వైఎస్‌ఆర్ సీపీకి పూర్వవైభవం తెస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్ సీపీకి పూర్వవైభవం తెస్తాం

వైఎస్‌ఆర్ సీపీకి పూర్వవైభవం తెస్తాం

Written By news on Tuesday, November 18, 2014 | 11/18/2014

వైఎస్‌ఆర్ సీపీకి పూర్వవైభవం తెస్తాం
మహబూబ్‌నగర్ అర్బన్: తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న పరిస్థితుల్లో తాను ఖమ్మం ఎంపీగా విజయం సాధించడంతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించామని, ఈ స్ఫూర్తితో రాష్ర్టంలో వైఎస్‌ఆర్ సీపీకి పూర్వవైభవం తెస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

సోమవారం జిల్లాకేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన వైఎస్‌ఆర్ సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వలసలకు పేరొందిన పాలమూర్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం అధికారంలో ఉన్న పాలకులు వాటిని పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు.

తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆశించారని, కానీ ఆర్నెళ్ల కాలవ్యవధిలోనే కేసీఆర్ ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నదని విమర్శించారు. 8 గంటలపాటు కరెంట్ ఇస్తామని ప్రజలను నమ్మించిన కేసీఆర్, మరో మూడేళ్లదాకా కరెంట్ కష్టాలు ఇలాగే ఉంటాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

 పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేశాం
 పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుంచీ జిల్లాలో చురుగ్గా పనిచేస్తున్నామని, రాష్ట్ర పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశామని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, సీజీసీ సభ్యుడు ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. షర్మిలమ్మ జిల్లాలో చేపట్టిన మరోప్రస్థానం పాదయాత్రను చరిత్రలో కనివినీఎరుగని రీతిలో జయప్రదం చేశామని, కల్వకుర్తి నియోజకవర్గం కొండారెడ్డిపల్లిలో చనిపోయిన ఓ రైతు కుటుంబానికి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను పిలిపించి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించామని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోకపోతే ప్రజలపక్షాల పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. అదే సందర్భంలో అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు.
 -ఎడ్మ కిష్టారెడ్డి

 ప్రజల గుండెల్లో నిలిచిన వైఎస్
 పార్టీ శ్రేణులు నిస్తేజంగా ఉన్నారని విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ సమావేశానికి వచ్చిన జనాన్ని చూస్తే ప్రజల గుండెల్లో వైఎస్ ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర నేత నల్లా సూర్యప్రకాశ్‌రావు అన్నారు. జిల్లాను చంద్రబాబు దత్తత తీసుకుని ఒరగబెట్టిందేమిలేదన్నారు. ఇక్కడినుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా జిల్లా అభివృద్ధికి ఏమీచేయడం ఏదన్నారు.         -సూర్యప్రకాశ్‌రావు

 జిల్లాలో పార్టీ బలంగా ఉంది
 వేలాదిమంది అ భిమానులు సమావేశంలో పాల్గొనడాన్ని చూస్తే జిల్లాలో పార్టీ బలంగా ఉందనే విష యం తెలుస్తుందని పార్టీ రాష్ట్ర నేత జనక్‌ప్రసాద్ అన్నారు. ప్రజల కష్టాలు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడం వల్లే పార్టీ చెక్కుచెదరలేదన్నారు. ప్రజాసమస్యలపై చర్చించడానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చామని, సీఎంకు ఇవ్వడానికి వెళ్తే అపాయింట్‌మెంట్ దొరకలేదన్నారు. సీఎంను మరోసారి కలవడానికి ప్రయత్నిస్తామని అప్పటికీ స్పందించకపోతే ఆయన క్యాంపు ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తామని తేల్చిచెప్పారు.                                  -జనక్‌ప్రసాద్

 ఎలక్షన్లు, కలెక్షన్లే కేసీఆర్ ధ్యేయం
 మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచిన కేసీఆర్ కనిపించడం లేదని జిల్లా ప్రజలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని పార్టీ ప్రధాన కార్యదర్శి హెచ్‌ఎ.రహెమాన్ అత్తాస్ గుర్తుచేశారు. ఎలక్షన్లు, కలెక్షన్లు, కన్‌స్ట్రక్షన్లు ధ్యేయంగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు.  ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ చేసిన ప్రకటన బూటకమన్నారు.                 -రహ్మాన్

 ప్రత్యర్థి పార్టీల నోళ్లు మూతపడక తప్పదు
 జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ లేదని పలుపార్టీల నాయకులు విమర్శించారని,  సమావేశానికి వచ్చిన జనాన్ని చూసి వారి నోళ్లు మూతపడక తప్పదని రాష్ట్ర నేత గట్టు రాంచందర్‌రావు అన్నారు. స్వార్థం కోసం కొంతమంది లీడర్లు పార్టీని వీడినప్పటికీ క్యాడర్ మాత్రం చెక్కుచెదరకుండా ఉందన్నారు. జిల్లాలో 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 157 మంది కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జిల్లా పార్టీకి, కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డికే దక్కిందన్నారు.    అభద్రతా భావంతో ఇతర పార్టీల్లోకి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు తిరిగి  పార్టీలోకి రావాలన్నారు.       -గట్టు రాంచందర్‌రావు

 సమావేశంలో తీర్మానాలివే..
వ్యవసాయ అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు
రూ.5లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలి.
వర్షాభావ పరిస్థితులు సక్రమంగా లేనందున కరువు జిల్లాగా
ప్రకటించి పంట నష్టపరిహారం, కరువు సహాయం
అందించాలి.
రబీసీజన్‌లో ఏడుగంటలపాటు కరెంట్‌ను సరఫరా చేసిఙ
రైతులను ఆదుకోవాలి.
కబేళాలకు తరలిపోతున్న పశుసంపదను ఆదుకోవడానికి
{పభుత్వం ఉచితంగా పశుగ్రాసాన్ని పంపిణీ చేయాలి.
వృద్ధాప్య పింఛన్ల వయస్సును 60 ఏళ్లకు కుదించాలి.
ఉపాధి హామీ పథకాన్ని అమలుచేసి గ్రామీణప్రాంతాల్లో
రైతు కూలీలకు పని కల్పించాలి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించి విద్యార్థుల్లో
ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టాలి.
జిల్లాలో జలయజ్ఞం ప్రాజెక్టులకు నిధులు సమకూర్చి
వాటిని వెంటనే పూర్తిచేయాలి
జిల్లాను ఎడారిగా మార్చే జూరాల-పాకాల పథకాన్ని
రద్దు చేయాలి
Share this article :

0 comments: