'ఓటుకు కోట్లు'లో టీడీపీ ఎమ్మెల్యేకు ఏసీబీ నోటీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ఓటుకు కోట్లు'లో టీడీపీ ఎమ్మెల్యేకు ఏసీబీ నోటీసులు

'ఓటుకు కోట్లు'లో టీడీపీ ఎమ్మెల్యేకు ఏసీబీ నోటీసులు

Written By news on Tuesday, June 16, 2015 | 6/16/2015

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ ప్రత్యక్ష కార్యచరణకు దిగింది. రోజంతా ఏసీబీ నోటీసులిస్తుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటట వీరయ్యను విచారణ అధికారి ముందు హీజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఏసీబీ బృందం టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. నోటీసులను ఆయన ఇంట్లో వ్యక్తులకు అందచేశారు. వెంకట వీరయ్యకు నోటీసులు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు పట్ల దూకుడుగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. రేపు కూడా మరికింత మంది టీడీపీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు,  నోటీసులు జారీ చేసే అవకాశముందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
Share this article :

0 comments: