తమిళనాడు వెళ్తే బాబుకు జ్ఞానోదయం అవుతుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తమిళనాడు వెళ్తే బాబుకు జ్ఞానోదయం అవుతుంది

తమిళనాడు వెళ్తే బాబుకు జ్ఞానోదయం అవుతుంది

Written By news on Tuesday, February 2, 2016 | 2/02/2016


'తమిళనాడు వెళ్తే బాబుకు జ్ఞానోదయం అవుతుంది'
కాకినాడ : చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 22 నెలలు అయినా కాపుల రిజర్వేషన్ అంశాన్ని పరిష్కరించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  కాపులను బీసీల్లో చేర్చాలంటూ నిన్న కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్య చేసుకున్న వెంకట రమణమూర్తి కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ తన చావు ద్వారా అయినా చంద్రబాబు కళ్లు తెరుస్తారని వెంకట రమణమూర్తి ప్రాణాలు కోల్పోయాడన్నారు. ఇప్పటికైనా కాపుల రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం తాత్సారం చేయకుండా వారిని బీసీల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా అమలు అవుతున్నాయో చంద్రబాబు అధ్యయనం చేయాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా సూచించారు.

చంద్రబాబు తెలిసీతెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని, తమిళనాడుకు వెళితే అక్కడ రిజర్వేషన్లు ఎలా అమలవుతున్నాయో జ్ఞానోదయం కలుగుతుందని ఆయన అన్నారు. మార్గదర్శకాలు చెప్పకుండా కాపు రిజర్వేషన్లపై కమిషన్ వేయడం సరికాదన్నారు. 1953లో కాకా కలేల్కర్ ఇచ్చిన నివేదికలో కాపులను బీసీలుగా గుర్తించారన్నారు. రిజర్వేషన్ల కోసం వెంకట రమణమూర్తి ప్రాణత్యాగం చూసైనా చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రమణమూర్తి కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని వైఎస్ జగన్ కోరారు. చావుల వల్ల సాధించేది ఏమీ లేదని, అంతా ఒకటిగా పోరాడి సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబుకు కొంచెం తిక్క అని, అది కాస్త ముదిరిందని, అందుకే అవాకులు చెవాకులు పేలుతున్నారని వైఎస్ జగన్ అన్నారు.
Share this article :

0 comments: