ఎంపీ ల్యాడ్స్ నిధుల ప్రతిపాదనలో ఖమ్మం ఎంపీ ముందంజ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎంపీ ల్యాడ్స్ నిధుల ప్రతిపాదనలో ఖమ్మం ఎంపీ ముందంజ

ఎంపీ ల్యాడ్స్ నిధుల ప్రతిపాదనలో ఖమ్మం ఎంపీ ముందంజ

Written By news on Friday, December 26, 2014 | 12/26/2014


పొంగులేటి టాప్
ఎంపీ ల్యాడ్స్ నిధుల ప్రతిపాదనలో
ఖమ్మం ఎంపీ ముందంజ


ఖమ్మం జెడ్పీసెంటర్: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగులు వేస్తున్నారు. తన నియోజకవర్గానికి ఎంపీ నిధులతో పాటు ఇతర నిధులు తెప్పించి అభివృద్ధి చేసేందుకు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల ప్రతిపాదనలో ఆయనే ముందున్నారు. జిల్లాలో అభివృద్ధి పనుల్లో తనదైన మార్క్ కోసం పార్లమెంట్ నియోజకవర్గం మొత్తానికి నిధులు కేటాయింపు కోసం రూపకల్పన చేశారు.

ప్రభుత్వం ప్రతి ఏటా విడుదల చేసే నిధులను  ఖర్చు చేయడానికి ఎంపీలకు తీరిక లేక కోట్లాది రూపాయలు వెనక్కి వెళ్ళిన సంఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. అయితే ఖమ్మం పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన పొంగులేటి ఆరు నెలల్లోనే తన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో అత్యంత ప్రాధాన్యాలను గుర్తించి వాటిని పూర్తి చేసేందుకు ఏక కాలంలో ప్రతిపాదనలు పంపారు. ఎంపీ కోటాలో నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.5 కోట్లు విడుదల చేస్తుంది.

ఖమ్మం ఎంపీ పొంగులేటి పరిధిలో  2014-15కు గానూ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఐదు కోట్లు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు చేసి మంజూరుకు ఫైల్ పంపారు. ఈ ఐదు కోట్లు నిధులతో సీసీ రోడ్లు, తాగునీటి పథకాలు, సైడ్ డ్రైయిన్లు, పైపు కల్వర్టులు, సైడ్ వాల్స్ తదితర అవసరాలకు కేటాయించారు.

వాటిలో ఖమ్మం డివిజన్‌లో 118 పనులకు రూ.374 లక్షలు, కొత్తగూడెం డివిజన్‌లో 20 వర్కులకు రూ.60 లక్షలు, ఆర్‌డబ్ల్యూఎస్ కొత్తగూడెంలో ఒక పనికోసం రూ.3 లక్షలు, ఖమ్మం కార్పొరేషన్‌లో 4 పనులకు రూ.13 లక్షలు, కొత్తగూడెం మున్సిపాలిటిలో 4 పనులకు రూ.11 లక్షలు, నీటి ఎద్దడి నివారణ కోసం, మంచినీటి సరఫరా కోసం ప్రతిపాదనలు చేశారు.  ఖమ్మం, కొత్తగూడెం డివిజన్ల నుంచి సంబంధిత పీఆర్‌ఐ కార్యనిర్వాహక ఇంజినీర్లు అంచనాలు తయారు చేసి ముఖ్య ప్రణాళిక అధికారికి పంపారు. కలెక్టర్ ఇలంబరితి పరిపాలన పరమైన మంజూరు చేయాల్సి ఉంది. ఇంజనీర్లు అంచనాలు తయారు చేసి ముఖ్య ప్రణాళికాధికారికి పంపారు. కలెక్టర్ ఇలంబరితి పరిపాలన మంజురి చేయాల్సింది.

అభివృద్ధే లక్ష్యంగా..
అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అందించే ఎంపీ నిధులతో పాటు అదనపు నిధుల కోసం పొంగులేటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏడాదిలో చెపట్టాల్సిన పనులను ఆరునెలల కాలంలోనే గుర్తించి ప్రతిపాదనలు పంపారు. రానున్న వేసవి దృష్ట్యా మం చినీటి ఎద్దడికి ప్రణాళికలు చేస్తున్నారు. నియోజకవర్గంలో నీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించారు. వాటికి నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తున్నారు.

ప్రత్యేక స్థానం..
ఒకప్పుడు ఎంపీ అయిన వెంటనే నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని పరిస్థితి జిల్లాలో ఉండేది. ప్రస్తుత ఎంపీ పొంగులేటి మాత్రం తనదైన శైలిలో ప్రతి వారం జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. వాటికి సంబంధించిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు.
Share this article :

0 comments: