
గుంటూరు సిటీ : వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గుంటూరు రానున్నట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. గుంటూరు రూరల్ మండలం మాజీ ఎంపీపీ, జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్, రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము) పెద్ద కుమారుడు రాజమన్నార్ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నట్లు తెలిపారు.
గుంటూరు రూరల్ మండలం లాలుపురం గ్రామ సమీపంలోని భవానీపురంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నేరుగా లాలుపురం సమీపంలోని భవానీపురం చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారని వివరించారు. తిరిగి సాయంత్రం 3 గంటల ప్రాంతంలో బయలుదేరి హైదరాబాద్ వెళతారని మర్రి రాజశేఖర్ తెలిపారు.
0 comments:
Post a Comment