
హైదరాబాద్: మూసివేతకు గురవుతున్న ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల ప్రజాధ్వని అధ్యక్షురాలు జె. లలితమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆమె బుధవారం ఈ మేరకు ఆయనకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. అందరికీ నాణ్యమైన విద్య అంది స్తామని, విద్యా ప్రమాణాలు మెరుగు పరుస్తామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
జగన్‌ను కలసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలు మూసివేయకుండా కృషి చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. జగన్‌ను కలసినవారిలో శేషగిరిరావు, కేవీ రమణారావు, లక్ష్మణరావు, కె. సుభాష్ తదితరులున్నారు.
0 comments:
Post a Comment