బాబుగారి కథలు చెల్లవిక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుగారి కథలు చెల్లవిక

బాబుగారి కథలు చెల్లవిక

Written By news on Thursday, June 25, 2015 | 6/25/2015

చంద్రబాబు కథ: టేపులు అతికించినవి, ఎక్కడెక్కడో మాట్లాడితే.. వాటిని ఒక చోట పేర్చారు.
నిజం: ఆడియో, వీడియో టేపులు కల్పితాలు కావు, ఇవి నిజమైనవేనంటూ ఫోరెన్సిక్ రిపోర్ట్.

చంద్రబాబు కథ: ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేసు... ఎన్నికల సంఘం చూసుకుంటుంది. ఏసీబీకి ఏం పని?
నిజం : ఈ కేసు అవినీతి కేసని ఎన్నికలసంఘం తేల్చిచెప్పింది. ఏసీబీ కేసుకూడా ఫైల్ చేయొచ్చని స్పష్టంచేసింది. కోర్టు తీర్పు వచ్చాక ఈసీకూడా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.

చంద్రబాబు కథ: ఆడియో, వీడియో టేపులను కోర్టులు పరిగణలోకి తీసుకోవు.
నిజం : ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం డిజిటల్ పరికరాల్లో ఉన్నవీ ఆధారాలే. కాకపోతే వీటికి సర్టిఫికేషన్ అవసరం. అంటే... ఇవి కల్పితం కాదంటూ ఒక నిఫుణిడి ధృవపత్రం అవసరం. ఆపనికూడా పూర్తయ్యింది. ఒరిజనలే అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇప్పటికే రిపోర్టు ఇచ్చింది.

చంద్రబాబు కథ : సెక్షన్ - 8 అమలు చేయాలంటూ.. అటార్నీ జనరల్ గవర్నర్ కు లేఖ రాశారు
నిజం: అలాంటి లేఖ ఏమీ రాయలేదు. అస్సలు సెక్షన్ - 8 కి, ఏసీబీ కేసుకు సంబంధం లేదని రాజ్ భవన్ వర్గాలు స్పష్టంచేయడం

చంద్రబాబు కథ: నాతో సహా చాలామంది ఫోన్లను ట్యాప్ చేశారు. దాదాపు 120 మంది ఫోన్లను ట్యాప్ చేశారు.
నిజం: ట్యాపింగ్ జరగలేదని టెలికాం కంపెనీలు స్పష్టంచేశాయి. 16 గంటల విచారణలో ఇదే విషయాన్ని చెప్పాయి.

చంద్రబాబు కథ: మత్తయ్యకు తెలంగాణ ప్రభుత్వం నుంచి, కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉంది.
నిజం: మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదులో కూడా లేదు. కేసీఆర్ మనుషులంటూ చెప్పుకున్న కొందరు తనను బెదిరించారని మత్తయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.

చంద్రబాబు కథ: అవసరమైతే హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు పెడుతుంది. మాకు మేమే రక్షణ కల్పించుకుంటాం.
నిజం: హైదరాబాద్ లో ఏపీ పోలీస్ స్టేషన్లు పెట్టడానికి వీల్లేదన్న కేంద్రహోంశాఖ. కర్నూలునుంచి తెప్పించిన పోలీసులనుకూడా తిరిగి వెనక్కి పంపిన ఏపీ డీజీపీ

చంద్రబాబు కథ: హైదరాబాద్ లో ఆంధ్ర ప్రాంత ప్రజలను వేధిస్తున్నారు.
నిజం : చంద్రబాబు తన రాజకీయాలకోసం తమను వాడుకోవద్దని హైదరాబాద్ సెటిలర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ పెట్టిమరీ స్పష్టంచేసింది. చంద్రబాబు లేకున్నా... తాము భద్రంగానే ఉంటామని చెప్పారు.

చంద్రబాబు కథ: 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవమానపడ్డారన్న చంద్రబాబు.
నిజం: ఎవ్వరూ అవమానపడలేదన్న అఖిలపక్షనేతలు. విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం. చంద్రబాబు తప్పులను జనంపై రుద్దొద్దని హెచ్చరిక.  చంద్రబాబు లేకున్నా.. ప్రజలను చూసుకునేందుకు వ్యవస్థలున్నాయని స్పష్టంచేసిన నేతలు.

http://www.sakshi.com/news/andhra-pradesh/forensic-report-reveals-about-note-for-vote-case-audio-video-tapes-251671?pfrom=home-top-story
Share this article :

0 comments: