చంద్రబాబు పాలన అంతా మోసం: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు పాలన అంతా మోసం: వైఎస్ జగన్

చంద్రబాబు పాలన అంతా మోసం: వైఎస్ జగన్

Written By news on Thursday, November 26, 2015 | 11/26/2015


చంద్రబాబు పాలన అంతా మోసం: వైఎస్ జగన్
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన మూడోరోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం ఆయన మన్సుర్ నగర్ లో పర్యటించారు. వరద బాధితుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలు వల్ల వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారన్నారు. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు నష్టపోయారని, ప్రతి ఇంటికి రూ.5వేల చొప్పన ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయమని, ఇప్పటికైనా సర్కార్ కళ్లు తెరిచి బాధితులను ఆదుకోవాలన్నారు. అధికారులు కొందరి పేర్ల మాత్రమే నమోదు చేస్తున్నారని, వరద సాయంలో వివక్ష చూపడం తగదని వైఎస్ జగన్ సూచన చేశారు. సర్వేల పేరుతో ఒకరు...ఇద్దరు పేర్లు రాసుకోవటం సరికాదన్నారు. బాధితులను ఆదుకోవడం పోయి... చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. మోసపూరిత హామీలతో బాబు అధికారంలోకి వచ్చారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పాలన అంతా మోసం... మోసం... మోసం అన్న పదాల చుట్టే తిరుగుతుందని అన్నారు.

కరవు మండలాల ప్రకటన, ఇన్ పుట్ సబ్సిడీలోనూ ప్రజలకు చెవిలో పూలు పెడుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే కొత్త ఇళ్లు కట్టిస్తామన్న చంద్రబాబు...ఇప్పుడు 30 ఏళ్లుగా ఉన్న ఇళ్లను   కూల్చివేస్తామని చెప్పడం అన్యాయమన్నారు. చంద్రబాబు మాత్రం అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటూ... పేదల కడుపు కొడతాననడం దారుణమన్నారు. వరద బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాల తోడుగా ఉంటుందని, వరద సాయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

కాగా వైఎస్ జగన్  గత మూడు రోజులుగా చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో  పర్యటిస్తున్నారు. తొలుత 23, 24 తేదీల్లోనే పర్యటన ఉంటుందని భావించినా, వరద నష్టం తీవ్రంగా ఉన్నందున మరో రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో పర్యటనను వైఎస్ జగన్ పొడిగించారు. గురువారం రాత్రికి ఆయన నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు తిరిగివస్తారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలకు వెళతారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా దెబ్బతిన్న ప్రాంతాల్ని సందర్శించి ప్రత్యక్షంగా పంట నష్టం వివరాల్ని, ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల్ని స్వయంగా తెలుసుకుంటారు.
Share this article :

0 comments: