బాబూ.. మీ పేరు సింగపూర్ నాయుడుగా మార్చుకోండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబూ.. మీ పేరు సింగపూర్ నాయుడుగా మార్చుకోండి

బాబూ.. మీ పేరు సింగపూర్ నాయుడుగా మార్చుకోండి

Written By news on Wednesday, November 12, 2014 | 11/12/2014


'బాబూ.. మీ పేరు సింగపూర్ నాయుడుగా మార్చుకోండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత పనుల కోసమే సింగపూర్ పర్యటనకు వెళ్లారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబుకు చెందిన వ్యాపారాలు, హోటళ్లు సింగపూర్ లో ఉన్నాయని తెహల్కా వెల్లడించిందని అంబటి అన్నారు. చంద్రబాబు-సింగపూర్ ల వైఖరి దృఢమైనదని ఆరోపించారు.

చంద్రబాబు తన పేరును సింగపూర్ నాయుడుగా మార్చుకుంటే మంచిదని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సింగపూర్ పర్యటనకు ఇంత ఆర్భాటాలు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి ఓ వైపు ప్రజల నుంచి చందాలు అడుగుతూ.. చంద్రబాబు బృందం రెండు ప్రత్యేక విమానాల్లో సింగపూర్ పర్యటనకు వెళ్లాల్సిన అవసరమేంటని అంబటి రాంబాబు విమర్శించారు.
Share this article :

0 comments: