
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాన్ని వైఎస్ జగన్ చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
వరద ప్రాంతాల్లో రేపటి నుంచి జగన్ పర్యటన
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23వ తేదీ నుంచి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చిత్తూరు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో బాధితులను జగన్ పరామర్శిస్తారని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ తెలిపారు. 23వ తేదీ తొలి రోజునశ్రీకాళహస్తి నియోజకవర్గంలో, వైఎస్సార్ జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రాంతాల్లో పర్యటిస్తారు. అదే రోజు సాయంత్రం నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో కూడా పర్యటన ఉంటుందని, 24వ తేదీన కూడా నెల్లూరు జిల్లాలో జగన్ విసృ్తతంగా పర్యటిస్తారని వివ రించారు.
0 comments:
Post a Comment