చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలి

చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలి

Written By news on Sunday, November 16, 2014 | 11/16/2014

చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలి
 పోలీస్‌స్టేషన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఫిర్యాదు

 అనంతపురం క్రైం : ముఖ్యమంత్రి చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం అనంతపురం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు దాదాపు 50 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆరు నెలలు గడుస్తున్నా వాటిని నెరవేర్చకుండా మో సం చేస్తున్నారన్నారు.

రైతులకు రుణ మాఫీ చేయక పోవడమే కాకుండా బీమా కూడా దక్కకుండా చేసి కడుపు కొట్టారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు అధిక వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగమని ఉన్న ఉద్యోగాలను కూడా పీకేస్తున్నారని విమర్శించారు. పింఛన్లు నాలుగు రెట్లు పెంచుతామని చెప్పి ఉన్న వాటిని కూడా తొలగిస్తున్నారని మండిపడ్డారు. బెల్టు షాపులు ఎత్తివేస్తామని చెప్పారని, కానీ ఎక్కడ చూసినా అమ్మకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్య, ఉన్నత విద్య కోసం ప్రవేశ పెట్టిన పథకాలను నిబంధనల పేరుతో ఎత్తివేసే ఆలోచనలో ఉన్నారన్నారు. ఇలా అన్ని విధాలా హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబుపై 420 కేసు నమోదు చేసి ఆయా వర్గాల ప్రజలు పడుతున్న మనోవేదనకు కాసింత ఊరట కల్గించాలని కోరారు.

వైఎఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు ఎల్లుట్ల మారుతీ నాయుడు, విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి పరుశురాం, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు ఖాదర్ బాషా, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్ పీరా, బీసీ సెల్ నగర అధ్యక్షుడు గవ్వల వెంకటేష్, జంగాలపల్లి రఫి, యూపీ నాగిరెడ్డి, మంజునాథ్, చింతకుంట మధు, ముక్తియార్, చాంద్‌బాషా, మణి, పెద్దన్న, జయపాల్ పాల్గొన్నారు.  
Share this article :

0 comments: