5/05/2012
YS Jagan anantapur by-poll campaign schedule
Written By news on Saturday, May 5, 2012 | 5/05/2012
5/05/2012
ఉపఎన్నికలో టీడీపీ - కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
ఉపఎన్నికలో టీడీపీ - కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. అందుకే తిరుపతి అర్బన్ ఎస్ పి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో మతాల మధ్య గొడవ పెట్టే విధంగా మాట్లాడిన చంద్రబాబుపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తమని అర్బన్ ఎస్ పి పట్టించుకోలేదన్నారు. రెండు గంటలపాటు అర్బన్ ఎస్ పి కార్యాలయంలో వేచి చూశామని చెప్పారు. ఎస్ పి కార్యాలయంలో ఉండి కూడా సెలవులో ఉన్నానని చెప్పారని తెలిపారు. ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించినట్లు చెప్పారు. చివరకు ఆర్ డిఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబుపై పీపుల్స్ రిప్రజంట్ యాక్ట్ ప్రకారం 425 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
5/05/2012
'ఎన్నికుట్రలు పన్నినా జగన్ కు తిరుగులేదు'
ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి తిరుగులేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ స్సష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనాడు అధినేత రామోజీ రావు, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన హయాంలో వేలాది ఎకరాల భూములు అప్పనంగా కట్టబెట్టారన్నారు. అప్పుడు రామోజీ కళ్లు మూసుకుపోయాయా? అని ప్రశ్నించారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ భూములిచ్చారని తెలిపారు. అది నేరమన్నట్లు 'ఈనాడు' తాటికాయంత అక్షరాలతో రాసిందన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేలాది ఎకరాల భూమిని తక్కువరేటుకే రామోజీ కాజేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మార్, ఐఎంజీ , జిఎంఆర్ లకు చంద్రబాబు వేలాది ఎకరాలివ్వలేదా? అని ఆయన అడిగారు. రామోజీ రావు చంద్రబాబుతో కుమ్మకై రాష్ట్ర ప్రగతిని కుంటుపరిచారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ కుటుంబాన్ని, జగన్‌ను ప్రజల నుంచి వేరు చేయలేరని ఆయన అన్నారు.
5/05/2012
'జగన్ తిరుమల దర్శనంపై వివాదం తగదు'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని దర్శనంపై వివాదం తగదని మాజీ మంత్రి శంకరరావు హితవు పలికారు. హిందూ మతం గంగానది లాంటిది. వెంకటేశ్వరస్వామిని ఎవరైనా దర్శించుకోవచ్చు. స్వామివారి దర్వనాన్ని వివాదం చేయడం హిందూ మతానికే అపచారం చేసినట్లు అని ఆయన అన్నారు. జగన్ తిరుమల దర్శనం వివాదానికి కాంగ్రెస్ నేతలు ఫులిస్టాప్ పెట్టకపోతే అది బూమారంగై కాంగ్రెస్‌నే దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించినందుకు తనని మంత్రి మండలి నుంచి తొలగించారని, అగ్రకుల మంత్రి సిఎంని విమర్శిస్తే ఎందుకు తొలగించలేదన్న భావన ప్రజల్లో ఉందన్నారు. మద్దిలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

'జగన్ సిఎం కావాలని ఎదురుచూస్తున్న ప్రజ'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రైతులు, రైతు కూలీలు, రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారని ఆ పార్టీ నేత, సినీనటుడు గిరిబాబు అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఉపఎన్నికల్లో గెలుపు కోసం డబ్బు, మందు విచ్చలవిడిగా ఖర్చుపెట్టినా కనీసం డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఆ రెండు పార్టీలకు అవమానకర ఫలితాలు వస్తాయన్నారు. ఎన్ని అబద్దాలు చెప్పైనా కనీసం 2 లేదా 3 సీట్లు గెలవాలని ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఉపఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి భారీగా వలసలు ఉంటాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చిదంబరంతో చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ స్పష్టమైందన్నారు. దీంతో టీడీపీ నేతలు ఏలా సర్దిచెప్పుకోవాలో అర్థంకాని స్థితిలో ఉన్నారన్నారు.
5/05/2012
జనసంద్రమైన రాజంపేట
‘నేల ఈనిందా.. ఆకాశం ఊడిపడిందా’.. అన్న చందంగా రాజంపేట పురవీధులు జనసంద్రంతో హోరెత్తాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా, చిన్న, పెద్దా తేడా లేకుండా మూడు గంటల పాటు సాగిన ర్యాలీలో పాల్గొని మీకు మేమున్నాం అంటూ జగన్‌కు అండగా నిలిచారు.
శుక్రవారం ఉదయం 9.20 గంటలకు తాజీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి అమరనాథరెడ్డి ఇంటి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ పార్టీ నేతలు జేసీబీ సుబ్బారెడ్డి, సాయిబాబా, పోలా శ్రీనివాసరెడ్డి, రామరాజుల ఇళ్లకు వెళ్లి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన గంగాధ ర కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం కాంగ్రెస్ వర్గీయుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుల్లంపేట వాసి నరసయ్యను పరామర్శించారు.అన్నమయ్య కళాశాల ఛైర్మన్ చొప్పా యల్లారెడ్డితో కొద్దిసేపు చర్చించారు. అక్కడి నుంచి మన్నూరు సమీపానికి 11.45 గంటలకు చేరుకున్నారు. అప్పటికే మహిళలు, వృద్ధులు, పిల్లలు పెద్ద ఎత్తున జననేత కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అక్కడి నుంచి రాజంపేట పట్టణంలోకి ర్యాలీ ప్రారంభం అయింది. సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న పాత బస్టాండ్ చేరేందుకు రెండు గంటల సమయం పట్టింది.
దారిపొడవునా అభివాదం చేస్తూ, ఆత్మీయ పలకరింపులు చేస్తూ జగన్ ముందుకు సాగారు. ర్యాలీ సాయంత్రం 3 గంటలకు ముగిసింది. అనంతరం వీరబల్లికి బయలుదేరగా మార్గమధ్యంలోని పాలెం వద్ద మహిళలు జననేతను చూసేందుకు పరుగెడుతూ వచ్చారు. వారిని గమనించిన జగన్ కాన్వాయ్ నిలిపారు. నీవు సల్లంగా ఉండాల సామి అంటూ కాళ్లపై పడే ప్రయత్నం చేశారు. అయితే వారిని వారిస్తూ ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరించారు. అనంతరం రెండు కొండల నడుమ ఉన్న బాలరాచుపల్లె మీదుగా సానిపాయికి 4.20 గంటలకు చే రుకున్నారు.

అమరన్నను ఆశీర్వదించండి
|
5/05/2012
సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌తో కలిసి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ ఎమ్మెల్యే ఒకరు భారీ స్థాయిలో సెటిల్‌మెంట్లు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఆ మాటకారి ఎమ్మెల్యే భానుకిరణ్‌ను అడ్డం పెట్టుకుని రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భూ దందాలకు పాల్పడినట్లు సీఐడీ విచారణలో బయటపడింది. తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రి కుమారుడితో పాటు, మరో మంత్రి బంధువు కూడా భాను భూ దందాలకు తోడ్పాటునందించినట్లు తెలిసింది. రాజధాని శివార్లలో భూ దందాలు, సెటిల్‌మెంట్‌లకు వారు భానుకిరణ్‌ను ఉపయోగించుకున్నట్లు తేలింది. తొమ్మిది రోజులపాటు సీఐడీ కస్టడీలో ఉన్న భానుకిరణ్ అధికార, ప్రతిపక్ష నేతలతో కలిసి తాను చేసిన భూ దందాల వివరాలను పూస గుచ్చినట్లు వెల్లడించాడు. టీడీపీ యువ ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి కుమారుడితో కలిసి చేసిన దందాల వివరాలను కూడా బట్టబయలు చేశాడు. రంగారెడ్డి జిల్లా గండిపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో వందల కోట్ల విలువైన అనేక ఎకరాల భూమి సెటిల్‌మెంట్‌లో టీడీపీ యువ ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి కుమారుడు కీలకపాత్ర పోషించినట్లు సీఐడీ విచారణలో భాను వెల్లడించాడు. అయితే భానుకిరణ్ చెపుతున్న విషయాలకు అనుగుణంగా పూర్తిస్థాయి సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాతే.. అతనితో కలిసి సెటిల్‌మెంట్లలో పాల్గొన్నవారి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని సీఐడీ అధికారులు చెప్పారు.
టీడీపీ యువ ఎమ్మేల్యేతో భాను బంధం!

5/05/2012
‘‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనతో భేటీ అయినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి చిదంబరం స్పష్టంగా చెప్పారు. అయినా చంద్రబాబు ఇంకా బుకాయిస్తున్నారు. అంటే.. ప్రజలు పిచ్చివాళ్లని బాబు అనుకుంటున్నారా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ పార్టీతో ఢిల్లీ స్థాయిలోనే చంద్రబాబు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని మేము మొదటి నుంచీ చెబుతున్న విషయం ఇప్పుడు రుజువైంది. ప్రత్యేక ఎజెండాతో రాష్ట్ర రాజకీయాలను ఇద్దరూ కలిసే నడుపుతున్నారు. బాబు సలహాలు, సూచనలతో కేంద్ర ప్రభుత్వాన్ని వయాగా చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని మేము చెబుతున్నది చిదంబరం వ్యాఖ్యల ద్వారా బట్టబయలైంది. ఇప్పటికైనా చిదంబరంతో కుదిరిన రహస్య ఒప్పందమేమిటో చంద్రబాబు బయటపెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మీ ఒప్పందం ఫలితంగానే బాబుపై ఉన్న అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులు కనీసం విచారణకు రాకుండానే ఆగిపోయాయి. విజయమ్మ వేసిన పిల్‌తో కోర్టు విచారణకు ఆదేశించినప్పుడు.., సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలుగా సీబీఐ విచారణ జరగకుండా ఆలస్యం చేయడం ఇందులో భాగమే. ఆ ఒప్పందం ఫలితంగానే జగన్‌ను, ఆయన కుటుంబాన్ని ఇద్దరూ కలిసే వేధించారు’’ అని గట్టు ఆరోపించారు.
‘‘చిదంబరం కుమారుడు, టీడీపీ రాజ్యసభ సభ్యుని మధ్య ఉండే వ్యాపార సంబంధాలు.. చిదంబరం- చంద్రబాబుల మధ్య రాజకీయ సంబంధంగా మారింది. అందులో భాగంగానే చంద్రబాబు కూడా పార్టీలోని సీనియర్లను కాదని సుజనా చౌదరి, సీఎం రమేష్, నామా నాగేశ్వరరావులాంటి వారికి ఢిల్లీలో ప్రాధాన్యతనిచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు’’ అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన సంక్షోభాలకు అధికార, ప్రధాన ప్రతిపక్షాల మధ్య అనైతికంగా కుదుర్చుకున్న అవగాహనే కారణమని తెలిపారు. భవిష్యత్‌లో టీడీపీకి రెండు లేదా మూడు పార్లమెంట్ సీట్లు వచ్చినా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని చంద్రబాబు ఒప్పందం చేసుకొని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆయనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి చిదంబరంతో భేటీ కావడం చూస్తే.. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మునిగిపోతున్న టీడీపీని వదిలి కాంగ్రెస్‌లోకి దూకేందుకు సిద్ధపడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీలు రెండూ మునిగిపోయే పడవలే అయినందున బాబు ప్రయత్నం ఫలించకపోవచ్చని ఎద్దేవా చేశారు. ‘‘టీడీపీ జెండా, ఎజెండా చంద్రబాబువి కావు. గుంజుకున్నవే. వాళ్లు తిరిగి గుంజుకుంటే మిగిలేది ఒంటరిగానే కదా. అప్పుడు కాంగ్రెస్‌లో కలవడం తప్ప మరేమీ ఉండదుగా’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అప్పుడు ఆనందించింది కిరణేగా!
సీఎల్పీ సాక్షిగా డీఎల్ రవీంద్రారెడ్డి, శంకర్రావు.. వైఎస్‌ని విమర్శిస్తుంటే చూస్తూ ఆనందపడిన కిరణ్‌కుమార్‌రెడ్డి మూతే ఇప్పుడు కాలుతోందని గట్టు ఎద్దేవా చేశారు. ‘‘ఆరోజు రాజశేఖరరెడ్డిగారిని వీళ్లు విమర్శిస్తుంటే ఆనందపడింది సీఎం కాదా? ఎదుటి వారి చేతులు కాలాయని ఆనందపడితే ఈరోజు నీ మూతే కాలుతోంది. వైఎస్‌ని విమర్శించాలని ఆరోజు అధిష్టానం ఆదేశించిందని స్వయంగా శంకర్రావే చెప్పారు’’ అని గుర్తు చేశారు. సీఎంపై డీఎల్, శంకర్రావు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపడుతున్న వారు.. ఇదే నేతలు ఆనాడు వైఎస్‌ను విమర్శిస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
‘చిదంబర రహస్యం’ చెప్పండి
5-5-12-2792.jpg)

కొండా సురేఖ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తెలంగాణ జిల్లాల నేతల పిలుపు
పోటీపై కేసీఆర్ పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి
హైదరాబాద్, న్యూస్‌లైన్: పరకాల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ విజయం కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలని, ఇదొక యజ్ఞంలా భావించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకే కొండా సురేఖ అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ జిల్లాల కన్వీనర్లు, పరిశీలకులు, కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో పాటు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. అనంతరం సమావేశ వివరాలను పార్టీ తెలంగాణ జిల్లాల రీజినల్ సమన్వయకర్తలు బాజిరెడ్డి గోవర్దన్, కె.కె.మహేందర్‌రెడ్డిలు విలేకరులకు వివరించారు. పరకాలలో కొండా సురేఖ విజయం కోసం అనుసరిం చాల్సిన వ్యూహాలు, ఇతర పార్టీల కుట్రలను తిప్పికొట్టే అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలకు ఇన్‌చార్జిలను నియమిస్తామని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్, టీడీపీల కంటే వైఎస్‌ఆర్ సీపీ స్పష్టమైన వైఖరి ప్రకటించిందన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించినందుకే.. రాజీనామా చేసిన వారి స్థానాల్లో తమ పార్టీ పోటీ పెట్టలేదని గుర్తు చేశారు.
టీ-జేఏసీ పిలుపు మేరకే సురేఖ రాజీనామా
తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకే కొండా సురేఖ అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారని బాజిరెడ్డి తెలిపారు. తెలంగాణ బిడ్డలైతే అవిశ్వాసాన్ని నెగ్గించాలని జేఏసీ చైర్మన్ కోదండరాం, స్వామిగౌడ్‌లు ప్రకటనలు చేశారని, పదవులు పోతే గెలిపించే బాధ్యత తమదేనని వారిచ్చిన వాగ్దానాలను గుర్తుచేశారు. ఈ విషయమై రాజకీయ జేఏసీ మద్దతు కోరుతూ త్వరలో లేఖ రాయనున్నట్లు ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం సురేఖ గతంలో రెండుసార్లు రాజీనామా చేసిందనీ, ఆమె చేసిన రాజీనామా ఇప్పటికీ స్పీకర్ వద్ద పెండింగ్‌లోనే ఉందన్నారు. కాంగ్రెస్ కుట్రలో భాగంగానే స్పీకర్ ఆమోదించలేదని చెప్పారు. కానీ కొన్ని పార్టీలు, ఓ వర్గం మీడియా తమ పార్టీనేతలు, అధ్యక్షుడిపై దుష్ర్పచారం చేస్తోందని మండిపడ్డారు. అలాగే, పరకాల ఉప ఎన్నికపై కేసీఆర్ పునరాలోచించుకోవాలన్నారు. పరకాలలో కొండా సురేఖ తప్పకుండా గెలుస్తారని బాజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఏదైనా తెలంగాణవాదాన్ని గెలిపించాలన్న జేఏసీ పిలుపును గౌరవించి బాసటగా నిలిచింది సురేఖ మాత్రమేనని కేకే మహేందర్‌రెడ్డి చెప్పారు. వైఎస్ కుటుంబం కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన సురేఖ, తెలంగాణ కోసం తన ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారని వివరించారు.

రిలయన్స్‌కు నిజంగా షాకేనా!
|
5/05/2012
మంత్రి మహీధర్‌పై ఈసీకి ఫిర్యాదు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసీని కోరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం కందుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మాచవరం గ్రామంలో ఓటర్లకు ‘దీపం’ కనెక్షన్లు పంపిణీ చేశారని ఈసీ దృష్టికి తెచ్చారు. అనంతరం జనక్‌ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఓటర్లను కొనుగోలు చేసేందుకు కోడ్‌ను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ఒకవైపు కాంగ్రెస్ సర్కారు ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తుండగా.., మరోవైపు టీడీపీ పసుపు రంగు మోటారు సైకిళ్లు పంపిణీ చేస్తోందని దుయ్యబట్టారు.
5/05/2012
బట్టబయలైన బాబు ‘మ్యాచ్‌ఫిక్సింగ్’
సీబీఐ విచారణ నుంచి బయటపడేందుకే హోంమంత్రితో రహస్య భేటీ?
అందుకు బలం చేకూర్చేలా జగన్, ఎమ్మార్ కేసుల్లో సీబీఐ దర్యాప్తు
జగనే లక్ష్యంగా ‘నానా కోణాల్లో’ ‘ఆగమేఘాలపై’ దర్యాప్తు చేస్తున్న సీబీఐ
ఎమ్మార్ కేసులో బాబు ప్రమేయం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నా పట్టించుకోని వైనం
దర్యాప్తుతో తనను ఇబ్బంది పెట్టొద్దని కేంద్రాన్ని కోరిన బాబు?
అందుకు ప్రతిగా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టబోమంటూ ఆఫర్!
చిదంబరం తాజా వ్యాఖ్యలపై టీడీపీలో తీవ్ర కలకలం
ఆంతర్యమేంటో తెలుసుకోవాలంటూ నేతలను పురమాయించిన బాబు
ఈ విషయం పొలిట్‌బ్యూరోలో చర్చకు రాకుండా జాగ్రత్తపడ్డ వైనం
హైదరాబాద్, న్యూస్‌లైన్: పరదా తొలగింది. బడా బాబుల చీకటి మాటు భేటీల తాలూకు ‘చిదంబర’ రహస్యం ఎట్టకేలకు బట్టబయలైంది. రెండున్నరేళ్లుగా అనేకాంశాల్లో అధికార కాంగ్రెస్‌తో అంటకాగుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ‘మ్యాచ్‌ఫిక్సింగ్’ బండారం లోక్‌సభ సాక్షిగా తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. బాబు తనను కలిశారంటూ స్వయానా కేంద్ర హోం శాఖ మంత్రి చిదంబరం లోక్‌సభలోనే వెల్లడించడంతో టీడీపీ నాయకత్వం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది. బాబు- చిదంబరం భేటీ జరిగిన ఒకట్రెండు రోజులకే జగన్ సంస్థల్లో పెట్టుబడులు, ఎమ్మార్ కేసుల్లో హైకోర్టు తీర్పు వెలువడటం, ఆ తర్వాత వారం రోజులకు వాటిపై సీబీఐ దర్యాప్తు మొదలవడం తెలిసిందే. ఆ రెండు దర్యాప్తులు సాగుతున్న తీరుపై మొదటినుంచీ సర్వత్రా పలు అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతే ఏకైక లక్ష్యంగా ఆయన ఆస్తుల కేసు దర్యాప్తును ‘యుద్ధ ప్రాతిపదిక’న రేయింబవళ్లూ కొనసాగిస్తున్న సీబీఐ.. ఎమ్మార్ కుంభకోణంలో మాత్రం బాబు ప్రమేయం అడుగడుగునా కొట్టొచ్చినట్టుగా కన్పిస్తున్నా అసలే పట్టించుకోని వైనం రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తూనే ఉంది. దీని వెనక దాగున్నది బహుశా ఈ ‘చిదంబర రహస్యమే’నన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. జగన్ ఉదంతంపై అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నేతలే సంయుక్తంగా హైకోర్టులో కేసులు వేయడం, అక్కడి నుంచి సీబీఐ దర్యాప్తు దాకా అంతా ఆగమేఘాలపై జరిగిపోవ డం తెలిసిందే. ఎమ్మార్ దర్యాప్తులో తీగ లాగితే తన డొంకే కదులుతుం దని కలవరపడ్డ బాబు, జగన్ కేసుతో పాటు ఈ విషయంపై కూడా చిదంబరంతో రహస్య భేటీలో చర్చించారని భావిస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన ఏఐసీసీ నాయకుడు ఒకరు ఈ విషయమై చేసిన వ్యాఖ్యలు కూడా ఈ అనుమానాలను ఊతమిచ్చేవిగానే ఉండటం విశేషం! ప్రైవేటు వ్యవహారాలు చక్కదిద్దుకునేందుకే ఆయన్ను బాబు రాత్రి మాటున గుట్టుగా కలుసుకున్నారని ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు. ఎంత చిన్న పని చేసినా, మీడియాను మేనేజ్ చేసి మరీ దానికి వీలైనంత ప్రచారం పొందేందుకు ప్రయత్నించే బాబు నైజాన్ని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఒకవేళ నిజంగానే రాష్ట్ర సమస్యలు తదితరాలపైనే చిదంబరాన్ని కలిసి ఉంటే, ఆ విషయాన్ని తక్షణం మీడియాకు పూసగుచ్చినట్టు చెప్పేవారని, దానికి వీలైనంత కవరేజీ ఇప్పించుకునేందుకు ప్రయత్నించేవారని వ్యాఖ్యానించారు. బాబు నిజంగా కలవనిదే కేంద్ర హోంమంత్రి వంటి బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి, ఏకంగా లోక్‌సభలో ఆ విషయాన్ని అంత ఎలా ఆషామాషీగా చెబుతారని ఆయన ప్రశ్నించారు. 2011 ఆగస్టులో రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా బాబు ఒకరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎస్పీజీ కమెండోలు, పోలీసు భద్రత లేకుండా ఒక ఎంపీ, తన వ్యక్తిగత భద్రతాధికారితో
కలిసి రహస్యంగా వెళ్లి చిదంబరంతో అరగంట పాటు భేటీ అయినట్టు వార్తలు రావడం తెలిసిందే. ఎంపీని కూడా బయటికి పంపి ఒంటరిగానే మంతనాలు సాగించారని కూడా అప్పట్లో పలు చానళ్లు ప్రసారం చేశాయి. ఆ రాత్రి బాబును కలిసేందుకు ప్రయత్నించిన పలువురు టీడీపీ ఎంపీలకు కూడా ఆయన ఎక్కడున్నారన్న దానిపై ఏ సమాచారమూ తెలియలేదు. దాంతో ఆయనెటు వెళ్లి ఉంటారా అంటూ వారంతా లోతుగా ఆరా తీశారు కూడా! బాబు-చిదంబరం రహస్య భేటీ జరిగిన ఒకట్రెండు రోజులకే జగన్ సంస్థల్లో పెట్టుబడులు, ఎమ్మార్ కేసులపై హైకోర్టు తీర్పు వెలువడింది. ఆ తర్వాత వారం రోజులకే ఇటు జగన్‌పై, అటు ఎమ్మార్‌కు సంబంధించిన సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. జగన్ కేసు దర్యాప్తును సీబీఐ యుద్ధ ప్రాతిపదికన, తన చరిత్రలోనే ఎన్నడూ లేనంత వేగంగా ‘నానా కోణాల్లో’ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఎమ్మార్ కుంభకోణానికి మూల కారణమైన ఒప్పందం 2002లో చంద్రబాబు సీఎంగా ఉండగానే కుదరడం బహిరంగ రహస్యమే అయినా, హైదరాబాద్ నడిబొడ్డున ఏకంగా 535 ఎకరాల అతి విలువైన భూమిని ఒప్పందం ముసుగులో ఎమ్మార్‌కు ఆయన కారుచౌకగా కట్టబెట్టినా.. సీబీఐ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడమే లేదు. ఎమ్మార్ కేసులో 2004కు ముందు, ఒప్పందం కుదిరినప్పటి నుంచీ జరిగిన లావాదేవీలన్నింటిపైనా దర్యాప్తు జరపాలని ఎన్ని డిమాండ్లు వచ్చినా తనకు వినిపించనట్టే వ్యవహరిస్తోంది. పైగా, అది కుదరదంటూ న్యాయస్థానాల సాక్షిగా సీబీఐ తన వైఖరిని ఇప్పటికే వెల్లడించింది కూడా! కనీసం ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబును కనీసం విచారించడానికి కూడా అది సాహసించడం లేదు. ఈ వైఖరిపై అప్పట్లోనే రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. జగన్ విషయంలో ఓవర్‌టైమ్ పని చేస్తూ, ఎమ్మార్ కేసులో మాత్రం కొట్టొచ్చినట్టుగా కన్పిస్తున్న బాబు పాత్రపై విచారణ ఊసే ఎత్తని సీబీఐ తీరులో ఏదో మతలబు దాగుందన్న అనుమానాలు మొదటి నుంచీ వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యం నుంచి చూస్తే, బాబు తనను కలిశారన్న చిదంబరం తాజా ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
సర్కారుకు బాసట - ఎమ్మార్ కేసులో ఊరట
కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనానికి ముందు రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రతిపాదన తెరపైకి రావడం, ప్రధాన విపక్షం టీడీపీ ఈ విషయంలో తన బాధ్యతను విస్మరిస్తోందంటూ ఇతర పార్టీల నుంచి భారీగా విమర్శలు రావడం తెలిసిందే. 2011 జనవరిలోనే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ ఇతర పక్షాలు టీడీపీపై బాగా ఒత్తిడి తెచ్చాయి. అయినా బాబు మాత్రం దానిపై ఎటూ తేల్చలేదు. పైగా ‘‘ఎవరో చెబితే పెడతామా? అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో మాకు తెలుసు’’ అంటూ విషయాన్ని దాటవేశారు. అవిశ్వాసం పెట్టబోమని చిదంబరంతో రహస్య భేటీ కంటే ముందు చేసిన ఢిల్లీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌కు బాబు చెప్పినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా ప్రభుత్వాన్ని కాపాడుతామంటూ పటేల్‌కు ఫోన్ చేసి మరీ బాబు భరోసా ఇచ్చారని ప్రచారం జరిగింది. ప్రభుత్వం పడిపోకుండా చూస్తామంటూ బాబు స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పడంతో ఎంతో విస్మయానికి లోనయ్యానని అహ్మద్ పటేలే తన సన్నిహితులతో వ్యాఖ్యానించారని అప్పట్లో కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్పాయి! నాటినుంచీ బాబు ఏదో ఒక మిషతో ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారంటున్నారు. జగన్‌పై బాబు ఆరోపణలు, సీబీఐ విచారణ డిమాండ్ల నేపథ్యంలో బాబుపై కూడా సీబీఐ విచారణ జరగాలంటూ ఎన్నో డిమాండ్లు రావడం తెలిసిందే. సరిగ్గా ఈ నేపథ్యంలోనే చిదంబరంతో బాబు రహస్య భేటీ జరిగిందని చెబుతున్నారు. ‘‘అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోం. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పడిపోకుండా చూస్తాం. బదులుగా సీబీఐ కేసుల వ్యవహారంలో కేంద్రం నన్ను ఇబ్బందులపాలు చేయకుండా చూడండి’’ అంటూ బాబు కోరినట్టు తెలుస్తోంది.
గుట్టు విప్పడంపై ఆంతర్యం...?
బాబు తనను కలిసిన విషయాన్ని తొమ్మిది నెలల తర్వాత, అదీ లోక్‌సభలో చిదంబరం ఎందుకు బయట పెట్టాల్సివచ్చిందో అర్థంకాక టీడీపీ నేతలంతా తలపట్టుకుంటున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్యులతో గురువారం దీనిపై బాబు తన నివాసంలో రెండు గంటలపాటు తర్జనభర్జన జరిపారు. దీనిపై విలేక రులతో ఎవరు, ఏం మాట్లాడాలా అంటూ మల్లగుల్లాలు పడ్డారు. చివరికి, మీడియాతో మాట్లాడి మరిన్ని ఇబ్బందులు తేవొద్దని నిర్ణయించారు. ఆ తర్వాత చిదంబరం వ్యాఖ్యలు అవాస్తవమంటూ బాబు ఒక ప్రకటన విడుదల చేసి సరిపెట్టడం తెలిసిందే. అయితే.. ఈ రహస్య భేటీపై ఆ మర్నాడే చానళ్లన్నీ కోడై కూస్తే, వాటిపై స్పందించాల్సిన అవసరం లేదని ఆ రోజు ఢిల్లీలో బాబు వ్యాఖ్యానించారు! నాటి ఎంపీ మైసూరారెడ్డి నివాసంలో టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, నిమ్మల కిష్టప్ప, రమేశ్ రాథోడ్, వేణుగోపాలరెడ్డి, మాజీ ఎంపీ లాల్‌జాన్ బాషా తదితరుల సమక్షంలోనే విలేకరులతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై సీబీఐ విచారణను ఓ విలేకరి ప్రస్తావించారు. సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పే మీరు, ఈ రోజు జగన్‌పై విచారణ జరపడాన్ని ఎలా చూస్తారని ప్రశ్నించగా, ‘అప్పటికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసముంది’ అంటూ బాబు బదులిచ్చారు!
టీడీపీ నేతల ఆరా
బయట పడకూడదనుకున్న విషయాన్ని చిదంబరం యాదృ చ్ఛికంగా బయటపెట్టారా, లేక లోక్‌సభలో టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు తీరుపై ఆగ్రహంతో వెల్లడించారా అంటూ పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. దీని ఆంతర్యంపై ఆరా తీయాల్సింది ఢిల్లీలో ఉన్న పార్టీ నేతలను బాబు ఆదేశించినట్టు టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. పార్టీకి చెందిన ఓ ఎంపీ కుమారుడి ద్వారా ‘చిదంబర’ రహస్యాన్ని తెలుసుకోవాలని బాబు కోరినట్టు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పొలిట్‌బ్యూరో భేటీలో దీనిపై బాబు వివరణ ఇస్తారని భావించామని టీడీపీ నేతలు కొందరు చెప్పారు. కానీ దీనిపై ఎక్కువ చర్చ పెడితే మరింతగా జనంలోకి వెళ్తుందన్న ఉద్దేశంతో ఎక్కువగా చర్చే జరగకుండా ఆయన జాగ్రత్త పడినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి
నీకూ నాకూ డ్యాష్..డ్యాష్

చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 కలిసి కాంగ్రెస్‌తో
|
5/05/2012
రేపు అనంతపూర్ కు జగన్ రాక
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6,7 తేదీల్లో అనంతపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని నియోజకవర్గ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు వారు శుక్రవారం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన వివరాలను ఓ ప్రకటనలో తెలియజేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా, మహానేత వైఎస్ ఆశయసాధనే లక్ష్యంగా కృషి చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను అన్ని వర్గాల వారు విజయవంతం చేయాలని కోరారు. అధికార, ప్రతిపక్ష పార్టీల దిమ్మతిరిగేలా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
జగన్ పర్యటన సాగేదిలా...
తేదీ : 6.5.2012
ఉదయం 10.00 గంటలు : మాజీ శాసనసభ్యుడు బి.గురునాథరెడ్డి ఇంటి నుంచి బయలుదేరి అరవింద్‌నగర్ చర్చి మీదుగా విద్యుత్ నగర్‌లో
రోడ్‌షో
10.30 : అంబేద్కర్ భవన్ సర్కిల్‌లో రోడ్‌షో
11.00 : అశోక్ నగర్ సర్కిల్‌లో రోడ్‌షో
11.30 : హరిహర దేవాలయం సమీపంలో రోడ్‌షో
12.00 : హౌసింగ్‌బోర్డు సర్కిల్‌లో రోడ్‌షో (వెంకటేశ్వరస్వామి సర్కిల్)
మధ్యాహ్నం 12.30 : నవోదయ కాలనీ సర్కిల్‌లో రోడ్‌షో
1.00 : సుశీలరెడ్డి కాలనీ, రామకృష్ణ కాలనీల్లో రోడ్‌షో
1.30 : లెనిన్ నగర్, ఎన్‌టీఆర్ కాలనీ, వెంగమనాయుడు కాలనీలలో
రోడ్‌షో
మధ్యాహ్నం 2.30 నుంచి 3.00 గంటల వరకు విరామం
3.00 : కలెక్టరేట్ వద్ద రోడ్‌షో
3.30 : పవర్ ఆఫీసు నుంచి గాంధీ బజారు వరకు రోడ్‌షో
సాయంత్రం 4.30 : తాడిపత్రి బస్టాండ్‌లో రోడ్‌షో
5.00 : బ్రహ్మంగారి గుడి మీదుగా రాణీనగర్, వినాయకనగర్,
40 అడుగుల రోడ్ సర్కిల్ వరకు రోడ్‌షో
5.30 : వినాయకనగర్ 80 అడుగుల రోడ్డు మీదుగా మేడా పెట్రోల్‌బంక్
(గుత్తిరోడ్డు) వరకు రోడ్‌షో
6.00 : నీలం థియేటర్ సర్కిల్‌లో రోడ్‌షో
6.30 : వేణుగోపాల్‌నగర్ సర్కిల్(సాయిబాబాగుడి)లో రోడ్‌షో
రాత్రి 7.00 : తారకరామ కొట్టాలు(80 అడుగుల రోడ్డు)లో రోడ్‌షో
7.30 : ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌లో రోడ్‌షో
8.00 : శ్రీకంఠం సర్కిల్‌లో రోడ్‌షో
రాత్రి 9 గంటలకు ప్రచారం ముగించుకుని
మాజీ శాసనసభ్యుడు బి.గురునాథరెడ్డి నివాసానికి చేరుకుంటారు.
తేదీ : 7.5.2012
ఉదయం 10.0 : మాజీ శాసనసభ్యుడు బి.గురునాథరెడ్డి ఇంటి నుంచి
బయలుదేరి రామ్‌నగర్ రైల్వే గేటు మీదుగా విష్ణుప్రియ
హోటల్ వద్ద రోడ్‌షో
10.30 : రుద్రంపేట మీదుగా చంద్రబాబునాయుడు కాలనీలో రోడ్‌షో
11.00 : విమలాఫరూక్ నగర్(వైఎస్సార్ సీపీ ఆఫీసు) మీదుగా రోడ్‌షో
11.30 : రుద్రంపేట సర్కిల్‌లో రోడ్‌షో
12.00 : లక్ష్మినగర్ నాగులకట్ట వద్ద రోడ్‌షో
12.30 : కళ్యాణదుర్గం బైపాస్‌రోడ్డు సర్కిల్‌లో రోడ్‌షో
1.00 : బళ్లారి బైపాస్‌రోడ్డు సర్కిల్‌లో రోడ్‌షో
1.30 : తపోవనంలో రోడ్‌షో

3.00 : రంగస్వామి నగర్, శాంతినగర్ సర్కిల్‌లో రోడ్‌షో
3.30 : 4వ రోడ్డు మీదుగా నడిమివంక వరకు రోడ్‌షో
సాయంత్రం 4.30 : 2వ రోడ్డు మీదుగా మిత్ర హోటల్ వరకు రోడ్‌షో
5.00 : మహాత్మాగాంధీ కాలనీ, లెక్చరర్చ్ కాలనీల మీదుగా రాజీవ్ కాలనీ వరకు రోడ్‌షో
5.30 : ఎర్రనాలకొట్టాలలోని గాంధీ విగ్రహం మీదుగా రోడ్‌షో
6.00 : రామచంద్రనగర్, శ్రీనివాసనగర్ మీదుగా
రైల్వేస్టేషన్ కూడలిలో రోడ్‌షో
6.30 : ఆర్ట్స్ కాలేజీ మీదుగా టవర్‌క్లాక్ వరకు రోడ్‌షో
7.00 : అమ్మవారుశాల, గుల్జార్‌పేటలో రోడ్‌షో
7.30 : ఆదిమూర్తినగర్, గిల్డ్‌ఆఫ్ సర్వీస్ స్కూల్ వద్ద రోడ్‌షో
రాత్రి 8.00 : నందిని హోటల్(వైఎస్సార్ సర్కిల్) వద్ద రోడ్‌షో
రాత్రి 9 గంటలకు ప్రచారం ముగించుకుని మాజీ శాసనసభ్యుడు బి.గురునాథరెడ్డి నివాసానికి చేరుకుంటారు.

5/04/2012
Special Edition on "DharmaYuddam" 4th May 2012
Written By news on Friday, May 4, 2012 | 5/04/2012
5/04/2012
నర్సరామయ్యను పరామర్శించిన జగన్
ఎమ్మెల్సీ బత్తల చెంగలరాయుడు అనుచరుల దాడిలో గాయపడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నర్సరామయ్యను వైఎస్ జగన్ పరామర్శించారు. ఎమ్మెల్సీ అనుచరులు నర్సరామయ్యపై హత్యాయత్నానికి పాల్పడ్డడాన్ని ఖండించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు మద్దతు పలకవద్దంటూ ఎమ్మెల్సీ అనుచరులు గత కొంతకాలంగా నర్సరామయ్యను బెదిరిస్తున్నారు. తాను జగన్ వెంటే ఉంటానని నర్సరామయ్య స్పష్టం చేయడంతో ఎమ్మెల్సీ అనుచరులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని రాజంపేట ఆసుపత్రిలో చేర్చారు. నర్సరామయ్యను పరామర్శించిన జగన్ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఇలాంటి దాడులకు భయపడవద్దని ధైర్యం చెప్పారు. |
5/03/2012
Special Edition "DharmaYudddam" 3rd May 2012
Written By news on Thursday, May 3, 2012 | 5/03/2012
5/03/2012
వైఎస్ఆర్ సీపీ నేత శేషు అక్రమ అరెస్ట్, విడుదల
వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, మడపాం మాజీ సర్పంచ్ జాయి శేషుపై అక్రమ కేసు బనాయించి స్టేషన్‌లో నరసన్నపేట పోలీసులు నిర్బంధించారు. అక్రమ అరెస్ట్ కు నిరసనగా స్టేషన్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. శేషును అక్రమ అరెస్ట్ చేసిన ఎస్.ఐపై చర్యలు తీసుకోవాలని పార్టీ డిమాండ్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలతో పోలీసులు దిగివచ్చి శేషును విడిచిపెట్టారు. ఇకపై పూర్తి ఆధారాలున్న తర్వాతే విచారణ సాగిస్తామని డీఎస్పీ ప్రసన్నకుమార్ హామీ ఇచ్చారు.
5/03/2012
వైఎస్సార్ మైనారిటీ ఇంచార్జిల నియామకం
పద్దెనిమిది శాసనసభ, ఒక లోక్‌సభా స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మైనారిటీ విభాగం తరపున 27 మందిని ఇంచార్జిలను నియమించారు. రాష్ట్ర కన్వీనర్ హెచ్.ఏ.రెహ్మాన్ ఇంచార్జిల జాబితాను గురువారం సాయంత్రం విడద ల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
సలీం ఖాన్, హఫీజ్ ఖాన్ (ఎమ్మిగనూరు), కె.ఎస్.ఎస్.బి.నూర్‌బాబా(అనంతపురం, రాయదుర్గం), కరీముల్లా షేక్, నసీర్ అహ్మద్ (ఒంగోలు, మాచెర్ల), సయ్యద్ ఖాజా, షేక్ చాంద్‌బాష (ఒంగోలు), మహబూబ్ బాష (మాచెర్ల), సలీంబాష, జహీర్ అహ్మద్‌ఖాన్, సయ్యద్ రఫీఖ్ బాష, సలీం బిన్ ఖలీఫా (ఆళ్లగడ్డ), అబ్దుల్ కలీం వాజిద్(పాయకరావుపేట), మహ్మద్ అయూబ్ ఖాన్ (పత్తిపాడు), మొయిన్, ముక్తార్ (పర్కాల), ఎం.అసదుల్లా(నరసన్నపేట), షఫీ (తిరుపతి), మహ్మద్ మునీర్ సిద్దీఖ్, షేక్ అబ్దుల్ జలీల్ (నెల్లూరు), షేక్ షఫీ (బుచ్చిరెడ్డిపాళెం), మహ్మద్ ఇలియాస్ (నెల్లూరు-రూరల్), అమ్జద్ బాష, ఎస్.ఎం.ఎం.ఖాద్రి, హఫీజుల్లా (రాయచోటి), అఫ్జల్ ఖాన్ (రాయదుర్గం), షేక్ వహీద్ బాష (కోవూరు). వీరు ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు.

పసుపు రైతులకు జగన్ పరామర్శ
వైఎస్ఆర్ జిల్లాలోని బకరాపేట వద్ద పసుపురైతులను వైఎస్ జగన్మోహనరెడ్డి పరామర్శించారు. ఉప ఎన్నికల ప్రచారంలో బకరాపేట చేరుకున్న జగన్ కు గిట్టుబాటు ధర రావడం లేదంటూ రైతులు మొరపెట్టుకున్నారు. పంట ఖర్చు వివరాలను రైతులను జగన్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంపై పోరాడి మద్ధతు ధర కోసం కృషి చేస్తానని రైతులకు జగన్ భరోసానిచ్చారు. మహానేత వైఎస్ హయాంలో క్వింటాల్ పసుపు ధర రూ.16వేలు పలికిందని.. ఇప్పుడు కనీసం రూ.2,500 కూడా రావడం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పసుపు రైతులను ఆదుకునే నాధుడే లేడని జగన్ అన్నారు. చేనేత కార్మికుల కోసం నిరాహారదీక్ష చేసినా ఈ ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే సువర్ణయుగానికి ఈ ఉపఎన్నికలే నాంది అని అన్నారు. ప్రతి రైతన్నా ఇది నా ప్రభుత్వం అనుకునేలా చేస్తా అని జగన్ అన్నారు. |
5/03/2012
పరకాల బరిలో తమ అభ్యర్థిని దించడం సాధ్యం కాదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. స్థానిక టీఎన్జీవోల భవన్ లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జేఏసీ రాజకీయ పార్టీ కాదన్నారు. అయితే, పరకాలలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సీమాంధ్ర పార్టీల ప్రతినిధులు గెలువకుండా జేఏసీ సర్వశక్తులను కేంద్రీకరిస్తుందని తెలిపారు. జేఏసీని దెబ్బ తీయాలన్న ఆంధ్రాపాలకుల కుట్రలో భాగంగానే కొన్నిపత్రికల్లో తప్పుడు కథనాలు వస్తున్నాయన్నారు. ఈ
దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలన్నారు. కొద్దివారాల్లో రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు రానున్నాయని జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సాధనకు జేఏసీ బలమైన ఉద్యమాన్ని నిర్మించనుందని వివరించారు. జేఏసీ సంఘటితంగా ఉందని, ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కోదండరాంను దింపేద్దామంటూ కేసీఆర్ కొన్ని జిల్లాల జేఏసీ నేతలతో మాట్లాడారని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ అసంకల్పితంగా మాట్లాడుకునే మాటలకు విలువ ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. ఉద్యమక్రమంలో అనేక అంశాలు చర్చకు వస్తాయని, వాటన్నింటినీ అంతర్గతంగా పరిష్కరించుకోగలిగే పరిపక్వత, నైపుణ్యం జేఏసీకి ఉందన్నారు.
పరకాల బరిలో దిగం

శ్రీవారి ఆశీస్సుల్లోనూ రాజకీయమేనా?
కుట్రలో భాగమే తెరపైకి ‘డిక్లరేషన్’ అంశం
టీ కప్పులో తుపాను సృష్టించిన చానళ్లు
నిన్నటివరకు జగన్ కులం, మతంపై విమర్శలు
నేడు శ్రీవారి దర్శనాన్నీ తప్పుబట్టే ప్రయత్నం
డిక్లరేషన్’ ప్రధానం కాదంటున్న మతపెద్దలు
భక్తి విశ్వాసాలే ముఖ్యమంటున్న ఆచార్యులు
తిరుమల, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల వేళలో రాష్ట్ర రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా చేస్తున్న కుట్రలూ, కుహకాలు హద్దులు మీరుతున్నాయి. నిన్న మొన్నటివరకు జగన్ కులం, మతం, ప్రాంతంపైన విమర్శలు గుప్పించిన రాజకీయపక్షాలు... నేడు తిరుమల శ్రీ వేంకటేశ్వరుని జగన్ దర్శించుకోవడాన్ని సైతం వివాదాస్పదం చేస్తూ వికృత రాజకీయాలకు తెరలేపాయి. కొన్ని మీడియా చానళ్లు పనికట్టుకుని ‘డిక్లరేషన్’ వివాదాన్ని రేకెత్తించడం రాజకీయ కుట్రలో భాగమేనని స్పష్టమవుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనను ఏదో ఒక రూపంలో వివాదంలోకి నెట్టి తద్వారా తమవారికి రాజకీయ లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ముందస్తు కసరత్తు జరిగింది. అందులో భాగంగానే జగన్ దర్శనం చేసుకున్నప్పటి నుంచీ ఆలయం వెలుపలకు వచ్చేవరకూ డిక్లరేషన్ అంశాన్ని తమ చానళ్లలో పనికట్టుకుని ప్రచారం చేశాయి. టీటీడీని కూడా తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి. తిరుమల శ్రీవారి దర్శనాన్ని సైతం రాజకీయాల్లోకి లాగడంపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భక్తికి ‘డిక్లరేషన్’ అవసరమా?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిబంధనల ప్రకారం 1987 రాష్ర్ట దేవాదాయశాఖ చట్టానికి లోబడి అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకునే సందర్భంలో ‘శ్రీవేంకటేశ్వర స్వామివారిపై నమ్మకం ఉంది’ అని తమ సమ్మతి తెలుపుతూ తప్పనిసరిగా డిక్లరేషన్ ఫారం/ రిజిస్టర్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే భక్తులందరూ స్వామివారి ఆశీస్సులకే వచ్చారన్నది టీటీడీ భావన. అందుకే ఇప్పటివరకు క్యూలో అన్యమతస్తులు కనిపించినా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. డిక్లరేషన్ ఇవ్వమని వారిని డిమాండ్ చేసిన సందర్భమూ లేదు. ఇటలీ దేశస్థురాలైన సోనియాగాంధీ పలుమార్లు తిరుమలకు వచ్చిన సందర్భంలోనూ ఈ నిబంధన అమలు చేసిన దాఖలాల్లేవు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కూడా ఐదేళ్లపాటు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. తిరుమలేశుడంటే అచంచల భక్తితోనే తన పదవీ కాలంలో 23సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. పదవిలోకి రాకముందు, ప్రతిపక్ష నేతగా 1600 కిలోమీటర్ల ప్రజాప్రస్థాన కార్యక్రమం పూర్తిచేశాక తిరుమలకు నడిచివచ్చి ముగించారనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి నేత తనయుడు వైఎస్ జగన్ బుధవారం శ్రీవారిని దర్శించుకోవడాన్ని వివాదం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ 2009లో దర్శనానికి వచ్చినపుడు కనిపించని డిక్లరేషన్ అంశం తాజాగా తెరపైకి తీసుకురావటంలో ఆంతర్యం ఏమిటి? దీనివెనుక హస్తం ఎవరిది? అన్న ప్రశ్నలకు ‘రాజకీయమే’అన్న సమాధానం లభిస్తోంది.
హిందూ సంప్రదాయాన్ని అవమానించడమే..
‘‘అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకునే సందర్భంలో వేంకటేశ్వరస్వామివారిపై తమకు నమ్మకముందని పేర్కొంటూ డిక్లరేషన్‌ను ఇవ్వాల్సి ఉంది. కానీ జగన్ అలాంటిదేమీ ఇవ్వకుండానే ఆలయంలోకి వెళ్లారు. ఇది హిందూ సంప్రదాయాన్ని అవమానించడమే’’
-వీరశివారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
హిందువుల మనోభావాలను కించపరిచిన జగన్..
శ్రీవారిని సందర్శించే సమయంలో నిబంధనలు పాటించకుండా జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. శ్రీవారిని అవమానించడం వైఎస్ కుటుంబానికి అలవాటుగా మారింది. తిరుమల ఏడుకొండల్లో రెండే శ్రీవారివని గతంలో వ్యాఖ్యానించిన వైఎస్ అందుకు ఫలితం అనుభవించారు.
-దాడి వీరభద్రరావు, టీడీపీ నేత
ప్రత్యేక మర్యాదలు కల్పించలేదు
డిక్లరేషన్ అంశాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వారి అనుచరుల దృష్టికి మా సిబ్బంది తీసుకెళ్లారు. గతంలో దర్శనం చేసుకున్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని, అందువల్ల మరోసారి ఇవ్వాల్సిన అవసరంలేదంటూ వారు చెప్పినట్టు మా సిబ్బంది ద్వారా తెలిసింది. అలాగే ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్లపాటు సాక్షాత్తు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినందున కొత్తగా మరోసారి సమ్మతి (డిక్లరేషన్) తెలపాల్సిన అవసరం లేదనే వాదన వచ్చింది. దీనిపై నేను కూడా పరిశీలిస్తాను. టీటీడీ పాలక మండలి సభ్యులు దర్శనం చేసుకున్నాకే ఆయనకు దర్శనం కల్పించాము. ఎలాంటి ప్రత్యేక మర్యాదలూ కల్పించలేదు. -ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, టీటీడీ ఈవో
దేవాలయాల అభివృద్ధిలో వైఎస్‌కు సాటిలేరు
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల అభివృద్ధికి వైఎస్ చేసిన కృషి మరెవ్వరూ చేయలేదు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆలయాల పరిస్థితిని అధ్యయనం చేశారు. వాటి అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టారు. సీఎం అయ్యాక చట్టాన్ని సవరించి దేవాలయాల అభివృద్ధిని చేపట్టారు. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేశారు. అర్చకుల సంక్షేమానికి కృషి చేశారు. ఆయన తిరుపతి వెళ్లినా, చిలుకూరు వచ్చినా ఓ భక్తునిగానే చూశామే తప్ప క్రిస్టియన్‌గా చూడలేదు. ఆయన తనయుడు జగన్‌నూ అలాగే భావిస్తున్నాం. తిరుపతిలో సంతకం చేయకుండా వెళ్లడం పెద్ద తప్పేమీ కాదు. -సౌందరరాజన్, చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు
సోనియావద్ద డిక్లరేషన్ తీసుకున్నారా?
వేంకటేశ్వర స్వామివారి పట్ల అపారమైన భక్తి విశ్వాసాలతో జగన్‌తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది పనికట్టుకుని అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. జగన్ చిన్నతనం నుంచి అనేకమార్లు తిరుమలకు వచ్చారు... 2009లో వచ్చారు... మళ్లీ ఇప్పుడు వచ్చారు. భవిష్యత్‌లో మరిన్నిసార్లు ఖచ్చితంగా వస్తారు. భగవంతుని పట్ల నమ్మకం, విశ్వాసం కలిగిన వ్యక్తి ఆయన. అసలు ఇటాలియన్ అయిన సోనియాగాంధీనుంచి ఒక్కసారైనా డిక్లరేషన్ తీసుకున్నారా? ఆమెకు వర్తించని నిబంధనలు జగన్‌కు మాత్రమే వర్తిస్తాయా?
-భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్
డిక్లరేషన్ అవసరం లేదని అంగీకరించారు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి దర్శన విషయంలో డిక్లరేషన్ అవసరం లేదనే వాదనతో టీటీడీ ఈవో ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ఏకీభవించారు. టీటీడీ తరఫున మావద్దకు ఎలాంటి డిక్లరేషన్ పత్రాలు తీసుకురాలేదు. నేనే వ్యక్తిగతంగా ఈవోను కలసి వివరించాను. ఐదు సంవత్సరాలు భక్తి విశ్వాసాలతో పట్టువస్త్రాలు సమర్పించి, అధికారంలో ఉండగా 23సార్లు, ఇతర సందర్భాల్లో పదుల సార్లు శ్రీవారిని దర్శించుకున్న దివంగత సీఎం రాజశేఖరరెడ్డి తనయుడికి డిక్లరేషన్ అవసరమా? అని ప్రశ్నించినప్పుడు ‘అవసరంలేదు’ అని ఈవో చెప్పారు.
-చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తుడా మాజీ చైర్మన్
తండ్రికి లేని నిబంధన కొడుక్కి ఎందుకు?
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని రాజకీయం చేయడం అవివేక చర్య. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి అనేకసార్లు శ్రీవారిని దర్శించుకున్నప్పుడు లేని నిబంధనలను జగన్‌కు వర్తింపజేయడం సబబు కాదు. సోనియాగాంధీ శ్రీవారిని దర్శించుకున్నప్పుడు ఈ నిబంధనలను ఎందుకు వర్తింపజేయలేదు? తల్లి చనిపోయిన ఏడవ రోజు అక్కినేని నాగార్జున తిరుమల దర్శనానికి వస్తే అతనికి స్వాగతం పలికి లోనికి ఆహ్వానించిన అధికారులు జగన్ దర్శనాన్ని వివాదాస్పదం చేయడం తగదు.
-ద్రోణం రాజు రవికుమార్, రాష్ట్ర బ్రాహ్మణసేవా సంఘ సమాఖ్య యువజన విభాగం
శ్రీవారి వద్ద రాజకీయమా?
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనాన్ని కొందరు రాజకీయం చేయటం సరికాదు. గతంలో ఆయన అనేకమార్లు దర్శనం చేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి హోదాలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అప్పుడులేని వివాదం ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చింది? ముఖ్యమంత్రిగా వైఎస్ చేసినంతగా మరెవరూ దేవాలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమానికి కృషి చేయలేదు. ఆయన ప్రవేశపెట్టిన 3,600 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం మళ్లీ వెలుగులకు కారణమైంది.
-గంగు భానుమూర్తి, తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంట్ సభ్యులు జగన్‌మోహన్‌రెడ్డికి పటిష్ట భద్రత కల్పించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బాజిరెడ్డి గోవర్ధన్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) వి.దినేష్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. జెడ్ క్యాటగిరీ భద్రత కలిగిన జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార పర్యటనలకు సంబంధించిన అన్ని వివరాలనూ జిల్లా పోలీసులకు ముందుగానే తెలియజేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరించారు.
తిరుపతి పర్యటన సందర్భంగా జనం తొక్కిసలాటలో జగన్‌మోహన్‌రెడ్డి చిక్కుకున్న సందర్భంలో పోలీసు సిబ్బంది వాహనాలలో నుంచి కనీసం కిందికి దిగలేదని ఆరోపించారు. జగన్ భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ ఎస్‌ఏ హుడా సానుకూలంగా స్పందించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. బాజిరెడ్డి గోవర్ధన్‌తోపాటు కె.శివకుమార్, పి.ప్రతాప్‌రెడ్డి, ఆదం విజయ్, మొహ్మద్ తదితరులు డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు.
జగన్ భద్రత కుదింపుపై విచారణ జరిపించాలి: ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు
జగన్‌మోహన్ రెడ్డికి జెడ్ క్యాటగిరీ ఉన్నా భద్రతను కుదించడంపై విచారణ జరిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టు న్యాయవాది పి. సాయికృష్ణ అజాద్ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్ హెచ్‌ఆర్సీ)కి బుధవారం ఫిర్యాదుచేశారు. గతంలో తాను ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుశాఖ తగిన విధంగా భద్రతా చర్యలు తీసుకోలేదని తాజాగా వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్ భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని ఆ ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.
జగన్‌కు పటిష్ట భద్రత కల్పించాలి

డిప్రెషన్‌కులోనై చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు
ఉప ఎన్నికల్లో ఓటమిని ముందే గ్రహించి మతి భ్రమించింది: గట్టు రామచంద్రరావు
డిప్రెషన్‌కులోనై చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు
ఎస్సీ, ఎస్టీ కార్డులు విఫలం కావడంతో బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు
తొమ్మిదేళ్ల పాలనలో బీసీలకు బాబు చేసింది శూన్యం
కులవృత్తులను సర్వనాశనం చేసిన ఘనత ఆయనదే
వైఎస్ ఒక్క నెలలో తొమ్మిది కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారు
అధికారంలోకి వచ్చిన ఏడాదే రూ.1,568 కోట్లు కేటాయించారు
అందుకే బీసీలు జగన్‌వెంట నడుస్తున్నారు
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో 18 నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఓటమిని ముందే గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. వైఎస్ కుటుంబానికి లభిస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక పిచ్చిపట్టినట్లు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాక్షస పుట్టుకకు ప్రతిరూపమైన చంద్రబాబు డిప్రెషన్‌కులోనై ఒక్కోమారు ఒక్కో విధంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘వైఎస్ ఎస్సీలకు వ్యతిరేకమని చంద్రబాబు ప్రచారం చేశారు. కానీ ప్రజలు నమ్మకపోగా బాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎస్సీలకు చేసిన అన్యాయాన్ని గుర్తు చేశారు.
ఎస్సీ అస్త్రం విఫలమవడంతో ఎస్టీ కార్డును ప్రయోగించారు. బాక్సైట్ తవ్వకాలతో గిరిజనులకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. కానీ బాబు హయాంలోనే వాటికి సంబంధించిన అనుమతులు దుబాయి కంపెనీలకు కట్టబెట్టిన విధానాన్ని గిరిజనులు ప్రశ్నించడంతో కంగుతిన్నారు. ఆఖరికి ఏం చేయాలో పాలుపోక తాజాగా బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు’’ అని విమర్శించారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో బీసీలకు చేశారో వివరించాలని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు 2003-04 సంవత్సర కాలంలో బీసీలకు కేవలం రూ.348 కోట్లు కేటాయిస్తే, వైఎస్ అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే రూ.1,568 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బీసీలు ప్రాణంగా చూసుకునే కులవృత్తులను సర్వనాశనం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ధ్వజమెత్తారు.
బీసీల్లో ఉన్న సన్న, చిన్న కారు రైతులను దగా చేశారని మండిపడ్డారు. వైఎస్ సువర్ణయుగంలో పేదరికాన్ని నిర్మూలిస్తే, చంద్రబాబు రాక్షస పాలనలో పేదల్ని మట్టుబెట్టారని దుయ్యబట్టారు. ‘‘హైదరాబాద్‌కు బిల్‌క్లింటన్ వస్తున్నారని చెప్పి పేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలను కుక్కల మాదిరిగా వాహనాల్లో తరలించిన విషయం రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బలుపెక్కి చనిపోతున్నారన్నారు. డబ్బు కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వారిని ఘోరంగా అవమానించిన నీచ చరిత్ర బాబుది. కరెంటు బిల్లు కట్టలేని రైతులను జైల్లో పెట్టాలని ప్రత్యేక జీవోలు తెచ్చిన ఘనత ఈ మహానుభావుడిదే’’ అని మండిపడ్డారు.
బోగస్ కంపెనీలతో అనుచరులకు దోచిపెట్టారు
చంద్రబాబు హయాంలో ఆదరణ పథకం ద్వారా రూ.625 కోట్లు టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టారని గట్టు విమర్శించారు. బోగస్ కంపెనీలు, ఫ్యాక్టరీలను అప్పటికప్పుడు సృష్టించి పనికిరాని వస్తువులను పంపిణీ చేశారని చెప్పారు. చంద్రబాబు బీసీ కార్పొరేషన్‌లను నిర్వీర్యం చేస్తే, వైఎస్ ఒక్క నెలలో 9 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి, వారికి లోన్లు కూడా ఇప్పించారని గుర్తుచేశారు. వైఎస్ మరణం తర్వాత నిరాదరణకు గురైన బీసీ కార్పొరేషన్‌ల గురించి ప్రతిపక్షనేత హోదా లో చంద్రబాబు నోరెందుకు మెదపరు? బీసీలకు అండగా నిలిచిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలకు కాంగ్రెస్ పెద్దలు తూట్లు పొడుస్తుంటే బాబు ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. ఇవేవీ పట్టని చంద్రబాబు అబద్ధాల ఫ్యాక్టరీ పెట్టుకొని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీసీలను ఓటు అడిగే అర్హత ఒక్క జగన్‌కు మాత్రమే ఉందన్నారు. అదే విధంగా బీసీలు కూడా తమ రాజకీయ వారసుడిగా జగన్‌ను చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేతగాకనే కులాలు, మతాలను చంద్రబాబు తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు.
కొనుగోలు చేయడం చంద్రబాబు బుద్ధే!
వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, జూపూడి ప్రభాకర్‌రావులు నెలజీతగాళ్లని టీడీపీ నేత శోభాహైమావతి చేసిన వ్యాఖ్యలను గట్టు ఖండించారు. జూపూడి చేసిన ప్రజా ఉద్యమాలు బ్రహ్మాండంగా ఉన్నాయని పొగిడిన టీడీపీ నేతలు... ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేసరికి నెలజీతగాడయ్యారా? అని నిలదీశారు. డబ్బుతో వ్యక్తులను కొనుగోలు చేసే నీచమైన బుద్ధి చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. అందుకే ఆయన హయాంలో జరిగిన ఆప్రో ఏసియన్ గేమ్స్‌లో ఇతర రాష్ట్రాలనుంచి ఆటగాళ్లను కొనుగోలు చేసిన దౌర్భాగ్యుడని విమర్శించారు. అలాంటి చరిత్ర ఉన్న పార్టీకి తమని విమర్శించే అర్హత లేదని గట్టు దుయ్యబట్టారు.
డిప్రెషన్‌కులోనై చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు
ఎస్సీ, ఎస్టీ కార్డులు విఫలం కావడంతో బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు
తొమ్మిదేళ్ల పాలనలో బీసీలకు బాబు చేసింది శూన్యం
కులవృత్తులను సర్వనాశనం చేసిన ఘనత ఆయనదే
వైఎస్ ఒక్క నెలలో తొమ్మిది కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారు
అధికారంలోకి వచ్చిన ఏడాదే రూ.1,568 కోట్లు కేటాయించారు
అందుకే బీసీలు జగన్‌వెంట నడుస్తున్నారు

ఎస్సీ అస్త్రం విఫలమవడంతో ఎస్టీ కార్డును ప్రయోగించారు. బాక్సైట్ తవ్వకాలతో గిరిజనులకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. కానీ బాబు హయాంలోనే వాటికి సంబంధించిన అనుమతులు దుబాయి కంపెనీలకు కట్టబెట్టిన విధానాన్ని గిరిజనులు ప్రశ్నించడంతో కంగుతిన్నారు. ఆఖరికి ఏం చేయాలో పాలుపోక తాజాగా బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు’’ అని విమర్శించారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో బీసీలకు చేశారో వివరించాలని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు 2003-04 సంవత్సర కాలంలో బీసీలకు కేవలం రూ.348 కోట్లు కేటాయిస్తే, వైఎస్ అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే రూ.1,568 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బీసీలు ప్రాణంగా చూసుకునే కులవృత్తులను సర్వనాశనం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ధ్వజమెత్తారు.
బీసీల్లో ఉన్న సన్న, చిన్న కారు రైతులను దగా చేశారని మండిపడ్డారు. వైఎస్ సువర్ణయుగంలో పేదరికాన్ని నిర్మూలిస్తే, చంద్రబాబు రాక్షస పాలనలో పేదల్ని మట్టుబెట్టారని దుయ్యబట్టారు. ‘‘హైదరాబాద్‌కు బిల్‌క్లింటన్ వస్తున్నారని చెప్పి పేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలను కుక్కల మాదిరిగా వాహనాల్లో తరలించిన విషయం రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బలుపెక్కి చనిపోతున్నారన్నారు. డబ్బు కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వారిని ఘోరంగా అవమానించిన నీచ చరిత్ర బాబుది. కరెంటు బిల్లు కట్టలేని రైతులను జైల్లో పెట్టాలని ప్రత్యేక జీవోలు తెచ్చిన ఘనత ఈ మహానుభావుడిదే’’ అని మండిపడ్డారు.
బోగస్ కంపెనీలతో అనుచరులకు దోచిపెట్టారు
చంద్రబాబు హయాంలో ఆదరణ పథకం ద్వారా రూ.625 కోట్లు టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టారని గట్టు విమర్శించారు. బోగస్ కంపెనీలు, ఫ్యాక్టరీలను అప్పటికప్పుడు సృష్టించి పనికిరాని వస్తువులను పంపిణీ చేశారని చెప్పారు. చంద్రబాబు బీసీ కార్పొరేషన్‌లను నిర్వీర్యం చేస్తే, వైఎస్ ఒక్క నెలలో 9 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి, వారికి లోన్లు కూడా ఇప్పించారని గుర్తుచేశారు. వైఎస్ మరణం తర్వాత నిరాదరణకు గురైన బీసీ కార్పొరేషన్‌ల గురించి ప్రతిపక్షనేత హోదా లో చంద్రబాబు నోరెందుకు మెదపరు? బీసీలకు అండగా నిలిచిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలకు కాంగ్రెస్ పెద్దలు తూట్లు పొడుస్తుంటే బాబు ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. ఇవేవీ పట్టని చంద్రబాబు అబద్ధాల ఫ్యాక్టరీ పెట్టుకొని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీసీలను ఓటు అడిగే అర్హత ఒక్క జగన్‌కు మాత్రమే ఉందన్నారు. అదే విధంగా బీసీలు కూడా తమ రాజకీయ వారసుడిగా జగన్‌ను చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేతగాకనే కులాలు, మతాలను చంద్రబాబు తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు.
కొనుగోలు చేయడం చంద్రబాబు బుద్ధే!
వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, జూపూడి ప్రభాకర్‌రావులు నెలజీతగాళ్లని టీడీపీ నేత శోభాహైమావతి చేసిన వ్యాఖ్యలను గట్టు ఖండించారు. జూపూడి చేసిన ప్రజా ఉద్యమాలు బ్రహ్మాండంగా ఉన్నాయని పొగిడిన టీడీపీ నేతలు... ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేసరికి నెలజీతగాడయ్యారా? అని నిలదీశారు. డబ్బుతో వ్యక్తులను కొనుగోలు చేసే నీచమైన బుద్ధి చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. అందుకే ఆయన హయాంలో జరిగిన ఆప్రో ఏసియన్ గేమ్స్‌లో ఇతర రాష్ట్రాలనుంచి ఆటగాళ్లను కొనుగోలు చేసిన దౌర్భాగ్యుడని విమర్శించారు. అలాంటి చరిత్ర ఉన్న పార్టీకి తమని విమర్శించే అర్హత లేదని గట్టు దుయ్యబట్టారు.
5/03/2012
తిరుమల, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అడుగడుగునా వివక్ష ప్రదర్శించినా, భక్తి విశ్వాసాలతో సుమారు గంటన్నరకుపైగా వేచి ఉండి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 7.20 గంటలకు ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించారు. అక్కడి అధికారులు వీఐపీలను అనుమతించే 17వ కంపార్ట్‌మెంట్‌కు తాళం వేశారు. పక్కనే మరో కంపార్ట్‌మెంట్‌లో ఇతర భక్తులతో కలసి జగన్ అరగంటపాటు వేచి ఉన్నాక ఆలయంలోకి వె ళ్లారు. సహస్త్రకలశాభిషేకం, ఇతర మఠాధిపతుల దర్శనం కారణంగా రంగనాయక మంటపంలోనే మరో గంటన్నరపాటు వేచి చూశారు.
ఆర్జిత సేవ భక్తులు, టీటీడీ ఈవో ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, పాలక మండలి సభ్యులు రౌతు సూర్యప్రకాశ్‌రావు, పి.రాజేశ్వరిలతో సుమారు మరో 200 మంది భక్తులు దర్శనం చేసుకున్నాక 9 గంటలకు జగన్ లోనికి వెళ్లారు. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ నేతలు అంబటి రాంబాబు, రోజా తదితరులతో కలసి ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి గరుడాళ్వార్ సన్నిధికి చేరుకున్నారు. అప్పటికే వీఐపీ దర్శనానికి రద్దీ ఉండటంతో అక్కడ మరో 15 నిమిషాలు వేచి ఉన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తి ప్రపత్తులతో నమస్కరించి ఆశీస్సులందుకున్నారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం భాష్యకార్లవారు, యోగనరసింహస్వామిలను దర్శించుకున్నారు. ఆ తర్వాత అద్దాల మంటపం వద్ద జగన్‌కు పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టువస్త్రం, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. వాటిని స్వీకరించి, ఆలయాధికారులు, అర్చకులకు భక్తిపూర్వకంగా నమస్కరించి ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. అంతకుముందు రౌతు సూర్యప్రకాశరావు, పి.రాజేశ్వరి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
అడుగడుగునా టీటీడీ వివక్ష
భక్తి విశ్వాసాలతో శ్రీవారి దర్శనానికి వచ్చిన జగన్ పట్ల టీటీడీ అడుగడుగునా వివక్ష చూపింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు వారి భార్యలకు కూడా టీటీడీ పాలక వర్గం, అధికారులు సాగిలపడి మరీ దగ్గరుండి దర్శనాలు చేయించడం బహిరంగ రహస్యమే. కానీ రెండుసార్లు రాష్ట్రాన్ని పరిపాలించి, బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి క్రమం తప్పకుండా భక్తిపూర్వకంగా పట్టువస్త్రాలు సమర్పించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడైన జగన్‌కు మాత్రం వివక్ష ఎదురైంది. ప్రొటోకాల్ హోదాలోనే తిరుమలకు వచ్చినా, ఆయనకు కనీసం ఆహ్వానం పలికే అధికారి కూడా కరువయ్యారు! దర్శనానికి సంబంధించి సమాచారం అందించే అధికారిని కూడా నియమించలేదు. దర్శనంపై అధికారుల నుంచి కచ్చితమైన సమాచారం లేకపోయింది.
దాంతో, ఉదయం 8.30 తర్వాత శ్రీవారి దర్శనం మొదలైతే, జగన్ 7.20కే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. అక్కడ వీఐపీలు వెళ్లే 17వ కంపార్ట్‌మెంట్‌కు అధికారులు ఉద్దేశపూర్వకంగా తాళం వేసి ఆయన ఆలయ ప్రవేశాన్ని అడ్డుకున్నారు. దాంతో పక్క కంపార్ట్‌మెంట్‌లో ఇతర భక్తులతో కలసి జగన్ అరగంట పాటు వేచి ఉన్నారు. టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అధికారులకు ప్రొటోకాల్ నిబంధనలను గుర్తు చేయడంతో అరగంట తర్వాత 17వ కంపార్ట్‌మెంట్ తాళం తెరిచారు. లోనికి వెళ్లిన జగన్, ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిసి ఇతర భక్తులతో కలసి గంటన్నర పాటు అక్కడే వేచి ఉన్నారు.
తర్వాత ప్రొటోకాల్ పరిధిలో లేని వందలాది మందిని దర్శనానికి అనుమతించాక, ఎట్టకేలకు ఉదయం 9 గంటలకు జగన్‌కు అవకాశం కల్పించారు. ఇదంతా అధికార పక్షం ఆదేశాల మేరకే టీటీడీ పాలక మండలి, ఉన్నతాధికారుల కనుసన్నల్లో జరిగిందంటూ విమర్శలు వినిపించాయి. అడుగడుగునా ఇలా వివక్షే ఎదురైన జగన్ మోముపై భక్తిపూర్వక చిరునవ్వే కనిపించింది.
భక్తుడిని వారించిన జగన్
శ్రీవారిని దర్శించుకుని వెలుపల వచ్చిన జగన్‌ను సమీపంగా చూసిన బయటి క్యూలోని ఓ భక్తుడు అభిమానాన్ని అణచుకోలేక ‘జై జగన్’ అంటూ అరిచాడు. దాంతో ‘వద్ద’ంటూ ఆయన్ను వారించారు.
అడుగడుగునా టీటీడీ వివక్ష.అయినా భక్తిప్రపత్తులతో దర్శించుకున్న జగన్

Subscribe to:
Posts (Atom)