పాలనను గాలికి వదిలేసిన బాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాలనను గాలికి వదిలేసిన బాబు

పాలనను గాలికి వదిలేసిన బాబు

Written By news on Wednesday, June 24, 2015 | 6/24/2015

కాకినాడ: ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడడం గురించి ఆలోచిస్తూ రాష్ట్రంలో పాలనను ఏపీ సీఎం చంద్రబాబు గాలికి వదిలేశారని వైఎస్సార్ సీపీ నాయకుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఖరీఫ్ ప్రారంభమైనా రైతుల గురించి చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పెంచిన మద్దతుధరకు అదనంగా రూ.200 కలిపి ఏపీ సర్కారు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మత్స్య సంపద ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న ప్రభుత్వం... మత్స్యకారులు చనిపోతే రూ. 4 లక్షల పరిహారం మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు. హుద్ హుద్ తుపాను కారణంగా చనిపోయిన వారికి రూ. 5 లక్షల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మత్స్యకారులు చనిపోతే రూ. లక్ష కోత ఎందుకు పెట్టిందని జ్యోతుల ప్రశ్నించారు.
Share this article :

0 comments: