ఇదీ బాబు తీరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇదీ బాబు తీరు

ఇదీ బాబు తీరు

Written By news on Wednesday, March 25, 2015 | 3/25/2015


ఇదీ బాబు తీరు
అప్పుడేమన్నారు...

‘విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు సర్కారుపై తిరగబడాలి. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలి. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయి. విద్యుత్, నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతుంటే, మరోవైపు పన్నుల రూపంలో ప్రభుత్వం లూఠీ చేస్తోంది’

2013 ఏప్రిల్ 4 వ తేదీన ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు అన్న మాటలివి. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా హైదరాబాద్ శివార్లలోని గగన్‌పహాడ్ సబ్‌స్టేషన్ ఎదుట చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. ఈ సందర్భంగా ఆయన అన్న మాటలివి.

 ‘అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తాను. కొండెక్కిన నిత్యావసరాలను కిందకు దించుతాను.’
ఏప్రిల్ 2వ తేదీన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట వద్ద పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది.
 
 ఇప్పుడేం చేశారు?

విద్యుత్ చార్జీలు తగ్గించలేదు సరికదా...! గతంలో అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన పద్దతినే పాటిస్తూ.. తొలి ఏడాదే ఏకంగా రూ. 941 కోట్ల మేర పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నందుకు ప్రజలు సంతోషిస్తుంటే.. ఆదాయంపై కన్నేసిన బాబుగారు మాత్రం రాష్ట్రంలో రెండింటి ధరలనూ రూ.4 చొప్పున పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇక నిత్యావసరాల ధరల గురించి మాట్లాడే పనేలేదు. జనాగ్రహం వ్యక్తమవుతున్నా... విపక్షాలు నిలదీస్తున్నా... తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు.
 
పైగా ఏమంటున్నార ంటే...

‘దేశంలో ద్రవ్యోల్బణమే ఏటా 5 శాతం పెరుగుతోంది. ఆ మేరకే విద్యుత్ చార్జీలు పెంచాం. ఇతర రాష్ట్రాల్లో ఇంతకన్నా ఎక్కువే ఉంది. కిరణ్ ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువే పెంచింది. నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. కాబట్టి చార్జీల పెంపు హేతుబద్ధమే’ 2015 మార్చి 25న ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలో చంద్రబాబు అన్న మాటలివి. చార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా బాబు ప్రకటన చేశారు.
 
ఎందుకీ మార్పు!

మొదటి ఎపిసోడ్‌లో ఆయన ఆగ్రహానికి కారణాలు.. అధికారంలో లేకపోవడం. ఎన్నికల వేళ కావడం. జనాన్ని ఆకట్టుకోవాలనే వ్యూహం కావడం. ఇక రెండో ఎపిసోడ్‌లో ఆయన వైఖరి మారడానికి కారణం.. అధికార పీఠాన్ని అధిష్టించడం వల్లే. ఎక్కడాలేని విధంగా 24 గంటలూ కరెంటు ఇస్తున్నాను కాబట్టి ప్రజలపై భారం వేయడం తప్పుకాదనే ది ఆయన అభిప్రాయం. అందుకనే కొన్ని రాష్ట్రాలను ఉదహరిస్తూ వాటికన్నా తక్కువే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలపై రూ. 941 కోట్ల భారాన్నీ తేలికగా కొట్టిపారేశారు. చంద్రబాబు వచ్చిన ఈ 9 నెలల కాలంలో ప్రజల ఆర్థిక పరిస్థితి పెరిగిందా?
 
అప్పుడు సంస్కరణలట.. ఇప్పుడు ఇంకొకటట!

చంద్రబాబు తన గత 9 ఏళ్ళ పాలనలో 8 సార్లు చార్జీలు పెంచడానికి ఒక కారణం చెబుతారు. విద్యుత్ సంస్కరణల కోసమే అంటారు. ఇప్పుడు మాత్రం నిరంతర విద్యుత్ కోసం అంటున్నారు. పీఎల్‌ఎఫ్ పెంచడానికే అంటారు. రాష్ట్రానికి థర్మల్ విద్యుత్తే ప్రధాన వనరైనప్పుడు... దానికి అవసరమైన బొగ్గు ధర తగ్గినప్పుడు... మరి విద్యుత్ చార్జీల పెంపు ఎందుకు? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.
Share this article :

0 comments: