ఫిబ్రవరి 2 న వైఎస్ జగన్ యువభేరీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫిబ్రవరి 2 న వైఎస్ జగన్ యువభేరీ

ఫిబ్రవరి 2 న వైఎస్ జగన్ యువభేరీ

Written By news on Sunday, January 31, 2016 | 1/31/2016


శ్రీకాకుళం: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన వైఎస్ జగన్ యువభేరీ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 2వ తేదీన జరుగనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం జరుగనున్నట్టు చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆదర్శ ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకోవడాన్ని ఎద్దేవా చేశారు. ఏ రంగంలో విజయం సాధించారని చంద్రబాబుకు ఆదర్శ ముఖ్యమంత్రి బిరుదు ఇచ్చారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
Share this article :

0 comments: