును ఇంతగా నీరుగార్చుతారా అని ఆయన అన్నారు. చంద్రబాబు కంటే పనికిమాలిన ముఖ్యమంత్రి దేశంలో లేరని భూమన వ్యాఖ్యానించారు. బాబులాంటి అవినీతిపరుడు ముఖ్యమంత్రిగా ఉండటం తెలుగుజాతికి అవమానమన్నారు. కపటం, మోసం తప్ప ఎలాంటి నైతికత లేని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు నిజంగా నిప్పు అయితే ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబును ఎవరూ కాపాడలేరు: అంబటి

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎవరూ కాపాడలేరని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్ని సాక్ష్యాధారాలతో కోర్టును ఆశ్రయించారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోది, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నా ఈ కేసు నుంచి చంద్రబాబు తప్పించలేరన్నారు.

త్వరలో ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు బయటకు రాబోతున్నాయని అంబటి రాంబాబు అన్నారు. గతంలో ఈ కేసులో చంద్రబాబును రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. ప్రతిఫలంగా  ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని అంబటి ధ్వజమెత్తారు. ఈ కేసు జరిగిన 14 నెలలు గడిచినా తెలంగాణ ప్రభుత్వం అదనపు ఛార్జిషీట్ ఎందుకు దాఖలు చేయలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఇక ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నలకు ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని అంబటి అన్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు పోరాటం చేసినా తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు సేవా కార్యక్రమాల్లో  పాల్గొవాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.

మళ్లీ తెరపైకి ఓటుకు కోట్లు కేసు


మళ్లీ తెరపైకి ఓటుకు కోట్లు కేసు
► పునర్విచారణకు ఏసీబీ కోర్టు ఆదేశం
► సెప్టెంబర్ 29లోగా విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వులు
► పిటిషన్ దాఖలు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
► ఫోరెన్సిక్ నివేదికలను కోర్టు ముందుంచిన న్యాయవాది
► వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు

హైదరాబాద్

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. వచ్చేనెల 29వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయాలని ఏసీబీని ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరంపై ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు ముందు ఉంచారు. ఈ నివేదిక ఆధారంగా కేసుపై పునర్విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో పిటిషనర్ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. ఆర్కే దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కేసులో సరైన విచారణ జరగలేదని ఆయన చెప్పారు. ఫోరెన్సిక్ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది కోరారు. తిరిగి విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని అడిగారు. ఆయన వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది.

దాదాపు ఏడాది కాలంగా ఈ కేసు ముందుకు సాగడంలేదు. అప్పట్లో స్టీఫెన్‌సన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపులు అతికించినవా, వాస్తవమైనవా అనే విషయమై నివేదికను ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబ్ ఇచ్చింది. అవి అసలైనవే తప్ప అతికించినవి కావని అప్పట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. దాంతోపాటు ఈ స్వరం చంద్రబాబు నాయుడిదేనని కూడా శాస్త్రీయంగా నిర్ధారించారు. ఇప్పుడు తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పలు సందర్భాలలో చంద్రబాబు మాట్లాడిన స్వర నమూనాలను, ఓటుకు కోట్లు కేసులో వినిపించిన సంభాషణలను అంతర్జాతీయంగా పేరొందిన ఒక ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ ల్యాబ్ అందించిన నివేదికలో కూడా ఆ స్వరం చంద్రబాబుదేనని తేల్చారు. వాటి ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ కోర్టులో కేసు దాఖలు చేశారు.

Popular Posts

Topics :