విద్యుత్ పై మేకపాటి గౌతం బాగా మాట్లాడారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్ పై మేకపాటి గౌతం బాగా మాట్లాడారు

విద్యుత్ పై మేకపాటి గౌతం బాగా మాట్లాడారు

Written By news on Tuesday, March 24, 2015 | 3/24/2015


విబజన తర్వాత ఎపిలో విద్యుత్ డిమాండ్ తగ్గిపోయిందని,అందువల్ల మిగులు రాష్ట్రంగా ఎపి ఉందని నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గౌతం రెడ్డి అన్నారు.శాసనసభలో విద్యుత్ చార్జీల పెంపుదలపై చర్చలో పాల్గొన్నారు.చార్జీల పెంపుదలను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్,రంగారెడ్డి లలో అత్యధిక వినయోగం ఉండేదని, విబజన తర్వాత ఆమేర ఎపిలో డిమాండ్ తగ్గి మిగులుకు వచ్చిందని ఆయన అన్నారు.నిజానికి అవసరానికి మించి ఎపి విద్యుత్ కొనుగోలు చేస్తున్నదని గౌతంరెడ్డి అన్నారు.ఎపిఇఆర్సి కి వెళ్లి 58 మిలియన్ యూనిట్లు డిమాండ్ అని చెప్పారని, ఏభై రెండు మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారని, అలాంటప్పుడు కొరత అయిన ఐదువేల మిలియన్ యూనిట్లు ఉంటే,పదహారు మిలియన్ యూనిట్లు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.అయితే మిగులు కొనుగోలు చేసినా, వాడనందున 575 కోట్లు పెనాల్టి చెల్లించడానికి డిస్కంలు ఎందుకు అంగీకరిస్తున్నాయని గౌతం ప్రశ్నించారు. ఈ వ్యయాన్ని తగ్గించుకోవడం లేదేమిటని ఆయన ప్రశ్నించారు.అదిక ధరను పెట్టి విద్యుత్ కొనుగోలు చేయవలసిన అవసరం ఉందా అని ఆయన అడిగారు.
Share this article :

0 comments: