అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు..

అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు..

Written By news on Friday, June 26, 2015 | 6/26/2015

సీఎం చంద్రబాబు నిజాయితీకి మారుపేరయితే ఆరోపణలు రాగానే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ 30 ఏళ్లుగా నీతితో నిప్పుగా రాజకీయాలు చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన విషయం నిర్థారణ అయితే దానిని ఎందుకు ఖండించడం లేదన్నారు. ఓటుకు నోటు విషయంలో ఆయన పాత్ర  నిర్థారణ కావడంతో బెంబేలెత్తి అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు సెక్షన్-8 పేరుతో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు విభజన అనంతరం సెక్షన్-8 అమలు జరగాల్సి ఉన్నా ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుకు నోటు వివాదంలో కూరుకుపోయిన చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలలో బలం లేకుండానే ప్రకాశం, కర్నూలులో అభ్యర్థులను నిలబెట్టి పోలీసుల సహకారంతో ఇతర పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి అక్రమంగా గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఆయలనకు బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు.
Share this article :

0 comments: